రచయిత: షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్)
హరమైన్ షరీఫైన్ పుస్తకాలు (రిసాలతుల్ హరమైన్) | 20 పేజీలు
ఈ పుస్తకంలో షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్), ఒక వ్యక్తి ముహమ్మద్ ﷺను అనుసరించకుండా యూదుడిగానో, క్రైస్తవుడిగానో ఉంటూ కూడా సత్య ధర్మంపై ఉండవచ్చని వాదిస్తూ రాసిన ఒక పత్రికా వ్యాసానికి ఖుర్ఆన్ మరియు సున్నత్ ఆధారాలతో సమాధానం ఇచ్చారు. ముహమ్మద్ ﷺ సందేశం సమస్త మానవజాతి కొరకు అని, అది మునుపటి షరీఅత్ లన్నింటినీ రద్దు చేసిందని, ఆయన గురించి విని కూడా ఆయనను అనుసరించనివాడు కాఫిర్ అని, ఇస్లాం తప్ప మరే ధర్మమూ అల్లాహ్ వద్ద స్వీకరించబడదని ఈ పుస్తకం స్పష్టంగా వివరిస్తుంది. చివరగా వ్యాసకర్తను నిజమైన తౌబా (పశ్చాత్తాపం) చేయమని హితబోధ చేస్తుంది.
పాఠకులకు గమనిక: PDF లోని తెలుగు అనువాదంలో కనుగొన్న కొన్ని అనువాద పొరపాట్లను, అసలు అరబీ గ్రంథం «بَيَانُ كُفْرِ وَضَلَالِ مَنْ زَعَمَ أَنَّهُ يَجُوزُ لِأَحَدٍ الْخُرُوجُ عَنْ شَرِيعَةِ مُحَمَّدٍ ﷺ» (రిసాలతుల్ హరమైన్ అరబీ PDF) తో పోల్చి ఈ పోస్ట్‌లో సరిదిద్దాము. కాబట్టి, PDF కంటే ఈ పోస్ట్‌లోని పాఠాన్నే ప్రామాణికంగా పరిగణించవలసిందిగా మనవి.



![ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు విధానము - షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ [పుస్తకం]
Prophet's Prayer - Imam Ibn Baz](https://i0.wp.com/teluguislam.net/wp-content/uploads/2025/06/namaz-vidhanam-ibn-baz.png?resize=541%2C746&ssl=1)
You must be logged in to post a comment.