త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (2) : షిర్క్ , ధర్మభ్రష్టత (రిద్దత్) – మరణానంతర జీవితం : పార్ట్ 43 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (2)
[మరణానంతర జీవితం – పార్ట్ 43]
https://www.youtube.com/watch?v=rhP9srQxkjE [20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, సత్కార్యాల త్రాసును తేలికపరిచే దుష్కార్యాల గురించి వివరించబడింది. ఇందులో ప్రధానంగా షిర్క్ (బహుదైవారాధన), దాని తీవ్రత, మరియు అది సత్కార్యాలను ఎలా నాశనం చేస్తుందో ఖురాన్ ఆయతుల ఆధారంగా చర్చించబడింది. షిర్క్‌తో మరణిస్తే అల్లాహ్ క్షమించడని, అయితే బ్రతికి ఉండగా పశ్చాత్తాపపడితే (తౌబా) క్షమించబడతాడని స్పష్టం చేయబడింది. ఆ తర్వాత, సత్కార్యాలను నాశనం చేసే అవిశ్వాసం (కుఫ్ర్) మరియు ధర్మభ్రష్టతకు (రిద్దత్) దారితీసే మూడు ప్రధాన కార్యాలు వివరించబడ్డాయి: 1) ధర్మాన్ని, ధర్మాన్ని పాటించే వారిని ఎగతాళి చేయడం. 2) అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకోవడం. 3) అల్లాహ్‌కు ఇష్టం లేని వాటిని అనుసరించి, ఆయనకు ఇష్టమైన వాటిని ద్వేషించడం. ఈ పాపాల వల్ల సత్కార్యాలు నిరర్థకమైపోతాయని హెచ్చరించబడింది.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు స్వాగతం.

త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల గురించి మనం వింటున్నాము. ఇందులో మొదటి విషయం, సర్వ సత్కార్యాలు నశింపజేసే దుష్కార్యం షిర్క్. షిర్క్ ఎంత ఘోరమైన పాపం అంటే, ఇదే స్థితిలో గనక ఎవరైనా చనిపోతే అల్లాహు త’ఆలా ఎన్నటికీ అతన్ని క్షమించడు మరియు అతనిపై శాశ్వతంగా స్వర్గం నిషిద్ధమైపోతుంది. మనిషి తప్పకుండా ప్రతీ రకమైన షిర్క్ నుండి తౌబా చేయాలి. అల్లాహ్‌కు అత్యంత అసహ్యకరమైన పాపం అంటే ఇదే.

అల్లాహ్ సూరె నిసా ఆయత్ నెంబర్ 48 లో షిర్క్ గురించి ఇలా హెచ్చరించాడు.

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ
[ఇన్నల్లాహ లా యగ్‌ఫిరు అన్ యుష్రక బిహీ వ యగ్‌ఫిరు మాదూన దాలిక లిమన్‌ యషా]
తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్‌ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. (4:48)

నిశ్చయంగా అల్లాహు త’ఆలా ఆయనతో పాటు మరొకరిని భాగస్వామిగా చేయడాన్ని ఎంతమాత్రం క్షమించడు. ఈ భాగస్వామ్యం, షిర్క్ తప్ప వేరే ఏ పాపాన్నైనా తాను కోరిన వారి గురించి క్షమించవచ్చును.

మరియు షిర్క్ ఎంత ఘోరమైన పాపం? అదే ఆయతులో ఉంది.

وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدِ افْتَرَىٰ إِثْمًا عَظِيمًا
[వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖదిఫ్తరా ఇస్మన్ అజీమా]
అల్లాహ్‌కు భాగస్వామ్యం కల్పించినవాడు ఘోర పాపంతో కూడిన కల్పన చేశాడు. (4:48)

ఒక నష్టం అయితే తెలుసుకున్నాం కదా, అల్లాహ్ క్షమించడు అని. రెండవది, ఎవరైతే అల్లాహ్‌తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తారో, అల్లాహ్‌తో పాటు ఇతరులను షిర్క్ చేస్తారో, అతను ఒక మహా భయంకరమైన ఘోర పాపానికి పాల్పడినవాడైపోతాడు. అందుకని మనం షిర్క్ నుండి చాలా దూరం ఉండాలి. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, అల్లాహు త’ఆలా షిర్క్‌ను ముమ్మాటికీ క్షమించడు అని ఏదైతే చెప్పడం జరుగుతుందో, ఆ మనిషి షిర్క్ చేసే వ్యక్తి బ్రతికి ఉండి తౌబా చేసుకుంటే కూడా మన్నించడు అని భావం కాదు. ఎవరైతే షిర్క్ స్థితిలో చనిపోతారో వారిని మన్నించడు. కానీ ఎవరైతే బ్రతికి ఉన్నారు, తౌబా చేసుకున్నారు, షిర్క్‌ను వదులుకున్నారు, తౌహీద్ పై వచ్చేసారు, ఏకైక అల్లాహ్‌ను నమ్ముకుని అతని ఆరాధనలో ఎవరినీ భాగస్వామిగా చేయడం లేదు, వారు తౌబా చేశారు, వారి తౌబాను అల్లాహ్ తప్పకుండా స్వీకరిస్తాడు.

ఇదే సూరె నిసా ఆయత్ నెంబర్ 116 లో అల్లాహు త’ఆలా ఇలా హెచ్చరించాడు.

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ
[ఇన్నల్లాహ లా యగ్‌ఫిరు అన్ యుష్రక బిహీ వ యగ్‌ఫిరు మాదూన దాలిక లిమన్‌ యషా]
తనకు భాగస్వామ్యం (షిర్క్‌) కల్పించటాన్ని అల్లాహ్‌ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. షిర్క్‌ మినహా తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు.

وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا
[వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ దల్ల దలాలన్ బఈదా]
అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టినవాడు మార్గభ్రష్టతలో చాలా దూరం వెళ్ళి పోయాడు. (4:116)

మరి ఎవరైతే, మరి ఎవరైతే అల్లాహ్‌తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తున్నారో, అతను సన్మార్గం నుండి దూరమై మార్గభ్రష్టత్వంలో ఎంతో దూరం వెళ్ళిపోయాడు. అందుకు, ఇలా మార్గభ్రష్టత్వంలో దూరం వెళ్ళిపోతూ ఉండేదానికి బదులుగా సన్మార్గం వైపునకు వచ్చేసేయాలి, తౌహీద్‌ను స్వీకరించాలి.

సృష్టిలో ఎవరు ఎంత గొప్పవారైనా, ఎంత పెద్ద హోదా అంతస్తులు కలవారైనా, చివరికి ప్రవక్తలైనా గాని, వారి కంటే గొప్పవారు ఎవరుంటారండి? వారి నుండి కూడా షిర్క్ లాంటి పాపం ఏదైనా జరిగిందంటే, అల్లాహు త’ఆలా వారి సర్వ పుణ్యాలను, సత్కార్యాలను తుడిచి పెడతానని హెచ్చరించాడు.

వాస్తవానికి ప్రవక్తల ద్వారా ఎన్నడూ షిర్క్ జరగదు. ప్రవక్తలందరూ కూడా చనిపోయారు. వారు షిర్క్ చేయలేదు. కానీ ఈ హెచ్చరిక, వారి ప్రస్తావన తర్వాత ఈ హెచ్చరిక అసల్ మనకు హెచ్చరిక.

సూరె జుమర్ ఆయత్ నెంబర్ 65.

وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
[వలఖద్ ఊహియ ఇలైక వ ఇలల్లజీన మిన్ ఖబ్లిక లఇన్ అష్రక్త లయహ్బతన్న అమలుక వలతకూనన్న మినల్ ఖాసిరీన్]

“(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” (39:65)

మీ వైపునకు మరియు మీ కంటే ముందు గతి౦చిన ప్రవక్తల వైపునకు మేము ఇదే వహీ చేశాము. ఏమని? నీవు గనక షిర్క్ చేస్తే నీ సర్వ సత్కార్యాలు వృథా అయిపోతాయి. మరియు పరలోకాన నీవు చాలా నష్టంలో పడిపోయిన వారిలో కలుస్తావు.

ఎందుకు మహాశయులారా, సృష్టికర్త ఒకే ఒక్కడు. మనందరినీ సృష్టించిన వాడు, భూమి ఆకాశాల్ని సృష్టించిన వాడు, ఈ సృష్టంతటినీ సృష్టించినవాడు ఒక్కడే. మరి ఆయన ఒక్కరి ముందే మన తల వంచితే, ఆయన ఒక్కరి ముందే మనము నమాజు చేస్తే, ఆయన ఒక్కనితోనే మన కష్టాల గురించి మొరపెట్టుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత న్యాయం ఉంటుంది. మనము కూడా ఇలాంటి శిక్షల నుండి ఎంత రక్షింపబడతాము.

రండి సోదరులారా! షిర్క్‌ను వదులుకోండి. మహా ఘోరమైన పాపం. అల్లాహ్ క్షమాపణ అనేది మనకు ప్రాప్తి కాదు. మరియు అదే స్థితిలో చనిపోయామంటే శాశ్వతంగా నరకంలో కాలడంతో పాటు మన సత్కార్యాలు ఏమైనా ఉంటే అవి కూడా నశించిపోతాయి. వాటి ఏ లాభం మనకు పరలోకంలో దొరకదు. అందుగురించి ప్రతీ వ్యక్తి అన్ని రకాల షిర్క్ నుండి దూరం ఉండాలి. షిర్క్ యొక్క దరిదాపులకు కూడా తాకకుండా ఉండాలి.

ఇక మహాశయులారా, ఏ పాపాల వల్ల మన పుణ్యాలన్నీ కూడా నశించిపోతాయో, వాటిలో అవిశ్వాసం, సత్య తిరస్కారం, మరియు సత్యాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ తిరిగి మార్గభ్రష్టత్వానికి వెళ్ళడం, ఇస్లాంను త్యజించడం, రిద్దత్ అని దీన్ని అంటారు, ఇవి మహా ఘోరమైన పాపాలు. అయితే, మనిషి ఏ పాపాలు చేయడం వల్ల లేదా ఎలాంటి కార్యం చేయడం వల్ల సత్య తిరస్కారానికి గురి అవుతాడు, అవిశ్వాసుడైపోతాడు, లేదా అతడు ముర్తద్ అయిపోయాడు, ధర్మభ్రష్టుడయ్యాడు అని అనడం జరుగుతుంది, ఆ కార్యాల గురించి మనం తెలుసుకుందాము.

అందులో మొదటిది, ధర్మం మరియు ధర్మాన్ని అవలంబించే వారిని పరిహసించడం, ఎగతాళి చేయడం. మహాశయులారా ఇది ఘోరమైన పాపం. ప్రవక్త కాలంలో వంచకులు, కపట విశ్వాసులు ఇలాంటి పాపానికి గురి అయ్యేది.

ఇది ఎంత చెడ్డ అలవాటు అంటే ఎవరైతే దీనికి పాల్పడతారో వారు ధర్మభ్రష్టతకు గురి అవుతారు, విశ్వాసాన్ని కోల్పోతారు అని అల్లాహు త’ఆలా సూరతు తౌబా ఆయత్ నెంబర్ 65 మరియు 66 లో తెలియజేశాడు.

وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ ۚ قُلْ أَبِاللَّهِ وَآيَاتِهِ وَرَسُولِهِ كُنتُمْ تَسْتَهْزِئُونَ لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُم بَعْدَ إِيمَانِكُمْ

(మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి? అని) నువ్వు వారిని అడిగితే, “అబ్బే ఏమీలేదు. ఏదో సరదాగా, నవ్వులాటకు ఇలా చెప్పుకుంటున్నాము” అని వారంటారు. “ఏమిటీ, మీరు అల్లాహ్‌తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తలతో పరిహాసమాడుతున్నారా? అని అడుగు. మీరింక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు.” (9:65-66)

మీరు వారిని అడగండి, ఒకవేళ మీరు వారిని అడిగితే, ప్రశ్నిస్తే, వారేమంటారు? మేము అలాగే ఆట, పరిహాసం, వినోదం, దీని గురించి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటిమి, అని వారు సమాధానం పలుకుతారు. అయితే వారితో చెప్పండి, మీ పరిహాసం, మీ ఆట వినోదానికి అల్లాహ్, అల్లాహ్ యొక్క ఆయతులు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తయేనా మీకు దొరికింది? వీరితోనా మీరు పరిహసించేది? వీరినా మీరు ఎగతాళి చేసేది? లా త’తదిరూ, ఇక మీరు ఏ సాకులు చెప్పకండి. ఖద్ కఫర్తుమ్ బ’ద ఈమానికుమ్. ఈమాన్ తర్వాత మీరు కుఫ్ర్‌కు గురి అయ్యారు. విశ్వాసం తర్వాత అవిశ్వాసానికి పాల్పడ్డారు. విశ్వాస మార్గంలో వచ్చిన తర్వాత సత్య తిరస్కారానికి గురి అయ్యారు.

వారితో అడగండి అని ఏదైతే చెప్పడం జరిగిందో ఈ ఆయతులో, వంచకుల విషయం అది. వంచకులు ప్రయాణంలో తిరిగి వస్తున్న సందర్భంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఏ సహచరులైతే ఖురాన్ కంఠస్థం చేసి, ఖురాన్ పారాయణం చేస్తూ, వాటి అర్థభావాలను తెలుసుకుంటూ, దాని ప్రకారంగా ఆచరిస్తూ, దాని వైపునకు ఇతరులను ఆహ్వానిస్తూ, జీవితం గడిపేవారో, అలాంటి పుణ్యాత్ముల, అలాంటి ధర్మాన్ని మంచి విధంగా అవలంబించిన వారి ఎగతాళి ఏదైతే వారు చేస్తూ ఉన్నారో, వారిని ఏదైతే పరిహసిస్తూ ఉన్నారో, ఆ విషయంలో వారిని అడగండి వారు ఎందుకు ఇలా చేశారు. దానికి సమాధానంగా వారు అన్నారు, ప్రయాణం క్షేమంగా జరగడానికి ఏదో కొన్ని నవ్వులాటలు చేసుకుంటాము కదా, ఏదైతే మేము కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము కదా వినోదం గురించి, అందులో ఇలాంటి మాటలు అనుకున్నాము. అయితే అల్లాహు త’ఆలా వారిని హెచ్చరిస్తున్నాడు. మీ ఆట, విలాసాలు, వినోదాలు వీటికి అల్లాహ్, అల్లాహ్ ఆయతులు, అల్లాహ్ యొక్క ప్రవక్తలా? అందుగురించి మహాశయులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పాపానికి ఎన్నడూ కూడా మనం గురి కాకూడదు.

అల్లాహ్ మనందరికీ ధర్మభ్రష్టత నుండి కాపాడుగాక, విశ్వాసం తర్వాత అవిశ్వాసంలో పడడం నుండి కాపాడుగాక.

షిర్క్, కుఫ్ర్ మరియు ధర్మభ్రష్టతకు గురిచేసే కార్యాల్లో రెండవది, అల్లాహ్ అవతరింపజేసిన మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన ఏ విషయాన్నైనా ‘ఇది నాకు ఇష్టం లేదు’ అని అనడం. ఇది కూడా మహా భయంకరమైన విషయం.

సూరె ముహమ్మద్ ఆయత్ నెంబర్ తొమ్మిది.

ذَٰلِكَ بِأَنَّهُمْ كَرِهُوا مَا أَنزَلَ اللَّهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ
[దాలిక బిఅన్నహుమ్ కరిహూ మా అన్జలల్లాహు ఫ అహ్బత అఅమాలహుమ్]

“అల్లాహ్ అవతరింపజేసిన వస్తువును వారు ఇష్టపడకపోవటం చేత ఈ విధంగా జరిగింది. అందుకే అల్లాహ్ (కూడా) వారి కర్మలను నిష్ఫలం చేశాడు.” (47:9)

ఇది ఎందుకు ఇలా జరిగినది అంటే, వారు అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నారు. ఇది నాకు ఇష్టం లేదు, అని అన్నారు. అందుకని అల్లాహు త’ఆలా వారి యొక్క సర్వ సత్కార్యాలను వృథా చేశాడు. ఏ ఫలితం మిగలకుండా చేసేసాడు. గమనించారా? అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నందువల్ల సత్కార్యాలకు ఏ సత్ఫలితం అయితే లభించాలో అది లభించకుండా ఉంటుంది. ఈ విధంగా మన త్రాసు బరువు కాకుండా తేలికగా అయిపోతుంది. నష్టమే కదా మనకు. త్రాసు బరువుగా పుణ్యాలతో సత్కార్యాలతో బరువుగా ఉంటేనే కదా మనం స్వర్గంలోకి వెళ్ళేది. అందు గురించి అల్లాహ్ అవతరింపజేసిన ఏ విషయాన్ని, నమాజ్ కానీ, ఉపవాసాలు కానీ, గడ్డము కానీ, పర్దా కానీ, ఇంకా అల్లాహు త’ఆలా ఏ ఏ ఆదేశాలు మనకిచ్చాడో, ఏ ఏ విషయాలు మనకు తెలిపాడో వాటిలో ఏ ఒక్క దానిని కూడా అసహ్యించుకోవద్దు.

అందుగురించి మహాశయులారా, ఇక్కడ ఒక విషయం చిన్నగా గమనించండి. ఏదైనా ఒక కార్యం చేయకపోవడం, అది వేరే విషయం. దానిని అసహ్యించుకొని దాని పట్ల, దాని ప్రస్తావన వస్తేనే మన మనసులో సంకోచం, ఏదైనా రోగం మొదలవడం ఇది మనల్ని అవిశ్వాసానికి తీసుకెళ్తుంది. ఉదాహరణకు నమాజ్ ఇది విధి అని, ఐదు వేళలలో పాబందీగా చేయాలని, మరియు పురుషులు సామూహికంగా జమాఅతులో మస్జిదులో పాల్గొనాలని, దీనిని నమ్మాలి. అల్లాహ్ అవతరింపజేసిన ఆదేశం ఇది. దీనిని అసహ్యించుకోవద్దు. ఇక ఎప్పుడైనా, ఎవరైనా ఏదైనా నమాజ్ తప్పిపోతే, దాని పట్ల ఒక రకమైన బాధ కూడా అతనికి ఉండాలి. కానీ, మంచిగానే జరిగింది. నమాజ్ అంటే నాకు అట్లా కూడా ఇష్టమే లేదు, ఇలా అనడం మహా పాపానికి, అవిశ్వాసానికి ఒడిగట్టినట్లు అవుతుంది. ఎవరైనా ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు. ఒక సమాజంలో, ఎలాంటి సమాజం అంటే అక్కడ గడ్డం ఉంచడం అతనికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల అతను తన గడ్డాన్ని ఉంచలేకపోతున్నాడు. కానీ, “ఈ గడ్డం ఉండాలి అని ఆదేశించడం, ఇట్లాంటి ఆదేశాలన్నీ నాకు నచ్చవండి. గడ్డం అంటేనే నేను అసహ్యించుకుంటాను“, అని అనడం గడ్డం ఉంచకపోవడం కంటే మహా పాపం.

ఇదే విధంగా, కొన్ని హలాల్ కార్యాలు ఉంటాయి. ఉదాహరణకు అల్లాహు త’ఆలా జంతువుల మాంసాన్ని మన కొరకు ధర్మసమ్మతంగా చేశాడు. తినడం కంపల్సరీ కాదు. కానీ వాటిని ధర్మంగా భావించాలి. అరే లేదండి ఇది ఎట్లా ధర్మం అవుతుంది? ఇదంటే నాకు ఇష్టమే లేదు. ఈ విధంగా అసహ్యించుకోవడం, అల్లాహ్ ఆదేశాన్ని ‘నాకు ఇది ఏ మాత్రం ఇష్టం లేదు’ అని అనడం, ఇది అవిశ్వాసానికి గురి చేస్తుంది. ఈ విధంగా మహాశయులారా, వేరే కొన్ని ధర్మ సమ్మతమైన విషయాలు కూడా అవసరం ఉన్నప్పుడు వాటిని ఉపయోగించడం వేరు విషయం. వాటిని మనం తినకపోవడం, వాటిని మనం ఉపయోగించకపోవడం అది వేరే విషయం. కానీ వాటిని అసహ్యించుకొని వదలడం ఇది మహా పాపానికే కాదు, అవిశ్వాసానికి గురి చేస్తుంది. అందుగురించి చాలా జాగ్రత్తగా ఉండాలి.

సత్కార్యాలను వృధా చేసి, ధర్మభ్రష్టత, కుఫ్ర్, అవిశ్వాసంలో పడవేసే మూడో విషయం, అల్లాహ్‌కు ఇష్టమైన దానిని మొత్తానికి వదిలేసి, దానిని ఆచరించకుండా ఉండి, అల్లాహ్‌కు ఏ విషయమైతే ఇష్టం లేదో దాని వెంట పడడం. ఇది కూడా మన సర్వ సత్కార్యాలను, సర్వ సత్కార్యాల సత్ఫలితాన్ని మట్టిలో కలుపుతుంది.

ذَٰلِكَ بِأَنَّهُمُ اتَّبَعُوا مَا أَسْخَطَ اللَّهَ وَكَرِهُوا رِضْوَانَهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ
[దాలిక బిఅన్నహుముత్తబఊ మా అస్ఖతల్లాహ వకరిహూ రిద్వానహూ ఫఅహ్బత అఅమాలహుమ్]

“వారి ఈ దుర్గతికి కారణం వారు అవలంబించిన మార్గమే. తద్వారా వారు అల్లాహ్‌ను అప్రసన్నుణ్ణి చేశారు. ఆయన ప్రసన్నతను వారు ఇష్టపడలేదు. అందుకే అల్లాహ్‌ వారి కర్మలను వృధా గావించాడు.” (47:28)

ఇది ఎందుకు ఇలా జరిగింది అంటే, దానికంటే ముందు ఆయతును చదివితే ఆ విషయం తెలుస్తుంది, చనిపోయే సందర్భంలో వారికి దేవదూతలు ఏ శిక్షలైతే విధిస్తున్నారో, ఇది ఎందుకు జరిగిందంటే, అల్లాహ్‌కు ఇష్టం లేనిది మరియు ఆయన్ని ఆగ్రహానికి గురి చేసే దానిని వారు అనుసరించారు. వకరిహూ రిద్వానహూ, మరియు ఆయనకు ఇష్టమైన, ఆయనకు ఇష్టమైన దానిని అసహ్యించుకున్నారు. ఇష్టం లేని దానిని ఇష్టపడి దానిని అనుసరించారు. మరి ఏదైతే అల్లాహ్‌కు ఇష్టం ఉన్నదో దానిని వదులుకున్నారు, దానిని అసహ్యించుకున్నారు. ఫ అహ్బత అ’మాలహుమ్, అందుకని అల్లాహు త’ఆలా వారి సత్కార్యాల సత్ఫలితాన్ని భస్మం చేశాడు. ఏ మాత్రం వారికి సత్ఫలితం లభించకుండా చేశాడు. ఈ విధంగా వారు నష్టపోయారు.

అందుకని మహాశయులారా, ధర్మభ్రష్టత అనేది చాలా భయంకరమైన విషయం. విశ్వాసంపై ఉన్న తర్వాత అవిశ్వాసంలో అడుగు పెట్టడం. విశ్వాస మార్గాన్ని అవలంబించి విశ్వాసానికి సంబంధించిన విషయాలను అసహ్యించుకొనడం, అల్లాహ్‌కు ఇష్టం లేని దాని వెంట పడడం, ఇష్టమైన దానిని వదిలివేయడం, ఇలాంటి విషయాలన్నీ కూడా మన సత్ఫలితాలన్నిటినీ భస్మం చేసి మట్టిలో కలిపి మనకు ఏ లాభం దొరకకుండా చేస్తాయి. అందుగురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

మరియు ఈ రోజుల్లో ఎన్నో రకాలుగా ఇలాంటి పాపాలకు ఎందరో గురి అవుతున్నారు. వారు ఇలాంటి ఆయతులను చదివి, భయకంపితలై ధర్మం వైపునకు మరలి, ధర్మంపై స్థిరంగా ఉండే ప్రయత్నం చేయాలి.

అల్లాహు త’ఆలా నాకు, మీకు అందరికీ సన్మార్గం ప్రసాదించి, వాటిపై స్థిరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక.

మన యొక్క త్రాసును తేలికగా చేసే మరియు దాని బరువును నశింపజేసే పాప కార్యాలు ఏమిటో మరిన్ని మనం ఇన్షాఅల్లాహ్ తర్వాయి భాగాల్లో తెలుసుకుందాము. మా ఈ కార్యక్రమాలను మీరు చూస్తూ ఉండండి. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43992

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

జాదు (చేతబడి) – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

[డౌన్లోడ్ తెలుగు PDF] – [డౌన్లోడ్ అరబిక్ PDF]

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ [آل عمران 102]. يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا [النساء 102]. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا * يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَمَنْ يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا [الأحزاب 70، 71].

స్తోత్రములు మరియు దరూద్ తరువాత:

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.      

అల్లాహ్ దాసులారా!  చేతబడి అంటే తాయత్తులపై, ముడులపై, మందులపై మంత్రాలు చదివి ఊదటం. దాని ద్వారా శరీరాలు, హృదయాలు ప్రభావితమవుతాయి. దానివల్ల వ్యక్తి వ్యాధి బారిన పడతాడు లేదా మరణిస్తాడు, లేదా మనిషి ఆలోచనలను, ఊహలను ప్రభావితం చేస్తుంది, లేదా భార్య భర్తలను వేరు చేయటము లేదా కలిసి వ్యాపారం చేస్తున్న ఇద్దరు స్నేహితులను వేరు చేయటము జరుగుతుంది. (అల్ ముగ్ని కితాబుల్ ముర్తద్)

అల్లాహ్ దాసులారా! చేతబడిలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి: హఖీఖి (వాస్తవమైనది). రెండవది: తఖయ్యులాతి (ఊహలు మరియు అంచనాలు).

హాఖీఖిలో మూడు రకాలు ఉన్నాయి: 

మొదటిది శరీరం పై ప్రభావం చూపిస్తుంది, దానివల్ల వ్యక్తి వ్యాధి బారిన పడతాడు లేదా మరణిస్తాడు. 

రెండవ రకములో  మానవ హృదయం పై ప్రేమ లేదా ద్వేషము ద్వారా  ప్రభావం చూపిస్తుంది, ఉదాహరణకు: భార్యను ద్వేషిస్తున్న భర్త మనసులో భార్య ప్రేమను సృష్టించడం, లేదా దానికి విరుద్ధము. దీని వల్లనే భర్త భార్యకు లేదా భార్య భర్తకు అందంగా కనిపించడం జరుగుతుంది (దీనినీ అరబిలో “అత్ ఫ్ ” అనే పేరుతో గుర్తిస్తారు) లేదా ప్రేమిస్తున్న భార్యకు భర్త దృష్టిలో శత్రువు లాగా చూపిస్తారు, దీని వల్ల భార్య భర్తకు, భర్త భార్యకు శత్రువు లాగా కనిపిస్తూ ఉంటారు (దీనినీ అరబీలో “సర్ ఫ్” అంటారు).

మూడో రకం ద్వారా మనిషి భ్రమ పడుతూ ఉంటాడు: నేను ఆ పని చేశాను, వాస్తవానికి ఆ పని అతను చేసి ఉండడు.  ఈ చేతబడి యొక్క ఉదాహరణ: లబీద్ బిన్ ఆసిం అనే యూదుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారికి చేతబడి చేసాడు. దాని వల్ల ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) వారు ఏదైనా పని చేశారని అనుకునేవారు కానీ వాస్తవానికి ఆ పని చేసి ఉండరు. ఈ విధంగా ఎన్నో నెలల వరకు ప్రవక్త వారిపై ఆ చేతబడి ప్రభావం ఉండేది (ఈ సంఘటన బుఖారి, ముస్లిమ్లలో వివరించబడినది)

అల్లాహ్ దాసులారా!  చేతబడి చేసేవాడు  మంత్రాల ద్వారా షైతాన్ నుండి సహయం తీసుకుంటాడు, అది ఎలా అంటే: మాంత్రికుడు అతి చెడ్డదైన మురికి  పరిస్థితిలో చేరి ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేస్తాడు,  దీని కోసం అతను చెడ్డ జిన్నాతులను ఆశ్రయిస్తాడు, మరి కొన్ని ముడులను మంత్రించి  దానిపై ఊదుతాడు,  (దీనిని అరబీ భాషలో నఫస్ అంటారు) దీని గురించి అల్లాహ్ ఖురాన్ లో ఇలా తెలియజేశాడు:

وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي العُقَد
(మంత్రించి) ముడులలో ఊదే వారి కీడు నుండి (113: 04) 

ఊదేవాళ్లు అంటే: చెడు జిన్నాత్తులు. వారు ముడులపై ఊదుతారు ఎందుకంటే చేతబడి యొక్క ప్రభావము జిన్నాతులు ఊదటం ద్వారానే అవుతుంది. కనుక వాళ్ళ శరీరాల నుంచి ఒక రకమైన ఊపిరి విడుదలవుతుంది, అందులో వాళ్ల ఉమ్మి కలిసి ఉంటుంది, దాని వల్ల ఎదురుగా ఉన్న వ్యక్తికి కీడు, హాని జరుగుతూ ఉంటుంది. ఈ జిన్నాతుల, షైతాన్ల ద్వారా ఎదుటి వ్యక్తి చేతబడికి గురవుతాడు, తఖ్దీర్ (విధివ్రాత) లోని ఒక రకం“కౌని” (జరగడం) మరియు “ఇజ్నీ” (ఆజ్ఞ) ద్వారానే చేతబడి సంభవిస్తుంది. అల్లాహ్ ఆదేశంపై శ్రద్ధ వహించండే:

وَمَا هُم بِضَارِّينَ بِهِ مِنْ أَحَدٍ إِلاَّ بِإِذْنِ اللَّه

ఎంత చేసినా వారు అల్లాహ్ అనుమతి లేకుండా ఆ చేతబడి ద్వారా ఎవరికీ ఎలిం కీడు కలిగించలేరు సుమా. (బఖర 2:102)

అల్లాహ్ దాసులారా!  కొంతమంది మాంత్రికుల వద్దకు వెళ్లి తనను కొంత కాలం వరకూ తన భార్య పిల్లల నుంచి వేరు చేయాలనుకొని చేతబడి జరిపిస్తారు. దాని ద్వారా వారు కొంత కాలం వరకు భార్య పిల్లల నుంచి నిశ్చింతమై ఉంటారు, ఈ విధంగా వాళ్ళు ప్రయాణాలను , పనులన్నీ ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు ఆ చేతబడిని భంగం చేస్తారు.

అల్లాహ్ దాసులారా! మాంత్రికులు, చేతబడి చేసే వాళ్ళు మనుషులను మోసం చేస్తూ ఉంటారు. కనుక ఎవరైనా వాళ్ల వద్దకు వెళ్తే, వాళ్ల ముందు ఖురాన్ పారాయణం చేస్తారు. దాని ద్వారా వచ్చిన వ్యక్తి  ఇతను అల్లాహ్ యొక్క వలి అని మంచి ఉద్దేశం కలిగి ఉంటారు. ఈ విధంగా మనుషులను మోసం చేస్తూ ఉంటారు. ఇలాంటి మాంత్రికులు తమ చేతబడిని కరామత్ (అల్లాహ్ తరఫు నుంచి మహిమ) అని ప్రదర్శిస్తూ ఉంటారు. వాస్తవానికి అది మంత్ర తంత్రాలు, చేతబడి. దానిని నేర్చుకోవటము మరియు అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్లడం కూడా నిషిద్ధము. దాని నుండి దూరం ఉండటం మరియు దానిని నివారించడము తప్పనిసరి (వాజిబ్).

అల్లాహ్ దాసులారా! తఖయ్యులాతి చేతబడి ప్రభావం అవ్వడానికి ఒకే మార్గం ఉన్నది – కంటి చూపులను ప్రభావితం చేయటము. శరీరము, హృదయము, ఆలోచనపై కాదు. కనుక ఎవరిపై అయితే చేతబడి చేస్తారో ఆ వ్యక్తి ప్రతి వస్తువు రూపాన్ని దానిని అవాస్తమైన వేరే రూపంలో చూస్తాడు. వాస్తవంగా ఆ వస్తువు ఉండదు.  ఈ చేతబడి ఫిర్ఔన్ దర్బారులో ఉన్న మాంత్రికులు మూసా ప్రవక్త వారిపై ప్రయోగం చేశారు, ఇదొక రకమైన షైతాన్ పని.

ప్రజలారా!  ఈ రకమైన “తఖయ్యులాతీ” చేతబడి వాస్తవాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక చూసేవాని కంట్లో దాని వాస్తవ  ప్రభావం జరుగుతుంది, కానీ చూస్తున్న వస్తువుపై దీని ప్రభావం ఉండదు. చూస్తున్న వస్తువు ఎక్కడ ఉన్నది అక్కడే వాస్తవంగా అలాగే ఉంటుంది,  కానీ చూసే వ్యక్తి కంట్లో మాత్రం చేతబడి ప్రభావం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ వస్తువు యొక్క రూపాన్ని మార్చటము తీర్చిదిద్దటము ఇది అల్లాహ్ కు మాత్రమే సాధ్యము, ఆయనకు ఎవరూ సాటి లేరు.

నేటి కాలంలో సర్కస్ పేరుమీద లేదా రెజ్లింగ్ గేమ్ అని చెప్పే ఆటలు కూడా తఖైయ్యులాతి చేతబడిలోనే భాగము. దాని ద్వారా మాంత్రికులు ప్రజల ఊహలను  ప్రభావితం చేస్తూ ఉంటారు. కనుక వస్తువులు తమ అసలైన రూపానికి విరుద్ధంగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్లు తమ చేసే ఈ పనిని చేతబడి అని చెప్పరు.  ఎందుకంటే ప్రజలు భయాందోళనకి గురికాకూడదని,  దానిని రెజ్లింగ్ ఆటలు ఇంకా వేరే ఆటల పేర్లు ఇస్తూ ఉంటారు. కానీ పేర్లు మారటం వలన వాస్తవం మారదు, ఎందుకంటే  వాస్తవాలను బట్టి నిర్ణయాలు ఉంటాయి. ఆ చేతబడి ఉదాహరణ ఏమిటంటే: ఒక వ్యక్తి తన తల వెంట్రుకల నుంచి కారు తీయడం, ఇంకో వ్యక్తి నిప్పులు తినటము, ఒక వ్యక్తి ఇనుపుతో తనకు తాను దాడి చేసుకోవడం లేదా నాలుకను కోసుకోవడం లేదా ఒక జంతువు నోటిలో ప్రవేశించి మల మార్గం ద్వారా  బయటకు రావడం, ఇంకా తమ వస్త్రాల నుంచి పావురాన్ని వెలికి తీయటము లేదా ప్రజల ముందు ఒక వ్యక్తి ఛాతీపై కారు నడిపించుట ఇలాంటి మొదలైనవి  ఎన్నో మానవుడి అధికారంలో లేనివి అన్ని షైతాన్ సహాయంతో జరుగుతూ ఉంటుంది.  షైతాన్ దాని తీవ్రతను భరిస్తూ ఉంటాడు,  లేదా ప్రజల కంటిపై చేతబడి ప్రభావం.

అల్లాహ్ దాసులారా!  చేతబడి చేసే మాంత్రికుల గురించి ఖురాన్ లో కూడా ఖండించడం జరిగినది. అల్లాహ్ ఆజ్ఞ:

وَلَا يُفْلِحُ السَّاحِرُ حَيْثُ أَتَىٰ
మాంత్రికుడు ఏ విధంగా (ఎంత అట్టహాసంగా) వచ్చినా సఫలీకృతుడు కాలేడు. (తాహా 20:69)

ఇంకా ఇలా ఆదేశించాడు:

 وَلَا يُفْلِحُ السَّاحِرُونَ
మాంత్రికులు సఫలీకృతులు కాలేరు. (యూనుస్ 10:77).

ఈ రెండు వాక్యాల ద్వారా మాంత్రికుడు ఏ విధంగానైనా సఫలికృతుడు కాలేడు, విజయం సాధించలేడని నిరూపించడం జరుగుతుంది (ఇది చేతబడి నేర్చుకొని అవిశ్వాసానికి పాల్పడిన వ్యక్తి హక్కులు) (అల్లామా షింఖీతి రహిమహుల్లాహ్ వారు ఖుర్ఆన్ వాక్యం వివరణలో మాంత్రికుడు కాఫిర్ (అవిశ్వాసి) అని నిరూపించారు)

ప్రవక్త మూసా అలైహిస్సలాం నోటి ద్వారా కూడా అల్లాహ్ మాంత్రికులను ఖండించాడు, ఖురాన్ వాక్యం ఈ విధంగా ఉన్నది:

مَا جِئْتُم بِهِ السِّحْرُ ۖ إِنَّ اللَّهَ سَيُبْطِلُهُ ۖ إِنَّ اللَّهَ لَا يُصْلِحُ عَمَلَ الْمُفْسِدِينَ

మీరు తెచ్చినది మంత్రజాలం, అల్లాహ్ ఇప్పుడే దానిని మిథ్యగా చేసి చూపిస్తాడు, అల్లాహ్ ఇలాంటి కల్లోల జనుల పనిని చక్కబడనివ్వడు. (యూనుస్ 10:81).

ఈ వాక్యం ద్వారా అర్థం అవుతున్న స్పష్టమవుతున్న విషయం ఏంటంటే ఈ భూమండలంపై మాంత్రికులు చేతబడి చేసేవాళ్లే  కల్లోల్లాన్ని, ఉపద్రవాలను, సృష్టించేవాళ్ళు.

పైన వివరించబడిన ఆయతుల ద్వారా స్పష్టమవుతున్నది ఏమిటంటే: మాంత్రికుడు, చేతబడి చేసేవాడు కాఫిర్ (అవిశ్వాసి). చేతబడి చేపించడం నిషిద్ధం మరియు ఈ భూమండలవాసులపై దాని చెడు ప్రభావం, హాని కలుగుతుందని, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ పనిని మరణాంతరం మానవుడిని సర్వనాశనం చేసే పనులలో లెక్కించారు. హజ్రత్ అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

اجْتَنِبُوا السَّبْعَ الْمُوبِقَاتِ

“వినాశనానికి గురి చేసే ఏడు విషయాలకు దూరంగా ఉండండి”. దానికి సహచరులు “ప్రవక్తా! అవి ఏమిటి?” అని అడిగారు. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు:

الشِّرْكُ بِاللهِ، وَالسِّحْرُ…
“అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించడం, చేతబడి చేయటం….” (బుఖారి 2766/ ముస్లిం 89).

హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు:

لَيْسَ مِنَّا مَنْ تَطَيَّرَ أَوْ تُطُيِّرَ لَهُ، أَوْ تَكَهَّنَ أَوْ تُكُهِّنَ لَهُ، أَوْ سَحَرَ أَوْ سُحِرَ لَهُ… وَمَنْ أَتَى كَاهِنًا فَصَدَّقَهُ بِمَا يَقُولُ فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ ﷺ

“శకునం తీయువాడు, తీయించువాడు, జ్యోతిష్యం చేయువాడు, చేయించు వాడు, చేతబడి చేయువాడు, చేయించువాడు మాలోని వారు కారు. ఏ వ్యక్తి అయినా జ్యోతిష్యం చేయువాని వద్దకు వెళ్ళి అతడు చెప్పిన మాటలను ధృవీకరించినచో అతడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లలాహు  అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించినవాడవుతాడు.” (*)

(*) ఈ హదీస్ ని ఇమామ్ బజ్జార్ 3578 ఉల్లేఖించారు. అయితే ముఅజం కబీర్ 355లోని పదాలు ఇలా ఉన్నాయి: హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ రజియల్లాహు అన్హు ఒక వ్యక్తి  చేతిలో ఇత్తడి కడియాన్ని చూసి, ఇదేమిటి అని ప్రశ్నించగా అతను చెప్పాడు: నాకు ‘వాహిన’ అను ఒక రోగం ఉంది, ఇది వేసుకుంటే అది దూరమవుతుందని నాకు చెప్పడం జరిగింది. ఈ మాట విన్న ఇమ్రాన్ రజియల్లాహు  అన్హు  చెప్పారు: أَمَا إِنْ مُتَّ وَهِيَ عَلَيْكَ وُكِلْتَ إِلَيْهَا నీవు ఇది వేసుకొని ఉండగానే చనిపోయావంటే నీవు దానికే అప్పగించబడిన వానివి అవుతావు. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పై హదీస్ తెలిపారు: “శకునం తీయువాడు, తీయించువాడు …. మాలోనివారు కారు”. (దీనిని అల్లమా అల్బానీ రహిమహుల్లాహ్ వారు సహీ అన్నారు. సహీహుల్ జామి 5435, సహీహా 2195).

ఇమామ్ బైహఖి హజ్రత్ ఖతాదాహ్ వారితో ఉల్లేఖించారు, కఅబ్ అన్నారు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “చేతబడి చేయువాడు, చేయించువాడు, జ్యోతిష్యం చేయువాడు, చేయించువాడు, శకునం చేయువాడు, చేయించువాడు నా నిజదాసులు కారు. నా నిజమైన దాసులు: నన్ను విశ్వసించి నాపై పూర్తి నమ్మకం కలిగినవారే”. (షుఅబుల్ ఈమాన్ 1176).

అల్లాహ్ దాసులారా!  చేతబడి చేయించడం కొరకు మాంత్రికుని (జాదూగర్) వద్దకు వెళ్లడం అవిశ్వాసం. అది కుఫ్ర్ (అవిశ్వాసం) అవ్వడానికి కారణం ఏమిటంటే: అతను ఆ చేతబడి(జాదు) ను ఇష్టపడ్డాడు, తమపై లేదా ప్రజలపై  చేయించడాన్ని సమ్మతించాడు.

జాదు (చేతబడి)కి పాల్పడక పోయినా దానిని ఇష్టపడటం కూడా అవిశ్వాసమే (కుఫ్ర్). ఎందుకనగా కుఫ్ర్ ను ఇష్టపడటం కూడా కుఫ్ర్ (అవిశ్వాసమే) అవుతుంది.  ఇది ఎలాంటిదంటే: ఒక వ్యక్తి విగ్రహారాధనను లేదా శిలువకు సాష్టాంగం చేయడాన్ని ఇష్టపడుతున్నట్లు. ఇలాంటి వ్యక్తి ఒకవేళ అతను సాష్టాంగం చేయకపోయినప్పటికీ,  విగ్రహారాధన చేయకపోయినా అతను కాఫిరే. ఉదాహరణకు:  ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు “నేను చేతబడి చెయ్యను, చేయమని ఆజ్ఞాపించను, చేతబడి నేర్చుకోను, నేర్చుకోమని ఆజ్ఞాపించను, కానీ నా ఇంట్లో, సమాజంలో చేతబడి జరగటం నాకు ఇష్టం, నేను దానిని నిరాకరించను”. ఇలాంటి వ్యక్తి కూడా కాఫిరే. ఎందుకంటే కుఫ్ర్ పట్ల రాజీ పడి ఉండడం కూడా కుఫ్ర్ యే గనక. కనీసం తన మనస్సుతో కుఫ్ర్ ను ఖండించనివాని హృదయంలో విశ్వాసం లేనట్లే. (అల్లాహ్ మనల్ని రక్షించుగాక)

అల్లాహ్ దాసులారా! ఈ తఖయ్యులాతీ  చేతబడి చేసేవాడు, వాస్తవాలను మార్చే శక్తి ఉందని ఆరోపిస్తాడు. మరి ఇలాంటి వాళ్ళు తమ ఈ దుష్చేష్ట వల్ల ఈ విశ్వంలో నియంత్రణ అధికారం కలిగి ఉన్నారని,  మరియు అల్లాహ్ ను కాకుండా వేరే వాళ్ళతో సహాయం ఆర్థిస్తారు.  ఈ రెండిటికి పాల్పడతారు, మొదటిది తౌహీదే రుబూబియత్ లో షిర్క్, రెండోది తౌహీదే ఉలూహియత్ లో షిర్క్ అవుతుంది. ఒక వ్యక్తి ముష్రిక్ మరియు మార్గ భ్రష్టుడు అవ్వడానికి ఈ రెండు ఆచరణలు సరిపోతాయి.  తౌహీదే రుబూబియత్ లో షిర్క్ అవ్వటానికి కారణం ఏమిటంటే అతను వాస్తవాలను మార్చే శక్తి కలిగి ఉన్నాడని ఆరోపించటం. కానీ ఈ విశ్వంలో వాస్తవాలను మార్చే శక్తి  అల్లాహ్ కు తప్ప మరెవరికీ లేదు, ఆయనే విశ్వాన్ని నడిపిస్తున్నాడు. ఆయనే సృష్టికర్త. ఆయనే ఒక వస్తువుని మరో వస్తువులో (రూపములో) మార్చే అధికారం కలిగి ఉన్నవాడు. కానీ ఇలాంటి అధికారము ఒక చేతబడి చేసేవాడు నేను కలిగి ఉన్నానని ఆరోపిస్తాడు,  ఈ విషయంలో అతను షిర్క్ కి పాల్పడుతున్నాడు, ఈ విషయంలో అతను అబద్ధం చెప్తున్నాడు. ఎందుకంటే అతను చేసే జాదు (చేతబడి)ని బట్టి అతను నేను అధికారం కలిగి ఉన్నాను అని ఆరోపిస్తున్నాడు, కానీ కళ్ళ పై ఆ చేతబడి ప్రభావం ఉన్నంతవరకు ఎదుటి వ్యక్తి భ్రమలో పడి ఉంటాడు. ఎప్పుడైతే దాని ప్రభావం తగ్గుతుందో వాస్తవం ప్రజల ముందు స్పష్టమవుతుంది మరియు వస్తువులు తమ అసలైన రూపంలో కనిపిస్తాయి

తౌహీదే ఉలూహియత్ లో షిర్క్ అవ్వడానికి కారణం ఏమిటంటే అతను షైతాన్ నుంచి సహాయం తీసుకుంటాడు మరియు షైతాన్ కి సాష్టాంగం చేసి, షైతాన్ని ఆరాధిస్తాడు,  షైతాన్ పేరు మీద జంతువులను జిబహ్ చేస్తాడు. మరి కొన్ని సందర్భాల్లో షైతాన్ ప్రసన్నత పొందటానికి ఖుర్ఆన్ని అవమానిస్తాడు. ఎందుకంటే షైతాన్ అతడి నుంచి ఎటువంటి ప్రతీకారము కోరడు, కేవలం అతను కుఫ్ర్ కి పాల్పడి, ఈ భూమండలంలో కల్లోలాన్ని వ్యాపించడం తప్ప. కనుక మాంత్రికుడు (చేతబడి చేసేవాడు) తనకు సహాయపడే షైతాన్ ను ఆరాధిస్తాడు, ఇదే అతని కుఫ్ర్ కి కారణం. మరియు ఆ మాంత్రికుడు అతన్ని ఆరాధించడం ద్వారా షైతాన్ లాభం పొందినట్లు గ్రహిస్తాడు. అదే షైతాన్ యొక్క అసలుద్దేశ్యం, అతడు ఆదం సంతతి నుండి కోరేది అదే. ఇదే విషయం అల్లాహ్ ఇలా తెలిపాడు:

أَلَمْ أَعْهَدْ إِلَيْكُمْ يَا بَنِي آدَمَ أَن لاَّ تَعْبُدُوا الشَّيْطَانَ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِين * وأنِ اعْبُدونِي هَذَا صِرَاطٌ مُسْتَقِيم

“ఓ ఆదం సంతతివారలారా! మీరు షైతాన్‌ను పూజించకండి, వాడు మీ బహిరంగ శత్రువు” అని నేను మీ నుండి వాగ్దానం తీసుకోలేదా? “మీరు నన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం” అని కూడా. (యాసీన్ 36:60,61).

ఇప్పటి వరకు వివరించబడిన విషయాల యొక్క సారాంశం ఏమిటంటే ఖురాన్, హదీసుల ఆధారంగా మరియు ఇజ్మాఎ ఉమ్మత్ ప్రకారంగా “చేతబడి నిషిద్ధము“. (మజ్మూఉల్ ఫతావా లిబ్ని తైమియహ్ 35/171)

షైతాన్   నుంచి సహాయం పొందటం వలన మాంత్రికుడికి ఏం లాభం? మరియు ఆ  మాంత్రికుడికి ప్రజల నుంచి  ఏమి లాభం?

అల్లాహ్ దాసులారా!  చేతబడి చేసేవాడు (మాంత్రికుడు) షైతాన్ నుంచి అనేక లాభాలు పొందుతాడు. ఉదాహరణకు:

షైతాన్ అతనికి దూర ప్రదేశాల ప్రయాణం అతి వేగంగా చేపిస్తాడు, ఇలాంటివి మొదలైనవి.

మాంత్రికుడు ప్రజల బలహీనతల నుంచి లబ్ధి పొందుతాడు , దాని ద్వారా ఆర్థికంగా లాభం పొందుతూ ఉంటాడు.  ఈ ముగ్గురు – షైతాన్ ,చేతబడి చేసేవాడు, చేయించేవాడు – తమ ప్రపంచాన్ని, పరలోకాన్ని నాశనం చేసుకుంటారు.

అల్లాహ్  దాసులారా!  చేతబడి చేయుట మరియు వాళ్ళ వద్దకు వెళ్లుట నుండి దూరంగా ఉండటం తప్పనిసరి. అయితే మాంత్రికుల వద్దకు పోకుండా ఉండటమే సరిపోదు, ఇస్లామీయ చట్ట ప్రకారం పరిపాలిస్తున్న దేశం అయితే, బాధ్యులకు మాంత్రికుల గురించి, వారి కార్యకలాపాల గురించి తెలియజేయాలి. వాళ్ళ సభలకు వెళ్లి, వాళ్ళ సంఖ్యను పెంచి, వాళ్లకు సహాయం చేయడం లాంటివన్నీ యోగ్యం లేలదు; అది టెలివిజన్ ద్వారానైనా, అనేక ఛానల్స్ మరియు అప్లికేషన్ల ద్వారా అయినా, అది కాలక్షేపం కొరకైనా, దాని అవగాహన కొరకైనా, లేదా దాన్ని తెలుసుకునే ప్రయత్నానికైనా  సరే,  ఏ ఉద్దేశంతో నైనా సరే వాళ్ళ వైపుకు వెళ్లకుండా ఉండాలి.

అల్లాహ్ దాసులారా! మాంత్రికులు, చేతబడి చేసేవాళ్లు మరియు ఇలాంటి అనేక ప్రక్రియలు అవిశ్వాస పూరితమైనవి. ఈ పనులు చేసే వాళ్ళపై అల్లాహ్ విధించిన శిక్షలను అమలు చేయడం ఉత్తమమైన ఆరాధన మరియు అల్లాహ్ సామిప్యాన్ని పొందే ఉత్తమైన ఆరాధనలలో ఒకటి. ఎందుకంటే వీళ్లు భూమండలంపై కల్లోల్లాన్నీ, ఉపద్రవాలను వ్యాపింప చేస్తారు, కనుక అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) వారి ఉల్లేఖనం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు ఇలా తెలియజేశారు: భూమిపై ఒక్క అపరాధికి అల్లాహ్ నియమించిన శిక్షను విధించడం వలన భూవాసులపై 40 రోజులు వర్షం కురవటం  కన్నా ఉత్తమైనది. (ఇబ్ను మాజహ్, అల్లామా ఆల్బాని వారు ప్రామాణికంగా ఖరారు చేశారు)

ఇబ్ను తైమియహ్ రహిమహుల్లాహ్ వారు ఇలా చెప్పారు: (మాంత్రికులను హతమార్చడం) దీనితోపాటు వాళ్ళ ఆచరణ, చేతబడికి సహాయపడే ప్రతి దానిని నాశనం చేయాలి, వృధా చేయాలి, అంతం చేయాలి, వీళ్లను సామాన్య రహదారులపై కూర్చోవడానికి నివారించాలి, మరియు ఇలాంటివాళ్లకు ఇల్లు అద్దెకి ఇవ్వరాదు. ఇవన్నీ అల్లాహ్ మార్గంలో జిహాద్ యొక్క ఉత్తమమైన రూపము, మార్గము.( మజ్మూ ఫతావా లి ఇబ్న్ తైమీయహ్)

చేతబడి ప్రక్రియలో పడకుండా జాగ్రత్త పడడానికి తెలుసుకోవలసిన ఖచ్చితమైన విషయాలు మరియు చేతబడి చేసేవాడు మరియు అతని వద్ద  పోయే వాళ్ల  కుఫ్ర్ ను తెలుసుకొనుటకు ఈ ఖుత్బా చాలా ప్రయోజనం చేకూర్చి ఉండాలి.

బారకల్లాహు లీ వలకుం ఫిల్ ఖుర్ఆనిల్ అజీం, వనఫఅనీ వఇయ్యాకుం బిమా ఫీహి మినల్ ఆయాతి వజ్జిక్రిల్ హకీం, అఖూలు ఖౌలీ హాజా, వఅస్తగ్ ఫిరుల్లాహ లీ వలకుం ఫస్తగ్ఫిరూహ్, ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీం.

(అల్లాహ్ నాపై, మీ పై ఖుర్ఆన్ శుభాలను అవతరింపజేయుగాకా! నాకూ, మీకూ అందులో ఉన్న వివేకము, లాభము ద్వారా ప్రయోజనం చేకూర్చుగాక! నేను నా మాటను ముగిస్తాను. మరియు నా కొరకు, మీ కొరకు క్షమాపణ కోరుతున్నాను మీరు కూడా కోరండి. నిస్సందేహంగా అల్లాహ్ చాలా క్షమించేవాడూ మరియు కరుణించేవాడూ.

చేతబడి నుండి రక్షణ మార్గాలు

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత …

అల్లాహ్ దాసులారా!  అల్లాహ్  భీతి కలిగి ఉండండి. మరి గుర్తుంచుకోండి. చేతబడి ప్రభావం కలగకుండా జాగ్రత్తగా ఉండడానికి: అజ్కార్ సబాహ్, మసా (ఉదయం, సాయంత్రం దుఆలు) చదువుతూ ఉండాలి.

చేతబడి సంభవించిన తర్వాత స్వస్థత పొందటానికి మూడు పద్ధతులు అవలంభించాలి:

మొదటి పద్ధతి మరియు చాలా ముఖ్యమైనది: అజ్కార్ సబాహ్, మసా (ఉదయం, సాయంత్రం దుఆలు) చదువుతూ ఉండాలి.

రెండవది పద్ధతి మరియు చాలా లాభదాయకమైనది: చేతబడి చేసిన ఆ వస్తువునీ,  దాచిన  ప్రదేశాన్ని తెలుసుకోవడం.  అది నేల లోపల ఉన్నా, లేదా కొండపై ఉన్నా, లేదా వేరే ఎక్కడున్నా సరే చేతబడి చేసి దాచిన ఆ వస్తువును తెలుసుకుంటే, దాన్ని అక్కడ నుంచి వెలికి తీసి నాశనం చేస్తే, తొలగిస్తే చేతబడి ప్రభావం దూరం అవుతుంది.

మూడవ పద్ధతి: ఇది ఏ వ్యక్తికి అయితే తన భార్యతో సంభోగ విషయంలో ఇబ్బందిగా ఉందో,  అలాంటి వ్యక్తికి చేయబడ్డ చేతబడి కి చాలా లాభకరమైనది.  ఏడు (7 ) పచ్చటి రేగి  ఆకులను తీసుకోవాలి, దానిని రాయితో దంచి, రుబ్బి, సన్నగా పేస్ట్ చేసి దానిని ఒక గిన్నెలో వేసి దానిపై స్నానం చేసేంత నీటిని వేసి, అందులో ఆయతుల్ కుర్సీ మరియు ఖుల్ యొక్క నాలుగు సూరాలు చదివి మరియు సూరతుల్ ఆరాఫ్, సూరతుల్ యూనుస్ మరియు సూరతుత్ తాహా లో చేతబడికి సంబంధించిన ఆయతులు పఠించాలి. దాని తర్వాత ఆ నీటిలోని కొద్ది భాగాన్ని మూడు సార్లు చేసి త్రాగాలి, మిగిలిన నీళ్లతో స్నానం చేయాలి. ఈ విధంగా చేతబడి యొక్క ప్రభావము ఇన్ షా అల్లాహ్  తొలగిపోతుంది. ఈ విధంగా రెండు మూడు సార్లు వ్యాధి నయం అయ్యే వరకు చేసినా పర్వాలేదు.

అల్లాహ్ మీపై కరుణించుగాకా, తెలుసుకోండి! అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి సూర అహ్ జాబ్:56లో ఆజ్ఞాపించాడు:

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا (56)

అల్లాహుమ్మ సల్లి వసల్లిమ్ వబారిక్ అలా అబ్దిక వరసూలిక ముహమ్మద్, వర్ జ అన్ అస్ హాబిహిల్ ఖులఫా, వమన్ తబిఅహుమ్ బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. అల్లాహుమ్మ అఇజ్జల్ ఇస్లామ వల్ ముస్లిమీన్, వఅజిల్లష్ షిర్క వల్ ముష్రికీన్, వదమ్మిర్ అఅదాఅక అఅదాఅద్దీన్, వన్సుర్ ఇబాదకల్ మువహ్హిదీన్.

ఓ అల్లాహ్ మా దేశాలలో భద్రతను ప్రసాదించు, మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గంపై నడిచే వారీగా చేయు.

ఓ అల్లాహ్ మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్ మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు.

ఓ అల్లాహ్ మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్మల్ని కాపాడు.

سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُون وَسَلَامٌ عَلَى الْمُرْسَلِين وَالْحَمْدُ للهِ رَبِّ الْعَالَمِين

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

సరియైన విశ్వాసం, దానికి విరుద్ధమైన విషయాలు & ఇస్లాంను భంగపరిచే విషయాలు – ఇమాం ఇబ్నె బాజ్ [పుస్తకం]

The Correct Belief and what Opposes It – Imaam ibn Baaz (rahimahullah)
రచయిత
: అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్)
తెలుగు అనువాదం: islamhouse

  1. తొలి పలుకులు
  2. మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం చూపటం
  3. దైవదూతల పట్ల విశ్వాసం
  4. దైవగ్రంధాల పట్ల విశ్వాసం
  5. దైవ సందేశహరుల పట్ల విశ్వాసం
  6. పరలోకం పట్ల విశ్వాసం
  7. విధి వ్రాత పట్ల విశ్వాసం
  8. విశ్వాసం అన్నది పలకటం మరియు ఆచరించటం. అది విధేయత చూపటం వలన అధికమగును మరియు అవిధేయత చూపటం వలన తరుగును.
  9. అల్లాహ్ కొరకు ప్రేమించటం, అల్లాహ్ కొరకు ద్వేషించటం, అల్లాహ్ కొరకు స్నేహం చేయటం
  10. ఈ విశ్వాసం నుండి మరలిపోయి దానికి వ్యతిరేకంగా నడిచేవారి ప్రస్తావన
  11. అల్లాహ్ ఒక్కడి ఆరాధన చేయటం తప్పనిసరి అవటం

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం

తొలి పలుకులు

అల్హమ్దులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాం అలా మన్లా నబియ్యబఅదహ్ వఅలా ఆలిహి వసహబిహి. అమ్మాబాద్

సరియైన విశ్వాసము ఇస్లాం ధర్మము యొక్క మూలము మరియు ధర్మము యొక్క పునాది.  అందుకనే నేను ప్రసంగము యొక్క అంశము దానిపై ఉండాలని నేను భావించాను. మరియు ఖుర్ఆన్ హదీసు ధార్మిక ఆధారాల ద్వారా తెలిసేదేమిటంటే ఆచరణలు మరియు మాటలు సరియైన విశ్వాసముతో జరిగి ఉంటే సరిఅవుతాయి మరియు స్వీకరించబడుతాయి. ఒక వేళ విశ్వాసము సరి కాకపోతే ఆ ఆచరణలు, మాటలు నిర్వీర్యమైపోతాయి.  అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:

وَمَن يَكْفُرْ بِالْإِيمَانِ فَقَدْ حَبِطَ عَمَلُهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ 

ఎవడు విశ్వాస మార్గాన్ని తిరస్కరిస్తాడో అతడి కర్మలు వ్యర్థమవుతాయి.  మరియు అతడు పరలోకంలో నష్టం పొందేవారిలో చేరుతాడు.  [అల్ మాయిద 5:5]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

  وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ

మరియు వాస్తవానికి! నీకూ మరియు నీకంటే ముందు వచ్చిన (ప్రతి ప్రవక్తకూ) దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలుపబడింది: “ఒకవేళ నీవు బహుదైవారాధన (షిర్కు) చేసినట్లైతే నీ కర్మలన్నీ వ్యర్థమై పోతాయి మరియు నిశ్చయంగా, నీవు నష్టానికి గురి అయిన వారిలో చేరిపోతావు”.  [జుమర్ 39:65]

ఈ అర్థములో చాలా ఆయతులు కలవు.  అల్లాహ్ యొక్క స్పష్టమైన గ్రంధము మరియు నీతిమంతుడైన ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ తెలియపరచిన సరిఅయిన అఖీదా ఏమిటంటే అల్లాహ్ పై, ఆయన దూతలపై, ఆయన గ్రంధములపై, ఆయన ప్రవక్తలపై, అంతిమ దినముపై మరియు మంచి, చెడు విధివ్రాతపై విశ్వాసం చూపటంలో ఇమిడి ఉంది.  ఈ ఆరు విషయాలు సరైన అఖీదా యొక్క పునాదులు.  వీటిని తీసుకుని సర్వ శక్తిమంతుడైన అల్లాహ్ గ్రంధం అవతరించింది.  మరియు అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంనకు వాటిని ఇచ్చి పంపించాడు.  మరియు అగోచర విషయాలు వేటిని విశ్వసించటం తప్పనిసరో మరియు వేటి గురించి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియపరచారో అన్ని ఈ పునాదుల నుండి ఉధ్భవించినవి.  ఈ ఆరు పునాదుల యొక్క ఆధారాలు గ్రంధములో మరియు సున్నతులో చాలా ఉన్నవి.  వాటిలో నుంచి అల్లాహ్ సుబహానహు వతఆలా యొక్క ఈ వాక్కు:

  لَّيْسَ الْبِرَّ أَن تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَٰكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ وَآتَى الْمَالَ عَلَىٰ حُبِّهِ ذَوِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينَ وَابْنَ السَّبِيلِ وَالسَّائِلِينَ وَفِي الرِّقَابِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَالْمُوفُونَ بِعَهْدِهِمْ إِذَا عَاهَدُوا ۖ وَالصَّابِرِينَ فِي الْبَأْسَاءِ وَالضَّرَّاءِ وَحِينَ الْبَأْسِ ۗ أُولَٰئِكَ الَّذِينَ صَدَقُوا ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُتَّقُونَ

మీరు మీ ముఖములను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు.  సదాచరణ అంటే అల్లాహ్ ను, అంతిమ దినాన్నీ, దైవదూతలనూ, దైవగ్రంధాన్ని, దైవప్రవక్తలనూ విశ్వసించటం.  [అల్ బఖర 2: 177]

మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ వాక్కు:

 آمَنَ الرَّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِ وَالْمُؤْمِنُونَ ۚ كُلٌّ آمَنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّن رُّسُلِهِ ۚ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا ۖ غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ

ఈ ప్రవక్త తన ప్రభువు తరుపు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు మరియు (అదే విధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు).  వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు.  (వారంటారు :) మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము.  [అల్ బఖర 2: 285]

మరియు పరిశుద్ధుడైన ఆయన వాక్కు:

  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا آمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَالْكِتَابِ الَّذِي نَزَّلَ عَلَىٰ رَسُولِهِ وَالْكِتَابِ الَّذِي أَنزَلَ مِن قَبْلُ ۚ وَمَن يَكْفُرْ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَالْيَوْمِ الْآخِرِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا

ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను, ఆయన సందేశహరుణ్ణి, ఆయన తన సందేశహరుని పై (ముహమ్మద్ పై) అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు ఆయన ఇంతకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి.  అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయాడు.  [నిసా 5: 136]

మరియు పరిశుద్ధుడైన ఆయన వాక్కు:

  أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا فِي السَّمَاءِ وَالْأَرْضِ ۗ إِنَّ ذَٰلِكَ فِي كِتَابٍ ۚ إِنَّ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ

ఏమీ? నీకు తెలియదా? ఆకాశంలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసని! నిశ్చయంగా, ఇదంతా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది.  నిశ్చయంగా ఇదంతా అల్లాహ్ కు చాలా సులభమైనది.  [హజ్ 22: 70]

ఈ పునాదులపై సూచించే సహీహ్ హదీసులు చాలా ఉన్నవి.  వాటిలో నుంచి ప్రసిద్ధిచెందిన హదీసు దాన్ని ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) అమీరుల్ మూమినీన్ హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు నుండి తన జామె సహీహ్ లో ఉల్లేఖించారు. 

జిబ్రయీల్ అలైహిస్సలాం గారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఈమాన్ గురించి అడిగారు.  ఆయనకు సమాధానమిస్తూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియపరచారు: ఈమాన్ అంటే నీవు అల్లాహ్ పై, ఆయన దూతల పై, ఆయన గ్రంథముల పై, ఆయన ప్రవక్తల పై మరియు అంతిమ దినం పై విశ్వాసమును చూపటం మరియు నీవు విధివ్రాత పై దాని మంచి, చెడు పై విశ్వాసము చూపటం[1].  . 

మరియు ఈ హదీసును ఇమామ్ బుఖారీ మరియు ఇమామ్ ముస్లిం రహిమహుమల్లాహ్ అబూహురైరా రజియల్లాహు అన్హు హదీసు నుండి ఉల్లేఖించారు.  ఈ ఆరు నియమాలు: వాటి నుండి అల్లాహ్ హక్కు విషయంలో మరియు పరలోక విషయంలో మరియు ఇతర అగోచర విషయాలలో ఒక ముస్లిం విశ్వసించవలసిన విషయాలన్నీ ఉద్భవించాయి. 

ముస్లింను దూషించటం మహాపాపం.ఇక అతన్ని చంపటం అంటే అది అవిశ్వాసానికి ప్రతీక [వీడియో]

ముస్లింను దూషించటం మహాపాపం.ఇక అతన్ని చంపటం అంటే అది అవిశ్వాసానికి ప్రతీక| బులూగుల్ మరాం| హదీసు 1283
https://youtu.be/iNtNrlahhLM [9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1283. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:

ముస్లింను దూషించటం మహాపాపం. ఇక అతన్ని చంపటం అంటే అది అవిశ్వాసానికి, దైవధిక్కరణకు ప్రతీక” (బుఖారీ, ముస్లిం)

సారాంశం:

హదీసులో “ఫిస్ఖ్” అనే పదం ప్రయోగించబడింది. సాటి ముస్లింను దూషించినవాడు “ఫాసిఖ్‌” అవుతాడు. అంటే దైవవిధేయతా పరిమితిని దాటిపోయినవాడు, హద్దులను అతిక్రమిం చినవాడన్న మాట! హద్దులను అతిక్రమించినవాడు పాపాత్ముడు, అపరాధి అవుతాడు. ఇక ముస్లింను చంపటం అంటే విశ్వాసాన్ని (ఈమాన్‌ను) త్రోసిరాజనటమే. అకారణంగా ఎవరయినా సాటి ముస్లింను చంపడాన్ని తన కొరకు ధర్మసమ్మతం గావించుకుంటే అతడు ఇస్లాంతో తాను ఏకీభవించటం లేదని క్రియాత్మకంగా రుజువు చేస్తున్నాడు. కనుక అతని ఈ చేష్ట ‘కుఫ్ర్’ క్రిందికి వస్తుంది.

సహీహ్‌ ముస్లింలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు : “నా అనుచర సమాజ సభ్యులందరూ క్షేమంగా, నిక్షేపంగా ఉండదగ్గవారే. అయితే బహిరంగంగా, నిస్సంకోచంగా పాపాలకు ఒడిగట్టేవారు మాత్రం దీనికి అర్హులు కారు.పాపాత్మునికి పాపకార్యాలను గురించి జాగరూకపరచటం గురించి పండితుల మధ్య భిన్నాభిప్రాయా లున్నాయి. తబ్రానీలో హసన్‌ పరంపర ద్వారా సేకరించబడిన ఒక హదీసులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా సెలవిచ్చారు:

“మీరు ఎప్పటి వరకు పాపాత్ముని ఘోరకృత్యాలను చెప్పకుండా ఉంటారు? అతని బండారం బయటపెట్టి తగిన శాస్తి జరిగేలా చూడండి.” ఈ హదీసు వెలుగులో దుర్మార్గుని దౌష్ట్య్రం నుండి ప్రజలు సురక్షితంగా ఉండగలిగేందుకు అతని దుర్మార్గాలను ఎండగడితే అది ముమ్మాటికీ ధర్మసమ్మతమే.


యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

అల్లాహ్ ఆయతులతో వేళాకోళం చేస్తున్నవారితో నీవు కూర్చోకు [వీడియో & టెక్స్ట్]

ధర్మపరమైన నిషేధాలు – 39
అల్లాహ్ ఆయతులతో వేళాకోళం చేస్తున్నవారితో నీవు కూర్చోకు
https://youtu.be/HzdBTTa3fGc [8 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రసంగం యొక్క ఈ భాగంలో, అల్లాహ్ యొక్క ఆయతులను (వచనాలను) ఎగతాళి చేసే వ్యక్తులతో కూర్చోవడం చేయడం నిషేధించబడిన విషయం గురించి చర్చించబడింది. ఎవరైనా అలాంటి వారిని ఆపగల శక్తి, జ్ఞానం, మరియు సదుద్దేశంతో వారి మధ్య కూర్చుంటే తప్ప, కేవలం వారి ఎగతాళిని వింటూ వారితో ఉండటం కూడా పాపంలో భాగస్వామ్యం అవ్వడమేనని వక్త స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, సూరతున్నసా (4వ అధ్యాయం)లోని 140వ ఆయతును పఠించి, దాని భావాన్ని వివరించారు. ఆ ఆయతు ప్రకారం, అల్లాహ్ ఆయతులను తిరస్కరించడం లేదా పరిహసించడం విన్నప్పుడు, ఆ సంభాషణను విడిచిపెట్టాలి, లేకపోతే వారు కూడా ఆ పాపులతో సమానం అవుతారు. వక్త ఈనాటి ముస్లింల పరిస్థితిని ప్రస్తావిస్తూ, సోషల్ మీడియా, సినిమాలు, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇలాంటి పాపభూయిష్టమైన విషయాలను చూస్తూ, వాటిలో పాల్గొంటూ, కనీసం ఖండించకుండా మౌనంగా ఉండటం ఎంతటి ప్రమాదకరమో హెచ్చరించారు. చెడును చేతితో, లేదా మాటతో ఆపాలని, కనీసం మనసులోనైనా దానిని ద్వేషించాలని చెప్పే హదీసును ఉటంకిస్తూ, విశ్వాసంలోని బలహీన స్థాయిని కూడా కోల్పోకూడదని ఉద్బోధించారు.

39వ విషయం: అల్లాహ్ ఆయతులతో వేళాకోళం చేస్తున్న వారితో నీవు కూర్చోకు.

శ్రద్ధ వహించండి, కన్ఫ్యూజ్ కాకండి. 38వ విషయం ఏమి విన్నారు? అల్లాహ్, అతని ఆయతులు, ఆయన ప్రవక్త పట్ల ఎగతాళి చేయకూడదు. కానీ ఇక్కడ 39వ విషయం, ఎవరైతే ఇలా ఎగతాళి చేస్తూ ఉన్నారో, అలాంటి వారికి తోడుగా ఉండకు. ఆ ఎగతాళి చేస్తున్న సందర్భములో వారితో కలిసి కూర్చోకు. ఆ సందర్భములో వారితో కలిసి ఉండకు. ఒకవేళ, నీవు వారిని ఆపగలుగుతున్నావు, అతను మాట పూర్తి చేసే వరకు మధ్యలో ఆపేది ఉంటే మన మాటను శ్రద్ధ వహించడు అందుకొరకే, కొంచెం మాట పూర్తి చేసిన వెంటనే, అతన్ని బోధ చేస్తాను, అతనికి నేను నసీహత్ చేస్తాను, అతను చేసిన ఈ పాపం ఎగతాళి నుండి నేను అతన్ని ఆపుతాను, ఇలాంటి సదుద్దేశం ఉండి, ఆపే అంతటి శక్తి ఉండి, ఆపే అంతటి జ్ఞానం ఉండి, అక్కడ కూర్చుంటే పాపం లేదు. కానీ అలా కాకుండా, ఆపడం అయితే లేదు, కానీ వారితో కలిసి కూర్చోవడం, ఇది కూడా పాపంలో వస్తుంది, ఇది కూడా ఒక నిషేధం, మనం దీనిని వదులుకోవాలి.

ముందు దీనికి సంబంధించి సూరతున్నసా, సూర నెంబర్ నాలుగు, ఆయత్ నెంబర్ 140 వినండి, ఆ తర్వాత దీనికి సంబంధించిన మరి చిన్నపాటి వివరణ కూడా మనం తెలుసుకుందాం.

[وَقَدْ نَزَّلَ عَلَيْكُمْ فِي الكِتَابِ أَنْ إِذَا سَمِعْتُمْ آَيَاتِ اللهِ يُكْفَرُ بِهَا وَيُسْتَهْزَأُ بِهَا فَلَا تَقْعُدُوا مَعَهُمْ حَتَّى يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ إِنَّكُمْ إِذًا مِثْلُهُمْ إِنَّ اللهَ جَامِعُ المُنَافِقِينَ وَالكَافِرِينَ فِي جَهَنَّمَ جَمِيعًا] {النساء:140}

అల్లాహ్ ఈ గ్రంథంలో మీకు ఇదివరకే ఈ ఉత్తరువు ఇచ్చి  ఉన్నాడు: అల్లాహ్ ఆయతులకు వ్యతిరేకంగా తిరస్కారవచనాలు వాగటాన్ని, వాటిని పరిహసించటాన్ని మీరు విన్నట్లైయితే, అలా చేసేవారు (ఆ సంభాషణ వదలి) వేరే మాట ప్రారంభించనంత వరకు మీరు వారితో కలసి కూర్చోకండి. ఇప్పుడు మీరు గనక అలా చేస్తే మీరూ వారి లాంటి వారే. అల్లాహ్ కపటులనూ, అవిశ్వాసులనూ నరకంలో ఒకచోట పోగుచెయ్యబోతున్నాడనే విషయం నిశ్చయమని తెలుసుకోండి[. (నిసా 4: 140).

అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ ఎంతటి హెచ్చరిక ఇందులో ఉంది ఈ రోజుల్లో మనం ఇలాంటి ఆయతులు చదవడం లేదు. అల్లాహ్ ఈ గ్రంథంలో మీకు ఇదివరకే ఈ ఉత్తరువు ఇచ్చి ఉన్నాడు, అల్లాహ్ ఈ దివ్య గ్రంథము ఖురాన్ లో మీకు ఇంతకు ముందే ఆదేశం ఇచ్చి ఉన్నాడు దీనికి సంబంధించి. ఏంటి? అల్లాహ్ ఆయతులకు వ్యతిరేకంగా, తిరస్కార వచనాలు వాగటాన్ని, వాటిని పరిహసించటాన్ని మీరు విన్నట్లయితే, అలా చేసే వారితో మీరు, వారు తమ ఆ సంభాషణ వదిలే వరకు వారితో కూర్చోకండి. ఫలా తఖ్’ఉదూ, గమనించండి, ఫలా తఖ్’ఉదూ, మీరు వారితో కూర్చోకండి. హత్తా యఖూదూ ఫీ హదీసిన్ గైరిహ్. వారు వేరే మాట ఎప్పటివరకైతే మాట్లాడారో మీరు వారితో, ఖురాన్ కు ఎగతాళి జరిగినప్పుడు, అల్లాహ్ పట్ల ఎగతాళి జరిగినప్పుడు, అల్లాహ్ ధర్మం పట్ల ఎగతాళి జరిగినప్పుడు, వారితో పాటే అక్కడ కూర్చోవడం, ఇది మీకు తగని విషయం. అంతే కాదు, ఇక్కడ గమనించండి, ఇన్నకుమ్ ఇదమ్ మిస్లుహుమ్. మీరు గనక నా ఈ ఆదేశాన్ని వినలేదంటే, మీరు కూడా వారిలో కలిసిపోయినవారే. గమనిస్తున్నారా? ఒక వ్యక్తి ఎగతాళి చేస్తున్నాడు, నువ్వు అక్కడే కూర్చొని ఉన్నావు. అతన్ని ఆపడం లేదు. నీకు చెప్పే అధికారం లేదు, అయ్యో నేను ఎగతాళి చేస్తలేనండి అని. నీవు కూడా ఇతనితో సమానం అని నేను అనడం లేదు, అల్లాహ్ అంటున్నాడు. ఇన్నకుమ్ ఇదమ్ మిస్లుహుమ్. నిశ్చయంగా మీరు కూడా వారితో సమానం.

అంతేనా? అల్లాహ్ ఇంకా హెచ్చరించాడు, గమనించండి. ఇన్నల్లాహ జామిఉల్ మునాఫిఖీన వల్ కాఫిరీన ఫీ జహన్నమ జమీఆ. అల్లాహ్ త’ఆలా వంచకులను మరియు అవిశ్వాసులను, కపట విశ్వాసులను, అవిశ్వాసులను కలిపి నరకంలో ఉంచుతాడు అని. వాస్తవానికి మనలో విశ్వాసం ఉంటే, వాస్తవానికి విశ్వాసం పట్ల కపటత్వం, వంచకపుతనం మనలో లేకుంటే, మనం ఆపాలి వారిని, లేదా అక్కడి నుండి వెళ్ళిపోవాలి.

సహీహ్ ముస్లిం యొక్క హదీస్ కూడా ఇక్కడ మీకు గుర్తొస్తుంది కదా? మన్ రఆ మిన్కుమ్ మున్కరన్. మీలో ఎవరైతే ఒక చెడు పనిని చూస్తారో, ఫల్ యుగయ్యిర్హు బియదిహ్. తన శక్తి ఉండేది ఉంటే తన చెయ్యితో అతన్ని ఆపాలి. ఫ ఇల్లమ్ యస్తతి’ ఫబిలిసానిహ్. చెయ్యితో ఆపే శక్తి లేకుంటే, నోటితో ఆపాలి. ఫ ఇల్లమ్ యస్తతి’ ఫబికల్బిహ్. ఆ శక్తి లేకుంటే హృదయంలో దాన్ని చెడుగా భావించి అక్కడి నుండి దూరం ఉండాలి. వ దాలిక అద్’అఫుల్ ఈమాన్. ఇదే విశ్వాసం యొక్క చివరి మెట్టు. ఇది బలహీన స్థితి విశ్వాసం యొక్క. ఈ పని కూడా కనీసం చేయలేదు అంటే ఇక విశ్వాసం లేనట్టే భావం.

సోదర మహాశయులారా, ఈ విషయంలో మనం అల్లాహ్ తో భయపడుతున్నామా నిజంగా? ఈ విషయంలో మనం నిజంగా అల్లాహ్ తో భయపడుతున్నామా? ఎంత ఘోరానికి మనం పాల్పడుతున్నాము. ఈ రోజుల్లో మన సమాజంలో, మన వాట్సాప్ గ్రూపులలో, మన సోషల్ మీడియాలో, ఎన్ని చెడులైతే చూస్తూ ఉన్నామో, ఆ చెడును ఖండించే అటువంటి శక్తి, ఆ చెడును ఖండించే అంతటి జ్ఞానం లేకపోతే, దానిని చూసుకుంటూ ఉండడం… అల్లాహు అక్బర్… అల్లాహు అక్బర్ అస్తగ్ ఫిరుల్లాహ్.

ముస్లిం యువకులు, ముస్లిం యువతులు, ఏ ఫిలింలు చూస్తూ ఉంటారో, ఏ పాటలు వింటూ ఉంటారో, ఏ సీరియల్ లు చూస్తూ ఉంటారో, ఏ కార్టూన్లు చూస్తూ ఉంటారో, ఏ గేమ్ లు ఆడుతూ ఉంటారో, ఏ వాట్సాప్ గ్రూపులలో ఉన్నారో, ఏ సోషల్ మీడియాలోని అప్లికేషన్లలో ఫాలో అవుతున్నారో, షేర్ చేస్తున్నారో, వీరందరూ కూడా గమనించాలి, అల్లాహ్ కు ఇష్టమైన వాటిలో వారు పాల్గొన్నారంటే, అల్ హందులిల్లాహ్. అల్లాహ్ కు ఇష్టం లేని వాటిలో పాల్గొన్నారంటే, అక్కడ ఖురాన్ పట్ల, హదీసుల పట్ల, ప్రవక్త పట్ల మరియు అల్లాహ్ యొక్క ఆయతుల పట్ల ఎగతాళి, పరిహాసం జరుగుతూ ఉన్నది. వారితో పాటు నవ్వులో నవ్వు మీరు కలిసి ఉన్నారు, లేదా కనీసం వారిని ఖండించకుండా మౌనం వహించి ఉన్నారు, వారి యొక్క సబ్స్క్రైబర్స్ పెరిగే మాదిరిగా ఉన్నారు, వారి యొక్క ఫాలోవర్స్ పెరిగే మాదిరిగా ఉన్నారు, వారి సంఖ్య పెద్దగా కనబడే విధంగా ఉన్నారు. ఆలోచించండి, ఈ పాపంలో మనం కలిసిపోతలేమా? ఖురాన్, హదీసులను మనం ఈనాటి కాలంలో ఎక్కువ ప్రచారం చేయాలి, మంచిని మనం ఎక్కువగా ప్రజల వరకు చేరవేయాలి. అలా కాకుండా ఏ చెడులోనైతే మనం పాల్గొంటామో, దాని వల్ల మనం ఎంత పాపానికి గురి అవుతామో ఎప్పుడైనా గమనించారా? అల్లాహ్ మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక.

పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు:

ధర్మపరమైన నిషేధాలు
https://teluguislam.net/?p=1705

తల్లిదండ్రులు షిర్క్, కుఫ్ర్ లాంటి బిదత్ చేస్తుంటే వారితో ఎలా మెలగాలి? [వీడియో]

బిస్మిల్లాహ్

[1:37 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ హఫిజహుల్లాహ్

బిద్అత్ (కల్పితాచారం) – Bidah – మెయిన్ పేజీ
https://teluguislam.net/others/bidah/

బిద్అత్ (కల్పితాచారం) పార్ట్ 01 – బిద్అత్ మరియు దాని నష్టాలు  
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ హఫిజహుల్లాహ్ – [39:20 నిముషాలు][వీడియో]

బిద్అత్ (కల్పితాచారం) పార్ట్ 02 – బిద్అత్ రకాలు, రూపాలు, కారణాలు 
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ హఫిజహుల్లాహ్ [34:42 నిముషాలు] [వీడియో]

ఒక ముస్లిం అయిఉండి విగ్రహారాధనను సమర్ధించవచ్చా? [ఆడియో]

బిస్మిల్లాహ్

నేను ఒక ముస్లిం అని చెప్పుకుంటూ జై శ్రీరామ్, భరతమాత కి జై, జై హింద్ అంటూ నినాదాలు చేస్తూ ముస్లింల యొక్క అస్థిత్వాన్ని, ఆచారాలను మంట కలుపుతూ యావత్ ముస్లిం సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నారు

[13:34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

క్విజ్: 76: ప్రశ్న 02: సమాధుల పూజ [ఆడియో]

బిస్మిల్లాహ్

[7:36 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

రెండవ ప్రశ్న సిలబస్ : సమాధుల పూజ

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు (Muharramat) పుస్తకం నుండి:

సమాధులను పూజించడం, మరణించి సమాధుల్లో ఉన్న వలీలు (పుణ్యపురుషులు) అవసరాలను తీరుస్తారని, కష్టాలను తొలిగిస్తారని నమ్మడం మరియు అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నదాని సహాయం వారితో కోరడం, వారితో మొరపెట్టుకోవడం లాంటివి పెద్ద షిర్క్ లో లెక్కించ బడతాయి.

అల్లాహ్ ఆదేశం చదవండి:

وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ
మీ ప్రభువు తనను తప్ప ఇతరులను మీరు ఆరాధింపకూడదని ఆదేశించాడు
[. (బనీఇస్రాఈల్ 17: 23).

అదే విధంగా చనిపోయిన ప్రవక్తలతో, పుణ్యాత్ములతో ఇంకెవరితోనైనా వారి సిఫారసు పొందుటకు, తమ కష్టాలు దూరమగుటకు వారితో దుఆ చేయడం కూడా షిర్క్. చదవండి అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:

أَمَّنْ يُجِيبُ المُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الأَرْضِ أَإلَهٌ مَعَ اللهِ
బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరలను ఆలకించి అతని బాధను తొలగించేవాడు ఎవడు? భూమిపై మిమ్మల్ని ప్రతినిధులుగా
చేసినవాడు ఎవడు? అల్లాహ్ తో పాటు (ఈ పనులు చేసే) మరొక దేవుడు కూడ ఎవడైనా ఉన్నాడా?
(నమ్ల్ 27: 62).

కొందరు కూర్చున్నా, నిలబడినా, జారిపడినా తమ పీర్, ముర్షిదుల నామములను స్మరించుటయే తమ అలవాటుగా చేసుకుంటారు. ఎప్పుడు ఏదైనా క్లిష్టస్థితిలో, కష్టంలో, ఆపదలో చిక్కుకున్నప్పుడు ఒకడు యా ముహమ్మద్ అని, మరొకడు యా అలీ అని, ఇంకొకడు యా హుసైన్ అని, మరి కొందరు యా బదవీ, యా జీలానీ, యా షాజులీ, యా రిఫాఈ, యా ఈద్ రూస్, యా సయ్యద జైనబ్, యా ఇబ్ను ఉల్వాన్ అని, యా గౌస్ అల్ మదద్ అని, యా ముఈనుద్దీన్ చిష్తీ అని, యా గరీబ్ నవాజ్ అని, నానా రకాలుగా పలుకుతారు. కాని అల్లాహ్ ఆదేశం ఏమిటని గమనించరు:

إِنَّ الَّذِينَ تَدْعُونَ مِنْ دُونِ اللهِ عِبَادٌ أَمْثَالُكُمْ فَادْعُوهُمْ فَلْيَسْتَجِيبُوا لَكُمْ إِنْ كُنْتُمْ صَادِقِينَ
అల్లాహ్ ను వదలి మీరు వేడుకుంటున్న వారు మీ మాదిరిగానే కేవలం దాసులు. మీరు వారిని ప్రార్థించి చూడండి. మీకు వారి పట్ల ఉన్న భావాలు నిజమే అయితే మీ ప్రార్థనలకు వారు సమాధానం ఇవ్వాలి (అఅ’రాఫ్ 7: 194).

కొందరు సమాధి పూజారులు సమాధుల ప్రదక్షిణం చేస్తారు. వాటి మూలమూలలను చుంబిస్తారు. చేతులు వాటికి తాకించి తమ శరీరంపై పూసుకుంటారు. వాటి గడపను చుంబిస్తారు. దాని మట్టిని తీసుకొని తమ ముఖాలకు రుద్దుకుంటారు. వాటిని చూసినప్పుడు సాష్టాంగ పడతారు (సజ్దా చేస్తారు). తమ అవసరాలను కోరతూ రోగాల నుండి స్వస్థత పొందుటకు, సంతానం కావాలని, అవసరం తీరాలని వాటి ఎదుట భయభీతితో, వినయవినమ్రతలతో నిలబడతారు. ఒక్కోసారి సమాధిలో ఉన్నవారిని ఉద్దేశించి ఇలా పిలుస్తారు కూడా: యా సయ్యిదీ! ఓ మేరే బాబా! నేను చాలా దూరం నుండి మీ సమక్షంలో హాజరయ్యాను, నాకు ఏమీ ప్రసాదించక వెనక్కు త్రిప్పి పంపుతూ అవమాన పరచకు.

కాని అల్లాహ్ ఆదేశం ఏముందో గమనించారా?

وَمَنْ أَضَلُّ مِمَّنْ يَدْعُو مِنْ دُونِ اللهِ مَنْ لَا يَسْتَجِيبُ لَهُ إِلَى يَوْمِ القِيَامَةِ وَهُمْ عَنْ دُعَائِهِمْ غَافِلُونَ
అల్లాహ్ ను వదలి ప్రళయం వరకు తమ ప్రార్థనలను విని సమాధాన మివ్వలేనటువంటి వారిని ప్రార్థించే వారికంటే, ఎక్కువ మార్గభ్రష్టులెవరు? మరియు వారు వీరి (ప్రార్థించేవారి) ప్రార్థనలను ఎరుగకుండా ఉన్నారు
(అహ్ఖాఫ్ 46: 5).

ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు:

مَنْ مَاتَ وَهْوَ يَدْعُو مِنْ دُونِ الله نِدًّا دَخَلَ النَّارَ
“ఎవరు అల్లాహ్ ను కాదని ఇతరులను ప్రార్థిస్తూ/దుఆ చేస్తూ చనిపోతాడో అతను నరకంలో ప్రవేశిస్తాడు”.
(బుఖారి 4497).

కొందరు సమాధుల వద్ద తమ తల గొరిగించుకుంటారు. ‘సమాధుల హజ్ చేసే విధానం’ అన్న పేరుగల పుస్తకాలు కొందరి వద్ద లభిస్తాయి. విశ్వవ్యవస్థ నిర్వహణ శక్తి మరియు లాభనష్టాలు చేకూర్చే శక్తి వలీలకు ఉన్నదని కొందరు నమ్ముతారు. కాని అల్లాహ్ యొక్క ఈ ఆదేశం పట్ల వారు ఎలా అంధులైపోయారో గమనించండి:

وَإِنْ يَمْسَسْكَ اللهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ وَإِنْ يُرِدْكَ بِخَيْرٍ فَلَا رَادَّ لِفَضْلِهِ
ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవరూ లేరు. ఇంకా ఆయన గనక నీ విషయంలో మేలు చేయాలని సంకల్పిస్తే ఆయన అనుగ్రాహన్ని మల్లించే వాడు కూడా ఎవడూ లేడు (యూనుస్ 10: 107).

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (7:33 నిముషాలు)

ఆడియో విన్న తర్వాత క్రింది ప్రశ్న ట్రై చెయ్యండి

(2) సమాధుల చుట్టూ ప్రదక్షిణలు చెయ్యడం , అక్కడ బలి ఇవ్వడం ఎలాంటి కార్యం?

A) ధర్మ సమ్మతం
B) చిన్న పాపం
C) ఘోర పాపం (షిర్క్)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

ఇంకా క్రింది పోస్టులు చదవండి:

కుఫ్ర్‌ (అవిశ్వాసం, తిరస్కార వైఖరి) మరియు దాని రకాలు – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

కుఫ్ర్‌ (అవిశ్వాసం, తిరస్కార వైఖరి) , నిర్వచనం, దాని రకాలు

(అ) కుఫ్ర్‌ నిర్వచనం :

నిఘంటువు ప్రకారం కుఫ్ర్‌ అంటే కప్పి ఉంచటం, దాచి పెట్టడం అని అర్థం. అయితే షరీయత్‌లో “ఈమాన్‌‘ (విశ్వాసం)కు విరుద్ధమైన దానిని కుఫ్ర్‌ (అవిశ్వాసం లేక తిరస్కారం) అంటారు.

ఎందుకంటే – అల్లాహ్ యెడల, దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) యెడల విశ్వాసం లేకపోవటమనే దానికి మరో పేరే కుఫ్ర్‌ (అవిశ్వాసం). అందులో ధిక్కరణా వైఖరి ఉన్నా, లేకున్నా అది అవిశ్వాసమే. విశ్వాసం (ఈమాన్‌)లో సందేహం సంశయమున్నా లేదా విముఖత ఉన్నా లేదా అసూయ ఉన్నా లేదా అహంకార భావమున్నా లేదా దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) విధానాన్ని అనుసరించకుండా మనోవాంఛలు అడ్డుపడినా – ఇవన్నీ కుఫ్ర్‌ (అవిశ్వాసం)లో అంతర్భాగాలే. కాకపోతే అల్లాహ్ యే లేడని, దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) రాక అసత్యమని పూర్తిగా కొట్టివేసే వ్యక్తి అవిశ్వాసం చాలా తీవ్రమైనది, కరడుగట్టినది. అలాగే దైవప్రవక్తలు సత్యం అన్న విషయంపై విశ్వాసమున్నప్పటికీ కేవలం అసూయ వల్ల వారిని త్రోసిపుచ్చిన వ్యక్తి కూడా అవిశ్వాసియే (కాఫిరే). (మజ్మూఅ అల్‌ ఫతావా-షేఖుల్‌ ఇస్లాం ఇబ్నె తైమియ-12/335)

(ఆ) కుఫ్ర్‌ రకాలు :

కుఫ్ర్‌ (అవిశ్వాసం) రెండు రకాలు : (1) కుఫ్రె అక్బర్‌ (పెద్ద తరహా అవిశ్వాసం) (2) కుఫ్రె అస్గర్ (చిన్న తరహా అవిశ్వాసం).

మొదటి రకం – కుఫ్రె అక్బర్‌

ఇది మనిషిని ఇస్లామీయ సముదాయం నుండి బహిష్కృతం చేసేస్తుంది. ఇందులో కూడా ఐదు రకాలున్నాయి. అవేమంటే:

(1) కుఫ్రె తక్‌జీబ్‌ : (అబద్ధంతో కూడుకున్న కుఫ్ర్‌)

దీనికి ప్రమాణం ఈ అల్లాహ్ ఆదేశం :

وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِالْحَقِّ لَمَّا جَاءَهُ ۚ أَلَيْسَ فِي جَهَنَّمَ مَثْوًى لِّلْكَافِرِينَ

“అల్లాహ్‌కు అబద్దాన్ని అంటగట్టేవానికన్నా లేదా తన వద్దకు సత్యం వచ్చినపుడు దానినీ అసత్యమంటూ ధిక్కరించే వానికన్నా పరమ దుర్మార్గుడెవడుంటాడు? ఏమిటి, అటువంటి తిరస్కారుల నివాస స్ధలం నరకంలో ఉండదా?” (అల్‌ అన్‌కబూత్‌ 29:68)

(2) కుఫ్రె తకబ్బుర్‌ వ ఇన్‌కార్‌ (అహంకారం, నిరాకరణతో కూడుకున్న కుఫ్ర్‌):

ఒక విషయాన్ని సత్యమని ధ్రువీకరిస్తూనే అహంకారం కారణంగా త్రోసిపుచ్చటం.

దీనికి ఆధారం ఈ అల్లాహ్ సూక్తి :

وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَىٰ وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ

“మీరందరూ ఆదం ముందు సాష్టాంగపడండి అని మేము దూతలను ఆజ్ఞాపించినపుడు ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు నిరాకరించాడు. అహంకారి అయి, అవిశ్వాసులలో చేరిపోయాడు.” (అల్‌ బఖర 2:34)

(3) కుఫ్రె షక్‌ (అనుమానంతో కూడుకున్న కుఫ్ర్‌)

దీనినే సంశయంతో, సందిగ్ధంతో కూడుకున్న కుఫ్ర్‌ అని కూడా అంటారు.

దీనికి ప్రమాణం అల్లాహ్ యొక్క ఈ సూక్తులు :

وَدَخَلَ جَنَّتَهُ وَهُوَ ظَالِمٌ لِّنَفْسِهِ قَالَ مَا أَظُنُّ أَن تَبِيدَ هَٰذِهِ أَبَدًا وَمَا أَظُنُّ السَّاعَةَ قَائِمَةً وَلَئِن رُّدِدتُّ إِلَىٰ رَبِّي لَأَجِدَنَّ خَيْرًا مِّنْهَا مُنقَلَبًا قَالَ لَهُ صَاحِبُهُ وَهُوَ يُحَاوِرُهُ أَكَفَرْتَ بِالَّذِي خَلَقَكَ مِن تُرَابٍ ثُمَّ مِن نُّطْفَةٍ ثُمَّ سَوَّاكَ رَجُلًا لَّٰكِنَّا هُوَ اللَّهُ رَبِّي وَلَا أُشْرِكُ بِرَبِّي أَحَدًا

ఆ విధంగా అతను తన ఆత్మకు అన్యాయం చేసుకున్న స్థితిలో తన తోటలోకి వెళ్ళాడు. ఇలా అన్నాడు: “ఏనాటికైనా ఈ తోట నాశనమవుతుందని నేననుకోను. ప్రళయ ఘడియ ఆసన్నమవుతుందని కూడా నేను భావించటం లేదు. ఒకవేళ (అలాంటిదేదైనా జరిగి) నేను నా ప్రభువు వద్దకు మరలింపబడినా, నిస్సందేహంగా నేను (ఆ మళ్ళింపు స్థానంలో) ఇంతకన్నా మంచి స్థితిలోనే ఉంటాను.” అప్పుడు అతని స్నేహితుడు అతనితో మాట్లాడుతూ ఇలా అన్నాడు: “ఏమిటి, నిన్ను మట్టితో చేసి, ఆ తరువాత వీర్య బిందువుతో సృష్టించి, ఆ పైన నిన్ను నిండు మనిషిగా తీర్చిదిద్దిన ఆయననే (ఆరాధ్య దైవాన్నే) తిరస్కరిస్తున్నావా? నా మటుకు నేను ఆ అల్లాహ్ యే నా ప్రభువు అని నమ్ముతున్నాను. నేను నా ప్రభువుకు సహవర్తునిగా ఎవరినీ కల్పించను.” (అల్‌ కహఫ్‌ 18:35-38)

(4) కుఫ్రె ఏరాజ్‌ (విముఖతతో కూడుకున్న కుఫ్ర్‌)

దీనికి ఆధారం దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ సూక్తి:

وَالَّذِينَ كَفَرُوا عَمَّا أُنذِرُوا مُعْرِضُونَ

“అవిశ్వాసులు తాము హెచ్చరించబడే విషయం నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు.” (అల్‌ అహ్‌ఖాఫ్‌ 46:3)

(5) కుఫ్రె నిఫాఖ్ (కాపట్యంతో కూడిన కుఫ్ర్‌) :

దీనికి ఆధారం దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ సూక్తి:

ذَٰلِكَ بِأَنَّهُمْ آمَنُوا ثُمَّ كَفَرُوا فَطُبِعَ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَفْقَهُونَ

“ఎందుకంటే వారు (మొదట) విశ్వసించి, ఆ తరువాత అవిశ్వాస వైఖరికి పాల్పడ్డారు. అందువల్ల వారి హృదయాలపై సీలు వేయ బడింది. ఇక వారు ఏమీ అర్థం చేసుకోరు.”(అల్‌ మునాఫిఖూన్‌ 63:3)

రెండవ రకం – కుఫ్రె అస్గర్‌ (చిన్నతరహా కుఫ్ర్‌)

దీనివల్ల మనిషి తన సముదాయం నుండి వేర్పడడు. దీనినే ‘క్రియాత్మక కుఫ్ర్‌‘గా కూడా వ్యవహరిస్తారు. దైవగ్రంథంలో, దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సున్నత్‌లో ఇది కుఫ్ర్‌గా పేర్కొనబడి నప్పటికీ ఇది ‘కుఫ్ర్ అక్బర్‌’ (పెద్ద తరహా కుఫ్ర్ ) పరిధిలోనికి రాదు. ఉదాహరణకు దైవానుగ్రహాల పట్ల కృతఘ్నతా భావం (కుఫ్రానె నీమత్‌). ఉదాహరణకు:

وَضَرَبَ اللَّهُ مَثَلًا قَرْيَةً كَانَتْ آمِنَةً مُّطْمَئِنَّةً يَأْتِيهَا رِزْقُهَا رَغَدًا مِّن كُلِّ مَكَانٍ فَكَفَرَتْ بِأَنْعُمِ اللَّهِ فَأَذَاقَهَا اللَّهُ لِبَاسَ الْجُوعِ وَالْخَوْفِ بِمَا كَانُوا يَصْنَعُونَ

“అల్లాహ్‌ ఒక పట్టణం ఉదాహరణ ఇస్తున్నాడు. ఆ పట్టణం ఎంతో ప్రశాంతంగా, తృప్తిగా ఉండేది. దానికి అన్ని వైపుల నుండీ పుష్కలంగా జీవనోపాధి లభించేది. తరువాత ఆ పట్టణ వాసులు అల్లాహ్‌ అనుగ్రహాలపై కృతఘ్నత చూపారు (అల్లాహ్ చేసిన మేళ్లను మరచిపొయ్యారు).” (అన్‌ నహ్ల్‌ 16:112)

ఒక ముస్లిం సాటి ముస్లింతో యుద్ధం చేయటం కూదా ‘కుఫ్రె అస్గర్‌’ ఉపమానం లోకే వస్తుంది. దీనిని గురించి మహనీయ ముహమ్మద్  (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :

“ముస్లింను దూషించటం పాపం. అతనిపై కయ్యానికి కాలు దువ్వటం “’కుఫ్ర్‌”. (బుఖారీ, ముస్లిం)

ప్రవక్త మహనీయుల (సల్లలాహు అలైహి వ సల్లం) వారి ఈ ప్రవచనం కూడా ఈ సందర్భంగా గమనార్హమే:

“మీరు నా తదనంతరం ఒకరినొకరి మెడలు నరుక్కొని కాఫిర్లుగా మారకండి.” (బుఖారీ, ముస్లిం)

అల్లాహ్ యేతరుల పేర ప్రమాణం చేయటం కూడా ఈ కోవకు చెందినదే. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :

“అల్లాహ్ యేతరుని పేర ప్రమాణం చేసినవాడు కుఫ్ర్‌ (అవిశ్వాసాని)కి ఒడిగట్టాడు లేదా షిర్క్‌ (బహుదైవోపాసన)కి పాల్పడ్డాడు.” (ఈ హదీసును తిర్మిజీ-1535 పొందుపరచి, హసన్‌గా ఖరారు చేశారు. హాకిమ్‌ మాత్రం దీనిని సహీహ్‌ – ప్రామాణికం – గా పేర్కొన్నారు).

వేరొక చోట అల్లాహ్‌ పెద్ద పాపానికి ఒడిగట్టిన వానిని విశ్వాసి (మోమిన్‌)గా పేర్కొన్నాడు. ఇలా సెలవిచ్చాడు :

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الْقِصَاصُ فِي الْقَتْلَى

“ఓ విశ్వాసులారా! హతుల విషయంలో ప్రతీకార న్యాయం (ఖిసాస్‌) మీ కొరకు విధిగా నిర్ణయించబడింది.” (అల్‌ బఖర 2:178)

పై సూక్తిలో అల్లాహ్‌ హంతకుణ్జి ‘విశ్వాసుల పరిధి నుండి వేరుచేయలేదు. పైగా అతన్ని హతుని తరఫు హక్కుదారునికి సోదరునిగా ఖరారు చేస్తూ అతనిపై ఖిసాస్‌ చెల్లింపు విధించాడు. తరువాత ఈ విధంగా ఆదేశించాడు :

فَمَنْ عُفِيَ لَهُ مِنْ أَخِيهِ شَيْءٌ فَاتِّبَاعٌ بِالْمَعْرُوفِ وَأَدَاءٌ إِلَيْهِ بِإِحْسَانٍ

“ఒకవేళ హతుని సోదరుడు హంతకుణ్జీ కనికరించదలిస్తే అతను రక్తశుల్కాన్ని న్యాయసమ్మతంగా అడగాలి. హంతకుడు కూడా రక్త ధనాన్ని ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి”. (అల్‌ బఖర 2:178)

ఇక్కడ ‘సోదరత్వం’ అంటే భావం నిశ్చయంగా ధార్మిక సోదరబంధమే. వేరొకచోట అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు :

وَإِن طَائِفَتَانِ مِنَ الْمُؤْمِنِينَ اقْتَتَلُوا فَأَصْلِحُوا بَيْنَهُمَا

“ఒకవేళ ముస్లింలలోని రెండు పక్షాలు పరస్పరం గొడవపడితే వారి మధ్య సయోధ్య చేయండి.” (అల్‌ హుజురాత్‌ 49:9)

చివరకు అల్లాహ్‌ ఈ విధంగా కూడా సెలవిచ్చాడు :

إِنَّمَا الْمُؤْمِنُونَ إِخْوَةٌ فَأَصْلِحُوا بَيْنَ أَخَوَيْكُمْ ۚ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُرْحَمُونَ

“(గుర్తుంచుకోండి) విశ్వాసులంతా అన్నదమ్ములు. కనుక మీ సోదరులిరువురి మధ్య రాజీ కుదుర్చండి.” (అల్‌ హుజురాత్‌ 49:10)

(పైన పొందుపరచబడిన విషయం “షరహ్ అత్ తహావియ్యహ్” నుండి సంక్షిప్తంగా సంగ్రహించబడినది).

కుఫ్రె అక్బర్‌ – కుఫ్రె అస్గర్‌ మధ్య గల తేడాలు:

(1) కుఫ్రె అక్బర్‌ (పెద్ద తరహా కుఫ్ర్‌) మనిషిని ఇస్లామీయ సముదాయం నుండి వేరుపరుస్తుంది. అతని ఆచరణలన్నీ దీని మూలంగా వృధా అయిపోతాయి. కుఫ్రె అస్గర్‌ (చిన్న తరహా కుఫ్ర్‌) వల్ల మనిషి ఇస్లామీయ సమాజం నుండి బహిష్కృతుడవడం గానీ, అతని ఆచరణలు వృధా అవటంగానీ జరగదు. అయితే అతనిలో ‘కుఫ్ర్‌’ మోతాదునుబట్టి అతని విశ్వాసం బలహీనమవుతుంది. దీనికి పాల్పడిన వ్యక్తిని అది శిక్షార్హునిగా నిలబెడుతుంది.

(2) కుఫ్రె అక్బర్‌ (పెద్ద తరహా కుఫ్ర్‌)కు పాల్పడిన వ్యక్తిని అది శాశ్వతంగా నరకానికి ఆహుతి చేస్తుంది. కుఫ్రె అస్గర్‌ (చిన్న తరహా కుఫ్ర్‌)కు పాల్పడిన వ్యక్తి ఒకవేళ నరకానికి ఆహుతి అయినప్పటికీ అందులో శాశ్వతంగా పడి ఉండడు. అల్లాహ్‌ అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించి, అతన్ని క్షమించి, నరకంలో వేయకపోవటం కూడా సంభవమే.

(3) కుఫ్రె అక్బర్‌ – దానికి పాల్చడిన వ్యక్తి ధన ప్రాణాలను అది సమ్మతంగా చేసి వేస్తుంది. కాగా కుఫ్రె అస్గర్‌ – దానికి పాల్పడిన వ్యక్తి ధన ప్రాణాలను సమ్మతం చేయదు.

(4) కుఫ్రె అక్బర్‌కు ఒడిగట్టిన వ్యక్తికి – విశ్వాసులకు మధ్య విరోధ భావం తప్పకుండా ఏర్పడుతుంది. కాబట్టి కుఫ్రె అక్బర్‌కి ఒడిగట్టే వారితో ముస్లింలు స్నేహం చేయటం ధర్మసమ్మతం కాదు – అతనెంత దగ్గరివాడయినాసరే! అయితే కుఫ్రె అస్గర్‌ ఎట్టి పరిస్థితిలోనూ స్నేహ బంధంలో అవరోధంగా ఉండదు. పైగా అలాంటి వ్యక్తితో – అతనిలో ఉన్న విశ్వాస (ఈమాన్‌) మోతాదును బట్టి స్నేహపూర్వక సంబంధాలు పెంపొందించుకోవచ్చు. అతనిలో ఉన్న అవిధేయతా భావం, పాపం మోతాదునుబట్టి అతని పట్ల దూరంగా ఉండటం జరుగుతుంది.


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (101-105 పేజీలు)

ధర్మాన్ని పరిహసించటం, ధార్మిక చిహ్నాలను కించపరచటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

తాను విశ్వసించే మత ధర్మాన్ని పరిహసించిన మనిషి ధర్మభ్రష్ఠుడైపోతాడు. ఆ ధర్మం నుండి పూర్తిగా బహిష్కృతుడవుతాడు. విశ్వప్రభువు ఇలా సెలవిచ్చాడు :

وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ ۚ قُلْ أَبِاللَّهِ وَآيَاتِهِ وَرَسُولِهِ كُنتُمْ تَسْتَهْزِئُونَ لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُم بَعْدَ إِيمَانِكُمْ

వారితో అను: “ఏమిటీ, మీరు అల్లాహ్‌తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తతో పరిహాసమాడుతున్నారా? మీరింక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు.” (అత్‌ తౌబా – 65, 66)

అల్లాహ్‌తో, ఆయన ప్రవక్తతో, ఆయన సూక్తులతో పరిహాసమాడటం అవిశ్వాసానికి (కుఫ్ర్కు) తార్కాణమని ఈ ఆయతుల ద్వారా రూఢీ అవుతోంది. కాబట్టి ఎవరు ఈ విషయాలలో ఏ ఒక్కదానినయినా పరిహసిస్తాడో అతను అన్నింటినీ పరిహసించిన వాడిగానే పరిగణించబడతాడు. అలనాడు (మదీనాలో) కపటుల విషయంలో జరిగింది కూడా ఇదే. వారు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను, ప్రవక్త సహచరులను ఎగతాళి చేశారు. అందుచేత పై ఆయతులు అవతరించాయి.

ధార్మిక చిహ్నాలలో ఏ ఒక్కదానినయినా పరిహసించేవాడు ధార్మిక చిహ్నాలన్నింటినీ తప్పనిసరిగా కించపరుస్తాడు. అలాగే అల్లాహ్ ఏకత్వాన్ని (తౌహీద్‌ను) చిన్నచూపు చూసేవాడు, నిజ దైవాన్ని వదలి మృతులను వేడుకోవటాన్ని గౌరవ దృష్టితో చూస్తారు. వారిని ఏకేశ్వరోపాసన వైపు పిలిచినపుడు, షిర్క్‌ నుండి వారించినపుడు ఎగతాళి చేస్తారు. అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు:

وَإِذَا رَأَوْكَ إِن يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَٰذَا الَّذِي بَعَثَ اللَّهُ رَسُولًا إِن كَادَ لَيُضِلُّنَا عَنْ آلِهَتِنَا لَوْلَا أَن صَبَرْنَا عَلَيْهَا

వారు నిన్ను చూచినప్పుడల్లా, నీతో వేళాకోళానికి దిగుతారు. “అల్లాహ్ ప్రవక్తగా చేసి పంపినది ఈయన గారినేనా?! మేము మా దేవుళ్లపై గట్టిగా నిలబడి ఉండకపోతే, ఇతను మమ్మల్ని మా దేవుళ్ల నుండి తప్పించేవాడే” అని ఎద్దేవా చేస్తారు. (అల్‌ ఫుర్ఖాన్‌ : 41, 42)

మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారిని షిర్క్‌ నుండి వారించినపుడు, వారు ఆయన్ని పరిహసించారు. ఇది తరతరాలుగా జరుగుతూ వస్తున్నదే. దైవప్రవక్తలు తమ జాతి ప్రజలను ఏకేశ్వరోపాసన వైపు ఆహ్వానించినప్పుడల్లా ముష్రిక్కులు వారిలో తప్పులెన్నే ప్రయత్నం చేశారు. ప్రవక్తలను అవివేకుల క్రింద జమకట్టారు. వారిని మార్గవిహీనులన్నారు. పిచ్చోళ్ళన్నారు. ఎందుకంటే వారి హృదయాలలో షిర్క్‌ (బహుదైవారాధన) పట్ల భక్తి భావం ఉండేది. అలాగే ముష్రిక్కులను పోలిన పనులు చేసే వారిలో కూడా ఇదే ఆలోచన ఉంటుంది. ఏక దైవారాధన వైపు పిలిచే వారిని చూసినపుడు వారు ఓర్చుకోలేరు. వారి గురించి చులకనగా మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళ హృదయాలలో కూడా షిర్క్‌ పట్ల (ప్రేమ గూడు కట్టుకుంది. ఈ నేపథ్యంలో అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు:

وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ

“అల్లాహ్‌ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరున్నారు.” (అల్‌ బఖర : 165)

కాబట్టి అల్లాహ్‌ పట్ల భక్తి కలగవలసిన విధంగా సృష్టిలో వేరే ఇతరుల పట్ల భక్తి కలిగి ఉండేవాడు ఖచ్చితంగా ముష్రిక్కే. ఇంకా – కేవలం అల్లాహ్‌ కొరకు ప్రేమించటంలో – అల్లాహ్‌ ప్రేమతో పాటు ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండటంలో గల వ్యత్యాసాన్ని చూడటం అవసరం. (అల్లాహ్‌ కొరకు ప్రేమించటం వాంఛనీయం. అల్లాహ్‌ పట్ల గల ప్రేమ మాదిరిగా ఇతరులను ప్రేమించటం అవాంఛనీయం). సమాధులను విగ్రహంగా మార్చుకున్న వారిని చూడండి – వారు దేవుని ఏకత్వాన్ని (తౌహీద్‌ని) పరిహసిస్తారు. దైవారాధనను గేలి చేస్తారు. అల్లాహ్‌ను వదలి తాము సిఫారసుదారులుగా ఆశ్రయించిన వారి పట్ల మాత్రం భక్తీ ప్రపత్తులు కలిగి ఉంటారు. వారిలోని ఒక వ్యక్తి అల్లాహ్‌ పేరు మీద అబద్ధ ప్రమాణం చేస్తాడు గాని తాను నమ్మినడుచుకునే ముర్షిద్‌ పేరు మీద మాత్రం అబద్ధ ప్రమాణం చేయడానికి ఎంతకీ సాహసించడు. ప్రజాబాహుళ్యంలో మీరు అనేకమందిని చూస్తుంటారు. వారి దృష్టిలో తమ ముర్షిద్‌కు విన్నపాలు చేసుకోవటం – అతని సమాధి వద్ద చేసినా, సమాధికి దూర స్థలంలో చేసినా – మస్జిద్ లో తెల్లవారుజామున అల్లాహ్‌కు విజ్ఞప్తి చేసుకోవటం కన్నా ఎక్కువ లాభదాయకమయింది అని భావిస్తారు. తమ ముర్షిద్‌ బాటను వదలి ఏకదైవారాధనా మార్గాన్ని అవలంబించిన వారిని వారు వేళాకోళం చేస్తారు. అలాంటి వారిలో చాలామంది మస్జిదులకు రారు గాని దర్గాలకు మాత్రం వెళతారు. దర్గాలను దేదీప్యమానంగా ముస్తాబుచేస్తారు. ఇదంతా ఏమిటి? అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను, ఆయన సూక్తులను పరిహసించి షిర్క్ కు స్వాగతం పలకటం కాదా!? (మజ్మూఅ అల్‌ ఫతావా : 15/48, 49)

నేటి సమాధి పూజారుల్లో ఈ ధోరణి అత్యధికంగా ఉంది.

ఎగతాళి రెండు రకాలుగా ఉంటుంది

1. బాహాటంగా ఎగతాళి చేయటం : అంటే ఇంతకు ముందు ఖుర్‌ఆన్‌ సూక్తుల్లో చెప్పబడినట్లుగా అడ్డూ ఆపూ లేకుండా సత్యాన్ని సత్య ప్రేమికుల్ని ఎగతాళి చేయటం. ఉదాహరణకు : మీ మతధర్మం ఐదవ మతం అని కొందరంటే, మీది బూటకపు మతం అని మరికొందరంటారు. అలాగే మంచిని పెంపొందించే వారిని, చెడుల నుండి ఆపేవారిని చూసి, “అబ్బో! బయలుదేరారు పేద్ద ధర్మోద్దారకులు” అంటూ వెటకారంగా ప్రేలుతారు. అంతకన్నా దారుణమైన వాక్యాలు – వ్రాయటానికి కూడా వీలులేని మాటలు చెప్పటం జరుగుతుంది.

(2) ద్వంద్వార్థాలతో ఎగతాళి చేయటం : ఈ ఎగతాళి కూడా తీరంలేని సముద్రం వంటిది. కన్నుగీటి సైగలు చేయటం, నాలుక వెళ్ళబెట్టడం, మూతి ముడుపులతో వెకిలి సైగలు చేయటం, ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తున్నప్పుడు, హదీసులు పఠిస్తున్నప్పుడు లేదా మంచి పనులు చేస్తున్నప్పుడు చేతులతో సైగలు చేయటం మొదలగునవి. (మజ్మూఅతు త్తౌహీద్‌ – నజ్‌దియ : పేజీ : 409)

మరి కొంతమంది చెప్పే కొన్ని మాటలు కూడా ఈ ‘పరిహాస పరిధిలోకే వస్తాయి. ఉదాహరణకు : “ఇస్లాం 21వ శతాబ్దికి సరిపోదు. ఇది మధ్య యుగాలకు తగినది.” “ఇస్లాం ఛాందసుల మతం”, “శిక్షల విషయంలో ఇస్లాం మరీ అమానుషంగా వ్యవహరిస్తుంది”, “విడాకులను, బహుభార్యత్వాన్ని అనుమతించి ఇస్లాం మహిళా హక్కులను హరించింది”, “ఇస్లాం శాసనాల ప్రకారం తీర్పు ఇవ్వటం కన్నా స్వయం కల్పిత చట్టాల కనుగుణంగా తీర్పు ఇవ్వటం మిన్న” లాంటి మాటలను కొందరు పలుకుతుంటారు. అలాగే ఏకేశ్వరోపాసనా సందేశం ఇచ్చేవారిని గురించి మాట్లాడుతూ, “వారు తీవ్రవాదులు. వారు ముస్లింలోని సంఘీభావాన్ని చిందరవందర చేస్తున్నారు” అంటారు. లేదంటే “వారు వహాబీలు” అంటారు. ఈ విధంగా వారు తమ మాటల తూటాలతో ఏక దైవారాధకులను, సత్యధర్మ ప్రేమికులను అనుదినం ఆటపట్టిస్తూ ఉంటారు.

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారి సున్నతులలో ఏదైనా ఒక సున్నత్‌ను ఖచ్చితంగా అనుసరించే వారిని పట్టుకుని ఎగతాళి చేయటం కూడా ఈ కోవకు చెందినదే.

ఉదాహరణకు – “గడ్డం పెంచినంత మాత్రాన ధర్మావలంబనలో పెరుగుదల రాదు” అని అనటం. అలాంటివే మరెన్నో తుచ్చమయిన పలుకులతో మనసులను గాయపరచటం.


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది