నాస్తికత్వం & దైవాస్తికత – సయ్యద్ అబ్దుల్ హకీమ్ [పుస్తకం]

రచయిత: సయ్యద్ అబ్దుల్ హకీమ్
అనువాదం: అబ్దుల్ బాసిత్ ఉమరీ


[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి] [38పేజీలు] [PDF]
https://teluguislam.files.wordpress.com/2022/03/daivastikatha-teluguislam.net-mobile-friendly.pdf

నాస్తికత – మానవ సమాజంపై దాని తప్పుడు ప్రభావాలు :

మానవ జీవితాన్ని సమస్యలు, చిక్కులనుండి రక్షించి పరిశుద్ధ ప్రశాంత జీవనమార్గం చూపాలని గొప్పలు చెప్పుకొనే తత్వశాస్త్రవాదులు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. సమస్యల పరిష్కారానికై వారు చేసిన ప్రయత్నాలు యుక్తులవల్ల సత్ఫలితానికి బదులు మరిన్ని చిక్కు సమస్యలు ఎదురయ్యాయి. ఉన్న వాటికంటే అనేక రెట్లు ఎక్కువ సంకటాలు ఏర్పడ్డాయి. వారి అపజయాలకు వైఫల్యాలకు కారణమేమిటంటే వారు నాస్తికతను ఆధారంగా చేసుకుని ప్రయత్నించారు. ఈ దృక్పధమే సర్వవినాశాలకు, దుష్కార్యాలకు మూలం. అసలు వాస్తవ విషయమేమిటంటే సర్వమానవాళిని ప్రస్తుత ఆరాచక భావాలు, సాంఘిక వైకల్యం, నీచబుద్ధి మొదలగు వాటి బారినుండి విముక్తి కలిగించాలనుకుంటే మొట్టమొదట ప్రసుత్త నాగరికతకు ఆధారాలుగా పరిగణింపబడుతున్న నాస్తికతా, దైవ తిరస్కారాలను సంపూర్ణంగా నిర్మూలించాలి.

మానవుడు తన ఉనికి యొక్క కారణం మరియు తత్వాన్ని మరచి తన వాస్తవ సృష్టికర్తయైన అల్లాహ్ ఆదేశాలను ఉల్లంఘించి గడిపే ప్రతిజీవితం అజ్ఞాన కాలపు ఆంధకార జీవితమని ఇస్లాం పేర్కొంటుంది. ఎందుకంటే అటువంటి జీవితం వినాశానానికి దారితీస్తుంది. కావున ప్రస్తుత నాస్తిక నాగరికత అజ్ఞాన కాలపు జీవితాలకంటే మరింత ఎక్కువ దిగజారి వుంది. ప్రస్తుత కాలమైన సరే ప్రాచీన కాలమైనా సరే ఇస్లాం దృక్పధమేమిటంటే మానవ జీవితాన్ని సహజ సిద్ధ మార్గాలనుండి తప్పించి, పనికిమాలిన ఆ తప్పుడు దారులు పట్టించే ప్రయత్నాలు చేయటం వల్లనే సర్వ వినాశాలు ఏర్పడతాయి కావున మానవాళి మార్గదర్శకానికి కావలసిన ఒకే ఒక చిట్కా యేమిటంటే అజ్ఞాన పూరిత భావాలను నిర్మూలించడం. అనగా మానవుడు యదార్థ కృతార్థత పొందాలనుకుంటే తన జీవితం యొక్క వాస్తవ ఉద్దేశ్యాన్ని విడనాడకుండా, తప్పుదారి పట్టకుండా పూర్తి బాధ్యతా భావంతో దాన్ని స్వీకరించాలి. తనను సృష్టించిన అల్లాహ్ పై విశ్వాసం ఉంచి ఆ విశ్వాసాన్నే తన జీవిత ప్రయాణ ప్రారంభంగా తలచి ఆయన మార్గదర్శకం ప్రకారం తన జీవన ప్రయాణం కొనసాగించాలి. ఎందుకంటే దేవుడైన అల్లాహ్ మానవాళినే కాక సర్వలోక సృష్టిరాశులను సృష్టించెను. ఆయనే సర్వలోక , యదార్థయజమాని మరియు సర్వాధికారి అతీతుడు,సర్వస్తోత్రాలకు అర్హుడు. ఆయన అత్యంత గొప్ప వినువాడు.అతి సమీపంగా నున్నవాడు. ఆయనే అందరి మొరలు ఆలకించును. ఆయనే ప్రభువు, దాత, సహాయకుడు. తత్వజ్ఞాని, సర్వజ్ఞాని, మనమందరం అతని పాలితులం. పోషితులం, దాసులం బానిసలం.

%d bloggers like this: