ఈ ప్రసంగంలో, వక్త ‘వసీలా’ (అల్లాహ్‌కు సాన్నిహిత్యం కోరే సాధనం) అనే భావనను వివరిస్తున్నారు. ధర్మ సమ్మతమైన మరియు అధర్మమైన వసీలాల మధ్య వ్యత్యాసాన్ని ఆయన స్పష్టం చేశారు. ధర్మబద్ధమైన మార్గం కేవలం ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ద్వారానే నిర్దేశించబడిందని నొక్కిచెప్పారు. ముఖ్యంగా, మరణించిన వారి ద్వారా, వారు ప్రవక్తలు లేదా పుణ్యాత్ములు అయినప్పటికీ, సహాయం కోరడం లేదా దుఆ చేయడం నిషిద్ధమని వివరించారు. ఆరాధన “ఎవరి కోసం” మరియు “ఎలా” అనే ఇబ్నె తైమియా సూత్రాన్ని ఉటంకించారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కాలంలో కరువు ఏర్పడినప్పుడు, వర్షం కోసం దుఆ చేయడానికి మరణించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కాకుండా, జీవించి ఉన్న ప్రవక్త పినతండ్రి అబ్బాస్ (రదియల్లాహు అన్హు)ను వసీలాగా చేసుకున్న చారిత్రక ఉదాహరణను అందించారు. దీని ద్వారా జీవించి ఉన్న పుణ్యాత్ముల ద్వారా మధ్యవర్తిత్వం కోరవచ్చని, కానీ మృతుల ద్వారా కాదని స్పష్టం చేశారు. అలాగే, ‘ఇస్తిఆనత్’ (ప్రాపంచిక విషయాలలో అనుమతించబడిన సహాయం) మరియు ‘ఇస్తిగాసా’ (కేవలం అల్లాహ్ మాత్రమే చేయగల విషయాలలో సహాయం కోరడం) మధ్య తేడాను వివరిస్తూ, రెండోది అల్లాహ్ యేతరుల నుండి కోరడం హరామ్ అని తేల్చిచెప్పారు.
(అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, వ మన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మా బాద్.)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు. అంతిమ విజయం దైవభీతిపరులకే. ప్రవక్తల నాయకులు, దైవసందేశహరులందరిపై మరియు ప్రళయదినం వరకు వారిని సన్మార్గంలో అనుసరించేవారిపై అల్లాహ్ కారుణ్యం మరియు శాంతి కురుపించుగాక. ఆ తర్వాత…
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహన అనే ఈ కార్యక్రమములోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
అధర్మమైన వసీలా
అభిమాన సోదరులారా! గత ఎపిసోడ్లో మనం ధర్మ సమ్మతమైన వసీలా గురించి తెలుసుకున్నాం. అవి తప్ప వేరే ఇతర పద్ధతుల ద్వారా ఆశ్రయం పొందటం అది అధర్మమైన వసీలా అవుతుంది.
ప్రియ సోదరులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన రుజుమార్గం కొరకు, సత్యమార్గం కొరకు ఒక మార్గాన్ని, ఒక దారిని, ఒక గీటురాయిని తెలియజేశాడు, చూపించాడు. సత్యం ఏమిటి? అసత్యం ఏమిటి? న్యాయం ఏమిటి? అన్యాయం ఏమిటి? ధర్మం ఏమిటి? అధర్మం ఏమిటి? స్వర్గానికి పోయే దారి ఏమిటి? నరకానికి పోయే దారి ఏమిటి? మన ఇహపర లోకాల సాఫల్యం కొరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంతిమ గ్రంథం, దివ్య గ్రంథం ఖురాన్ మజీద్ ని అవతరింపజేశాడు. అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు, ప్రవచనాలు. ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసులలో మన జీవన విధానం, ఈ లోకంలో, ప్రపంచంలో, ఇహంలో మనము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థన చేయకూడదు, అల్లాహ్ ను ఎలా వేడుకోవాలి, ఎలా వేడుకోకూడదు, ఇవన్నీ మనకు తెలియజేయడం జరిగింది ఖురాన్ లో మరియు హదీస్ లో.
అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తప్ప ఇతర మార్గం ఎన్నుకుంటే, అది మన బుద్ధికి, మన తెలివికి సరైనది అని అనిపించినా, అది ఖురాన్ పరంగా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం పరంగా లేకపోతే, అది ధర్మ సమ్మతం కాదు అని మనము స్పష్టంగా తెలుసుకోవాలి.
ఆరాధన ఎవరి కోసం? ఎలా?
అందుకే షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియా రహ్మతుల్లాహి అలై ఒక చక్కని సూత్రం చెప్పారు. అది ఏమిటంటే:
مَنْ تَعْبُدُ؟ كَيْفَ تَعْبُدُ؟ (మన్ త’అబుద్? కైఫ త’అబుద్?) ఎవరిని ఆరాధించాలి? ఆ ఆరాధన ఎలా చేయాలి?
ఎవరిని ఆరాధించాలి? ఆరాధన ఎవరి కొరకు? కైఫ త’అబుద్, ఆ ఆరాధన ఎలా చేయాలి? సూటిగా చెప్పాలంటే, ఆరాధన, ఇబాదత్ ఎవరి కోసం? ఆ ఇబాదత్ ఎలా చేయాలి? రెండే రెండు విషయాలు. దీనికి సూటిగా చెప్పాలంటే చక్కని సమాధానం: ఆరాధన కేవలం అల్లాహ్ కొరకు మరియు ఆ ఆరాధన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన విధానం ప్రకారమే.
మృతులను వసీలాగా తీసుకోవటం
అభిమాన సోదరులారా! కావున ఈ ధర్మ సమ్మతం కాని విషయాలలో, ధర్మ సమ్మతం కాని వసీలాలలో ఉదాహరణకు ఒకటి ఏమిటి? మృతులను దుఆ చేయమని కోరటం. మృతులను, పరమపదించిన వారిని దుఆ చేయమని కోరటం, వారిని వసీలాగా తీసుకోవటం, వాస్తాగా తీసుకోవటం, ఇది ఇస్లాంలో అధర్మం అని మనం తెలుసుకోవాలి.
అది ఎవరైనా సరే, పుణ్య పురుషులు కావచ్చు, ఔలియాలు కావచ్చు, అలాగే దైవ ప్రవక్తలు కూడా కావచ్చు. ఎవరైనా సరే, మరణించిన వారి సహాయం కోరటం, వారి వసీలాను కోరటం, వారి వసీలా ద్వారా దుఆ చేయటం ఇది ఇస్లాంలో సమ్మతం కాదు. ఎందుకంటే, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు – ఇది ప్రామాణికమైన హదీస్, అనేక హదీస్ గ్రంథాలలో ఈ హదీస్ ఉంది, సహీహ్ హదీస్ ఇది, ప్రామాణికమైన హదీస్ ఇది.
ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు, ముఆవియా బిన్ అబూ సుఫ్యాన్ రదియల్లాహు అన్హులు వారు గానీ, ఇతర సహాబాలు గానీ, తాబయీన్లు గానీ, కరువు కాటకాలు వచ్చినప్పుడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత వారి ద్వారా దుఆ చేయలేదు, వారి వసీలా తీసుకోలేదు. ఇది ముఖ్యమైన విషయం, గమనించాల్సిన విషయం ఇది. మనకంటే ఎక్కువ జ్ఞానం గలవారు, మనకంటే ఎక్కువ ఖురాన్, హదీస్ తెలిసినవారు, మనకంటే ఎక్కువ అల్లాహ్‌కు భయపడేవారు, మనకంటే ఎక్కువ దైవభీతి కలిగినవారు, మనకంటే ఎక్కువ అల్లాహ్‌ను ఆరాధించేవారు, మనకంటే ఎక్కువ ధర్మ జ్ఞానం కలిగినవారు, సహాబాలు, తాబయీన్లు, ధర్మ పండితులు, ముహద్దసీన్లు, వారు కరువు కాటకాలు వచ్చినప్పుడు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను వసీలాగా తీసుకున్నారా? తీసుకోలేదు.
ఇంకా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత కాలం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా దుఆ చేసేవారు. పోయి, “ఓ దైవ ప్రవక్త! కరువు వచ్చింది, వర్షం లేదు, నీరు వలన మనుషులు, జంతువులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ దైవ ప్రవక్త, దుఆ చేయండి” అని కోరేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు. ఇది మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం.
కాకపోతే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత సహాబాలు, ఆ తర్వాత కాలానికి చెందిన వారు, వారెవరైనా ప్రవక్తల, మృతుల, చనిపోయిన పుణ్యాత్ముల వసీలా తీసుకునేవారా? కాదు. ఒక హదీస్ ఇలా ఉంటుంది.
ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు యొక్క వేడుక: “ఓ అల్లాహ్! గతంలో మేము మా ప్రవక్త ద్వారా నిన్ను అర్థించే వారము, నీవు వర్షం కురిపించి మా కరువు తీర్చే వాడివి. ఇప్పుడు మేము మా ప్రవక్త బాబాయి గారిని ఆశ్రయించి నిన్ను ప్రార్థిస్తున్నాము. కనుక మాపై వర్షం కురిపించు” అని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ప్రార్థించేవారు.
దీంట్లో స్పష్టంగా ఏముంది? స్పష్టంగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు తెలియజేస్తున్నారు. “ఓ అల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత వరకు ప్రవక్త ద్వారా నిన్ను అర్థించే వారము.” అంటే ఇప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేరు కాబట్టి, పరమపదించారు కాబట్టి, ఇప్పుడు మనము ప్రవక్త గారి బాబాయి అయిన, పినతండ్రి అయిన అబ్బాస్ రదియల్లాహు అన్హు గారిని ఆశ్రయించి, అబ్బాస్ గారి ద్వారా నిన్ను వేడుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే అప్పుడు అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు బ్రతికి ఉన్నారు. ఇది గమనించాల్సిన విషయం.
అంటే దీని సారాంశం ఏమిటి అభిమాన సోదరులారా? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికి ఉన్నంత వరకు సహాబాలు ప్రవక్త ద్వారా ప్రార్థించేవారు. ఆయన పరమపదించిన తర్వాత కరువు వస్తే, ప్రవక్తగారి పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు అన్హు ద్వారా దుఆ చేసేవారు. దీనితో అర్థం ఏమైందంటే, చనిపోయిన వారి ద్వారా దుఆ చేయకూడదు. వారిని వసీలాగా తీసుకోకూడదు. ఎవరైతే పుణ్యాత్ములు, దైవభీతిపరులు, తఖ్వా గలవారు బ్రతికి ఉన్నారో, వారి ద్వారా దుఆ చేయవచ్చుమని మనకు అర్థమవుతుంది.
దైవ ప్రవక్త హోదాను వసీలాగా చేసుకోవడం
అలాగే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతస్తు, వేరే ఇతరుల అంతస్తులను వసీలాగా కూడా చేసుకోకూడదు. ప్రవక్త గారి అంతస్తును, ఇతర వారి అంతస్తులను కూడా ఆసరాగా చేసుకోకూడదు, వసీలాగా చేసుకోకూడదు. ఒక్క హదీస్ ఉంది, ఆ హదీస్ కి కొందరు ఆధారంగా తీసుకుంటారు, అది సమంజసం కాదు. ఆ హదీస్ ఏమిటంటే:
ఈ హదీస్, దీని అర్థం ఏమిటి? “మీరు అల్లాహ్ ను అడిగితే నా హోదాను, అంతస్తులను ఆసరాగా చేసుకుని అడగండి, ఎందుకంటే నా స్థాయి చాలా గొప్పది” అని ఇది ఆ ఒక ఉల్లేఖనం ఉంది. ఇది కాల్పనిక హదీస్, ‘మౌజూ’, ‘మన్ ఘడత్’. ఇది కాల్పనిక హదీస్, సత్యం లేశమైనా దీంట్లో లేదు అని గ్రహించాలి. ఈ హదీస్‌ను ఆధారంగా తీసుకోవటం కరెక్ట్ కాదు, సమ్మతం కాదు, న్యాయం కాదు. ఎందుకంటే ఇది ‘మౌజూ’, ‘మన్ ఘడత్’ హదీస్ ఇది.
అలాగే, సృష్టితాలలో ఏ ఒక్కరి అస్తిత్వాన్నైనా ఆధారంగా చేసుకోవటం ధర్మ సమ్మతం కాదు. ఎందుకంటే, ఎటువంటి ఆధారాలు ఖురాన్ లో గానీ, ప్రామాణికమైన హదీసులలో గానీ లేవు.
సహాయం కోరటంలోని రకాలు
అభిమాన సోదరులారా! అలాగే సృష్టితాలను సహాయం చేయమని కోరటం రెండు రకాలు. ఒకటి ఇస్తిఆనత్, ఇది సమ్మతమే. ఇస్తిఆనత్ అంటే ఏమిటి? ఏదైనీ వ్యవహారములో సహాయం కోరటం. ఉదాహరణకు స్నేహితులు, అమ్మ నాన్న, భార్య, భర్త, సంతానము, పిల్లలు… బ్రతికి ఉన్నారు, వారితో మనం జీవిస్తున్నాము, ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ఇచ్చు పుచ్చుకోవటం. ఇది సమ్మతమే. ఇంకా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో ఇలా తెలియజేశాడు:
وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَى (వ తఆవనూ అలల్ బిర్రి వత్తఖ్వా) పుణ్యకార్యాలలో, దైవభీతితో కూడిన విషయాలలో పరస్పరం సహకరించుకోండి. (సూరె మాయిదా: 2)
ఒకరి సహాయం కోరటము, “నాకు ఈ పని చేసి పెట్టండి, ఫలానా వస్తువు తీసుకొని రండి, ఇది వారికి ఇచ్చివేయండి”, అంటే ఇది ఇస్తిఆనత్. పరస్పరం ఇటువంటి విషయాలలో సహాయం చేసుకోవచ్చు. ఇది దాంట్లో రాదు.
సృష్టితాల సహాయంలో రెండవది ఏమిటి? ఇస్తిగాసా. ఇస్తిగాసా అంటే, అల్లాహ్ మాత్రమే చేయగలిగే పనులను, అల్లాహ్ మాత్రమే చేయగలిగే విషయాలను మృతులను కోరటం. ఏ పని అయితే అల్లాహ్ మాత్రమే చేస్తాడో, ఏది అయితే అల్లాహ్‌కు మాత్రమే సాధ్యమో, అటువంటివి సృష్టితాలతో కోరటం, ఇది కూడా అధర్మం కిందకి వస్తుంది. కేవలం అల్లాహ్‌కు సాధ్యమైన విషయాల కొరకు, బ్రతికి ఉన్న వారిని అర్థించటం ఇది కూడా ధర్మ సమ్మతం కాదు.
అభిమాన సోదరులారా! నా ఈ ప్రసంగానికి సారాంశం ఏమిటంటే, వసీలా రెండు రకాలు: ధర్మ సమ్మతం – గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. రెండవది అధర్మమైన వసీలా, అంటే మృతులను దుఆ చేయమని కోరటం, దైవ ప్రవక్త అంతస్తు లేదా ఇతరుల, పుణ్యాత్ముల అంతస్తులను వసీలాగా చేసుకోవటం, చనిపోయిన వారిని సహాయం కోరటం, ఇవన్నీ అధర్మమైన వసీలా. ఇది ఇస్లాం ధర్మంలో ముమ్మాటికీ కరెక్ట్ కాదు, నిషిద్ధము, ఇది తప్పు, అధర్మం, అన్యాయం, పాపం.
ఇక సహాయం వస్తే ఇది రెండు రకాలు. ఇస్తిఆనత్, పరస్పరం సహాయం చేసుకోవటం, వ్యవహారంలో ఏమైనా వస్తువులలో, లావాదేవీల్లో, తినే తాగే విషయాలలో ఇది ధర్మ సమ్మతమే. కాకపోతే ఇస్తిగాసా, ఏదైతే అల్లాహ్ మాత్రమే చేయగలుగుతాడో, కేవలం అల్లాహ్‌కు మాత్రమే సాధ్యమైన విషయాల కొరకు సృష్టితలతో కోరటం, ఇది అధర్మమైన వసీలాగా పరిగణిస్తుంది.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల పరంగా జీవించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) “సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు” అన్నదే మా చివరి మాట. మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగం ఇస్లాం యొక్క ప్రాథమిక విశ్వాసమైన తౌహీద్ (ఏకేశ్వరోపాసన) యొక్క ప్రాముఖ్యతను మరియు షిర్క్ (బహుదైవారాధన) యొక్క ప్రమాదాలను వివరిస్తుంది. తౌహీద్ అత్యున్నత ఆరాధన అని, షిర్క్ అత్యంత ఘోరమైన పాపమని వక్త నొక్కిచెప్పారు. తాయెత్తులు కట్టుకోవడం వంటి షిర్క్‌కు దారితీసే కార్యాలను నివారించాలని, అల్లాహ్ పట్ల ఎల్లప్పుడూ సద్భావన కలిగి ఉండాలని ఆయన ఉద్బోధించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు తౌహీద్‌ను ఎలా కాపాడారో, షిర్క్‌కు దారితీసే మార్గాలను ఎలా మూసివేశారో హుదైబియా చెట్టు ఉదంతం ద్వారా వివరించారు. మనల్ని మరియు మన కుటుంబాలను తౌహీద్‌పై స్థిరంగా ఉంచమని అల్లాహ్‌ను ప్రార్థించాలని, ఇస్లాం మరియు సున్నత్ అనే అనుగ్రహాలకు కృతజ్ఞతతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.
أَلْحَمْدُ لِلَّهِ الْمُتَوَحِّدِ بِالْجَلَالِ بِكَمَالِ الْجَمَالِ تَعْظِيمًا وَتَكْبِيرًا (అల్ హమ్దు’లిల్లాహిల్ ముతవహ్హిది బిల్ జలాలి బికమాలిల్ జమాలి త’అజీమన్ వ తక్బీరా)
أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ تَقْدِيرًا وَتَدْبِيرًا (అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ తఖ్దీరన్ వ తద్బీరా)
وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ لِيَكُونَ لِلْعَالَمِينَ نَذِيرًا (వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ లియకూన లిల్ ఆలమీన నజీరా)
నేను మీకూ, అలాగే నాకు కూడా అల్లాహ్ (సుబహనహు వ త’ఆలా) భయభీతిని కలిగి ఉండాలని బోధిస్తున్నాను. అల్లాహ్‌కు భయపడటానికి అత్యంత ముఖ్యమైన మార్గం తౌహీద్‌ను (అల్లాహ్ ఏకత్వాన్ని) స్థాపించడం, షిర్క్‌ను (ఆయనకు భాగస్వాములను కల్పించడాన్ని) నివారించడం. తౌహీద్ అన్ని ఆరాధనలలోకెల్లా గొప్పది, దాన్ని పాటించేవారు అల్లాహ్ వద్ద అత్యుత్తమ స్థానంలో ఉంటారు. షిర్క్ అన్ని పాపాలలోకెల్లా అత్యంత అసహ్యకరమైనది, చెడ్డది, దాన్ని పాటించేవారు అల్లాహ్ నుండి అత్యంత దూరంలో ఉంటారు.
అవును, తౌహీద్ విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉన్నారు, ఇది దాసులపై అల్లాహ్‌కు ఉన్న హక్కు. వారి కోరికలు వారిని తౌహీద్ నుండి దూరం చేశాయి. కలహాలు, సంక్షోభాలు, రోగాలు వారిని ఆవరించాయి. వారిలో కొందరు తాయెత్తులు, కడియాల మాయలో పడి ఉన్నారు, వాటిని తమకు, తమ పిల్లలకు, తమ వాహనాలకు, తమ ఇళ్లకు కట్టుకుంటారు. అవి కీడును దూరం చేస్తాయని, కంటిదిష్టిని తొలగిస్తాయని, మంచిని తీసుకువస్తాయని వారు నమ్ముతారు. కానీ వారు ప్రవక్త ఆదేశాన్ని మరిచారా?
(مَنْ عَلَّقَ تَمِيمَةً فَقَدْ أَشْرَكَ) “ఎవరైతే తాయెత్తు కట్టుకుంటారో, వారు షిర్క్ చేసినట్లే.” (ముస్నద్ అహ్మద్ 17422. దీని సనద్ బలమైనది).
అల్లాహ్ ను కాకుండా వేరొకరిని ఆశ్రయించినా, వేరొకరిని ఆశించినా వారికి ఎంతటి వినాశనం! విశ్వాసులు స్వచ్ఛమైన దానిని త్రాగారు, కానీ అతను (షిర్క్ చేసే వాడు) కలుషితమైన దానిని త్రాగాడు. విశ్వాసులు ఒక్క ప్రభువును ఆరాధించారు, కానీ అతను పదిమంది ప్రభువులను ఆరాధించాడు:
(ءأَرْبَابٌ مُّتَّفَرّقُونَ خَيْرٌ أَمِ اللَّهُ الْوَاحِدُ الْقَهَّارُ) “అనేక మంది విభిన్న ప్రభువులు మేలా? లేక సర్వాధిక్యుడైన ఒక్క అల్లాహ్ మేలా? (మీరే చెప్పండి!)” (యూసుఫ్ 12:39).
ఇక మృతులను పూజించేవాడు ఎక్కడ, ఎన్నటికీ మరణించని జీవించియున్న అల్లాహ్ ని పూజించేవాడు ఎక్కడ?
అయినప్పటికీ, మన బాధ్యతలో ఉన్న వారి మనస్సులలో ఈ ప్రాథమిక భావాలను నాటాలి. అంటే తౌహీద్ ను ప్రేమించడం, ప్రోత్సహించడం, దానిని స్థాపించడం. షిర్క్ ను అసహ్యించుకోవడం, షిర్క్ ను వారించడం. ఇది ప్రాథమిక విషయం. వీటిని మనం మన భార్యా, పిల్లలు, మన బంధువులు, మన బాధ్యతలో ఉన్న వారి మనస్సులలో నాటాలి. వారిలో అల్లాహ్ పట్ల, ఆయన ఆజ్ఞల పట్ల, నిషేధాల పట్ల గొప్ప గౌరవాన్ని పెంచాలి. ఆయన గొప్ప ఆజ్ఞ తౌహీద్. ఆయన గొప్ప నిషేధం షిర్క్. అల్లాహ్ జల్ల వ’ఉలా తన ప్రవక్తకు తౌహీద్ గురించి జ్ఞానం పొందమని ఆజ్ఞాపించాడు:
{فَاعْلَمْ أَنَّهُ لَا إِلَهَ إِلَّا اَللَّهُ} “కనుక (ఓ ప్రవక్తా!) అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో. ” (ముహమ్మద్ 47:19).
ఇక ప్రవక్తకే ఈ ఆదేశం అల్లాహ్ ఇచ్చినప్పుడు, మనకు ఇది మరింత ప్రాధాన్యమైన ఆజ్ఞ.. కాబట్టి, మనకు ఇది మరింత ప్రాధాన్యమైన ఆజ్ఞ. అందుకే మనలో ఒకరు ఇలా అనడం అజ్ఞానం: “మేము తౌహీద్‌ను అర్థం చేసుకున్నాము, అయితే దానిని మన పాఠశాలల్లో, మసీదుల్లో ఎందుకు బోధిస్తూ ఉండాలి?” అంటారు కదా కొందరు ఇలా. ఇలా అనడం తప్పు విషయం. అల్లాహ్ నేర్చుకోమని ఏ విషయం అయితే చెబుతున్నాడో, దానిని ఇలా విస్మరించడమా?
ఓ విశ్వాసులారా: తౌహీద్ విషయాలలో విస్మరించబడిన వాటిలో ఒకటి అల్లాహ్ పట్ల దుర్బుద్ధి, దురాలోచన.
{الظَّانِّينَ بِاللَّهِ ظَنَّ السَّوْءِ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ} “అల్లాహ్ విషయంలో చెడుగా అనుమానించేవారు, వాస్తవానికి వారి దురనుమానాలు వారిపైనే పడతాయి.” (ఫత్ హ్ 48:6).
ఎంత మంది ప్రజలు అసత్యం విజయం సాధించడాన్ని, సత్యం బలహీనపడడాన్ని చూసినప్పుడు, అసత్యం శాశ్వతంగా ఉన్నత స్థితిలో ఉంటుందని, సత్యం క్షీణిస్తుందని భావిస్తారు? ఇది అల్లాహ్ పట్ల దుర్బుద్ధి, దురాలోచన, చెడు ఊహ. ఇది ఆయన స్వభావానికి, గుణాలకు తగనిది.
ఎంత మంది ప్రజలు తీవ్రమైన అనారోగ్యంతో లేదా పేదరికంతో బాధపడుతున్నప్పుడు అల్లాహ్ పట్ల దుర్బుద్ధిని కలిగి ఉంటారు, అల్లాహ్ వారి కష్టాలను దూరం చేయడని భావిస్తారు? ఇది నిస్సందేహంగా తౌహీద్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది.
మీ పరిస్థితిని మీరే చూసుకోండి, మీ పట్ల ఎవరైనా చెడుగా భావిస్తే మీరు ఎంత కోపంగా ఉంటారు, దాన్ని ఎంత ఖండిస్తారు? మీరు ప్రతి లోపానికి అర్హులు, అలాంటిది మీ ప్రభువు పట్ల మీరు ఎలా దుర్బుద్ధి, దురాలోచన కలిగి ఉంటారు, ఆయన పరిపూర్ణ గుణాలన్నింటికీ అర్హుడు?
ఇమామ్ అల్ ముజద్దిద్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ రచించిన ‘కితాబుత్-తౌహీద్’లో ఒక అధ్యాయం ఉంది, దాని శీర్షిక:
حِمَايَةُ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حِمَى التَّوْحِيدِ وَسَدِّهِ طُرُقَ الشِّرْكِ (హిమాయతున్-నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లమ హిమత్-తౌహీద్ వ సద్దిహీ తురుఖష్-షిర్క్) “తౌహీద్‌ను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎలా రక్షించారు, షిర్క్‌కు దారితీసే మార్గాలను ఎలా మూసివేశారు.”
ఇందులో, ఆ ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ వారి యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) షిర్క్ కు దారి తీసే మార్గాలను మూసివేశారు, స్వయం ఆ మార్గాలు షిర్క్ కాకపోయినప్పటికీ, తౌహీద్ ను రక్షించడానికి ఇది ముందు జాగ్రత్త చర్యగా.
తౌహీద్‌ను రక్షించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పే ఒక చిన్న కథ తెలుసుకుందాము: హజ్రత్ ముసయ్యిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: హుదైబియాలోని చెట్టు కింద ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో బైఅత్ చేసిన వారిలో ఒకరు ఆయన కూడా ఉన్నారు, ఆయన చెప్పారు: “బైఅత్ జరిగిన తర్వాత సంవత్సరం మేము ఆ చెట్టు దగ్గరి నుండి దాటిపోయాము, కాని మేము దానిని మరచిపోయి ఉంటిమి గనక దానిని కనుగొనలేకపోయాము.” (బుఖారీ 4162, 4163, ముస్లిం 1859).
ఈ హదీస్ వ్యాఖ్యానంలో ఇమామ్ నవవీ రహిమహుల్లాహ్ చెప్పారు, “దాని అదృశ్యం, అంటే అది కనబడకుండా ఉండడం, అల్లాహు త’ఆలా దయలో ఓ భాగం. అది కనిపించి ఉన్నట్లయితే, అజ్ఞానులు దానికి గొప్ప గౌరవం ఇస్తారన్న భయం ఉండేది”. (షర్హ్ ముస్లిం).
తరువాత హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు కాలంలో, ప్రజలు దాని పట్ల మరొకసారి ఫిత్నాలో పడ్డారు. అప్పుడు ఆయన దానిని నరికివేయమని ఆజ్ఞాపించారు, షిర్క్‌కు దారితీసే మార్గాన్ని మూసివేయడానికి; ఎందుకంటే వారు దాని కిందకు వెళ్లి నమాజ్ చేసేవారు. అయితే వారు ఫిత్నాలో పడతారని ఆయన భయపడ్డారు. (ఫత్హుల్ బారీ 7/448 ثُمَّ وَجَدْتُ عِنْد بن سَعْدٍ بِإِسْنَادٍ صَحِيحٍ عَنْ نَافِعٍ أَنَّ عُمَرَ بَلَغَهُ أَنَّ قَوْمًا يَأْتُونَ الشَّجَرَةَ فَيُصَلُّونَ عِنْدَهَا فَتَوَعَّدَهُمْ ثُمَّ أَمْرَ بِقَطْعِهَا فَقُطِعَتْ).
ఓ అల్లాహ్, మమ్మల్ని తౌహీద్‌పై జీవింపజేయి, తౌహీద్‌పై మరణింపజేయి, ప్రళయదినాన మమ్మల్ని తౌహీద్ పై లేపు. అస్తగ్ఫిరుల్లాహ లీ వ’లకుమ్ ఫ’స్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్’రహీం.
ఇస్లాం, తౌహీద్, స్పష్టమైన సున్నత్ అనే గొప్ప అనుగ్రహాలు ప్రసాదించిన అల్లాహ్‌కు స్తోత్రములు. తౌహీద్ పై స్థిరంగా ఉండి, అటూ ఇటూ తొంగని, వంగనివారి నాయకులైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి, శుభాలు వర్షించుగాక. ఆమీన్. అమ్మాబాద్!
ఓ షిర్క్‌ను, దానిని పాటించేవారిని వదలి, తౌహీద్‌ను పాటించేవాడా, ఓ బిద్అత్‌ను, దానిని పాటించేవారిని వదలి సున్నత్‌ను పాటించేవాడా: నీవు తౌహీద్, సున్నత్ దేశంలో తౌహీద్ మరియు సున్నత్ యొక్క అనుగ్రహాన్ని గమనిస్తున్నావా, దాని విలువను గ్రహిస్తున్నావా?
మన దేశంలో ఉన్న గొప్ప అనుగ్రహాన్ని నీవు గుర్తించావా (సౌదీయాలో జరిగిన ఖుత్బా, అందుకొరకే ఖతీబ్ చెప్పిన మాటలు అలాగే అనువదించడం జరిగింది), ఏంటి అది? అల్లాహ్ దయ వల్ల మనం మస్జిదులు, శ్మశాన వాటికలలోకి, ఖబ్రిస్తాన్ లలోకి ప్రవేశించినప్పుడు, షిర్క్ లేదా బిద్అత్ యొక్క ఏ చిహ్నాలను కూడా మనం చూడము. విగ్రహాలను పూజించకుండా, సాలిహీన్‌లను, సమాధి చేయబడిన వారిని, ఔలియాలను మధ్యవర్తులుగా చేసుకోవడం నుండి నిన్ను దూరంగా ఉంచిన అల్లాహ్ గొప్ప దయను నీవు గుర్తుకు తెచ్చుకున్నావా?
నీ మూడవ తండ్రి ఇబ్రహీం (అలైహిస్సలాం) చేసిన దుఆ నీవు చేస్తూ ఉన్నావా? (మూడవ తండ్రి ఎందుకు అన్నారండీ? మనల్ని కన్న తండ్రి ఒక తండ్రి అయితే, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తండ్రి లాంటి వారు కాదా? ధర్మమంతా ప్రేమగా నేర్పారు కదా).
{وَاجْنُبْنِي وَبَنِيَّ أَنْ نَعْبُدَ الْأَصْنَامَ رَبِّ إِنَّهُنَّ أَضْلَلْنَ كَثِيرًا مِنَ النَّاسِ} “నన్నూ, నా సంతానాన్నీ విగ్రహ పూజ నుంచి కాపాడు, నా ప్రభూ! అవి ఎంతో మందిని పెడదారి పట్టించాయి” (ఇబ్రాహీం 14:35-36).
ఇబ్నుల్-ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: “నేను ఒక రోజు మా స్నేహితులలో ఒకరిని సందర్శించాను – ఆయనకు దుఃఖం వచ్చి ఏడుస్తూ ఉన్నారు – నేను ఆయనను దాని గురించి అడిగాను, ఆయన అన్నారు: అల్లాహ్ నాకు సున్నత్ ప్రసాదించాడు, దాని జ్ఞానం ప్రసాదించాడు. మరియు ప్రజలు ఏ సందేహాల్లో పడి ఉన్నారో, ఏ తప్పుడు నియమ నిర్ణయాల్లో ఉన్నారో, వాటి నుండి విముక్తిని కలిగించాడు. ఇలా కలిగించిన ఆ అల్లాహ్ ను నేను గుర్తు చేసుకుంటున్నాను, ఈ అనుగ్రహాలను నేను గుర్తు చేసుకుంటున్నాను. అది నన్ను సంతోష పెట్టింది, చివరికి నన్ను ఏడ్పించింది”. (మదారిజుస్సాలికీన్ 3/127).
దుఆ
فاللهم لَكَ الحَمْدُ عَلَى نِعْمَةِ التَّوْحِيْدِ وَالسُّنَّةِ، بِبِلَادِ التَّوْحِيْدِ وَالسُّنَّةِ. (అల్లాహుమ్మ లకల్ హమ్దు అలా ని’అమతిత్ తౌహీది వస్-సున్నతి ఫీ బిలాదిత్ తౌహీది వస్-సున్న) ఓ అల్లాహ్, తౌహీద్, సున్నత్ దేశంలో తౌహీద్, సున్నత్ అనే గొప్ప అనుగ్రహానికి నీకే ప్రశంసలు, స్తోత్రములు.
اللَّهُمَّ ثَبِّتْنَا عَلَى ذَلِكَ إِلَى يَوْمِ نَلْقَاكَ (అల్లాహుమ్మ సబ్బిత్నా అలా జాలిక ఇలా యౌమి నల్ఖాక) ఓ అల్లాహ్! మేము నిన్ను కలిసే రోజు వరకు దానిపై మమ్మల్ని స్థిరపరచు.
وَعُمَّ بِالتَّوْحِيدِ وَالسُّنَّةِ أَوْطَانَ الْمُسْلِمِينَ (వ’ఉమ్మ బిత్-తౌహీది వస్-సున్నతి అవ్తానల్ ముస్లిమీన్) ముస్లింల దేశాలను తౌహీద్, సున్నత్ తో నింపు.
اللهم كَمَا هَدَيْتَنا لِلإِسْلاَمِ فلاَ تَنْزِعْهُ مِنّا حَتَّى تَتَوَفَّانا وَنحن مُسْلِمونَ. (అల్లాహుమ్మ కమా హదైతనా లిల్ ఇస్లామి ఫలా తన్జి’అహు మిన్నా హత్తా తతవఫ్ఫానా వ నహ్ను ముస్లిమూన్) ఓ అల్లాహ్, నీవు మమ్మల్ని ఇస్లాంపై నడిపించినట్లే, మేము ముస్లింలుగా మరణించే వరకు దానిని మమ్మల్నుండి దూరం చేయకు.
اللهم اجْعَلْنَا مِمَّنْ يَلْقَاكَ لَا يُشْرِكُ بِكَ شَيْئَاً. (అల్లాహుమ్మ జ’అల్నా మిమ్మన్ యల్ఖాక లా యుష్రికు బిక షైఆ) ఓ అల్లాహ్, నిన్ను కలిసేటప్పుడు నీకు ఏమీ భాగస్వామిగా చేయని వారిలో మమ్మల్ని చేర్చు.
اللَّهُمَّ اجْعَلْنَا أغَنْى خَلْقِكَ بكَ، وأفْقَرَ خَلْقِكَ إليْكَ. (అల్లాహుమ్మ జ’అల్నా అగ్నా ఖల్ఖిక బిక వ అఫ్ఖర ఖల్ఖిక ఇలైక) ఓ అల్లాహ్, నీ తప్ప నీ సృష్టిలో ఎవరి అవసరం లేకుండా చేయి, మరియు నీ సృష్టిలోకెల్లా నీ సన్నిధిలో అత్యంత పేదవారిగా ఉంచు.
اللَّهُمَّ إِنّا نَسْأَلُكَ النَّعِيمَ الْمُقِيمَ الَّذِي لَا يَحُولُ وَلَا يَزُولُ. (అల్లాహుమ్మ ఇన్నా నస్అలుకన్-నయీమల్ ముఖీమల్లజీ లా యహూలు వలా యజూల్) ఓ అల్లాహ్, ఎన్నటికీ మారకుండా, తొలగిపోకుండా ఉండే శాశ్వతమైన అనుగ్రహాలు మేము నిన్ను అడుగుతున్నాము.
اللهم وفِّقْ إِمَامَنَا خَادِمَ الحَرَمَينِ الشَّرِيْفَيْنِ، وَوَلِيَّ عَهْدِهِ لِمَا فِيْهِ عِزُّ الإِسْلامِ وَصَلاحُ المُسْلِمِيْنَ. وَارْحَمْ وَالِدَهُمُ الإِمَامَ المُؤَسِّسَ، وَالإِمَامَ المُجَدِّدَ. (అల్లాహుమ్మ వఫ్ఫిఖ్ ఇమామనా ఖాదిమల్ హరమైనిష్-షరీఫైని వ వలియ్య అహదిహీ లిమా ఫీహి ఇజ్జుల్ ఇస్లామి వ సలాహుల్ ముస్లిమీన్, వర్’హమ్ వాలిదహుమల్ ఇమామల్ ముఅస్సిస వల్ ఇమామల్ ముజద్దిద్) ఓ అల్లాహ్! మా నాయకుడు (అంటే రాజు), రెండు పవిత్ర మస్జిదుల సేవకుడు మరియు ఆయన యువరాజును ఇస్లాం గౌరవానికి, ముస్లింల శ్రేయస్సుకు దోహదపడే వాటికి మార్గనిర్దేశం చెయ్యి. వారి తండ్రి, వ్యవస్థాపక ఇమామ్ (మలిక్ అబ్దుల్ అజీజ్) మరియు పునరుద్ధరణ చేసిన ఇమామ్ (ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్) రహిమహుముల్లాహ్ పై నీవు దయ చూపు.
اللهم احْفَظْ أَمْنَنَا وَإيْمَانَنَا وَجُنُودَنَا وَحُدُوْدَنَا، وَمُقَدَّسَاتِنَا وَقُدْسَنَا. (అల్లాహుమ్మ హ్ఫజ్ అమ్ననా వ ఈమాననా వ జునూదనా వ హుదూదనా వ ముఖద్దసాతినా వ ఖుద్సనా) ఓ అల్లాహ్, మా భద్రతను, మా విశ్వాసాన్ని, మా సైనికులను, మా సరిహద్దులను, మా పవిత్ర స్థలాలను, మా బైతుల్ మఖ్దిస్ ను రక్షించు, కాపాడు.
اللهم يَا ذَا النِّعَمِ الَّتِيْ لا تُحْصَى عَدَدًا: نَسْأَلُكَ أَنْ تُصَلِّيَ وَتُسَلِّمَ عَلَى مُحَمَّدٍ أَبَدَاً. (అల్లాహుమ్మ యా జన్ని’అమిల్లతీ లా తుహ్సా అదదా, నస్అలుక అన్ తుసల్లియ వ తుసల్లిమ అలా ముహమ్మదిన్ అబదా) ఓ అల్లాహ్, లెక్క లేనన్ని అనుగ్రహాలు ప్రసాదించేవాడా: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఎల్లప్పుడూ శాంతిని, శుభాలను కురిపించమని మేము నిన్ను అడుగుతున్నాము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ దాసులారా! ఆయనకు భయపడుతూ ఉండండి, ఆయన భీతి కలిగి ఉండండి, ఆయనకు విధేయత చూపండి, అవిధేయతకు పాల్పడకండి. గుర్తుంచుకోండి! తౌహీద్లో భాగమైన ఓ విషయం ఏమిటంటే: నామాలలో గుణగణాలలో అల్లాహ్ ను ఏకంగా భావించటం. అందులో అగోచర జ్ఞానం అనేది అల్లాహ్ యొక్క ప్రత్యేకమైన గుణం, అది అల్లాహ్ కు అంకితం అని ఖురాన్ మరియు హదీసుల ద్వారా మరియు ఈ ఉమ్మత్ యొక్క ఉలమాలు అందరూ ఏకీభవించి ఉన్న స్పష్టమైన విషయం. అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు:
“అల్లాహ్‌కు తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర జ్ఞానం లేదు. తాము ఎప్పుడు తిరిగి లేపబడతామో కూడా వారికి తెలియదు” అని ఓ ప్రవక్తా (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి చెప్పు. (సూరా అన్ నమ్ల్ 27 : 65)
ఓ హాదీస్ లో ఖాలిద్ బిన్ జక్వాన్ వారు రబీ బింతే ముఅవ్వీజ్ తో ఉల్లేఖిస్తున్నారు: దైవ ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక బాలికను ఈ విధంగా గీతం పాడుతుండగా విన్నారు “మా ప్రవక్తకు రేపు జరిగే విషయాలు కూడా తెలుసు“. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఆ విషయాన్ని విడిచి మిగతాది పాడండి” అని వారించారు మరియు రేపు ఏం జరగనున్నది అనేది అల్లాహ్ కు తప్ప మరెవరికి తెలియదు అని బోధించారు. (ఇబ్ను మాజహ్, అల్లామా అల్బానీ రహిమహుల్లాహ్ వారు దీనిని ప్రామాణికంగా ఖరారు చేశారు).
ఇబ్నె ఉమర్ వారి ఉల్లేఖనము: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)వారు ఇలా అన్నారు: అగోచరజ్ఞానం ఖజానా కు ఐదు తాళం చెవులు ఉన్నాయి , దాని జ్ఞానం అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి లేదు, అందులో : (1) రేపు ఏం జరగనున్నదో అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి తెలియదు, (2) మాతృ గర్భాలలో ఏముందో అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి తెలియదు (*), (3) వర్షం ఎప్పుడు కురుస్తుందో ఆయనకు తప్ప మరెవరికి తెలియదు, (4) ఎవరు ఏ గడ్డపై మరణిస్తారో అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి తెలియదు మరియు (5) ప్రళయం ఎప్పుడు సంభవిస్తుందో అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి తెలియదు. (సహీ బుఖారి).
(*) అంటే అర్థము మాతృ గర్భంలో 9 మాసాల కన్నా తక్కువ లేదా 9 మాసాలు కన్నా ఎక్కువ గర్భం నిలుస్తుందో ఈ జ్ఞానం అల్లాహ్ కు మాత్రమే ఉంది, అల్లాహ్ ఆజ్ఞ ఇలా ఉంది: స్త్రీ తన గర్భంలో ఏదైతే మోస్తుందో, ఈ గర్భం తగ్గటము పెరగటం విషయంలో పూర్తి జ్ఞానం అల్లాహ్ కు మాత్రమే ఉంది. (ఇబ్నే కసీర్ వారు ” తఫ్సీరు ఖుర్ఆనిల్ అజీమ్” లో సూరే రఆద్ వివరణలో వివరించారు).
తెలిసిన విషయమేమిటంటే అగోచర జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే అంకితము. ఇది అల్లాహ్ యొక్క గుణము. ఇందులో ఎవరు కూడా ఆయనకి సాటిలేరు, వాళ్ళు అల్లాహ్ సమీపంలో ఉన్న దైవదూతులైనా కావచ్చు, పంపించబడ్డ ప్రవక్తలైనా కావచ్చు. కనుక ఎవరైతే తనకు అగోచర జ్ఞానం ఉందని ప్రకటిస్తాడో అతను అల్లాహ్ కి ప్రత్యేకమైన గుణంలో అల్లాహ్ దాసులను భాగ్యస్వామ్యం చేసినట్టు. దాసుడ్ని అల్లాహ్ కు సమానము చేశాడు, మరియు ఘోరాతి ఘోరమైన పాపానికి (షిర్క్ ఎ అక్బర్) కి పాల్పడ్డాడు. తమ కాలానికి ఇమామ్ అయిన ఇమామ్ అహ్లుస్ సున్నహ్: నుఐమ్ బిన్ హమ్మాద్ అల్ ఖుజాయీ వారు అన్నారు: “ఎవరైతే సృష్టికర్తను సృష్టిరాశులతో సమానం చేశాడో అతను అవిశ్వాసానికి (కుఫ్ర్ కు) పాల్పడినట్టు.”
కాహిన్ మరియు అర్రాఫ్ పరిచయం
అల్లాహ్ దాసులారా! ప్రజలలో కొందరు అగోచర జ్ఞాన విషయంలో అల్లాహ్ కు సాటిగా సమానులని ప్రకటిస్తున్నారు. అల్లాహ్ కు ఈ నినాదానికి ఎటువంటి సంబంధం లేదు. వీళ్లు “కాహిన్” మరియు “అర్రాఫ్ “. కాహిన్ అంటే: భవిష్య జ్ఞానం కలిగి ఉన్నాడని ప్రచారం చేసుకునేవాడు, జ్యోతిష్యుడు. అర్రాఫ్ ( షోబదబాజ్) అంటే ఇందులో జ్యోతిష్యుడు, గుప్త విద్య కలిగిన వాడు, చేతబడి చేసేవాడు అనే అన్ని అర్ధాలు వస్తాయి. అరబీ భాషలో ఇతన్ని “అర్రాఫ్” అంటారు.
షేక్ సాలేహ్ అల్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్) అన్నారు: కాహిన్ అనే పదానికి అర్ధం “అంచనా” ఆధారం లేని విషయాల ద్వారా వాస్తవాలు సేకరించడం. ఆజ్ఞాన కాలంలో ఎవరి వద్దకు అయితే షైతానులు వచ్చేవో వాళ్ళు ఇదే పని చేసేవారు, షైతానులు ఆకాశం నుంచి సమాచారాలను అందించే వారు. ఈ జ్యోతిష్యులు షైతానులు నుంచి అందిన సమాచారంతో స్వంత మాటలు కలిపి ప్రజలకు చెప్పేవారు. ఒకవేళ వీళ్ళు చెప్పిన మాటలు నిజమైతే ప్రజలు వీళ్ళకు దగ్గరై ప్రతీ సమస్యకు పరిష్కారం కొరకు వీళ్ళని ఆశ్రయించే వారు మరియు భవిష్యవాణులు తెలుసుకునే వారు. అందుకే మనం (సాలేహ్ అల్ఉసైమీన్ వారు) అంటున్నాం, కాహిన్ అంటే: భవిష్యత్తులో జరిగే అగోచార విషయాల్ని తెలియజేసేవాడు .(ఇలా ప్రజల్లో ప్రచారం వుంది)
ఓ విశ్వాసులారా! జ్యోతిష్యుడు అగోచర జ్ఞానం నిరూపించడానికి రెండింటిలో ఒక మార్గాన్ని ఎన్నుకుంటాడు,
మొదటిది: దైవదూతల నుంచి సమాచారాన్ని దొంగలిచే షైతాన్ మాటలు వినటం. దీని ఆధారం సహీ బుఖారిలో ఆయేషా (రదియల్లాహు అన్హా) వారి ఉల్లేఖనం:
దైవ దూతలు ఆకాశం మబ్బుల్లో వస్తారు మరియు అల్లాహ్ తీసుకున్న నిర్ణయాలను తెలియజేస్తారు. అక్కడున్న షైతాన్లు రహస్యంగా ఆ మాటలను దైవదూతల నుంచి విని, ఈ చేతబడి చేసే వాళ్ళు, జ్యోతిష్యాలు చెప్పే వాళ్లకు తెలియజేస్తారు. వాళ్ళు ఆ విన్న మాటల్లో తమ తరఫునుంచి అబద్ధాలు కలిపి, తమ వద్దకు వచ్చే ప్రజలకు చెప్తారు. (బుఖారి)
అల్లాహ్ దాసులారా! తెలిసిన విషయం ఏంటంటే: జ్యోతిష్యులు ప్రజలకు అబద్ధమైన విషయాలను చెప్తారు. ఒకవేళ వాళ్ళు చెప్పిన విషయంలో ఏదైనా సత్యం ఉంటే, అది షైతాన్ దొంగిలించిన మాటల్లో నుంచి ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు చెప్పే అగోచర జ్ఞానానికి దానికి సంబంధం ఉండదు. ఈ విధంగా ప్రజలు వాళ్ళ చెప్పే విషయాల్లో ఆ ఒక్క సత్యమైన మాట వల్ల వాళ్ళ వలలో చిక్కుకుంటారు. మరియు అందులో కలిసి ఉన్న అబద్ధమైన విషయాలను పట్టించుకోరు. మరికొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పే పూర్తి విషయాలు అబద్ధం అయినప్పటికీ దాన్ని సత్యమే అని భావిస్తారు. (ఇది మొదటి మార్గం)
రెండవ మార్గం: జిన్నులను ఆశ్రయించటం. ఆ జిన్ ప్రతి మానవుడుతో పాటే ఉండేవాడైనా కావచ్చు లేదా వేరే వాడైనా. ఇది ఎలా అంటే ప్రతి మానవుడుతో పాటు ఒక జిన్ నిమిత్తమై ఉంటాడు. అతను ఆ మానవుడికి చెడు వైపునకు ఆహ్వానిస్తూ ఉంటాడు, కనుక ఆయేషా (రదియల్లాహు అన్హా) వారి ఉల్లేఖనం లో ఈ విధంగా ఉంది: కొంతమంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కాహిన్ మరియు జ్యోతిష్యులు గురించి ప్రశ్నించారు. దానికి సమాధానంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు “అది పెద్ద విషయం కాదు” దానికి వారు ఇలా అడిగారు ” ప్రవక్త కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పే మాటలు నిజమవుతాయి కదా” అంటే దానికి జవాబుగా ప్రవక్త వారు ఇలా అన్నారు ” వాళ్లు చెప్పే మాటల్లో ఏదైతే నిజం అవుతాయో అవి దైవదూతల నుంచి దొంగలిస్తారు , దానిని ఈ జ్యోతిష్యులు, కాహిన్ లకు చెవిలో కోడికూత మాదిరిగా చెప్తారు. తర్వాత వాళ్ళు ఆ ఒక్క మాటలో వంద అబద్ధాలు కలిపి చెప్తారు. ( బుఖారి, ముస్లిం)
కాహిన్ లకు మానవులతో పాటు ఉండే జిన్నాతులకు సంబంధం ఉంది అని చెప్పటానికి ఇది ఒక ఆధారం, ఎందుకంటే ప్రతి మానవుడుతో పాటు ఒక జిన్ నియమిత ఉంటాడు. అతను మానవుడికి చెడు వైపుకు ఆహ్వానిస్తూ ఉంటాడు. ఈ జిన్ ఆ వ్యక్తి యొక్క ప్రతి రహస్యాన్ని ఎరిగి ఉంటాడు, ఏదైతే ఇతర ప్రజలకు తెలియవో. ఉదాహరణకు: ఒక వ్యక్తి యొక్క ఏదో ఒక వస్తువు తప్పిపోతే ఆ వ్యక్తితో పాటు ఉండే జిన్ కి ఆ ప్రదేశము తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఎల్లప్పుడూ ఆ వ్యక్తితోనే ఉంటాడు కాబట్టి. ఒకవేళ ఈ వ్యక్తి కాహిన్ ను సంప్రదిస్తే ఆ తప్పిపోయిన వస్తువు గురించి ప్రశ్నిస్తే ఆ జిన్ ఆ కాహిన్ కి ఆ వస్తువు ఒక ప్రదేశం గురించి తెలియజేస్తాడు. తర్వాత కాహిన్ ఆ ఒక్క మాటతో 100 అబద్ధాలు కలిపి ఆ వ్యక్తికి ఆ ప్రదేశము తెలియజేస్తాడు. చివరికి ఆ వ్యక్తి పోగొట్టుకున్న వస్తువుని పొందిన తర్వాత ఆ కాహిన్ చెప్పిన ప్రతి మాట నిజమే అని భావిస్తాడు, మరియు అతను అగోచర జ్ఞానం కలిగి ఉన్నాడని నమ్ముతాడు. వాస్తవానికి ఆ కాహిన్ ఆ జిన్ను నుంచి విన్న విషయాన్ని అతనికి చెప్పి ఉంటాడు, ఉదాహరణకు: ఒక వ్యక్తి తన భార్యతో చెప్పుకున్న విషయాలు, వాళ్ల తల్లి పేరు, ఊరు పేరు, ఇంటి అడ్రస్సు, వాళ్ళు చేసే పని, ఇంకా ఆ జిన్ కి , ఆ వ్యక్తికి సంబంధించి తెలిసిన విషయాలన్నీ కూడా మొదలైనవి.
అల్లాహ్ దాసులారా! కాహిన్ ఏ షైతాన్ని అయితే సంప్రదిస్తాడో అతను షైతాన్ నుంచి సేవలు తీసుకుంటాడు. దానికి బదులు ఆ కాహిన్ అతన్ని ఆరాధిస్తాడు. షైతాన్ లక్ష్యం కూడా ఇదే. షైతాన్ పూర్తి ఆదం సంతతిని మార్గ భ్రష్టత్వానికి గురి చేయడానికి లక్ష్యం చేసుకున్నాడు. ఇంకా ఇదే అతని పని మరియు ఇదే అతని సందేశము. అతని వలలో జ్యోతిష్యులు, చేతబడి చేసే వాళ్ళు కాహిన్ అందరూ చిక్కుకుంటారు, వీళ్ళు మానవుల్లో ఉన్న షైతానులు అయితే అతను జిన్నాతుల నుంచి షైతాన్. ఈ షైతాన్లు అందరు కలిసి మానవాళిని అపమార్గం పట్టిస్తారు. (అల్లాహ్ మనందరినీ ఈ షైతాన్లు నుంచి కాపాడుగాక)
అల్లాహ్ దాసులారా! ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరైతే షరియత్ లో చెప్పిన రుఖ్యా ద్వారా వ్యాధులను నిర్మూలిస్తారో వాళ్లకు ఆ కాహిన్ చేసే నాటకాలు తెలిసికొని ఉంటారు. వాళ్ళల్లో ఒక్కరు చెప్పిన విషయం ఏమిటంటే: మీరు కాహిన్ రహస్యాన్ని ఛేదించడం అనుకుంటున్నారు అయితే: “మీకు కూడా తెలియని ఒక విషయము ఆ కాహిన్ ని అడగండి, ఎందుకంటే మీకు తెలియని విషయం కూడా మీతో పాటు ఉన్న జిన్ కి కూడా తెలియదు, కనుక ఆ కాహిన్ కి కూడా తెలియకుండా పోతుంది. ఉదాహరణకు నేలపై నుంచి కొన్ని కంకర రాళ్లు తీసుకోండి, మీ పిడికిలను మూసేసి, తర్వాత కాహిన్ను ప్రశ్నించండి, నా చేతిలో ఎన్ని రాళ్లు ఉన్నాయని, అతను దానికి సమాధానం ఇవ్వలేడు, మీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు, ఎందుకంటే ఈ విషయము, ఈ సమాధానము మీతో పాటు ఉన్న జిన్ కి కూడా తెలియదు, అలాంటప్పుడు ఆ కాహిన్ ఏం సమాధానం ఇస్తాడు? .
సారాంశం ఏమిటంటే: కాహిన్ తమ అన్ని వ్యవహారాలలో జిన్నాతులను ఆశ్రయిస్తాడు,సహాయం తీసుకుంటాడు. అన్ని సంఘటనలు, సమాచారాన్ని తెలుసుకోవడానికి షైతాన్ ను ఆశ్రయిస్తాడు. షైతాన్ ఆ కాహిన్ చెవిలో కొన్ని విషయాలు ఊదుతాడు, దానినీ ఆధారంగా చేసుకొని అనేక విషయాలు కలిపి ప్రజలకు తెలియజేస్తారు. ఒకవేళ చెప్పిన మాట నిజమైతే ప్రజలు ఆ కాహిన్ ని అగోచర జ్ఞాని అనుకుంటారు, ఇలా అతని వలలో చిక్కుకుంటారు. ప్రజలు అజ్ఞానంలో దాన్ని మహిమలు (కరామాత్) అనుకొని వీళ్ళు ఔలియా అల్లాహ్ (అల్లాహ్ స్నేహితులు) అనుకుంటున్నారు. వాస్తవానికి వాళ్ళు ఔలియా ఉష్ షైతాన్ (షైతాన్ స్నేహితులు), ఎలాగైతే అల్లాహ్ ఖుర్ఆన్ లో సూరతుష్ షుఅరా లో ఇలా తెలియజేశారు:
(ప్రజలారా!) షైతానులు ఎవడిపైన దిగుతారో నేను మీకు తెలుపనా? అబద్దాలకోరు, పాపాత్ములైన ప్రతి ఒక్కరిపై వారు దిగుతారు. విని వినని కొన్ని మాటలు చెవుల్లో వేస్తారు. వారిలో అనేకులు అబద్ధాలు చెప్పేవారే (26: 221,-226)
తౌహీద్ ప్రజలారా: నుజూమి కూడా అగోచర జ్ఞానం కలిగి ఉన్నాడని ప్రకటిస్తాడు. నుజూమి అంటే: నక్షత్రాలను చూసి భవిష్యతులొ సంభవించే సంఘటనాల జ్ఞానాన్ని సేకరించేవాడు. ఉదాహరణకు: గాలి వీచే సమయము , వర్షం కురిసే సమయం, చలికాలం, వేసవి కాలము మరియు ధరలు మారే జ్ఞానము. వాళ్ళు చెప్పే విషయం ఏమిటంటే : ఆకాశంలో నక్షత్రాలు తిరిగే , కలిసే సమయాల్లో దానిని చూసి వీళ్ళు ఈ విషయాలు తెలియజేస్తారు. మరియు నక్షత్రాలు భూమండలంపై ప్రభావితమై ఉంటాయి అంటారు, దీనిని “ఇల్మె తాసీర్” అంటారు , మరియు దీని గురించి ప్రచారం చేసుకునే వాడ్ని ‘జ్యోతిషి” అని అంటారు. వాళ్లు నక్షత్రాలను చూసి, వాళ్లతో మాట్లాడేటప్పుడు షైతాన్ వాళ్లకు చెప్పాలనుకున్న విషయాన్ని చిత్ర రూపంలో చూపిస్తాడు, దాని ద్వారా వాళ్ళు ప్రజలకు ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటారు. (ఇవన్నీ వ్యర్థమైన విషయాలు)
అల్లాహ్ దాసులారా! ఇల్మే నుజూమ్ లో ఓ భాగం: ఆకాశంలో తిరిగే నక్షత్రాలు మరియు అబ్జద్ అక్షరాల (అరబీ ఆల్ఫాబెట్స్) ద్వారా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను తెలియజేయడం కూడా ఉంది, ఇబ్నే అబ్బాస్ (రదియల్లాహు అన్హు) గారు చెప్పిన మాటకు ఇదే అర్థము: ఒక జాతి వారు అబూజాద్ (అరబీ ఆల్ఫాబెట్స్) లను ఉపయోగించి , నక్షత్రాలను చూసి ఇలా భవిష్యవాణిలను చెప్పేవాళ్లు నా ఉద్దేశ ప్రకారం వాళ్లు పరలోకంలో ఏం భాగాన్ని పొందలేరు. (ఏ ప్రతిఫలం దక్కడు) .
( దీనినీ అబ్దూర్రజ్జాక్ వారు ముసన్నఫ్ అనే గ్రంథంలో పేర్కొన్నారు , ఇమామ్ బైహకిఖీ వారు కూడా పేర్కొన్నారు)
ఇల్మే నుజూమ్ లోని ప్రదర్శనలో ఇంకో భాగం జ్యోతిష్య శాస్త్రవేత్తలు (Astrologers), వీళ్ళు మానవ భవిష్యత్తులో సంభవించే విషయాలను తెలుసుకున్నారని మరియు దానిని వార్తల్లో , మ్యాగజైన్స్ లోప్రచారం చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసే వాదన ఏమిటంటే : ఎవరైతే బిర్జ అక్రబ్ నక్షత్రము మెరిసే సమయంలో పుడతాడో , జన్మించాడో, అతని తలరాత మంచిది కాదని మరి ఎవరైతే “బిర్జ్ మిజాన్” నక్షత్రము మెరిసే సమయంలో జన్మిస్తాడో వాడు మంచి అదృష్టం గలవాడు అని భావించడం మొదలైనవి.
అల్లాహ్ దాసులారా! ఇల్మే నుజూమ్ కూడా చేతబడి కిందే పరిగణించడం జరుగుతుంది. ఈ రెండిటి మధ్య సమానమైన విషయం ఏమిటంటే : షైతాన్ నుండి సంప్రదింపులు, సంబంధాలు, దాని ఆధారము ఇబ్నె అబ్బాస్ వారి ఉల్లేఖనము, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైతే ఇల్మే నుజూమ్ నేర్చుకున్నాడో అతను చేతబడిలో ఒక భాగాన్ని నేర్చుకున్నట్టే , కనుక ఆ భాగాన్ని పెంచుకునే వాళ్ళు పెంచుకోండి. (సహీ ముస్లిం)
ఇల్మే నుజూమ్ ను ఇల్మే తాసీర్ అంటారు. అంటే: నక్షత్రాల ప్రసరణ వలన (నక్షత్రాలు తిరగటం వలన) దాని ప్రభావం భూమండలంపై పడుతుంది. అంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాట “అతను జాదులో (చేతబడిలో) ఒక భాగాన్ని నేర్చుకున్నాడు” కు అతను చేతబడిలోని ఒక రకానికి గురయ్యాడు అని అర్థం. మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాట “అందులో ఎవరైతే తమ భాగాన్ని పెంచుకోవాలనుకుంటున్నారో పెంచుకోండి” అంటే అర్థము ఎవరైతే ఖగోళ జ్యోతిష శాస్త్ర జ్ఞానాన్ని నేర్చుకుంటాడో అతను అదే విధంగా చేతబడి విద్యను నేర్చుకున్నాడు, దాన్ని ఇంకా పెంచుకుంటున్నాడు.
అల్లాహ్ దాసులారా! ఇస్లాం ధర్మం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మంచి శకునము తీసుకునే ఆజ్ఞ ఇస్తుంది. మరియు మానవుడికి చేసే మార్గదర్శకాలు ఎలా ఉంటాయి అంటే: అందులో ఇహ పరలోకాలా సాఫల్య రహస్యం దాగి ఉంటుంది. షిర్క్, బహు దైవారాధన, పాపాలు, మోసాలు, అబద్ధాల ను నివారిస్తుంది . అందుకే ఇస్లాం షైతాన్ చేష్టలను, మార్గాలను ముందు నుంచే ఆరికట్టింది. కనుక కాహిన్ల వద్దకు వెళ్లటాన్ని నిషేధం చేసింది. మరియు జ్యోతిష్యులు చెప్పే వాళ్ళ వద్దకు వెళ్లే వాళ్ళ విషయంలో కఠినంగా చర్యలు తీసుకోవడం జరిగినది. ఆ కాహిన్ల వద్దకు ప్రశ్నించడానికి వెళ్లినా సరే. ఇమామ్ ముస్లిం వారు ప్రవక్త గారి సతీమణి సఫీయహ్ (రదియల్లాహు అన్హా) వారితో ఉల్లేఖించారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారు అన్నారు: ఏ వ్యక్తి అయితే అగోచారవిషయాలను చెప్పేవాడి (జ్యోతిష్యుడు) వద్దకు వెళ్లి అతన్ని ఏ విషయంలోనైనా ప్రశ్నించినా, లేదా అతను చెప్పిన మాటను నమ్మినా నలభై (40) రోజుల వరకు అతను చేసిన నమాజులు స్వీకరించబడవు (ఆమోదకరమైనవి కావు). (సహీ ముస్లిం)
ఏ వ్యక్తి అయితే జ్యోతిష్యుల వద్ద కాహిన్ వద్ద వెళ్లి అతన్ని ఏదైనా విషయంలో ప్రశ్నించాడు, కానీ దానికి ఇవ్వబడిన సమాధానాన్ని నమ్మలేదు, అలాంటి వ్యక్తి యొక్క 40 రోజులు నమాజు స్వీకరించబడవు అనే విషయం ఈ హదీస్ ద్వారా స్పష్టమవుతుంది. ఆ వ్యక్తి కాఫిర్ అవ్వడు (ఎందుకంటే ఇవ్వబడిన సమాధాన్ని స్వీకరించలేదు ‘నమ్మలేదు’ కాబట్టి). అందువల్ల అతను ఇస్లాం నుంచి బహిష్కరించబడడు.
కానీ! ఏ వ్యక్తి అయితే ఆ కాహిన్ వద్దకు వెళ్లి ఏ విషయంలోనైనా అతన్ని ప్రశ్నించి మరియు అతను ఇచ్చిన సమాధానాన్ని సత్యమని నమ్మితే అలాంటి వ్యక్తి ఇస్లాం పరిధిలో నుంచి బహిష్కరించబడినట్టే. ఎందుకంటే అతను ఏదో ఒక విషయాన్ని నమ్మిన తర్వాతే కాహిన్ అగోచర జ్ఞాని అని విశ్వసించినట్టవుతుంది. మరియు అల్లాహ్ కు అంకితమైన ఈ అగోచర జ్ఞానం విషయంలో ఆ కాహిన్ ను సాటి నిలబెట్టినట్టే అవుతుంది. మరి ఇలాంటి వ్యక్తి ఖుర్ఆన్ లో ఇవ్వబడ్డ విషయాలను తిరస్కరించినట్టు. మరియు కుఫ్ర్ కి పాల్పడినట్లు అవుతుంది. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు ) వారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు : “ఏ వ్యక్తి అయితే కాహిన్ వద్దకు వెళ్లి , అతను చెప్పిన సమాచారాన్ని సత్యమని విశ్వసిస్తే అతను ప్రవక్త పై అవతరించబడ్డ ధర్మాన్ని (షరియత్) ను తిరస్కరించినట్టే“. (మస్నద్ అహ్మద్)
హజరత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను. “శకునము తీయువాడు, తీయించువాడు, గుప్తవిద్య చేయువాడు, చేయించువాడు, జాదు చేయువాడు, చేయించువాడు మనలోలేరు (అంటే ఇస్లాంలో లేరు). ఏ వ్యక్తి అయినా గుప్త విద్య చేయువాని వద్దకు వెళ్ళి అతడు చేప్పిన మాటలను ధృవీకరించిన ఎడల అతడు మతమును నిరాకరించిన వాడవుతాడు” (దీనిని ఉత్తమ సనద్ బజ్జార్ ఉల్లేఖించెను)
అల్లాహ్ దాసులారా! ఈ కాహిన్, జ్యోతిష్యుల కార్యకలాపాలు సూఫీల వద్దనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ గురువులు కాహిన్లు లేదా అర్రాఫ్ (జ్యోతిష్యులు) అయి ఉన్నారు. వాళ్ళ గురువులు, విలాయత్ పొంది ఉన్నారు (వలి అని) కరమాత్ (మహిమలు) తెలుసు అని ప్రకటిస్తూ ఉంటారు. మరియు అగోచర జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తులు మత్రమే విలాయాత్ మరియు కరామాత్ చేస్తారు అనీ వాళ్ళ నమ్మకం, దాన్ని వాళ్ళు కష్ఫ్ (నేరుగా అల్లాహ్ తో మాట్లాడటం) అనే పేరు పెట్టారు, (ఒకవేళ వాళ్ళు దీనికి అగోచర జ్ఞానం అని పేరు పెడితే ప్రజల ముందు అవమాన పాలవుతారని ఈ విధంగా పేర్లు మార్చారు )
అల్లాహ్ దాసులారా! కహానత్ నిషేధము అని మరియు కాయిన్ల వద్దకు వెళ్ళటము అవిశ్వాసము అని స్పష్టం చేయడానికి ఇది చాలా లాభకరమైన విషయ సూచిక. కాహిన్ జ్యోతిష్యము చేసినా, చేయించినా, ఈ విద్యను నేర్చుకున్న లేదా మనసులో దానికి సంబంధించి ఇష్టం కలిగి ఉన్న సరే ఇవన్నీ అవిశ్వాస పూరితమైన ఆచరణ.
అల్లాహ్ మనందరికీ ఖురాన్ యొక్క శుభాలతో, ఆశీర్వాదాలతో దీవించును గాక. అల్లాహ్ మనందరినీ వివేకంతో, హితోపదేశంతో కూడిన వాక్యాల ప్రకారం ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు గాక. నేను నా కొరకు మీ కొరకు అల్లాహ్ నుంచి క్షమాపణ వేడుకుంటున్నాను. మరియు మీరు కూడా ఆయన నుంచి క్షమాపణ కోరండి. సందేహంగా ఆయన క్షమించేవాడు దయగలవాడు. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
రెండవ ఖుత్బా :
స్తోత్రాలు మరియు దరూద్ తరువాత …
అల్లాహ్ దాసులారా! ఆయన భీతి కలిగి ఉండండి. కాహిన్ ల చేష్టలలో “తరక్” అనేది కూడా ఒక భాగమే. దాని ద్వారా అరబ్ వాళ్లు అగోచర జ్ఞానాన్ని ఆర్జిస్తారన్న సంతోషంలో, భ్రమలో ఉండేవారు. తరక్ అంటే “నడవటం”. వాళ్లు నేలపై కొన్ని గీతలు గీస్తారు, ఆ గీత ద్వారా వాళ్ళు నడిచినట్టు భావించి, ఆ గీత ద్వారా అగోచర జ్ఞానం తెలిసింది అని వ్యక్తం చేస్తారు.
రమాల్ అనేది కూడా జ్యోతిష్యంలో పరిగణించడం జరుగుతుంది. ఈ పద్ధతి ఎలా అంటే: ఓ వ్యక్తి తమ చేతులారా ఇసుకపై కొన్ని గీతలు గీసి, దాని ద్వారా ఆ గోచర జ్ఞానం ప్రకటిస్తాడు.
కహానత్ లో (జ్యోతిష్యంలో) రాళ్లతో కొట్టడం కూడా ఒక భాగమే, ఇది ఎలా అంటే ఎవరైనా వ్యక్తి వచ్చి ఏదో ఒక సంఘటన గురించి ప్రశ్నిస్తే ఈ జ్యోతిష్యుడు తమ వద్ద ఉన్న ఆ చిన్న చిన్న కంకర రాళ్ళను తీసి ఆ రాళ్ల పై కొట్టి దాని ద్వారా ఆ వ్యక్తి అడిగిన సమస్యకు పరిష్కారం సమాధానం తెలుసుకుంటాడు.
కహానత్ లో ఫింజాన్ (కప్పు, Cup) చదవటము కూడా భాగమే, ఇది ఎలా అంటే: వ్యక్తి కప్పులో కాఫీ తాగిన తర్వాత మిగిలిన దానిపై ఆ మాంత్రికుడు తమ దృష్టిని కేంద్రీకరిస్తాడు , దాని చుట్టుపక్కల కొన్ని గీతలు గీసి, దాని ద్వారా అగోచర జ్ఞానం కలిగిందని, వచ్చిన వాళ్లకు సమస్యలకు పరిష్కారం చెప్పటము ఇలా చేస్తా ఉంటారు,
ఈ కహానత్ లో చేతి రేఖలను చదివి చెప్పటం కూడా భాగ్యమే , అది ఎలా అంటే : జ్యోతిష్యుడు కాహిన్లు చేతి రేఖలను: అడ్డంగా నిలువుగా కలిసి ఉన్నరేఖలను చూసి ప్రజలకు ఇలా ఇలా జరగనున్నది అని చెప్తారు.
ఇక కహానత్లో “అయాఫా” (పక్షుల ద్వారా శకునం తీయడం) కూడా భాగమే దాని పద్ధతి ఏమిటంటే: పక్షులను గాలిలో వదిలి అవి ఒకవేళ కుడివైపు ఎగిరితే మంచి శకునం లేదా ఎడమవైపు ఎగిరితే చెడు జరుగుతుంది అని శకునాలను తీస్తారు. ఖచ్చితంగా అయాఫా కూడా అధర్మమైన పద్ధతే. ఎందుకంటే పక్షులు అల్లాహ్ యొక్క సృష్టితాలు. వాటిలో మేలు గాని చెడు గాని చేసే శక్తి ఉండదు. అల్లాహ్ యే వాళ్ల పోషకుడు, పాలకుడు. అల్లాహ్ ఈ విధంగా తెలియజేశారు:
శూన్యాకాశంలో ఆజ్ఞాబద్ధులై ఉన్న పక్షులను వారు చూడలేదా? అల్లాహ్ తప్ప వాటిని ఆ స్థితిలో నిలిపి ఉంచేవారెవరూ లేరు. నిశ్చయంగా విశ్వసించేవారి కోసం ఇందులో గొప్ప సూచనలున్నాయి. (సూరా అన్ నహ్ల్ 16: 79)
ఏమిటీ, వీరు తమపై రెక్కల్ని చాచుతూ, (ఒక్కోసారి) ముడుచుకుంటూ ఎగిరే పక్షుల్ని చూడటం లేదా? కరుణామయుడు (అయిన అల్లాహ్) తప్ప వాటిని ఆ స్థితిలో ఎవరూ నిలిపి ఉంచటం లేదు. నిశ్చయంగా ప్రతి వస్తువు ఆయన దృష్టిలో ఉంది. (సూరా అత్ తహ్రీం 67 : 19)
ఈ కహానత్ (జ్యోతిష్యం) లో శకునం కూడా భాగమే. అవి కంటికి కనిపించేవే అయినా సరే, లేదా వినేటటువంటి నుంచి అయినా సరే. అంటే పావురాలను ఎగిరిపించి శకునాలు తీయటము లేదా ఇంటిపై కూర్చున్న గుడ్లగూబను చూసి శకునము తీయటము, లేదా పదమూడవ (13వ) అంకె నుంచి, మెల్లకన్ను ,కాళ్లు లేనివాడు నుంచి శకునము తీయటము, ఉదాహరణకు: “మెల్లకన్ను కలిగి ఉన్న వ్యక్తిని చూసి ఇలా అనటం “ఈరోజు మొత్తం దరిద్రంగా ఉంటుంది, మంచి జరగదు”. కనుక అతను వ్యాపారం మూసేసి, ఆరోజు మొత్తం కొనటము అమ్మటముగాని చేయకుండా ఉండటము, బహుశా అతనికి ఆరోజు చెడు, కీడు జరుగుతుంది అని, ఆపద విరుచుకు పడుతుందని తెలిసిపోయినట్టు. ఇంకా ఒక వ్యక్తి కుడి చేయి అరచేతిలో దురద పుట్టితే అలా జరుగుతుందని లేదా ఎడమ చేయి అరిచేతిలో దురద పుడితే ఇలా జరుగుతుందని భావించటం ఇంకా మొదలైనవి. వీటన్నిటిలో ఏ ఒక్కటి లో కూడా అల్లాహ్ చెడును, హానిని పెట్టలేదు. కానీ ప్రజలు వాటి నుంచి శకునాలను తీస్తున్నారు, చెడు జరుగుతుందని భావిస్తున్నారు. ఆ రోజులను కీడులా భావించుకుంటున్నారు. దీనికి అర్థం ఏమిటంటే: ఆ రోజు ఏం జరుగుతుందో దాన్ని తెలుసుకొని, అల్లాహ్ కు తెలిసిన అగోచర విషయంలో అల్లాహ్ కు సాటిగా నిలిచాడు. దీని కొరకు వాళ్ళు అసమర్థమైన విషయాలను కారణాలుగా చేస్తున్నారు.
శకునం తీయడం అనేది హారాం, ఇంకా షిర్క్ కూడా. దీనికి ఆధారం అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వారి ఉల్లేఖనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా వివరించారు: “ఎవరి శకునము అతనికి తమ అవసరాలను తీర్చకుండా ఆపేసిందో అతను షిర్క్ చేసినట్టు, దానికి సహాబాలు అడిగారు “దానికి పరిహారం ఏమిటి “? దానికి ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:
( اللهم لا خير إلا خيرك، ولا طير إلا طيرك، ولا إلـٰه غيرك )
ఓ అల్లాహ్ నువ్వు ప్రసాదించిన మేలు కన్నా మరో మేలు ఏదీ లేదు, నువ్వు నియమించిన శకునము కన్నా మరో శకునము లేదు, మరియు నీవు తప్ప మరో ఆరాధ్యుడు లేడు (అహ్మద్)
శకునం హరాం అనడానికి ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) గారి ఈ హదీస్ కూడా మనకు ఆధారం : వ్యాధి తనంతట తానే వ్యాపించడం, శకునం తీయటము, మరియు గుడ్లగూబ వల్ల కీడు, సఫర్ మాసం వల్ల శకునం ఇలాంటివి ఏమీ లేవు (అన్ని వ్యర్ధ మాటలే) ( బుఖారి)
ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) మాట “శకునం లేదు”- దీనివల్ల శకునాలు ఏమీ లేవు అన్న మాట పూర్తిగా స్పష్టమవుతుంది.
సారాంశము ఏమిటంటే : కహానత్ “జ్యోతిష్యం”లో చాలా రకాలు ఉన్నాయి, కానీ అన్ని రకాలలో సమాంరతమైన విషయము ఏమిటంటే అది “అగోచర జ్ఞానం ప్రకటన“. పద్ధతులు వేరేగా ఉంటాయి, అందులో కొన్ని షైతానులతో సంబంధం ఉంటుంది, మరికొందరు కేవలం ఉట్టిగా ప్రకటనలు చేస్తారు, దాని ద్వారా ప్రజలను మోసం చేస్తారు, తమ వలలో పడేసుకుంటారు. అల్లాహ్ మనందరినీ వీళ్ళ నుంచి కాపాడుగాక.
ముగింపు ప్రసంగం :
మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అల్లాహ్ మిమల్ని గొప్ప సత్కార్యాన్ని గురుంచి ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశం:
నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి. – (33: 56)
اللهم صل وسلم على عبدك ورسولك محمد، وارض عن أصحابه الخلفاء، الأئمة الحنفاء، وارض عن التابعين ومن تبعهم بإحسان إلى يوم الدين.
ఓ అల్లాహ్! మాకు ప్రపంచంలో మేలును, పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు. మరియు నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు. ఓ అల్లాహ్! మన హృదయాలను కపటం నుంచి, మన ఆచరణను ప్రదర్శన బుద్ధి నుంచి మరియు మా చూపులను ద్రోహం నుంచి కాపాడుగాక .
ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయపడుతున్నాము, మరియు ఆ స్వర్గంలోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము.మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము మరియు నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి నీ శరణు కోరుకుంటున్నాము.
ఓ అల్లాహ్! ఇహపరలోకాల సర్వ మేలును ప్రసాదించు, ఆ మేలు మాకు తెలిసిన తెలియకపోయినా మరియు ఇహ పరలోకాల చెడు నుంచి మమ్మల్ని రక్షించు ఆ చెడు మాకు తెలిసిన తెలియకపోయినా. ఓ అల్లాహ్! నీ అనుగ్రహాలు మా నుండి తొలగిపోవటాన్ని గురుంచి, ఆరోగ్యం పోవటం నుంచి, నీ శిక్షల నుంచి, నీ ఆగ్రహానికి గురికాకుండా మనల్ని రక్షించు, కాపాడు.
ఓ అల్లాహ్ మాకు ప్రపంచంలో పుణ్యాన్ని ప్రసాదించు, పరలోకంలో మేలును ప్రసాదించు, మమ్మల్ని నరక శిక్ష నుండి కాపాడు.
اللهم صل على نبينا محمد وآله وصحبه وسلِّم تسليما كثيرا.
—
పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ అనువాదం: అబ్దుల్లాహ్ జామయి
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ తప్ప ఇతరులతో శరణు కోరుట షిర్క్ – ఏకత్వపు బాటకు సత్యమైన మాట వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/VqNlWM-JI88
అల్లాహ్ ఆదేశం:
وَأَنَّهُۥ كَانَ رِجَالٌۭ مِّنَ ٱلْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍۢ مِّنَ ٱلْجِنِّ فَزَادُوهُمْ رَهَقًۭا “మానవులలో కొందరు జిన్నాతులలో కొందరిని శరణు వేడుతుండేవారు. ఈ విధంగా వారు జిన్నాతుల గర్వాన్ని మరింత అధికం చేశారు“. (72: జిన్న్: 6).
ఖవ్ లా బిన్తె హకీం కథనం: ప్రవక్త ﷺ ఇలా ఆదేశించగా నేను విన్నాను:
“ఎవరైనా ఒక స్థలంలో చేరిన తరువాత “అఊజు బికలిమా తిల్లాహి త్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్” చదివినచో వారికి ఆ స్థలం నుండి వెళ్ళే వరకు ఏ హాని కలగదు“. (ముస్లిం).
ముఖ్యాంశాలు:
1. కొందరు మనుషులు జిన్నాతుల శరణు కోరేవారు అని సూరె జిన్న్ వాక్యంలో తెలిసింది.
2. అది షిర్క్ అని తెలిసింది.
3. పైన పేర్కొనబడిన హదీసుతో కూడా అల్లాహ్ తో మాత్రమే శరణు వేడాలని తెలిసింది. అల్లాహ్ వాక్కు (కలిమ), ఆయన గుణమని, సృష్టిరాశి కాదు అని తెలిసింది. ఒక వేళ సృష్టి అయి ఉంటే ప్రవక్త వాటిద్వారా శరణు కోరేవారు కాదు. ఎందుకనగా సృష్టితో శరణు కోరుట షిర్క్.
4. పైన తెలుపబడిన దుఆ చిన్నది అయినప్పటికి దాని ఘనత, లాభం చాలా వుంది.
5. ఓ సందర్భంలో ఒక క్రియ, పని ద్వారా ఏదైనా ప్రాపంచిక లాభం కలిగితే, లేక కష్టం, నష్టం దూరమైతే అది షిర్క్ కాదు అనటానికి అది ప్రమాణం కాదు. (దేనితో లాభం కలిగిందో అదే స్వయం షిర్క్ కావచ్చు. అందుకు ఏది షిర్కో, ఏది షిర్క్ కాదో అనేది ఖుర్ఆన్, హదీసుల ద్వారా తెలుసుకోవాలి).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. ఆయన ఎల్లప్పుడు మిమ్మల్ని చూస్తున్నాడనే భావన కలిగి ఉండండి. ఆయనను అనుసరించండి మరియు ఆయన అవిధేయత నుండి దూరంగా ఉండండి.
అల్లాహ్ పై విశ్వాసం కొరకు నాలుగు విషయాలపై విశ్వాసం తప్పనిసరి అని తెలుసుకోండి: అల్లాహ్ సుబ్ హానహు వతఆలా[1] యొక్క ఉనికి పై విశ్వాసం, ఆయన రుబూబియత్[2] పై విశ్వాసం, ఆయన ఉలూహియత్[3] పై విశ్వాసం. ఆయన శుభ నామములు, ఉత్తమ గుణాలపై విశ్వాసం.
ఈ ఖుత్బాలో మనం అల్లాహ్ యొక్క రుబూబియత్ పై విశ్వాసం గురించి చర్చించుకుందాం.
అల్లాహ్ దాసుల్లారా! అల్లాహ్ యొక్క రుబూబియత్ పై విశ్వాసం అంటే ఏకైకుడైన అల్లాహ్ మాత్రమే రబ్ అని, ఆయనకు సహవర్ధులు గానీ, సహాయకులు గానీ ఎవ్వరూ లేరని విశ్వసించటం. రబ్ అంటే: ఆయనకు సృష్టించే శక్తి ఉంటుంది, ఆయనే ప్రతీ దానికి యజమాని, ఆయన ఆజ్ఞ మాత్రమే చెల్లుతుంది అంటే ఆయన ఆజ్ఞతో విశ్వ వ్యవహారాలు నిర్వహించ బడతాయి. ఆయన తప్ప మరో సృష్టికర్త లేడు, ఆయన తప్ప మరో యజమాని లేడు, ఆయన తప్ప ఆజ్ఞాపించేవాడు మరొకడు లేడు. సృష్టించడంలో తానే అద్వితీయుడు అల్లాహ్ చాలా స్పష్టంగా తెలిపాడు:
أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ (వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు.) (ఆరాఫ్:54)
الْحَمْدُ لِلَّهِ فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ (సర్వస్తోత్రాలు (శూన్యంలో నుంచి) ఆకాశాలను, భూమిని సృష్టించిన అల్లాహ్‌కే శోభిస్తాయి.) (ఫాతిర్:1)
ఓ విశ్వాసులారా! అల్లాహు తఆలా సృష్టించిన పూర్తి సృష్టిలో అన్నింటి కంటే గొప్పవి ఈ పది సృష్టితాలు: ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, రాత్రి, పగలు, మానవుడు, జంతువులు, వర్షము మరియు గాలులు. అల్లాహు తఆలా దివ్య ఖుర్ఆన్ లో అనేక చోట్ల తమ సృష్టి గురించి ప్రస్తావిస్తూ తమను తాము పొగుడుకున్నాడు, ప్రత్యేకంగా కొన్ని సూరాల ప్రారంభ ఆయతుల్లో. ఉదా: సూరతుల్ జాసియా లో ఇలా సెలవిచ్చాడు:
(హామీమ్ * ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడు, వివేచనా పరుడైన అల్లాహ్ తరఫున జరిగింది * నిశ్చయంగా ఆకాశాలలో, భూమిలో విశ్వసించిన వారి కోసం ఎన్నో సూచనలున్నాయి. స్వయంగా మీ పుట్టుకలోనూ, ఆయన సర్వవ్యాప్తం చేసే జంతువుల పుట్టుకలోనూ నమ్మే జనుల కొరకు సూచనలున్నాయి * రేయింబవళ్ళ రాకపోకలలోనూ, అల్లాహ్ ఆకాశం నుంచి ఉపాధిని (వర్షం రూపంలో) కురిపించి, భూమిని చచ్చిన పిదప బ్రతికించటంలోనూ, వాయువుల మార్పులోనూ బుద్ధీజ్ఞానాలు గలవారికి పలు సూచనలున్నాయి.) (జాసియా:1-5).
యాజమాన్యంలో అల్లాహ్ ఏకైకుడని చెప్పడానికి గల ఆధారం, అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:
(ఇంకా ఇలా చెప్పు: ”ప్రశంసలన్నీ అల్లాహ్‌కే శోభిస్తాయి. ఆయన ఎవరినీ సంతానంగా చేసుకోలేదు. తన విశ్వ సామ్రాజ్యంలో ఆయనకు భాగస్వాములెవరూ లేరు. ఒకరి సహాయ సహకారాలపై ఆధారపడటానికి ఆయన ఏ మాత్రం బలహీనుడు కాడు. కాబట్టి నువ్వు ఆయన గొప్పదనాన్ని ఘనంగా కీర్తిస్తూ ఉండు.”) (ఇస్రా:111)
(ఈ అల్లాహ్‌యే మీ ప్రభువు. విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయన్ని వదలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు.) (ఫాతిర్:13)
ఆజ్ఞాపించటంలో (మరియు విశ్వ వ్యవహారంలో) అల్లాహ్ ఒక్కడేనని చెప్పడానికి ఈ ఆయతు ఆధారము.
أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ (వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు.) (ఆరాఫ్:54)
మరో ఆధారం:
إِنَّمَا قَوْلُنَا لِشَيْءٍ إِذَا أَرَدْنَاهُ أَنْ نَقُولَ لَهُ كُنْ فَيَكُونُ (మేము దేన్నయినా చేయాలని సంకల్పించుకున్నప్పుడు ‘అయిపో’ అని అంటే చాలు, అది అయిపోతుంది). (నహ్ల్:40)
ఓ ముస్లిములారా! ఆజ్ఞలు రెండు రకాలు: 1. షరీఅత్ పరమైన ఆజ్ఞ. 2. విశ్వపరమైన ఆజ్ఞ. షరీఅత్ ఆజ్ఞల సంబంధం ధర్మశాస్త్రం మరియు ప్రవక్త తత్వాలతో ఉంటుంది. అయితే ఆ అల్లాహ్ ఒక్కడే తన వివేకముతో అవసరాలానుసారం ధార్మిక నియమ నిబంధనాలపై ఇవ్వాల్సిన ఆజ్ఞలు ఇస్తాడు, రద్దు చేయాల్సినవి రద్దు చేస్తాడు. ఆయనే మానవులకు వారి పరిస్థితులను సరిదిద్దే విధంగా తగిన షరీఅతును నియమించాడు మరియు ఆయన వద్ద స్వీకరించబడే ఆరాధనలను, ఆచరణలను చట్టబద్ధమైనవిగా చేసాడు. ఎందుకంటే ఆయనకు మానవుల పరిస్థితులు, వారి వ్యవహారాల గురించి తెలుసు మరియు ఆయన వారి పై కరుణించే కరుణామయుడు కూడాను.
అల్లాహ్ ఆజ్ఞ యొక్క రెండవ రకం విశ్వానికి సంబంధించినది. దీని సంబంధం విశ్వపరమైన వ్యవహారాలతో ఉంటుంది. కనుక మేఘాల కదలిక, వర్షాలు కురవడం, జీవన్మరణాలు, ఉపాధి మరియు సృష్టి, భూకంపాలు, ఆపదల తొలగింపు, విశ్వ సమాప్తం లాంటి అన్ని వ్యవహారాల ఆజ్ఞలు ఇచ్చేవాడు అల్లాహ్ ఒక్కడే. అందుకనే ఈ వ్యవహారాలలో అల్లాహ్ ఏ ఆజ్ఞ ఇచ్చినా అది జరిగే తీరుతుంది. దాని పై ఎవరూ ఆధిపత్యం పొందలేరు, దానిని ఎవరు తప్పించలేరు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
إِنَّمَا قَوْلُنَا لِشَيْءٍ إِذَا أَرَدْنَاهُ أَنْ نَقُولَ لَهُ كُنْ فَيَكُونُ (మేము దేన్నయినా చేయాలని సంకల్పించుకున్నప్పుడు ‘అయిపో’ అని అంటే చాలు, అది అయిపోతుంది.) (నహ్ల్:40)
అంటే ఏదైనా మేము జరపాలని అనుకుంటే కేవలం ఒకే ఒక్క మాట అంటాము, అదే: ‘కున్’ (అయిపో), అప్పుడు అది రెప్పపాటు సమయంలో జరిగిపోతుంది. అది జరగడానికి రెప్ప పాటు కూడా అలస్యం జరగదు.
సారాంశం ఏమిటంటే ఆజ్ఞలు రెండురకాలు: 1. విశ్వపరమైన ఆజ్ఞలు 2. ధర్మపరమైన ఆజ్ఞలు. దాని ప్రకారంగానే ప్రళయదినాన లెక్క తీసుకోవటం జరుగుతుంది.
అల్లాహ్ దాసుల్లారా! అల్లాహ్ యొక్క భయభక్తులు కలిగి ఉండండి.
ఈ సృష్టిలో అల్లాహ్ యొక్క రుబూబియత్ను తిరస్కరించే వారు కూడా ఉన్నారా? అంటే లేరు, కానీ గర్వం ఎవరి తలకెక్కిందో వారు తిరస్కరిస్తారు కాని నిజమైన నమ్మకంతో కాదు. ఉదాహరణకు ఫిరాఔన్ తమ జాతి వారితో ఇలా అన్నాడు :
أَنَا رَبُّكُمُ الْأَعْلَى (”నేనే మీ సర్వోన్నత ప్రభువును”) (నాజిఆత్: 24)
ఇంకా ఇలా అన్నాడు :
يَا أَيُّهَا الْمَلَأُ مَا عَلِمْتُ لَكُمْ مِنْ إِلَهٍ غَيْرِي (“ఓ ప్రముఖులారా! నేను తప్ప మీకు మరో దేవుడున్నాడన్న సంగతి నాకు తెలీదు.) (అల్ ఖసస్:38)
కానీ వాడు తన విశ్వాసం వలన ఇలా అనలేదు గర్వం, దౌర్జన్యం చేసే తత్వం వలన ఇలా అన్నాడు. అల్లాహ్ ఆదేశం చదవండి:
وَجَحَدُوا بِهَا وَاسْتَيْقَنَتْهَا أَنْفُسُهُمْ ظُلْمًا وَعُلُوًّا (నిజానికి వారి మనసులు (సత్యాన్ని) నమ్మినప్పటికీ అన్యాయం, అహంకారంతో వారు దాన్ని త్రోసిపుచ్చారు.) (నమ్ల్:14)
అల్లాహ్ మీపై కరుణించుగాక! తెలుసుకోండి! మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలోని అవిశ్వాసులు అల్లాహ్ యొక్క రుబూబియత్ను నమ్మేవారు. అంటే అల్లాహ్ యే సృష్టికర్త, ఉపాధి ప్రధాత, ఈ విశ్వాన్ని నడిపేవాడని విశ్వసించేవారు. అయినప్పటికీ వారు తమ ఆరాధనలో అల్లాహ్ తో పాటు విగ్రహాలను భాగస్వాములుగా చేసేవారు, వారి కోసం రకరకాల ఆరాధనలు చేసేవారు. ఉదా: దుఆ చేయడం, జంతుబలి ఇవ్వడం, మొక్కుబడులు చెల్లించటం మరియు సాష్టాంగ పడటం మొదలుగునవి. అందుకనే వారు తిరస్కారులు, అవిశ్వాసులయ్యారు. అల్లాహ్ యొక్క రుబూబియత్ను విశ్వసించినా వారికి ఎటువంటి లాభము చేకూరలేదు. ఎందుకంటే వారు తౌహీదె రుబూబియత్ను నమ్మడం వల్ల ఏ బాధ్యతలు ఉంటాయో వాటిని నమ్మలేదు; అదే తౌహీదే ఉలూహియత్. సర్వ ఆరాధనలకు ఏకైక అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమేనని విశ్వసించకుండా కేవలం రుబూబియత్ పై విశ్వాసం ఇస్లాంలో చేరడానికి సరిపోదు.
ప్రవక్త కాలంనాటి ముష్రికులు తౌహీదె రుబూబియత్ను మాత్రమే నమ్మేవారని అల్లాహ్ దివ్యఖుర్ఆన్ లో తెలిపాడు:
(“భూమి మరియు అందులో ఉన్న సమస్త వస్తువులు ఎవరివో మీకే గనక తెలిసి ఉంటే చెప్పండి?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. “అల్లాహ్‌వే” అని వారు వెంటనే సమాధానం ఇస్తారు. “మరయితే మీరు హితబోధను ఎందుకు గ్రహించటం లేదు?” అని అడుగు. “సప్తాకాశాలకు, మహోన్నతమైన (అర్ష్) పీఠానికి అధిపతి ఎవరు?” అని వారిని ప్రశ్నించు. “అల్లాహ్‌యే” అని వారు జవాబిస్తారు. “మరలాంటప్పుడు మీరెందుకు భయపడరు?” అని వారిని (నిలదీసి) అడుగు. సమస్త విషయాల సార్వభౌమత్వం ఎవరి చేతుల్లో ఉందో, శరణు ఇచ్చేవాడెవడో, ఎవరికి వ్యతిరేకంగా ఏ శరణూ లభించదో – ఆయనెవరో మీకు తెలిసి ఉంటే చెప్పండి? అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. “అల్లాహ్ మాత్రమే” అని వారు చెబుతారు. “మరైతే మీరు ఎలా మోసపోతున్నారు?” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.) (మూమినూన్:84-89)
అల్లాహ్ మీపై కరుణించుగాక!, తెలుసుకోండి! అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి ఆజ్ఞాపించాడు:
(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై సలాత్ (దరూద్) పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా ఆయనపై దరూద్ పంపండి, అత్యధికంగా ఆయనపై సలాములు పంపండి.) (అహ్ జాబ్:56).
ఓ అల్లాహ్ మా దేశాలలో భద్రతను ప్రసాదించు, మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గంపై నడిచే వారీగాచేయి.ఓ అల్లాహ్ మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్ మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు.ఓ అల్లాహ్ మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్మల్ని కాపాడు.
[1] ‘సుబ్ హానహు’ అంటే అన్ని లోపాలకు అతీతుడు. ‘తఆలా’ అంటే మహోన్నతుడు. [2]రుబూబియత్ అంటే పుట్టించడం, పోషించడం మరియు విశ్వ నిర్వహణ (నడపడం). [3]ఉలూహియత్ అంటే అన్ని రకాల ఆరాధనలు, భక్తిభావంతో చేసే పూజలు.
—
రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ అనువాదం: అబ్దుల్లాహ్ జామయి
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
وَمَآ أَنفَقْتُم مِّن نَّفَقَةٍ أَوْ نَذَرْتُم مِّن نَّذْرٍۢ فَإِنَّ ٱللَّهَ يَعْلَمُهُۥ “మీరేమి ఖర్చుపెట్టినదీ, మీరు మొక్కుబడి చేసుకున్నదీ, అంతా అల్లాహ్ కు తెలుసు“. (2: బఖర: 270).
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు: “అల్లాహ్ కు విధేయత చూపాలని మొక్కుబడి చేసిన వ్యక్తి విధేయత చూపాలి. కాని ఎవరు అల్లాహ్ కు అవిధేయత చూపాలని మొక్కుబడి చేస్తాడో అతడు అవిధేయత చూపకూడదు”. (బుఖారి).
ముఖ్యాంశాలు:
1. మొక్కుబడి చేస్తే దాన్ని పూర్తి చేయాలి. 2. మొక్కుబడి ఇబాదత్ (ఆరాధన) అని తెలిసింది, దాన్ని ఇతరుల కొరకు చేయుట షిర్క్. 3. పాపకార్యానికి, అవిధేయతకు మొక్కుబడి చేస్తే దాన్ని పూర్తి చేయకూడదు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
11వ అధ్యాయం: అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబహ్ చేసే చోట, అల్లాహ్ కొరకు జిబహ్ చేయరాదు
అల్లాహ్ ఆదేశం:
لَا تَقُمْ فِيهِ أَبَدًۭا “నీవు ఎన్నడూ అందులో నిలబడకు“. (9: తౌబా: 108).
సాబిత్ బిన్ జహ్హాక్ రజియల్లాహు అన్హు కథనం: బువాన అనే స్థలంలో ఒక వ్యక్తి ఒంటె జిబహ్ చేయాలని మ్రొక్కుకున్నాడు. దాన్ని గురించి ప్రవక్త ﷺ తో ప్రశ్నించగా, “అక్కడ జాహిలియ్యత్ కాలంలోని విగ్రహాల్లో ఏదైనా విగ్రహం ఉందా? దాని పూజ జరుగుతూ ఉందా?” అని ఆయన అడిగారు. “లేదు” అని అతడు సమాధానం పలికాడు. “వారి పండుగలో (ఉర్సు, జాతరలలో) ఏదైనా పండుగ (ఉర్సు,జాతర) అక్కడ జరుగుతుందా?” అని అడిగారు. “లేదు” అని అతడు సమాధానం పలికాడు. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారు: “నీ మ్రొక్కుబడిని పూర్తి చేయు. అల్లాహ్ అవిధేయతకు గురి చేసే మ్రొక్కుబడిని పూర్తి చేయరాదు. మానవుడు తన శక్తికి మించిన దాన్ని మ్రొక్కుకుంటే అది కూడా పూర్తి చేయరాదు”. (అబూ దావూద్).
ముఖ్యాంశాలు:
1. ఇందులోని ఆయతు యొక్క వ్యాఖ్యానం.
2. అల్లాహ్ విధేయత, అవిధేయత కొన్ని సందర్భాల్లో భూమి పై కూడా తన ప్రభావాన్ని చూపుతుంది. (అందుకే షిర్క్ జరిగే చోట జిబహ్ చేయవద్దు అని చెప్పబడింది).
3. కఠిన సమస్యను నచ్చజెప్పెటప్పుడు సులభరీతిలో ఏలాంటి చిక్కు లేకుండా స్పష్టపడునట్లు చెప్పాలి.
4. అవసర సందర్భంలో “ఫత్వా” ఇచ్చువారు వివరాన్ని కోరవచ్చు.
5. ఎలాంటి ధార్మిక అడ్డు, ఆటంకం లేనప్పుడు ప్రత్యేక చోటును మ్రొక్కుబడి కొరకు నిర్ణయించవచ్చును.
6. జాహిలియ్యత్ (మూఢవిశ్వాస) కాలంలో విగ్రహం ఉన్నచోట, దాన్ని తర్వాత తొలగించినప్పటికీ అచ్చట జిబహ్ చేయరాదు.
7. వారి పండుగ (ఉర్సు, జాత్ర) జరుగుతున్న స్థలం, అది ఇప్పుడు జరగనప్పటికీ అక్కడ కూడా జిబహ్ చేయరాదు.
8. ఇలాంటి స్థలాల్లో జిబహ్ చేయుటకు మ్రొక్కుకుంటే దానిని పూర్తి చే యకూడదు. అది పాపపు మ్రొక్కు అగును.
9. ఉద్దేశపూర్వకంగా కానప్పటికీ ముస్లింలు ముష్రికుల పండుగ (ఉర్సు, జాత్ర)ల పోలికల నుండి జాగ్రత్తగా వహించాలి.
10. అవిధేయతకు గురి చేసే మ్రొక్కుబడి చేయరాదు.
11. మనిషి తన శక్తికి మించిన దాని మ్రొక్కు చేయకూడదు.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
దీనికి ముందు అధ్యాయం తరువాత, వెంటనే ఈ అధ్యాయాన్ని ప్రస్తావించడంలో ఉత్తమమైన ఔచిత్యం ఉంది. మొదటిది షిర్క్ అక్బర్ అయితే, ఇది దానికి వసీల (మార్గం, సాధనం). ఏ చోటనైతే అవిశ్వాసులు, ముష్రికులు తమ దేవతల (వలీల) సాన్నిధ్యం పొందుటకు అల్లాతో షిర్క్ చేస్తూ వారి కొరకు జిబహ్ చేస్తారో అవి షిర్క్ యొక్క చిహ్నాలు, గుర్తులు అయ్యాయి. అక్కడ ఎవరైనా ముస్లిం జిబహ్ చేస్తే, అతని ఉద్దేశం అల్లాహ్ కొరకే ఉన్నప్పటికీ అది బాహ్యంగా వారి విధంగనే ఏర్పడుతుంది. (అంటే చూసేవాళ్ళకు అల్లాహ్ యేతరలకు చేస్తున్నట్లే ఏర్పడుతుంది). ఇలా బాహ్య రూపంలో వారికి పోలిన పనులు చేస్తే, చివరికి ఆంతర్యం కూడా ఒకటి అయి పోయే భయం ఉంటుంది. (ఈ రోజుల్లో అయిపోయినట్లే కనబడుతుంది).
అందుకే ఇస్లాం వారి (అవిశ్వాసులు, ముష్రికులు) పోలికల నుండి దూరముండాలని హెచ్చరించింది. అది వారి పండుగలు, వారి లాంటి కార్యాలు, వారి లాంటి దుస్తులు ఇంకా వారికి ప్రత్యేకించిన ప్రతీ దానితో ముస్లిం దూరముండాలి. వాస్తవానికి ఇది వారిలో కలసిపోవుటకు ఒక సాధనంగా మారుతుంది. ముష్రికులు అల్లాహ్ యేతరులకు సజ్దా చేసే సమయంలో, ముస్లింలు నఫిల్ నమాజు చేయుట నివారించబడింది. ఈ నివారణ వచ్చింది వారి పోలిక నుండి దూరముంచుటకే.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
కాలం సాక్షిగా! నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించినవారు, ఒండొకరికి సహనం (స్థయిర్యం) గురించి తాకీదు చేసినవారు మాత్రం నష్టపోరు. (సూర అస్ర్ 103).
ఈ సూర గురించి ఇమాం షాఫిఈ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు:
لو مَا أَنزَلَ اللهُ حُجَّةً على خَلقهِ إلا هَذهِ السُّورةَ لكَفَتهُم “అల్లాహ్ మానవులపై ప్రమాణంగా కేవలం ఈ ఒక్క సూరాను అవతరింపజేసినా, ఇది వారి కొరకు సరిపోయేది“
ఇమాం బుఖారీ రహిమహుల్లాహ్ చెప్పారు: వాచ, కర్మ (మాట మరియు ఆచరణ) కంటే ముందు జ్ఞానం తప్పనిసరి. దీనికి ఆధారం అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, “తబర్రుక్ వాస్తవికత” (శుభాన్ని ఆశించడం యొక్క వాస్తవికత) అనే అంశంపై చర్చించబడింది. వక్త తబర్రుక్‌ను రెండు రకాలుగా విభజించారు: ధర్మసమ్మతమైనది (మష్రూ) మరియు నిషిద్ధమైనది (మమ్నూ). ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ద్వారా ధృవీకరించబడిన తబర్రుక్ మాత్రమే ధర్మసమ్మతమైనదని, ఉదాహరణకు మూడు మస్జిద్‌లకు (మస్జిద్-ఎ-హరామ్, మస్జిద్-ఎ-నబవి, మస్జిద్-ఎ-అఖ్సా) ప్రయాణించడం, జమ్ జమ్ నీరు త్రాగడం, మరియు ఖురాన్‌ను పఠించి, అర్థం చేసుకుని, ఆచరించడం ద్వారా శుభం పొందడం వంటివి వివరించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వ్యక్తిత్వం, ఆయన వస్తువులు, మరియు ఆయన శరీరం నుండి వేరైన భాగాల (వెంట్రుకలు) ద్వారా శుభం పొందడం కేవలం ఆయనకు మాత్రమే ప్రత్యేకం అని, సహాబాలు ఇతరులతో ఇలా చేయలేదని స్పష్టం చేశారు. ఖురాన్ మరియు సున్నత్‌లలో ఆధారం లేని ఏ వస్తువు, ప్రదేశం, లేదా వ్యక్తి ద్వారా శుభాన్ని ఆశించడం నిషిద్ధమైన తబర్రుక్ అని, ఇది షిర్క్‌కు దారితీస్తుందని హెచ్చరించారు. దర్గాలు లేదా ఇతర సమాధుల వద్దకు శుభం కోసం ప్రయాణించడం హరామ్ అని హదీసుల ఆధారంగా వివరించారు.
الْحَمْدُ لِلَّهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنُؤْمِنُ بِهِ وَنَتَوَكَّلُ عَلَيْهِ، (అల్ హందులిల్లాహి నహ్మదుహూ వ నస్త ఈనుహూ వ నస్తగ్ ఫిరుహూ వ ను’మిను బిహీ వ నతవక్కలు అలైహ్.) సర్వ స్తోత్రాలు అల్లాహ్ కొరకే. మేము ఆయనను స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్ని కోరుతున్నాము, ఆయన క్షమాపణను వేడుకుంటున్నాము, ఆయనను విశ్వసిస్తున్నాము మరియు ఆయనపైనే నమ్మకం ఉంచుతున్నాము.
وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، (వ న ఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ ఫుసినా వ మిన్ సయ్యిఆతి అ’అమాలినా) మేము మా ఆత్మల చెడు నుండి మరియు మా కర్మల చెడు నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము.
مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، (మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ, వ మన్ యుద్ లిల్హు ఫలా హాదియ లహ్.) అల్లాహ్ ఎవరికి మార్గనిర్దేశం చేస్తాడో, వారిని ఎవరూ మార్గభ్రష్టులుగా చేయలేరు. మరియు ఆయన ఎవరిని మార్గభ్రష్టులుగా వదిలేస్తాడో, వారికి ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు.
وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، (వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహ్.) అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు.
وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، (వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహ్.) మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.
أَرْسَلَهُ بِالْحَقِّ بَشِيرًا وَنَذِيرًا، وَدَاعِيًا إِلَى اللَّهِ بِإِذْنِهِ وَسِرَاجًا مُنِيرًا. (అర్సలహూ బిల్ హఖ్ఖి బషీరవ్ వ నజీరా. వ దాఇయన్ ఇలల్లాహి బి ఇజ్నిహీ వ సిరాజమ్ మునీరా.) ఆయన (అల్లాహ్) అతన్ని (ముహమ్మద్‌ను) సత్యంతో శుభవార్తలు అందించేవాడిగా, హెచ్చరించేవాడిగా, తన అనుమతితో అల్లాహ్ వైపుకు ఆహ్వానించేవాడిగా మరియు ప్రకాశవంతమైన దీపంగా పంపాడు.
أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ (అమ్మా బ’అద్ ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్) నిశ్చయంగా, అన్ని మాటలలోకెల్లా ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం (ఖురాన్).
وَخَيْرُ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صلى الله عليه وسلم (వ ఖైరల్ హద్ యి హద్ యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు అన్ని మార్గాలలోకెల్లా ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గం.
وَشَرُّ الأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلُّ مُحْدَثَةٍ بِدْعَةٌ (వ షర్రల్ ఉమూరి ముహ్ దసాతుహా, వ కుల్లు ముహ్ దసతిన్ బిద్ అహ్) మరియు అన్ని కార్యాలలోకెల్లా చెడ్డ కార్యం (ధర్మంలో) కొత్తగా కల్పించబడినది, మరియు ప్రతి కొత్త కల్పన ఒక బిద్అత్ (ఆవిష్కరణ).
وَكُلُّ بِدْعَةٍ ضَلاَلَةٌ وَكُلُّ ضَلاَلَةٍ فِي النَّارِ (వ కుల్లు బిద్ అతిన్ దలాలహ్, వ కుల్లు దలాలతిన్ ఫిన్నార్) మరియు ప్రతి బిద్అత్ ఒక మార్గభ్రష్టత్వం, మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికి దారి తీస్తుంది.
సర్వ స్తోత్రాలు, అన్ని విధముల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. కారుణ్య శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.
అభిమాన సోదరులారా, నాటి ఈ జుమా ప్రసంగాంశం, తబర్రుక్ వాస్తవికత. తబర్రుక్ అనే విషయంలో మన సమాజంలో అనేక విధాల అపార్థాలు, ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల ఆధారంగా కాకుండా బిద్అతులు చోటు చేసుకున్నాయి. ఇన్షా అల్లాహ్ ఈరోజు తబర్రుక్ వాస్తవికత ఏమిటో తెలుసుకుందాం.
తబర్రుక్ అర్థం మరియు రకాలు
తబర్రుక్ అంటే బరకత్ నుంచి. బరకత్ పొందటం, శుభాలను పొందడం, శుభాలను ఆశించడం, శుభాలు కలగడం అనే అర్థాలు వస్తాయి తబర్రుక్ అంటే. అత్తబర్రుక్ బిష్షై అంటే ప్రత్యేకమైన ఓ వస్తువు ద్వారా శుభాన్ని కోరటం.
ఈ తబర్రుక్ రెండు రకాలు. మష్రూ తబర్రుక్ (ధర్మ సమ్మతమైన తబర్రుక్). రెండవది మమ్నూ తబర్రుక్ (నిషిద్ధమైన తబర్రుక్).
ధర్మసమ్మతమైన తబర్రుక్ (మష్రూ తబర్రుక్ )
ధర్మ సమ్మతమైన తబర్రుక్ అంటే, ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢి అయిన తబర్రుక్. ఉదాహరణకు, శుభం కొరకు, మేలు కొరకు, శుభం పొందటానికి మస్జిద్-ఎ-హరామ్ వైపుకు పయనించటం, ప్రయాణించటం. అది హదీసులో ఉంది. అలాగే మస్జిద్-ఎ-నబవి ప్రయాణించటం, అలాగే మస్జిద్-ఎ-అఖ్సా వైపు పోవటం. అంటే ఈ మూడు మస్జిదుల గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, శుభం కొరకు, మేలు కొరకు, పుణ్యం కొరకు ఈ మూడు మస్జిదుల వైపుకు ప్రయాణం చేయవచ్చు. ఇది ధర్మ సమ్మతమైన తబర్రుక్ పొందటం.
అలాగే జమ్ జమ్ నీరు, దాని గురించి స్పష్టమైన హదీసులు ఉన్నాయి, దాని యొక్క శుభం గురించి.
అలాగే ఖురాన్. స్వయంగా ఖురాన్ గ్రంథం తబర్రుక్‌తో నిండి ఉన్నది. స్వయంగా ఖురాన్ గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర అన్ఆమ్ ఆయత్ నంబర్ 155లో ఇలా తెలియజేశాడు:
وَهَـٰذَا كِتَابٌ أَنزَلْنَاهُ مُبَارَكٌ فَاتَّبِعُوهُ وَاتَّقُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ మరియు ఈ ఖురాన్ మేము అవతరింపజేసిన ఒక శుభప్రదమైన గ్రంథం. కాబట్టి మీరు దీనిని అనుసరించండి, భయభక్తులతో మెలగండి. తద్వారా మీరు కరుణించబడే అవకాశం ఉంది.
అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖురాన్ గురించి సూర సాద్, ఆయత్ 29లో ఇలా తెలియజేశాడు:
كِتَابٌ أَنزَلْنَاهُ إِلَيْكَ مُبَارَكٌ لِّيَدَّبَّرُوا آيَاتِهِ وَلِيَتَذَكَّرَ أُولُو الْأَلْبَابِ ఇదొక శుభప్రదమైన గ్రంథం. బరకత్‌తో కూడిన గ్రంథం, తబర్రుక్‌తో నిండియున్న గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటందుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకునేందుకు దీనిని నీ వైపుకు పంపాము అని అల్లాహ్ సెలవిచ్చాడు.
ఇక ఖురాన్‌తో బరకత్ పొందటం, ఖురాన్‌తో తబర్రుక్ ఆశించటం, ఇలాంటి చాలా ఆయతులు ఖురాన్‌లో ఉన్నాయి. నేను రెండు ఆయతులు పఠించాను, అన్ఆమ్ మరియు సూర సాద్ లోనిది.
ఖురాన్ ద్వారా తబర్రుక్ పొందాలంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దీంట్లో కండిషన్ పెట్టాడు. ఖురాన్ శుభప్రదం, ఎప్పుడు? ఖురాన్‌ని అనుసరిస్తే. ఖురాన్‌ని ఎప్పుడు అనుసరించాలి? పఠించాలి, పారాయణం చేయాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు అనుసరించవచ్చు. అలాగే ఖురాన్ శుభప్రదం ఎప్పుడు? చింతన చేస్తే, గుణపాఠం నేర్చుకుంటే, మన జీవితాలు ఖురాన్ పరంగా ఉంటే ఈ ఖురాన్ మనకోసం బరకత్‌గా మారిపోతుంది, మన జీవితాలలో శుభం జరుగుతుంది, శుభం మనం పొందవచ్చు, శుభాన్ని ఆశించవచ్చు ఖురాన్ ద్వారా, అంటే ఖురాన్‌ను పఠించి, ఖురాన్ పారాయణం చేసి, ఖురాన్ చింతన చేసి, గుణపాఠం నేర్చుకొని ఆచరించినట్లయితే, ఈ ఖురాన్ ద్వారా మనకి బరకత్ వస్తుంది, శుభం అవుతుంది. అలా కాకుండా, కేవలం తబర్రుక్ ఉద్దేశంతో పఠించడం లేదు, ఖురాన్ తెరిచి చూడటం లేదు, అర్థం చేసుకోవడం లేదు, కేవలం బరకత్ ఉద్దేశంతో అందమైన దుస్తులు, అందమైన ఒక చిట్టీలో, ఖరీదైన దుస్తులలో దాన్ని బంద్ చేసి, ప్రయాణం చేసేటప్పుడు వాహనంలో, కొత్త ఇల్లు కట్టేటప్పుడు ఇంట్లో, దుకాణంలో, కేవలం తబర్రుక్ ఉద్దేశంతో, చదవటం లేదు, అర్థం చేసుకోవటం లేదు, పారాయణం లేదు, ఏమీ లేదు, అది సమంజసం కాదు. ఖురాన్ ద్వారా తబర్రుక్ పొందటం స్వయంగా అల్లాహ్ తెలియజేశాడు. ఖురాన్ ద్వారా, ఖురాన్ ఆ గ్రంథమే బరకత్‌తో కూడిన గ్రంథం. ఆ ఖురాన్ ద్వారా మనం బరకత్ పొందాలంటే పఠించాలి, పారాయణం చేయాలి, అర్థం చేసుకోవాలి, దాని అనుగుణంగా నడుచుకోవాలి. దీని ద్వారా ఖురాన్ మనకి బరకత్ అవుతుంది.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తబర్రుక్
అసలు విషయం ఏమిటంటే, ఖురాన్ తర్వాత అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో శుభాన్ని పొందటం. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా శుభాన్ని పొందటం, తబర్రుక్ ఆశించటం,
ఇవి రెండు విధాలు. ఒకటి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో తబర్రుక్ పొందటం, వ్యక్తిత్వంతో ఆయన ఉన్నప్పుడు. సహాబాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను చుంబించేవారు, శుభప్రదమైన చేతులను పట్టుకునేవారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చేతులను పట్టుకొని తమ ముఖాన్ని పైన స్పర్శించుకునేవారు, తిప్పుకునేవారు, శుభం ఉద్దేశంతో, తబర్రుక్ ఉద్దేశంతో. అది అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వ్యక్తిత్వంతో తబర్రుక్‌ని పొందటం.
రెండవది, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం శుభప్రదమైన శరీరంతో, శుభవంతమైన శరీరంతో వేరైన వస్తువులు, వేరైన భాగాలు. ఆయన శుభవంతమైన శిరోజాలు, తల వెంట్రుకలు. ఆయన శరీరంకి ముట్టిన దుస్తులు, ఆయన వాడిన పాత్రలు. అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి సంబంధించిన, ఆయన వాడిన, ఆయన తొడిగిన పాత్రలు, వస్తువులతో తబర్రుక్ పొందటం.
ఇది ధర్మ సమ్మతమైనది అని మనకు పలు హదీసుల ద్వారా తెలుస్తుంది. ఉదాహరణకి ఒక రెండు, మూడు హదీసులు మనం పరిశీలిద్దాం. ముస్లిం గ్రంథంలో హదీస్ ఉంది, అస్మా బిన్తె అబీ బకర్ రదియల్లాహు అన్హా ఈ హదీస్ కి కథనం ఉల్లేఖులు. ఆమె ఇలా అంటున్నారు, అస్మా బిన్తె అబీ బకర్ రదియల్లాహు అన్హా ఎవరంటే, అబూబకర్ గారి కూతురు, ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క అక్క అస్మా రదియల్లాహు అన్హా. అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు యొక్క తల్లి అస్మా రదియల్లాహు అన్హా. ఆవిడ రదియల్లాహు అన్హా ఇలా తెలియజేశారు, ఒక ప్రవక్త గారి ఒక జుబ్బాని తీశారు, జుబ్బా, చొక్కా. అస్మా రదియల్లాహు అన్హా ఒక జుబ్బాని తీసి, ఈ జుబ్బా ఆయిషా రదియల్లాహు అన్హా బ్రతికున్నంత కాలం ఆవిడ దగ్గర ఉండింది ఈ జుబ్బా. ఆయిషా రదియల్లాహు అన్హా పరమపదించిన తర్వాత ఆ జుబ్బాని నేను నా దగ్గర పెట్టుకున్నాను. ఆ జుబ్బా ఎవరిది? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడిన జుబ్బా, తొడిగిన జుబ్బా అది. ఇప్పుడు ఆ జుబ్బా నా దగ్గర ఉంది. ఇప్పుడు మనం మనలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే, కీడు జరిగితే, స్వస్థత కోసం, చికిత్స కోసం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధరించిన ఆ జుబ్బాని మనం నీళ్ళలో వేసి, ఆ జుబ్బాని పిండితే, ఆ నీళ్ళతో మనం ఆరోగ్యం కోసం వాడేవారము, చికిత్స నిమిత్తం ఆ నీళ్లు వాడేవారము, అని అస్మా బిన్తె అబీ బకర్ రదియల్లాహు అన్హుమా సెలవిస్తున్నారు. అంటే ఈ హదీస్ ప్రామాణికమైన హదీస్, ముస్లిం గ్రంథంలో ఈ హదీస్ ఉంది.
అలాగే ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది. సహల్ బిన్ స’అద్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇలా తెలియజేశారు, ఆయన దగ్గర ఒక పాత్ర ఉండింది, మంచి నీళ్లు తాగే పాత్ర, గ్లాస్ లాంటిది, పాత్ర ఉండింది. ఆ పాత్ర, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పాత్రలో నీళ్లు ఒకప్పుడు తాగారు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికి ఉండగా ఆ పాత్రలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మంచి నీళ్లు తాగారు. ఆ పాత్ర సహల్ బిన్ స’అద్ రదియల్లాహు త’ఆలా అన్హు దగ్గర ఉండింది. ఆ పాత్ర తీసి సహల్ రదియల్లాహు అన్హు తబర్రుక్ కోసం, శుభం పొందటం కోసం తాగారని అబూ హాజిమ్ తెలియజేశారు. ఆ తర్వాత అదే పాత్రను నాకు కావాలని ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లాహి అలైహి కోరారు. ఎవరిని? సహల్ బిన్ స’అద్ రదియల్లాహు అన్హుని. ఆ పాత్ర నాకు ఇస్తారా అని కోరితే, సహల్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ గారికి కానుకగా ఆ పాత్రను ఇచ్చేశారు. అర్థం ఏమిటంటే, రిజల్ట్ ఏమిటంటే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడిన పాత్ర ఆయన అనుచరులు ఆ తర్వాత తాబయీన్లు తబర్రుక్‌గా, శుభం కోరటం కోసం వాడేవారు. అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడిన పాత్రలు, ధరించిన దుస్తులు తబర్రుక్ కోసం వాడవచ్చు అని ఈ బుఖారీ హదీస్ ద్వారా రూఢి అవుతుంది.
అలాగే అబూ జుహైఫా రదియల్లాహు అన్హు కథనం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణ నిమిత్తం మధ్యాహ్న సమయంలో బయలుదేరారు. ఒక ప్రయాణంలో మధ్యాహ్నం బయలుదేరారు. దారిలో బతహా ప్రదేశంలో నమాజ్ నిమిత్తం ఆగటానికి. దారిలో నమాజ్ చేయడానికి, జొహర్ మరియు అసర్ నమాజ్ చేయడానికి. ఆ స్థలం పేరు బతహా. అక్కడ ఆగి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేసి జొహర్, అసర్ నమాజ్ చేశారు. సహాబాలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన చెయ్యితో, చెయ్యి పట్టుకొని సహాబాలు తమ ముఖం పైన తిప్పుకున్నారు. ఈ హదీస్ రావి జుహైఫా అంటున్నారు, నేను కూడా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన చెయ్యిని పట్టుకొని నా ముఖం పైన తిప్పాను, ఉంచాను. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన చెయ్యి చల్లగా, కస్తూరి కంటే ఎక్కువ సువాసనగా ఉండింది, అని తెలియజేశారు. అంటే ఈ విధంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వాడిన వస్తువుల ద్వారా, స్వయంగా ఆయన బ్రతికి ఉన్నంతకాలం, స్వయంగా ఆయన వ్యక్తిత్వంతో తబర్రుక్ తీసుకోవటం, తబర్రుక్ ని పొందటం ఇది ధర్మ సమ్మతము.
బుఖారీలోనే ఇంకో హదీసులో ఇలా ఉంది:
فَجَعَلَ النَّاسُ يَأْخُذُونَ مِنْ فَضْلِ وَضُوئِهِ فَيَتَمَسَّحُونَ بِهِ (ఫ జ’అలన్నాసు య’ఖుజూన మిన్ ఫద్లి వుజూఇహీ ఫ యతమస్సహూన బిహీ) అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేస్తే, వుజూలో మిగిలిన నీళ్లను సహాబాలు తీసుకునేవారు. ఆ నీళ్లను తమ శరీరం పైన పూసుకునేవారు, ముఖం పైన పూసుకునేవారు, తమ పైన జల్లుకునేవారు, తబర్రుక్ ఉద్దేశంతో.
అభిమాన సోదరులారా, అలాగే ముస్లిం గ్రంథంలో ఒక హదీస్ ఉంది, హజ్ సమయంలో అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మినా రోజు అది ఖుర్బానీ ఇచ్చిన తర్వాత, క్షవరం చేసుకున్నప్పుడు, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ శుభవంతమైన శిరోజాలను కుడి వైపు, ఎడమ వైపు సహాబాలకు పంచారు. తబర్రుక్ ఉద్దేశంతో సహాబాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన శిరోజాలను తమ వద్ద ఉంచుకున్నారు.
దీంతో ఏమర్థమవుతుంది? అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికున్నంత కాలం ఆయన వ్యక్తిత్వంతో తబర్రుక్ పొందవచ్చు, ఆయన వాడిన, వేసుకున్న, ధరించిన దుస్తుల ద్వారా, ఆయన శరీరం నుంచి వేరైన, అది వెంట్రుకలు, ద్వారా, అలాగే ఆయన వాడిన పాత్రల ద్వారా సహాబాలు తబర్రుక్ పొందారని రూఢి అయ్యింది, ఇది ధర్మ సమ్మతమే. కాకపోతే, ఇది కేవలం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకే పరిమితం. ప్రత్యేకంగా ఆయన కొరకే ఇది.
అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని పోల్చుకుంటూ ఇతర ఔలియాలు, ధర్మ పండితులు, పుణ్య పురుషులు, సజ్జనుల విషయంలో ఇలా చేయటం షిర్క్ అవుతుంది. ధర్మ పండితులు ఇతరులకి, దర్గాలకి పోయి శుభాన్ని కోరటం, ఇది ఫలానా పీర్ జుబ్బా అని, ఇది ఫలానా ఔలియా చొక్కా అని, ఇది ఫలానా ఔలియా పాత్ర అని, ఇది ఫలానా ఔలియాకి ఇది, ఇది అని, అది అని, ఇది ఔలియాలు, బుజుర్గులు, పీర్లు, ధర్మ పండితులు, పుణ్య పురుషులు, సజ్జనులు ఎవరైనా సరే. అంతెందుకు? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత అందరి కంటే ఉత్తములు ఎవరు? అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు. ఉమ్మతె ముహమ్మదియాలో, ప్రవక్తల పరంపర తర్వాత, ప్రవక్తల తర్వాత, ఉమ్మతె ముహమ్మదియాలో అందరికంటే పెద్ద వలీ ఎవరు? అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు. ఎవరైతే ప్రపంచంలో వలీ, వలీ, వలీ అని పేరు పొందారో, వారికంటే పెద్ద వలీ అబూబకర్ రదియల్లాహు అన్హు. ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు. ఆ తర్వాత ఉస్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు. ఆ తర్వాత అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు త’ఆలా అన్హు. ఆ తర్వాత అషర ముబష్షరా. పది మంది సహాబాలకి ప్రవక్త గారు స్వయంగా ఒకే హదీసులో స్వర్గం శుభవార్త ఇచ్చారు. ముహాజిర్లు, అన్సార్లు, అంత పెద్ద పెద్ద సహాబాల ద్వారా ఎవరైనా ఇతర సహాబాలు, తాబయీన్లు శుభాన్ని ఆశించారా? తబర్రుక్ పొందారా? తబర్రుక్ నిమిత్తం ఇలా చేశారా? స్వయంగా ఈ నలుగురు ఖలీఫాలు, అషర ముబష్షరా, ముహాజిరీన్లు, అన్సార్లు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో కాకుండా, ఆయన జుబ్బా, ఆయన వాడిన పాత్ర, ఆయన శరీరం నుంచి వేరైన ఆ శుభవంతమైన శిరోజాలు, ఇవి కాకుండా, ప్రవక్త గారు ఎక్కడ నమాజ్ చేశారో, ప్రవక్త సమాధి నుంచి శుభం తీసుకున్నారా? మనకంటే ఎక్కువగా ధర్మం తెలిసిన వారు. ప్రవక్త గారి జీవితాన్ని చూసిన వారు. ఖురాన్ యొక్క అర్థం ప్రవక్తతో తెలుసుకున్న వారు. అటువంటి సహాబాలు కూడా, ఇది తబర్రుక్ అనేది చేయలేదు. అది ఒక ప్రత్యేకంగా ఉంది, దేని ద్వారా తబర్రుక్ తీసుకోవాలి అనేది ఖురాన్లో అల్లాహ్ తెలియజేశాడు, హదీసులలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఖురాన్ మరియు హదీస్ పరంగా ఉంటే అది ధర్మ సమ్మతం, అది చేయాలి. మంచి విషయం.
ఉదాహరణకు ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. జమ్ జమ్ నీరు ఉంది. వర్షపు నీళ్లు ఉంది. వర్షపు నీరు శుభవంతమని, ఎందుకు? దాంతో ప్రయోజనం ఉంది. తాగుతాము, బ్రతుకు ఉంది, పంటలు పండుతాయి, దాంతో మేలు జరుగుతుంది. శుభవంతమైనది. హజరె అస్వద్ ఉంది. ప్రవక్త గారు ముద్దాడారు. స్వర్గం నుంచి వచ్చిందని చెప్పారు. శుభవంతమైన ఉద్దేశంతో మనం కూడా ముద్దాడతాం. ఆ విధంగా దేని గురించి ఖురాన్లో ఉందో తబర్రుక్ పొందవచ్చు అని, దేని గురించి ప్రవక్త గారు స్వయంగా చెప్పారో తబర్రుక్ ఉంది అని, మరి ఏ విషయాల గురించి ప్రాక్టికల్గా సహాబాలు అమలు చేశారో వాటితో తబర్రుక్ పొందటం, ఆశించటం ధర్మ సమ్మతమే. అవి కాకుండా ప్రస్తుతం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేరు, పరమపదించారు. అంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో తబర్రుక్ పొందేది లేదు, అది అయిపోయింది. రెండవది, ఆయన శరీరం నుంచి వేరైన వస్తువులు, ఆయన దుస్తులు, పాత్రలు, వెంట్రుక, అవి ఇప్పుడు ప్రపంచంలో ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢి అవ్వలేదు, ఎక్కడ ఉన్నాయి అనేది. నిజంగానే ప్రామాణికమైన హదీసుల ద్వారా ఇప్పుడు కూడా రూఢి అయితే అది ధర్మ సమ్మతమే, తబర్రుక్ ఉద్దేశంతో వాడవచ్చు. కాకపోతే రూఢి అవ్వలేదు, ప్రవక్త యొక్క సంబంధించిన వస్తువులు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం శరీరంతో వేరైన వస్తువులు ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయి అనేది ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢి లేదు కాబట్టి. ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ తబర్రుక్‌తో కూడిన అన్ని విషయాలన్నీ పాత ఇండియాలోనే ఉన్నాయి. ఇది ఫలానా ఔలియా, ఇది ఫలానా పీరు, ఇది ఫలానా సహాబీ, ఇది ఫలానా వ్యక్తిది పగడా, ఇది ఫలానా వ్యక్తిది పగడి, ఇది ఫలానా వ్యక్తిది జుబ్బా, ఇది ఫలానా వ్యక్తిది పాత్ర, ఇది ఫలానా ఔలియా గ్లాసు, ఇది ఫలానా ఔలియా వెంట్రుక, ఇది ఫలానా ఔలియా పాదము, ఇది ఫలానా ఔలియా చెప్పులు, ఇవంతా పాత ఇండియాలోనే ఉన్నాయి, అరబ్ దేశాల్లో లేవే? అంటే మనము సృష్టించుకున్నాము. ఒకవేళ ఉన్నా, ఆ తబర్రుక్ అనేది కేవలం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకే పరిమితం, ప్రత్యేకం. ఆయన తప్ప సహాబాలకి అది లేదు. అబూబకర్ రదియల్లాహు కంటే పెద్ద వలీ ఉన్నారా? ఉమర్ కంటే పెద్ద వలీ ఉన్నారా? ఖులఫా-ఎ-అర్బా కంటే పెద్ద వలీలు ఉన్నారా? వారి ద్వారానే వారి అనుచరులు, వారి స్నేహితులు ఆ తర్వాత తాబయీన్లు వారి ద్వారా తబర్రుక్ పొందలేదు కదా, అంటే అది ధర్మ సమ్మతం కాదు అని అర్థం అయిపోయింది.
నిషిద్ధమైన తబర్రుక్ (మమ్నూ తబర్రుక్)
కాకపోతే ఒక హదీస్ ద్వారా మనము తెలుసుకుందాము. ఒక సందర్భంలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హునైన్ కి పోయారు. అబూ వాఖిద్ అల్లైసీ తెలియజేస్తున్నారు, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో పాటు హునైన్ కి పోయాము.
خَرَجْنَا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِلَى حُنَيْنٍ (ఖరజ్నా మ’అన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హునైన్) మేము దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో పాటు హునైన్ కి పోయాము.
అది యుద్ధ సమయంలో.
وَنَحْنُ حُدَثَاءُ عَهْدٍ بِكُفْرٍ (వ నహ్ను హుదసాఉ అహ్దిన్ బికఫ్రిన్) అప్పుడు మేము కొత్త కొత్తగా ఇస్లాం స్వీకరించాము. అంటే అప్పుడే మేము ఇస్లాం స్వీకరించిది, కొత్తగా ముస్లిములము. కొత్తగా ఇస్లాం స్వీకరించాము.
وَلِلْمُشْرِكِينَ سِدْرَةٌ يَعْكُفُونَ عِنْدَهَا وَيَنُوطُونَ بِهَا أَسْلِحَتَهُمْ (వ లిల్ ముష్రికీన సిద్రతున్ య’అకిఫూన ఇందహా వ యనూతూన బిహా అస్లిహతహుం) అక్కడ ఆ హునైన్ ఆ స్థలంలో ఒక రేయి చెట్టు ఉండింది. ముష్రికీన్లు, బహుదైవారాధకులు ఆ రేయి చెట్టు పైన తమ ఆయుధాలను వ్రేలాడదీసేవారు, తబర్రుక్ ఉద్దేశంతో. చేసేది ఎవరు? ముష్రికీన్లు, తబర్రుక్ ఉద్దేశంతో అలా చేసేవారు.
అది చూసి ఈ కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారు, “ఓ దైవ ప్రవక్త,” దానికి జాతు అన్వాత్ అని పేరు ఉంది హదీస్ పుస్తకంలో, ఆ రేయి చెట్టు పైన అది వారు ఆయుధాలు వ్రేలాడదీస్తారు కదా, దాని పేరు జాతు అన్వాత్. ఈ కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారు దైవ ప్రవక్తతో, “ఓ దైవ ప్రవక్త, ఏ విధంగా అయితే ఆ బహుదైవారాధకులు, ఆ ముష్రికీన్లు తబర్రుక్ నిమిత్తం, శుభం పొందటానికి ఈ చెట్టు పైన ఆయుధాలు వ్రేలాడదీస్తున్నారు కదా, మా కోసం కూడా మీరు ఒక అన్వాత్‌ని తయారు చేయండి” అన్నారు, తబర్రుక్ కోసం.
అప్పుడు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసహనంతో ఏమన్నారంటే:
قُلْتُمْ وَالَّذِي نَفْسِي بِيَدِهِ كَمَا قَالَ قَوْمُ مُوسَى: اجْعَل لَّنَا إِلَٰهًا كَمَا لَهُمْ آلِهَةٌ (ఖుల్తుమ్ వల్లజీ నఫ్సీ బియదిహీ కమా ఖాల ఖవ్ము మూసా: ఇజ్అల్ లనా ఇలాహన్ కమా లహుమ్ ఆలిహహ్) అల్లాహ్ సాక్షిగా, ఆ దేవుని సాక్షిగా ఎవరి చేతిలో అయితే నా ప్రాణం ఉందో, అంటే అల్లాహ్ సాక్షిగా, మీరు చెప్పిన మాట చాలా పెద్ద మాట. ఏ విధంగా అయితే మూసా జాతి ప్రజలు మూసా అలైహిస్సలాంని కోరారు. మూసా అలైహిస్సలాం బనీ ఇస్రాయిల్. ఆ బనీ ఇస్రాయిల్లో బహుదైవారాధకులు షిర్క్ చేసేవారు ఆ ఆవు దూడని పూజించేవారు కదా. మూసా అలైహిస్సలాంకి విశ్వసించిన వారు కూడా అడిగారు: “ఓ మూసా అలైహిస్సలాం, వారికి ఏ విధంగా ఇలాహ్ ఉన్నాడో, అలాగే మాకు కూడా ఒక ఇలాహ్ తయారు చేయండి” అన్నారు.
ఇన్నకుమ్ కౌమున్ తజ్హలూన్ (నిశ్చయంగా మీరు ఇంకా అజ్ఞానులే) అని సమాధానం ఇచ్చారు. అంటే అది ఉపమానంగా ఇస్తూ అంతిమ దైవ ప్రవక్త, “ఇప్పుడు కూడా మీకు ఇంకా పాత జ్ఞాపకాలే ఉన్నాయా? పాత ఆచారాలే ఉన్నాయా? ఇంకా మీ ఈమానంలో, మీ విశ్వాసంలో ఇంకా తేడా రాలేదా?” అని అసహనంగా ప్రవక్త గారు బాధపడ్డారు. అంటే, ఇది అధర్మమైన తబర్రుక్, మమ్నూ తబర్రుక్. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఉన్నా కూడా, ఈ చెట్ల ద్వారా, పుట్టల ద్వారా, పండ్ల ద్వారా తబర్రుక్ లేదు అని ఈ హదీస్ ద్వారా రూఢి అయిపోయింది. ఈ హదీస్ ముస్నద్ అహ్మద్ లో ఉంది, ఇది సహీ హదీస్ ఇది.
అలాగే చివర్లో, బుఖారీ కితాబు ఫద్లిస్సలాత్‌లో ఒక హదీస్ ఉంది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:
لاَ تُشَدُّ الرِّحَالُ إِلاَّ إِلَى ثَلاَثَةِ مَسَاجِدَ الْمَسْجِدِ الْحَرَامِ وَمَسْجِدِ الرَّسُولِ -صلى الله عليه وسلم- وَمَسْجِدِ الأَقْصَى (లా తుషద్దుర్రిహాలు ఇల్లా ఇలా సలాసతి మసాజిద్: అల్ మస్జిదిల్ హరామ్, వ మస్జిదిర్రసూల్, వ మస్జిదిల్ అఖ్సా.)
ఈ భూమండలంలో అన్నిటికంటే పవిత్రమైన స్థలాలు ఏమిటి? మస్జిద్‌లు. ఎక్కడైనా సరే, పవిత్రంగా, అన్నిటికంటే పవిత్రం. కాకపోతే, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ తెలియజేశారు, శుభాలు పొందే ఉద్దేశంతో, తబర్రుక్ ఉద్దేశంతో ప్రయాణం చేయటం నిషిద్ధం, హరామ్. అది మస్జిద్ అయినా సరే.
ఫలానా దేశంలో ఫలానా మస్జిద్ ఉంది, అక్కడ పోయి నమాజ్ చేస్తే పుణ్యం వస్తుంది, శుభం కలుగుతుంది, తబర్రుక్ ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రయాణం చేయటం హరామ్. మూడు మస్జిద్‌లు తప్ప. మస్జిద్-ఎ-హరామ్ (మక్కా), మస్జిద్-ఎ-నబవి (మదీనా), మస్జిద్-ఎ-అఖ్సా (ఫలస్తీన్). ఈ మూడు మస్జిద్‌లు తప్ప, అంటే ఈ మూడు మస్జిద్‌లు శుభం పొందే ఉద్దేశంతో, తబర్రుక్ ఉద్దేశంతో ప్రయాణం చేయవచ్చు. హదీస్ ద్వారా రూఢి అయ్యింది, ధర్మ సమ్మతం. ఈ మూడు మస్జిద్‌లు తప్ప ప్రపంచంలో ఎక్కడైనా సరే, మస్జిద్ అయినా సరే, తబర్రుక్ ఉద్దేశంతో ప్రయాణం చేయటం హరామ్.
అయితే, దర్గా విషయం ఏమిటి? దర్గాకి పోతున్నారు, స్త్రీలు, పురుషులు, హిజాబ్ లేదు, చాలా ఖురాన్‌కి, హదీస్‌కి విరుద్ధంగా, మరి తబర్రుక్. ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమాధితో తబర్రుక్ లేదు. ఆయన మదీనాలో నడిచిన వీధులతో తబర్రుక్ లేదు. ఆయన యుద్ధాలు చేసిన యుద్ధ మైదానం ద్వారా తబర్రుక్ లేదు. దేని ద్వారా తబర్రుక్ ఉందో, అది రూఢి అయ్యింది ఖురాన్, హదీస్‌లో ఉంది. అవి తప్ప అది మస్జిద్ అయినా, సమాధి అయినా, దర్గా అయినా, ఔలియా అయినా, సజ్జనులైనా, పుణ్య పురుషులైనా తబర్రుక్ అనేది లేదు. ఒకవేళ తబర్రుక్‌గా భావిస్తే, వాటి ద్వారా శుభాన్ని కోరితే, అది షిర్క్ క్రిందికి వస్తుందని ధర్మ పండితులు తెలియజేశారు.
అభిమాన సోదరులారా, ఇవి సారాంశం, ధర్మ సమ్మతమైన తబర్రుక్, నిషిద్ధమైన తబర్రుక్.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఖురాన్ మరియు హదీస్‌ను అర్థం చేసుకొని, దాని అనుగుణంగా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ త’ఆలా మనందరికీ ఖురాన్ మరియు హదీస్ యొక్క సరైన అవగాహన కలిగే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్, సుమ్మా ఆమీన్. వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ఇస్లాంలో జ్యోతిష్యం మరియు భవిష్యవాణి యొక్క నిషేధం గురించి చర్చించబడింది. భవిష్యత్తు మరియు అగోచర విషయాల జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉందని, ప్రవక్తలకు కూడా ఆ జ్ఞానం లేదని ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేయబడింది. జ్యోతిష్కులను సంప్రదించడం మరియు వారి మాటలను విశ్వసించడం ఇస్లాంలో తీవ్రమైన పాపంగా పరిగణించబడుతుందని, అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించడంతో సమానమని హెచ్చరించబడింది.
ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహ్, అమ్మా బ’అద్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ 14వ ఎపిసోడ్ లో జ్యోతిష్యం గురించి తెలుసుకుందాం.
జ్యోతిష్యం అంటే ఏమిటి?
జ్యోతిష్యం అంటే ఇతరుల భవిష్యత్తు గురించి చెప్పడం. కొందరు తమకు కానరాని వాటి గురించి, భవిష్యత్తు గురించి జ్ఞానం ఉందని అంటారు. ఇటువంటి వారిని జ్యోతిష్కుడు, మాంత్రికుడు అని అంటారు.
జ్యోతిష్యం చెప్పడం గురించి ఇస్లాంలో నిషేధించబడింది. అలాగే జ్యోతిష్కుని దగ్గరకు వెళ్ళటం కూడా పాపమే. భవిష్యత్తు మరియు కానరాని విషయాలు అల్లాహ్ కు తప్ప ఎవ్వరికీ తెలియదు.
ఈ విషయం గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ అన్ఆమ్ లో ఇలా తెలియజేశాడు,
وَعِندَهُ مَفَاتِحُ الْغَيْبِ لَا يَعْلَمُهَا إِلَّا هُوَ (వ ఇందహూ మఫాతిహుల్ గైబి లా య’అలముహా ఇల్లా హువ) “అగోచర విషయాల తాళం చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. ఆయన తప్ప మరెవరూ వాటిని ఎరుగరు.” (6:59)
అంటే అగోచర జ్ఞానం, ఇల్మె గైబ్ గురించి అల్లాహ్ కు తప్ప ఎవ్వరికీ తెలియదు. దైవ ప్రవక్తలకు కూడా తెలియదు.
అభిమాన సోదరులారా, ఈ విషయం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ అ’అరాఫ్ లో ఇలా తెలియజేశాడు,
قُل لَّا أَمْلِكُ لِنَفْسِي نَفْعًا وَلَا ضَرًّا إِلَّا مَا شَاءَ اللَّهُ (ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “అల్లాహ్ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. (7:188)
ఓ దైవ ప్రవక్తా, నువ్వు చెప్పు, అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశిస్తున్నాడు, ఓ దైవ ప్రవక్తా నువ్వు చెప్పు, (ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “అల్లాహ్ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. అల్లాహ్ యే కోరితే తప్ప, స్వయంగా నాకు నేను ఏ లాభమూ చేకూర్చుకోలేను, ఏ నష్టమూ నివారించుకోలేను.”
అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు కూడా లాభం చేయటం, నష్టం చేకూర్చటం అనే అధికారం లేదు. అలాగే, నాకే గనక,
وَلَوْ كُنتُ أَعْلَمُ الْغَيْبَ لَاسْتَكْثَرْتُ مِنَ الْخَيْرِ وَمَا مَسَّنِيَ السُّوءُ ۚ إِنْ أَنَا إِلَّا نَذِيرٌ وَبَشِيرٌ لِّقَوْمٍ يُؤْمِنُونَ “నాకే గనక అగోచర విషయాలు తెలిసివుంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాణ్ణి. ఏ నష్టమూ నాకు వాటిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించే వారికి హెచ్చరించేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే.” (7:188)
అని ఈ ఆయత్ లో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి ఎన్నో సందర్భాలలో సమస్యలు వచ్చాయి, నష్టం జరిగింది. ఒకవేళ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి అగోచర జ్ఞానం ఉండి ఉంటే, ఇల్మె గైబ్ తెలిసి ఉంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కి ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ కష్టాలు వచ్చేవి కావు.
కావున, జ్యోతిష్యం అనేది తర్వాత జరగబోయే విషయాలు, అగోచర జ్ఞానం ఉందని, కానరాని విషయాలు చెప్తారని, ఆ విద్య ఉందని, అది నమ్మటము, అలా చెప్పటము, అది ఇస్లాం ధర్మంలో హరామ్, అధర్మం. ఇది కేవలం ఇల్మె గైబ్ అనేది అల్లాహ్ కు తప్ప ఎవ్వరికీ తెలియదు.
హదీసు వెలుగులో
అభిమాన సోదరులారా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ జ్యోతిష్యం గురించి ఇలా తెలియజేశారు,
مَنْ أَتَى كَاهِنًا، أَوْ عَرَّافًا، فَصَدَّقَهُ بِمَا يَقُولُ، فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ صلى الله عليه وسلم “ఎవరైతే జ్యోతిష్కుని వద్దకు వెళ్ళి అతడు చెప్పిన మాటల్ని నమ్మితే, జ్యోతిష్యుని దగ్గరికి పోయి ఆ జ్యోతిష్కుడు చెప్పే మాటలు నమ్మితే, అతడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన వాటిని తిరస్కరించిన వాడవుతాడు.”
అంటే ఎవరైతే ఈ జ్యోతిష్యాన్ని నమ్ముతాడో, అతను చెప్పిన మాటల్ని నమ్ముతాడో, ఆ వ్యక్తి వాస్తవానికి ఏం చేస్తున్నాడు, అంతిమ దైవ ప్రవక్తపై అల్లాహ్ ఏది అవతరింపజేశాడో, వహీని, ఖుర్ఆన్ ని దాన్ని తిరస్కరించినట్టు అని అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ లో స్పష్టంగా తెలియజేశారు.
అభిమాన సోదరులారా, కావున మన సమాజంలో అప్పుడప్పుడు మనము చూస్తూ ఉంటాం, పోయి చేతులు చూపించి, ఏదో చూపించి, నష్టం జరుగుతుందని, రాబోయే కాలంలో ఏం జరుగుతుందని వివరించుకుంటారు. ఇది హరామ్, ఇస్లాం ధర్మంలో దీన్ని ఖుర్ఆన్ మరియు హదీసులో చాలా కఠినంగా ఖండించడం జరిగింది.
అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఈ పాపం నుంచి కాపాడు గాక. సరైన మార్గాన్ని చూపించు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.