త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ

الأصول الثلاثة– تلغو
ఈ పుస్తక రచయిత: ఇమాం ముహమ్మద్ తమీమీ రహిమహుల్లాహ్
అనువాదకర్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ

ఇమాం ఇబ్ను బాజ్ రహిమహుల్లాహ్ ఈ పుస్తకం 100 సార్లు చదివించారు. దీని ద్వారా ఈ పుస్తకం యొక్క విలువను గమనించండి

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [ 28పేజీలు]

యూట్యూబ్ ప్లే లిస్ట్: (23 వీడియోలు)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3sKIkLUrdBOs1lCFaW2b0U

విషయసూచిక

1వ పాఠం – నాలుగు విషయాల జ్ఞానం విధి

అల్లాహ్ నిన్ను కరుణించుగాక! 4 విషయాలు నేర్చుకొనుట మనపై విధి అని తెలుసుకో! (1) ఇల్మ్, (2) అమల్, (3) దఅవత్, (4) సబ్ర్ .

  1. ఇల్మ్ (విద్య, జ్ఞానం); అంటే అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు ఇస్లాం ధర్మం గురించి (ఖుర్ఆన్, హదీసుల) ఆధారాలతో తెలుసుకొనుట.
  2. అమల్ (తెలుసుకున్న జ్ఞానం ప్రకారం ఆచరించుట).
  3. దఅవత్ (ఇతరులను ఇస్లాం వైపునకు ఆహ్వానించుట).
  4. సబ్ర్ (ఏ కష్టం, ఆపద ఎదురైనా ఓపిక, సహనాలు వహించుట).

వీటన్నిటికి దలీల్ (ఆధారం) ఇది:

وَالْعَصْـرِ (1) إِنَّ الْإِنسَانَ لَفِي خُسـْرٍ (2) إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ (3)

కాలం సాక్షిగా! నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించినవారు, ఒండొకరికి సహనం (స్థయిర్యం) గురించి తాకీదు చేసినవారు మాత్రం నష్టపోరు. (సూర అస్ర్ 103).

ఈ సూర గురించి ఇమాం షాఫిఈ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు:

لو مَا أَنزَلَ اللهُ حُجَّةً على خَلقهِ إلا هَذهِ السُّورةَ لكَفَتهُم
అల్లాహ్ మానవులపై ప్రమాణంగా కేవలం ఈ ఒక్క సూరాను అవతరింపజేసినా, ఇది వారి కొరకు సరిపోయేది

ఇమాం బుఖారీ రహిమహుల్లాహ్ చెప్పారు: వాచ, కర్మ (మాట మరియు ఆచరణ) కంటే ముందు జ్ఞానం తప్పనిసరి. దీనికి ఆధారం అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:

فَاعْلَمْ أَ نَّهُ لَا إِلَهَ إِلَّا اللهُ واسْتَغْفِرْ لِذَنبِكَ

కనుక (ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో, నీ పొరపాట్లకుగాను క్షమాపణ వేడుకుంటూ ఉండు“. (ముహమ్మద్ 47:19).

ఈ ఆయతులో వాచ,కర్మ కంటే ముందు జ్ఞానం ప్రస్తావన ఉంది.

2వ పాఠం – మూడు విషయాల జ్ఞానం విధి

అల్లాహ్ నిన్ను కరుణించుగాక, తెలుసుకో! నిశ్చయంగా ప్రతి ముస్లిం స్త్రీ పురుషునిపై మూడు విషయాలు నేర్చుకొనుట మరియు వాటి ప్రకారంగా ఆచరించుట విధిగా ఉంది.

మొదటిది: నిశ్చయంగా అల్లాహ్ యే మనల్ని సృష్టించాడు, పోషిస్తున్నాడు. మరియు మనల్ని వృధాగా వదిలివేయలేదు, మన వైపునకు ప్రవక్తను పంపాడు, ఎవరు ఆ ప్రవక్తను విధేయత చూపుతారో వారే స్వర్గంలో ప్రవేశిస్తారు, మరెవరు ఆయనకు అవిధేయత చూపుతారో వారు నరకంలో ప్రవేశిస్తారు. దీనికి ఆధారం, అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:

إِنَّا أَرْسَلْنَا إِلَيْكُمْ رَسُولاً شَاهِداً عَلَيْكُمْ كَمَا أَرْسَلْنَا إِلَى فِرْعَوْنَ رَسُولاً * فَعَصَـى فِرْعَوْنُ الرَّسُولَ فَأَخَذْنَاهُ أَخْذاً وَبِيلاً

మేము ఫిరౌను వద్దకు ప్రవక్తను పంపినట్లే మీ వద్దకు కూడా మీపై సాక్షిగా ఉండటానికి ఒక ప్రవక్తను పంపాము. మరి ఫిరౌను ఆ ప్రవక్త మాట వినలేదు. అందువల్ల మేమతన్ని చాలా కఠినంగా పట్టుకున్నాము“. (ముజమ్మిల్ 71:15,16).

రెండవది: అల్లాహ్ తన ఆరాధనలో ఆయనతో పాటు మరొకరిని సాటి కల్పించడాన్ని (భాగస్వామిగా చేయడాన్ని) ఏ మాత్రం ఇష్టపడడు, ఆ భాగస్వామి ఆయనకు అత్యంత సమీపంలో ఉండే దైవదూత అయినా సరే, ఆయన పంపిన ప్రవక్త (సందేశహరుడు) అయినా సరే. దీనికి ఆధారం, అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:

وَأَنَّ المَسَاجِدَ لِلهِ فَلَا تَدْعُوا مَعَ اللهِ أَحَداً

మస్జిదులు కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కాబట్టి (వాటిలో) అల్లాహ్ తో పాటు ఇతరులెవరినీ పిలవకండి“. (జిన్ 72:18).

మూడవది: ప్రవక్తకు విధేయత చూపి, అల్లాహ్ ఆరాధనలో ఏకత్వాన్ని పాటించేవారికి, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విరోధులుగా ఉండేవారితో ప్రాణస్నేహంగా ఉండడం తగదు, వారు ఎంత దగ్గరి బంధువులైనా సరే. దీనికి ఆధారం, అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:

لا تَجِدُ قَوْماً يُؤْمِنُونَ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آباءهُمْ أَوْ أَبْنَاءهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ أُوْلَئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ الْإِيمَانَ وَأَيَّدَهُم بِرُوحٍ مِّنْهُ وَيُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا رَضِيَ اللهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ أُوْلَئِكَ حِزْبُ اللهِ أَلَا إِنَّ حِزْبَ اللهِ هُمُ المُفْلِحُونَ

అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించేవారు అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల శత్రుత్వం వహించేవారిని ప్రేమిస్తున్నట్లు నీవు ఎక్కడా చూడవు, ఆఖరికి వారు తమ తండ్రులైనాసరే, తమ కొడుకులైనా సరే, తమ అన్నదమ్ములైనా సరే, తమ పరివారజనులైనా సరే (ససేమిరా వారిని ప్రేమించరు). అల్లాహ్ విశ్వాసాన్ని రాసి పెట్టినది ఇలాంటి వారి హృదయాలలోనే! ఆయన తన ఆత్మ ద్వారా వీరిని ప్రత్యేకంగా బలపరిచాడు. ఇంకా వీరికి, క్రింద సెలయేరులు పారే స్వర్గ వనాలలో ప్రవేశం కల్పిస్తాడు. అందులో వీరు కలకాలం ఉంటారు. అల్లాహ్ వీరి పట్ల ప్రసన్నుడయ్యాడు. వీరు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. అల్లాహ్ పక్షానికి చెందిన వారంటే వీరే. నిశ్చయంగా సాఫల్యం పొందేవారు అల్లాహ్ పక్షం వారే“. (58:22).

3వ పాఠం – మిల్లతె ఇబ్రహీం అంటే ఏమిటి?

اعلمْ ـ أرشَدَكَ اللهُ لِطَاعَتهِ ـ أنَّ الحنِيفِّيةَ مِلةَ إِبراهيمَ، أنْ تَعبُدَ اللهَ وحدَهُ مُخلِصًا لهُ الدينَ، وبذلكَ أَمرَ اللهُ جَميعَ النَّاسِ وخَلَقَهُم لَها، كَما قَالَ تَعَالى:  ] وَمَا خَلَقتُ الجِنَّ وَالإِنسَ إِلّا لِيَعْبُدوِن [ [الذاريات: 56].

అల్లాహ్ నీకు విధేయత భాగ్యం ప్రసాదించుగాక, తెలుసుకో! ఏకాగ్రత (హనీఫియ్యత్) గల ఇబ్రాహీం (అలైహిస్సలాం) ధర్మం అంటే: ధర్మాన్ని ఆయనకే ప్రత్యేకించి, అల్లాహ్ ఏకైకుడిని మాత్రమే ఆరాధించుట. ఈ ఆదేశమే అల్లాహ్ సర్వ మానవాళికి ఇచ్చాడు, దీని కొరకే వారిని పుట్టించాడు. దీనికి ఆధారం, అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:

وَمَا خَلَقتُ الجِنَّ وَالإِنسَ إِلّا لِيَعْبُدوِن
నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను “ఆరాధించటానికి” మాత్రమే“. (జారియాత్ 51:56).

ومعنى  ِيَعْبُدُونِ : يُوَحِّدونِ.
“ఆరాధించటానికి” అంటే అర్థం: ఆరాధనలో ఏకత్వాన్ని పాటించడం.

و أعْظَمُ مَا أَمَرَ اللهُ بِهِ: التَّوحيدُ ، وهو إفْرادُ اللهِ بالعِبَادةِ. وأعظمُ ما نَهى عَنهُ: الشّـِركُ، وهو دَعْوةُ غَيْرِهِ مَعَهُ.  

అల్లాహ్ ఇచ్చిన ఆదేశాల్లో అతి గొప్పది: తౌహీద్. అంటే: అల్లాహ్ అద్వితీయుడిని మాత్రమే ఆరాధించడం. అల్లాహ్ నిషేధించిన వాటిలో అతి భయంకరమైనది: షిర్క్. అంటే అల్లాహ్ తో పాటు ఇతరులను ఆరాధించడం.

والدَّليِلُ قَوْلُهُ تعَالى:
దీనికి ఆధారం, అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:

وَاعْبُدُوا اللَه وَلاَ تُشركُوا بِهِ شَيئاً
అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయనకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి“. (నిసా 4:36).

4వ పాఠం – ఉసూలే సలాస ఏమిటి? నీ ప్రభువు ఎవరు?

فإذا قِيلَ لكَ: مَا الأُصُولُ الثَّلاثةُ التي يَجبُ على الإنسانِ مَعرفَتُها؟
فقل: معرفةُ العبدِ رَبَّهُ ، ودِينَهُ ، ونَبيَهُ محمدًا صلى الله عليه وسلم.

ఏ త్రిసూత్రాలను తెలుసుకొనుట మనిషిపై విధిగా ఉందని నీతో ప్రశ్నించబడినప్పుడు? నీవు చెప్పు:

(1) మనిషి తన ప్రభువు గురించి తెలుసుకోవడం.
(2) మనిషి తన ధర్మం గురించి తెలుసుకోవడం.
(3) మనిషి తన ప్రవక్త గురించి తెలుసుకోవడం, (అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం).

الأصـــل الأول
మొదటి సూత్రం

فَإذَا قِيْلَ لكَ: مَنْ رَبُكَ؟ فَقُل: رَبيَّ اللهُ الَّذي رَبَّانِي وّرَبَّى جَميعَ العَالمَينَ بِنِعَمِهِ، وهُوَ مَعبُودِي لَيسَ لي مَعْبُودٌ سِوَاهُ ، والدَّليِلُ قَوْلُهُ تعَالى: ] الحَمْدُ للهِ رَبِّ الْعَالَمِيْن [ [الفاتحة:2]. وكُلُّ مَنْ سِوى اللهِ عَالَمٌ ، وأنَا واحِدٌ مِنْ ذلكَ العَالَمِ.

నీ ప్రభువు ఎవరు అని నీతో ప్రశ్నించబడినప్పుడు? నీవు చెప్పు: నన్ను మరియు సర్వ లోకవాసులను తన అనేక అనుగ్రహాలతో పోషిస్తున్నవాడే నా ప్రభువు. ఆయనే నా ఆరాధ్యుడు (నా ఆరాధనలకు ఏకైక అర్హుడు), ఆయన తప్ప నాకు మరో ఆరాధ్యుడు లేడు. దీనికి ఆధారం, అల్లాహ్ యొక్క ఈ ఆదేశం::

الحَمْدُ للهِ رَبِّ الْعَالَمِيْن
ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు“. (ఫాతిహా 1:1).

అల్లాహ్ తప్ప ప్రతీది లోకమే, ఆ లోకంలో నేను ఒకడ్ని.

5వ పాఠం – నీవు నీ ప్రభువును ఎలా గుర్తించావు?

فَإذَا قِيْلَ لكَ: بِمَ عَرَفْتَ رَبَكَ؟
فَقُل: بآياتِهِ وَمَخلُوقَاتِهِ، ومِنْ آياتهِ الليلُ والنَّهَارُ ، والشَّمْسُ والقَمَرُ، ومِنْ مَخلوقَاتهِ السَّمَواتُ السَّبعُ، والأرَضُونَ السَّبعُ ، ومَنْ فيهنَ وما بَينهُما ، والدَّليِلُ قَوْلُهُ تعَالى:

‘నీవు నీ ప్రభువును ఎలా గుర్తించావు’? అని నీతో ప్రశ్నించబడితే, నీవు చెప్పు:

ఆయన సూచనల మరియు సృష్టి ద్వారా. ఆయన సూచనల్లో రేయింబవళ్ళు, సూర్యచంద్రాదులు. ఆయన సృష్టిలో సప్తకాశాలు, ఏడు భూములు మరియు వాటిలో ఉన్న మరియు వాటి మధ్యలో ఉన్న సమస్త చరచరాల ద్వార గుర్తించాను. దీనికి ఆధారం, అల్లాహ్ యొక్క ఈ ఆదేశం::

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا للهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ

రేయింబవళ్లూ, సూర్యచంద్రులు కూడా ఆయన (శక్తి) సూచనల లోనివే. మీరు సూర్యునికిగానీ, చంద్రునికిగానీ సాష్టాంగప్రణామం (సజ్దా) చేయకండి. నిజంగా మీరు అల్లాహ్‌ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్‌ ముందు సాష్టాంగపడండి“. (ఫుస్సిలత్ 41:37).

మరో ఆదేశం:

إِنَّ رَبَّكُمُ اللهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَى عَلَى الْعَرْشِ يُغْشـِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثاً وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ أَلاَ لَهُ الخَــلْقُ وَالأَمْــرُ تَبَــارَكَ اللهُ رَبُّ الْعَــالَمِينَ

నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన సొంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌ అపారమైన శుభాలు కలవాడు“. (ఆరాఫ్ 7:54).

والربُ هو: المعْبُودُ، والدَّليِلُ قَوْلُهُ تعَالى
రబ్ (ప్రభువు) అంటే నిజ ఆరాధ్యుడు. దీనికి ఆధారం, అల్లాహ్ యొక్క ఈ ఆదేశం::

يَأيُّهَا النَّاسُ اعبُدُوا ربَّكُمُ الَّذي خَلَقَكُم وَالذِّينَ مِن قَبلكُم لَعَلَّكُم تَتَّقُونَ الّذِي جَعَلَ لَكُمُ الأرضَ فِرَاشًا وَالسَّمآءَ بِنآءً وَأنزَلَ مِنَ السَّمَآءِ مَاْءً فَأخرَجَ بِهِ مِن الثَّمراتِ رِزقًا لّكُم فَلاَ تَجعَلُواْ للِه أندَادًا وَأنتُم تَعْلُمونَ

ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి, తద్వారానే మీరు (శిక్ష నుండి) సురక్షితంగా ఉంటారు. ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి“. (బఖర 2:21,22).

قالَ ابنُ كَثيرٍ رَحِمَهُ اللهُ تَعَالى: ((الخَالِقُ لِهذهِ الأَشْيَاءِ هُو المُستَحِقُّ للعِبَادةِ )).
ఇమాం ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ చెప్పారు: ఈ వస్తువులన్నిటినీ సృష్టించిన ప్రభువే సర్వ ఆరాధనలకు నిజమైన అర్హుడు.

6వ పాఠం – ఆరాధన రకాలు & దుఆ ఆధారాలు

وأَنْوَاعُ العِبَادَةِ التي أَمرَ اللهُ بهَا، مِثلُ : الإسلامِ، والإيمانِ، والإحسانِ، ومِنهُ الدُّعاءُ، والخوفُ، والرَّجَاءُ، والتوَكُلُ، والرَّغبَةُ، والرَّهبَةُ، والخشوعُ، والخشيَةُ، والإنَابَةُ، والاستِعَانةُ، والاستِعَاذَةُ، والاستِغَاثَةُ، والذَّبْحُ، والنَّذرُ، وغَيْرُ ذَلِكَ مِنْ أَنوَاعِ العِبَادَةِ التي أَمَرَ اللهُ بهَا، كُلُّهَا للهِ.

అల్లాహ్ ఆదేశించిన ఆరాధన రకాల్లో కొన్ని:

ఇస్లాం, ఈమాన్, ఇహ్ సాన్, దుఆ (ప్రార్థన, వేడుకోలు), ఖౌఫ్ (భయం), రజా (ఆశ), తవక్కుల్ (నమ్మకం), రగ్బత్ (ఆసక్తి), రహబ్ (మహాభీతి), ఖుషూఅ (నమ్రత), ఖషియత్ (గౌరవభావంతో భీతి), ఇనాబత్ (మరలుట), ఇస్తిఆనత్ (సహాయం అర్థించుట), ఇస్తిఆజ (శరణు కోరుట), ఇస్తిగాస (మొరపెట్టుకొనుట), జిబహ్ (బలిదానం), నజ్ర్ (మ్రొక్కుబడి) తదితర ఆరాధన రకాలు. ఇవన్నియూ కేవలం అల్లాహ్ కొరకే చేయాలి.

والدَّليِلُ قَوْلُهُ تعَالى
దుఆ యొక్క దలీల్ (ఆధారం):

وَأنَّ المَسَاجِد للهِ فَلا تَدعُوا مَعَ اللهِ أحَداً
మస్జిదులు కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కాబట్టి (వాటిలో) అల్లాహ్ తో పాటు ఇతరులెవరినీ వేడుకోకండి“. (72:18).

فَمَنْ صَرَفَ مِنْهَا شَيئًا لِغَيْرِ اللهِ فَهُوَ مُشْرِكٌ كَافِرٌ.
ఆరాధన రకాల్లో ఏ ఒక్కటైనా అల్లాహ్ తప్ప వేరే ఎవరికైనా చేసినవాడు ముష్రిక్ మరియు కాఫిర్ అవుతాడు.

దీనికి దలీల్:

وَمَن يَدْعُ مَعَ اللهِ إِلَهاً آخَرَ لَا بُرْهَانَ لَهُ بِهِ فَإِنَّمَا حِسَابُهُ عِندَ رَبِّهِ إِنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ

ఎవడైనా, తన దగ్గర ఏ ప్రమాణమూ లేకపోయినప్పటికీ- అల్లాహ్‌తో పాటు వేరొక దేవుణ్ణి మొరపెట్టుకుంటే, అటువంటి వ్యక్తి లెక్క అతని ప్రభువు వద్ద ఉన్నది. నిశ్చయంగా అవిశ్వాసులు సఫలురు కాలేరు“. (మోమినూన్ 23:117).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

الدُّعَاءُ هُوَ الْعِبَادَةُ
దుఆయే అసలైన ఆరాధన“. (అబూ దావూద్ 1479. సహీ హదీస్).

అల్లాహ్ యొక్క మరో ఆదేశం:

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ

మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా దాస్యం పట్ల గర్వాహంకారం ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించటం తథ్యం”. (గాఫిర్ 40:60).

7వ పాఠం – ఖౌఫ్ (భయం), రజా (ఆశ), తవక్కుల్ (నమ్మకం, భరోసా)

الخَوفِఖౌఫ్ (భయం) యొక్క దలీల్ (ఆధారం):

فَلاَ تَخَافُوهُمْ وَخَافُونِ إِن كُنتُم مُّؤْمِنِينَ
కనుక మీరు అవిశ్వాసులకు భయపడకండి, మీరు విశ్వాసులే అయితే నాకు భయపడండి“. (ఆలి ఇమ్రాన్ 3:175).

الرَّجَاءِరజా (ఆశ) యొక్క దలీల్ (ఆధారం):

فَمَن كَانَ يَرْجُو لِقَاء رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلاً صَالِحاً وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَداً
“కనుక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు సత్కార్యాలు చేయాలి. తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించకూడదు”. (కహ్ ఫ్ 18:110).

التوَكُلِతవక్కుల్ (నమ్మకం, భరోసా) యొక్క దలీల్ (ఆధారం):

وَعَلَى اللهِ فَتَوَكَّلواْ إِن كُنتُم مُّؤْمِنِينَ
మీరు విశ్వాసులే అయితే అల్లాహ్‌నే నమ్మండి“. (మాఇద 5:23).

وَمَن يَتَوَكَّلْ عَلَى اللهِ فَهُوَ حَسْبُهُ
అల్లాహ్ పై భారం మోపిన వానికి అల్లాహ్ యే చాలు“. (తలాఖ్ 65:3).

8వ పాఠం – రగ్బత్ (ఆసక్తి), రహబ్ (మహాభీతి), ఖుషూఅ (నమ్రత)

الرَّغْبَةِ రగ్బత్ (ఆసక్తి), الرَّهْبَةِ రహబ్ (మహాభీతి), الخُشُوعِ ఖుషూఅ (నమ్రత) యొక్క దలీల్ (ఆధారం):

إِنَّهُـمْ كَــانُوا يُسَـارِعُـونَ فِي الخَــيْرَاتِ وَيَدْعُــونَنَـا رَغَباً وَرَهَباً وَكَانُوا لنَا خَاشِعِينَ

ఈ సద్వర్తనులు సత్కార్యాల కోసం త్వరపడేవారు. ఆశతోనూ, భయంతోనూ మమ్మల్ని వేడుకునేవారు. మా ముందు అశక్తతను, అణకువను కనబరచేవారు“. (అంబియా 11:90).

الخَشْيَةِఖషియత్ (గౌరవభావంతో భీతి) యొక్క దలీల్ (ఆధారం):

فَلاَ تَخْشَوْهُمْ وَاخْشَوْنِي
మీరు వారికి భయపడకండి. నాకు మాత్రమే భయపడండి“. (బఖర 2:150).

الإنابةِఇనాబత్ (మరలుట) యొక్క దలీల్ (ఆధారం):

وَ أَنِيْبُوا إِلىَ رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ
మీరు మీ ప్రభువు వైపునకు మరలండి. ఆయనకు విధేయత చూపండి.” (జుమర్ 39:54).

9వ పాఠం – ఇనాబత్ (మరలుట), ఇస్తిఆనత్ (సహాయం అర్థించుట), ఇస్తిఆజ (శరణు కోరుట), ఇస్తిగాస (మొరపెట్టుకొనుట)

ఇస్తిఆనత్ (సహాయం అర్థించుట) యొక్క దలీల్ (ఆధారం):

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاْكَ نَسْتَعِينُ
మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము“. (ఫాతిహా 1:5).

(( إِذَا اسْتَعَنْتَ فَاسْتَعِنْ بِاللهِ ))
నీవు సహాయం కోరితే అల్లాహ్ తో మాత్రమే సహాయం కోరు“. (తిర్మిజి 2516. సహీ).

ఇస్తిఆజ (శరణు కోరుట) యొక్క దలీల్ (ఆధారం):

قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ
చెప్పు: “నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను“. (నాస్ 114:1).

ఇస్తిగాస (మొరపెట్టుకొనుట) యొక్క దలీల్ (ఆధారం):

إِذْ تَسْتَغِيثُونَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ
సహాయం కోసం మీరు మీ ప్రభువును మొరపెట్టుకున్నప్పుడు అల్లాహ్‌ మీ మొరను ఆలకించాడు“. (అన్ఫాల్ 8:9).

10వ పాఠం – జిబహ్ (బలిదానం), నజ్ర్ (మ్రొక్కుబడి)

الذبحِజిబహ్ (బలిదానం) యొక్క దలీల్ (ఆధారం):

قُلْ إِنَّ صَلاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلهِ رَبِّ الْعَالَمِينَ لاَ شَرِيكَ لَهُ وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَاْ أَوَّلُ المُسْلِمِينَ

ఈ విధంగా ప్రకటించు : “నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం – ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌ కొరకే. (అన్ఆమ్ 6:163).

హదీసు యొక్క ఆధారం:

(( لَعَنَ اللهُ مَنْ ذَبَحَ لِغَيْرِ اللهِ )).
ఎవరు అల్లాహ్ యేతరుల కొరకు జిబహ్ (జంతుబలి) చేశాడో అల్లాహ్ అతనిని శపించాడు“. (ముస్లిం 1978).

النذرِనజ్ర్ (మ్రొక్కుబడి) యొక్క దలీల్ (ఆధారం):

يُوفُونَ بِالنَّذْرِ وَيَخَافُونَ يَوْماً كَانَ شَرُّهُ مُسْتَطِيراً

వారు తమ మొక్కుబడులను చెల్లిస్తుంటారు. ఏ రోజు కీడు నలువైపులా విస్తరిస్తుందో ఆ రోజు గురించి భయపడుతుంటారు“. (ఇన్ సాన్ 76:7).

11వ పాఠం – ఆధారాలతో ఇస్లాం ధర్మ పరిచయం

రెండవ సూత్రం – ఆధారాలతో ఇస్లాం ధర్మ పరిచయం

وهُوَ الاِسْتِسْلَامُ للهِ بالتَّوحِيدِ، والاِنْقِيَادُ لَهُ بالطَّاعَةِ، والبراءَةُ مِنَ الشِّرْكِ وَأَهْلِهِ.

ఇస్లాం అంటే అల్లాహ్ కు లొంగిపోవటం, తమను తాము అల్లాహ్ కు సమర్పించుకోవటం, ఆయన ఏకత్వాన్ని పాటించటం, ఆయనకు విధేయత చూపటం, షిర్క్ (బహుదైవారాధన) మరియు షిర్క్ చేసేవారితో (ఆ షిర్క్ పనుల్లో) సంబంధం లేకుండా ఉండడం.

وهو ثلاث مراتب : الإسلامُ  ، والإيمانُ  ، والإحسانُ ، وكُل مَرتَبةٍ لها أَركَانٌ.

ధర్మం యొక్క స్థానాలు మూడు: ఇస్లాం, ఈమాన్, ఇహ్ సాన్. వీటిలో ప్రతి ఒక్కదానికి కొన్ని రుకున్ లున్నాయి.

فأركانُ الإسلامِ خَمسَةٌ: شَهادةُ أنَّ لاَ إلهَ إلا اللهُ وأنَّ مُحمَّداً رَسُولُ اللهِ، و إقَامُ الصَّلاةِ، وإيتاءُ الزَّكاةِ، وصَومُ رَمَضانَ، وحَجُ بَيتِ اللهِ الحَرَامِ.

ఇస్లాం యొక్క రుకున్లు (పిల్లర్లు) ఐదు: (1) లాఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ (పవిత్ర వచనం = కలిమయె తయ్యిబ) యొక్క సాక్ష్యం పలకడం, (2) నమాజు స్థాపించడం, (3) జకాత్ చెల్లించడం, (4) రమజాన్ ఉపవాసాలు పాటించడం, (5) హజ్ చేయడం (అల్లాహ్ గృహం కాబా యొక్క యాత్ర).

12వ పాఠం – లాఇలాహ ఇల్లల్లాహ్ యొక్క దలీల్, నిజ అర్ధం

కలిమయె తయ్యిబ సాక్ష్యం యొక్క దలీల్:

شَهِدَ اللهُ أَنَّهُ لاَ إِلَـهَ إِلاَّ هُوَ وَالْـمَلاَئِكَةُ وَأُوْلُواْ الْعِلْمِ قَآئِماً بِالْقِسْطِ لاَ إِلَـهَ إِلاَّ هُوَ الْعَزِيزُ الحَكِيمُ

అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యదైవం లేడని స్వయంగా అల్లాహ్‌, ఆయన దూతలు, జ్ఞానసంపన్నులూ సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వం, సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు“. (ఆలి ఇమ్రాన్ 3:18).

ومَعْناهَا: لا مَعبُودَ بِحَقٍّ إلا اللهُ وحَدَهُ ، ( لا إلهَ ) نَافيًا مَا يُعبَدُ مِنْ دُونِ اللهِ. ( إلا اللهُ ) مُثبِتًا العِبَادَةَ للهِ وَحْدَهُ لاَ شَريكَ لهُ في عِبَادَتِهِ، كَما أَنَّهُ لَيسَ لهُ شَريكٌ في مُلكهِ.

ఈ సాక్ష్యం యొక్క భావం: ఏకైకుడైన అల్లాహ్ తప్ప సత్యమైన ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఇందులో రెండు రుకున్లున్నాయి:

  • (1) నిరాకరించుట, ఇది “లాఇలాహ” అన్న పదంలో ఉంది. అనగా ఉలూహియ్యత్ (ఆరాధన అర్హత)ను ప్రతి వస్తువు నుండి నిరాకరించుట.
  • (2) అంగీకరించుట, ఇది “ఇల్లల్లాహ్” అన్న పదంలో ఉంది. అనగా ఉలూహియ్యత్ (ఆరాధన)కు అర్హతగల అద్వితీయుడు అల్లాహ్ మాత్రమేనని, ఆయనకు భాగస్వాముడెవడు లేడని నమ్ముట. అలాగే అల్లాహ్ అధికారంలో కూడా ఏ భాగస్వామీ లేడు.

ఈ సాక్ష్యానికి వివరణ ఈ ఆయతులో ఉంది:

وَإِذْ قَالَ إِبْرَاهِيمُ لِأَبِيهِ وَقَوْمِهِ إِنَّنِي بَرَاءٌ مِمَّا تَعْبُدُونَ * إِلَّا الَّذِي فَطَرَنِي فَإِنَّهُ سَيَهْدِينِ * وَجَعَلَهَا كَلِمَةً بَاقِيَةً فِي عَقِبِهِ لَعَلَّهُمْ يَرْجِعُونَ

ఇబ్రాహీము తన తండ్రితోనూ, తన జాతి వారితోనూ పలికినప్పటి విషయం (స్మరించదగినది. ఆయన ఇలా అన్నాడు): “మీరు పూజించే వాటి నుంచి నేను వేరైపోయాను. నన్ను పుట్టించిన వానిని మాత్రమే (నేను ఆరాధిస్తాను). ఆయనే నాకు సన్మార్గం చూపుతాడు.” మరి ఇబ్రాహీము ఈ మాటే – తన తదనంతరం – తన సంతానంలో మిగిలి ఉండేట్లుగా చేసి వెళ్ళాడు – ప్రజలు (షిర్క్‌ నుంచి) మరలిరావటానికి. (జుఖ్రుఫ్ 43:26-28).

మరో ఆదేశం:

قُلْ يَا أَهْلَ الْكِتَابِ تَعَالَوْاْ إِلَى كَلِمَةٍ سَوَاء بَيْنَنَا وَبَيْنَكُمْ أَلاَّ نَعْبُدَ إِلاَّ اللهَ وَلاَ نُشْـرِكَ بِهِ شَيْئاً وَلاَ يَتَّخِذَ بَعْضُنَا بَعْضاً أَرْبَاباً مِن دُونِ اللهِ فَإِنْ تَوَلَّوْاْ فَقُولُواْ اشْهَدُواْ بِأَنَّا مُسْلِمُونَ

(ఓ ప్రవక్తా!) వారికి స్పష్టంగా చెప్పు: ”ఓ గ్రంథవహులారా! మాలోనూ, మీ లోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు రండి. అదేమంటే మనం అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించరాదు. అల్లాహ్‌ను వదలి మనలో ఎవరూ ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు.” ఈ ప్రతిపాదన పట్ల గనక వారు విముఖత చూపితే, ”మేము మాత్రం ముస్లిం (విధేయు)లము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి” అని వారికి చెప్పేయండి.

13వ పాఠం – ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సాక్ష్యం యొక్క దలీల్ & భావం

ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సాక్ష్యం యొక్క దలీల్:

لَقَدْ جَاءكُمْ رَسُولٌ مِنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالمُؤْمِنِينَ رَؤُوفٌ رَحِيمٌ

మీ దగ్గరకు స్వయంగా మీలో నుంచే ఒక ప్రవక్త వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతిదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసుల యెడల అతను వాత్సల్యం కలవాడు, దయామయుడు. (తౌబా 9:128).

و معنى شهادة أنَّ محمدًا رسولُ الله : طَاعَتهُ فِيمَا أَمَرَ ، وتصدِيقهُ فيما أخْبَرَ ، واجْتِنَابُ ما نَهى عنهُ وزَجَرَ ، وألاَّ  يُعْبَدَ اللهُ إلا بما شَرَعَ

ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సాక్ష్యం యొక్క భావం:

  • (1) ఆయన ఆదేశాల పట్ల విధేయత చూపాలి, (طَاعَتهُ فِيمَا أَمَرَ)
  • (2) ఆయన తెలిపిన విషయాలన్ని సత్యం అని నమ్మాలి ( وتصدِيقهُ فيما أخْبَرَ),
  • (3) నిషేధించిన, ఖండించిన వాటికి దూరంగా ఉండాలి (واجْتِنَابُ ما نَهى عنهُ وزَجَرَ),
  • (4) ఆయన చూపిన విధంగానే అల్లాహ్ ను ఆరాధించాలి (وألاَّ  يُعْبَدَ اللهُ إلا بما شَرَعَ).

14వ పాఠం – నమాజ్, జకాత్, ఉపవాసం & హజ్ యొక్క దలీల్

నమాజ్, జకాత్ యొక్క దలీల్ మరియు తౌహీద్ వ్యాఖ్యానం:

] وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاء وَيُقِيمُوا الصَّلَاةَ وَيُؤْتُوا الزَّكَاةَ وَذَلِكَ دِينُ الْقَيِّمَةِ [

వారు అల్లాహ్ నే ఆరాధించాలని ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలనీ, ఏకాగ్రచిత్తులై – నమాజును నెలకొల్పాలనీ, జకాత్ ను ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది. ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం. (బయ్యినహ్ 98:5).

ఉపవాసం యొక్క దలీల్:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُواْ كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ

ఓ విశ్వసించినవారలారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది, మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది. (బఖర 2:183).

హజ్ యొక్క దలీల్:

وللهِ عَلَى النَّاسِ حِجُّ البَيِت مِنَ استَطَاعَ إلَيهِ سَبِيلاً وَمَن كَفَرَ فَإنَّ اللهَ غَنيٌّ عِن العَالَمِينَ

అక్కడికి వెళ్ళే స్థోమత గలవారికి, ఆ గృహ (యాత్ర) హజ్‌ చేయటాన్ని అల్లాహ్‌ విధిగా చేశాడు. మరెవరయినా (ఈ ఆజ్ఞను శిరసావహించటానికి) నిరాకరిస్తే అల్లాహ్‌కు సమస్త లోకవాసుల అవసరం ఎంతమాత్రం లేదు. (ఆలి ఇమ్రాన్ 3:97).

15వ పాఠం – ఈమాన్, దాని భాగాలు, మూల సూత్రాలు, దలీల్

المرتبة الثانية:
రెండవ స్థానం: ఈమాన్ (విశ్వాసం)

الإيمانُ: وهُوَ بِضْعٌ وَسَبعُونَ شُعبَةً، فأعلاهَا قَولُ: لا إلهَ إلا اللهُ ، وأدنَاهَا إمَاطَةُ الأَذَى عَنِ الطَّرِيقِ ، والحيَاءُ شُعبةٌ مِنَ الإيمانِ.

విశ్వాస భాగాలు డెబ్బై కి పైగా ఉన్నాయి, వాటిలో అత్యున్నతమైనది: “లాఇలాహ ఇల్లల్లాహ్”. మరియు వాటిలో అడుగున ఉన్నది: దారి నుంచి బాధ కలిగించే వాటిని దూరం చేయడం. లజ్జా (హయా) కూడా విశ్వాసంలోని ఓ భాగమే. (రియాజుస్సాలిహీన్ 125).

విశ్వాస మూల సూత్రాలు (అర్కానె ఈమాన్) ఆరు ఉన్నాయి:

وأركانهُ ستة: أنْ تُؤمنَ باللهِ ، وَمَلائكَتِهِ ، وَكُتُبِهِ، وَرُسُلِهِ، وَاليومِ الآخِرِ، وبالقدَرِ خَيرهِ وشَرِّهِ.

అల్లాహ్ ను, దైవదూతలను, గ్రంథాలను, ప్రవక్తలను, పరలోక దినాన్ని మరియు మంచి, చెడు విధివ్రాతను నమ్మడం.

ఈమాన్ (విశ్వాస) మూల సూత్రాల ఆధారం:

لَيْسَ الْبِرَّ أَنْ تُوَلُّواْ وُجُوهَكُمْ قِبَلَ المَشْـرِقِ وَالمَغْرِبِ وَلَـكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِالله وَالْيَوْمِ الآخِرِ وَالمَلآئِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ

మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు. సదాచరణ అంటే వాస్తవానికి అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ, దైవదూతలనూ, దైవగ్రంథాలను, దైవ ప్రవక్తలనూ విశ్వసించటం. (బఖర 2:177).

విధివ్రాత ఆధారం:

إِنَّا كُلَّ شَيْءٍ خَلَقْنَاهُ بِقَدَرٍ
నిశ్చయంగా, మేము ప్రతి వస్తువును ఒక (నిర్ణీత) ‘విధి’ ప్రకారం సృష్టించాము“. (ఖమర్ 54:49).

16వ పాఠం – ఇహ్ సాన్, దాని దలీల్

మూడవ స్థానం: ఇహ్ సాన్ (విశ్వాసం)

ఇహ్ సాన్ యొక్క రుకున్ ఒకటే. అదే: అల్లాహ్ ను నీవు నిజంగా చూస్తున్నట్లు (భక్తి ప్రపత్తులతో) ఆరాధించు, నీవు ఆయన్ని చూడలేకపోయినా, ఆయన నిన్ను నిశ్చయంగా చూస్తున్నాడు (అన్న భావన కలిగి ఉండు). (రియాజుస్సాలిహీన్ 60).

ఇహ్ సాన్ యొక్క దలీల్:

إِنَّ اللهَ مَعَ الَّذِينَ اتَّقَواْ وَالَّذِينَ هُم مُحْسِنُونَ
నిశ్చయంగా అల్లాహ్‌ తనకు భయపడుతూ జీవితం గడిపే వారికి, సద్వర్తనులకు తోడుగా ఉంటాడు“. (నహ్ల్ 16:128).

మరో ఆదేశం:

وَتَوَكَّلْ عَلَى الْعَزِيزِ الرَّحِيمِ * الَّذِي يَرَاكَ حِينَ تَقُومُ * وَتَقَلُّبَكَ فِي السَّاجِدِينَ* إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ

సర్వాధిక్యుడు, కరుణామయుడు అయిన అల్లాహ్‌నే నమ్ముకో. నువ్వు (ఒంటరిగా ఆరాధనలో) నిలబడి ఉన్నప్పుడు ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. సాష్టాంగపడేవారి మధ్య (కూడా) నీ కదలికలను (కనిపెట్టుకుని ఉంటాడు). నిశ్చయంగా ఆయన అన్నీ వినేవాడు, అంతా తెలిసినవాడు. (షుఆరా 26:217-220).

మరో ఆదేశం:

وَمَا تَكُونُ فِي شَأْنٍ وَمَا تَتْلُو مِنْهُ مِن قُرْآنٍ وَلاَ تَعْمَلُونَ مِنْ عَمَلٍ إِلاَّ كُنَّا عَلَيْكُمْ شُهُودًا إِذْ تُفِيضُونَ فِيهِ 

నువ్వు ఏ స్థితిలో వున్నా, ఖుర్‌ఆనులోని ఏ భాగాలను పారాయణం చేసినా, (ప్రజలారా!) మీరు ఏ పనిచేసినా, మీరు మీ కార్యక్రమాలలో తలమునకలై ఉన్నప్పుడు మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాము. (యూనుస్ 10:61).  

17వ పాఠం – హదీసె జిబ్రీల్: ఇస్లాం, ఈమాన్ & ఇహ్ సాన్ యొక్క దలీల్

ఇస్లాం, ఈమాన్ మరియు ఇహ్ సాన్ యొక్క దలీల్ ప్రఖ్యాతిగాంచిన హదీసె జిబ్రీల్ ద్వారా: ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో కూర్చొని ఉండగా, ఆకాస్మాత్తుగా ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు, మిక్కిలి తెల్లని దుస్తులు ధరించి బాగా నల్లని వెంట్రుకలు కలిగి ఉన్నాడు. అతనిలో ప్రయాణపు చిహ్నాలేమీ కనిపించలేదు. అయితే మాలో ఎవరూ ఆ వ్యక్తిని గుర్తుపట్టలేదు. ఆ వ్యక్తి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి, తన మోకాళ్ళను దైవప్రవక్త మోకాళ్ళకు అనిస్తూ, తన అరచేతులను ఆయన తొడలపై పెట్టి (కడు వినమ్రుడై) కూర్చున్నాడు.

وَ قَالَ: يَا مُحمَّد أَخبرني عَنِ الإسلامِ. قَالَ: (( أَنْ تَشهَدَ أنْ لاَ إلهَ إلاَ اللهُ وَأنَّ مُحمَّداً رَسُولُ اللهِ، وَتُقيمَ الصَّلاةَ وتُؤتي الزَّكاةَ، وَتَصُومَ رَمَضَانَ، وتحُجَ البَيتَ إنْ استَطَعتَ إليهِ سَبيلا )). قالَ: صَدَقْتَ. فَعَجِبنَا لهُ يَسْألهُ وَيُصَدِّقَه

ఆ తరువాత దైవప్రవక్తను, “ఓ ముహమ్మద్‌! నాకు “ఇస్లాం” గురించి బోధించండి” అని అడిగాడు. దానికి ఆయన “ఇస్లాం అంటే అల్లాహ్‌ తప్ప వేరొక సత్య ఆరాధ్యుడు లేడనీ, ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త అని నీవు సాక్ష్యం పలకాలి, నమాజును స్థాపించాలి, జకాత్‌ (విధి దానం) చెల్లించాలి, రమజాన్‌ నెలలో ఉపవాసం పాటించాలి. వీలుంటే అల్లాహ్ గృహానికి (కాబాకు) యాత్ర చేయాలి. (ఇదే ఇస్లాం)” అని చెప్పారు. దైవప్రవక్త సమాధానం విని ఆ వ్యక్తి “నీవు చెప్పింది నిజం” అంటూ ఆయన మాటల్ని ధృవీకరించాడు. ఈ వ్యక్తి తనకు తెలియనట్లే అడుగుతున్న, తిరిగి ప్రవక్త సమాధానాన్ని ధృవీకరిస్తున్న ఈ వింత చూసి మేము ఆశ్చర్యపోయాము.

قَالَ: أَخْبرني عَنِ الإيمانِ، قَالَ: (( أنْ تُؤمنَ باللهِ وَمَلائكتهِ، وكُتبهِ، ورُسُلهِ، وَاليومِ الآخرِ، وبالقَدَرِ خَيرهِ وَشَرهِ ))

మరి “ఈమాన్‌” అంటే ఏమిటి? అని ఆ వ్యక్తి మళ్ళీ ప్రశ్నించాడు. “ఈమాన్‌ అంటే అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన (అవతరింపజేసిన) గ్రంథాలను, ఆయన పంపిన ప్రవక్తలను, పరలోక దినాన్ని, మంచీచెడుల విధివ్రాతను విశ్వసించాలి” అని ప్రవక్త ఆ వ్యక్తికి బోధించారు. అతను మళ్ళీ “నిజం చెప్పావ్‌” అన్నాడు.

قالَ: أَخبرني عَنِ الإحسَانِ. قَالَ: (( أنْ تَعْبُدَ اللهَ كأنكَ تَراهُ فِإنْ لم تكُنْ تَراهُ فإنهُ يَراكَ ))

ఆ వ్యక్తి తిరిగి “ఇహ్సాన్” అంటే ఏమిటో బోధించమని అడిగాడు. దానికి ప్రవక్త, “అల్లాహ్‌ను నీవు నిజంగా చూస్తున్నట్లు (భక్తి ప్రపత్తులతో) ఆరాధించాలి. నీవు ఆయన్ని చూడలేకపోయినా (ఆరాధించేటప్పుడు కనీసం) ఆయనైతే నిన్ను చూస్తూనే ఉన్నాడన్న భావననైనా కలిగి ఉండాలి”. ఇదే ఇహ్సాన్‌ అన్నారు.

قَالَ أَخْبرني عَنْ السَّاعَةِ. قَالَ: (( مَا المَسؤولُ عَنهَا بأعْلَمَ مِنَ السَّائلِ ))

తరువాత ఆ అపరిచిత వ్యక్తి “మరి ప్రళయం ఎప్పుడు వస్తుందో చెప్పండి” అని మరో ప్రశ్న వేశాడు. దానికి ఆయన “ఈ విషయం గురించి ప్రశ్నించబడే వాడికి ప్రశ్నించేవాడి కన్నా ఎక్కువేమీ తెలియదు” అని బదులిచ్చారు.

قَالَ: أخبرني عَن أمَارَاتِهَا. قَالَ: (( أنْ تَلدَ الأمَةُ رَبَّتهَا، وأنْ تَرى الحُفَاةَ العُراةَ العَالةَ رِعَاءَ الشَّاءِ يَتَطاوَلونَ في البُنيَانِ ))

అందుకా వ్యక్తి “మరయితే దాని సంభవానికి సూచనలేమైనా ఉంటే తెలియజేయండి” అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయ సూచనల గురించి ఈ విధంగా తెలియజేశారు: “అప్పుడు దాసి యజమానురాలిని కంటుంది. ఒకప్పుడు ఒంటిమీద సరిగ్గా బట్టలు కూడా లేకుండా బోసి కాళ్ళతో తిరుగుతూ, తిండికి కూడా గతి లేకుండా బతికిన పశువుల కాపర్లు (ఇప్పుడు) భవంతులు నిర్మించటంలో పరస్పరం పోటీపడటాన్ని నీవు కళ్లారా చూస్తావు.

قَالَ: فَمَضى. فَلبثنَا مَليَّاً. فَقَالَ: (( يَا عُمَرُ أتدرونَ مَنِ السَّائِلُ )) قُلنَا: اللهُ وَرَسُولهُ أعْلمُ. قَالَ: ((هَذَا جِبْريلُ أتَاكُم يُعَلِّمَكُم أَمرَ دِينكُم)).

తరువాత ఆ అపరిచిత వ్యక్తి వెళ్ళి పోయాడు. (హదీసు తెలియజేసిన హజ్రత్‌ ఉమర్‌ రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు.) తరువాత నేను చాలా సేపు (ప్రవక్త సన్నిధిలోనే) ఉండిపోయాను. అప్పుడు ఆయన నన్ను “ఆ పృచ్చకుడు ఎవరో తెలుసా?” అని అడిగారు. అందుకు నేను “అల్లాహ్ కీ, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు” అని కడు వినమంగా జవాబిచ్చాను. దానికి ఆయన “వచ్చిన వ్యక్తి దైవదూత జిబ్రీల్‌. మీకు మీ ధర్మం నేర్పడం కోసం వచ్చారు” అని చెప్పారు. (ముస్లిం 8, రియాజుస్సాలిహీన్ 60)

18వ పాఠం – మూడవ సూత్రం – నీ ప్రవక్త ఎవరు?

మూడవ సూత్రం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరిచయం

ఆయన ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్. హాషిమ్ ఖురైషు వంశం నుండి. ఖురైష్ అరబ్బులోని వారు. అరబ్బులు ఇస్మాఈల్ బిన్ ఇబ్రాహీం (అలైహిమస్సలాం) సంతతిలోనివారు.

ప్రవక్త వయస్సు 63 సంవత్సరాలు; ప్రవక్త పదవికి ముందు 40, ఆ తర్వాత 23. “ఇఖ్రఅ” (అలఖ్ 96:1-5) ద్వారా ప్రవక్త పదవి పొందారు. ముద్దస్సిర్ (74:1-7) ద్వారా సందేశదూత బాధ్యత పొందారు. జన్మస్థలం: మక్కా.

అల్లాహ్ షిర్క్ నుండి హెచ్చరించడానికి, తౌహీద్ వైపునకు పిలవడానికి ఆయన్ని పంపాడు. దీనికి దలీల్:

يَا أَيُّهَا المُدَّثِّرُ * قُمْ فَأَنذِرْ * وَرَبَّكَ فَكَبِّرْ * وَثِيَابَكَ فَطَهِّرْ * وَالرُّجْزَ فَاهْجُرْ * وَلَا تَمْنُن تَسْتَكْثِرُ * وَلِرَبِّكَ فَاصْبِرْ

ఓ కంబళి కప్పుకున్నవాడా! లే. (లేచి జనులను) హెచ్చరించు. నీ ప్రభువు గొప్పతనాన్ని చాటి చెప్పు. నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. ఆశుద్ధతను వదలిపెట్టు. ఉపకారం చేసి ఎక్కువ (ప్రతిఫలం) పొందాలని ఆశించకు. నీ ప్రభువు కొరకు ఓర్పు వహించు“. (ముద్దస్సిర్ 74:1-7).

లే. హెచ్చరించు” అంటే: షిర్క్ నుండి హెచ్చరించు, తౌహీద్ వైపునకు పిలువు.
నీ ప్రభువు గొప్పతనాన్ని చాటి చెప్పు” అంటే: తౌహీద్ గొప్పతనాన్ని చాటి చెప్పు.
నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో” అంటే: నీ ఆచరణ(కర్మ)లను షిర్క్ మలినాల నుండి శుభ్రంగా ఉంచుకో.
అశుద్ధతను వదిలిపెట్టు” అంటే: విగ్రహాల ఆరాధన, విగ్రహారాధకులను వదిలిపెట్టు, వాటితో, వారితో ఆ పనుల్లో సంబంధం లేకుండా ఉండు.

ఈ తౌహీద్ ప్రచారంలో పది సంవత్సరాలు గడిపాక, మేరాజ్ ప్రయాణం జరిగింది, అప్పుడే ఐదు పూటల నమాజ్ విధి అయినది. మక్కాలో మూడు సంవత్సరాలు నమాజ్ చేశారు. ఆ తర్వాత మదీనా వైపునకు హిజ్రత్ (వలస) చేయాలని ఆదేశించడం జరిగినది.

19వ పాఠం – హిజ్రత్ (వలసపోవుట)

హిజ్రత్ (వలసపోవుట)

హిజ్రత్ ఈ ఉమ్మత్ పై విధిగా ఉంది. హిజ్రత్ అంటే షిర్క్ ప్రాంతం నుండి, ఇస్లాం ప్రాంతానికి వలసపోవుట. హిజ్రత్ ప్రళయం వరకు ఉంది.

إِنَّ الَّذِينَ تَوَفَّاهُمُ المَلآئِكَةُ ظَالمي أَنْفُسِهِمْ قَالُواْ فِيمَ كُنتُمْ قَالُواْ كُنَّا مُسْتَضْعَفِينَ فِي الأَرْضِ قَالْوَاْ أَلَمْ تَكُنْ أَرْضُ اللهِ وَاسِعَةً فَتُهَاجِرُواْ فِيهَا فَأُوْلَـئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ وَسَاءتْ مَصِيرًا إِلاَّ المُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاء وَالْوِلْدَانِ لاَ يَسْتَطِيعُونَ حِيلَةً وَلاَ يَهْتَدُونَ سَبِيلاً * فَأُوْلَـئِكَ عَسَى اللهُ أَن يَعْفُوَ عَنْهُمْ وَكَانَ اللهُ عَفُوًّا غَفُورًا

ఎవరయితే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉన్నారో, వారి ప్రాణాలను తీసేటప్పుడు దైవదూతలు, “మీరే స్థితిలో ఉండేవారు?” అని వారిని అడుగుతారు. దానికి వారు, “మేము మా ప్రదేశంలో బలహీనులముగా, (నిస్సహాయులంగా) ఉండేవారము” అని బదులిస్తారు. “ఏమిటీ? మీరు (ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి) వలసపోవటానికి దేవుని భూమి విశాలంగా లేదా?” అని దైవ దూతలు వారిని అడుగుతారు. వీరి నివాస స్థలమే నరకం. అది అత్యంత చెడ్డ గమ్య స్థానం. అయితే నిజంగానే ఏ సాధన సంపత్తి లేని, దారి తెలియని నిస్సహాయులైన పురుషుల, స్త్రీల, పసివాళ్ళ (సంగతి వేరు). అల్లాహ్‌ వారిని మన్నించవచ్చు! అల్లాహ్‌ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు. (నిసా 4:97-99).

يَا عِبَادِيَ الَّذِينَ آمَنُوا إِنَّ أَرْضِي وَاسِعَةٌ فَإِيَّايَ فَاعْبدُونِ
విశ్వసించిన ఓ నా దాసులారా! నా భూమి ఎంతో విశాలమైనది. కనుక మీరు నన్నే ఆరాధించండి“. (అన్కబూత్ 29:56).

ఇమాం బగవీ రహిమహుల్లాహ్ చెప్పారు: ఈ ఆయత్ మక్కాలో ఉండిపోయి హిజ్రత్ చేయని ముస్లిముల గురించి అవతరించినది. అయితే అల్లాహ్ వారిని విశ్వసించిన దాసులారా అని అన్నాడు.

హిజ్రత్ గురించి హదీసు యొక్క దలీల్: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

తౌబా ఉన్నంత కాలం హిజ్రత్ ఉంది, పడమర నుండి సూర్యోదయం జరగనంత వరకు తౌబా ద్వారం తెరచి ఉంది“. (అబూ దావూద్ 2479. సహీ హదీస్).

20వ పాఠం – ప్రవక్త ﷺ వారి మదీనా జీవితం

ప్రవక్త ﷺ మదీనాలో

فَلمَّا اسْتَقَرَ فيْ المَدِيَنةِ، أُمِرَ بِبَقِيِّةِ شَرَائِعِ الإسْلامِ، مِثْلُ: الزَّكَاةِ، والصَّوْمِ، والحجِ، والأَذَانِ، والجهَادِ، والأَمْرِ بِالمَعْرُوفِ، وَالنَّهْيِ عَنِ المُنكَرِ، وَغَيرِ ذَلِكَ مِنْ شَرَائِعِ الإسلاَمِ. أَخَذَ عَلى هَذَا عَشْـرَ سِنِينَ، وَبَعْدَهَا تُوُفِّيَ ، صَلاةُ اللهِ وَسَلامُهُ عَلَيهِ ، وَدِينُهُ بَاقٍ.

మదీనాలో స్థిరపడ్డాక ఇస్లాం ధేర్మంలోని ఇతర ఆదేశాలన్నీ ఇవ్వడం జరిగినది, ఉదాహరణకు: జకాత్, ఉపవాసం, హజ్, అజాన్, జిహాద్, మంచిని ఆదేశించడం, చెడును ఖండించడం. ఇంకా తదితర ఆదేశాలు. ఇలా మదీనాలో పది సంవత్సరాలు గడిసాయి. ఆ తర్వాత ప్రవక్త చనిపోయారు. కాని ప్రవక్త తీసుకువచ్చిన ధర్మం ఉంది. (ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి, దీవెనలు కురియుగాక)

وَهَذَا دِينُهُ ، لاَ خَيْرَ إِلاَّ دَلَ الأُمَّةَ عَلَيْهِ، وَلا شَرَّ إِلاَّ حَذَّرَهَا مِنْهُ. وَالخيرُ الَّذِي دَلَّها عَليهِ: التَّوُحِيدُ، وَجَميعُ مَا يُحبهُ اللهُ وَيَرضَاهُ. والشَّـرُّ الَّذيْ حَذَّرَهَا مِنهُ: الشّـِركُ وَجَميعُ مَا يَكْرَهُهُ اللهُ وَيَأبَاهُ

ఆయన తీసుకొచ్చిన ఈ ధర్మం; మానవుల కొరకు మేలైన ప్రతి విషయం గురించి తెలిపారు. మరియు వారి కొరకు నష్టంగా (కీడుగా) ఉన్న ప్రతి విషయం నుండి హెచ్చరించారు. ఆయన తెలిపిన మేలైన వాటిలో అత్యుత్తమమైనది: తౌహీద్, మరియు అల్లాహ్ కు ఇష్టమైన, ఆయన ఇష్టపడే ప్రతీది. ఆయన హెచ్చరించిన వాటిలో అత్యంత ప్రమాదకరమైనది: షిర్క్, మరియు అల్లాహ్ అసహ్యించుకున్న మరియు వారించిన ప్రతీది.

بَعَثَهُ اللهُ إلى النَّاسِ كَافَّةً، وَافْتَرَضَ طَاعَتَهُ عَلى جَميعِ الثَّقلَينِ: الِجنِّ وَالإنسِ

అల్లాహ్ వారిని సర్వ మానవుల వైపునకు ప్రవక్తగా చేసి పంపాడు, మానవులు, జిన్నాతులందరిపై ఆయన విధేయత విధిగా చేశాడు. దలీల్:

قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللهِ إِلَيْكُمْ جَمِيعاً
ఓ ప్రజలారా! నేను మీ అందరి వైపునకు పంపబడిన ప్రవక్తను అని మీరు చెప్పండి“. (ఆరాఫ్ 7:158).

وَأَكْمَلَ اللهُ بهِ الدِّينَ
అల్లాహ్ ఆయనపై ధర్మాన్ని సంపూర్ణం చేశాడు. దలీల్:

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الإِسْلاَمَ دِيناً

ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను.(మాఇద 5:3).

والدليلُ على مَوْتِهِ ﷺ
ఆయన మరణించారు అనడానికి దలీల్:

إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُم مَّيِّتُونَ
నిశ్చయంగా (ఏదో ఒకనాడు) నీకూ చావు వస్తుంది. వారికీ చావు వస్తుంది“.(జుమర్ 39:30).

21వ పాఠం – మరణానంతర జీవితం

చనిపోయినవారు తిరిగి లేపబడతారు

وَالنَّاسُ إذَا مَاتُوا يُبْعَثُونَ، والدَّليِلُ قَوْلُهُ تعَالى
మానవులు చనిపోయిన తర్వాత తిరిగి లేపబడతారు. దలీల్:

مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً أُخْرَى

దీని (ఈ నేల)లో నుంచే మేము మిమ్మల్ని సృష్టించాము. మళ్లీ ఇందులోనికే మిమ్మల్ని చేరుస్తాము. మరి ఇందులో నుంచే మరోసారి మీ అందరినీ వెలికి తీస్తాము. (తాహా 20:55).

మరొక దలీల్:

وَاللهُ أَنبَتَـكُم مِّنَ الْأَرْضِ نَبَاتاً * ثُمَّ يُعِيدُكُمْ فِيهَا وَيُخْرِجُكُمْ إِخْرَاجاً

ఇంకా అల్లాహ్ మిమ్మల్ని నేల నుండి (ఒక ప్రత్యేక రీతిలో) మొలిపించాడు.” మరి మిమ్మల్ని అందులోనికే తిరిగి తీసుకుపోతాడు. మరి ఆ నేలలో నుంచే మిమ్మల్ని (విచిత్రంగా) వెలికితిస్తాడు.” (నూహ్ 71:17-18).

وَبَعدَ البَعْثِ مُحاسَبُونَ وَمَجزِيُّونَ بِأَعْمَالهِم. والدليلُ ، قَوْلُهُ تَعَالى
తిరిగి లేపబడిన తర్వాత వారి కర్మల లెక్క తీసుకోవడం జరుగుతుంది, వాటి ప్రకారంగా ప్రతిఫలం ఇవ్వడం జరుగుతుంది. దలీల్:

وَللهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ لِيَجْزِيَ الَّذِينَ أَسَاؤُوا بِمَا عَمِلُوا وَيَجْزِيَ الَّذِينَ أَحْسَنُوا بِالحُسْنَى

భూమ్యాకాశాలలో ఉన్నదంతా అల్లాహ్ దే. దుష్కర్మలు చేసేవారికి అల్లాహ్ వారి కర్మలకు తగ్గ ప్రతిఫలం ఇవ్వటానికి, సత్కర్మలు చేసేవారికి వారి కర్మలకు తగ్గట్టుగా పుణ్యఫలం ప్రసాదించటానికి (సన్మార్గ దుర్మార్గాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి). (నజ్మ్ 53:31).

وَمَنْ كَذَّبَ بِالبَعثِ كَفَرَ ، والدَّليِلُ قَوْلُهُ تعَالى
తిరిగి లేపబడటాన్ని (పునరుత్థాన దినాన్ని) తిరస్కరించినవారు కాఫిర్ (అవిశ్వాసి, సత్యతిరస్కరి) అవుతాడు. దలీల్:

زَعَمَ الَّذِينَ كَفَرُوا أَنْ لَّنْ يُبْعَثُوا قُلْ بَلَى وَرَبِّي لَتُبْعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِمَا عَمِلْتُمْ وَذَلِكَ عَلَى اللهِ يَسِيرٌ

తాము మరణించిన పిదప తిరిగి బ్రతికించబడటం అనేది ఎట్టి పరిస్థితిలోనూ జరగని పని అని అవిశ్వాసులు తలపోస్తున్నారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “ఎందుకు జరగదు? నా ప్రభువు తోడు! మీరు తప్పకుండా మళ్ళీ లేపబడతారు. మీరు చేసినదంతా మీకు తెలియపరచబడుతుంది. ఇలా చేయటం అల్లాహ్ కు చాలా తేలిక”. (తగాబున్ 64:7).

22వ పాఠం – ప్రవక్తలు ఎందుకు వచ్చారు?

ప్రవక్తల రాక ఉద్దేశ్యం

وَأَرْسَلَ اللهُ جَميعَ الرُّسُلِ مُبَشّـِرينَ وَمُنذِرينَ ، والدليلُ ، قَوْلُهُ تَعَالى
అల్లాహ్ ప్రవక్తలందరినీ శుభవార్త ఇచ్చే, హెచ్చరించేవారిగా చేసి పంపాడు. దలీల్:

رُسُلاً مُبَشِّـرِينَ وَمُنذِرِينَ لِئَلاَّ يَكُونَ لِلنَّاسِ عَلَى اللهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ

మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము – ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహ్‌కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారమూ మిగలకూడదని (మేమిలా చేశాము). (నిసా 4:165).

وَأَوَلهُمْ نُوحٌ عَليهِ السَّلامُ، وَآخِرُهُمْ مُحمَّدٌ ﷺ، وَهُوَ خَاتَمُ النَبيينَ. والدليلُ عَلى أنَّ أولهم نوح، قَوْلُهُ تَعَالى
ఆ ప్రవక్తల్లో (షిర్క్ నుండి హెచ్చరించిన) తొలి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం మరియు అంతిమ ప్రవక్త మరియు ప్రవక్తల పరంపరలో చిట్టచివరివారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వస్లలం. దలీల్:

إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَى نُوحٍ وَالنَّبِيِّينَ مِن بَعْدِهِ

(ఓ ముహమ్మద్‌!) మేము నూహ్‌ వైపుకు, అతని తరువాత వచ్చిన ప్రవక్తల వైపుకు వహీ పంపినట్లే (వాణిని అవతరింపజేసినట్లే) నీ వైపుకూ వహీ పంపాము. (నిసా 4:163).

وَكُلُّ أُمَّةٍ بَعَثَ اللهُ إليهَا رَسُولاً مِنْ نُوحٍ إلى مُحمَّدٍ يَأمُرُهُمْ بِعِبَادَةِ اللهِ وَحْدَهُ، وَيَنْهَاهُمْ عَنْ عِبَادَةِ الطَّاغُوتِ ، والدليلُ ، قَوْلُهُ تَعَالى
నూహ్ అలైహిస్సలాం నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వస్లలం వరకు వచ్చిన ప్రవక్తలందరూ తమ జాతివారికి ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని ఆదేశిసిస్తూ ఉండేవారు మరియు “తాగూత్” ఆరాధన నుండి వారిస్తూ ఉండేవారు. దలీల్:

وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولاً أَنِ اعْبُدُواْ اللهَ وَاجْتَنِبُواْ الطَّاغُوتَ

మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (ప్రజలారా!) “అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి” అని బోధపరచాము. (నహ్ల్ 16:36).

23వ పాఠం : తాగూత్ వివరణ

“తాగూత్” ను వదలండి

وَافْتَرَضَ اللهُ عَلى جَميِعِ العِبَادِ الكُفْرَ بالطَّاغُوتِ، وَالإيمانَ باللهِ

అల్లాహ్ సర్వ మానవాళిపై “తాగూత్” ను తిరస్కరించి, అల్లాహ్ ను మాత్రమే విశ్వసించాలని విధిగావించాడు.

قَالَ ابنُ القَيِّمِ رَحِمَهُ اللهُ: (( مَعْنى الطَّاغُوتِ مَا تَجاوَزَ بِهِ العَبْدُ حَدَّهُ مِنْ مَعْبُودٍ، أَوْ مَتْبُوعٍ ، أَو مُطَاعٍ )).

ఇబ్ను ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ చెప్పారు: (“తాగూత్” అంటే మనిషి తాను ఆరాధిస్తున్న, అనుసరిస్తున్న, విధేయత చూపుతున్న వాటిలో ధర్మ హద్దులను మీరడం).

وَالطَّوَاغِيتُ كَثيرُونَ، وَرُؤوسُهُمْ خَمسةٌ: إِبليسُ لَعَنَهُ اللهُ ، وَمَنْ عُبِدَ وَهُوَ رَاضٍ، وَمَنْ دَعَا النَّاسَ إلى عِبَادَةِ نَفسِهِ، وَمَنْ ادَّعَىْ شَيئاً مِنْ عِلمِ الغَيبِ، وَمَنْ حَكَمَ بِغَيرِ مَا أَنزَلَ اللهُ.

తాగూతులు అనేకం, వారిలో ప్రధాన సూత్రధారులు ఐదు రకాలు:

1- ఇబ్లీస్ (అల్లాహ్ అతడ్ని శపించాడు),
2- ప్రజలు తనను ఆరాధిస్తున్నది చూసి సంతోషపడే వ్యక్తి,
3- ప్రజలను తన ఆరాధన వైపునకు ఆహ్వానించే వ్యక్తి,
4- అగోచర జ్ఞానం గలదని ఆరోపణ చేసేవ్యక్తి,
5- అల్లాహ్ ధర్మానికి వ్యతిరేకంగా తీర్పులు చేసే వ్యక్తి.

والدليلُ ، قَوْلُهُ تَعَالى
అయితే దలీల్:

لاَ إِكْرَاهَ فِي الدِّينِ قَد تَّبَيَّنَ الرُّشْد مِن الْغَي فَمَن يَكْفُرْ بالطَّاغُوت وَيُؤْمِن بِاللهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَى لَا انَفِصَام لَهَا وَاللهُ سَمِيعٌ عَلِيمٌ

ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమయ్యింది. కనుక ఎవరయితే అల్లాహ్‌ తప్ప వేరితర ఆరాధ్యులను (తాగూత్‌ను) తిరస్కరించి అల్లాహ్‌ను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. (బఖర 2:256).

وَهَذَا هُوَ مَعْنَىْ : ( لَا إِلَهَ إِلَّا اللهُ ).
ఇదే “లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క నిజమైన భావం.

وَفي الحدِيثِ
హదీసులో ఉంది:

(( رَأسُ الأَمْرِ الإِسْلَامُ، وَعَمُودُهُ الصَّلاةُ، وَذُرْوَةُ سَنَامِهِ الجِهَادُ في سَبِيلِ اللهِ )).

ధర్మం యొక్క తల ఇస్లాం, దాని స్తంభం నమాజ్, దాని మూపురపు ఎత్తు జిహాద్ ఫీ సబీలిల్లాహ్. (తిర్మిజి 2616, సహీ).

వల్లాహు అఅ’లమ్ (అల్లాహ్ కే బాగా తెలుసు)
వసల్లల్లాహు అలా ముహమ్మదివ్ వఆలిహీ వసహబిహి వసల్లం

ఇతర లింకులు:

%d bloggers like this: