Greatness of Al-Qur’an (ఖురాన్ ఘనత)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
ఖుర్ఆన్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1MMOwL9fds2bCGoEbYxk1J
శ్రమకోర్చి ఖుర్ఆన్ పఠించే వ్యక్తి ఘనత
461. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:-
“ఖుర్ఆన్ కంఠపాఠి గౌరవనీయులైన దైవదూత లాంటివాడు. అతను (ప్రళయదినాన) వారితోనే ఉంటాడు. ఖుర్ఆన్ పఠించడం తనకు ఎంతో ప్రయాసతో కూడిన పని అయినప్పటికీ, దాన్ని పఠించి కంఠస్తం చేసే వ్యక్తి రెట్టింపు పుణ్యఫలానికి అర్హుడవుతాడు.”
[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం – అత్తఫ్సీర్ ఖుర్ఆన్, 80 వ అధ్యాయం – ‘అబస’ సూరా]
మధురమైన, సువాసన కలిగిన నారింజపండులా ఉండండి
460. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:-
ఖుర్ఆన్ పఠించే వ్యక్తి (విశ్వాసి) రుచిలోనూ, సువాసనలోనూ మేలు జాతికి చెందిన నారింజపండు లాంటివాడు. ఖుర్ఆన్ పఠించని విశ్వాసి (మోమిన్) రుచి ఉన్నా సువాసన లేని ఖర్జూర పండు లాంటివాడు. ఖుర్ఆన్ పఠించే కపట విశ్వాసి పరిమళం ఉన్న చేదుఫలం లాంటివాడు. ఖుర్ఆన్ పఠించని కపట విశ్వాసి సువాసన లేని చేదుగా ఉండే అడవి దోసకాయ లాంటివాడు.
[సహీహ్ బుఖారీ : 70 వ ప్రకరణం – అల్ అత్ అము – 30 వ అధ్యాయం – జిక్రిత్తామ్]
ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం – 37 వ అధ్యాయం – ఖుర్ఆన్ క్రమం తప్పకుండా పఠించే వ్యక్తి ఘనత.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
ఇతరములు:
You must be logged in to post a comment.