షిర్క్ నాలుగు నియమాలు (القواعد الأربع) – జుల్ఫీ దావహ్

ఇస్లాం ధర్మం యొక్క నాలుగు నియమాలు
(అల్ ఖవాఇద్ అల్ ఆర్బా) القواعد الأربع – تلغو
షిర్క్ నాలుగు సూత్రాలు

మూలం:షేఖుల్ ఇస్లాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ (రహమతుల్లాహ్ అలై)
అనువాదకులు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిదహుల్లాహ్)
జుల్ఫీ దావహ్ పబ్లికేషన్స్, సౌదీ అరేబియా

[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [11 పేజీలు] [మొబైల్ ఫ్రెండ్లీ]

పుస్తక పరిచయం

ఇది ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందిన పుస్తకం. దీనిని “అల్ ఖవాఇదుల్ అర్బఅ” (నాలుగు నియమాలు) అంటారు,  ఎందుకంటే ఇందులో విశ్వాసిని అవిశ్వాసి నుండి, ఏకదైవారాధకుడిని బహుదైవారాధకుడి నుండి వేరు చేయడానికి ఉపయోగించే నాలుగు మౌలిక అంశాలను తెలుపడం జరిగినది. ఇది ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ తమీమీ గారి అత్యంత ముఖ్యమైన రచనలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది ఆయన ఇతర రచనల కంటే చాలా సంక్షిప్తంగా ఉన్నప్పటికీ, కవర్ చేయబడిన సమాచారం మరియు చర్చించిన ప్రయోజన అంశాల పరంగా చాలా విలువైనది, ఘనమైనది.

షేఖ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ చెప్పారు: ఈ నియమాలు చాలా ముఖ్యమైనవి, వీటిని ఉత్తమ రీతిలో అర్థం చేసుకున్నవారు ముష్రికుల ధర్మాన్ని మరియు ముస్లిముల ధర్మాన్ని స్పష్టంగా తెలుసుకోగలరు. అనేక మందికి ఇవి తెలియవు గనక సమాధి పూజ, వాటిలో ఉన్నవారి, ఔలియాల పూజలు చేస్తూ తౌహీద్ పై ఉన్నామని అనుకుంటారు, నిజంగా చెప్పాలంటే వారు తౌహీద్ మరియు షిర్క్ వాస్తవికతలను మరియు వాటి మధ్యలో ఉన్న వ్యత్యాసం పట్ల అజ్ఞానంలో ఉన్నారు.

షేక్ సాలిహ్ అల్-ఫౌజాన్ ఇలాచెప్పారు:, “మీరు ఈ నియమాలను నేర్చుకొని, అర్థం చేసుకుంటే, అల్లాహ్ తన ప్రవక్తల మరియు గ్రంథాల ద్వారా బోధపరచిన తౌహీద్‌ను అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. అలాగే అల్లాహ్ హెచ్చరించిన షిర్క్ మరియు ఇహపరలోకాల్లో దాని యొక్క అపాయం మరియు హాని గురించి అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.

క్లాస్ 1:

క్లాస్ 1: https://www.youtube.com/watch?v=dYx8j7WAV9k

أسأل الله الكريمَ ، ربَّ العرش العظيم: أن يتولاّك في الدنيا والآخرة، وأن يجعلك مباركاً أينما كُنْتَ

అస్అలుల్లాహల్ కరీమ్, రబ్బల్ అర్షిల్ అజీం (పరమదాత, మహోన్నత సింహాసనానికి ప్రభువైన అల్లాహ్ ను అర్థిస్తున్నాను): ఇహపరలోకాల్లో నిన్ను వలీ [1]గా చేసుకొనుగాక మరియు నీవు ఎక్కడ ఉన్నా నిన్ను శుభవంతుడిగా చేయుగాక.

وأن يجعلكَ مِمن إذا أعطي شَكَر، وإذا ابْتُلي صَبر، وإذا أذنب استغفر، فإن هذه الثلاث عنوانُ السعادة

ఇంకా ఏదైనా ప్రసాదించబడినప్పుడు కృతజ్ఞత చెల్లించే, పరీక్షకు గురైనప్పుడు సహనం వహించే, పాపం (పొరపాటు) జరిగినప్పుడు క్షమాపణ కోరుకునే వారిలో నిన్ను చేర్చుగాక. వాస్తవానికి ఈ మూడు గుణాల్లోనే సౌభాగ్యం, అదృష్టం ఉంది.

[1] వలీ అంటే అల్లాహ్ యొక్క సన్నిహితుడు, అతడికి అల్లాహ్ సన్మార్గం చూపుతాడు, సద్భాగ్యం ప్రసాదిస్తాడు, అతనికి సహాయసహకారాలు అందిస్తాడు.

క్లాస్ 2:

క్లాస్ 2: https://youtu.be/eW8NRgoEZ8o

اعلم أرشدك الله لطاعته أن الحنيفية -مِلةَ إبراهيمَ-: أنْ تَعبُدَ الله مُخلصاً له الدين، وبذلك أمرَ الله جميع الناس، وخَلَقهم لها ، كما قال تعالى

అల్లాహ్ నీకు విధేయత భాగ్యం ప్రసాదించుగాక! తెలుసుకో! ఇబ్రాహీం అలైహిస్సలాం మతం అయిన హనీఫియత్ అంటే: నీవు ధర్మాన్ని ఆయనకే ప్రత్యేకించి కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట. అల్లాహ్ సర్వ మానవాళికి ఈ ఆదేశమే ఇచ్చాడు, వారందరినీ పుట్టించినది కూడా దీని కొరకే. అల్లాహ్ ఆదేశం చదవండి:

وَمَا خَلَقتُ الجِنَّ وَالإِنسَ إِلّا لِيَعْبُدوِن
నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను “ఆరాధించటానికి” మాత్రమే. (జారియాత్ 51:56).

فإذا عرفتَ أن الله خلقك لعبادته: فاعلم أنّ العبادةَ لا تُسمى عبادةً إلا مع التوحيد، (كما أنّ الصلاة لا تُسمى صلاة إلا مع الطهارة).

అల్లాహ్ నిన్ను ఆయన ఆరాధన కొరకు మాత్రమే పుట్టించాడన్నది నీవు తెలుసుకున్నప్పుడు, ఇది కూడా తెలుసుకో: ఎలాగైతే వుజూ లేనిది నమాజును నమాజ్ అనబడదో అలాగే తౌహీద్ (ఏకదైవారాధన) లేనంత వరకు ఏ ఆరాధన కూడా ఆరాధన అనబడదు. ఎలాగైతే నమాజులో వుజూ భంగమయితే నమాజ్ పాడవుతుందో, అలాగే ఆరాధనలో ‘షిర్క్’ ప్రవేశిస్తే అది పాడవుతుంది (స్వీకరించబడదు).

فإذا دخل الشركُ في العبادة فسدتْ، (كالحَدَثِ إذا دخل في الصلاة) ، كما قال تعالى

షిర్క్ ఏదైనా ఆరాధనలో కలుషితమైతే అది దానిని చెడగొడుతుందని, ఆ కార్యం వృధా అవుతుందని (పుణ్యఫలం దొరకదని), షిర్క్ కు పాల్పడినవాడు శాశ్వతంగా నరకవాసి అయిపోతాడు అని ఎప్పుడైతే నీవు తెలుసుకున్నావో, “షిర్క్ బిల్లాహ్ (అల్లాహ్ కు ఎవరినైనా భాగస్వామిగా చేయడం)” గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని గమనించు![2] -అల్లాహ్ నిన్ను దాని వలలో చిక్కకుండా కాపాడుగాక!- (ఆమీన్).

مَا كَانَ لِلْمُشْرِكِينَ أَنْ يَعْمُرُوا مَسَاجِدَ اللَّهِ شَاهِدِينَ عَلَى أَنْفُسِهِمْ بِالْكُفْرِ أُولَئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ وَفِي النَّارِ هُمْ خَالِدُونَ[ [التوبة: 17].

[2] “ముష్రిక్కులు తాము స్వయంగా తమ అవిశ్వాసాన్ని గురించి సాక్ష్యమిస్తున్నప్పుడు వారు అల్లాహ్‌ మస్జిదుల నిర్వహణకు ఎంతమాత్రం తగరు. వారి కర్మలన్నీ వృథా అయిపోయాయి. శాశ్వతంగా వారు నరకాగ్నిలో ఉంటారు“. (తౌబా 9:17). [కొన్ని పుస్తకాల్లో ఈ దలీల్ కూడా ఉంది].

ఆ షిర్క్ గురించే హెచ్చరిస్తూ అల్లాహ్ ఇలా తెలిపాడు:

]إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ[ [النساء: 116].

తనకు భాగస్వామ్యం (షిర్క్‌) కల్పించటాన్ని అల్లాహ్‌ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. షిర్క్‌ మినహా తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు.  (నిసా 4:116).

అయితే అందుకు నాలుగు నియమాల(4మూల విషయాల)ను) తెలుసుకోవడం తప్పనిసరి అవుతుంది, అల్లాహ్ వాటిని తన దివ్య గ్రంథంలో ప్రస్తావించాడు:

క్లాస్ 3:

క్లాస్ 3: https://youtu.be/VEyPUZ3PWz0

మొదటి నియమం (మూలం) – القاعدة الأولى

أن تعلم: أن الكفارَ الذين قاتَلَهمْ رسولُ الله صلى الله عليه وسلم كانوا مقرّين أنّ الله هو الخالقُ الرازقُ المحي المميتُ المُدبر لجميعَ الأمور، ولم يدخلهم ذلك في الإسلام

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ అవిశ్వాసులతో యుద్ధం చేశారో వారు అల్లాహ్ యే సృష్టికర్త, పోషకుడు, జీవన్మరణ ప్రధాత, విశ్వ వ్యవస్థను నడిపేవాడు అని నమ్మేవారు, అయినా ఈ విశ్వాసం వారిని ఇస్లాంలో చేర్చలేకపోయింది. (అంటే అందువల్ల వారు ముస్లింలు కాలేదు).

దలీల్: والدليل قوله تعالى

]قُلْ مَنْ يَرْزُقُكُمْ مِنَ السَّمَاءِ وَالْأَرْضِ أَمَّنْ يَمْلِكُ السَّمْعَ وَالْأَبْصَارَ وَمَنْ يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَيُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَمَنْ يُدَبِّرُ الْأَمْرَ فَسَيَقُولُونَ اللَّهُ فَقُلْ أَفَلَا تَتَّقُونَ[ [يونس: 31]

ఆకాశం నుండి, భూమి నుండి మీకు ఉపాధిని సమకూర్చేవాడెవడు? చెవులపై, కళ్లపై పూర్తి అధికారం కలవాడెవడు? ప్రాణమున్న దానిని ప్రాణములేని దాని నుండీ, ప్రాణములేని దానిని ప్రాణమున్న దాని నుండీ వెలికి తీసేవాడెవడు? సమస్త కార్యాల నిర్వహణకర్త ఎవరు?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. “అల్లాహ్‌యే” అని వారు తప్పకుండా చెబుతారు. “మరలాంటప్పుడు మీరు (దేవుని శిక్షకు) ఎందుకు భయపడరు?” (యూనుస్ 10:31).

క్లాస్ 4:

క్లాస్ 4: https://youtu.be/zzc4q4XAin4

రెండవ నియమం (మూలం)

القاعدة الثانية: الكفار كانوا يقولون ما دعوناهم وتوجهنا إليهم إلّا لِطَلَب القُربة والشَّفاعة

ఆ అవిశ్వాసులు అనేవారు: మేము అల్లాహ్ యేతరులతో దుఆ చేసేది, వారికి కొన్ని ఆరాధనలు సమర్పించేది; వారు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చుతారని, మా గురించి సిఫారసు చేస్తారని.

సాన్నిధ్యం యొక్క దలీల్: فدليلُ القُرْيَةِ؛ قوله تعالىَ

وَالَّذِينَ اتَّخَذُوا مِنْ دُونِهِ أَوْلِيَاءَ مَا نَعْبُدُهُمْ إِلَّا لِيُقَرِّبُونَا إِلَى اللَّهِ زُلْفَى إِنَّ اللَّهَ يَحْكُمُ بَيْنَهُمْ فِي مَا هُمْ فِيهِ يَخْتَلِفُونَ إِنَّ اللَّهَ لَا يَهْدِي مَنْ هُوَ كَاذِبٌ كَفَّارٌ .[الزمر: 3]

ఎవరయితే అల్లాహ్‌ను గాకుండా ఇతరులను “ఔలియా” (సంరక్షకులుగా) ఆశ్రయించారో వారు, “ఈ పెద్దలు మమ్మల్ని అల్లాహ్‌ సాన్నిధ్యానికి చేర్చటంలో తోడ్పడతారని భావించి మాత్రమే మేము వీళ్లను ఆరాధిస్తున్నామ”ని అంటారు. ఏ విషయం గురించి వారు భేదాభిప్రాయానికి లోనై ఉన్నారో దానికి సంబంధించిన (అసలు) తీర్పు అల్లాహ్‌ (స్వయంగా) చేస్తాడు. అబద్ధాలకోరులకు, కృతఘ్నులకు అల్లాహ్‌ ఎట్టి పరిస్థితిలోనూ సన్మార్గం చూపడు. (జుమర్ 39:03).

సిఫారసు యొక్క దలీల్: ودليل الشفاعة قوله تعالى

]وَيَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنْفَعُهُمْ وَيَقُولُونَ هَؤُلَاءِ شُفَعَاؤُنَا عِنْدَ اللَّهِ قُلْ أَتُنَبِّئُونَ اللَّهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ سُبْحَانَهُ وَتَعَالَى عَمَّا يُشْرِكُونَ[ [يونس: 18]

వారు అల్లాహ్‌ను వదలి తమకు నష్టాన్ని గానీ, లాభాన్ని గానీ చేకూర్చలేని వాటిని పూజిస్తున్నారు. ఇంకా, “అల్లాహ్‌ సమక్షంలో ఇవి మాకు సిఫారసు చేస్తాయి” అని చెబుతున్నారు. “ఏమిటీ, ఆకాశాలలో గానీ, భూమిలో గానీ అల్లాహ్‌కు తెలియని దానిని గురించి మీరు ఆయనకు తెలియజేస్తున్నారా?” వారు కల్పించే భాగస్వామ్యాల నుంచి ఆయన పవిత్రుడు, ఉన్నతుడు అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. (యూనుస్ 10:18).

క్లాస్ 5:

క్లాస్ 5: https://youtu.be/TxgpaXMw0Qs

సిఫారసు రెండు రకాలు:

(1) రద్దు చేయబడే సిఫారసు. (2) అంగీకరించబడే సిఫారసు.

రద్దు చేయబడే సిఫారసు – అంటే కేవలం అల్లాహ్ శక్తిలో మాత్రమే ఉన్నదానిని అల్లాహ్ యేతరులతో కోరడం. దలీల్:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم مِّن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا بَيْعٌ فِيهِ وَلَا خُلَّةٌ وَلَا شَفَاعَةٌ ۗ وَالْكَافِرُونَ هُمُ الظَّالِمُونَ. [ [البقرة: 254]

ఓ విశ్వాసులారా! వ్యాపార లావాదేవీలుగానీ, స్నేహబంధాలుగానీ, సిఫార్సులుగానీ ఉండని ఆ రోజు రాకముందే మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చుచేయండి. వాస్తవానికి తిరస్కారులే దుర్మార్గులు. (బఖర 2:254).

అంగీకరించబడే సిఫారసు: (1) ఇది కేవలం అల్లాహ్ తో మాత్రమే కోరడం జరుగుతుంది. (2) సిఫారసు చేసే వ్యక్తి అల్లాహ్ వైపు నుండి గౌరవించ బడినవాడు. (3) ఎవరి కొరకు సిఫారసు చేయడం జరుగుతుందో అల్లాహ్ అతని సాక్ష్యం, ఆచరణ పట్ల సంతృప్తి చెంది ఉండడం తప్పనిసరి.

దలీల్:

مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ ۚ
ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? (బఖర 2:255).

మూడవ నియమం (మూలం)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికి ఏకదైవారాధన బోధ చేశారో వారి ఆరాధ్య దైవాలు వేర్వేరుగా ఉండినవి:

కొందరు సూర్యచంద్రాదులను ఆరాధించేవారు, దలీల్:

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِنْ كُنْتُمْ إِيَّاهُ تَعْبُدُونَ[ [فصلت: 37]

రేయింబవళ్లూ, సూర్యచంద్రులు కూడా ఆయన (శక్తి) సూచనలలోనివే. మీరు సూర్యునికిగానీ, చంద్రునికిగానీ సాష్టాంగప్రణామం (సజ్దా) చేయకండి. నిజంగా మీరు అల్లాహ్‌ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్‌ ముందు సాష్టాంగపడండి. (ఫుస్సిలత్ 41:37).

కొందరు దైవదూతలను ఆరాధించేవారు, దలీల్:

]وَيَوْمَ يَحْشُرُهُمْ جَمِيعًا ثُمَّ يَقُولُ لِلْمَلَائِكَةِ أَهَؤُلَاءِ إِيَّاكُمْ كَانُوا يَعْبُدُونَ – قَالُوا سُبْحَانَكَ أَنْتَ وَلِيُّنَا مِنْ دُونِهِمْ بَلْ كَانُوا يَعْبُدُونَ الْجِنَّ أَكْثَرُهُمْ بِهِمْ مُؤْمِنُونَ[ [سبأ: 40 – 41]

ఆ రోజు అల్లాహ్‌ వారందరినీ సమీకరించి, “ఏమిటి, వీళ్లు మిమ్మల్ని పూజించేవారా?” అని దూతలను అడుగుతాడు. “(ఓ అల్లాహ్‌!) నీవు పవిత్రుడవు. మా రక్షకుడవు నువ్వు మాత్రమే గాని వీళ్లు కాదు. అసలు వీళ్లు జిన్నులను పూజించే వాళ్ళు. వీరిలో చాలా మంది వాళ్ళనే (జిన్నులనే) నమ్ము కున్నారు” అని వారు సమాధానమిస్తారు. (సబా 34:40,41).

కొందరు ప్రవక్తలను ఆరాధించేవారు, దలీల్:

]{وَإِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ أَأَنْتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُونِي وَأُمِّيَ إِلَهَيْنِ مِنْ دُونِ اللَّهِ قَالَ سُبْحَانَكَ مَا يَكُونُ لِي أَنْ أَقُولَ مَا لَيْسَ لِي بِحَقٍّ … [ [المائدة: 116]

“మర్యమ్‌ పుత్రుడవైన ఓ ఈసా! అల్లాహ్‌ను వదలి నన్నూ, నా తల్లిని ఆరాధ్య దైవాలుగా చేసుకోండి అని గాని నీవు ప్రజలకు చెప్పావా?” అని అల్లాహ్‌ (నిలదీసి) అడిగే సందర్భం కూడా స్మరించుకోదగినదే. అప్పుడు ఈసా ఇలా విన్నవించుకుంటారు: “(ఓ అల్లాహ్‌!) నిన్ను పరమ పవిత్రునిగా భావిస్తున్నాను. ఏ మాటను అనే హక్కు నాకు లేదో అలాంటి మాటను అనటం నాకేమాత్రం తగదు. (మాఇద 5:116, 117 కూడా చదవండి).

కొందరు పుణ్యపురుషులను ఆరాధించేవారు, దలీల్:

]قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُمْ مِنْ دُونِهِ فَلَا يَمْلِكُونَ كَشْفَ الضُّرِّ عَنْكُمْ وَلَا تَحْوِيلًا – أُولَئِكَ الَّذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إِلَى رَبِّهِمُ الْوَسِيلَةَ أَيُّهُمْ أَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُ وَيَخَافُونَ عَذَابَهُ إِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَحْذُورًا[ [الإسراء: 56 – 57]

వారికి చెప్పు: “మీరు అల్లాహ్‌ను వదలి ఆరాధ్య దైవాలుగా భావిస్తున్న వారిని పిలిచి చూడండి, వారు మీ నుండి ఏ కష్టాన్నీ దూరం చేయటంగానీ, మార్చటంగానీ చేయలేరు.” వీళ్లు ఎవరిని పిలుస్తున్నారో వారే స్వయంగా తమ ప్రభువు సామీప్యం కోసం మార్గాన్ని వెతుక్కుంటున్నారు. తమలో ఎవరు ఎక్కువ సామీప్యం పొందుతారోనని (పోటీపడుతున్నారు). వారు ఖుద్దుగా ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు. ఆయన శిక్ష పట్ల భీతిల్లుతున్నారు. (అవును మరి) నీ ప్రభువు శిక్ష భయపడ దగినదే. (బనీ ఇస్రాఈల్ 17:56, 57).

కొందరు చెట్లను, రాళ్ళను ఆరాధించేవారు, దలీల్:

]أَفَرَأَيْتُمُ اللَّاتَ وَالعُزَّى * وَمَنَاةَ الثَّالِثَةَ الأُخْرَى[ {النَّجم:19، 20}.

ఏమిటీ, మీరు లాతు, ఉజ్జాలను చూశారా? మూడవది, చివరిది అయిన మనాతును (కూడా చూశారా?)

وحديث أبي واقد الليثي، قال: «خرجنا مع رسول الله ﷺ إلى حنين ونحن حُدَثاء عهد بكفر، وللمشركين سِدْرة يعكفون عندها وينوطون بها أسلحتهم يقال لها: ذات أنواط، فمررنا بسدرة فقلنا: يا رسول الله اجعل لنا ذاتَ أنواط كما لهم ذات أنواط، فقال ﷺ: الله أكبر إنها السنن، قلتم – والذي نَفْسي بيده- كما قالت بنو إسرائيل لموسى: {اجْعَلْ لَنَا إِلَهًا كَمَا لَهُمْ آلِهَةٌ}» [الأعراف: 138 – 140].

అబూ వాఖిద్‌ లైసీ రజియల్లాహు అన్హు హదీసులో ఉంది: మేము  ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లంతో కలసి హునైన్ యుద్దానికి వెళ్ళాము. అప్పుడే మేము కొత్తగా ఇస్లాం  స్వీకరించి యుంటిమి. (దారి మధ్యలో ఒక చోట) ముష్రిక్కుల ఒక ‘రేగు చెట్టు’ ఉండింది. అక్కడ వారు (శుభం (తబర్రుక్‌) కలగాలని) కూర్చుండేవారు, తమ ఆయుధాలను దానికి తగిలించేవారు. దానిని “జాతు అన్వాత్‌” అనేవారు. ఆ రేగుచెట్టు దగ్గరి నుండి మేము వెళ్తూ “మాకు కూడా అలాంటి ఒక “జాతు అన్వాత్‌ ” నిర్ణయించండి ప్రవక్తా’ అని అన్నాము. అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అన్నారు: “అల్లాహు అక్బర్! ఇవే (గత జాతులు పాటించిన) పద్దతులు, మార్గాలు. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్ష్యం! బనీ ఇస్రాయీల్‌ “తమ ప్రవక్త మూసా (అలైహిస్సలాం) తో అన్న తీరే మీరన్నారు. “వాళ్ళ దేవుళ్ళ వంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసి పెట్టు” (అని వారన్నప్పుడు), మూసా (అలైహిస్సలాం) ఇలా అన్నారు: “మీరు చాలా అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారు”. (ఆరాఫ్ 7:138). [తిర్మిజి 2180, షేఖ్ అల్బానీ సహీ అన్నారు].

అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారందరితో యుద్ధం చేశారు. వారి మధ్యలో ఏలాంటి వ్యత్యాసం పాటించలేదు, దలీల్:

وَقَاتِلُوهُمْ حَتَّى لَا تَكُونَ فِتْنَةٌ وَيَكُونَ الدِّينُ لِلَّهِ[ [البقرة: 193]
పీడన (ఫిత్నా) సమసిపోనంతవరకూ, దైవధర్మానిది పైచేయి కానంతవరకూ వారితో పోరాడుతూనే ఉండండి. (బఖర 2:193).

నాల్గవ నియమం (మూలం)

మన ఈ కాలం నాటి ముష్రికులు (షిర్క్ చేసేవారు) పూర్వపు ముష్రికుల కంటే భయంకరమైన షిర్క్ లో పడిఉన్నారు, ఎలా అనగా: పూర్వపు ముష్రికులు కష్టకాలంలో చిత్తశుద్ధితో (నష్కల్మషమైన మనస్సుతో) అల్లాహ్ ను ఆరాధించేవారు, వేడుకునేవారు, క్షేమంగా, సుఖంగా ఉన్నప్పుడు మాత్రమే షిర్క్ చేసేవారు, కాని మన ఈ కాలం నాటి (మన ముస్లిం సమాజంలోని) ముష్రికులు కష్టములో ఉన్నా, సుఖంగా ఉన్నా అన్ని సమయ సందర్భాల్లో షిర్క్ చేస్తున్నారు. దీనికి దలీల్:

]فَإِذَا رَكِبُوا فِي الْفُلْكِ دَعَوُا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ فَلَمَّا نَجَّاهُمْ إِلَى الْبَرِّ إِذَا هُمْ يُشْرِكُونَ [ [العنكبوت: 65]

మరి వారు ఓడలో ప్రయాణమైనప్పుడు, తమ ఆరాధనను అల్లాహ్‌కే ప్రత్యేకించుకుని – కేవలం ఆయన్నే మొరపెట్టుకుంటారు. తరువాత ఆయన వారిని సురక్షితంగా తీరానికి చేర్చగానే, అప్పటికప్పుడే వారు దైవానికి సహవర్తుల్ని కల్పించటం మొదలెడతారు. (అన్కబూత్ 29:65).

والحمد لله رب العالمين،
وصلى الله على محمد وعلى آله وصحبه وسلم.

ఈ పుస్తక రచయిత పేరు పైన చదివారు
అనువాద భాగ్యం పొందారు
ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ


[1] వలీ అంటే అల్లాహ్ యొక్క సన్నిహితుడు, అతడికి అల్లాహ్ సన్మార్గం చూపుతాడు, సద్భాగ్యం ప్రసాదిస్తాడు, అతనికి సహాయసహకారాలు అందిస్తాడు.

[2] ]مَا كَانَ لِلْمُشْرِكِينَ أَنْ يَعْمُرُوا مَسَاجِدَ اللَّهِ شَاهِدِينَ عَلَى أَنْفُسِهِمْ بِالْكُفْرِ أُولَئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ وَفِي النَّارِ هُمْ خَالِدُونَ[ [التوبة: 17].

ముష్రిక్కులు తాము స్వయంగా తమ అవిశ్వాసాన్ని గురించి సాక్ష్యమిస్తున్నప్పుడు వారు అల్లాహ్‌ మస్జిదుల నిర్వహణకు ఎంతమాత్రం తగరు. వారి కర్మలన్నీ వృథా అయిపోయాయి. శాశ్వతంగా వారు నరకాగ్నిలో ఉంటారు. (తౌబా 9:17). [కొన్ని పుస్తకాల్లో ఈ దలీల్ కూడా ఉంది].

ఖవాఇదుల్ అర్బఅ్ (షిర్క్ నాలుగు సూత్రాలు) – ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1pWt6nWRtbG3K0XsU2SCv1

%d bloggers like this: