
[6:30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ధర్మపరమైన నిషేధాలు – 15
15– ఆపద దూరమగుటకు, లేదా అది రాకుండా తాయత్తులు, పూసలు మరియు గవ్వలు వేసుకోకు.
عن عَبْدِ الله بْنِ عُكَيْمٍ أَبِي مَعْبَدِ الْجُهَنِيِّ قَال: قَالَ النَّبِيُّ : (مَنْ تَعَلَّقَ شَيْئًا وُكِلَ إِلَيْهِ).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారని అబ్దుల్లాహ్ బిన్ ఉకైమ్ అబూ మఅబద్ అల్ జుహనీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః
“ఏదైనా వస్తువు తగిలేసుకున్న వారు దాని వైపే అప్పగించబడుతారు”. (అంటే వారికి అల్లాహ్ రక్షణ, సహాయం ఉండదు).
(తిర్మిజి/ మా జాఅ ఫీ కరాహియతిత్ తాలీఖ్/ 2072, నిసాయి/ బాబుల్ హుక్ మి ఫిస్సహర/ 4011).
మరో ఉల్లేఖనంలో ఉంది:
(إِِنَّ الرُّقَى وَالتَّمَائِمَ وَالتِّوَلَةَ شِرْكٌ )
“మంత్రం, తావీజులు, మరియు ‘తివల’ ఇవన్నియు షిర్క్”. ‘తివల’ అనగా భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుటకు చేతబడి చేయడం.
(అబూ దావూద్/ బాబు ఫీ తాలీఖిత్ తమాయిమ్/ 3883, ఇబ్ను మాజ/ బాబు తాలీఖిత్ తమాయిమ్/ 3530, అహ్మద్).
పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు