చీకట్లలో మస్జిదులకు నడిచి వెళ్ళే వారికి ప్రళయ దినాన సంపూర్ణ వెలుగు లభిస్తుందనే శుభవార్తను అందించండి

1058. హజ్రత్ బురైదా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :

చీకట్లలో మస్జిదులకు నడిచి వెళ్ళే వారికి ప్రళయ దినాన సంపూర్ణ వెలుగు లభిస్తుందనే శుభవార్తను అందించండి.

[సుననె అబూదావూద్ లోని నమాజు ప్రకరణం – సుననె తిర్మిజీ లోని నమాజ్ అధ్యాయాలు]

ముఖ్యాంశాలు :

చీకట్లలో మస్జిదులకు వెళ్ళటమంటే ఫజ్ర్ మరియు ఇషాకు సంబందించిన సామూహిక నమాజులకు హాజరు కావటం అని భావం. నేటి ఆధునిక యుగంలో నగరవీధులు కాంతివంతమైన విద్యుద్దీపాలతో ఎంతగా వెలిగి పోయినా, చీకటి వల్ల కలిగే భయాందోళనలను ఎవరూ తొలగించలేరని గ్రహించాలి. అందుకే ఫజ్ర్ మరియు ఇషా నమాజులు నేటికీ చీకట్లో చేయబడే నమాజులగానే పరిగణించ బడతాయి. వాటిని నెరవేర్చే అదృష్టవంతులకు ప్రళయదినాన అల్లాహ్ తరుఫు నుండి పరిపూర్ణమైన వెలుగు లభిస్తుందనే శుభవార్త ఇవ్వబడినది.

189 వ అధ్యాయం – మస్జిదులకు కాలి నడకన వెళ్ళటం – హదీసు కిరణాలు (రియాజుస్సాలిహీన్) – సంకలనం : ఇమామ్ నవవీ (రహ్మతుల్లా అలై)

http://wp.me/p2lYyT-fA

Related Links:

 

ఆపద ప్రారంభంలో వహించే సహనమే సహనం

533. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

ఓ రోజు ఒక స్త్రీ సమాధి మీద కూర్చొని ఏడుస్తుంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అటుగా పోవడం జరిగింది. అపుడు ఆయన ఆ స్త్రీని చూసి “అల్లాహ్ కి భయపడి కాస్త సహనం వహించు” అని అన్నారు. దానికి ఆ స్త్రీ (ముఖం చిట్లించుకుంటూ) “మీ దారిన మీరు వెళ్ళండి, నన్ను నా మానాన వదిలెయ్యండి. నా మీద వచ్చిపడిన ఆపద మీ మీద రాలేదు. అందువల్ల మీరు (నా) బాధను అర్ధం చేసుకోలేరు” అని అన్నది.

తరువాత (కొందరు) ఆ స్త్రీకి ‘ఆయనగారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)’ అని తెలియజేశారు. అది విని ఆమె (పరుగుపరుగున) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటికి వెళ్ళింది. చూస్తే ఆయన వాకిలి ముందు ఒక్క ద్వారపాలకుడు కూడా లేడు. సరే, ఆ మహిళ [దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను కలుసుకొని] “నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను (క్షమించండి)” అని అన్నది. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఆపద ప్రారంభంలో వహించే సహనమే (అసలు) సహనం”(*) అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం – జనాయేజ్, 32 వ అధ్యాయం – జియారతుల్ ఖుబూర్]

(*) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచానానికి భావం ఏమిటంటే – నీ వన్న మాటలకు నువ్వు క్షమాపణ చెప్పుకోనవసరం లేదు. నేను స్వవిషయం గురించి ఎవరి మీద కోపగించుకోను. నా ఇష్టాఇష్టాలన్నీ ధైవప్రసన్నత కోసమే పరిమితం. కాకపోతే నువ్వు కష్ట సమయంలో సహనం వహించకుండా ఏడ్పులు పెడబొబ్బలు పెట్టి నీకు దక్కే పుణ్యాన్ని పోగొట్టుకున్నావు. ఇది నీ పొరపాటు. నా విషయంలో నీవు చేసిన పొరపాటు క్షమించబడింది. కాని ధైవధర్మం విషయంలోనే నీవు పొరబడ్డావు. ఆపద ప్రారభంలో సహనం వహించి ఉంటే పుణ్యం లభించి ఉండేది. నువ్వలా చేయలేకపోయావు.

జనాయెజ్ ప్రకరణం : 8 వ అధ్యాయం – ఆపద ప్రారంభంలో వహించే సహనమే సహనం. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

రోజుకో హదీసు మీ ఈమెయిలు లో చదవండి

ప్రియమైన సోదర సోదరీ మణు లారా , అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

రోజుకో హదీసు మీ ఈమెయిలు లో చదవటానికి , నేను ఒక కొత్త బ్లాగ్ ను ఏర్పరచాను.
దాని అడ్రస్ :  http://TeluguDailyHadith.Wordpress.com
మీరు ఇష్టపడితే పై బ్లాగ్ ను సందర్శించి subscribe చేసుకోండి.
(Check at the end of the blog page to subscribe)

ఇంకొక పద్దతి :[Google Group] కి వెళ్లి జాయిన్ అవ్వండి.

మీకు  కష్టం అనిపిస్తే ,  నన్ను ఇక్కడ సంప్రదించండి (http://telugudailyhadith.wordpress.com/contact-us/), నేను మిమ్మల్ని జాయిన్ చేస్తాను.

బారకల్లాహ్ ఫీకుం
అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు
అబ్దుర్రహ్మాన్ మేడా @ teluguislam.net

Qur’an 56. Soorah al-Waaqi'ah – Telugu Subtitles [video]

Qur’an 56. Soorah al-Waaqi’ah – Telugu Subtitles

56  సూరహ్ అల్ వాఖి’అహ్

అనంత కరుణామయుడు అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో
1. *ఆ అనివార్య సంఘటన సంభవించినపుడు,
2. అది సంభవించటంలో ఎలాంటి సందేహం (అసత్యం) లేదు.
3. అది కొందరిని హీనపరుస్తుంది, మరికొందరిని పైకెత్తుతుంది.
4. భూమి తీవ్రకంపనంతో కంపించి నప్పుడు;
5. మరియు పర్వతాలు పొడిగా మార్చబడినప్పుడు;
6. అప్పుడు వాటి దుమ్ము నలువైపులా నిండిపోయినప్పుడు;
7. మరియు మీరు మూడు వర్గాలుగా విభజించబడతారు.
8. ఇక కుడిపక్షం వారు, ఆ కుడిపక్షము వారు ఎంత (అదృష్టవంతులు)!
9 . మరికొందరు వామపక్షం వారుంటారు, ఆ వామపక్షపు వారు ఎంత (దౌర్భాగ్యులు)!
10. మరియు (ఇహలోకంలో విశ్వాసంలో) ముందున్న వారు (స్వర్గంలో కూడా) ముందుంటారు.
11. అలాంటి వారు (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందుతారు.
12. వారు సర్వసుఖాలు గల స్వర్గవనాలలో ఉంటారు.
13. మొదటి తరాల వారిలో నుండి చాలామంది;
14. మరియు తరువాత తరాల వారిలో నుండి కొంతమంది.
15. (బంగారు) జలతారు అల్లిన ఆసనాల మీద;
16. ఒకరికొకరు ఎదురెదురుగా, వాటి మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు.
17. వారిచుట్టు ప్రక్కలలో చిరంజీవులైన (నిత్య బాల్యం) గల బాలురు (సేవకులు) తిరుగుతూ ఉంటారు.
18. (మధువు) ప్రవహించే చెలమల నుండి నింపిన పాత్రలు, గిన్నెలు మరియు కప్పులతో!
19. దాని వలన వారికి తలనొప్పి గానీ లేక మత్తు గానీ కలుగదు.
20. మరియు వారుకోరే పండ్లూ, ఫలాలు ఉంటాయి.
21. మరియు వారు ఇష్టపడే పక్షుల మాంసం.
22. మరియు అందమైన కన్నులు గల సుందరాంగులు (హూరున్);
23. దాచబడిన ముత్యాలవలే!
24. ఇదంతా వారు చేస్తూ ఉండిన వాటికి (సత్కార్యాలకు) ప్రతిఫలంగా!
25. అందులో వారు వ్యర్ధమైన మాటలు గానీ, పాప విషయాలు గానీ వినరు.
26. “శాంతి (సలాం) శాంతి (సలాం)!” అనే మాటలు తప్ప!
27. మరియు కుడిపక్షం వారు, ఆ కుడిపక్షము వారు ఎంత (అదృష్టవంతులు)!
28. వారు ముళ్ళు లేని సిద్ ర వృక్షాల మధ్య!
29. మరియు పండ్లగెలలతో నిండిన అరటిచెట్లు,
30. మరియు వ్యాపించి ఉన్న నీడలు,
31. మరియు ఎల్లప్పుడు ప్రవహించే నీరు,
32. మరియు సమృద్ధిగా ఉన్న పండ్లు ఫలాలు,
33. ఎడతెగ కుండా మరియు అంతం కాకుండా (ఉండే వనాలలో);
34. మరియు ఎత్తైన ఆసనాల మీద (కూర్చొని ఉంటారు).
35. నిశ్చయంగా, మేము వారిని ప్రత్యేక సృష్టిగా సృష్టించాము;
36. మరియు వారిని (నిర్మలమైన) కన్యలుగా చేశాము;
37. వారు ప్రేమించే వారుగానూ, సమ వయస్సుగల వారుగానూ (ఉంటారు);
38. కుడిపక్షం వారి కొరకు.
39. అందులో చాలా మంది మొదటి తరాలకు చెందిన వారుంటారు;
40. మరియు తరువాత తరాల వారిలో నుండి కూడా చాలా మంది ఉంటారు.
41. ఇక వామ (ఎడమ) పక్షం వారు; ఆ వామపక్షం వారు ఎంత (దౌర్భాగ్యులు)?
42. వారు దహించే నరకాగ్నిలో మరియు సలసల కాగే నీటిలో;
43. మరియు నల్లటి పొగ ఛాయలో (ఉంటారు).
44. అది చల్లగానూ ఉండదు మరియు ఓదార్చేదిగానూ ఉండదు;
45. నిశ్చయంగా వారు ఇంతకు ముందు చాలా భోగభాగ్యాలలో పడిఉండిరి;
46. మరియు వారు మూర్ఖపు పట్టుతో ఘోరమైన పాపాలలో పడిఉండిరి;
47. మరియు వారు ఇలా అనేవారు: “ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మరల బ్రతికించి లేపబడతామా?
48. “మరియు పూర్వీకులైన మా తాత ముత్తాతలు కూడానా?”
49. వారితో ఇలా అను: “నిశ్చయంగా, పూర్వీకులు మరియు తరువాత వారు కూడాను!
50. “వారందరూ ఆ నిర్ణీతరోజు, ఆ సమయమున సమావేశపరచబడతారు.
51. “ఇక నిశ్చయంగా మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా!
52. “మీరు ‘జుఖ్ఖూమ్ చెట్టును (ఫలాలను) తింటారు.
53. “దానితో కడుపులు నింపుకుంటారు.
54. “తరువాత, దానిమీద సలసల కాగే నీరు త్రాగుతారు.
55. “వాస్తవానికి మీరు దానిని దప్పిక గొన్న ఒంటెలవలే త్రాగుతారు.”
56. తీర్పుదినం నాడు (ఈ వామపక్షం) వారికి లభించే ఆతిధ్యం ఇదే!
57. మిమ్మల్ని మేమే సృష్టించాము; అయితే మీరెందుకు ఇది సత్యమని నమ్మరు?
58. ఏమీ? మీరెప్పుడైనా, మీరు విసర్జించే వీర్యబిందువును గమనించారా?
59. ఏమీ? మీరా, దానిని సృష్టించే వారు? లేక మేమా దాని సృష్టికర్తలము?
60. మేమే మీ కోసం మరణం నిర్ణయించాం మరియు మమ్మల్ని అధిగమించేది ఏదీ లేదు;
61. మీ రూపాలను మార్చివేసి మీరు ఎరుగని (ఇతర రూపంలో) మిమ్మల్ని సృష్టించటం నుండి.
62. మరియు వాస్తవానికి మీ మొదటి సృష్టిని గురించి మీరు తెలుసుకున్నారు, అయితే మీరెందుకు గుణపాఠం నేర్చుకోరు?
63. మీరు నాటే, విత్తనాలను గురించి, మీరెప్పుడైనా ఆలోచించారా?
64. మీరా వాటిని పండించేది? లేక మేమా వాటిని పండించేవారము?
65. మేము తలచుకుంటే, దానిని పొట్టుగా మార్చివేయగలము, అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడిపోతారు.
66. (మీరు అనేవారు): “నిశ్చయంగా, మేము పాడైపోయాము!
67. “కాదుకాదు, మేము దరిద్రుల మయ్యాము!” అని.
68. ఏమీ? మీరు ఎప్పుడైనా మీరు త్రాగే నీటిని గురించి ఆలోచించారా?
69. మీరా దానిని మేఘాల నుండి కురిపించే వారు? లేక మేమా దానిని కురిపించే వారము?
70. మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పుగా ఉండేలా చేసేవారము! అయినా మీరెందుకు కృతజ్ఞత చూపరు?
71. మీరు రాజేసే అగ్నిని గమనించారా?
72. దాని వృక్షాన్ని పుట్టించినవారు మీరా? లేక దానిని ఉత్పత్తి చేసినది మేమా?
73. మేము దానిని (నరకాగ్నిని), గుర్తు చేసేదిగా మరియు ప్రయాణీకులకు (అవసరం గలవారికి) ప్రయోజనకారిగా చేశాము.
74. కావున సర్వోత్తముడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు.
75. * ఇక నేను నక్షత్రాల స్థానాల (కక్ష్యల) సాక్షిగా చెబుతున్నాను.
76. మరియు నిశ్చయంగా, మీరు గమనించగలిగితే, ఈ శపథం ఎంతో గొప్పది!
77. నిశ్చయంగా ఈ ఖుర్ఆన్ దివ్యమైనది.
78. సురక్షితమైన గ్రంధంలో ఉన్నది.
79. దానిని పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు.
80. ఇది సర్వలోకాల ప్రభువు తరుఫు నుండి అవతరింపజేయబడింది.
81. ఏమీ? మీరు ఈ సందేశాన్ని తేలికగా తీసుకుంటున్నారా?
82. మరియు (అల్లాహ్) మీకు ప్రసాదిస్తున్న జీవనోపాధికి (కృతజ్ఞతలు) చూపక, వాస్తవానికి ఆయనకు మీరు తిరస్కరిస్తున్నారా?
83. అయితే (చనిపోయేవాడి) ప్రాణం గొంతులోనికి వచ్చినపుడు, మీరెందుకు (ఆపలేరు)?
84. మరియు అప్పుడు మీరు (ఏమీ చేయలేక) చూస్తూ ఉండిపోతారు.
85. మరియు అప్పుడు, మేము అతనికి మీకంటే చాలా దగ్గరలో ఉంటాము, కాని మీరు చూడలేక పోతారు.
86. ఒకవేళ మీరు ఎవరి అదుపాజ్ఞలో (అధీనంలో) లేరనుకుంటే,
87. మీరు సత్యవంతులే అయితే దానిని (ఆ ప్రాణాన్ని) ఎందుకు తిరిగి రప్పించుకోలేరు?
88. కాని అతడు (మరణించే వాడు), (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందినవాడైతే!
89. అతని కొరకు సుఖసంతోషాలు మరియు తృప్తి మరియు పరమానంద కరమైన స్వర్గవనం ఉంటాయి.
90. మరియు ఎవడైతే కుడిపక్షం వారికి చెందిన వాడో!
91. అతనితో: “నీకు శాంతి కలుగుగాక (సలాం)! నీవు కుడిపక్షం వారిలో చేరావు.” (అని అనబడుతుంది).
92. మరియు ఎవడైతే, అసత్యవాదులు, మార్గభ్రష్టులైన వారిలో చేరుతాడో!
93. అతని ఆతిధ్యానికి సలసల కాగే నీరు ఉంటుంది.
94. మరియు భగభగమండే నరకాగ్ని ఉంటుంది.
95. నిశ్చయంగా, ఇది రూడీ అయిన నమ్మదగిన సత్యం!
96. కావున సర్వోత్తముడైన నీ ప్రభువు పేరును స్తుతించు.

Telugu Translation Source: దివ్య ఖురాన్ సందేశం

Qur'an Surah 78. An-Naba – Telugu Subtitles [video]

Qur’an Surah 78.An-Naba – Telugu Subtitles

78 సూరహ్ అన్-నబా
అనంత కరుణామయుడు అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో
1. (*) ఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు?
2. ఆ మహా వార్తను గురించేనా?
3. దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారో!
4. అదికాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.
5. ఎంత మాత్రము కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.
6. ఏమీ? మేము భూమిని పరుపుగా చేయలేదా?
7. మరియు పర్వతాలను మేకులుగా?
8. మరియు మేము మిమ్మల్ని (స్త్రీ , పురుషుల) జంటలుగా సృష్టించాము.
9. మరియు మేము నిద్రను, మీకు విశ్రాంతి నిచ్చేదిగా చేశాము.
10. మరియు రాత్రిని ఆచ్చాదంగా చేశాము.
11. మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము.
12. మరియు మేము మీపైన పటిష్ఠమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము.
13. మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము.
14. మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము.
15. దానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లుచేమలను) పెరిగించటానికి!
16. మరియు దట్టమైన తోటలను.
17. నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం.
18. ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచివస్తారు.
19. మరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి;
20. మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమైపోతాయి.
21. నిశ్చయంగా, నరకం ఒక మాటు;
22. ధిక్కారుల గమ్యస్థానం;
23. అందులో వారు యుగాలతరబడి ఉంటారు.
24. అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవిచూడరు.
25. సలసల కాగే నీరు మరియు చీములాంటి మురికి (పానీయం) తప్ప!
26. (వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా!
27. వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు.
28. పైగా వారు మా సూచన (ఆయాత్) లను అసత్యాలని తిరస్కరించారు.
29. మరియు మేము (వారు చేసిన) ప్రతి దానిని ఒక పుస్తకంలో వ్రాసిపెట్టాము.
30. కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవిచూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము.
31. నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది;
32. ఉద్యానవనాలూ, ద్రాక్షతోటలూ!
33. మరియు ఈడూజోడూ గల (యవ్వన) సుందరకన్యలు;
34. మరియు నిండి పొర్లే (మధు) పాత్ర.
35. అందులో (స్వర్గంలో) వారు ఎలాంటి వ్యర్ధపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు.
36. (ఇదంతా) నీ ప్రభువు తరుఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం.
37. భూమ్యాకాశాలు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువైన  అనంత కరుణామయుని (బహుమానం); ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవ్వరికీ లేదు.
38. ఏ రోజునయితే ఆత్మ (జిబ్రీల్) మరియు దేవదూతలు వరుసలలో నిలిచిఉంటారో! అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించిన వాడు తప్ప, మరెవ్వరూ మాట్లాడలేరు; ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు.
39. అదే అంతిమ సత్యదినం. కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి!
40. నిశ్చయంగా, మేము అతి సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతిమనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు. మరియు సత్యతిరస్కారి: “అయ్యో, నా పాడుగానూ! నేను మట్టినయి ఉంటే ఎంత బాగుండేది!” అని వాపోతాడు.

Telugu Translation Source: దివ్య ఖురాన్ సందేశం

హిస్నుల్ ముస్లిం

బిస్మిల్లాహ్
అరబ్బీ మూలం: సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తాని
(Written by (Arabic) : Sayeed Bin Ali Bin Wahaf Al Qahtani)

అనువాదం: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ

ఇక్కడ పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [PDF] [178పేజీలు]

దుఆ సూచిక

ముందు మాట
జిక్ర్‌ (అల్లాహ్‌ స్మరణ) యొక్క విశిష్టత

 1. నిద్ర నుండి మేల్మొన్న తర్వాత దుఆలు
 2. వస్త్రాలు ధరించునపుడు చేయు దుఆ
 3. నూతన వస్త్రాలు ధరించునపుడు చేయు దుఆ
 4. నూతన వస్త్రాలు ధరించేవారి కోసం చేయు దుఆ…
 5. వస్త్రాలు విప్పునపుడు ఏమనాలి?
 6. మరుగు దొడ్డిలోనికి ప్రవేశించే ముందు పఠించు దుఆ
 7. మరుగు దొడ్డి నుండి వెలుపలికి వచ్చినతరువాత పఠించు దుఆ
 8. వుజూ చేయుటకు ముందు పఠించు దుఆ
 9. వుజూ పూర్తి చేసిన తరువాత పఠించు దుఆలు
 10. ఇంటి నుండి బయలుదేరునపుడు పఠించు దుఆ
 11. ఇంటి లోనికి ప్రవేశించునపుడు పఠించు దుఆ
 12. మస్జిద్  వైపుకు బయలుదేరునపుడు పఠించు దుఆ
 13. మస్జిద్ లోనికి ప్రవేశించునపుడు పఠించు దుఆ
 14. మస్జిద్ నుండి బయటకు పోవునపుడు పఠించు దుఆ
 15. అదాన్‌ కు సంబంధించిన దుఆలు
 16. నమాజు ప్రారంభమున పఠించు దుఆలు
 17. రుకూలో పఠించు దుఆలు
 18. రుకూ నుండి లేచునపుడు పఠించు దుఆలు
 19. సజ్దాలో పఠించు దుఆలు
 20. రెండు సజ్దాల మధ్య జల్సాలో పఠించు దుఆలు
 21. సజ్దాయె తిలావత్‌ (ఖుర్‌ఆన్‌ చదువునపుడు సజ్దా ఆయత్‌ తర్వాత చేసే సజ్దాలో) దుఆలు
 22. తషహ్హుద్‌
 23. తషహ్హుద్‌ తర్వాత నబీ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్‌
 24. అంతిమ తషహ్హుద్‌ తర్వాత మరియు సలామ్‌కు ముందు చదివే దుఆలు
 25. నమాజు ముగించిన తర్వాతి దుఆలు
 26. ఇస్తెఖారహ్‌ (అల్లాహ్‌ తరపు నుండి ఉత్తమ నిర్ణయాన్ని ఆశిస్తూ చేసే) నమాజు యొక్క దుఆ
 27. ఉదయం మరియు సాయంకాలాలయందు అల్లాహ్‌ ధ్యానంలో చదివే దుఆలు
 28. నిద్రకు ఉపక్రమించినపుడు పఠించు దుఆలు
 29. రాత్రి పక్క మరల్చినపుడు పఠించు దుఆ
 30. నిద్రలో అసహనము మరియు భయము వంటిది కలిగినపుడు పఠించు దుఆ
 31. మంచి లేదా చెడు కలలు వచ్చినప్పుడు ఏమి చేయాలి? 
 32. ఖునూత్‌ విత్ర్ దుఆ
 33. విత్ర్‌ నమాజ్‌ ముగించిన తర్వాత పఠించు దుఆలు
 34. దుఃఖము మరియు విచారకర సమయంలో పఠించు దుఆ
 35. ఆపద సమయములో పఠించు దుఆ
 36. శత్రువు మరియు అధికారము గల వ్యక్తి ఎదురైనపుడు పఠించు దుఆ
 37. రాజు యొక్క దౌర్జన్యము వలన భయపడే వ్యక్తి పఠించు దుఆ
 38. శత్రువును శపించుటకు చేయు దుఆ
 39. ప్రజల వలన భయము కలిగినపుడు ఏమి అనాలి?
 40. తన విశ్వాస విషయంలో సందేహం కలిగిన వ్యక్తి యొక్క దుఆ
 41. అప్పు తీర్చుట కొరకు దుఆ
 42. నమాజులో మరియు ఖుర్‌ఆన్‌ పఠనములో కలతలు రేకెత్తినపుడు చేయు దుఆ
 43. కఠినతర కార్యము ఎదురైన వ్యక్తి చేయు దుఆ
 44. ఎవరి వలనైనా పాపకార్యము జరిగితే అతను ఏమనాలి మరియు ఏమి చేయాలి?
 45. షైతాను మరియు అతని దుష్ట ప్రేరేపణలు దూరం చేయడానికి పఠించు దుఆ
 46. అభీష్టానికి భిన్నంగా ఏదైనా జరిగినప్పుడు లేదా పనులు తన ఆధీనం తప్పినప్పుడు పఠించు దుఆ.
 47. సంతానము కలిగిన వారిని అభినందిచు విధానము మరియు దాని జవాబు
 48. పిల్లల కొరకు అల్లాహ్‌ రక్షణ కోరు విధానం
 49. వ్యాధిగ్రస్తుణ్ణి పరామర్శించునపుడు చేయు దుఆ
 50. వ్యాధిగ్రస్తులను పరామర్శించుటలో గల విశిష్టత
 51. జీవితంపై ఆశ వదులుకున్న రోగి చేయు దుఆ
 52. మరణావస్థలో ఉన్న వ్యక్తికి చేయవలసిన సద్బోధ
 53. ఆపద సంభవించిన వ్యక్తి యొక్క దుఆ
 54. చనిపోయిన వ్యక్తి కళ్ళు మూయునపుడు పఠించు దుఆ
 55. జనాజా నమాజులో మృతుని కొరకు చేయు దుఆలు
 56. పిల్లల జనాజా నమాజులో చదివే దుఆ
 57. మృతుని కుటుంబీకులను పరామర్శించునపుడు చేయు దుఆ
 58. శవాన్ని సమాధిలో దించునపుడు పఠించు దుఆ
 59. శవాన్ని పూడ్చిన తర్వాత పఠించు దుఆ
 60. సమాధులను సందర్శ్భించినపుడు పఠించు దుఆ
 61. తూఫాను, పెనుగాలులు వీచునపుడు చేయు దుఆ
 62. మేఘాలు గర్జించునపుడు చేయు దుఆ
 63. వర్షం పడాలని కోరుతూ చేయు దుఆలు
 64. వర్షము కురియునపుడు చేయు దుఆ
 65. వర్షము కురిసిన తర్వాత చేయు దుఆ
 66. ఆకాశం నిర్మలం అయ్యేందుకు చేయు దుఆ
 67. నెలవంకను చూచునపుడు చేయు దుఆ
 68. ఉపవాసి ఇఫ్తార్‌ చేయునపుడు పఠించు దుఆ
 69. భోజనము చేయుటకు ముందు పఠించు దుఆ
 70. భోజనము ముగించిన పిదప పఠించు దుఆ
 71. ఆతిథ్యం చేసిన వారికొరకు అతిథి చేయు దుఆ
 72. ఏదైనా పానీయం త్రాగించిన లేదా త్రాగించడానికి సంకల్పించిన వారికొరకు చేయు దుఆ
 73. ఎవరి ఇంటిలోనైనా ఇఫ్తార్‌ చేసినచో పఠించు దుఆ
 74. భోజనము హాజరుపరచబడినపుడు, ఉపవాసి తన ఉపవాసము భంగపరచకుండా ఉండి చేయు దుఆ 
 75. ఎవరైనా తనను తిట్టినపుడు ఉపవాసి ఏమనాలి?
 76. క్రొత్త లేదా అప్పుడే చిగురించిన ఫలాలను చూచినపుడు పఠించు దుఆ
 77. తుమ్మినపుడు చేయు దుఆలు
 78. అవిశ్వాసి తుమ్మినపుడు అల్లాహ్‌ను స్తుతించినచో ఏమని పలకాలి?
 79. పెళ్ళి తర్వాత వరుని కొరకు చేయు దుఆ
 80. పెళ్ళి తర్వాత వరుడు చేయు దుఆ, అలాగే ఎవరైనా జంతువు కొనుగోలు చేసిన తరువాత చేయు దుఆ
 81. భార్యతో సంభోగించడానికి ముందు చేయు దుఆ
 82. కోపం చల్లారడానికి పఠించు దుఆ
 83. ఆపదలో ఉన్న వ్యక్తిని చూచి పఠించు దుఆ
 84. సభలో కూర్చున్నపుడు ఏమి పఠించాలి?
 85. సభ ముగించునపుడు, పాప పరిహారము కొరకు పఠించు దుఆ
 86. “అల్లాహ్‌ మిమ్మల్ని క్షమించు గాక” అని అన్నవారి కొరకు దుఆ
 87. మీకు మేలు చేసిన వారి కొరకు చేయు దుఆ
 88. దజ్జాల్‌ కీడు నుండి అల్లాహ్‌ రక్షణ పొందుటకు ఏమి చేయాలి?
 89. “నేను నిన్ను అల్లాహ్‌ (ప్రీతి) కొరకు ప్రేమిస్తున్నాను” అని అన్నవారి కొరకు చేయు దుఆ
 90. ఎవరైనా తమ ధనము, సంపద మీకు ఇవ్వచూపినట్లయితే వారి కొరకు చేయు దుఆ
 91. అప్పు తీర్చు సమయంలో, అప్పు ఇచ్చినవారి కొరకు చేయు దుఆ 
 92. షిర్క్‌ పనికి పాల్పడుతానేమో అనే భయంతో చేయు దుఆ
 93. “అల్లాహ్‌ మీకు శుభాలు ప్రసాదించు గాక” అని అన్నవారి కొరకు చేయు దుఆ
 94. శకునాలను అసహ్యించుకునే దుఆ
 95. సవారీ లేదా వాహనంపై కూర్చున్నపుడు పఠించు దుఆ
 96. ప్రయాణము మొదలు పెట్టినపుడు చేయు దుఆ
 97. ఏదైనా ఊరు లేదా పట్టణములోకి ప్రవేశించునపుడు చేయు దుఆ
 98. బజారులోకి ప్రవేశించునపుడు చేయు దుఆ
 99. సవారీ లేదా వాహనము పై నుండి పడిపోయినపుడు చేయు దుఆ
 100. స్టానికునికై ప్రయాణికుడు చేయు దుఆ
 101. ప్రయాణికునికై స్థానికుడు చేయు దుఆ
 102. ప్రయాణంలో “తక్బీర్ ” మరియు “తస్బీహ్” పఠించడం
 103. సూర్యోదయం వేళైనపుడు ప్రయాణికుడు చేయు దుఆ
 104. మజిలీ చేసినపుడు లేదా మధ్యలో ఆగినపుడు ప్రయాణికుడు చేయు దుఆ
 105. తిరుగు ప్రయాణంలో చేయు దుఆ
 106. ఏదైనా సంతోషకర వార్త లేదా అయిష్టకరమైన వార్త అందినపుడు ఏమనాలి?
 107. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్‌ పఠించు ఘనత
 108. సలామును వ్యాపింపజేయడం
 109. అవిశ్వాసి చేసిన సలాముకు ఎలా జవాబు పలకాలి?
 110. కోడి కూసినపుడు మరియు గాడిద అరచినపుడు చేయు దుఆలు
 111. రాత్రివేళ కుక్కలు అరచినపుడు చేయు దుఆ
 112. నీవు ఎవరినైనా తిట్టినట్లయితే, అతని కొరకు చేయు దుఆ
 113. ఒక ముస్లిమ్‌ ఇతర ముస్లిమును ఎలా పొగడాలి?
 114. ఒక ముస్లిమ్‌ తన పొగడ్త విని ఏమని పలకాలి?
 115. హజ్జ్‌ లేదా ఉమ్రా చేయు ముహ్రిం తల్బియా ఎలా పలకాలి?
 116. హజరే అస్వద్‌ వద్ద పలుకు తక్బీర్ 
 117. రుక్నే యమనీ మరియు హజరే అస్వద్‌ మధ్యలో పఠించు దుఆ
 118. సఫా మరియు మర్వహ్‌ కొండలపై నిలుచుని చదువు దుఆలు
 119. అరఫా రోజున (మైదానంలో) చేయు దుఆ
 120. మషఅరే హరాం వద్ద చేయు దుఆ
 121. జమరాత్‌ వద్ద ప్రతి కంకర రాయి విసురునపుడు పలుకు తక్బీర్ 
 122. ఆశ్చర్యము మరియు ఆనందం కలిగినపుడు చేయు దుఆ
 123. సంతోషకరమైన వార్త విన్నపుడు ఏమి చేయాలి?
 124. శరీరంలో బాధ కలిగినపుడు ఏమి అనాలి?
 125. తన దిష్టి తగులుతుందని భయపడే వ్యక్తి చేయు దుఆ
 126. భయాందోళనలు కలుగునపుడు ఏమనాలి?
 127. జిబహ్‌ లేదా ఖుర్బానీ చేయునపుడు ఏమి పఠించాలి?
 128. దుష్ట షైతానుల మాయోపాయాలను తరమడానికి ఏమి పఠించాలి?
 129. ఇస్తిగ్‌ ఫార్‌ మరియు తౌబా వచనాలు
 130. సుబ్‌ హానల్లాహ్‌, అల్‌హమ్‌దులిల్లాహ్‌, లా ఇలాహ ఇల్లల్లాహ్‌ మరియు అల్లాహు అక్బర్‌ యొక్క ఘనత
 131. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తస్బీహ్‌ ఎలా చేసేవారు?
 132. వివిధ రకాల పుణ్యాలు మరియు అతి ముఖ్యమైన ఆచరణలు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్)

lulu-wal-marjanAl-Loolu-wa-Marjan – Maha Pravakta Mahitoktulu

అల్-లూలు-వల్-మర్జాన్ (మహా ప్రవక్త మహితోక్తులు)

Download [Part 01Part 02]

[Hadiths from Sahih Bukhari and Sahih Muslim]

Compiled by: Muhammad Favvad Abdul Baaqui
Urdu Translator: Syed Shabbir Ahmed
Telugu Translator: Abul Irfan

Volume 1 Volume 2
 1. గ్రంధ పరిచయం
 2. భూమిక
 3. ఉపక్రమని
 4. విశ్వాస ప్రకరణం
 5. శుచి, శుభ్రతల ప్రకరణం
 6. బహిస్టు ప్రకరణం
 7. నమాజు ప్రకరణం
 8. ప్రార్ధనా స్థలాల ప్రకరణం
 9. ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం
 10. జుమా ప్రకరణం
 11. పండుగ నమాజ్ ప్రకరణం
 12. ఇస్తిస్ఖా నమాజ్ ప్రకరణం
 13. సలాతుల్ కుసూఫ్ ప్రకరణం
 14. జనాజ ప్రకరణం
 15. జకాత్ ప్రకరణం
 16. ఉపవాస ప్రకరణం
 17. ఎతికాఫ్ ప్రకరణం
 18. (a) హజ్ ప్రకరణం (b) నికాహ్ ప్రకరణం
 19. స్తన్య సంభందిత ప్రకరణం
 20. తలాఖ్ ప్రకరణం
 21. శాప ప్రకరణం
 22. బానిస విమోచనా ప్రకరణం
 23. వాణిజ్య ప్రకరణం
 24. లావాదేవీల ప్రకరణం
 25. విధుల ప్రకరణం
 26. హిబా ప్రకరణం
 27. వీలునామా ప్రకరణం
 28. మొక్కుబడుల ప్రకరణం
 29. విశ్వాస ప్రకరణం
 30. సాక్షాధార ప్రమాణ ప్రకరణం
 1. హద్దుల ప్రకరణం
 2. వ్యాజ్యాల ప్రకరణం
 3. సంప్రాప్త వస్తు ప్రకరణం
 4. జిహాద్ (ధర్మ పోరాటం) ప్రకరణం
 5. పదవుల ప్రకరణం (పరిపాలన విధానం)
 6. జంతు వేట ప్రకరణం
 7. ఖుర్భానీ ప్రకరణం
 8. పానియాల ప్రకరణం
 9. వస్త్రధారణ , అలంకరణ ప్రకరణం
 10. సంస్కార ప్రకరణం
 11. సలాం ప్రకరణం
 12. వ్యాధులు – వైద్యం  ప్రకరణం
 13. పద ప్రయోగ ప్రకరణం
 14. కవితా ప్రకరణం
 15. స్వప్న ప్రకరణం
 16. ఘనతా విశిష్టతల ప్రకరణం
 17. ప్రవక్త సహచరుల (రది అల్లాహు అన్హు) మహిమోన్నతల ప్రకరణం
 18. సామాజిక మర్యాదల ప్రకరణం
 19. విధి వ్రాత ప్రకరణం
 20. విద్యా విషయక ప్రకరణం
 21. ప్రాయశ్చిత్త ప్రకరణం
 22. పశ్చాత్తాప ప్రకరణం
 23. కపట విశ్వాసుల ప్రకరణం
 24. స్వర్గ భాగ్యాల , స్వర్గ వాసుల ప్రకరణం
 25. ప్రళయ సూచనల ప్రకరణం
 26. ప్రేమైక వచనాల ప్రకరణం
 27. వ్యాఖ్యాన ప్రకరణం