ప్రవక్త ﷺ సున్నత్ అనుసరణ – ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

ఉర్దూ మూలం : మౌలానా ముహమ్మద్ ఇక్బాల్ కీలానీ
తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
ప్రకాశకులు : హదీస్ పబ్లికేషన్స్

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[మొబైల్ ఫ్రెండ్లీ బుక్ ][PDF] [120 పేజీలు] [5.13 MB]

విషయ సూచిక (డౌన్లోడ్)

  1. తొలి పలుకులు [13p]
  2. బిద్ అత్ (కొత్త పోకడలు) [22p]
  3. హదీసు వివరాల సంక్షిప్త బోధన [3p]
  4. సంకల్పం [1p]
  5. సున్నత్ నిర్వచనం [3p]
  6. సున్నత్ – ఖుర్ఆన్ వెలుగులో [6p]
  7. సున్నత్ మహత్తు [4p]
  8. సున్నత్ ప్రాముఖ్యం [9p]
  9. సున్నత్ యెడల భక్తి ప్రపత్తులు [3p]
  10. సున్నత్ వుండగా సొంత అభిప్రాయమా? [4p]
  11. ఖుర్ఆన్ అవగాహనకై సున్నత్ ఆవశ్యకత [8p]
  12. సున్నత్ను పాటించటం అవశ్యం [10p]
  13. ప్రవక్త సహచరుల దృష్టిలో సున్నత్ [8p]
  14. ఇమాముల దృష్టిలో సున్నత్ [4p]
  15. బిద్అత్ నిర్వచనం [2p]
  16. బిద్అత్ ఖండించదగినది [7p]
  17. బలహీనమైన, కాల్పనికమైన హదీసులు [2p]

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

హదీసు పబ్లికేషన్స్ వారు ప్రచురించిన పుస్తకాలు క్రింది లింక్ దర్శించి డౌన్లోడ్ చేసుకోగలరు.
https://teluguislam.net/hadith-publications-books/

నికాహ్ (పెళ్లి) ఆదేశాలు – ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

ఉర్దూ మూలం : మౌలానా ముహమ్మద్ ఇక్బాల్ కీలానీ
తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
ప్రకాశకులు : హదీస్ పబ్లికేషన్స్

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[మొబైల్ ఫ్రెండ్లీ బుక్ ] [PDF] [152 పేజీలు] [14.7 MB]

విషయ సూచిక

అన్ని చాఫ్టర్లు PDF లింకులు గా క్రింద ఇవ్వబడ్డాయి. లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చదవవచ్చు.

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

హదీసు పబ్లికేషన్స్ వారు ప్రచురించిన పుస్తకాలు క్రింది లింక్ దర్శించి డౌన్లోడ్ చేసుకోగలరు.
https://teluguislam.net/hadith-publications-books/

దరూద్ షరీఫ్ శుభాలు – ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

దరూద్ షరీఫ్ శుభాలు – ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

ఉర్దూ మూలం : మౌలానా ముహమ్మద్ ఇక్బాల్ కీలానీ
తెలుగు అనువాదం : బద్రుల్ ఇస్లాం
ప్రకాశకులు : హదీస్ పబ్లికేషన్స్

డెస్క్ టాప్ వెర్షన్
[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [64 పేజీలు] [ఫైల్ సైజు: 3.24 MB]

మొబైల్ ఫ్రెండ్లీ వెర్షన్
[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [64 పేజీలు] [ఫైల్ సైజు: 12.5 MB]

విషయ సూచిక

  • రూపు రేఖలు
  • వంశధార
  • ప్రవక్త జీవిత చరిత్ర (టూకీగా)
  • తొలిపలుకులు [PDF] [8p]
  1. దరూద్ షరీఫ్ భావం [PDF] [1p]
  2. దైవ ప్రవక్తలందరిపై దరూద్ పంపాలి [PDF]
  3. దరూద్ షరీఫ్ ప్రాశస్త్యం [PDF] [7p]
  4. దరూద్ షరీఫ్ ప్రాముఖ్యత [PDF] [4p]
  5. మస్నూన్ దరూద్ వాక్యాలు [PDF] [9p]
  6. దరూద్ షరీఫ్ పఠించే సందర్భాలు [PDF] [8p]
  7. బలహీనమైన కాల్పనికమైన హదీసులు [PDF] [4p]

బిస్మిల్లా హిర్రహ్మానిర్రహీం

అల్హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, అమ్మాబాద్.

జీవితంలో కాలం అత్యంత విలువైనది. కాలప్రవాహం నిరంతరంగా, నిరాఘాటంగా చాలా వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది. కాలచక్రం మన మీద దయతలచి ఎక్కడా ఆగకుండా ముందుకు సాగి పోతూ మనల్ని జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ఆపదలను సహించగలిగేలా చేస్తున్నది. గడిచే కాలం క్షతగాత్ర హృదయాలకు ఉపశమనాన్నీ, ఊరటనూ కలిగిస్తున్నది. ఒకవేళ ఈ కాల ప్రవాహమే గనక ఆగిపోతే భూమిపై మానవ ఉనికికే ప్రమాదం వాటిల్లుతుంది. ప్రతి మనిషీ ఓ శోకమూర్తిలా, కనిపిస్తాడు.

కొన్ని సంవత్సరాల క్రితం నా జీవితం కాల ప్రవాహంలోని సహజమైన ఎగుడు దిగుళ్ళను దాటుకుంటూ అతి వేగంగా ముందుకు సాగిపోతున్న సమయంలో హఠాత్తుగా కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు జరిగాయి. వాటి మూలంగా నాకు రాత్రివేళ నిద్ర, పగటిపూట మనశ్శాంతి కరువయ్యాయి. దైనందిన కార్యకలాపాలన్నీ అస్తవ్యస్తమయిపోయాయి. ఇది నేను “నమాజ్ పుస్తకం” సంకలనం చేస్తున్న కాలం నాటి మాట.

ఈ రోజు దాని గురించి ఆలోచిస్తేనే చెప్పలేని ఆశ్చర్యం కలుగుతున్నది. అల్ప జ్ఞాని, పరిమిత సామర్థ్యం కలవాణ్ణి అయిన నేను ఇంత గొప్ప కార్యం ఎలా చేయగలిగానా అనిపిస్తోంది. వాస్తవం ఏమిటంటే నేను దైవప్రవక్త ప్రవచనాల సంకలనం, క్రోడీకరణ పనిలో పూర్తిగా లీనమయిపోయినందువల్ల బయటి ప్రపంచంలోని అల్లకల్లోల వాతావరణం నా మీద ప్రభావం చూపలేకపోయింది. ఆ విధంగా నేను ఎన్నో సమస్యల నుండి, బాధల నుండి సురక్షితంగా ఉండగలిగాను. అంతేకాదు, నా కార్యక్రమంలోనూ చెప్పదగిన ఆటంకం ఏమీ ఏర్పడలేదు. ఒకవేళ ఆ సమయంలో నేను నమాజ్ పుస్తకం పనిలో నిమగ్నుణ్ణి ఉండకపోయినట్లయితే, ఈ రోజు నా జీవితపు రూపురేఖలే మారిపోయి ఉండేవి. చెప్పొచ్చేదేమిటంటే దైవప్రవక్త ప్రవచనాలకు సంబంధించిన ఈ సంక్షిప్త సంకలనం-జీవితపు అత్యంత కఠినమైన, క్లిష్టతరమైన ప్రయాణంలో నాకు ఓ స్నేహితుడిగా, సానుభూతిపరుడిగా దోహదపడింది. నా దుఃఖంలో పాలు పంచుకున్నది. నా వల్ల ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు జరిగి ఉన్నప్పటికీ అల్లాహ్ నన్నింతగా కరుణిస్తున్నాడంటే ఇదంతా దరూద్ షరీఫ్ శుభాల మూలంగానే జరిగివుంటుందని నా నమ్మకం. హదీసులు చదువుతూ రాస్తూ ఉన్నప్పుడు మాటిమాటికీ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, సత్యప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పేరు వచ్చినప్పుడల్లా ఆయన మీద అల్లాహ్ శాంతీశ్రేయాలు కురవాలని ప్రార్థించినందుకు నాకా మహాభాగ్యం లభించి ఉండవచ్చు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచరుడయిన ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు)తో అన్న మాటలు అక్షరాలా సత్యం. “కాబ్! నువ్వు నీ మొత్తం నీ ప్రార్థనను నా దరూద్ కోసం ప్రత్యేకించుకో. ఇహపరాల్లో నీకు కలిగే దుఃఖాలన్నిటికీ అది ఉపశమనంగా పనికి వస్తుంది” (తిర్మిజీ షరీఫ్).

అల్లాహ్ తన గ్రంథంలో ఒకచోట ఇలా అన్నాడు :

”ఓ ముహమ్మద్ చెప్పేయండి, విశ్వాసులకు ఈ ఖురాన్ మార్గదర్శకం వహిస్తుందని, ఉపశమనాన్ని కలిగిస్తుందనీను”.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాల విషయంలో కూడా నిస్సందేహంగా మనం ఈ మాట అనవచ్చు. ఆయన పలుకులు ప్రజలకు సన్మార్గం చూపించటంతో పాటు, ఉపశమనాన్ని కూడా ఇస్తాయి. ఇమామ్ రమావీ (రహిమహుల్లాహ్) తనకు సుస్తీ చేసినప్పుడల్లా తాను “నాకు హదీసు చదివి వినిపించండి. అందులో ఉపశమనం ఉంది” అని అంటారని బాగ్దాద్ చరిత్ర గ్రంథంలో వ్రాశారు. భారత ఉపఖండ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రసిద్ధికెక్కిన ప్రముఖ హదీసువేత్త హజ్రత్ షాహ్ వలీయుల్లాహ్ గారి గురించి తెలియని వారుండరు. ఆయన తండ్రిగారైన షాహ్ అబ్దుర్రహీమ్ తరచూ ఇలా అంటుండేవారు: “మాకు ధర్మసేవ చేసే భాగ్యమంతా దరూద్ షరీఫ్ శుభాల మూలంగానే లభించింది”.

పండితులు సఖావీ (రహిమహుల్లాహ్) ‘ఖైలుల్ బదీ’ అనే గ్రంథంలో అనేకమంది హదీసువేత్తల స్వప్న విశేషాలను పొందుపరిచారు. ఆ గ్రంథం ప్రకారం కొంతమంది హదీసువేత్తలు హదీసులు వ్రాసే సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రస్తావన వచ్చినప్పుడల్లా దరూద్ షరీఫ్ పఠించటం, వ్రాయటం చేసేవారు. దాని మూలంగా వారి పాపాలన్నిటినీ మన్నించటం జరిగింది.

దైవప్రవక్త హదీసులు మరియు దరూద్ షరీఫ్ మహిమల్ని, శుభాలను స్వానుభవంతో గ్రహించిన నేను ”శుచీ శుభ్రతల పుస్తకం” తర్వాత “దైవప్రవక్త విధానానుసరణ” పుస్తకాన్ని రచించే ముందు ”దరూద్ షరీఫ్ శుభాలు” అనే పుస్తకం సంకలనం చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. అల్ హమ్దులిల్లాహ్! అల్లాహ్ నా ఆశను నెరవేర్చాడు. ఈ పుస్తకంలోని మేళ్లన్నీ కూడా అల్లాహ్ కృపతో, ఆయన అనుగ్రహంతో జరిగినవే. పోతే ఇందులోని లోపాలన్నీ నా స్వయంకృతాలు.

తనకు సలాం చేసే వారికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సమాధిలో నుంచి ప్రతి సలాం చేస్తారని ప్రామాణికమైన హదీసు ద్వారా తెలుస్తోంది.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధిలో ఉండి ప్రజల సలాం ఎలా వింటారు? వారి సలాంకు జవాబు ఎలా చెబుతారు? అనే విషయాలను గురించి చర్చించినప్పుడు మనం ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రాపంచిక జీవనం దృష్ట్యా సాధారణ మానవులకు ఏ విధంగా మరణం సంభవిస్తుందో అదేవిధంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు కూడా మరణం సంభవించింది. దివ్య ఖురాన్లో అల్లాహ్ పలుచోట్ల దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొరకు ‘మరణం’ అనే పదాన్ని ఉపయోగించాడు.

“ఓ ప్రవక్తా! నీవూ మరణిస్తావు, వారూ మరణిస్తారు.” (అజ్ జుమర్ : 30)

ఆలి ఇమ్రాన్ సూరాలో ఇలా ప్రకటించబడింది :

”ముహమ్మద్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కారు. అతనికి పూర్వం ఇంకా ఎందరో ప్రవక్తలు గతించారు. అలాంటప్పుడు ఒకవేళ అతను మరణిస్తే లేక హత్య చేయబడితే మీరు వెనుకంజవేసి మరలిపోతారా?” (ఆలి ఇమ్రాన్: 144)

అంబియా సూరాలో ఇలా చెప్పబడింది:

“ఓ ప్రవక్తా! శాశ్వత జీవితాన్ని మేము నీకు పూర్వం కూడా ఏ మానవునికీ ప్రసాదించలేదు. ఒకవేళ నీవు మరణిస్తే వారు మాత్రం శాశ్వతంగా జీవించి ఉంటారా?’ (అంబియా సూరా, 34వ సూక్తి)

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించినప్పుడు ఆయన ప్రియ సహచరుడయిన హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) తన ఉపన్యాసంలో ఇలా ఎలుగెత్తి చాటారు :

”ముహమ్మద్ ను పూజించేవారు ముహమ్మద్ కు మరణం సంభవించిందన్న సత్యాన్ని గ్రహించాలి” (బుఖారీ షరీఫ్).

దైవప్రవక్త మరణానంతరం ఆయన పవిత్ర భౌతిక కాయానికి స్నానం చేయించి, వస్త్ర సంస్కారాలు చేయటం జరిగింది. ఆ తర్వాత జనాజా నమాజ్ ఆచరించి ఆయన భౌతిక కాయాన్ని సమాధిలో ఉంచి మట్టితో పూడ్చేయటం జరిగింది. ఇది వాస్తవం. కనుక ప్రాపంచిక జీవితం దృష్ట్యా ఆయనకు మరణం సంభవించిందనే విషయంలో ఎలాంటి సందేహానికీ తావులేదు. అయితే ఆయన సమాధి జీవితం మాత్రం ఇతర దైవప్రవక్తలు, పుణ్యాత్ములు, అమరవీరులు, సజ్జనులందరి కంటే ఎంతో మెరుగ్గా, ఎక్కువ పరిపూర్ణంగా ఉంటుంది. సమాధి జీవితం గురించి ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ జీవితం మరణానికి ముందు ఉండే ప్రాపంచిక జీవితం లాగుండదు. అలా అని అది పూర్తిగా పరలోక జీవితం కూడా కాదు. దాని వాస్తవిక స్థితి కేవలం అల్లాహ్ కు మాత్రమే తెలుసు. దివ్యఖురాన్లో అల్లాహ్ ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా ఇలా ప్రకటించాడు:

“అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని “మృతులు” అని అనకండి. వాస్తవానికి వారు సజీవులు. కాని మీరు వారి జీవితాన్ని గ్రహించలేరు.” (అల్బఖర : 154వ సూక్తి)

సమాధి జీవితం గురించి వివరిస్తూ అల్లాహ్ ”మీరు ఆ స్థితిని గ్రహించలేరు” అని స్పష్టంగా చెప్పిన తర్వాత – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజల సలాం విని దానికి జవాబు చెప్పగల్గుతారంటే బహుశా ఆయన మనలాగే బ్రతికే ఉన్నారేమో? ఆయన సలాం వినగలిగినప్పుడు మనం చెప్పుకునే మాటలు మాత్రం ఎందుకు వినలేరు? అంటూ భౌతికంగా ఆలోచించటానికి ప్రయత్నించకూడదు. మన విశ్వాసం (ఈమాన్) కోరేదేమంటే మనం అల్లాహ్, దైవప్రవక్త ఆదేశాలను యధాతథంగా ఆచరించాలి. ఏ విషయంలోనయితే షరీఅత్ మౌనం వహించిందో అలాంటి విషయాల్లో అనవసర సందేహాలకు, సంశయాలకు లోనవకుండా తెలిసిన విషయాలనే ఆచరించటానికి ప్రయత్నించాలి. ధర్మం, విశ్వాసాల రక్షణకు ఇదే అత్యంత సురక్షితమైన మార్గం.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “అల్లాహ్ కొంతమంది దూతలకు ఒక బాధ్యతను అప్పగించాడు. వారు భువిలో సంచరిస్తూ ఉంటారు. ప్రజల్లో ఎవరయినా దరూద్ పఠిస్తే దాన్ని దైవప్రవక్తకు (అంటే నాకు) చేరవేస్తూ ఉంటారు” (అహ్మద్, నసాయి, దారిమి).

ఈ హదీసు ద్వారా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎల్లప్పుడూ తన సమాధిలోనే ఉంటారనీ, ఆయన సర్వాంతర్యామి కారని స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవేళ ఆయనే గనక సర్వాంతర్యామి అయితే దైవదూతలు ఆయనకు దరూద్ చేరవేయవలసిన అవసరం ఏముంటుంది చెప్పండి?!

మరికొన్ని హదీసుల ప్రకారం దైవదూతలు ఫలానా దరూద్ ఫలానా అతని కుమారుడు పఠించాడని కూడా ఆయనకు తెలియపరుస్తారని బోధపడుతుంది. దీని ద్వారా కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అగోచర జ్ఞానం లేదని తెలుస్తోంది. ఒకవేళ ఆయనకే గనక అగోచర జ్ఞానముంటే దైవదూతలు ఫలానా వ్యక్తి దరూద్ పఠించాడని ఆయనకు తెలియజేయవలసిన అవసరం ఏముంది?

ప్రస్తుత కాలంలో ఇస్లాం ధర్మంలో క్రొత్తపోకడలు (బిద్అత్ లు) తామర తంపరలుగా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ప్రార్థనలు, సంకీర్తనల్లో ఎన్ని కల్పిత విషయాలు చేర్చబడ్డాయంటే వాటి మూలంగా సంప్రదాయబద్ధమైన (మస్నూన్) ప్రార్ధనలు, సంకీర్తనలు మరుగున పడిపోతున్నాయి. ఆఖరికి దరూద్, సలామ్ లలో కూడా ఎన్నో కల్పితమైన, సంప్రదాయ విరుద్ధమైన విషయాలు చోటు చేసుకున్నాయి. ఉదా:- దరూదె తాజ్, దరూదె లిఖ్ఖి, దరూదె ముఖద్దస్, దరూదె అక్బర్, దరూదె మాహీ, దరూదె తస్ జైనా మొదలగునవి. వీటిలో ప్రతి ఒక్క దరూద్ పఠనానికి ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించబడింది. పుస్తకాల్లో వాటికి వేర్వేరు ప్రయోజనాలు ఆపాదించబడ్డాయి. మరి చూడబోతే వాటిలో ఏ ఒక్క దరూద్ వాక్యాలు కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేత ప్రవచించబడినట్లు రుజువు కావటం లేదు. కనుక వాటిని పఠించే పద్ధతి, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలు అన్నీ మాయమాటలు మాత్రమే.

షరీఅత్లో కల్పితమైన, సంప్రదాయ విరుద్ధమైన చర్యలకు పాల్పడటం మూలంగా కలిగే నష్టమేమిటో తెలుసుకోవటానికి ప్రతి ముస్లిం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశాలను దృష్టిలో పెట్టుకోవాలి. లేకపోతే ఈ కొద్దిపాటి అమూల్యమైన జీవితంలో ఖర్చు చేయబడే సమయం, ధనం, ఇతర శక్తి సామర్ధ్యాలన్నీ ప్రళయదినాన వృధా అయిపోయే ప్రమాదముంది..

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా ధర్మంలో షరీఅత్ పరంగా నిరాధారమైన పనికి శ్రీకారం చుడితే ఆ పని త్రోసిపుచ్చదగినది” (బుఖారీ- ముస్లిం). అంటే అల్లాహ్ సన్నిధిలో దానికి ఎలాంటి పుణ్యం లభించదన్నమాట! వేరొక హదీసులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ధర్మంలో తలెత్తే ప్రతి క్రొత్త పోకడ మార్గభ్రష్టతే, మార్గభ్రష్టత నరకానికి గొనిపోతుంది” అని హెచ్చరించారు. (అబూ నయీమ్).

ఈ సందర్భంగా ఇమామ్ బుఖారీ, ఇమామ్ ముస్లింలు వెలికితీసిన ఒక హదీసుని ప్రస్తావించటం చాలా ఉపయోగకరంగా ఉంటుందనుకుంటాను. ముగ్గురు మనుషులు దైవప్రవక్త సతీమణుల దగ్గరికి వెళ్ళి దైవప్రవక్త ఆరాధనా పద్ధతిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారిలో ఒకతను ‘నేను ఇప్పట్నుంచి ప్రతి రోజూ రాత్రంతా జాగారం చేస్తాను. అసలు విశ్రాంతే తీసుకోను’ అని ప్రతినబూనాడు. రెండో వ్యక్తి, “నేను రేపట్నుంచి నిరంతరాయంగా ఉపవాసముంటాను. ఈ వ్రతాన్ని ఎన్నటికీ విరమించను” అని ఒట్టేసుకున్నాడు. “నేనయితే ఎన్నటికీ వివాహం చేసుకోను. అసలు స్త్రీలనే ముట్టుకోను’ అని ప్రమాణం చేశాడు మూడోవ్యక్తి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు ఈ విషయం తెలియగానే ఆయన వారిని హెచ్చరిస్తూ, “అల్లాహ్ సాక్షి! నేను మీ అందరి కంటే ఎక్కువగా అల్లాహ్ కు భయపడేవాడిని, నిష్టాగరిష్టుణ్ణి. అయినప్పటికీ నేను రాత్రిపూట ఆరాధనలు చేస్తాను, పడుకుంటాను కూడా. ఉపవాసాలుంటాను, అప్పుడప్పుడూ వాటిని విరమిస్తాను కూడా. అంతేకాదు, నేను స్త్రీలను వివాహం కూడా చేసుకున్నాను. కనుక జాగ్రత్త! ఎవరయితే నా విధానం పట్ల వైముఖ్య ధోరణికి పాల్పడతాడో అతనితో నాకెలాంటి సంబంధం లేదు” అని అన్నారు.

ప్రియ పాఠకులారా!

కాస్త ఆలోచించండి, ఆ ముగ్గురు వ్యక్తులు తమ ఉద్దేశ్యం ప్రకారం తాము వీలైనన్ని ఎక్కువ సత్కార్యాలు చేస్తున్నామనీ, ఎక్కువ పుణ్యం సంపాదించు కుంటున్నామని భావించారు. కాని వారు అవలంబించిన విధానం కల్పితమైనది. సంప్రదాయ విరుద్ధమైనది, కనుక దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి మాటల్ని తీవ్రంగా నిరసించారు. దరూద్ సలామ్ ల సంగతి కూడా అంతే.

కల్పితమైన, సంప్రదాయ విరుద్ధమైన దరూద్ లు, సలామ్ లు పఠించటం వృధా ప్రయాస మాత్రమే. పైగా దానివల్ల దైవప్రవక్త అప్రసన్నతకు, దైవాగ్రహానికి గురి కావలసి వస్తుంది. అంచేత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించిన దరూద్-సలామ్ లను మాత్రమే పఠించాలి. గుర్తుంచుకోండి! ప్రపంచంలోని ఇతర సాధువులు, పుణ్యాత్ములందరూ కలిసి తయారు చేసిన ఎన్నో పలుకుల కన్నా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శుభ అధరాల నుండి వెలువడిన ఒక్క పలుకు ఎంతో అమూల్యమైనది, శ్రేష్ఠమైనదీను.

ఈ పుస్తకం సంకలనం కోసం హదీసుల్ని ఎంపిక చేసినప్పుడు ‘సహీహ్’ మరియు ‘హసన్’ కోవలకు చెందిన హదీసుల్ని మాత్రమే ఎంపిక చేసి పుస్తక ప్రామాణికతను కాపాడటానికి అన్ని విధాలా కృషి చేయటం జరిగింది. అయినప్పటికీ ఇందులో ఏదయినా బలహీనమైన హదీసు దొర్లిందని విద్యావంతులు మాకు తెలియపరిస్తే మేము వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.

ఈ పుస్తకాన్ని సిద్ధపరచటంలో మిత్రులు జనాబ్ హాఫిజ్ అబ్దుర్రహ్మాన్ (రక్షణ శాఖ) గారు చెప్పదగిన పాత్రను నిర్వహించారు. మా నాన్నగారు హాఫిజ్ ముహమ్మద్ ఇద్రీస్ కైలానీ ముసాయిదాను పునఃపరిశీలించటంతో పాటు వ్రాత, ప్రచురణ పనుల్ని దగ్గరుండి జరిపించారు. మా నాన్నగారు హజ్రత్ మౌలానా ముహమ్మద్ ఇస్మాయీల్ సలఫీ (రహిమహుల్లాహ్), హజ్రత్ మౌలానా ముహమ్మద్ అతావుల్లాహ్ హనీఫ్ (రహిమహుల్లాహ్) లాంటి ప్రసిద్ధ పండితుల దగ్గర శిష్యరికం చేసిన ప్రముఖుల్లో ఒకరు. దస్తూరీలో బాగా పేరు మోసిన వ్యక్తి. ఉపాధి నిమిత్తం దస్తూరీ పని చేసిన కాలంలోనే ఆయన ఆరు ప్రామాణిక గ్రంథాలయిన (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం, సుననె తిర్మిజీ, సుననె నసాయి, సుననె అబూదావూద్, సుననె ఇబ్నెమాజా లనే గాక మిష్కాత్ షరీఫ్, దివ్యఖురాన్ కు సంబంధించిన అనేక వ్యాఖ్యాన గ్రంథాలను కూడా ఆయన తన చేత్తో వ్రాశారు. మౌలానా అతావుల్లాహ్ హనీఫ్ గారు తన ప్రసిద్ధ గ్రంథమైన “తాలీఖాతె సలఫియా” (నసాయీ షరీఫ్ వ్యాఖ్యాన) గ్రంథాన్ని వ్రాయటం కోసం ప్రత్యేకంగా మా నాన్నగారినే ఎన్నుకున్నారు.

అల్లాహ్ నాన్నగారికి ప్రత్యేక కరుణాకటాక్షాల్ని అనుగ్రహించాడు. యాభై ఎనిమిదవ పడిలో ఆయనకు దివ్యఖురాన్ ను కంఠస్తం చేసే మహాభాగ్యాన్ని ప్రసాదించాడు. విద్యాభ్యాసం పూర్తయినప్పటి నుంచే ఆయన దస్తూరీ పనితోబాటు తన సొంత ఊర్లో ధర్మప్రచార కార్యక్రమాల్ని కూడా నిర్వర్తించటం మొదలుపెట్టారు. అయితే గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా-దైవకృపతో ఆయన ఉపాధిని కూడా లెక్కచేయకుండా పూర్తి ఏకాగ్రతతో ఈ బాధ్యతను నిర్వహిస్తున్నారు. హదీస్ పబ్లికేషన్స్ తరఫున ప్రచురణ కార్యక్రమం మొదలయినప్పటి నుంచి ముసాయిదాలను పునఃపరిశీలించటం, వాటిని వ్రాయించటం, ప్రచురించటం ఆ తర్వాత వాటిని పంపిణీ చేయటం మొదలగు పనులన్నిటినీ ఆయనే నిర్వర్తిస్తున్నారు.

మహాశయులారా !

నాన్నగారు జనాబ్ హాఫిజ్ ముహమ్మద్ ఇద్రీస్ కైలానీ గారికి అల్లాహ్ ఆరోగ్యాన్నీ, ఆయుష్షును* ప్రసాదించాలని కోరుకోమని విన్నవించుకుంటున్నాను. దానివల్ల మనకు దైవగ్రంథ, దైవప్రవక్త ప్రవచనాల ప్రచార కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షణలో నిర్వహించే అవకాశం లభిస్తుంది. అలాగే కేవలం దైవప్రసన్నతను బడసే ఉద్దేశ్యంతో, దైవప్రవక్త ప్రవచనాల పట్ల తమకున్న ప్రేమాభిమానాల మూలంగా తమ అమూల్యమైన సమయాన్ని, శక్తి సామర్థ్యాలను, పవిత్ర సంపాదనను ఖర్చుపెట్టి తద్వారా దైవగ్రంథం, దైవప్రవక్త ప్రవచనాల ప్రాచుర్యం కోసం పాటుపడుతున్న ప్రభృతులందరి కోసం కూడా దైవాన్ని ప్రార్థించండి. దైవం వారందరికీ ఇహపరాల్లోనూ తన అనుగ్రహాలను ప్రసాదించుగాక! ప్రళయదినాన వారికి దైవప్రవక్త సిఫారసుకు నోచుకునే భాగ్యాన్ని ప్రాప్తించుగాక! (ఆమిన్).

సంకలనకర్త తండ్రిగారైన హాఫిజ్ ముహమ్మద్ ఇద్రీస్ కైలానీ (రహిమహుల్లాహ్) క్రీ.శ. 1992 అక్టోబర్ 13వ తేదీనాడు శాశ్వతంగా ఇహలోకాన్ని వీడిపోయారు. ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్. పాఠకులు ఆయన మన్నింపు కోసం, పరలోకంలో ఆయన అంతస్తుల పెరుగుదల కోసం అల్లాహ్ ను ప్రార్థించాలని కోరుకుంటున్నాం.

రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్సమీవుల్ అలీం. వతుబ్ అలైనా ఇనక అంతత్తవ్వాబుర్రహీమ్”.
(ప్రభూ! మేము చేసిన ఈ సేవను స్వీకరించు. నిస్సందేహంగా నీవు అన్నీ వినేవాడవు. సర్వం తెలిసినవాడవు. ప్రభూ! మమ్మల్ని క్షమించు. నిస్సందేహంగా పశ్చాత్తాపాన్ని అంగీకరించే వాడవు, కరుణించే వాడవు నీవే)

ముహమ్మద్ ఇక్బాల్ కైలానీ
కింగ్ సవూద్ యూనివర్సిటీ, సౌదీ అరేబియా

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ ﷺ قَالَ: «الْمَلَائِكَةُ تُصَلِّي عَلَى أَحَدِكُمْ مَا دَامَ فِي مُصَلاهُ الَّذِي صَلَّى فِيهِ مَا لَمْ يُحْدِتْ تَقُوْلُ اللَّهُمَّ اغْفِرْ لَهُ اللَّهُمَّ ارْحَمْهُ.– رَوَاهُ الْبُخَارِيُّ

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగాప్రవచించారు: మీలో ఎవరయినా తను నమాజ్ చేసిన స్థలంలో పరిశుద్ధావస్థలో కూర్చొని ఉన్నంత వరకు (అంటే అతని వుజూ భంగం కానంత వరకు) దైవదూతలు అతనిపై దరూద్ పంపుతూ, “అల్లాహ్! ఇతన్ని మన్నించు, ఇతన్ని కరుణించు” అని ప్రార్థిస్తూఉంటారు. (బుఖారీ – నమాజ్ ప్రకరణం)

عَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ : قَالَ رَسُولُ اللَّهِ ﷺ : إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى مَيَامِنِ الصُّفُوفِ . رَوَاهُ أَبُو دَاوُدَ

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:. “పంక్తుల్లో కుడివైపున వుండే వారిపై అల్లాహ్ కారుణ్యాన్ని కురిపిస్తాడు. దైవదూతలు కూడా వారిని అల్లాహ్ కరుణించాలని కోరుకుంటూ ఉంటారు”. (అబూదావూద్-హసన్ – అల్ బానీగారి సహీహ్ సుననె అబూదావూద్, మొదటి సంపుటి 628వ హదీసు)

عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا أَنَّهُ قَالَ: لاَ تُصَلُّوْا صَلَاةٌ عَلَى أَحَدٍ إِلَّا عَلَى النَّبِيِّ وَلكِنْ يُدْعَى لِلْمُسْلِمِينَ وَالْمُسْلِمَاتِ بِالاِسْتِغْفَارِ. رَوَاهُ إِسْمَاعِيْلُ الْقَاضِي

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ప్రబోదనం :- “దైవప్రవక్తలపై తప్ప మరెవరి పైనా దరూద్ పంపకండి. అయితే ముస్లిం స్త్రీ పురుషుల కోసం మాత్రం మన్నింపు ప్రార్థనలు చేయండి”.

(దీనిని ఇస్మాయీల్ ఖాజీగారు “ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి” గ్రంథంలో పేర్కొన్నారు. ఇది సహీహ్ కోవకు చెందిన హదీసు) (అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం, 75వ హదీసు)

عَنْ أَنَسٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (مَنْ صَلَّى عَلَيَّ صَلَاةَ وَاحِدَةً صَلَّى اللهُ عَلَيْهِ عَشْرَ صَلَوَاتٍ وَحُطَّتْ عَنْهُ عَشَرُ خَطِيئَاتٍ وَرُفِعَتْ لَهُ عَشَر دَرَجَاتٍ– رَوَاهُ النَّسَائِيُّ

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా నాపై ఒకసారి దరూద్ పరిస్తే అల్లాహ్ అతనిపై పదిసార్లు కారుణ్యం కురిపిస్తాడు. అతని పది పాపాలను మన్నిస్తాడు. ఇంకా అతని పది అంతస్తులను పెంచుతాడు“. (నసాయి-సహీహ్) (అల్బానీగారి సహీహ్ సునని నసాయి గ్రంథం, మొదటి సంపుటి 1230వ హదీసు)

عَنِ ابْنِ مَسْعُوْدٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ : أَوْلَى النَّاسِ بِي يَوْمَ الْقِيَامَةِ أَكْثَرُهُمْ عَلَيَّ صَلَاةٌ. رَوَاهُ التَّرْمِذِيُّ

హజ్రత్ ఇబ్న్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు. “నాపై అత్యధికంగా దరూద్ పఠించేవాడు ప్రళయ దినాన నాకు అందరికన్నా సమీపంలో ఉంటాడు.” (తిర్మిజీ – సహీహ్) [అల్ బానిగారి మిష్కాతుల్ మసాబీహి గ్రంథం, మొదటి భాగం 923 న హదీసు]

عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اللَّهِ ﷺ: (مَنْ صَلَّى عَلَى أَوْ سَأَلَ لِي الْوَسِيلَةَ حَقَّتْ عَلَيْهِ شَفَاعَتِي يَوْمَ الْقِيَامَةِ». رَوَاهُ إِسْمَاعِيلُ الْقَاضِي فِي فَضْلِ الصَّلَاةِ عَلَى النَّبِيِّ ﷺ

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా నాపై దరూద్ పఠిస్తే, నాకు ‘వసీలా’ (స్వర్గంలో ఒక ఉన్నత స్థానం) లభించాలని అల్లాహ్ ను కోరుకుంటే, ప్రళయ దినాన నేను వారి గురించి తప్పకుండా సిఫారసు చేస్తాను

(ఇస్మాయీల్ ఖాజీగారు దీనిని ‘ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి’ గ్రంథంలో పేర్కొన్నారు. ఇది ‘సహీహ్’ కోవకు చెందిన హదీసు).[అల్ బానిగారి ‘ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి’ గ్రంథం 50వ హదీసు]

عَنْ أُبَيّ بن كعب رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قُلْتُ  يَا رَسُولَ اللهِ، إِنِّي أُكْثِرُ الصَّلَاةَ عَلَيْكَ، فَكَمْ أَجْعَلُ لَكَ مِنْ صَلَاتِي؟ فَقَالَ: «مَا شِئْتَ». قَالَ: قُلْتُ: الرُّبُعَ. قَالَ: «مَا شِئْتَ، فَإِنْ زِدْتَ فَهُوَ خَيْرٌ لَكَ». قُلْتُ: النِّصْفَ. قَالَ: «مَا شِئْتَ، فَإِنْ زِدْتَ فَهُوَ خَيْرٌ لَكَ». قَالَ: قُلْتُ: فَالثُّلُثَيْنِ. قَالَ: «مَا شِئْتَ، فَإِنْ زِدْتَ فَهُوَ خَيْرٌ لَكَ». قُلْتُ: أَجْعَلُ لَكَ صَلَاتِي كُلَّهَا. قَالَ: «إِذَاً تُكْفَى هَمَّكَ، وَيُغْفَرُ لَكَ ذَنْبُكَ. رَوَاهُ الترمذي

హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) కథనం: నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో మాట్లాడుతూ “దైవప్రవక్తా! నేను మీపై అత్యధికంగా దరూద్ పంపుతూ ఉంటాను, వాస్తవానికి నేను నా ప్రార్ధన (దుఆ)లో ఎంతసేపు మీపై దరూద్ పఠించాలి.” అని అడిగాను. అందుకాయన “నీకిష్టమయినంత సేపు” అని అన్నారు. “నా ప్రార్థనలో నాల్గో వంతు మీ దరూద్ కోసం కేటాయిస్తే సరిపోతుందా?” అని అడిగాను. ”సరిపోతుంది. కాని అంతకన్నా ఎక్కువ సేపు దరూద్ పరిస్తే అది నీకే మంచింది” అని అన్నారాయన, నేను “సగం ప్రార్థన దరూద్ కోసం కేటాయిస్తాను” అన్నాను. దానికాయన “సరే, నీ యిష్టం. కానీ అంతకన్నా ఎక్కువ సేపు దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నారు. నేను మళ్లీ “అయితే మూడింట రెండు వంతుల ప్రార్థన దాని కోసమే కేటాయించమంటారా?” అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ”నీ యిష్టం. ఇంకా ఎక్కువ సమయం దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నారు. చివరికి నేను “మరయితే నా ప్రార్ధన అంతా దరూద్ కోసమే ప్రత్యేకించుకుంటాను” అని అన్నాను. అప్పుడాయన “ఈ పద్ధతి నీ దుఃఖ విచారాలన్నిటినీ దూరం చేస్తుంది. నీ పాపాల మన్నింపుకు దోహదపడుతుంది” అని చెప్పారు. (తిర్మిజీ-హసన్) [అల్ బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ రెండో సంపుటి 1999వ హదీసు]

عَنْ عَبْدِ الرَّحْمَنِ بْنِ عَوْفٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : خَرَجَ رَسُولُ اللهِ ﷺ حَتَّى دَخَلَ نخلا فَسَجَدَ فَأَطَالَ السُّجُوْدَ حَتَّى خَشِيْتُ أَنْ يَكُوْنَ اللهُ قَدْ تَوَفَّاهُ قَالَ : فَجِئْتُ أَنْظُرُ فَرَفَعَ رَأْسَهُ فَقَالَ : مَالَكَ؟ فَذَكَرْتُ لَهُ ذَلِكَ قَالَ: فَقَالَ : إِنَّ جِبْرِيلَ عَلَيْهِ السَّلامُ قَالَ لِي: أَلا أُبَشِّرُكَ أَنَّ اللهَ عَزَّ وَجَلَّ يَقُولُ لَكَ مَنْ صَلَّى عَلَيْكَ صَلَاةٌ صَلَّيْتُ عَلَيْهِ وَمَنْ سَلَّمَ عَلَيْكَ سَلَّمْتُ عَلَيْهِ». رَوَاهُ أَحْمَدُ

హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటి నుండి బయలుదేరి ఖర్జూరపు తోటలోకి వెళ్ళారు. అక్కడ ఆయన సజ్దా చేశారు. చాలా సేపటి వరకు అలాగే ఉండిపోయారు. ఎంతసేపటికీ సజ్దా నుండి లేవకపోవటంతో అదే స్థితిలో ఆయన ప్రాణం గాని పోయి వుంటుందేమోనని భయమేసింది నాకు! నేనాయన వైపు అలాగే చూస్తుండిపోయాను. అంతలో ఆయన తల పైకెత్తి ‘ఏమయింది?’ అని అడిగారు. నేను నాకు తోచింది చెప్పాను. అప్పుడాయన నాతో ఇలా అన్నారు :

”(నేను సజ్దా స్థితిలో ఉన్నప్పుడు) జిబ్రయీల్ దూత నన్ను సంబోధిస్తూ, “ఓ ముహమ్మద్! నేను మీకో శుభవార్త తెల్పనా? మీపై దరూద్ పంపిన వ్యక్తిపై తాను కారుణ్యాన్ని కురిపిస్తాననీ, మీ శాంతిని కోరేవారిపై తానూ శాంతిని అవతరింపజేస్తానని అంటున్నాడు అల్లాహ్” అని చెప్పారు. (అహ్మద్-సహీహ్) [అల్బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం 7వ హదీసు]

عَنْ أَبِي الدَّرْدَاءِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ ﷺ: «مَنْ صَلَّى عَلَيَّ حِيْنَ يُصْبِحُ عَشْرًا وَحِيْنَ يُمْسِي عَشْرًا أَدْرَكَتْهُ شَفَاعَتِي يَوْمَ الْقِيَامَةِ». رَوَاهُ الطَّبَرَانِي

హజ్రత్ అబూదర్దా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయితే ఉదయం పదిసార్లు, సాయంత్రం పదిసార్లు నాపై దరూద్ పఠిస్తారో, ప్రళయ దినాన వారికి నా సిఫారసు లభిస్తుంది“.(తబ్రానీ-హసన్) [అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం. 11వ హదీసు]

عَنْ عَبْدِ اللَّهِ بْنِ مَسْعُوْدٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: كُنتُ أُصَلِّي وَالنَّبِيُّ ﷺ وَأَبُو بَكْرٍ وَعُمَرُ رَضِيَ اللهُ عَنْهُمَا مَعَهُ ,فَلَمَّا جَلَسْتُ بَدَأْتُ بالثَّناءِ عَلَى اللهِ ثُمَّ الصَّلَاةِ عَلَى النَّبِيِّ ثُمَّ دَعَوْتُ لِنَفْسِي فَقَالَ النَّبِيُّ ﷺ: «سَلْ تُعْطَهُ، سَلْ تُعْطَة» رَوَاهُ التَّرْمِذِيُّ

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం : ఓ రోజు నేను నమాజ్ చేస్తుండగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆయనతో పాటు అబూబక్ర్, ఉమర్ (రదియల్లాహు అన్హుమా)లు కూడా (నాకు సమీపంలోనే) కూర్చొని ఉన్నారు. నేను (నమాజ్ ముగించుకొని దుఆ కోసం) కూర్చొని ముందుగా అల్లాహ్ ను స్తుతించాను. తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై దరూద్ పఠించి ఆ తర్వాత నా స్వయం కోసం దుఆ చేసుకున్నాను. అది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “(అలాగే) అల్లాహ్ ను ప్రార్థించు, నీకు తప్పకుండా ప్రసాదించబడుతుంది. (మళ్లీ) అల్లాహ్ ను ప్రార్థించు, నీకు తప్పకుండా ప్రసాదించటం జరుగుతుంది” అని పురికొల్పారు. (తిర్మిజీ-హసన్) [అల్ బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ మొదటి సంపుటి 486 వ హదీసు]

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنّ رَسُوْلَ اللهِ ﷺ قَالَ: «مَنْ صَلَّى عَلَيَّ وَاحِدَةً صَلَّى اللَّهُ عَلَيْهِ عَشْرًا» . رَوَاهُ مُسْلِمٌ

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా నాపై ఒకసారి దరూద్ పఠిస్తే అల్లాహ్ అతని మీద పదిసార్లు కారుణ్యాన్ని కురిపిస్తాడు“.(ముస్లిం – నమాజ్ ప్రకరణం)

عَنْ أَبِي طَلْحَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُولَ اللهِ ﷺ ، جَاءَ ذَاتَ يَوْمِ وَالْبُشْرَى فِي وَجْهِهِ فَقُلْنَا إِنَّا لَنَرَى الْبُشْرَى فِي وَجْهِكَ فَقَالَ: «إِنَّهُ أَتَانِي الْمَلَكُ جِبْرِيلُ فَقَالَ : يَا مُحَمَّدُ إِنَّ رَبَّكَ يَقُوْلُ أَمَا يُرْضِيْكَ الله ﷺ أَنَّهُ لَا يُصَلِّي عَلَيْكَ أَحَدٌ إِلا صَلَّيْتُ عَلَيْهِ عَشْرًا، وَلا يُسَلَّمْ عَلَيْكَ أَحَدٌ إِلا سَلَّمْتُ عَلَيْهِ عَشْرًا». رَوَاهُ النَّسَائِيُّ (حسن)

హజ్రత్ అబూ తల్హా (రదియల్లాహు అన్హు) కథనం: ఓ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో ఆయన ముఖారవిందం ఆనందాతిశయంతో వెలిగిపోతూ ఉంది. అది చూసి మేము ”ఈ రోజు మీ ముఖారవిందంలో సంతోషం తొణకిసలాడుతున్నట్లు కన్పిస్తుందే” అని అన్నాం. అప్పుడాయన మాకు ఇలా తెలియజేశారు. “నా దగ్గరకు జిబ్రయీల్ దూత వచ్చి ఓ శుభవార్త చెప్పి వెళ్ళారు. అల్లాహ్ నన్ను ఉద్దేశ్యించి, ”ముహమ్మద్! ఎవరయినా మీపై ఒకసారి దరూద్ పఠిస్తే, నేనతని పై పదిసార్లు కారుణ్యాన్ని కురిపిస్తాను. ఎవరయినా ఒకసారి మీపై శాంతి కలగాలని కోరుకుంటే నేను వారిపై పదిసార్లు శాంతిని అవతరింపజేస్తాను. ఇది మీకు సంతోషకరమే కదా! అని అడుగుతున్నాడట!” (నసాయి-హసన్)[అల్బానీగారి సహీహ్ సుననె నసాయి మొదటి సంపుటి1216వ హదీసు]

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُولُ اللهِ ﷺ: «مَنْ صَلَّى عَلَيَّ مَرَّةً وَاحِدَةً كَتَبَ اللهُ لَهُ عَشْرَ حَسَنَاتٍ – رَوَاهُ إِسْمَاعِيلُ الْقَاضِيُّ فِي فَضْلِ الصَّلَاةِ عَلَى النَّبِيِّ . (صحیح)

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు : “ఎవరయినా నాపై ఒకసారి దరూద్ పఠిస్తే, అల్లాహ్ అతని కర్మల పత్రంలో పదిపుణ్యాలు జమ చేస్తాడు”. (దీనిని ఇస్మాయీల్ ఖాజీ ‘ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి’ గ్రంథంలో పేర్కొన్నారు. ఇది సహీహ్ కోవకు చెందిన హదీసు) [అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం 11వ హదీసు]

عَنْ عَامِرِ بْنِ ربيعة عَنْ أَبِيْهِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : سَمِعْتُ النَّبِيَّ ﷺ يَقُولُ: (مَا مِنْ عَبْدٍ يُصَلِّي عَلَيَّ إِلا صَلَّتْ عَلَيْهِ الْمَلَائِكَةُ مَا صَلَّى عَلَيَّ فَلْيُقِلَّ أَوْ لَيُكْثِرُه . رَوَاهُ إِسْمَاعِيلُ الْقَاضِيُّ فِي فَضْلِ الصَّلاةِ عَلَى النَّبِيِّ (حسن)

హజ్రత్ ఆమిర్ బిన్ రబీఆ తన తండ్రి నుండి చేసిన కథనం ప్రకారం, తను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచిస్తుండగా విన్నారు: “ఏ ముస్లిం వ్యక్తి అయినా నాపై దరూద్ పఠిస్తూ ఉన్నంత వరకు దైవదూతలు అతనిపై కారుణ్యం కురవాలని ప్రార్థిస్తూనే ఉంటారు. కనుక ఇక మీ యిష్టం. దరూద్ తక్కువగానయినా పఠించండి లేదా ఎక్కువగానయినా పఠించండి”.

(దీనిని ఇస్మాయీల్ ఖాజీ ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథంలో పేర్కొన్నారు. ఇది ‘హసన్’ కోవకు చెందిన హదీసు) [అల్ బానీగారి మిష్కాతుల్ మసాబీహ్ గ్రంథం మొదటి సంపుటి 725వ హదీసు]

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ ﷺ: «مَا مِنْ أَحَدٍ يُسَلِّمُ عَلَيَّ إِلا رَدَّ اللهُ عَلَى رُوْحِي حَتَّى أَرُدَّ عَلَيْهِ السَّلاَمَ». رواه أبو داود (حسن)

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా నాకు సలాం చేస్తే, ఆ సమయంలో అల్లాహ్ నా ఆత్మను (భూలోకానికి) త్రిప్పి పంపిస్తాడు. దాంతో నేను నాకు సలాం చేసిన వారికి ప్రతి సలాం చేస్తాను”. (అబూ దావూద్-హసన్) [అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథంలోని 6వ హదీసు]

గమనిక: దరూద్ షరీఫ్ పఠనంపై లభించే పుణ్య పరిమాణం గురించి వివిధ హదీసుల్లో వివిధ రకాలుగా పేర్కొనటం జరిగింది. మొత్తానికి ఆ పుణ్యం దాన్ని పఠించేవారి చిత్తశుద్ధి, భక్తివిశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి.

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: «رَغِمَ أَنْفُ رَجُلٍ ذَكَرْتُ عِنْدَهُ فَلَمْ يُصَلِّ عَلَيَّ وَرَغِمَ أَنْفُ رَجُلٍ دَخَلَ عَلَيْهِ رَمَضَانُ ثُمَّ انْسَلَخَ قَبْلُ أَنْ يُغْفَرَ لَهُ، وَرَغِمَ أَنْفُ رَجُلٍ أَدْرَكَ عِنْدَهُ أَبْوَاهُ الْكِبَرَ فَلَمْ يُدْخِلَاهُ الْجَنَّة». رَوَاهُ التَّرْمِذِيُّ (صحیح)

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా శపించారు: “తన ముందు నా పేరు ప్రస్తావించబడినప్పటికీ నాపై దరూద్ పంపని వాడు నాశనమయిపోవు గాక! పూర్తి రమజాన్ మాసాన్ని పొందినప్పటికీ తన పాపాలను ప్రక్షాళనం చేసుకోలేకపోయినవాడు నాశనమయిపోవు గాక! తన జీవితంలో ముసలివారయిన తల్లిదండ్రుల్ని పొందినప్పటికీ వారికి సేవ చేసుకొని స్వర్గంలోకి ప్రవేశించలేక పోయినవాడు నాశనమయిపోవు గాక!” (తిర్మిజీ – సహీహ్) (అల్ బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ, మూడో సంపుటి 2810 వ హదీసు)

عَنْ كَعْبِ بْنِ عُجْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُولُ اللهِ ﷺ: « أَحْضُرُوا الْمِنْبَرَ فَحَضَرْنَا فَلَمَّا ارْتَقَى الدَّرَجَةَ قَالَ آمِيْنَ ثُمَّ ارْتَقَى الدَّرَجَةَ الثَّانِيَةَ فَقَالَ: آمِيْنَ ثُمَّ ارتَقَى الدَّرَجَةَ الثَّالِثَةَ فَقَالَ: آمِيْنَ، فَلَمَّا فَرَغَ نَزَلَ عَنِ الْمِنْبَرِ قَالَ: فَقُلْنَا لَهُ: يَا رَسُولَ الله لَقَدْ سَمِعْنَا مِنْكَ الْيَوْمَ شَيْئًا مَا كُنَّا نَسْمَعُهُ قَالَ: إِنَّ جِبْرِيلَ عَرَضَ لِي فَقَالَ : بَعُدَ مَنْ أَدْرَكَ رَمَضَانَ فَلَمْ يُغْفَرْ لَهُ، فَقُلْتُ: آمِيْنَ فَلَمَّا رَقِيْتُ الثَّانِيَةَ قَالَ: بَعُدَ مَنْ ذُكِرْتَ عِنْدَهُ فَلَمْ يُصَلِّ عَلَيْكَ. فَقُلْتُ : آمِيْنَ. فَلمَّا رَقِيْتُ الثَّالِثَةَ قَالَ : بَعُدَ مَنْ أَدْرَكَ أبَوَيْهِ الْكِبَرَ أَوْ أَحَدَهُمَا فَلَمْ يُدْخِلاهَ الْجَنَّةَ. فَقُلْتُ : آمِيْنَ ». رَوَاهُ الْحَاكِمُ (صحیح)

హజ్రత్ కాబ్ బిన్ ఉజ్రా (రదియల్లాహు అన్హు) కథనం: ఒక రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మింబర్ (వేదిక)ను తీసుకొచ్చి పెట్టమని ఆదేశించారు. మేము అలాగే తీసుకొచ్చి పెట్టాం. ఆయన వేదిక తొలి మెట్టు ఎక్కినప్పుడు ‘ఆమీన్’ అని అన్నారు. రెండో మెట్టు ఎక్కినప్పుడు ‘ఆమీన్’ అని అన్నారు. మూడో మెట్టు ఎక్కినప్పుడు కూడా ‘ఆమీన్’ అని అన్నారు. ఉపన్యాసం ముగించి వేదిక దిగి క్రిందికి రాగానే సహాబాలు (సహచరులు) ఆశ్చర్యంతో, “ఈ రోజు విూరు విచిత్రంగా ప్రవర్తించారు. (ఖుత్బా సమయంలో) మీరలా అనటం మేము ఇంతకు ముందెన్నడూ వినలేదు. (విషయం ఏమిటి దైవప్రవక్తా?!)” అని అడిగారు.

అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విషయాన్ని వివరిస్తూ ”జిబ్రయీల్ (అలైహిస్సలాం) వచ్చి “రమజాన్ మాసం పొందినప్పటికీ తన పాపాలను ప్రక్షాళనం చేయించుకోలేక పోయినవాడు నాశనమవుగాక!” అని శపించారు. నేనందుకు “ఆమీన్” అని అన్నాను. ఆ తర్వాత నేను రెండో మెట్టు ఎక్కుతున్నప్పుడు జిబ్రయీల్ ‘తన ముందు మీ శుభనామం ప్రస్తావనకు వచ్చినప్పటికీ మీ పై దరూద్ పంపనివాడు నాశనమయిపోవుగాక!’ అని శపించారు. నేనందుకు ”ఆమీన్” అని పలికాను. మూడో మెట్టు ఎక్కుతున్నప్పుడు జిబ్రయీల్, “ముసలి వారయిన తల్లిదండ్రుల్ని లేక వారిరువురిలో ఏ ఒక్కరినయినా పొంది వారికి సేవలు చేసుకొని స్వర్గాన్ని పొందలేకపోయినవాడు నాశనమవుగాక!” అని శపించారు. నేనందుకు కూడా ‘ఆమీన్’ అని అన్నాను” అని చెప్పారు. (హాకిమ్ – సహీహ్) (అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం 19 హదీసు)

عَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُوْلُ اللهِ ﷺ : «الْبَخِيْلُ الَّذِي مَنْ ذُكِرْتُ عِنْدَهُ فَلَمْ يُصَلِّ عَلَيَّ». رَوَاهُ التَّرْمِذِيُّ

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం, ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “తన ముందు నా పేరు ప్రస్తావించబడినప్పటికీ నాపై దరూద్ పఠించనివాడు పిసినిగొట్టు.” (తిర్మిజీ-సహీహ్) (అల్ బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ మూడో సంపుటి 2811వహదీసు)

عَنْ أَبِي ذَرٍّ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ ﷺ قَالَ: « إِنَّ أَبْخَلَ النَّاسِ مَنْ ذُكِرْتُ عِنْدَهُ فَلَمْ يُصَلِّ عَلَيَّ » – رَوَاهُ إِسْمَاعِيْلُ الْقَاضِي فِي فَضْلِ الصَّلَاةِ عَلَى النَّبِيِّ (صحیح)

హజ్రత్ అబూ జర్ర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “తన ముందు నా పేరు ప్రస్తావించబడినప్పటికీ నాపై దరూద్ పఠించనివాడు ప్రజలందరిలోకెల్లా మహా పిసినిగొట్టు”. (ఖాజీ ఇస్మాయీల్ దీనిని ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథంలో పేర్కొన్నారు. ఇది సహీహ్ కోవకు చెందిన హదీసు) (అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం 37వ హదీసు)

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُولُ اللهِ ﷺ: « مَا فَعَدَ قَوْمٌ مَقْعَدًا لَمْ يَذْكُرُوا فِيه اللهَ عَزَّ وَجَلَّ وَيُصَلُّوْا عَلَى النَّبِيِّ إِلا كَانَ عَلَيْهِمْ حَسْرَةٌ يَوْمَ الْقِيَامَةِ وَإِنْ دَخَلُوا الْجَنَّةَ لِلثَّوَابِ » رَوَاهُ أَحْمَدُ وَابْنُ حَبَّانِ وَالْحَاكِمُ وَالْخَطِيْبُ . (صحیح)

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “కొంతమంది ఒకచోట సమావేశమై ఆ సమావేశంలో అల్లాహ్ ను జ్ఞాపకం చేసుకోకపోతే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పంపకపోతే ప్రళయదినాన ఆ సమావేశం వారి పాలిట దుఃఖదాయకంగా (తలవంపుగా) పరిణమిస్తుంది. వారు సత్కార్యాల ఆధారంగా స్వర్గంలో ప్రవేశించేవారయినా సరే” (అహ్మద్, ఇబ్నె హిబ్బాన్, హాకిమ్, ఖతీబ్- సహీహ్) (అల్బానీగారి సిల్సిలతుల్ అహాదీసుస్సహీహా ‘మొదటి సంపుటి 76వ హదీసు)

عَنِ ابْنِ عَبَّاسِ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: « مَنْ نَسِيَ الصَّلاةَ عَلَيَّ خطئ طريقَ الْجَنَّةِ » . رَوَاهُ ابْنُ مَاجَةَ (صحیح)

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు : “నాపై దరూద్ పంపటం మరిచిపోయినవాడు స్వర్గమార్గం తప్పిపోతాడు” (ఇబ్నెమాజా-సహీహ్) (అల్బానీగారి సహీహ్ సుననె ఇబ్నెమాజా మొదటి సంపుటి 740వ హదీసు.)

عَنْ أَنس رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُوْلُ اللهِ ﷺ:« كُلُّ دُعَاءِ مَحْجُوْبٌ حَتَّى يُصَلِّيَ عَلَى النَّبِيُّ » . رَوَاهُ الطَّبَرَانِيُّ (حسن)

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై దరూద్ పఠించనంతవరకు ఏ దుఆ స్వీకృతిని పొందజాలదు“. (తబ్రానీ-హసన్) (అల్బానీగారి సిల్సిలతుల్ అహాదీసుస్సహీహా ఐదో సంపుటి 2035వ హదీసు)

عن فضالة بْنِ عبيد رَضِيَ اللهُ عَنْهُ قَالَ : سَمِعَ النَّبِيُّ ﷺ رَجُلًا يَدْعُو فِي صَلَاتِهِ فَلَمْ يُصَلِّ عَلَى النَّبِيُّ . فَقَالَ النَّبِيُّ ﷺ: «( عجل هذا ) ، ثُمَّ دَعَاهُ فَقَالَ لَهُ أَوْ لِغَيْرِهِ إِذَا صَلَّى أَحَدُكُمْ فَلْيَبْدَا بِتَحْمِيدِ اللَّهِ والثناء عَلَيْهِ ثُمَّ لَيُصَلِّ عَلَى النبي ﷺ ثُمَّ لَيَدْعُ بَعْدُ مَا شَاءَ» . رَوَاهُ التَّرْمِذِيُّ (صحیح)

హజ్రత్ ఫజాలా బిన్ ఉబైద్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక వ్యక్తి నమాజ్లో దరూద్ పఠించకుండా దుఆ చేస్తుండగా చూసి ‘ఇతను తొందరపడ్డాడు’ అని అన్నారు. ఆ తర్వాత అతణ్ణి దగ్గరకు పిలిచి అతన్నో లేక మరో వ్యక్తినో ఉద్దేశ్యించి, “మీలో ఎవరయినా నమాజ్ చేసేటప్పుడు దైవస్తోత్రంతో ప్రారంభించాలి. ఆ తర్వాత (తషహుద్ లో కూర్చున్నప్పుడు) దైవప్రవక్తపై దరూద్ పఠించాలి. దాని తర్వాత తమకు ఇష్టమొచ్చింది ప్రార్థించుకోవాలి” అని చెప్పారు. (తిర్మిజీ-సహీహ్) (అల్బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ మూడో సంపుటి 2767వ హదీసు)

عَنْ أَبِي أَمَامَةَ بْنِ سَهْلِ رَضِيَ اللهُ عَنْهُ أَنَّهُ أَخْبَرَهُ رَجُلٌ مِنْ أَصْحَابِ النَّبِيِّ ﷺ أَنَّ السُّنَّةَ فِي الصَّلَاةِ عَلَى الْجَنَازَةِ أَنْ يُكَبَّرَ الإِمَام ثُمَّ يَقْرَأْ بِفَاتِحَةِ الْكِتَابِ بَعْدَ التكبيرة الأولَى سِرًّا فِي نَفْسِهِ ثُمَّ يُصَلِّي عَلَى النَّبِيِّ ﷺ وَيُخَلَّص الدُّعاءَ لِلْجَنَازَةِ فِي التَّكْبِيرَاتِ وَلَا يَقْرَأْ فِي شَيْءٍ مِنْهُنَّ ثُمَّ يُسَلَّمْ سِرًّا فِي نَفْسِهِ. رَوَاهُ الشَّافِعِيُّ.

హజ్రత్ అబూ ఉమామా బిన్ సహ్లి (రదియల్లాహు అన్హు) కథనం, ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల్లో ఒకాయన తనకు ఈ విషయం తెలిపారు. “జనాజా నమాజ్లో ఇమామ్ మొదటి తక్బీర్ తర్వాత మెల్లిగా ఫాతిహా సూరా పఠించటం, (రెండో తక్బీర్ తర్వాత) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠించటం, (మూడో తక్బీర్ తర్వాత) మృతుని కోసం చిత్తశుద్ధితో ప్రార్థించటం, ఈ తక్బీరుల్లో ఖురాన్ పారాయణం చేయకుండా ఉండటం, (నాల్గో తక్బీర్ తర్వాత) మెడ త్రిప్పుతూ మెల్లిగా సలాం చేయటం సున్నత్ (సంప్రదాయం)“. (షాఫయీ) (ముస్నదె షాఫయీ-581 వ హదీసు)

عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ رَضِيَ اللهُ عَنْهُمَا أَنَّهُ سَمِعَ النَّبِيِّ ﷺ يَقُولُ : إذَا سَمِعْتُمُ الْمُؤَذَنَ فَقُوْلُوْا مِثْلَ مَا يَقُوْلُ ثُمَّ صَلُّوْا عَلَيَّ فَإِنَّهُ مَنْ صَلَّى عَلَيَّ صَلَاةٌ صَلَّى اللهُ عَلَيْهِ بِهَا عَشْرًا، ثُمَّ سَلُوْا اللهَ لِي الْوَسِيْلَةَ فَإِنَّهَا مَنْزِلَةٌ فِي الْجَنَّةِ لا تَنْبَغِي إِلا لِعَبْدِ مِنْ عِبَادِ اللهِ وَأَرْجُوْ أَنْ أَكُونَ أَنَا هُوَ فَمَنْ سَأَلَ اللَّهَ لِي الْوَسِيلَةَ حَلَّتْ لَهُ الشَّفَاعَةُ». رَوَاهُ مُسْلِمٌ.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) తెలియజేశారు: “ముఅజ్జన్ (అజాన్ ఇచ్చేవాని) ప్రకటన విన్నప్పుడు, అతను అనే పలుకులే మీరూ పలకండి. ఆ తర్వాత నాపై దరూద్ పఠించండి. నాపై ఒకసారి దరూద్ పఠించేవారిని అల్లాహ్ పదిసార్లు కరుణిస్తాడు. ఆ తర్వాత నాకు ‘వసీలా’ లభించాలని అల్లాహ్ ను ప్రార్థించండి. వసీలా అనేది స్వర్గంలో ఒక (ఉన్నత స్థానం). స్వర్గవాసులందరిలో అది కేవలం ఒకే ఒక్కరికి లభిస్తుంది. ఆ ఒక్కణ్ణి నేనేనని నా అభిప్రాయం. కనుక నాకు వసీలా లభించాలని ప్రార్థించే వ్యక్తికి నా సిఫారసు తప్పకుండా లభిస్తుంది“. (ముస్లిం – నమాజ్ ప్రకరణం.)

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ ﷺ: « لَا تَتَّخِذُوا قَبْرِي عيدا وَلا تَجْعَلُوا بُيُوتَكُمْ قُبُورًا وَحيثُما كُنتُمْ فَصَلُّوا عَلَيَّ فَإِنَّ صَلاتِكُمْ تَبْلُغُنِي ». رَوَاهُ أَحْمَدُ

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “నా సమాధిని తిరునాళ్ళగా చేయకండి. మీ ఇండ్లను శ్మశానాలుగా మార్చుకోకండి. మీరెక్కడున్నా సరే నాపై దరూద్ పంపుతూ ఉండండి. మీ దరూద్ నాకు చేరవేయబడుతుంది”. (అహ్మద్-సహీహ్) (అల్బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథంలోని 20వ పుట)

عَنْ أَبِي بَكْرِ الصَّدِّيقِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُوْلُ اللهِ ﷺ: «أَكْثِرُوا الصَّلَاةَ عَلَيَّ فَإِنَّ اللَّهَ وَكُل بِي مَلَكًا عِنْدَ قَبْرِي فَإِذَا صَلَّى عَلَيَّ رَجُلٌ مِنْ أُمَّتِي قَالَ لِي ذلِكَ الْمَلَكُ : يَا مُحَمَّدَ إِنَّ فُلانَ ابْنَ فُلَانِ صَلَّى عَلَيْكَ السَّاعَةَ . رَوَاهُ الدَّيْلَمِي (حسن)

హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “నాపై అత్యధికంగా దరూద్ పంపండి. అల్లాహ్ నా సమాధి దగ్గర ఓ దూతను నియమిస్తాడు. నా అనుచరుడెవడయినా నాపై దరూద్ పంపితే, ఆ దైవదూత నాతో, “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)! ఫలానా అతను ఫలానా సమయంలో మీపై దరూద్ పంపాడు’ అని చెబుతాడు“. (దైలమీ -హసన్)(అల్ బానీగారి సిల్సిలతుల్ అహాదీసుస్సహీహా నాల్గో సంపుటి 1530వ హదీసు)

عَنِ ابْنِ مَسْعُوْدٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُولُ اللهِ ﷺ :إِنَّ للهِ مَلائِكَة سيَّاحِيْنَ فِي الْأَرْضِ يُبَلِّغُونِي مِنْ  أمتي السَّلَامَ. رَوَاهُ النَّسَائِيُّ (صحیح)

హజ్రత్ ఇబ్నె మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “నా అనుచరులు నాకు చెప్పే సలాములను నాకు చేరవేయటానికి అల్లాహ్ కొంతమంది దూతల్ని నియమించాడు. వారు భూమిమీద తిరుగుతూ ఉంటారు”. (నసాయి-సహీహ్) (అల్ బానీగారి సహీహ్ సుననె నసాయి 1215వ హదీసు)

عَنْ أَبِي مَسْعُوْدٍ الأَنْصَارِيُّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ : «أَكْثِرُوا الصَّلاةَ عَليَّ فِي يَوْمِ الْجُمْعَةِ فَإِنَّهُ لَيْسَ يُصَلِّ عَلَيَّ أَحَدٌ يَوْمَ الْجُمْعَةِ إِلَّا عُرِضَتْ على صلاته». رَوَاهُ الْحَاكِمُ وَالْبَيْهَقِي

హజ్రత్ అబూ మస్ ఊద్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “జుమా నాడు నాపై అత్యధికంగా దరూద్ పంపండి. ఎందుకంటే జుమా నాడు ఎవరయినా నాపై దరూద్ పరిస్తే అది తప్పకుండా నాకు సమర్పించబడుతుంది“. (హాకిమ్, బైహఖీ-సహీహ్) (అల్బానీ గారి సహీహ్ జామె సగీర్ మొదటి సంపుటి 1219వ హదీసు)

عَنْ أَوْسِ بْنِ أَوْسٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ ﷺ: “إِنَّ مِنْ أَفْضَلِ أَيَّامِكُمْ يَوْمَ الْجُمْعَةِ فِيْهِ خُلِقَ آدَمُ، وَفِيْهِ قُبِضَ ، وَفِيْهِ الْنَّفْخَةُ، وَفِيْهِ الصَّعْقَةُ، فَأَكْثِرُوْا عَلَيَّ مِنَ الصَّلَاةِ فِيْهِ فَإِنَّ صَلاتِكُمْ مَعْرُوْضَةٌ عَلَيَّ قَالَ قَالُوا : يَا رَسُوْلَ اللهِ ﷺ وَكَيْفَ تُعْرَضُ صَلَاتُنا عَلَيْكَ وَقَدْ أَرَمْتَ؟ فَقَالَ : إِنَّ اللهَ عَزَّوَجَلَّ حَرَّمَ عَلَى الْأَرْضِ أَجْسَادَ الأَنْبِيَاءِ – رَوَاهُ ابو داود (صحيح)

హజ్రత్ ఔస్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “మీ రోజుల్లో జుమా రోజు ఎంతో ఘనమైనది. ఆ రోజునే ఆదం పుట్టించబడ్డారు. ఆ రోజునే మరణించారు. ఆ రోజునే శంఖం పూరించబడుతుంది. ఆ రోజునే మృతుల్ని తిరిగి లేపే ఆజ్ఞ అవుతుంది. కనుక ఆ రోజు మీరు నాపై అత్యధికంగా దరూద్ పంపండి. మీ దరూద్ నాకు చేరవేయబడుతుంది“.

అది విని అనుచరులు, “దైవప్రవక్తా! మేము పంపే దరూద్ తమకు ఎలా చేరవేయబడుతుంది. అప్పటికి మీ ఎముకలు (సయితం) కృశించిపోయి ఉంటాయి కదా! (లేక) మీ దేహం మట్టిలో కలిసిపోయి ఉంటుంది కదా!” అని సందేహపడగా, “అల్లాహ్ దైవప్రవక్తల శరీరాల్ని మట్టికొరకు నిషేధం చేశాడు” అని చెప్పారాయన (సల్లల్లాహు అలైహి వసల్లం). (అబూదావూద్-సహీహ్) (అల్బానీగారి సహీహ్ సుననె అబూదావూద్ మొదటి సంపుటి 925)

عَنْ فَضَالَةَ بْن عُبَيْدٍ قَالَ: بَيْنَ رَسُولُ اللهِ ﷺ قَاعِدٌ إِذْ دَخَلَ رَجُلٌ فَصَلَّى فَقَالَ: اللَّهُمَّ اغْفِرْ لِي وَارْحَمْنِي. فَقَالَ رَسُولُ اللهِ : عَجَّلْتَ أَيُّهَا الْمُصَلِّي، إذَا صَلَّيْتَ فَقَعَدْتَ فَاحْمَدِ اللَّهَ بِمَا هُوَ أَهْلُهُ وصَلَّ عَلَيَّ ثُمَّ ادْعُهُ، قَالَ : ثُمَّ صَلَّى رَجُلٌ آخَرٌ بَعْدَ ذَلِكَ فَحَمِدَ اللهَ وَصَلَّى عَلَى النَّبِيِّ ﷺ فَقَالَ ا أَيُّهَا الْمُصَلِّي أَدْعُ تُجَبْ». رَوَاهُ التَّرْمِذِي (صحیح)

హజ్రత్ ఫజాలా బిన్ ఉబైద్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒకరోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (మస్జిదులో) కూర్చొని ఉండగా ఒక వ్యక్తి లోనికి ప్రవేశించాడు. నమాజ్ చేసిన తర్వాత అతను “ఓ అల్లాహ్! నన్ను క్షమించు. నా మీద దయజూపు” అని ప్రార్థించటం మొదలు పెట్టాడు. అది చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతన్ని ఉద్దేశ్యించి, “ఓయీ నమాజ్ చేసిన వ్యక్తి! నువ్వు ప్రార్థించటంలో తొందరపడ్డావు. నమాజ్ చేసుకున్న తర్వాత దుఆ కోసం కూర్చున్నప్పుడు ముందుగా తగిన విధంగా అల్లాహ్ ను స్తుతించు. తర్వాత నాపై దరూద్ పఠించు. ఆ తర్వాత నీ కోసం దుఆ చేసుకో” అని ఉపదేశించారు..

మరో వ్యక్తి సమాజ్ చేసుకున్న తర్వాత ”ముందుగా అల్లాహ్ ను స్తుతించాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠించాడు. అది చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఓయీ నమాజ్ చేసిన వ్యక్తీ! ప్రార్థించు, నీ ప్రార్ధన తప్పకుండా స్వీకరించబడుతుంది” అని అన్నారు. (తిర్మిజీ-సహీహ్) (అల్బానీ గారి సహీహ్ సుననె తిర్మిజీ మూడో సంపుటి 2865వ హదీసు)

عَنْ أُبي بْنِ كَعْبٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قُلْتُ يَا رَسُولَ اللَّهِ وَ إِنِّي أُكْثِرُ الصَّلَاةَ عَلَيْكَ فَكَمْ أَجْعَلُ لَكَ مِنْ صَلَاتِي ؟ قَالَ : مَاشِئتَ. قُلْتُ : الرُّبْعَ. قَالَ: مَا شِئتَ فَإِنْ زِدْتَ فَهُوَ خَيْرٌ لَكَ . قُلْتُ : فَالنَّصْفَ . قَالَ : مَا شِئْتَ فَإِنْ زِدْتَ فَهُوَ خَيْرٌ لَكَ . قُلْتُ: فَالثُّلُتَيْنِ . قَالَ : مَا شِئتَ فَإِنْ زِدْتَ فَهُوَ خَيْرٌ لَكَ . قُلْتُ : أَجْعَلُ لَكَ صَلَاتِي كُلَّهَا . قَالَ : إذا يُكْفَى هَمَّكَ وَيُغْفَرُ لَكَ ذَنْبُكَ . رَوَاهُ الترمذي (حسن)

హజ్రత్ ఉబై బిన్ కాబ్(రదియల్లాహు అన్హు) కథనం: నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో మాట్లాడుతూ, “దైవప్రవక్తా! నేను అత్యధికంగా మీపై దరూద్ పంపుతూ ఉంటాను. అసలు నా ప్రార్ధనలో ఎంత సేపు మీపై దరూద్ పఠించాలి?” అని అడిగాను. అందుకాయన, ”నీకిష్టమయినంతసేపు” అని అన్నారు. “నా ప్రార్థనలో నాల్గోవంతు మీ దరూద్ కోసం కేటాయిస్తే సరిపోతుందా?” అని అడిగాను, ”సరిపోతుంది. కాని * అల్బానీ గారి సహీహ్ సుననె తిర్మిజీ మూడో సంపుటి 2865వ హదీసు. అంతకన్నా ఎక్కువ సేపు దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నారాయన. నేను “సగం ప్రార్థన (దుఆ) దరూద్ కోసం కేటాయిస్తాను” అని అన్నాను. దానికాయన ”సరే, నీ యిష్టం. కానీ అంతకన్నా ఎక్కువసేపు దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అన్నారు. నేను మళ్లీ “అయితే మూడింట రెండు వంతుల ప్రార్థన దానికోసమే కేటాయించమంటారా?” అని అడిగాను. ఆయన “నీ యిష్టం. ఇంకా ఎక్కువ సమయం దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నారు. చివరికి నేను, ”మరయితే నా ప్రార్థన అంతా దరూద్ కోసమే ప్రత్యేకించుకుంటున్నాను” అని అన్నాను. అప్పుడాయన “ఈ పద్ధతి నీ దుఃఖవిచారాలన్నిటినీ దూరం చేస్తుంది. నీ పాపాల మన్నింపుకు దోహదపడుతుంది” అని చెప్పారు. (తిర్మిజీ-హసన్)(అల్బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ రెండోసంపుటి 1999వ హదీసు)

عَنْ عَلِيّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رسول الله ﷺ : الْبَخِيلُ الَّذِي مَنْ ذُكِرْتُ عَنْدَهُ فَلَمْ يُصَلُّ عَلَيَّ». رَوَاهُ التَّرْمِذِيُّ (صحیح)

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: ”తన దగ్గర నా ప్రస్తావన వచ్చినప్పటికీ నాపై దరూద్ పఠించనివాడు పరమ పిసినిగొట్టు.” (తిర్మిజీ-సహీహ్) (అల్బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ మూడో సంపుటి 2811వ హదీసు)

عَنْ فَاطِمَةَ رَضِيَ اللهُ عَنْهَا بِنْتِ رَسُوْلِ اللهِ ﷺ قَالَتْ : كَانَ رَسُوْلُ اللهِ ﷺ إِذَا دَخَلَ الْمَسْجِدَ يَقُولُ: «بِسْمِ اللهِ وَالسَّلَامِ عَلَى رَسُوْلِ اللَّهِ ، اللَّهُمَّ اغْفِرْ لِي ذُنُونِي، وَافْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ، وَإِذَا خَرَجَ قَالَ: بِسْمِ اللَّهِ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللهِ ، اللَّهُمَّ اغْفِرْ لِي ذُنُوبِي وَافْتَحْ لِي أَبْوَابَ فَضْلِكَ رَوَاهُ ابْنُ مَاجَةَ

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుమార్తె హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా ) కథనం; దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మస్జిద్ కి ప్రవేశించేటప్పుడు ఇలా పలికేవారు.

“బిస్మిల్లాహి వస్సలాము అలా రసూలిల్లాహి అల్లాహుమ్మగ్ఫోర్లీ జునూబీ, వఫతహ్లీ అబ్వాబ రహ్మతిక”, (అల్లాహ్ పేరుతో మస్జిద్లోకి ప్రవేశిస్తున్నాను. దైవప్రవక్తపై శాంతి కురియు గాక! అల్లాహ్! నా పాపాలను మన్నించు. నా కోసం నీ కారుణ్య ద్వారాలను తెరిచి ఉంచు.)

తిరిగి మస్జిద్ నుండి వెడలినప్పుడు ఈ విధంగా ప్రార్థించేవారు.

“బిస్మిల్లాహి వస్సలాము అలా రసూలిల్లాహి, అల్లాహుమ్మ్ఫరీ జునూబీ వఫతహ్లీ అబ్వాబ పబ్లిక”. (అల్లాహ్ పేరుతో వెడలుతున్నాను. దైవప్రవక్తకు శాంతి కల్గుగాక! దేవా! నా పాపాలను మన్నించు. నీ కటాక్ష ద్వారాలను నా కోసం తెరిచి ఉంచు.)(ఇబ్నెమాజా-సహీహ్)(అల్బానీగారి సహీహ్ సుననె ఇబ్సెమాజా మొదటి సంపుటి 625వ హదీసు)

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: «مَا جَلَسَ قَوْمٌ مَجْلِسًا لَمْ يَذْكُرُوا اللهَ فِيْهِ، وَلَمْ يُصَلَّوْا عَلَى نَبِيِّهِمْ إِلا كَانَ عَلَيْهِمْ يَرَةً فَإِنْ شَاءَ عَذَبَهُمْ وَإِنْ شَاءَ غَفَرَ لَهُمْ . رَوَاهُ التَّرْمِذِيُّ (صحیح)

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: కొంతమంది ఏదయినా ఒక చోట సమావేశమై ఆ సమావేశంలో అల్లాహ్ ను జ్ఞాపకం చేసుకోకపోతే, తమ ప్రవక్తపై దరూద్ పంపకపోతే ఆ సమావేశం వారిపాలిట తలవంపుగా పరిణమిస్తుంది. అల్లాహ్ వారిని శిక్షించనూవచ్చు లేదా మన్నించనూ వచ్చు. (తిర్మిజీ-సహీహ్)(అల్బానీగారి సహీహ్ సునవె తిర్మిజీ మూడో సంపుటి 2691వ హదీసు)

عَنْ أَبِي الدَّرْدَاءِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: «مَنْ صَلَّى عَلَيَّ حَيْنَ يُصْبِحُ عَشْرًا وَحِيْنَ يُمْسِي عَشْرًا أَدْرَكَتْهُ شَفَاعَتِي يَوْمَ الْقِيَامَةِ». رَوَاهُ الطَّبَرَانِيُّ (حسن)

హజ్రత్ అబూదర్దా(రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: ఎవరయినా నాపై ఉదయం వేళ పదిసార్లు. తిరిగి సాయంత్రం పూట పదిసార్లు దరూద్ పఠిస్తే ప్రళయదినాన వారికి నా సిఫారసు లభిస్తుంది.(తబ్రానీ-హసన్)(అల్బానీగారి సహీహ్ జామే ఉస్-సగీర్ 6233వ హదీసు)

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: كَانَ إِذَا سَلَّمَ النَّبِيُّ ﷺ مِنَ الصَّلاة قَالَ ثَلَاثَ مَرَّاتٍ : سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُوْنَ، وَسَلَامٌ عَلَى الْمُرْسَلِيْنَ، وَالْحَمْدُ للهِ رَبِّ الْعَالَمِينَ. رَوَاهُ أَبُوْ يَعْلِي (حسن)

హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సలాం చేసి నమాజ్ ముగించిన తర్వాత మూడుసార్లు ఈ విధంగా ప్రార్థించేవారు. “సుబహాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిపూన్వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హము లిల్లాహి రబ్బిల్ ఆలమీన్”, నీ ప్రభువు పరిశుద్ధుడు, గొప్ప గౌరవోన్నతులు కలవాడు, వారు కల్పిస్తున్న అన్ని విషయాలకూ అతీతుడు. దైవప్రవక్తలపై శాంతి వర్షించుగాక! సకలలోక ప్రభువే సకల స్తోత్రాలకూ అర్హుడు. (అబూయాలా – జయీఫ్)(ఈ హదీసు ఆధారాల రిత్యా బలహీనమైనది. వివరాలకోసం జయీఫ్ జామే ఉస్-సగీర్ 4419, అజ్జయిఫా 4201 లు చూడండి)

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

హదీసు పబ్లికేషన్స్ వారు ప్రచురించిన పుస్తకాలు క్రింది లింక్ దర్శించి డౌన్లోడ్ చేసుకోగలరు.
https://teluguislam.net/hadith-publications-books/

తలాఖ్ ఆదేశాలు – ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

తలాఖ్ ఆదేశాలు - ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

ఉర్దూ మూలం : మౌలానా ముహమ్మద్ ఇక్బాల్ కీలానీ
తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
ప్రకాశకులు : హదీస్ పబ్లికేషన్స్

[మొబైల్ ఫ్రెండ్లీ బుక్]
[PDF] [80 పేజీలు] [3 MB]

[డెస్క్ టాప్ బుక్ పుస్తకం]
[PDF] [80 పేజీలు] [67.4 MB]

విషయసూచిక

అన్ని చాఫ్టర్లు PDF లింకులు గా క్రింద ఇవ్వబడ్డాయి. లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చదవవచ్చు.

  • మహిళాభ్యుదయ సంఘాలకు మనవి [1p]
  • 1. ముందు మాట [28p]
    • కఠినమైన మార్గం
    • విడాకుల సాంప్రదాయిక పద్ధతి
    • ముఖ్య నియమ నిభందనలు
    • ఒక విడాకుతో వేరుపడటం
    • రెండు విడాకులతో వేరు పడటం
    • మూడు విడాకులతో విడిపోయే ధర్మ సమ్మతమైన పద్ధతి
    • ఖులా
    • ఏక కాలంలో మూడు విడాకులు
    • హలాలా
    • ఇస్లాం – సమత్వం, సమతూకంతో కూడిన ధర్మం
    • వివాహ చట్టాలు
    • విడాకులు
    • నియోగ చట్టం
    • ఇస్లాం మరియు మనిషి గౌరవ మర్యాదలు
    • ముగింపు

హదీసుల పరంగా చాఫ్టర్లు

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

హదీసు పబ్లికేషన్స్ వారు ప్రచురించిన పుస్తకాలు క్రింది లింక్ దర్శించి డౌన్లోడ్ చేసుకోగలరు.
https://teluguislam.net/hadith-publications-books/

ఇస్లాం ప్రియ బోధనలు – సయ్యద్ అబ్దుల్ హకీం [పుస్తకం]

ఇస్లాం ప్రియ బోధనలు (Islam Priya Bodhanalu)
రచయిత: సయ్యద్ అబ్దుల్ హకీం, ఎం. ఎ. (Syed AbdulHakim, M.A)
అనువాదం: అబ్దుల్ బాసిత్ ఉమరి, ఎం.ఓ.ఎల్. (AbdulBasit Omari M.O.L)

ఈ చిరు పుస్తకంలో ముస్లింలు ఏ విధంగా తమను తాము సరిదిద్దుకోవాలి అనే అంశాన్ని రచయిత చాలా చక్కగా వివరించారు.

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
PDF (పిడిఎఫ్) 42 పేజీలు – మొబైల్ ఫ్రెండ్లీ బుక్

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

తొలిపలుకు

ఈ లోకం ఆర్థికంగా, భౌతికంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మానవతా విలువలు దిగజారుతున్నాయి. అందుకనే ఈ లోకంలో శాంతి సౌభాగ్యాలు కరువై దౌర్జన్యకాండలు, రక్తపాతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నేడు మనశ్శాంతి కోసం అల్లాడుతున్న మానవజాతికి ఇస్లాం ధర్మంలోనే ఆశాకిరణం కానవస్తుంది. ఇస్లాం ధర్మం శాంతి సౌభాగ్య బోధనలతో నిండి ఉంది. సత్ప్రవర్తన, నీతి, న్యాయం, సత్యసంధత, ప్రేమ, సోదరభావం, శాంతి; ఇవన్నీ ఇస్లాం బోధనలకు ప్రతిరూపాలే. సర్వమానవాళిని సృజించిన అల్లాహ్ కు మానవాళి కృతార్థమార్గం తెలియును. కావున వారి కృతార్థతకొరకు ఆయన ఇస్లాం ధర్మాన్ని అవతరింపజేసెను.

పరలోకమునందు, విచారణదినము నందు విశ్వాసం ఉంచటం ఇస్లాం మౌలిక బోధనల్లో ఒకటి. అందువల్లనే మానవుడు దుష్పలితాలకు నరకశిక్షకు భయపడి, సత్ఫలితాలను, స్వర్గ భాగ్యాలను ఆశిస్తూ దుష్కార్యాలకు దూరంగా ఉంటూ, సత్కార్యాలు చేస్తూ ఉంటాడు. ఇందువల్ల ఈ లోకం శాంతి సౌభాగ్యాలకు అలవాలమవుతుంది. కానీ పరలోక విశ్వాసమే లేకపోతే ఈ లోకం దౌనర్జన్యకాండలకు రక్తపాతాలకు ఆలవాలమై నరకకూపంలా తయారవుతుంది.

ఏక దైవారాధన విశ్వాసం, దైవ ప్రవక్త పై విశ్వాసం, పరలోక విశ్వాసం ఇవి మూడూ ఇస్లాం ధర్మం యొక్క మౌళిక బోధనలు. కానీ ఈ మూడు బోధనల యందు విశ్వాసం ఉంచు ముస్లింలే వాటిని సరిగా అర్థం చేసుకోక వాటి గురించిన విధులు నెరవేర్చ లేకపోతున్నారు. కావున ముస్లింలు ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని దాని ప్రకారం ఆచరించటం కోసమే ఈ పుస్తకం రచింపబడింది. ఈ విధంగా ముస్లింలు వాస్తవంగా ముస్లిములై ముస్లిమేతరులకు మార్గదర్శులు కాగలరు.

కానీ ఒక చేదు వాస్తవమేమిటంటే కొందరు ముస్లింలు తమ ఆజ్ఞానము వల్ల ముస్లిమేతరులకు తీసిపోని విధంగా తయారయ్యారు. తాము ముస్లింలని చెప్పుకుంటూనే అల్లాహు ను విడిచి సమాధులను, వలీలను పూజిస్తున్నారు. లాభనష్టాలు, సుఖదుఃఖాలు వారి చేతిలోనే ఉన్నాయని భావిస్తున్నారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవుడు కాదని, దేవుని భాగం లేదా అవతారమని అపార్థపడుతున్నారు. జంతువులను అల్లాహ్ పేర కాకుండా సమాధుల పేర బలియిస్తున్నారు. నమాజ్ ఆరాథనను అల్లాహ్ కొరకు అంకితం చేయక అబ్దుల్ ఖాదిర్ జీలానీ కొరకు కూడా భాగం ఇస్తున్నారు. సమాధులకు ప్రదక్షిణాలు చేసి హజ్ చేసినంత పుణ్యం దొరికిందని, ఇక స్వర్గప్రవేశం తప్పక లభిస్తుందని సంబరపడుతున్నారు. ఇవన్నీ నామ మాత్రపు ముస్లింలు యేర్పరుచుకున్న బూటకపు దురాచారాలేగానీ, వాటికి ఇస్లాంతో ఎటువంటి సంబంధమూ లేదు. అందుకనే ముస్లింలు సంఖ్యలో అధికంగా ఉన్నా, వారికి యే విధమైన విలువా లేకపోయింది. అజ్ఞానం మరియు ఇస్లాం వాస్తవ బోధనలకు దూరం కావటం వల్లనే ఇలా జరుగుతోంది.

ఇకనైనా ముస్లింలు సువర్ణావకాశాలను చేజార్చుకోకుండా ఇస్లాం వాస్తవ బోధనలు తెలుసుకుని వాటి ప్రకారం ఆచరించి అల్లాహ్ ను సంతుష్టపర్చి ఆయన దయకు పాత్రుల కాగలరని ఆశిస్తున్నాం.

మౌలానా సయ్యద్ అబ్దుల్ హకీం గారు ముస్లింల సంస్కరణ మరియు ముస్లిమేతరులకు ఇస్లాం ధర్మ ఆహ్వానం మొదలగు ఉన్నత సంకల్పాలతో ఈ పుస్తకాన్ని రచించి ధన్యులయ్యారు. ఇందు అన్ని విషయాలూ దివ్యఖుర్ ఆన్ వాక్యాలు మరియు పవిత్ర హదీసు వచనాల ఆధారంతోనే పేర్కొనబడినవి. ఈ క్రింద అతిక్లుప్తంగా రచయిత జీవిత విశేషాలు ఇవ్వబడుతున్నాయి.

సయ్యద్ అబ్దుల్ హకీం గారు 7-6-1939 సo. హైదరాబాదులో జన్మించారు. ఆయన 1969 లో ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి ఎం. ఏ చేశారు. మరొక వైపు ఇస్లాం ధార్మిక విధ్యలో కూడా ప్రావీణ్యత సంపాదించారు. ఆయన గొప్ప ప్రసంగీకులేకాక ప్రముఖరచయిత కూడా. ఇంతవరకు సుమారు ఇరవై చిరు పుస్తకాలు రచించారు. అవి ఉర్దూభాషలోనే కాక ఆంగ్లం మరియు తెలుగు భాషల్లో కూడా అనువదింపబడి ప్రచురింపబడినవి. మౌలానా సయ్యద్ అబ్దుల్ హకీం గారు ప్రస్తుతం సౌదీ అరేబియా ప్రభుత్వం తరుపున దోహ ఖతర్ లో ఇస్లాం ప్రచార బోధనా కేంద్రంలో ధార్మిక బోధకునిగా సేవ చేయుచున్నారు.

అల్లాహ్ రచయితకు, అనువాదకునికీ, ప్రచురణకర్తకు మరియు ఇతర సహకారులందరికీ సంకల్ప శుద్ధి ప్రసాదించుగాక! ఈ చిరు ప్రయత్నాన్ని స్వీకరించి మనందరికీ ఇహపరలోకాల కృతార్థత ప్రసాదించుగాక! ఆమీన్.

సయ్యద్ సఈ ముర్రహ్మాన్ ఎం. ఏ.
ప్రధాన కార్యదర్శి జమయ్యతె అహ్లెహదీస్;
హైదరాబాద్ సికింద్రాబాద్.

విషయ సూచిక

  • పవిత్ర వచనం: లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్రసూలుల్లాహ్.
  • విధ్యాభ్యాస ప్రాముఖ్యత
  • ఏకదైవారాధన – మానవ ప్రవర్తనా సంస్కరణ
  • ఏకదైవారాధన సంఘ సంస్కరణ
  • ఇస్లాం ఒక సద్గుణ బోధిని
  • “సలామ్” సదాచార వివరాలు
  • ఏక ధైవారాధనా విశ్వాసం
  • బహు ధైవారాధన
  • విచారణ దిన సిఫారసు వివరాలు
  • ఇస్లాం విశిష్టతలు

ఇస్లాం జీవన విధానం – మౌలానా ముఖ్తార్ అహ్మద్ నద్వీ [పుస్తకం]

ఇస్లామ్ జీవన విధానం (తాలీముల్ ఇస్లామ్) (Islam Jeevana Vidhanam)
సంకలనం: మౌలానా ముఖార్ అహ్మద్ నద్వీ (రహిమహుల్లాహ్)
అనువాదం : ముహమ్మద్ జాకిర్ ఉమరీ
ప్రకాశకులు : హదీస్‌ పబ్లికేషన్స్‌. హైద్రాబాద్‌, ఏ.పి. ఇండియా

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/3eltfNT
PDF (పిడిఎఫ్) 164 పేజీలు – మొబైల్ ఫ్రెండ్లీ బుక్

విషయసూచిక

  1. తొలిపలుకు
  2. ఇస్లామ్ ప్రత్యేకతలు (మహాసినుల్ ఇస్లామ్)
  3. ఇస్లామీయ విశ్వాసాలు (కలిమయె తయ్యిబహ్ అర్థం)
  4. ఉత్తమ వచనాన్ని విశ్వసించే విధానం
  5. ముహమ్మదుర్రసూలుల్లాహ్ యొక్క భావం
  6. ఈమాన్ విధులు
  7. అత్-తౌహీద్
  8. ముస్లిముల నమ్మకాలు
  9. అల్-వసీలహ్
  10. ధర్మసమ్మతమైన వసీలహ్ మూడు రకాలు
  11. ఇస్లాం విధులు, పరిశుభ్రత
  12. ఆహారపదార్థాల పానీయాల ఎంగిలి
  13. శరీర, దుస్తుల పరిశుభ్రత
  14. స్థల పరిశుభ్రత
  15. నజాసత్ వివరణ
  16. మల మూత్ర విసర్జనా నియమాలు
  17. పరిశుద్ధతను పొందే స్నానం (గుసులె జనాబత్)
  18. తయ్యమ్ముమ్
  19. తయ్యమ్ముమ్ పద్ధతి
  20. వుజూ
  21. మసహ్
  22. అజాన్
  23. నమాజ్
  24. నమాజు లోని సాంప్రదాయక విషయాలు
  25. నమాజ్ సంపూర్ణ స్వరూపం
  26. తషహ్హుద్ లేదా అత్తహియ్యాత్ – దరూద్
  27. జుమ (శుక్రవారం) నమాజ్
  28. రెండు నమాజులను కలిపి ఆచరించడం
  29. ప్రయాణీకుని నమాజ్
  30. పండుగల నమాజ్
  31. మస్జిదుల్లో స్త్రీల ప్రవేశం
  32. నఫిల్ నమాజులు, తహజ్జుద్, తరావీహ్
  33. చాప్త్ నమాజ్
  34. సలాతుల్ ఇస్తిఖారహ్
  35. సలాతుత్తస్బీహ్
  36. గ్రహణ నమాజులు
  37. ఇస్ తిస్ ఖా (వర్షపు) నమాజ్
  38. జనాజా నమాజ్
  39. సమాధులను సందర్శించుట
  40. జకాత్
  41. జకాత్ చెల్లించని వారికి కఠిన హెచ్చరికలు
  42. అవ్ ఖాఫ్ ఆదాయంపై జకాత్
  43. పశుసంపదలో జకాత్
  44. ఒంటెల్లో జకాత్
  45. ఆవు గెదెల జకాత్, గొర్రెల మేకల్లో జకాత్
  46. జకాతును పొందేవారు
  47. జకాతుకు చెందిన వివిధ సమస్యలు
  48. సదఖతుల్ ఫిత్ర్
  49. నఫిల్ (అదనపు) సదఖాలు
  50. రోజా (ఉపవాసం)
  51. రోజా విధులు
  52. నఫిల్ రోజాలు
  53. రోజా నియమాలు
  54. రోజా స్థితిలో ధర్మసమ్మతమైన విషయాలు
  55. రోజాను భంగపరిచే విషయాలు
  56. హజ్, హజ్ రకాలు
  57. హజ్ విధులు, హజ్ ని తప్పనిసరి విధులు
  58. ఉమ్రా
  59. మృతుని తరఫున హజ్ నిర్వర్తించటం
  60. ఉమ్రా బదల్
  61. మీఖాత్
  62. ఇహ్రామ్
  63. తవాఫ్ మరియు సయీ
  64. సఫా మర్వాల సయీ
  65. హజ్ పద్ధతి
  66. తలగీయించుట లేదా వెంట్రుకలు కత్తిరించుట
  67. మూడు జమరాత్ (షైతాన్)పై కంకరాళ్ళు విసురుట
  68. నికాహ్ మరియు మంచి సమాజం
  69. నికాహ్
  70. నికాహ్ కార్యక్రమం పూర్తయ్యే విషయాలు
  71. నికాహ్ లో మహ్ర్ తప్పనిసరి
  72. కట్నకానుకలు, వరకట్నం
  73. వలీమా
  74. వివాహ నిషిద్ధ స్త్రీలు
  75. బాల్యంలో పాలవల్ల నిషిద్ధమయ్యే స్త్రీలు
  76. తాత్కాలిక నిషిద్ధం
  77. లిఆన్ చేయబడిన స్త్రీతో నికాహ్
  78. ముష్రిక్ స్త్రీతో నికాహ్
  79. భార్యభర్తల హక్కులు
  80. భర్త హక్కులు
  81. భర్త రెండో హక్కు
  82. భర్త మూడవ హక్కు
  83. అల్ హిజాబ్ (పర్దా)
  84. తలాఖ్
  85. తలాఖ్ సున్నీ, తలాఖ్ బిద్ యీ
  86. రజ్ అత్
  87. ఖుల
  88. జిహార్
  89. ఫిస్క్ (నికాహ్ భంగపరుచుట)
  90. ఈలా
  91. లి ఆన్
  92. ఇద్దత్
  93. ఇద్దత్ రకాలు
  94. హరామ్ నికాహ్
  95. నేరాలు శిక్షలు
  96. వ్యభిచారం
  97. స్వలింగసంపర్కము (లివాతత్)
  98. ఖజఫ్ (వ్యభిచార నింద మోపటం)
  99. మురతద్ (ఇస్లామ్ పరిధి నుండి తొలగిపోవుట)
  100. అల్ హిరాబహ్ (ఉగ్రవాదం)
  101. దొంగతనం
  102. హత్య
  103. హత్యలు మూడు రకాలు
  104. ఉద్దేశ్యపూర్వకంగా చేసే హత్యకు శిక్ష
  105. ఉద్దేశ్యపూర్వకంగా హత్యచేసేవాడు అల్లాహ్ అనుగ్రహానికి అనర్హుడు
  106. వ్యాపారం
  107. వ్యాపార విశిష్టత
  108. వ్యాపారనియమాలు
  109. దొంగసరుకు కొనడం నిషిద్ధం
  110. ప్రమాణాలు చేసి సరుకును అమ్మడం నిషిద్దం
  111. మస్జిద్ లో వ్యాపారం చేయకూడదు
  112. వడ్డీ
  113. వడ్డీ నిషేధం
  114. మొక్కుబడి, వ్యర్ధమైన మొక్కుబడి
  115. షరతులతో కూడిన మొక్కుబడి
  116. సాధారణమైన మొక్కుబడి
  117. సృష్టితాల మొక్కుబడి నిషిద్ధం
  118. మొక్కుబడి పరిహారం
  119. మొక్కుబడి ఉపవాసాలు
  120. ప్రమాణం చేయుట
  121. ప్రమాణాలలో రకాలు
  122. ధృడమైన ప్రమాణం భంగం చేస్తే పరిహారం
  123. గట్టి ప్రమాణం భంగపరిస్తే పరిహారం
  124. ఔలియా అల్లాహ్ (అల్లాహ్ భక్తులు వారి మహిమలు)
  125. హక్కులు
  126. తల్లిదండ్రులపై సంతాన హక్కులు
  127. సంరక్షణ
  128. బంధువుల హక్కులు
  129. పొరుగువారి హక్కులు
  130. అతిథి మర్యాదలు
  131. అనాధల హక్కులు
  132. ముస్లిముల పరస్పర హక్కులు
  133. మానవ హక్కులు
  134. న్యాయం ధర్మం
  135. సుగుణాలు
  136. సత్యం, సత్యం పలుకుట
  137. క్షమాపణ మన్నింపు, వినయ విధేయతలు
  138. సత్యశీలత పరిశుద్ధత
  139. ఇహ్ సాన్, ధైర్యం, పర ప్రాధాన్యత
  140. న్యాయం ధర్మం
  141. అమానత్
  142. ఇస్లామీయ జీవిత విధానం
  143. ప్రత్యేక సత్కార్యాలు
  144. ఉదయం సాయంత్రం చేసే దుఆలు
  145. పడుకున్నప్పుడు, మేల్కోన్నప్పుడు పఠించే దుఆలు
  146. మరుగుదొడ్డిలో ప్రవేశించినపుడు పఠించే దుఆ
  147. బయటకు వచ్చిన తరువాత పఠించే దుఆ
  148. కొత్త బట్టలు ధరించేటప్పుడు పఠించే దుఆ
  149. ఇంటి నుండి బయటకు బయలుదేరేప్పుడు దుఆ
  150. మస్జిద్ లో ప్రవేశించినప్పుడు పఠించే దుఆ
  151. మస్జిద్ నుండి బయటకు వచ్చేటప్పుడు పఠించే దుఆ
  152. భోజనానికి ముందు పఠించే దుఆ
  153. భోజనం తరువాత పఠించే దూఆ
  154. ఆతిథ్యం ఇచ్చిన వారి కొరకు దుఆ
  155. భార్యతో సంభోగానికి ముందు పఠించే దుఆ
  156. ప్రయాణం సంకల్పించినప్పుడు
  157. వాహనముపై ఎక్కినప్పుడు పఠించే దుఆ చేసే దుఆ
  158. ఆయతుల్ కుర్సీ
  159. దైవానుగ్రహం పూర్తయిన పిదప పఠించే దుఆ

తొలి పలుకు

ఇస్లామీయ ప్రాధమిక విద్యను అభ్యసించడం ప్రతి ముస్లిమ్ స్త్రీ పురుషుల విధి. ఇస్లామ్ ఈ ప్రపంచంలో ఏకైక మార్గ దర్శక ధర్మం. దీని బోధనలు మానవ ప్రకృతికి అనుగుణంగా ఉన్నాయి. ఒకవేళ ఇస్లాంను జీవిత రంగాలన్నిటిలో పూర్తిగా అవలంభిస్తే, జీవితమంతా సుఖశాంతులతో, శాంతి భద్రతలతో, సంతోషాలతో విలసిల్లుతుంది. ప్రతి ముస్లిమ్ స్త్రీ పురుషులు వాస్తవ పరిశుద్ధ జీవితపు అనుభూతిని పొందగలరు. దీన్ని ఎంతోమంది అనుభవించి చూచిఉన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

ఇస్లామీయ ఆదేశాలు జీవితపు అన్ని రంగాలకు వర్తిస్తాయి. అందువల్ల వాటిని పొందేందుకు బుద్ధి జ్ఞానాలు గల వయస్సు ఎంతైనా అవసరం. మరీ చిన్న వయస్కులు దీన్ని అర్థం చేసుకోలేరు. అందువల్లే దీని పాఠ్య ప్రణాళిక ఈ విధంగా తయారు చేయ బడింది. దీని శిక్షణ ఇచ్చిన పొందిన యువకుల క్లాసులు ఏర్పాటు చేయాలి. కనీసం వారానికి ఒక రోజయినా యువకులందరూ ఇందులో పాల్గొనాలి.

నమాజుకు వచ్చే యువకుల్లో శ్రామికులు, విద్యార్థులు, వ్యాపారులు మొదలైన అనేక వృత్తులకు చెందిన వారుంటారు. వీరి వయస్సు 15 నుండి 35 వరకు ఉండాలి. ఇందులోని అధ్యాయాలను స్పష్టంగా బోధించాలి. పశ్నల ద్వారా వాటిని కంఠస్తం చేయిం చాలి. మస్జిదుల ఇమాములు, నిర్వాహకులు, వారానికి ఒక అధ్యాయాన్నే బోధించాలి. దాన్ని ఇతర వివరాలతో స్పష్టంగా అర్థమయ్యేటట్లు అధ్యయనం చేయించాలి.

శనివారం వరకు విద్యార్థులు తమ ఇళ్ళలోనే పాఠాన్ని కంఠస్థం చేయాలి. శనివారం నాడు గతవారం పాఠాన్ని ప్రతి ఒక్కరూ అప్పజెప్పాలి. విద్యార్థులు పరస్పరం ప్రశ్నలు అడగాలి. సమాధానాలు చెప్పాలి. దీనివల్ల పుస్తకంలోని పాఠాలన్నీ గుర్తుంటాయి. ఇవి తప్ప ఇతర అనవసర ప్రశ్నలు వేయటంగాని సమాధానాలు చెప్పటంగానీ చేయరాదు. పుస్తకంలోని పాఠాలను నిర్మలమైన హృదయంతో, భక్తి శ్రద్ధలతో అభ్యసించాలి. దీనివల్ల అప్పటివరకు చదివిన పాఠాలన్నీ గుర్తుంటాయి.

ఈ పాఠ్యప్రణాళిక శ్రద్ధాభక్తులతో చదివి కంఠస్తం చేసుకోవాలి. కేవల పుణ్యం లభిస్తుందని, శుభం కలుగుతుందని భావించి ఖుర్ ఆన్ లా పఠించి ఊరుకుంటే ఎటువంటి లాభమూ కలుగదు. తాలీముల్ ఇస్లామ్ తబ్లీగీ నిసాబ్ కాదు. వీటి అధ్యాయాలను పాఠాలను భక్తిశ్రద్దలతో చదవాలి.

తాలీముల్ ఇస్లామ్ని బోధించే అధ్యాపకులు, బోధకులు, ఉపాధ్యాయులు నిర్వాహకులు ఈ పాఠ్య ప్రణాళికను బోధించే, స్పష్టంగా విశదపరిచే, కంఠస్తం చేయించే ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రతివారం ఒక్కొక్క పాఠాన్ని కంఠస్తం చేయించాలి వెనుకటి పాఠాల్లో నుండి పరీక్షలు పెట్టాలి.

ఈ పాఠ్య ప్రణాళిక పూర్తిగా కంఠస్తం చేసి పరీక్షల్లో మంచి మార్పులు పొందిన వారికి ‘అద్దారుస్సలఫియ్యహ్’ తరపున కొన్ని ఉర్దూ పుస్తకాలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల పురుషులతో పాటు స్త్రీలు కూడా ఈ కృషిలో ముందుకు రావాలి.

అల్లాహ్ (తఅలా) ను ముస్లిమ్ స్త్రీ పురుషుల్లో ఈ ప్రాధమిక విద్యాజ్ఞానాన్ని వ్యాపింప జేయమని ముస్లిముల ఇళ్ల నుండి ధార్మిక అజ్ఞానాన్ని తొలగించమని, ముస్లిములందరికి ధార్మిక విద్యను అభ్యసించే భాగ్యం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. (ఆమీన్) ఇన్షా అల్లాహ్ బాధ్యతాయుతంగా దీన్ని అభ్యసించేవారు ధార్మిక విద్యా శుభాలను పొంది, పరలోకంలో గొప్ప సాఫల్యాన్ని పొందగలరు. ఇహపరలోకాల్లో వీరిపై అల్లాహ్ శుభాలు, అనుగ్రహాలు కురుస్తాయి.

అల్హామ్లు లిల్లాహ్, ముస్లిం సమాజంలోని అన్ని వర్గాల్లోనూ తాలిముల్ ఇస్లామ్ను ఆదరించటం జరిగింది. అంతేకాక పాఠశాలల్లో, మదరసాల్లో కూడా దీన్ని తమ పాఠ్య పుస్తకాల్లో చేర్చుకోవటం జరిగింది. క్రమంగా తాలీముల్ ఇస్లామ్ కేంద్రాలు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ వ్యాపించి ఉన్నాయి.

తాలీముల్ ఇస్లామ్ను భారీ సంఖ్యలో ప్రచురించడం జరిగింది. రోజురోజుకు ప్రజల్లో దీని ఆదరణ పెరుగుతూ పోతుంది. అల్లాహ్ (తఅలా) ఈ పుస్తకం రచయితకు, ప్రకాశకులకు, అనువాదలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు రుజుమార్గం, సత్కా ర్యాలు చేసే భాగ్యం ప్రసాదించుగాక, ఇంకా దీన్ని వారి ఉభయలోకాల సాఫల్యానికి సాధనంగా రూపొందించు గాక. ఆమీన్.


ముఖ్తార్ర్ అహ్మద్ నద్వీ ,R.A.
ప్రధానాచార్యులు
అద్దారుస్సల ఫియ్యహ్, ముంబై
10-5-1996

  • హదీసు పబ్లికేషన్స్ వారు ప్రచురించిన పుస్తకాలు క్రింది లింక్ దర్శించి డౌన్లోడ్ చేసుకోగలరు.
    https://teluguislam.net/hadith-publications-books/

సరియైన విశ్వాసం, దానికి విరుద్ధమైన విషయాలు & ఇస్లాంను భంగపరిచే విషయాలు – ఇమాం ఇబ్నె బాజ్ [పుస్తకం]

The Correct Belief and what Opposes It – Imaam ibn Baaz (rahimahullah)
రచయిత
: అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్)
తెలుగు అనువాదం: islamhouse

  1. తొలి పలుకులు
  2. మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం చూపటం
  3. దైవదూతల పట్ల విశ్వాసం
  4. దైవగ్రంధాల పట్ల విశ్వాసం
  5. దైవ సందేశహరుల పట్ల విశ్వాసం
  6. పరలోకం పట్ల విశ్వాసం
  7. విధి వ్రాత పట్ల విశ్వాసం
  8. విశ్వాసం అన్నది పలకటం మరియు ఆచరించటం. అది విధేయత చూపటం వలన అధికమగును మరియు అవిధేయత చూపటం వలన తరుగును.
  9. అల్లాహ్ కొరకు ప్రేమించటం, అల్లాహ్ కొరకు ద్వేషించటం, అల్లాహ్ కొరకు స్నేహం చేయటం
  10. ఈ విశ్వాసం నుండి మరలిపోయి దానికి వ్యతిరేకంగా నడిచేవారి ప్రస్తావన
  11. అల్లాహ్ ఒక్కడి ఆరాధన చేయటం తప్పనిసరి అవటం

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం

తొలి పలుకులు

అల్హమ్దులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాం అలా మన్లా నబియ్యబఅదహ్ వఅలా ఆలిహి వసహబిహి. అమ్మాబాద్

సరియైన విశ్వాసము ఇస్లాం ధర్మము యొక్క మూలము మరియు ధర్మము యొక్క పునాది.  అందుకనే నేను ప్రసంగము యొక్క అంశము దానిపై ఉండాలని నేను భావించాను. మరియు ఖుర్ఆన్ హదీసు ధార్మిక ఆధారాల ద్వారా తెలిసేదేమిటంటే ఆచరణలు మరియు మాటలు సరియైన విశ్వాసముతో జరిగి ఉంటే సరిఅవుతాయి మరియు స్వీకరించబడుతాయి. ఒక వేళ విశ్వాసము సరి కాకపోతే ఆ ఆచరణలు, మాటలు నిర్వీర్యమైపోతాయి.  అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:

وَمَن يَكْفُرْ بِالْإِيمَانِ فَقَدْ حَبِطَ عَمَلُهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ 

ఎవడు విశ్వాస మార్గాన్ని తిరస్కరిస్తాడో అతడి కర్మలు వ్యర్థమవుతాయి.  మరియు అతడు పరలోకంలో నష్టం పొందేవారిలో చేరుతాడు.  [అల్ మాయిద 5:5]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

  وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ

మరియు వాస్తవానికి! నీకూ మరియు నీకంటే ముందు వచ్చిన (ప్రతి ప్రవక్తకూ) దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలుపబడింది: “ఒకవేళ నీవు బహుదైవారాధన (షిర్కు) చేసినట్లైతే నీ కర్మలన్నీ వ్యర్థమై పోతాయి మరియు నిశ్చయంగా, నీవు నష్టానికి గురి అయిన వారిలో చేరిపోతావు”.  [జుమర్ 39:65]

ఈ అర్థములో చాలా ఆయతులు కలవు.  అల్లాహ్ యొక్క స్పష్టమైన గ్రంధము మరియు నీతిమంతుడైన ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ తెలియపరచిన సరిఅయిన అఖీదా ఏమిటంటే అల్లాహ్ పై, ఆయన దూతలపై, ఆయన గ్రంధములపై, ఆయన ప్రవక్తలపై, అంతిమ దినముపై మరియు మంచి, చెడు విధివ్రాతపై విశ్వాసం చూపటంలో ఇమిడి ఉంది.  ఈ ఆరు విషయాలు సరైన అఖీదా యొక్క పునాదులు.  వీటిని తీసుకుని సర్వ శక్తిమంతుడైన అల్లాహ్ గ్రంధం అవతరించింది.  మరియు అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంనకు వాటిని ఇచ్చి పంపించాడు.  మరియు అగోచర విషయాలు వేటిని విశ్వసించటం తప్పనిసరో మరియు వేటి గురించి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియపరచారో అన్ని ఈ పునాదుల నుండి ఉధ్భవించినవి.  ఈ ఆరు పునాదుల యొక్క ఆధారాలు గ్రంధములో మరియు సున్నతులో చాలా ఉన్నవి.  వాటిలో నుంచి అల్లాహ్ సుబహానహు వతఆలా యొక్క ఈ వాక్కు:

  لَّيْسَ الْبِرَّ أَن تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَٰكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ وَآتَى الْمَالَ عَلَىٰ حُبِّهِ ذَوِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينَ وَابْنَ السَّبِيلِ وَالسَّائِلِينَ وَفِي الرِّقَابِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَالْمُوفُونَ بِعَهْدِهِمْ إِذَا عَاهَدُوا ۖ وَالصَّابِرِينَ فِي الْبَأْسَاءِ وَالضَّرَّاءِ وَحِينَ الْبَأْسِ ۗ أُولَٰئِكَ الَّذِينَ صَدَقُوا ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُتَّقُونَ

మీరు మీ ముఖములను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు.  సదాచరణ అంటే అల్లాహ్ ను, అంతిమ దినాన్నీ, దైవదూతలనూ, దైవగ్రంధాన్ని, దైవప్రవక్తలనూ విశ్వసించటం.  [అల్ బఖర 2: 177]

మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ వాక్కు:

 آمَنَ الرَّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِ وَالْمُؤْمِنُونَ ۚ كُلٌّ آمَنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّن رُّسُلِهِ ۚ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا ۖ غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ

ఈ ప్రవక్త తన ప్రభువు తరుపు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు మరియు (అదే విధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు).  వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు.  (వారంటారు :) మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము.  [అల్ బఖర 2: 285]

మరియు పరిశుద్ధుడైన ఆయన వాక్కు:

  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا آمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَالْكِتَابِ الَّذِي نَزَّلَ عَلَىٰ رَسُولِهِ وَالْكِتَابِ الَّذِي أَنزَلَ مِن قَبْلُ ۚ وَمَن يَكْفُرْ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَالْيَوْمِ الْآخِرِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا

ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను, ఆయన సందేశహరుణ్ణి, ఆయన తన సందేశహరుని పై (ముహమ్మద్ పై) అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు ఆయన ఇంతకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి.  అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయాడు.  [నిసా 5: 136]

మరియు పరిశుద్ధుడైన ఆయన వాక్కు:

  أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا فِي السَّمَاءِ وَالْأَرْضِ ۗ إِنَّ ذَٰلِكَ فِي كِتَابٍ ۚ إِنَّ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ

ఏమీ? నీకు తెలియదా? ఆకాశంలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసని! నిశ్చయంగా, ఇదంతా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది.  నిశ్చయంగా ఇదంతా అల్లాహ్ కు చాలా సులభమైనది.  [హజ్ 22: 70]

ఈ పునాదులపై సూచించే సహీహ్ హదీసులు చాలా ఉన్నవి.  వాటిలో నుంచి ప్రసిద్ధిచెందిన హదీసు దాన్ని ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) అమీరుల్ మూమినీన్ హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు నుండి తన జామె సహీహ్ లో ఉల్లేఖించారు. 

జిబ్రయీల్ అలైహిస్సలాం గారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఈమాన్ గురించి అడిగారు.  ఆయనకు సమాధానమిస్తూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియపరచారు: ఈమాన్ అంటే నీవు అల్లాహ్ పై, ఆయన దూతల పై, ఆయన గ్రంథముల పై, ఆయన ప్రవక్తల పై మరియు అంతిమ దినం పై విశ్వాసమును చూపటం మరియు నీవు విధివ్రాత పై దాని మంచి, చెడు పై విశ్వాసము చూపటం[1].  . 

మరియు ఈ హదీసును ఇమామ్ బుఖారీ మరియు ఇమామ్ ముస్లిం రహిమహుమల్లాహ్ అబూహురైరా రజియల్లాహు అన్హు హదీసు నుండి ఉల్లేఖించారు.  ఈ ఆరు నియమాలు: వాటి నుండి అల్లాహ్ హక్కు విషయంలో మరియు పరలోక విషయంలో మరియు ఇతర అగోచర విషయాలలో ఒక ముస్లిం విశ్వసించవలసిన విషయాలన్నీ ఉద్భవించాయి. 

ఖుర్ఆన్ మజీద్ – తెలుగులో అరబీ ఉచ్చారణ  (1 భాగం ఎడిషన్)

ఖుర్ఆన్ మజీద్ | తెలుగులో అరబీ ఉచ్చారణ  [ 1 భాగం ఎడిషన్]

[తెలుగులో అరబ్బీ ఉచ్చారణ] [ఆయతుల తెలుగు అనువాదం]
[తెలుగు వ్యాఖ్య (తఫ్సీర్) లేదు ]

ఇది తెలుగులో నేటికీ వాడుకలో నున్న మొదటి అనువాదం.
మౌల్వీ అబ్దుల్ గపూర్ గారు దీనిని నేరుగా అరబీ భాష నుండి అనువదించినారు.

మీడియం క్వాలిటీ స్కాన్ బుక్ (Medium Quality Scan Book)
[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [618 పేజీలు]
[ఫైల్ సైజు: 115 MB]

హై క్వాలిటీ స్కాన్ బుక్ (High Quality Scan Book)
[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [618 పేజీలు][ఫైల్ సైజు: 1.12 GB]

విషయ సూచిక డౌన్లోడ్ చేసుకోండి.
(విషయ సూచికలో అన్నీ పారాలకు, అన్నీ సూరాలకు పేజీ నంబర్లు ఇవ్వబడ్డాయి )

పారా (జుజ్) ల విషయసూచిక

పారా నెంబర్ మీద క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోండి లేదా చదవండి.

పారా 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 | 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |అమ్మ పారా 30 |

సూరాల విషయసూచిక

సూరా మీద క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోండి లేదా చదవండి.

జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం [పుస్తకం]

ఉర్దూ గ్రంధకర్త: డాక్టర్ హాఫిజ్ ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్ (హఫిజహుల్లాహ్)
తెలుగు అనువాదం: ముహమ్మద్‌ ఖలీలుర్‌ రహ్మాన్‌, కొత్తగూడెం.
ముద్రణ: అల్‌ ఇదారతుల్‌ ఇస్తామియ, కొత్తగూడెం.

[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [673 పేజీలు]

శుక్రవారపు నమాజు ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన ఘట్టం దాని ఖుత్బా (ప్రసంగం). దీనిలో వివరించాల్సిన విషయాలను దివ్య ఖురాను మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో, సలఫుస్సాలిహీన్ల దృక్పథంతో సమగ్రంగా, పూర్తి ఆధారాలతో సహా వివరించే పుస్తకం ఏదియూ తెలుగు భాషలో ఇంతవరకు అందుబాటులో లేదన్న విషయం తెలుగు పాఠకలోకానికి తెలుసు. అందుకే, అల్ ఇదారతుల్ ఇస్లామియ, కొత్తగూడెం ఈ లోటును పూరిస్తూ తెలుగు పాఠక లోకానికి – శుక్రవారపు ఖుత్బాల గురించి డాక్టర్ హాఫిజ్ ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్ హఫిజహుల్లాహ్ ‘జాదుల్ ఖతీబ్’ పేరుతో ఉర్దూ భాషలో గ్రంథీకరించిన వివిధ సంపుటాలలో మొదటి సంపుటం యొక్క తెలుగు అనువాదాన్ని ‘జాదుల్ ఖతీబ్’ (ఖుత్బాల సంగ్రహము), సంపుటం-1 అనే పేరుతో మీకు సమర్పిస్తోంది! జనాబ్ ముహమ్మద్ ఖలీలుర్ రహ్మాన్ గారు ఈ బాధ్యతను చేపట్టి, ఎంతో పట్టుదలతో శ్రమించి, సామాన్య ప్రజానీకానికి సయితం అర్థమయ్యేలా అత్యంత సులభమైన శైలిలో ఈ అనువాద ప్రక్రియను పూర్తి చేశారు. అల్లాహ్ కే సమస్త స్తోత్రాలు, ఆయన అనుగ్రహం ద్వారానే సదాచరణలు సంపూర్ణం గావించబడతాయి.

విషయ సూచిక

నాస్తికత్వం & దైవాస్తికత – సయ్యద్ అబ్దుల్ హకీమ్ [పుస్తకం]

రచయిత: సయ్యద్ అబ్దుల్ హకీమ్
అనువాదం: అబ్దుల్ బాసిత్ ఉమరీ


[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి] [38పేజీలు] [PDF]
https://teluguislam.net/wp-content/uploads/2022/03/daivastikatha-teluguislam.net-mobile-friendly.pdf

నాస్తికత – మానవ సమాజంపై దాని తప్పుడు ప్రభావాలు :

మానవ జీవితాన్ని సమస్యలు, చిక్కులనుండి రక్షించి పరిశుద్ధ ప్రశాంత జీవనమార్గం చూపాలని గొప్పలు చెప్పుకొనే తత్వశాస్త్రవాదులు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. సమస్యల పరిష్కారానికై వారు చేసిన ప్రయత్నాలు యుక్తులవల్ల సత్ఫలితానికి బదులు మరిన్ని చిక్కు సమస్యలు ఎదురయ్యాయి. ఉన్న వాటికంటే అనేక రెట్లు ఎక్కువ సంకటాలు ఏర్పడ్డాయి. వారి అపజయాలకు వైఫల్యాలకు కారణమేమిటంటే వారు నాస్తికతను ఆధారంగా చేసుకుని ప్రయత్నించారు. ఈ దృక్పధమే సర్వవినాశాలకు, దుష్కార్యాలకు మూలం. అసలు వాస్తవ విషయమేమిటంటే సర్వమానవాళిని ప్రస్తుత ఆరాచక భావాలు, సాంఘిక వైకల్యం, నీచబుద్ధి మొదలగు వాటి బారినుండి విముక్తి కలిగించాలనుకుంటే మొట్టమొదట ప్రసుత్త నాగరికతకు ఆధారాలుగా పరిగణింపబడుతున్న నాస్తికతా, దైవ తిరస్కారాలను సంపూర్ణంగా నిర్మూలించాలి.

మానవుడు తన ఉనికి యొక్క కారణం మరియు తత్వాన్ని మరచి తన వాస్తవ సృష్టికర్తయైన అల్లాహ్ ఆదేశాలను ఉల్లంఘించి గడిపే ప్రతిజీవితం అజ్ఞాన కాలపు ఆంధకార జీవితమని ఇస్లాం పేర్కొంటుంది. ఎందుకంటే అటువంటి జీవితం వినాశానానికి దారితీస్తుంది. కావున ప్రస్తుత నాస్తిక నాగరికత అజ్ఞాన కాలపు జీవితాలకంటే మరింత ఎక్కువ దిగజారి వుంది. ప్రస్తుత కాలమైన సరే ప్రాచీన కాలమైనా సరే ఇస్లాం దృక్పధమేమిటంటే మానవ జీవితాన్ని సహజ సిద్ధ మార్గాలనుండి తప్పించి, పనికిమాలిన ఆ తప్పుడు దారులు పట్టించే ప్రయత్నాలు చేయటం వల్లనే సర్వ వినాశాలు ఏర్పడతాయి కావున మానవాళి మార్గదర్శకానికి కావలసిన ఒకే ఒక చిట్కా యేమిటంటే అజ్ఞాన పూరిత భావాలను నిర్మూలించడం. అనగా మానవుడు యదార్థ కృతార్థత పొందాలనుకుంటే తన జీవితం యొక్క వాస్తవ ఉద్దేశ్యాన్ని విడనాడకుండా, తప్పుదారి పట్టకుండా పూర్తి బాధ్యతా భావంతో దాన్ని స్వీకరించాలి. తనను సృష్టించిన అల్లాహ్ పై విశ్వాసం ఉంచి ఆ విశ్వాసాన్నే తన జీవిత ప్రయాణ ప్రారంభంగా తలచి ఆయన మార్గదర్శకం ప్రకారం తన జీవన ప్రయాణం కొనసాగించాలి. ఎందుకంటే దేవుడైన అల్లాహ్ మానవాళినే కాక సర్వలోక సృష్టిరాశులను సృష్టించెను. ఆయనే సర్వలోక , యదార్థయజమాని మరియు సర్వాధికారి అతీతుడు,సర్వస్తోత్రాలకు అర్హుడు. ఆయన అత్యంత గొప్ప వినువాడు.అతి సమీపంగా నున్నవాడు. ఆయనే అందరి మొరలు ఆలకించును. ఆయనే ప్రభువు, దాత, సహాయకుడు. తత్వజ్ఞాని, సర్వజ్ఞాని, మనమందరం అతని పాలితులం. పోషితులం, దాసులం బానిసలం.