1251. హజ్రత్ అబూ ఖతాదా (రధి అల్లాహు అన్హు) కధనం :
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అరఫా నాటి ఉపవాసం గురించి విచారించటం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ,
“అది క్రితం యేడు మరియు వచ్చేయేటి పాపాలన్నిటినీ (minor sins – చిన్న పాపాలు) తుడిచి పెట్టేస్తుంది” అని వివరించారు.
[సహీహ్ ముస్లిం లోని ఉపవాసాల ప్రకరణం]
ముఖ్యాంశాలు:-
జుల్ హిజ్జా మాసపు తొమ్మిదో తేదీని ‘అరఫా రోజు’ అని పిలుస్తారు. ఆ రోజు హజ్ యాత్రికులందరూ అరఫాత్ మైదానంలో ఆగుతారు. కనుక ఆ రోజును ‘అరఫాత్ రోజు’ గా వ్యవహరిస్తారు. ఆ విధంగా అరఫాత్ మైదానంలో ఆగటమనేది హజ్ విధులన్నిటిలోనూ అత్యంత ప్రధానమైనది. దాన్ని నిర్వర్తించకపోతే హజ్జే నెరవేరదు. హజ్ యాత్రికులు ఆ రోజున ప్రార్ధనలు, సంకీర్తనల్లో నిమగ్నులై ఉంటారు. ఆనాడు వారికి అదే గొప్ప ఆరాధనగా పరిగణించబడుతుంది. కనుక వారు ఆరోజు ఉపవాసం పాటించటం అభిలషణీయం కాదు. కాని హజ్ యాత్రలో పాల్గొనని వారికి మాత్రం ఆరోజు ఉపవాసం పాటిస్తే గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. ఆ ఒక్క ఉపవాసం రెండేళ్ళ పాపాలను తుడిచిపెట్టేస్తుంది.
227 వ అధ్యాయం – అరఫా రోజు మరియు ముహర్రమ్ మాసపు తొమ్మిదో తేదీల్లో పాటించబడే ఉపవాసాల ఘనత. హదీసు కిరణాలు (రియాజుస్సాలిహీన్) – సంకలనం : ఇమామ్ నవవీ (రహ్మతుల్లా అలై)
హజ్జతుల్ విదా (ఆఖరి హజ్) లోని అరఫా రోజు శుక్రవారం వచ్చింది. ఆ రోజు ఖుర్ఆన్ లోని ఈ ఆయతు (వచనం) అవతరించింది: “ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను.” (ఖుర్ఆన్, సూరా మాయిదా 5:3)
అల్లాహ్ ధర్మాన్ని పూర్తిగావించాడు. ఇప్పుడు ఇందులో ఎలాంటి మార్పుచేర్పులకు తావులేదు. అందువల్లే అల్లాహ్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో ప్రవక్తల పరంపరను అపివేశాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చిట్ట చివరి ప్రవక్త. అల్లాహ్ ఇస్లాం ధర్మాన్ని ఆమోదించాడు, అనగా అల్లాహ్ కు ఇస్లాం తప్ప వేరే ఏ ఇతర ధర్మం సమ్మతం కాదు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దిల్ హజ్జ్ మాసపు 9వ రోజున (అరఫా రోజు) ఉపవాసం ఉండేవారు. హునైదహ్ ఇబ్నె ఖాలిద్ తన భార్య ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కొందరు భార్యలు ఇలా పలికినారని ఉల్లేఖించెను:
”ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 9వ దిల్ హజ్జ్ దినమున, అషూరహ్ దినమున, ప్రతి నెల మూడు దినములలో మరియు ప్రతి నెల మొదటి రెండు సోమవారాలు మరియు గురువారాలు ఉపవాసం ఉండేవారు.”
(అన్నిసాయి హదీథ్ గ్రంథం, 4/205 మరియు అహూ దావూద్ హదీథ్ గ్రంథం; సహీహ్ అబి దావుద్ గ్రంథంలో, 2/462 దీనిని సహీహ్ హదీథ్ గా షేఖ్ అల్ బానీ వర్గీకరించెను.)
అరఫా రోజు చేసే ప్రార్ధన (దుఆ, తస్బీహ్)
దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: అరఫా రోజున చేసే దుఆ అన్నిటికంటే ఉత్తమమైనది. అరఫా రోజున నేను మరియు ఇతర ప్రవక్తలు పలికిన ఉత్తమ పదాలు:
“లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్.”
“కేవలం ఒక్కడైన అల్లాహ్ తప్ప ఆరాధ్యానికి అర్హులు ఎవ్వరూ లేరు. అతనికి సహవర్తులూ ఎవ్వరు లేరు. రాజ్యాధినేత ఆయనే, స్తోత్రములన్నీఆయన కొరకే. అయన అన్నీ చేయగలడు.”
(సహీహ్ అత్ తిర్మిజి vol 3:184, సిల్సిలతుల్అహాదీస్ అస్ సహీహ 4/6)
You must be logged in to post a comment.