రుఖ్ యా (మంత్రించి ఊదటం) [వీడియో & టెక్స్ట్]

రుఖ్ యా (మంత్రించి ఊదటం)
https://youtu.be/9SIgD5D56yo [14 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో “రుఖ్ యా” (మంత్రించి ఊదడం) అనే అంశం గురించి వివరించబడింది. రుఖ్ యా అంటే, అనారోగ్యంతో లేదా ఇతర బాధలతో ఉన్న వ్యక్తిపై ఖుర్ఆన్ వచనాలు, అల్లాహ్ నామ-గుణాలు లేదా ప్రవక్త నేర్పిన దుఆలు పఠించి ఊదటం. రుఖ్ యాలో రెండు రకాలు ఉన్నాయి: ధర్మసమ్మతమైనది (రుఖ్ యా షరియా) మరియు నిషిద్ధమైనది (షిర్క్ తో కూడినది). ధర్మసమ్మతమైన రుఖ్ యాకు మూడు షరతులు ఉన్నాయి: అది అల్లాహ్ వాక్యాలు లేదా నామ-గుణాలతో ఉండాలి, అరబి భాషలో స్పష్టమైన అర్థంతో ఉండాలి, మరియు దాని ప్రభావం అల్లాహ్ యే కలుగజేస్తాడనే నమ్మకం ఉండాలి. దైవేతరుల సహాయం కోరే, షిర్క్ తో కూడిన రుఖ్ యా ఇస్లాంలో తీవ్రంగా నిషిద్ధం. సహాబాలు, సలఫ్ సాలెహీన్‌లు ఎవరూ రుఖ్ యాను వ్యాపారంగా లేదా జీవనోపాధిగా చేసుకోలేదని, ఈ విషయంలో జాగ్రత్త వహించాలని ప్రసంగీకులు హెచ్చరించారు.

أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ وَمَنْ تَبِعَهُمْ بِإِحْسَانٍ إِلَى يَوْمِ الدِّينِ أَمَّا بَعْدُ
సమస్త ప్రశంసలు సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే శోభాయమానం. మరియు అంతిమ విజయం దైవభక్తిపరుల కొరకే. మరియు దైవ ప్రవక్తల నాయకునిపై మరియు ఆయనను అనుసరించిన వారిపై ప్రళయదినం వరకు శాంతి మరియు శుభాలు వర్షించుగాక!

ప్రియ వీక్షకుల్లారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక!

ప్రియ వీక్షకుల్లారా! ఈరోజు మనం ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలో, రుఖ్ యా అంటే మంత్రించి ఊదటం అనే విషయం గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అరబీ భాషలో, హదీస్ గ్రంథాలలో రుఖ్ యా ఇది ఏకవచనం, దానికి బహువచనం రుఖా. రుఖ్ యా అంటే తెలుగు అనువాదకులు రుఖ్ యా అనే దానికి మంత్రం, మంత్రించి ఊదటం అని అనువదించారు. ఇది షరియత్ పరిభాషలో అరబీలో రుఖ్ యా అంటారు. మంత్రించి ఊదటం.

ఈ విషయం గురించి షరియత్ లో దాని ఆదేశం ఏమిటి? అది తప్పా ఒప్పా అనే విషయం గురించి తెలుసుకుందాం.

అసలు రుఖ్ యా అంటే ఏమిటి, మంత్రించి ఊదటం అది ఏమిటో తెలుసుకుందాం ఇన్షా అల్లాహ్. రుఖ్ యా దానికి అర్థం ఏమిటంటే మానసికంగానైనా శారీరకంగానైనా బాధలో ఉన్న వ్యక్తిపై ఏదైనా పఠించి ఊదటం. జ్వరం, మూర్ఛ రోగం, మొదలుగైన బాధలు, కష్టాలు, సమస్యలు, అనారోగ్యంకి గురైన వారికి, రోగులపై ఏదైనా పఠించి ఊదటాన్ని రుఖ్ యా అంటారు, మంత్రించి ఊదటం అంటారు.

ఇవి రెండు రకాలు.

మొదటి విషయం, మొదటి రకం ఏమిటంటే షిర్క్ ప్రమేయం లేకుండా, షిర్క్ లేని మంత్రం, షిర్క్ లేని రుఖ్ యా. ఆ రుఖ్ యాలో, ఆ మంత్రంలో ఎటువంటి షిర్క్ లేదు. సూటిగా చెప్పాలంటే దివ్య ఖుర్ఆన్ లోని ఆయతులు లేదా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాలు, ఆయన నామ గుణాలని పఠించి ఆ రోగిని, ఎవరిపైన ఊదుతున్నామో ఆయన్ని అల్లాహ్ రక్షణలో ఇవ్వటం.

ఈ రకమైన రుఖ్ యా, ఈ రకమైన మంత్రం ధర్మ సమ్మతమే. ఏ రుఖ్ యాలో షిర్క్ లేదో, బిద్అత్ లేదో, కొత్త విధానం లేదో, కేవలం అల్లాహ్ వాక్యాలు, అల్లాహ్ నామం, ఆయన గుణాలు మాత్రమే దాంట్లో ఉంటే ఇటువంటి రుఖ్ యా, ఇటువంటి మంత్రం ధర్మ సమ్మతమే. ఈ విధంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చేశారు, మరి అది ధర్మ సమ్మతం అని ఖరారు కూడా చేశారు.

దీనికి ఆధారం, ఒక సందర్భంలో ఔఫ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ దైవ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం, మేము అజ్ఞాన కాలంలో మంత్రించి ఊదే వారము. ఇప్పుడు మీరు దీని గురించి, ఈ రుఖ్ యా గురించి, ఈ మంత్రం గురించి ఏదైతే మేము అజ్ఞాన కాలంలో ఇలా మంత్రించి ఊదుతూ ఉన్నాము కదా, ఇప్పుడు మీరు ఆ విషయం గురించి ఏమంటారు, మీ అభిప్రాయం ఏమిటి?” అని ఔఫ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించారు.

దానికి సమాధానంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

اعْرِضُوا عَلَىَّ رُقَاكُمْ لاَ بَأْسَ بِالرُّقَى مَا لَمْ يَكُنْ فِيهِ شِرْكٌ
(ఇఅరిదూ అలయ్య రుఖాకుమ్, లా బ’స బిర్రుఖా మా లమ్ తకున్ షిర్కన్)
“మీ మంత్రాలు ఏమిటో నా ముందు సమర్పించండి. షిర్క్ ప్రమేయం లేకుండా ఉన్నంత వరకు మంత్రించి ఊదటంలో అభ్యంతరం ఏమీ లేదు” (సహీహ్ ముస్లిం)

అభిమాన సోదరులారా! ఈ హదీస్ లో రెండు భాగాలు ఉన్నాయి, బాగా గమనించాలి. మొదటి భాగం ఏమిటి? “ఇఅరిదూ అలయ్య రుఖాకుమ్” అన్నారు. అంటే ఆలోచన చేయకుండా, అడగకుండా, ఏ మంత్రమైనా, ఎలాగైనా కరెక్టే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కితాబు ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. “ఇఅరిదూ అలయ్య రుఖాకుమ్” – మీరు ముందు నాకు సమర్పించండి, చూపించండి. మీరు ఎటువంటి మంత్రం మీరు చేస్తారు, ఎలా ఊదుతారు, విధానం ఏమిటి, పదాలు ఏమిటి, వాక్యాలు ఏమిటి, అది నాకు ముందు చూపించండి, నా సమక్షంలో సమర్పించండి, నేను చూస్తాను అన్నారు.

ఆ తర్వాత రెండో భాగం ఏమిటి ఈ హదీస్ లో? “లా బ’స బిర్రుఖా మా లమ్ తకున్ షిర్కన్”. అంటే మీరు మంత్రించి ఊదటంలో ఎటువంటి షిర్క్ ఉండకూడదు. ఆ మంత్రంలో, ఆ రుఖ్ యాలో షిర్క్ లేనంత వరకు అది ధర్మ సమ్మతమే అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా! కావున, ఈ రుఖ్ యా గురించి మనము ఇంకా పరిశీలిస్తే, ఇది ధర్మ సమ్మతం అవటానికి మూడు షరతులు ఉన్నాయి. ఈ మూడు షరతులు అబ్దుర్రహ్మాన్ బిన్ హసన్ అత్తమీమీ రహ్మతుల్లాహి అలై తన పుస్తకం ‘ఫత్ హుల్ మజీద్ షరహ్ కితాబుత్ తౌహీద్‘ లో తెలియజేశారు ఈ మూడు షరతులు.

అంటే రుఖ్ యా ధర్మ సమ్మతం, జాయజ్, చేయవచ్చు అనటానికి ఆ మూడు షరతులు ఉన్నాయి.

  1. మొదటి షరతు ఏమిటి? ఆ రుఖ్ యా దైవ వచనాల, దైవ నామాల ఆధారంగా మంత్రించి ఊదాలి. మొదటి షరతు ఇది. ఏదైతే మనము రుఖ్ యా చేస్తున్నామో, మొదటి షరతు ఏమిటి? దైవ వచనాలు, అల్లాహ్ ఆయతులు, ఖుర్ఆన్ లోని వాక్యాలు, అల్లాహ్ నామ గుణాలు ఆధారంగా మంత్రించి, పఠించి ఊదాలి. ఇది మొదటి కండిషన్.
  2. రెండవ షరతు: ఆ రుఖ్ యా అనేది, ఆ పదాలు అనేవి అరబీ భాషలోనే ఉండాలి. దాని భావం కూడా స్పష్టంగా ఉండాలి. ఇది రెండవ కండిషన్.
  3. మూడవ కండిషన్: ఆ మంత్రం, ఆ రుఖ్ యా, ఆ విధంగా మంత్రించి ఊదటం, అది అల్లాహ్ విధివ్రాత ప్రకారమే దాని ప్రభావం ఉంటుందని నమ్మకం కలిగి ఉండాలి.

ఈ మూడు కండిషన్లు ఉంటే అటువంటి రుఖ్ యా ధర్మ సమ్మతం, కరెక్టే, చేయవచ్చు. దానివల్ల ఇన్షా అల్లాహ్, అల్లాహ్ తలిస్తే ప్రయోజనం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది ఇన్షా అల్లాహ్ రోగికి. ఆ మూడు కండిషన్లు బాగా మనము గుర్తు పెట్టుకోవాలి.

మొదటి కండిషన్ ఏమిటి? అల్లాహ్ వచనాల, అల్లాహ్ నామాల ఆధారంగా మంత్రించి ఊదాలి. రెండవది అది అరబీ భాషలోనే ఉండాలి, దాని భావం స్పష్టంగా ఉండాలి. మూడవది, అది ఆ విధివ్రాత ప్రకారమే దాని ప్రభావం ఉంటుందని నమ్మకం కలిగి ఉండాలి. ఈ మూడు కండిషన్లు, ఈ మూడు షరతులు ఆ మంత్రంలో, ఆ రుఖ్ యాలో కలిగి ఉంటే, అటువంటి రుఖ్ యా, అటువంటి మంత్రం, అటువంటి మంత్రించి ఊదటం కరెక్టే, ధర్మ సమ్మతమే.

దాని విధానం ఏమిటంటే, మంత్రించే పద్ధతి ఏమిటంటే, నిర్దిష్ట దైవ వచనాలు, నిర్దిష్ట వాక్యాలు, ఖుర్ఆన్ వాక్యాలు పఠించి రోగిపై ఊదాలి. మొదటి విషయం ఏమిటి? స్వయంగా రోగి తన కోసం అది చేసుకోవాలి. ఆ రోగికి, ఆ బాధలో, సమస్యలో ఉన్న వ్యక్తికి ఆ వచనాలు, ఆ దుఆలు అవి రాని యెడల, వచ్చే వారు రోగిపై పఠించి ఊదవచ్చు. లేదా నీటిపై మంత్రించి దానిని రోగికి త్రాగించాలి. ఇది సరైన విధానం, రుఖ్ యా షరియా అనేది.

రెండవ విధానం ధర్మ సమ్మతం కాదు, జాయజ్ కాదు, అధర్మం. అదేమిటి? షిర్క్ కు ప్రమేయం ఉన్నది. అంటే దైవేతరుల సహాయం అర్థించే మంత్ర తంత్రాలు. ఇందు నిమిత్తం దైవేతరులను మొరపెట్టుకోవటం, వారి సహాయం కోరటం, వారి శరణు కోరటం, జిన్నాతుల పేర్లతో, ప్రవక్తల పేర్లతో, దైవదూతల పేర్లతో, పుణ్య పురుషుల పేర్లతో మంత్రించి ఊదటం. ఇదంతా దైవేతరులను మొరపెట్టుకోవటం క్రిందికే వస్తుంది, కావున ఇది షిర్కే అక్బర్ అవుతుంది. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ధర్మ సమ్మతం కాదు, హరాం.

అలాగే కొన్ని పదాలు, కొన్ని మంత్రాలు వాటిలో అవిశ్వాసంతో, షిర్క్ తో కూడిన వాక్యాలు కూడా ఉండవచ్చు. ఆ విషయం మనకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఈ విధమైన మంత్రాలు కూడా సమ్మతం కావు అని మనం బాగా తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి.

అభిమాన సోదరులారా! సారాంశం ఏమనగా చిన్న పిల్లలైనా, పెద్దవారైనా, ఎవరైనా సరే ఏదైనా రోగం వస్తే, అనారోగ్యానికి గురైతే, ఖుర్ఆన్ మరియు హదీస్ ఆధారంగా, ఖుర్ఆన్ లోని ఆయతులు, వాక్యాలు, అల్లాహ్ నామాలు, అల్లాహ్ గుణ గణాలను పఠించి ఊదవచ్చు. ఏదైతే ఖుర్ఆన్ లో వాక్యాలు ఉన్నాయో, ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పించారో. అవి కూడా మూడు కండిషన్లు మనం తెలుసుకున్నాము. ఆ మూడు కండిషన్లతో సహా ఉంటే మనము ఈ రుఖ్ యా షరియా పఠించవచ్చు, పఠించి ఊదవచ్చు, మంత్రించవచ్చు, రుఖ్ యా చేయవచ్చు.

ఈ విషయంలో లాస్ట్ లో ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. అది ఏమిటంటే, ఈ కాలంలో కొందరు దీనిని వ్యాపారంగా చేసుకున్నారు. వారి జీవనోపాధికి కూడా ఇదే మంత్రం, రుఖ్ యా మాత్రమే అయిపోయింది. ఈ విషయం గురించి ఒకే ఒక్క మాట. రుఖ్ యా షరియాను, ఈ మంత్రించి ఊదటాన్ని సహాబాలు, ఆ తర్వాత తాబయీన్లు, తబే తాబయీన్లు, ముహద్దీసీన్లు, అయిమ్మాలు, మన పూర్వం సజ్జనులు, సలఫ్ సాలెహీన్లు ఎవ్వరూ కూడా ఈ రుఖ్ యాను, ఈ మంత్రించి ఊదటాన్ని వ్యాపారంగా, తన జీవన ఉపాధిగా ఎవ్వరూ, ఏ వ్యక్తి కూడా చేసుకోలేదు. ఇది గమనించాల్సిన విషయం. కావున, అవసరం రీత్యా మనము ఈ వ్యాపారం లేకుండా ఈ విధంగా మనము దీనిని రోగిపై పఠించి ఊదవచ్చు.

స్వస్థత కల్పించేవాడు, చికిత్స చేసేవాడు అల్లాహ్ మాత్రమే. ఆరోగ్యం ఇచ్చేవాడు, అనారోగ్యం ఇచ్చేవాడు అల్లాహ్ మాత్రమే. కావున ఇది రుఖ్ యా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు.

అలాగే దీనికే సంబంధించిన విషయం ఒకటి ఉంది, అది తావీజు, తాయెత్తు. కొందరు తావీజులు, తాయెత్తులు కట్టుకుంటారు, మెడలో వేలాడదీసుకుంటారు, చేతికి కట్టుకుంటారు. ఇది ధర్మ సమ్మతమా కాదా? ఈ తావీజు యొక్క వాస్తవికత ఏమిటి? అది తప్పా ఒప్పా? అనే విషయం ఇన్షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా ఆఖరి పలుకు ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక!

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=24566

మంత్రించి ఊదటం, తావీజులు కట్టటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [PDF] [4పేజీలు]
https://teluguislam.net/wp-content/uploads/2022/10/at-sh.fawzan-4.10.pdf

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

భర్త నమాజు చదవడం లేదు, తావీజు ధరిస్తున్నాడు, షిర్క్ చేస్తున్నాడు, ఇటువంటి సమయంలో విశ్వాసురాలైన భార్య ఏమి చెయ్యాలి? [ఆడియో]

భర్త నమాజు చదవడం లేదు, తావీజు ధరిస్తున్నాడు, షిర్క్ చేస్తున్నాడు,
ఇటువంటి సమయంలో విశ్వాసురాలైన భార్య ఏమి చెయ్యాలి?
https://youtu.be/HORMsPWKEDQ [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, భర్త నమాజుకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, మెడలో తాయెత్తులు వేసుకుంటూ, దర్గాల వద్దకు వెళ్తూ షిర్క్ చేస్తున్నప్పుడు, తౌహీద్ మరియు సున్నత్ ప్రకారం జీవించాలనుకునే భార్య అతని నుండి ఖులా (విడాకులు) తీసుకోవచ్చా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. దర్గాలకు వెళ్లడం, తాయెత్తులు ధరించడం వంటివి షిర్క్ వరకు తీసుకెళ్లే తీవ్రమైన పాపాలని, ఖురాన్ ఆయతుల ఆధారంగా వివరించబడింది. ముఖ్యంగా అల్లాహ్ ను కాకుండా ఇతరులను ప్రార్థించడం, ఇతరులకు సజ్దా చేయడం స్పష్టమైన షిర్క్. అలాగే, నమాజును నిర్లక్ష్యం చేయడం లేదా వదిలివేయడం కూడా చాలా పెద్ద పాపమని, అది కుఫ్ర్ వరకు వెళ్ళవచ్చని హెచ్చరించబడింది. భర్త ఈ పాపాలనుండి పశ్చాత్తాపపడకపోతే, భార్య ఖులా తీసుకోవడం ధర్మసమ్మతమని పండితులు అభిప్రాయపడతారని, అయితే ఓపికతో అతనికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేయవచ్చని, కానీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని సలహా ఇవ్వబడింది.

భర్త ఏ మాత్రం నమాజుకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, మెడలో తాయీజులు వేసుకుంటూ దర్గాల వద్దకు వెళ్తూ ఉంటాడు. భార్య ఇస్లాం యొక్క ప్రేమికురాలు, తౌహీద్ మరియు సున్నత్ ప్రకారంగా జీవితం గడపాలనుకుంటుంది. అయితే ఆ భర్త, ఆ భర్త నుండి ఖులా తీసుకోవడానికి, వేరుకోవడానికి ఇస్లాంలో ఏదైనా అనుమతి ఉందా అని మీరు అడిగారు.

వాస్తవానికి చూసేది ఉంటే, మనిషి దర్గాలకు వెళ్లి అక్కడ అల్లాహ్ కు చేయబడే అటువంటి కొన్ని ఆరాధనలు అక్కడ చేస్తున్నాడు, తాయీదులు వేసుకుంటున్నాడు, ఇవి రెండూ కూడా షిర్క్ వరకు తీసుకెళ్లే పాపాలు.

దర్గా కాడికి వెళ్లి డైరెక్ట్ దర్గా వారితో దుఆ చేస్తే, దర్గా వారికి సజ్దా చేస్తే, అల్లాహ్ అలాంటి పరిస్థితి నుండి మనందరినీ కాపాడుగాక, షిర్క్ చేసినవాడైపోతాడు. అల్లాహ్ త’ఆలా చాలా స్పష్టంగా చెప్పాడు.

وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ
(వస్ జుదూ లిల్లా హిల్లాజి ఖలకహున్)
వాటిని సృష్టించిన అల్లాహ్‌కే సాష్టాంగపడండి. (41:37)

భూమి ఆకాశాలు, సూర్య చంద్రాలు ఇంకా ఈ సృష్టి అంతటినీ సృష్టించిన ఆ ఏకైక అల్లాహ్ కు మాత్రమే మీరు సజ్దా చేయండి.

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ
(వ కాల రబ్బుకుముద్ ఊని అస్తజిబ్ లకుం)
మీ ప్రభువు అంటున్నాడు: “నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. (40:60)

మీ ప్రభువు మీతో చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు నన్ను మాత్రమే అర్థించండి, నాతో మాత్రమే దుఆ చేయండి, నేను మీ దుఆలను అంగీకరిస్తాను.

ఇంత స్పష్టమైన ఆయతులు ఉన్నప్పటికీ మనిషి దర్గాల కాడికి వెళ్లి ఇలాంటి పనులు చేస్తున్నాడంటే స్పష్టమైన షిర్క్ కు గురి అవుతున్నాడు. ఇక ఆ మనిషి అల్లాహ్ ను నమ్ముతూ, ప్రవక్తను నమ్ముతూ, పరలోక దినాన్ని నమ్ముతూ నమాజులు చేస్తూ ఇదే పెద్దలు చేసిన్లు మా ఊర్లో, నేను ఎక్కడా ఇంకా బయటికి వెళ్ళలేదు ఏమీ వేరేది చూడలేదు, దీనినే నిజమైన ఆరాధన అనుకుంటున్నాను అన్నటువంటి భ్రమలో ఉండి ఉంటే, అల్లాహ్ అలాంటి వ్యక్తితో ఎలా మసులుకుంటాడో కరుణాకటాక్షాలతో లేదా ఇంకా వేరే ఏదైనా పరీక్ష తీసుకుంటాడా అది వేరే విషయం. కానీ ఈనాటి కాలంలో నెట్ ద్వారా, మొబైల్ ల ద్వారా సత్యం అనేది ఎంత ప్రస్ఫుటమవుతుంది, అయినా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఇలాంటి షిర్క్ పనికి లోనవుతూ ఉంటే ఇది చాలా భయంకరమైన విషయం.

భార్య వాస్తవానికి ఇస్లాం ప్రకారంగా జీవితం గడపాలనుకుంటుంది అంటే ముందు భర్తను ఇలాంటి షిర్క్ పనుల గురించి ప్రేమగా, మంచి విధంగా, ఆధారాలు చూపుతూ ఇవి తప్పు అని తప్పకుండా తెలియజేస్తూ ఉండాలి.

దీనిపై ఇంకా తాయీదులు వేసుకుంటున్నారు అంటే ఈ రోజుల్లో దర్గాల వద్ద నుండి వేరే కొందరు మౌల్సాబుల నుండి ఏదైతే తాయీదులు ఇవ్వడం జరుగుతున్నాయో, సర్వసాధారణంగా ప్రజలు ఆ తాయీదుల మీదనే మొత్తం నమ్మకం ఉంచుతున్నారు. చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఎందరితోనో మనం మాట్లాడి, ఎంతో ప్రేమగా దీని గురించి చెప్పి తీయించాలని ప్రయత్నం చేస్తే, అయ్యో వద్దండి వద్దండి ఇది తీసేస్తుంటే ఖలాస్ ఇక నా ప్రాణం పోతది, లేదు నాకు మళ్లీ కడుపునొప్పి మొదలైపోతది, ఇక ఇది తీసేది ఉంటే నేను మళ్ళీ అనారోగ్యానికి గురైపోతాను అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఇది కేవలం ఒక చిన్న సబబుగా అల్లాహ్ యే షఫా ఇచ్చేవాడు అన్నటువంటి సంపూర్ణ నమ్మకం లేదు. దీనిమీదనే, ఈ తాయీదుల మీదనే నమ్మకం ఉన్నది. మరి ఇలాంటి ఈ నమ్మకాన్ని కూడా పెద్ద షిర్క్ లో పడవేసేది అని ఖురాన్ హదీస్ ఆయతుల ద్వారా ధర్మ పండితులు చెప్పి ఉన్నారు.

దీనికంటే కరేలా నీమ్ చడా అన్నట్టుగా ఇంకా ఘోరమైన విషయం మీరు తెలిపింది ఏమిటంటే ఆ భర్త నమాజుకు ప్రాముఖ్యత ఏమీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఉంటుంది. అదేమిటంటే నమాజుకు ఏదైనా ఎప్పుడైనా బద్ధకంతో వెళ్లకపోతే అదే చాలా ప్రమాదకరమైన విషయం అని ఖురాన్ హదీసులో చెప్పడం జరిగింది.

ఉదాహరణకు మీరు గమనించండి, ఒక చిన్న సూరాలో అంటే సూరతుల్ మాఊన్ లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు,

فَوَيْلٌ لِلْمُصَلِّينَ
(ఫ వైలుల్ లిల్ ముసల్లీన్)
వయిల్ (అధోలోకం) ఉన్నది ఆ నమాజీల కొరకు, (107:4)

الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُونَ
(అల్లజీనహుం అన్ సలాతిహిం సాహూన్)
ఎవరయితే తమ నమాజుల పట్ల ఏమరుపాటుగా ఉంటారో, (107:5)

ఎవరైతే నమాజు బద్ధకంగా చేస్తున్నారో, టైం యొక్క సమయపాలన లేకుండా, రుకున్ వాజిబాత్ ఇంకా సున్నత్ ప్రకారంగా చేయకుండా, ఇష్టం వచ్చినప్పుడు చేస్తున్నాడు లేదా అంటే వదిలేస్తున్నాడు, ఇలా బద్ధకంగా చేసే వారి గురించే వినాశకరమైన వైల్ ఉన్నది అని అల్లాహ్ త’ఆలా హెచ్చరిస్తున్నాడు. అలాంటప్పుడు ఎవరైతే దానికి ప్రాముఖ్యతనే ఇవ్వరో, అయ్యో నమాజ్ చదవాలి అన్నటువంటి మనసులో ఒక తపన లేనే లేదో వారు ఇంకా ఎంత భయంకరమైన పాపములో పడి ఉన్నారో గమనించండి.

అయితే ఇలాంటి భార్య అతని నుండి ఆ భర్త నుండి ఖులా తీసుకోవచ్చా? ఎంతోమంది ధర్మపండితులు చెప్పే విషయం ఏమిటంటే ఇలాంటి షిర్క్ మరియు నమాజును వదిలేటువంటి కుఫ్ర్ పని నుండి అతను తోబా చేయకుంటే తప్పకుండా భార్య ఖులా తీసుకోవాలి.

కానీ మన చోట ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ భార్య ఇంకా దావత్ ఇస్తూ, భర్తకు నచ్చజెప్పుతూ ఓపిక కొంచెం వహించింది అంటే ఒకరకంగా మంచిది కావచ్చు. కానీ అలాగే ఉండిపోవడం, ఆ భర్త అంటే ఆమె పిల్లల యొక్క తండ్రి యొక్క శిక్షణలో ఈ పిల్లలు ఎలా ఎదుగుతారు అనే విషయంలో భార్య తప్పకుండా భయపడాలి. అల్లాహ్ తో అధికంగా దుఆ చేయాలి, అధికంగా దుఆ చేయాలి. అల్లాహ్ మనందరికీ సన్మార్గం ప్రసాదించుగాక. ఇస్లాంపై స్థిరంగా ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక.


తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

తావీజులు, తాయత్తులు… !? – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

తావీజులు, తాయత్తులు… !?
https://youtu.be/W9VBuoPiFfk [15 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, తావీజు (తాయత్తులు) మరియు ఇస్లాంలో వాటి స్థానం గురించి వివరించబడింది. తావీజులు రెండు రకాలుగా విభజించబడ్డాయి: ఖుర్ఆన్ వచనాలు కలిగినవి మరియు ఇతర వస్తువులు (గవ్వలు, దారాలు మొదలైనవి) కలిగినవి. ఖుర్ఆన్ వచనాలు ఉన్న తాయత్తుల విషయంలో కూడా పండితుల మధ్య అభిప్రాయ భేదం ఉందని, అయితే మెజారిటీ పండితులు షిర్క్‌కు దారితీస్తుందనే భయంతో వాటిని కూడా నిషేధించారని ప్రసంగీకులు పేర్కొన్నారు. షిర్క్‌తో కూడిన రెండవ రకం తాయత్తులు పూర్తిగా హరామ్ అని స్పష్టం చేయబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన విధంగా, తాయత్తులకు బదులుగా ఖుర్ఆన్ మరియు దుఆలను పఠించడం ద్వారా రక్షణ మరియు నివారణను వెతకాలని ముగింపులో ఉపదేశించబడింది.


إِنَّ الْحَمْدَ لِلَّهِ وَحْدَهُ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ، أَمَّا بَعْدُ
(ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్ద, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బా’ద, అమ్మా బా’ద్)
నిశ్చయంగా సర్వ స్తోత్రాలు ఏకైక అల్లాహ్ కే శోభిస్తాయి. మరియు ఎవరి తర్వాత ప్రవక్త లేడో, ఆయనపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఆ తర్వాత…

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమములోకి మీ అందరికీ ఇస్లామీయ అభివాదం.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈ రోజు మనం తావీజు, తాయత్తుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం మన సమాజంలో చూస్తూ ఉంటాము, కొందరి మెడలో, చేతులో, నడుంకి తావీజులు, తాయత్తులు కట్టుకుంటారు. చిన్న పిల్లలకి దిష్టి తగలకుండా ఉండటానికి, పెద్దవారైనా సరే, ఎవరైనా సరే రోగానికి గురైనప్పుడు ఆ రోగం పోవాలని, నష్టానికి గురైనప్పుడు నష్టం రాకూడదని, కొందరు భయం కోసము, కొందరు ముందు జాగ్రత్త ఎప్పుడూ నష్టానికి, బాధకి లోను కాకూడదని ఏదేదో కారణాలతో, ఏదేదో ఉద్దేశాలతో తావీజులు కట్టుకుంటారు. ఇది కూడా సమాజంలో ఒక వర్గం దీనిని వ్యాపారంగా కూడా చేసుకున్నది. కాకపోతే, ఇస్లాం ధర్మంలో, షరీఅత్‌లో తావీజు యొక్క వాస్తవికత ఏమిటి? దీనికి అరబీలో ‘తమీమా‘ అంటారు, ‘త’అవీద్’. మామూలుగా తెలుగులో తావీజు, తాయత్తు అని చెప్తారు.

ఈ తాయత్తులు, ఈ తావీజులు రెండు రకాలు. షేఖ్ సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్ (రహ్మతుల్లాహి అలై) ఒక పుస్తకం ఉంది ‘అఖీదతుత్ తౌహీద్‘, ఆ పుస్తకం ఆధారంగా ఈ తావీజు గురించి ఈ రెండు రకాలు నేను మాట్లాడుతున్నాను. తావీజు రెండు రకాలు ఈ తాయత్తులు.

మొదటి రకం ఏమిటి? ఖుర్ఆన్ ఆధారంగా కట్టే తావీజులు. ఆ తావీజులో ఎటువంటి షిర్క్ లేదు, బిద్అత్ లేదు, కొత్త విషయాలు లేవు. ఖుర్ఆన్ వాక్యాలు మాత్రమే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన వాక్యాలు మాత్రమే ఆ తావీజులో ఉన్నాయి. అంటే ఖుర్ఆన్ సూక్తులను లేదా అల్లాహ్ నామాలను, గుణాలను లిఖించి వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో తావీజు వేయటం. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. అల్లాహ్ సూక్తులను, అల్లాహ్ నామాలను, అల్లాహ్ గుణాలను లిఖించి ఆ వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో వేలాడదీయడం, వేయటం.

ఇటువంటి తావీజు ధర్మ సమ్మతమని కొంతమంది పండితుల అభిప్రాయం. అందరి అభిప్రాయం కాదు, కొంతమంది పండితుల అభిప్రాయం మాత్రమే. ఆధారం ఏమిటి? అటువంటి తావీజులో షిర్క్ లేదు, బిదాత్ లేదు, కొత్త విషయం ఏదీ లేదు. కేవలం అల్లాహ్ వాక్యం ఉంది, అల్లాహ్ నామం మాత్రమే ఉంది, అల్లాహ్ గుణగణాలు మాత్రమే ఉన్నాయి. ఉద్దేశం కూడా ఏమిటి? వ్యాధి నివారణ పొందే ఉద్దేశం. షిర్క్ లేదు కాబట్టి ఇది ధర్మ సమ్మతమే అని కొంతమంది పండితుల అభిప్రాయం.

కాకపోతే, అత్యధిక శాతం, ఎక్కువ మంది ధర్మ పండితులు ఇటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అంటారు. ఆ లిఖించటంలో, ఆ తావీజులో, ఆ కాగితంలో ఖుర్ఆన్ ఆయత్ మాత్రమే ఉన్నప్పటికిని అది ధర్మ సమ్మతం కాదు అని అంటారు అత్యధిక మంది ధర్మ పండితులు. ఉదాహరణకు, అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు త’ఆలా అన్హు) పెద్ద సహాబీ, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పినతండ్రి కుమారుడు అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు త’ఆలా అన్హు), హుజైఫా (రదియల్లాహు త’ఆలా అన్హు), ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఇలా, అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) యొక్క శిష్యులు, ఒక ఉల్లేఖనం ప్రకారం ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహ్మతుల్లాహి అలై), అలాగే వారి శిష్యులు, తర్వాతి తరాల వారు కూడా దీనినే కట్టుబడ్డారు, అంటే ఇది కూడా ఇటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు. అత్యధిక మంది పండితుల అభిప్రాయం ఇదే. ఆధారం ఏమిటి?

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

إِنَّ الرُّقَى وَالتَّمَائِمَ وَالتِّوَلَةَ شِرْكٌ
(ఇన్నర్రుఖా వత్తమాఇమ్ వత్తివలా షిర్కున్)
“నిశ్చయంగా మంత్రాలు (షిర్క్ తో కూడినవి), తాయత్తులు మరియు తివలా (ఒక రకమైన క్షుద్ర విద్య) షిర్క్.” (ఇబ్ను మాజా)

అంటే ఈ విధంగా మంత్రించటం, తాయత్తులు వేయటం, తివలా, ఇది ఒక రకమైన చేతబడి, క్షుద్ర విద్య, షిర్కుతో కూడుకున్నది అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా! కేవలం అల్లాహ్ నామాలు మాత్రమే, అల్లాహ్ గుణాలు మాత్రమే ఉన్నప్పటికీ అది ధర్మ సమ్మతం కాదు అని ఎందుకు అంటున్నారంటే మూడు కారణాల వల్ల అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అంటున్నారు. అది మూడు కారణాలు. ఒకటి ఏమిటి? సర్వసాధారణంగా తాయత్తులు కట్టడం పట్ల వారింపు ఉంది. సర్వసాధారణంగా తాయత్తులు కట్టరాదు, తావీజు వేయరాదు అని వాక్యాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. కావున ఈ సర్వసాధారణకి ప్రత్యేకంగా చేసే ఆధారం ఏదీ లేదు. ఒక విషయం సర్వసాధారణంగా ఉంది, దానికి ప్రత్యేకంగా ఏమైనా రుజువు కావాలి, ఆధారం కావాలి. ఆధారం లేకపోతే అది ధర్మ సమ్మతం అవ్వదు. అంటే మొదటి రకం, మొదటి విషయం ఏమిటి? సర్వసాధారణంగా తాయత్తులు కట్టడం వల్ల వారింపు ఉంది. ఈ సర్వసాధారణమును ప్రత్యేకంగా చేసే ఆధారం ఏదీ లేదు కనుక.

అలాగే రెండవ కారణం ఏమిటి? దీనిని ధర్మ సమ్మతం చేస్తే షిర్క్ ద్వారాలు తెరుస్తాయి. షిర్క్ ద్వారాలను మూసివేయటంలో ఈ వారింపు ఉపయుక్తంగా ఉన్నది కాగా తావీజులు వ్రేలాడదీయవచ్చన్న ఫతవా అనే ఇస్తే, షిర్కుతో కూడుకున్న తావీజును ప్రోత్సహించేందుకు ఆస్కారం ఉంది. అది ఏ విధంగానూ సమ్మతం కాదు. ఇది రెండో కారణం.

మూడోది ఏమిటి? ఖుర్ఆన్ ఆయతులను తావీజుగా చేసి మెడలో, చేతులు వేసుకుంటే తప్పకుండా వాటి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తారు. తప్పనిసరిగా అవుతుంది అది. ఎందుకంటే తావీజు వేసుకొని బాత్రూంకి పోవాలి, కాలకృత్యాలు పూర్తి చేసుకోవాలి, మనిషి ఒకసారి జునుబీ స్థితిలో ఉంటాడు, అశుద్ధ స్థితిలో ఉంటాడు, వివాహం అయిన వారు సంభోగించుకుంటారు భార్యాభర్తలు. మరి మెడలో ఖుర్ఆన్ వాక్యాలు, అల్లాహ్ నామము, చేతిలో అల్లాహ్ వాక్యాలు, ఖుర్ఆన్ వాక్యాలు, అల్లాహ్ నామాలు, అల్లాహ్ పేరు, అల్లాహ్ గుణ విశేషాలు ఇవి మన శరీరంలో పెట్టుకొని మనము బాత్రూం కి పోవటం ఏమిటి? కాలకృత్యాలు తీసుకోవటం ఏమిటి? జునుబీ స్థితిలో ఉండటం ఏమిటి? ఈ విధంగా చాలా కారణాలు ఉన్నాయి, అమర్యాద అవుతుంది ఆ ఈ ఖుర్ఆన్ వాక్యాల విషయంలో. కావున ఈ మూడు కారణాల వల్ల ఆ తావీజులో ఖుర్ఆన్ వాక్యాలు మాత్రమే ఉన్నప్పటికిని అది ధర్మ సమ్మతం కాదు అని పండితుల అత్యధిక మంది పండితుల అభిప్రాయం ఇది.

అభిమాన సోదరులారా! ఇప్పుడు వరకు నేను చెప్పిన మాటల్లో సారాంశం రెండు రెండు విషయాలు. ఒకటి, ధర్మ సమ్మతమైన తావీజు, దాంట్లో ఎటువంటి షిర్క్ పదాలు ఉండకూడదు. కేవలం అల్లాహ్ వాక్యాలు, అల్లాహ్ నామం, అల్లాహ్ గుణాలు మాత్రమే ఉండాలి. అటువంటి తావీజు ధర్మ సమ్మతమని కొంతమంది మాత్రమే ధర్మ సమ్మతం అంటున్నారు. కాకపోతే, రెండో విషయం ఏమిటి? అత్యధిక మంది ధర్మ పండితులు అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు. ఎందుకంటే ఈ మూడు కారణాలు. మొదటి కారణం ఏమిటి? సాధారణంగా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతీ తావీజు షిర్క్ అన్నారు. దానికి ప్రత్యేకం చేయటానికి ఆధారం లేదు. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏమిటి? ఇది షిర్క్‌కి దారి తీస్తుంది. రెండో కారణం. మూడో కారణం ఏమిటి? అల్లాహ్ వాక్యాల పట్ల, అల్లాహ్ నామం పట్ల, అల్లాహ్ గుణ విశేషాల పట్ల అమర్యాద కలుగుతుంది, అగౌరవం కలుగుతుంది. ఈ కారణాల వల్ల రుజువు లేదు కాబట్టి అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అత్యధిక మంది పండితుల అభిప్రాయం.

కావున, మనము తావీజు కట్టుకోకుండా, తావీజు వ్రేలాడదీసుకోకుండా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానాన్ని అనుసరించి మనము మంత్రించి ఊదుకోవాలి, అది ఆధారం ఉంది కదా! ఆరోగ్యం బాగాలేదు, ప్రవక్త గారు కొన్ని దుఆలు, కొన్ని వాక్యాలు నేర్పించారు. ఖుర్ఆన్ వాక్యాలు ఉన్నాయి, అల్లాహ్ నామాలు ఉన్నాయి, అల్లాహ్ గుణాలు ఉన్నాయి. అవి మంత్రించి, పఠించి ఊదుకోవచ్చు. రోగిపై పఠించి ఊదవచ్చు. నీళ్ళపై మంత్రించి ఆ నీళ్ళు తాగవచ్చు, త్రాపించవచ్చు. ఈ విధానం ఉంది కదా. లేని విధానాన్ని, దాంట్లో షిర్క్ అనే అనుమానం ఉంది, అటువంటి విధానాన్ని ఎన్నుకోవడం కరెక్ట్ కాదు.

ఇక తావీజు విషయంలో రెండో రకం, రెండో కోవకు చెందిన తావీజు, ఇప్పుడు అది ఒక వ్యాపారంగా మారిపోయింది. అది ఎటువంటి పరిస్థితుల్లో ధర్మ సమ్మతం కాదు, అధర్మం, షిర్క్ మరియు హరామ్. అంటే, ఖుర్ఆన్ సూక్తులు ఆధారం కాని, ఆధారం లేని తావీజులు. అంటే గవ్వలు, పూసలు, దారాలు, వెంట్రుకలు, చిప్పలు, భూత పిశాచాల పేర్లు ఇత్యాదివి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ రకమైన తావీజులు ముమ్మాటికి నిషిద్ధం, హరామ్, ధర్మ సమ్మతం కాదు, షిర్క్. అవి ఖచ్చితంగా షిర్క్ కిందికి వస్తాయి. ఎందుకంటే ఈ రకమైన వస్తువులలో అల్లాహ్ నామాల, వాక్యాల బదులు వాటిని ఇతరత్రా వాటితో ముడిపెట్టడం జరుగుతుంది, దైవేతరులను ఆశ్రయించడం జరుగుతుంది. కాగా హదీసులో ఇలా ఉంది, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

مَنْ تَعَلَّقَ تَمِيمَةً فَقَدْ أَشْرَكَ
(మన్ త’అల్లఖ తమీమతన్ ఫఖద్ అష్రక్)
ఎవరైతే తాయత్తు వేలాడదీసుకున్నాడో, అతను షిర్క్ చేశాడు.” (ముస్నద్ అహ్మద్)

ఇంకో హదీసులో ఉంది:

مَنْ تَعَلَّقَ شَيْئًا وُكِّلَ إِلَيْهِ
(మన్ త’అల్లఖ షై’అన్ వుకిల ఇలైహి)
ఎవరైతే ఏదైనా వస్తువుతో (రక్షణ కోసం) సంబంధం పెట్టుకుంటాడో, అతను దానికే అప్పగించబడతాడు.” (తిర్మిజి)

ఎవరైనా ఏదైనా వస్తువుతో సంబంధం ఏర్పరుచుకుంటే అతను దాని పరమే చేయబడతాడు, అతని నమ్మకం దాని పైనే ఉంటుంది, అల్లాహ్ పైన నమ్మకం ఉండదు. అల్లాహ్ అతనికి పట్టించుకోడు. కావున ఇది షిర్క్ అవుతుంది. ప్రస్తుతం సమాజంలో చాలామంది అది ఒక వ్యాపారంగా చేసుకున్నారు. మీరు దాని గురించి అనుభవం చేసి చూడండి. కొన్ని తావీజులు ఓపెన్ చేసి చూస్తే, కొన్ని అక్షరాలు ఉంటాయి, అర్థం కాని అక్షరాలు ఉంటాయి. అరబీ భాష కావచ్చు, అరబీ భాష కాకపోవచ్చు, అర్థం కాని భాష ఉంటుంది, అర్థం కాని అక్షరాలు ఉంటాయి. కొన్ని తావీజులలో అడ్డంగా, దిడ్డంగా గీతలు ఉంటాయి. కొన్ని తావీజులలో లెక్కలు ఉంటాయి. ఇదన్నీ ఎవరు నేర్పించారు? ఇవన్నీ హరామ్, ఇవన్నీ షిర్క్ కిందికి వస్తుంది, అధర్మం.

కావున, మనం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన విధానాన్నే అనుసరించాలి. రోగానికి గురైనప్పుడు ప్రవక్త గారు మనకి ఏం నేర్పించారు? పిల్లలకి దిష్టి తగలకుండా ఉండాలంటే ప్రవక్త గారు నేర్పించారు. జ్వరం వస్తే ఏం చేయాలి? బాధకి గురైతే ఏం చేయాలి? నష్టానికి గురైతే ఏం చేయాలి? భయంలో ఏం చేయాలి? ప్రయాణంలో ఏం చేయాలి? అల్హమ్దులిల్లాహ్! అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ప్రతీ విధానం నేర్పించారు. ప్రతీ విషయంలో, ప్రతీ సమయంలో, ప్రతీ సబ్జెక్టులో మనకు నేర్పించారు. వివాహంలో, సంభోగం సమయంలో, దుస్తులు వేసుకునేటప్పుడు, ఇంట్లో ప్రవేశించేటప్పుడు, ఇంటి నుంచి బయటికి పోయేటప్పుడు, ఉదయం సాయంత్రం దుఆలు, అజాన్‌కి ముందు అజాన్ తర్వాత, మస్జిద్‌కి పోయేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు, బాధ కలిగినప్పుడు, భయం ఉన్నప్పుడు, టెన్షన్‌లో ఉన్నప్పుడు, అప్పులో ఉన్నప్పుడు, అప్పులు తీర్చేటప్పుడు ప్రతీ సమస్యకి, ప్రతీ రోగానికి, ప్రతీ కష్టానికి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఒక పద్ధతి నేర్పించారు, ఒక విధానం నేర్పించారు.

మరి మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ఏం నేర్పించినా,

وَمَا يَنطِقُ عَنِ الْهَوَىٰ إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَىٰ
(వమా యంతిఖు అనిల్ హవా, ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా)
అతను తన మనోభిరామం ప్రకారం మాట్లాడటమూ లేదు. అది (అతను మాట్లాడేదంతా) అతని వద్దకు పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు. (53:3-4)

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు అల్లాహ్ తరఫు నుంచే నేర్పుతారు. కావున, మనము ప్రతీ చిన్న పెద్ద షిర్క్ నుండి దూరంగా ఉండాలి. షిర్క్ చాలా ఘోరమైన నేరం, డేంజర్ విషయం అది. షిర్క్ చాలా ఘోరం. కావున, ఈ తావీజు కూడా షిర్క్ కిందికి వస్తుంది. కావున మనం ఈ షిర్క్ నుండి దూరంగా ఉండాలి, ఈ తావీజులు, తాయత్తులతో దూరంగా ఉండాలి. సమాజంలో ఈ బాబాలు, పీర్లు, వీళ్ళు దీనిని ఒక వ్యాపారంగా చేసుకున్నారు. ఇస్లాంలో ఎటువంటి దీనికి స్థానం లేదు. ఇది ధర్మ సమ్మతం కాదు. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ మనకి రోగం వచ్చినా, మన పిల్లలకి రోగాలు వచ్చినా, వారికి దిష్టి తగలకుండా ఉండాలన్నా ప్రవక్త గారు నేర్పించారు. కావున మీరు దుఆల పుస్తకం ఆధారంగా ఉన్న ప్రామాణికమైన హదీసుల పరంగా దుఆలు మనకు ఉన్నాయి, ఆ దుఆలు పఠించండి, ప్రవక్త గారి విధానాన్ని అనుసరించండి. ఇన్షా అల్లాహ్ ఇహపర లోకాలలో సాఫల్యం దక్కుతుంది ఇన్షా అల్లాహ్.

అభిమాన సోదరులారా! కావున ఇంతటితో నేను నా మాటలను ముగిస్తూ, ఇన్షా అల్లాహ్ మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా చివరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.

వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=24530

మంత్రించి ఊదటం, తావీజులు కట్టటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [PDF] [4పేజీలు]

ఆపద దూరమగుటకు, లేదా అది రాకుండా తాయత్తులు, పూసలు మరియు గవ్వలు వేసుకోకు – ధర్మపరమైన నిషేధాలు [వీడియో] [6 నిముషాలు]

దిష్టి తగలకుండా బుగ్గకి నల్ల చుక్క లేదా కాళ్ళకి నల్ల దారం కట్టవచ్చా? [వీడియో]

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

లాభనష్టాల అధికారం కేవలం అల్లాహ్ కే ఉంది

ఇస్లామీయ సోదరులారా! 

లాభనష్టాల అధికారం కేవలం అల్లాహ్ కే వుందని ప్రతి ముస్లిం మనస్ఫూర్తిగా విశ్వసించాలి. అతనికి తప్ప మరెవరికీ ఈ అధికారం లేదు. ఏ ‘వలీ‘ దగ్గరా లేదు, ఏ ‘బుజుర్గ్‘ దగ్గరా లేదు. ఏ ‘పీర్‘, ‘ముర్షద్‘ దగ్గరా లేదు. ఏ ప్రవక్త దగ్గరా లేదు. చివరికి ప్రవక్తలలో శ్రేష్ఠులు, ఆదమ్ సంతతికి నాయకులు మరియు ప్రవక్తల ఇమామ్ అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు కూడా. ఇతరులకు లాభనష్టాలు చేకూర్చడం అటుంచి, స్వయానా తమకు కలిగే లాభనష్టాలపై సయితం వారు అధికారం కలిగిలేరు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

قُل لَّآ أَمْلِكُ لِنَفْسِى نَفْعًۭا وَلَا ضَرًّا إِلَّا مَا شَآءَ ٱللَّهُ ۚ وَلَوْ كُنتُ أَعْلَمُ ٱلْغَيْبَ لَٱسْتَكْثَرْتُ مِنَ ٱلْخَيْرِ وَمَا مَسَّنِىَ ٱلسُّوٓءُ ۚ إِنْ أَنَا۠ إِلَّا نَذِيرٌۭ وَبَشِيرٌۭ لِّقَوْمٍۢ يُؤْمِنُونَ

“ప్రవక్తా! వారితో ఇలా అను: నాకు సంబంధించిన లాభనష్టాలపై నాకు ఏ అధికారమూ లేదు. అల్లాహ్ కోరింది మాత్రమే అవుతుంది. నాకే గనక అగోచర విషయ జ్ఞానం వున్నట్లయితే, నేను ఎన్నో ప్రయోజనాలను నా కొరకు పొంది ఉండేవాణ్ణి. నాకు ఎన్నటికీ ఏ నష్టమూ వాటిల్లేది కాదు. నేను నా మాటను నమ్మేవారి కొరకు కేవలం హెచ్చరిక చేసేవాణ్ణి మాత్రమే, శుభవార్త వినిపించేవాణ్ణి మాత్రమే.” (ఆరాఫ్ 7:188) 

ఈ ఆయతుపై దృష్టి సారిస్తే తెలిసేదేమిటంటే – 

స్వయానా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనకు కలిగే లాభనష్టాలపై అధికారం కలిగి లేకపోతే – మరి ఆయన కన్నా తక్కువ స్థాయి గల వలీ గానీ, బుజుర్గ్ గానీ, పీర్ గానీ- ఎవరి సమాధులనయితే ప్రజలు గట్టిగా నమ్మి సందర్శిస్తుంటారో- ఈ అధికారాన్ని ఎలా కలిగి వుంటారు? తమకు ప్రయోజనం చేకూర్చే మరియు నష్టాన్ని కలిగించే వారుగా ప్రజలు తలపోసే వారి గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ لَيَقُولُنَّ ٱللَّهُ ۚ قُلْ أَفَرَءَيْتُم مَّا تَدْعُونَ مِن دُونِ ٱللَّهِ إِنْ أَرَادَنِىَ ٱللَّهُ بِضُرٍّ هَلْ هُنَّ كَـٰشِفَـٰتُ ضُرِّهِۦٓ أَوْ أَرَادَنِى بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكَـٰتُ رَحْمَتِهِۦ ۚ قُلْ حَسْبِىَ ٱللَّهُ ۖ عَلَيْهِ يَتَوَكَّلُ ٱلْمُتَوَكِّلُونَ

“వారిని ఇలా అడుగు: ఒకవేళ అల్లాహ్ నాకేదైనా నష్టాన్ని కలిగించగోరితే, మీరు అల్లాహ్ ను కాదని వేడుకొనే ఆరాధ్యులు, ఆయన కలిగించే నష్టం నుండి నన్ను కాపాడగలరా? లేదా అల్లాహ్ నాపై కనికరం చూపగోరితే, వారు ఆయన కారుణ్యాన్ని అడ్డుకోగలరా? మీ అభిప్రాయం ఏమిటి? కనుక వారితో ఇలా అను, నాకు అల్లాహ్ ఒక్కడే చాలు, నమ్ముకునేవారు ఆయననే నమ్ముకుంటారు.” (జుమర్ 39 : 38) 

ఈ ఆయత్ లో అల్లాహ్ ఇలా ఛాలెంజ్ చేస్తున్నాడు: దైవేతరులెవరి దగ్గరైనా లాభనష్టాల అధికారం గనక వుంటే – అల్లాహ్ నష్టం కలిగించదలచిన వాడిని, తను, ఆ నష్టం కలగకుండా కాపాడ మనండి మరియు అల్లాహ్ ప్రయోజనం చేకూర్చదలచిన వాడికి ఆ ప్రయోజనం కలగకుండా ఆపమనండి. అంటే – వారలా చేయలేరు. మరి వారలా చేయలేరంటే – దాని అర్థం వారికి లాభనష్టాల అధికారం లేదు అని. 

అలాగే, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

مَّا يَفْتَحِ ٱللَّهُ لِلنَّاسِ مِن رَّحْمَةٍۢ فَلَا مُمْسِكَ لَهَا ۖ وَمَا يُمْسِكْ فَلَا مُرْسِلَ لَهُۥ مِنۢ بَعْدِهِۦ ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

“అల్లాహ్ ప్రజల కొరకు ఏ కారుణ్య ద్వారాన్ని తెరచినా, దానిని అడ్డుకొనే  వాడెవ్వడూలేదు. ఆయన మూసివేసిన దానిని అల్లాహ్ తరువాత మళ్ళీ తెరిచేవాడూ ఎవ్వడూ లేడు. ఆయన శక్తిమంతుడు, వివేచన కలవాడు.” (ఫాతిర్ 35: 2) 

అందుకే, అల్లాహ్- తనను తప్ప ఇతరులను వేడుకోవడం నుండి వారించాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَلَا تَدْعُ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَنفَعُكَ وَلَا يَضُرُّكَ ۖ فَإِن فَعَلْتَ فَإِنَّكَ إِذًۭا مِّنَ ٱلظَّـٰلِمِينَ وَإِن يَمْسَسْكَ ٱللَّهُ بِضُرٍّۢ فَلَا كَاشِفَ لَهُۥٓ إِلَّا هُوَ ۖ وَإِن يُرِدْكَ بِخَيْرٍۢ فَلَا رَآدَّ لِفَضْلِهِۦ ۚ يُصِيبُ بِهِۦ مَن يَشَآءُ مِنْ عِبَادِهِۦ ۚ وَهُوَ ٱلْغَفُورُ ٱلرَّحِيمُ

“అల్లాహ్ ను వదలి నీకు నష్టాన్ని గానీ లాభాన్ని గానీ కలిగించలేని ఏ శక్తినీ వేడుకోకు. ఒకవేళ అలా చేస్తే నీవూ దుర్మార్గుడవై పోతావు. అల్లాహ్ గనక నిన్ను ఏదైనా ఆపదకు గురిచేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవ్వరూ లేరు. ఇంకా, ఆయన గనక నీ విషయంలో ఏదైనా మేలు చెయ్యాలని సంకల్పిస్తే, ఆయన అనుగ్రహాన్ని మళ్ళించేవాడు కూడా ఎవ్వడూ లేడు. ఆయన తన దాసులలో తాను కోరిన వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆయన క్షమించేవాడూ, కరుణించేవాడూను.” (యూనుస్ 10: 106 -107) 

ఈ ఆయతులలో అల్లాహ్ – దైవేతరులెవరికీ లాభనష్టాల అధికారం లేదు, వారిని వేడుకోవడాన్ని వారిస్తూ, ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)! ఒకవేళ నీవు గనక ఇలా చేస్తే (అల్లాహ్ శరణు) నీవు కూడా దుర్మార్గులలో కలసి పోతావు – అని సెలవియ్యడంతోపాటు, తన ప్రియ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఆయన నష్టం కలిగించదలిస్తే దాన్ని ఆపగలిగే వాడెవడూ లేడు మరియు ఒకవేళ తన కృపతో ఆయన దేన్నయినా ప్రసాదిస్తే ఆయన అనుగ్రహాన్ని కూడా ఎవరూ అడ్డుకోలేరు అని సెలవిచ్చాడు. దీనితో – రుజువయ్యిందేమిటంటే – ఈ అధికారాలు కేవలం అల్లాహ్ కే వున్నాయి. 

కాస్త ఆలోచించండి! 

మరి, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు అల్లాహ్ తప్ప మరెవ్వరూ నష్టం కలిగించలేనప్పుడు, సాధారణ ముస్లిములకు అల్లాహ్ తప్ప మరెవరు నష్టం కలిగించగలరు? అందుకే, దైవేతరులెవరైనా సరే, వారితో లాభనష్టాలను ఆశించకూడదు. ఎందుకంటే – దైవేతరుల గురించి -తన సంకల్పంతో, అధికారంతో ఎవరికైనా తను కోరుకున్న నష్టం కలిగించగలడు – అని భావించడం పెద్ద షిర్క్ (షిర్కె అక్బర్). 

అందుకే ఇబ్రాహీం (అలైహిస్సలాం) ఇలా సెలవిచ్చి వున్నారు: 

وَحَآجَّهُۥ قَوْمُهُۥ ۚ قَالَ أَتُحَـٰٓجُّوٓنِّى فِى ٱللَّهِ وَقَدْ هَدَىٰنِ ۚ وَلَآ أَخَافُ مَا تُشْرِكُونَ بِهِۦٓ إِلَّآ أَن يَشَآءَ رَبِّى شَيْـًۭٔا ۗ وَسِعَ رَبِّى كُلَّ شَىْءٍ عِلْمًا ۗ أَفَلَا تَتَذَكَّرُونَ وَكَيْفَ أَخَافُ مَآ أَشْرَكْتُمْ وَلَا تَخَافُونَ أَنَّكُمْ أَشْرَكْتُم بِٱللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِۦ عَلَيْكُمْ سُلْطَـٰنًۭا ۚ فَأَىُّ ٱلْفَرِيقَيْنِ أَحَقُّ بِٱلْأَمْنِ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ

“(అల్లాహ్ కు వ్యతిరేకంగా) మీరు నిలబెట్టిన భాగస్వాములకు నేను భయపడను. అయితే నా ప్రభువు ఏదైనా కోరితే అది తప్పకుండా జరుగుతుంది. నా ప్రభువు జ్ఞానం ప్రతి దానినీ ఆవరించి వున్నది. మీరు స్పృహలోకి రారా? నేను అసలు మీరు నిలబెట్టే భాగస్వాములకు ఎందుకు భయపడాలి?వాటి విషయంలో అల్లాహ్ మీపై ఏ ప్రమాణాన్ని అవతరింపజేయనప్పటికీ వాటిని మీరు ఆయన తోపాటు దైవత్వంలో భాగస్వాములుగా చేస్తూ భయపడనప్పుడు.” (అన్ఆమ్ 6: 80-81) 

ఈ ఆయతుల ద్వారా తెలిసిందేమిటంటే – 

పీర్లు, ఫకీర్లు, ‘బుజుర్గ్’ లో ఎవరిని గురించి కూడా (వారేదో చేసేస్తారని) భయాందోళనలకు గురి కాకూడదు. అల్లాహ్ అభీష్టానికి వ్యతిరేకంగా ఎవరు కూడా ఏ మాత్రం నష్టం కలిగించలేరు. ఇలాంటి భయాందోళనలు కేవలం అల్లాహ్ పట్ల కలిగి వుండాలి. కారణం – తన సంకల్పానికి అనుగుణంగా ఎవరికైనా నష్టం కలిగించే శక్తి సామర్థ్యాలు కేవలం ఆయనకే ఉన్నాయి కాబట్టి. ఒకవేళ అల్లాహ్ సంకల్పించకుంటే ప్రపంచంలోని ఏ వలీ, బుజుర్గ్, పీర్ లేదా సజ్జాదా నషీన్ అయినా ఏ మాత్రం నష్టం కలిగించలేడు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

قُل لَّن يُصِيبَنَآ إِلَّا مَا كَتَبَ ٱللَّهُ لَنَا هُوَ مَوْلَىٰنَا ۚ وَعَلَى ٱللَّهِ فَلْيَتَوَكَّلِ ٱلْمُؤْمِنُونَ

“వారితో ఇలా అను: అల్లాహ్ మాకొరకు వ్రాసి వుంచింది తప్ప మాకు ఏదీ (చెడుగానీ, మంచిగానీ) ఏ మాత్రం కలుగదు. అల్లాహ్ యే మా సంరక్షకుడు. విశ్వసించేవారు ఆయననే నమ్ముకోవాలి.” (తౌబా 9: 51) 

అలాగే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

“యావత్ మానవజాతి ఏకమై నీకేదైనా ప్రయోజనం చేకూర్చాలన్నా ఇదివరకే నీ అదృష్టంలో అల్లాహ్ వ్రాసిపెట్టి వున్నంత వరకే ప్రయోజనం చేకూర్చ గలదు. అలాగే, యావత్తు మానవజాతి ఏకమై నీకేదైనా కీడు కలిగించాలనుకొన్నా – అది కూడా, ఇదివరకే నీ అదృష్టంలో అల్లాహ్ వ్రాసి పెట్టినంతవరకే కీడు తలపెట్టగలదు అని దృఢంగా విశ్వసించు.” (తిర్మిజి : 2516, సహీ ఉల్ జామె : 7957)  

ఈ పోస్ట్ క్రింది ఖుత్బా పుస్తకం నుండి తీసుకోబడింది.

సఫర్ నెల మరియు దుశ్శకునాలు (ఖుత్బా)
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్తయీన్ (మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్నే అర్ధిస్తున్నాము) [వీడియో & టెక్స్ట్]

ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్తయీన్ (మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్నే అర్ధిస్తున్నాము)
https://youtu.be/6PT6tpRuaE4 [9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, సూరహ్ అల్-ఫాతిహాలోని ఒక ముఖ్యమైన వాక్యం, ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్, యొక్క లోతైన అర్థం వివరించబడింది. మొదటగా, వాక్యం యొక్క పదాల వారీగా అర్థం, అంటే ‘నిన్ను మాత్రమే మేము ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్ని మాత్రమే మేము అర్థిస్తున్నాము’ అని వివరించబడింది. తరువాత, ‘మాత్రమే’ అనే పదం యొక్క ప్రాముఖ్యతను ఒక భార్యాభర్తల ఉదాహరణతో స్పష్టం చేశారు, ఇది అల్లాహ్ పట్ల ఆరాధనలో సంపూర్ణ ఏకత్వాన్ని నొక్కి చెబుతుంది. వాక్య నిర్మాణంలో ‘ఇయ్యాక’ (నిన్ను మాత్రమే) పదాన్ని ముందు ఉంచడం ద్వారా, ఆరాధన కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకం అని మరియు ఇతరులను ఆరాధించడం ఘోరమైన పాపం అని చెప్పబడింది. చివరగా, ఆరాధన (ఇబాదత్) మరియు సహాయం కోరడం (ఇస్తి’ఆనత్) వేరువేరుగా ఎందుకు ప్రస్తావించబడ్డాయో వివరిస్తూ, అల్లాహ్ సహాయం లేకుండా మనం ఆయనను సరిగ్గా ఆరాధించలేమని, ఇది వినయాన్ని పెంపొందిస్తుందని తెలియజేశారు.

إِيَّاكَ نَعْبُدُ
(ఇయ్యాక న’అబుదు)
నిన్ను మాత్రమే మేము ఆరాధిస్తున్నాము.

సోదర మహాశయులారా, ఇక్కడ ముందు ఈ పదాల యొక్క అర్థం తెలుసుకుందాము. ఆ తర్వాత సరళమైన ఒక భావం దీనికి మనం తెలుసుకుందాం.

إِيَّاكَ
(ఇయ్యాక)
ఇయ్యాక అంటే ఏంటి? నిన్ను మాత్రమే.

نَعْبُدُ
(న’అబుదు)
మేము ఆరాధిస్తున్నాము.

وَإِيَّاكَ
(వ ఇయ్యాక)
మరియు నిన్ను మాత్రమే.

نَسْتَعِينُ
(నస్త’ఈన్)
మేము అర్ధిస్తున్నాము.

అర్థమైందా? ఇయ్యాక అంటే ఏంటి? నిన్ను మాత్రమే. న’అబుదు అంటే? ఆరాధిస్తున్నాము. వ ఇయ్యాక, ‘వ’ మరియు ఇయ్యాక అదే భావం, నిన్ను మాత్రమే.

نَسْتَعِينُ
(నస్త’ఈన్)
మేము అర్ధిస్తున్నాము. మేము సహాయం కొరకు నిన్ను అర్ధిస్తున్నాము. మేము సహాయం కోరుతున్నాము.

సహాయానికై అర్ధిస్తున్నాము. ‘అవ్న్’ అనే పదం నుండి వచ్చింది నస్త’ఈన్. సహాయం అన్న భావం అక్కడ. ఇస్తి’ఆనా ఉంది గనుక, సీన్ వచ్చింది, అందులో ‘తలబ్‘ అనే భావం అంటే కోరడం. సహాయం కోరుతున్నాము, సహాయం కొరకు అర్ధిస్తున్నాము.

ఇక సరళమైన భావం ఏముంటుంది?

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ
(ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్)
మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు సహాయం కొరకు నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము.

సోదర మహాశయులారా, ఇక్కడ ఒక మాట కేవలం అర్థం అవ్వడానికి చెప్తున్నా. ఒక సామెతగా. మీలో ఎవరైనా తమ భార్యతో, “నేను నీకు మాత్రమే భర్త,” “నేను నీకు కూడా భర్త.” ఈ రెండిటిలో తేడా ఏదైనా అర్థమవుతుందా మీకు? దీన్ని కొంచెం అపోసిట్ గా, మీ యొక్క భార్య మీతో చెప్పింది, “నేను నీకు మాత్రమే భార్యను.” అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒకవేళ మీ భార్య చెప్పింది అనుకోండి, “నేను నీకు కూడా భార్యను.” అప్పుడు? మీ మైండ్ 180, 360 వరకు తిరిగిపోతుంది కదా, వేడి ఎక్కుతుందిగా. ఇక్కడ ‘కూడా’ మరియు ‘మాత్రమే’ అన్నటువంటి పదాలలో భావం తెలుస్తుందా?

నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన రోజువారీ జీవితంలో ఈ విషయాన్ని మనం గ్రహిస్తాము కదా. కానీ అల్లాహ్ యొక్క ఆరాధన విషయంలో. వలిల్లాహిల్ మసలుల్ అ’అలా. నేను మాటిమాటికీ చెబుతున్నాను, కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఉపమానాలు, ఉదాహరణలు, సామెతలు మనం చెప్పుకున్నప్పుడు న’ఊజుబిల్లాహ్, అల్లాహ్ కొరకు కాదు ఈ సామెతలు, మన బుద్ధి జ్ఞానాలలో మాట సరిగా అర్థం అవ్వడానికి, మన అజ్ఞానం దూరం అవ్వడానికి.

ఎవరైనా ఒక భార్య, “నేను నీకు కూడా భార్య” అంటే మనం సహించము. “ఓ అల్లాహ్ నిన్ను కూడా ఆరాధిస్తున్నాము” అని అంటే ఇది బాగుంటుందా? తప్పు విషయం ఇది. “నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాము.”

అందుకొరకే ఇక్కడ, ఇయ్యాక ముందు వచ్చింది, తర్వాత న’అబుదు అని చెప్పారు. తెలుగు సాహిత్య పరంగా మనం చూసుకుంటే సర్వసాధారణంగా ఎలా చెబుతారు? కర్త, కర్మ, క్రియ. రాయడంలో మాట ఈ క్రమంలో వస్తుంది కదా. అరబీలో, అరబీ సాహిత్య పరంగా, న’అబుదుక, ఇలా రావాలి. కానీ ఇక్కడ అల్లాహు త’ఆలా, ఇయ్యాకను ముందు పెట్టాడు అంటే, ఈ ప్రత్యేకతను తెలియజేయడానికి. ఆరాధన అన్నది అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఎవరికీ చెల్లదు. అలా చేసేవారు చాలా ఘోరమైన పాపానికి ఒడిగడుతున్నారు. ఎంతటి ఘోరమైనది? వ్యభిచారం కంటే, మత్తుపానీయాలు సేవించడం కంటే, ఇంకా వేరే ప్రపంచంలో ఉన్న చెడ్డ పనుల కంటే అతి నీచమైన చెడ్డ పని, అల్లాహ్ ను వదలి లేదా అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరినైనా ఆరాధించడం.

అలాంటి ఏ భావాలు ఉండకుండా కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తున్నాము అన్న భావం రావడానికి అల్లాహు త’ఆలా, ఇయ్యాక అన్న పదం ముందు ఇక్కడ పేర్కొన్నాడు. అర్థమైందా దీని యొక్క ప్రాముఖ్యత? తెలుస్తుందా?

ఇక ఆ తర్వాత, ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్ లో ఉన్నటువంటి మరో విషయం గమనించండి. అదేంటి?

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ
(ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్)

న’అబుదు, ఆరాధన. ఆరాధన అంటే, నాలుక సంబంధమైన, హృదయ సంబంధమైన, మన శరీర సంబంధమైన, శరీరావయవాలకు సంబంధమైన, మన ధన సంబంధమైన అన్ని రకాల ఆరాధనలు వచ్చేసాయి. ఆరాధన అంటే, నమాజు వచ్చింది, ప్రేమ వచ్చింది, నమ్మకం వచ్చింది, భయము వచ్చింది, ఆశ వచ్చింది, ఉపవాసము వచ్చింది, ఖుర్బానీ వచ్చింది, దానధర్మాలు వచ్చినాయి, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. అన్నీ కూడా కేవలం అల్లాహ్ కు మాత్రమే అంకితం చేయాలి.

అయితే, కేవలం అల్లాహ్ తో మాత్రమే సహాయం కోరడం, నస్త’ఈన్ అని ఉంది కదా తర్వాత. ఆరాధనల యొక్క ఎన్నో రకాలు ఇప్పుడు నేను తెలిపాను కదా? నమాజ్, భయము, ఉపవాసాలు, ఇంకా ఆశ ఇట్లాంటివి. వాటిలో ఒకటి, సహాయం కోరడం కూడా. సహాయం కోరడం అనేది ఆరాధనలలోని ఒక రకం. ఇక ఆరాధన అంటే అన్ని వచ్చేసాయి, మళ్లీ ప్రత్యేకంగా సహాయం అన్న దాన్ని ఎందుకు అల్లాహ్ ప్రస్తావించాడు? ఇక్కడ ఒక గొప్ప భావం ఉంది. అదేమిటంటే, అల్లాహ్ యొక్క ఆరాధన మనం సరైన రీతిలో చేయాలంటే, అల్లాహ్ యొక్క సహాయం మనకు అందాలి, అప్పుడే మనం సరైన రీతిలో చేయగలుగుతాం.

అందుకొరకే చూడండి, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సలాం తిప్పిన తర్వాత ఏ దువాలైతే మనకు నేర్పారో, అందులో ఒకటేముంది?

అల్లాహుమ్మ అని కూడా ఉంది, రబ్బీ అని కూడా ఉంది.

“اللَّهمَّ أعنِّي على ذِكْرِكَ، وشُكْرِكَ، وحُسنِ عبادتِكَ
(అల్లాహుమ్మ అ’ఇన్నీ ‘అలా జిక్రిక వ షుక్రిక వ హుస్ని ‘ఇబాదతిక)
ఓ అల్లాహ్ నాకు సహాయం అందించు, ‘అలా జిక్రిక, నీ జిక్రు చేయడంలో, స్మరించడంలో, వ షుక్రిక, నీ యొక్క కృతజ్ఞత చెల్లించడంలో, వ హుస్ని ‘ఇబాదతిక, నీ యొక్క ఆరాధన ఉత్తమమైన రీతిలో చేయడంలో నీవు నాకు సహాయం అందించు.

అయితే ఇక్కడ ఏం తెలుస్తుంది? సహాయం కూడా కేవలం అల్లాహ్ తో కోరాలి అని తెలియడంతో పాటు మరొక గొప్ప విషయం ఏం తెలిసింది? అరే, నేను చేశాను అన్నటువంటి గొప్పలు చెప్పుకోవడం కాదు, అల్లాహ్ సహాయపడ్డాడు, అల్లాహ్ భాగ్యం కలుగజేశాడు, అల్లాహ్ మనకు తోడు ఇచ్చాడు, అల్లాహు త’ఆలా యొక్క దయ కలిగినది, అప్పుడే మనం ఏదైనా చేయగలిగాము అన్నటువంటి భావన ఉండాలి. అందుకొరకు ఎల్లవేళల్లో అల్లాహ్ ముందు మనం వినయ వినమ్రతతో ఎంతో మంచి రీతిలో మనం ఆ అల్లాహ్ యొక్క ఆరాధనలో గడుపుతూ ఉండాలి.

తఫ్సీర్ సూరతుల్ ఫాతిహా – ప్రతీ పదానికి అర్థ భావాలు & వివరణ (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0y1S_HJBYajOm3yyF4a16J

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

సర్వ సత్కార్యాలను నశింపజేసే దుష్కార్యం [ఆడియో]

సర్వ సత్కార్యాలను నశింపజేసే దుష్కార్యం [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/LP5FGVGsz_o [7 నిముషాలు]

అల్లాహ్ కి సాటి కల్పించటం (షిర్క్) 

జాతర (ఉర్సు) దగ్గర బలి ఇచ్చే నియ్యత్ తో కొన్న జంతువుని ఇంట్లో జిబహ్ చేస్తే దాని మాంసం తినవచ్చా? [వీడియో]

జాతర (ఉర్సు) దగ్గర బలి ఇచ్చే నియ్యత్ తో కొన్న జంతువుని ఇంట్లో జిబహ్ చేస్తే దాని మాంసం తినవచ్చా?
https://youtu.be/RxmR0Dxpmr0 [4 min]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఉరుసులు, దర్గాల వాస్తవికత
https://teluguislam.net/2019/09/09/reality-of-urusulu-dargalu/

అల్లాహ్ యేతరుల కొరకు జిబహ్ (జంతు బలిదానం) చేయుట షిర్క్ అక్బర్ – ఇమామ్ అస్-సాదీ
https://teluguislam.net/2020/04/18/slaughtering-for-other-than-allah/

సమాధుల, దర్గాల వద్ద జంతుబలి ఇవ్వటం, కానుకలు సమర్పించుకోవటం, శ్రద్ధాంజలి ఘటించటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్
https://teluguislam.net/2020/04/04/grave-worship/

అల్లాహ్ యేతరుల కొరకు జంతు బలి చేయకు [వీడియో]
https://teluguislam.net/2020/09/27/prohibition-in-the-deen-23/

ఖురాన్ లో ఔలియాల ప్రస్తావన వచ్చి ఉంది కదా? మరి ఎందుకు వారితో దుఆ చేయకూడదు, శరణు వేడకూడదు? [వీడియో]
https://teluguislam.net/2021/03/09/allah-praised-awliyaa-in-the-quran/

క్విజ్: 77: ప్రశ్న 02: మొక్కుబడులు, జిబహ్ చేయుట (జంతు బలి) [ఆడియో]
https://teluguislam.net/2020/06/27/quiz-77-2/

దర్గాలు, సమాధులు, ఔలియాల వాస్తవికత యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0IUeQVvT8sjlYDsK6O9rFF

అగోచర జ్ఞానంలో షిర్క్‌ (భాగస్వామ్య) ఖండన | విశ్వాస ప్రదాయిని (తఖ్వియతుల్‌ ఈమాన్‌)

విశ్వాస ప్రదాయిని (తఖ్వియతుల్‌ ఈమాన్‌)
ఉర్దూ మూలం: హదీసు వేత్త షాహ్‌ ఇస్మాయీల్‌ (రహిమహుల్లాహ్)
4 వ అధ్యాయం: అగోచర జ్ఞానంలో షిర్క్‌ (భాగస్వామ్య) ఖండన

అల్లాహ్‌ దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిస్తున్నాడు:

وَعِندَهُۥ مَفَاتِحُ ٱلْغَيْبِ لَا يَعْلَمُهَآ إِلَّا هُوَ ۚ وَيَعْلَمُ مَا فِى ٱلْبَرِّ وَٱلْبَحْرِ ۚ وَمَا تَسْقُطُ مِن وَرَقَةٍ إِلَّا يَعْلَمُهَا وَلَا حَبَّةٍ فِى ظُلُمَـٰتِ ٱلْأَرْضِ وَلَا رَطْبٍ وَلَا يَابِسٍ إِلَّا فِى كِتَـٰبٍ مُّبِينٍ

అగోచరాల తాళం చెవులు అల్లాహ్‌ వద్దనే ఉన్నాయి. అల్లాహ్ కు తప్ప ఇతరులెవరికీ వాటి గురించి తెలియదు. భూమిలోనూ, సముద్రాలలోనూ ఉన్న వస్తువులన్నింటి గురించి ఆయనకు తెలుసు. రాలే ఆకు కూడా ఆయనకు తెలియకుందా ఉండదు. నేలలోని చీకటి పొరలలో పడే ఏ గింజ అయినా – పచ్చిది, ఎండినది ఏది పడినా – స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉంది. (దివ్యఖర్‌ఆన్‌ 6 : 59)

అల్లాహ్‌ మానవునికి బాహ్య వస్తువుల గురించి తెలుసుకోడానికి కొన్ని అవయవాలు ప్రసాదించాడు. ఉదాహరణకు: చూడటానికి కళ్లు, వినడానికి చెవులు, వాసన కోసం ముక్కు, రుచి కోనం నాలుక, వెతకటానికి చేతులు, అర్థం చేనుకోవడానికి బుద్ధిని ప్రసాదించాడు. ఈ అవయవాలన్నిటిపై మానవుడికి అధికారాన్ని ప్రసాదించాడు. తాను తలచుకున్నప్పుడు వాటిని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు: ఏదైనా వస్తువులను చూడకూడదనుకున్నప్పుడు కళ్లు మూనుకుంటాడు. చూడాలనుకున్నవ్పుడు కళ్లు తెరిచిఉంచుతాడు. ప్రతి అవయవాన్ని ఇలాగే ఊహించుకోండి. అదే విధంగా గోచర విషయాలు తెలుసుకోడానికి తాళం చెవులు ఇచ్చాడు. ఉదాహరణకు తాళం తెరవాలో లేదో? తాళం చెవి ఉన్న వాడి అధికారంలోనే ఉంటుంది. ఇలా బాహ్య వస్తువుల గురించి తెలుసుకోవాలో, తెలుసుకోకూడదో? అంతా మానవుడి అదుపులోనే ఉంది.

దీనికి భిన్నంగా అగోచర విషయాలు తెలుసుకోవడం మానవుడి చేతుల్లో లేదు. దాని తాళం చెవులు అల్లాహ్‌ తన వద్ద ఉంచుకున్నాడు. మహా వ్యక్తులకుగానీ, అల్లాహ్‌ సామీప్యం పొందిన దైవదూతలకుగానీ తమకు ఇష్టం వచ్చినప్పుడు అగోచర విషయాలు తెలుసుకోవాలనుకునే, ఇష్టంలేనప్పుడు వదలి పెట్టే అధికారం లేదు. అల్లాహ్‌ తన ఇష్టానుసారం ఎప్పుడైనా ఎవరికైనా అగోచర విషయాలు కావాలనుకున్నంతగా తెలుపుతాడు. అగోచర విషయాలు తెలుపడం అల్లాహ్‌ ఇష్టంపై మాత్రమే ఆధారపడి ఉంది. వేరే వారి ఇష్టంపై ఆధారపడి లేదు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనేకసార్లు ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలనుకునేవారు. కాని ఆ విషయం ఆయన తెలుసుకోలేకపోయేవారు. అల్లాహ్‌ తలచుకున్నప్పుడు వాటిని వెంటనే తెలిపేవాడు. దైవదౌత్య కాలంలో కపటులు మాతృమూర్తి ఆయిషా( రదియల్లాహు అన్హా) పై అపనింద మోపారు. ఆ విషయం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్గం)కు తీవ్రంగా బాధ కలిగించింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ నల్లం) చాలా రోజుల వరకు ఆ విషయాన్ని శోధించారు. కాని ఏ విషయమూ తెలుసుకోలేక పోయారు. తర్వాత అల్లాహ్‌ కోరినప్పుడు వహీ అవతరింప జేసి కపటులు అబద్ధాల కోరులని, ఆయిషా (రదియల్లాహు అన్హా) పరమ పవిత్రురాలని తెలియజేశాడు.

కనుక ప్రతి ముస్లిం అగోచరాల ఖజానాల తాళం చెవులు అల్లాహ్‌ తన వద్దనే ఉంచుకున్నాడని, వాటికి ఎవరినీ కోశాధికారిగా చేయలేదని విశ్వసించాలి. ఆయన స్వయంగా ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. అతని చేయిని అడ్డుకునే సాహసం ఎవరికుంది?

దీని ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే, అగోచరం తెలుస్తుందని, గడిచిన వాటి గురించి, భవిష్యత్తు గురించి తనకు తెలుసునని వాదించేవాడు అబద్ధాలకోరు. అలాంటి వాడు దైవత్వ ప్రకటన చేస్తున్నాడు. ఎవరయినా ప్రవక్తలను, మహాత్ములను, జిన్నులను, దైవదూతలను, ఇమాములను, సజ్జనులను లేదా పీరులను, అమరవీరులను, సిద్ధాంతిని, జ్యోతిష్కుడిని, పండితులను, భూతాలను అలా భావిస్తే ముష్రిక్కులు (బహు దైవారాధకులు) అనబడతారు. వారు పైన పేర్కొన్న ఆయతు (దివ్య ఖుర్‌ఆన్‌ 6 : 59) లను తిరస్కరిస్తున్నారు. అనుకోకుండా ఎవరయినా జ్యోతిష్యుడి మాట నిజమయితే దాని వల్ల అతను అగోచర జ్ఞాని కాలేడు. ఎందుకంటే అతను చెప్పే చాలా విషయాలు అబద్ధాలు కనుక! అగోచర జ్ఞానం తెలుసుకోవడం వారికి సాధ్యమయ్యే విషయం కాదు. వారి అంచనా ఒక్కోసారి నిజం కావచ్చు. మరికొన్ని సార్లు తప్పు కావచ్చు. జ్యోతిష్యం, కనికట్టు, ఖుర్‌ఆన్‌తో శకునాలు చూడటం కూడా అలాంటిదే. వహీ (దైవవాణి) మాత్రం ఎప్పుడూ అబద్ధం కాదు. అది మాత్రం వారి అధీనంలో లేదు. అల్లాహ్‌ తన ఇష్టప్రకారం తాను తలచుకుంది తెలుపుతాడు. వేరే వారి ఇష్టంపై వహీ ఆధారపడి లేదు. అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు:

قُل لَّا يَعْلَمُ مَن فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ٱلْغَيْبَ إِلَّا ٱللَّهُ ۚ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ

“అల్లాహ్‌కు తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర విషయాల జ్ఞానం లేదు. తాము ఎప్పుడు తిరిగి లేపబడతామో కూడా వారికి తెలియదు అని ఓ ప్రవక్తా (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారికి చెప్పు”. (దివ్యఖర్‌ఆన్‌ 27: 65)

అగోచర విషయాలు తెలునుకోవడం ఎవరి తరమూ కాదు. వారు ఎంతటి వారయినా లేదా దైవదూత అయినా సరే. దీనికి స్పష్టమయిన ఆధారం ఏమిటంటే, ప్రళయం వన్తుందని ప్రపంచం మొత్తానికి తెలుసు కాని అది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అన్ని విషయాలు తెలుసుకోవడం వారికి సుసాధ్యమే అయితే ప్రళయం ఏ రోజు వస్తుందో కూడా తెలుసుకునేవారే.

అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు:

إِنَّ ٱللَّهَ عِندَهُۥ عِلْمُ ٱلسَّاعَةِ وَيُنَزِّلُ ٱلْغَيْثَ وَيَعْلَمُ مَا فِى ٱلْأَرْحَامِ ۖ وَمَا تَدْرِى نَفْسٌ مَّاذَا تَكْسِبُ غَدًا ۖ وَمَا تَدْرِى نَفْسٌۢ بِأَىِّ أَرْضٍ تَمُوتُ ۚ إِنَّ ٱللَّهَ عَلِيمٌ خَبِيرٌۢ

నిస్సందేహంగా ప్రళయానికి సంబంధించిన జ్ఞానం అల్లాహ్‌ వద్ద మాత్రమే ఉంది. ఆయనే వర్షాన్ని కురిపిస్తున్నాడు. మాతృ గర్భాలలో ఏముందో ఆయనకు తెలుసు. తాను రేపు ఏం చేయనున్నదో ఏ ప్రాణీ ఎరుగడు. తాను ఏ గడ్డపై మరణిస్తాడో కూడా ఎవరికీ తెలియదు. అల్లాహ్‌యే సర్వజ్ఞాని, అన్నీ తెలిసినవాడు (అని తెలుసుకోండి). (దివ్యఖర్‌ఆన్‌ 31 : 34)

అగోచరాల జ్ఞానం అల్లాహ్‌కు మాత్రమే ఉంది. ఆయన తప్ప అగోచరాల జ్ఞాని ఎవరూ లేరు. ప్రళయం సంభవించడం తథ్యం, మానవులందరికీ ఈ విషయం తెలుసు. కాని అది ఎప్పుడు రాబోతుందో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు వేరే విషయాల గురించి ఏం చెప్పగలరు. ఉదాహరణకు: విజయం, పరాజయం, స్వస్థత, అస్వస్థత ఇలాంటి విషయాల జ్ఞానమూ ఎవరికీ లేదు.ఇవి ప్రళయమంత ముఖ్య మైనవి కాకపోయినా అవి ఎప్పుడు సంభవిస్తాయో ఎవరికీ తెలియదు. అదే విధంగా వర్షం ఎప్పుడు పడుతుందో ఎవరికీ తెలియదు. దానికోసం ప్రత్యేకంగా ఒక కాలం కూడా ఉంది. అయినా వర్షం పడుతుందో లేదో తెలియదు. వేరే కాలాల్లోనూ వర్షం పడుతుంటుంది. చాలా మంది దీనిని కోరుతుంటారు కూడా. ఒకవేళ దాని సమయం ఎలాగైనా తెలుస్తుందనుకుంటే దాని గురించి ఎవరికైనా తప్పనిసరిగా తెలుస్తుంది. ఉదాహరణకు : ఒక వ్యక్తి జననం, మరణం లేదా సంతానం కలగడం కలగకపోవడం లేదా ధనవంతుడవ్వడం పేదవాడవ్వడం లేదా విజయం సాధించడం, పరాజయం పాలవ్వడం ఈ విషయాలు ఎవరికైనా ఎలా తెలుస్తాయి? మాతృ గర్భంలో ఉన్నది కూడా ఎవరికీ తెలియదు.” [ ఆధునిక వైద్యశాస్త్రం పుట్టబోయే నంతానం ఏదో ప్రసవ సమీప కాలంలో మాత్రమే చెప్పగలుగుతుంది.]

గర్భంలో ఉన్నది ఒకరా లేదా ఇద్దరా? అందులో ఉన్నది ఆడా, మగా? సంపూర్ణంగా ఉన్నారా లేదా లోపంతో ఉన్నారా? అందంగా ఉన్నారా అంద విహీనంగా ఉన్నారా? నిపుణులు ఈ విషయాలన్ని అసంపూర్తిగానే తెలుపుతారు. కాని ఎవరికీ పూర్తిగా పరిస్థితులు తెలియవు. అలాంటప్పుడు మానవ అంతర్గత విషయాల గురించి ఎలా తెలుసుకోగలరు? ఉదాహరణకు: వారి భావాలు, సంకల్పాలు, కోరికలు, వారి విశ్వాస కాపట్య స్థితి. తాను రేపు ఏం చేస్తాడో తనకే తెలియనప్పుడు ఇతరుల గురించి ఎలా తెలుసుకోగలడు? మనిషికి అతను ఎవ్పుడు మరణిస్తాడో తెలియనప్పుడు మరణించబోయే రోజు సమయం ఎలా తెలుస్తుంది? ఏది ఏమైనప్పటికీ అల్లాహ్‌ తప్ప మరెవరూ భవిష్యత్తు విషయాలను తమ అధికారంతో తెలుసుకోలేరు. కనుక అగోచర విషయాల జ్ఞానులమని వాదించేవారు అబద్ధాలకోరులు. కనికట్టు, జ్యోతిష్యం, శకునాలు చూడటం, రాశిఫలాలు అన్నీ అబద్దాలే. ఇవన్నీ షైతాన్‌ పన్నాగాలు. ముస్లిములు ఎన్నటికీ వీటిలో చిక్కుకోకూడదు.

ఎవరైనా “నాకు అగోచర విషయాల జ్ఞానం లేదు, వాటిని తెలుసుకోవడమూ నా వల్ల కాదు, అల్లాహ్‌ నాకు తెలుపుతున్న విషయాలు తప్ప వేరే విషయాలు చెప్పడం నా అధికారంలో లేదు” అని ఎవరయినా అంటే ఇందులో రెండు విషయాలకు అవకాశం ఉంది. అతను నిజం చెప్పవచ్చు లేదా అబద్ధమూ చెప్పవచ్చు. ఉదాహరణకు: sixth sense షర్హే సద్ర్‌ (మనో వికాసం), దైవికంగా తోచినమాట.

అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు:

وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُوا۟ مِن دُونِ ٱللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُۥٓ إِلَىٰ يَوْمِ ٱلْقِيَـٰمَةِ وَهُمْ عَن دُعَآئِهِمْ غَـٰفِلُونَ

“అల్లాహ్ ను వదలి ప్రళయదినం వరకూ తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునే వానికన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు?” (దివ్యఖుర్‌ఆన్‌ 46:5).

ముష్రిక్కులు పరమ మూర్ఖులు. అల్లాహ్‌ లాంటి శక్తిమంతుణ్ణి, వివేకవంతుణ్ణి విడిచిపెట్టి ఇతరులను మొరపెట్టుకుంటున్నారు. వారు వీరి మొరలను ఆలకించలేరు. వారికి ఎటువంటి శక్తిసామర్థ్యాలూ లేవు. వీరు ఇలాగే ప్రళయం వరకు మొరపెట్టుకున్నా వారు ఏమీ చేయలేరు. ఎవరయితే మహాత్ములను మొరపెట్టుకుంటూ, మా అవసరాలను తీర్చమని మీరు అల్లాహ్‌తో దుఆ చేయండి?’ అనడం కూడా షిర్క్‌గానే పరిగణించబడుతుంది. మేము అవసరాలను తీర్చమని అల్లాహ్‌నే కదా వేడుకున్నాం? ఈ మహాత్ములు కేవలం వారధులు మాత్రమే. అది షిర్క్‌ ఎలా అవుతుంది? అని వారు భావించవచ్చు.అసలు విషయం ఏమిటంటే; వారు దూరంగా ఉన్న వ్యక్తిని (పుణ్యాత్ముణ్ణి) మొరపెట్టు కున్నారు. కనుక ఇది షిర్క్‌ అవుతుంది. ఎందుకంటే పుణ్యాత్ములు దూరం నుండి దగ్గర నుండి కూడా వింటారని వారిని విశ్వసించారు. కాని అది అల్లాహ్‌ ఔన్నత్యం. అల్లాహ్‌ దివ్యఖుర్‌ఆన్‌ 46 : 5 లో “వీరి మొరలను ఆలకించలేరు. వీరు ఎంత మొర పెట్టుకున్నా, చివరకు ప్రళయం వరకు మొరపెట్టుకున్నా వారు వినలేరు’ అని స్పష్టంగా వివరించాడు.

అల్లాహ్‌ దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిస్తున్నాడు:

قُل لَّآ أَمْلِكُ لِنَفْسِى نَفْعًا وَلَا ضَرًّا إِلَّا مَا شَآءَ ٱللَّهُ ۚ وَلَوْ كُنتُ أَعْلَمُ ٱلْغَيْبَ لَٱسْتَكْثَرْتُ مِنَ ٱلْخَيْرِ وَمَا مَسَّنِىَ ٱلسُّوٓءُ ۚ إِنْ أَنَا۠ إِلَّا نَذِيرٌ وَبَشِيرٌ لِّقَوْمٍ يُؤْمِنُونَ

(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “అల్లాహ్‌ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేధు. నాకే గనక అగోచర విషయాలు తెలిసి ఉంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాణ్ణి, ఏ నష్టమూ నాకు వాటిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించే వారికి హెచ్చరించేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే.” (దివ్యఖుర్‌ఆన్‌ 7: 186)

ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవక్తలకు నాయకులు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా గొప్ప గొప్ప మహిమలు ప్రస్ఫుటమయ్యాయి. ప్రజలు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా ధార్మిక విషయాలు నేర్చుకున్నారు. ప్రజలు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మార్గంలో నడవడం వల్ల ఔన్నత్యం పొందారు. అల్లాహ్‌ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్గం)కు ప్రజల ముందు తన స్థితి ఎలాంటిదో వివరించమని ఆదేశించాడు; “నాకు ఎలాంటి శక్తిలేదు. నేను అగోచర విషయాల జ్ఞానిని కూడా కాను. నేను నా స్వయానికి లాభంగానీ, నష్టంగానీ చేకూర్చు కోలేను. దీంతోనే నా శక్తి ఏపాటిదో మీరు అంచనావేయవచ్చు. అలాంటప్పుడు నేను ఇతరులకు లాభనష్టాలు ఎలా చేకూర్చగలను? ఒకవేళ నేను అగోచరాల జ్ఞానిని అయి ఉంటే పని చేయక ముందే దాని పర్యవసానాన్ని తెలుసుకునేవాడిని. నేను చేయబోయే పని వల్ల నష్టం జరుగుతుందని తెలిస్తే ఆ పనిని ప్రారంభించేవాడినికాను. అగోచర విషయాల జ్ఞానం కలిగి ఉండటం అల్లాహ్‌ గొప్పతనం. నేను కేవలం ప్రవక్తను మాత్రమే. చెడుల పర్యవసానాన్ని హెచ్చరిస్తూ మంచి పనుల శుభవార్తలను అందదేయడమే ప్రవక్తల పని. విశ్వాసం ఉన్న హృదయాలకే ఈ విషయం లబ్ది చేకూర్చగలుగుతుంది. నమ్మకం కలిగించడం అల్లాహ్‌ పని

ప్రవక్తల, పుణ్యాత్ముల గొప్పతనం ఏమిటంటే; వారు అల్లాహ్‌ మార్గాన్ని తెలుపు తారు. తమకు తెలిసిన మంచి, చెడుల గురించి ప్రజలకు తెలియజేస్తారు. వారి సందేశ ప్రచారంలో అల్లాహ్‌ ఆకర్షణను ఉంచాడు. వారి సందేశం వల్ల అనేక మంది రుజుమార్గంలో వచ్చి చేరారు. ఒకవేళ అల్లాహ్‌ వారికి విశ్వంలో అధికారం చేసే శక్తి ఇచ్చినా ఆశ్చర్య పోనక్కరలేదు. అవి మహత్యాలు మాత్రమే. అల్లాహ్‌ ఎవరినైనా హతమార్చడం లేదా సంతానం కలిగించడం, ఆపదల నుండి రక్షించటం, మొరలను ఆలకించడం, జయాపజయాలు కలిగించడం. ధనవంతునిగా చేయడం, నిరుపేదగా మార్చడం లేదా రాజుగా చేయడం, ఎవరినైనా బిచ్చగాణ్జీ చేయడం లేదా అధికారినో, మంత్రినో చేయడం. ఎవరి హృదయంలో నైనా విశ్వాసం కలిగించడం, ఎవరి హృదయం నుండైనా విశ్వాసాన్ని లాక్కోవడం. ఎవరికైనా ఆరోగ్యాన్ని ప్రసాదించడం, మరెవరైనా అస్వస్థతకు గురిచేయడం – ఇదంతా అల్లాహ్‌ గొప్పతనమే. అల్లాహ్‌ తప్ప ఈ పనులు ఎవరూ చేయలేరు. ఇంతకు మించి అందరూ నిస్సహాయులే. నిస్సహాయతలో అందరూ సమానులే. ప్రవక్తలు గాని పుణ్యాత్ములుగాని ఏ విషయాలలోనైనా ఏమైనా చేసినా అవి కేవలం అల్లాహ్‌ సహాయంతో మాత్రమే చేయగలరు.

అదే విధంగా అల్లాహ్‌ తలచుకుంటే అగోచరాల జ్ఞానం వారికి ఇవ్వవచ్చు. తద్వారా ఎవరి హృదయంలో ఏముందో తెలునుకోవచ్చు. ఏ అగోచర విషయా న్నైనా తెలునుకోవచ్చు. అయితే ఫలానా వారికి సంతానం కలుగుతుందా? లేదా? వ్యాపారంలో లాభం కలుగుతుందా లేదా? పోరాటంలో విజయం పాందుతారా? పరాజయం పాలవుతారా? ఇలాంటి విషయాలు ఎవరికీ తెలియవు. అప్పుడప్పుడు ఏదైనా విషయం అంచనా వేసుకుని లేదా రుజువులను బట్టి చెబితే అది చెప్పినట్టుగానే జరగనూ వచ్చు. అదే విధంగా అప్పుడప్పుడు పెద్దలు చెప్పేమాటలు కూడా నిజమవుతాయి. ఒక్కోసారి అబద్ధాలూ కావచ్చు. కాని వహీ లేదా దైవిక జ్ఞానోదయం అబద్ధంకాదు. ఇంకా వహీ ప్రవక్తల అధీనంలో ఉండదు.

రబీఅ బిన్తె ముఅవ్విజ్‌ బిన్‌ అఫ్రా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం: (పెళ్ళికూతురిగా) నాకు వీడ్కోలు పలికే సమయంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నా వద్దకు వచ్చారు. నా మంచంపై నాకు చాలా దగ్గరగా మీరు కూర్చున్నంత దగ్గరగా కూర్చున్నారు. మా (కుటుంబీకుల) పిల్లలు కొందరు దఫ్‌ (డప్పు) వాయిస్తూ బద్ర్‌ మృతుల సంఘటనను ఆలపించ సాగారు. అందులో ఒకరు “మా ప్రవక్తకు రేపు జరిగే విషయాలు కూడా తెలుసు” అన్నారు. అందుకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి న నల్లం) వారిని వారిస్తూ ‘ఆ విషయాన్ని విడిచి మిగతాది ఆలపించండి’ అని హిత బోధచేశారు. ( హదీసు గ్రంథం బుఖారీ: 5147)

రబీఅ అన్సారియ్య వివాహ సందర్భంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెకు దగ్గరగా కూర్చున్నారు. బాలికలు గీతం ఆలపిస్తూ “మా ప్రవక్తకు రేపటి విషయాలు కూడా తెలుసు” అని పాడారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారిని అ మాట అనకండని వారించారు.

మనిషి ఎంత పెద్ద వాడయినా అతని విషయంలో అతను అగోచరజ్ఞాని అని విశ్వసించకూడదు. కవులు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ నల్లం)ను పొగుడుతూ భూమ్యాకాశాల ఎత్తుకు ఎత్తడం, అతిశయం కోసం అన్నామని అనడం సమంజసం కాదు. ఇలా చేయడం తప్పు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనను పొగుడుతూ ఇలాంటి కవితలు పాడుతున్న బాలికలనే వారించారు. అలాంటప్పుడు అన్నీ తెలిసిన కవులకు, పెద్దలకు ఇలాంటి కవితలు పాడమని ఎలా అనుమతించగలరు.

అయేషా (రదియల్లాహు అన్హా) ఇలా అన్నారు: “ఆ ఘడియకు సంబంధించిన జ్ఞానం” అల్లాహ్‌ వద్ద మాత్రమే ఉన్నది. (దివ్యఖుర్‌ఆన్‌ 31: 34) అనే ఆయత్‌లో తెలిపిన ఐదు విషయాల సమాచారం ప్రవక్త (నల్లల్లాహు అలైహి వ సల్లం)కు తెలుసని ఎవరైతే చెప్పాడో అతను ప్రవక్తపై ఘోరమైన అపనిందమోపాడు. (హదీసు గ్రంథం : బుఖారి : 3287)

అంటే ఆ అయిదు విషయాలు దివ్యఖుర్‌ఆన్‌ (31: 34)లో ఉన్నాయి. దాని గురించి వివరించడం జరిగింది. అగోచర విషయాలు ఆ అయిదు విషయాల్లోనే ఉన్నాయి. కనుక ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అగోచర విషయాల జ్ఞానం ఉందని తెలిపేవాడు ఆయనపై తీవ్రమైన నిందమోపాడు.

ఉమ్మె అలా అన్సారీ (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: “అల్లాహ్‌ సాక్షి! నేను దైవ ప్రవక్త అయినప్పటికీ నా విషయంలో ఏం జరుగుతుందో, మీ విషయంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు”. ( హదీసు గ్రంథం: బుఖారీ : 7018)

అంటే అల్లాహ్‌ తన దాసుల విషయంలో ఈ ప్రపంచంలో గానీ, పరలోకం లోగానీ, సమాధిలోగానీ ఎలా వ్యవహరిస్తాడన్నది ఎవరికీ తెలియదు. ప్రవక్తలకు, పుణ్యాత్ములకు కూడా తెలియదు. తమ పరిస్థితి ఏమవుతుందో తెలియదు. ఇతరుల పరిస్థితి కూడా వారికి తెలియదు. ఒకవేళ ఎవరికైనా ఎప్పుడైనా ఫలానా వ్యక్తి విషయంలో మేలు జరుగుతుందని దైవికంగా తోచిన మాట ద్వారా తెలిస్తే అది ఒక సంక్షిప్త సమాచారం. అంతకు మించి అతను ఎక్కువగా తెలునుకోలేడు.

సారాంశం:

1-2. గోచరాలను తెలుసుకోవడానికి అల్లాహ్‌ మానవుడికి కొన్ని వనరులు ఇచ్చి వాటిని వినియోగించే శక్తిని ప్రసాదించాడు. కాని అగోచరాల తాళం చెవులు మాత్రం అల్లాహ్‌ వద్ద వున్నాయి. అతను తన ఇచ్చ ప్రకారం అందులో నుండి ఎప్పుడైనా ఎవరికైనా కొంచెం తెలుపుతాడు. అత్యవసర సమయాల్లో ప్రవక్తలకు కూడా తెలుపుతాడు.

3. అగోచరజ్ఞానవాది మరియు అతన్ని ధ్రువీకరించేవాడు ఇద్దరూ బహుదైవాదరాధకులే. ఎందుకంటే అగోచరాలు కేవలం అల్లాహ్‌ చేతిలోనే వున్నాయి. ఎప్పుడైనా ఏదైనా విషయం నిర్దారితమైతే అది కేవలం యాదృచ్చికమే.

4-5 అగోచరాల చిన్నా-పెద్ద విషయాలు అల్లాహ్‌ పరిధిలోనే వున్నాయి. మానవుడు ఎప్పుడైన్నా ఎటువంటి వరుసలతోనైనా వాటి వరకు చేరలేడు. జ్యోతిష్యం, తాంత్రిక విద్య, శకునాలు మొదలగునవి షైతాన్‌ కుట్రలు.

6. అంతర్గత -బహిర్గత, దూర-సమీప ప్రార్థనలను ఆయనే వింటాడు. సహాయం చేస్తాడు. వేరేతరులను ఈ విధంగా అర్థించడం బహుదైవారాధన. వారు ప్రళయం వరకు కూడా వినలేరు.

7. అగోచరాల జ్ఞాన గుణం అల్లాహ్‌ సొంత గుణం. ప్రవక్తలు మరియు అంతిమ ప్రవక్త అగోచరాల జ్ఞానులు కారు. లేకపోతే వారు తమను, తమ అనుచరులను కష్టాల నుంచి రక్షించేవారు: దైవప్రవ క్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కేవలం శుభ వార్తాహరులు మరియు హెచ్చరించేవారు మాత్రమే.

8. ప్రవక్తల అసలు పని శుభవార్తలందించడం, హెచ్చరించడం మాత్రమే. వారు కూడా దాసులు మాదిరిగా అల్లాహ్‌ ముందు నిస్సహాయులు, అశక్తులు, విశ్వంలో అధికారం చేయడం కేవలం అల్లాహ్‌ సొంత గుణం,

9. ప్రవక్తలు అగోచర జ్ఞానులు కారు. వారు బుద్ధి మరియు అంచనాల ఆధారంగా ఏ విషయాన్నీ చెప్పరు. అల్లాహ్‌ వారికి వహీ (దైవవాణి) ద్వారా పంపిన సరైన విషయాలనే తెలుపుతారు.

10. కవితల్లో అతిశయానికి పాల్పడుతూ దైవప్రవక్తను అగోచరాల జ్ఞాని అనడాన్ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తీవ్రంగా వారించారు.

11. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను అగోచరాల జ్ఞాని అని భావించినవాడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)పై అపనింద మోపాడు. అల్లాహ్ తప్ప మరెవ్వరూ అగోచరాలను గురించి తెలిసినవారు లేరు.

12. ప్రవక్తలకు, పుణ్యాత్ములకు తమకు, తమ అనుచరులకు సంబంధించిన ఇహపరాల, అగోచరాల విషయాలు తెలియవు.

ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

  1. జ్ఞానంలోని షిర్క్ (షిర్క్ ఫిల్ ఇల్మ్) వాస్తవికతను వివరించండి?
  2. “అగోచర జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది” ఈ వాక్య భావాన్ని వివరించండి?
  3. అగోచరజ్ఞానం గురించి కొన్ని ఆయతులు, హదీసులను వివరించండి?
  4. లాభనష్టాలను కలిగించే అధికారి ఎవరు? ఆధారాలతో వివరించండి?
  5. ప్రవక్తలకు అగోచరజ్ఞానం ఉందా? వివరించండి?

తప్పొప్పులను గుర్తించండి

  1. వలీలకు దగ్గర నుండి దూరం నుండి మొరపెట్టుకోవడం, ఈ వలీలు తమ మొరలను వింటారని భావించడం, షిర్క్ అవుతుంది.
  2. ప్రవక్తలు స్వయంగా అగోచర జ్ఞానాన్ని కలిగి ఉంటారు
  3. అల్లాహ్ తోపాటు ఇతర దైవాలకు కూడా లాభనష్టాలను కలిగించే శక్తి గలదు

ఖాళీలను పూరించండి

  1. అల్లాహ్ తప్ప మరెవరూ ………. కాదు.
  2. లాభనష్టాలకు యజమాని ………. కారు.
  3. ప్రవక్తలకు అగోచర జ్ఞానం ………………………..

ఈ పోస్ట్ క్రింది పుస్తకం , 4 వ అధ్యాయం నుండి తీసుకోబడింది:
విశ్వాస ప్రదాయిని(తఖ్వియతుల్‌ ఈమాన్‌)
ఉర్దూ మూలం: హదీసు వేత్త షాహ్‌ ఇస్మాయీల్‌ (రహిమహుల్లాహ్)
ప్రకాశకులు: గ్రామీణ ముస్లిం స్వయం శిక్షణాభివృద్ధి గ్రంధాలయం, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆం.ప్ర

అత్యంత పెద్ద నేరం, పాపం? – సలీం జామి’ఈ [ఆడియో & టెక్స్ట్]

అత్యంత పెద్ద నేరం, పాపం?
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/0m0vDeE36Cw [21 నిముషాలు]

ఈ ప్రసంగంలో షిర్క్ (బహుదైవారాధన) ఇస్లాంలో అత్యంత ఘోరమైన పాపం మరియు నేరం అనే అంశంపై దృష్టి సారించారు. సాధారణంగా ప్రజలు హత్య లేదా అత్యాచారం వంటి నేరాలను అతిపెద్దవిగా భావిస్తారని, కానీ ఖురాన్ మరియు హదీసుల ప్రకారం, అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించడమే (షిర్క్) అన్నింటికన్నా పెద్ద పాపమని వక్త వివరిస్తారు. షిర్క్ యొక్క తీవ్రమైన పరిణామాలను, అంటే చేసిన మంచి పనులన్నీ వృధా కావడం, స్వర్గం నిషేధించబడటం మరియు నరకంలో శాశ్వత శిక్ష వంటి వాటిని ఖురాన్ ఆయతుల ద్వారా ఉటంకిస్తారు. ఇంకా, షిర్క్ రెండు రకాలుగా ఉంటుందని వివరిస్తారు: షిర్క్-ఎ-అక్బర్ (పెద్ద షిర్క్), ఇది ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది, మరియు షిర్క్-ఎ-అస్గర్ (చిన్న షిర్క్). చిన్న షిర్క్‌లో అల్లాహ్ తప్ప ఇతరుల మీద ప్రమాణం చేయడం, తాయెత్తులు కట్టడం, మరియు రియా (ప్రదర్శన కోసం ఆరాధనలు చేయడం) వంటివి ఉంటాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా తెలియజేస్తారు. ప్రతి ముస్లిం ఈ ఘోరమైన పాపం నుండి దూరంగా ఉండాలని, తన ఆరాధనలను కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేయాలని వక్త ప్రబోధిస్తారు.

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي
[రబ్బిష్రహ్ లీ సద్రీ, వ యస్సిర్ లీ అమ్ రీ, వహ్ లుల్ ఉఖ్ దతమ్ మిల్ లిసానీ, యఫ్ ఖహూ ఖౌలీ]
(ఓ నా ప్రభూ! నా హృదయాన్ని నా కొరకు విశాలపరచు. నా కార్యాన్ని నాకు సులభతరం చెయ్యి. నా నాలుకలోని ముడిని విప్పు. ప్రజలు నా మాటను సులభంగా అర్థం చేసుకునేటట్లు చెయ్యి.) (20:25-28)

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి నా జుమా ప్రసంగ అంశం, షిర్క్ ఒక పెద్ద నేరం.

అభిమాన సోదరులారా, సాధారణంగా నేరాలన్నింటిలో పెద్ద నేరం ఏమిటి? పాపాలన్నింటిలో పెద్ద పాపం ఏమిటి? అని ప్రశ్నించినప్పుడు, ధర్మజ్ఞానము లేని వారు లేదా అంతంత మాత్రమే ధర్మజ్ఞానం ఉన్నవారు నేరాలన్నింటిలో పెద్ద నేరం అంటే, ప్రజల ప్రాణాలు హరించటం పెద్ద నేరం అని సమాధానం ఇస్తారు. మరి కొంతమంది అయితే అమ్మాయిలపై బలాత్కారాలు చేయటం, అత్యాచారాలు చేయటం పెద్ద నేరం అండి అని కొంతమంది సమాధానం ఇస్తారు. అలాగే మరికొంతమంది ప్రజల సొమ్ము దోచేయటం, లూటీలు చేయటం పెద్ద నేరం అండి అని ఈ విధంగా రకరకాల సమాధానాలు ఇస్తూ ఉంటారు.

నిజం ఏమిటంటే, ఇవన్నీ పెద్ద నేరాలే. కానీ వీటన్నింటికంటే కూడా ఒక పెద్ద నేరం ఉంది. అది బలాత్కారాలు చేయడం కంటే కూడా పెద్ద నేరము, లూటీలు దోపిడీలు చేయటం కంటే కూడా పెద్ద నేరము, ప్రజల ప్రాణాలు హరించటము కంటే కూడా పెద్ద నేరము. ఆ నేరం గురించి మాత్రము ఎక్కువ మందికి తెలియదు, చాలా తక్కువ మంది మాత్రమే ఆ దాని గురించి తెలుసుకొని ఉన్నారు. ఆ అంత పెద్ద నేరం ఏమిటి ఆ పెద్ద నేరం అంటే అభిమాన సోదరులారా, షిర్క్! బహుదైవారాధన. అల్లాహ్‌కు ఇతరులను సాటి కల్పించటం. ఇది పాపాలన్నింటిలో, నేరాలన్నింటిలో పెద్ద నేరము, పెద్ద పాపము.

అరే! అది అంత పెద్ద పాపం అని మీరు ఎలా చెప్పగలరండీ అని మీరు ప్రశ్నిస్తారేమో? ఇది నా మాట కాదు. నేను నా తరఫున ప్రకటిస్తున్న విషయము కాదు. అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షిర్క్ బహుదైవారాధన పెద్ద నేరము అని పాపాలన్నింటిలో నేరాలన్నింటిలో పెద్ద నేరము అని ప్రకటించి ఉన్నారు.

మనం చూసినట్లయితే, సూరా లుఖ్మాన్‌లోని 13వ వాక్యంలో ఈ విధంగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు:

إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ
[ఇన్నష్షిర్క ల జుల్మున్ అజీమ్]
నిస్సందేహంగా అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్‌ చేయటం) ఘోరమైన అన్యాయం (31:13)

అలాగే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఒక వ్యక్తి ఈ విధంగా ప్రశ్నించాడు. యా రసూలల్లాహ్, అయ్యు జంబి అక్బరు ఇందల్లాహ్? అల్లాహ్ దృష్టిలో పెద్ద నేరము ఏమిటి? అల్లాహ్ దృష్టిలో పెద్ద పాపము ఏమిటి? అని ఆ వ్యక్తి ప్రశ్నించగా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తికి ఈ విధంగా సమాధానం ఇచ్చారు, అన్ తజ్ అల లిల్లాహి నిద్దన్ వహువ ఖలఖక. నీకు పుట్టించిన ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో ఇతరులను సాటి కల్పించడం, సహవర్తులుగా నిలబెట్టడం, ఇది నేరాలన్నింటిలో, పాపాలన్నింటిలో పెద్ద నేరము, పెద్ద పాపము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తికి సమాధానం ఇచ్చారు.

అలాగే మరొక సందర్భంలో శిష్యుల వద్ద ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రశ్నించారు. ఏమన్నారంటే, అలా ఉనబ్బిఉకుం బి అక్బరిల్ కబాయిర్? ఏమండీ నేను మీకు పాపాలలోనే పెద్ద పాపము, ఘోరాలలోనే పెద్ద ఘోరము, నేరాలలోనే పెద్ద నేరము దాని గురించి మీకు తెలుపనా అని తెలియజేశారు. శిష్యులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, బలా యా రసూలల్లాహ్. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తప్పనిసరిగా దాని గురించి మాకు మీరు తెలియజేయండి అనగా, అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదటిగా ప్రస్తావించిన విషయం ఏమిటంటే, అల్ ఇష్రాకు బిల్లాహ్. అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించటం, అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టటం, ఇది పెద్ద పాపాలలోనే పెద్ద పాపము, పెద్ద నేరము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంలో ప్రకటించారు.

అలాగే మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజానికి ఏడు ప్రాణాంతకమైన విషయాల గురించి హెచ్చరించి ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, ఇజ్తనిబుస్ సబ్అల్ మూబిఖత్. ఏడు ప్రాణాంతకమైన విషయాల నుండి మీరు దూరంగా ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అన్నారు. ఆ ఏడు విషయాలు ఏమిటంటే అందులోని మొదటి విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అష్షిర్కు బిల్లాహ్. అల్లాహ్‌తో ఇతరులను సహవర్తులుగా నిలబెట్టడం, షిర్క్ చేయటం, ఇది ఏడు ప్రాణాంతకమైన పాపాలలో మొదటి పాపము అన్నారు.

అభిమాన సోదరులారా! అటు అల్లాహ్ వాక్యము ద్వారా, ఇటు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పలుకుల ద్వారా మనకు ఒక విషయం మాత్రము స్పష్టంగా అర్థమైపోయింది, అది ఏమిటంటే షిర్క్ చేయటం, బహుదైవారాధన చేయటం, అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించటం, ఇది ఘోరమైన నేరం, పెద్ద పాపము అని స్పష్టమయ్యింది.

ఇక రండి, ఈ షిర్క్ చేస్తే, ఈ పాపానికి ఎవరైనా ఒడిగడితే అతనికి జరిగే పరిణామం ఏమిటి? అతనికి జరిగే నష్టం ఏమిటి? అది కూడా మనము ఇన్షా అల్లాహ్ ఖురాన్ మరియు హదీసు గ్రంథాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

షిర్క్ చేసే వ్యక్తికి కలిగే ఒక నష్టం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆ వ్యక్తికి స్వర్గం నుండి దూరంగా ఉంచేస్తాడు. ఎవరైతే షిర్క్‌కు పాల్పడతారో వారి కోసము స్వర్గం నిషేధించబడుతుంది. వారి నివాసం నరకమైపోతుంది. మనం చూసినట్లయితే ఖురాన్‌లోని సూరా మాయిదా 72వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

إِنَّهُ مَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ
ఎవడు అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వానికోసం అల్లాహ్‌ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు. (5:72)

అలాగే అభిమాన సోదరులారా, షిర్క్ చేసే వానికి కలిగే మరొక నష్టం ఏమిటంటే, అతని సత్కార్యాలు అన్నీ, అతని కర్మలన్నీ, అతని పుణ్యాలు అన్నీ తుడిచివేయబడతాయి. ఖురాన్‌లోని సూరా జుమర్ 65వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హెచ్చరిస్తూ ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” (39:65)

అల్లాహు అక్బర్. స్వయంగా ప్రవక్తలలో గొప్ప ప్రవక్త, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాకీదు చేస్తున్నాడు, ఒకవేళ నీవు గనుక షిర్క్‌కు పాల్పడినట్లయితే, నీ కర్మలన్నీ వృధా చేయబడతాయి అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయనకే, అంత గొప్ప వ్యక్తికే అంత గొప్ప మహా ప్రవక్తకే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాకీదు చేస్తున్నాడంటే, మీలాంటి, నాలాంటి, మనలాంటి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏమిటి అభిమాన సోదరులారా ఒక్కసారి ఆలోచించండి.

కాబట్టి ఇదే విషయము ఖురాన్‌లోని సూరా అన్ఆమ్ 88వ వాక్యంలో మనం చూచినట్లయితే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అక్కడ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు:

ذَٰلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُم مَّا كَانُوا يَعْمَلُونَ
ఇదీ అల్లాహ్‌ మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు. ఒకవేళ వీరు సైతం, దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి. (6:88)

ఇక్కడ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కొంతమంది ప్రవక్తల ప్రస్తావన చేసి చివరికి ఏమంటున్నారంటే, ఇలాంటి ప్రవక్తలు కూడా ఒకవేళ షిర్క్‌కు పాల్పడినట్లయితే, బహుదైవారాధనకు గురైనట్లయితే, అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించినట్లయితే, వారి సత్కార్యాలన్నీ వృధా అయిపోతాయి అంటున్నాడు. కాబట్టి దీని ద్వారా మనకు ఒక విషయం మాత్రము స్పష్టమవుతుంది, అదేమిటంటే అభిమాన సోదరులారా, ఏ వ్యక్తి అయితే షిర్క్ చేస్తాడో, ఏ వ్యక్తి అయితే అల్లాహ్‌తో ఇతరులను సహవర్తులుగా, సాటిగా నిలబెడతాడో, అతని సత్కార్యాలు అన్నీ అతని కర్మలన్నీ వృధా చేయబడతాయి.

అలాగే అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా మనకు తెలియజేసి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆ విషయం మనము జీవితంలో ప్రతివేళ గుర్తు చేసుకుంటూ ఉండాలి. అదేమిటంటే సూరా నిసాలోని 48వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేసి ఉన్నాడు:

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ
తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్‌ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. (4:48)

అంటే తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని షిర్క్‌ను అల్లాహ్ సుతరాము క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అంటే షిర్క్ తప్ప ఇతర పాపాలు మనిషి చేసి ఉంటే అల్లాహ్ తలిస్తే వాటిని క్షమించగలడేమో గానీ, షిర్క్‌ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా క్షమించడు అని ఈ వాక్యంలో స్పష్టంగా మనకు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి, అభిమాన సోదరులారా, షిర్క్ పెద్ద నేరము అని, షిర్క్ క్షమించరాని నేరము అని, షిర్క్ వల్ల మనిషి స్వర్గానికి దూరమైపోతాడు, నరకానికి చేరుకుంటాడని, అతని కర్మలన్నీ వృధా చేయబడతాయని ఇంతవరకు విన్న విషయాలలో మనము అర్థం చేసుకున్నాము.

ఇక రండి, షిర్క్ గురించి మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఉంది అదేమిటంటే, షిర్క్ రెండు రకాలు అభిమాన సోదరులారా. ఒకటి షిర్కె అక్బర్, రెండవది షిర్కె అస్గర్. షిర్కె అక్బర్ అంటే ఇప్పటివరకు మనం విన్నాము కదా, అల్లాహ్ దగ్గర చేయవలసిన కార్యాలు అల్లాహ్ వద్ద కాకుండా ఇతరుల వద్ద చేస్తే, అల్లాహ్‌కు ఇతరులను సాటి కల్పిస్తే అది షిర్కె అక్బర్ అవుతుంది. మరి షిర్కె అస్గర్ అంటే ఏమిటి? అభిమాన సోదరులారా, ఆ విషయము కూడా మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా స్పష్టంగా తెలియజేసి ఉన్నారు.

షిర్కె అస్గర్ రెండు రకాలు. చిన్న షిర్క్ రెండు రకాలు. ఒకటి బహిర్గతంగా కనిపించే షిర్క్, రెండవది కనిపించకుండా రహస్యంగా ఉండే షిర్క్.

బహిర్గతంగా కనిపించే చిన్న షిర్క్ ఏమిటి అంటే అభిమాన సోదరులారా, ఒకటి అల్లాహ్‌ను కాకుండా ఇతరుల మీద ప్రమాణం చేయటం. అల్లాహ్‌ను వదిలేసి ఇతరుల మీద ప్రమాణం చేయటం. మనం చూస్తూ ఉంటాం, ఏదైనా సందర్భంలో ఏదైనా ఒక మాట స్పష్టంగా ప్రజలకు నమ్మ జెప్పాలంటే చాలామంది ఏమంటుంటారంటే, నా తల్లి మీద నేను ప్రమాణం చేస్తున్నాను, నా తల్లి సాక్షిగా, నా బిడ్డల మీద నేను ప్రమాణం చేస్తున్నాను, నా బిడ్డల సాక్షిగా, నేను నడుపుతున్న బండి మీద నేను ప్రమాణం చేస్తున్నాను, ఈ బండి సాక్షిగా అని రకరకాల విషయాల మీద వాళ్లు ప్రమాణం చేస్తూ ఉంటారు. అయితే అభిమాన సోదరులారా, ఇలా చేయటం ధర్మ సమ్మతము కాదు. ఒకవేళ మనిషికి ప్రమాణం చేయటం తప్పనిసరి అయితే అతను కేవలం అల్లాహ్ పేరు మీద మాత్రమే ప్రమాణం చేయాలే గానీ ఇతరుల పేరు మీద ప్రమాణం చేయకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్ పేరు మీద కాకుండా ఇతరుల పేరు మీద ప్రమాణం చేస్తే ఆ వ్యక్తి కూడా షిర్క్ చేసినట్లు అవుతుంది, చిన్న షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పలుకులు వినండి, ఆయన తెలియజేశారు: మన్ హలఫ బిగైరిల్లాహి ఫఖద్ కఫర ఔ అష్రక. ఎవరైతే అల్లాహ్ కాకుండా ఇతరుల మీద ప్రమాణం చేస్తాడో అతను కుఫ్రుకు పాల్పడినట్లు లేదా షిర్క్‌కు పాల్పడినట్లు.

అలాగే అభిమాన సోదరులారా, చిన్న షిర్క్ యొక్క కనిపించే రెండో విషయం ఏమిటంటే, తాయెత్తులు వేలాడదీయటం. చాలామంది చేతుల్లో, మెడలలో, నడుము మీద, కాళ్ళ మీద తాయెత్తులు కట్టుకొని ఉంటారు. అభిమాన సోదరులారా, తాయెత్తులు కట్టటము కూడా ధర్మ సమ్మతము కాదు, నిషేధమైన కార్యము. ఎవరైనా వ్యక్తి తాయెత్తులు కట్టినట్లయితే అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది, అతను కూడా చిన్న షిర్క్ చేసినట్లు అవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అల్లఖ తమీమతన్ ఫఖద్ అష్రక. ఎవరైతే తాయెత్తులు కట్టాడో అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లే.

ఇది చిన్న షిర్క్‌లో బహిర్గతంగా కనిపించే షిర్క్.

ఇక రండి అభిమాన సోదరులారా, చిన్న షిర్క్‌లో కనిపించకుండా రహస్యంగా ఉండే ఒక షిర్క్ ఉంది, అదేమిటంటే రియా అని తెలుగులో అంటారు, ప్రదర్శనా బుద్ధితో చేసే సత్కార్యాలు అని తెలుగులో అంటారు. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను ఎక్కువగా ఈ షిర్కె అస్గర్ గురించి భయపడుతూ ఉన్నాను అన్నారు. శిష్యులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నించారు, ఓ దైవ ప్రవక్త, ఈ చిన్న షిర్క్ అంటే ఏమిటండీ, దీని గురించి మీరు కంగారు పడుతున్నారు అని ప్రశ్నించగా అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆయన పలుకులు వినండి, అఖ్వఫు మా అఖాఫు అలైకుం అష్షిర్కుల్ అస్గర్. ఖాలూ యా రసూలల్లాహ్ వమష్షిర్కుల్ అస్గర్? ఖాల అర్రియా. అంటే మీ విషయంలో నాకు అన్నిటికన్నా అధికంగా షిర్కె అస్గర్ చిన్న షిర్క్ గురించి భయమేస్తుంది. దైవ ప్రవక్త ఆ షిర్కె అస్గర్ అంటే ఏమిటి అని శిష్యులు అడిగినప్పుడు ఆయన అన్నారు, ప్రదర్శనా బుద్ధితో పని చేయటం.

అభిమాన సోదరులారా, ఒక వ్యక్తి నమాజు చేస్తున్నాడు, ఉపవాసాలు పాటిస్తున్నాడు, దానధర్మాలు చేస్తున్నాడు, జకాతు చెల్లిస్తున్నాడు, ఉమ్రా హజ్జులు ఆచరిస్తున్నాడు, అయితే అతను అల్లాహ్ ప్రసన్నత కోసం ఈ విషయాలన్నీ చేయట్లేదు గానీ ప్రజల దృష్టిలో నేను ఉత్తముడ్ని, భక్తుడ్ని అని నాకు పేరు ప్రతిష్టలు రావాలి అనే బుద్ధితో ఆ సంకల్పంతో అతను ఈ విషయాలు చేస్తే దీనినే రియా అంటారు, ప్రదర్శనా బుద్ధితో చేసిన సత్కార్యాలు అంటారు. ఇలా చేస్తే అభిమాన సోదరులారా, షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది. ఎందుకంటే సత్కార్యాలు, ఆరాధనలు కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు మాత్రమే చేయాలి గానీ ప్రదర్శనా బుద్ధితో చేయరాదు. ఎవరైనా ప్రదర్శనా బుద్ధితో చేస్తున్నట్టే అతను అల్లాహ్ ప్రసన్నత కోరుకోవట్లేదు గానీ ప్రజల ప్రసన్నత కోరుకుంటున్నాడు కాబట్టి అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది అభిమాన సోదరులారా.

అయితే మన బాధ్యత ఏమిటి? ఇప్పటివరకు మనం షిర్క్ గొప్ప షిర్క్ పెద్ద నేరమని తెలుసుకున్నాము. షిర్క్ రెండు రకాలు, షిర్క్ పెద్దది ఒకటి, చిన్నది ఒకటి అని తెలుసుకున్నాము. అలాగే పెద్ద షిర్క్‌కి, చిన్న షిర్క్‌కి ఉన్న తేడా ఏమిటో కూడా తెలుసుకోవాలి. అదేమిటంటే అభిమాన సోదరులారా, పెద్ద షిర్క్ చేసిన వారికి నరకశిక్ష విధించబడుతుంది, వారు స్వర్గం నుంచి దూరమైపోతారు, వారి సత్కార్యాలన్నీ వృధా చేయబడతాయి. అయితే చిన్న షిర్క్‌కు పాల్పడిన వారి సత్కార్యాలు మాత్రం వృధా చేయబడవు, వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాత్కాలిక శిక్షలు వేసి మళ్లీ శిక్షలు ముగిసిన తర్వాత స్వర్గానికి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ప్రదర్శనా బుద్ధితో ఏ ఏ సత్కార్యాలు ఆరాధనలు వారు చేసి ఉంటారో కేవలం ఆ సత్కార్యాలు, ఆ ఆరాధనలు మాత్రమే వృధా చేయబడతాయి.

కాబట్టి అభిమాన సోదరులారా, ఒక భక్తునిగా మనందరి బాధ్యత ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము షిర్క్‌కి పాల్పడకూడదు. అందుకోసమే మనం చూచినట్లయితే గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే గతించారో, వారు మరణించే ముందు వారి సంతానాన్ని పిలిచి షిర్క్‌కు పాల్పడవద్దు అని తాకీదు చేసి మరీ మరణించారు.

ఖురాన్‌లో లుక్మాన్ అలైహిస్సలాం వారి గురించి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రస్తావించి ఉన్నాడు. సూరా లుక్మాన్‌లో లుక్మాన్ అలైహిస్సలాం ఆయన కుమారుని పిలిచి ఏమంటున్నారంటే, “ఓ కుమారా, నీవు షిర్క్‌కు పాల్పడవద్దు. ఎందుకంటే షిర్క్ పెద్ద నేరము, ఘోరమైన పాపము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీవు షిర్క్‌కు పాల్పడవద్దు” అని తెలియజేశారు.

అదేవిధంగా ప్రవక్తలు, ఇతర గొప్ప గొప్ప భక్తులు వారి సంతానానికి, అనుచర సమాజానికి తెలియజేసిన విషయం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు అల్లాహ్‌ను వదిలి ఇతరులను ఆరాధించకండి, అల్లాహ్‌కు ఇతరులను సహవర్తులుగా సాటిగా కల్పించకండి, మీకు నిలువునా చీల్చేసేసినా సరే, మీకు సజీవంగా దహనం చేసేసినా సరే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బహుదైవారాధన, షిర్క్ చేయవద్దు, చేయవద్దు, చేయవద్దు అని తెలియజేసి ఉన్నారు.

కాబట్టి అభిమాన సోదరులారా, మనందరి బాధ్యత ఏమిటంటే మనం కేవలం అల్లాహ్‌నే ఆరాధించాలి, అల్లాహ్ మీదే నమ్మకం ఉంచాలి, ఆయన ప్రసన్నత కోసం మాత్రమే సత్కార్యాలు చేయాలి. అల్లాహ్‌తో నేను దుఆ చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ షిర్క్ నుండి కాపాడి, అల్లాహ్ ప్రసన్నత కోసం అల్లాహ్ ఆరాధనలు చేయడానికి మల్లా మనందరికీ భాగ్యము కల్పించు గాక.

అఖూలు ఖౌలి హాజా అస్తగ్ ఫిరుల్లాహ్ లీ వలకుం వలి సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17133

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

ఖురాన్ లో ఔలియాల ప్రస్తావన వచ్చి ఉంది కదా? మరి ఎందుకు వారితో దుఆ చేయకూడదు, శరణు వేడకూడదు?[ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ఖురాన్ లో ఔలియాల ప్రస్తావన వచ్చి ఉంది కదా? మరి ఎందుకు వారితో దుఆ చేయకూడదు, శరణు వేడకూడదు?
https://youtu.be/OFeb-uCup0Q [9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చివరి ప్రవక్త అని, ఆయన తర్వాత ప్రవక్తలు రారని స్పష్టం చేయబడింది. అయితే, అల్లాహ్ యొక్క ‘ఔలియాలు’ (స్నేహితులు) వస్తూనే ఉంటారని ఖురాన్ లో ఉందని, కానీ వారిని ఆరాధించడం, వేడుకోవడం లేదా వారి సమాధుల వద్ద మొక్కుబళ్ళు చెల్లించడం ఘోరమైన షిర్క్ అని వివరించబడింది. అల్లాహ్ ను వదిలి ఇతరులను ఔలియాలుగా చేసుకోవద్దని, కేవలం అల్లాహ్ గ్రంథమైన ఖురాన్ ను మాత్రమే అనుసరించాలని సూరతుల్ ఆరాఫ్, సూరతుర్ రఅద్ వంటి ఆయత్ ల ఆధారంగా నొక్కి చెప్పబడింది.

సమాధానం: వ అలైకుం అస్సలాం వ రహమతుల్లాహి వ బరకాతుహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ ప్రవక్తలకు అంతిమ, చిట్టచివరి ప్రవక్త అని చాలా స్పష్టంగా ఉంది. మరియు ఇక మీరు అడిగిన ప్రశ్న, అల్లాహ్ యొక్క ఔలియాల గురించి ఖురాన్ లో లేదా?

అల్లాహ్ యొక్క ఔలియాల ప్రస్తావన ఖురాన్ లో అనేక సందర్భాలలో ఉంది. కానీ, అల్లాహ్ ను వదిలి ఆ ఔలియాలను మనం వేడుకోవడం లేదా అల్లాహ్ తో పాటు ఆ ఔలియాలతో దువాలు చేయడం, దీని ప్రస్తావన లేదు. ఏముంది ఖురాన్ లో? ఉదాహరణకు మీరు సూరతు యూనుస్ చూశారంటే,

أَلَا إِنَّ أَوْلِيَاءَ اللَّهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
(అలా ఇన్న అవ్లియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలా హుమ్ యహ్జనూన్)
వినండి! నిశ్చయంగా అల్లాహ్ మిత్రులకు ఎలాంటి భయమూ ఉండదు, వారు దుఃఖించరు కూడా.

الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ
(అల్లజీన ఆమనూ వ కానూ యత్తఖూన్)
వారు ఎవరంటే, విశ్వసించి, దైవభీతితో ఉండేవారు.

ఇప్పుడు నేను తిలావత్ చేసిన రెండు ఆయతులు సూరత్ యూనుస్ 62, 63.

వినండి. నిశ్చయంగా అల్లాహ్ యొక్క ఔలియా, (అలా వినండి, ఇన్న నిశ్చయంగా, ఔలియా అల్లాహ్, అల్లాహ్ యొక్క ఔలియా, వలీలు), లా ఖవ్ఫున్ అలైహిమ్, వారికి ఎలాంటి భయము లేదు. వలా హుమ్ యహ్జనూన్, వారు ఎలాంటి చింతించనవసరము లేదు.

అల్లజీన ఆమనూ, ఎవరు ఆ ఔలియాలు? విశ్వసించిన వారు.
వ కానూ యత్తఖూన్, వారు పాపాలకు దూరంగా ఉండేవారు, భయభీతితో, అల్లాహ్ యొక్క భయభీతితో తమ జీవితం గడిపేవారు.

ఇక వారికి ఎలాంటి రందీ లేదు, ఎలాంటి చింత లేదు, బాధ లేదు, వారు భయపడవలసిన అవసరం లేదు అని అల్లాహ్ చెప్పాడు కదా, మరి ఏముంది వారికి? అల్లాహ్ అంటున్నాడు ఆయత్ నెంబర్ 64 లో,

لَهُمُ الْبُشْرَىٰ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ
(లహుముల్ బుష్రా ఫిల్ హయాతిద్ దున్యా వ ఫిల్ ఆఖిరహ్)
ఇహలోక జీవితంలో మరియు పరలోక జీవితంలో వారి కొరకు శుభవార్తలు ఉన్నాయి.

అయితే గమనించారా? ఔలియా అల్లాహ్ ల యొక్క ప్రస్తావన ఖురాన్ లో ఉంది. వారి యొక్క ఘనత అల్లాహ్ త’ఆలా చాలా స్పష్టంగా తెలిపాడు.

కానీ ఈ రోజుల్లో మన ముస్లిం సోదర సోదరీమణులలో ఎంతో మంది అల్లాహ్ తో పాటు ఇతర ఔలియాలను ఏదైతే వేడుకుంటున్నారో, దువా చేస్తున్నారో, వారి యొక్క సమాధుల వద్దకు వెళ్లి అల్లాహ్ కు చేయవలసిన కొన్ని ఆరాధనలు, ఉదాహరణకు మొక్కుబడులు చెల్లించడం గానీ, మరికొన్ని దర్బారుల, దర్గాల వద్ద జంతువులను బలి ఇవ్వడం గానీ, అల్లాహ్ హిదాయత్ ప్రసాదించు గాక కొన్ని దర్బారులు ఉదాహరణకు పాకిస్తాన్ లో ఖలందర్ షా దర్గా అని ఉంది, అక్కడ తవాఫ్ కూడా చేస్తారు. నవూజుబిల్లాహ్ సుమ్మ నవూజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, మనం ఎలాగైతే తవాఫ్ హజ్రే అస్వద్ నుండి మొదలుపెట్టి అక్కడే పూర్తి చేస్తామో, అలా అక్కడ కూడా వారు ఒక స్థలాన్ని నిర్ణయించుకుని అక్కడి నుండి ప్రారంభం చేస్తారు. ఇలాంటి ఘోరమైన షిర్క్ పనులు ఏవైతే జరుగుతున్నాయో, అల్లాహ్ దివ్య గ్రంథం ఖురాన్ లో వీటిని ఖండించాడు.

ఉదాహరణకు మీరు సూరతుల్ ఆరాఫ్, ఆయత్ నెంబర్ మూడు చూశారంటే,

اتَّبِعُوا مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ۗ قَلِيلًا مَّا تَذَكَّرُونَ
(ఇత్తబిఊ మా ఉన్జిల ఇలైకుమ్ మిర్ రబ్బికుమ్ వలా తత్తబిఊ మిన్ దూనిహీ అవ్లియా, ఖలీలమ్ మా తజక్కరూన్)
మీ ప్రభువు వైపు నుండి మీ వైపునకు అవతరింప చేయబడిన దానిని మీరు అనుసరించండి. దానిని వదిలి మీరు ఔలియాల వెంట పడకండి. మీరు చాలా తక్కువ గుణపాఠం నేర్చుకుంటున్నారు.

హితోపదేశం ఈ ఖురాన్, హదీసుల ద్వారా ఏదైతే తీసుకోవాలో, దాని నుండి మీరు చాలా తక్కువ హితోపదేశం పొందుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అల్లాహు అక్బర్. గమనించారా?

అయితే స్వయంగా ఆ ఔలియాలు, ఎవరైతే అల్లాహ్ యొక్క నిజమైన ఔలియాలు ఉన్నారో, వారి యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది. అందులో అనుమానం లేదు. కానీ ఆ ఔలియాలలో ఏ ఒక్క వలీ, ఇక్కడ గుర్తుంచుకోండి నిజమైన వలీ అయితే, ఏ ఒక్క వలీ కూడా మీరు నా సమాధి వద్దకు రండి, నా యొక్క దర్గాల వద్దకు రండి, నన్ను ఆరాధించండి, నాతో దువా చేయండి, నా వద్ద మొక్కుబడులు మీరు చెల్లించండి, ఇలాంటి ఏ ఒక్క మాట చెప్పలేదు.

ఒక్కసారి గనక మీరు సూరతుర్ రఅద్, సూర నెంబర్ 13, ఆయత్ నెంబర్ 16 లో గమనిస్తే,

قُلْ مَن رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ قُلِ اللَّهُ ۚ قُلْ أَفَاتَّخَذْتُم مِّن دُونِهِ أَوْلِيَاءَ لَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ نَفْعًا وَلَا ضَرًّا
(ఖుల్ మర్ రబ్బుస్ సమావాతి వల్ అర్ద్, ఖులిల్లాహ్. ఖుల్ అఫత్తఖజ్తుమ్ మిన్ దూనిహీ అవ్లియాల లా యమ్లికూన లి అన్ఫుసిహిమ్ నఫ్ అన్ వలా దర్ర)
వారితో ప్రశ్నించండి, భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు? వారితో చెప్పండి, అల్లాహ్ మాత్రమే. ఇప్పుడు వారికి ఈ ఆదేశం ఇవ్వండి, ఈ హెచ్చరిక చేయండి, వారికి తెలపండి, చెప్పండి వారితో, అల్లాహ్ ను కాదని మీరు వేరే వారిని ఔలియాలుగా చేసుకుంటున్నారా మీకు ఇష్టం వచ్చినట్లు? వారు స్వయం తమకు ఏ లాభం చేకూర్చలేరు, వారిపై వచ్చి పడిన ఏ నష్టాన్ని వారు దూరం చేసుకోలేరు.

ఔలియా అల్లాహ్, వారిని మనం విశ్వసించాలి. ఎవరైతే అల్లాహ్ యొక్క సత్యమైన వలీలు ఉన్నారో, వారు అల్లాహ్ యొక్క సత్య వలీలు అని నమ్మాలి. కానీ, ఈ రోజుల్లో వలీల పేరు మీద ఏ దందాలు జరుగుతున్నాయో వాటిని స్వయంగా ఖురాన్ ఖండించినది అన్న విషయం కూడా తెలుసుకోవాలి.

అల్లాహ్ మనందరికీ సన్మార్గం ప్రసాదించు గాక. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్: https://teluguislam.net/?p=16057