మంత్రజాలం (చేతబడి), జ్యోతిష్యంకు సంబంధించిన ఆదేశము – ఇమామ్ ఇబ్న్ బాజ్ [పుస్తకం]

మంత్రజాలం, జ్యోతిష్యం మరియు వాటికి సంబంధించిన వాటి ఆదేశము - షేఖ్ ఇబ్న్ బాజ్ పుస్తకం ముఖచిత్రం

రచయిత: షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్)
హరమైన్ షరీఫైన్ పుస్తకాలు (రిసాలతుల్ హరమైన్ – తొమ్మిదవ సందేశము) | 24 పేజీలు

పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ :
మంత్రజాలం, జ్యోతిష్యం మరియు వాటికి సంబంధించిన వాటి ఆదేశము – ఇమామ్ ఇబ్న్ బాజ్ [డౌన్లోడ్ PDF]

ప్రస్తుత కాలంలో మంత్రజాలం (చేతబడి) చేసేవారు, జ్యోతిష్కులు చాలా మంది కనబడుతున్నారు. వారు వైద్యం చేస్తున్నట్లు నటిస్తూ అజ్ఞానులైన ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సౌదీ అరేబియా మాజీ ముఫ్తీ షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్) రచించిన ఈ చిరుపుస్తకం, ఖుర్ఆన్ మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో చేతబడి, జ్యోతిష్యం మరియు వాటికి సంబంధించిన విషయాల ఇస్లామీయ ఆదేశాన్ని స్పష్టంగా వివరిస్తుంది. జ్యోతిష్కుల, మాంత్రికుల వద్దకు వెళ్ళటం, వారిని ప్రశ్నించటం, వారి మాటలను నమ్మటం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తూ, చేతబడి జరగక ముందు దాని నుండి రక్షణ పొందే మార్గాలను మరియు చేతబడి జరిగిన తరువాత షరీఅత్ సమ్మతమైన చికిత్సా పద్ధతులను కూడా ఈ పుస్తకం వివరిస్తుంది.

సంతోషకరమైన జీవితానికి ఉత్తమ మార్గాలు – ఇమామ్ అస్సఅదీ [పుస్తకం]

సంతోషకరమైన జీవితాన్ని అందించే ఉత్తమ మార్గాలు - ఇమామ్ అస్సఅదీ పుస్తకం ముఖచిత్రం

రచయిత: షేఖ్ అబ్దురహ్మాన్ బిన్ నాసిర్ అస్సఅదీ (రహిమహుల్లాహ్)
హరమైన్ షరీఫైన్ పుస్తకాలు

పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ :
సంతోషకరమైన జీవితాన్ని అందించే ఉత్తమ మార్గాలు – ఇమామ్ అస్ సాదీ [డౌన్లొడ్ PDF]

షేఖ్ అబ్దుర్ రహ్మాన్ బిన్ నాసిర్ అస్సఅదీ రచించిన సంతోషకరమైన జీవితానికి ఉత్తమ మార్గాలు అనే ఈ చిరుపుస్తకం నిజమైన సంతోషానికి దారి తీసే కారణాలను లోతైన ఈమాన్ దృష్టి కోణంతో పరిశీలిస్తున్నది. ఇది పాఠకుడిని దైవవిశ్వాసం, సత్కార్యాలు, అల్లాహ్ స్మరణ, సంతృప్తి, అనుగ్రహాలపై అల్లాహ్ కు కృతజ్ఞతలు, దయ, అల్లాహ్‌ పై ఆధారపడటం, సహనం మొదలైన విషయాల అర్థాన్ని గ్రహించడం ద్వారా మానసిక ప్రశాంతత వైపు దారి చూపుతుంది. అందమైన శైలిలో, ఈ చిరుపుస్తకం జీవితంలో సవాళ్ళు, కష్టసుఖాలు, ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ ప్రశాంతమైన, సమతుల్యమైన, ఆనందకరమైన జీవితాన్ని గడిపేందుకు ఒక ఉత్తమమైన మార్గాన్ని మీ చేతుల్లో ఉంచుతున్నది.

రచయిత పరిచయం: షేఖ్ అబ్దుర్రహ్మాన్ బిన్ నాసిర్ బిన్ అబ్దుల్లాహ్ అస్సఅదీ (రహిమహుల్లాహ్) బనూ తమీమ్ తెగకు చెందినవారు. ఆయన హిజ్రీ 1307 ముహర్రం 12వ తేదీన (క్రీ.శ. 1889) సౌదీ అరేబియాలోని ఉనైజా పట్టణంలో జన్మించారు. పదకొండు సంవత్సరాల వయస్సు రాకముందే ఖుర్ఆన్ ను కంఠస్థం చేశారు. షేఖ్ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్-ఉసైమీన్ (రహిమహుల్లాహ్) వంటి గొప్ప పండితులు ఆయన శిష్యులు. ఆయన 40కి పైగా పుస్తకాలు రచించారు; వాటిలో ప్రసిద్ధ ఖుర్ఆన్ వ్యాఖ్యానం ‘తైసీర్ అల్-కరీమ్ అర్-రహ్మాన్‘ (తఫ్సీర్ అస్సఅదీ), ‘బహ్జతు ఖులూబిల్ అబ్రార్‘ మరియు ‘మిన్హాజుస్ సాలికీన్‘ ముఖ్యమైనవి. ఆయన హిజ్రీ 1376 జుమాదల్ ఆఖిరా 23వ తేదీన, 69 సంవత్సరాల వయస్సులో మరణించారు. అల్లాహ్ ఆయనను కరుణించుగాక. [మూలం: bakkah.net]

పాఠకులకు గమనిక: ఈ పోస్ట్‌లోని తెలుగు అనువాదాన్ని మేము అసలు అరబీ గ్రంథం «الوسائل المفيدة للحياة السعيدة» (రిసాలతుల్ హరమైన్ ప్రచురణ) తో పోల్చి సరిచూశాము. PDF లోని తెలుగు అనువాదంలో కనుగొన్న కొన్ని పొరపాట్లను ఈ పోస్ట్‌లో సరిదిద్దాము; సరిదిద్దిన భాగాలు ఈ నీలి రంగులో చూపబడ్డాయి. కాబట్టి, PDF కంటే ఈ పోస్ట్‌లోని పాఠాన్నే ప్రామాణికంగా పరిగణించవలసిందిగా మనవి.

విషయసూచిక

అజ్కార్ మరియు రుఖ్యా [పుస్తకం]

అజ్కార్ మరియు రుఖయా [పుస్తకం]

ఉదయం సాయంత్రం అజ్కార్, నమాజు తరువాత దుఆలు, నిద్రపోయే ముందు ప్రార్థనలు, రోజువారీ దుఆలు. సర్వరోగ నివారిణి ‘రుఖ్యా’ – దిష్టి, అసూయ, జిన్నులు, షైతానులు, చేతబడి వాటి నుంచి తిరుగులేని రక్షణ

[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[50 పేజీలు] [PDF]

శాంతిమార్గం పబ్లికేషన్స్, హైదరాబాద్.

  • అజ్కార్ అంటే ఏమిటి? ఎందుకు పఠించాలి?
  • ఉదయం సాయంత్రం అజ్కార్
  • ప్రతి ఫర్జ్ నమాజ్ తరువాత అజ్కార్
  • దైనందిన అజ్కార్
  • నిద్రపోయే ముందు అజ్కార్
  • అసూయ, దిష్టి చికిత్స కొరకు సంక్షిప్త రుఖ్యా
  • ఇబ్బంది పెట్టే జిన్నులను పారదోలే విధానం
  • జిన్న్, చేతబడి చికిత్సకు పూర్తి రుఖ్యా
  • అదనపు చికిత్స
  • దుష్టశక్తులను స్వయంగా ఎదుర్కోండి

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు విధానము – ఇమాం ఇబ్నె బాజ్ [పుస్తకం]

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు విధానము - షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ [పుస్తకం]

Prophet's Prayer - Imam Ibn Baz

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు విధానము
షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్)
[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [28 పేజీలు]