షేక్ ఇబ్న్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్) ఈ విధంగా చెప్పారు:
అర్-రాఫిదా – వీరు ప్రవక్తగారి కుటుంబ సభ్యుల (ఆల్-బైత్) విషయంలో మితిమీరి ప్రవర్తించేవారు (అతివాదులు). తమను వ్యతిరేకించిన సహచరులను (సహాబాలను) వీరు అవిశ్వాసులుగా (కాఫిర్లుగా) ప్రకటిస్తారు లేదా వారిపై చెడు (ఫిస్క్) మోపుతారు. వీరు అనేక వర్గాలుగా విడిపోయారు. వారిలో అలీ (రజియల్లాహు అన్హు) దేవుడు అని వాదించే అతివాదులు ఉన్నారు, అలాగే వారి కంటే భిన్నమైన ఇతర వర్గాలు కూడా ఉన్నాయి.
అలీ బిన్ అబీ తాలిబ్ ఖిలాఫత్ (పాలనా) కాలంలో అబ్దుల్లాహ్ బిన్ సబా ఆయనతో “నీవే దేవుడివి” అని అన్నప్పుడు వీరి నూతన కల్పన (బిదఅత్) మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ కారణంగా, వారిని అగ్నికి ఆహుతి చేయాలని అలీ ఆదేశించారు. అయితే, వారి నాయకుడు అబ్దుల్లాహ్ బిన్ సబా వేరొక నగరానికి పారిపోయాడు.
అల్లాహ్ యొక్క లక్షణాలకు సంబంధించి వారు వివిధ అభిప్రాయాలను కలిగి ఉంటారు, కాబట్టి వారిలో ‘తష్బీహ్‘ (సృష్టితో పోల్చడం) చేసేవారు, ‘తఅతీల్‘ (లక్షణాలను తిరస్కరించడం) చేసేవారు, మరియు (లక్షణాల గురించి సరైన అభిప్రాయంతో) ఏకీభవించేవారు కూడా ఉన్నారు. వీరిని ‘రాఫిదా‘ అని ఎందుకు పిలుస్తారంటే, వీరు జైద్ బిన్ అలీ ఇబ్నుల్-హుసైన్ బిన్ అలీ బిన్ అబీ తాలిబ్ ను తిరస్కరించారు (రఫ్ద్). వీరు అబూ బకర్ మరియు ఉమర్ ల గురించి ఆయన్ని అడిగినప్పుడు, ఆయన వారిద్దరి కోసం “రహిమహుల్లాహ్” (అల్లాహ్ వారిపై కరుణ కురిపించుగాక) అని అన్నారు. అందువల్ల వారు ఆయన్ని తిరస్కరించారు.
కాబట్టి వారు అతడిని తిరస్కరించి, అతనికి దూరమయ్యారు. వారు ఆల్-బైత్ (ప్రవక్త కుటుంబం) పక్షాన నిలబడతామని (తషయ్యు), వారికి మద్దతు ఇస్తామని, మరియు ఇమామ్ పదవి (ఇమామత్) పై వారి హక్కును తిరిగి పొందుతామన్న వారి వాదన మరియు భావన కారణంగా తమకు తాము ‘షియా‘ అని పేరు పెట్టుకున్నారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ఇస్లాంలో జ్యోతిష్యం మరియు భవిష్యవాణి యొక్క నిషేధం గురించి చర్చించబడింది. భవిష్యత్తు మరియు అగోచర విషయాల జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉందని, ప్రవక్తలకు కూడా ఆ జ్ఞానం లేదని ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేయబడింది. జ్యోతిష్కులను సంప్రదించడం మరియు వారి మాటలను విశ్వసించడం ఇస్లాంలో తీవ్రమైన పాపంగా పరిగణించబడుతుందని, అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించడంతో సమానమని హెచ్చరించబడింది.
ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహ్, అమ్మా బ’అద్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ 14వ ఎపిసోడ్ లో జ్యోతిష్యం గురించి తెలుసుకుందాం.
జ్యోతిష్యం అంటే ఏమిటి?
జ్యోతిష్యం అంటే ఇతరుల భవిష్యత్తు గురించి చెప్పడం. కొందరు తమకు కానరాని వాటి గురించి, భవిష్యత్తు గురించి జ్ఞానం ఉందని అంటారు. ఇటువంటి వారిని జ్యోతిష్కుడు, మాంత్రికుడు అని అంటారు.
జ్యోతిష్యం చెప్పడం గురించి ఇస్లాంలో నిషేధించబడింది. అలాగే జ్యోతిష్కుని దగ్గరకు వెళ్ళటం కూడా పాపమే. భవిష్యత్తు మరియు కానరాని విషయాలు అల్లాహ్ కు తప్ప ఎవ్వరికీ తెలియదు.
ఈ విషయం గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ అన్ఆమ్ లో ఇలా తెలియజేశాడు,
وَعِندَهُ مَفَاتِحُ الْغَيْبِ لَا يَعْلَمُهَا إِلَّا هُوَ (వ ఇందహూ మఫాతిహుల్ గైబి లా య’అలముహా ఇల్లా హువ) “అగోచర విషయాల తాళం చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. ఆయన తప్ప మరెవరూ వాటిని ఎరుగరు.” (6:59)
అంటే అగోచర జ్ఞానం, ఇల్మె గైబ్ గురించి అల్లాహ్ కు తప్ప ఎవ్వరికీ తెలియదు. దైవ ప్రవక్తలకు కూడా తెలియదు.
అభిమాన సోదరులారా, ఈ విషయం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ అ’అరాఫ్ లో ఇలా తెలియజేశాడు,
قُل لَّا أَمْلِكُ لِنَفْسِي نَفْعًا وَلَا ضَرًّا إِلَّا مَا شَاءَ اللَّهُ (ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “అల్లాహ్ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. (7:188)
ఓ దైవ ప్రవక్తా, నువ్వు చెప్పు, అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశిస్తున్నాడు, ఓ దైవ ప్రవక్తా నువ్వు చెప్పు, (ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “అల్లాహ్ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. అల్లాహ్ యే కోరితే తప్ప, స్వయంగా నాకు నేను ఏ లాభమూ చేకూర్చుకోలేను, ఏ నష్టమూ నివారించుకోలేను.”
అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు కూడా లాభం చేయటం, నష్టం చేకూర్చటం అనే అధికారం లేదు. అలాగే, నాకే గనక,
وَلَوْ كُنتُ أَعْلَمُ الْغَيْبَ لَاسْتَكْثَرْتُ مِنَ الْخَيْرِ وَمَا مَسَّنِيَ السُّوءُ ۚ إِنْ أَنَا إِلَّا نَذِيرٌ وَبَشِيرٌ لِّقَوْمٍ يُؤْمِنُونَ “నాకే గనక అగోచర విషయాలు తెలిసివుంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాణ్ణి. ఏ నష్టమూ నాకు వాటిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించే వారికి హెచ్చరించేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే.” (7:188)
అని ఈ ఆయత్ లో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి ఎన్నో సందర్భాలలో సమస్యలు వచ్చాయి, నష్టం జరిగింది. ఒకవేళ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి అగోచర జ్ఞానం ఉండి ఉంటే, ఇల్మె గైబ్ తెలిసి ఉంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కి ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ కష్టాలు వచ్చేవి కావు.
కావున, జ్యోతిష్యం అనేది తర్వాత జరగబోయే విషయాలు, అగోచర జ్ఞానం ఉందని, కానరాని విషయాలు చెప్తారని, ఆ విద్య ఉందని, అది నమ్మటము, అలా చెప్పటము, అది ఇస్లాం ధర్మంలో హరామ్, అధర్మం. ఇది కేవలం ఇల్మె గైబ్ అనేది అల్లాహ్ కు తప్ప ఎవ్వరికీ తెలియదు.
హదీసు వెలుగులో
అభిమాన సోదరులారా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ జ్యోతిష్యం గురించి ఇలా తెలియజేశారు,
مَنْ أَتَى كَاهِنًا، أَوْ عَرَّافًا، فَصَدَّقَهُ بِمَا يَقُولُ، فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ صلى الله عليه وسلم “ఎవరైతే జ్యోతిష్కుని వద్దకు వెళ్ళి అతడు చెప్పిన మాటల్ని నమ్మితే, జ్యోతిష్యుని దగ్గరికి పోయి ఆ జ్యోతిష్కుడు చెప్పే మాటలు నమ్మితే, అతడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన వాటిని తిరస్కరించిన వాడవుతాడు.”
అంటే ఎవరైతే ఈ జ్యోతిష్యాన్ని నమ్ముతాడో, అతను చెప్పిన మాటల్ని నమ్ముతాడో, ఆ వ్యక్తి వాస్తవానికి ఏం చేస్తున్నాడు, అంతిమ దైవ ప్రవక్తపై అల్లాహ్ ఏది అవతరింపజేశాడో, వహీని, ఖుర్ఆన్ ని దాన్ని తిరస్కరించినట్టు అని అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ లో స్పష్టంగా తెలియజేశారు.
అభిమాన సోదరులారా, కావున మన సమాజంలో అప్పుడప్పుడు మనము చూస్తూ ఉంటాం, పోయి చేతులు చూపించి, ఏదో చూపించి, నష్టం జరుగుతుందని, రాబోయే కాలంలో ఏం జరుగుతుందని వివరించుకుంటారు. ఇది హరామ్, ఇస్లాం ధర్మంలో దీన్ని ఖుర్ఆన్ మరియు హదీసులో చాలా కఠినంగా ఖండించడం జరిగింది.
అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఈ పాపం నుంచి కాపాడు గాక. సరైన మార్గాన్ని చూపించు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సమాహతుష్ షేఖ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్) గారిని క్రింది విధంగా ప్రశ్నించడం జరిగింది
ప్రశ్న: షేఖ్ గారు! “సున్నీ (అహ్లుస్ సున్నహ్ ) మరియు షీయాలో చిన్నపాటి విషయాల్లో తప్ప (మూల విషయాల్లో) ఏ భేదం లేదు” అని మీరన్నట్లు విన్నాము, ఇది నిజమేనా? కాదా? వాస్తవానికి సున్నీ మరియు షీయాలో విభేదాలున్నాయా?
షేఖ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్) గారి జవాబు:
ఇది చాలా విచిత్రం. ఇది అబద్ధం, అపనింద. –అల్లాహ్ ఇలాంటి వాటి నుండి రక్షించాలి- ఇది అసత్యం, ఇలాంటి ఏ మాట గాని, దీనికి ఇంచుమించు లేదా ఈ భావం గల ఏ మాట నా నుండి వెల్లలేదు. మా (సున్నీల) మధ్య మరియు వారి (షీయాల) మధ్య భూమ్యాకాశాల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఉంది. ప్రత్యేకంగా షీయాలో రాఫిదా , నుసైరియా మరియు వీరి లాంటి వర్గాల మధ్య (చాలా విభేదాలున్నాయి).
షియాలో ఎన్నో రకాలున్నాయి. ఒకే రకం కాదు. అనేక రకాలు, అనేక వర్గాలున్నాయి. షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహిమహుల్లాహ్ 22 వర్గాలు పేర్కొన్నారు. కొన్ని వర్గాలవారు దుర్మార్గంలో ఉన్నారు. కొందరు కేవలం అలీ (రదియల్లాహు అన్హు) గారు ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) కంటే ఘనతగలవారంటారు. మరి కొందరు అలీ (రదియల్లాహు అన్హు) గారు అబూబక్ర్, ఉమర్ (రదియల్లాహు అన్హుమా)ల కంటే ఉత్తములు అని అంటారు. కాని దూషించరు, అలీ (రదియల్లాహు అన్హు) గారిని పూజించరు, వారి విషయంలో అతిశయించరు (గులువ్వ్ చేయరు). వీరు కూడా షీయాలే, కాని వీరి విషయం చిన్నపాటి తేలిగ్గా ఉంది, వీరు సహాబాలలో అతిఉత్తములెవరన్న విషయంలో సున్నీలకు భిన్నంగా ఉండి, తప్పులో పడ్డారు కాని ధర్మపరంగా మహా ఘోరమైన నష్టంలో పడలేదు. వీరి దుర్మార్గం, నష్టం ఇతర వర్గాల మాదిరిగా కాదు.
షీయాలో కొందరు ముఆవియ (రదియల్లాహు అన్హు) గారిని దూషిస్తారు, వీరు కూడా పప్పులో కాలేసి, తప్పులో పడ్డారు, వీరికి దీని పాపం కలుగును.షీయాలో మరికొందరు ఆయిషా (రదియల్లాహు అన్హా) గారిని దూషిస్తారు. (వీరు మహా ఘోర పాపంలో పడ్డారు).
అయితే షీయాలో కొన్ని ‘బాతినీ’ వర్గాలున్నాయి (అంటే బాహ్యానికి భిన్నమైన ఆంతర్యం గలవారు). అలీ (రదియల్లాహు అన్హు) గారిని ఆరాధిస్తారు, పూజిస్తారు, ప్రవక్త కుటుంబీకులను పూజిస్తారు, వారితో మొరపెట్టుకుంటారు, వారికి మ్రొక్కుబడులు చెల్లిస్తారు, వారికి అగోచర జ్ఞానం గలదన్న నమ్మకం కలిగి ఉంటారు, సహాబాలను దూషిస్తారు, అంతేకాదు – నఊజుబిల్లాహ్ – సహాబాలు కాఫిర్లయ్యారనీ, ఇంకా సహాబాలు అలీ (రదియల్లాహు అన్హు) పై దౌర్జన్యం చేశారని, ప్రవక్త తర్వాత అలీకి రావలసిన ఖిలాఫత్ హక్కును ఆక్రమించుకున్నారని అంటారు. అయితే సహాబాలలో కేవలం అమ్మార్, సల్మాన్, మిక్దాద్ బిన్ అస్వద్ మరి కొందరు సహాబాలను దూషించరు.
సారాంశం ఏమిటంటే: షీయాలో వర్గాలున్నాయి. వారి మధ్య మరియు సున్నీల మధ్య స్పష్టమైన భేదాలున్నాయి. ప్రత్యేకంగా సున్నీల మరియు బాతినీ వర్గాల మధ్య.
సున్నీలు సహాబాలను స్నేహితులుగా, సన్నిహుతులుగా భావిస్తారు, వారిని ప్రేమిస్తారు, వారి ప్రస్తావన వచ్చినప్పుడు రదియల్లాహు అన్హు/మ్ అంటారు, వారు ముస్లిం సమాజంలో అత్యుత్తములు, ఉన్నత శ్రేణికి చెందిన ఘనతగలవారు అని విశ్వసిస్తారు.
ఇక షీయాలోని రాఫిదా, నుసైరియా మరియు వీరి లాంటి వర్గాలు సున్నీల విశ్వసానికి భిన్నంగా ఉన్నారు. సున్నీలు కేవలం ఏకైక అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తారు. అగోచరజ్ఞానం (ఇల్మె గైబ్) అల్లాహ్ కు తప్ప ఎవరికీ లేదు అని నమ్ముతారు.
కాని రాఫిదా, బాతినీ వర్గాలు ఈ విశ్వాసాలకు భిన్నంగా ఉన్నారు.సున్నీ షీయాల మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. మరిన్ని వివరాలు కోరే వారు షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా గారి “మిన్ హాజుస్ సున్నహ్“, అబ్దుల్లాహ్ ముహమ్మద్ గరీబ్ గారి “వజాఅ దౌరుల్ మజూస్“, అల్లామా ఏహ్సాన్ ఇలాహీ జహీర్ లాంటివారు వ్రాసిన పుస్తకాలు చదువవచ్చు. ఈ అంశానికి సంబంధించి మరెన్నో పుస్తకాలున్నాయి.
తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
سمعنا يا سماحة الشيخ أنك تقول بأنه ليس هناك فرقٌ بين أهل السنة والشيعة إلا ببعض الفروع، فهل هذا صحيح أم لا؟ وهل هناك فعلًا فرقٌ بين أهل السنة والشِّيعة؟
هذا من العجائب، هذا كذبٌ وافتراءٌ -نسأل الله العافية- هذا كذبٌ، ولم يصدر مني هذا الكلام، ولا قريب من هذا الكلام، بل بيننا وبينهم مثل ما بين السماء الأرض، ولا سيما بينهم وبين الرافضة، الرافضة والنُّصيرية وأشباههم طوائف باطنية.
والشيعة أقسام، هم ليسوا قسمًا واحدًا، أقسام كثيرة، وفِرَقٌ كثيرة، حتى ذكرهم شيخُ الإسلام اثنتين وعشرين فرقة، هم أقسام، بعضهم ضالٌّ، وبعضهم يُفضّل عليًّا فقط على عثمان، وبعضهم يُفضله على الصديق وعمر، لكن لا يسبُّون، ولا يعبدون عليًّا، ولا يغلون فيه، هؤلاء شيعة، لكن أمرهم سهل، لا يضرُّهم ذلك من جهة الدين، وإن كانوا قد أخطأوا في مخالفة أهل السنة في التفضيل، لكن لا يضرُّهم مثل ضرر الطوائف الأخرى.
ومنهم مَن يسبُّ معاوية، وهؤلاء أيضًا قد أخطأوا وغلطوا، وعليهم إثم ذلك، ومنهم مَن يسبُّ عائشة كذلك، لكن فيهم طوائف باطنية، يعبدون عليًّا، ويعبدون أهل البيت، ويستغيثون بهم، وينذرون لهم، ويعتقدون أنهم يعلمون الغيب، ويَسُبُّون أصحاب النبي صلى الله عليه وسلم، ويُكفِّرونهم، ويقولون: إنهم ظلموا عليًّا وأخذوا عنه الولاية، إلا النفر القليل من أصحاب النبي لا يسبُّونهم: كعمار وسلمان والمقداد بن الأسود ونفر قليل.
فالحاصل أن الشيعة أقسام، وبينهم وبين أهل السنة فرقٌ بعيدٌ، خصوصًا الباطنية منهم:
فأهل السنة يُوالون الصحابة، ويُحبُّونهم، ويترضون عنهم، ويعتقدون أنهم أفضل الأمة، وخير الأمة، والرافضة والنُّصيرية وأشباههم بضدِّ ذلك.
وأهل السنة يعبدون الله وحده، ويقولون: الغيب لله، لا يعلمه إلا الله، والرافضة والباطنية بخلاف ذلك.
فالفرق عظيمٌ جدًّا، ومَن أراد ذلك فليُراجع ما كتبه الناسُ في هذا، مثل: “منهاج السنة” لشيخ الإسلام ابن تيمية، ومثل: “وجاء دور المجوس” لعبدالله محمد غريب، ومثل الكتب الأخرى: كتب الشيخ حافظ إحسان، وغيره ممن كتب في هذا الباب، وفي هذا كتابات كثيرة
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.