తబర్రుక్ –  ప్రత్యేక స్థలాల్లో, ప్రత్యేక వస్తువుల ద్వారా, పుణ్యప్రజల యందు శుభాలను కాంక్షిస్తూ చేసే ఆరాధనలు

అత్ తబర్రుక్ అంటే; శుభాలను ఆశించడం. మేళ్ళు, శుభాలు కలగడం మరియు శుభాలు ప్రాప్తించడం. ఎవరికైతే మేళ్ళను మరియు శుభాలను ప్రసాదించే అధికారం ఉందో, వారితోనే కోరడం సమంజసం. శుభాలను ప్రసాదించే అధికారం ఎవరికైతే లేదో, వారి ద్వారా శుభాలు ఆశించడం లేక కోరడం అవివేకం. కనుక మేళ్ళను మరియు శుభాలను ప్రసాదించగలిగే అధికారం అల్లాహ్ కు మాత్రమే ఉంది. సర్వసృష్టిలో ఉన్న ఏ వ్యక్తికి మేళ్ళను మరియు శుభాలను ప్రసాదించే శక్తిగాని, ఆధికారంగాని లేదు. 

ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمْ لَهُ ٱلْمُلْكُ ۚ وَٱلَّذِينَ تَدْعُونَ مِن دُونِهِۦ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ إِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا۟ دُعَآءَكُمْ وَلَوْ سَمِعُوا۟ مَا ٱسْتَجَابُوا۟ لَكُمْ ۖ

కనుక అల్లాహ్ ఇలా తెలియజేసాడు: “ఆయనే అల్లాహ్ మీ ప్రభువు, విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే! మరియు ఆయనను పదిలి మీరు వేడుకొనే వారు, ఖర్జూర బీజంపై నున్న పొరకు కూడా యజమానులు కారు- మీరు వారిని వేడుకున్నప్పటికీ, వారు మీ ప్రార్థనలను విసలేరు, ఒక వేళ విన్నా, వారు మీకు జవాబివ్వలేరు” (సూరతుల్ ఫాతిర్ 35:13-14). 

మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: ”ఓ అల్లాహ్ నీవు ఎవరికైన ప్రసాదిస్తే దానిని నివారించేవారు ఎవరూ లేరు. నీకృపే లేకపోతే కృషి చేయువాని కృషికి ప్రతి ఫలము ఏమియు లేదు.” (బుఖారీ:799, ముస్లిం:725) 

ప్రత్యేక స్థలాల్లో మరియు బ్రతికున్న లేక మరణించిన పుణ్యప్రజల యందు శుభాలను ఆశించడం ధర్మసమ్మతం కాదు. ఒకవేళ వారి ద్వారా శుభాలు ప్రాప్తిస్తాయని విశ్వసిస్తే అది షిర్క్ అవుతుంది. మరియు కొన్ని వస్తువులను పవిత్రంగా భావించి వాటి తాకిడి వల్ల శుభాలు ప్రాప్తిస్తాయని, ప్రత్యేకమైన స్థలాలలో బస చేయడం వల్ల శుభాలు ప్రాప్తిస్తాయని నమ్మడం షిర్క్ వైపుకే దారి తీస్తోంది.

ముఖ్య గమనిక: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బ్రతికుండగా ఆయన శిరోజాలను, ఆయన చమటను, మరియు ఆయన దుస్తులను శుభాలుగా భావించి సహాబాలు వాటితో ప్రయోజనం పొందేవారు. ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వ్యక్తిత్వంతో మాత్రమే శుభాలను ఆశించడం ధర్మం. మరియు ఆయన శరీరానికి సంబంధించిన ఏ ఒక్క వస్తువు (వెంట్రుకలు, తలపాగ, దుస్తులు, ఉంగరం వంటివి) మనకు లభించిన వాటిని పవిత్రంగా భావించి శుభాలను ఆశించడం కూడా ధర్మమే. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చనిపోయిన తరువాత ఆయనకు సంబంధించిన వస్తువులు ప్రస్తుత కాలంలో లేవు, కాబట్టి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వనల్లం)వ్యక్తిత్వం ద్వారా మరియు వారి వస్తువుల ద్వారా శుభాలను ఆశించడం అనేది కూడా లేదు. ఒక వేళ పవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారికి సంభందించిన వస్తువు ప్రామాణి కమైన ఆధారాలతో లభించినట్లయితే శుభంగా ఉపయోగించడం ధర్మం. 

కాని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటిని లేక సమాధిని మరియు ఆయన నమాజు చేసే చోటును లేక ఆయన కూర్చునే చోటును శుభాల కొరకు ప్రత్యేకించలేదు. అలాగే హిరా కొండను, సౌర్ కొండను, జబలుర్ రహ్మా (అరాఫాత్) మైదానంలో నిలబిడి ప్రసంగించిన) కొండను శుభాలుగా ఆశించి ఎక్కడం లేక బస చేయడం మరియు అక్కడ నమాజు కొరకు ప్రధాన్యత ఇవ్వడం కూడా ధర్మం కాదు. ప్రపంచంలో మక్కా మరియు మదీనా పవిత్రమైన స్థలాలు. అక్కడ ఉన్న కాబతుల్లాహ్ మసీదు, మరియు మదీనాలో ఉన్న మస్జిద్ నబవీ మరింత పవిత్రమైనవి. అలాగే మజ్జిదే అఖ్సా కూడా పవిత్రమైనది. మరియు మక్కా మసీదులో ఉన్న జమ్ జమ్ నీరు అతి పవిత్రమైనది. మదీనా లో పండే ‘అజ్వా’ ఖర్జూరాలు శుభమైనవి. 

హజ్రత్ అబూబకర్ మరియు హజ్రత్ ఉమర్, హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ అలీ, హజ్రత్ హసన్, హుసైన్ వంటి ఉత్తమమైన సహాబాలు, మరియు వారిలో కొందరు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబానికి చెందినవారు కూడా ఉన్నారు. అంతేకాక వారందరితో అల్లాహ్ ప్రసన్నుడ య్యాడు. మరియు వారు కూడా అల్లాహ్ తో సంతుష్టులయ్యారు. అనే విషయం దైవ గ్రంథం ఖుర్ఆన్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి మహా పుణ్యాత్ములైన సహాబాలను, వారు ఉపయోగించిన వస్తువులను ఆ నాటి ప్రజలు శుభాల కొరకు ప్రత్యేకించలేదంటే, వారి తరువాత తరాల ప్రజల నుండి శుభాలను ఆశించడం ఎంతవరకు ధర్మం? 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి తరానికి చెందినవారు సహాబాలు మరియు సహబాల తరానికి చెందినవారు తాబయీన్లు, తబా తాబయీన్లు. వారందరూ పవిత్రమైన తరాలకు మరియు కుటుంబాలకు చెందినవారు. కనుక ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు: 

ప్రజలందరిలోకెల్లా నా తరం ప్రజలు ఉత్తములు (పుణ్యాత్ములు) మరియు ఆ తరువాతి తరంవారు, మరియు ఆ తరువాతి తరంవారు” (బుఖారీ:2457, ముస్లిం:4603) 

అంటే; వారందరు పుణ్యాత్ములనీ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ధృవీకరించారు. అయినా వారి నుండి, వారి సమాధుల నుండి మనం ఎలాంటి శుభాలను ఆశించడం లేదు మరియు ఆశించకూడదు. 

వారి తరువాత జ్ఞానవంతులైన ఇమాములు, హదీసు జ్ఞానం కలిగిన ముహద్ధిసీన్లు (హదీసు ధర్మవేత్తలు), ధర్మాన్ని తూచతప్పకుండా అనుసరించే ఔలియాలు (పుణ్యాత్ములు) మరియు సాధారణ ముస్లింలు ప్రళయం వరకూ సమాజంలో ఉంటారు. వారిలో మనం కొందరినీ ఔలియాలనీ నిర్ణయించుకొని వారిద్వారా శుభాలను ఆశించడం మరియు వారు తిని త్రాగి వదలిన వస్తువులను, వారు ధరించే వస్త్రాలను, లేక వారికి సంబంధించిన ఇతర వస్తువులను శుభాలుగా భావించటం ఎంతవరకు సమంజసం? మరియు వారు మరణిస్తే వారి సమాధులను దర్గాలుగా నిర్మించి ప్రత్యేకంగా దర్శించటం, వాటి ద్వారా శుభాలను ఆశించటం మరియు అక్కడ భయం భక్తిని చూపటం ఎంతవరకు ధర్మసమ్మతం? అందుకనే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ఇలా హెచ్చరించారు: 

 “ఎవరైనా మేము ఆదేశించని పని ఏదైనా చేస్తే అది త్రోసిపుచ్చదగినది” (బుఖారీ:2499, ముస్లిం:3242). 

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

%d bloggers like this: