ప్రియమైన అమ్మకు .. [పుస్తకం]

సంకలనం: నసీమ్ గాజీ

[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
https://teluguislam.files.wordpress.com/2022/03/priyamaina-ammaku-teluguislam.net-mobile-friendly.pdf
[20 పేజీలు] [PDF] 

అపార కృపాశీలుడు అనంత కరుణామయుడయిన అల్లాహ్‌ పేరుతో

ఈ ఉత్తరం ఇప్పటికి దాదావు ఇరవై సంవత్సరాల క్రితం వ్రాశాను. అప్పుడు నేను ఒక ధార్మిక పాఠశాల, జామియతుల్‌ ఫలాహ్‌, బిలేరియా గంజ్‌ (ఆజమ్‌గడ్ జిల్లా)లో విద్యనభ్య సిస్తున్నాను. ఆ కాలంలో అప్పుడప్పుడు ఇంటికి కూడా వెళ్ళేవాడిని. ఇస్లాం స్వీకారానికి పూర్వం నేను హిందూ సమాజంలోని అగర్వాల్‌ కుటుంబానికి చెందినవాడిని. మా నాన్నగారు మరణించినప్పుడు నా వయస్సు తొమ్మిది సంవత్సరాలు. ఒక రోజు ఇస్లాం స్వీకరించే భాగ్యం నాకు లభిస్తుందన్నది నా ఊహకు కూడా అందని విషయం. మా పెద్దన్నయ్య మా కుటుంబ పెద్ద. ఇస్లాం విషయంలో ఆయన నాతో ఏకీభవించేవారు గనక, ఆయన ద్వారా నాకు ప్రోత్సాహమే లభించింది కాని ప్రతికూలం ఎదురవ్వలేదు. అయితే అమ్మ విషయం మాత్రం అందుకు భిన్నంగా ఉండేది. నేను ఇస్లాం స్వీకరించడం ఆమె సుతరామూ ఇష్టపడలేదు. ఆమెను అన్నింటి కంటే ఎక్కువగా బాధించిన విషయం ఏమంటే నేనామెకు దూరంగా ఒక ధార్మిక పాఠశాలలో చేరాను. అప్పటికీ నేను తరచూ ఇంటికి వెళ్ళివచ్చేవాడిని. అమ్మ కూడా ఈ మహా వరప్రసాదాన్ని గ్రహించాలని సహజంగానే నేను మనసారా కోరుకునేవాణ్ణి. ఆమె మటుకు వీలయినంత త్వరగా నేను ఇస్లాంను వదిలేసి పాత ధర్మం వైవుకు తిరిగిరావాలని కోరుకునేది. వాస్తవానికి ఆమెకు నాపైగల అమితమైన మమతానురాగాల కారణంగా నా ఈ చేష్ట ఆమెకు నచ్చలేదు. ఆమె మానసికంగానూ, ఆధ్యాత్మికంగానూ ఆవేదనకు గురయింది. ఇది స్వాభావికమే. ఇస్లాం బోధనలు ఆమెకు విశదంగా తెలియవు. ముస్లిముల జీవితాలు ఇస్లామ్‌కు పూర్తిగా భిన్నంగానే కాక ఇస్లామ్‌ పట్ల ఏవగింపు కలుగజేసేవిగా కనిపిస్తున్నాయి. అందువల్ల అమె హృదయంలో ఇస్లామ్‌ కొరకు ఏ మాతం చోటు లేదు. నా గురించి ఆమెలో రకరకాల ఆలోచనలు తలెత్తేవి, ఇతరులూ బహు విధాలుగా రేకెత్తించేవారు. ఈ లేఖలో కొన్నింటిని పేర్కొన్నాను. నేను వీలైనంతవరకు ఆమె సందేహాలను, సంశయాలను దూరం చేయడానికి, ఇస్లాం బోధనల్ని, విశదపరచడానికి ప్రయత్నించేవాడిని. ఈ ప్రయత్నం ఒక్కో సారి సంభాషణ ద్వారాను, మరోసారి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారాను కొనసాగేది.

నేను జన్మించిన తరువాత హైందవ ఆచారం ప్రకారంగా మా వంశ గురువులవారు, నా హస్తరేఖలు, నా జాతకం చూసి నా భవిష్యత్తు గురించి అనేక విషయాలు మా అమ్మకు చెప్పారు. ఆందులో ఒకటి, “నీ కొడుకు నీకు కాకుండా పోతాడ”న్నది. నేను ఇస్లాం స్వీకరించిన తరువాత ఆచార్యులవారు జోస్యం నిజమయినట్లుగా ఆమెకు అగుపడసాగింది. ఆ విషయాన్ని ప్రస్తావించి ఆవిడ నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించేది.

ఇస్లాంలో మంచి అన్నదేదీ లేకపోయినా, నా కొడుకు మౌలానాగారి వలలో చిక్కుకున్నాడు అనే విషయం ఆమె హృదయంలో బాగా నాటుకుపోయింది. ఈ లేఖలో ఆమెకున్న ఈ అపోహను దూరం చేయడానికీ ప్రయత్నించాను. దాంతో పాటు ఇస్లాం వైవుకు కూడా అమెను ఆహ్వానించాను. నా ఉద్ధేశ్యం, ఇస్లాం పట్లను , నా పట్లను కేవలం ఆమెకున్న అపోహల్ని, అపార్ధాలను దూరం చెయ్యడమే కాదు. ఈ సత్యాన్ని ఆమె కూడా స్వీకరించి, దైవ ప్రసన్నత పొంది, స్వర్గానికి అర్హురాలు కావాలని, నరకాగ్ని నుండి ఆమె రక్షింపబడాలి అన్నది నా ప్రగాఢ వాంఛ, కృషి కూడా.

ఈ లేఖ చదివిన తరువాత ఆమెలో భావ తీవ్రత కాస్త్ర తగ్గినా, తన పూర్వీకుల మతం వదలడానికి మాతం ఆమె సిద్ధం లేదు. నేను ఆమెకు నచ్చజెప్పడానికి సతతం ప్రయత్నం చేస్తుండేవాడిని. ఆమె హృదయ కవాటాలు సత్యం కొరకు తెరచుకోవాలని అల్లాహ్ ను వేడుకునే వాణ్ణి కూడా. దాదాపు మూడు సంవత్సరాల ఎడతెగని కృషి తరువాత అల్లాహ్ అనుగ్రహం కలిగింది. ఆమెకు సత్యధర్మానికి స్వాగతం పలికే బుద్ధి కలిగింది. తన పురాతన ప్రవర్తనకు పశ్చాత్తాప్పడింది. నా మాతృమూర్తి నేడు ఇస్లామ్‌ పై సుస్థిరంగా, సంతృప్తిగా ఉంది. ఆమెకు ఇస్లాం పట్ల కలిగిన అవ్యాజాభిమానానికి తార్కాణంగా అనేకసార్లు ఖురాన్ లాంటి ఉద్గ్రంధం, హిందీ అనువాదాన్ని అనేకసార్లు అధ్యయనం చేసింది. నేడు, ప్రజలు ఇస్లాం ను అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యాలని, ముస్లిమ్‌లు తమ జీవితంలో ఇస్లాం ను పూర్తిగా అనుసరించాలని, ఇస్లామ్‌ పట్ట ప్రబలిపోయిన అపోహలను దూరం చేసి, ఇస్లామ్‌ బోధించే మహత్తర శిక్షణల్ని సామాన్య ప్రజలకు చేరవేయాలని ఆమె ఆవేదన చెందుతూ. ఉంటులది.

ఇదో వ్యక్తిగత లేఖ. దీన్ని ప్రచురించడం మూలాన సత్యప్రేమికుల ఆత్మలకు సన్మార్గ దర్శనం జరగాలని, మనం సత్యధర్మంపై స్ధిరంగా నిలబడగలగాలని, మృత్యువు సంభవించే వరకు ఇస్లామ్‌నే అనుసరించగలగాలని ఆకాంక్షిస్తూ అల్లాహ్‌ను వేడుకుంటున్నాను.

నసీమ్‌ గాజి
జూన్‌: 1980

%d bloggers like this: