తజ్వీద్ సులభ శైలిలో [పుస్తకం]

రచన / కూర్పు : ముర్షిదా రజూఖ్
అధిపతి : అరబ్బేతరులకు అరబీ శిక్షణా విభాగం ఇంగ్లీషు అకాడమి

పర్యవేక్షణ: లతీఫా ఎన్. అల్ సయీద్
అధిపతి : స్కూల్ విభాగం , ఇస్లామ్ ప్రెజెంటేషన్ కమిటి మహిళా విభాగం

అనువాదం:
సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ, హబీబుర్రహ్మాన్ జామయీ

Tajweed in Easyway – Book Part 1& 2
[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [పార్ట్ 1 & 2] [138 పేజీలు] [54 MB]

తజ్వీద్ అనేది అత్యున్నతమైన విద్య. అదొక అమోఘమైన పఠనా ప్రక్రియ. ఎందుకంటే ఇది దివ్య ఖుర్ఆన్తో సంబంధం కలిగివుంది. ఖుర్ఆన్ గ్రంథం అల్లాహ్ శాశ్వత మహిమ. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లమ్)పై పవిత్ర ఖుర్ఆన్లు ఎలా అవతరించిందో అలానే పఠించడాన్ని తజ్వీద్ అంటారు. ప్రతి ముస్లిం దీనిని తప్పక నేర్చుకోవాలి. ఇంకా తమ పిల్లలకు కూడా నేర్పాలి. ఎందుకంటే తజ్వీద్ ఖుర్ఆన్ పారాయణం ఫర్జె అయిన్ (తప్పనిసరి విధి). అంటే ఇది ప్రతి ముస్లింపై ఉన్న విధ్యుక్త ధర్మం.

తజ్వీద్: ప్రతి అక్షరాన్ని సరయిన ఉచ్చారణతో ప్రత్యేక లక్షణాలతో పారాయణం చేయటాన్నే తజ్వీద్ అంటారు.

సమస్త స్తోత్రాలు అల్లాహ్ కొరకే. ఇంకా సమస్త మానవాళికి కారుణ్యమూర్తిగా పంపబడిన దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై శాంతి కురియుగాక! ఖుర్ఆన్ అల్లాహ్ వాక్కు, ఖుర్ఆన్ పఠనం ఓ ఆరాధన. దీని ద్వారా ఒక ముస్లిం చాలా తేలికగా అనంతమైన పుణ్య ఫలాల్ని సముపార్జించుకోగలడు.

ఖుర్ఆన్ను తజ్వీద్ నిబంధనలతో పారాయణం చేయటం ప్రతి పఠితునిపై తప్పనిసరి. కాబట్టి ముస్లింలు సరిఅయిన రీతిలో ఖుర్ఆన్ పారాయణం చేసేందుకు తజ్వీద్ నియమాలను పాటించటానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి అక్షరాన్ని దాని నియమాలను, లక్షణాలను పాటిస్తూ సరిఅయిన ఉచ్చారణతో ఖుర్ఆన్ పారాయణం చేయడంలో పారాయణకర్తలు ప్రావీణ్యత సంపాదించాలన్నదే తజ్వీద్ శాస్త్ర ముఖ్యోద్దేశం.

తజ్వీద్ సమర్పిస్తున్నందుకు ఐ.పి.సి స్కూల్ విభాగం సంతోషిస్తోంది. అరబీ మాతృభాష కాని ముస్లింలు, నవ ముస్లింలు వారి ఖుర్ఆన్ పారాయణాన్ని వృద్ధి చేసుకోవాలన్నదే ఈ పుస్తక సమర్పణ ముఖ్యోద్దేశం. “తజ్వీద్’ – సులభ శైలిలో” అనే పుస్తకం ఒక మంచి ఆరంభం. తజీవీద్ నేర్చుకునే వారికి ఈ పుస్తకం చక్కగా ఖుర్ఆన్ పారాయణం చేయడానికి దోహదకారి కాగలదని ఆశిస్తున్నాము.

ఇది ముస్లింలందరికీ మార్గదర్శకం కావాలని, ఇది మాకు శుభాశీస్సుగా మారాలని పరమ పవిత్రుడైన అల్లాహ్ ను వేడుకుంటున్నాము.

స్కూల్ విభాగం
ఇస్లాం ప్రజెంటేషన్ కమిటి