1. ప్రశ్న : అల్లాహ్ మనల్ని ఎందుకు పుట్టించాడు?
జవాబు:
ఆయన మనల్ని కేవలం తన ఆరాధన కొరకు సృష్టించాడు.
وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
నేను జిన్నాతులనూ, మానవులనూ కేవలం నా ఆరాధన కొరకు మాత్రమే సృష్టించాను.[1]
(సూరా అజ్ జారియాత్ 51:56)
హదీస్ : అల్లాహ్కు ఆయన దాసులపై ఉన్న హక్కు ఏమిటంటే, వారు ఆయన్నే ఆరాధించాలి. ఈ ఆరాధనలో మరెవ్వరినీ భాగస్వాములుగా చెయ్యకూడదు. (బుఖారీ, ముస్లిం)
ఈ పోస్ట్ ముస్లింల ధార్మిక విశ్వాసం – జమీల్ జైనూ అను పుస్తకం నుండి తీసుకోబడింది
[1] నోట్స్: ఆహ్సనుల్ బయాన్ నుండి:
మానవులను, జిన్నులను పుట్టించటంలోని తన ఉద్దేశ్యమేమిటో అల్లాహ్ ఈ వాక్యంలో తెలియపరచాడు. వారంతా తనను మాత్రమే ఆరాధించాలి, తనకు మాత్రమే విధేయత చూపాలన్నది ఆయన అభిమతం. అయితే దానికోసం ఆయన మనుషులనుగానీ, జిన్నాతులనుగానీ కట్టుబానిసలుగా చేసుకోలేదు. వారి స్వేచ్చా స్వాతంత్రాలను హరించ లేదు. ఒకవేళ అదేగనక అయివుంటే మనుషులు, జిన్నాతులు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా అల్లాహ్ ఆరాధనకు కట్టుబడి ఉండేవారు. కాని అల్లాహ్ వారికి స్వేచ్చను ఇస్తూనే తనను ఆరాధించమని కోరాడు. వారి పుట్టుకలోని పరమార్ధాన్ని వారికిక్కడ జ్ఞాపకం చేశాడు. ఈ పరమార్థాన్ని విస్మరించిన వారికి పరలోకంలో ఎదురయ్యే పరాభవాన్ని గురించి కూడా హెచ్చరించాడు.
“నేను వారి నుండి జీవనోపాధిని కోరటం లేదు. వారు నాకు అన్నం పెట్టాలని కూడా నేను కోరటం లేదు”. (సూరా అజ్ జారియాత్ 51:57)
ఈ ఆరాధన మరియు విధేయత ద్వారా నా పోషణ జరుగుతుందని అనుకుంటున్నారేమో! అదేమీ కాదు. ప్రపంచంలో మీరు కల్పించే చిల్లర దేవుళ్ల లాంటి వాణ్ని కాదు నేను. ఆ మాటకొస్తే భూమ్యాకాశాల్లోని సమస్త ఖజానాలు నా అధీనంలోనే ఉన్నాయి. నా ఆరాధన వల్ల నా భక్తులకే లాభం చేకూరుతుంది. వారికి ఇహపరాల సాఫల్యం కలుగుతుంది. అంతేగాని నాకు చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదు.
మరింత సమాచారం కోసం క్రింది లింక్ సందర్శించండి:
మానవజాతి సృష్టి యెక్క ఉద్దేశ్యం ఏమిటి? (The Purpose of Creation)
You must be logged in to post a comment.