ఫిఖ్‘హ్ దుఆ – 5: ధర్మసమ్మతమైన వసీలా ఆధారాలు [వీడియో]

బిస్మిల్లాహ్

విశ్వాసి జీవితంలో దుఆ చాల ముఖ్యమైన అంశం. తప్పక వినండి. అర్ధం చేసుకొని మీ జీవితాలలో అమలు చేసుకోండి. మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి ఇన్ షా అల్లాహ్.

1. అల్లాహ్ యొక్క సుందర నామాలతో వసీలా కోరడం
2. తన విశ్వాసము మరియు సత్కార్యాల మూలంగా వసీలా కోరడం
3. బ్రతికి ఉన్న పుణ్యాత్ములను అల్లాహ్ తో మనకోసం దుఆ చేయమని కోరడం

ఫిఖ్‘హ్ దుఆ – 5: ధర్మసమ్మతమైన వసీలా ఆధారాలు – వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[26 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఫిఖ్‘హ్ దుఆ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV27wc82PWsbdneU9YNGriU2

ఫిఖ్‘హ్ దుఆ – 4: దుఆలో ధర్మసమ్మతమైన వసీలా ఏది? [వీడియో]

బిస్మిల్లాహ్

విశ్వాసి జీవితంలో దుఆ చాల ముఖ్యమైన అంశం. తప్పక వినండి. అర్ధం చేసుకొని మీ జీవితాలలో అమలు చేసుకోండి. మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి ఇన్ షా అల్లాహ్.

ఫిఖ్‘హ్ దుఆ – 4 దుఆలో ధర్మసమ్మతమైన వసీలా ఏది?- వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[24 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఫిఖ్‘హ్ దుఆ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV27wc82PWsbdneU9YNGriU2

ఫిఖ్‘హ్ దుఆ – 2: మీ ప్రభువు చెప్పాడు “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ (ప్రార్థనలను) ఆమోదిస్తాను” [వీడియో]

బిస్మిల్లాహ్

విశ్వాసి జీవితంలో దుఆ చాల ముఖ్యమైన అంశం. తప్పక వినండి. అర్ధం చేసుకొని మీ జీవితాలలో అమలు చేసుకోండి. మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి ఇన్ షా అల్లాహ్.

ఫిఖ్‘హ్ దుఆ – 2: మీ ప్రభువు చెప్పాడు “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ (ప్రార్థనలను) ఆమోదిస్తాను” – వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[33 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఫిఖ్‘హ్ దుఆ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV27wc82PWsbdneU9YNGriU2

[وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ] {غافر :60}
మరి మీ ప్రభువు చెప్పాడు: “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ (ప్రార్థనలను) ఆమోదిస్తాను. నా దాస్యం పట్ల గర్వాహంకారం ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశిస్తారు“.

1- అల్లాహ్ తో మాత్రమే దుఆ చేయడం విధిగా ఉంది.
2- అల్లాహ్ తప్పక దుఆ అంగీకరిస్తాడన్న శుభవార్త ఉంది.
3- అల్లాహ్ తో దుఆ చేయడం తౌహీదె ఇబాదత్ (ఆరాధన). ఇతరులతో దుఆ చేయడం షిర్క్, మహాపాపం, గర్వాహంకారం.

అల్లాహ్ తో మాత్రమే దుఆ చేయడం విధిగా ఉంది.

1- దుఆ అల్లాహ్ తో చేయడమే ధర్మం, సత్యం.

[لَهُ دَعْوَةُ الحَقِّ] {الرعد:14}
ఆయన్ని వేడుకోవటమే(దుఆ చేయడమే) సత్యం. (రఅద్ 13:14).

2- ఇతరులతో దుఆ అసత్యం, అబద్ధం, అధర్మం.

[وَأَنَّ مَا يَدْعُونَ مِنْ دُونِهِ البَاطِلُ] {لقمان:30}
ఆయన్ని వదలి ప్రజలు మొరపెట్టుకునేవన్నీ అసత్యం. (లుఖ్మాన్ 31:30).

3- ఇతరులతో దుఆ చేసేవాడు జాలిమ్.

[وَلَا تَدْعُ مِنْ دُونِ اللهِ مَا لَا يَنْفَعُكَ وَلَا يَضُرُّكَ فَإِنْ فَعَلْتَ فَإِنَّكَ إِذًا مِنَ الظَّالِمِينَ] {يونس :106}
“అల్లాహ్‌ను వదలిపెట్టి నీకు ఎలాంటి లాభాన్ని గానీ, కీడును గానీ కలిగించలేని దానిని నువ్వు ఆరాధించకు. ఒకవేళ అలాంటి పని చేశావంటే నువ్వు కూడా దుర్మార్గుల్లో ఒకడివవుతావు” (అని హెచ్చరించబడింది)

4- ఇతరులతో దుఆ చేయడం షిర్క్, కుఫ్ర్.

[وَإِذَا رَأَى الَّذِينَ أَشْرَكُوا شُرَكَاءَهُمْ قَالُوا رَبَّنَا هَٰؤُلَاءِ شُرَكَاؤُنَا الَّذِينَ كُنَّا نَدْعُو مِن دُونِكَ فَأَلْقَوْا إِلَيْهِمُ الْقَوْلَ إِنَّكُمْ لَكَاذِبُونَ] {النحل:86}
ఈ ముష్రిక్కులు తాము (అల్లాహ్‌కు) భాగస్వాములుగా నిలబెట్టే వారిని చూడగానే, “ఓ మా ప్రభూ! మేము నిన్ను వదిలేసి మొరపెట్టుకున్న మా భాగస్వాములు వీరే” అని అంటారు. అప్పుడు వారు (ఆ భాగస్వాములు), “మీరు చెప్పేది పచ్చి అబద్ధం” అని వారి మాటను ఖండిస్తారు. (నహ్ల్ 16:86)

[حَتَّىٰ إِذَا جَاءَتْهُمْ رُسُلُنَا يَتَوَفَّوْنَهُمْ قَالُوا أَيْنَ مَا كُنتُمْ تَدْعُونَ مِن دُونِ الله قَالُوا ضَلُّوا عَنَّا وَشَهِدُوا عَلَىٰ أَنفُسِهِمْ أَنَّهُمْ كَانُوا كَافِرِينَ] {الأعراف: 37}
ఆఖరికి మా దూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకోవటానికి వారివద్దకు వచ్చినప్పుడు “అల్లాహ్‌ను వదలి మీరు ఆరాధిస్తూ ఉన్నవారు ఇప్పుడెక్కడున్నారు?” అని అడుగుతారు. “వారంతా మా వద్ద నుంచి మటుమాయమై పోయారు” అని వాళ్ళు చెబుతారు. తాము అవిశ్వాసులుగా ఉండేవారన్న విషయాన్ని గురించి వారు స్వయంగా సాక్ష్యమిస్తారు.

ప్రశ్న: అవిశ్వాసులు ఎవరినైతే పూజించేవారో వారు కేవలం విగ్రహాలే, పుణ్య పురుషులు కారు అని మన వద్ద కొందరి వాదన, ఇది నిజమేనా ?

జవాబు: నిజం కాదు. ఎందుకంటే అల్లాహ్ ఇలా తెలిపాడు

[إِنَّ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ الله عِبَادٌ أَمْثَالُكُمْ فَادْعُوهُمْ فَلْيَسْتَجِيبُوا لَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ]
మీరు అల్లాహ్‌ను వదలి ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారంతా మీలాంటి దాసులే. మీరు మొరపెట్టుకుంటూనే ఉండండి. (ఈ బహుదైవోపాసనలో) మీరు గనక సత్యవంతులయితే వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి. (ఆరాఫ్ 7:194).

البخاري 4859 – عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا، فِي قَوْلِهِ: {اللَّاتَ وَالعُزَّى} [النجم: 19] «كَانَ اللَّاتُ رَجُلًا يَلُتُّ سَوِيقَ الحَاجِّ»
ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు సూర నజ్మ్(53:19) లో వచ్చిన “లాత్” గురించి చెప్పారు: అతను హాజీలకు సత్తూ తయారు చేసి తినిపించే ఓ మనిషి. (అంటే అరబ్బులు అతడ్ని పుణ్యాత్ముడిగా భావించేవారు కనుక అతడు మరణించాక, అతడ్ని పూజించడం మొదలెట్టారు, అల్లాహ్ దానిని ఖండించాడు).

5- ఇతరులతో దుఆ చేయడం వల్ల శిక్ష, విపత్తు కురుస్తుంది

[فَلَا تَدْعُ مَعَ اللهِ إِلَهًا آَخَرَ فَتَكُونَ مِنَ المُعَذَّبِينَ] {الشعراء:213}
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు అల్లాహ్‌తో పాటు మరే ఇతర దైవాన్నీ మొరపెట్టుకోకు. నువ్వుగాని అలా చేశావంటే శిక్షించబడేవారిలో చేరిపోతావు సుమా! (షుఅరా 26:213)

క్రింది హదీసుపై శ్రద్ధ వహించి, అందరినీ జాగృతపరచండి

البخاري 4497 – عَنْ عَبْدِ اللَّهِ، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ «مَنْ مَاتَ وَهْوَ يَدْعُو مِنْ دُونِ اللَّهِ نِدًّا دَخَلَ النَّارَ» وَقُلْتُ أَنَا: مَنْ مَاتَ وَهْوَ لاَ يَدْعُو لِلَّهِ نِدًّا دَخَلَ الجَنَّةَ
అల్లాహ్ ను కాకుండా ఇతరులను మొరపెట్టుకుంటూ ఉండేవాడు అదే స్థితిలో చనిపోతే అతను నరకంలో ప్రవేశిస్తాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దీనిపై నేను చెబుతున్నాను అని అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ చెప్పారు: ‘ఎవరు అల్లాహ్ ను వదలి ఇతరులతో మొరపెట్టుకుంటూ ఉండకుండా (అల్లాహ్ తోనే దుఆ చేస్తూ ఉండీ) చనిపోతాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు’. (బుఖారీ 4497).

ఫిఖ్‘హ్ దుఆ -3: ఇతరులతో దుఆ చేయడంలో నష్టాలు [వీడియో]

బిస్మిల్లాహ్

విశ్వాసి జీవితంలో దుఆ చాల ముఖ్యమైన అంశం. తప్పక వినండి. అర్ధం చేసుకొని మీ జీవితాలలో అమలు చేసుకోండి. మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి ఇన్ షా అల్లాహ్.

ఫిఖ్‘హ్ దుఆ -3: ఇతరులతో దుఆ చేయడంలో నష్టాలు – వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[35 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఫిఖ్‘హ్ దుఆ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV27wc82PWsbdneU9YNGriU2

ఫిఖ్‘హ్ దుఆ -1: దుఆ నిబంధనలు, మర్యాదలు, అంగీకార సమయాలు, సందర్భాలు, స్థలాలు & అవరోధాలు [వీడియో]

బిస్మిల్లాహ్

ఫిఖ్‘హ్ దుఆ క్లాస్ పోయిన సోమవారం స్టార్ట్ అయ్యింది. ఈ క్లాస్ ప్రతి సోమవారం రాత్రి 7 గంటలకు జరుగుతుంది ఇన్ షా అల్లాహ్. ఈ మొదటి క్లాస్ లో దుఆ నిబంధనలు, మర్యాదలు, అంగీకార సమయాలు, సందర్భాలు, స్థలాలు & అవరోధాలు క్లుప్తంగా వివరించడం జరిగింది. వచ్చే క్లాసులలో ప్రతి పాయింట్ గురుంచి వివరంగా చెప్పబడుతుంది ఇన్ షా అల్లాహ్.

విశ్వాసి జీవితంలో దుఆ చాల ముఖ్యమైన అంశం. తప్పక వినండి. అర్ధం చేసుకొని మీ జీవితాలలో అమలు చేసుకోండి. మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి ఇన్ షా అల్లాహ్.

దుఆ నిబంధనలు, మర్యాదలు, అంగీకార సమయాలు, సందర్భాలు, స్థలాలు & అవరోధాలు – వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[36 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఫిఖ్‘హ్ దుఆ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV27wc82PWsbdneU9YNGriU2

నెలసరి (Menses) ఆగిపోయిందని ఖచ్చితంగా ఎలా తెలుసుకోవాలి? [వీడియో]

బిస్మిల్లాహ్

[2:24 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

బహిష్టు, బాలింత స్త్రీలు:

స్త్రీలు తమ ఋతుస్రావము మరియు బాలింత గడువులో ఉన్నప్పుడు నమాజ్, ఉపవాసాలు పాటించకూడదు. హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

«إِذَا أَقْبَلَتِ الحَيْضَةُ، فَدَعِي الصَّلاَةَ، وَإِذَا أَدْبَرَتْ، فَاغْسِلِي عَنْكِ الدَّمَ وَصَلِّي»

“నీవు ఋతువు గడువు దినాల్లో నమాజ్ చేయడం మానేయి. ఋతు స్రావం ముగిసాక నీ వొంటి మీది రక్తాన్ని కడిగి (తలంటు స్నానం చేసి) నమాజ్ చేస్తూ ఉండు”. (బుఖారి 331, ముస్లిం 333).

తప్పి పోయిన నమాజులు తిరిగి చేయకూడదు. కాని తప్పి పోయిన ఉపవాసాలు మాత్రం పూర్తి చేయాలి. అలాగే వీరు కాబా ప్రదక్షిణం (తవాఫ్) కూడా చేయకూడదు. ఈ గడువులో భర్త తన భార్యతో సంభోగించడం కూడా నిషిధ్ధం. అయితే రమించడం తప్ప పరస్పరం ఏ రకమైన ఆనందం పొందినా తప్పు లేదు. ఈ స్థితిలో స్త్రీ ఖుర్ఆనును తాక వద్దు.

రక్త స్రావం ఆగిన తరవాత స్నానం చేయడం విధిగా ఉంది([1]). స్నానం తర్వాత వారి గడువులో నిశిద్ధంగా ఉన్నవన్నీ ధర్మ సమ్మతం అవుతాయి.

నమాజ్ సమయం ప్రవేశించిన తరువాత, ఆ నమాజ్ చేయక ముందే ఏ స్త్రీకైనా ఋతు స్రావం మొదలవుతే, లేదా ప్రసవిస్తే ఆమె పరిశుద్ధురా- లయిన తరువాత ఆ నమాజును తిరిగి చేయాలి. (ఉదా: జొహ్ర్ నమాజ్ వేళ ఆరంభమయింది పగలు పన్నెండు గంటల నలబై నిమిషాలకు, ఒక స్త్రీ ఒకటింటి వరకు కూడా  జొహ్ర్ నమాజ్ చేసుకోలేక పోయింది. అప్పుడే ఋతు స్రావం మొదలయింది, లేదా ప్రసవించింది. అలాంప్పుడు ఆ స్త్రీ పరిశుద్ధురాలయిన తరువాత జొహ్ర్ నమాజ్ చేయాలి). ఒక రకాతు మాత్రమే చేయునంత సమయం ఉన్నప్పుడు పరిశుద్ధుమైన స్త్రీ గుస్ల్ చేసిన తరువాత ఆ నమాజ్ చేసుకోవాలి. ఒక వేళ అది అస్ర్ లేదా ఇషా నమాజ్ అయితే అస్ర్ తో పాటు జొహ్ర్, మగ్రిబ్ తో పాటు ఇషా కూడా చేయుట అభిలషణీయం. ఉదాః సూర్యాస్తమయానికి ఒక రకాత్ చేయునంత ముందు పరిశుద్ధమైతే అస్ర్ నమాజ్ మాత్రం తప్పక చేయాలి. అయితే జొహ్ర్ కూడా ఖజా చేస్తే మంచిది. అర్థ రాత్రికి కొంచెం ముందు పరిశుద్ధురాలయితే ఇషా మాత్రం చేయవలసిందే, అయితే మగ్రిబ్ కూడా చేయడం మంచిది.


[1]  కొందరు బాలింత స్త్రీలు 15, లేదా 20, 25 రోజుల్లో రక్త స్రావం నిలిచిపోయినా 40 రోజుల తరువాతే గుస్ల్ చేస్తారు. ఆ తరువాతే నమాజు ఆరంభిస్తారు. వారు ఇలా చేసేది చాలా ఘోరమైన తప్పు. ఎప్పుడు రక్త స్రావం నిలిచినదో అప్పుడే గుస్ల్ చేయాలి. నమాజు మొదలెట్టాలి.

హైజ్ (ముట్టు, బహిష్టు), నిఫాస్ (పురిటి రక్తం)

ధర్మ జ్ఞానం నేర్చుకునే విద్యార్థుల్లారా! ప్రవక్త ఇచ్చిన ఈ శుభవార్తను అందుకోండి [వీడియో]

బిస్మిల్లాహ్

[4 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
విజ్ఞానం : https://teluguislam.net/others/ilm-knowledge/

దీనికి సంబంధించిన ఇతర లింకులు:

ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) : పార్ట్ 11 – నమాజ్ లో మరచిపోవుట, సున్నతె ముఅక్కద, విత్ర్, ఫజ్ర్ సున్నతులు, చాష్త్ నమాజ్ [వీడియో]

బిస్మిల్లాహ్

[49 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

నమాజులో మరచిపోవుట:

ఎవరైనా నమాజులో మరచిపోతే, అంటే; నమాజులో ఏదైనా అదనపు కార్యం లేదా ఏదైనా కొరత జరుగుతే, లేదా అలాంటి అనుమానం ఏదైనా కలుగుతే రెండు సజ్దాలు చేయాలి. వీటిని సహు సజ్దా అంటారు.

మరచిపోయి నమాజులో ఏదైనా హెచ్చింపు జరిగినప్పుడు, అంటే; ఖియాం, లేదా రుకూ, లేదా సజ్దా లాంటిదేదైనా అదనంగా చేసినప్పుడు సలాం త్రిప్పిన తరువాత రెండు సహ్ వ్ సజ్దాలు చేయాలి.

ఒకవేళ మరచిపోయి నమాజులో ఏదైనా కొరత జరిగినప్పుడు అంటే; నమాజులో చేయవలసిన ఏదైనా కార్యం చేయక, చదవ వలసినా ఏదైనా దుఆ, సూరా చదవక కొరత జరుగుట. ఒకవేళ అది ‘రుకున్’ అయితే, దాని రెండు స్థితులుః ఆ ‘రుకున్’ ఏ రకాతులో మరచిపోయాడో దాని తరువాత రకాతు ఆరంభానికి ముందు ఆ విషయం గుర్తుకు వస్తే, వెంటనే ఆ ‘రుకున్’ నెరవేరుస్తూ, ఆ రకాతులో దాని తరువాత ఉన్నవాటిని పూర్తి చేయాలి([1]). సలాం తిప్పేకి ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. ఆ ‘రుకున్’ ఏ రకాతులో మరచిపోయాడో దాని తరువాత రకాతు ఆరంభానికి ముందు ఆ విషయం గుర్తుకు రాకుంటే ఆ రకాత్ కానట్లే లెక్క. ఇప్పుడు చేస్తున్న రకాతే దాని స్థానం తీసుకుంటుంది([2]).

మరచిపోయిన రుకున్ సలాం తరువాత కొద్ది క్షణాలకే గుర్తుకు వస్తే, పూర్తి ఒక రకాత్ చేసి, సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. తొందరగా గుర్తుకు రాలేదు, లేదా వుజూ భంగమయితే తిరిగి పూర్తి నమాజ్ చేయాలి.

మొదటి తషహ్హుద్ లాంటి వాజిబ్ మరచిపోయినప్పుడు సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేస్తే సరిపోతుంది.

ఇక అనుమాన స్థితికి గురైనప్పుడు; ఈ అనుమానం రకాతుల సంఖ్యలో ఉంటే, ఉదాః రెండు రకాతులు చదివానా లేదా మూడా? అని సందేహం కల్గితే, తక్కువ సంఖ్యపై నమ్మకం ఉంచుకొని, మిగిత రకాతులు పూర్తి చేసుకోవాలి. సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. ఒకవేళ రుకున్ విషయంలో సందేహం కలుగుతే, దాన్ని చేయలేని కింద లెక్క కట్టి, దాన్ని నెరవేర్చాలి. దాని తరువాత రకాతులు చేసుకోవాలి. సజ్దా సహ్ వ్ చేయాలి.

సున్నతె ముఅక్కద

స్థానికులైన ప్రతి ముస్లిం స్త్రీ పురుషులు పన్నెండు రకాతులు పాటించడం ఎంతో పుణ్యకార్యం. అవి జొహ్ర్ కు ముందు 4, దాని తరువాత 2, మగ్రిబ్ తరువాత 2, ఇషా తరువాత 2, ఫజ్ర్ కు ముందు 2 రకాతులు. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సున్నతులు పాటించేవారు. ఇంకా ఆయన ఇలా శుభవార్త ఇచ్చారని ఉమ్మె హబీబ రజియల్లాహు అన్హా తెలిపారు:

 (مَا مِنْ عَبْدٍ مُسْلِمٍ يُصَلِّي لله كُلَّ يَوْمٍ ثِنْتَيْ عَشْرَةَ رَكْعَةً تَطَوُّعًا غَيْرَ فَرِيضَةٍ إِلَّا بَنَى اللهُ لَهُ بَيْتًا فِي الْجَنَّةِ أَوْ إِلَّا بُنِيَ لَهُ بَيْتٌ فِي الْجَنَّةِ).

“ఏ ముస్లిం భక్తుడు రాత్రి పగల్లో ఫర్జ్ కాకుండా పన్నెండు రకాతుల అదనపు (నఫిల్) నమాజ్ చేస్తూ ఉంటాడో అతనికి వాటికి బదులుగా అల్లాహ్ ఒక గృహము స్వర్గంలో నిర్మిస్తాడు, లేదా ఒక గృహం స్వర్గంలో నిర్మించచబడును”. (ముస్లిం 728).

సున్నతె ముఅక్కద మరియు సాధరణంగా నఫిల్ నమాజ్ లన్నియూ ఇంట్లో చేయడం చాలా ఉత్తమం. ప్రవక్త ﷺ ప్రబోధించారని, జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

 (إِذَا قَضَى أَحَدُكُمْ الصَّلَاةَ فِي مَسْجِدِهِ فَلْيَجْعَلْ لِبَيْتِهِ نَصِيبًا مِنْ صَلَاتِهِ فَإِنَّ اللهَ جَاعِلٌ فِي بَيْتِهِ مِنْ صَلَاتِهِ خَيْرًا).

“మీలోనెవరైనా మస్జిదులో (ఫర్జ్) నమాజ్ నెరవేర్చుకున్నాక, తన ఇంటి కొరకు కూడా (సున్నతులు, నఫిల్ లాంటి) నమాజుల యొక్క కొంత భాగాన్ని మిగిలించుకోవాలి. అల్లాహ్ అతని నమాజుకు బదులుగా అతని ఇంట్లో మేలే చేకూర్చుతాడు”. (ముస్లిం 778).

జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః

 (فَإِنَّ خَيْرَ صَلَاةِ الْـمَرْءِ فِي بَيْتِهِ إِلَّا الصَّلَاةَ الْـمَكْتُوبَةَ).

“మనిషి తనింట్లో చేసే నమాజ్ అతి ఉత్తమమైనది. కేవలం ఫర్జ్ నమాజ్ తప్ప”. (బుఖారి 6113).

విత్ర్ నమాజ్

అలాగే ముస్లిం విత్ర్ నమాజును పాటించుట ధర్మం. ఇది కూడా సున్నతె ముఅక్కద. దీని సమయం ఇషా తరువాత నుండి ఉషోదయం వరకు ఉంటుంది. అయితే రాత్రి చివరి గడియలో మేల్కొనగల వారికి ఆ సమయమే ఉత్తమం. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాల్లో ఒకటి. ప్రవక్త మహా నీయులు విత్ర్ మరియు ఫజ్ర్ కు ముందు గల రెండు రకాతుల సున్నతులు ఎప్పుడూ విడనాడ లేదు. ప్రయాణంలో ఉన్నా, లేదా స్థానికంగా ఉన్నా. విత్ర్ యొక్క కనిష్ట సంఖ్య ఒక్క రకాతు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రుల్లో 11 రకాతులు చేసేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనంలో ఉందిః

أَنَّ رَسُولَ الله كَانَ يُصَلِّي بِاللَّيْلِ إِحْدَى عَشْرَةَ رَكْعَةً يُوتِرُ مِنْهَا بِوَاحِدَةٍ…

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి పూట 11 రకాతులు చేసేవారు, అందులో ఒక రకాతు విత్ర్ చేసేవారు. (ముస్లిం 736).

రాత్రి నమాజ్ రెండేసి రకాతులు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రాత్రి నమాజ గురించి ప్రశ్నించాడు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః

 (صَلَاةُ اللَّيْلِ مَثْنَى مَثْنَى فَإِذَا خَشِيَ أَحَدُكُمْ الصُّبْحَ صَلَّى رَكْعَةً وَاحِدَةً تُوتِرُ لَهُ مَا قَدْ صَلَّى).

“రాత్రి వేళ నఫిల్ నమాజ్ రెండేసి రకాతుల చొప్పున చేయాలి. ఇక ఉషోదయం కావస్తోందని భావించినప్పుడు ఒక రకాతు చేయు. దీనివల్ల మొత్తం నమాజ్ విత్ర్ (బేసి సంఖ్య నమాజ్) అయిపోతుంది”.  (బుఖారి 991, ముస్లిం 749).

అప్పుడప్పుడు విత్ర్ లో దుఆయె ఖునూత్ చేయడం మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్ బిన్ అలీ రజియల్లాహు అన్హు గారికి విత్ర్ లో చదివే దుఆ నేర్పారు. కాని ఎల్లప్పుడు చేయకూడదు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ విధానం గురించి ఉల్లేఖించిన సహచరులు ఖునూత్ గురించి చెప్పలేదు.

రాత్రి నమాజ్ చేయలేకపోయినవారు మరుసటి రోజు రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండు ఇష్టమున్నన్ని రకాతులు చేయుట మంచిది. ఎప్పుడైనా రాత్రి నమాజ్ తప్పి పోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే చేసేవారు.

ఫజ్ర్ సున్నతులు

ప్రవక్త ﷺ పాబందీగా పాటించే సున్న తుల్లో ఫజ్ర్ సున్నతులు కూడా, వాటిని ఆయన ప్రయాణంలో ఉన్న, స్థానికంగా ఉన్నా విడనాడకపోయేది. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం:

أَنَّ النَّبِيَّ ﷺ لَمْ يَكُنْ عَلَى شَيْءٍ مِنْ النَّوَافِلِ أَشَدَّ مُعَاهَدَةً مِنْهُ عَلَى رَكْعَتَيْنِ قَبْلَ الصُّبْحِ.

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నఫిల్ నమాజుల్లో ఫజ్ర్ సున్న తులను చేసేటంత ఎక్కువ పాబందీగా మరో నఫిల్ చేసేవారు కారు”. (బుఖారి 1163, ముస్లిం 724).

వాటి ఘనత, ప్రాముఖ్యతలో ప్రవక్త ﷺ ఇలా చెప్పేవారుః

لَـهُمَا أَحَبُّ إِلَيَّ مِنْ الدُّنْيَا جَمِيعًا.

“ఆ రెండు రకాతులు నాకు ప్రపంచం మరియు, అందులో ఉన్న వాటికన్నా చాలా ప్రియమైనవి”. (ముస్లిం 725).

మొదటి రకాతులో (సూర ఫాతిహా తర్వాత) సూర కాఫిరూన్ మరియు రెండవ రకాతులో (సూర ఫాతిహ తర్వాత) సూర ఇఖ్లాస్ చదువుట ధర్మం. ఒక్కోసారి మొదటి రకాతులో “ఖూలూ ఆమన్నా బిల్లాహి వమా ఉంజిల ఇలైనా….” (అల్ బఖర 2: 136) ఆయతులు మరియు రెండవ రకాతులో “ఖుల్ యా అహ్లల్ కితాబి తఆలౌ ఇలా కలిమతిన్ సవాఇమ్ బైననా వ బైనకుమ్….” (ఆలె ఇమ్రాన్ 3: 64) ఆయతులు పఠించుట మంచిది.

ప్రవక్త అనుసరణలో వాటిని సంక్షిప్తంగా చేయాలి. ఫర్జ్ నమాజుకు ముందు వాటిని చేయలేకపోయిన వ్యక్తి నమాజ్ తర్వాత కూడా చేయవచ్చును. అయితే సూర్యోదయం తర్వాత సూర్యుడు బల్లెమంత పైకి వచ్చాక చేయడం మరీ ఉత్తమం. దీని సమయం పగటిలి పొద్దు వాలేకి ముందు వరకు ఉంటుంది.

చాష్త్ నమాజ్

దీనినే సలాతుల్ అవ్వాబీన్ అంటారు. ఇది సున్నతె ముఅక్కద. అనేక హదీసుల్లో దీని గురించి ప్రోత్సహించబడింది. అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీస్ ముస్లిం 820లో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః

عَنْ أَبِي ذَرٍّ عَنْ النَّبِيِّ ﷺ أَنَّهُ قَالَ: (يُصْبِحُ عَلَى كُلِّ سُلَامَى مِنْ أَحَدِكُمْ صَدَقَةٌ فَكُلُّ تَسْبِيحَةٍ صَدَقَةٌ وَكُلُّ تَحْمِيدَةٍ صَدَقَةٌ وَكُلُّ تَهْلِيلَةٍ صَدَقَةٌ وَكُلُّ تَكْبِيرَةٍ صَدَقَةٌ وَأَمْرٌ بِالْمَعْرُوفِ صَدَقَةٌ وَنَهْيٌ عَنْ الْمُنْكَرِ صَدَقَةٌ وَيُجْزِئُ مِنْ ذَلِكَ رَكْعَتَانِ يَرْكَعُهُمَا مِنْ الضُّحَى).

“మానవ శరీరంలో ఎన్ని కీళ్ళున్నాయో వాటి లో ప్రతి దానికీ ఒక దానం (సదఖా) విధి అయి ఉంది. అయితే ప్రతి సుబ్ హానల్లాహ్ ఒక సదఖా, ప్రతి అల్ హందులిల్లాహ్ ఒక సదఖా, లాఇలాహ ఇల్లల్లాహ్ ఒక సదఖా, అల్లాహు అక్బర్ ఒక సదఖా, ఒక మంచిని బోధించడం ఒక సదఖా, ఒక చెడును నివారించడం ఒక సదఖా, వీటన్నిటికీ బదులుగా చాష్త్ సమయం లో 2 రకాతులు సరిపోతాయి”.

عَنْ أَبِي هُرَيْرَةَ t قَالَ أَوْصَانِي خَلِيلِي بِثَلَاثٍ لَا أَدَعُهُنَّ حَتَّى أَمُوتَ: صَوْمِ ثَلَاثَةِ أَيَّامٍ مِنْ كُلِّ شَهْرٍ وَصَلَاةِ الضُّحَى وَنَوْمٍ عَلَى وِتْرٍ.

హజ్రత్ అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: నా ప్రాణ స్నేహితులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు మూడు విషయాలను గురించి హితబోధ చేశారు. నేను వాటిని చని పోయేంత వరకు వదిలి- పెట్టను. అవిః 1. ప్రతి (ఇస్లామీయ) నెలలో మూడు రోజుల ఉపవాసం పాటించటం. 2. చాష్త్ నమాజ్ చేయడం. 3. విత్ర్ నమాజ్ చేసి నిద్ర పోవడం. (బుఖారి 1178, ముస్లిం 721).

దీని ఉత్తమ సమయం పొద్దెక్కి, ఎండ తాపం పెరిగిన తర్వాత. పొద్దు వాలిన వెంటనే దీని సమయం సమాప్తమవుతుంది. కనిష్ట సంఖ్య రెండు రకాతులు. గరిష్ట సంఖ్యకు హద్దు లేదు.


[1]) దీని ఉదాహరణః ఒక వ్యక్తి మొదటి రకాతులో ఖిరాత్ తర్వతా రుకూ మరచిపోయి రెండు సజ్దాలు కూడా చేశాడనుకుందాము. రుకూ నమాజు ‘రుకున్’లలో ఒకటి. ఇక అతడు రెండవ రకాతు కొరకు నిలబడ్డాడు కాని ఖిరాత్ ఆరంభానికి ముందే అతనికి మరచిపోయిన రుకూ విషయం గుర్తొచ్చింది. అప్పుడు అతను రుకూ చేయాలి, రెండు సజ్దాలు చేయాలి. మళ్ళీ రెండవ రకాతు కొరకు నిలబడి యథా ప్రకారంగా నమాజు పూర్తి చేయాలి.

[2]) దీని ఉదాహరణః ఒక వ్యక్తి మొదటి రకాతులో ఖిరాత్ తర్వతా రుకూ మరచిపోయి రెండు సజ్దాలు కూడా చేశాడనుకుందాము. రుకూ నమాజు ‘రుకున్’లలో ఒకటి. ఇక అతడు రెండవ రకాతు కొరకు నిలబడి, ఖిరాత్ ఆరంభించిన తర్వాత గుర్తుకు వస్తే అతని ఆ రకాతు, ఎందులో అతను రుకూ మరచిపోయాడో అది కానట్లే. అందుకు ఈ రెండవ రకాతు మొదటి రకాతు స్థానంలో ఉంటుంది.


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

ధార్మిక విద్యా విధానం [వీడియో]

బిస్మిల్లాహ్

[56:10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

విజ్ఞానం (మెయిన్ పేజీ)
https://teluguislam.net/others/ilm-knowledge/

దీనికి సంబంధించిన ఇతర లింకులు:

ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) : పార్ట్ 10 – నమాజు విధానం, నమాజ్ తర్వాత జిక్ర్, మస్బూఖ్, నమాజ్ భంగపరుచు కార్యాలు,నమాజ్ వాజిబులు,రుకున్ లు [వీడియో]

బిస్మిల్లాహ్

[1: 00 :14 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

నమాజ్ విధానం:

నమాజ్ చేసేటప్పుడు నియ్యత్ (సంకల్పం) తప్పనిసరిగా చేయాలి. అలాగే ఇతర ఆరాధనల్లో కూడా చేయాలి. అయితే నియ్యత్ మనుస్సులో చేయాలి. నోటితో కాదు.

నమాజ్ చిత్రాలు చూడండి:

నమాజు పద్ధతి చిత్రాలు

ఇక నమాజ్ పద్ధతి ఇలా వుందిః

1- పూర్తి శరీరము మరియు పూర్తి శ్రద్ధాభక్తుల తో ఖిబ్లా దిశలో నిలబడాలి. చూపులు, శరీరము అటూ ఇటూ ఉండకూడదు. (చూపులు సజ్దా చేసే చోట కేంద్రికరించాలి).

2- ‘తక్బీరె తహ్రీమ’ అల్లాహు అక్బర్ అంటూ

రెండు చేతులు భుజాల వరకు లేదా చెవుల వరకు ఎత్తాలి. చూడండి (చిత్రం1)

3- కుడి అర చెయ్యిని ఎడమ చెయ్యిపై పెట్టి ఛాతిపై కట్టుకోవాలి. (చిత్రం2)

4- దుఆయె ఇస్తిఫ్ తాహ్ చదవాలిః

అల్ హందులిల్లాహి హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్. (ముస్లిం 600).

(الْحَمْدُ لله حَمْدًا كَثِيرًا طَيِّبًا مُبَارَكًا فِيهِ).

(శుభాలు గల, అనేకానేక మంచి స్తోత్రములన్నీ అల్లాహ్ కే చెందును).

సుబ్ హానకల్లాహుమ్మ వబిహమ్దిక వతబార కస్ముక వతఆల జద్దుక వలాఇలాహ గైరుక.

سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ وَتَبَارَكَ اسْمُكَ وَتَعَالَى جَدُّكَ وَلَا إِلَهَ غَيْرُكَ

ఓ అల్లాహ్ నీవు పరమ పవిత్రునివి, నీకే సర్వ స్తోత్రములు, నీ నామము శుభం గలది. నీ మహిమ చాలా ఘనమయినది. నీవు తప్ప ఆరాధ్యుడెవడు లేడు.

ఇవి రెండే గాకుండా ఇతర దుఆలు కూడా చదవవచ్చును. ఎల్లప్పుడూ ఒకే దుఆ కాకుండా వేరు వేరు సమయాల్లో వేరు వేరు దుఆలు చదవడం ఉత్తమం. ఇలా నమాజులో నమ్రత, శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది.

5- అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్,

6- బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్ చదివి, సూరె ఫాతిహ చదవాలిః అల్ హమ్ దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహ్మా నిర్రహీమ్, మాలికి యౌమిద్దీన్, ఇయ్యాక నఅ బుదు వఇయ్యాక నస్త ఈన్, ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్, సిరాతల్లజీన అన్అమ్ త అలైహిం,  గైరిల్ మగ్ జూబి అలైహిమ్ వలద్జాల్లీన్. (ఆమీన్).

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ* الْحَمْدُ للهِ رَبِّ العَالَمِينَ* الرَّحْمَنِ الرَّحِيمِ* مَالِكِ يَوْمِ الدِّينِ* إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ* اهْدِنَا الصِّرَاطَ المُسْتَقِيمَ*صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ المَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ

అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో * ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు, * అపార కరుణా మయుడు, పరమ కృపాశీలుడు. * ప్రతిఫల దినానికి (అంటే ప్రళయ దినానికి) యజమాని. * మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము. * మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపించు. * నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోనుకాని వారి మార్గం.

7- కంఠస్తం చేసి ఉన్న ఖుర్ఆనులోని ఏదైనా సూరా లేదా కొన్ని ఆయతులు పఠించాలి.

8- చేతులు భుజాల వరకు ఎత్తి, అల్లాహు అక్బర్ అంటూ రుకూ చేయాలి. రుకూలో అరచేతుల తో మోకాళ్ళను పట్టుకోవాలి. వ్రేళ్ళు దగ్గరదగ్గరగా కాకుండా విడిగా ఉండాలి. సుబ్ హాన రబ్బియల్ అజీం మూడు సార్లు చదువుట సున్నత్. అంతకంటే ఎక్కువ చదవవచ్చు. ఒక్క సారి చదివినా సరిపోవును. చూడండి (చిత్రం3)

9- ఒంటరి నమాజ్ చేయు వ్యక్తి మరి ఇమాం రుకూ నుండి తల లేపుతూ సమిఅల్లాహు లిమన్ హమిద అంటూ భుజాల వరకు చేతులెత్తాలి. ముఖ్తదీ సమిఅల్లాహు లిమన్ హమిదహ్ కు బదులుగా రబ్బనా వలకల్ హమ్ ద్ అనాలి. ఈ స్థితిలో కుడి చెయి ఎడమ చెయిపై పెట్టి ఛాతిపై కట్టుకోవాలి.

10- రుకూ తర్వాత నిలబడి ఉన్నప్పుడు ఈ దుఆ కూడా చదవవచ్చునుః అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్ దు మిల్ఉస్ సమావాతి వ మిల్ఉల్ అర్జి వ మిల్ఉ మాషిఅత మిన్ షైఇమ్ బఅదు.

اللَّهُمَّ رَبَّنَا لَكَ الْـحَمْدُ مِلْءُ السَّمَاوَاتِ وَمِلْءُ الْأَرْضِ وَمِلْءُ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ

ఓ అల్లాహ్, మా ప్రభువా! నీకే ఆకాశముల నిండుగాను, భూమి నిండుగాను, అవి గాకా నీవు కోరిన వస్తువుల నిండుగాను స్తుతి గలదు. (ముస్లిం 476).

11- అల్లాహు అక్బర్ అంటూ మొదటి సజ్దాలో వెళ్ళాలి. ఏడు అంగములపై సజ్దా చేయాలిః (1) నొసటి, ముక్కు. (2,3) రెండు అరచేతులు. (4,5) రెండు మోకాళ్ళు. (6,7) రెండు పాదముల వ్రేళ్ళు. చేతులను పక్కల నుండి దూరముంచాలి. కాళ్ళ వ్రేళ్ళను ఖిబ్లా దిశలో ఉంచి, సజ్దాలో సుబ్ హాన రబ్బియల్ అఅలా మూడు సార్లు పలుకుట సున్నత్. ఎక్కువ పలు- కుట మంచిదే. ఒక్క సారి చదివినా సరిపోతుంది. ఈ స్థితిలో ఎక్కువ దుఆ చేయాలి. ఎందుకనగా ఇది దుఆ అంగీకార స్థితుల్లో ఒకటి. చిత్రం4

12- అల్లాహు అక్బర్ అంటూ సజ్దా నుండి తలెత్తి ఎడమ పాదముపై కూర్చోవాలి. కుడి కాలు పాదమును నిలబెట్టాలి. కుడి చెయ్యి కుడి మోకాలుకు దగ్గరగా తోడపై, ఎడమ చెయ్యి ఎడమ మోకాలుకు దగ్గరగా తోడపై పెట్టాలి. చేతి వ్రేళ్ళను విడిగా పరచి ఉంచాలి. రబ్బిగ్ ఫిర్లీ రబ్బిగ్ ఫిర్లీ అని చదవాలి. (చిత్రం5,6,7)

13- రెండవ సజ్దా మొదటి సజ్దా మాదిరిగా చేసి, సజ్దాలో అదే దుఆ చదవాలి.

14- అల్లాహు అక్బర్ అంటూ రెండవ సజ్దా నుండి లేస్తూ నిటారుగా నిలబడాలి.

15- రెండవ రకాత్ మొదటి రకాత్ మాదిరిగా చేయాలి. అందులో చదివిన దుఆలే ఇందులో చదవాలి. దుఆయె ఇస్తిఫ్ తాహ్ మరియు అఊజు బిల్లాహి…. తప్ప. ఈ రెండవ రకాత్ లోని రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అంటూ లేచి రెండు సజ్దాల మధ్యలో కూర్చున్న విధంగా కూర్చోని, కుడి చెయి వ్రేళ్ళను ముడుచుకొని నడిమి వ్రేళిని బొటన వ్రేళి మధ్యలో పెట్టి, చూపుడు వ్రేళితో సైగా చేస్తూ, కదలిస్తూ తషహ్హుద్ చదవాలిః

అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు అస్సలాము అలైక అయ్యుహన్ నబియ్యు వరహ్మతుల్లాహి వబరకా తుహూ అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లా హిస్సాలి హీన్ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహు. (బుఖారి 831).

التَّحِيَّاتُ لله وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ الله وَبَرَكَاتُهُ السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ الله الصَّالِحِينَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

నా వాక్కు, దేహా, ధన సంబంధమైన ఆరాధన లన్నియూ అల్లాహ్ కొరకే ఉన్నవి. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆయన శుభాలు కురువుగాకా. అల్లాహ్ తప్ప వేరు ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు, సందేశహరుడని సాక్ష్యమిస్తున్నాను.

ఇక్కడి వరకు చదివిన తరువాత, చేతులు భుజాల వరకు ఎత్తుతూ అల్లాహు అక్బర్ అంటూ నిలబడాలి, ఒక వేళ మగ్రిబ్ లాంటి మూడు రకాతుల నమాజ్ లేదా జొహ్ర్, అస్ర్ మరియు ఇషా లాంటి నాలుగు రకాతుల నమాజ్ చేస్తుంటే, రెండవ రకాతు మాదిరిగా మిగిత నమాజ్ పూర్తి చేయాలి. అయితే ఖియామ్ (నిలబడి ఉన్న స్థితి)లో కేవలం సూరె ఫాతిహ చదువుతే సరిపోతుంది. చివరి రకాతు రెండవ సజ్దా నుండి లేచి కూర్చోని తషహ్హుద్, దరూద్ ఇబ్రాహీమ్ మరియు ప్రవక్త నేర్పిన తనికిష్టమైన దుఆలు అధికంగా చదవడం మంచిది. (ఇది కూడా దుఆ అంగీకార సందర్భాల్లో ఒకటి). క్రింద దరూద్ మరియు ఒక దుఆ ఇవ్వబడుతుంది.

అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్రి వమిన్ అజాబిన్నారి వమిన్ ఫిత్నతిల్ మహ్ యా వల్ మమాతి వమిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాల్.

اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ ، اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ وَمِنْ عَذَابِ النَّارِ وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ وَمِنْ فِتْنَةِ الْمَسِيحِ الدَّجَّالِ.

ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీంను, వారి కుటుంబీకులను కరుణించినట్లు ముహమ్మద్ మరియు వారి కుటుంబీకులను కరుణించు. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేసినట్లు ముహమ్మద్, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేయుము. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. ఓ అల్లాహ్ నేను సమాధి శిక్షల నుండి, నరక యాతన నుండి, జీవన్మరణ పరీక్షల నుండి మరియు దజ్జాల్ మాయ నుండి రక్షణకై నీ శరణు కోరుతున్నాను

16- అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటూ కుడి వైపున మెడ త్రిప్పాలి. అలాగే అంటూ ఎడమ వైపున మెడ త్రిప్పాలి. చూడండి (చిత్రం8,9)

17- జొహ్ర్, అస్ర్, మగ్రిబ్, ఇషా నమాజుల్లోని చివరి తషహ్హుద్ లో కూర్చుండే పద్ధతి ఇలా ఉండాలి. కుడి పాదాన్ని నిలబెట్టి ఎడమ పాదాన్ని కుడి కాలి పిక్క క్రింది నుంచి బైటికి తీయాలి. ఎడమ పిరుదును భూమిపై ఆనించాలి. కుడి చెయ్యి కుడి తోడపై, ఎడమ చెయ్యి ఎడమ తోడపై మోకాలుకు దగ్గరగా పెట్టాలి. చూడండి (చిత్రం10)

నమాజ్ తర్వాత జిక్ర్:

సలాం తింపిన తరువాత ఈ దుఆలు చదవాలి.

అస్తగ్ ఫిరుల్లాహ్, అస్తగ్ ఫిరుల్లాహ్, అస్తగ్ ఫిరుల్లాహ్, అల్లాహుమ్మ అంతస్సలాం వ మిన్ కస్సలాం తబారక్ త యాజల్ జలాలి వల్ ఇక్రాం. లా ఇలాహ ఇల్లల్లాహు     వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅతైత వలా ముఅ తియ లిమా మనఅత వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్ కల్ జద్ద్. లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, లాఇలాహ ఇల్లల్లా హు వలా నఅబుదు ఇల్లా ఇయ్యాహు లహున్నిఅమతు వలహుల్ ఫజ్లు వలహుస్సనా ఉల్ హసన్, లాఇలాహ ఇల్లల్లాహు ముఖ్లిసీన లహుద్దీన వలౌ కరిహల్ కాఫిరూన్.

أَسْتَغْفِرُ الله (3). اَللهُمَّ أَنْتَ السَّلامُ ومِنْكَ السَّلامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ وَ الإكْرَام. لا إله إلا الله وَحْدَهُ لا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيءٍ قَدِير. اَللهُمَّ لا مَانِعَ لِمَا أعْطَيْتَ وَلا مُعْطِيَ لِمَا مَنَعْتَ وَلا يَنْفَعُ ذَا الجَدِّ مِنْكَ الْجَدُّ. لا حَوْلَ وَلا قُوَّةَ إِلاَّ بِاللهِ، لاَ إِلهَ إِلاَّ اللهُ وَلاَ نَعْبُدُ إِلاَّ إِيَّاهُ، لَهُ النِّعْمَةُ وَلَهُ الْفَضْلُ وَلَهُ الثَّنـاءُ الْحَسـَن، لاَ إلَهَ إِلاَّ اللهُ مُخْلِصِينَ لَه الدِّينَ وَلَوكَرِهَ الكَافرون.

అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను (3). ఓ అల్లాహ్ నీవు ఏలాంటి లోపాలు లేనివాడవు. నీవే రక్షణ నొసంగువాడవు. ఓ ఘనుడవు, పరమదాతయువు నీవు శుభములు గలవాడవు. అల్లాహ్ దప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు. ఆయనకు సాటి మరొకడు లేడు. ఆయనకే అధికారము చెల్లును. ఆయనకే సర్వ స్తోత్రములు గలవు. ఆయనే సర్వ శక్తుడు. ఓ అల్లాహ్ నీవు నొసంగిన వరాలను ఎవడు అడ్డగింపజాలడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వజాలడు. ధనికుడు తన ధనముతో నీ శిక్షల నుండి తప్పించుకు- పోజాలడు. పాపాములను వదులుకొనుట మరియు పుణ్యాలు చేయుట అల్లాహ్ దయవలననే కలుగును. అల్లాహ్ దప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన్నే మేము ఆరాధించుచున్నాము. ఆయనే సర్వ అనుగ్రహాలు దయ చేయువాడు. ఆయనకే ఘనత, మంచి స్తోత్రములు గలవు. అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యు డెవ్వడూ లేడు. చిత్తశుద్ధితో మేము ఆయన్నే ఆరాధించుచున్నాము. ఈ విషయము సత్య తిరస్కారులకు నచ్చకున్నా సరే. (ముస్లిం 591, 593, 594, బుఖారి 844).

తరువాత సుబ్ హానల్లాహ్ 33, అల్ హందు లిల్లాహ్ 33, అల్లాహు అక్బర్ 33 సార్లు చదివి, లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ తో 100 పూర్తి చేయాలి. (ముస్లిం 597).

తరువాత ఆయతుల్ కుర్సీ([1]) ఒకసారి.

ఖుల్ హువల్లాహు అహద్(5), ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్(5), ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్([2]) సూరాలు ఫజ్ర్ మరియు మగ్రిబ్ తరువాత మూడేసి సార్లు మిగిత నమాజుల తరువాత ఒక్కొక్క సారి చదవాలి.

మస్బూఖ్:

ఎవరైనా జమాఅతుతో ఒకటి లేదా కొన్ని రకాతులు తప్పి పోతే (మస్బూఖ్) ఇమాం రెండవ సలాం తింపిన తర్వాత వాటిని పూర్తి చేసుకోవాలి. అతను ఇమాంతో ఏ రకాతులో కలిసాడో అదే అతని మొదటి రకాతు. ఇమాంను రుకూ స్థితిలో పొందినవాని ఆ రకాతు అయినట్లే. ఇమాంను రుకూలో పొందకుంటే ఆ రకాత్ తప్పిపోయి నట్లే లెక్క.

జమాఅతు నిలబడిన తర్వాత వచ్చేవారు జమాఅతును ఏ స్థితిలో చూసినా అదే స్థితిలో కలవాలి. వారు రుకూ, లేదా సజ్దా ఇంకే స్థితిలో ఉన్నా సరే. వారు మరో రకాతు కొరకు నిలబడే వరకు నిరీక్షించవద్దు. నిలబడి తక్బీరె తహ్రీమ అల్లాహు అక్బర్ అనాలి. రోగి లాంటి ఏదైనా ఆటంకం ఉన్నవారు కూర్చుండి అల్లాహు అక్బర్ అంటే ఏమీ తప్పు లేదు.

నమాజును భంగపరుచు కార్యాలు:

  • 1- తెలిసి, కావాలని మాట్లడడం, అది కొంచమైనా సరే.
  • 2- పూర్తి శరీరముతో ఖిబ్లా దిశ నుండి పక్కకు మరలడం.
  • 3- వుజూను భంగపరిచే కారణాల్లో ఏ ఒకటైనా సంభవించడం.
  • 4- అనవసరంగా ఎడతెగకుండా ఎక్కువ చలనము చేయడం.
  • 5- కొంచం నవ్వినా నమాజ్ వ్యర్థమవుతుంది.
  • 6- తెలిసి కూడా ఎక్కువ రుకూ, సజ్దాలు, ఖియాం, జుల్సాలు చేయడం.
  • 7- తెలిసి కూడా (రుకూ, సజ్దా వగైరా) ఇమాంకు ముందు చేయడం.

నమాజ్ యొక్క వాజిబులు:

  • 1- మొదటి తక్బీరె తహ్రీమ తప్ప మిగితావన్నీ.
  • 2- రుకూలో కనీసం ఒక్కసారైనా సూబ్ హాన రబ్బియల్ అజీం అనడం.
  • 3- రుకూ నుండి లేస్తూ ఇమాం మరియు ఒంటరి నమాజి సమిఅల్లాహు లిమన్ హమిదహ్ అనడం.
  • 4- రుకూ నుండి నిలబడి రబ్బనా వలకల్ హంద్ అనడం.
  • 5- సజ్దాలో కనీసం ఒక్కసారైనా సుబ్ హాన రబ్బియల్ అఅలా అనడం.
  • 6- రెండు సజ్దాల మధ్యలో రబ్బిగ్ ఫిర్లీ అనడం.
  • 7- మొదటి తషహ్హుద్ చదవడం.
  • 8- మొదటి తషహ్హుద్ చదవడానికి కూర్చోవడం.

నమాజ్ యొక్క రుకున్ లు:

  • 1- ఫర్జ్ నమాజులో శక్తి ఉన్నప్పుడు నిలబడటం. నఫిల్ నమాజులో నిలబడటం ముఖ్యం లేదు. కాని కూర్చుండి నమాజ్ చేసేవానికి, నిలబడి చేసేవానికంటే సగం పుణ్యం తక్కువ.
  • 2- తక్బీరె తహ్రీమ.            
  • 3- ప్రతి రకాతులో సూరె ఫాతిహ పఠించడం.
  • 4- ప్రతీ రకాతులో రుకూ చేయడం.
  • 5- రుకూ నుండి లేచి నిటారుగా నిలబడటం.
  • 6- ప్రతీ రకాతులో రెండు సార్లు ఏడు అంగములపై సజ్దా చేయడం.
  • 7- రెండు సజ్దాల మధ్య కూర్చోవడం.
  • 8- నమాజులోని రుకూ, సజ్దా మొదలైన అంశాలన్నిటినీ నింపాదిగా, శాంతిగా నెరవేర్చడం.
  • 9- చివరి తషహ్హుద్.
  • 10- దాని కొరకు కోర్చోవడం.
  • 11- దరూదె షరీఫ్ (అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మది…..)
  • 12- సలాం తింపడం.
  • 13- ప్రతి రుకున్ నెరవేర్చడంలో క్రమ పద్దతిని పాటించడం

[1])اللهُ لَا إِلَهَ إِلَّا هُوَ الحَيُّ القَيُّومُ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ لَهُ مَا

فِي السَّمَاوَاتِ وَمَا فِي الأَرْضِ مَنْ ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلَّا بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالأَرْضَ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا وَهُوَ العَلِيُّ العَظِيمُ] {البقرة:255}

[2]) قُلْ هُوَ اللهُ أَحَدٌ(1) اللهُ الصَّمَدُ(2) لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ(3)  

وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ(4) قُلْ أَعُوذُ بِرَبِّ الفَلَقِ(1) مِنْ شَرِّ مَا خَلَقَ(2) وَمِنْ شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ(3) وَمِنْ شَرِّ النَّفَّاثَاتِ فِي العُقَدِ(4) وَمِنْ شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ(5).  قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ(1) مَلِكِ النَّاسِ(2) إِلَهِ النَّاسِ(3) مِنْ شَرِّ الوَسْوَاسِ الخَنَّاسِ(4) الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ(5)  مِنَ الجِنَّةِ وَالنَّاسِ أَجْمَعِينَ(6)


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

%d bloggers like this: