https://youtu.be/aAqiOFQV6_4 [53 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1
సూరహ్ ఖద్ర్ తఫ్సిర్(వ్యాఖ్యానం) & ప్రతీ పదానికి అర్థభావాలు & వివరణ
https://youtu.be/Ug69vsV_-xo [57 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
1️⃣📝: సూరహ్ ఖద్ర్ తఫ్సిర్(వ్యాఖ్యానం) & ప్రతీ పదానికి అర్థభావాలు & వివరణ
2️⃣📝: లైలతుల్ ఖద్ర్ అంశానికి సంబందించిన 22/04/22 జరిగిన అరబీ జుమా ఖుత్బా తెలుగు అనువాదం
—
మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1
బిస్మిల్లాహ్ హిర్రహ్ మా నిర్రహీమ్

అస్సలాముఅలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. ప్రియమైన సోదర సోదరీమణులారా!. కందుకూరు పట్టణములో మేము స్వచ్ఛమైన సున్నత్‌పై ప్రజలను ఇస్లాం నేర్చుకోవడానికి, అభ్యాసం చేయడానికి మరియు సలఫ్ యొక్క తౌహీద్, సున్నత్ మరియు మన్హజ్ వైపు ప్రజలను పిలవడానికి దావా కార్యకలాపాలు చేయుటకు ప్రయత్నిస్తున్నాము. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మనకు సున్నత్ ప్రకారం ఒక మస్జిద్ మరియు మదర్సా ను స్థాపించాల్సిన అవసరం చాలా ఉంది. దీని కోసం మేము 440 Sqyd విస్తీర్ణంలో అమ్మకానికి ఉన్న ఒక ఇంటిని గుర్తించాము మరియు అడ్వాన్స్ కూడా పే చేసాము (కందుకూరు పట్టణము, నెల్లురు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము , ఇండియా). అల్లాహ్ దయవల్ల 50% డబ్బులుసమకూరాయి. మిగతా నిధుల సమీకరణకు మీ యొక్క సహాయాన్ని కోరుతున్నాము.
ప్రదేశము: కందుకూరు పట్టణము, నెల్లురు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము , ఇండియా
నిధుల సమీకరణ ప్రస్తుత పురోగతి ఈ క్రింది విధంగా ఉంది :
ఆస్తి అంచనా విలువ : రూ. 50 లక్షలు (మస్జిద్ బిల్డింగ్ + మరమ్మత్తులు)
వసూలు చేసిన మొత్తం రూ. : రూ. 25 లక్షలు
ఇంకా అవసరమైన డబ్బు మొత్తం : రూ. 25 లక్షలు
హజ్రత్ జాబిర్(రదియల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహివసల్లం) గారు ఇలా ప్రభోదించారు. “పక్షిగూడు అంత పెద్ద లేదా చిన్న మసీదును అయినా సరే నిర్మించిన వ్యక్తి కొరకు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అతని కోసం స్వర్గంలో ఒక ఇంటిని నిర్మిస్తాడు.(ఇబ్న్ మాజా). అల్లాహ్ కొరకు ఉదారంగా దానం చేయండి. ఏ కొంచెం దానాన్ని అయినా చిన్నదిగా చూడకండి.మీ శక్తి సామర్ధ్యాల మేరకు మీ కున్నదాంట్లో సహాయం ఆందించండి. మీకు మరియు మీ ప్రియమైన వారికి అల్లాహ్ (సుబ్హానహువతాలా) ఇహలోకంలో మరియు పరలోకంలో చాలా ఆనందాన్ని ప్రసాదించుగాక, ఆమీన్
గమనిక:
1. మేము విదేశీ ఖాతాల నుండి నిధులను స్వీకరించలేము. భారతీయ ఖాతాల నుండి మాత్రమే స్వీకరిస్తాము
2. మరింత సమాచారం కోసం & బదిలీ చేయబడిన మొత్తం యొక్క వివరము ను దయచేసి ఈ WhatsApp (+91 8074633535 కి https://wa.me/918074633535 మెసేజ్ పంపవలసిందిగా మేము మిమ్మల్ని కోరుతున్నాము.
బ్యాంక్ ఖాతా వివరాలు:
బ్యాంక్ పేరు: BANK OF BARODA
అకౌంట్ పేరు: AL HUDA ASSOCIATION FOR DAWAH AND BENEVOLENT
అకౌంట్ నెంబర్: 60640200000076
IFSC కోడ్: BARB0KANDUK (గమనిక: BARB తర్వాత ఉన్నది సున్నా ZERO అని గుర్తిచగలరు))
Gpay/PhonePe: 9866302144
Gpay QR code:

AL HUDA Association for Dawah and Benevolent.
Regd. No. 195/2021. Email: alhudakdkr@gmail.com . WhatsApp: +918074633535 ( https://wa.me/918074633535 )
Kandukur-523105, Andhra Pradesh, India, Mob:0091-9032551567
మస్జిద్ పిక్చర్స్:

![ఖుర్ఆన్ మజీద్ | తెలుగులో అరబీ ఉచ్చారణ [ 1 భాగం ఎడిషన్]](https://teluguislam.net/wp-content/uploads/2022/10/quran-majeed-new.png?w=877)
[తెలుగులో అరబ్బీ ఉచ్చారణ] [ఆయతుల తెలుగు అనువాదం]
[తెలుగు వ్యాఖ్య (తఫ్సీర్) లేదు ]
ఇది తెలుగులో నేటికీ వాడుకలో నున్న మొదటి అనువాదం.
మౌల్వీ అబ్దుల్ గపూర్ గారు దీనిని నేరుగా అరబీ భాష నుండి అనువదించినారు.
మీడియం క్వాలిటీ స్కాన్ బుక్ (Medium Quality Scan Book)
[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [618 పేజీలు] [ఫైల్ సైజు: 115 MB]
హై క్వాలిటీ స్కాన్ బుక్ (High Quality Scan Book)
[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [618 పేజీలు][ఫైల్ సైజు: 1.12 GB]
విషయ సూచిక డౌన్లోడ్ చేసుకోండి.
(విషయ సూచికలో అన్నీ పారాలకు, అన్నీ సూరాలకు పేజీ నంబర్లు ఇవ్వబడ్డాయి )
పారా నెంబర్ మీద క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోండి లేదా చదవండి.
సూరా మీద క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోండి లేదా చదవండి.
ఉర్దూ గ్రంధకర్త: డాక్టర్ హాఫిజ్ ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్ (హఫిజహుల్లాహ్)
తెలుగు అనువాదం: ముహమ్మద్ ఖలీలుర్ రహ్మాన్, కొత్తగూడెం.
ముద్రణ: అల్ ఇదారతుల్ ఇస్తామియ, కొత్తగూడెం.
[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [673 పేజీలు]
శుక్రవారపు నమాజు ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన ఘట్టం దాని ఖుత్బా (ప్రసంగం). దీనిలో వివరించాల్సిన విషయాలను దివ్య ఖురాను మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో, సలఫుస్సాలిహీన్ల దృక్పథంతో సమగ్రంగా, పూర్తి ఆధారాలతో సహా వివరించే పుస్తకం ఏదియూ తెలుగు భాషలో ఇంతవరకు అందుబాటులో లేదన్న విషయం తెలుగు పాఠకలోకానికి తెలుసు. అందుకే, అల్ ఇదారతుల్ ఇస్లామియ, కొత్తగూడెం ఈ లోటును పూరిస్తూ తెలుగు పాఠక లోకానికి – శుక్రవారపు ఖుత్బాల గురించి డాక్టర్ హాఫిజ్ ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్ హఫిజహుల్లాహ్ ‘జాదుల్ ఖతీబ్’ పేరుతో ఉర్దూ భాషలో గ్రంథీకరించిన వివిధ సంపుటాలలో మొదటి సంపుటం యొక్క తెలుగు అనువాదాన్ని ‘జాదుల్ ఖతీబ్’ (ఖుత్బాల సంగ్రహము), సంపుటం-1 అనే పేరుతో మీకు సమర్పిస్తోంది! జనాబ్ ముహమ్మద్ ఖలీలుర్ రహ్మాన్ గారు ఈ బాధ్యతను చేపట్టి, ఎంతో పట్టుదలతో శ్రమించి, సామాన్య ప్రజానీకానికి సయితం అర్థమయ్యేలా అత్యంత సులభమైన శైలిలో ఈ అనువాద ప్రక్రియను పూర్తి చేశారు. అల్లాహ్ కే సమస్త స్తోత్రాలు, ఆయన అనుగ్రహం ద్వారానే సదాచరణలు సంపూర్ణం గావించబడతాయి.
1256. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రవచించారు:
“ఎవరి అధీనంలో నా ప్రాణముందో ఆ పవిత్రమూర్తి సాక్షిగా చెబుతున్నాను తన స్వయం కొరకు ఇష్టపడేదే తన ఇరుగు పొరుగు లేక తన సోదరుని కోసం కూడా ఇష్టపడనంత వరకూ ఏ దాసుడూ విశ్వాసి (మోమిన్) కాలేడు.” (బుఖారీ, ముస్లిం)
సారాంశం:
ఈ హదీసులో విశ్వాస పరిపూర్ణత కొరకు ఒక షరతు విధించబడింది. అదేమంటే విశ్వాసి అయినవాడు తన కోసం ఇష్టపడే వస్తువునే తన పొరుగువారి కోసం లేదా తన తోటి సోదరుల కోసం కూడా ఇష్టపడాలి. సమాజంలో తన గౌరవ ప్రతిష్ఠలు ఇనుమడించాలని అతను కాంక్షిస్తున్నపుడు ఇతరులు కూడా అలాగే కోరుకుంటారని అతడు తలపోయాలి. కనుక ఇతరుల గౌరవ ప్రతిష్ఠలకు తన తరపున విఘాతం కలగకుండా చూసుకోవాలి. తనకు శాంతీ సౌఖ్యాలు ప్రాప్తించాలని కోరుకున్నప్పుడు సాటి వ్యక్తుల కోసం కూడా అదేవిధంగా ఆలోచించాలి. వ్యక్తుల్లో ఇలాంటి సకారాత్మక ఆలోచనలున్నప్పుడు సమాజమంతా సుఖశాంతులకు నిలయమవుతుంది. ప్రగతి పథంలో సాఫీగా సాగిపోతుంది. అశాంతి అలజడులుండవు. ఒకరింకొకరి శ్రేయస్సును అభిలషించే వారుగా, ఒండొకరి యెడల సానుభూతి పరులుగా ఉంటారు. ఒక సత్సమాజానికి ఉండవలసిన ప్రధాన లక్షణమిదే.
యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3
మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

రచయిత: సయ్యద్ అబ్దుల్ హకీమ్
అనువాదం: అబ్దుల్ బాసిత్ ఉమరీ
[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి] [38పేజీలు] [PDF]
https://teluguislam.net/wp-content/uploads/2022/03/daivastikatha-teluguislam.net-mobile-friendly.pdf
నాస్తికత – మానవ సమాజంపై దాని తప్పుడు ప్రభావాలు :
మానవ జీవితాన్ని సమస్యలు, చిక్కులనుండి రక్షించి పరిశుద్ధ ప్రశాంత జీవనమార్గం చూపాలని గొప్పలు చెప్పుకొనే తత్వశాస్త్రవాదులు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. సమస్యల పరిష్కారానికై వారు చేసిన ప్రయత్నాలు యుక్తులవల్ల సత్ఫలితానికి బదులు మరిన్ని చిక్కు సమస్యలు ఎదురయ్యాయి. ఉన్న వాటికంటే అనేక రెట్లు ఎక్కువ సంకటాలు ఏర్పడ్డాయి. వారి అపజయాలకు వైఫల్యాలకు కారణమేమిటంటే వారు నాస్తికతను ఆధారంగా చేసుకుని ప్రయత్నించారు. ఈ దృక్పధమే సర్వవినాశాలకు, దుష్కార్యాలకు మూలం. అసలు వాస్తవ విషయమేమిటంటే సర్వమానవాళిని ప్రస్తుత ఆరాచక భావాలు, సాంఘిక వైకల్యం, నీచబుద్ధి మొదలగు వాటి బారినుండి విముక్తి కలిగించాలనుకుంటే మొట్టమొదట ప్రసుత్త నాగరికతకు ఆధారాలుగా పరిగణింపబడుతున్న నాస్తికతా, దైవ తిరస్కారాలను సంపూర్ణంగా నిర్మూలించాలి.
మానవుడు తన ఉనికి యొక్క కారణం మరియు తత్వాన్ని మరచి తన వాస్తవ సృష్టికర్తయైన అల్లాహ్ ఆదేశాలను ఉల్లంఘించి గడిపే ప్రతిజీవితం అజ్ఞాన కాలపు ఆంధకార జీవితమని ఇస్లాం పేర్కొంటుంది. ఎందుకంటే అటువంటి జీవితం వినాశానానికి దారితీస్తుంది. కావున ప్రస్తుత నాస్తిక నాగరికత అజ్ఞాన కాలపు జీవితాలకంటే మరింత ఎక్కువ దిగజారి వుంది. ప్రస్తుత కాలమైన సరే ప్రాచీన కాలమైనా సరే ఇస్లాం దృక్పధమేమిటంటే మానవ జీవితాన్ని సహజ సిద్ధ మార్గాలనుండి తప్పించి, పనికిమాలిన ఆ తప్పుడు దారులు పట్టించే ప్రయత్నాలు చేయటం వల్లనే సర్వ వినాశాలు ఏర్పడతాయి కావున మానవాళి మార్గదర్శకానికి కావలసిన ఒకే ఒక చిట్కా యేమిటంటే అజ్ఞాన పూరిత భావాలను నిర్మూలించడం. అనగా మానవుడు యదార్థ కృతార్థత పొందాలనుకుంటే తన జీవితం యొక్క వాస్తవ ఉద్దేశ్యాన్ని విడనాడకుండా, తప్పుదారి పట్టకుండా పూర్తి బాధ్యతా భావంతో దాన్ని స్వీకరించాలి. తనను సృష్టించిన అల్లాహ్ పై విశ్వాసం ఉంచి ఆ విశ్వాసాన్నే తన జీవిత ప్రయాణ ప్రారంభంగా తలచి ఆయన మార్గదర్శకం ప్రకారం తన జీవన ప్రయాణం కొనసాగించాలి. ఎందుకంటే దేవుడైన అల్లాహ్ మానవాళినే కాక సర్వలోక సృష్టిరాశులను సృష్టించెను. ఆయనే సర్వలోక , యదార్థయజమాని మరియు సర్వాధికారి అతీతుడు,సర్వస్తోత్రాలకు అర్హుడు. ఆయన అత్యంత గొప్ప వినువాడు.అతి సమీపంగా నున్నవాడు. ఆయనే అందరి మొరలు ఆలకించును. ఆయనే ప్రభువు, దాత, సహాయకుడు. తత్వజ్ఞాని, సర్వజ్ఞాని, మనమందరం అతని పాలితులం. పోషితులం, దాసులం బానిసలం.
1263.హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు:
“ఎవరయినా సరే ప్రపంచంలోని ఆపదల్లో నుంచి, ఏదేని ఒక ఆపదనుంచి ఏ ముస్లింనయినా గట్టెక్కిస్తే అల్లాహ్ ప్రళయ దినాన ప్రళయదినపు గండాలలోని ఏదేని ఒక గండం నుంచి అతన్ని గట్టెక్కిస్తాడు. ఎవరయినా ప్రాపంచికంగా లేమికి గురైన ఒక వ్యక్తికి వెసులుబాటు కల్పిస్తే అల్లాహ్ ఇహపరాలలో అతని కోసం వెసులుబాటును కల్పిస్తాడు. ఎవరయినా ఒక ముస్లిం బలహీనతను కప్పిపుచ్చితే అల్లాహ్ ఇహపరాలలో అతని లోగుట్టు పై ఆచ్చాదన వేసి ఉంచుతాడు. ఒక దాసుడు తోటి సోదరుని సాయపడుతూ ఉన్నంత కాలం అల్లాహ్ అతన్ని ఆదుకుంటూనే ఉంటాడు.”
—
యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3
మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1
సంకలనం: నసీమ్ గాజీ
[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
https://teluguislam.net/wp-content/uploads/2022/03/priyamaina-ammaku-teluguislam.net-mobile-friendly.pdf
[20 పేజీలు] [PDF]
అపార కృపాశీలుడు అనంత కరుణామయుడయిన అల్లాహ్ పేరుతో
ఈ ఉత్తరం ఇప్పటికి దాదావు ఇరవై సంవత్సరాల క్రితం వ్రాశాను. అప్పుడు నేను ఒక ధార్మిక పాఠశాల, జామియతుల్ ఫలాహ్, బిలేరియా గంజ్ (ఆజమ్‌గడ్ జిల్లా)లో విద్యనభ్య సిస్తున్నాను. ఆ కాలంలో అప్పుడప్పుడు ఇంటికి కూడా వెళ్ళేవాడిని. ఇస్లాం స్వీకారానికి పూర్వం నేను హిందూ సమాజంలోని అగర్వాల్ కుటుంబానికి చెందినవాడిని. మా నాన్నగారు మరణించినప్పుడు నా వయస్సు తొమ్మిది సంవత్సరాలు. ఒక రోజు ఇస్లాం స్వీకరించే భాగ్యం నాకు లభిస్తుందన్నది నా ఊహకు కూడా అందని విషయం. మా పెద్దన్నయ్య మా కుటుంబ పెద్ద. ఇస్లాం విషయంలో ఆయన నాతో ఏకీభవించేవారు గనక, ఆయన ద్వారా నాకు ప్రోత్సాహమే లభించింది కాని ప్రతికూలం ఎదురవ్వలేదు. అయితే అమ్మ విషయం మాత్రం అందుకు భిన్నంగా ఉండేది. నేను ఇస్లాం స్వీకరించడం ఆమె సుతరామూ ఇష్టపడలేదు. ఆమెను అన్నింటి కంటే ఎక్కువగా బాధించిన విషయం ఏమంటే నేనామెకు దూరంగా ఒక ధార్మిక పాఠశాలలో చేరాను. అప్పటికీ నేను తరచూ ఇంటికి వెళ్ళివచ్చేవాడిని. అమ్మ కూడా ఈ మహా వరప్రసాదాన్ని గ్రహించాలని సహజంగానే నేను మనసారా కోరుకునేవాణ్ణి. ఆమె మటుకు వీలయినంత త్వరగా నేను ఇస్లాంను వదిలేసి పాత ధర్మం వైవుకు తిరిగిరావాలని కోరుకునేది. వాస్తవానికి ఆమెకు నాపైగల అమితమైన మమతానురాగాల కారణంగా నా ఈ చేష్ట ఆమెకు నచ్చలేదు. ఆమె మానసికంగానూ, ఆధ్యాత్మికంగానూ ఆవేదనకు గురయింది. ఇది స్వాభావికమే. ఇస్లాం బోధనలు ఆమెకు విశదంగా తెలియవు. ముస్లిముల జీవితాలు ఇస్లామ్‌కు పూర్తిగా భిన్నంగానే కాక ఇస్లామ్ పట్ల ఏవగింపు కలుగజేసేవిగా కనిపిస్తున్నాయి. అందువల్ల అమె హృదయంలో ఇస్లామ్ కొరకు ఏ మాతం చోటు లేదు. నా గురించి ఆమెలో రకరకాల ఆలోచనలు తలెత్తేవి, ఇతరులూ బహు విధాలుగా రేకెత్తించేవారు. ఈ లేఖలో కొన్నింటిని పేర్కొన్నాను. నేను వీలైనంతవరకు ఆమె సందేహాలను, సంశయాలను దూరం చేయడానికి, ఇస్లాం బోధనల్ని, విశదపరచడానికి ప్రయత్నించేవాడిని. ఈ ప్రయత్నం ఒక్కో సారి సంభాషణ ద్వారాను, మరోసారి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారాను కొనసాగేది.
నేను జన్మించిన తరువాత హైందవ ఆచారం ప్రకారంగా మా వంశ గురువులవారు, నా హస్తరేఖలు, నా జాతకం చూసి నా భవిష్యత్తు గురించి అనేక విషయాలు మా అమ్మకు చెప్పారు. ఆందులో ఒకటి, “నీ కొడుకు నీకు కాకుండా పోతాడ”న్నది. నేను ఇస్లాం స్వీకరించిన తరువాత ఆచార్యులవారు జోస్యం నిజమయినట్లుగా ఆమెకు అగుపడసాగింది. ఆ విషయాన్ని ప్రస్తావించి ఆవిడ నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించేది.
ఇస్లాంలో మంచి అన్నదేదీ లేకపోయినా, నా కొడుకు మౌలానాగారి వలలో చిక్కుకున్నాడు అనే విషయం ఆమె హృదయంలో బాగా నాటుకుపోయింది. ఈ లేఖలో ఆమెకున్న ఈ అపోహను దూరం చేయడానికీ ప్రయత్నించాను. దాంతో పాటు ఇస్లాం వైవుకు కూడా అమెను ఆహ్వానించాను. నా ఉద్ధేశ్యం, ఇస్లాం పట్లను , నా పట్లను కేవలం ఆమెకున్న అపోహల్ని, అపార్ధాలను దూరం చెయ్యడమే కాదు. ఈ సత్యాన్ని ఆమె కూడా స్వీకరించి, దైవ ప్రసన్నత పొంది, స్వర్గానికి అర్హురాలు కావాలని, నరకాగ్ని నుండి ఆమె రక్షింపబడాలి అన్నది నా ప్రగాఢ వాంఛ, కృషి కూడా.
ఈ లేఖ చదివిన తరువాత ఆమెలో భావ తీవ్రత కాస్త్ర తగ్గినా, తన పూర్వీకుల మతం వదలడానికి మాతం ఆమె సిద్ధం లేదు. నేను ఆమెకు నచ్చజెప్పడానికి సతతం ప్రయత్నం చేస్తుండేవాడిని. ఆమె హృదయ కవాటాలు సత్యం కొరకు తెరచుకోవాలని అల్లాహ్ ను వేడుకునే వాణ్ణి కూడా. దాదాపు మూడు సంవత్సరాల ఎడతెగని కృషి తరువాత అల్లాహ్ అనుగ్రహం కలిగింది. ఆమెకు సత్యధర్మానికి స్వాగతం పలికే బుద్ధి కలిగింది. తన పురాతన ప్రవర్తనకు పశ్చాత్తాప్పడింది. నా మాతృమూర్తి నేడు ఇస్లామ్ పై సుస్థిరంగా, సంతృప్తిగా ఉంది. ఆమెకు ఇస్లాం పట్ల కలిగిన అవ్యాజాభిమానానికి తార్కాణంగా అనేకసార్లు ఖురాన్ లాంటి ఉద్గ్రంధం, హిందీ అనువాదాన్ని అనేకసార్లు అధ్యయనం చేసింది. నేడు, ప్రజలు ఇస్లాం ను అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యాలని, ముస్లిమ్‌లు తమ జీవితంలో ఇస్లాం ను పూర్తిగా అనుసరించాలని, ఇస్లామ్ పట్ట ప్రబలిపోయిన అపోహలను దూరం చేసి, ఇస్లామ్ బోధించే మహత్తర శిక్షణల్ని సామాన్య ప్రజలకు చేరవేయాలని ఆమె ఆవేదన చెందుతూ. ఉంటులది.
ఇదో వ్యక్తిగత లేఖ. దీన్ని ప్రచురించడం మూలాన సత్యప్రేమికుల ఆత్మలకు సన్మార్గ దర్శనం జరగాలని, మనం సత్యధర్మంపై స్ధిరంగా నిలబడగలగాలని, మృత్యువు సంభవించే వరకు ఇస్లామ్‌నే అనుసరించగలగాలని ఆకాంక్షిస్తూ అల్లాహ్‌ను వేడుకుంటున్నాను.
నసీమ్ గాజి
జూన్: 1980
1284. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకాకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తాకీదు చేశారు:
“దురనుమానానికి దూరంగా ఉండండి. ఎందుకంటే దురనుమానం చాలా పెద్ద అబద్ధంగా పరిగణించబడుతుంది.” (బుఖారీ, ముస్లిం)
సారాంశం: దురనుమానం ఒక పెద్ద అసత్య విషయంగా పరిగణించబడటానికి కారణం ఏమిటంటే మనిషి తనలో తానే దాన్ని పెంచి పోషించుకుంటూ పోతాడు. ఆఖరికి అసలేమీ లేని దాన్ని గురించి ఏదో ఒక సందర్భంగా నోటితో చెప్పేస్తాడు. అందుకే విద్వాంసులు దీన్ని అభాండంగా, అపనిందగా ఖరారు చేశారు. ఒకరిపై అపనింద మోపటం నిషిద్ధం కదా! దీని ద్వారా తేటతెల్లమయిందేమిటంటే దురనుమానం అపనిందకు ఆనవాలు. అపనింద మహాపరాధం. పశ్చాత్తాపం చెందనిదే ఇది క్షమార్హం కాజాలదు. అందుకే వీలయినంత వరకు దీనికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే దురనుమానాలు, సంకోచాలు పుట్టిపెరిగే సమాజంలో సదనుమానం, సద్భావన అనేవి నిలదొక్కుకోలేవు. అలాంటి సమాజంలోని సభ్యుల మధ్య పరస్పర నమ్మకం, పరస్పర సహకార భావాల వాతావరణం కూడా ఏర్పడదు. ఒండొకరిని అడుగడుగునా శంకిస్తూ ఉంటారు. ఇది సమాజ అభ్యున్నతికి, వికాసానికి శుభ సూచకం కాదు సరికదా పతనానికి, అధోగతికి ఆనవాలు అవుతుంది. సత్సమాజ రూపకల్పనకు ఉపక్రమించినపుడు దురనుమానవు సూక్ష్మక్రిములను ఎప్పటికప్పుడు సంహరించటం అవసరం.
—
యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3
మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1
You must be logged in to post a comment.