ఆస్తి వారసత్వం [PDF] [5 పేజీలు] – ఇస్లామీయ ఆరాధనలు [పుస్తకం] ఆస్తి పంపకానికి ప్రాథమిక సూత్రాలు,ఆస్తి వాటాలు, వీలునామా, మూడోవంతు కంటే ఎక్కువ ఆస్తి మీద వీలునామా చెల్లదు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
షిర్క్ చేస్తూ సత్కార్యాలు చేస్తూ ఉంటే ప్రయోజనం ఉందా? వక్త: హబీబుర్రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/vsNjT5L40VE [6 నిముషాలు]
ఈ ప్రసంగంలో షిర్క్ (బహుదైవారాధన) చేస్తూ సత్కార్యాలు చేస్తే ప్రయోజనం ఉంటుందా అనే అంశాన్ని ఖురాన్ ఆధారంగా వివరించబడింది. షిర్క్‌కు పాల్పడితే ఎలాంటి మంచి పనులు చేసినా అవి నిష్ఫలమవుతాయని, ప్రయోజనం శూన్యమని స్పష్టంగా చెప్పబడింది. దీనికి నిదర్శనంగా సూరా జుమర్ మరియు సూరా అన్’ఆమ్‌లోని ఆయతులను ఉటంకించారు. ప్రవక్తల వంటి ఉన్నతమైన వ్యక్తులు సైతం షిర్క్ చేస్తే వారి కర్మలు వృధా అవుతాయని అల్లాహ్ హెచ్చరించినప్పుడు, సాధారణ మానవుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ, షిర్క్‌కు దూరంగా ఉండి ఏకైక అల్లాహ్ ను ఆరాధించాలని ఈ ప్రసంగం ఉద్బోధిస్తుంది.
అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ ఎనిమిదవ ఎపిసోడ్లో, షిర్క్ చేస్తూ సత్కార్యాలు చేస్తూ ఉంటే ప్రయోజనం ఉందా? ఓ పక్కన షిర్క్ చేస్తున్నాము, మరో పక్కన మంచి పనులు చేస్తున్నాము, సత్కార్యాలు ఆచరిస్తున్నాము. ప్రయోజనం ఉందా? అభిమాన సోదరులారా, సూటిగా సమాధానం ఏమిటంటే ప్రయోజనం లేదు, ఉండదు.
ఇది స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా జుమర్‌లో ఇలా తెలియజేశాడు.
“నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” (39:65)
ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేను నీ వైపు మరియు నీకంటే పూర్వం వచ్చిన ప్రవక్తల వైపు సందేశాన్ని పంపించాను, వహీని పంపించాను. అది ఏమిటి? ఓ ప్రవక్తా, నువ్వు గనక షిర్క్ చేస్తే నువ్వు చేసిన సత్కార్యాలన్నీ, మంచి పనులన్నీ, పుణ్యాలన్నీ వృధా అయిపోతాయి. మరియు నువ్వు నష్టం చేసేవారిలో చేరుకుంటావ్, నష్టపోయేవారిలో చేరుకుంటావ్. అభిమాన సోదరులారా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షిర్క్ చేస్తారా? చేయరు. తర్వాత కూడా చేసే అవకాశం లేదు. కాకపోతే, మనం మనల్ని సంస్కరించుకోవాలని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క అభిమతం.
అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా అన్’ఆమ్ ఆయత్ 88లో ఇలా తెలియజేశాడు.
“ఒకవేళ వీరు సైతం, దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి.” (6:88)
ఒకవేళ వీరు సైతం షిర్క్ చేస్తే వీరు చేసిన సత్కార్యాలన్నీ, పుణ్యాలన్నీ నాశనమైపోతాయి, వృధా అయిపోతాయని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయతులో తెలియజేశాడు. వీరు సైతం అంటే ఎవరు? ఈ ఆయత్ కంటే ముందు ఆయత్, సూరా అన్’ఆమ్ ఆయత్ 83 నుంచి ఈ 88 వరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 18 ప్రవక్తల ప్రస్తావన చేసి, ఈ ప్రవక్తలు కూడా షిర్క్ చేస్తే వారి కర్మలు వృధా అయిపోతాయని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హెచ్చరిస్తున్నాడు.
ఒకసారి మనం పరిశీలిద్దాము. సూరా అన్’ఆమ్ ఆయత్ 83 నుంచి 88 వరకు :
ఇబ్రాహీము (అలైహిస్సలాం) తన జాతి వారిని ఎదుర్కొనటానికిగాను మేము అతనికి ఇచ్చిన మా ‘నిదర్శనం’ ఇది! మేము తలచుకున్నవారి అంతస్తుల్ని పెంచుతాము. నిశ్చయంగా నీ ప్రభువు వివేకవంతుడు, గొప్ప పరిజ్ఞానం కలవాడు.
ఇంకా మేము అతనికి ఇస్హాఖును, యాఖూబ్ను ప్రసాదించాము. వారిలో ప్రతి ఒక్కరికీ మేము సన్మార్గం చూపించాము. అంతకు మునుపు మేము నూహ్‌కు సన్మార్గం చూపించి ఉన్నాము. ఇంకా అతని సంతతి వారిలోనుంచి దావూదు సులైమానులకు, అయ్యూబు యూసుఫులకు, మూసా హారూనులకు మేము సన్మార్గం చూపాము. సత్కార్యాలు చేసేవారికి మేము ఇలాగే ప్రతిఫలం ఇస్తూ ఉంటాము.
అంతేకాదు, వారి పితామహులలో (తాత ముత్తాతలలో), వారి సంతానంలో, వారి సహోదరులలో కూడా కొందరిని (మేము కటాక్షించాము.) వారిని (మా సేవకోసం) ఎన్నుకున్నాము. వారిని రుజుమార్గం వైపుకు నడిపించాము.
ఇదీ అల్లాహ్ మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు. ఒకవేళ వీరు సైతం, దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి.
ఈ 18 ప్రవక్తల ప్రస్తావన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంటున్నాడు, వారు సైతం షిర్క్ చేస్తే వారు చేసిన కర్మలన్నీ, సత్కార్యాలన్నీ, పుణ్యాలన్నీ వృధా అయిపోతానని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హెచ్చరిస్తున్నాడు. అభిమాన సోదరులారా, ప్రవక్తల స్థానం ఏమిటి? మన స్థానం ఏమిటి?
మనం ఓ వైపు షిర్క్ చేస్తూ మరోవైపు నమాజులు చేస్తూ, ఉపవాసాలు పాటిస్తూ, ఉమ్రాలు చేస్తూ, దానధర్మాలు చేస్తూ, దుఆలు చేస్తూ ఉన్నాము. మరోవైపు షిర్క్ చేస్తున్నాము, దర్గాలకి పోతున్నాము, మూఢనమ్మకాలకి గురవుతున్నాము, పెద్ద షిర్క్ చేస్తున్నాము, చిన్న షిర్క్ చేస్తున్నాము. మరి మన ఈ సత్కర్మలకి ప్రయోజనం ఉంటుందా? ఈ ఆయత్ ఆయతుల పరంగా ప్రయోజనం ఉండదు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి చిన్న, పెద్ద షిర్క్ నుండి కాపాడుగాక, మరియు షిర్క్ లేకుండా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం పరంగా సత్కార్యాలు చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్.
వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఖుర్ఆన్ ను పఠించడం | ఖుర్ఆన్ హక్కులు – 2 వక్త: హబీబుర్రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/s95wqnlrv94 [9 నిముషాలు]
ఈ ప్రసంగంలో, ఖుర్ఆన్ పట్ల విశ్వాసికి ఉన్న హక్కులలో రెండవదాని గురించి వివరించబడింది. ఖుర్ఆన్‌ను విశ్వసించడం మొదటి హక్కు అయితే, దానిని నిరంతరం పఠించడం రెండవ హక్కు అని స్పష్టం చేయబడింది. ఖుర్ఆన్ పఠించడం వలన ప్రతి అక్షరానికి పది పుణ్యాలు లభిస్తాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు పేర్కొనబడింది. ప్రళయదినాన ఖుర్ఆన్ తనను పఠించిన వారి కొరకు సిఫారసు చేస్తుందని కూడా చెప్పబడింది. ఖుర్ఆన్‌ను పఠించవలసిన రీతిలో (హక్క తిలావతిహి) పఠించడం యొక్క ప్రాముఖ్యత నొక్కిచెప్పబడింది, దీనికి పలు అర్థాలు వివరించబడ్డాయి: ఏకాగ్రతతో చదవడం, అందులోని ధర్మాధర్మాలను అంగీకరించడం, దాని సందేశాన్ని ఇతరులకు వివరించడం, మరియు స్పష్టమైన ఆజ్ఞలను పాటిస్తూ, అస్పష్టమైన విషయాల జ్ఞానం కోసం పండితులను ఆశ్రయించడం. చివరగా, ఖుర్ఆన్‌ను తజ్విద్ (ఉచ్ఛారణ నియమాలు) మరియు తర్తీల్ (ఆగి ఆగి, స్పష్టంగా పఠించడం)తో చదవాలని సూచిస్తూ ప్రసంగం ముగించబడింది.
ఇన్నల్హమ్దులిల్లాహి వహ్దహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు అమ్మా బ’అద్.
అభిమాన సోదరులారా, కారుణ్య కడలి రమజాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ఈ రోజు మనం ఖుర్ఆన్ యొక్క రెండవ హక్కు, ఖుర్ఆన్‌ను పఠించడం అనే అంశం గురించి తెలుసుకోబోతున్నాం. ఖుర్ఆన్ యొక్క రెండవ హక్కు, ఖుర్ఆన్‌ను పఠించాలి. మొదటి హక్కు, ఖుర్ఆన్‌ను విశ్వసించడం. దాని గురించి ఇంతకు ముందు ఎపిసోడ్‌లో మనం తెలుసుకున్నాం. ఈ రోజు ఖుర్ఆన్‌ను పఠించడం.
ఖుర్ఆన్ యొక్క రెండవ హక్కు ఏమిటంటే, మనం ఖుర్ఆన్‌ను పఠిస్తూ ఉండాలి. కేవలం విశ్వసిస్తే సరిపోదు, విశ్వసించిన తరువాత ఖుర్ఆన్‌ను మనం పఠించాలి. ఖుర్ఆన్ పఠించడం వలన ఒక అక్షరానికి పది పుణ్యాలు లభిస్తాయని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఒక అక్షరానికి పది పుణ్యాలు. ఇంకా ఇలా ప్రవచించారు:
اقْرَءُوا الْقُرْآنَ فَإِنَّهُ يَأْتِي يَوْمَ الْقِيَامَةِ شَفِيعًا لأَصْحَابِهِ (ఇఖ్రవుల్ ఖుర్ఆన ఫఇన్నహు య’అతీ యౌమల్ ఖియామతి షఫీఅన్ లిఅస్ హాబిహి) “ఖుర్ఆన్‌ను అత్యధికంగా పారాయణం చేయండి. ప్రళయ దినాన అది తనను పారాయణం చేసిన వారి కొరకు సిఫారసు దారునిగా వస్తుంది.”
ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది. ఖుర్ఆన్‌ను అత్యధికంగా పారాయణం చేయండి. ఖుర్ఆన్ తిలావత్ చేస్తూ ఉండండి. ప్రళయ దినాన అది తనను పారాయణం చేసిన వారి కొరకు సిఫారసు దారునిగా వస్తుంది అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
“నీ వద్దకు వహీ ద్వారా పంపబడిన నీ ప్రభువు గ్రంథాన్ని పఠిస్తూ ఉండు. ఆయన వచనాలను మార్చగలవాడెవడూ లేడు. నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ఆయన ఆశ్రయం తప్ప వేరే ఆశ్రయాన్ని పొందజాలవు.” (సూర కహఫ్ 18:27)
ఖుర్ఆన్ పఠించే విధానం
ఖుర్ఆన్ పారాయణం చేసే విధానం కూడా బోధించబడింది. రెండవ హక్కు ఖుర్ఆన్‌ని పఠించాలి. ఖుర్ఆన్ పారాయణం చేయాలి, తిలావత్ చేయాలి. ఆ విధానం కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు.
“మేము ఎవరికి గ్రంథం వొసగామో వారు దానిని పారాయణం చేయవలసిన రీతిలో పారాయణం చేస్తారు. (అంతేకాదు,) వారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు. ఇక, దీనిపట్ల తిరస్కార వైఖరిని అవలంబించినవారే నష్టపోయేది.” (2:121)
ఈ ఆయతులో ‘హక్క తిలావతిహి’ గురించి ఫత్హుల్ ఖదీర్ ఆధారంగా అహ్సనుల్ బయాన్‌లో ఇలా ఉంది: పఠించవలసిన విధంగా పఠిస్తారు అన్న వాక్యానికి పలు అర్థాలు వివరించబడ్డాయి. ఉదాహరణకు ఒక అర్థం ఏమిటి? బాగా చదువుతారు, శ్రద్ధతో, ఏకాగ్రతతో పారాయణం చేస్తారు. పఠన సందర్భంగా స్వర్గ ప్రస్తావన వస్తే, స్వర్గంలో ప్రవేశం కల్పించమని అల్లాహ్‌ను వేడుకుంటారు. నరక ప్రస్తావన వస్తే, దాని బారి నుండి రక్షించమని ప్రార్థిస్తారు. ఇది ఒక అర్థం.‘హక్క తిలావతిహి’కి ఇది ఒక అర్థం. పఠించవలసిన విధానంగా పఠించాలి అంటే ఇది ఒక అర్థం.
రెండో అర్థం ఏమిటి? అందులో ధర్మసమ్మతంగా ఖరారు చేయబడిన వాటిని ధర్మసమ్మతాలుగా విశ్వసిస్తారు. అధర్మం అని స్పష్టం చేయబడిన వాటిని అధర్మంగానే భావిస్తారు. అంతేగాని యూదుల మాదిరిగా ప్రక్షిప్తాలకు పాల్పడటం గానీ, తప్పుడు అన్వయింపులు చేయడం గానీ చేయరు. అంటే, ఖుర్ఆన్‌లో దేనిని హలాల్ అని చెప్పబడిందో దానిని హలాల్‌గా నమ్ముతారు, అంగీకరిస్తారు, ఆచరిస్తారు. ఖుర్ఆన్‌లో దేనిని హరాం అని, నిషిద్ధం అని, అధర్మం అని చెప్పబడిందో దానిని అధర్మం అని నమ్ముతారు, విశ్వసిస్తారు, దాని నుండి దూరంగా ఉంటారు. ఇది దీనికి ఒక అర్థం. ఖుర్ఆన్‌ని పఠించవలసిన రీతిలో పఠించాలి. ‘హక్క తిలావతిహి’కి ఇది ఒక అర్థం. ఖుర్ఆన్‌లో ఏదైతే ధర్మం ఉందో, ధర్మం అని భావించాలి. అధర్మానికి అధర్మం అని భావించాలి. దానికి తప్పుడు అర్థాలు చెప్పరాదు, చేసుకోకూడదు.
అలాగే మూడవ అర్థం ఏమిటంటే, అందులో పొందుపరచబడి ఉన్న విషయాలను గురించి అందరికీ వివరిస్తారు, వాటిని దాచి ఉంచరు.
అలాగే ఇంకో అర్థం, అందులో చేయమని ఆజ్ఞాపించబడిన వాటిని—మహ్కమాత్ ఆయతులను—చేస్తారు. అస్పష్టంగా ఉన్న ముతషాబిహాత్ విషయాలను విశ్వసిస్తారు.అర్థం కాని విషయాల గురించి విద్వాంసులను, ధర్మ పండితులను అడిగి తెలుసుకుంటారు. ఇది చాలా ముఖ్య విషయం. తెలియకుండా, ధర్మ అవగాహన లేకుండా, మనమే ఊహించుకుని, కొంచెం వస్తే దానికి ఇంకా కొన్ని విషయాలు అల్లుకుని, మనమే దానికి భావాలు, అర్థాలు చెప్పటం చాలా తప్పు. ఖుర్ఆన్ అల్లాహ్ వాక్యం. ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని ప్రవక్త గారు ఏ విధంగా దానికి అర్థం చెప్పారు, సహాబాలు ఏ విధంగా అర్థం తీసుకున్నారో, అదే అర్థం మనం తీసుకోవాలి. ఆ ఆయతులు మహ్కమ్ ఆయతులు ఉండినా, ముతషాబిహ్ ఆయతులు ఉండినా. అర్థం కాని విషయాలు, ఆ విషయాల గురించి ధర్మ పండితులను, విద్వాంసులను అడిగి తెలుసుకోవాలి.
అలాగే చివరి మాట, ఖుర్ఆన్‌లో ఒక్కొక్క విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. పఠించవలసిన రీతిలో పఠిస్తారు అన్న వాక్యంలో ఎన్ని పరమార్థాలు ఇమిడి ఉన్నాయి! వీటన్నింటి పట్ల శ్రద్ధాసక్తులు కలిగి ఉన్నవారికే అల్లాహ్ మార్గదర్శకత్వం ప్రాప్తిస్తాడు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్‌లో ఇలా సెలవిచ్చాడు:
وَرَتِّلِ الْقُرْآنَ تَرْتِيلًا (వరత్తిలిల్ ఖుర్ఆన తర్తీలా) “ఖుర్ఆన్ ను మాత్రం బాగా – ఆగి ఆగి నింపాదిగా (స్పష్టంగా) పఠించు.” (73:4)
అంటే ఖుర్ఆన్‌ను, ఖుర్ఆన్‌ను మాత్రం బాగా ఆగి ఆగి, నింపాదిగా, స్పష్టంగా పఠించు. అంటే తజ్విద్‌తో, తర్తీల్‌తో, సరైన ఉచ్ఛారణతో. ఖుర్ఆన్‌కి ఒక పద్ధతి ఉంది, తిలావత్ చేసే ఒక విధానం ఉంది. కొన్ని నియమాలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఒక సబ్జెక్టే ఉంది, దానికి తజ్విద్ అంటారు. ఏ అక్షరం ఎక్కడ నుండి ఉచ్ఛరింపబడుతుంది, అవి మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు అరబీలో ‘ح’ (హా) అని ఒక అక్షరం ఉంది, ‘ه’ (హా) అని ఒక అక్షరం ఉంది. తెలుగులో ‘హ’ మాత్రమే ఉంటుంది. ‘ح’ (హా) అనే ఉచ్ఛారణ తెలుగులో లేదు, ఇంగ్లీషులో కూడా లేదు. అలాగే అరబీలో ‘ز’ (జా) ఒక అక్షరం ఉంది, ‘ج’ (జా) ఒక అక్షరం ఉంది. తెలుగులో రెండింటికీ ‘జ’ మాత్రమే ఉంటుంది. ‘ز’ (జా) అనే అక్షరం తెలుగులో లేదు. అలాగే ‘ف’ (ఫా) అనే అక్షరం తెలుగులో లేదు. తెలుగులో ‘ప’ ఉంటుంది, లేకపోతే ‘ఫ’ ఉంటుంది. ‘ف’ (ఫా) అనే అక్షరం తెలుగులో లేదు. చెప్పడం ఏమిటంటే, ఖుర్ఆన్‌ను తజ్విద్‌తో చదవాలి. ‘వరత్తిలిల్ ఖుర్ఆన తర్తీలా’, ఖుర్ఆన్‌ను బాగా ఆగి ఆగి, నింపాదిగా, తజ్విద్‌తో, ప్రతి అక్షరాన్ని తన మఖ్రజ్‌తో మనము చదివే ప్రయత్నం చేయాలి. రాకపోతే నేర్చుకోవాలి.
రెండవ హక్కు ఏమిటంటే, ఖుర్ఆన్‌ను పఠించాలి, ఖుర్ఆన్‌ను పారాయణం చేయాలి. ఇవి ఖుర్ఆన్‌కి సంబంధించిన రెండవ హక్కు. ఇన్షా అల్లాహ్, మిగతా హక్కు తర్వాత ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.
వ ఆఖిరు ద’అవానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, షేఖ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహాబ్ రచించిన ‘అల్-ఖవాయిద్ అల్-అర్బా’ (నాలుగు సూత్రాలు) అనే పుస్తకంలోని మొదటి సూత్రం గురించి వివరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోని అవిశ్వాసులు, అల్లాహ్‌ను ఏకైక సృష్టికర్తగా, పోషకుడిగా మరియు సర్వ వ్యవహారాల నిర్వాహకుడిగా (తౌహీద్ అల్-రుబూబియ్యత్) అంగీకరించారని, కానీ ఈ నమ్మకం మాత్రమే వారిని ఇస్లాంలోకి ప్రవేశింపజేయలేదని ఈ సూత్రం స్పష్టం చేస్తుంది. దీనికి రుజువుగా సూరత్ యూనుస్ మరియు ఇతర సూరాల నుండి ఆయత్‌లు ఉదహరించబడ్డాయి. వారి అవిశ్వాసానికి అసలు కారణం, వారు కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలి (తౌహీద్ అల్-ఉలూహియ్యత్) అనే విషయం నిరాకరించి, తమ ఇతర దైవాలను వదులుకోకపోవడమే అని సూరత్ అస్-సాఫ్ఫాత్ ఆధారంగా వివరించబడింది. ఆరాధనలో ఇతరులను భాగస్వాములుగా కల్పించడం (షిర్క్) అనేది తౌహీద్ అల్-రుబూబియ్యత్‌ను అంగీకరించినప్పటికీ ఒక వ్యక్తిని ఇస్లాం నుండి బహిష్కరిస్తుందని ఈ పాఠం నొక్కి చెబుతుంది.
అల్హందులిల్లాహి హందన్ కసీరా, వ సల్లల్లాహు వ సల్లమ అలా నబియ్యినా ముహమ్మదిన్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి తస్లీమన్ మజీదా, అమ్మా బాద్.
ప్రియ వీక్షకుల్లారా, ఈరోజు అల్-ఖవాయిదుల్ అర్బఅ, నాలుగు నియమాలు అనే పుస్తకం ఏదైతే మనం చదువుతున్నామో, షేఖుల్ ఇస్లాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహీమహుల్లాహ్ వారిది, ఈ పుస్తకం నుండి మూడవ పాఠం చదవబోతున్నాము. మన యొక్క ఈ కంటిన్యూయేషన్ లో మూడో క్లాస్.
ఇంతకుముందు పాఠాలు మీకు తెలిసి ఉన్నాయి అని ఆశిస్తున్నాను నేను. మనం ఏం చదివాము? ముందు దుఆ ఇచ్చారు. ఆ తర్వాత హనీఫియ్యత్ మిల్లతె ఇబ్రాహీం అంటే ఏమిటో తెలియజేశారు. ఆ తర్వాత తౌహీద్ ఉంటేనే ఆరాధనను ఆరాధన అనబడుతుంది. ఎలాగైతే వుదూతో చేయబడిన నమాజును మాత్రమే నమాజు అని అనబడుతుంది. ఎలాగైతే అపానవాయువు జరిగితే వుదూ భంగమైతే, వుదూ మిగిలి ఉండదు, నమాజు కాదు, నెరవేరదు, చేసినా అది లెక్కించబడదు, దాని పుణ్యం మనిషి పొందడు, పైగా అతనికి శిక్ష కలుగుతుంది. అలాగే అంతకంటే మరీ ఘోరంగా, ఎవరైనా నేను అల్లాహ్‌ను ఆరాధిస్తున్నాను అన్నటువంటి సంతోషంలో ఉండి, షిర్క్ నుండి దూరం ఉండకుంటే, ఆ షిర్క్ అతని ఆ ఆరాధనను చెడగొడుతుంది, పాడుచేస్తుంది, దాని పుణ్యం అతనికి లభించదు. ఒకవేళ అది పెద్ద షిర్క్ అయ్యేది ఉంటే, అదే స్థితిలో చనిపోయేది ఉంటే, క్షమాపణ అల్లాహ్ తో కోరకుంటే, అతడు శాశ్వతంగా నరకంలో ఉంటాడు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా మనము తెలుసుకున్నాము.
ఇక రండి, ఆ నాలుగు నియమాలు ఏవైతే ఉన్నాయో, వేటి ద్వారానైతే మనం షిర్క్‌ను మంచి రీతిలో అర్థం చేసుకోగలుగుతామో, ఆ నాలుగు నియమాలలో మొదటిది ఇప్పుడు మనం ప్రారంభం చేస్తున్నాము.
మొదటి సూత్రం: అవిశ్వాసులు రుబూబియ్యత్‌ను అంగీకరించారు
ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహీమహుల్లాహ్ చెబుతున్నారు.
మొదటి నియమం:
الْقَاعِدَةُ الْأُولَى: أَنْ تَعْلَمَ أَنَّ الْكُفَّارَ الَّذِينَ قَاتَلَهُمْ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم مُقِرُّونَ بِأَنَّ اللَّهَ تَعَالَى هُوَ الْخَالِقُ الرَّازِقُ الْمُدَبِّرُ، وَأَنَّ ذَلِكَ لَمْ يُدْخِلْهُمْ فِي الْإِسْلَامِ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ అవిశ్వాసులతో యుద్ధం చేశారో, వారు అల్లాహ్ యే సృష్టికర్త, పోషకుడు, జీవన్మరణ ప్రధాత, విశ్వ వ్యవస్థను నడిపేవాడు అని నమ్మేవారు. అయినా ఈ విశ్వాసం వారిని ఇస్లాంలో చేర్చలేకపోయింది (అంటే అందువల్ల వారు ముస్లింలు కాలేదు)
అల్లాహు అక్బర్. గమనించండి. అల్లాహ్ మాత్రమే సృష్టికర్త, పోషకుడు, జీవన్మరణ ప్రధాత, విశ్వ వ్యవస్థను నడిపేవాడు అన్నటువంటి విశ్వాసం వారిది. అయినా ఈ విశ్వాసం వారిని ఇస్లాంలో చేర్చలేకపోయింది. అంటే ఈ విశ్వాసం వల్ల వారు ముస్లింలు కాలేదు. వారిని ముస్లింలుగా పరిగణించడం జరగలేదు. వారిని విశ్వాసులుగా లెక్కించడం జరగలేదు.
దలీల్ (ఆధారం). దలీల్ ఇస్తున్నారు సూరత్ యూనుస్ ఆయత్ నెంబర్ 31. కానీ ఆ దలీల్, ఆ దలీల్ యొక్క వివరణ మనం వినేకి ముందు ఇక్కడ మరొక్కసారి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు తమ కాలంలోని ఏ అవిశ్వాసులతో యుద్ధాలు చేశారో, ఉదాహరణకు అబూ జహల్, అబూ లహబ్ ఇంకా వేరే ఎందరో. వారు అల్లాహ్ గురించి, ఏ అల్లాహ్‌నైతే మనం నమ్ముతున్నామో ఆ అల్లాహ్ యే నిజమైన సృష్టికర్త, పోషకుడు, జీవన్మరణ ప్రధాత, విశ్వ వ్యవస్థను నడిపేవాడు అన్నటువంటి నమ్మకం వారిది. కానీ ఈ నమ్మకం, ఈ విశ్వాసం ద్వారా వారు ఇస్లాంలో ప్రవేశించలేకపోయారు. ఈ విశ్వాసం వారిని ఇస్లాంలో చేరిపించలేకపోయింది. ఈ విశ్వాసం, ఈ నమ్మకం ద్వారా వారు ముస్లింలుగా, విశ్వాసులుగా పరిగణించబడలేదు. దలీల్ వస్తుంది. విషయం అర్థమైంది కదా?
ఇక ఎందుకు ముస్లింలుగా పరిగణించబడలేదు? ఎందుకు అంటే ఇక్కడ అల్లాహ్ యే ఖాలిఖ్, సృష్టికర్త, రాజిఖ్, పోషకుడు, ఇంకా అల్లాహ్ మాత్రమే అల్ ముదబ్బిర్, ఈ విశ్వ వ్యవస్థను నడిపేవాడు, ఈ విధంగా వారి నమ్మకం ఏదైతే ఉండిందో దీనిని తౌహీదె రుబూబియ్యత్ అని అంటారు. ఇంతకుముందు ఎన్నో సందర్భాలలో మనం చదివి ఉన్నాము కదా? తౌహీద్, అల్లాహ్ ఏకత్వాన్ని మనం నమ్మాలి లేకుంటే విశ్వాసులము సంపూర్ణంగా కాము. అయితే ఆ అల్లాహ్ యొక్క ఏకత్వం ఏ విషయంలో? రుబూబియ్యత్, అస్మా వ సిఫాత్ మరియు ఉలూహియ్యత్. ఈ మూడిటిలో కూడా అల్లాహ్‌ను అద్వితీయునిగా, ఏకైకుడిగా, ఎలాంటి భాగస్వామి లేని వాడిగా నమ్మడం తప్పనిసరి.
ఇక ఈ ముష్రికులు, ఈ కాఫిర్లు, అవిశ్వాసులు, ఎవరైతే ప్రవక్త కాలంలో ఉండినారో అల్లాహ్ మాత్రమే సృష్టికర్త, పోషకుడు, మరియు ఆయనే ఈ విశ్వాన్ని నడిపేవాడు అని నమ్మేవారు. అంటే ఏంటి? తౌహీదె రుబూబియ్యత్‌ను నమ్మేవారు. అంతేకాదు, ఎన్నో అస్మా వ సిఫాత్‌లను నమ్మేవారు అని కూడా తెలుస్తుంది, ఇంకా ఆయత్‌లు ఉన్నాయి. ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహీమహుల్లాహ్ సంక్షిప్తంగా ఒక మూల విషయం చెప్పి దాని యొక్క ఒక్క ఆధారం ఇచ్చి సంక్షిప్తంగా చెప్పాలనుకున్నారు. కానీ మన ప్రాంతాలలో ప్రజలు షిర్క్‌లో ఎలా కూరుకుపోయారంటే, కేవలం అనువాదం చదివి ఒక ఆయత్ దాని అనువాదం చదివేస్తే అంత స్పష్టంగా అర్థం కాదు. అందుకొరకే ఎన్నో ఉదాహరణలు తీసుకొచ్చి, ఎన్నో రకాల ఆధారాలు తీసుకొచ్చి వారికి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆధారం తీసుకొస్తారు ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహీమహుల్లాహ్. దాన్ని ఇప్పుడు మనం చదువుదాము. కానీ అంతకంటే ముందు ఆ నియమం ఏదైతే తెలిపారో దాన్ని అర్థం చేసుకోండి. ఏంటి నియమం? ముష్రికులు అల్లాహ్‌ను మాత్రమే సృష్టికర్త, పోషకుడు, విశ్వ వ్యవస్థను నడిపేవాడు అని అల్లాహ్ మాత్రమే అని నమ్మినప్పటికీ వారు ముస్లింలుగా కాలేదు. వారిని విశ్వాసులుగా పరిగణించబడలేదు. ఎందుకంటే వారు కేవలం తౌహీదె రుబూబియ్యత్‌ను నమ్మారు. తౌహీదె ఉలూహియ్యత్‌ను నమ్మలేదు. కాకపోతే తౌహీదె అస్మా వ సిఫాత్ ను కూడా నమ్మినటువంటి కొన్ని దలీల్‌లు కనబడతాయి మనకు.
రండి ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహీమహుల్లాహ్ చెప్పినటువంటి ఆ దలీల్ ముందు చదివి, ఇంకా ఈ అంశాన్ని మరికొన్ని వేరే ఆధారాలతో తెలుసుకొని, ఆ తర్వాత మన సమాజంలోని ఈనాటి మనం ముస్లింలం ఎలాంటి ఈ నియమానికి సంబంధించి మనం కూడా ఎలాంటి తప్పులో ఉన్నామో, మనలోని చాలామంది, ఆ విషయాన్ని అర్థం చేసుకుందాం.
“ఆకాశం నుండి, భూమి నుండి మీకు ఉపాధిని సమకూర్చేవాడెవడు? చెవులపై, కళ్లపై పూర్తి అధికారం కలవాడెవడు? ప్రాణమున్న దానిని ప్రాణములేని దాని నుండీ, ప్రాణములేని దానిని ప్రాణమున్న దాని నుండీ వెలికి తీసేవాడెవడు? సమస్త కార్యాల నిర్వహణకర్త ఎవరు?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. “అల్లాహ్‌యే” అని వారు తప్పకుండా చెబుతారు. “మరలాంటప్పుడు మీరు (అల్లాహ్ శిక్షకు) ఎందుకు భయపడరు?” (10:31)
ఐదు ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ గమనించండి మీరు, ఒక్కొక్కటిగా గమనించండి. ఐదు ప్రశ్నలు అల్లాహ్ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెబుతున్నాడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు ఈ ముష్రికులను అడుగు, వీరిని ప్రశ్నించు:
మొదటి ప్రశ్న: ఆకాశం నుండి, భూమి నుండి మీకు ఉపాధిని సమకూర్చేవాడు ఎవడు?
రెండో ప్రశ్న: చెవులపై, కళ్ళపై పూర్తి అధికారం కలవాడు ఎవడు?
మూడో ప్రశ్న: ప్రాణమున్న దానిని ప్రాణము లేని దాని నుండి వెలికి తీసేవాడు ఎవడు?
నాలుగో ప్రశ్న: ప్రాణము లేని దానిని ప్రాణమున్న దాని నుండి వెలికి తీసేవాడు ఎవడు?
ఐదో ప్రశ్న: సమస్త కార్యాల నిర్వహణ కర్త ఎవరు?
అర్థమైందా? చూస్తున్నారు కదా, అరబీ ఆయత్ మరియు దాని అనువాదంలో ఐదు విషయాలు స్పష్టంగా కనబడ్డాయా మీకు? భూమ్యాకాశాల నుండి మీకు ఉపాధిని సమకూర్చే వాడు ఎవడు? మీ యొక్క చెవులపై, కళ్ళపై పూర్తి అధికారం కలవాడు ఎవడు? మరియు ప్రాణమున్న దానిని ప్రాణము లేని దాని నుండి, నాలుగవది ప్రాణము లేని దానిని ప్రాణమున్న దాని నుండి వెలికి తీసేవాడు ఎవడు? ఐదవది సమస్త కార్యాల నిర్వహణ కర్త ఎవరు? ఈ ఐదు ప్రశ్నలు మీరు అడగండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పబడినది, ప్రవక్త వారు వారిని అడిగారు, వారికి సమాధానం ఏముండింది? ఖుర్‌ఆన్‌లో వచ్చింది వారి సమాధానం. ఫసయఖూలూనల్లాహ్ (فَسَيَقُولُونَ اللَّهُ) – “అల్లాహ్ యే” అని వారు తప్పకుండా చెబుతారు. అయితే వారికి చెప్పండి: ఫఖుల్ (فَقُلْ) – అఫలా తత్తఖూన్ (أَفَلَا تَتَّقُونَ) – అయితేమీరు ఎందుకు భయపడటం లేదు? షిర్క్ చేయడం ద్వారా ఎంత నష్టం ఉన్నదో, షిర్క్ చేస్తే అల్లాహ్ ఎలాంటి శిక్ష ఇస్తాడో, ఈ శిక్ష నుండి, ఈ షిర్క్ నుండి, శిక్షకు గురిచేసే అటువంటి ఈ షిర్క్ నుండి మీరు ఎందుకు భయపడరు, ఎందుకు దూరం ఉండరు?
సోదర మహాశయులారా, గమనించారా? ఈ విధంగా ఈ మొదటి నియమంలో మనం తెలుసుకున్న విషయం ఏమిటో అర్థమైంది కదా మీకు? ఏంటి? అల్లాహ్ త’ఆలాను సృష్టికర్తగా, పోషణకర్తగా, ఉపాధి ప్రధాతగా, ఇంకా ఈ విశ్వ వ్యవస్థను నడిపేవాడిగా, జీవన్మరణాల అధికారి, ప్రధాతగా కేవలం నమ్మితే సరిపోదు. ఇది కేవలం తౌహీదె రుబూబియ్యత్ మాత్రమే.
ఇక ముష్రికులు అల్లాహ్ యొక్క కొన్ని నామాలను కూడా నమ్మేవారు అని చెప్పాను కదా? దానికి ఏంటి దలీల్? రండి. కొన్ని రకాల దలీల్ నేను మీకు వినిపిస్తాను, చూపిస్తాను. చాలా శ్రద్ధగా మీరు ఈ విషయాన్ని గ్రహించండి.
అయితే ఇంతకుముందు నేను మీ మొబైల్‌లో చాలా సులభంగా ఖుర్‌ఆన్ అనువాదం చదవగలుగుతారు అని చెప్పి ఉన్నాను కదా? అహ్‌సనుల్ బయాన్ నుండి. అయితే అందులో నుండే ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను, ఇదిగోండి.
“భూమ్యాకాశాలను సృష్టించినదెవరు?” అని నువ్వు గనక వారిని ప్రశ్నిస్తే, “సర్వశక్తుడు, సర్వజ్ఞాని అయినవాడే (అల్లాహ్‌యే) సృష్టించాడ”ని వారు తప్పకుండా సమాధానమిస్తారు.” (43:9)
చూశారా? మీకు గనుక నేను ఖుర్‌ఆన్‌లోని మరికొన్ని ఆయతులు ఒకచోట సమకూర్చాను. ఈ అంశం మీకు చాలా స్పష్టంగా అర్థం కావాలని ఒక్కసారి స్పీడ్‌గా ఆ ఆయతులు, వాటి అనువాదం, ఆ ఆయతుల యొక్క రిఫరెన్స్, ఏ సూరాలలో, ఏ ఆయత్ నెంబర్లో ఒక్కసారి చూడండి. ఈ అంశం మీకు చాలా స్పష్టంగా అర్థమైపోవాలి.
ఇక్కడ చూస్తున్నారా? చాలా స్పష్టంగా కనబడుతుందా మీకు? మొదటి దలీల్ ఇప్పుడు మనం చదివినది, ఏదైతే ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహీమహుల్లాహ్ ప్రస్తావించారో సూరత్ యూనుస్ ఆయత్ నెంబర్ 31. ఆ తర్వాత రెండో దలీల్ చూడండి, ఎంత స్పష్టంగా ఉంది:
“మిమ్మల్ని పుట్టించినదెవర”ని నువ్వు గనక వారిని అడిగితే, “అల్లాహ్” అని వారు తప్పకుండా అంటారు. మరలాంటప్పుడు వారు ఎటు తిరిగిపోతున్నారు(ట)?!” (సూరత్ జుఖ్రుఫ్ 43:87)
“ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా భూమిని, అది చచ్చిన తరువాత బ్రతికించినదెవరు? అని నువ్వు వారిని ప్రశ్నించినట్లయితే ‘అల్లాహ్‌యే’ అని వారి నుంచి సమాధానం వస్తుంది. సకల స్తోత్రాలు అల్లాహ్‌కే శోభిస్తాయి అని నువ్వు చెప్పు. కాని వారిలో అనేకులు ఇంగిత జ్ఞానం లేనివారు.” (29:63)
“భూమ్యాకాశాలను సృష్టించినవాడెవడు? సూర్యచంద్రులను పనిలో నిమగ్నుల్ని చేసినవాడెవడు? అని నువ్వు వారిని అడిగితే ‘అల్లాహ్‌యే’ అని వారు చెబుతారు. మరలాంటప్పుడు వారు (సత్యం నుంచి) ఎలా తిరిగిపోతున్నారు?” (29:61)
ఖలకస్సమావాతి వల్ అర్ద్ (خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ) అన్న పదం, భూమ్యాకాశాలను పుట్టించింది ఎవరు? ఇది సూరత్ లుఖ్మాన్, సూర నెంబర్ 31 ఆయత్ నెంబర్ 25 లో కూడా ఉంది. సూరత్ జుఖ్రుఫ్, సూర నెంబర్ 43 మరియు ఆయత్ నెంబర్ 9 లో కూడా ఉంది. అందుకొరకు ఇక్కడ దాని అనువాదం ప్రస్తావించడం జరగలేదు. అలాగే సూరత్ జుమర్, సూర నెంబర్ 39 ఆయత్ నెంబర్ 38 లో కూడా ఉంది.
ఇక రండి సూరతుల్ ముఅ్‌మినూన్. ఈ సూరాలో ఆయత్ నెంబర్ 84 నుండి 89 వరకు ఆరు ఆయతులలో అల్లాహ్ కొన్ని ప్రశ్నలు ఆ ముష్రికులతో అడుగుతున్నాడు మరియు వారి యొక్క సమాధానం ఏముందో శ్రద్ధగా చూడండి, వినండి.
“భూమి మరియు అందులో ఉన్న సమస్త వస్తువులు ఎవరివో మీకే గనక తెలిసి ఉంటే చెప్పండి?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు.“అల్లాహ్‌వే” అని వారు వెంటనే సమాధానం ఇస్తారు. “మరయితే మీరు హితబోధను ఎందుకు గ్రహించటం లేదు?” అని అడుగు. (23:84-85)
ఇక ఆ తర్వాత మళ్ళీ రెండో ప్రశ్న చూడండి. قُلْ مَن رَّبُّ السَّمَاوَاتِ السَّبْعِ وَرَبُّ الْعَرْشِ الْعَظِيمِ ﴿٨٦﴾ سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ أَفَلَا تَتَّقُونَ ﴿٨٧﴾ (ఖుల్ మన్ రబ్బుస్సమావాతిస్సబ్’ఇ వరబ్బుల్ అర్షిల్ అజీమ్. సయఖూలూన లిల్లాహ్. ఖుల్ అఫలా తత్తఖూన్)
“సప్తాకాశాలకు, మహోన్నతమైన (అర్ష్) పీఠానికి అధిపతి ఎవరు?” అని వారిని ప్రశ్నించు.“అల్లాహ్‌యే” అని వారు జవాబిస్తారు. “మరలాంటప్పుడు మీరెందుకు భయపడరు?” అని వారిని (నిలదీసి) అడుగు. (23:86-87)
“సమస్త విషయాల సార్వభౌమత్వం ఎవరి చేతుల్లో ఉందో, శరణు ఇచ్చేవాడెవడో, ఎవరికి వ్యతిరేకంగా ఏ శరణూ లభించదో- ఆయనెవరో మీకు తెలిసి ఉంటే చెప్పండి? అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు.“అల్లాహ్ మాత్రమే” అని వారు చెబుతారు. “మరైతే మీరు ఎలా మోసపోతున్నారు?” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.” (23:88-89)
గమనించారా? ఇప్పుడు మీరు చదివిన ఈ ఆయతులన్నిటి ద్వారా ఏం తెలిసింది? సార్వభౌమత్వం, శరణు ఇచ్చేవాడు, శరణు తీసుకునేవాడు కాదు. ఇంకా అర్ష్ అజీమ్ యొక్క రబ్. సప్తాకాశాల యొక్క రబ్. మరియు ఈ భూమి, ఇందులో ఉన్న సమస్తము, వీటన్నిటికీ అధికారి ఎవరు? అలాగే మిమ్మల్ని పుట్టించిన వాడు ఎవడు? భూమ్యాకాశాలను పుట్టించిన వాడు ఎవడు? సూర్యచంద్రులను మీ ఉపయోగానికి, మీరు ప్రయోజనం పొందడానికి ఒక లెక్క ప్రకారంగా దానిని అదుపులో ఉంచినవాడు ఎవడు? ఆకాశం నుండి వర్షం కురిపించేది ఎవరు? చనిపోయిన భూమి నుండి పంటను పండించేది, ఆ భూమిని బ్రతికించేది ఎవరు? ఈ విధంగా ఆయత్ యూనుస్‌లోనిది కూడా కలుపుకుంటే అందులోని ఐదు ప్రశ్నలు, ఈ విధంగా చూశారా? సుమారు 12 కంటే ఎక్కువ ప్రశ్నలు వారిని ప్రశ్నించడం జరిగింది. వీటన్నిటికీ అధికారి, వీటన్నిటినీ చేసేవాడు ఎవడు అని ఆ కుఫ్ఫార్, అవిశ్వాసుల సమాధానం ఒక్కటే. ఏమిటి? అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్.
అవిశ్వాసానికి అసలు కారణం – ఉలూహియ్యత్‌ను (కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలి) తిరస్కరించడం
అయినా గానీ వారిని ముస్లింలు అని ఎందుకు చెప్పలేదు? వారు విశ్వాసులు అని ఎందుకు చెప్పడం జరగలేదు? ఎందుకు? ఖుర్‌ఆన్ స్వయంగా సమాధానం ఇస్తుంది. ఖుర్‌ఆన్ స్వయంగా సమాధానం ఇస్తుంది, చూడండి. అది కూడా మీకు చూపిస్తున్నాను.
సూరా నెంబర్ 37, ఆయత్ నెంబర్ 35 చూడండి. సూరత్ సాఫ్ఫాత్.
“అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడ”ని వారితో అన్నప్పుడు వారు అహంకారంతో విర్రవీగేవారు.“పిచ్చిపట్టిన ఒక కవి చెప్పినంత మాత్రాన మేము మా పూజ్య దైవాలను వదులుకోవాలా?” అని అనేవారు.” (సూరత్ సాఫ్ఫాత్ 37:35-36)
తెలిసిందా ఆధారం, ఖుర్‌ఆన్ ద్వారా? వారు తౌహీదె రుబూబియ్యత్‌ను నమ్మారు. ఇన్షాఅల్లాహ్ నాలుగో నియమంలో కూడా వస్తుంది, ఈనాటి ముస్లింల కంటే ఎక్కువ బలమైన నమ్మకం తౌహీదె రుబూబియ్యత్ పట్ల వారికి ఉండినది. కానీ ఉలూహియ్యత్, కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలి, ఈ విషయాన్ని వారు తిరస్కరించారు.
చూస్తున్నారు కదా దలీల్? “ఇన్నహుం కానూ ఇజా ఖీల లహుం లా ఇలాహ ఇల్లల్లాహ్” (إِنَّهُمْ كَانُوا إِذَا قِيلَ لَهُمْ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ) – అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరొకడు లేడు అని వారితో చెప్పబడినప్పుడు, “యస్తక్బిరూన్” (يَسْتَكْبِرُونَ) – తకబ్బుర్, గర్వం, అహంకారం ప్రదర్శించేవారు.
అంతేకాదు నఊజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్యవంతుడు, అమీన్, ఎంతో మంచివాడు అన్నటువంటి ప్రశంసలు కురిపించేవారు సైతం, ఈ తౌహీదె ఉలూహియ్యత్ మాట విని ఆ ఈ పిచ్చివాడు, నఊజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, ఈ కవి, నఊజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. గమనించండి, ఏ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారినైతే ప్రశంసించేవారో, తౌహీదె ఉలూహియ్యత్ వైపునకు పిలిచినందుకు, ఆహ్వానించినందుకు, ఆ ప్రవక్తనే షాఇర్, మజ్నూన్, కవి, పిచ్చివాడు అని అంటున్నారు, నఊజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షాఇర్ కవి కూడా కారు, పిచ్చివారు కూడా కారు. కానీ వారలా అనేవారు. అని ఏమనేవారు? “లతారికూ ఆలిహతినా” (لَتَارِكُو آلِهَتِنَا) – ఈ కవి, పిచ్చివారి మాటలు విని మేము మా యొక్క పూజ్య దైవాలను వదులుకోవాలా? అంటే అర్థమైంది కదా? ఇక్కడ “ఆలిహతినా” (آلِهَتِنَا), మా యొక్క ఆరాధ్య దైవాలు, మేము ఎవరినైతే పూజించే వారిమో వారు ఈ భూమ్యాకాశాలను పుట్టించారని నమ్మేవారు కాదు. వారు మమ్మల్ని పుట్టించారా? లేదు లేదు లేదు, అల్లాహ్ యే పుట్టించాడు. మీరు ఎవరినైతే పూజిస్తారో, ఆరాధన యొక్క కొన్ని రకాలు ఎవరి ముందైతే చేస్తారో, వారు మీకు ఉపాధిని ఇస్తున్నారా? ఆకాశం నుండి ఏదైనా మీకు కురిపిస్తున్నారా? భూమి నుండి పంట పండిస్తున్నారా? మీకు కావలసినటువంటి ఆహారం వసగుతున్నారా? వారేమనేవారు? లేరు లేరు లేరు, అది కేవలం అల్లాహ్ మాత్రమే ఇస్తాడు. మరి అలాంటప్పుడు అల్లాహ్‌నే మీరు ఆరాధించండి. లేదు లేదు, వీరిని కూడా ఆరాధిస్తాం. అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్.
సోదర మహాశయులారా, ఈ మాటను ఇన్ని ఆధారాలతో, ఇంత వివరంగా మీకు నచ్చచెప్పడం జరుగుతుంది అంటే ఇక మీరు సమాజంలో చూడండి. ఈరోజు ముస్లింలు అని తమకు తాము చెప్పుకునే వాళ్ళు, నమాజులు కూడా చేసేవాళ్ళు, ఉపవాసాలు కూడా ఉండేవాళ్ళు, కొన్ని సందర్భాలలో అల్లాహ్ శక్తి కలగజేస్తే హజ్ కూడా చేసేవాళ్ళు. కానీ, అయ్యో మా బడే పాహాడ్ సాహెబ్‌ను ఎలా వదులుకోవాలి? ఫలానా మా బాబాగారిని ఎలా వదులుకోవాలి? మీరు వహాబీలు చెప్పిన మాటకు విని మేము మా యొక్క పీర్ సాహెబ్‌ను వదులుకోవాలా? ఇలా అంటారు కదా? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఆనాటి కాలంలో ముష్రికులు ఇచ్చినటువంటి సమాధానం, ఈ రోజుల్లో మనం, మనకు మనం ముస్లింలు అనుకునే వాళ్ళలో ఎంతోమంది ఇలాంటి సమాధానాలు ఇస్తారు. అయితే గమనించండి, అల్లాహ్ వద్ద కుటుంబం, వంశం, పేరు ప్రఖ్యాతులు, సమాజంలో ఇతనికి ఎంత హోదా అంతస్తు ఉంది, ఇవన్నీ అల్లాహ్ చూడడు. ఒకవేళ అల్లాహ్ అలా చూసేవాడైతే సొంత బాబాయి అబూ లహబ్, తబ్బత్ యదా అబీ లహబిన్ వతబ్బ్ అని హెచ్చరికను, శాపనను, నరకం లో వేయబడతాడు అన్నటువంటి విషయం ఖుర్‌ఆన్‌లో ఇలా వస్తుందా? అంటే అల్లాహ్ వద్ద ఏం చూడడం జరుగుతుంది? ఎవరు తౌహీదె ఉలూహియ్యత్‌ను విశ్వసిస్తారో, ఎవరు తౌహీదె ఉలూహియ్యత్ ప్రకారంగా తమ జీవితాన్ని గడుపుతారో.
మొదటి నియమం ఈ నాలుగు నియమాల్లో అల్-ఖవాయిదుల్ అర్బాలో తెలిసిందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ అవిశ్వాసులతోనైతే యుద్ధం చేశారో వారు అల్లాహ్ నే సృష్టికర్తగా, పోషకునిగా, సర్వ వ్యవస్థను నడిపేవాడిగా నమ్మేవారు. కానీ ఆ నమ్మకం, ఆ విశ్వాసం వారిని ఇస్లాంలో చేర్చలేదు. దలీల్ సూరత్ యూనుస్ ఆయత్ నెంబర్ 31. ఎందుకు చేర్చలేదు? ఎందుకంటే వారు తౌహీదె రుబూబియ్యత్‌ను నమ్మారు, తౌహీదె ఉలూహియ్యత్‌ను నమ్మలేదు. ఏమిటి దలీల్? ఇది, సూరత్ సాఫ్ఫాత్ సూరా నెంబర్ 37, ఆయత్ నెంబర్ 35.
సోదర మహాశయులారా, మరికొన్ని ఆధారాలు ఉన్నాయి, కానీ సమయం సరిపోదు అందుకొరకే నేను ముందుకు సాగుతున్నాను. ఇక ఇక్కడ విషయం అర్థమైంది కదా? నేను ఈ అన్ని వివరాలు మీకు ఏదైతే తెలియజేశానో సొంత నా వైపు నుండి ఇది కాదండి. ఇక్కడ చూడండి ఇది పీడీఎఫ్ షేఖ్ సాలెహ్ అల్-ఫౌజాన్ హఫిజహుల్లాహ్ వారు అల్-ఖవాయిదుల్ అర్బా యొక్క వ్యాఖ్యానం చేసినది. ఈ పీడీఎఫ్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది షేఖ్ అబ్దుల్ ముహ్సిన్ అల్-ఖాసిమ్, ఇమాం వ ఖతీబ్ మస్జిద్-ఎ-నబవీ వారు. మరియు ఇది షేఖ్ అబ్దుర్రజాఖ్ అల్-బద్ర్ హఫిజహుల్లాహ్. మరియు ఇది షేఖ్ సాలెహ్ ఆలష్ షేఖ్. ఇంకా అలాగే షేఖ్ బిన్ బాజ్ రహమహుల్లాహ్ వారి యొక్క, ఇవన్నీ చదివి మరియు ఖుర్‌ఆన్‌లో ఈ ముష్రికుల యొక్క తౌహీదె రుబూబియ్యత్ గురించి వచ్చినటువంటి ఆ ఆయతులను చదివి వాటిని గ్రహించి, అర్థం చేసుకొని ఆ తర్వాత వీటి యొక్క సారాంశం మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము.
ఇకనైనా మీరు ఈ ఖుర్‌ఆన్ ఆధారంగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ఆధారంగా చెప్పబడుతున్న విషయాలను శ్రద్ధ వహించండి, మంచిగా అర్థం చేసుకోండి, ఆ తర్వాతనే మీరు తౌహీదె ఉలూహియ్యత్‌ను నమ్మకుంటే ఎంత ఘోరమైన నష్టం జరుగుతుందో దాన్ని అర్థం చేసుకోగలుగుతారు.
ఇక ఆయత్ ఏదైతే వచ్చినదో ప్రత్యేకంగా సూరత్ యూనుస్‌లోని ఆయత్ నెంబర్ 31, దానిలోని ఒక్కొక్క విషయాన్ని నేను వివరిస్తే ఇంకా చాలా ఎక్కువ సమయం పడుతుంది. కానీ సంక్షిప్తంగా మీకు అర్థమైంది కదా? ఆ ఆయత్ నెంబర్ 31 లో ఐదు ప్రశ్నలు ముష్రికులతో చేయబడ్డాయి. భూమ్యాకాశాల నుండి మీకు ఆహారం ఇచ్చేది ఎవరు? ముష్రికులు ఏం జవాబు ఇచ్చారండి? అల్లాహ్ మాత్రమే అని. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది ముస్లింలు ఏమంటారు? నేను వారి యొక్క తావీజు వేసుకున్నా, కాబా యొక్క తలుపు ఏదైతే ఉందో అది నేను నా ఇంట్లో దాని ఫోటో పెట్టుకున్నా, నేను ఫలానా బాబా వద్దకు వెళ్లి అక్కడ మొక్కుకొని వచ్చినా, అప్పుడే నాకు శుభం కలిగిందండి, నా వ్యాపారం పెరిగిందండి, నా పంట మంచిగా పండిందండి, నేను ఫలానా వలీ వద్దకు వారి యొక్క దర్గా వద్దకు, మజార్ వద్దకు వెళ్లి వచ్చిన తర్వాతనే నాకు సంతానం కలిగిందండి, లేకుంటే అంతకుముందు నేను ఎన్నో నమాజులు చేస్తూ ఉండేవాడిని, కానీ సంవత్సరాల తరబడి ఎంతో దుఆ చేసినా నాకు సంతానం కాలేదు, ఇలా అనేవారు మన సమాజంలో ఉన్నారా? ఎంత బాధాకరమైన విషయం గమనించండి. ప్రవక్త కాలం నాటి ముష్రికులు ఏం నమ్ముతున్నారు? భూమ్యాకాశాల నుండి ఎక్కడి నుండైనా ఆహారం ఇచ్చేది కేవలం అల్లాహ్ మాత్రమే. కేవలం అల్లాహ్ మాత్రమే.
ఇక ఆ తర్వాత? ఎవరు మీ చెవుల మరియు మీ కళ్ళ పై అధికారం కలిగి ఉన్నాడు? ఈ ప్రశ్నకు సమాధానంలో కూడా వారేమంటారు? అల్లాహ్ మాత్రమే. కానీ ఈ రోజుల్లో మన అనేక మంది ముస్లింలు ఈ విషయంలో కూడా వేరే ఎవరెవరితో భయపడుతూ ఉంటారు. ఇక్కడ మీ చెవులపై, మీ కళ్ళపై అధికారం ఎవరికి ఉంది, ఇమాం ఇబ్ను కసీర్ రహీమహుల్లాహ్ చెప్పారు, “మొదటగా ఈ శక్తిని ప్రసాదించినది ఎవరు? ఈ వినే శక్తి, చూసే శక్తి ప్రసాదించినది ఎవరు? అల్లాహ్ తలుచుకుంటే ఎప్పుడైనా మీ నుండి వాటిని తీసుకోగలుగుతాడు.” సూరతుల్ ముల్క్ ఆయత్ నెంబర్ 23, సూరతుల్ అన్’ఆమ్ ఆయత్ నెంబర్ 46 ఆధారంగా ఈ మాట తెలియజేశారు.
ఇక ఆ తర్వాత ఏముంది? ప్రాణమున్న దానిని ప్రాణము లేని దాని నుండి, ప్రాణము లేని దానిని ప్రాణమున్న దాని నుండి వెలికి తీసేవాడు ఎవడు? ఇక్కడ ఒక ఉదాహరణ ఏమివ్వడం జరిగింది? వేరే తఫ్సీర్‌లలో, ఉదాహరణకు ఇమాం నవాబ్ సిద్దీఖ్ హసన్ ఖాన్ అల్-ఖన్నూజీ రహీమహుల్లాహ్ తమ తఫ్సీర్‌లో తెలియజేస్తున్నారు. ఈ జీవి నుండి నిర్జీవిని, నిర్జీవి నుండి జీవిని, ప్రాణమున్న దాని నుండి ప్రాణము లేని దానిని, ప్రాణము లేని దాని నుండి ప్రాణమున్న దానిని వెలికి తీయడం ఇది ఎంతో శక్తి గల విషయం. ఏమంటారు? బికుద్రతిహిల్ అజీమా వ మిన్నతిహిల్ అమీమా. తీసిన వారు ఎవరు? అంటే కేవలం అల్లాహ్ మాత్రమే. ఫత్హుల్ బయాన్, ఇక్కడ ఉంది చూడండి. ఏమంటున్నారు ఇక్కడ? అల్లాహ్ త’ఆలా ప్రాణమున్న కోడి నుండి గుడ్డు, గుడ్డులో ప్రాణం లేదు. కానీ అల్లాహ్ తలుచుకున్నప్పుడు అదే ప్రాణం లేని గుడ్డు ద్వారా మళ్ళీ కోడిపిల్లను పుట్టిస్తాడు. కదా? ఇది ఒక ఉదాహరణ మనకు అర్థం కావడానికి. అలాగే మరొక ఉదాహరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. “వన్నబాత మినల్ హబ్బా” – ఒక చెట్టు నుండి విత్తనం, విత్తనం నుండి చెట్టు. ఈ విధంగా, ఇక వేరే కొన్ని ఇలాంటి ఉదాహరణలు కూడా ఇవ్వబడినవి.
సోదర మహాశయులారా, ఆ తర్వాత అల్లాహ్ చెబుతున్నాడు, “వమన్ యుదబ్బిరుల్ అమ్ర్” – అంటే ఈ సర్వ విశ్వ వ్యవస్థను నడిపేవాడు. అంటే ఏంటి? పుట్టించడం, చావు ఇవ్వడం, ఇంకా ఈ పూర్తి విశ్వంలో అందరికీ వారికి తగిన అవసరాలన్నీ తీరుస్తూ ఉండడం. ఈ ఖగోళం ఏదైతే చూస్తామో, ఖగోళ శాస్త్రం అని చదువుతారు, పెద్ద పెద్ద సైంటిస్టులు అవుతారు కదా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అవి వాటి వాటి సమయాల్లో, వాటి వాటి కక్ష్యలో తిరుగుతూ ఉండే విధంగా, ఇదంతా నిర్వహించేవాడు, ఈ పూర్తి విశ్వంలో ఎక్కడ ఏమి జరిగినా గానీ దానికి బాధ్యుడు, నడిపించేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే.
ఇంతటి గొప్ప శక్తి గల అలాంటి అల్లాహ్‌ను వదిలి వీర్యపు బిందువుతో పుట్టినటువంటి ఒక మానవుడు, అది కూడా చనిపోయాడు, అతన్ని పూజించడం? మానవుడు అతనిలో స్వయం ఏ శక్తి లేదు, అల్లాహ్ ఏ కొత్త శక్తి ఇచ్చాడో అది ప్రాణం ఉన్నంతవరకు సద్వినియోగించుకొని అతని యొక్క విధేయతలో గడపాలి. అలా కాకుండా ఎవరెవరినో మనం ఎంతో పుణ్యాత్ములుగా భావించి వారిని పూజిస్తే, ఆరాధనకు సంబంధించిన కొన్ని విషయాలు వారి కొరకు చేస్తే ఎంత పెద్ద నష్టం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి.
అందుకొరకే ఈ మొదటి నియమం ద్వారా తెలపబడిన విషయం ఏమిటంటే, ముష్రికులు సైతం తౌహీదె రుబూబియ్యత్, అందులో వచ్చేటటువంటి ఎన్నో విషయాలు, ఒక 12, 13 ప్రశ్నల రూపంలో వారిని అడగడం జరిగింది, వారు కేవలం ఏకైకుడైన అల్లాహ్ మాత్రమే సృష్టించాడు, వీటికి అధికారి, అల్లాహ్ తప్ప వేరే ఎవరిలో కూడా వీటి శక్తి లేదు అని స్పష్టంగా చెప్పేశారు. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది ముస్లింలు ఈ తౌహీదె రుబూబియ్యత్‌లో కూడా షిర్క్ చేస్తున్నారు. వారు అల్లాహ్‌ను అంతగా నమ్మినప్పటికీ ముస్లింలు కాలేదు అంటే, ఉలూహియ్యత్‌ను తిరస్కరించారు, అల్లాహ్ ఆరాధనలో వేరేవారిని భాగస్వామిగా చేశారు. మరి ఈరోజు మనం ముస్లింలమని పేరును పెట్టుకొని అలాంటి ఆరాధనలో ఏదైనా భాగస్వామ్యం కలగజేస్తే అల్లాహ్ మనల్ని మెచ్చుకుంటాడా? మనం అల్లాహ్ యొక్క శిక్ష నుండి తప్పించుకోగలుగుతామా?
అల్లాహ్ త’ఆలా ఈ మొదటి నియమాన్ని ఏదైతే మనం విన్నామో, ఇన్ని ఆధారాలతో మంచిగా అర్థం చేసుకొని, మన ఇంటి వారిలో ఎవరైతే ఇలాంటి షిర్క్‌కు పాల్పడి ఉన్నారో, మన చుట్టుపక్కల ఎవరైతే రుబూబియ్యత్‌ను నమ్మి ఉలూహియ్యత్‌ను నమ్మటం లేదో, ఈ ఆయతులు, ఈ హదీసులు, ఈ దలాయిల్ ఆధారాలన్నీ చూపించి వారికి మంచిగా నచ్చచెప్పే, వారికి తౌహీద్ యొక్క దావత్ మంచి రీతిలో ఇచ్చేటువంటి భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ‘ఔలియా అల్లాహ్’ (అల్లాహ్ యొక్క మిత్రులు) యొక్క నిజమైన అర్థం మరియు నిర్వచనంపై దృష్టి సారించారు. వక్త ‘వలీ’ (ఏకవచనం) మరియు ‘ఔలియా’ (బహువచనం) అనే పదాల భాషాపరమైన మరియు మతపరమైన అర్థాలను వివరిస్తారు. సూరహ్ యూనుస్ లోని 62 మరియు 63 ఆయతుల ద్వారా ఖురాన్ యొక్క నిర్వచనాన్ని స్పష్టం చేస్తారు, దీని ప్రకారం ఔలియా అల్లాహ్ అంటే విశ్వసించి, దైవభీతి (తఖ్వా)తో జీవించేవారు. మహిమలు లేదా కరామాతులు చూపించడం అనేది ఔలియాగా ఉండటానికి అవసరమైన ప్రమాణం కాదని, అది ఒక తప్పుడు భావన అని వక్త నొక్కి చెబుతారు. అల్లాహ్ సామీప్యం అనేది కల్మషం లేని విశ్వాసం మరియు భయభక్తులతో కూడిన జీవన విధానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, ప్రతి దైవభీతిపరుడూ అల్లాహ్ కు ప్రియతముడేనని స్పష్టం చేశారు.
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బాద్.
అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
ఔలియా అల్లాహ్ అంటే ఎవరు?
ఈరోజు మనం, ఔలియా అల్లాహ్ అంటే ఎవరు? తెలుసుకుందాం. వలీ, ఔలియా. వలియుల్లాహ్, ఔలియావుల్లాహ్ అంటే ఎవరో తెలుసుకుందాం.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర యూనుస్ ఆయత్ నెంబర్ 62లో ఇలా సెలవిచ్చాడు.
أَلَا إِنَّ أَوْلِيَاءَ اللَّهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ (అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలాహుమ్ యహ్ జనూన్) “వినండి! అల్లాహ్ మిత్రులకు ఎలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.” (10:62)
ఔలియా అల్లాహ్ గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చెప్పిన మాట ఇది, సూర యూనుస్ ఆయత్ నెంబర్ 62.
ఔలియా అనే పదం, వలీ అనే పదానికి బహువచనం. అంటే, వలీ ఏకవచనం, ఔలియా బహువచనం.
నిఘంటువు పరంగా వలీ అంటే సన్నిహితుడని అర్థం వస్తుంది. దీని ప్రకారం, ఔలియా అల్లాహ్ అంటే చిత్తశుద్ధితో, అల్లాహ్ కు విధేయత కనబరచి, చెడు నుండి తమను కాపాడుకుని దైవ సామీప్యం పొందేందుకు నిరంతరం పాటుపడిన వారు ఔలియాలు.
అల్లాహ్ స్వయంగా, ఈ ఆయత్ తర్వాత, “అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలాహుమ్ యహ్ జనూన్”, వినండి, ఔలియా అల్లాహ్ కు భయము గానీ, దుఃఖము గానీ ఉండదు అని చెప్పిన తర్వాత, ఔలియా అల్లాహ్ యొక్క నిర్వచనాన్ని అల్లాహ్ తెలియజేశాడు. స్వయంగా ఈ తర్వాతి ఆయత్ లో ఔలియా అల్లాహ్ ను నిర్వచించాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. ఎవరు వారు?
الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ (అల్లజీన ఆమనూ వ కానూ యత్తఖూన్) వారు విశ్వసించిన వారై, (చెడుల విషయంలో అల్లాహ్‌కు) భయపడేవారై ఉంటారు.(10:63)
ఔలియా అల్లాహ్ అంటే, విశ్వాసంతో పాటు తన పట్ల భయభక్తుల విధానాన్ని కలిగి ఉంటారని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వివరించాడు. అంటే విశ్వాసంతో పాటు తన పట్ల భయభక్తుల విధానాన్ని కలిగి ఉంటారు ఔలియాలు.
అభిమాన సోదరులారా, దీన్ని బట్టి అవగతమయ్యేది ఏమిటంటే, అల్లాహ్ సామీప్యం పొందగోరేవారు, నిష్కల్మషమైన విశ్వాసం కలిగి ఉండటంతో పాటు, భయభక్తులతో కూడుకున్న జీవితం గడపాలి. ప్రతి దైవభీతిపరుడూ అల్లాహ్ కు ప్రియతముడే. వలియుల్లాహ్ యే అవుతాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దైవభీతిపరుడూ, వలియుల్లాహ్ యే అవుతాడు, అల్లాహ్ కు ప్రియతముడే అవుతాడు.
ఔలియా గురించి తప్పుడు భావనలు
కానీ, ఇక్కడ ఒక విషయం మనము గమనించాలి. సమాజంలో ఏం జరుగుతోంది. జనులు మాత్రం, సమాజంలో ఒక వర్గం వారు, కొందరు, వారు మాత్రం దీనిని ఒక ప్రహసనంగా మార్చారు. వలీ, ఔలియా అల్లాహ్ అంటే దీనిని ఒక ప్రహసనంగా మార్చేశారు. మహిమలు చూపే వారే అల్లాహ్ ప్రియతములు కాగలుగుతారని వారు భాష్యం చెప్పారు. తమ భాష్యాన్ని సమర్థించుకోవటానికి, తాము ఇష్టపడే వలీలకు స్వకల్పిత మహిమలను ఆపాదించారు.
అభిమాన సోదరులారా, ఈ విషయం గమనించండి, అల్లాహ్ సామీప్యం పొందటానికి, మహిమలు ప్రదర్శించటానికి అసలు సంబంధమే లేదు. ఒకవేళ ఎవరి ద్వారానైనా ఏదైనా మహిమ ప్రదర్శితమైతే, అది అల్లాహ్ ప్రణాళిక, దైవేచ్ఛ అని అనుకోవాలి. అంతేగానీ, అది ఆ వలీ తరఫు నుంచి జరిగిందని ఏమీ కాదు.
అలాగే, ఒక ధర్మానిష్ఠాపరుని ద్వారా, ఒక విశ్వాసి ద్వారా, ఒక దైవభీతిపరుని ద్వారా ఏదైనా మహిమ ప్రదర్శితం కాకపోయినంత మాత్రాన వారి భక్తి తత్పరతకు శంకించనవసరం లేదు, శంకించకూడదు. ఎవరి అంతర్యాలలో ఎంత భక్తి ఉందో, అది అల్లాహ్ కే బాగా తెలుసు.
అభిమాన సోదరులారా, సారాంశం ఏమిటంటే, అల్లాహ్ సామీప్యం పొందగోరే వారు, నిష్కల్మషమైన విశ్వాసం కలిగి ఉండటంతో పాటు, భయభక్తులతో కూడుకున్న జీవితం గడిపే వారు ఔలియా అల్లాహ్ అవుతారు. అంటే ప్రతి దైవభీతిపరుడూ అల్లాహ్ కు ప్రియతముడే, అంటే వలియుల్లాహ్ యే అని అర్థమైంది. అలాగే ఈ మహిమలు, కరామాతులు ప్రదర్శితమైతేనే ఔలియా అల్లాహ్, లేకపోతే లేదు అనేది ఎటువంటి రూల్స్ లేదు. అలా వాటికి సంబంధం అసలు లేదు. మహిమలు, కరామాతులు, అది జరిగినా, జరగకపోయినా, ఔలియా అల్లాహ్ అవ్వటానికి సంబంధము లేదు. ఎవరి ఆంతర్యాలలో ఎంత భక్తి ఉందో అది అల్లాహ్ కే బాగా తెలుసు.
అభిమాన సోదరులారా, ఇది క్లుప్తంగా ఔలియా అల్లాహ్ అంటే ఎవరో మనం తెలుసుకున్నాం. ఇన్ షా అల్లాహ్, ఇంకా ఇతర విషయాలు వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.
వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో షేక్ సలీం జామిఈ గారు హజ్ యొక్క ఘనత మరియు విశిష్టతలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరిస్తారు. హజ్ ఇస్లాం యొక్క ఐదు మూలస్తంభాలలో ఒకటని, దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు. స్వీకరించబడిన హజ్ యొక్క ప్రతిఫలం స్వర్గం అని, అది గడిచిన పాపాలన్నింటినీ మరియు పేదరికాన్ని కూడా తొలగిస్తుందని ప్రవక్త వచనాల ఆధారంగా వివరిస్తారు. హజ్ యాత్రికులు అల్లాహ్ యొక్క అతిథులు అని, వారి ప్రార్థనలు స్వీకరించబడతాయని పేర్కొంటారు. హజ్ కు వెళ్లే వారికి ముఖ్యమైన సూచనలు ఇస్తూ, స్తోమత కలిగిన వెంటనే హజ్ చేయాలని, హలాల్ సంపాదనతోనే చేయాలని మరియు హజ్ సమయంలో గొడవలు, అశ్లీలతకు దూరంగా ఉండాలని బోధిస్తారు. వ్యాధిగ్రస్తులు మరియు పసిపిల్లల తరఫున హజ్ చేసే విధానాలను కూడా ప్రస్తావిస్తారు. చివరగా, హజ్ నుండి నేర్చుకోవలసిన ఐక్యత, సమానత్వం మరియు ఏకేశ్వరోపాసన వంటి గుణపాఠాలను గుర్తుచేస్తూ ప్రసంగాన్ని ముగిస్తారు.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్
గౌరవనీయులైన పండితులు, పెద్దలు, ఇస్లామీయ సోదర సోదరీమణులారా, మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు
హజ్ ఘనత
ఇంతకుముందు మీరు విన్నట్టుగా, ఈనాటి ప్రసంగంలో మనం హజ్ ఘనత గురించి ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం.
చూడండి, ఎప్పటి నుంచి అయితే రమజాను మాసము ముగిసిపోయిందో, షవ్వాల్ నెల కూడా ముగిసిందో, జిల్ ఖాదా నెల మొదలైనప్పటి నుండి ప్రపంచం నలుమూలల నుండి మనము ఒక వార్త పదేపదే వార్తా ఛానళ్లలో అలాగే అంతర్జాల మాధ్యమాలలో చూస్తూ వింటూ వస్తున్నాం, అదేమిటంటే దైవభక్తులు, అల్లాహ్ దాసులు ప్రపంచం నలుమూలల నుండి మక్కాకు చేరుకుంటున్నారు, పవిత్రమైన హజ్ యాత్ర చేసుకోవటానికి అని మనము కొన్ని దృశ్యాలు, కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాం.
కాబట్టి మిత్రులారా, ఇది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిర్ణయించిన హజ్ మాసాలలో ఒక మాసం జిల్ ఖాదా మాసం కాబట్టి ఈ సందర్భంలో మనము హజ్ గురించి తెలుసుకోబోతున్నాం, ఇన్ షా అల్లాహ్
హజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ, మనసులో మనమంతా అల్లాహ్ ను కోరుకుందాం. అదేమిటంటే, “ఓ అల్లాహ్, ఎవరెవరైతే ఇప్పుడు మనం ఇక్కడ హజ్ గురించి ప్రసంగం వింటూ ఉన్నామో, వారందరినీ కూడా నీవు ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా హజ్ యాత్ర చేసుకోవటానికి అన్ని రకాల సౌకర్యాలు ప్రసాదించు.”, ఆమీన్
హజ్ ప్రాముఖ్యత – ఇస్లాం యొక్క ఐదు మూలస్తంభాలలో ఒకటి
అయితే మిత్రులారా, ముందుగా ఇప్పుడు మనము హజ్ గురించి తెలుసుకునేటప్పుడు ఒక విషయం దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. అదేమిటంటే, హజ్ అనేది ఇస్లాం ధర్మంలో ఒక చిన్న విషయము కాదు. ఏ ఐదు విషయాల మీద అయితే ఇస్లాం నిలబడి ఉందో, ఆ ముఖ్యమైన ఐదు అంశాలలో ఒక ముఖ్యమైన అంశం అని మనము గుర్తించవలసి ఉంది.
దీనికి ఆధారం మనం చూసినట్లయితే, బుఖారీ, ముస్లిం గ్రంథాలలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు:
“ఇస్లాం ఐదు మూలస్తంభాలపై నిర్మించబడింది: అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్య దేవుడు లేడని మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యం పలకడం, నమాజు స్థాపించడం, జకాత్ ఇవ్వడం, అల్లాహ్ గృహం (కాబా) యొక్క హజ్ చేయడం మరియు రమదాన్ ఉపవాసాలు పాటించడం.“
ఇస్లాం ఐదు ముఖ్యమైన అంశాల మీద నిర్మితమై ఉంది. అంటే, మన ఇస్లాం ధర్మం, ఏ ధర్మాన్ని అయితే మనం అంతా అవలంబిస్తూ ఉన్నామో, అది ఐదు ముఖ్యమైన అంశాల మీద నిర్మించబడి ఉంది. పిల్లర్స్ లాంటివి అవి. ఆ ఐదు విషయాలు, ఏంటి అవి? ప్రవక్త వారు తెలియజేస్తున్నారు: అల్లాహ్ ఒక్కడే నిజమైన ఆరాధ్య దేవుడు, ఆయన తప్ప మరెవ్వరూ నిజమైన ఆరాధ్య దేవుళ్ళు కాదు అని సాక్ష్యం పలకాలి. ఇది మొదటి ముఖ్యమైన అంశం. అలాగే, రెండవది, నమాజు ఆచరించటం. అలాగే, జకాతు చెల్లించటం. అల్లాహ్ పుణ్యక్షేత్రమైన, పవిత్ర అల్లాహ్ గృహమైన కాబతుల్లా యొక్క హజ్ ఆచరించటం. వసౌమి రమదాన్, రమదాన్ నెల ఉపవాసాలు పాటించటం.
ఇక్కడ మిత్రులారా, మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఐదు ముఖ్యమైన అంశాల మీద ఇస్లాం ధర్మం నిర్మించబడి ఉంది, నిలబెట్టబడి ఉంది, అందులో ఒక విషయం హజ్ ఆచరించటం అని తెలియజేశారు కాబట్టి, హజ్ ఆచరించటం ఒక చిన్న ఆరాధన కాదు, ఒక చిన్న విషయం కాదు, ఇస్లాం నిర్మించబడి ఉన్న పునాదులలో ఒక పునాది అని, ముఖ్యమైన అంశము అని, గొప్ప కార్యము అని ముందుగా మనమంతా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవలసి ఉంది.
హజ్ ఎవరిపై విధి?
ఇక ఆ తర్వాత, హజ్ ఎవరి మీద విధి చేయబడింది అంటే, ధార్మిక పండితులు ఐదు, ఆరు విషయాలు ప్రత్యేకంగా తెలియజేసి ఉన్నారు. ఎవరి మీద హజ్ విధి చేయబడింది అంటే, ఆ వ్యక్తి ముస్లిం అయి ఉండాలి. అంటే ముస్లిమేతరుల మీద హజ్ విధి చేయబడలేదు అన్నమాట. అలాగే, ఆ వ్యక్తి బుద్ధిమంతుడై ఉండాలి. జ్ఞానం లేని వారు, పిచ్చి వారు ఉంటారు కదండీ, అలాంటి వారి మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి యవ్వనుడై ఉండాలి, అంటే పసి పిల్లల మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి స్వతంత్రుడై ఉండాలి, అంటే బానిసత్వంలో ఉన్న వారి మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి స్తోమత గలవాడై ఉండాలి, అంటే స్తోమత లేని నిరుపేదల మీద హజ్ విధి చేయబడలేదు.
ఏమండీ? ఇక్కడ నేను ఐదు విషయాలు ప్రస్తావించాను. ముస్లిం అయి ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి, యవ్వనస్తుడై ఉండాలి, స్వతంత్రుడై ఉండాలి, స్తోమత కలిగి ఉన్న వాడై ఉండాలి. ఇవి పురుషులు, మహిళలకు అందరికీ వర్తించే నిబంధనలు.
అయితే మహిళలకు ప్రత్యేకంగా మరొక నిబంధన కూడా పండితులు తెలియజేసి ఉన్నారు. ఏంటది? మహిళలకు హజ్ చేయటానికి వారికి తోడుగా ‘మహరమ్’ కూడా జతగా ఉండాలి. మహరమ్ అంటే ఎవరు? ఆ మహిళతో ఆ పురుషునితో ఎప్పటికీనీ ఏ విధంగాను, ఏ కారణంగాను వివాహం జరగదు, అసంభవం అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్ణయించారో కదా, అలాంటి వారిని ‘మహరమ్’ అంటారు. ఉదాహరణకు, మహిళ ఉంది, ఆ మహిళ యొక్క తండ్రి. తండ్రితో ఆ మహిళ యొక్క వివాహము ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ కారణంగాను జరగదు కాబట్టి తండ్రి ఆ మహిళకు మహరమ్ అవుతాడు. ఆ విధంగా చాలా ఉన్నాయండి, అవన్నీ ఇన్ షా అల్లాహ్ సందర్భం వచ్చినప్పుడు మనం ప్రత్యేకంగా దాని గురించి చర్చించుకుందాం. ఇప్పుడు మనము హజ్ ఘనత గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మన మాటను ముందుకు కొనసాగిద్దాం.
హజ్ ఘనతలు మరియు విశిష్టతలు
ఇక రండి, హజ్ యొక్క విశిష్టతలు, ఘనతలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇన్ షా అల్లాహ్ మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. శ్రద్ధగా వినండి, ఇన్ షా అల్లాహ్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరించు గాక.
స్వీకరించబడిన హజ్ యొక్క ప్రతిఫలం స్వర్గం
హజ్ యొక్క విశిష్టత ఏమిటంటే, మనిషి చేసే ప్రతి సత్కార్యానికి, ప్రతి ఆరాధనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని కొన్ని పుణ్యాలు నిర్ణయించి ఉన్నాడు. అయితే, కొన్ని సత్కార్యాలు, పుణ్య కార్యాలు, ఆరాధనలు ఎలా ఉన్నాయి అంటే, వాటికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పుణ్యము అపరిమితం చేసేశాడు. లేదంటే కొన్ని ఆరాధనలు, సత్కార్యాలు ఎలా ఉన్నాయి అంటే, దానికి బదులుగా ఇక స్వర్గము తప్ప మరొకటి కానుకగా ఇవ్వబడదు అని తేల్చేసి ఉన్నాడు. అందులో హజ్ కూడా ఉంది. హజ్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు, బుఖారీ, ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం అండీ, ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:
الْحَجُّ الْمَبْرُورُ لَيْسَ لَهُ جَزَاءٌ إِلَّا الْجَنَّةُ (అల్ హజ్జుల్ మబ్రూరు లైస లహూ జజావున్ ఇల్లల్ జన్నాహ్) “స్వీకరించబడిన హజ్ కు బదులుగా స్వర్గం తప్ప మరే ప్రతిఫలము లేదు.“
అంటే, ఎవరి హజ్ అయితే అల్లాహ్ వద్ద ఆమోదించబడుతుందో, దానికి ప్రతిఫలంగా అతనికి ఇక స్వర్గమే. స్వర్గం తప్ప ఇంకా వేరే కానుక అతనికి ఇవ్వడానికి లేదు. హజ్ స్వీకరించబడితే చాలు, హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే చాలు, ఆ భక్తునికి ఇక ఇన్ షా అల్లాహ్ స్వర్గం తప్పనిసరిగా ఇవ్వబడుతుందన్న విషయం ప్రవక్త వారు ఇక్కడ తెలియజేశారు. అంటే, హజ్ ఆమోదించబడిందా, ఆ దాసుడు స్వర్గవాసి అయిపోతాడు ఇన్ షా అల్లాహ్. ఎంత గొప్ప విషయం కదండీ? ఇది మొదటి ఘనత.
హజ్ పాపాలను తుడిచివేస్తుంది
రెండవ ఘనత ఏమిటంటే, హజ్ చేయటం వలన భక్తుని యొక్క పాపాలన్నీ తుడిచివేయబడతాయి, క్షమించవేయబడతాయి. దీనికి మన దగ్గర ఒక ఆధారం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఒక చిన్న సంఘటన చోటు చేసుకునింది, దాని వల్ల మనకు ఈ విషయం బోధపడుతుంది.
ఆ సంఘటన ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఎవరైనా ఇస్లాం స్వీకరించాలంటే ప్రవక్త వారి వద్దకు వచ్చి ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేసేవారు. దానిని మనము అరబీ భాషలో ‘బైఅత్‘ చేయటం అని అంటాం. ఆ ప్రతిజ్ఞ చేసిన తర్వాత వారు సాక్ష్యవచనం పఠించి ప్రతిజ్ఞ చేసి ఇస్లాం ధర్మంలోకి ప్రవేశించేవారు.
ఆ విధంగా అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఇస్లాం స్వీకరించటానికి వచ్చి ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ‘బైఅత్’ (ప్రతిజ్ఞ) చేసే సమయాన చెయ్యి పెట్టి మళ్లీ వెనక్కి తీసేసుకున్నారు. ప్రవక్త వారికి ఆశ్చర్యం కలిగింది. ఏంటయ్యా, చెయ్యి మీద చెయ్యి పెట్టేశావు, మళ్లీ ఎందుకు చెయ్యి వెనక్కి తీసేసుకున్నావు, ఏంటి నీ సందేహము అని ప్రవక్త వారు అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, “ఓ దైవ ప్రవక్త, నేను ప్రతిజ్ఞ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇస్లాం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే, నాది ఒక షరతు అండీ. ఆ షరతు ఏమిటంటే, నా గత పాపాలన్నీ క్షమించవేయబడాలి. నేను ఇస్లాం స్వీకరిస్తున్నప్పటికీ, నేను ఇంతకు ముందు నా జీవితంలో ఎన్ని పాపాలైతే చేసేశానో అవన్నీ అల్లాహ్ మన్నించేయాలి, క్షమించేయాలి. అలా అయితే నేను ఇస్లాం స్వీకరిస్తాను,” అన్నారు.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:
“నీకు తెలియదా, ఇస్లాం (స్వీకరించడం) దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని? మరియు హిజ్రత్ (వలస) దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని? మరియు హజ్ దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని?” ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం.
ప్రవక్త వారు ఏమంటున్నారంటే, “ఓ అమ్ర్, నీకు తెలియదా, ఎప్పుడైతే వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తాడో, ఇస్లాం స్వీకరించగానే అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి.” అల్లాహు అక్బర్. అలాగే రెండవ విషయం చూడండి. ఎప్పుడైతే మనిషి అల్లాహ్ కొరకు వలస ప్రయాణము చేస్తాడో, హిజ్రతు చేస్తాడో, హిజ్రతు చేయగానే, వలస ప్రయాణం చేయగానే అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి, ఈ విషయం నీకు తెలియదా? అలాగే, ఎప్పుడైతే మనిషి హజ్ ఆచరిస్తాడో, అతని హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి, ఈ విషయము నీకు తెలియదా?” అని ప్రవక్త వారు మూడు విషయాల గురించి ప్రస్తావించారు.
మన అంశానికి సంబంధించిన విషయం ఏముంది ఇక్కడ? ఇక్కడ ప్రవక్త వారు ప్రస్తావించిన మూడు విషయాలలో ఒక విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనిషి హజ్ ఆచరిస్తాడో, ఆ హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, ఆ దాసుని యొక్క, ఆ భక్తుని యొక్క గత పాపాలన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన్నించేస్తాడు. ఎంత గొప్ప విషయం అండి. మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి 80 సంవత్సరాల వయసులో హజ్ చేస్తున్నాడు, 70 సంవత్సరాల వయసులో హజ్ చేస్తున్నాడు, 60 సంవత్సరాల వయసులో, 50 సంవత్సరాల వయసులో, 40 సంవత్సరాల వయసులో, 30 సంవత్సరాల వయసులో, ఆ విధంగా వేరే వేరే వాళ్ళు వేరే వేరే వయసులలో హజ్ ఆచరిస్తూ ఉన్నారు. అన్ని సంవత్సరాలలో వారికి తెలిసి, తెలియక ఎన్ని పాపాలు దొర్లిపోయి ఉంటాయండి? అన్ని పాపాలు కూడా ఆ హజ్ చేయడం మూలంగా, ఆ హజ్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరించిన కారణంగా అన్ని పాపాలు తుడిచివేయబడతాయి, కడిగివేయబడతాయి, క్షమించవేయబడతాయి అంటే ఎంత గొప్ప వరం కదండీ. కాబట్టి, హజ్ యొక్క ఘనత ఏమిటంటే ఎవరి హజ్ అయితే అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుందో, ఆమోదించబడుతుందో, వారి గత పాపాలన్నీ కూడా క్షమించవేయబడతాయి. అల్లాహు అక్బర్.
హజ్ పాపాలను & పేదరికాన్ని తొలగిస్తుంది
అలాగే ప్రాపంచిక ప్రయోజనం కూడా ఉందండోయ్. అదేంటంటే, ప్రాపంచిక ప్రయోజనం అంటే అందరూ యాక్టివ్ అయిపోతారు. చెప్తాను చూడండి. ప్రవక్త వారు తెలియజేసిన విషయం కాబట్టి మనమంతా దాన్ని గమనించాలి, విశ్వసించాలి. ఎవరైతే హజ్ ఆచరిస్తారో, ఉమ్రాలు ఆచరిస్తారో, పదేపదే ఆచరించుకుంటూ ఉంటారో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి పాపాల క్షమాపణతో పాటు, వారి పేదరికాన్ని కూడా తొలగించేస్తాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం తబరానీ గ్రంథంలోని ప్రామాణికమైన సహీ ఉల్లేఖనం, ప్రవక్త వారు తెలియజేశారు:
మీరు హజ్ మరియు ఉమ్రాలను నిరంతరం చేస్తూ ఉండండి. ఎందుకంటే అవి రెండూ పేదరికాన్ని మరియు పాపాలను తొలగిస్తాయి, కొలిమి ఇనుము యొక్క మాలిన్యాన్ని తొలగించినట్లుగా.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, “మీరు పదేపదే హజ్ లు, ఉమ్రాలు ఆచరించుకుంటూ ఉండండి.” అంటే, పదేపదే మీకు అవకాశం దొరికినప్పుడల్లా, సౌకర్యం దొరికినప్పుడల్లా హజ్ లు, ఉమ్రాలు ఆచరించుకుంటూ ఉండండి. అలా చేయటం వలన ఏమి జరుగుతుంది? పదేపదే హజ్ మరియు ఉమ్రాలు ఆచరించటం వలన భక్తుని యొక్క పాపాలు తొలగిపోతాయి, అలాగే ఆ దాసుని యొక్క పేదరికము కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తొలగించేస్తాడు. ప్రవక్త వారు ఉదహరించారు. ఎలాగైతే అగ్నిలో కాల్చినప్పుడు ఇనుముకి పట్టిన తుప్పు ఎలాగైతే రాలిపోతుందో, మనం చూస్తున్నాం కదా, ఇనుముని ఎప్పుడైతే అగ్నిలో పెట్టి కాలుస్తారో, దానిని బయటికి తీసి విదిలిస్తే దానికి పట్టిన తుప్పు మొత్తం రాలిపోతుంది. ఆ విధంగా ప్రవక్త వారు వివరిస్తూ, ఉదహరిస్తూ ఏమంటున్నారంటే, ఇనుముకి పట్టిన తుప్పు అగ్నిలో కాల్చిన కారణంగా ఎలాగైతే రాలిపోతుందో, అలాగా హజ్ చేయటం వలన, పదేపదే హజ్ ఉమ్రాలు ఆచరించటం వలన భక్తుని యొక్క పాపాలు తొలగిపోతాయి, భక్తుని యొక్క పేదరికము కూడా తొలగిపోతుంది. మాషా అల్లాహ్. ఇది కూడా ఒక గొప్ప ఘనత అండీ.
గొప్ప సత్కార్యాలలో హజ్ ఒకటి
అలాగే, ఇంతకుముందు మనం విన్నట్టుగా, హజ్ ఇస్లామీయ ఆరాధనల్లో, ఇస్లామీయ సత్కార్యాలలో చిన్న సత్కార్యము, చిన్న ఆరాధన కాదు, గొప్ప గొప్ప ఆరాధనల్లో ఒక ఆరాధన, గొప్ప గొప్ప సత్కార్యాలలో ఒక సత్కార్యము అని కూడా మనము తెలుసుకోవాలి. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నాడు:
أَيُّ الْعَمَلِ أَفْضَلُ (అయ్యుల్ అమలి అఫ్దల్) ఏ సత్కార్యము గొప్పది?
అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇస్తూ అంటున్నారు:
إِيمَانٌ بِاللَّهِ وَرَسُولِهِ (ఈమాను బిల్లాహి వ రసూలిహి) అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించడం.
గమనించండి. మళ్లీ ఆ వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, “ఆ తర్వాత గొప్ప సత్కార్యం ఏది?” అంటే, ప్రవక్త వారు అంటున్నారు:
جِهَادٌ فِي سَبِيلِ اللَّهِ (జిహాదున్ ఫీ సబీలిల్లాహ్) అల్లాహ్ మార్గంలో జిహాద్ (ధర్మయుద్ధం) చేయడం.
మళ్లీ ఆ వ్యక్తి మూడవ సారి ప్రశ్నిస్తూ ఉన్నాడు, “ఆ తర్వాత ఏది గొప్ప సత్కార్యము దైవప్రవక్త?” అంటే, ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:
అంటే, అల్లాహ్ మరియు ప్రవక్తను విశ్వసించటము మొదటి ప్రథమ గొప్ప కార్యము అయితే, జిహాద్ చేయటం, అల్లాహ్ మార్గంలో యుద్ధము చేయటం రెండవ గొప్ప కార్యము అయితే, ఆ రెండు కార్యాల తర్వాత మూడవ గొప్ప స్థానాన్ని పొందిన గొప్ప కార్యం హజ్ అని ఈ ఉల్లేఖనంలో ప్రవక్త వారు మనకు బోధించి ఉన్నారు కాబట్టి, హజ్ గొప్ప కార్యాలలో, గొప్ప సత్కార్యాలలో ఒక గొప్ప సత్కార్యము, గొప్ప ఆరాధన అని మనమంతా గ్రహించాలి.
వృద్ధులకు, బలహీనులకు మరియు మహిళలకు హజ్ ఒక జిహాద్
అలాగే మిత్రులారా, మన సమాజంలో వృద్ధులు ఉన్నారు, అలాగే మహిళలు ఉన్నారు. వృద్ధులు యుద్ధ మైదానంలో పాల్గొంటారండి? పాల్గొనలేరు. అలాగే మహిళలు యుద్ధం చేస్తారండి వెళ్లి యుద్ధ మైదానంలో? వాళ్లు చేయలేరు. అలాంటి వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన శుభవార్త ఏమిటంటే, వృద్ధులకు, మహిళలకు హజ్ చేయటం వలన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా జిహాద్ లో పాల్గొన్నంత పుణ్యము, ప్రతిఫలము ప్రసాదిస్తాడు అని శుభవార్త తెలియజేశారు. దీనికి ఆధారంగా మనం చూసినట్లయితే, నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి అయిన, విశ్వాసుల మాతృమూర్తి అయిన అమ్మ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. “ఓ దైవ ప్రవక్త, పురుషులు జిహాద్ లో పాల్గొని బాగా పుణ్యాలు సంపాదించుకుంటున్నారు కదా, మరి మన మహిళలకు కూడా మీరు యుద్ధంలో జిహాద్ లో పాల్గొని బాగా పుణ్యాలు సంపాదించుకోవడానికి అనుమతి ఇవ్వరా?” అని అడుగుతున్నారు. దానికి బదులుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు:
لَكُنَّ أَفْضَلُ الْجِهَادِ: حَجٌّ مَبْرُورٌ (లకున్న అఫ్దలుల్ జిహాది హజ్జున్ మబ్రూర్) “మీ కొరకు స్వీకృతి పొందిన హజ్ జిహాద్ తో సమానమైనది.” [బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం.]
మహిళలు హజ్ చేస్తే, మహిళలు చేసిన ఆ హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, ఆ మహిళలకు జిహాద్, అల్లాహ్ మార్గంలో యుద్ధం సలిపినంత పుణ్యము దక్కుతుంది అని ప్రవక్త వారు శుభవార్త తెలియజేశారు. అలాగే నసాయి గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:
جِهَادُ الْكَبِيرِ وَالضَّعِيفِ وَالْمَرْأَةِ: الْحَجُّ وَالْعُمْرَةُ (జిహాదుల్ కబీరి వజ్జయీఫి వల్ మర’అతి అల్ హజ్జు వల్ ఉమ్రా) వృద్ధుని, బలహీనుని మరియు స్త్రీ యొక్క జిహాద్: హజ్ మరియు ఉమ్రా.
అంటే, ఈ పూర్తి ఉల్లేఖనాల యొక్క సారాంశం ఏమిటంటే, ఎవరైతే బలహీనులు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే మహిళలు ఉన్నారో, వారు హజ్ ఆచరిస్తే వారికి అల్లాహ్ మార్గంలో జిహాద్ లో పాల్గొన్నంత పుణ్యము దక్కుతుందన్నమాట. చూశారా హజ్ అంటే ఎంత గొప్ప విషయమో.
హజ్ యాత్రికులు అల్లాహ్ యొక్క అతిథులు
అలాగే ఎవరైతే హజ్ చేయడానికి వెళ్తారో, ఇంటి నుంచి ఎవరైతే బయలుదేరి హజ్ చేయడానికి మక్కా చేరుకుంటారో, పుణ్యక్షేత్రానికి చేరుకుంటారో, వారికి దక్కే ఒక గొప్ప గౌరవం ఏమిటంటే వారు అల్లాహ్ అతిథులు అనిపించుకుంటారు. అల్లాహు అక్బర్. ఇబ్నె హిబ్బాన్ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు:
“అల్లాహ్ మార్గంలో పోరాడే యోధుడు, హజ్ చేసేవాడు మరియు ఉమ్రా చేసేవాడు అల్లాహ్ యొక్క అతిథులు. ఆయన వారిని పిలిచాడు, వారు సమాధానమిచ్చారు. వారు ఆయనను అడిగారు, ఆయన వారికి ఇచ్చాడు.“
అల్లాహ్ మార్గంలో యుద్ధము చేయు వ్యక్తి, అలాగే హజ్ చేసే వ్యక్తి, అలాగే ఉమ్రా ఆచరించే వ్యక్తి. ముగ్గురి గురించి ప్రస్తావన ఉంది గమనించండి. అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసే వ్యక్తి, హజ్ ఆచరించే వ్యక్తి, ఉమ్రా ఆచరించే వ్యక్తి, ఈ ముగ్గురూ కూడా అల్లాహ్ అతిథులు. సుబ్ హానల్లాహ్. ఏమవుతుందండి అల్లాహ్ అతిథులుగా వెళితే? ప్రవక్త వారు తెలియజేస్తున్నారు, అల్లాహ్ వారిని వచ్చి ఇక్కడ హజ్ ఆచరించమని, ఉమ్రా ఆచరించమని పిలిచాడు కాబట్టి, అల్లాహ్ పిలుపుని పురస్కరించుకొని వారు అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అల్లాహ్ తో ఏమి అడిగితే అది అల్లాహ్ వారికి ఇచ్చేస్తాడు. యా అల్లాహ్, యా సుబ్ హానల్లాహ్.
మిత్రులారా, ప్రపంచంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మనకు అతిథిగా పిలిస్తే, లేదా ఒక చిన్న రాజ్యానికి రాజు మనకు ఆతిథ్యం ఇచ్చి మనకు రాజభవనానికి ఆతిథులుగా పిలిస్తే, దానిని మనం ఎంత గౌరవంగా భావిస్తాం, అవునా కాదా చెప్పండి? అబ్బా, రాజు మనకు పిలిచాడు, రాజు ఆతిథ్యము దక్కించుకున్న వ్యక్తి అని అతను ఎంతో సంబరిపడిపోతాడు, గౌరవంగా భావిస్తాడు. పూర్తి విశ్వానికి రారాజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆతిథ్యం ఇస్తున్నాడండీ. అలాంటి పూర్తి విశ్వానికి రారాజు అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పిలుపుని పురస్కరించుకొని హజ్ చేయడానికి, ఉమ్రా చేయడానికి వెళితే, అల్లాహ్ దాసులు అల్లాహ్ అతిథులుగా గౌరవం పొందుతారు. అక్కడికి వెళితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారు అడిగిందల్లా వారికి ఇస్తాడు అని ప్రవక్త వారు తెలియజేశారు.
దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయండి, ప్రవక్త వారి జీవిత కాలంలోని ఉదాహరణలు ఉన్నాయి, నేటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. నేను కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో అడిగాను, నాకు కూడా అల్లాహ్ ఇచ్చాడు. అంతెందుకు, సోషల్ మీడియాలో మొన్న ఈ మధ్యనే ఒక వీడియో చాలా బాగా వైరల్ అయిపోయింది. ఒక వ్యక్తి అక్కడికి వెళ్లి అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ధనం గురించి పదేపదే అడుగుతూ ఉన్నాడు. ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది, మనమంతా చూశాం. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత అదే వ్యక్తిని మళ్ళీ చూపిస్తూ ఉన్నారు, అతను వెళ్లి అక్కడ అల్లాహ్ తో ధనం అడిగాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ఎంత ధనం ఇచ్చాడంటే, ఇప్పుడు అతను గొప్ప ధనికుడు అయిపోయాడు, Mercedes-Benz లలో అతను తిరుగుతూ ఉన్నాడు, చూడండి అల్లాహ్ పుణ్యక్షేత్రానికి వెళ్లి అడిగితే అల్లాహ్ ఇస్తాడు అనటానికి గొప్ప సాక్ష్యము ఈ వ్యక్తి, చూడండి అని చూపిస్తూ ఉన్నారు మిత్రులారా. కాబట్టి అక్కడికి వెళితే అల్లాహ్ అతిథులు అవుతారు, అక్కడికి వెళ్లి అడిగితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్తాడు. ప్రవక్త వారు చెప్పినారు, అలాగే ప్రవక్త వారి కాలం నాటి సంఘటనలు ఉన్నాయి, నేటికి కూడా జరుగుతున్న అనేక సంఘటనలు ఉన్నాయి మిత్రులారా.
హజ్ మార్గంలో మరణించిన వారి పుణ్యం
అలాగే హజ్ గురించి మనం తెలుసుకుంటున్నాము కాబట్టి హజ్ ఘనతలలో మరొక ఘనత ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే హజ్ చేయడానికి ఇంటి నుండి బయలుదేరుతాడో, బయలుదేరిపోయిన తర్వాత మార్గంలో గాని, అక్కడికి చేరుకున్నప్పుడు గాని అతను మరణిస్తే అతనికి పూర్తి హజ్ చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది అని చెప్పడం జరిగింది. మరొక ఉల్లేఖనంలో అయితే ప్రళయం వరకు అతను హజ్ చేస్తూ ఉన్నంత పుణ్యము ఇవ్వబడుతుంది అని చెప్పబడింది. రెండు ఉల్లేఖనాలు కూడా నేను మీ ముందర పంచుతున్నాను చూడండి. సహీ అత్-తర్గిబ్ గ్రంథంలో ప్రవక్త వారు తెలియజేస్తూ ఉన్నారు:
ఏ వ్యక్తి అయితే హజ్ ఆచరించటానికి, ఉమ్రా ఆచరించటానికి ఇంటి నుండి బయలుదేరుతాడో, ఆ తర్వాత దారిలోనే అతను మరణిస్తాడో, అతనికి ప్రళయం వరకు హజ్ లు చేసినంత, ప్రళయం వరకు ఉమ్రాలు చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది. (సహీ అత్-తర్గిబ్ గ్రంథం)
“అతనికి పూర్తి హజ్ చేసినంత పుణ్యము, పూర్తి ఉమ్రా చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది” అని మరొక ఉల్లేఖనంలో ఉంది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకునింది. బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనంలో తెలియజేయటం జరిగింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఉమ్రా చేయటానికి సహబాలతో పాటు కలిసి వెళుతూ ఉంటే ఒక వ్యక్తి, ప్రవక్త వారితో పాటు వెళ్ళిన ఒక శిష్యుడు ఒంటె పైనుంచి జారి కింద పడ్డాడు. గమనించండి. ప్రవక్త వారితో పాటు ఉమ్రా ఆచరించటానికి వెళుతూ ఉన్న ఒక శిష్యుడు ఒంటె పైనుంచి జారి కింద పడిపోయాడు. కింద పడినప్పుడు అతని మెడ విరిగింది, అందులోనే అతను ప్రాణాలు వదిలేశాడు. అతను మరణించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబాలకు ఈ విధంగా ఆదేశించారు:
“అతనికి రేగి ఆకులతో కలిపిన నీటితో స్నానం చేయించండి, అతని రెండు వస్త్రాలలోనే అతనికి కఫన్ చుట్టండి, అతని తలను కప్పకండి, అతనికి సుగంధం పూయకండి, ఎందుకంటే అతను ప్రళయం రోజున తల్బియా పఠిస్తూ లేపబడతాడు.”
అతనికి మీరు నీళ్ళలో రేణి ఆకులు వేసి కాంచిన నీళ్ళతో గుసుల్ చేయించండి, స్నానము చేయించండి. అతను ఏ బట్టలైతే ఉమ్రా కోసము ధరించి ఉన్నాడో, అదే బట్టల్లో అతని శవవస్త్రాలుగా చుట్టండి. అతని తలను కప్పకండి, అతని శరీరానికి, బట్టలకు సువాసనలు పూయకండి. ఎందుకంటే, ఇతను రేపు పరలోకంలో అల్లాహ్ ఎప్పుడైతే భక్తులందరికీ పరలోకంలో మళ్లీ రెండవ సారి నిలబెడతాడో, ఆ రోజు అతను
لَبَّيْكَ اللَّهُمَّ لَبَّيْكَ (లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక్) “ఓ అల్లాహ్, నేను హాజరయ్యాను”
అని తల్బియా పఠిస్తూ లేస్తాడు అని చెప్పారు. అల్లాహు అక్బర్. అంటే ఎంత గౌరవం చూడండి. ఎవరైతే హజ్ ఉమ్రాలు చేయడానికి బయలుదేరి దారిలోనే ప్రాణాలు వదిలేస్తారో, వారు ఎంత గౌరవం దక్కించుకుంటారంటే వారికి హజ్ చేసిన పుణ్యము ఇవ్వబడుతుంది, ఉమ్రా చేసిన పుణ్యము ఇవ్వబడుతుంది, వారు రేపు పరలోకంలో అల్లాహ్ ఎప్పుడైతే మళ్లీ రెండవ సారి లేపుతారో, ఆ రోజు తల్బియా పఠిస్తూ అల్లాహ్ ముందరికి చేరుకుంటారు, తల్బియా పఠిస్తూ లేస్తారు. అల్లాహు అక్బర్.
హజ్ లోని ప్రతి క్రియకు లభించే పుణ్యం
ఇక మిత్రులారా, హజ్ లో అనేక కార్యాలు ఉన్నాయి. మనిషి ప్రయాణిస్తాడు, ఆ తర్వాత ఇహ్రామ్ ధరిస్తాడు, ఆ తర్వాత మళ్ళీ తల్బియా పఠించుకుంటూ పుణ్యక్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ వెళ్లి తవాఫ్ ఆచరిస్తాడు, నమాజులు ఆచరిస్తాడు, జమ్ జమ్ నీరు తాగుతాడు, సయీ చేస్తాడు, తలనీలాలు సమర్పించుకుంటాడు, అరఫా మైదానానికి వెళ్తాడు, ముజ్దలిఫాకు వెళ్తాడు, అలాగే కంకర్లు జమరాత్ కి కొడతాడు, తర్వాత తవాఫ్ లు చేస్తారు, సయీ చేస్తారు, దువాలు చేస్తారు, ఇక అనేక కార్యాలు చేస్తారు కదా, మరి ఇవన్నీ ఆచరిస్తే వారికి ఏమి దక్కుతుంది అంటే ఒక సుదీర్ఘమైన పెద్ద ఉల్లేఖనం ఉంది. అది నేను అరబీలో కాకుండా, దాన్ని అనువాదాన్ని, సారాంశాన్ని మాత్రమే మీ ముందర చదివి వినిపిస్తాను. చూడండి శ్రద్ధగా వినండి. హజ్ చేసిన వారు, హజ్ ఆచరించే వారు అడుగడుగునా, ప్రతి చోట ఎన్ని సత్కార్యాలు, ఎన్ని విశిష్టతలు, ఘనతలు దక్కించుకుంటారో గమనించండి.
ఉల్లేఖనాన్ని చదువుతున్నాను వినండి, దాని సారాంశం అండి ఇది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయాలండీ, “మీరు అల్లాహ్ గృహం వైపు హజ్ యాత్ర సంకల్పంతో బయలుదేరితే మీ సవారీ వేసే ఒక్కొక్క అడుగుకు బదులుగా అల్లాహ్ ఒక పుణ్యం రాస్తాడు, ఒక పాపం క్షమిస్తాడు.” అల్లాహు అక్బర్. ఎంత దూరం ప్రయాణిస్తాడండి భక్తుడు, అంత దూరము అతను ఎన్ని అడుగులు వేస్తాడో, అతని సవారీ ఎన్ని అడుగులు వేస్తుందో, అన్ని పుణ్యాలు లిఖించబడతాయి, అన్ని పాపాలు తొలగించబడతాయి.
ఆ తర్వాత ప్రవక్త వారు అంటున్నారు: “మీరు తవాఫ్ తర్వాత చదివే రెండు రకాతుల నమాజ్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వంశంలోని ఒక బానిసను స్వతంత్రుని చేసిన దానికి సమానం అవుతుంది.” అల్లాహు అక్బర్. ఆ తర్వాత చూడండి,
“మీరు సఫా మర్వాల మధ్య చేసే సయీ 70 బానిసలను స్వతంత్రులుగా చేసిన దానికి సమానం అవుతుంది. అరఫా రోజు సాయంత్రము మొదటి ఆకాశంపై అల్లాహ్ వచ్చి మీ పట్ల గర్విస్తూ ఇలా అంటాడు: ‘చూడండి, నా ఈ భక్తులు దూర ప్రదేశాల నుండి శ్రమించి దుమ్ము ధూళిలను భరించి నా వద్దకు వచ్చారు. వీరు నా అనుగ్రహాలను ఆశిస్తున్నారు. కావున భక్తులారా, మీ పాపాలు ఇసుక కంకరు అన్ని ఉన్నా, లేదా వర్షపు చినుకులన్ని ఉన్నా, లేక సముద్రపు నురుగు అన్ని ఉన్నా వాటన్నింటినీ నేను క్షమించేస్తున్నాను. వినండి నా దాసులారా, ఇక మీరు ముజ్దలిఫా వైపు వెళ్ళండి. నేను మిమ్మల్ని క్షమించేసాను. అలాగే మీరు ఎవరి కోసం ప్రార్థించారో వారిని కూడా క్షమించేసాను.” అల్లాహు అక్బర్.
ఆ తర్వాత ప్రవక్త వారు అంటున్నారు: “ఆ తర్వాత మీరు జమరాత్ రాళ్ళు కొడితే, మీరు కొట్టే ప్రతి రాయికి బదులుగా ఒక పెద్ద పాపము తుడిచివేయబడుతుంది. మీరు ఖుర్బానీ చేస్తే దాని పుణ్యం మీ ప్రభువు అల్లాహ్ వద్ద మీ కోసం భద్రపరచబడుతుంది. మీరు తలనీలాలు సమర్పించినప్పుడు అల్లాహ్ ప్రతి వెంట్రుకకు బదులు ఒక పుణ్యం రాసేస్తాడు, ఒక పాపం తుడిచివేస్తాడు. ఆ తర్వాత మీరు తవాఫ్ చేస్తే మీరు పాపాలు లేకుండా పూర్తిగా ఎలా కడిగివేయబడతారంటే మీరు తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు ఎలాగైతే మీ కర్మపత్రాల్లో పాపాలు ఉండవో, అలా అయిపోతారు. తర్వాత ఒక దూత వచ్చి మీ రెండు భుజాల మధ్య చెయ్యి పెట్టి ఇలా అంటాడు: వెళ్ళండి, ఇక మీ భవిష్యత్తు కొరకు సత్కార్యాలు చేయండి. ఎందుకంటే మీ గత పాపాలు అన్నీ క్షమించవేయబడ్డాయి.” అల్లాహు అక్బర్.
మిత్రులారా, ఎన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి, ఎన్ని పుణ్యాలు ఏ ఏ సందర్భంలో భక్తునికి దక్కుతున్నాయో చూడండి. తలనీలాలు సమర్పిస్తే, తల వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని పుణ్యాలు ఇవ్వబడుతూ ఉన్నాయి, అన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి. వర్షపు చినుకులన్ని పాపాలు క్షమించవేయబడుతూ ఉన్నాయి. ఇసుక కంకరు అన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి. ఇసుక కంకరు ఎంత ఉందో లెక్కించగలమా? వర్షపు చినుకులు ఎన్ని ఉన్నాయో లెక్కించగలమా? తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో లెక్కించగలమా? అంటే, లెక్క చేయనన్ని పాపాలు ఉన్నా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా క్షమించేస్తాడు.
ఎవరైతే హజ్ ఆచరిస్తున్నారో, వారిని క్షమించడమే కాకుండా వారు ఎవరి కోసమైతే అక్కడ దుఆ చేస్తారో, వారి తల్లిదండ్రుల గురించి కావచ్చు, వారి భార్యాబిడ్డల గురించి కావచ్చు, బంధుమిత్రుల గురించి కావచ్చు, ఉపాధ్యాయుల గురించి కావచ్చు, ఇక ముస్లిం సమాజం గురించి కావచ్చు, వారు ఎవరి గురించి అయితే అక్కడ క్షమాపణ కోరుతారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని కూడా ఆ రోజు క్షమించేస్తాడు అని ప్రవక్త వారు తెలియజేస్తున్నారు కాబట్టి, ఎవరెవరైతే హజ్ కోసం వెళుతూ ఉంటారో భక్తులు వెళ్లి వారితో, “ఏమండీ మా కోసం కూడా దుఆ చేయండి, ఏమండీ మా కోసం కూడా దుఆ చేయండి,” అని విన్నవించుకుంటారు, ఇందుకోసమే మిత్రులారా.
కాబట్టి హజ్ చేయడం, హజ్ చేసే వారు ప్రతి చోట వారు నడుస్తున్నంత సేపు, వారు పలుకుతున్నంత సేపు, వారు దువాలు చేస్తున్నంత సేపు ఎన్నో పుణ్యాలు దక్కించుకుంటారు, వారు అనేక పాపాలు క్షమించవేయబడతాయి. అలాంటి విశిష్టతలు, ఘనతలు దక్కించుకోబడే ఏకైక ఆరాధన ఈ హజ్ ఆరాధన. కాబట్టి మిత్రులారా, ఈ హజ్ కు అనేక విశిష్టతలు, ఘనతలు ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పటివరకు కొన్ని ఆధారాలతో సహా మీ ముందర ఉంచాను.
హజ్ యాత్రికుల కొరకు ముఖ్యమైన సూచనలు
అయితే ఇప్పుడు హజ్ చేయడానికి ఎవరైతే వెళుతూ ఉన్నారో వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు ధార్మిక పండితులు ఖురాన్, హదీసుల గ్రంథాల వెలుగులో తెలియజేసి ఉన్నారు. అవి కూడా ఇన్ షా అల్లాహ్ నేను చెప్పేసి నా మాటను ముగించేస్తాను.
హజ్ చేయు వారి కోసము ధార్మిక పండితులు తెలియజేసిన సలహాలు, సూచనలలో మొదటి సలహా ఏమిటంటే:
స్తోమత ఉన్నప్పుడు హజ్ చేయడంలో ఆలస్యం చేయరాదు
స్తోమత గలవారు వెంటనే హజ్ చేయాలి, ఆలస్యము చేయరాదు. ఎందుకు? అహ్మద్ గ్రంథంలోని ప్రామాణికమైన హదీసులో ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:
ఎవరికైతే హజ్ చేయడానికి సౌకర్యం ఉంటుందో వారు వెంటనే హజ్ ఆచరించేయండి. ఎందుకంటే, తెలియదు, ఆలస్యము చేస్తే మీరు వ్యాధి బారిన పడవచ్చు, ఆ తర్వాత మీకు హజ్ చేయడం కుదరకపోవచ్చు. అలాగే, మీ దగ్గర ఉన్న సొమ్ము మీ దగ్గర నుంచి దూరమైపోవచ్చు, ఆ తర్వాత మీకు హజ్ చేయడానికి అవకాశం దొరక్కపోవచ్చు. అలాగే వేరే ఏదైనా కారణము మీకు ఏర్పడవచ్చు, ఆ కారణంగా మీరు మళ్లీ హజ్ వెళ్ళడానికి సౌకర్యం దక్కకపోవచ్చు.
కాబట్టి, సౌకర్యం దొరకగానే వెంటనే హజ్ ఆచరించేయాలి అని ప్రవక్త వారు తెలియజేశారు కాబట్టి, హజ్ చేయటంలో ఆలస్యం చేయరాదు.
చాలామంది ఏమంటారంటే, “ముసలివాళ్ళం అయిపోయాక, బాగా వృద్ధ్యాపానికి చేరుకున్నాక అప్పుడు చేద్దాం లేండి, ఇప్పుడే ఎందుకు తొందర ఎందుకు,” అంటారు. లేదు లేదు, అప్పటి వరకు బ్రతుకుతామని గ్యారెంటీ లేదు, అప్పటి వరకు ఆరోగ్యంగా ఉంటాము అని గ్యారెంటీ లేదు, ఎలాంటి మనకు అవసరాలు పడవు, గడ్డు పరిస్థితులు దాపురించవు అని గ్యారెంటీ లేదు కాబట్టి, సౌకర్యం ఉన్నప్పుడు వెంటనే హజ్ ఆచరించుకోవాలి. ఇది మొదటి సలహా.
అయితే, మనం సమాజంలో చూస్తూ ఉన్నాం, చాలా మంది లక్షాధికారులు, కోటీశ్వరులు ఉన్నారు. యవ్వనంలో ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అవకాశం ఉంది వెళ్లి హజ్ ఆచరించడానికి, అయినా గానీ వెళ్ళట్లేదు. అలాంటి వారి కొరకు హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు చాలా కోపగించుకుని ఉన్నారు. ఆ మాట కూడా వినిపిస్తున్నాను చూడండి.
ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు ఈ విధంగా తెలియజేశారు: “ఎవరైతే స్తోమత ఉండి కూడా, అవకాశం ఉండి కూడా హజ్ కి వెళ్ళట్లేదో, హజ్ ఆచరించట్లేదో, అలాంటి వారిని గుర్తించి, వారి మీద ‘జిజ్యా’ ట్యాక్స్ విధించాలి. ఎందుకంటే, ఇలా అశ్రద్ధ వహించేవారు నిజమైన ముస్లింలు కారు” అని చెప్పారు.”
అల్లాహు అక్బర్. చూశారా? ఏమంటున్నారు? అవకాశం ఉండి కూడా వెళ్లి హజ్ ఆచరించట్లేదు అంటే, అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు అంటే వారు నిజమైన ముస్లింలు కాదు, వారి మీద జిజ్యా ట్యాక్స్ వేయండి అని ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు కోపగించుకుంటున్నారంటే జాగ్రత్త పడవలసి ఉంది సుమా.
ధర్మసమ్మతమైన (హలాల్) సంపాదనతోనే హజ్ చేయాలి
ఇక రెండవ సలహా ఏమిటంటే, హజ్ చేసేవారు ధర్మసమ్మతమైన హలాల్ సంపాదనతోనే హజ్ చేయాలి. అధర్మమైన సంపాదనతో చేసిన హజ్ స్వీకరించబడదు. హజ్ కాదు, ఏ సత్కార్యము స్వీకరించబడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:
يَا أَيُّهَا النَّاسُ، إِنَّ اللَّهَ طَيِّبٌ، وَلَا يَقْبَلُ إِلَّا طَيِّبًا (యా అయ్యుహన్నాస్, ఇన్నల్లాహ తయ్యిబున్, వలా యఖ్బలు ఇల్లా తయ్యిబన్) “ఓ ప్రజలారా, నిశ్చయంగా అల్లాహ్ పరిశుద్ధుడు, మరియు ఆయన పరిశుద్ధమైన దానిని తప్ప మరేదీ స్వీకరించడు.”
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరిశుద్ధుడు కాబట్టి ధర్మసమ్మతమైన విషయాలనే ఆయన ఆమోదిస్తాడు, స్వీకరిస్తాడు. అధర్మమైన విషయాలను ఆయన స్వీకరించడు, ఆమోదించడు. అధర్మమైన సంపాదనతో హజ్ చేస్తే అది ఆమోదించబడదు కాబట్టి హలాల్, ధర్మసమ్మతమైన సంపాదనతోనే హజ్ చేయాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వ్యక్తి గురించి తెలియజేశారు. ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం,
“ఒక వ్యక్తి దూరము నుంచి ప్రయాణము చేసుకొని వస్తాడు. దుమ్ము, ధూళి నింపుకొని అక్కడికి చేరుకుంటాడు. ఆ తర్వాత దీనమైన స్థితిలో రెండు చేతులు పైకెత్తి “యా రబ్బీ, యా రబ్బీ” (“ఓ నా ప్రభువా, ఓ నా ప్రభువా”) అని అల్లాహ్ తో వేడుకుంటూ ఉంటాడు. ప్రవక్త వారు అంటున్నారు, అతను అంత శ్రమించినా, అంత దీనంగా వేడుకున్నా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని ప్రార్థనను, అతని సత్కార్యాన్ని ఆమోదించడు. ఎందుకంటే:
“అతని ఆహారం హరాం, అతని పానీయం హరాం, అతని వస్త్రం హరాం, మరియు అతను హరాంతో పోషించబడ్డాడు, కాబట్టి అతని ప్రార్థన ఎలా స్వీకరించబడుతుంది?“
అతను భుజించింది హరాం, అధర్మమైనది. అతను త్రాగింది హరాం, అధర్మమైనది. అతను తొడిగింది హరాం, అధర్మమైనది. అతను తిన్న తిండి కూడా అధర్మమైనది కాబట్టి అతని ప్రార్థన, అతని ఆరాధన ఎలా స్వీకరించబడుతుంది చెప్పండి? అన్నారు ప్రవక్త వారు. కాబట్టి అధర్మమైన సంపాదనతో చేసిన హజ్ స్వీకరించబడదు కాబట్టి జాగ్రత్త, ధర్మసమ్మతమైన హలాల్ సంపాదనతోనే హజ్ చేయాలి.
హజ్ సమయంలో గొడవలు మరియు అశ్లీలతకు దూరంగా ఉండాలి
అలాగే, మూడవ సలహా ఏమిటంటే, హజ్ యాత్ర చేస్తున్నప్పుడు గొడవలకు దిగకూడదు, దూషించకూడదు, అసభ్యకరమైన పనులు చేయకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా తెలియజేశాడు, సూర బఖరా 197వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:
مَنْ حَجَّ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ، رَجَعَ كَمَا وَلَدَتْهُ أُمُّهُ (మన్ హజ్జ ఫలమ్ యర్ఫుస్ వలమ్ యఫ్సుఖ్ రజ’అ కమా వలదత్హు ఉమ్ముహు) “ఎవరైతే హజ్ చేసి, అసభ్యకరంగా మాట్లాడకుండా, పాపం చేయకుండా ఉంటాడో, అతను తన తల్లి గర్భం నుండి పుట్టిన రోజున ఉన్నట్లుగా తిరిగి వస్తాడు.”
ఎవరైతే హజ్ చేయడానికి వెళ్లారో వారు దుర్భాషలాడకూడదు, అలాగే అసభ్యమైన కార్యాలు చేయకూడదు, గొడవలకు పాల్పడకూడదు. అలా ఎవరైతే గొడవలకు పాల్పడకుండా, అసభ్యమైన కార్యాలు చేయకుండా, దూషించకుండా హజ్ యాత్ర ముగించుకొని వస్తారో, అప్పుడే తల్లి గర్భం నుంచి జన్మించిన శిశువు ఖాతాలో ఎలాగైతే పాపాలు ఉండవో, వారి ఖాతాలో నుంచి కూడా అలాగే పాపాలు తొలగివేయబడి ఎలాంటి పాపాలు ఉండవు అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.
జీవితంలో ఒక్కసారి హజ్ విధి
అలాగే మిత్రులారా, ముఖ్యమైన ఒక విషయం ఏమిటంటే, జీవితంలో ఒక్కసారి మాత్రమే స్తోమత గలవారి మీద హజ్ విధి చేయబడింది. కాబట్టి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేయటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఫర్జ్ చేసిన ఆ హజ్ ను చేయటంలో ఆలస్యం చేయకూడదు. ఒక్కసారి మాత్రమే హజ్ విధి అయింది అనటానికి ఆధారం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ప్రజల ముందర బోధిస్తూ ఇలా అన్నారు:
يَا أَيُّهَا النَّاسُ، قَدْ فَرَضَ اللَّهُ عَلَيْكُمُ الْحَجَّ فَحُجُّوا (యా అయ్యుహన్నాస్, ఖద్ ఫరదల్లాహు అలైకుముల్ హజ్జ ఫహుజ్జూ) “ఓ ప్రజలారా, నిశ్చయంగా అల్లాహ్ మీపై హజ్ ను విధిగా చేశాడు, కాబట్టి హజ్ చేయండి.”
ఒక వ్యక్తి లేచి, “ఓ దైవ ప్రవక్త, ప్రతి సంవత్సరం చేయవలసిందేనా?” అన్నాడు. ప్రవక్త వారు సమాధానం ఇవ్వలేదు. రెండవ సారి అడిగాడు, సమాధానం ఇవ్వలేదు. మూడు సార్లు అడిగినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాకీదు చేస్తూ ఏమన్నారంటే:
لَوْ قُلْتُ نَعَمْ لَوَجَبَتْ وَلَمَا اسْتَطَعْتُمْ (లౌ ఖుల్తు నఅమ్ లవజబత్ వలమస్తత’తుమ్) “నేను అవును అని చెప్పి ఉంటే, అది విధిగా అయ్యేది, మరియు మీరు దానిని చేయలేకపోయేవారు.”
నేను అవును అని చెప్పేస్తే, మీ మీద విధి అయిపోతుంది, ప్రతి సంవత్సరం చేయడం విధి అయిపోతుంది. కాబట్టి అలాంటి ప్రశ్నలు మీరు ఎందుకు అడుగుతారు? మిమ్మల్ని మీరు కష్టంలోకి నెట్టుకునేటట్లుగా నాతో ప్రశ్నలు చేయకండి అని ప్రవక్త వారు తాకీదు చేశారన్నమాట. అంటే ఈ పూర్తి ఉల్లేఖనం యొక్క సారాంశం ఏమిటంటే, జీవితంలో ఒక్కసారి మాత్రమే హజ్ విధి చేయబడింది. ఒక్కసారి కంటే ఎక్కువ చేయకూడదా అంటే చేయవచ్చు, అది ‘నఫిల్’ అవుతుంది. ఎక్కువ సార్లు హజ్ లు చేయవచ్చు, అది నఫిల్ అవుతుంది. అలా చేయటం వలన అనేక విశిష్టతలు ఉన్నాయి. పాపాలు కడిగివేయబడతాయి, దువాలు స్వీకరించబడతాయి, కోరికలు తీర్చబడతాయి, అలాగే పేదరికము తొలగిపోతుంది, అనేక ప్రయోజనాలు ఉన్నాయి మిత్రులారా, చేయవచ్చు కాకపోతే అది నఫిల్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తించాలి.
వ్యాధిగ్రస్తుల తరఫున హజ్ చేయటం
అలాగే, ఐదవ సలహా ఏమిటంటే, విపరీతమైన వ్యాధిగ్రస్తుల తరఫున వారసులు హజ్ చేయవచ్చు. అయితే, ముందు తమ తరఫున వారు హజ్ చేసుకొని ఉండాలి. చాలా మంది ప్రజల యొక్క తల్లిదండ్రులు లేదంటే బంధుమిత్రులు పూర్తిగా వ్యాధిగ్రస్తులైపోయి మంచాన పడిపోయి ఉంటారు, మంచానికే పరిమితం అయిపోయి ఉంటారు. లేవలేరు, కూర్చోలేరు, నడవలేరు. అలాంటి స్థితిలో ఉంటారు. మరి వారి తరఫున వారి మిత్రులు గాని, వారి బంధువులు గాని వెళ్లి హజ్ ఆచరించవచ్చునా అంటే ఆచరించవచ్చు కాకపోతే ముందు వారు వారి తరఫున హజ్ ఆచరించుకొని ఉండాలి అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.
దీనికి ఆధారంగా మనం చూసినట్లయితే, ఖసామ్ తెగకు చెందిన ఒక మహిళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఇలా అడిగారు, “ఓ దైవ ప్రవక్త, నా తండ్రి మీద హజ్ విధి అయిపోయింది, కాకపోతే ఆయన వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు, వాహనం మీద కూర్చోలేడు, కాబట్టి నేను వెళ్లి నా తండ్రి తరఫున హజ్ ఆచరించవచ్చునా?” అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అవును, చేయవచ్చు” అన్నారు. అలాగే ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు వెళ్ళిన వారి శిష్యుల్లో ఒక శిష్యుడు సంకల్పం చేస్తున్నప్పుడు:
لَبَّيْكَ عَنْ شُبْرُمَةَ (లబ్బైక్ అన్ షుబ్రుమా) “ఓ అల్లాహ్, నేను షుబ్రుమా తరఫున హజ్ చేయడానికి హాజరయ్యాను” అని చెప్పాడు.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తితో, ఆ శిష్యునితో ఇలా అడిగారు, “ఏమయ్యా, ముందు నువ్వు నీ తరఫున హజ్ చేసుకున్నావా?” అని అడిగితే అతను అన్నాడు, “లేదండీ ఓ దైవప్రవక్త,” అన్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:
حُجَّ عَنْ نَفْسِكَ ثُمَّ حُجَّ عَنْ شُبْرُمَةَ (హుజ్జ అన్ నఫ్సిక సుమ్మ హుజ్జ అన్ షుబ్రుమా) “ముందు నీ తరపున హజ్ చెయ్యి, ఆ తర్వాత షుబ్రుమా తరపున హజ్ చెయ్యి.”
కాబట్టి మిత్రులారా, ఇక్కడ రెండు ఉల్లేఖనాల ద్వారా మనకు అర్థమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు గాని, బంధుమిత్రులు గాని ఎవరైనా వ్యాధిగ్రస్తులైపోయి ఉంటే, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటే వారి తరఫున వారి బంధువులు, కుటుంబ సభ్యులు హజ్, ఉమ్రాలు ఆచరించవచ్చు. కాకపోతే, ముందు వారు, ఎవరైతే ఇతరుల తరఫున హజ్ ఉమ్రాలు చేస్తున్నారో, వారు ముందు వారి తరఫున హజ్ ఉమ్రాలు చేసుకొని ఉండాలి.
పసి పిల్లలకు హజ్ చేయించడం
అలాగే, చాలా మంది ధనవంతులైన తల్లిదండ్రులు వారి వద్ద ఉన్న పసిపిల్లలకు కూడా హజ్, ఉమ్రాల కొరకు తీసుకుని వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నారు. అలా తీసుకుని వెళ్ళవచ్చునా అంటే, వెళ్ళవచ్చును, దానికి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలోని కొన్ని ఆధారాలు ఉన్నాయి.
ముస్లిం గ్రంథంలోని ఒక ఉల్లేఖనం ప్రకారము, ఒక మహిళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి తమ బిడ్డను పైకెత్తి చూపిస్తూ, “ఓ దైవ ప్రవక్త, ఈ బిడ్డను కూడా నేను తీసుకుని వెళ్లి హజ్ ఉమ్రా చేయించవచ్చునా?” అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:
نَعَمْ وَلَكِ أَجْرٌ (నఅమ్ వలకి అజ్ర్) “అవును, మరియు నీకు ప్రతిఫలం ఉంది.”
“నీవు తప్పనిసరిగా నీ బిడ్డను తీసుకుని వెళ్లి హజ్ చేయించవచ్చు. నువ్వు ఆ బిడ్డను మోసుకొని అక్కడ శ్రమిస్తావు కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానికి ఫలితంగా అదనంగా నీకు పుణ్యము ప్రసాదిస్తాడు,” అని ప్రవక్త వారు తెలియజేశారు.
అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక ధార్మిక పండితులు తెలియజేశారు, అదేమిటంటే తల్లిదండ్రులు ధనవంతులు. వారి బిడ్డలకు పసితనంలోనే తీసుకొని వెళ్లి హజ్ ఉమ్రాలు చేయించేశారు. ఆ బిడ్డలు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ పెరిగి పెద్దవారైపోతారు కదా, వారు పెరిగి పెద్దవారైపోయిన తర్వాత వారికి స్తోమత ఉంటే వారు తప్పనిసరిగా వారి తరఫున మళ్ళీ హజ్ ఉమ్రాలు చేసుకోవాలి. అలా కాకుండా స్తోమత ఉండి కూడా, “నా పసితనంలో మా తల్లిదండ్రులు నాకు ఉమ్రా చేయించేశారు, మా తల్లిదండ్రులు నాకు హజ్ చేయించేశారు,” అంటే కుదరదు. తల్లిదండ్రులు చేయించేశారు, అది వేరే విషయం. మీరు యవ్వనానికి చేరుకున్న తర్వాత మీకు స్తోమత ఉన్నప్పుడు మీ సొమ్ములో నుంచి మీ తరఫున మీరు తప్పనిసరిగా హజ్ ఉమ్రాలు ఆచరించుకోవలసి ఉంటుంది. అప్పుడే మీ బాధ్యత తీరుతుంది అని ధార్మిక పండితులు తెలియజేశారు.
హజ్ లోని గుణపాఠాలు
ఇవి కొన్ని విషయాలండీ. ఇక హజ్ చేసే వాళ్ళు అనేక విషయాలు అక్కడ గ్రహిస్తారండీ. ప్రపంచం నలుమూలల నుంచి అనేక జాతుల వారు, అనేక రంగుల వారు, అనేక భాషల వారు అక్కడికి వస్తారు. వారిలో రకరకాల జాతులు, రకరకాల రంగులు, రకరకాల భాషలు కలిగిన వారు ఉంటారు. అలాగే ధనం ప్రకారంగా ఎంతో వ్యత్యాసం కలిగిన వాళ్ళు ఉంటారు. గొప్ప గొప్ప కోటీశ్వరులు ఉంటారు, మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, సాధారణమైన వాళ్ళు ఉంటారు. ఎవరు అక్కడికి వచ్చినా అందరూ ఒకే రకమైన బట్టల్లో అక్కడికి చేరుకుంటారు. అప్పుడు హజ్ చేసేవారు గమనించాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఉంటాయి.
మొదటి విషయం ఏమిటంటే ఇస్లాంలో ధనం మూలంగా గాని, జాతి మూలంగా గాని, రంగు మూలంగా గాని, అలాగే భాష మూలంగా గాని ఎవరికీ ఎలాంటి ఆధిక్యత లేదు. అందరూ అల్లాహ్ దృష్టిలో సమానులే అని చెప్పటానికి గొప్ప నిదర్శనం.
అలాగే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పిలుపు ఇచ్చినప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులందరూ అక్కడికి చేరుకుంటున్నారంటే ముస్లింలందరూ అంతర్జాతీయంగా ఐక్యంగా ఉన్నారు, అల్లాహ్ ఒక్క మాట మీద వారందరూ ప్రపంచం నలుమూలల నుండి బయలుదేరి రావడానికి సిద్ధంగా ఉన్నారు అని సూచించడం జరుగుతూ ఉంది.
అలాగే అక్కడికి చేరుకున్నప్పుడు ఇబ్రహీం అలైహిస్సలాం వారి త్యాగాలు, హాజిరా అలైహిస్సలాం వారి త్యాగాలు, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి త్యాగాలు, అవన్నీ గుర్తు చేసుకోవలసి ఉంటుంది. అలాగే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అక్కడ ఒకప్పుడు మక్కా ముష్రికులు చేసిన దాడులు, అలాగే నవ ముస్లింల మీద మక్కా ముష్రికులు చేసిన దౌర్జన్యాలు, ఒకప్పుడు బిలాల్ రజియల్లాహు లాంటి వారు అదే వీధుల్లో అల్లాహ్ కోసము “అల్లాహ్ అహద్, అల్లాహ్ అహద్” అని ఎంతగా శ్రమించారో, ఎంత కష్టపడి అల్లాహ్ ఏకత్వాన్ని చాటి చెప్పారో, ఆ సంఘటనలన్నీ మనం అక్కడ వెళ్ళినప్పుడు అవన్నీ గుర్తుంచుకోవలసి ఉంటుంది.
అలాగే మిత్రులారా, చాలా విషయాలు ఉన్నాయండి, ఇన్ షా అల్లాహ్ వేరే సందర్భాలలో మనం తెలుసుకుందాం. కాకపోతే, అక్కడ వెళ్ళినప్పుడు భక్తుడు కేవలం అల్లాహ్ నే ఆరాధిస్తాడు, అల్లాహ్ నే వేడుకుంటాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోనే అతను మాట్లాడుతూ ఉన్నట్టు ఉంటాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఏ వలినీ గుర్తుంచుకోడు, ఏ దర్గాని అక్కడ ఎవరూ గుర్తుంచుకోరు. వారందరి ముందర, వారందరి దృష్టిలో ఒకే ఒక ఆలోచన: అల్లాహ్ గృహం, మనం అల్లాహ్ తో మాట్లాడుతున్నాం, మనం అల్లాహ్ తో దుఆ చేసుకుంటున్నాం, మనం అల్లాహ్ ముందర ఇవన్నీ చేసుకుంటున్నామని అల్లాహ్ తోనే డైరెక్ట్ గా భక్తులందరూ సంభాషించుకుంటున్నారు కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులతో డైరెక్ట్ గా మాట్లాడటానికి, వినటానికి, స్వీకరించటానికి, మన్నించటానికి, కోరికలు తీర్చటానికి అక్కడే కాదు ప్రపంచం నలుమూలలా సిద్ధంగా ఉన్నాడు, ఎవరి వాస్తా (మధ్యవర్తిత్వం) అవసరం లేదు, ఏ మరణించిన వ్యక్తి యొక్క వసీలా, వాస్తా భక్తునికి అవసరం లేదు, భక్తుడు కోరుకుంటే అల్లాహ్ డైరెక్ట్ గా వింటాడు అన్న తౌహీద్ సందేశం కూడా అక్కడ మనకు దొరుకుతుంది.
అలాగే, హజ్ ఉమ్రాలు ఆచరించే వారు అరఫా మైదానంలో, ముజ్దలిఫా మైదానంలో, మినా మైదానంలో వెళ్తూ ఉంటారు. అక్కడ రాత్రి వరకే ఉండాలంటే రాత్రి వరకే ఉంటారు. అక్కడ ఉదయాన్నే ఉండాలంటే అక్కడ ఉదయాన్నే ఉంటారు. అక్కడ ఎనిమిదవ తేదీన ఉండాలంటే ఎనిమిదవ తేదీనే ఉంటారు. తొమ్మిదవ తేదీన అలా ఉండాలంటే అక్కడే తొమ్మిదవ తేదీన మాత్రమే ఉంటారు. ఎందుకండీ? వేరే తేదీలలో అక్కడికి ఎందుకు వెళ్ళరు? అవన్నీ పక్కపక్కనే ఉన్నాయి కదా, ఒకే రోజు అన్ని తిరుక్కొని ఎందుకు రారు అంటే ప్రవక్త వారి విధానానికి విరుద్ధం అని వారు ఆ పని చేయరు. కాబట్టి అక్కడ వెళ్ళిన వారికి ప్రవక్త వారి విధానాన్ని అవలంబించటం భక్తుని యొక్క కర్తవ్యం అన్న విషయం కూడా బోధించబడుతుంది.
ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ హజ్ యాత్ర చేసే వారికి అవన్నీ విషయాలు బోధపడతాయి కాబట్టి నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కూడా ప్రత్యేకంగా హజ్ లు ఆచరించుకునే భాగ్యం ప్రసాదించు గాక. అలాగే కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో, భార్యాబిడ్డలతో కూడా వెళ్లి హజ్ లు ఆచరించే భాగ్యం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ప్రసాదించు గాక. అలాంటి సౌకర్యాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కలిగించు గాక.ఆమీన్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (6) [మరణానంతర జీవితం – పార్ట్ 47] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://www.youtube.com/watch?v=rCFxyKebOx8 [22 నిముషాలు]
ఈ ప్రసంగంలో, ప్రళయ దినాన కర్మల త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి వివరించబడింది. ప్రధానంగా, అల్లాహ్ మార్గంలో పోరాడటానికి వెళ్ళిన వారి స్త్రీలను కాపాడకుండా వారికి ద్రోహం చేయడం, ఆత్మహత్య చేసుకోవడం, అకారణంగా భర్తకు అవిధేయత చూపడం, ప్రజలు ఇష్టపడని ఇమామ్, మరియు యజమాని నుండి పారిపోయిన బానిస వంటి వారి నమాజులు స్వీకరించబడకపోవడం, దానధర్మాలు చేసి వాటిని చెప్పుకుని బాధపెట్టడం, గర్వంతో చీలమండలాల కిందికి దుస్తులు ధరించడం, మరియు అమ్మకాలలో అబద్ధపు ప్రమాణాలు చేయడం వంటి పాపాల తీవ్రత గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో చర్చించబడింది. ఈ పాపాలు కర్మల త్రాసును తేలికగా చేయడమే కాక, అల్లాహ్ యొక్క ఆగ్రహానికి మరియు కఠినమైన శిక్షకు కారణమవుతాయని హెచ్చరించబడింది.
అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్ హమ్దులిల్లాహి కఫా వ సలామున్ అలా ఇబాదిల్లజీనస్ తఫా అమ్మా బ’అద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము.
అల్లాహ్ మార్గంలో పోరాడటానికి వెళ్ళిన వారి స్త్రీలను కాపాడకుండా వారికి ద్రోహం చేయడం
వాటిలో 14వ విషయం, అల్లాహ్ మార్గంలో పోరాడడానికి వెళ్ళిన వారి యొక్క స్త్రీలను కాపాడకుండా, వారి విషయంలో అపహరణలకు, అక్రమానికి పాల్పడడం.
మహాశయులారా, అల్లాహ్ మార్గంలో పోరాడడానికి అని అంటే, అల్లాహ్ పంపినటువంటి సత్య ధర్మం మరియు అసత్య ధర్మాల మధ్య ఎప్పుడైనా ఏదైనా పోరాటం జరిగితే, అందులో పాల్గొనడం అని భావం వస్తుంది. అయితే, అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వారు అని అంటే, ఇందులో పోరాడడానికి వెళ్ళిన వారు మాత్రమే కాకుండా, అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రచారం చేయడానికి మరియు అల్లాహ్ యొక్క సత్య ధర్మాన్ని తెలుసుకోవడానికి, విద్య అభ్యసించడానికి ప్రయాణం చేసేవారు, ఈ విధంగా ఇంకా ఎన్నో పుణ్య కార్యాల గురించి కూడా ఈ పదం ఉపయోగపడుతుంది. అయితే మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా తెలిపారు.
ఎలాగైతే అల్లాహ్ మార్గంలో పోరాడేందుకు వెళ్ళడానికి శక్తి లేని వారు తమ నగరాల్లో, గ్రామాల్లో, తమ ఇంట్లో కూర్చుండి ఉంటారో, వారి తల్లులు వారిపై ఎలా నిషిద్ధమో, అలాగే పోరాడటానికి వెళ్ళిన వారి స్త్రీల యొక్క పరువు కూడా అలాగే నిషిద్ధం.
అంటే, స్వయం మనం మన తల్లులను ఎలా గౌరవిస్తామో, వారి విషయంలో ఎలాంటి చెడును ఎప్పుడూ ఊహించకుండా మనం ఉంటామో, అలాగే అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వారి స్త్రీలను కూడా ఆ విధంగా భావించాలి, వారికి రక్షణ ఇవ్వాలి, వారి యొక్క అవసరాలు తీర్చాలి. ఇది మన త్రాసును బరువు చేసే సత్కార్యాలలో ఒకటి. కానీ అలా చేయకుండా, ఎవరైతే అపహరణకు గురి చేస్తారో, వారి మాన పరువుల్లో జోక్యం చేసుకుంటారో, వారికి ఏ రకమైన ఇబ్బంది కలుగజేస్తారో, ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా ఆ అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వ్యక్తిని పిలుస్తాడు. ఎవరి స్త్రీల విషయంలో జోక్యం చేసుకోవడం జరిగిందో, అతన్ని పిలుస్తాడు. పిలిచి, ఈ దౌర్జన్యం చేసిన వ్యక్తి పుణ్యాల్లో నుండి నీకు ఇష్టమైన పుణ్యాలు తీసుకోమని ఆదేశిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం తెలియజేస్తూ,
فما ظنكم (ఫమా జన్నుకుమ్)
చెప్పండి, ఇతని పుణ్యాల నుండి నీకు ఇష్టమైన పుణ్యాలు తీసుకో అని ఏదైతే చెప్పడం జరుగుతుందో, అలాంటప్పుడు ఇతని పరిస్థితి ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. ఇతడు పుణ్యాల నుండి తన పుణ్యాలను కోల్పోయి ఆ సమయంలో ఎంత బాధకు గురి కావచ్చు.
ఇక్కడ కూడా మీరు గమనించండి, ఇస్లాం యొక్క గొప్పతనాన్ని కూడా తెలుసుకోండి. ఈ రోజుల్లో భర్తలు ఇంటి నుండి బయటికి వెళ్ళిన తర్వాత, ఉద్యోగానికైనా, ఆ బయటికి వెళ్ళడం ఇంటి నుండి సేమ్ అదే సిటీలోనైనా, లేదా ఇంటి నుండి బయటికి వెళ్ళడం అంటే దేశం నుండి బయటికి వెళ్లి ఏదైనా సంపాదించే ప్రయత్నం చేయడం గానీ, ఆ ఇంటి యొక్క చుట్టుపక్కన ఉన్నవారు ఆ ఇంటి స్త్రీలను కాపాడుతున్నారా? వారికి రక్షణ కలుగజేస్తున్నారా? ఇంకా ఎవరైతే బయటికి వెళ్లి అల్లాహ్ మార్గంలో ఉంటున్నారో, అల్లాహ్ యొక్క సత్య ధర్మం గురించి ఏదైతే వారు ప్రయత్నం చేస్తున్నారో, అలాంటి వారి ఇళ్లల్లో వారి యొక్క స్త్రీలకు రక్షణ కల్పించడం, వారి యొక్క మాన పరువులను భద్రంగా ఉండే విధంగా చూసుకోవడం చుట్టుపక్కన ఉన్నవారందరి యొక్క బాధ్యత.
ఆత్మహత్య (Suicide)
ఇంకా మహాశయులారా! ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో 15వ విషయం, ఆత్మహత్య చేసుకోవడం. అల్లాహు అక్బర్! ఈ రోజుల్లో చాలా మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అల్లాహ్ పై విశ్వాసం, నమ్మకం కలిగి ఉన్న వారిలో కూడా ఎంతోమంది తమ ఉద్యోగంలో, తమ చదువులో, ఇహలోకపు బూటకపు ప్రేమల్లో, ఇంకా వేరే ఎన్నో విషయాల్లో తమకు తాము ఫెయిల్యూర్ అనుకొని వారు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కానీ, ఆత్మహత్యకు పాల్పడడం ఇది తమను తాము ఎంతో నష్టంలో పడవేసుకోవడం.
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక వ్యక్తి ఎంతో ధైర్యంతో యుద్ధంలో పాల్గొని చాలా ధీటుగా పోరాడుతున్నాడు. ఆ సందర్భంలో అతన్ని చూసిన వారు మెచ్చుకుంటూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు అతన్ని ప్రశంసించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అతడు నరకవాసి అని. కొందరు సహచరులకు, ఏంటి, అంత ధైర్యంగా పోరాడుతున్న వ్యక్తిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నరకవాసి అని అన్నారు అని ఒక బాధగా ఏర్పడింది. కానీ వారిలోనే ఒక వ్యక్తి ఆ ధైర్యంతో పోరాడే వ్యక్తి వెనక ఉండి అతన్ని చూడడం మొదలుపెట్టాడు. చివరికి ఏం జరిగింది? ఎంతో మందిని అతను హత్య చేసి, ధైర్యంగా పోరాడుతూ ఉన్న ఆ వ్యక్తి, ఏదో ఒక బాణం వచ్చి అతనికి గుచ్చుకుంది. దాన్ని అతను భరించలేక, స్వయంగా తన బాణంతోనే తనను తాను చంపుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసిన వెంటనే అతను పరుగెత్తుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, “ప్రవక్తా, మీరు చెప్పిన మాట నిజమైంది. అల్లాహ్ సాక్షిగా మీరు సత్య ప్రవక్త, ఇందులో ఎలాంటి అనుమానం లేదు.” ప్రవక్త అడిగారు, “ఏమైంది విషయం? ఏం చూశావు? ఏం జరిగింది?” అంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, “ప్రవక్తా, ఎవరి గురించైతే, ఏ మనిషి గురించైతే కొందరు సహచరులు ప్రశంసిస్తూ, పొగుడుతూ ఉండగా, మీరు అతని గురించి నరకవాసి అని చెప్పారో, అతన్ని నేను నా కళ్ళారా చూశాను, తనకు తాను చంపుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. తన బాణంతోనే తన యొక్క ఛాతిలో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా అల్లాహ్ త’ఆలా మీ యొక్క మాటను సత్యపరిచాడు,” అని తెలియపరిచాడు.
ఈ విధంగా మహాశయులారా, అందుగురించే అనేకమంది సహాబాయే కిరామ్ రదియల్లాహు అన్హుమ్ వారి యొక్క దృష్టిలో ఆత్మహత్య చేసుకున్న వారి యొక్క కర్మలు వృధా అవుతాయి. అందుకొరకే అతడు నరకంలో వెళ్తాడు అని చెప్పడం జరిగింది.
అయితే ఈ విధంగా మహాశయులారా, ఆత్మహత్యకు పాల్పడకూడదు. ఆత్మహత్య అన్నది ఏమిటి? వాస్తవానికి, ఆత్మహత్య గురించి మనకు తెలిస్తే ఎప్పుడూ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడం. ఎందుకంటే సహీ హదీసులో వచ్చి ఉంది,
ఎవరైతే ఏ మార్గంతో, ఏ విధంగా, ఏ వస్తువుతో ఆత్మహత్య చేసుకుంటాడో, అతను చనిపోయిన తర్వాత నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు, తీర్పు దినాన తీర్పు సంపూర్ణమయ్యే వరకు అతనికి అలాంటి శిక్షనే జరుగుతూ ఉంటుంది. చివరికి అతడు, అయ్యో, నేను ఆత్మహత్య చేసుకోకుంటే ఎంత బాగుండు అని చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ ఆ బాధ ఆ సందర్భంలో అతనికి ఏమీకి పనికి రాదు.
మళ్ళీ ఇక్కడ ఒక విషయం గమనించారా మీరు? ప్రవక్త కాలంలో, ప్రవక్త తోడుగా ఉండి, ప్రవక్తతో యుద్ధంలో పాల్గొని, ఎంతో ధైర్యంగా పోరాడి, ఎందరో ప్రజల ప్రశంసలను అందుకొని, ఇవన్నీ రకాల లాభాలు ఉన్నప్పటికీ ఆ మనిషి నరకంలోకి వెళ్ళాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే, అతను చేసుకున్న అంతటి సత్కార్యాలన్నీ కూడా వృధా అయినవి అనే కదా భావం. అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్మార్గం చూపుగాక.
నమాజు స్వీకరించబడని పాపాలు
మహాశయులారా, ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో అకారణంగా భార్య భర్తకు అవిధేయురాలై పోవుట మరియు అకారణంగా ప్రజలు వారికి నమాజు చేయించే ఇమాము పట్ల అసహ్యించుకొనుట, ఇంకా దాసుడు తన యజమానికి తెలియకుండా అపహరణం చేసి అతని నుండి పారిపోవుట. ఈ మూడు పాపాలు ఎలాంటివి అంటే, దీని మూలంగా వారి యొక్క నమాజు అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. ఇక నమాజ్ త్రాసును బరువు చేసే సత్కార్యాల్లో చాలా గొప్ప సత్కార్యం. ఎప్పుడైతే ఆ నమాజ్ స్వీకరించబడదో, త్రాసు బరువు అనేది కాజాలదు, తేలికగా అవుతుంది. ఈ విధంగా మనిషి కష్టపడి చేసుకున్న పుణ్యాన్ని కూడా నోచుకోకుండా అయిపోతుంది. వినండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసు.
ثَلَاثَةٌ لَا تُجَاوِزُ صَلَاتُهُمْ آذَانَهُمْ (సలాసతున్ లా తుజావిజు సలాతుహుమ్ ఆజానహుమ్) మూడు రకాల వారు, వారి యొక్క నమాజ్ వారి చెవులకు పైగా కూడా పోదు.
అంటే, అల్లాహ్ వద్దకు వెళ్లి అక్కడ అల్లాహ్ స్వీకరించడం, అది ఇంకా దూరం. వారి మీదికే వెళ్ళదు. అంటే భావం, స్వీకరించబడదు. ఎవరు ఆ ముగ్గురు? ఆ మూడు రకాల వారు ఎవరు?
తన యజమాని నుండి పారిపోయిన దాసుడు, అతను తిరిగి వచ్చేంత వరకు అతని నమాజు స్వీకరించబడదు. మరియు ఏ రాత్రి భర్త తన భార్యపై కోపగించుకొని ఉంటాడో, అకారణంగా భార్య భర్తకు అవిధేయురాలై, భర్త ఆగ్రహానికి, రాత్రంతా కోపంగా భార్యపై గడపడానికి కారణంగా మారిందో, ఆ భార్య యొక్క నమాజు కూడా స్వీకరించబడదు. మరియు ఏ ప్రజలు తమ ఇమామును అసహ్యించుకుంటున్నారో, ఒకవేళ వారి అసహనం, వారు అసహ్యించుకొనడం హక్కుగా ఉంటే, అలాంటి ఇమామ్ యొక్క నమాజు కూడా స్వీకరించబడదు. అకారణంగా ఉంటే ప్రజలు పాపంలో పడిపోతారు.
ఈ విధంగా మహాశయులారా, ఈ హదీస్ తిర్మిజీలో ఉంది. హదీస్ నెంబర్ 360. మరియు షేక్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుల్ జామేలో పేర్కొన్నారు. హదీస్ నెంబర్ 3057.
కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, ఇలాంటి భార్యలు, ఇలాంటి ఇమాములు, ఎప్పుడైతే మా నమాజు స్వీకరించబడటం లేదో, మేము ఎందుకు నమాజు చేయాలి అని నమాజును విడనాడకూడదు. నమాజు స్వీకరించకపోవడానికి కారణం ఏ పాపమైతే ఉందో, అలాంటి పాపాన్ని వదులుకొని నమాజు స్వీకరించబడే విధంగా ప్రవర్తించే ప్రయత్నం చేయాలి.
దానధర్మాలు చేసి బాధపెట్టడం
17వ కార్యం, దీనివల్లనైతే త్రాసు తేలికగా అయిపోతుందో అది, దానధర్మాలు చేసి ఒకరి పట్ల ఏదైనా మేలు చేసి అతనికి బాధ కలిగించడం. అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. మనందరికీ సంకల్ప శుద్ధి ప్రసాదించుగాక. ఈ రోజుల్లో ఈ చెడు గుణం చాలా మందిలో చూడడం జరుగుతుంది. ఒకరి పట్ల ఏదైనా మేలు చేస్తారు, ఒకరికి ఏదైనా దానధర్మాలు చేస్తారు, ఒకరికి అతను ఏదైనా విషయంలో సహాయపడతారు, ఒకరి కష్టంలో వారిని ఆదుకుంటారు, తర్వాత ఎద్దేవా చేయడం, తర్వాత మనసు నొప్పించే మాటలు మాట్లాడడం, తర్వాత నేను చేయడం వల్ల, నేను నీకు సహకరించడం వల్ల, నేను నిన్ను నీ కష్టంలో ఆదుకోవడం వల్ల ఈరోజు నువ్వు ఇంత పైకి వచ్చావు అని వారికి బాధ కలిగిస్తారు. ఇలా బాధ కలిగించే వారి ఆ దానధర్మాలు, ఆ మేలు చేసిన కార్యాలు పుణ్యం లేకుండా అయిపోతాయి. వాటి యొక్క ఫలితం అనేది వారికి దక్కదు.
ఖురాన్లో అల్లాహ్ త’ఆలా ఈ విధంగా తెలియపరిచాడు.
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُمْ بِالْمَنِّ وَالْأَذَىٰ (యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుబ్తిలూ సదఖాతికుమ్ బిల్ మన్ని వల్ అజా)
“ఓ విశ్వాసులారా! మీరు మీ ఉపకారాన్ని చాటుకుని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి.”(2:264)
దీనివల్ల మీ యొక్క పుణ్యం అనేది నశించిపోతుంది. మీరు చేసిన ఆ దానం, దానికి ఏ సత్ఫలితం లభించాలో అది మీకు లభించదు. ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసులో కూడా తెలిపారు. ఆ హదీసు ఇన్ షా అల్లాహ్ దీని తర్వాత ప్రస్తావిస్తాను.
చీలమండలానికి కిందిగా దుస్తులు ధరించడం, ఏదైనా మేలు చేసి చెప్పుకొని బాధ కలిగించడం, సామాను విక్రయిస్తూ అసత్య ప్రమాణాలు చేయడం
18వ కార్యం, దీనివల్లనైతే మన త్రాసు ప్రళయ దినాన తేలికంగా అయిపోతుందో, చీలమండలానికి కిందిగా దుస్తులు ధరించడం మరియు ఎవరికైనా ఏదైనా మేలు చేసి చెప్పుకొని బాధ కలిగించడం మరియు ఏదైనా సామాను విక్రయిస్తూ అసత్య ప్రమాణాలు చేయడం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలిపారు, “సలాసతున్” మూడు రకాల మనుషులు ఉన్నారు, అల్లాహ్ త’ఆలా వారితో మాట్లాడడు, ప్రళయ దినాన అల్లాహ్ వారి వైపున చూడడు, వారిని పరిశుద్ధ పరచడు మరియు వారికి కఠినమైన శిక్ష విధిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడుసార్లు ప్రస్తావించారు. అబూజర్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు,
خَابُوا وَخَسِرُوا، مَنْ هُمْ يَا رَسُولَ اللَّهِ؟ (ఖాబూ వ ఖసిరూ, మన్ హుమ్ యా రసూలల్లాహ్?) “ప్రవక్తా, వారైతే నాశనమైపోయారు, వారైతే చాలా నష్టపోయారు. ఎవరు అలాంటి వారు?”
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,
“చీలమండలానికి కిందిగా దుస్తులు ధరించేవాడు, ఎవరికైనా ఏదైనా మేలు చేసి చెప్పుకునేవాడు, మరియు సామాను విక్రయిస్తున్నప్పుడు అసత్య ప్రమాణాలు చేసేవాడు” అని. ఈ హదీస్ ముస్లిం షరీఫ్లో ఉంది, హదీస్ నెంబర్ 106.
ఈ రోజుల్లో మనలోని ఎంతమందికి ఈ విషయం గుర్తుంది? దీనివల్ల ప్రళయ దినాన మన త్రాసు తేలికగా అవుతుంది అన్నటువంటి భయం ఉందా? మనలో ఎంతోమంది ఎలాంటి కారణం లేకుండా చీలమండలానికి కిందిగా దుస్తులు ధరిస్తూ ఉన్నారు. దీనివల్ల నాలుగు రకాల శిక్షలకు గురి అవుతాము అన్నటువంటి భయం కూడా మనలో లేకపోయింది. ఒకటి, అల్లాహ్ మన వైపున చూడడు. రెండవది, అల్లాహ్ మనతో మాట్లాడడు. మూడవది, అల్లాహ్ మనల్ని పరిశుద్ధ పరచడు. నాలుగవది, అల్లాహ్ త’ఆలా కఠిన శిక్ష ఇస్తాడు. ఈ విధంగా మహాశయులారా, ఈ నాలుగు శిక్షలు ఎవరి గురించి? ఎవరైతే దుస్తులు కిందికి ధరిస్తున్నారో, ఒకరికి ఉపకారము చేసి వారి మనసు నొప్పిస్తున్నారో, మరియు సామాను విక్రయిస్తున్న సందర్భంలో అసత్య ప్రమాణాలు చేస్తున్నారో.
ఈ విధంగా మహాశయులారా, అల్లాహ్ యొక్క దయవల్ల మనం మరణానంతర జీవితంలో ఒక అతి ముఖ్యమైన ఘట్టం, త్రాసు నెలకొల్పడం, త్రాసును నెలకొల్పడం, న్యాయంగా తూకం చేయడం మరియు ఆ త్రాసులో ఏ విషయాల వల్ల, ఏ సత్కార్యాల వల్ల త్రాసు బరువుగా ఉంటుంది, ఏ దుష్కార్యాల వల్ల త్రాసు తేలికగా అవుతుందో అన్ని వివరాలు తెలుసుకున్నాము. ఇక మిగిలినది ఏమిటి? మనము సత్కార్యాలు చేయడంలో ముందుకు వెళ్ళాలి. మన త్రాసు బరువుగా ఉండే విధంగా ఆలోచించాలి. దుష్కార్యాలకు దూరంగా ఉండాలి. తేలికగా ఉండకుండా, త్రాసు తేలికగా ఉండకుండా మనం ప్రయత్నించాలి. అప్పుడే మనం సాఫల్యం పొందగలుగుతాము. ఈ విషయాలు మీరు తెలుసుకున్నారు, మీకు చెప్పడం, తెలపడం జరిగింది. ఇక మీ బాధ్యత, మీరు దీనిపై ఆచరించి ఇతరులకు తెలియజేస్తూ ఉండాలి. దీనివల్ల మనకు కూడా ఇంకా లాభాలు కలుగుతాయి. ఎంతమందికి మనం ఈ సత్కార్యాల గురించి తెలుపుతామో, అంతే ఎక్కువగా మన యొక్క త్రాసు కూడా బరువుగా అవుతూ ఉంటుంది.
అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ప్రతిరోజు మనం పడుకునే ముందు, బిస్మిల్లాహి, ఓ అల్లాహ్ నీ యొక్క పేరుతో నేను నిద్రపోతున్నాను. ప్రళయ దినాన నా యొక్క త్రాసును నీవు బరువుగా చేయి అని దుఆ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి ఒక దుఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా కూడా రుజువై ఉన్నది.
అల్లాహ్ మనందరి త్రాసును ప్రళయ దినాన బరువుగా చేయుగాక. అల్లాహ్ త’ఆలా మనందరినీ మన త్రాసు బరువుగా అయ్యే సత్కార్యాలు చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక. మరియు ఏ దుష్కార్యాల వల్ల మన త్రాసు తేలికగా అవుతుందో, అలాంటి దుష్కార్యాల నుండి దూరం ఉండే భాగ్యం ప్రసాదించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ముస్లింలు దేన్ని తమ గీటురాయిగా తీసుకోవాలి? వక్త: హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్) https://youtu.be/7wdS1-T5Pkg [15 నిముషాలు]
ఈ ప్రసంగంలో, ముస్లింలు తమ జీవితంలోని ప్రతి విషయంలోనూ, ప్రతి సమస్యలోనూ అంతిమ గీటురాయిగా దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన ప్రవక్త ప్రవచనాలను (హదీసులను) మాత్రమే స్వీకరించాలని వక్త నొక్కి చెప్పారు. పూర్వీకుల ఆచారాలు, వ్యక్తిగత కోరికలు లేదా ఇతరుల అభిప్రాయాలు ఈ రెండు మూలాలకు విరుద్ధంగా ఉంటే వాటిని అనుసరించవద్దని హెచ్చరించారు. అల్లాహ్ అవతరింపజేసిన దాని ప్రకారం తీర్పు చేయకపోవడం యొక్క తీవ్రమైన పరిణామాలను వివరించడానికి సూరహ్ మాయిదాలోని వాక్యాలను ఉదహరించారు. అలాంటి చర్యలను అవిశ్వాసం (కుఫ్ర్), దుర్మార్గం (జుల్మ్), మరియు అవిధేయత (ఫిస్ఖ్)గా వర్గీకరించారు. అల్లాహ్ చట్టం కంటే తమ చట్టం గొప్పదని భావించి తీర్పు ఇవ్వడం (పెద్ద కుఫ్ర్) మరియు అల్లాహ్ చట్టం యొక్క ఆధిక్యతను విశ్వసిస్తూనే ప్రాపంచిక కోరికల కారణంగా దానిని ఉల్లంఘించడం (చిన్న కుఫ్ర్) మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేశారు. సమాజంలోని వివాదాలు మరియు తగాదాలకు దైవిక చట్టాన్ని ప్రమాణంగా విడిచిపెట్టడమే కారణమని ఒక హదీసుతో ప్రసంగాన్ని ముగించారు.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బాద్.
అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ముస్లింల గీటురాయి – ఖుర్ఆన్ & హదీసులు
ఈ రోజు మనం ముస్లిములు దేనిని తమ గీటురాయిగా తీసుకోవాలి అనే విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ప్రియ వీక్షకులారా, సాధారణంగా మనం మన సమాజంలో చూసేది ఏమిటి? ఏదైనా తీర్పు ఇవ్వాలన్నా, ఏదైనా సమస్యకి పరిష్కారం చూపించాలన్నా, నిర్ణయించాలన్నా, ఈ ఆచారం మా తాత ముత్తాతల నుంచి వస్తా ఉంది, మా అమ్మానాన్న ఇలాగే నేర్పించారు, మా గురువులు ఇలాగే చేసేవారు, అది న్యాయమైనా, అన్యాయమైనా, సత్యమైనా, అసత్యమైనా, ఇది పక్కన పెట్టి, న్యాయం-అన్యాయం, సత్యం-అసత్యం, మంచి విధానం, చెడు విధానం, కరెక్టా కాదా ఇవి పక్కన పెట్టి, ముందు నుంచి వస్తా ఉంది కాబట్టి కొనసాగిస్తున్నారు. కాకపోతే ఇస్లాంలో అలా చెల్లదు.
ముస్లిములు దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు అంటే ప్రామాణికమైన హదీసులను గీటురాయిగా తీసుకోవడం తప్పనిసరి, విధి అని మనం తెలుసుకోవాలి. అమ్మానాన్నతో నేర్చుకోవాలి, కాకపోతే అమ్మానాన్న, తల్లిదండ్రులు దేనిని గీటురాయిగా తీసుకుని నేర్పించారు? గురువులతో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కానీ ఆ గురువులు దేనిని గీటురాయిగా తీసుకుని మనకి నేర్పించారు? విజ్ఞులతో, జ్ఞానులతో, పండితులతో తెలుసుకోవాలి. కాకపోతే వారు దేనిని గీటురాయిగా తీసుకుని మనల్ని నేర్పించారు అనేది ముఖ్యమైన విషయం, తెలుసుకోవలసిన విషయం.
అభిమాన సోదరులారా, ప్రతి విషయంలో, అమ్మానాన్న విషయంలో, భార్యాపిల్లల విషయంలో, ఇరుగుపొరుగు వారి విషయంలో, బంధుమిత్రుల విషయంలో, స్నేహితుల విషయంలో, అనాథల విషయంలో, వితంతువుల విషయంలో, ఇరుగుపొరుగు వారి విషయంలో, అది వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఉద్యోగమైనా, రాజకీయపరమైనా, ఏ రంగంలోనైనా సరే ఒక తీర్పు ఇస్తే, ఒక పరిష్కారం చేస్తే అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశాలు మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం ప్రకారంగానే ఉండాలి. ఖుర్ఆన్ మరియు హదీసులు మాత్రమే గీటురాయిగా మనం తీసుకోవాలి, చేసుకోవాలి.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరహ్ మాయిదా, ఆయత్ 49లో ఇలా సెలవిచ్చాడు:
“(ఓ ప్రవక్తా!) అల్లాహ్ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి. వాళ్ళ కోరికలను ఎంత మాత్రం అనుసరించకు.” (5:49)
అంటే, నీవు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పంపిన చట్టం ప్రకారం ప్రజల వ్యవహారాలను పరిష్కరించు. ఏదైనా తీర్పు ఇస్తే, ఏదైనా సమస్యకి పరిష్కారం చూపిస్తే అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశం ప్రకారం ఉండాలి, అల్లాహ్ యొక్క చట్ట ప్రకారం ఉండాలి, అల్లాహ్ యొక్క ఆజ్ఞ పరంగా ఉండాలి.
وَلَا تَتَّبِعْ اَهْوَاۤءَهُمْ (వలా తత్తబిఅ అహ్వాఅహుమ్) “వారి కోరికలను ఎంత మాత్రం అనుసరించకు.“
వారు బంధువులని, స్నేహితులని, మిత్రులని, తెలిసిన వారని, లేకపోతే వారు సమాజంలో వారు హోదాలో మంచి హోదాలో, మంచి పొజిషన్‌లో ఉన్నారని, ఆ ఉద్దేశంతో తీర్పు చేయకూడదు. వారు ఎవ్వరైనా సరే, అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, ఇరుగుపొరుగు వారు, స్నేహితులు, గురువులు, తెలిసిన వారు, తెలియని వారు ఎవ్వరైనా సరే. ధనవంతులు, పేదవారు, ఉన్నవారు, లేనివారు ఎవ్వరైనా సరే అందరికీ ఒకటే ధర్మం, అందరికీ ఒకటే న్యాయం, అందరికీ ఒకటే విధానం.
وَاَنِ احْكُمْ بَيْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ (వ అనిహ్కుమ్ బైనహుమ్ బిమా అన్జలల్లాహ్) “(ఓ ప్రవక్తా!) అల్లాహ్ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి.”
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చట్టం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశం ఏమిటి? ఆయన యొక్క ఆజ్ఞ ఏమిటి? ఆయన ఏ విధంగా మనకు సెలవిచ్చాడు? మరియు దానికి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయంలో ఆయన ప్రవచనం ఏమిటి? ఆయన విధానం ఏమిటి? ఇది మనకు తప్పనిసరి.
ఇదే ఆయత్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చివరి భాగంలో ఇలా సెలవిచ్చాడు:
وَاِنَّ كَثِيْرًا مِّنَ النَّاسِ لَفٰسِقُوْنَ (వ ఇన్న కసీరమ్ మినన్నాసి లఫాసిఖూన్) “ప్రజల్లో చాలా మంది అవిధేయులే ఉంటారు.“(5:49)
ఫాసిఖ్ అంటే అవిధేయుడు, కరప్ట్, దురాచారి. అంటే ప్రజలలో చాలా మంది అల్లాహ్ ఆజ్ఞలకు, ఆదేశాలకు విరుద్ధంగా తీర్పుని ఇస్తున్నారన్నమాట. పట్టించుకోవటం లేదు. నేను ఎవరిని నమ్ముతున్నాను? ఎవరి పట్ల నేను విశ్వాసం కలిగి ఉన్నాను? ఎవరి కలిమా నేను చదువుతున్నాను? ఎవరి విధేయత నేను చూపాలి? ఎవరిని నేను ఆదర్శంగా తీసుకున్నాను? ఇవి కాకుండా, మనోమస్తిష్కాలకు గురై, ప్రపంచ వ్యామోహానికి గురై, ఏదో ఒక కారణంగా అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను పక్కన పెట్టి, మన కోరికల పరంగా, లేకపోతే వారు బంధువులని, తెలిసిన వారని, ఉన్న వారని, ఏదో ఒక సాకుతో వారికి అనుగుణంగా, వారి కోరికలకు సమానంగా తీర్పు ఇవ్వకూడదు అన్నమాట.
అభిమాన సోదరులారా, ఈ వాక్యంలో అల్లాహ్ ఏం తెలియజేశాడు? ఎవరైతే అల్లాహ్ ఆదేశాలను కాకుండా, అల్లాహ్ చట్టపరంగా కాకుండా, దానికి విరుద్ధంగా తీర్పునిస్తే వారు ఫాసిఖ్, అవిధేయులు, కరప్టెడ్, దురాచారులు అని అల్లాహ్ తెలియజేశాడు. అలాగే, అదే సూరహ్, సూరహ్ మాయిదా వాక్యం 45లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
ఎవరైతే అల్లాహ్ ఆదేశం ప్రకారం, అల్లాహ్ చట్టం ప్రకారం తీర్పు ఇవ్వకపోతే, వారు దుర్మార్గులు. అంటే అల్లాహ్ చట్టం ప్రకారం తీర్పు ఇవ్వని వారే దుర్మార్గులు, దౌర్జన్యులు అని అల్లాహ్ సెలవిచ్చాడు. అంటే, అల్లాహ్ చట్టం ప్రకారం, అల్లాహ్ ఆదేశం ప్రకారం, అనగా ఖుర్ఆన్ మరియు హదీసుల పరంగా తీర్పు ఇవ్వకపోతే, వారు జాలిమీన్, దుర్మార్గులు, దౌర్జన్యపరులు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సెలవిచ్చాడు. అలాగే అదే సూరహ్, ఆయత్ 44 లో ఇలా సెలవిచ్చాడు:
وَمَنْ لَّمْ يَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الْكٰفِرُوْنَ (వమల్లమ్ యహ్కుమ్ బిమా అన్జలల్లాహు ఫ ఉలాఇక హుముల్ కాఫిరూన్) “ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన వహీ ప్రకారం తీర్పు చెయ్యరో వారే (కరడుగట్టిన) అవిశ్వాసులు.” (5:44)
అభిమాన సోదరులారా, ఈ విషయం మనం బాగా గమనించాలి. ఒకే సూరహ్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యం 44, అదే సూరహ్ వాక్యం 45, అదే సూరహ్ వాక్యం 49లో, అల్లాహ్ చట్టం ప్రకారం, అల్లాహ్ ఆదేశాల ప్రకారం తీర్పు ఇవ్వకపోతే, ఒక ఆయతులో ఫాసిఖీన్ అన్నాడు, వారు ఫాసిఖులు, దౌర్జన్యపరులు, దురాచారులు అన్నారు. ఇంకో ఆయతులో జాలిమూన్ అన్నాడు, దౌర్జన్యపరులు, దుర్మార్గులు అన్నాడు. ఇంకో ఆయతులో కాఫిరూన్ అన్నాడు, అంటే వారు అవిశ్వాసులు.
అంటే ఇంత గమనించే విషయం ఇది. మనము జీవితానికి సంబంధించిన అది విశ్వాసం అయినా, ఆరాధన అయినా, వ్యాపారం అయినా, వ్యవసాయం అయినా, రాజకీయం అయినా, నడవడిక అయినా, ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే మనము తీర్పు ఇవ్వాలంటే గీటురాయిగా తీసుకోవాలంటే అది అల్లాహ్ ఆదేశం, అంతిమ దైవప్రవక్త యొక్క ప్రవచనం.
అల్లాహ్ చట్టంతో తీర్పు ఇవ్వకపోవటంలోని రకాలు
అభిమాన సోదరులారా, అలా చేయకపోతే ఇస్లాంకు వ్యతిరేకమైన చట్టాలను అమలు చేయడాన్ని ధర్మ సమ్మతంగా భావించడం, ఇస్లాంకు వ్యతిరేకంగా, ఖుర్ఆన్‌కి వ్యతిరేకంగా, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలకు వ్యతిరేకంగా అమలు చేయడాన్ని ఇది కరెక్టే, సమ్మతమే అని భావించడం కుఫ్ర్ అక్బర్ అవుతుంది. పెద్ద అవిశ్వాసం. అంటే ఆ వ్యక్తి ఇస్లాం నుంచి తొలగిపోతాడు.
ఇబ్నె బాజ్ రహమతుల్లాహి అలైహి ఇలా సెలవిచ్చారు, ఎవరైనా తీర్పు ఇస్తే, అది రెండు రకాలుగా ఉంటుంది అన్నారు.
మొదటి రకం ఏమిటి? (ఇదా హకమ బిగైరి మా అన్జలల్లాహ్) అల్లాహ్ చట్టం ప్రకారం కాకుండా, అల్లాహ్ యొక్క ఆదేశాలకు విరుద్ధంగా తీర్పు ఇస్తే, ఎందుకు ఇస్తున్నాడు ఆ తీర్పు ఆ వ్యక్తి? (యఅతఖిదు హల్ల దాలిక్), అతని ఉద్దేశం ఏమిటి? నేను ఇచ్చే తీర్పు, దీంట్లో పరిష్కారం ఉంది ఆ సమస్యకి. అల్లాహ్ ఆదేశంలో ఆ పరిష్కారం లేదు, నా తీర్పులో ఆ పరిష్కారం ఉంది అని భావించి ఆ తీర్పు ఇస్తే, లేదా (అవ అన్న దాలిక అఫ్దల్), నా తీర్పు, నా నిర్ణయం, నా న్యాయం అల్లాహ్ ఆదేశం కంటే గొప్పది, మేలైనది అని భావిస్తే, (అవ్ అన్నహు యుసావి లిష్షరిఅ), లేకపోతే నా తీర్పు కూడా అల్లాహ్ తీర్పుకి సమానంగానే ఉంది, షరిఅత్‌కి సమానంగానే ఉంది అనే ఉద్దేశంతో తీర్పు ఇస్తే, (కాన కాఫిరన్ ముర్తద్దన్), ఆ వ్యక్తి కాఫిర్ అయిపోతాడు, ముర్తద్ అయిపోతాడు. అంటే ఇస్లాం నుంచి తొలగిపోతాడు.
ఏ ఉద్దేశంతో? నేను ఇచ్చే న్యాయం తీర్పు, నేను చేసే న్యాయం, నేను అవలంబించే విధానం ఇది అల్లాహ్ ఆదేశం కంటే గొప్పది లేదా దానికి సరైనది, సమానంగా ఉంది అని ఆ ఉద్దేశంతో భావించి తీర్పు ఇస్తే, అటువంటి న్యాయం, అటువంటి తీర్పు, అటువంటి వ్యక్తి ఇస్లాం నుంచి తొలగిపోతారు, కాఫిర్ అవిశ్వాసి అయిపోతారు, ముర్తద్ అయిపోతారు.
రెండో రకమైన తీర్పు ఏమిటి? (అమ్మా ఇదా హకమ బిగైరి మా అన్జలల్లాహ్), అల్లాహ్ చట్టానికి విరుద్ధంగా, అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా తీర్పు ఇస్తున్నాడు, ఉద్దేశం ఏమిటి? (లిహవా), తన కోరికలకి అనుగుణంగా, కోరికలకి బానిసైపోయి ఇస్తున్నాడు, కోరికలను పూర్తి చేసుకోవటానికి. (అవ్ లిమకాసిద్ సయ్యిఅ) చెడు ఉద్దేశం కోసం, చెడు కారణాల కోసం. (అవ్ లితమఇన్), లేకపోతే ఏదో ఒక ఆశించి. (అవ్ లిర్రిశ్వా) లంచం కోసం. నేను అల్లాహ్ యొక్క ఆదేశానికి విరుద్ధంగా తీర్పు ఇస్తే నాకు ఇంత డబ్బు వస్తుంది, లంచం వస్తుంది, ధనం వస్తుంది, ఈ ఉద్దేశంతో తీర్పు ఇస్తే, అంటే అతని మనసులో అతని విశ్వాసం, అతని నమ్మకం ఏమిటి? నా తీర్పు అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా ఉంది, ఇది తప్పే. కాకపోతే నేను ఈ విధంగా తీర్పు ఇస్తే నాకు ప్రపంచపరంగా, ఆర్థికపరంగా నాకు డబ్బు వస్తుంది, ధనం వస్తుంది, నా కోరికలు పూర్తి అవుతాయి అని ఈ దురుద్దేశంతో తీర్పు ఇస్తున్నాడు. మనసులో మాత్రం అల్లాహ్ తీర్పే గొప్పది అని నమ్మకం ఉంది. అటువంటి వ్యక్తి ఘోరమైన పాపాత్ముడు అవుతాడు. దీనిని చిన్న షిర్క్ అంటారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి చిన్న, పెద్ద కుఫ్ర్ నుండి, షిర్క్ నుండి రక్షించుగాక, కాపాడుగాక.
అంటే, నా నిర్ణయం, నా తీర్పు అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా ఉన్నా నాదే గొప్పది అని భావించి ఇస్తే, అతను పెద్ద కుఫ్ర్, ముర్తద్ అయిపోతాడు. మనోవాంఛలకు, డబ్బుకి ఆశించి, కోరికలకి లోనై తీర్పు ఇస్తే పాపాత్ముడు అవుతాడు, చిన్న కుఫ్ర్ అవుతుంది, చిన్న అవిశ్వాసం అవుతుంది.
అభిమాన సోదరులారా, చివర్లో ఒక్క హదీస్ చెప్పి నేను నా ఈ మాటని ముగిస్తాను. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “వారి నాయకులు దైవగ్రంథం ప్రకారం తీర్పు చేయకుంటే, అల్లాహ్ అవతరింపజేసిన చట్టాన్ని ఎన్నుకోకుంటే, అల్లాహ్ వారి మధ్యన వివాదాలను, తగాదాలను సృష్టిస్తాడు.” ఈ హదీస్ ఇబ్నె మాజాలో ఉంది.
ఇప్పుడు పూర్తి సమాజంలో, ప్రపంచంలో మన పరిస్థితి ఏమిటి? మనకి అర్థమవుతుంది. మనం ఎందుకు ఈ విధంగా వివాదాలకు గురై ఉన్నాము, తగాదాలకు గురై ఉన్నాము అంటే, మన తీర్పులు, మన వ్యవహారాలు, మనం చేసే విధానము, మనం తీసుకున్న గీటురాయి అది ఖుర్ఆన్ మరియు హదీస్ కాదు. మనం తీసుకున్న గీటురాయి అది అల్లాహ్ ఆదేశాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు కాదు.
ఎప్పుడైతే మనం అల్లాహ్ ఆదేశాల పరంగా తీర్పు ఇవ్వమో, అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను గీటురాయిగా తీసుకోమో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన మధ్య వివాదాలను, తగాదాలను సృష్టిస్తాడు. అది ఇప్పుడు మనము కళ్ళారా చూస్తున్నాము.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన హదీసులను గీటురాయిగా తీసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ప్రతి విషయంలో, ప్రతి సమస్యలో, ప్రతి సమయంలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క ఆదేశాలను గీటురాయిగా తీసుకొని తీర్పునిచ్చే సద్బుద్ధిని అల్లాహ్ మనందరినీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇహపరలోకాలలో సాఫల్యం ప్రసాదించుగాక.
వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, దౌర్జన్యం (జుల్మ్) మరియు దాని భయంకరమైన పరిణామాల గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో చర్చించబడింది. దౌర్జన్యాన్ని అల్లాహ్ తనపై తాను నిషేధించుకున్నాడని, మరియు ఇతరుల పట్ల దౌర్జన్యానికి పాల్పడవద్దని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారని వివరించబడింది. అణచివేతకు గురైన వ్యక్తి యొక్క శాపం (బద్దుఅ) నేరుగా అల్లాహ్ ను చేరుతుందని, దానికి మరియు అల్లాహ్ కు మధ్య ఎలాంటి అడ్డు ఉండదని చెప్పబడింది. దీనికి ఉదాహరణలుగా సహాబీ సయీద్ బిన్ జైద్ (రజియల్లాహు అన్హు), ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ (రహిమహుల్లాహ్), మరియు ఫిరౌన్ ల గాథలు వివరించబడ్డాయి. దౌర్జన్యం చేసేవారికి సహాయపడటం లేదా వారి వైపు మొగ్గు చూపడం కూడా నరకాగ్నికి దారితీస్తుందని ఖురాన్ ఆయత్ ద్వారా హెచ్చరించబడింది. దౌర్జన్యపరుడైనా, బాధితుడైనా తన సోదరునికి సహాయం చేయాలని, దౌర్జన్యపరుడికి సహాయం చేయడమంటే అతనిని ఆ దౌర్జన్యం నుండి ఆపడమని ఇస్లాం బోధిస్తుందని ప్రసంగం ముగించబడింది.
అస్తగ్ ఫిరుహు వ ను’మిను బిహీ వ నతవక్కలు అలైహ్, వ నఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అ’మాలినా, మై యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ, వ మై యుద్ లీల్ ఫలా హాదియ లహ్. వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ, వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, అర్సలహు బిల్ హఖ్ఖి బషీరవ్ వ నజీరా, అమ్మా బాద్
ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్, వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా వ కుల్ల ముహ్దసతిన్ బిద్అ, వ కుల్ల బిద్అతిన్ దలాలహ్, వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్
“మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి, దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరిపేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్‌కు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మీపై నిఘావేసి ఉన్నాడు.” (అన్నిసా 4:1)
“ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడండి. మాట్లాడితే సూటిగా మాట్లాడండి (సత్యమే పలకండి).తద్వారా అల్లాహ్ మీ ఆచరణలను చక్కదిద్దుతాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఎవరయితే అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత కనబరచాడో అతను గొప్ప విజయం సాధించాడు.” (అల్ అహ్ జాబ్ 33:70-71)
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.
గౌరవనీయులైన పెద్దలు, పండితులు మరియు ఇస్లామీయ సోదరులారా.
దౌర్జన్యం – దుష్పపరిణామాలు
‘దౌర్జన్యం – దుష్పపరిణామాలు’ అనే అంశం గురించి ఇన్షా అల్లాహ్ ఈ జుమా ప్రసంగంలో ఖురాన్, హదీస్ మరియు చరిత్ర ఆధారంగా కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం.
దౌర్జన్యం చేయటాన్ని, దౌర్జన్యానికి పాల్పడటాన్ని అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధం చేసి ఉన్నారు. మనం చూసినట్లయితే, ముస్లిం గ్రంథంలోని హదీసె ఖుద్సీలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు.
“ఓ నా దాసులారా! నిశ్చయంగా నేను నా మీద దౌర్జన్యాన్ని నిషేధించుకున్నాను. ఇంకా దానిని మీ మధ్య కూడా నిషిద్ధం చేశాను. కాబట్టి మీరు ఒకరిపై ఒకరు దౌర్జన్యం చేసుకోకండి.” (ముస్లిం గ్రంథంలోని హదీసె ఖుద్సీ)
అర్థం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా భక్తులతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, “ఓ నా దాసులారా, దౌర్జన్యం చేయటాన్ని నేను నా మీద నిషేధం చేసుకున్నాను. అలాగే మీ కొరకు కూడా దౌర్జన్యం చేయటాన్ని నిషేధం చేసేశాను కాబట్టి, మీరు ఎవరూ కూడా దౌర్జన్యానికి పాల్పడవద్దు.”
ముస్లిం గ్రంథంలోని మరొక ఉల్లేఖనంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు,
“దౌర్జన్యానికి దూరంగా ఉండండి. ఎందుకంటే దౌర్జన్యం ప్రళయ దినాన చీకట్లుగా పరిణమిస్తుంది.” (ముస్లిం గ్రంథం)
దౌర్జన్యం నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే దౌర్జన్యానికి పాల్పడిన వారు రేపు పరలోకాన అంధకారాలలో ఉంచివేయబడతారు అన్నారు.
ఈ రెండు ఉల్లేఖనాలలో మనము గమనించాల్సిన రెండు విషయాలు ఉన్నాయి. మొదటి విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎప్పుడూ, ఎవరి మీద దౌర్జన్యము చేయడు. ఆయన న్యాయం చేయువాడు, ఎవరి మీద కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దౌర్జన్యం చేయడు. అలాగే గమనించాల్సిన రెండో విషయం ఏమిటంటే, మానవులు కూడా ఎవరూ ఎవరి మీద దౌర్జన్యానికి పాల్పడకూడదు, అల్లాహ్ నిషేధం చేసి ఉన్నాడు. అయితే మిత్రులారా, ఎవరైతే దౌర్జన్యానికి పాల్పడతారో, అలాంటి వారిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇష్టపడడు అని ఖురాను గ్రంథంలో తెలియజేశాడు.
وَاللَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ (వల్లాహు లా యుహిబ్బుజ్ జాలిమీన్) “అల్లాహ్ దుర్మార్గులను ఎంత మాత్రం ఇష్టపడడు.” (ఆలి ఇమ్రాన్ 3:57)
ఖురాను గ్రంథం, మూడవ అధ్యాయము 57వ వాక్యంలో చూసినట్లయితే, అల్లాహ్ ఈ విధంగా తెలియజేశాడు, “అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దౌర్జన్యానికి పాల్పడిన వారిని ఇష్టపడడు.”
మిత్రులారా, ఎవరైతే దౌర్జన్యానికి గురి అవుతారో, అణిచివేతకు గురి అవుతారో, అలాంటి వారు బద్దుఅ (శాపం) పెడతారు. వారు శాపం పెడితే, అది అల్లాహ్ వద్దకు డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూటిగా హెచ్చరించి ఉన్నారు.
“అణచివేతకు గురైన వ్యక్తి శాపం నుండి జాగ్రత్త పడండి. ఎందుకంటే దానికి, అల్లాహ్ కు మధ్య ఎలాంటి అడ్డు తెర ఉండదు.”
దౌర్జన్యంపై చారిత్రక ఉదాహరణలు
దీనికి కొన్ని ఉదాహరణలు ఇన్షా అల్లాహ్ నేను మీ ముందర ఉంచుతున్నాను చూడండి.
మొదటి ఉదాహరణ సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు వారిది. ఈయన పేరు ఎక్కడైనా విన్నారా మీరు? సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు వారు అషర ముబష్షరాలో చివరి పేరు ఆయనది. ఒకే ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పది మందిని స్వర్గపు శుభవార్త వినిపించి ఉన్నారు కదా, మొదటి పేరు అబూబక్ర్ రజియల్లాహు అన్హు వారిది వస్తుంది. చివరి పేరు సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు వారిది.
సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు వారు వృద్ధాప్యానికి చేరినప్పుడు – ప్రవక్త వారు మరణించారు, అబూబక్ర్ రజియల్లాహు అన్హు వారు, ఉమర్ రజియల్లాహు అన్హు వారు, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు, అలీ రజియల్లాహు అన్హు వారు నలుగురు ధర్మ ఖలీఫాలు మరణించిన తరువాత, మదీనాలో మర్వాన్ అనే ఒక వ్యక్తి పరిపాలన చేస్తున్న రోజుల్లో, సయీద్ రజియల్లాహు అన్హు వారు వృద్ధాప్యానికి గురైపోయారు, అంటే ముసలివారైపోయారు. ఆ సమయంలో అర్వా బిన్త్ ఉవైస్ అనే ఒక మహిళ ఆయన మీద నింద మోపారు. ఏమని నింద మోపారు? “ఈయన అక్రమంగా నా భూమి లాక్కున్నారు, దౌర్జన్యంగా నా భూమి పీక్కున్నారు” అని నింద మోపారు.
విషయం మర్వాన్ వద్దకు చేరింది. మర్వాన్ ఈ సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు వారిని పిలిపించి, “ఏంటి విషయం? ఈ మహిళ మీ గురించి ఈ విధంగా చెబుతా ఉంది” అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, “ఏమండీ, ఈ నేరానికి నేను పాల్పడలేదు. చూడండి, నేను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఒక హదీసు విని ఉన్నాను. ప్రవక్త వారు తెలియజేశారు, ఎవరైనా ప్రపంచంలో ఇతరుల భూమి ఒక జానెడు భూమి దోచేసినా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా రేపు పరలోకంలో అతని మెడలో ఏడు భూముల భారం వేలాడదీస్తాడు అని తెలియజేశారు.” ఆ హదీసు నేను ప్రవక్త వారి నోట విని ఉన్నాను. ఆ హదీసు విని కూడా నేను ఇలాంటి నేరం చేస్తానా? ఇతరుల భూమి అక్రమంగా నేను కాజేస్తానా? నేను చేయలేదు అని చెప్పేశారు.
అప్పుడు ఆయన ఏమన్నారంటే, “మీరు ఇంకా సాక్ష్యాధారాలు చూపించవలసిన అవసరం లేదు, మీరు వెళ్ళవచ్చు” అని పంపించేశాడు. కాకపోతే, ముసలితనంలో ఆయన మీద, ఆయన గౌరవనీయుడు కదండీ, ఎంత గౌరవనీయుడు, ఒక సహాబీ. ప్రవక్త వారి నోట స్వర్గపు శుభవార్త పొందిన సహాబీ. అలాంటి గౌరవనీయుడైన వ్యక్తి మీద నింద మోపటము, కాబట్టి ఆయనకు గాయమైంది, మనసుకు గాయమైంది. ఆయన బాధపడ్డారు, లోలోపల బాధపడి, చివరికి ఆయన ఏం చేశారంటే, శాపం పెట్టేశారు. ఏమని శాపం పెట్టారు?
اللَّهُمَّ إِنْ كَانَتْ كَاذِبَةً فَأَعْمِ بَصَرَهَا وَاقْتُلْهَا فِي أَرْضِهَا (అల్లాహుమ్మ ఇన్ కానత్ కాజిబతన్ ఫ అ’మి బసరహా వఖ్తుల్ హా ఫీ అర్జిహా) “ఓ అల్లాహ్! ఈమె అబద్దమాడుతున్నట్లయితే, ఈమె కంటిచూపును తీసివేయి మరియు ఈమెను తన భూమిలోనే మరణింపజెయ్యి.” (ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం)
ఏమని శాపం పెట్టారంటే, “ఓ అల్లాహ్, ఈ మహిళ ఆపద్ధం పలుకుతూ ఉన్నట్లయితే, ఈవిడ కంటి చూపు పోవాలి, ఈవిడ భూమిలోనే ఈవిడ చనిపోవాలి” అని శాపం పెట్టారు, అల్లాహు అక్బర్.
సహాబీ అండి. సహాబీ శాపం పెట్టారు, చరిత్రకారులు తెలియజేసిన విషయం ఏమిటంటే, ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే ఆ మహిళ అంధురాలు అయిపోయారు, కంటిచూపు పోయింది. ఆ తర్వాత, ఆవిడ భూమిలోనే ఏదో పని నిమిత్తము గుంత తవ్వి పెట్టి ఉంటే, ఒకరోజు ఆవిడ వెళ్తూ ఉంది, కళ్ళు చూపు, కంటి చూపు లేదు. కనిపించని కారణంగా వెళ్ళింది, ఆ గుంతలో పడి చచ్చింది, అల్లాహు అక్బర్.
చూశారా? శాపం పెడితే, అది డైరెక్ట్ అల్లాహ్ వద్దకు చేరుకుంటుంది అని చెప్పటానికి ఒక ఉదాహరణ, అది ముస్లిం గ్రంథంలోని ఉదాహరణ, ఒక సహాబీ ఉదాహరణ మీ ముందర ఉంచాను. ఇప్పుడు మరొక ఉదాహరణ మీ ముందర ఉంచుతూ ఉన్నాను, గమనించండి.
రెండో ఉదాహరణ ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్ వారిది. నలుగురు ఇమాములు ఉన్నారు కదండీ, ఆ నలుగురు ఇమాములలో ఒక ఇమాము వారు, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్. ఈయన జీవిత కాలంలో మామూనుర్ రషీద్ అనే ఒక పరిపాలకుడు ఉండేవాడు. ఆయన కొంతమంది మాటల్లో పడిపోయి, ఖురాన్ మఖ్లూఖ్ అని ఒక ఉపద్రవాన్ని లేవనెత్తేశారు.
ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ వారు, “మీ వాదన సరికాదు, ఇది ఖురాన్ వాక్యాలకు, ప్రవక్త వారి ఉల్లేఖనాలకు విరుద్ధమైనది” అని వారించారు. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా, మామూనుర్ రషీద్ రాజు కాబట్టి, ఎవరైతే ఆయన మాటను వ్యతిరేకించారో వారిని కొట్టించాడు, జైళ్లలో వేయించాడు. ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్ వారిని కూడా జైల్లో వేయించి కొరడాలతో కొట్టించాడు.
చూడండి, కొరడాలతో కొట్టించిన తర్వాత, కొద్ది రోజులకి ఏం చేశాడంటే, ఆయన నగరం నుంచి వేరే నగరానికి తరలించండి, వేరే జైల్లో వేసి మరింత కఠినమైన శిక్షలు వేయించండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఇక భటులు ఆయన ఇంటికి వెళ్లారు. “రాజు ఆజ్ఞ వచ్చింది, మీకు ఈ ఊరి నుంచి వేరే ఊరికి తరలిస్తున్నారు, అక్కడ మరింత కఠినమైన శిక్షలు మీకు వేయిస్తున్నాడు రాజు” అని చెప్పారు. అప్పుడు ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్ వారు మోకాళ్ళ మీద వంగిపోయి శాపం పెట్టారు.
గమనించండి మిత్రులారా, మోకాళ్ళ మీద వంగిపోయి శాపం పెట్టారు. ఏమని శాపం పెట్టారు?
اللَّهُمَّ فَإِنْ يَكُنِ الْقُرْآنُ كَلامَكَ غَيْرَ مَخْلُوقٍ فَاكْفِنَا مَؤُنَتَهُ (అల్లాహుమ్మ ఫ ఇన్ యకునిల్ ఖుర్ఆను కలాముక ఘైరు మఖ్లూఖ్, ఫక్ఫినా మవూనతహూ) “ఓ అల్లాహ్! ఖురాన్ నీ వాక్యమై, అది సృష్టించబడనిదైతే, ఇతని (పరిపాలకుడి) పీడ నుండి మమ్మల్ని కాపాడు.”
ఓ అల్లాహ్, నీ గ్రంథం ఖురాన్ ఘైర్ మఖ్లూఖ్ అయితే, ఈ రాజు దౌర్జన్యం నుండి నన్ను కాపాడు ఓ అల్లాహ్ అని దుఆ చేశారు. చరిత్రకారులు తెలియజేసిన విషయం ఏమిటంటే, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్ వారిని ఆయన ఊరిలో నుంచి వేరే నగరానికి తీసుకువెళ్తూ ఉన్నారు, నగరంలో ఇంకా ప్రవేశించలేదు, అంతలోనే కబురు వచ్చింది, ఏమని? రాజు చనిపోయాడు అని. అల్లాహు అక్బర్.
చూశారా? కాబట్టి రెండు ఉదాహరణలు మీ ముందర ఉంచానండి. ఈ రెండు ఉదాహరణల ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే, ఎవరైతే దౌర్జన్యానికి గురవుతారో, అణిచివేతకు గురవుతారో, వారు శాపం పెడతారు. అలాంటి వారు శాపం పెడితే, ఆ శాపం తగులుతుంది. ఎవరైతే దౌర్జన్యం చేస్తారో, వారి మీద ఆ శాపం పడుతుంది, ఆ శాపం వారిని పట్టుకుంటుంది, జాగ్రత్త అని ఈ రెండు ఉదాహరణలు మీ ముందర ఉంచడం జరిగింది.
అలాగే మనం చూసినట్లయితే, ఎవరైతే దౌర్జన్యం చేస్తారో, అలాంటి వారి మీద అల్లాహ్ శాపం పడుతుంది అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ లో తెలియజేశాడు.
ఖురాను గ్రంథం 11వ అధ్యాయము 18వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు. “జాగ్రత్త, ఎవరైతే దౌర్జన్యానికి పాల్పడతారో, వారి మీద అల్లాహ్ శాపం పడుతుంది.”
అల్లాహ్ శాపం పడుతుంది అనటానికి ఏదైనా ఒక ఉదాహరణ చెప్పండి గురువుగారు అంటే, ఖురాన్ లో మూసా అలైహిస్సలాం వారి గురించి మనము చూచినట్లయితే, బనీ ఇస్రాయీల్ ప్రజలను, అలనాటి రాజు ఫిరౌన్, ఫిరౌన్ బనీ ఇస్రాయీల్ ప్రజలను టార్గెట్ చేసుకుని, వారి హక్కుల్ని కాలరాసి, తర్వాత వారిని బానిసలుగా మార్చి, రేయింబవళ్లు వెట్టి చాకిరి చేయించి, కొట్టించి, ఆకలి దప్పుకలతో ఉంచి, చివరికి వారి మగబిడ్డలను వారి కళ్ల ముందరే చంపించేశాడు.
ఎంత దౌర్జన్యం అండి. హక్కులు కాజేశాడు. కొట్టాడు, ఆకలి దప్పుకలతో ఉంచాడు, బానిసలుగా మార్చారు, వెట్టి చాకిరి చేయించాడు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, వారి ఇళ్లల్లో మగబిడ్డ పుడితే, వారి కళ్ల ముందే, తల్లిదండ్రుల కళ్ల ముందే చంపించేశాడు.
ఇంకా వాళ్ళు ఉంటారా? ఎంత అణిచివేతకు గురైన వారు గమ్మున ఉంటారా? శాపం పెడతారా పెట్టరా? శాపం పెట్టేశారు. చివరికి ఏమైంది? మనందరికీ తెలిసిన విషయమే, పదేపదే మనం వినే ఉన్నాం. చివరికి ఏమైందండి? సముద్రంలో, నడి సముద్రంలో మునిగి చచ్చాడు. నడి సముద్రంలో మునిగి చచ్చిన తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రకటించేశాడు, “నీ శవాన్ని నేను ప్రపంచంలో భద్రంగా ఉంచుతాను. ప్రళయం వరకు వచ్చే వారు నీ శవాన్ని చూసి గుణపాఠం నేర్చుకోవాలి” అని అన్నాడు. నేడు కూడా ప్రజలు వెళుతూ ఉన్నారు, కెమెరాలలో అతని ఫోటోలు, వీడియోలు బంధించి ప్రపంచానికి చూపిస్తూ ఉన్నారు, “ఇదిగో, ఒకప్పుడు విర్రవీగిపోయిన దౌర్జన్యపరుడు, అహంకారి ఫిరౌన్, అతని శవాన్ని చూడండి” అని చూపిస్తూ ఉన్నారు.
అంటే, అహంకారానికి పాల్పడితే, దౌర్జన్యానికి పాల్పడితే, అలాంటి గతి పడుతుంది మిత్రులారా.
అలాగే మరొక ముఖ్యమైన హెచ్చరిక, అదేమిటంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా 11వ అధ్యాయము 113వ వాక్యంలో తెలియజేశాడు.
ఎవరైతే దౌర్జన్యానికి పాల్పడతారో, అలాంటి వారి వైపు మొగ్గు చూపించకూడదు. ఒకవేళ మొగ్గు చూపారో, మీకు కూడా నరకాగ్ని పట్టుకుంటుంది అన్నారు. అంటే అర్థం ఏమిటి? ఒక వ్యక్తి దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు అంటే, ఆ వ్యక్తికి ఏ విధంగానూ సహకరించకూడదు.
మనం ఏం చేస్తున్నామండి? ప్రజలు మనం చూసినట్లయితే, నేడు కొంతమంది ముస్లింలను టార్గెట్ చేసుకుని, వారి హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు, వారిని అణిచివేతకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క నిబంధన, ఒక్కొక్క హక్కు, ఒక్కొక్క హక్కు వారిది దూరం చేసేస్తూ ఉన్నారు, తొలగించుకుంటూ పోతూ ఉన్నారు. ముస్లింలను నలువైపుల నుంచి అణిచివేతకు గురి చేస్తూ ఉన్నారు. అయితే దౌర్జన్యం చేసేవాడు దౌర్జన్యం చేస్తూ ఉంటే, కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా, మీడియా ముందర వచ్చి, సోషల్ మీడియా ముందర వచ్చి, అతన్ని పొగుడుతూ ఉన్నారు. అతన్ని పొగుడుతూ, అతనికి సహాయం చేస్తూ ఉన్నారు, అతనికి ప్రోత్సహిస్తూ ఉన్నారు. అలా అతన్ని ప్రోత్సహిస్తే, అతనికి సహాయపడితే, అతను ఏం చేస్తాడండి? మరింత రెచ్చిపోయి దౌర్జన్యానికి పాల్పడతాడు, అవునా కాదా? మరింత ఎక్కువగా దౌర్జన్యం చేస్తాడు, అవునా కాదా? అలా చేస్తే, దౌర్జన్యం చేసిన వానికి కూడా నరకాగ్ని పట్టుకుంటుంది, దౌర్జన్యం చేసే వారిని పొగిడిన వారికి కూడా నరకాగ్ని పట్టుకుంటుంది, జాగ్రత్త అని అల్లాహ్ హెచ్చరించాడు. కాబట్టి అలా చేయకూడదు సుమా.
అలాగే మిత్రులారా, మానవుల మీద కూడా దౌర్జన్యానికి పాల్పడకూడదు. జంతువుల మీద కూడా దౌర్జన్యానికి పాల్పడకూడదు. పక్షుల మీద కూడా దౌర్జన్యానికి పాల్పడకూడదు. ఏ ప్రాణి మీద కూడా దౌర్జన్యానికి పాల్పడకూడదు అని హెచ్చరించిన ధర్మం, మన ఇస్లాము ధర్మం. అయితే మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే,
انْصُرْ أَخَاكَ ظَالِمًا أَوْ مَظْلُومًا (ఉన్సుర్ అఖాక జాలిమన్ అవ్ మజ్లూమన్) “మీ సోదరునికి సహాయం చేయండి, అతను దౌర్జన్యపరుడైనా సరే లేదా అణచివేతకు గురైన వాడైనా సరే.”
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన తర్వాత, సహాబాలు ప్రవక్త వారితో అడిగారు, “ఓ దైవ ప్రవక్తా, మా సోదరుడు అణిచివేతకు గురైతే మనము అతనికి సహాయం చేస్తాం, ఇది అర్థమవుతా ఉంది. కానీ, మన సోదరుడు ఇతరుల మీద దౌర్జన్యం చేస్తా ఉంటే, అప్పుడు మనము అతనికి ఎలా సహాయం చేయగలము?” అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం. మీ సోదరుడు ఇతరుల మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే, అతని చెయ్యి పట్టుకొని ఆ దౌర్జన్యం నుండి ఆపండి. దౌర్జన్యం చేయకుండా మీ సోదరుని మీరు ఆపితే, మీ సోదరునికి మీరు సహాయం చేసిన వారు అవుతారు అన్నారు, అల్లాహు అక్బర్. ఇది ఇస్లాం మిత్రులారా.
కాబట్టి ఇస్లాం ధర్మంలో ఎవరి మీద కూడా దౌర్జన్యం చేయటానికి అనుమతి ఇవ్వబడలేదు. ఎవరైతే దౌర్జన్యం చేస్తారో, అలాంటి వారిని అల్లాహ్ ఇష్టపడడు. వారి మీద దైవ శాపం పడుతుంది. ఎవరైతే అణిచివేతకు గురవుతారో, వాళ్ళు శాపం పెడితే, ఆ శాపం వారిని ముట్టుకుంటుంది అని బోధించడం జరిగింది.
అల్లాహ్ తో నేను దుఆ చేస్తూ ఉన్నాను, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ అన్ని రకాల దౌర్జన్యాల నుండి దూరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక. న్యాయంగా వ్యవహరించుకుంటూ, అందరి హక్కులు చెల్లించుకుంటూ జీవితం గడిపే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, వక్త ఇస్లాంలో నిషిద్ధమైన ‘బిదాత్’ (మతంలో నూతన ఆవిష్కరణ) యొక్క వివిధ రకాలను వివరిస్తారు. బిదాత్ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు: విశ్వాసానికి సంబంధించినది (బిదాత్ అల్-ఇ’తిఖాదియ్యా) మరియు ఆరాధనలకు సంబంధించినది (బిదాత్ అల్-అమలియ్యా). విశ్వాసపరమైన బిదాత్, జహ్మియా, ముతజిలా వంటి మార్గం తప్పిన సమూహాల సిద్ధాంతాలను ఉదాహరణగా చూపిస్తుంది. ఆరాధనలలో బిదాత్‌ను నాలుగు విభాగాలుగా వివరిస్తారు: 1) షరియత్‌లో ఆధారం లేని కొత్త ఆరాధనను సృష్టించడం (ఉదా: మీలాద్-ఉన్-నబీ ఉత్సవం), 2) నిర్ధారిత ఆరాధనలకు అదనంగా చేర్చడం (ఉదా: ఫర్జ్ నమాజ్‌లో రకాతుల సంఖ్యను పెంచడం), 3) ఆరాధన పద్ధతిని మార్చడం (ఉదా: వ్యక్తిగత ధిక్ర్‌ను సామూహికంగా చేయడం), 4) సాధారణ ఆరాధనలకు షరియత్ నిర్దేశించని ప్రత్యేక సమయం లేదా తేదీని కేటాయించడం (ఉదా: షాబాన్ 15న ప్రత్యేక ఉపవాసం మరియు జాగరణ). ప్రతి రకమైన బిదాత్ నుండి దూరంగా ఉండాలని మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గాన్ని మాత్రమే అనుసరించాలని వక్త నొక్కిచెప్పారు.
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.
గత ఎపిసోడ్ లో బిదాత్ అంటే ఏమిటి? దాని అర్థం తెలుసుకున్నాం. ఈరోజు బిదాత్ రకాలు తెలుసుకుందాం, కొన్ని రకాలు.
బిదాత్ రకాలు
ముఖ్యంగా బిదాత్ రెండు రకాలు.
మొదటి రకం విశ్వాసపరమైన బిదాత్. విశ్వాసానికి, ఈమాన్ కి సంబంధించిన బిదాత్. అంటే ఈ బిదాత్ సంబంధం వ్యక్తుల విశ్వాసాలతో ఉంటుంది. ఉదాహరణకు, జహ్మియా అనే ఒక వర్గం ఉంది, ముతజిలా అనే ఒక వర్గం ఉంది, రవాఫిజ్ అనే వర్గం ఉంది, తదితర మార్గ విహీన వర్గాల వారి సిద్ధాంతాలు. వారు అల్లాహ్ విషయంలో, అల్లాహ్ యొక్క అస్మాయె హుస్నా (ఉత్తమమైన పేర్లు) విషయంలో, అలాగే తఖ్దీర్ (విధి వ్రాత) విషయంలో, మన కర్మల విషయంలో వాళ్ళు కొత్త కొత్త విషయాలు కల్పించుకున్నారు. ఇప్పుడు దాని వివరం అవసరం లేదు. ఇది విశ్వాసానికి సంబంధించిన బిదాత్. ముతజిలా, జహ్మియా, రవాఫిజ్ తదితర మార్గ విహీన వర్గాల సిద్ధాంతాలు.
ఇక రెండవ రకం, ఆరాధనకి సంబంధించిన బిదాత్. ఆరాధన. నమాజ్ చేయటం, జికిర్ చేయటం, దుఆ చేయటం, హజ్ ఉమ్రా చేయటం, ఉపవాసం ఉండటం, పండుగ జరుపుకోవటం. హృదయానికి సంబంధించిన ఆరాధనలు, శారీరానికి సంబంధించిన ఆరాధనలు, నాలుకకి సంబంధించిన ఆరాధనలు. అంటే ఆరాధనకి సంబంధించిన బిదాత్, ఇది రెండవ రకం. అంటే ఇబాదత్ గా, ఆరాధనగా చెల్లుబాటు అవుతున్న బిదాత్. అది ఆరాధన కాదు, అది ఇబాదత్ కాదు, అది ప్రవక్త గారి విధానం కాదు. కానీ ఇబాదత్ గా, ఆరాధనగా చెల్లుబాటు అవుతా ఉంది.
ఉదాహరణకు, షరియత్ తో ఏ ప్రాతిపదిక కూడా లేని ఆరాధనను ఎవరైనా సృష్టించుకొని దానిని సమాజంలో ప్రవేశపెట్టడం. అంటే లేని నమాజు, లేని ఉపవాసం, లేని పండుగలను కల్పించుకోవటం అన్నమాట. ఉదాహరణకు, మీలాదున్నబీ, ఈద్ మీలాదున్నబీ ఉత్సవం. అది ఇబాదత్ గా, దీన్ లోని, ధర్మంలోని ఒక పండుగగా జరుపుకుంటారు. కానీ అది ఇబాదత్ కాదు. ఇది ఇబాదత్ లో బిదాత్ అవుతుంది.
అలాగే, ఇంకో రకం, చేయవలసి ఉన్న ఆరాధనకు అదనంగా ఏదన్నా చేర్చటం. ఉదాహరణకు, ఫర్జ్ నమాజులో ఒక రకాతును అదనంగా చేర్చటం. జుహర్ నమాజ్ నాలుగు రకాతులు ఫర్జ్. ఐదు చేయవచ్చా? చేయకూడదు. ఉద్దేశ్యపూర్వకంగా పుణ్యమే కదా, ఆరాధనే కదా, మంచి పనే కదా అని ఉద్దేశ్యంతో చేస్తే అది బిదాత్ అయిపోతుంది. అలాగే అసర్ లో నాలుగు, ఐదు చేయలేము. మగ్రిబ్ లో మూడు, నాలుగు చేయలేము. ఇషాలో నాలుగు, ఐదు చేయలేము. ఫజర్ లో రెండే, మూడు చేయలేము. మరి నమాజ్ మంచిదే కదా, నమాజ్ పుణ్యమే కదా అని చెప్పి ప్రవక్త గారు చూపించిన విధానం కాకుండా వేరే విధానం, కొత్తగా ఆవిష్కరిస్తే, ప్రవేశ పెడితే అది ఆరాధనలో బిదాత్ అవుతుంది.
అలాగే ఇంకో రకం ఏమిటంటే, ఆరాధన చేయవలసిన రీతిలో చేయకుండా, సంప్రదాయేతర పద్ధతిలో చేయటం. ఉదాహరణకు, వ్యక్తిగతంగా చేసుకోవలసిన దుఆలను, దైవ ధ్యానమును, జికిర్ ను సామూహికంగా చేయటం. ఏ ఆరాధన అయితే ప్రవక్త గారు వ్యక్తిగతంగా చేసుకోండి అని చేసి చూపించారో, వాటిని మనం సామూహికంగా చేయటం. దాని కోసం ప్రత్యేక సదనాలను ఏర్పాటు చేసుకోవటం, ఆరాధనలు చేసేందుకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవలంబించిన సులభమైన విధానాన్ని కాదని, కష్టతరమైన పద్ధతులను పాటించటం అన్నమాట.
అలాగే ఇంకో రకం ఏమిటంటే, ధర్మ సమ్మతమైన ఏ దేని ఆరాధనలను ఫలానా తేదీ లేక ఫలానా సమయం కొరకు కేటాయించుకోవటం. ఆ ఆరాధన మాత్రం ధర్మ సమ్మతమే. కానీ ఆ ధర్మ సమ్మతమైన ఆ ఆరాధనలను ఫలానా తేదీ లేక ఫలానా సమయం కొరకు ప్రత్యేకించుకోవటం. అది కూడా బిదాతే. ఎందుకంటే ఈ ఆరాధనలను షరియత్ ఆ మేరకు నిర్ధారించి ఉండదు. ఉదాహరణకు, షాబాన్ నెల 15వ తేదీ పగలు ఉపవాసం ఉండాలని, ఆ రాత్రి పూట జాగారం చేయాలని నిశ్చయించుకోవటం. ఇది బిదాత్. ఉపవాసం ఉండటం, రాత్రి జాగారం చేయటం ఇది సమ్మతమే. ఎప్పుడైనా ఉపవాసం ఉండవచ్చు, ఏ రాత్రి అయినా జాగారం చేసి ప్రార్థన చేయవచ్చు. ఉపవాసం ఉండటం, రాత్రి పూట జాగారం చేయటం సమ్మతమే. కానీ వాటిని ఒకానొక రాత్రి కోసమో, పగలు కోసమో ప్రత్యేకించుకోవటం సమ్మతం కాదు. దానికి ఆధారం లేదు అన్నమాట.
ఇది బిదాత్ కి సంబంధించిన కొన్ని రకాలు మనము తెలుసుకున్నాము. మన సమాజంలో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అల్లాహ్ మనందరినీ ప్రతి బిదాత్ నుండి కాపాడుగాక. ఇక బిదాతుల ఆదేశం ఏమిటి? అది ఇన్షాఅల్లాహ్ మనం వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.