మరణాంతర జీవితం – పార్ట్ 21 & 22 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
[43:19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఎలాంటి కర్మలను త్రాసులో తూకం వేస్తారు?
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:
“రెండు వాక్యాలు పలకటానికి చాలా తేలికైనవి, కాని అవి త్రాసులో చాలా బరువైనవి, కరుణామయునికి ఎంతో ప్రియమైనవి. అవి, ‘సుబహానల్లాహి వబిహమ్ ది హి, సుబహానల్లాహిల్ అజీమ్.” (బుఖారీ,ముస్లిం)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ (రదియల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: “ప్రళయ దినాన ప్రజలందరి ముందు నా ఉమ్మతక్కు చెందిన ఒక వ్యక్తిని కేకలు పెట్టి పిలువడం జరుగుతుంది. తరువాత అతని ముందు తొంభైతొమ్మిది (కర్మల) పత్రాలను తెరిచి పరుస్తారు. ప్రతి పత్రం అతను చూడగలిగినంత దూరం వరకూ (పెద్దదిగా) ఉంటుంది.” తరువాత అల్లాహ్ అతనితో: “దీని (పాపాల పత్రాల)లో నీవు చేయని (విషయాలు) ఏమైనా ఉన్నాయని చెప్పగలవా?” అని ప్రశ్నిస్తాడు. అతను: “లేదు నా ప్రభూ! ” అని అంటాడు. మరలా అల్లాహ్ అతనితో: “వాటిని జాగ్రత్తగా రాసేవారు (మున్కర్ నకీర్) నీపై (నీ పత్రాలలో) అన్యాయంగా ఏమైనా రాసారా!” అని ప్రశ్నిస్తాడు. తరువాత అతనితో: “నీ వద్ద వాటికి (ఆ పాపాల పత్రాలకు) బదులు పుణ్యాలేమైనా ఉన్నాయా?” అని అల్లాహ్ ప్రశ్నిస్తాడు. అప్పుడు అతను: లోలోన భయపడుతూ “నా వద్ద (పుణ్యాలు) లేవు ” అని అంటాడు. ఆ తరువాత అల్లాహ్ అతనితో: “ఎందుకు లేవు మా వద్ద నీ పుణ్యం ఒకటుంది. ఈ రోజు మేము ఎవరికీ అన్యాయం చెయ్యబోము” అని అల్లాహ్ (షహాదత్) ““అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు” పత్రాన్ని అతనికి ప్రసాదిస్తాడు. అతను: దాన్ని చూసి, “ఓ అల్లాహ్ ఈ ఒక్క పత్రం అన్ని పాపాల) పత్రాలకు సరిసమానమవుతుందా?” అని ఆశ్చర్యపడుతూ అంటాడు. తరువాత అల్లాహ్: “ఈ రోజు నీకు ఎలాంటి అన్యాయం జరగదనీ , అంటాడు. తరువాత “(అతని పాపాల) పత్రాలన్ని ఒక పళ్లెంలో వేస్తారు. మరియు ‘షహాదత్ పత్రం’ మరొక పళ్లెంలో వేస్తారు. ఆ (పాపాల) పత్రాలన్ని తేలికైపోతాయి. షహాదత్ పత్రం (అన్ని పత్రాలపై) బరువైపోతుంది. (ఎందుకంటే) అల్లాహ్ పేరు కంటే (ఎక్కువ) ఏదీ బరువు ఉండదు.” (తిర్మిజీ హాకిమ్, సహీహ్ ఇబ్నుమాజ: 3469)
హజ్రత్ అబూ దర్దా (రదియల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: . “ప్రళయం రోజున త్రాసులో తూకం చేసినప్పుడు ఉత్తమ గుణాలకంటే ఎక్కువ బరువు ఏ విషయము ఉండదు.” (ఇబ్నుమాజ, తిర్మిజీ, హాకిమ్)
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: “ప్రళయం రోజు ఒక లావుగా బలసిన వ్యక్తి వస్తాడు. అయినా అతను (త్రాసులో) దోమ రెక్కకు సమానం కూడా బరువు ఉండడు. తరువాత ఖుర్ఆన్ సూక్తిని ఇలా పఠించారు: “ప్రళయం రోజున మేము వారిని ఏ మాత్రము బరువుగా నిలబెట్టము.”(18,సూరతుల్ కహఫ్:105) (బుఖారీ)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు) కథనం; “ఒక రోజు నేను ప్రవక్త ముహమ్మద్ కొరకు మిస్వాక్ చెట్టు నుండి మిస్వాక్ ను తెంపుకొనే టప్పుడు క్రిందకు (నేలపై) పడిపోయేటట్టు గాలి వీచింది. ఆ (పరిస్థితిని చూసి) ప్రజలు నవ్వినారు. మీరు ఎందుకు నవ్వుతున్నారనీ ? ప్రవక్త ముహమ్మద్ ప్రశ్నించారు. దానికి వారందరూ: ఓ అల్లాహ్ ప్రవక్తా! “ఆయన కాళ్ళు సన్నగా ఉన్నందువలన” అని సమాధానమిచ్చారు. ఆ తరువాత ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: “ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో, అతని సాక్షిగా! ప్రళయ దినాన త్రాసులో ఆయన కాళ్ళు ఉహద్ కొండకంటే ఎక్కువ బరువు ఉంటాయి.” (అహ్మద్, ఇర్వావుల్ గలీల్:65)
హజ్రత్ అబూ మాలిక్ అల్ అష్ అరీ (రదియల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:
“పరిశుభ్రత విశ్వాసానికి ఒక షరతు. అల్ హమ్ దులిల్లాహ్ (అనే పదాలు) త్రాసులో నిండిపోతాయి. సుబ్ హానల్లాహి, వల్ హమ్ దు లిల్లాహి (అనే పదాలు) భూమ్యాకాశాల మధ్యలో ఉన్న (స్థలమంతా) నిండిపోతాయి.” (ముస్లిం)
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారు:
“ఎవరైనా అల్లాహ్ ను విశ్వసిస్తూ, అతని వాగ్దానాన్ని ధృవీకరిస్తూ, తన గుర్రానికి (ధర్మ పోరాటానికై ఎల్లప్పుడు) సిద్ధంగా ఉంచినట్లయితే, ఆ గుర్రానికి అతను మేత పెట్టినందుకు, నీరు త్రాగించినందుకు, (ఆ గుర్రం) పేడ వేసినందుకు, మూత్ర విసర్జన చేసినందుకు బదులుగా, ప్రళయ దినాన ఆ వ్యక్తి కొరకు త్రాసులో పుణ్యాలు బరువు చేయ బడుతాయి.” (బుఖారీ)
ఈ విషయాలు క్రింది పుస్తకం నుండి తీసుకోబడ్డాయి:
పుస్తకం: మరణానంతర జీవితం (Life After Death) – (ఖుర్‌ఆన్ మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో)
కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
పూర్తి భాగాలు క్రింద వినండి
- మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
పరలోకం (The Hereafter) మెయిన్ పేజీ:
https://teluguislam.net/hereafter/
You must be logged in to post a comment.