హదీసులు కూడా కేవలం అల్లాహ్ యొక్క వహీనే! తఖ్రీజ్: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ రహిమహుల్లాహ్, షోబా తహ్రీఖ్ వతాలీఫ్, దారుస్సలామ్, లాహోర్ తెలుగు అనువాదం, సమర్పణ: ఇక్రాముద్దీన్ ముహమ్మద్ పరిశీలన: షేఖ్ నసీరుద్దీన్ జామి’ ఈ మరియు సోదరులు అబ్దుల్ ఖాదిర్ హఫిజహుముల్లాహ్
“హదీసులు కూడా కేవలం అల్లాహ్ యొక్క వహీనే!” అనే ఈ పుస్తకం, ముస్లింల జీవితంలో ఖురాన్‌తో పాటు దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి హదీసులు (సున్నత్) కూడా అల్లాహ్ చేత అవతరింపబడిన దివ్యజ్ఞానమే (వహీ) అని స్పష్టంగా నిరూపిస్తుంది. ప్రవక్త ధర్మవిషయంలో ఏదీ తన ఇష్టానుసారం చెప్పలేదని, అవన్నీ వహీ ద్వారానే వచ్చాయని ఖురాన్ ఆయతుల ఆధారంగా గ్రంథకర్త వివరించారు. ఖిబ్లా మార్పు, ముగ్గురు వ్యక్తుల పశ్చాత్తాపం, ఉపవాసం, జకాత్ మరియు నమాజు విధానాలు వంటి అనేక విషయాలు ఖురాన్‌లో ప్రస్తావించబడినప్పటికీ, వాటి పూర్తి వివరాలు కేవలం హదీసులలోనే లభిస్తాయని ఉదాహరణలతో సహా నిరూపించారు. కేవలం ఖురాన్‌ను మాత్రమే నమ్ముతాము అని చెబుతూ “హదీసులను తిరస్కరించే వారి” (మున్కిరీనె హదీసు) వాదనలను ఖండిస్తూ, హదీసుల ప్రామాణికత లేకుండా దైనందిన ఇస్లామిక్ విధులను ఆచరించడం అసాధ్యమని ఈ పుస్తకం ఉద్ఘాటిస్తుంది.
హదీసు సంకలనం – అబ్దుల్ గఫ్ఫార్ ఉమరీ (హఫిజహుల్లాహ్) [వీడియో] -హదీస్ అంటే అర్ధం? వివరణ -హదీస్ ప్రాముఖ్యత -హదీస్ ప్రస్తావన ఖుర్ఆన్ లో -హదీస్ అవసరం లేదు అన్నవారికి సమాధానం -హదీసులు కంఠస్తం చేసేవారికి శుభవార్త -వహీ ఎన్ని రకాలు?అవి ఏవి? -హదీసుల పట్ల ఉత్సాహం-ఖుర్ఆన్ తో పాటు ఇంకోటి ఇవ్వబడింది అదే హదీస్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
రెండు తోటల యజమాని కధ: అహంకారానికి అంతం వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/Z07VIyo51W0 [27 నిముషాలు]
ఈ ప్రసంగంలో, సూరత్ అల్-కహఫ్‌లో ప్రస్తావించబడిన “రెండు తోటల యజమాని” కథ ద్వారా అహంకారం (కిబ్ర్) యొక్క వినాశకరమైన పర్యవసానాలను వివరించబడింది. సంపద మరియు సంతానం అనేవి అల్లాహ్ నుండి వచ్చిన పరీక్షలని, వాటి పట్ల గర్వపడకుండా, ‘మాషా అల్లాహ్’ అంటూ వినమ్రతతో కృతజ్ఞత చూపాలని ఈ కథ ద్వారా నేర్చుకోవచ్చు. సత్యాన్ని తిరస్కరించడం మరియు ఇతరులను తక్కువగా చూడటమే అహంకారం అని, దీనికి ఉదాహరణగా ఇబ్లీస్ మరియు ఖారూన్‌ల కథలు చెప్పబడ్డాయి. అహంకారం మనిషిని స్వర్గానికి దూరం చేస్తుందని హదీసుల ద్వారా హెచ్చరించబడింది. దీనికి విరుద్ధంగా, వినమ్రత అల్లాహ్ దృష్టిలో ఒక వ్యక్తి స్థాయిని పెంచుతుంది. చివరగా, అల్లాహ్‌ను స్మరించడం, పేదలతో గడపడం, మరియు వినమ్రతను అలవర్చుకోవడం ద్వారా అహంకారం నుండి రక్షణ పొందవచ్చని సూచించబడింది.
అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వలా ఉద్వాన ఇల్లా అలజ్జాలిమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బాద్.
సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్‌కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.
రెండు తోటల యజమాని అహంకారం
అభిమాన సోదరులారా, రెండు తోటల యజమాని: అహంకారానికి అంతం.
ఈ రెండు తోటల యజమాని అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ కహఫ్‌లో ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఈ రెండు తోటల అతని గురించి సూరత్ కహఫ్‌లో ఆయత్ 32 నుంచి 44 వరకు ఆ ప్రస్తావన ఉంటుంది.
(ఓ ప్రవక్తా!) వారికి ఆ ఇద్దరు వ్యక్తుల ఉదాహరణను కూడా వినిపించు – వారిలో ఒకతనికి మేము రెండు ద్రాక్ష తోటలను ఇచ్చాము. వాటి చుట్టూ ఖర్జూరపు చెట్ల కంచెను నిర్మించాము. ఆ రెంటికీ మధ్య పచ్చని పంట పొలాలను కూడా వొసగాము. (18:32)
ఈ విధంగా ఈ ప్రస్తావన ఆయత్ 44 వరకు ఉంటుంది.
అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఉద్దేశించి ఈ ఉదాహరణ వినిపించు అని అంటున్నాడు. అంటే ఏంటి ఈ ఉదాహరణ? దీంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తికి రెండు అందమైన తోటలు ఉన్నాయి. ద్రాక్ష తోటలు, ఖర్జూరపు వృక్షాలు. మధ్యలో పంట పొలాలు, నీరు ప్రవహించే నదులు. అతనికి అపారమైన సంపద, కుటుంబ బలం ఉంది.
ఈ కారణంగా ఈ వ్యక్తి తన స్నేహితునితో గర్వంగా ఇలా అన్నాడు, “నా సంపద నీకంటే ఎక్కువ. నా కుటుంబ బలం నీకంటే ఎక్కువ. ఈ తోట ఎప్పటికీ నశించదు, ఖియామత్ రోజు కూడా రాదు.” ఒకపక్కన ఈ తోట మూలంగా గర్వపడుతున్నాడు. ఎప్పటికీ ఇలాగే ఈ తోటలు, ఈ ధనం ఇలాగే ఉండిపోతుంది అనే ఒక పక్కన గర్వపడతా ఉంటే, అదే గర్వంతో “ఖియామత్ కూడా రాదు. వచ్చినా కూడా నేను ఇక్కడి కంటే మంచి ఫలమే పొందుతాను” అని గర్వంలో ఉప్పొంగిపోతున్నాడు.
ఇది స్పష్టమైన అహంకారం, కిబ్ర్, మరియు అల్లాహ్‌పై అవిశ్వాసం. ఈ ధనవంతుడు ఇలా చెప్పాడు తన స్నేహితునితో, ఆ స్నేహితుడు పేదవాడు. ఈ ఉదాహరణలో ఇద్దరు వ్యక్తుల ఉదాహరణ, ఒక వ్యక్తి ఈ అహంకారి, గర్విష్ఠి, ఇంకో వ్యక్తి పేదవాడు కానీ విశ్వాసి, అల్లాహ్‌పై నమ్మకం గలవాడు.
ఈ గర్విష్ఠి చెప్పిన మాటలు విని తన స్నేహితుడు ఇలా అన్నాడు. వినమ్రంగా హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు? “నీకు ఈ తోట ఇచ్చింది ఎవరు? అల్లాహ్ మాత్రమే కదా? మరి
مَا شَاءَ اللَّهُ لَا قُوَّةَ إِلَّا بِاللَّهِ (మాషా అల్లాహ్ లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్) ‘అల్లాహ్ తలచినదే అవుతుంది. అల్లాహ్ ద్వారా లభించే శక్తి తప్ప వేరే శక్తి ఏదీ లేదు’(18:39)
అని చెప్పాలి కదా? అల్లాహ్ చిత్తమే, శక్తి అంతా ఆయనదే, అల్లాహ్ తలిస్తేనే జరిగింది, అల్లాహ్ ఇవ్వకపోతే ఎవ్వరూ ఇవ్వలేరు అని ఎందుకు చెప్పలేదు? నేను పేదవాడిని కావచ్చు, కానీ అల్లాహ్ నిన్ను శిక్షించవచ్చు, నీ గర్వానికి, నీ అహంకారానికి, నీ తిరస్కారానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శిక్షించవచ్చు” అని ఆ పేద స్నేహితుడు వినమ్రంగా అతనికి తెలియపరిచాడు.
కానీ ఏమైంది? అహంకారానికి అంతమైంది. కొద్ది కాలంలోనే ఒక విపత్తు వచ్చింది, ఆ తోటలు పూర్తిగా నాశనం అయ్యాయి, చెట్లు పడిపోయాయి, పంటలు కాలిపోయాయి. అప్పుడు ఆ రెండు తోటల యజమాని ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోటలను నాశనం చేశాడో, చెట్లను ఇది చేసేసాడో, పంటలు కాల్చేశాడో, ఆ తర్వాత కుమిలిపోతూ, చేతులు మలుచుకుంటూ, పశ్చాత్తాపంతో ఇలా అన్నాడు:
يَا لَيْتَنِي لَمْ أُشْرِكْ بِرَبِّي أَحَدًا (యా లయ్తనీ లమ్ ఉష్రిక్ బిరబ్బీ అహదా) “అయ్యో! నేను నా ప్రభువుకు సహవర్తులుగా ఎవరినీ నిలబెట్టకుండా ఉంటే ఎంత బావుండేది!” (18:42)
ఇది కథ, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ కహఫ్‌లో ప్రస్తావించిన కథ ఇది. రెండు తోటల యజమాని, అహంకారంతో విర్రవీగిపోయాడు, నాకు ఎప్పుడూ పేదరికం రాదు, ఇలాగే ధనవంతుడినిగానే నేను ఉంటాను, నా ధనం నాతోనే ఉంటుంది, నా పంటలు, నా పొలము ఇవన్నీ నాతోపాటే ఉంటాయి, ఇంకో పక్క ఖియామత్ అనేది ఏమీ లేదు అని చెప్పిన అహంకారి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొద్ది కాలం తర్వాత, నసీహత్ చేసేప్పుడు కూడా అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు, అతను నసీహత్ కూడా చేశాడు, మంచి మాటలు చెప్పాడు. అయినా కూడా అతని అహంకారానికి ఎటువంటి ఇది రాలేదు కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని తోటలను పూర్తిగా నాశనం చేశాడు. అప్పుడు ఆయన నేను షిర్క్ చేయకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది అని బాధపడుతూ కుమిలిపోయాడు. కానీ ఆలస్యమైపోయింది.
ఈ కథలోని ప్రధాన పాఠాలు
[1] అహంకారం పెద్ద పాపం: మొదటి విషయం, ఇస్లాం ధర్మంలో అహంకారం పెద్ద పాపం.
మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
అంటే స్వర్గ ప్రవేశానికి అర్హులు ఎవరు? ఆవగింజంతైనా కూడా కిబ్ర్, గర్వం అనేది ఉండనివాడు. కొంచెమైనా కిబ్ర్, గర్వం, అహంకారం ఉంటే అటువంటి వ్యక్తి స్వర్గానికి అర్హుడు కాదు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అహంకారం అంటే సత్యాన్ని తిరస్కరించడం, ఇతరులను తక్కువగా చూడటం, చిన్నచూపు చూడటం.
[2] సంపద ఒక పరీక్ష మాత్రమే: రెండవ విషయం ఏమిటి ఈ కథలో, ఈ ఉదాహరణలో? సంపద అనేది ఒక పరీక్ష మాత్రమే.
అల్లాహ్ సంపదను అనుగ్రహంగా ఇస్తాడు, కానీ అది పరీక్ష కూడా అవుతుంది.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు సూరత్ అన్ఫాల్‌లో:
وَاعْلَمُوا أَنَّمَا أَمْوَالُكُمْ وَأَوْلَادُكُمْ فِتْنَةٌ (వ’లమూ అన్నమా అమ్వాలుకుమ్ వ అవ్లాదుకుమ్ ఫిత్నహ్) మీ సిరిసంపదలు, మీ సంతానం మీ పాలిట ఒక పరీక్ష అన్న సంగతిని తెలుసుకోండి. (8:28)
సంపద ఉండటం తప్పు కాదు, సంపద మీద గర్వం చేసి అల్లాహ్‌ను మరిచిపోవడం తప్పు. ఇది గమనించాల్సిన విషయం.
[3] ‘మాషా అల్లాహ్’ అనే సంస్కారం:
మూడో విషయం ఏమిటి? అల్లాహ్ తక్కువ ప్రసాదించినా, ఎక్కువ ప్రసాదించినా, మరీ ఎక్కువ ప్రసాదించినా ‘మాషా అల్లాహ్’ అనే చెప్పే సంస్కారం కావాలి.
మాషా అల్లాహ్ అంటే కేవలం నాలుకతో కాదు, దాని అర్థాన్ని తెలుసుకుంటూ, దాని భావాన్ని తెలుసుకుంటూ, దానిని నిజాయితీగా నమ్ముతూ ఉండే ఆ సంస్కారం కలిగి ఉండాలి. మనకు ఏదైనా మంచి ఉన్నప్పుడు, మంచి జరిగినప్పుడు, ఇల్లు, వ్యాపారం, పిల్లలు, ఆరోగ్యం, అంతస్తు, హోదాలు, పదవులు, సంతోషాలు, సుఖాలు ఏవైనా సరే, అవి జరిగినప్పుడు ‘మాషా అల్లాహ్, ఇది అల్లాహ్ తరఫు నుంచే’. మనలో వినమ్రత పెంచుతుంది. ఇలా జరిగితే అల్లాహ్ దయను గుర్తు చేస్తుంది ఇటువంటి భావన. అంటే ఈ సంపాదన అల్లాహ్ నాకు ప్రసాదించాడు, ఈ జ్ఞానం అల్లాహ్ నాకు ప్రసాదించాడు, సంతానం అల్లాహ్ నాకు ప్రసాదించాడు, ఈ హోదా అల్లాహ్ నాకు ఇచ్చాడు, ఈ పదవి అల్లాహ్ నాకు ఇచ్చాడు, ఇంత బంగారం, ఇంత ధనం, ఇంత పదవులు ఇవన్నీ అల్లాహ్ నాకు ఇచ్చాడు. కొంచెం కూడా గర్వం రాకూడదు. ఇటువంటి భావన ఉంటే, ఇది మనలో వినమ్రత పెంచుతుంది, అల్లాహ్ దయను గుర్తు చేస్తుంది.
[4] ప్రాపంచిక జీవితం తాత్కాలికం:
నాలుగో విషయం ఏమిటి ఈ కథలో? ప్రాపంచిక జీవితం తాత్కాలికం. ఈ దునియా తాత్కాలికం.
ఈ కథ మనకు చెబుతోంది, దునియా జీవితం, ప్రాపంచిక జీవితం ఒక తోట లాంటిది. ఈ రోజు పచ్చగా ఉంటుంది, రేపు ఎండిపోతుంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దీని గురించి ఖురాన్‌లో తెలియజేశాడు, ప్రపంచపు జీవితం వర్షం లాంటిది. كَمَثَلِ غَيْثٍ (క-మసలి గైసిన్) సూరత్ హదీద్‌లో ఉంది. ఇది వర్షం లాంటిది, పంటలు పుష్కలంగా పెరుగుతాయి, తర్వాత ఎండిపోతాయి. కొన్ని రోజుల జీవితం కోసం గర్వపడకూడదు, అల్లాహ్‌ని మరిచిపోకూడదు, అహంకారంలో విర్రవీగకూడదు.
కావున, అభిమాన సోదరులారా, అహంకారం మహా పాపం, కిబ్ర్ చాలా చెడు, అల్లాహ్‌కు అసలు ఇష్టం ఉండదు.
వినమ్రత యొక్క గొప్పతనం
మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
مَنْ تَوَاضَعَ لِلَّهِ رَفَعَهُ اللَّهُ (మన్ తవాద’అ లిల్లాహి రఫ’అహుల్లాహ్) ఎవరైతే వినమ్రతతో ఉంటారో అల్లాహ్ వారిని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్తాడు.
అలాగే, అసలైన ధనవంతుడు డబ్బు ఉన్నవాడు కాదు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
لَيْسَ الْغِنَى عَنْ كَثْرَةِ الْعَرَضِ، وَلَكِنَّ الْغِنَى غِنَى النَّفْسِ (లైసల్ గినా అన్ కసరతిల్ ‘అరది, వలాకిన్నల్ గినా గినన్-నఫ్స్) సంపద ఎక్కువ ఉండటం ధనికత కాదు, కానీ నిజమైన ధనికత హృదయ సంతృప్తి.
కావున ప్రియ సోదర సోదరీమణులారా, రెండు తోటల యజమాని కథ మనందరికీ ఇది ఒక హెచ్చరిక. అహంకారం నాశనానికి దారి తీస్తుంది. అల్లాహ్‌ను మరచిన సంపద నిలవదు. వినమ్రతే నిజమైన మహిమ. ఈ ప్రాపంచిక జీవితం తాత్కాలికం, ఆఖిరత్, పరలోకం అది శాశ్వతం. మనకు ఉన్న ప్రతి అనుగ్రహానికి ‘అల్హమ్దులిల్లాహ్‘ అని చెప్పాలి, అది చిన్నదైనా పెద్దదైనా. మన హృదయంలో అహంకారం తొలగించాలి, అల్లాహ్ ముందు వినమ్రంగా జీవించాలి, ఇలా ఉండాలి ఒక విశ్వాసి.
అహంకారం అంటే ఏమిటి?
అభిమాన సోదరులారా, సత్యాన్ని తిరస్కరించడం, ఇతరులను తక్కువగా చూడటం, ఇది ఎప్పుడు అవుతుంది? ఇదే కదా కిబ్ర్ అనేది, గర్వం అనేది, అహంకారం అనేది ఇదే కదా? నాకు ఉంది, అతనికి లేదు, నేను గొప్పవాడు, వాడు చిన్నవాడు, లేనివాడు, పేదవాడు అనేది ఈ ఒక రకమైన భావన కలిగి ఉండటమే అహంకారం, కిబ్ర్ అంటారు.
దీనికి ఉదాహరణ చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇబ్లీసును ఆదం అలైహిస్సలాం ముందు సజ్దా చేయమని ఆజ్ఞాపించినప్పుడు ఇబ్లీస్ తిరస్కరించాడు. కారణం ఏమిటి? అహంకారం.
أَنَا خَيْرٌ مِنْهُ (అన ఖైరున్ మిన్హు) నేను అతనికంటే శ్రేష్ఠుణ్ణి (7:12)
అన్నాడు. కానీ ఏం జరిగింది? ఇబ్లీస్ పతనానికి కారణం అహంకారం.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు అహంకారులు ఇష్టం ఉండరు.
إِنَّهُ لَا يُحِبُّ الْمُسْتَكْبِرِينَ (ఇన్నహూ లా యుహిబ్బుల్ ముస్తక్బిరీన్) నిశ్చయంగా ఆయన అహంకారులను ఇష్టపడడు. (16:23)
అల్లాహ్ ముందు వినమ్రత ఈమాన్ యొక్క లక్షణం.
అలాగే ఖారూన్ ఉదాహరణ ఉంది ఖురాన్‌లో. అతను ఏమన్నాడు ఖారూన్? “ఇన్నమా ఊతీతుహు అలా ఇల్మిన్ ఇందీ” అన్నాడు. నా దగ్గర ఉండే ఈ హోదా, ఈ ఆస్తిపాస్తులు, ఈ ఆనందాలు, ఈ భోగభాగ్యాలు, ఈ ధనం, ఈ ధనికత ఇదంతా నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ‘అలా ఇల్మిన్ ఇందీ’, నా జ్ఞానం వల్ల నాకు లభించింది అని అన్నాడు. ఎందుకు అన్నాడు? గర్వం, అహంకారం. నాకు ఎవ్వరూ ఇవ్వలేదు, నా జ్ఞానం ఇది, నా శక్తి ఇది, నా ప్లాన్ ఇది, నేను చేశాను, నేను సంపాదించాను, నాది మాత్రమే అని అహంకారంతో అతను విర్రవీగాడు. ఫలితం ఏమైంది? అతను తన సంపదతో పాటు నేలలో ముంచబడ్డాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానికి కూడా నాశనం చేసేశాడు.
మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, అహం ఉన్నవాడు, గర్వం గలవాడు, కిబ్ర్ ఉన్నవాడు స్వర్గంలో ప్రవేశించలేడు. హృదయంలో రాయిగింజంత అహంకారం ఉన్నవాడు జన్నత్‌లో ప్రవేశించడు. (బుఖారీ మరియు ముస్లింలో హదీస్ ఉంది ఇది). ఒక సహాబీ ఈ హదీస్ విని ప్రవక్త గారిని అడిగారు, “ఓ దైవ ప్రవక్త, మనకు మంచి దుస్తులు, మంచి చెప్పులు ఇష్టం ఉండటం కూడా అహంకారమా?”. మంచి తొడగాలి అని మంచి దుస్తులు వేసుకున్నాము, మంచి చెప్పులు వేసుకున్నాము, ఇది కూడా అహంకారం కిందికి వస్తుందా? అని అడిగారు. దానికి సమాధానంగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, “అల్లాహ్ అందమైనవాడు, అందాన్ని ఇష్టపడతాడు”. అన్నారు. అంటే ఇది అహంకారం కాదు. అంటే మంచి దుస్తులు వేసుకోవడం ఇది అహంకారం కాదు, దాని మూలంగా ఇతరులను చిన్నచూపు చూడటం అది అహంకారం కిందికి వస్తుంది. అహంకారం అంటే సత్యాన్ని తిరస్కరించడం మరియు ప్రజలను, ఇతరులను తక్కువగా చూడటం.
రెండవది వినమ్రత, దీనికి విరుద్ధం. ‘మన్ తవాద అలిల్లాహ్’ – ఎవరైతే అల్లాహ్ కోసం వినమ్రత చూపుతాడో, ‘రఫాహుల్లాహ్’ – అల్లాహ్ వారిని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు.
మూడవది, ఖియామత్ రోజున పరిస్థితి ఏంటి? అహంకారులు ఖియామత్ రోజు చిన్న చీమల వలె లేవనెత్తబడతారు. అంటే అక్కడ వారికి ఆ గౌరవం, ఎటువంటి గౌరవం ఉండదు కదా.
ఇస్లాంలో అహంకారం, కిబ్ర్ అంటే సత్యాన్ని తిరస్కరించడం, ఇతరులను తక్కువగా తృణీకరించడం. ఇది అత్యంత నిషిద్ధమైన పాపం. ఖురాన్ మరియు హదీసుల ప్రకారం హృదయంలో అణుమాత్రం గర్వం ఉన్నా స్వర్గ ప్రవేశం లభించదు. ఎందుకంటే గొప్పతనం అనేది అది అల్లాహ్‌కు మాత్రమే సొంతం.
“అహంకారంతో ప్రజల నుండి ముఖం తిప్పుకోకు. భూమిపై గర్వంతో నడవకు. అహంకారానికి, గొప్పలు చెప్పుకునేవాడిని అల్లాహ్ ప్రేమించడు” అని అల్లాహ్ సూరత్ లుఖ్మాన్‌లో తెలియజేశాడు.
అలాగే సూరత్ అన్-నిసాలో ఉంది, అహంకారంతో భూమిపై గర్వంగా నడిచేవారికి కఠినమైన శిక్ష ఉంటుందని ఖురాన్ హెచ్చరించింది (సూరత్ అన్-నిసా, ఆయత్ 173లో). అలాగే సూరత్ ఆరాఫ్‌లో ఉంటుంది, అహంకారులకు స్వర్గ ద్వారాలు తెరవబడవు (సూరత్ ఆరాఫ్, ఆయత్ 40).
అలాగే సహీహ్ ముస్లింలో హదీస్ ఉంది, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, హృదయంలో అణుమాత్రం అహంకారం ఉన్నవాడు స్వర్గములో ప్రవేశించడు.
కావున, అహంకారం యొక్క పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి.
స్వర్గం నుండి దూరం: గర్వం ఉన్నవారు స్వర్గం పొందలేరు, అంటే స్వర్గం నుంచి దూరం.
నరక శిక్ష: అహంకారుల నివాసం నరకం.
దైవ ప్రేమకు దూరం: అల్లాహ్ అహంకారులను ఇష్టపడడు.
అహంకారం ఎందుకు ప్రమాదం అంటే, అది ఈమాన్‌ను బలహీనపరుస్తుంది, కంజోర్ చేస్తుంది. దుఆ అంగీకారం తగ్గుతుంది, దుఆ స్వీకరించబడటం తగ్గిపోతుంది. మనుషుల మధ్య విభేదాలు పెరుగుతాయి. అల్లాహ్ కోపానికి కారణం అవుతుంది.
ఇక్కడ మనము ఒక విషయం గమనించాలి, అది ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒక వ్యక్తికి ఈ ప్రాపంచిక జీవితంలో అన్నీ ఇచ్చాడు. ప్రతీదీ ప్రసాదించాడు. అందం, ఐశ్వర్యం, హోదా, పదవులు, డబ్బులు, ధనం, రాజకీయం, రాజ్యం, ప్రతీదీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి జ్ఞానం, బలం, శక్తి అన్నీ అల్లాహ్ ఇచ్చాడు, ఈమాన్ తప్ప. ఒక వ్యక్తికి ప్రపంచంలో ప్రతి వస్తువు దక్కింది, ప్రతి సంతోషం దక్కింది ప్రాపంచిక పరంగా, ప్రతి విషయం దక్కింది, అల్లాహ్ అన్నీ ఇచ్చేశాడు. అతనికి కష్టమే తెలీదు, బాధే తెలీదు, అంత బాగుంది. ఈమాన్ అల్లాహ్ అతనికి ఇవ్వలేదు.
ఇంకో వైపు అల్లాహ్ ఒక వ్యక్తికి ఏదీ ఇవ్వలేదు. డబ్బు లేదు, అందం లేదు, ధనం లేదు, హోదా లేదు, పదవి లేదు, ఇంకా సమస్యలు, అనారోగ్యం, బలహీనత, ఆర్థిక సమస్యలు, శారీరక సమస్యలు, మానసిక సమస్యలు చాలా ఉన్నాయి. కానీ అల్లాహ్ అతనికి ఈమాన్ ఇచ్చాడు, విశ్వాసాన్ని ఇచ్చాడు, హిదాయత్ ప్రసాదించాడు.
మరి ఈ ఇద్దరి వ్యక్తులలో గొప్పవాడు ఎవరు? ధనికుడు ఎవరు? సాఫల్యం పొందేవాడు ఎవడు? రెండవ వ్యక్తే. ఈ ప్రాపంచిక జీవితంలో డబ్బు లేకపోయినా, సుఖం లేకపోయినా, తాత్కాలిక సుఖం లేకపోయినా, అందం ఐశ్వర్యం లేకపోయినా, ధనం, బలం ఇది లేకపోయినా కానీ అల్లాహ్ ఈ ప్రాపంచిక జీవితంలో విశ్వాసాన్ని ఇచ్చాడు, ఈమాన్‌ను ఇచ్చాడు, హిదాయత్ ప్రసాదించాడు. ఇదే అసలైన సంపద, ఇదే అసలైన బలం, ఇదే అసలైన వస్తువు. ఎందుకు? ఇదే మనకు పనికి వచ్చేది మరణానంతర జీవితంలో, పరలోకములో, శాశ్వతమైన జీవితంలో. ఎందుకు? ఇక్కడ ఉన్నా లేకపోయినా మరణం తప్పదు. మరణం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? చెప్పలేము. ఈ రోజు రావచ్చు, రాత్రి రావచ్చు, రేపు రావచ్చు, ఒక రోజులో రావచ్చు, నెలలో రావచ్చు, ఎప్పుడు వస్తుందో తెలీదు. కొందరు పూర్తి జీవితం 20-30 సంవత్సరాలు స్వయంగా అనుభవించకుండా బాగా కష్టపడి, త్యాగాలు చేసి, రాత్రి పగలు అనకుండా త్యాగాలు చేసి సంపాదించి కూడా పెట్టారు భార్యాపిల్లల కోసం, హఠాత్తుగా మరణించారు. సంపాదించింది ఎవరు? అనుభవిస్తుంది ఎవరు? ఇది జీవితం. ఇక్కడ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇక్కడ అసలు ఏది కావాలి? అసలు ఈమాన్ కావాలి. దాని మూలంగా మరణానంతర జీవితం, పరలోకంలో శాశ్వతంగా సుఖంగా ఉంటాము.
అందుకోసం, రెండూ ఇస్తే అల్హమ్దులిల్లాహ్, ‘దాలిక ఫద్లుల్లాహి యు’తీహి మయ్యషా’ – అల్లాహ్ కొందరికి ఈమాన్‌తో పాటు ప్రపంచాన్ని, ప్రపంచంతో పాటు దీన్‌ను కూడా అల్లాహ్ ఇస్తాడు. అది ‘దాలిక ఫద్లుల్లాహ్’, అల్హమ్దులిల్లాహ్. కానీ అల్లాహ్ పరీక్ష నిమిత్తము, ఇంకో కారణము, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రాపంచిక జీవితంలో, ఇది పరీక్షతో కూడిన జీవితం కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందం విషయంలో, బలం విషయంలో, ధనం విషయంలో, ఆర్థిక విషయంలో, కుటుంబ విషయంలో, సమాజ విషయంలో, ఉద్యోగ విషయంలో, రాజకీయ విషయంలో అనేక సందర్భాలలో, అనేక విషయాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్ష పెడుతూ ఉంటాడు. అది మనము సహనంతో, ఓర్పుతో మనము దానిని పరీక్షగా తీసుకుని విధేయతగా మనము జీవించే ప్రయత్నం చేయాలి.
అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్ష నిమిత్తం మనకు డబ్బు ఇచ్చాడు, హోదా ఇచ్చాడు, అందం ఇచ్చాడు, పదవిని ఇచ్చాడు, అల్హమ్దులిల్లాహ్ బాగా ప్రసాదించాడు. గర్వపడకూడదు, కొంచెం కూడా మన మనసులో గర్వం రాకూడదు. అల్లాహ్ ప్రసాదించిన వాటిని మన మనసులో ఉండే భావన ఏమిటి? ఇది అల్లాహ్ ఇచ్చాడు, పరీక్ష కోసం ఇచ్చాడు. అందుకు దానధర్మాలు చేయాలి, ఫర్జ్ జకాత్ కాక ఇంకా నఫిల్ సదకాత్‌ను కూడా చేస్తూ ఉండాలి.
అహంకారం నుండి రక్షణ మార్గాలు
అభిమాన సోదరులారా, అహంకారం నుండి రక్షణ మార్గాలు:
అల్హమ్దులిల్లాహ్, మాషా అల్లాహ్ ఎక్కువగా చెప్పడం.
“మాషా అల్లాహ్ లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అనే అలవాటు చేసుకోవడం.
సజ్దా ఎక్కువగా చేయటం.
పేదవాళ్ళతో కూర్చోవడం.
మనకు ఉన్నది అన్నీ అల్లాహ్ దయ అని గుర్తుపెట్టుకోవడం.
ఇవి మనము ఈ లక్షణాలు, గుణాలు కలిగి ఉండాలి. అభిమాన సోదరులారా, అహంకారం మనిషిని ఇబ్లీస్ స్థాయికి తీసుకువెళ్తుంది, వినమ్రత మనిషిని అల్లాహ్‌కు దగ్గర చేస్తుంది. మన హృదయంలో కిబ్ర్ లేకుండా తఖ్వా, వినమ్రతతో జీవిద్దాం.
అల్లాహ్ మన హృదయాలను శుద్ధి చేసి అహంకారం నుండి రక్షించుగాక. ఆమీన్.
వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీనార్ అల్-అయార్ గురించి ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. దీనార్‌కు ఒక పుణ్యాత్మురాలైన తల్లి ఉండేది. ఆమె ఎప్పుడూ తన పాపపు జీవితం గురించి, దారి తప్పిన ప్రవర్తన గురించి పశ్చాత్తాపపడమని అతనికి సలహా ఇస్తూ ఉండేది. ఆమె ఎంత ప్రయత్నించినప్పటికీ, ఆమె మాటలు అతనిపై ఎటువంటి ప్రభావం చూపలేదు.
ఒకరోజు, అతను ఒక స్మశానం గుండా వెళుతుండగా, ఒక ఎముకను తీయడానికి ఆగాడు. ఆ ఎముక అతని చేతిలోనే పొడిపొడిగా మారి మట్టిలో కలిసిపోవడం చూసి అతను దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆ దృశ్యం దీనార్‌పై తీవ్ర ప్రభావం చూపింది. అతను తన జీవితం మరియు తన గత పాపాల గురించి ఆలోచించడం ప్రారంభించాడు. అప్పుడు అతను ఇలా అన్నాడు, “ఓ దీనార్, నీకు వినాశనం తప్పదు! నువ్వు కూడా ఈ నలిగిపోయిన ఎముకలాగే అంతం కాబోతున్నావు, నీ శరీరం మట్టిలో కలిసిపోతుంది.” అతని గత పాపాలన్నీ అతని కళ్ళ ముందు కదిలాయి, అతను పశ్చాత్తాపపడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆకాశం వైపు చూసి, “ఓ నా ప్రభూ, నేను ఇప్పుడు నీకు పూర్తిగా లొంగిపోతున్నాను (శరణు కోరుతున్నాను), కాబట్టి నన్ను స్వీకరించు మరియు నాపై దయ చూపించు” అని వేడుకున్నాడు.
పూర్తిగా మారిన హృదయంతో మరియు మానసిక స్థితితో, దీనార్ తన తల్లి దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు, “అమ్మా, తన నుండి పారిపోయిన బానిసను పట్టుకున్నప్పుడు యజమాని ఏం చేస్తాడు?” ఆమె, “[శిక్షించడానికి] ఆ యజమాని అతనికి ముతక బట్టలు మరియు నాసిరకం ఆహారాన్ని ఇస్తాడు; అతను మళ్ళీ పారిపోవడానికి ప్రయత్నించకుండా అతని కాళ్ళు చేతులు కట్టేస్తాడు” అని చెప్పింది. అప్పుడు దీనార్, “అయితే నాకు ముతక ఉన్నితో చేసిన వస్త్రం, నాసిరకం బార్లీ మరియు రెండు గొలుసులను ఇవ్వు. అమ్మా, పారిపోయిన బానిసకు చేసినట్లే నాకూ చెయ్యి. బహుశా నా ప్రభువు, నా అవమానం మరియు వినయాన్ని చూసి, నాపై దయ చూపిస్తాడేమో.” తన కొడుకు పట్టుదలగా మరియు నిశ్చయంగా ఉండటం చూసి, ఆమె అలాగే చేసింది.
ప్రతి రాత్రి ప్రారంభంలో, దీనార్ ఆగకుండా ఏడవడం మరియు రోధించడం మొదలుపెట్టేవాడు. అతను తనలో తాను ఇలా అనుకునేవాడు, “ఓ దీనార్, నీకు వినాశనం! నరకపు మంటలను తట్టుకోగల శక్తి నీకు ఉందా? సర్వశక్తిమంతుడైన దేవుని ఆగ్రహానికి అర్హులయ్యేలా నువ్వు ఎంత తెగించి జీవించావు!” అతను ఉదయం వరకు ఆ స్థితిలోనే ఉండేవాడు.
దీనార్ శరీరం మెల్లగా చిక్కిపోయి, పాలిపోయింది. అతన్ని ఆ దయనీయ స్థితిలో చూడలేక, అతని తల్లి, “నా కొడుకా, నీపై నువ్వు కాస్త దయ చూపించుకో,” అని చెప్పింది. అతను ఇలా బదులిచ్చాడు, “అమ్మా, నన్ను కొద్దిసేపు ఇలాగే కట్టివేయనివ్వు, బహుశా తర్వాత నేను దీర్ఘకాలిక సుఖాన్ని పొందే అవకాశం ఉంది. రేపు నేను నా మహోన్నత ప్రభువు ముందు చాలా సేపు వేచి ఉండాల్సి ఉంటుంది, ఆయన నన్ను అందమైన నీడ ఉండే ప్రదేశాలకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడో లేక వర్ణించలేని భయానక ప్రదేశాలకు (నరకానికి) పంపుతాడో నాకు తెలియదు.”
ఆమె, “నా కొడుకా, కనీసం కాసేపు విశ్రాంతి తీసుకో,” అని చెప్పింది. అతను, “నేను వెతుకుతున్నది ఇప్పటి విశ్రాంతి లేదా సౌకర్యం కాదు. అమ్మా, రేపు నువ్వు మరియు ఇతర ప్రజలు స్వర్గం వైపు వెళుతున్నట్లు, నేను మరియు నరకవాసులు నరకాగ్ని వైపు వెళుతున్నట్లు నాకు కనిపిస్తోంది,” అని అన్నాడు. ఆమె అతన్ని వదిలేసింది, అతను ఏడుస్తూ, ఆరాధన చేస్తూ, ఖురాన్ పఠించడంలో మునిగిపోయాడు. ఒక రాత్రి, అతను ఖురాన్ పఠిస్తుండగా, ఈ వచనాలు వచ్చాయి:
فَوَرَبِّكَ لَنَسْأَلَنَّهُمْ أَجْمَعِين عَمَّا كَانُوا يَعْمَلُونَ َ “కావున, నీ ప్రభువు సాక్షిగా [ఓ ముహమ్మద్], వారు చేసిన పనులన్నింటి గురించి మేము వారిని తప్పక విచారిస్తాము.” [అల్-హిజ్ర్ : 92-93]
ఈ వచనాల అర్థాలు మరియు భావాలను అతను ఆలోచిస్తుండగా, అతను ఎంతగా ఏడ్చాడంటే సొమ్మసిల్లి పడిపోయాడు. అతని తల్లి పరుగున వచ్చి అతన్ని లేపడానికి చాలా ప్రయత్నించింది, కానీ అతను స్పందించలేదు. అతను చనిపోయాడని ఆమె భావించింది. తన కొడుకు ముఖం వైపు చూసి, “ఓ నా ప్రియమైన వాడా, నా హృదయ ఆనందమా, మనం మళ్ళీ ఎప్పుడు కలుస్తాం?” అని అన్నది. వాస్తవానికి, దీనార్‌లో ఇంకా కొంచెం ప్రాణం మిగిలి ఉంది, తన తల్లి మాటలు విని, అతను బలహీనమైన గొంతుతో, “అమ్మా, తీర్పు దినాన విశాలమైన మైదానాల్లో నేను నీకు కనిపించకపోతే, నా గురించి నరకపు రక్షకుడైన ‘మాలిక్’ను అడుగు,” అని అన్నాడు. ఆ తర్వాత అతను గొంతులో నుండి ఒక శబ్దం చేస్తూ (తుది శ్వాస విడిచి) మరణించాడు.
అతని మృతదేహాన్ని శుభ్రం చేసిన తర్వాత, దీనార్ తల్లి అతని అంత్యక్రియలకు సిద్ధం చేసింది. ఆమె బయటకు వెళ్లి, “ఓ ప్రజలారా, నరకాగ్ని భయంతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి అంత్యక్రియల ప్రార్థనకు రండి,” అని ప్రకటన చేసింది. అన్ని దిశల నుండి ప్రజలు రావడం ప్రారంభించారు. ఆ కాలంలో, అంతకంటే గొప్ప జనసమూహం ఎప్పుడూ రాలేదని మరియు ఆ రోజు చిందించినంత కన్నీళ్లు మరే రోజు చిందించలేదని చెబుతారు.
అతని అంత్యక్రియలు జరిగిన రాత్రే, దీనార్ స్నేహితుల్లో ఒకరు అతన్ని కలలో చూశారు. దీనార్ ఆకుపచ్చని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అతను స్వర్గంలో ఆనందంగా విహరిస్తూ ఈ వచనాన్ని పఠిస్తున్నాడు:
فَوَرَبِّكَ لَنَسْأَلَنَّهُمْ أَجْمَعِين عَمَّا كَانُوا يَعْمَلُونَ َ “కావున, నీ ప్రభువు సాక్షిగా [ఓ ముహమ్మద్], వారు చేసిన పనులన్నింటి గురించి మేము వారిని తప్పక విచారిస్తాము.”
ఆ కలలో, అతను ఇలా చెప్పడం స్నేహితుడు విన్నాడు: “ఆయన శక్తి మరియు గొప్పతనం సాక్షిగా, ఆయన నన్ను [నా కర్మల గురించి] అడిగాడు. నాపై దయతో, ఆయన నన్ను క్షమించాడు మరియు నా పాపాలను మన్నించాడు. ఇదిగో! ఈ వార్తను మా అమ్మకు చేరవేయ్యి.”
మూలం: పైన పేర్కొన్న కథ దారుస్సలాం ప్రచురించిన “Stories of Repentance” (పశ్చాత్తాప కథలు) పుస్తకం నుండి తీసుకోబడింది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఓ విశ్వసించినవారలారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది – మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది. [సూరా అల్-బఖరా (2): 183]
ఈ ఆయత్ (వచనం)లో, ఇక్కడ ఉన్నవారందరికీ తెలిసినట్లుగానే, అల్లాహ్ ముహమ్మద్ ( ﷺ ) గారి ఉమ్మత్‌కు తెలియజేస్తున్నాడు, పూర్వపు జాతులపై ఉపవాసాన్ని విధిగా చేసినట్లే, వీరిపై కూడా ఉపవాసాన్ని విధిగా (ఫర్జ్) చేశాడు. ఈ విషయం ఈ ఆయత్‌ను చదివే ముస్లింలందరికీ బాగా తెలుసు మరియు దాని అర్థం స్పష్టంగా అర్థమవుతుంది. కానీ నేను మాట్లాడాలనుకుంటున్నది వేరే విషయం, సాధారణ ప్రజలలో చాలా తక్కువ మంది మాత్రమే గమనించే విషయం – అది ఈ ఆయత్ చివరలో ఉన్న అల్లాహ్ మాట:
لَعَلَّكُمْ تَتَّقُونَ ‘…తద్వారా మీరు దైవభీతి (తక్వా) గలవారు అవుతారు.’
సాధారణంగా అల్లాహ్ తన విశ్వాసులైన దాసులను ఏదైనా ఆదేశించినప్పుడు లేదా ఏదైనా చట్టాన్ని విధిగా చేసినప్పుడు, దాని వెనుక ఉన్న వివేకాన్ని(wisdom) వివరించకుండా కేవలం ఆజ్ఞను మాత్రమే ప్రస్తావిస్తాడు. ఎందుకంటే అల్లాహ్ తన దాసులపై విధులను ఉంచడం వెనుక ఉన్న సాధారణ వివేకం ఏమిటంటే, ఆయన వారిని పరీక్షించడమే. తద్వారా ఎవరు ఆయనకు విధేయులై ఉంటారో మరియు ఎవరు అవిధేయులవుతారో స్పష్టమవుతుంది.
అయితే ఈ ఆయత్‌లో, పవిత్ర ఖురాన్‌లో తరచుగా కనిపించని ఒక విషయాన్ని ఆయన ప్రస్తావించారు, అదేమిటంటే ఆయన ఉపవాసం ఉండమని ఆజ్ఞాపించడానికి గల కారణాన్ని ఇలా పేర్కొన్నారు:
لَعَلَّكُمْ تَتَّقُونَ ‘…తద్వారా మీరు దైవభీతి (తక్వా) గలవారు అవుతారు.’
కాబట్టి విశ్వాసుల ఉపవాసం వెనుక ఉన్న వివేకం కేవలం వారు ఆనందదాయకమైన మరియు అనుమతించబడిన మంచి వస్తువులకు దూరంగా ఉండటం మాత్రమే కాదు – ఉపవాసం ఉన్నవారికి ఇది తప్పనిసరి అయినప్పటికీ – ఈ ఉపవాసం ద్వారా ఆశించినది మరియు ఉద్దేశించినది ఇది మాత్రమే కాదు. అల్లాహ్, ఉపవాసం ఉండాలన్న తన ఆజ్ఞను ఇలా ముగించాడు:
لَعَلَّكُمْ تَتَّقُونَ “.. తద్వారా మీరు దైవభీతి (తక్వా) గలవారు అవుతారు.‘
దీని అర్థం: ఉపవాసాన్ని విధించడం వెనుక ఉన్న వివేకం ఏమిటంటే, ముస్లిం ఈ ఉపవాస మాసంలో అల్లాహ్ పట్ల తన విధేయతను పెంచుకోవాలి మరియు ఇంతకు ముందు కంటే ఎక్కువ విధేయుడిగా మారాలి.
అలాగే ప్రవక్త ( ﷺ ) ఈ దైవిక వివేకాన్ని స్పష్టంగా తెలియజేశారు. సహీహ్ అల్-బుఖారీ (నం. 1903)లో నివేదించబడినట్లుగా, ప్రవక్త ( ﷺ ) ఇలా అన్నారు:
“ఎవరైతే అసత్యపు మాటలను మరియు చేతలను విడిచిపెట్టరో, వారు తమ ఆహార పానీయాలను మానేయడం వల్ల అల్లాహ్‌కు ఎటువంటి అవసరం లేదు.”
దీని అర్థం: అల్లాహ్ ఉపవాసాన్ని విధిగా చేయడం ద్వారా – అంటే మీకు తెలిసిన నిర్ణీత సమయం వరకు ఆగి ఉండటం ద్వారా – కేవలం ఆహారం మరియు పానీయాలకు దూరంగా ఉండటాన్ని మాత్రమే ఉద్దేశించలేదు. బదులుగా, అల్లాహ్ పాపాలు మరియు అవిధేయతకు సంబంధించిన నిషేధించిన విషయాల నుండి కూడా వారు దూరంగా ఉండాలి; అందులో అసత్యపు మాటలు మరియు చేతలు కూడా ఉన్నాయి.
కాబట్టి ప్రవక్త ( ﷺ ) ఈ ఆయత్‌ను నొక్కి చెబుతున్నారు:
لَعَلَّكُمْ تَتَّقُونَ ‘…తద్వారా మీరు దైవభీతి (తక్వా) గలవారు అవుతారు.’
అంటే, మీరు అల్లాహ్‌కు దగ్గరవ్వడానికి ఒక ఆరాధనగా, ఆహారం మరియు పానీయాలకు దూరంగా ఉండటంతో పాటు, చాడీలు చెప్పడం, ఇతరులకు హాని కలిగించేలా మాటలు మోయడం, తప్పుడు సాక్ష్యం ఇవ్వడం, అబద్ధాలు చెప్పడం వంటి నిషేధించబడిన చర్యలకు కూడా దూరంగా ఉండాలి.
కాబట్టి ముస్లింలందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఉపవాసాన్ని భంగపరిచే చర్యలు కేవలం భౌతిక చర్యలు (తినడం, తాగడం మరియు లైంగిక కలయిక) మాత్రమే కాదు. ఉపవాసం అంటే కేవలం వీటిని ఆపడం మాత్రమే కాదు. అందువల్ల కొంతమంది పండితులు ఉపవాసాన్ని భంగపరిచే విషయాలను రెండు రకాలుగా విభజించారు. ఈ శుభ సమయంలో నేను చెప్పదలచుకున్నది ఇదే.
ముఖ్యంగా రమదాన్ సమయంలో ఖుత్బాలు ఇచ్చేవారు మరియు ప్రజలకు ఉపదేశించేవారు, ఉపవాసాన్ని భంగపరిచే విషయాల గురించి మాట్లాడేటప్పుడు, వారు కేవలం భౌతిక విషయాలైన తినడం, తాగడం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ ముస్లింలకు సలహా ఇచ్చేవారిగా వారు చేయవలసినది ఏమిటంటే, ఉపవాసాన్ని భంగపరిచే రెండవ రకమైన విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రజలు ఉపవాసం అంటే కేవలం భౌతిక విషయాలకు దూరంగా ఉండటమే అని అలవాటు పడిపోయారు. కానీ ఉపవాసాన్ని భంగపరిచే మరో వర్గం ఉంది, దానిని మనం ‘భౌతికేతర విషయాలు’ (non-material things) అని పిలవవచ్చు.
మీరు ఇప్పుడే ప్రవక్త ( ﷺ ) గారి మాట విన్నారు: “ఎవరైతే అసత్యపు మాటలను మరియు చేతలను విడిచిపెట్టరో, వారు తమ ఆహార పానీయాలను మానేయడం వల్ల అల్లాహ్‌కు ఎటువంటి అవసరం లేదు.”
కాబట్టి ప్రతి ఉపవాసకుడు తనను తాను పరీక్షించుకోవాలి: అతను కేవలం భౌతిక విషయాలకు దూరంగా ఉంటున్నాడా లేక భౌతికేతర విషయాలకు కూడా దూరంగా ఉంటున్నాడా? అంటే: పవిత్ర రమదాన్ మాసం వచ్చినప్పుడు అతను తన ప్రవర్తనను మరియు నడవడికను మెరుగుపరచుకున్నాడా? అదే జరిగితే, అతను ఆయత్ చివరిలో ఉన్న అల్లాహ్ మాటను నెరవేర్చినట్లవుతుంది:
لَعَلَّكُمْ تَتَّقُونَ ‘…తద్వారా మీరు దైవభీతి (తక్వా) గలవారు అవుతారు.’
కానీ ఎవరైతే తన ఉపవాసాన్ని కేవలం ఆహారం మరియు పానీయాలకు దూరంగా ఉండటానికే పరిమితం చేసుకుని, రమదాన్‌కు ముందు ఉన్న చెడు ప్రవర్తననే కొనసాగిస్తారో, అప్పుడు అది ఈ పవిత్ర మాస చట్టం వెనుక ఉన్న జ్ఞానం నుండి ఆశించిన మరియు కోరుకున్న ఉపవాసం కాదు. దీనినే మన ప్రభువు తన వాక్కులో సూచించాడు:
لَعَلَّكُمْ تَتَّقُونَ ‘…తద్వారా మీరు దైవభీతి (తక్వా) గలవారు అవుతారు.’
అందువల్ల మేము మన ముస్లిం సోదరులకు సలహా ఇస్తున్నాము మరియు గుర్తుచేస్తున్నాము, వారు ఉపవాసాన్ని భంగపరిచే ఈ రెండవ వర్గం (భౌతికేతర) విషయాలను గుర్తుంచుకోవాలి. ఉపదేశకులు మరియు ప్రజలకు సరైన మార్గం చూపేవారు దీని గురించి చాలా అరుదుగా మాట్లాడతారు, ఇక సాధారణ ప్రజల గురించి చెప్పనక్కర్లేదు, వారికి ఈ భౌతికేతర విషయాల గురించి అసలు అవగాహన లేదు.
ఈ సమావేశంలో ఉన్న సోదరులకు నేను గుర్తుచేయాలనుకున్నది ఇదే, అల్లాహ్ చిత్తమైతే, ఇది ఈ పవిత్ర మాసంలో వారి ఆరాధనలను పెంచడానికి మరియు అల్లాహ్‌కు దగ్గరవ్వడానికి ఒక కారణంగా మారుతుందని ఆశిస్తున్నాను. అల్లాహ్ మనందరికీ ఈ మాసం యొక్క హక్కును నెరవేర్చే భాగ్యాన్ని ప్రసాదించుగాక, అదేమిటంటే ఉపవాసాన్ని భంగపరిచే భౌతిక మరియు భౌతికేతర విషయాలన్నింటికీ దూరంగా ఉండటం.
దీనికి అదనంగా, సాధారణ ముస్లింలే కాకుండా, జ్ఞానం ఉన్నవారు కూడా విస్మరించిన కొన్ని విషయాల పట్ల మీరు శ్రద్ధ వహిస్తారని నేను ఆశిస్తున్నాను.
ఇఫ్తార్ చేయడంలో త్వరపడటం & సహర్ చేయడంలో ఆలస్యం చేయడం
ఒక హదీసు ఉంది, ఇది మరొక హదీసు కారణంగా తరచుగా విస్మరించబడుతుంది, ఎందుకంటే చాలా మంది ప్రజలు ఆచరణలో ఆ రెండింటినీ సమన్వయం చేసుకోలేకపోతున్నారు. ఆ హదీసు ప్రవక్త (ﷺ) గారి ఈ మాట: “నా ఉమ్మత్ (సమాజం) ప్రజలు ఇఫ్తార్ (ఉపవాసం విరమించడం) చేయడంలో త్వరపడినంత కాలం మరియు సహర్ (తెల్లవారుజామున భోజనం) చేయడంలో ఆలస్యం చేసినంత కాలం వారు మంచిపై ఉంటారు.”
ఇక్కడ రెండు విషయాలు ప్రస్తావించబడ్డాయి, మరియు అవి చాలా మంది ప్రజలచే విస్మరించబడుతున్నాయి:
ఇఫ్తార్ చేయడంలో త్వరపడటం.
సహర్ (ముందస్తు భోజనం) చేయడంలో ఆలస్యం చేయడం.
మొదటి విషయం (ఇఫ్తార్‌లో త్వరపడటం) విస్మరించడానికి కారణం, కొంతమంది దృష్టిలో ఇది మరొక హదీసుకు విరుద్ధంగా కనిపిస్తుంది, అదేమిటంటే: “నా ఉమ్మత్ ప్రజలు మగ్రిబ్ నమాజ్ చదవడంలో త్వరపడినంత కాలం వారు మంచిపై ఉంటారు.”
ఇక్కడ మనకు రెండు విషయాలలో త్వరపడమని రెండు ఆజ్ఞలు ఉన్నాయి. కాబట్టి ఆ రెండింటినీ ఒకేసారి త్వరగా చేయడం సాధ్యం కాదని కొందరికి అనిపిస్తుంది.
కానీ ఇఫ్తార్ త్వరగా చేయడం మరియు మగ్రిబ్ నమాజ్ త్వరగా చేయడం మధ్య సమన్వయం చాలా సులభం. దీనిని మన ప్రవక్త ( ﷺ ) తన చర్య మరియు ఆచరణ ద్వారా స్పష్టంగా చూపించారు. ఆయన ( ﷺ ) మూడు ఖర్జూరాలతో ఉపవాసం విరమించేవారు. ఆయన మూడు ఖర్జూరాలు తినేవారు. ఆ తర్వాత ఆయన మగ్రిబ్ నమాజ్ చేసేవారు, ఆ తర్వాత రాత్రి భోజనం అవసరమైతే తినేవారు.
కానీ ఈ రోజు మనం రెండు తప్పులు చేస్తున్నాము:
(i) మొదటగా మనం ‘అజాన్’ను దాని నిర్ణీత సమయం నుండి ఆలస్యం చేస్తున్నాము. ఈ ఆలస్యం తర్వాత మరో ఆలస్యం వస్తుంది, అదేమిటంటే మనం భోజనం కోసం కూర్చుంటాము – మసీదులో మగ్రిబ్ నమాజ్ పట్ల ఆసక్తి చూపే కొద్దిమంది తప్ప. కానీ ఎక్కువ మంది ప్రజలు అజాన్ వినిపించే వరకు వేచి ఉండి, ఆ తర్వాత కేవలం ఉపవాసం విరమించడం కాకుండా, రాత్రి భోజనం చేస్తున్నట్లుగా తినడానికి కూర్చుంటారు.
ఈ రోజుల్లో చాలా ఇస్లామిక్ దేశాలలో – కేవలం జోర్డాన్‌లోనే కాదు, నేను పరిశోధన ద్వారా తెలుసుకున్న దాని ప్రకారం – మగ్రిబ్ అజాన్ సమయం అయిన తర్వాత కూడా ఆలస్యంగా ఇవ్వబడుతోంది. దీనికి కారణం మనం ఇస్లామిక్ నిబంధనలను పాటించడం మానేసి, ఖగోళ గణనలపై (astronomical calculations) ఆధారపడటమే. మనం టైమ్‌టేబుల్‌పై ఆధారపడుతున్నాము.
కానీ ఈ టైమ్ టేబుల్స్ భూమిని ఒక చదునుగా ఉండే తలం (flat plane)గా పరిగణించి చేసే గణనలపై ఆధారపడి ఉంటాయి. వాస్తవానికి భూమి, ముఖ్యంగా మన ప్రాంతంలో, లోయలు మరియు పర్వతాలతో ఎత్తుపల్లాలను కలిగి ఉంటుంది. కాబట్టి సముద్ర తీరం, మైదానాలు మరియు పర్వతాలకు ఒకే సమయం ఇవ్వడం సరైనది కాదు. కాదు, భూమిలోని ప్రతి భాగానికి దాని స్వంత సమయం ఉంటుంది. కాబట్టి ఎవరైతే తన నివాస స్థలంలో, తన నగరంలో లేదా గ్రామంలో, తన కళ్లతో సూర్యుడు అస్తమించడాన్ని చూడగలుగుతారో, సూర్యుడు అస్తమించిన వెంటనే, అదే మనం త్వరపడాల్సిన సమయం. ప్రవక్త ( ﷺ ) ఇలా అన్నారు: “ప్రజలు ఇఫ్తార్ చేయడంలో త్వరపడినంత కాలం వారు మంచిపై ఉంటారు.” ప్రవక్త ( ﷺ ) ఈ సున్నతును బోధించడం ద్వారా మరియు ఆచరించడం ద్వారా దీనిని అమలు చేయడానికి జాగ్రత్త తీసుకున్నారు.
ఆయన బోధన గురించి చెప్పాలంటే, సహీహ్ అల్-బుఖారీ (నం. 1954)లో నివేదించబడిన హదీసులో ఆయన ( ﷺ ) ఇలా అన్నారు: “రాత్రి ఈ వైపు నుండి కనిపిస్తే,” (అని తూర్పు వైపు చూపించారు), “మరియు పగలు ఇక్కడి నుండి వెళ్లిపోతే,” (అని పడమర వైపు చూపించారు), “మరియు సూర్యుడు అస్తమిస్తే, అప్పుడు ఉపవాసకుడు ఉపవాసం విరమించినట్లే.”
‘ఉపవాసకుడు ఉపవాసం విరమించినట్లే’ అంటే అర్థం ఏమిటి? అంటే అతను ఉపవాసం విరమించాలనే నిబంధనలోకి ప్రవేశించాడని అర్థం. ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ప్రవక్త ( ﷺ ) దీనిని అమలు చేసేవారు.
సహీహ్ అల్-బుఖారీ (నం. 1955)లో నివేదించబడినట్లుగా, ప్రవక్త ( ﷺ ) తన సహచరులలో ఒకరిని ఇఫ్తార్ సిద్ధం చేయమని ఆదేశించారు. అప్పుడు అతను, ‘ఓ అల్లాహ్ ప్రవక్త, ఇంకా పగలు ఉంది కదా’ అని సమాధానమిచ్చాడు. అంటే: సూర్యకాంతి ఇంకా పడమరలో స్పష్టంగా కనిపిస్తోంది, సూర్యుడు అస్తమించినప్పటికీ. ప్రవక్త ( ﷺ ) అతని మాటకు స్పందించలేదు, బదులుగా ఇఫ్తార్ సిద్ధం చేయమని మళ్లీ ఆదేశించారు. హదీసు ఉల్లేఖించిన వ్యక్తి ఇలా అన్నాడు, “మేము మా ముందు పగటి వెలుతురును చూడగలిగాము,” అంటే: మేము ఇఫ్తార్ చేసినప్పుడు సూర్యకాంతి ఉంది. “మాలో ఎవరైనా ఒంటె ఎెక్కి ఉంటే అతను సూర్యుడిని చూసి ఉండేవాడు.” ఇక్కడి నుండి చూస్తే సూర్యుడు అస్తమించాడు, అందుకని ప్రవక్త ( ﷺ ) ఇఫ్తార్ సిద్ధం చేయమని ఆదేశించారు – ఎందుకు? మంచి విషయంలో త్వరపడటానికి. “నా ఉమ్మత్ ప్రజలు ఇఫ్తార్ చేయడంలో త్వరపడినంత కాలం వారు మంచిపై ఉంటారు.”
కాబట్టి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇఫ్తార్‌ను త్వరగా చేయాలి, అది కూడా కొన్ని ఖర్జూరాలతో. ఆ తర్వాత మనం నమాజ్ చేయడానికి త్వరపడాలి. ఆ తర్వాత ప్రజలు కూర్చుని తమకు అవసరమైనంత తినవచ్చు.
ప్రవక్త ( ﷺ ) త్వరగా చేయమని ఆదేశించిన రెండు విషయాలను (ఇఫ్తార్ త్వరగా చేయడం మరియు మగ్రిబ్ నమాజ్ త్వరగా చేయడం) ఎలా సమన్వయం చేసుకోవాలో నేను మీకు గుర్తుచేయాలనుకున్న మొదటి విషయం ఇది. ఇఫ్తార్ కొన్ని ఖర్జూరాలతో చేయాలి, అవి లేకపోతే కొన్ని నీటి గుక్కలతో చేయాలి. ఆ తర్వాత మసీదులో సామూహికంగా నమాజ్ చేయాలి.
నేను మీకు గుర్తుచేయాలనుకున్న రెండవ విషయం మునుపటి హదీసులో ఉంది: “మరియు వారు సహర్ (ముందస్తు భోజనం) ఆలస్యం చేస్తారు”. అంటే: ఇక్కడ ఇఫ్తార్‌కు వ్యతిరేకమైనది అవసరం. ఆయన ( ﷺ ) ఇఫ్తార్‌లో త్వరపడమని ఆదేశించారు. కానీ సహర్ విషయంలో, దానిని ఆలస్యం చేయాలి.
కానీ ఈ రోజు జరుగుతున్నది దీనికి పూర్తిగా విరుద్ధం. చాలా మంది ఫజర్ సమయానికి ఒక గంట ముందే సహర్ తినేస్తున్నారు. ఇది తగదు. ఇది ప్రవక్త ( ﷺ ) చూపిన సున్నత్‌కు మరియు ఆయన ఆచరణకు విరుద్ధం. ప్రవక్త ( ﷺ ) గారి సహచరులు సహర్‌ను ఎంత ఆలస్యం చేసేవారంటే, వారిలో ఒకరు అజాన్ వినడానికి దగ్గరగా ఉన్నప్పటికీ ఇంకా తింటూనే ఉండేవారు, ఎందుకంటే వారు సహర్‌ను అంత ఆలస్యం చేశారు.
వాస్తవానికి ప్రవక్త ( ﷺ ) నుండి ఒక సహీహ్ హదీసు ఉంది, ఇది ఇస్లాం అందించే సౌలభ్యాన్ని చూపిస్తుంది. ముస్లింలు దీని గురించి గర్వపడాలి, ముఖ్యంగా ఉపవాసం విషయంలో. అల్లాహ్ ఉపవాసానికి సంబంధించిన ఆయత్లను ఈ మాటతో ముగించాడు:
‘అల్లాహ్ మీకు సౌలభ్యాన్ని కోరుకుంటాడు, మిమ్మల్ని కష్టపెట్టాలని అనుకోడు.’
ఈ సౌలభ్యంలో భాగమే ఆయన ( ﷺ ) మాట: “మీలో ఎవరైనా అజాన్ విన్నప్పుడు, అతని చేతిలో పాత్ర (ఆహారం/నీరు) ఉంటే, అతను తన అవసరం తీరే వరకు దానిని కింద పెట్టవద్దు.”
“మీలో ఎవరైనా అజాన్ విన్నప్పుడు… పాత్ర చేతిలో ఉంటే“: ఆ పాత్రలో పాలు, నీరు లేదా సహర్ కోసం తీసుకునే ఏదైనా ఆహారం ఉండవచ్చు. అతను అజాన్ విన్నప్పుడు, ‘అజాన్ వినిపించింది కాబట్టి ఇప్పుడు ఆహారం నిషిద్ధం’ అని అనుకోకూడదు. ఎవరైతే కడుపు నిండా తిన్నారో, వారికి ఇక తినడానికి అనుమతి లేదు. కానీ ఎవరైతే ఇంకా అవసరమైనంత తినలేదో, తాగలేదో, వారికి ప్రవక్త ( ﷺ ) దానిని అనుమతించారు. ఆయన స్పష్టమైన అరబిక్ భాషలో ఇలా అన్నారు: “మీలో ఎవరైనా అజాన్ విన్నప్పుడు, అతని చేతిలో పాత్ర ఉంటే, అతను తన అవసరం తీరే వరకు దానిని కింద పెట్టవద్దు.”
ఇక్కడ అజాన్ అంటే ‘రెండవ అజాన్’. ఇది మొదటి అజాన్ కాదు, దానిని తప్పుగా ‘ఇమ్సాక్ అజాన్’ (ఆగిపోవడానికి అజాన్) అని పిలుస్తారు. మొదటి అజాన్‌ను ‘ఇమ్సాక్ అజాన్’ అని పిలవడానికి ఎటువంటి ఆధారం లేదని మనం తెలుసుకోవాలి. రెండవ అజాన్ సమయంలోనే మనం తినడం ఆపివేయాలి, ఇది ఖురాన్‌లో స్పష్టంగా ఉంది:
‘మరియు ఉషోదయం అనే తెల్లని దారం, రాత్రి అనే నల్లని దారం నుండి మీకు స్పష్టంగా కనిపించే వరకు తినండి మరియు తాగండి.’
కాబట్టి ఫజర్ నమాజ్ సమయం ప్రారంభమైనప్పుడు తినడం నిషిద్ధం అవుతుంది. ఈ రెండింటి మధ్య ఎటువంటి విరామం లేదు. ఫజర్ సమయానికి పావు గంట ముందు, లేదా తక్కువ లేదా ఎక్కువ సమయం ముందు ఆహార పానీయాలు ఆపేయడం (ఇమ్సాక్) అనేది లేదు. అసలు లేదు.
ఎందుకంటే నిజమైన ఉషోదయం (True Dawn) కనిపించినప్పుడు నమాజ్ సమయం అవుతుంది, మరియు అదే సమయంలో ఉపవాసకుడికి ఆహారం నిషిద్ధం అవుతుంది. కాబట్టి ఈ రెండు విషయాల మధ్య ఎటువంటి ఎడబాటు లేదు.
అందువల్ల సహీహ్ అల్-బుఖారీ మరియు ముస్లింలలో అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) నుండి ఒక హదీసు ఉంది, ప్రవక్త ( ﷺ ) ఇలా అన్నారు: “బిలాల్ ఇచ్చే అజాన్ మిమ్మల్ని మోసగించకూడదు…” అంటే మొదటి అజాన్, “…ఎందుకంటే నిద్రపోతున్న వారిని లేపడానికి మరియు సహర్ తినాలనుకునే వారు తినడానికి అతను అజాన్ ఇస్తాడు. కాబట్టి ఇబ్న్ ఉమ్ మక్తూమ్ అజాన్ ఇచ్చే వరకు తినండి మరియు తాగండి.”
ఇబ్న్ ఉమ్ మక్తూమ్, అతని పేరు ‘అమ్ర్’, అతను అంధుడు. అతని గురించే అల్లాహ్ యొక్క ఈ వాక్కు వచ్చింది: ‘అతను ముఖం చిట్లించుకుని పక్కకు తిప్పుకున్నాడు, ఒక అంధుడు అతని వద్దకు వచ్చినప్పుడు…’ (సూరా అబస).
అతను (ఇబ్న్ ఉమ్ మక్తూమ్) రెండవ అజాన్ ఇచ్చేవారు, ఆ అజాన్ అంటే తినడం నిషిద్ధం అని మరియు ఫజర్ నమాజ్ సమయం అయిందని అర్థం.
అతను అంధుడై ఉండి అజాన్ ఎలా ఇచ్చేవారు? ఇది సహజంగా వచ్చే ప్రశ్న. అమ్ర్ ఇబ్న్ ఉమ్ మక్తూమ్ మసీదు పైకప్పు ఎక్కేవారు, కానీ అతనికి ఉషోదయం కనిపించేది కాదు. కాబట్టి దారిన పోయే వారు ఉషోదయాన్ని చూసే వరకు అతను వేచి ఉండేవారు. ఎవరైనా ఉషోదయం కనిపించిందని, వెలుతురు వ్యాపించిందని చూసినప్పుడు, వారు అతనితో “తెల్లవారింది, తెల్లవారింది” (It is morning) అని చెప్పేవారు. అప్పుడు అతను అజాన్ ఇచ్చేవారు.
కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, అమ్ర ఇబ్న్ ఉమ్ మక్తూమ్ అజాన్ ఫజర్ వచ్చిన తర్వాతే, మరియు ప్రజలు వీధుల్లో నడుస్తూ చూసిన తర్వాతే ఉండేది. “తెల్లవారింది, తెల్లవారింది” అని చెప్పినప్పుడు, అతను అజాన్ ఇచ్చేవారు.
కాబట్టి ఈ విషయంలో వెసులుబాటు ఉంది. ముఅజ్జిన్ ప్రజలు “తెల్లవారింది” అని చెప్పే వరకు అజాన్ ఇవ్వడంలో ఆలస్యం చేయవచ్చు. అప్పుడు అల్లాహ్ ప్రవక్త ( ﷺ ) ఇలా అన్నారు: “మీలో ఎవరైనా అజాన్ విన్నప్పుడు, అతని చేతిలో పాత్ర ఉంటే, అతను తన అవసరం తీరే వరకు దానిని కింద పెట్టవద్దు.”
కాబట్టి అల్లాహ్, ఉపవాసానికి సంబంధించిన ఆ ఆయత్ల చివరలో చెప్పిన మాట సత్యం:
‘అల్లాహ్ మీకు సౌలభ్యాన్ని కోరుకుంటాడు, మిమ్మల్ని కష్టపెట్టాలని అనుకోడు.’
మరియు ‘…మీరు ఆ దినాల లెక్కను పూర్తి చేయాలని మరియు మీకు మార్గదర్శకత్వం చేసినందుకు అల్లాహ్ గొప్పతనాన్ని (తక్బీర్) చాటాలని మరియు మీరు కృతజ్ఞులై ఉండాలని.’
కాబట్టి విమర్శించదగిన మరియు ఈ సున్నత్‌కు విరుద్ధమైన ఫిఖ్ (అవగాహన) ఏమిటంటే, ఒక వ్యక్తి ఇలా అనడం: “ఎవరైనా అజాన్ విన్నప్పుడు అతని నోటిలో కొంత ఆహారం ఉంటే, అతను దానిని ఉమ్మివేయాలి.” ఇది అతి కఠినత్వం, మరియు మతంలో హద్దులు మీరడం (ghuluww). సృష్టికర్త అయిన ప్రభువు మన మతంలో హద్దులు మీరకూడదని తన గ్రంథంలో మరియు తన ప్రవక్త ( ﷺ ) సున్నత్ ద్వారా హెచ్చరించాడు. పవిత్ర ఖురాన్‌లో ఆయన ఇలా అన్నాడు:
يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ وَلَا تَقُولُوا عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ ‘ఓ గ్రంథ ప్రజలారా! మీ మతంలో హద్దులు మీరకండి మరియు అల్లాహ్ గురించి సత్యం తప్ప మరేదీ చెప్పకండి.’
మరియు మన ప్రవక్త ( ﷺ ) ఇలా అన్నారు: “మతంలో హద్దులు మీరడం (ghuluww) పట్ల జాగ్రత్త వహించండి. ఎందుకంటే మీకు ముందున్న వారు తమ మతంలో హద్దులు మీరడం వల్లే నాశనమయ్యారు.”
కాబట్టి అల్లాహ్ ప్రవక్త ( ﷺ ) మనకు స్పష్టం చేశారు, సహర్ చేసే వ్యక్తికి కొంత వెసులుబాటు మరియు సౌలభ్యం ఉంది. ఎంతగా అంటే ఆయన ఇలా అన్నారు: “మీలో ఎవరైనా అజాన్ విన్నప్పుడు, అతని చేతిలో పాత్ర ఉంటే, అతను తన అవసరం తీరే వరకు దానిని కింద పెట్టవద్దు.”
కాబట్టి అజాన్ విన్నప్పుడు నోటిలో ఆహారం ఉంటే దానిని నేలమీద ఉమ్మివేయాలని చెప్పడం అల్లాహ్ మరియు ప్రవక్త పట్ల వ్యతిరేకత అవుతుంది. ఇది సున్నత్‌కు విరుద్ధం మరియు ప్రవక్త ( ﷺ ) స్పష్టమైన ఆజ్ఞకు విరుద్ధం.
నన్ను చాలా సార్లు ఈ ప్రశ్న అడిగారు, కాబట్టి నేను ముందుగానే సమాధానం ఇస్తున్నాను. ఈ హదీసు సున్నత్‌కు సంబంధించిన అత్యంత ప్రసిద్ధ పుస్తకాలలో ఉంది. వాటిలో ఒకటి ‘సునన్ అబూ దావూద్’, ఇది బాగా తెలిసిన ఆరు పుస్తకాలలో మూడవది. (మొదటిది సహీహ్ అల్-బుఖారీ, రెండవది సహీహ్ ముస్లిం, మూడవది సునన్ అబూ దావూద్).
ఈ హదీసు అందులో ఉంది, అలాగే అబూ అబ్దుల్లా అల్-హాకిమ్ తన ‘ముస్తద్రక్’లో మరియు ఇమామ్ అహ్మద్ ఇబ్న్ హంబల్ (రహిమహుల్లా) తన గొప్ప పుస్తకం ‘ముస్నద్’లో దీనిని నివేదించారు.
కాబట్టి ఈ హదీసు వింతైనది కాదు, ఇది బాగా తెలిసిన హదీసు మరియు ప్రామాణికమైన గొలుసు (chain of narration)తో మునుపటి ఇమామ్‌ల ద్వారా నివేదించబడింది.
చివరగా, నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. బహుశా మీకు కొన్ని ప్రశ్నలు ఉండవచ్చు, అల్లాహ్ చిత్తమైతే మేము సమాధానం ఇస్తాము. నేను ప్రవక్త ( ﷺ ) గారి ఈ మాటతో ముగిస్తాను: “అల్లాహ్ తన విధులను నెరవేర్చడాన్ని ఎంతగా ప్రేమిస్తాడో, తన వెసులుబాటులను (allowances) ఆచరించడాన్ని కూడా అంతే ప్రేమిస్తాడు,” మరియు ఒక ఉల్లేఖనలో, “ఆయనకు అవిధేయత చూపడాన్ని ఎంతగా ద్వేషిస్తాడో (అంతగా).”
అందువల్ల ముస్లిం తప్పుడు భక్తిని ప్రదర్శించకూడదు మరియు ప్రవక్త ( ﷺ ) మనల్ని ప్రోత్సహించిన మరియు స్పష్టం చేసిన విషయాలలో ఆయనను పాటించకుండా ఉండకూడదు.
చెప్పిన ఈ విషయాలు సరిపోతాయి, మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే స్తుతులన్నీ.
అరబ్బీ / ఇంగ్లీష్ తెలిసిన వారు క్రింది వీడియో చూసి లాభం పొందండి :
PS: అనువాదంలో ఏమైనా తప్పులు గమనిస్తే, teluguislam.net@gmail.com కు సంప్రదించండి, బారకల్లాహు ఫీకుం
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ పేరుతో, అత్యంత దయామయుడు, కరుణామయుడు. సర్వ లోకాలకు ప్రభువైన అల్లాహ్‌కే సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు. ఆరాధనకు అర్హులైన వారు అల్లాహ్ తప్ప ఎవరూ లేరని, ఆయనకు ఎటువంటి భాగస్వాములు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన దాసుడు మరియు ప్రవక్త అని, అలాగే ఆయన కుటుంబం మరియు సహచరులందరిపై శాంతి కలుగుగాక అని నేను సాక్ష్యమిస్తున్నాను.
(అల్లాహుమ్మ లా ఇల్మ లనా ఇల్లా మా అల్లంతనా. అల్లాహుమ్మ అల్లిమ్నా మా యన్ఫఉనా, వన్ఫఅనా బిమా అల్లంతనా, వ జిద్నా ఇల్మన్, వ అస్లిహ్ లనా ష’ననా కుల్లహ్, వ లా తకిల్నా ఇలా అన్ఫుసినా తర్ఫత ఐన్).
“ఓ అల్లాహ్, నువ్వు మాకు నేర్పించినది తప్ప మాకు వేరే జ్ఞానం లేదు. ఓ అల్లాహ్, మాకు ప్రయోజనం చేకూర్చే దానిని మాకు నేర్పించు, నువ్వు మాకు నేర్పించిన దాని ద్వారా మాకు లాభం చేకూర్చు, మా జ్ఞానాన్ని పెంపొందించు. మా వ్యవహారాలన్నింటినీ చక్కదిద్దు, కంటి రెప్పపాటు కాలం కూడా మమ్మల్ని మా మానాన వదిలేయకు.“
గౌరవనీయ సోదరులారా, మనం ఒక పవిత్ర మాసం మరియు ఒక గొప్ప కాలం ముంగిట ఉన్నాము. దాని రోజులు సమీపిస్తున్నాయి, ఆ నెల తనతో పాటు గొప్ప పుణ్యాలు మరియు అపారమైన ఆశీర్వాదాలను తీసుకువస్తోంది. అందులో పాప క్షమాపణ, చెడు కర్మల ప్రాయశ్చిత్తం మరియు నరకాగ్ని నుండి విముక్తి ఉన్నాయి. కాబట్టి ప్రతి ముస్లిం ఈ మాసం కోసం సత్సంకల్పంతో, మంచి ప్రణాళికతో, ఉన్నత ఆశయాలతో, దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితో మరియు ఈ పవిత్ర మాసపు పగలు మరియు రాత్రులను సద్వినియోగం చేసుకోవడానికి కృషి మరియు శ్రద్ధతో సిద్ధంగా ఉండటం అవసరం. సుబ్హానల్లాహ్! ముస్లింలు దాని రాకతో ఒకరినొకరు అభినందించుకుంటున్నారే తప్ప, అది కొద్ది క్షణాలే ఉంటుందని, ఆ తర్వాత ఈ గొప్ప కాలానికి వీడ్కోలు పలుకుతామని గ్రహించడం లేదు. అది వచ్చినంత వేగంగానే వెళ్లిపోతుంది.
మనం గత రంజాన్‌ను పెద్దలు, యువకులు, పురుషులు మరియు స్త్రీలతో కలిసి జరుపుకున్నాము. అయితే మరణం వారికి మరియు ఈ నెలకు మధ్య అడ్డుగా వచ్చింది, వారిని ఈ నెల వరకు చేరుకోకుండా ఆపింది. దీనిని బట్టి, ఒక దాసుడు ఈ శుభ మాసాన్ని మరియు ఈ గొప్ప కాలాన్ని చేరుకోవడం గొప్ప అదృష్టంగా (విజయంగా) పరిగణించబడుతుంది.
మన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ నెల గొప్ప ప్రాముఖ్యత, ఉన్నత హోదా మరియు విశిష్ట స్థానం కారణంగా దీని రాక గురించి తన సహచరులకు శుభవార్త అందించేవారు. “ఇదిగో రంజాన్. ఇది మీ వద్దకు వచ్చింది.” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనేవారు.
“ఇదిగో రంజాన్. ఇది మీ వద్దకు వచ్చింది. స్వర్గపు ద్వారాలు తెరుచుకుంటాయి. నరకపు ద్వారాలు మూసివేయబడతాయి. మరియు షైతాన్లు సంకెళ్లతో బంధించబడతారు.”
“మరియు ప్రతి రాత్రి ఒక పిలుపునిచ్చేవాడు (దూత) ఇలా ప్రకటిస్తాడు, ‘ఓ మంచిని కోరుకునేవాడా, ముందుకు రా! ఓ చెడును కోరుకునేవాడా, ఆగు! అల్లాహ్ నరకాగ్ని నుండి విముక్తి ప్రసాదించేవారు చాలా మంది ఉన్నారు – మరియు ఇది ప్రతి రాత్రి జరుగుతుంది.”
ఈ పవిత్ర మాసానికి ఉన్న ఈ గొప్ప సుగుణాలు, దీనిని చేరుకోవాలని, దీని ప్రజలలో ఒకరిగా ఉండాలని, దీని మంచితనం మరియు ఆశీర్వాదాలను పొందడంలో విజయం సాధించాలని హృదయాలలో కోరికను రేకెత్తిస్తాయి. ఈ నెల కోసం సన్నద్ధం కావడం అంటే, పైన పేర్కొన్నట్లుగా, సత్కార్యాలు మరియు ఆరాధనలు చేయడానికి, అల్లాహ్‌కు సామీప్యాన్ని పొందడానికి మరియు ఆత్మను దానిపై నిలబెట్టడానికి సత్సంకల్పం మరియు దృఢ నిశ్చయం కలిగి ఉండటం.
ఇక్కడ తెలుసుకోవలసిన ఆవశ్యకత ఏమిటంటే, ఇస్లాం యొక్క శత్రువులు ఈ నెల యొక్క ప్రాముఖ్యతను మరియు దాని గొప్ప స్థానాన్ని గ్రహించారు. అందుకే, ఈ నెల రాకముందే, ముస్లిం యువతను మరియు వారి పిల్లలను ఈ నెల సుగుణాల నుండి ఎలా దూరం చేయాలా అని వారు కుట్రలు మరియు ప్రణాళికలు రచిస్తారు. దీని కారణంగా, రంజాన్ కాని సమయాల్లో కనిపించని విధంగా వినోదం, సినిమాలు మరియు కాలక్షేపాలు ఈ సమయంలో విపరీతంగా పెరుగుతాయి. కొన్ని చోట్ల ప్రజలు వినోదం మరియు ఆటల సీజన్‌లోకి ప్రవేశించారేమో అనిపించేంతగా పరిస్థితి ఉంటుంది. చాలా మంది యువత దృష్టి ఈ వినోద సాధనాలు, ఆటలు మరియు రంజాన్ కంటే కొన్ని నెలల ముందే సిద్ధం చేయబడిన సినిమాల వైపు మళ్ళించబడుతుంది. తద్వారా యువత ఈ గొప్ప నెల యొక్క మంచితనాన్ని పొందకుండా కోల్పోవాలని వారి ఉద్దేశ్యం.
“ఎవరైతే రంజాన్ నెలలో విశ్వాసంతో మరియు ప్రతిఫలాన్ని ఆశిస్తూ రాత్రి పూట ప్రార్థన (తరావీహ్) చేస్తారో, వారి గత పాపాలన్నీ క్షమించబడతాయి.” [సహీహ్ అల్-బుఖారీ: 37, సహీహ్ ముస్లిం: 759]
ముస్లింలు ఈ క్షమాపణను పొందాలని ఇస్లాం ధర్మ శత్రువులు కోరుకోరు. వారు ముస్లింలు లైలతుల్-ఖద్ర్ (ఘనత గల రాత్రి) ని కూడా కోల్పోవాలని కోరుకుంటారు. అల్లాహ్ ఆ రాత్రి గొప్పతనాన్ని మరియు వ్యవహారాన్ని నొక్కిచెప్పాడు.
﴾وَمَا أَدْرَاكَ مَا لَيْلَةُ الْقَدْرِ * لَيْلَةُ الْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ﴿ (వ మా అద్రాక మా లైలతుల్-ఖద్ర్. లైలతుల్-ఖద్రి ఖైరున్ మిన్ అల్ఫి షహర్). (మరియు ఘనత గల ఆ రాత్రి ఏమిటో నీకేమి తెలుసు? ఘనత గల ఆ రాత్రి వెయ్యి నెలల కంటే ఉత్తమమైనది). (అల్-ఖద్ర్: 2,3)
అంటే ఆ రాత్రిలో చేసే ఆరాధన వెయ్యి నెలలు (సుమారు 83 సంవత్సరాల 4 నెలలు) ఆరాధన చేయడం కంటే గొప్పది. వెయ్యి నెలలు అంటే, లైలతుల్-ఖద్ర్ కాకుండా ఎనభై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం. లైలతుల్-ఖద్ర్ ఒక్కటే, అది లేకుండా గడిపే ఎనభై సంవత్సరాల కంటే ఉత్తమమైనది.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు,
(أَعْمَارُ أُمَّتِي مَا بَيْنَ السِّتِّينَ إِلَى السَّبْعِينَ) (అ’మారు ఉమ్మతీ మా బైన అస్-సిత్తీన ఇల అస్-సబ్ఈన్). “నా ఉమ్మత్ (సమూహం) యొక్క ఆయుష్షు అరవై నుండి డెబ్బై సంవత్సరాల మధ్య ఉంటుంది.” [సునన్ అత్-తిర్మిదీ: 3550, సిల్సిలా అస్-సహీహా: 757 – షేక్ అల్-అల్బానీ: సహీహ్]
దీని అర్థం; ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఉమ్మత్ యొక్క సగటు ఆయుష్షు కంటే ఒక్క రాత్రి (లైలతుల్ ఖద్ర్) ఉత్తమమైనది.
అయినప్పటికీ, కొంతమంది ముస్లింలు రంజాన్ రాత్రులను, చివరకి లైలతుల్-ఖద్ర్ అని భావించబడే రాత్రులను కూడా వృధాగా గడపడం మీరు చూస్తారు. వారికి దాని ప్రాముఖ్యత తెలియదు, దాని ఉన్నత స్థానాన్ని వారు అర్థం చేసుకోరు, మరియు దాని గొప్పతనాన్ని వారు అనుభవించలేరు. కాబట్టి వారు దానిని ఇతర సాధారణ రాత్రుల వలె గడుపుతారు. అల్లాహ్ సాక్షిగా, ఇది ఒక గొప్ప విపత్తు; కాదు, ఇది ఒక పెద్ద నష్టం (అదృష్టాన్ని కోల్పోవడం).
మన గౌరవనీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:
అంటే, ఒక వ్యక్తి రంజాన్‌ను పొందుతాడు, పశ్చాత్తాపానికి, అల్లాహ్ వైపు మళ్ళడానికి మరియు అల్లాహ్ విధేయత వైపు తిరగడానికి ఆత్మను ప్రేరేపించే ఈ గొప్ప మాసాన్ని చేరుకుంటాడు. అది మంచి వైపు, ఆరాధనలో పోటీ పడటానికి మరియు విధేయత చూపడంలో తొందరపడటానికి ఆత్మకు శక్తినిస్తుంది. కానీ ఆ వ్యక్తి తన అజాగ్రత్త, వినోదం మరియు తిరస్కరణలో మునిగిపోతాడు. నిశ్చయంగా ఈ నెల వచ్చి వెళ్లిపోతుంది, కానీ అతను మాత్రం అజాగ్రత్త మరియు నష్టంలోనే ఉండిపోతాడు.
కాబట్టి ముస్లింలు ముందుగా ఈ నెల ప్రాముఖ్యతను మరియు దాని గొప్ప స్థానాన్ని గుర్తించడం విధి. అతను లాభం మరియు సంపద కోసం ఒక గొప్ప సీజన్‌లోకి ప్రవేశించాడని గ్రహించాలి. ప్రాపంచిక (దునియా) వ్యాపారుల దృష్టికోణం నుండి చూడండి; వారు ధనార్జన కోసం తమ ప్రయత్నాలను ఎలా చేస్తారో, లాభదాయకమైన వ్యాపార సీజన్లకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో గమనించండి. ఎక్కువ లాభం పొందడానికి దూర దేశాలకు ప్రయాణించవలసి వస్తే, వారు ప్రయాణిస్తారు. ఇది రంజాన్ అనే గొప్ప నెల యొక్క పవిత్ర సీజన్. పరలోకం (ఆఖిరత్) కోసం వ్యాపారం చేయడానికి ఇది గొప్ప సీజన్లలో ఒకటి.
కాబట్టి ముస్లిం ఈ నెల కోసం తనను తాను సిద్ధం చేసుకోవడం విధి, తద్వారా అతను దీనిని సద్వినియోగం చేసుకుంటాడు మరియు తన కోసం ఒక మంచి, ప్రయోజనకరమైన ప్రణాళికను రూపొందించుకుంటాడు. ఒకవేళ అతను ప్రణాళిక వేసుకుంటే, దానికి కట్టుబడి ఉంటాడు. పూర్వీకులలో (సలఫ్) ఒకరు రంజాన్ వచ్చినప్పుడు వేసుకున్న ప్రణాళికకు ఉదాహరణ చూడండి. ఆయన ఇలా అన్నారు, “ఇది కేవలం ప్రజలకు ఆహారం ఇవ్వడానికి మరియు ఖురాన్ చదవడానికి మాత్రమే.” ఇది రంజాన్ నెలలో ఆయన తన కోసం వేసుకున్న ప్రణాళిక.
మరి రంజాన్ ప్రవేశించినప్పుడు, మీరు ఏమి చేస్తారు? మీ లక్ష్యాలను మరియు మీ పనులను నిర్ణయించుకోండి. మీ సమయాన్ని క్రమబద్ధీకరించుకోండి. తరావీహ్ ప్రార్థనను మరియు ఖియామ్ అల్-లైల్ (రాత్రి ప్రార్థన)ను వదులుకోవద్దు. ఉపవాస సమయంలో అల్లాహ్ ను ఎక్కువగా స్మరించడం (జిక్ర్) మానేయకండి. అల్లాహ్ వద్ద ప్రతిఫలం విషయంలో ఉపవాసం ఉండేవారిలో గొప్పవారు, తమ ఉపవాస సమయంలో ఎక్కువగా అల్లాహ్ ను స్మరించేవాళ్ళు.
ఎవరైతే పగటిపూట ఆహారం, పానీయాలు మరియు ఉపవాసాన్ని భంగపరిచే ఇతర విషయాల నుండి దూరంగా ఉండి ఉపవాసం ఉంటారో, కానీ ఉదాహరణకు, ఫజర్ నుండి జుహర్ వరకు నిద్రపోతారో, అతను తన ఉపవాస సమయాన్ని ఖురాన్ పఠనంలో గడిపే వ్యక్తితో సమానమా? వారిద్దరి ఉపవాసం ఒకటేనా? వారిద్దరి ఉపవాసం సమానమా? కాదు, అల్లాహ్ సాక్షిగా కాదు! అవును, ఈ ఉపవాస వ్యక్తి విధిని నెరవేరుస్తున్నాడు మరియు అవతలి వ్యక్తి కూడా నెరవేరుస్తున్నాడు, కానీ వారిద్దరూ సమానం కాదు.
జ్ఞానుల (పండితుల) వద్ద ఉన్న ఒక సూత్రం ఏమిటంటే, ప్రతి విధేయతా చర్యలో గొప్ప ప్రతిఫలం పొందేవారు, (ఆ పని చేస్తున్నప్పుడు) అల్లాహ్‌ను ఎక్కువగా స్మరించేవారు. ఉపవాసం ఉండేవారిలో గొప్ప ప్రతిఫలం పొందేవారు ఉపవాస సమయంలో అల్లాహ్‌ను ఎక్కువగా స్మరించేవారు. ‘ఉమ్రా’ చేసేవారిలో గొప్ప ప్రతిఫలం పొందేవారు ‘ఉమ్రా’ సమయంలో అల్లాహ్‌ను ఎక్కువగా స్మరించేవారు. హజ్ చేసేవారిలో గొప్ప ప్రతిఫలం పొందేవారు హజ్ చేస్తున్నప్పుడు అల్లాహ్‌ను ఎక్కువగా స్మరించేవారు. ప్రతి ఆరాధన విషయంలోనూ ఇదే వర్తిస్తుంది, ఎందుకంటే అల్లాహ్ స్మరణ అనేది విధేయత యొక్క సారాంశం మరియు ఆరాధనల యొక్క మూలం. ఉపవాసం, హజ్, సలాహ్ (నమాజ్) మరియు ఇతర ఆరాధనలు అల్లాహ్ స్మరణను స్థాపించడానికి మాత్రమే నియమించబడ్డాయి.
కాబట్టి ఒక వ్యక్తి ఈ గొప్ప నెల మరియు పవిత్ర సీజన్ కోసం తనకంటూ ఒక ప్రణాళికను రూపొందించుకుంటే, అతను ఈ నెల కోసం తాను ఏర్పాటు చేసుకున్న ప్రణాళికకు కట్టుబడి ఉండటంలో శ్రద్ధ వహిస్తాడు.
ఆత్మ తన ప్రయత్నంతో పాటు, ప్రభువు (అల్లాహ్) సహాయాన్ని కోరడం ద్వారా చాలా మేలు పొందుతుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:
(احْرِصْ عَلَى مَا يَنْفَعُكَ، وَاسْتَعِنْ بِاللهِ وَلَا تَعْجِزْ) (ఇహ్రిస్ అలా మా యన్ఫఉక, వస్తఇన్ బిల్లాహి వ లా తఅజిజ్).
“మీకు ప్రయోజనం చేకూర్చే దానిపై శ్రద్ధ వహించండి, అల్లాహ్ సహాయం కోరండి మరియు అలసిపోకండి (నిర్లక్ష్యం చేయకండి).” [సహీహ్ ముస్లిం: 2664]
“రంజాన్ నెల వచ్చింది” అనే శీర్షికతో నా ఒక చిన్న పుస్తకం ముద్రించబడింది. ఈ పవిత్ర మాసం సన్నాహాలకు సంబంధించిన కొన్ని విషయాలను అందులో వివరించాను. బహుశా దానిని చదవడం మరియు చూడటం ద్వారా, అల్లాహ్ అనుమతితో, ఈ గొప్ప మరియు పవిత్ర సీజన్‌కు బాగా సిద్ధం కావడానికి సహాయపడుతుంది.
నేను గొప్ప సింహాసనానికి ప్రభువైన అల్లాహ్‌ను, ఆయన అందమైన పేర్లు మరియు ఉన్నత గుణాల ద్వారా వేడుకుంటున్నాను.. మనల్ని రంజాన్‌కు చేర్చమని, దాని పగలు మరియు రాత్రుల ఫలాలను పొందడంలో విజయం ప్రసాదించమని కోరుతున్నాను. అందులో ఆయన స్మరణపై, ఆయనకు కృతజ్ఞత చూపడంపై మరియు మన ఆరాధనను పరిపూర్ణం చేసుకోవడంపై మనకు సహాయం చేయమని, మన వ్యవహారాలన్నింటినీ చక్కదిద్దుమని మరియు కంటి రెప్పపాటు కాలం కూడా మమ్మల్ని మా మానాన వదిలేయవద్దని కోరుతున్నాను.
నేను అల్లాహ్‌ను కోరుతున్నాను, ఈ సీజన్‌ను మనకు మంచితనం, సుగుణాలు మరియు సామీప్యానికి మార్గంగా చేయమని, దాని మేలు మరియు ఆశీర్వాదాలను మాకు ప్రసాదించమని. మనందరినీ ఈ గొప్ప సీజన్‌లో నరకాగ్ని నుండి విముక్తి పొందిన వారిలో చేర్చమని మరియు మన వ్యవహారాలన్నింటినీ చక్కదిద్దుమని కోరుతున్నాను. నిశ్చయంగా ఆయన సర్వము వినేవాడు మరియు అత్యంత సమీపంలో ఉన్నవాడు.
(అల్లాహుమ్మ అస్లిహ్ లీ దీనీ అల్లజీ హువ ఇస్మతు అమ్రీ, వ అస్లిహ్ లీ దున్యాయ అల్లతీ ఫీహా మఆషీ, వ అస్లిహ్ లీ ఆఖిరతీ అల్లతీ ఫీహా మఆదీ, వజ్అలిల్-హయాత జియాదతన్ లీ ఫీ కుల్లి ఖైర్, వజ్అలిల్-మౌత రాహతన్ లీ మిన్ కుల్లి షర్).
“ఓ అల్లాహ్, నా వ్యవహారాలకు రక్షణ అయిన నా ధర్మాన్ని నా కోసం చక్కదిద్దు. నా జీవనం ఉన్న నా ఇహలోక జీవితాన్ని నా కోసం చక్కదిద్దు. నా పరలోకాన్ని నా కోసం చక్కదిద్దు, అక్కడే నా అంతిమ మజిలీ ఉంది. నా జీవితాన్ని ప్రతి మంచి పనిలో వృద్ధికి మూలంగా చేయి మరియు నా మరణాన్ని ప్రతి చెడు నుండి నాకు ఉపశమనంగా చేయి.” [సహీహ్ ముస్లిం: 2720]
(అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తఖ్వాహా, వ జక్కిహా అంత ఖైరు మన్ జక్కాహా, అంత వలియ్యుహా వ మౌలాహా. అల్లాహుమ్మ తఖబ్బల్ తౌబతనా, వగ్సిల్ హౌబతనా, వ సబ్బిత్ హుజ్జతనా, వహ్ది ఖులూబనా, వ సద్దిద్ అల్సినతనా, వస్లుల్ సఖీమత సుదూరినా).
“ఓ అల్లాహ్, నా ఆత్మకు దైవభీతిని (తఖ్వా) ప్రసాదించు మరియు దానిని పరిశుద్ధం చేయి, దానిని పరిశుద్ధం చేసేవారిలో నువ్వే ఉత్తముడివి. నువ్వే దాని సంరక్షకుడివి మరియు యజమానివి. ఓ అల్లాహ్, మా పశ్చాత్తాపాన్ని స్వీకరించు, మా పాపాలను కడిగివేయి, మా సాక్ష్యాన్ని దృఢపరచు, మా హృదయాలకు మార్గనిర్దేశం చేయి, మా నాలుకలను సరిచేయి మరియు మా హృదయాల నుండి ద్వేషాన్ని తొలగించు.” [సహీహ్ ముస్లిం: 2722]
అల్లాహుమ్మఖ్సిమ్ లనా మిన్ ఖష్యతిక మా తహూలు బిహీ బైననా వ బైన మఆసీక్, వ మిన్ తాఅతిక మా తుబల్లిగునా బిహీ జన్నతక్, వ మినల్ యఖీని మా తుహవ్విను బిహీ అలై నా మసాఇబ్ అద్-దునియా.
ఓ అల్లాహ్! మాకు మరియు నీకు అవిధేయత చూపడానికి మధ్య అడ్డుగా నిలిచేంత భయాన్ని మాకు ప్రసాదించు; మమ్మల్ని నీ స్వర్గానికి చేర్చేంత నీ విధేయతను మాకు ప్రసాదించు; మరియు ఈ ప్రపంచంలోని ఆపదలను సులభంగా భరించేంత నమ్మకాన్ని (యకీన్) మాకు ప్రసాదించు.
అల్లాహుమ్మ మత్తిఅనా బి-అస్మాఇనా వ అబ్సారినా వ ఖువ్వతినా మా అహ్యైతనా, వజ్అల్హుల్-వారిస మిన్నా, వజ్అల్ స’రనా అలా మన్ జలమనా, వన్సుర్నా అలా మన్ ఆదానా, వ లా తజ్అల్ ముసీబతనా ఫీ దీనినా, వ లా తజ్అల్ అద్-దునియా అక్బర హమ్మి నా, వ లా మబ్లగ ఇల్మినా, వ లా తుసల్లిత్ అలై నా మన్ లా యర్హమునా.
ఓ అల్లాహ్! నువ్వు మమ్మల్ని బ్రతికించినంత కాలం మా వినికిడి, మా చూపు మరియు మా శక్తిని అనుభవించేలా చేయి, మరియు వాటిని మా వారసులుగా చేయి (చివరి వరకు కాపాడు). మాపై అన్యాయం చేసేవారిపై మా ప్రతీకారం తీర్చుకో, మా పట్ల శత్రుత్వం వహించే వారిపై మాకు సహాయం చేయి. మా ధర్మంలో మాకు ఎటువంటి పరీక్ష పెట్టకు; ప్రాపంచిక విషయాలను మా ప్రధాన చింతగా లేదా మా జ్ఞానానికి అవధిగా చేయకు, మరియు మాపై జాలి చూపని వారిని మాపై పాలకులుగా నియమించకు!
సుబ్ హానక అల్లాహుమ్మ వ బిహందిక, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత, అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.
ఓ అల్లాహ్, నీవు సర్వ లోపాలకు అతీతుడవు మరియు ప్రశంసలన్నీ నీకే. ఆరాధనకు అర్హులైన వారు నీవు తప్ప ఎవరూ లేరని నేను సాక్ష్యమిస్తున్నాను. నేను నీ క్షమాపణ కోరుతున్నాను మరియు పశ్చాత్తాపంతో నీ వైపు మళ్ళుతున్నాను.
ఓ అల్లాహ్, నీ దాసుడు మరియు ప్రవక్త అయిన మన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై మరియు వారి కుటుంబం మరియు సహచరులపై నీ ఆశీర్వాదాలు మరియు శాంతిని కురిపించు.
అరబ్బీ / ఇంగ్లీష్ తెలిసిన వారు క్రింది వీడియో చూసి లాభం పొందండి :
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ఆడియోలో వక్త ఇస్లామిక్ వారసత్వ చట్టం (ఫరాయిజ్) గురించి వివరిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా పురుషులు మరియు స్త్రీలలో ఎవరు వారసులుగా ఉంటారో గుర్తు చేస్తూ, తండ్రి మరియు తాత యొక్క వాటాలను పునశ్చరణ (recap) చేశారు. ఆ తర్వాత, సూరా అన్-నిసాలోని 12వ ఆయతు ఆధారంగా భార్యాభర్తల వాటాల గురించి సవివరంగా చర్చించారు. సంతానం ఉన్నప్పుడు మరియు లేనప్పుడు భర్తకు (1/2, 1/4) మరియు భార్యకు (1/4, 1/8) ఆస్తిలో ఎంత భాగం దక్కుతుందో స్పష్టం చేశారు. చివరగా, జ్ఞానాన్ని రాతపూర్వకంగా భద్రపరచుకోవడం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు.
వారసత్వపు అర్హతలు మరియు పరిమితులు
ఇస్లామిక్ షరియత్ ప్రకారం మొత్తం 15 మంది పురుషులకు మరియు 10 మంది స్త్రీలకు వారసులు అయ్యే హక్కు ఉంది. అయితే, గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి సందర్భంలోనూ వీరందరికీ ఆస్తి దక్కదు. కేవలం ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఉన్న నిర్దిష్ట బంధువులకు మాత్రమే వారసత్వపు హక్కు ఉంటుంది. ఈ లిస్ట్‌లో లేని ఇతర బంధువులకు ఆస్తిలో వాటా ఉండదు. అలాగే, ఈ అర్హత కలిగిన వారు కూడా కొన్నిసార్లు వారసులు అవుతారు, మరికొన్ని సందర్భాల్లో కాలేరు. కొన్నిసార్లు వారికి ఎక్కువ వాటా వస్తే, మరికొన్నిసార్లు తక్కువ వాటా వస్తుంది.
తండ్రి వాటా – మూడు పరిస్థితులు (పునశ్చరణ)
గత తరగతుల్లో మనం తండ్రి మరియు తాతగారి వాటాల గురించి తెలుసుకున్నాము. తండ్రికి ఆస్తి సంక్రమించే విషయంలో మూడు ప్రధాన పరిస్థితులు ఉన్నాయి:
మొదటి పరిస్థితి (సుదుస్ – 1/6): మరణించిన వ్యక్తికి కుమారుడు లేదా మనుమడు (మగ సంతానం) ఉన్నప్పుడు, తండ్రికి ఆస్తిలో ఆరవ వంతు (1/6) దక్కుతుంది.
రెండవ పరిస్థితి (సుదుస్ + అసబా): మరణించిన వ్యక్తికి కేవలం ఆడ సంతానం (కూతురు లేదా మనుమరాలు) మాత్రమే ఉండి, మగ సంతానం లేనప్పుడు, తండ్రికి నిర్ణీత ఆరవ వంతు (1/6) దక్కడమే కాకుండా, మిగిలిన వారసులకు పంచగా మిగిలిన ఆస్తి (అసబా) కూడా తండ్రికి చెందుతుంది.
మూడవ పరిస్థితి (కేవలం అసబా): మరణించిన వ్యక్తికి అసలు సంతానమే (ఆడ లేదా మగ) లేనప్పుడు, ఇతర నిశ్చిత వాటాదారులకు ఇవ్వగా మిగిలిన ఆస్తి మొత్తం తండ్రికి దక్కుతుంది.
తాత వాటా – నాలుగు పరిస్థితులు
తాతగారికి సంబంధించిన నిబంధనలు కూడా తండ్రికి వర్తించే నిబంధనల లాగానే ఉంటాయి. ఆయనకు మొత్తం నాలుగు పరిస్థితులు ఉన్నాయి:
మరణించిన వ్యక్తికి తండ్రి లేనప్పుడు, పైన పేర్కొన్న తండ్రికి వర్తించే మూడు నిబంధనలే తాతగారికి కూడా యథాతథంగా వర్తిస్తాయి.
నాలుగవ పరిస్థితి: ఒకవేళ మరణించిన వ్యక్తి తండ్రి బ్రతికి ఉంటే, అప్పుడు తాతగారికి ఆస్తిలో ఎటువంటి వాటా దక్కదు (తండ్రి అడ్డుపడతాడు కాబట్టి).
భార్యాభర్తల వాటాలు (సూరా అన్-నిసా 4:12 ఆధారంగా)
ఈరోజు పాఠ్యాంశం భార్యాభర్తల వాటాల గురించి. ఖురాన్‌లోని సూరా అన్-నిసా, 12వ ఆయతులో అల్లాహ్ దీనిని స్పష్టంగా వివరించాడు.
“మీ భార్యలకు సంతానం లేనిపక్షంలో వారు వదలివెళ్ళిన ఆస్తిలో సగభాగం మీది. ఒకవేళ వారికి సంతానముంటే వారు విడిచిపెట్టిన ఆస్తిలో నాల్గోభాగం మీకు చెందుతుంది. వారు వ్రాసిపోయిన వీలునామాను అమలుపరచిన మీదట, లేదా వారు చేసిన అప్పుల్ని తీర్చిన మీదటే ఈ పంపకం జరగాలి. మీకు పిల్లలు లేని పక్షంలో మీరు వదలిపోయే ఆస్తిలో మీ భార్యలకు నాల్గో భాగం లభిస్తుంది. ఒకవేళ మీకు పిల్లలుంటే అప్పుడు మీరు వదలివెళ్ళే ఆస్తిలో మీ భార్యలకు ఎనిమిదో వంతు మాత్రమే లభిస్తుంది. మీరు వ్రాసి వెళ్ళిన వీలునామాను అమలు పరచి, లేదా మీరు చేసివెళ్ళిన అప్పుల్ని తీర్చిన తరువాతే మిగిలిన ఆస్తిలో పంపకాలు జరుగుతాయి.“
భర్త వాటా – రెండు పరిస్థితులు:
సగభాగం (నిస్ఫ్ – 1/2): చనిపోయిన భార్యకు ఎటువంటి సంతానం లేనప్పుడు (ఈ భర్త ద్వారా గానీ లేదా గతంలో వేరే భర్త ద్వారా గానీ పిల్లలు లేకపోతే), భర్తకు ఆమె ఆస్తిలో సగభాగం (1/2) లభిస్తుంది.
నాలుగవ వంతు (రుబు – 1/4): ఒకవేళ చనిపోయిన భార్యకు సంతానం ఉంటే (మగ లేదా ఆడ పిల్లలు ఎవరైనా సరే), అప్పుడు భర్తకు ఆమె ఆస్తిలో నాలుగవ వంతు (1/4) మాత్రమే దక్కుతుంది.
భార్య వాటా – రెండు పరిస్థితులు:
నాలుగవ వంతు (రుబు – 1/4): చనిపోయిన భర్తకు ఎటువంటి సంతానం లేనప్పుడు (ఈ భార్య ద్వారా గానీ లేదా వేరే భార్య ద్వారా గానీ పిల్లలు లేకపోతే), భార్యకు భర్త ఆస్తిలో నాలుగవ వంతు (1/4) లభిస్తుంది.
ఎనిమిదవ వంతు (సుమున్ – 1/8): ఒకవేళ చనిపోయిన భర్తకు సంతానం ఉంటే (మగ లేదా ఆడ పిల్లలు ఎవరైనా సరే), అప్పుడు భార్యకు భర్త ఆస్తిలో ఎనిమిదవ వంతు (1/8) దక్కుతుంది.
సాధారణ సూత్రం: ఇస్లామిక్ వారసత్వ చట్టంలో “ఆడవారి కంటే మగవారికి రెట్టింపు వాటా” అనే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. భర్తకు 1/2 వచ్చిన చోట భార్యకు 1/4 వస్తుంది; భర్తకు 1/4 వచ్చిన చోట భార్యకు 1/8 వస్తుంది.
జ్ఞానాన్ని భద్రపరచుకోవడం
మనం విన్న విషయాలు కేవలం జ్ఞాపకశక్తిపై ఆధారపడితే మర్చిపోయే ప్రమాదం ఉంది. మన పూర్వీకులు (సలఫ్) “జ్ఞానాన్ని రాత ద్వారా బంధించండి” అని చెప్పేవారు. మనిషి మెమొరీ మోసం చేయవచ్చు, కానీ రాసిపెట్టుకున్న జ్ఞానం స్థిరంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. పుస్తకాల్లోనే కాకుండా మొబైల్ నోట్స్, గూగుల్ డ్రైవ్ లేదా ఈమెయిల్స్‌లో ఈ ముఖ్యమైన పాయింట్లను, షరతులను రాసి భద్రపరచుకుంటే, ఫోన్ లేదా ల్యాప్‌టాప్ పోయినా ఆ జ్ఞానం మనకు తిరిగి లభిస్తుంది. కాబట్టి, ఈ వారసత్వ విద్యను శ్రద్ధగా నేర్చుకుని, ముఖ్యమైన పాయింట్లను రాసి పెట్టుకోవడం ద్వారా మనం దీనిని సులభంగా గుర్తుంచుకోవచ్చు మరియు అవసరమైనప్పుడు ఆచరించవచ్చు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ఆడియోలో ప్రసంగీకులు ఇస్లాంలో వారసత్వపు హక్కులు, ముఖ్యంగా స్త్రీల వాటాలు మరియు ఖుర్ఆన్ లో నిర్ణయించబడిన నిర్దిష్ట వాటాల (అల్ ఫురూజుల్ ముఖద్దర) గురించి వివరిస్తున్నారు. గత పాఠంలో పురుష వారసుల గురించి చర్చించిన తర్వాత, ఇందులో స్త్రీలలో వారసులుగా ఎవరు ఉంటారో (కూతురు, మనవరాలు, తల్లి, అమ్మమ్మ/నానమ్మ, సోదరీమణులు, భార్య తదితరులు) పది రకాల వారిని పేర్కొన్నారు. అలాగే, అల్లాహ్ ఖుర్ఆన్ లో ఆరు రకాల నిర్ణీత వాటాలను (సగం, పావు వంతు, ఎనిమిదవ వంతు, 2/3 వంతు, 1/3 వంతు, ఆరవ వంతు) విధించారని, వీటిని ఎవరికి ఎలా పంచుతారో క్లుప్తంగా పరిచయం చేశారు. చివరగా, కొడుకుకు నిర్ణీత వాటా ఉండదని, అతను ‘అసబ’ (మిగిలిన ఆస్తిని తీసుకునేవాడు) అని వివరించారు.
[Source of the image: Inheritance Regulations &. Exhortations – English , by Muhammad al-Jilbaly)
పురుష వారసుల పునశ్చరణ
గత పాఠంలో మనం పురుషులలో ఎవరెవరు వారసులవుతారో తెలుసుకున్నాం. మనం చూసిన జాబితా ప్రకారం.. కొడుకు, తండ్రి, తాత, సోదరుడు, బాబాయ్ (పినతండ్రి) వంటి బంధుత్వాలు ఇందులో ఉన్నాయి. ఈ బంధుత్వాలన్నీ మరణించిన వ్యక్తితో ముడిపడి ఉండాలి. అంటే మరణించిన వ్యక్తికి తండ్రి, మరణించిన వ్యక్తికి కొడుకు, లేదా మరణించిన వ్యక్తికి సోదరుడు అయి ఉండాలి. మరణించిన వ్యక్తితో ఈ సంబంధాలు ఉన్న పురుషులు మాత్రమే వారసులుగా పరిగణించబడతారు.
స్త్రీలలో వారసులు (అల్ వారిసాతు మినన్ నిసా)
ఇప్పుడు మనం ‘అల్ వారిసాతు మినన్ నిసా’ (స్త్రీలలో వారసులు) గురించి చర్చించుకుందాం.
అంటే చనిపోయిన వ్యక్తికి ఏయే బంధుత్వాలు కలిగిన స్త్రీలు ఆస్తిలో వారసులు అవుతారో మనం తెలుసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా, జాబితాలో ఉన్న బంధువులందరూ ఒకేసారి వారసులు కాలేరు. ప్రతి సందర్భంలోనూ అందరికీ వాటా దొరకదు. కానీ ఈ బంధుత్వాలన్నింటికీ వారసత్వపు అర్హత ఉంటుంది. కొన్నిసార్లు ఒక వారసుడు ఉండటం వల్ల వేరొకరికి వాటా దక్కకపోవచ్చు, లేదా వాటా తగ్గిపోవచ్చు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. మరణించిన వ్యక్తి ఆస్తిలో వారసత్వపు హక్కు కేవలం ఈ నిర్దిష్ట బంధుత్వాలకు మాత్రమే ఉంటుంది.
వారసురాళ్ళ జాబితా (10 రకాలు)
పురుషులలో 15 రకాల వారసులు ఉన్నట్లే, స్త్రీలలో 10 రకాల వారసులు ఉంటారు. ఆ పది మంది వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
అల్ బింత్ (Al-Bint): కూతురు.
బింతుల్ ఇబ్న్ (Bint al-Ibn): మనవరాలు (కొడుకు యొక్క కూతురు).
అల్ ఉమ్ (Al-Umm): తల్లి.
అమ్మమ్మ: తల్లి యొక్క తల్లి.
నానమ్మ: తండ్రి యొక్క తల్లి.
అల్ ఉఖ్త్ అష్-షకీఖ (Al-Ukht ash-Shaqiqah): సొంత సోదరి (అక్క లేదా చెల్లి).
అల్ ఉఖ్త్ లి-అబ్ (Al-Ukht li-Ab): తండ్రి తరఫు సోదరి (సవతి తల్లి కూతురు – తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు).
అల్ ఉఖ్త్ లి-ఉమ్ (Al-Ukht li-Umm): తల్లి తరఫు సోదరి (తల్లి ఒక్కటే కానీ తండ్రులు వేరు).
అజ్-జౌజ (Az-Zawjah): భార్య.
అల్ ముఅతిఖ (Al-Mu’tiqah): బానిసత్వాన్ని విముక్తి చేసిన యజమానురాలు.
పురుషులలో 15 మంది, స్త్రీలలో 10 మంది వారసులు ఉంటారు అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
వారసత్వ నియమాలు మరియు వాటాలు
మనం వారసులెవరో తెలుసుకున్నాం, ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు:
ఎవరెవరు వారసులవుతారు?
ఎవరు ఏ పరిస్థితుల్లో వారసులు అవుతారు?
ఖుర్ఆన్ లో అల్లాహ్ ఎవరికి ఎన్ని వాటాలను నిర్ణయించాడు?
ఒక వ్యక్తి వారసుడయ్యాడంటే అతనికి ఆస్తిలో ఎంత భాగం వస్తుంది అనేది ముఖ్యం. నాకు ఎంత వస్తుంది? నా సోదరుడికి ఎంత వస్తుంది? తల్లిదండ్రుల వాటా ఎంత? అనే విషయాలను అల్లాహ్ ఖుర్ఆన్ లో స్పష్టంగా వివరించాడు.
నిర్ణీత వాటాలు (అల్ ఫురూజుల్ ముఖద్దర)
ఖుర్ఆన్ లో అల్లాహ్ తబారక వ తాలా వారసత్వ పంపిణీ కోసం ఆరు రకాల నిర్దిష్ట వాటాలను నిర్ణయించారు. వీటిని అరబ్బీలో ‘అల్ ఫురూజుల్ ముఖద్దర’ అంటారు (నిర్ణీత వాటాలు). ఏ వారసుడికైనా సరే, ఈ ఆరు వాటాలలో ఏదో ఒక వాటా లభిస్తుంది. ఆ ఆరు వాటాలు ఇవే:
అన్-నిస్ఫ్ (An-Nisf – 1/2): సగం వాటా. అంటే ఆస్తిని రెండు సమాన భాగాలు చేసి, అర్హులైన వారికి ఒక భాగం ఇవ్వడం.
అర్-రుబుఅ (Ar-Rubu’ – 1/4): నాలుగవ వంతు. అంటే ఆస్తిని నాలుగు భాగాలు చేసి ఒక భాగం ఇవ్వడం.
అస్-సుమున్ (Ath-Thumun – 1/8): ఎనిమిదవ వంతు. అంటే ఆస్తిని ఎనిమిది భాగాలు చేసి, అర్హులైన వారికి ఒక భాగం ఇవ్వడం.
అస్-సులుసాన్ (Ath-Thuluthan – 2/3): మూడింట రెండు వంతులు. అంటే ఆస్తిని మూడు భాగాలు చేసి, అందులో రెండు భాగాలు ఇవ్వడం.
అస్-సులుస్ (Ath-Thuluth – 1/3): మూడవ వంతు. అంటే ఆస్తిని మూడు భాగాలు చేసి, ఒక భాగం ఇవ్వడం.
అస్-సుదుస్ (As-Sudus – 1/6): ఆరవ వంతు. అంటే ఆస్తిని ఆరు భాగాలు చేసి, ఒక భాగం ఇవ్వడం.
ఖుర్ఆన్ ప్రకారం వారసత్వ విద్యలో ఈ ఆరు వాటాలే ప్రధానమైనవి. ఎవరికి పంపిణీ చేసినా ఈ భిన్నాల (Fractions) ప్రకారమే వాటాలు వెళ్తాయి.
కొడుకు స్థానం (అసబ)
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఖుర్ఆన్ లో ‘కొడుకు’ (Son) కోసం పైన పేర్కొన్న విధంగా 1/2 లేదా 1/3 వంటి నిర్ణీత వాటా ఏదీ విధించబడలేదు. కొడుకును ‘అసబ’ (Asaba) అంటారు.
عَصَبَة (అసబ) మిగిలిన ఆస్తికి వారసుడు
అసబ అంటే.. నిర్ణీత వాటాలు కలిగిన వారసులకు (ఉదాహరణకు భార్య, తల్లిదండ్రులు వంటి వారికి) వారి వాటాలు ఇచ్చేసిన తర్వాత, మిగిలిన ఆస్తి ఎంతైతే ఉంటుందో, ఆ మొత్తాన్ని తీసుకునేవాడు అని అర్థం.
అల్లాహ్ కొడుకుకి “ఇంతే ఇవ్వాలి” అని నిర్దిష్టంగా చెప్పలేదు. మిగిలినదంతా కొడుకుకే చెందుతుంది. దీని గురించి ముందు ముందు పాఠాలలో మరింత వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఖుర్ఆన్ మరియు హదీసుల ప్రకారం ఈ ఆరు రకాల వాటాలు మాత్రమే ప్రామాణికం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగ భాగంలో, వక్త ఇస్లామిక్ షరియా ప్రకారం మరణించిన వ్యక్తి ఆస్తిలో హక్కుదారులుగా ఉండే 15 మంది పురుష వారసుల (అల్-వారిసూన్ మినర్ రిజాల్) గురించి సవివరంగా తెలియజేశారు. ఇందులో కొడుకు, మనవడు, తండ్రి, తాత, సోదరులు (సొంత, తండ్రి వైపు, తల్లి వైపు), వారి సంతానం, బాబాయిలు, మరియు భర్త వంటి బంధుత్వాలను అరబిక్ పరిభాషతో సహా వివరించారు. ఈ వారసుల ప్రాధాన్యత క్రమాన్ని మరియు ఏ సందర్భాల్లో ఎవరు వారసులు అవుతారో కూడా స్పష్టం చేశారు.
[Source of the image: Inheritance Regulations &. Exhortations – English , by Muhammad al-Jilbaly)
15 మంది పురుష వారసులు (అల్-వారిసూన్ మినర్ రిజాల్)
షరియా ప్రకారం, మరణించిన వ్యక్తి ఆస్తిలో వాటా పొందే అర్హత ఉన్న పురుషులు మొత్తం 15 మంది ఉన్నారు. వీరి వరుస క్రమం మరియు బంధుత్వాల వివరణ క్రింద ఇవ్వబడింది:
అల్-ఇబ్న్ (الِابْن) – కొడుకు: మరణించిన వ్యక్తి యొక్క సొంత కుమారుడు.
ఇబ్నుల్ ఇబ్న్ (ابْنُ الِابْن) – కొడుకు యొక్క కొడుకు (మనవడు): కేవలం కొడుకు వైపు మనవడు మాత్రమే. కూతురు వైపు మనవడు ఇందులో రాడు. (కొడుకు బ్రతికి లేనప్పుడు మనవడికి హక్కు వస్తుంది).
అల్-అబ్ (الْأَب) – తండ్రి: మరణించిన వ్యక్తి యొక్క తండ్రి.
అల్-జద్ / అబుల్ అబ్ (أَبُو الْأَب) – తాత (తండ్రి యొక్క తండ్రి): ఇక్కడ తండ్రి వైపు తాత మాత్రమే వస్తారు. తల్లి వైపు తాత (తల్లి తండ్రి) వారసుడు కాడు.
అల్-అఖ్ అష్-షకీక్ (الْأَخُ الشَّقِيق) – సొంత సోదరుడు: ఒకే తల్లి మరియు ఒకే తండ్రికి పుట్టిన సోదరుడు (అన్న లేదా తమ్ముడు).
అల్-అఖ్ లి-అబ్ (الْأَخُ لِأَب) – తండ్రి వైపు సోదరుడు: తండ్రి ఒక్కరే కానీ, తల్లులు వేరువేరుగా ఉన్న సోదరులు. (ఉదాహరణకు: తండ్రికి ఇద్దరు భార్యలు ఉండి, వేరే భార్య ద్వారా పుట్టిన కొడుకు).
అల్-అఖ్ లి-ఉమ్ (الْأَخُ لِأُم) – తల్లి వైపు సోదరుడు: తల్లి ఒక్కరే కానీ, తండ్రులు వేరువేరుగా ఉన్న సోదరులు. (ఉదాహరణకు: తల్లికి రెండవ పెళ్లి జరిగి, ఆ భర్త ద్వారా పుట్టిన కొడుకు).
ఇబ్నుల్ అఖ్ అష్-షకీక్ (ابْنُ الْأَخِ الشَّقِيق) – సొంత సోదరుని కొడుకు: సొంత అన్నయ్య లేదా తమ్ముడి కుమారుడు (మేనల్లుడు).
ఇబ్నుల్ అఖ్ లి-అబ్ (ابْنُ الْأَخِ لِأَب) – తండ్రి వైపు సోదరుని కొడుకు: తండ్రి వైపు సోదరుడికి పుట్టిన కుమారుడు. (గమనిక: తల్లి వైపు సోదరుని కుమారుడికి వారసత్వ హక్కు ఉండదు).
అల్-అమ్ అష్-షకీక్ (الْعَمُّ الشَّقِيق) – సొంత బాబాయి/పెదనాన్న: మరణించిన వ్యక్తి యొక్క తండ్రికి సొంత సోదరుడు (ఒకే తల్లిదండ్రులు).
అల్-అమ్ లి-అబ్ (الْعَمُّ لِأَب) – తండ్రి వైపు బాబాయి/పెదనాన్న: తండ్రికి సవతి సోదరుడు (తండ్రి ఒక్కరే, తల్లులు వేరు). (గమనిక: తండ్రికి తల్లి వైపు సోదరుడు అంటే మేనమామ, ఇక్కడ వారసుడు కాడు).
ఇబ్నుల్ అమ్ అష్-షకీక్ (ابْنُ الْعَمِّ الشَّقِيق) – సొంత బాబాయి కొడుకు: తండ్రి యొక్క సొంత సోదరుని కుమారుడు.
ఇబ్నుల్ అమ్ లి-అబ్ (ابْنُ الْعَمِّ لِأَب) – తండ్రి వైపు బాబాయి కొడుకు: తండ్రి యొక్క సవతి సోదరుని (తండ్రి వైపు) కుమారుడు.
అజ్-జౌజ్ (الزَّوْج) – భర్త: మరణించిన స్త్రీ యొక్క భర్త. వివాహ బంధం ఉన్నందున ఇతను వారసుడవుతాడు.
అల్-ముఅతిక్ (الْمُعْتِق) – బానిసకు విముక్తి కలిగించిన యజమాని: ఇస్లామిక్ చరిత్ర ప్రకారం, ఒక యజమాని తన బానిసకు స్వేచ్ఛను ప్రసాదిస్తే, ఆ విముక్తి పొందిన బానిస మరణించినప్పుడు అతనికి వేరే వారసులు ఎవరూ లేకపోతే, ఆస్తి అతనికి విముక్తిని ప్రసాదించిన మాజీ యజమాని (లేదా అతని పురుష వారసుల)కి చెందుతుంది.
ఈ 15 మంది పురుషులు ఇస్లామిక్ చట్టం ప్రకారం వారసత్వానికి అర్హులు. అయితే, వీరందరికీ ఒకేసారి ఆస్తి లభించదు. దగ్గరి బంధువులు ఉన్నప్పుడు (ఉదా: కొడుకు), దూరపు బంధువులు (ఉదా: మనవడు లేదా సోదరుడు) ఆస్తికి అనర్హులు అవుతారు. ఈ ప్రాధాన్యత క్రమాన్ని బట్టి ఆస్తి పంపకం జరుగుతుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఆస్తి వారసత్వం [PDF] [5 పేజీలు] – ఇస్లామీయ ఆరాధనలు [పుస్తకం] ఆస్తి పంపకానికి ప్రాథమిక సూత్రాలు,ఆస్తి వాటాలు, వీలునామా, మూడోవంతు కంటే ఎక్కువ ఆస్తి మీద వీలునామా చెల్లదు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
షిర్క్ చేస్తూ సత్కార్యాలు చేస్తూ ఉంటే ప్రయోజనం ఉందా? వక్త: హబీబుర్రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/vsNjT5L40VE [6 నిముషాలు]
ఈ ప్రసంగంలో షిర్క్ (బహుదైవారాధన) చేస్తూ సత్కార్యాలు చేస్తే ప్రయోజనం ఉంటుందా అనే అంశాన్ని ఖురాన్ ఆధారంగా వివరించబడింది. షిర్క్‌కు పాల్పడితే ఎలాంటి మంచి పనులు చేసినా అవి నిష్ఫలమవుతాయని, ప్రయోజనం శూన్యమని స్పష్టంగా చెప్పబడింది. దీనికి నిదర్శనంగా సూరా జుమర్ మరియు సూరా అన్’ఆమ్‌లోని ఆయతులను ఉటంకించారు. ప్రవక్తల వంటి ఉన్నతమైన వ్యక్తులు సైతం షిర్క్ చేస్తే వారి కర్మలు వృధా అవుతాయని అల్లాహ్ హెచ్చరించినప్పుడు, సాధారణ మానవుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ, షిర్క్‌కు దూరంగా ఉండి ఏకైక అల్లాహ్ ను ఆరాధించాలని ఈ ప్రసంగం ఉద్బోధిస్తుంది.
అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ ఎనిమిదవ ఎపిసోడ్లో, షిర్క్ చేస్తూ సత్కార్యాలు చేస్తూ ఉంటే ప్రయోజనం ఉందా? ఓ పక్కన షిర్క్ చేస్తున్నాము, మరో పక్కన మంచి పనులు చేస్తున్నాము, సత్కార్యాలు ఆచరిస్తున్నాము. ప్రయోజనం ఉందా? అభిమాన సోదరులారా, సూటిగా సమాధానం ఏమిటంటే ప్రయోజనం లేదు, ఉండదు.
ఇది స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా జుమర్‌లో ఇలా తెలియజేశాడు.
“నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” (39:65)
ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేను నీ వైపు మరియు నీకంటే పూర్వం వచ్చిన ప్రవక్తల వైపు సందేశాన్ని పంపించాను, వహీని పంపించాను. అది ఏమిటి? ఓ ప్రవక్తా, నువ్వు గనక షిర్క్ చేస్తే నువ్వు చేసిన సత్కార్యాలన్నీ, మంచి పనులన్నీ, పుణ్యాలన్నీ వృధా అయిపోతాయి. మరియు నువ్వు నష్టం చేసేవారిలో చేరుకుంటావ్, నష్టపోయేవారిలో చేరుకుంటావ్. అభిమాన సోదరులారా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షిర్క్ చేస్తారా? చేయరు. తర్వాత కూడా చేసే అవకాశం లేదు. కాకపోతే, మనం మనల్ని సంస్కరించుకోవాలని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క అభిమతం.
అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా అన్’ఆమ్ ఆయత్ 88లో ఇలా తెలియజేశాడు.
“ఒకవేళ వీరు సైతం, దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి.” (6:88)
ఒకవేళ వీరు సైతం షిర్క్ చేస్తే వీరు చేసిన సత్కార్యాలన్నీ, పుణ్యాలన్నీ నాశనమైపోతాయి, వృధా అయిపోతాయని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయతులో తెలియజేశాడు. వీరు సైతం అంటే ఎవరు? ఈ ఆయత్ కంటే ముందు ఆయత్, సూరా అన్’ఆమ్ ఆయత్ 83 నుంచి ఈ 88 వరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 18 ప్రవక్తల ప్రస్తావన చేసి, ఈ ప్రవక్తలు కూడా షిర్క్ చేస్తే వారి కర్మలు వృధా అయిపోతాయని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హెచ్చరిస్తున్నాడు.
ఒకసారి మనం పరిశీలిద్దాము. సూరా అన్’ఆమ్ ఆయత్ 83 నుంచి 88 వరకు :
ఇబ్రాహీము (అలైహిస్సలాం) తన జాతి వారిని ఎదుర్కొనటానికిగాను మేము అతనికి ఇచ్చిన మా ‘నిదర్శనం’ ఇది! మేము తలచుకున్నవారి అంతస్తుల్ని పెంచుతాము. నిశ్చయంగా నీ ప్రభువు వివేకవంతుడు, గొప్ప పరిజ్ఞానం కలవాడు.
ఇంకా మేము అతనికి ఇస్హాఖును, యాఖూబ్ను ప్రసాదించాము. వారిలో ప్రతి ఒక్కరికీ మేము సన్మార్గం చూపించాము. అంతకు మునుపు మేము నూహ్‌కు సన్మార్గం చూపించి ఉన్నాము. ఇంకా అతని సంతతి వారిలోనుంచి దావూదు సులైమానులకు, అయ్యూబు యూసుఫులకు, మూసా హారూనులకు మేము సన్మార్గం చూపాము. సత్కార్యాలు చేసేవారికి మేము ఇలాగే ప్రతిఫలం ఇస్తూ ఉంటాము.
అంతేకాదు, వారి పితామహులలో (తాత ముత్తాతలలో), వారి సంతానంలో, వారి సహోదరులలో కూడా కొందరిని (మేము కటాక్షించాము.) వారిని (మా సేవకోసం) ఎన్నుకున్నాము. వారిని రుజుమార్గం వైపుకు నడిపించాము.
ఇదీ అల్లాహ్ మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు. ఒకవేళ వీరు సైతం, దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి.
ఈ 18 ప్రవక్తల ప్రస్తావన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంటున్నాడు, వారు సైతం షిర్క్ చేస్తే వారు చేసిన కర్మలన్నీ, సత్కార్యాలన్నీ, పుణ్యాలన్నీ వృధా అయిపోతానని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హెచ్చరిస్తున్నాడు. అభిమాన సోదరులారా, ప్రవక్తల స్థానం ఏమిటి? మన స్థానం ఏమిటి?
మనం ఓ వైపు షిర్క్ చేస్తూ మరోవైపు నమాజులు చేస్తూ, ఉపవాసాలు పాటిస్తూ, ఉమ్రాలు చేస్తూ, దానధర్మాలు చేస్తూ, దుఆలు చేస్తూ ఉన్నాము. మరోవైపు షిర్క్ చేస్తున్నాము, దర్గాలకి పోతున్నాము, మూఢనమ్మకాలకి గురవుతున్నాము, పెద్ద షిర్క్ చేస్తున్నాము, చిన్న షిర్క్ చేస్తున్నాము. మరి మన ఈ సత్కర్మలకి ప్రయోజనం ఉంటుందా? ఈ ఆయత్ ఆయతుల పరంగా ప్రయోజనం ఉండదు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి చిన్న, పెద్ద షిర్క్ నుండి కాపాడుగాక, మరియు షిర్క్ లేకుండా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం పరంగా సత్కార్యాలు చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్.
వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.