అల్లాహ్ తప్ప ఇతరులతో శరణు కోరుట షిర్క్ – ఏకత్వపు బాటకు సత్యమైన మాట
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/VqNlWM-JI88
అల్లాహ్ ఆదేశం:
وَأَنَّهُۥ كَانَ رِجَالٌۭ مِّنَ ٱلْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍۢ مِّنَ ٱلْجِنِّ فَزَادُوهُمْ رَهَقًۭا
“మానవులలో కొందరు జిన్నాతులలో కొందరిని శరణు వేడుతుండేవారు. ఈ విధంగా వారు జిన్నాతుల గర్వాన్ని మరింత అధికం చేశారు“. (72: జిన్న్: 6).
ఖవ్ లా బిన్తె హకీం కథనం: ప్రవక్త ﷺ ఇలా ఆదేశించగా నేను విన్నాను:
“ఎవరైనా ఒక స్థలంలో చేరిన తరువాత “అఊజు బికలిమా తిల్లాహి త్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్” చదివినచో వారికి ఆ స్థలం నుండి వెళ్ళే వరకు ఏ హాని కలగదు“. (ముస్లిం).
ముఖ్యాంశాలు:
- 1. కొందరు మనుషులు జిన్నాతుల శరణు కోరేవారు అని సూరె జిన్న్ వాక్యంలో తెలిసింది.
- 2. అది షిర్క్ అని తెలిసింది.
- 3. పైన పేర్కొనబడిన హదీసుతో కూడా అల్లాహ్ తో మాత్రమే శరణు వేడాలని తెలిసింది. అల్లాహ్ వాక్కు (కలిమ), ఆయన గుణమని, సృష్టిరాశి కాదు అని తెలిసింది. ఒక వేళ సృష్టి అయి ఉంటే ప్రవక్త వాటిద్వారా శరణు కోరేవారు కాదు. ఎందుకనగా సృష్టితో శరణు కోరుట షిర్క్.
- 4. పైన తెలుపబడిన దుఆ చిన్నది అయినప్పటికి దాని ఘనత, లాభం చాలా వుంది.
- 5. ఓ సందర్భంలో ఒక క్రియ, పని ద్వారా ఏదైనా ప్రాపంచిక లాభం కలిగితే, లేక కష్టం, నష్టం దూరమైతే అది షిర్క్ కాదు అనటానికి అది ప్రమాణం కాదు. (దేనితో లాభం కలిగిందో అదే స్వయం షిర్క్ కావచ్చు. అందుకు ఏది షిర్కో, ఏది షిర్క్ కాదో అనేది ఖుర్ఆన్, హదీసుల ద్వారా తెలుసుకోవాలి).
ఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్) – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం].
తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఏకత్వపు బాటకు సత్యమైన మాట)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0VrU7pg90uGfghChg9Bptl
You must be logged in to post a comment.