దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మూల రచయిత : ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ (రహిమహుల్లాహ్) అనువాదం: హాఫిజ్ బద్రుల్ ఇస్లాం ఎడిటింగ్: హాఫిజ్ అబ్దుర్ రవూఫ్ ఉమ్రి హదీస్ పబ్లికేషన్స్, హైదరాబాద్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
గౌరవనీయులైన పాఠకులారా! నేడు ముస్లిం సమాజంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాల పట్ల శ్రద్ధ లేనట్లుగా, వాటిని తమ జీవిత వ్యవహారాల్లో పాటించ- నట్లుగా చూస్తున్నాము -ఏ కొద్ది మందో తప్ప!. ఈ కొద్ది మంది మూలంగానే బహుశా అల్లాహ్ కరుణ కురుస్తుందేమో! అందుకే ప్రవక్త సాంప్రదాయాల్లో కొన్నిటిని ఈ చిరు పుస్తక రూపంలో మీ ముందుకు తీసుకరాదలిచాము. అవును! చిరు పుస్తక రూపములోనే. అది మీరు ఎల్లవేళల్లో మీ వెంట ఉంచుకోవడంలో సులభంగా ఉండటానికి మరియు మీ సమస్త కార్యాల్లో ప్రవక్త సాంప్రదాయాన్ని గుర్తు చేయటానికి. దీనిని “శత సాంప్రదాయాలు” అని నామకరణ చేశాము. దీని ఉద్దేశం ప్రవక్త సాంప్రదాయాలు కేవలం ఇవేనని కాదు, వాటిలో కొన్ని మాత్రమే సమకూర్చి, అల్లాహ్ దయతో మీ ముందుంచగలిగాము. వీటిని ఆచరణ రూపంలో తీసుకొచ్చే భాగ్యం ప్రసాదించాలని ఆ ఏకైక విధాత అయిన అల్లాహ్ నే వేడుకుంటున్నాము.
అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః
“నా ‘వలీ’ (ప్రియతముని)తో శత్రుత్వం వహించేవాడు నాతో యుద్ధానికి సిద్ధమవ్వాలని ప్రకటిస్తున్నాను. నా దాసుడు నా సాన్నిధ్యం కోరి ఆచరించే వాటిలోకెల్లా నేను అతనిపై విధిగా నిర్ణయించినవి నాకు ప్రియమైనవి. నా దాసుడు నఫిల్ (అదనపు) సత్కార్యాల ద్వారా నాకు ఇంకా ఎంతో చేరువవుతాడు. కడకు అతడు నా ప్రేమకు పాత్రుడవుతాడు. అతడు నాకు ప్రీతి పాత్రుడు అయినప్పుడు నేను, అతడు వినే చెవినవుతాను, అతడు చూసే కన్నునవుతాను, అతడు పట్టుకునే చెయ్యినవుతాను, అతడు నడిచే కాలునవుతాను. ఇక అతడు నన్ను అడిగితే నేను తప్పక ప్రసాదిస్తాను, శరణు కోరితే నేను శరణు ఇస్తాను. నేను చేసే ఏ పనిలోనూ తటపటా- యించను, విశ్వాసుని ప్రాణం తీయునప్పుడు తప్ప. అతను మరణం అంటే ఇష్టపడడు, అతనికి హాని కలగించడం అంటే నేను ఇష్టపడను. (కాని అది జరగక తప్పదు). (బుఖారీ 6502).
ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతి రాత్రి తమ పడకపై వచ్చి, “ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్, ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్” సూరాలు పూర్తిగా చదివి, రెండు అరచేతుల్లో ఊదుకొని, ముఖము మరియు తల నుండి మొదలుపెట్టి శరీర ముందు భాగంపై సాధ్యమైనంత వరకు తుడుచుకునేవారు. ఇలా మూడు సార్లు చేసేవారు. (బుఖారీ 5018).
అలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ఫాతిమా రజియల్లాహు అన్హా ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పనిమనిషి కావాలని అడిగినప్పుడు “మీ కొరకు పనిమనిషికన్నా మేలైన విషయం తెలుపనా?” అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారుః “మీరిద్దరూ పడకపై చేరుకున్నప్పుడు 34 సార్లు “అల్లాహు అక్బర్”, 33 సార్లు “సుబ్ హానల్లాహ్”, 33 సార్లు “అల్ హందులిల్లాహ్” పఠించండి. ఈ స్మరణ మీ కోసం సేవకుడి కంటే ఎంతో శ్రేష్ఠమైన సంపద“. (బుఖారీ 6318. ముస్లిం 2727).
“ఎవరు రాత్రి వేళ నిద్ర నుండి మేల్కొని ‘లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహూ, లహుల్ ముల్కు వలహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్ హందులిల్లాహ్, వ సుబ్ హానల్లాహ్, వల్లాహు అక్బర్, వలాహౌల వలాఖువ్వత ఇల్లాబిల్లాహ్’ చదివి, ‘అల్లాహ్ నన్ను క్షమించు’ అని లేదా మరేదైనా దుఆ చేసుకున్నచో అది అంగీకరింపబడుతుంది. ఒకవేళ వుజూ చేసుకొని నమాజ్ చేస్తే అదీ స్వీకరించబడుతుంది” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారీ 1154).
الدعاء عند الاستيقاظ من النوم: (اَلْـحَمْدُ لله الَّذِي أَحْيَانَا بَعدَمَا أَمَاتَنَا وَإِلَيهِ النُّشُور).
అల్ హందు లిల్లాహిల్లాజి అహ్యానా బఅద మా అమాతనా వఇలైహిన్నుషూర్. (మమ్మల్ని నిర్జీవావస్థకు గురిచేసిన తర్వాత జీవం పోసిన ఆ అల్లాహ్ కే సర్వ స్తోత్రములు. మేము తిరిగి ఆయన సమక్షంలోనే లేచి నిలబడే వారము). (బుఖారీ 6312లో హుజైఫా ఉల్లేఖనం).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లైంగిక అశుద్ధత నుండి పరిశుద్ధత పొందే నిమిత్తం స్నానానికి ఉపక్రమించినపుడు (మర్మాంగ స్థలాన్ని కడుక్కున్న తర్వాత) చేతులు కడుక్కునేవారు. మళ్ళీ నమాజు కోసం చేసుకునే విధంగా వుజూ చేసి, నీళ్ళు తీసుకొని తన చేతివేళ్ళతో తలవెంట్రుకల వ్రేళ్ళ భాగం సయితం తడిసేలా నీరు పోసేవారు. ఆ పైన దోసిట్లో నీళ్ళు తీసుకుని మూడుసార్లు తలపై నీరు పోసేవారు. ఆపైన శరీరమంతటిపై నీళ్ళు పోసుకునేవారు. (బుఖారీ 248, ముస్లిం 316).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
“మీలో ఎవ్వరైనా మంచివిధంగా వుజూ చేసిన పిదప “అష్ హదు అల్లాఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు” చదివితే అతని కొరకు స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాలు తెరువబడుతాయి. అతను తాను ఇష్టపడిన ఏ ద్వారం గుండానైనా ప్రవేశించవచ్చు.” (ముస్లిం 234).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
“ఎవరు నేను చేసిన విధంగా వుజూ చేసి రెండు రకాతుల నమాజు చేస్తాడో – నమాజుకు సంబంధం లేని విషయాలు మాట్లాడడో- అతని పూర్వ పాపాలన్నియు మన్నించ బడతాయి. (బుఖారీ 164. ముస్లిం 226).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
“నా అనుచర సమాజానికి కష్టతరమవుతుందన్న సంశయం నాకు లేకుండినట్లయితే ప్రతి నమాజ్ సమయంలో మిస్వాక్ చేయాలని ఆజ్ఞాపించి ఉండేవాణ్ణి”. (బుఖారీ 887. ముస్లిం 252).
* (1) నిద్ర నుండి మేల్కొని, (2) వుజూ సమయం లో, (3) నోటి వాసనలో మార్పు వచ్చినప్పుడు, (4) ఖుర్ఆన్ చదివే ముందు, (5) ఇంట్లో ప్రవేశించే ముందు మిస్వాక్ చేయడం ధర్మం.
الذهاب إلى المسجد ماشيا: عَنْ أبي هُرَيرَةَ t أَنَّ رَسُولَ الله قَالَ: (أَلاَ أَدُلُّكُمْ عَلَى مَا يَمْحُو اللهُ بِهِ الْـخَطَايَا ، وَيَرْفَعُ بِهِ الدَّرجَاتِ) قَالُوا: بَلَى يَا رَسُولَ الله. قَالَ: (إِسبَاغُ الْوُضُوء عَلَى الْـمَكَارِه ، وَكَثْرَةُ الـْخُطَا إِلَى الْـمَسَاجِد ، وَانْتِظَارُ الصَّلاَةِ بَعدَ الصَّلاَةِ، فَذَلِكُمُ الرِّبَاط).
అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారుః “పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో నేను మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారుః “వాతవరణం, పరిస్థితులూ ప్రతీకూలంగా ఉన్నప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం. మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం – ఇది రిబాత్ తో సమానం ([1])”. (ముస్లిం 251).
إتيان الصلاة بسكينة ووقار: عَن أَبِي هُـرَيرَةَ t قَالَ: سَمِعتُ رَسولَ الله يَقُولُ: (إِذَا أُقِيمَتِ الصَّلاَةُ فَلاَ تَأتُوهَا تَسْعَونَ، وَأتُوهَا تَمْشُونَ، وَعَلَيْكُمُ السَّكِينَةُ، فَمَا أَدْرَكْتُمْ فَصَلُّوا ، وَمَا فَاتَكُمْ فَأَتِـمُّوا).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా తాను విన్నాను అని అబూహురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
“నమాజ్ కొరకు ఇఖామత్ ఇవ్వబడినప్పుడు అందులో చేరడానికి పరుగిడుతూ రాకండి. నిదానంగా నడచి వెళ్ళండి. సామూహిక నమాజులో మీకు ఏ మేరకు లభిస్తే ఆ మేరకు చేయండి. మిగిలిన భాగాన్ని వ్యక్తిగతంగా చేసి నమాజు పూర్తి చేసుకోండి“. (బుఖారీ 908. ముస్లిం 602).
الدعاء عند دخول المسجد، و الخروج منه: عَن أبي حُميد الساعدي أو عن أبي أُسيد قَالَ: قَالَ رَسُولُ الله : (إذَا دَخَلَ أَحَدُكُمُ الْـمَسْجِدَ فَلْيَقُلْ: اَللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ ، وَإِذَا خَرَجَ فَلْيَقُلْ: اَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారని అబూహుమైద్ సాఇదీ రజియల్లాహు అన్హు లేక అబూ ఉసైద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
“మీలో ఎవరైనా మస్జిద్ లో ప్రవేశించినప్పుడు ‘అల్లాహుమ్మఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక’ చదవాలి. బైటికి వచ్చినప్పుడు ‘అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫజ్ లిక’ చదవాలి”)[ఓ అల్లాహ్! మా కొరకు నీ కరుణ ద్వారాలు తెరుచు/ ఓ అల్లాహ్! నీ దయను వేడుకుంటున్నాను].(ముస్లిం 713
الصلاة إلى سترة: عَن طَلحَةَ t قَالَ: قَالَ رَسُولُ الله : (إِذَا وَضَعَ أَحَدُكُمْ بَيْنَ يَدَيْهِ مِثلَ مُؤَخَّرَةِ الرَّحلِ فليُصَلِّ ، وَلاَ يُبَالِ مَنْ مَرَّ وَرَاءَ ذلِك).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని తల్ హా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా తన ముందు ఒంటెపై కట్టబడే పల్లకీ వెనుకభాగపు ఎత్తుకు సమానంగా ఏదైనా వస్తువు పెట్టుకొని నమాజ్ చేయాలి. దాని అవతల నుండి ఎవరు దాటినా ఇక అతనికి అనవసరం“. (ముస్లిం 499).
*‘సుత్రా’ అంటే నమాజ్ చేసే వ్యక్తి తాను సజ్దా చేసే స్థలానికి ముందు అడ్డుగా ఉపయోగించుకునే వస్తువు. అది గోడ కావచ్చు, స్థంభం కావచ్చు, అడ్డు తెర కావచ్చు, కర్ర కావచ్చు, లేదా అటువంటిదే మరేదైనా వస్తువు కావచ్చు. ఈ సుత్రా నమాజ్ చేసే వ్యక్తికీ, అతని ముందు నుంచి నడచిపోయే వారికీ మధ్య అడ్డుగా ఉంటుంది.
తావూస్ చెప్పగా అబుజ్జుబైర్ విని ఉల్లేఖిస్తున్నారుః మేము ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హుమా తో (నమాజులో రెండు సజ్దాల మధ్యలో) పాదాలు నిలబెట్టి మడిమలపై కూర్చోవటమెలా అని అడిగాము. దానికి అతను ‘అది సున్నత్’ అని చెప్పాడు. ఇది మనిషికి చాలా కష్టంగా ఉంటుంది అని మేమన్నాము. దానికి అతను ‘ఇది మీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్’ అని చెప్పాడు. (ముస్లిం: 536).
అబూహుమైద్ సాఇదీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చివరి తషహ్హుద్ లో కూర్చునేటప్పుడు ఎడమ పాదం కుడి వైపు తీసుకొని, కుడి పాదాన్ని నిలబెట్టి ఎడమ పిరుదును భూమికి ఆనించి కూర్చుండేవారు. (బుఖారీ 828).
الإكثار من الدعاء قبل التسليم: عَن عَبدِالله قَالَ: قَالَ النَّبِيُّ : … (ثُمَّ يَتَخَيَّرُ مِنَ الدُّعَاءِ أَعْجَبَهُ إِلَيْهِ فَيَدْعُو).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారని అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “… తనకు ఇష్టమున్న దుఆలు ఎన్నుకొని వాటి ద్వారా దుఆ చేయాలి”. (బుఖారీ: 835).
ఉమ్మె హబీబ రజియల్లాహు అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విని ఉల్లేఖించారుః “ఏ ముస్లిం భక్తుడు అల్లాహ్ కొరకు ప్రతి రోజూ పన్నెండు రకాతుల నఫిల్ నమాజు చేస్తాడో అల్లాహ్ అతని కొరకు స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు. (ముస్లిం: 728).
అవిః జొహ్ర్ కు ముందు 4, దాని తరువాత 2, మగ్రిబ్ తరువాత 2, ఇషా తరువాత 2 మరియు ఫజ్ర్ కు ముందు 2.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీలో ఉన్న ప్రతి అవయవానికి బదులుగా ఒక సదఖా చేయడం మీపై విధిగా ఉంది. అయితే ఒకసారి సుబ్ హానల్లాహ్ అని పలకడం ఒక సదఖా. ఒకసారి అల్ హందులిల్లాహ్ అనడం ఒక సదఖా. ఒకసారి లా ఇలాహ ఇల్లల్లాహ్ అని స్మరించడం కూడా సదఖా. ఒకసారి అల్లాహు అక్బర్ అనడమూ సదఖాయే. మంచిని ఆదేశించడం ఒక సదఖా. చెడు నుండి వారించడం ఒక సదఖా. అయితే రెండు రకాతుల చాష్త్ నమాజు వీటన్నిటికి సరిపోతుంది”. (ముస్లిం 720).
* దీని ఉత్తమ సమయం: పొద్దెక్కి, ఎండ తాపం పెరిగిన తరువాత నుండి జొహ్ర్ సమయానికి ముందు వరకు. కనీసం రెండు రకాతులు. ఎక్కువ చేయుటకు హద్దు లేదు.
قيام الليل: عَن أبِي هُرَيرَةَ t أَنَّ رَسُولَ الله سُئِلَ : أَيُّ الصَّلاَةِ أفْضَلُ بَعدَ الْـمَكْتُوبَةِ؟ فَقَالَ: (أفْضَلُ الصَّلاَةِ بَعدَ الصَّلاَةِ الْـمَكْتُوبَةِ، اَلصَّلاَةُ فِي جَوفِ اللَّيل).
అబూహురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ఫర్జ్ నమాజు తరువాత ఎక్కువ ఘనతగల నమాజు ఏది? అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అడిగినప్పుడు “ఫర్జ్ నమాజు తరువాత ఎక్కువ ఘనతగల నమాజు అర్థ రాత్రి తరువాత చదివే తహజ్జుద్ నమాజు” అని బదులిచ్చారు. (ముస్లిం 1163).
الصلاة في النعلين إذا تحققت طهارتهما: سُئلَ أنَسُ بنُ مَالِكٍ t: أَكَانَ النَّبِيُّ يُصَلِّي فِي نَعْلَيهِ؟ قَالَ: (نَعم).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పులు వేసుకొని నమాజు చేసేవారా? అని అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ని ప్రశ్నించినప్పుడు ‘అవును’ అని ఆయన జవాబిచ్చారు. (బుఖారీ 386).
الصـلاة في مسجد قباء: عَنِ بنِ عُمَرَ t قَالَ: (كَانَ النَّبِيُّ يَأتِي مَسْجِدَ قُبَاءٍ رَاكِبًا وَمَاشِيًا) زَادَ ابنُ نُمَير: حدثنا عبيدالله، عن نافع: (فيصلي فيه ركعتين).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కోసారి కాలినడకన, మరోసారి వాహనం మీద ఖుబా మస్జిద్ కు వస్తుండేవారు, అని ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందులో రెండు రకాతుల నమాజు కూడా చేసేవారు అని ఈ హదీసు ఉల్లేఖన కర్త నాఫె చెప్పారుః. (బుఖారీ 1194. ముస్లిం 1399).
أداء صلاة النافلة في البيت: عَنْ جَابِرٍ t قَالَ: قَالَ رَسُولُ الله : (إِذَا قَضَى أَحَدُكُمْ الصَّلَاةَ فِي مَسْجِدِهِ فَلْيَجْعَلْ لِبَيْتِهِ نَصِيبًا مِنْ صَلَاتِهِ فَإِنَّ اللهَ جَاعِلٌ فِي بَيْتِهِ مِنْ صَلَاتِهِ خَيْرًا).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీలో ఒకరు ఫర్జ్ నమాజు మస్జిద్ లో పూర్తి చేసి, తన నమాజు యొక్క కొంత భాగం తన ఇంట్లో చేయాలి. అందువల్ల అల్లాహ్ అతని ఇంట్లో మేలే చేకూర్చుతాడు”. (ముస్లిం 778).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఖుర్ఆను సూరాలు నేర్పినట్లు ప్రతి పనిలో ఇస్తిఖారా చేయడాన్ని గురించి బోధించేవారని జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారీ 1162).
* దాని విధానం: రెండు రకాతుల నమాజు చేసి, తరువాత ఇలా దుఆ చేయాలి. అల్లాహుమ్మ ఇన్నీ అస్తఖీరుక బిఇల్మిక, వ అస్తఖ్దిరుక బిఖుద్రతిక, వ అస్అలుక మిన్ ఫజ్లికల్ అజీం, ఫఇన్నక తఖ్ దిరు వలా అఖ్ దిరు, వ తఅలము వలా అఅలము, వ అంత అల్లాముల్ గుయూబ్, అల్లాహుమ్మ ఇన్ కుంత తఅలము అన్న హాజల్ అమ్ర(2) ఖైరున్ లీ ఫీ దీనీ, వ మఆషీ, వ ఆఖిబతి అమ్రీ, ఫఖ్ దుర్ హులీ, వయస్సిర్ హులీ, సుమ్మ బారిక్ లీ ఫీహి, వ ఇన్ కుంత తఅలము అన్న హాజల్ అమ్ర([2]) షర్రున్ లీ ఫీ దీనీ, వ మఆషీ, వఆఖిబతి అమ్రీ, ఫస్రిఫ్ హు అన్నీ, వస్రిఫ్ నీ అన్హు, వఖ్ దుర్ లియల్ ఖైర హైసు కాన సుమ్మ అర్ జినీ బిహీ).
ఈ దుఆ యొక్క భావం: ఓ అల్లాహ్! నీ జ్ఞానం సాక్షిగా నేను శ్రేయస్సును అర్థిస్తున్నాను. నీ శక్తి పేరిట నేను నీ మహత్తర కటాక్షాన్ని అభ్యర్థిస్తు- న్నాను. నీవే సర్వశక్తిమంతుడివి, నాకు రవ్వంత కూడా శక్తి లేదు. నీవు సర్వజ్ఞుడివి. నేను జ్ఞానం లేనివాణ్ణి. అగోచరమైన విషయాలన్నీ నీకే బాగా తెలుసు. అల్లాహ్! నీ దృష్టిలో ఈ పని నా ఇహపరాల రీత్యా, పరిణామాల రీత్యా నాకు శ్రేయస్కరమైనదయితే దానిని నాకు ప్రాప్తం చెయ్యి. దానిని నాకు శుభకరమైనదిగా చెయ్యి. ఒకవేళ నీ దృష్టిలో ఈ పని నా ఇహపరాల రీత్యా, పరిణామ ఫలం రీత్యా నా పాలిట చెడుదైతే, ఆ పని నుండి నన్ను దూరంగా ఉంచు, దాని నుండి నన్ను కాపాడు. నా శ్రేయోశుభాలు ఎందులో ఉన్నాయో దానిని నాకు ప్రాప్తం చెయ్యి. తరువాత దాని మీద నాకు మక్కువ, ఏకాగ్రతలు కూడా కలిగించు.
الجلوس في المصلى بعد صلاة الفجر حتى تطلع الشمس: عَنْ جَابِرِ بنِ سَمُرَةَ t: ( أَنَّ النَّبِيَّ كَانَ إِذَا صَلَّى الْفَجْرَ جَلَسَ فِي مُصَلاَّهُ حَتَّى تَطلُعَ الشَّمسُ حَسَنًا).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ నమాజు చేసుకొని అదే స్థలంలో స్పష్టంగా సూర్యోదయం అయ్యే వరకు కూర్చునేవారని జాబిర్ బిన్ సముర రజియల్లాహు అన్హు తెలిపారు. (ముస్లిం 670).
الاغتسال يوم الجمعة : عَن ابنِ عُمَرَ ؆ قَالَ: قَالَ رَسُولُ الله : (إِذَا جَاءَ أحَدُكُمُ الْـجُمُعَةَ فَلْيَغْتَسِلْ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా జుమా నమాజుకు వచ్చినప్పుడు స్నానం చేయాలి”. (బుఖారీ 877. ముస్లిం 845).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూహురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “జుమా రోజు దైవ దూతలు మస్జిద్ యొక్క ద్వారంపై నిలబడి ఉంటారు. ఎవరు ఎంత ముందు వస్తారో వారి పేరు అంత ముందు వ్రాసుకుంటారు. అందరికంటే ముందు వచ్చిన వ్యక్తికి లభించే పుణ్యం ఒక ఒంటెను ఖుర్బానీ ఇచ్చిన వ్యక్తిని పోలినది. ఆ తరువాత గడియలో వచ్చేవారికి ఒక ఆవు ఖుర్బానీ ఇచ్చినంత, ఆ తరువాత వారికి ఒక పొట్టేలు ఖుర్బానీ ఇచ్చినంత, ఆ తర్వాత వారికి కోడి, ఆ తర్వాత వారికి గ్రుడ్డు అల్లాహ్ మార్గంలో సదఖా చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇమాం మెంబర్ పై వచ్చాక దైవదూతలు తమ రిజిస్టర్లను చుట్టుకొని, ఖుత్బా వింటారు. (అంటే ఆ తరువాత వచ్చేవారు ఆ దైవదూతల రిజస్టర్లో లిఖించబడరు). (బుఖారీ 929. ముస్లిం 850).
تحري ساعة الإجابة يوم الجمعة: عَن أَبِي هُرَيرَةَ t أَنَّ رَسُولَ الله ذَكَرَ يَوْمَ الْـجُمُعَةِ فَقَالَ: (فِيهِ سَاعَةٌ لَا يُوَافِقُهَا عَبْدٌ مُسْلِمٌ وَهُوَ قَائِمٌ يُصَلِّي يَسْأَلُ اللهَ تَعَالَى شَيْئًا إِلَّا أَعْطَاهُ إِيَّاهُ) وَأَشَارَ بِيَدِهِ يُقَلِّلُهَا.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా రోజు గురించి ప్రస్తావించి ఇలా చెప్పారని అబూహురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఆ రోజు ఓ ప్రత్యేక శుభ గడియ ఉంది. ఆ గడియలో ఎవరైనా ముస్లిం నమాజు స్థితిలో అల్లాహ్ ను ఏదైనా వేడుకుంటే అల్లాహ్ అతని కోరికను తప్పకుండా తీర్చుతాడు”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సంగతి చెబుతూ “ఆ గడియ అతి స్వల్పంగా ఉంటుంది” అని చేత్తో సైగ చేశారు. (బుఖారీ 935. ముస్లిం 852).
الصلاة على الجنازة: عَنْ أَبِي هُرَيرَةَ t قَالَ: قَالَ رَسُولُ الله : (مَنْ شَهِدَ الْـجَنَازَةَ حَتَّى يُصَلَّى عَلَيهَا فَلَهُ قِيرَاطٌ ، وَمَنْ شَهِدَهَا حَتَّى تُدْفَنَ فَلَهُ قِيرَاطَانِ) قِيلَ: وَمَا الْقِيرَاطَانِ؟ قَالَ: (مَثَلُ الْـجَبَلَيْنِ الْعَظِيمَين).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూహురైరా రజి- యల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరైతే జనాజా వెంట వెళ్తాడో, జనాజా నమాజ్ పూర్తి అయ్యే వరకు ఉంటాడో అతనికి ఒక ‘ఖీరాత్’కు సమానంగా పుణ్యఫలం లభిస్తుంది. మరెవరయితే ఖననం చేసే వరకూ ఉంటాడో అతనికి రెండు ‘ఖీరాత్’ల పుణ్యం లభిస్తుంది”. రెండు ‘ఖీరాత్’లంటే ఎంత? అని ప్రశ్నించగా “అవి రెండు పెద్ద కొండలకు సమానమ”ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానమిచ్చారు. (బుఖారీ 1325. ముస్లిం 945).
زيارة المقابر: عَنْ بُرَيدَةَ t قَالَ: قَالَ رَسُولُ الله : (كُنتُ نَهَيتُكُمْ عَنْ زِيَارَةِ الْقُبُورِ فَزُورُوهَا … ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని, బురైద రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నేను మిమ్మల్ని సమాధుల సందర్శన నుండి నివారించి యుంటిని, కాని ఇక మీరు వాటి దర్శనానికి వెళ్ళండి….”. (ముస్లిం 977).
* గమనార్హం: శ్మశానవాటిక దర్శనం స్త్రీలకు నిషిద్ధం. ఇదే ఫత్వా ఇచ్చారు షేఖ్ బిన్ బాజ్ మరియు ధర్మవేత్తల ఒక పెద్ద సంఖ్య.
تعجيل الفطر ، وذلك إذا تحقق غروب الشمس: عَنْ سَهلِ بنِ سَعدٍ t قَالَ: قَالَ رَسُولُ الله : (لاَ يَزَالُ النَّاسُ بِخَيْرٍ مَا عَجَّلُوا الْفِطْرَ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని సహల్ బిన్ సఅద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ప్రజలు ఇఫ్తార్ (ఉపవాస విరమణ) కొరకు త్వరపడినంత కాలం మంచికి కట్టుబడి ఉంటారు”. (బుఖారీ 1957. ముస్లిం 1098).
قيام رمضان: عَنْ أَبِي هُرَيرَةَ t أَنَّ رَسُولَ الله قَالَ: (مَنْ قَامَ رَمَضَانَ إيمانًا وَاحْتِسَابًا غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِن ذَنْبِهِ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శుభవార్త ఇచ్చారని, అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “రమజాన్ నెలలో ఎవరు ధృడ విశ్వాసంతో, పుణ్యఫలాపేక్షతో రాత్రిళ్ళు తరావీహ్ నమాజు చేస్తారో వారి గత పాపాలన్నీ క్షమించబడ- తాయి”. (బుఖారీ 36, 2014. ముస్లిం 759).
صوم ستة أيام من شوال: عَنْ أَبِي أَيُّوبَ الأنصَارِي t أَنَّ رَسُولَ الله قَالَ: (مَنْ صَامَ رَمَضَانَ، ثُمَّ أَتْبَعَهُ سِتًا مِنْ شَوَّالَ، كَانَ كَصِيَامِ الدَّهرِ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారని అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరైనా రమజాన్ ఉపవాసాలు పాటించి, ఆ తరువాత షవ్వాల్ నెలలో కూడా 6 ఉపవాసాలు పాటిస్తే, ఒక సంవత్సర పొడవూ ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది”. (ముస్లిం 1164).
صوم ثلاثة أيام من كل شهر: عَنْ أَبِي هُرَيرَةَ t قَالَ: (أَوْصَانِي خَلِيلِي بِثَلَاثٍ لَا أَدَعُهُنَّ حَتَّى أَمُوتَ صَوْمِ ثَلَاثَةِ أَيَّامٍ مِنْ كُلِّ شَهْرٍ وَصَلَاةِ الضُّحَى وَنَوْمٍ عَلَى وِتْرٍ).
అబూహురైరా రజియల్లాహు అన్హు చెప్పారుః ‘నా ప్రాణ స్నేహితులైన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు మూడు విషయాలను గురించి హితబోధ చేశారు. నేను వాటిని నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ వదలి పెట్టను. ఆ మూడు విషయాలు ఇవిః (1) ప్రతి నెల మూడు రోజులు ఉపవాసాలు పాటించడం. (2) చాష్త్ నమాజ్ చేయడం. (3) విత్ర్ నమాజు చేసి నిద్రపోవడం. (బుఖారీ 1178. ముస్లిం 721).
صوم يوم عرفة: عَن أَبِي قَتَادَةَ t أَنَّ رَسُولَ الله قَالَ: (صِيَامُ يَومِ عَرَفةَ، أَحْتَسِبُ عَلَى اللهِ أن يُكَفِّرَ السَّنَةَ الَّتِي قَبْلَه، وَالسَّنَةَ الَّتِي بَعْدَه).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని అబూ ఖతాద రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అరఫా దినాన ఉపవాసం వల్ల, గడచిన సంవత్సరం పాపాలనూ, రాబోయే సంవత్సరం పాపాలనూ అల్లాహ్ మన్నిస్తాడని నాకు నమ్మకం ఉంది”. (ముస్లిం 1162).
صوم يوم عاشوراء: عَنْ أَبِي قَتَادَةَ t قَالَ: قَالَ رَسُولُ الله : (صِيَامُ يَومِ عَاشُورَاء ، أَحْتَسِبُ عَلَى اللهِ أَن يُكَفِّرَ السَّنَةَ الَّتِي قَبْلَهُ).
అబూ ఖతాద రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః “ఆషూరా దినపు ఉపవాసం వలన అల్లాహ్ గడిచిన ఒక సంవత్సరపు పాపాలను దూరం చేస్తాడని నాకు నమ్మకం ఉంది”. (ముస్లిం 1162).
اختيار أمير في السفر: عَن أبي سَعِيدٍ ، وَأبي هُرَيرَةَ ؆ قَالاَ: قَالَ رَسُولُ الله : (إِذَا خَرَجَ ثَلاَثَةٌ فِي سَفَرٍ فَلْيُؤَمِّرُوا أَحَدَهُم).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ సఈద్ రజియల్లాహు అన్హు మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరైనా ముగ్గురు మనుషులు కలసి ప్రయాణానికి వెళ్తే వారు తమలో ఒకరిని నాయకునిగా ఎన్నుకోవాలి”. (అబూదావూద్ 2608).
التكبير عند الصعود والتسبيح عند النزول: عَنْ جَابِرٍ t قَالَ: (كُنَّا إِذَا صَعِدْنَا كَبَّرْنَا ، وَإِذَا نَزَلْنَا سَبَّحْنَا).
మేము ఎత్తు ప్రదేశంలో ఎక్కెటప్పుడు అల్లాహు అక్బర్ అని, ఎత్తు నుండి దిగేటప్పుడు సుబ్ హానల్లాహ్ అని అనేవారమని జాబిర్ రజియల్లాహు అన్హు తెలిపారు. (బుఖారీ 2994).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా తాను విన్నానని ఖౌలా బిన్తె హకీం రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః “ఎవరైనా ప్రయాణం చేస్తూ ఏదైనా ప్రాంతంలో మజిలీ చేసినప్పుడు ఈ దుఆ చదివితే వారు అక్కడి నుండి బయలుదేరే వరకూ వారికి ఏ హానీ కలగదుః అఊజు బికలిమాతిల్లా హిత్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్. (నేను అయన సృష్టి కీడు నుండి అల్లాహ్ యొక్క సంపూర్ణ వచనాల శరణు కోరుతున్నాను). (ముస్లిం 2708).
కఅబ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం నుండి తిరిగి రాగానే ముందు మస్జిద్ కు వెళ్ళి రెండు రకాతుల నమాజు చేసేవారు. (బుఖారీ 443. ముస్లిం 716).
అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్రొత్త దుస్తులు ధరిస్తున్నప్పుడు దాని పేరు చెప్పేవారు. ఉదాః కమీజు, తలపాగా అని. తర్వాత ఈ దుఆ చదివేవారు:
అల్లాహుమ్మ లకల్ హందు, అంత కసౌతనీహి, అస్అలుక మిన్ ఖైరిహీ, వఖైరి మా సునిఅ లహూ, వ అఊజు బిక మిన్ షర్రిహీ, వ షర్రి మా సునిఅ లహూ. (అల్లాహ్! అన్ని విధాల స్తోత్రములు నీకే. నీవే ఈ దుస్తులు నాకు ధరింప- జేశావు. అందులోని మేలును, ఏ ఉద్దేశంతో చేయబడిందో ఆ మేలును నేను కాంక్షిస్తున్నాను. దాని కీడు నుండి మరియు ఏ కీడునుద్దేశించి చేయబడిందో దాని నుండి నేను నీ శరణు కోరుచున్నాను). (అబూదావూద్ 4020).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
“చెప్పులు తొడిగేటప్పుడు మొదట కుడి కాలికి తొడుక్కోవాలి. విడిచేటప్పుడు మొదట ఎడమ కాలి చెప్పు విడువాలి. మరియు తొడిగితే రెండు చెప్పులు తొడుక్కోవాలి. విడిస్తే రెండు చెప్పులు విడువాలి”. (బుఖారీ 5855. ముస్లిం 2097).
ఉమర్ బిన్ అబూ సల్మా రజియల్లాహు అన్హు తెలిపారు: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంరక్షణలో పెరుగుతుండేవాణ్ణీ. అన్నం తినేటప్పుడు నా చేయి కంచెంలో అన్ని వైపులా కదలాడేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓసారి చూసి,
“ఓ అబ్బాయీ! (అన్నం తినేముందు) బిస్మిల్లాహ్ అని పఠించాలి. కుడి చేత్తో తినాలి. కంచంలో నీ ముందు భాగం నుండి తినాలి” అని ఉపదేశించారు. (బుఖారీ 5376. ముస్లిం 2022).
المضمضة من اللبن: عَنْ ابنِ عَبَّاٍس ؆ أَنَّ رَسُولَ الله شَرِبَ لبنًا فَمَضْمَضَ، وَقَالَ: (إنَّ لَهُ دَسمًا).
ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పాలు త్రాగిన తరువాత నీటితో నోరు పుక్కిలించి “పాలు త్రాగడం వల్ల నోరు తైలయతమవుతుంది (అంచేత నీళ్ళతో పుక్కిలించి నోరు శుభ్రపరుచుకోవాలి)” అని అన్నారు. (బుఖారీ 211. ముస్లిం 358).
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నడూ ఏ ఆహారంలో కూడా లోపం ఎత్తి చూపలేదు. ఆయనకు ఇష్టమయితే తినేవారు. ఇష్టం లేకపోతే మానేసేవారు“. (బుఖారీ 5409. ముస్లిం 2064).
الشرب والاستشفاء من ماء زمزم: عَنْ أَبِي ذَرٍّ t قَالَ: قَالَ رَسُولُ الله عَنْ مَاءِ زَمْزَمَ: (إِنَّهَا مُبَارَكَةٌ ، إِنَّهَا طَعَامُ طُعْمٍ). رواه مسلم و زاد الطيالسي: (وَشِفَاءُ سُقْمٍ).
అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జమ్ జమ్ నీళ్ళ విషయంలో ఇలా బోధించారు:
“అది శుభమైన నీరు. అది ఆకలిగొన్నవారికి ఆహారపు పని జేస్తుంది. (ఇది ముస్లిం 2473 ఉల్లేఖనం, తయాలిసిలో అదనంగా ఈ పదాలున్నాయిః) మరియు అది రోగ నివారిణి కూడాను“.
الأكل يوم عيد الفطر قبل الذهاب للمصلى: عَنْ أَنَسِ بنِ مَالِكٍ t قَالَ: (كَانَ رَسُولُ الله لاَ يَغْدُو يَومَ الْفِطْرِ حَتَّى يَأكُلَ تَمرَاتٍ) وفي رواية: (وَيَأْكُلُهُنَّ وِترًا).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమజాను పండుగ రోజు ఖర్జూరపు పండ్లు తినే దాకా ఈద్గాహ్ వెళ్ళేవారు కాదు అని అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు తెలిపారు. మరో ఉల్లేఖనంలో ఉంది: “ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం బేసి సంఖ్యలో తినేవారు“. (బుఖారీ 953).
تحسين الصوت بقراءة القرآن: عَنْ أَبِي هُرَيْرَةَ t أَنَّهُ سَمِعَ النَّبِيَّ يَقُولُ: (مَا أَذِنَ اللهُ لِشَيْءٍ مَا أَذِنَ لِنَبِيٍّ حَسَنِ الصَّوْتِ بِالْقُرْآنِ يَجْهَرُ بِهِ ).
అబూ హూరైరా రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా విని ఉల్లేఖిస్తున్నారు:
“సుమధుర స్వరంతో ఖుర్ఆన్ పారాయణం చేసే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంఠస్వరాన్ని అల్లాహ్ ఎంతో శ్రద్ధగా ఆలకిస్తాడు. ఆయన అంత శ్రద్ధగా మరే స్వరాన్నీ వినడు”. మంచి స్వరం అంటే (చక్కని ఉచ్ఛారణతో) బిగ్గరగా పారాయణం చేయడమని అర్థం. (బుఖారీ, 5024. ముస్లిం 792).
జువైరియా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం: ఆమె నమాజు చేసిన స్థలంలోనే ఉండగా ఫజ్ర్ నమాజ్ చేయించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె వద్ద నుండి వెళ్ళారు. చాష్త్ సమయంలో తిరిగి వచ్చారు. అప్పటికి ఆమె అక్కడే కూర్చొని ఉండటం చూసి, “నేను ఇంతకు ముందు నిన్ను వదలిన స్థితిలోనే ఇప్పటి వరకున్నావా నీవు?” అని అడిగారు. ఆమె ‘అవును’ అని సమాధాన- మిచ్చింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “నీ దగ్గరి నుండి వెళ్ళి నేను నాలుగు పదాలు మూడు సార్లు పలికాను. వీటిని మరియు నీవు ఉదయం నుండి పలికిన పదాలను తూకం వేస్తే నేను పలికిన పదాలు బరువుగా తేలుతాయి. అవి: సుబ్ హానల్లాహి వబి హందిహి, అదద ఖల్ఖిహీ, వ రిజా నఫ్ సిహీ, వ జినత అర్షిహీ వ మిదాద కలిమాతిహీ”. [భావం: అల్లాహ్ సృష్టిరాసుల సంఖ్యలో, ఆయన స్వయంగా కోరిన పరిణామంలో, ఆయన అర్ష్ (సింహాసనం) విలువంత మరియు ఆయన వచనాల పరిణామంలో ఆయనకు పవిత్రతలు మరియు స్తోత్రాలు]. (ముస్లిం 2726).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా తుమ్మితే “అల్ హందులిల్లాహ్” అనాలి. అది విన్న అతని సోదరుడు లేక మిత్రుడు “యర్ హముకల్లాహ్” అనాలి. మళ్ళీ తుమ్మిన వ్యక్తి “యహ్ దీకుముల్లాహు వ యుస్లిహు బాలకుం” అనాలి. (బుఖారీ 6224).
ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రోగిని పరామర్శించడానికి వెళ్ళి ఇలా దుఆ చేశారుః “లా బాస తహూరున్ ఇన్షాఅల్లాహ్”. [చింతించకు, అల్లాహ్ తలిస్తే ఈ వ్యాధి నిన్ను (నీ పాపాల నుండి) ప్రక్షాళనం చేస్తుంది]. (బుఖారీ 5662).
وضع اليد على موضع الألم، مع الدعاء: عَنْ عُثْمَانَ بْنِ أَبِي الْعَاصِ الثَّقَفِيِّ أَنَّهُ شَكَا إِلَى رَسُولِ اللهِ وَجَعًا يَجِدُهُ فِي جَسَدِهِ مُنْذُ أَسْلَمَ فَقَالَ لَهُ رَسُولُ الله ِ: (ضَعْ يَدَكَ عَلَى الَّذِي تَأَلَّمَ مِنْ جَسَدِكَ وَقُلْ بِاسْمِ الله ثَلَاثًا وَقُلْ سَبْعَ مَرَّاتٍ أَعُوذُ بِالله وَقُدْرَتِهِ مِنْ شَرِّ مَا أَجِدُ وَأُحَاذِرُ).
ఉస్మాన్ బిన్ అబుల్ ఆస్ కథనం: అతను ఇస్లాం స్వీకరించినప్పటి నుండి తన శరీరంలోని ఓ భాగంలో నొప్పి వస్తుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఫిర్యాదు చేశాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారుః
“నీ శరీరంలో నొప్పి ఉన్న చోట చేయి పెట్టి మూడు సార్లు “బిస్మిల్లాహ్” అని, ఏడు సార్లు “అఊజు బిల్లాహి వ ఖుద్రతిహీ మిన్ షర్రి మా అజిదు వ ఉహాజిరు” చదువు. [నేను అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క శక్తిసామర్థ్యాల శరణులో వస్తున్నాను నాకు ఉన్న అవస్త మరియు నేను భయపడుతున్న దానితో]. (ముస్లిం 2202).
الدعـاء عند نزول المطر: عَنْ عَـائِشَةَ أَنَّ رَسُولَ الله كَانَ إِذَا رَأَى الْـمَطَرَ قَالَ: (اللَّهُمَّ صيبًا نافعًا).
ఆయిషా రజియల్లాహు అన్హా కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వర్షం కురుస్తున్నది చూసి, “అల్లాహుమ్మ సయ్యిబన్ నాఫిఅ” అనేవారు. (ఓ అల్లాహ్! మాకు లాభం చేకూర్చే వర్షం కుర్పించు). (బుఖారీ 1032).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా తాను విన్నానని జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
“మనిషి తనింట్లో ప్రవేశిస్తూ మరియు భోజనంపై కూర్చుంటూ అల్లాహ్ ను స్మరిస్తే (ఆ సందర్భంలో చదవవలసిన ప్రవక్త నేర్పిన దుఆలు చదివితే), షైతాన్ (తన మిత్రులతో) అంటాడుః “ఇక్కడ మీరు నిద్రించడానికీ మరియు రాత్రి భోజనం చేయుటకు ఏ అవకాశమూ లేదు”. ఇక ఇంట్లో ప్రవేశించి- నప్పుడు అల్లాహ్ ను స్మరించకున్నట్లయితే షైతాన్ ఇలా అంటాడుః “మీరు నిద్రించడానికి స్థలం పొందారు”. భోజనం చేసేటప్పుడు అల్లాహ్ ను స్మరించకున్నట్లయితే అంటాడుః మీరు నిద్రించటానికి మరియు భోంచేయటానికి అవకాశం కలిగింది. (ముస్లిం 2018)
ذكر الله في المجلس: عَنْ أَبِي هُرَيْرَةَ t عَنْ النَّبِيِّ قَالَ: (مَا جَلَسَ قَوْمٌ مَجْلِسًا لَمْ يَذْكُرُوا اللهَ فِيهِ وَلَمْ يُصَلُّوا عَلَى نَبِيِّهِمْ إِلَّا كَانَ عَلَيْهِمْ تِرَةً (أي: حسرة) فَإِنْ شَاءَ عَذَّبَهُمْ وَإِنْ شَاءَ غَفَرَ لَـهُمْ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని, అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
“ప్రజలు ఏదైనా సమావేశంలో కూర్చొని, అల్లాహ్ ను స్మరించకుంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పంపకుంటే, ఆ సమావేశం, వారి అనుతాపానికే కారణమగును. అల్లాహ్ తలుచుకుంటే వారిని శిక్షించవచ్చు లేదా క్షమించనూ వచ్చు”. (తిర్మిజి 3380).
الدعاء عند دخول الخلاء: عَنْ أَنَسِ بنِ مَالِكٍ t قَالَ: كَانَ النَّبِيُّ إِذَا دَخَلَ (أي: أَرَادَ دُخُولَ) الْخَلاَءَ قَالَ: (اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْـخُبُثِ وَالْـخَبَائِثِ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరుగుదొడ్లో ప్రవేశించాలనుకున్నపుడు “అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇసి” అని పలికేవారని అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. [అల్లాహ్! దుష్ట జిన్నాతు స్త్రీ పురుషుల నుండి నీ శరణు కోరుచున్నాను]. (బుఖారీ 6322. ముస్లిం 375).
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః తీవ్రంగా వీచే గాలిని చూసినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ చదివేవారుః “అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఖైరహా వ ఖైర మా ఫీహా, వ ఖైర మా ఉర్సిలత్ బిహీ, వ అఊజు బిక మిన్ షర్రిహా వషర్రి మా ఫీహా, వషర్రి మా ఉర్సిలత్ బిహీ”. [అల్లాహ్! నేను దాని మేలును, దానిలోని మేలును, అది ఏ మేలుతో పంపబడిందో దాన్ని కోరుతున్నాను. దాని కీడు, దానిలోని కీడు మరియు అది ఏ కీడుతో పంపబడిందో దాని నుండి నీ శరణు కోరుతున్నాను]. (ముస్లిం 899).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విని ఉల్లేఖిస్తున్నారు అబూ దర్దా రజియల్లాహు అన్హు:
“ఎవరు తన సోదరుని కోసం అతని పరోక్షంలో దుఆ చేస్తాడో, అక్కడ ఒక దైవదూత నియమింపబడి ఉంటాడు, అతడు దానిపై ఆమీన్, నీకూ ఇలాంటి మేలే కలుగుగాక! అని దీవిస్తాడు”. (ముస్లిం 2732).
“ఎవరైనా ముస్లింకు ఏదైనా ఆపద ఎదురైనప్పుడు అల్లాహ్ ఆదేశించినట్లు “ఇన్నా లిల్లాహి వఇన్నా ఇలైహి రాజిఊన్, అల్లాహుమ్మఅజుర్ నీ ఫీ ముసీబతీ వఅఖ్ లిఫ్ లీ ఖైరమ్ మిన్ హా” అని చదివితే అల్లాహ్ అతనికి మేలైనదాన్ని ప్రసాదిస్తాడు. (అనువాదం: మేమందరమూ అల్లాహ్ కు చెందినవారమే, మరియు మేము ఆయన వైపునకు తిరిగి పోవలసినవారము, ఓ అల్లాహ్! నా ఆపదకు బదులుగా ఉత్తమ ఫలితం ప్రసాదించు, దీనికంటే మేలైనది నాకు ప్రసాదించు). (ముస్లిం 918).
إفشاء السلام: عَنِ البَراءِ بن عَازِبٍ t قَالَ: (أمَرنا النبي بِسَبع ، وَنَهَانَا عَن سَبع: أُمِرْنَا بِعِيَادَةِ الْـمَرِيض، … وَإفشَاء السلام ،… الحديث).
బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం:
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏడు విషయాల గురించి మాకు ఆదేశించారు, ఏడు విషయాలను నివారించారు. మాకు ఆదేశించినవాటిలో రోగులను పరామర్శించాలని మరియు సలాంను వ్యాప్తి చేయాలని ఉంది“. (బుఖారీ 5175. ముస్లిం 2066)
అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “నాకొక పిల్లవాడు పుడితే నేనతడ్ని తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వెళ్ళాను. ఆ పిల్లవాడికి ఆయన ఇబ్రాహీం అని పేరు పెట్టారు. ఖర్జూర పండు నమిలి అతని నోట్లో పెట్టారు”. (దీనినే ‘తహ్ నీక్’ అంటారు. ఇది ఖర్జూరపు పండుతో చేస్తే ఉత్తమం, కాని ఇది లేనప్పుడు మరే తీపి పదార్థంతోనయినా చేయవచ్చును). (బుఖారీ. 5467. ముస్లిం 2145).
العقيقة عن المولود: عَنْ عَائِشَةَ قَالَتْ: (أَمَرَنَا رَسُولُ الله أَنْ نَعُقَّ عَنِ الْجَارِيَةِ شَاةٌ ، وَعَنِ الْغُلاَمِ شَاتَينِ).
ఆడ పిల్ల అయితే ఒక మేక, మగ పిల్లవాడైతే రెండు మేకలతో అఖీఖా చేయాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు. (అహ్మద్ 25764).
كشف بعض البدن ليصيبه المطر: عَنْ أَنَسٍ t قَالَ: أَصَابَنَا وَنَحْنُ مَعَ رَسُولِ الله مَطَرٌ قَالَ فَحَسَرَ رَسُولُ الله r ثَوْبَهُ حَتَّى أَصَابَهُ مِن المَطَرِ فَقُلْنَا: يَا رَسُولَ الله لِمَ صَنَعْتَ هَذَا قَالَ: (لِأَنَّهُ حَدِيثُ عَهْدٍ بِرَبِّهِ تَعَالَى).
అనస్ రజియల్లాహు అన్హు తెలిపారుః మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉండగా వర్షం కురిసింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ శరీరంలో కొంత భాగం నుండి వస్త్రాన్ని ప్రక్కకు జరిపారు. ‘మీరిలా ఎందుకు చేశార’ని మేమడిగాము. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ నుండి అవతరించిన ఈ సంవత్సరపు తొలి వర్షం ఇది” అని సమాధానం ఇచ్చారు. (ముస్లిం 898).
“ఏ చిన్న సత్కార్యాన్ని కూడా విలువలేనిదిగా భావించకు. అది నీ తోటి సోదరునితో చిరునవ్వుతో కలుసుకోవట మైనా సరే“నని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఉద్దేశించి చెప్పారని అబూ జర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః (ముస్లిం 2626).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
“ఒక వ్యక్తి తన సోదరున్ని దర్శించుటకు వేరే గ్రామానికి వెళ్ళాడు. ఆ దారిలో అల్లాహ్ ఒక దైవదూతను మాటు వేసి యుండుటకు పంపాడు. ఆ వ్యక్తి రాగానే దైవదూత “నీవు ఎటు వెళ్తున్నావు?” అని అడిగాడు. “ఆ గ్రామంలో నా ధార్మిక సోదరుడు ఒకడున్నాడు అతన్ని కలుసుకోవటానికి వెళ్తున్నాను” అన్నాడతను. “అతడు నీకు ఏదైనా మేలు చేశాడని, నీవు దాన్ని తీర్చడానికి వెళ్తున్నావా?” అని అడిగాడు దైవదూత. “అదేం కాదు. నేను అల్లాహ్ కొరకే అతన్ని ప్రేమించాను” అని ఆ మనిషి జవాబిచ్చాడు. దానికి ఆ దూత ఇలా చెప్పాడు: “నేను అల్లాహ్ యొక్క దూతను, అల్లాహ్ నన్ను ఈ శుభవార్తతో నీ వైపు పంపాడు. నీవు అతన్ని అల్లాహ్ కొరకే ప్రేమించినందుకు అల్లాహ్ నిన్ను ప్రేమించాడు”. (ముస్లిం 2567).
“ఆవలింపు షైతాన్ తరఫున ఉంటుంది. అందుకే మీలో ఎవరైనా ఆవలించినపుడు సాధ్యమైనంత వరకు దాన్ని ఆపుకోవాలి. మీలో ఎవరైనా ఆవలిస్తూ ‘హా…’ అన్నపుడు షైతాన్ నవ్వుతాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని, అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారీ 3289. ముస్లిం 2994).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ శుభవార్త ఇచ్చారని సహల్ బిన్ సఅద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
“నేను మరియు అనాథల సంరక్షకుడు స్వర్గంలో ఇలా ఉంటాము” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపుడు వ్రేలు మరియు మధ్య వ్రేలును కలిపి చూపించారు. (బుఖారీ 6005).
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ఏదైనా బోధించండి అని అర్థించాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “ఆగ్రహం చెందకు” అని ఉపదేశించారు. ఆ వ్యక్తి ఇదే ప్రశ్న మాటిమాటికి వేశాడు, దానికి ప్రవక్త కూడా “నీవు ఆగ్రహం చెందకు” అనే బోధించారు. (బుఖారీ 6116).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
“అల్లాహ్ ఛాయ తప్ప మరెలాంటి ఛాయ లభించని (ప్రళయ)దినాన అల్లాహ్ ఏడు రకాల మనుషుల్ని తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. అందులో ఒకడుః ఏకాంతంలో అల్లాహ్ ను తలుచుకొని కంట తడి పెట్టే వ్యక్తి”. (బుఖారీ 660. ముస్లిం 1031).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని, అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
మనిషి చనిపోయినపుడు అతని ఆచరణ అంతమయి పోతుంది. అయితే మూడు రకాల ఆచరణలు మటుకు అంతం కావు. (వాటి పుణ్య ఫలం మనిషికీ లభిస్తూనే ఉంటుంది). (1) సదకా జారియ. (2) ప్రజలకు ఉపయోగపడుతున్న జ్ఞానం. (3) అతనికోసం దుఆ చేసే ఉత్తమ సంతానం. (ముస్లిం 1631).
ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు మస్జిదె నబవి (ప్రవక్త మస్జిదు)ని పునర్నిర్మించినపుడు ప్రజలు అతన్ని ఏవేవో మాటలు అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఆ మాటలు విని ఇలా అన్నారు. మీరు లేనిపోని మాటలు అంటున్నారు గాని నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారుః “కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు ఎవరైనా మస్జిదు నిర్మిస్తే అతని కోసం అల్లాహ్ అలాంటిదే ఒక ఇల్లు స్వర్గంలో నిర్మిస్తాడు“. (బుఖారీ 450. ముస్లిం 533).
إزالة الأذى عن الطريق: عَنْ أَبِي هُرَيْرَةَ t أَنَّ رَسُولَ الله قَالَ: (بَيْنَمَا رَجُلٌ يَمْشِي بِطَرِيقٍ وَجَدَ غُصْنَ شَوْكٍ عَلَى الطَّرِيقِ فَأَخَّرَهُ فَشَكَرَ اللهُ لَهُ فَغَفَرَ لَهُ).
అబూహురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
“ఒక వ్యక్తి దారిన నడచిపోతుంటే దారిలో ఒక ముళ్ళ కంప పడి ఉండటం చూశాడు. అతను దాన్ని తీసి పక్కన పారేసి వెళ్ళిపోయాడు. అతను చేసిన ఈ పుణ్యకార్యాన్ని అల్లాహ్ స్వీకరించి అతడ్ని మన్నించాడు“. (బుఖారీ 654, ముస్లిం 1914).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
“ఎవరైనా తన పవిత్ర సంపాదన నుండి ఒక ఖర్జూరపుటంత దానం చేస్తే -అల్లాహ్ పవిత్ర వస్తువును మాత్రమే స్వీకరిస్తాడు- అల్లాహ్ దాన్ని తన కుడిచేత్తో స్వీకరిస్తాడు. ఆ తర్వాత మీరు గుర్రపు పిల్లను పెంచి పెద్ద చేసినట్లు ఆయన ఆ దానాన్ని వృద్ధి పరుస్తాడు. అలా వృద్ధి చెందుతూ చివరికది పెరిగి పర్వతం మాదిరిగా అయి పోతుంది“. (బుఖారీ 1410. ముస్లిం 1014).
الإكثار من الأعمال الصالحة في عشر ذي الحجة: عَنْ ابْنِ عَبَّاسٍ ؆ عَنْ النَّبِيِّ أَنَّهُ قَالَ: (مَا الْعَمَلُ فِي أَيَّامٍ أَفْضَلَ مِنْهَا فِي هَذِه)ِ ( يعني أيام العشر) قَالُوا: وَلَا الْجِهَادُ؟ قَالَ: (وَلَا الْجِهَادُ إِلَّا رَجُلٌ خَرَجَ يُخَاطِرُ بِنَفْسِهِ وَمَالِهِ فَلَمْ يَرْجِعْ بِشَيْءٍ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
“జిల్ హజ్జ మొదటి దశకంలో చేసిన సత్కార్యాలకు ఉన్నంత ఘనత వేరే రోజుల్లో చేసే సత్కార్యాలకు లేదు”. జిహాద్ కు సయితం ఆ పుణ్యం లేదా? అని సహచరులు అడిగారు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అవును జిహాద్ కు కూడా లేదు. కేవలం తన ధనప్రాణంతో సహా జిహాద్ కు వెళ్ళి తిరిగిరాని అమరవీరునికి తప్ప” అని జవాబిచ్చారు. (బుఖారీ 969).
النهي عن أن يُحَدِّث المرء بكل ما سمع: عَنْ حَفْصِ بنِ عَاصِمٍ t قَالَ: قَالَ رَسُولُ الله : (كَفَى بِالْمَرْءِ إِثماً أن يُحَدِّث بِكُلِّ مَا سَمِعَ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని, హఫ్స్ బిన్ ఆసిం రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
“విన్న ప్రతి మాటా చెప్పుకు తిరుగుటయే మనిషి పాపంలో పడిపోవటానికి సరిపోతుంది“. (అబూ దావూద్ 4992).
الرَّمل في الطواف: عَنِ بنِ عُمَرَ t قَالَ: (كَانَ رَسُولُ الله إذَا طَافَ الطَّوَافَ الأَوَّلَ، خَبَّ (أي:رَمَلَ) ثلاثًا ومشى أربعًا …) الحديث.
ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబా గృహం చుట్టూ మొదటి విడత ప్రదక్షిణం చేస్తున్నప్పుడు చిన్న చిన్న అడుగులతో వడివడిగా నడుస్తూ మూడు చుట్లు తిరిగేవారు. ఆ తర్వాత నాలుగు ప్రదక్షిణలు సాధారణ నడకలో నడిచి చేసేవారు. ....(బుఖారీ 1644. ముస్లిం 1261).
المداومة على العمل الصالح وإن قل: عَنْ عَائِشَةَ أَنَّهَا قَالَتْ: سُئِلَ رَسُولُ الله : أَيُّ الأعْمَالِ أَحَبُّ إِلَى الله؟ قَالَ: (أدوَمُهَا وإن قلَّ).
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం ‘అల్లాహ్ కు అన్నింటికంటే ఎక్కువగా ఏ పని అంటే ఇష్టం?‘ అని ప్రవక్తను ప్రశ్నించగా, “అల్లాహ్ కు నిత్యం క్రమం తప్పకుండా చేసే పని అంటే ఎంతో ఇష్టం, అది తక్కువైనా సరే” అని సమాధాన మిచ్చారు. (బుఖారీ 6465. ముస్లిం 1828).
وصلى الله وسلم وبارك على نبينا محمد وعلى آله وصحبه أجمعين.
[1] రిబాత్ అంటే సత్యాసత్యాల మధ్య పోరాటం సాగే రోజుల్లో రాత్రిళ్ళు పహరా కాయడం అన్న మాట. శాంతి కాలంలో నమాజ్ పట్ల మక్కువ, పోరాటపు రోజుల్లో ప్రాణాలొడ్డి పహరా కాయడంతో సమానమని అర్థం.
([2]) ఇక్కడ ‘హాజల్ అమ్ర’కు బదులుగా తన అవసరాన్ని పేర్కొనాలి. లేదా ‘హాజల్ అమ్ర’ అంటూ తన అవసరాన్ని ఆలోచించుకోవాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సిఫాతె ఇలాహీ (అల్లాహ్ గుణవిశేషాలు) లో తౌహీద్ అనగానేమి?
తౌహీద్ (ఏకదైవారాధన) కు కట్టుబడిన ముస్లింకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?
అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు?
మనతోపాటు అల్లాహ్ తన అస్థిత్వంతో ఉన్నాడా లేదా తన జ్ఞానంతో ఉన్నాడా?
అతిపెద్ద పాపం ఏమిటి?
షిర్కే అక్బర్ (అతిపెద్ద షిర్కు) అంటే ఏమిటి?
అతిపెద్ద ‘షిర్కు’ కు ఒడిగడితే ఎలాంటి నష్టం కలుగుతుంది?
‘షిర్కు’ కు ఒడిగడుతూ సత్కార్యాలు ఆచరిస్తే ప్రయోజనం ఉంటుందా?
ముస్లిముల్లో షిర్కు ఉందా?
అల్లాహ్ తప్ప ఇతరులను వేడుకోవడం, అంటే వలి అల్లాహ్ లను వేడుకునే విషయమై ఎలాంటి ఆదేశం ఉంది?
వేడుకోవడం (దుఆ) దైవారాధన అవుతుందా?
మృతులు పిలుపును వింటాయా?
మృతులను సహాయం కొరకు ప్రార్ధించవచ్చా?
అల్లాహ్ తప్ప ఇతరులను సహాయం కోరడం ధర్మసమ్మతమేనా?
బ్రతికి ఉన్న సృష్టి సహాయం కోరవచ్చా ?
అల్లాహ్ తప్ప ఇతరులకు మొక్కుబడులు చెల్లించడం ధర్మసమ్మతమేనా?
అల్లాహ్ తప్ప ఇతరులకోసం జిబాహ్ చేయడం ధర్మసమ్మతమేనా?
సమాధుల ప్రదక్షిణం చేయటం ధర్మసమ్మతమేనా?
సమాధుల వైపునకు ముఖాన్ని త్రిప్పి నమాజ్ చేయడం ధర్మసమ్మతం అవుతుందా?
చేతబడి చేయటం గురించి ఎలాంటి ఆదేశం ఉంది?
జ్యోతిష్కుని మాటలను నమ్మవచ్చా ?
అగోచర జ్ఞానం ఎవరికైనా ఉంటుందా?
ముస్లిములు వేటిని తమ గీటురాయిగా చేసుకోవడం విధిగా చేయబడింది?
ఇస్లాంకు వ్యతిరేకమైన చట్టాలను అమలు చేసే విషయమై ఎలాంటి ఆదేశం ఉంది?
దైవేతరులపై ప్రమాణం చేయడం ధర్మసమ్మతమేనా?
తాయత్తులు, గవ్వలు వ్రేలాడదీసుకోవడం ధర్మసమ్మతమేనా?
మనము అల్లాహ్ ను ఏ విధంగా వేడుకోవాలి?
అల్లాహ్ ను వేడుకొనడానికి ఎవరి సహాయమైనా అవసరమవుతుందా?
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పని ఏమిటి?
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసు ప్రసాదించమని మనం ఎవరిని వేడుకోవాలి?
అల్లాహ్ ను ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను మనం ఏవిధంగా ప్రేమించాలి?
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రశంసించే విషయంలో హద్దుమీరి ప్రవర్తించవచ్చా?
అల్లాహ్ తన సృష్టిరాశుల్లో మొదటగా ఎవరిని సృష్టించాడు?
అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయడం గురించి ఎలాంటి ఆదేశం ఉంది?
‘విశ్వాసులతో స్నేహం’ అంటే ఏమిటి?
వలీ అల్లాహ్ (అల్లాహ్ మిత్రుడు) ఎవరు?
అల్లాహ్ ఖుర్ఆన్ ను ఎందుకు అవతరింపజేశాడు?
ఖుర్ఆన్ ఎలాగూ ఉంది కదా! అని మనం హదీస్ పట్ల విముఖత చూపగలమా?
అల్లాహ్ , ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశాలపై మనము ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వగలమా?
వివాదం తలెత్తినప్పుడు మనం ఏం చేయాలి?
‘బిద్అత్’ అంటే ఏమిటి?
ఇస్లాంలో ‘బిద్అతె హసనా’ ఉందా?
ఇస్లాంలో ‘సున్నతె హసనా’ (మంచి విధానం) ఉందా?
మనిషి కేవలం స్వీయ సంస్కరణ చేసుకొంటే సరిపోతుందా?
ముస్లింలకు ఎప్పుడు ఆధిపత్యం లభిస్తుంది?
ముస్లింలపై ముస్లింల హక్కులు ఎన్ని ఉన్నాయి ?
సందేశ ప్రచార విషయంలో ఎలాంటి ఆదేశం ఉంది?
ప్రపంచంలో సన్మార్గ గాములు ఉన్నారా?
ఏ వర్గం వారు ధార్మిక సేవ అందరికంటే ఎక్కువ చేసారు?
సత్యం ఎవరి పక్షాన ఉంది?ఎవరు సాఫల్యం పొందుతారు?
సామూహిక ప్రాముఖ్యం తెలుపండి ?
అన్నింటికన్నా ప్రాముఖ్యం గల విధి ఏది?
ధర్మంలో నైతికతకు ఎలాంటి స్థానం ఉంది?
ఇస్లామీ వ్యవస్థ లేని దేశంలో మనం ఏ విధంగా జీవించాలి?
దాసులలో అందరికంటే అధికంగా హక్కుగల వారెవరు?
దేవుని అవిధేయత జరిగే పక్షంలో మానవులకు విధేయత చూపవచ్చా?
జీవితం అనగా నేమి?
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అంతిమ దైవగ్రంథం ఖుర్ఆన్ (అనువాదం, వ్యాఖ్యానం) – అహ్సనుల్ బయాన్
Telugu Quran Commentry -Translation based on the Urdu translation of Moulana Muhammad Jonagari (Ahlulhadith) with brief commentry named “Tafseer Ahsan-ul-Bayan” by Hafizh Salah-ud-deen yusuf
టైటిల్: అంతిమ దైవగ్రంథం ఖుర్ఆన్ (అనువాదం, వ్యాఖ్యానం) – అహ్సనుల్ బయాన్
క్లుప్త వివరణ: ఉర్దూ భాషలో మౌలానా ముహమ్మద్ జునాగడీ (Moulana Muhammad Jonagari ) మరియు హాఫిజ్ సలాహుద్దీన్ యుసుఫ్ (Hafiz Salah-ud-Din Yusuf) లు కలిసి తయారు చేసిన అహ్సనుల్ బయాన్ అనే ప్రపంచ ప్రసిద్ధ ఖుర్ఆన్ సంకలనం యొక్క తెలుగు అనువాదమిది. దీనిని ముహమ్మద్ అజీజుర్రహ్మాన్ గారు తెలుగులో అనువదించినారు. శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాదు వారు ప్రచురించినారు. వారి అనుమతి లేకుండా ఎవరూ దీనిని అధిక సంఖ్యలో ప్రింటు చేయరాదు. తెలుగు భాషలో ఇటువంటి అమూల్యమైన గ్రంథం లభ్యమవటం మన అదృష్టం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
( Bulugh al Maraam) – Ibn Hajr Al Asqalaani (rahimahullah)
సంకలనం : అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) వ్యాఖ్యానం : మౌలానా సఫీవుర్రహ్మాన్ ముబారక్ పూరీ తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్ అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్ , హైదరాబాద్ -ఆం.ప్ర–ఇండియా
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ గ్రంథంలో మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి) సంప్రదాయాల (హదీసుల)కు సంబంధించిన సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం అనే రెండు హదీసు గ్రంథాలను రెండు సముద్రాలతో పోల్చడం జరిగింది. అయితే ప్రస్తుత సంకలన కర్త అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ హదీసుల మూలం (text)ని బుఖారీ గ్రంథం నుండి గ్రహించి స్కంధాలు, అధ్యాయాల క్రమాన్ని, శీర్షికల పేర్లను మాత్రం ముస్లిం గ్రంథం నుండి స్వీకరించారు. అదీగాక పై రెండు గ్రంథాలలోనూ ఒకే ఉల్లేఖకుడు తెలిపిన ఉమ్మడి హదీసుల్ని మాత్రమే ఈ గ్రంథం కోసం ఎంచుకున్నారు. వీటిని “ముత్తఫఖున్‌అలైహ్” (ఉభయోకీభవిత) హదీసులని అంటారు. వీటినే ఈ సంకలనకర్త ముత్యాలు, పగడాలుగా అభివర్ణించి, దాన్నే తన గ్రంథానికి నామకరణం చేశారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు విధానము షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్) [పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి] [PDF] [28 పేజీలు]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అ) ప్రవక్తముహమ్మద్(సల్లల్లాహుఅలైహివసల్లమ్)కాలంలోహదీథ్లనురికార్డు (నమోదు) చేయటం
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క కాలంలోనే హదీథ్ లను రికార్డుచేయటం మొదలైనది.
1. అబుహురైరా రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులలో అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ రదియల్లాహు అన్హుమా తప్ప, నా కంటే ఎక్కువగా హదీథ్ లను ఉల్లేఖించిన వారెవరూ లేరు. ఆయన వ్రాసేవారు మరియు నేను వ్రాసేవాడిని కాదు.” బుఖారి హదీస్
2. అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ రదియల్లాహు అన్హుమా ఇలా తెలిపారు – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం నుండి నాకు తెలిసిన ప్రతి విషయం కంఠస్థం చేయటం కొరకు నేను వ్రాస్తూ ఉండేవాడిని.కాని (మక్కాలోని ఒక తెగవారైన) ఖురైషులు (వ్రాయకుండా) నన్ను ఆపి ఇలా చెప్పారు “నీవు ప్రతి విషయం వ్రాస్తున్నావు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం కూడా మానవుడే, ఆయన కోపగించుకుంటారు మరియు ఉల్లాసంగా కూడా మాట్లాడతారు.”అప్పుడు నేను వ్రాయటం ఆపి, ఈ విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లంకు తెలియజేసాను, ఆయన తన చేతితో తన నోటివైపు చూపిస్తూ ఇలా సెలవిచ్చారు “వ్రాయి! నా ఆత్మ ఎవరి అధీనంలో ఉన్నదో, అతడి సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను, దీని(తన నోటి) నుండి నిజం(సత్యసందేశం) తప్ప ఇంకేమీ బయటికి రాదు.” [అబు దావుద్ & అహ్మద్.]
3. అబు సయిద్ అల్ ఖుద్రి రదియల్లాహు అన్ హు ఇలా ఉల్లాఖిచారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా సెలవిచ్చారు “నేను చెప్పేది ఏదీ వ్రాయవద్దు ఒక్క ఖుర్ఆన్ తప్ప, ఖుర్ఆన్ మినహా ఎవరైనా ఏదైనా వ్రాసినట్లైతే దానిని తుడిచి వేయవలెను.” [ముస్లిం & అహ్మద్.]
మొదటి రెండు హదీథ్ (వ్రాయటానికి అనుమతివ్వబడినదని నిరూపించేవి)లు మరియు మూడో హదీథ్ (వ్రాయటం నిషేధింపబడినదని నిరూపించేది) పరస్పరం విరుద్ధంగా ఉన్నప్పటికీ ఏకకాలంలో మూడూ నిజమైనవే ఎలా అవుతాయి?
తన సహాబాల(ప్రవక్త సహచరుల)కు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం హదీథ్ లను వ్రాయటానికి అనుమతిచ్చారా లేక నిషేధించారా అనే విషయాన్ని నిర్ణయించడానికి వీలుగా ముస్లిం పండితులు కొన్ని కారణాలను ఇలా ప్రకటించారు.
1. హదీథ్ లు మరియు దివ్యఖుర్ఆన్ సందేశాలు ఒకదానిలో ఒకటి కలసి పోయి తికమక పెట్టవచ్చనే కారణంగా హదీథ్ లు వ్రాయటాన్ని జనరల్ గా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం నిషేధించి ఉండవచ్చును.
2. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం కు కరక్టుగా వ్రాయగలరనే నమ్మకమన్న కొందరు సహాబాల(ప్రవక్త సహచరుల)ను మాత్రమే హదీథ్ లను వ్రాయటానికి ప్రత్యేకంగా ఆజ్ఞాపించి ఉండవచ్చను.
3. దివ్య ఖుర్ఆన్ అవతవరణ ప్రారంభదశలో హదీథ్ లు వ్రాయటాన్ని నిషేధించి ఉండవచ్చును మరియు దివ్య ఖుర్ఆన్ అవతరణ దాదాపుగా పరిపూర్తవుతున్న దశలో అంటే ఖుర్ఆన్ నమోదవటం పూర్తవుతున్న సమయంలో హదీథ్ లు వ్రాయటానికి ఆజ్ఞాపించి ఉండవచ్చును. అప్పటికే ఎక్కవ మంది సహాబాల (ప్రవక్త సహచరుల)కు హదీథ్ మరియు ఖుర్ఆన్ వచనాలను ఎలా గుర్తించాలో స్పష్టంగా తెలిసిపోయి ఉంటుంది.
1. సత్యమైనపవిత్రగ్రంథం – ఇది అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ రదియల్లాహు అన్హుమా వ్రాసినారు. వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం యొక్క అనేక హదీథ్ లను ఇందులో నమోదు చేసినారు. దీనిని తన మనమడైన ఉమర్ బిన్ షుయైబ్ కు అందజేశారు.
2. అలీబిన్అబితాలిబ్ (రదియల్లాహుఅన్హు) యొక్కలిఖితపత్రం – ఇస్లాంలో ఖైదీలను విడిపించే నియమాలు, మానవ హత్యకు పరిహారంగా ఇవ్వవలసిన సొమ్ము యొక్క లెక్కలు మరియు శరీరావయవముల నష్ట పరిహారపు సొమ్ము యొక్క లెక్కలు కలిగిన ఒక చిన్న లిఖిత పత్రం.
3. సాద్బిన్ఉబాదా (రదియల్లాహుఅన్హు) యొక్కలిఖితపత్రం వాదోపవాదాల సమయంలో ప్రమాణం చేయటానికి మరియు సాక్ష్యమివ్వటానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం అనుమతిచ్చారని సాద్ బిన్ ఉబాదా రదియల్లాహు అన్హు ఉల్లేఖన ఆధారంగా తిర్మిథి తెలిపినారు.
4. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ఉత్తరాల రూపంలో వేర్వేరు ప్రదేశాలలోని తన ప్రజాసేవకులకు, ఉద్యోగులకు పంపిన పరిపాలనా వ్యవహారాల ఆజ్ఞలు మరియు దానికి సంబంధించిన ఇస్లాం యొక్క నియమ నిబంధనలు.
5. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్తరాల రూపంలో చుట్టుప్రక్కల ఇతర మతాలకు చెందిన నాయకులకు, చక్రవర్తులకు పంపిన ఉత్తరాలు. వీటిలో ఇస్లాం గురించిన ఉపోద్ఘాతం మరియు ఇస్లాం స్వీకరించమనే ఆహ్వానం పంపబడినది.
6. ఇతర మతాల వారితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క శాంతి ఒడంబడికలు, ప్రాధాన్యమున్న ఒప్పందాలు, పవిత్రమైన వాగ్దానాలు. ఉదాహరణకు యూదు మతస్థులతో మదీనా పట్టణంలో చేసుకున్న శాంతి ఒప్పందాలు.
7. జవాబుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం తమ సహాబా (సహచరు)లకు పంపిన వ్యవహారాల నిర్వహణ మరియు ఇస్లాం ధార్మిక విషయాలు.
ఆ) ఋజుమార్గంలోనడిపబడినఖలీఫాల
(తొలిఇస్లామీయరాజ్యపాలకుల) కాలంలోహదీథ్లనురికార్డు (నమోదు) చేయటం –1వహజ్రీశతాబ్దం 600-700AD
ఈ కాలంలో హదీథ్ లను వ్రాయటం కంటే ఎక్కువగా కంఠస్థం చేయటానికి ప్రాముఖ్యం ఇచ్చేవారు మరియు సహాబా (ప్రవక్త సహచరు)లు హదీథ్ ల గురించి తక్కువగా చర్చించేవారు. ఎందుకంటే వారు దివ్య ఖుర్ఆన్ ను నమోదు చేసే పనికే పూర్తి సమయాన్ని కేటాయించేవారు. మొదటి ఖలీఫా అబుబకర్ సిద్ధీక్ రదియల్లాహు అన్హు కాలంలో ఇస్లామియ రాజ్యపు నలువైపుల జరిగిన పలు యుద్ధాలలో అనేక మంది ఖుర్ఆన్ ను కంఠస్థం చేసిన సహాబాలు మరణించటం వలన, మొట్టమొదటి పూర్తి ఖుర్ఆన్ లిఖితప్రతిని సాధ్యమైనంత త్వరగా తయారుచేయటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడినది. ఆ కాలంలో హదీథ్ ల ద్వారా ప్రస్తావింపబడిన విషయాలను కొన్ని పద్ధతుల ద్వారా సహాబాలు మరియు ఖలీఫాలు అంగీకరించేవారు.
1. ఏదైనా ఇస్లామీయ ధార్మిక విషయం దివ్యఖుర్ఆన్ లో కనబడనప్పుడు లేదా వివరంగా లేనప్పుడు హదీథ్ లలో వెతకడం.
ఉదాహరణ: గాబేష్ ఇబ్నె థుయైబ్ రదియల్లాహు అన్ హు ఇలా తెలిపారు – ఒక ముసలమ్మ ఖలీఫా అబూబకర్ సిద్ధీఖ్ రదియల్లాహు అన్ హు దగ్గరకు వచ్చి తనకు రావలసిన వారసత్వపు హక్కును ఇవ్వమని అడుగుతుంది. దివ్యఖుర్ఆన్ లో దానికి సంబంధించిన ఎటువంటి ఆదేశాలు కనబడలేదని మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం నుండి కూడా ఎటువంటి ఆదేశాలు వినలేదని ఖలీఫా జవాబిస్తారు. తర్వాత మిగిలిన సహాబాలను ఈ విషయం గురించి అడుగుతారు. అక్కడున్న వారిలో నుండి అల్ ముగీరా ఇబ్నె షోబా రదియల్లాహు అన్ హు లేచి నిలబడి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఆవిడకు 6వ వంతు ఇవ్వడం చూసానని సాక్ష్యమిస్తారు. అప్పుడు ఖలీఫా ఆ సహాబీతో ఆ సమయంలో ఇంకెవరైనాసాక్ష్యమున్నారా? అని అడుగుతారు. అక్కడున్న వారిలో నుండి ముహమ్మద్ ఇబ్నె సలామా రదియల్లాహు అన్ హు లేచి అల్ ముగీరా సాక్ష్యాన్ని ధృవీకరిస్తారు. అప్పుడు ఖలీఫా అబుబకర్ రదియల్లాహు అన్ హు ఆవిడకు ఇవ్వవలసిన 6వ భాగం ఇచ్చివేస్తారు. (అల్ థహాబీ-తథ్కిరత్ అల్ హఫ్ఫాజ్ p2)
2. దివ్య ఖుర్ఆన్ ద్వారా మరియు ఇస్లామీయ సిద్ధాంతాల ద్వారా హదీథ్ ల పై సమాలోచన చేయటం.
ఒకవేళ దివ్య ఖుర్ఆన్ ఆయత్ లకు గాని ఇస్లామీయ సిద్ధాంతాలకు గాని హదీథ్ వ్యతిరేకమౌతున్నట్లైతే, ఆ హదీథ్ ను తిరస్కరించి, తప్పుగా అన్వయించి ఉండవచ్చనే ఉద్దేశంతో దానిని ఆచరించకుండా వదిలివేయటం జరిగేది.
ఉదాహరణ: ఉమర్ బిన్ ఖత్తాబ్ మరియు వారి కుమారుడు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఒక హదీథ్ ను ఇలా ఉల్లేఖిస్తున్నట్లుగా ఆయేషా రదియల్లాహుఅన్హా విన్నారు-ప్రవక్త ముహమ్మద్సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా సెలవిచ్చారు “బంధువులు శోకిస్తుండటం వలన చనిపోయినవారు శిక్షకు గురౌతారు” ఆవిడ ఇలా తెలిపారు – “అల్లాహ్ ఉమర్ పై దయ చూపుగాక, నేను అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను, చనిపోయిన వారి కోసం ఏడుస్తున్న బంధువుల కారణంగా అల్లాహ్ ఆ చనిపోయిన విశ్వాసులను శిక్షిస్తాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఎప్పుడూ చెప్పలేదు. దీనికి సంబంధించి నేను విన్న సరైన హదీథ్ ఇలా ఉన్నది – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా ప్రకటించి ఉన్నారు – చనిపోయిన వారి కోసం ఏడుస్తున్న బంధువుల కారణంగా ఆ చనిపోయిన అవిశ్వాసుల శిక్షను అల్లాహ్ పెంచుతాడు.” బుఖారి మరియు ముస్లిం. ముస్లిం హదీథ్ లో ఆయేషా రదియల్లాహుఅన్హా ఇంకా ఇలా చెప్పారని నమోదు చేయబడినది – హదీథ్ ఉల్లేఖనలో వచ్చిన తేడా అబద్ధం వలన కాదు, కాని వినటం లో జరిగిన పొరపాటు వలన అయివుంటుంది.
హదీథ్లలోకపటంమరియుఅబద్ధంకనిపించడం:
మూడవ ఖలీఫా ఉత్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు హత్య తర్వాత ముస్లింలలో భేదాభిప్రాయాలు మొదలై, పోట్లాటలు ప్రారంభమైనవి. స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం మరియు తమ తమ అవసరాలను తీర్చుకోవటానికి కొంతమంది స్వార్థపరులు హదీథ్ ల పదాలను మార్చటం, అబద్ధపు హదీథ్ లను కల్పించటం ప్రారంభమైనది. ఈ పరిస్థితులలో నుండి వాస్తవమైన హదీథ్ లను కాపాడటానికి సహాబాలు (ప్రవక్త సహచరులు)కూడా గట్టిగా ప్రయత్నించటం మొదలుపెట్టారు. తమ ముందుకు వచ్చిన ప్రతి హదీథ్ యొక్క సనన్(ఉల్లేఖకుల పరంపర) మరియు మతన్ (హదీథ్ లోని అసలు విషయం) లను క్షుణ్ణంగా పరిశీలించి, కపటమైన మరియు అబద్ధమైన హదీథ్ లను రద్దుచేసి, నిజమైన హదీథ్ లను సేకరించటం ప్రారంభించారు. ఈ అత్యంత బాధ్యతాకరమైన కార్యక్రమంలో అంటే హదీథ్ నిజానిజాలు పరీక్షించటం లో క్రింద పేర్కొనబడిన పద్ధతులను, నియమాలను వారు అనుసరించారు.
1. హదీథ్ ను ఉల్లేఖించిన వారి గుణగణాల గురించి సహాబాలు ప్రశ్నించటం ప్రారంభమైనది. దీనికి పూర్వం ఉల్లేఖకులందరినీ నమ్మదగినవారుగా మరియు ప్రామాణికమైన వారుగా విశ్వసించేవారు.
2. సామాన్య ప్రజలు ఉల్లేఖకుల నుండి విన్న హదీథ్ లను వెంటనే స్వీకరించకుండా సావధానంగా పరిశీలించిన తర్వాతే విశ్వసించేటట్లుగా సహాబాలు ప్రోత్సహించారు. దైవభీతి, దైవభక్తి గల, సత్యవంతులుగా మరియు ప్రామాణికత గలవారుగా ప్రసిద్ధిచెందిన, నిష్ఠాపరులైన ఉల్లేఖకుల నుండి మాత్రమే హదీథ్ లను ప్రజలు స్వీకరించేటట్లుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దీని ద్వారా జర్మరియుతాదీల్సైన్స్ అంటే ఉల్లేఖకులను విశ్వసించటానికి అవసరమైన పరీక్షలు జరపే సైన్స్ (విజ్ఞానశాస్త్రం) ఉనికి లోనికి వచ్చినది.
3. హదీథ్ యొక్క ప్రామాణికతను నిర్ధారించటానికి దూర దూర ప్రాంతాలకు ప్రయాణించటం – సహాబాలు ఒకరి నుండి విన్న హదీథ్ లోని నిజానిజాలు తెలుసుకోవటానికి, ఎన్ని కష్టాలెదురైనా సరే అదే హదీథ్ గురించి జ్ఞానం ఉన్న మరొకరి వద్దకు కూడా ప్రయాణించి, అందులోని ప్రామాణికతను పూర్తిగా పరీక్షించేవారు.
4. ఇంకా ఒకే హదీథ్ ను గనుక వేర్వేరు యోగ్యలైన ఉల్లేఖకర్తలు తెలిపి ఉన్నట్లైతే, సహాబాలు వాటిని పోల్చిచూసుకునేవారు. పోలిక సరిపోతేనే ఆ హదీథ్ ను స్వీకరించేవారు. పోలిక సరిపోకపోతే తిరస్కరించేవారు.
కాబట్టి ఆ కాలంలో హదీథ్ లను రెండు రకాలుగా విభజించారు.
హదీథ్ సైన్స్ ఈకాలంలోనే పూర్తయినది. దీనిని క్రింది విధంగా వర్ణించవచ్చును.
1. అధికారికంగాహదీథ్లనురికార్డుచేయటం.
అల్ బుఖారి ఇలా తెలిపారు – ముస్లింల ముఖ్య పండితుడైన అబిబకర్ ఇబ్నె హజమ్ కు అప్పటి ముస్లింల ఖలీఫా అయిన ఒమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్ (100 – 102 హిజ్రీ అంటే 700 – 800 AD) ఇలా సందేశం పంపారు – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క నిజమైన హదీథ్ లను వెతికి ఒకచోట వ్రాయండి. ఎందుకంటే హదీథ్ వేత్తల మరణం వలన కాలక్రమంలో ఆ గొప్ప జ్ఞానసంపదను పోగొట్టుకుంటామేమో అని భయపడుతున్నాను. (అల్ బుఖారి 1:27)
కాబట్టి ముస్లిం పండితులు సరైన హదీథ్ లను సేకరించి, పుస్తకాల రూపంలో వ్రాయటం ప్రారంభించారు. వాటిలో కొన్ని క్రింద పేర్కొనబడినవి.
ఈ షరతులను తయారు చేసిన మొదటి పండితుడు ఇమామ్ అల్ జొహ్రి. వీటిని పుస్తకరూపంలో వ్రాయకుండానే బోధించేవారు,
5. అల్రిసాలాప్రతి – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క హదీథ్ లను స్వీకరించటానికి ఇమామ్ షాఫయి కొన్ని హదీథ్ షరతులను వ్రాసినారు.
ఈ) 3వహజ్రీశతాబ్దం (800-900AD) నుండి 4వహిజ్రీశతాబ్దపుమధ్యకాలంహదీథ్లకుస్వర్ణయుగం
ఈ కాలం సరైన హదీథ్ లను ఒకచోట సేకరించటానికి మరియు హదీథ్ విజ్ఞాన గ్రంథాలు తయారుకావటానికి సాక్ష్యంగా నిలచినది. హదీథ్ విజ్ఞానశాస్త్రం అనేక విభాగాలుగా అభివద్ధి చెందినది. పురుష ఉల్లేఖకుల హదీథ్ లే ఉన్నటువంటి (అతి తక్కువ సంఖ్యలో మహిళా ఉల్లేఖకుల హదీథ్ ఉన్నటువంటి) పురుష హదీథ్ విజ్ఞానశాస్త్రం సమకూర్చారు. అందులో ఉల్లేఖకుల స్థితిగతులు, వారి రాజకీయ పూర్వరంగం, వ్యక్తిగత జీవితవిధానం మొదలైన అనేక విషయాలు చేర్చటం జరిగినది. ఎలాల్ అల్ తిర్మిథి అనే గ్రంథంలో ఇమామ్ తిర్మిథి హదీథ్ లకు సంబంధించిన వివిధ సమస్యలను వివరంగా చర్చించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అనేక హదీథ్ గ్రంథాలు ఈ కాలంలోనే వ్రాయబడినాయి. అవి ఈనాటికీ అందరికీ అందుబాటులో ఉన్నాయి. వాటిలో
ü కొన్ని కేవలం విశ్వసనీయమైన(సహీహ్) హదీథ్ లు మాత్రమే ఉన్న గ్రంథాలున్నాయి,
ü ఇంకొన్ని విశ్వసనీయమైన మరియు స్వీకరించగలిగే అర్హతలు గల హదీథ్ లున్న గ్రంథాలున్నాయి,
ü మరికొన్ని విశ్వసనీయమైన, స్వీకరించగలిగే అర్హతలు గల మరియు బలహీనమైన ఆధారాల హదీథ్ లున్న గ్రంథాలు కూడా ఉన్నాయి, వీటికి ఉదాహరణ –
& సహీహ్ బుఖారీ (విశ్వసనీయమైనది హదీథ్ లు మాత్రమే ఉన్న గ్రంథం-Only Authentic hadith)
& సహీహ్ ముస్లిం (విశ్వసనీయమైన హదీథ్ లు మాత్రమే ఉన్న గ్రంథం-Only Authentic hadith)
& సునన్ దావూద్ (విశ్వసనీయమైన, స్వీకరించగలిగే అర్హతలు గల మరియు బలహీనమైన ఆధారాల హదీథ్ లు కలసి ఉన్న గ్రంథం – mix of Authentic ,Acceptable and weak hadith)
& సునన్ అల్ తిర్మిథి (విశ్వసనీయమైన, స్వీకరించగలిగే అర్హతలు గల మరియు బలహీనమైన ఆధారాల హదీథ్ లు కలసి ఉన్న గ్రంథం – mix of Authentic ,Acceptable and weak hadith)
& సునన్ అన్ నిసాయి (విశ్వసనీయమైన, స్వీకరించగలిగే అర్హతలు గల మరియు బలహీనమైన ఆధారాల హదీథ్ లు కలసి ఉన్న గ్రంథం – mix of Authentic ,Acceptable and weak hadith)
& సునన్ ఇబ్నె మాజా (విశ్వసనీయమైన, స్వీకరించగలిగే అర్హతలు గల మరియు బలహీనమైన ఆధారాల హదీథ్ లు కలసి ఉన్న గ్రంథం – mix of Authentic ,Acceptable and weak hadith)
ఇంకా అనేక హదీథ్ గ్రంథాలు మరియు హదీథ్ విజ్ఞానశాస్త్ర గ్రంథాలు ఈ కాలంలోనూ, తర్వాత కాలాల్లోనూ వ్రాయబడినాయి. కాని కేవలం ఈ కాలంలో వ్రాయబడిన హదీథ్ గ్రంథాలు మాత్రమే విశ్వసనీయమైనవిగా (authentic) ప్రత్యేక గుర్తింపు పొందాయి.
ఈకాలంలో హదీథ్ విద్య మరియు హదీథ్ సైన్స్ (విజ్ఞానశాస్త్ర) గ్రంథాలు పూర్తిగా ప్రపంచం మొత్తం వ్యాపించాయి. ఇస్లాం లో వాటి విషయ ప్రాముఖ్యతను బట్టి వివిధ అధ్యాయాలుగా (అంటే ఖుర్ఆన్ అవతరణ, విశ్వాసం, నమాజులు, దానం, ఉపవాసం, హజ్, లావాదేవీలు, ఇతర వ్యవహారాలు, శిక్షలు, జుర్మానాలు,మొదలైనవి) సమకూర్చ బడినాయి. ఇంకా వీటి సారాంశాన్ని మరియు వివరణను ఇతర పండితులు వేర్వేరు గ్రంథాలుగా తయారుచేశారు. ఉదాహరణకు –
& హదీథ్ విజ్ఞాన శాస్త్రాలు(వివరణ) – ఇమామ్ అల్ సియూతి
911 హిజ్రీ (1534 AD)
హదీథ్రకాలు
విశ్వసనీయతను బట్టి మూడు రకాలైన హదీథ్ లు ఉన్నాయి.
1. సహీహ్ హదీథ్ లు (పూర్తిగా విశ్వసించదగినవి – Authentic)
హదీథ్ ను రికార్డు చేసిన మొదటి ఉల్లేఖకుడి (అల్ బుఖారి లేక ముస్లిం) నుండి చిట్టచివరి ఉల్లేఖకుడి వరకు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వరకు ఒకరి నుండి మరొకరి మధ్య, ఉల్లేఖకుల వరుసక్రమంలో ఎటువంటి అంతరాయం (బ్రేక్) లేకుండా ఉన్న హదీథ్ లు. ఇంకా ఈ హదీథ్ లన్నీ పూర్తిగా నమ్మదగిన మరియు యోగ్యులైన ఉల్లేఖకులు తెలిపినవే.
2. హసన్ హదీథ్ లు (స్వీకారయోగ్యమైన హదీథ్ లు – Acceptable)
హదీథ్ ను రికార్డు చేసిన మొదటి ఉల్లేఖకుడి (అల్ తిర్మథి) నుండి చిట్టచివరి ఉల్లేఖకుడి వరకు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వరకు ఒకరి నుండి మరొకరి మధ్య, ఉల్లేఖకుల వరుసక్రమంలో ఎటువంటి అంతరాయం (బ్రేక్) లేకుండా ఉన్న హదీథ్ లు. వీటిని ఉల్లేఖించిన వారు కూడా పూర్తిగా నమ్మకమైనవారే కాని తక్కువ యోగ్యులు.
బలహీనమైన హదీథ్ లు(స్వీకరింపలేనివి లేక తిరస్కరింపబడినవి)
సమస్యలున్న మరియు ఉల్లేఖకుల వరుసక్రమంలో అంతరాయం (మధ్యలో ఒకరు లేక ఒకరి కన్నా ఎక్కువ ఉల్లేఖకుల పేర్లు తప్పిపోవటం) ఉన్న హదీథ్ లు. ఒకరు లేక ఒకరి కన్నా ఎక్కువ ఉల్లేఖకులు నమ్మకమైనవారు కాకపోవటం అంటే వయస్సు భారం వలన ఆలోచనాశక్తి తగ్గినవారు, రికార్డు చేసిన వ్రాతప్రతులు పోగొట్టుకున్నవారు, అసత్యవంతులుగా ప్రసిద్ధి చెందిన వారు, అపరిచిత ఉల్లేఖకులు.
ప్రశ్నలు
01.ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) కాలంలోనే హదీథ్ లను రికార్డు (నమోదు) చేయటం మొదలైనదా?
02. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం హదీథ్ లను వ్రాయటానికి అనుమతిచ్చారా లేక నిషేధించారా అనే విషయాన్ని నిర్ణయించడానికి వీలుగా ముస్లిం పండితులు ప్రకటించిన కారణాలేవి?
03.ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం జీవితకాలంలోనే వ్రాయబడిన హదీథ్ ప్రతుల వివరాలు తెలుపండి.
04.మొదటి హిజ్రీ శతాబ్దంలో హదీథ్ ల నిజానిజాలు పరీక్షించటానిక ఏ పద్ధతులను అనుసరించారు?
05.మొదటి హిజ్రీ శతాబ్దంలో హదీథ్ లను ఎన్ని రకాలు గా విభజించారు?
06.రెండవ హిజ్రీ శతాబ్దంలో హదీథ్ ల ప్రాముఖ్యత ఏమిటి?
07.రెండవ హిజ్రీ శతాబ్దంలో వ్రాయబడిన హదీథ్ గ్రంథాలను పేర్కొనండి?
08.హదీథ్ సరైనదా కాదా అనే పరిశోధనలలో ప్రసిద్ధిచెందిన వారి పేర్లు?
09.హదీథ్ ఉల్లేఖనలను నిర్ధారించటానికి షరతులు కనిపెట్టిన మొదటి హదీథ్ వేత్త ఎవరు?
10.హదీథ్ లను స్వీకరించటానికి ఇమామ్ షాఫయి వ్రాసిన ప్రతి పేరు?
11.హదీథ్ లకు స్వర్ణయుగమని ప్రసిద్ధి చెందిన కాలమేది?
12.3వ హిజ్రీ శతాబ్దంలో వ్రాయబడిన ప్రఖ్యాత 6 హదీథ్ గ్రంథాలేవి? అవి ఎటువంటి హదీథ్ లు కలిగి ఉన్న గ్రంథాలు?
13.ఏ హిజ్రీ శతాబ్దంలో వ్రాయబడిన హదీథ్ గ్రంథాలు విశ్వసనీయమైనవిగా (authentic) ప్రత్యేక గుర్తింపు పొందాయి?
14.హిజ్రీ 4వ శతాబ్దం తరువాత వచ్చిన ప్రఖ్యాత హదీథ్ గ్రంథాలేవి?
15.బుఖారీ & ముస్లిం హదీథ్ గ్రంథాలకు మరియు ఇతర హదీథ్ గ్రంథాలకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటి?
16.ఎన్నిరకాలైన హదీథ్ లున్నాయి? వివరంగా తెలుపండి.
17. రదియల్లాహు అన్ హు అంటే అర్థం ఏమిటి?ఎవరి పేరు వచ్చిన ఎడల దీనిని పలుక వలెను? మూడు ఉదాహరణలు ఇవ్వవలెను.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.