సున్నతు నమాజుల ఘనత, సంఖ్య [వీడియో]

బిస్మిల్లాహ్

సున్నతు నమాజుల ఘనత, సంఖ్య Sunnat Namazula Ghanata فضل السنن الرواتب (Telugu)

[వ్యవధి: 6 నిముషాలు ]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


సున్నతె ముఅక్కద:

స్థానికులైన ప్రతి ముస్లిం స్త్రీ పురుషులు పన్నెండు రకాతులు పాటించడం ఎంతో పుణ్యకార్యం. అవి జొహ్ర్ కు ముందు 4, దాని తరువాత 2, మగ్రిబ్ తరువాత 2, ఇషా తరువాత 2, ఫజ్ర్ కు ముందు 2 రకాతులు. స్వయంగా ప్రవక్తసల్లల్లాహు అలైహి వసల్లం  ఈ సున్నతులు పాటించేవారు. ఇంకా ఆయన ఇలా శుభవార్త ఇచ్చారని ఉమ్మె హబీబ రజియల్లాహు అన్హా తెలిపారుః

 (مَا مِنْ عَبْدٍ مُسْلِمٍ يُصَلِّي لله كُلَّ يَوْمٍ ثِنْتَيْ عَشْرَةَ رَكْعَةً تَطَوُّعًا غَيْرَ فَرِيضَةٍ إِلَّا بَنَى اللهُ لَهُ بَيْتًا فِي الْجَنَّةِ أَوْ إِلَّا بُنِيَ لَهُ بَيْتٌ فِي الْجَنَّةِ).

ఏ ముస్లిం భక్తుడు రాత్రి పగల్లో ఫర్జ్ కాకుండా పన్నెండు రకాతుల అదనపు (నఫిల్) నమాజు చేస్తూ ఉంటాడో అతనికి వాటికి బదులుగా అల్లాహ్ ఒక గృహము స్వర్గంలో నిర్మిస్తాడు, లేదా ఒక గృహం స్వర్గంలో నిర్మించచబడును“. (ముస్లిం 728).

సున్నతె ముఅక్కద మరియు సాధరణంగా నఫిల్ నమాజులన్నియూ ఇంట్లో చేయడం చాలా ఉత్తమం. ప్రవక్త ﷺ ప్రబోధించారని, జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

 (إِذَا قَضَى أَحَدُكُمْ الصَّلَاةَ فِي مَسْجِدِهِ فَلْيَجْعَلْ لِبَيْتِهِ نَصِيبًا مِنْ صَلَاتِهِ فَإِنَّ اللهَ جَاعِلٌ فِي بَيْتِهِ مِنْ صَلَاتِهِ خَيْرًا).

“మీలోనెవరైనా మస్జిదులో (ఫర్జ్) నమాజు నెరవేర్చుకున్నాక, తన ఇంటి కొరకు కూడా (సున్నతులు, నఫిల్ల లాంటి) నమాజుల యొక్క కొంత భాగాన్ని మిగిలించుకోవాలి. అల్లాహ్ అతని నమాజుకు బదులుగా అతని ఇంట్లో మేలే చేకూర్చుతాడు”. (ముస్లిం 778).

జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

 (فَإِنَّ خَيْرَ صَلَاةِ الْـمَرْءِ فِي بَيْتِهِ إِلَّا الصَّلَاةَ الْـمَكْتُوبَةَ).

“మనిషి తనింట్లో చేసే నమాజు అతి ఉత్తమమైనది. కేవలం ఫర్జ్ నమాజు తప్ప”. (బుఖారి 6113).


ఇతరములు:

సున్నతు మరియు నఫిల్ నమాజులు

ఇస్లాంలో పవిత్ర మాసాలు, రజబ్ మాసంలో ఒక ముస్లిం ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? [2 వీడియోలు & టెక్స్ట్]

మొదటి భాగం:

పార్ట్ 1: ఇస్లాం లో పవిత్ర మాసాల విషయం, వాటి ప్రాముఖ్యత, మరియు వాటిలో జుల్మ్ (అన్యాయం) చేసుకోకూడదు
https://www.youtube.com/watch?v=lDeA6oFXxIc
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) [28 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త రజబ్ మాసం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇది ఇస్లామీయ క్యాలెండర్‌లోని నాలుగు పవిత్ర మాసాలలో ఒకటి అని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా స్పష్టం చేయబడింది. ఈ పవిత్ర మాసాలలో అన్యాయానికి (జుల్మ్) పాల్పడటం తీవ్రంగా నిషేధించబడింది. పాపాలు చేయడం మరియు అల్లాహ్ ఆదేశాలను విస్మరించడం ద్వారా మనిషి తనకు తాను అన్యాయం చేసుకుంటాడని వక్త వివరిస్తారు. షిర్క్, అవిధేయత, మరియు ఇతరులను పీడించడం వంటివి ఆత్మపై చేసుకునే అన్యాయానికి ఉదాహరణలుగా పేర్కొన్నారు. జీవితం అశాశ్వతమని, ఎప్పుడైనా మరణం సంభవించవచ్చని గుర్తు చేస్తూ, పాపాలకు పశ్చాత్తాపం చెంది (తౌబా), అల్లాహ్ వైపునకు మరలాలని వక్త ఉద్భోదిస్తారు.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
[బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్]
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.

మహాశయులారా! ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ఏడవ నెల రజబ్ నెల మొదలైపోయింది. ప్రత్యేకంగా రజబ్ నెల విషయంలో ఏదైనా ప్రసంగం అవసరం ఉండదు. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది మన ముస్లిం సోదర సోదరీమణులు రజబ్ నెలలో అల్లాహ్ మరియు ఆయన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ మాత్రం తెలుపని కొన్ని కార్యాలు చేస్తున్నారు. వాటిని ఖండించడానికి రజబ్ విషయంలో ప్రత్యేకంగా ప్రసంగం అవసరం ఉంటుంది.

ఒక విషయం గమనించండి, మనమందరం ఎవరి దాసులం? అల్లాహ్ దాసులం. మనమందరం అల్లాహ్ యొక్క దాసులమైనప్పుడు, అల్లాహ్ కు ఇష్టమైన విధంగానే మనం ఆయన దాస్యం చేయాలి, ఆయనను ఆరాధించాలి. నిజమే కదా? ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. కానీ ఆయన దాస్యం, ఆయన ఆరాధన ఎలా చేయాలి, అది చూపించడానికి అల్లాహ్ ఏం చేశాడు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనకు ఒక ఆదర్శంగా పంపించారు. అందు గురించి మహాశయులారా, మనం ఏ కార్యం చేసినా కానీ దానికి అల్లాహ్ వైపు నుండి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపు నుండి సాక్ష్యాధారం, రుజువు, దలీల్ తప్పనిసరిగా అవసరం ఉంది.

సామాన్యంగా ఈ రోజుల్లో ఎంతోమంది ఏమనుకుంటున్నారు? పర్వాలేదు, ఇది మంచి కార్యమే, ఇది చేయవచ్చు అన్నటువంటి భ్రమలో పడి ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ అల్లాహ్ వద్ద మనకు ఇష్టమైనటువంటి, మనకు మెచ్చినటువంటి పని స్వీకరించబడదు. అల్లాహ్ వద్ద ఏదైనా పని, ఏదైనా సత్కార్యం స్వీకరించబడడానికి అది అల్లాహ్ లేక ప్రవక్త ఆదేశపరంగా ఉండాలి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపిన పద్ధతి ప్రకారంగా ఉండడం తప్పనిసరి.

రజబ్ నెల దీనికి ఏదైనా ప్రత్యేకత ఉంటే, ఏదైనా గౌరవప్రదం ఉంటే, ఒకే ఒక విషయం ఉంది. అదేమిటి? అల్లాహ్ త’ఆలా తన ఇష్టానుసారం సంవత్సరంలో 12 నెలలు నిర్ణయించాడు. ఆ 12 నెలల్లో నాలుగు నెలలను గౌరవప్రదమైనవిగా ప్రస్తావించాడు. ఆ నాలుగు గౌరవప్రదమైన మాసాల్లో రజబ్ కూడా ఒకటి ఉంది.

సూరె తౌబా ఆయత్ నంబర్ 36 లో అల్లాహ్ త’ఆలా చెప్పాడు:

إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ

నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్‌ దగ్గర – అల్లాహ్‌ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజునుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతున్నది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి.)”  (9:36)

నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ వద్ద పన్నెండు నెలలు ఉన్నాయి. ఫీ కితాబిల్లాహ్, ఈ విషయం అల్లాహ్ వద్ద ఉన్నటువంటి గ్రంథంలో కూడా వ్రాసి ఉంది. ఎప్పటి నుండి ఉంది?

يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ
[యౌమ ఖలకస్సమావాతి వల్ అర్ద్]
ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన నాటి నుండి

భూమి ఆకాశాలను ఆయన సృష్టించినప్పటి నుండి ఈ నిర్ణయం, ఈ విషయం ఉంది.

مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ
[మిన్హా అర్బఅతున్ హురుమ్]
వాటిలో నాలుగు నెలలు పవిత్రమైనవి.

ఆ 12 మాసాల్లో నాలుగు నెలలు, నాలుగు మాసాలు హురుమ్ – నిషిద్ధమైనవి అన్న ఒక భావం వస్తుంది హురుమ్ కు, హురుమ్ అన్న దానికి మరో భావం ఇహ్తిరామ్, హుర్మత్, గౌరవప్రదమైనవి, ఎంతో గొప్పవి అన్నది కూడా భావం వస్తుంది.

ఆయత్ యొక్క ఈ భాగం ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే, అల్లాహ్ ఎప్పటి నుండి భూమి ఆకాశాలను సృష్టించాడో అప్పటి నుండి నెలల సంఖ్య ఎంత? సంవత్సరంలో ఎన్ని నెలలు? 12 నెలలు. దీని ద్వారా మనకు ఒక విషయం తెలిసింది ఏంటంటే ఎవరెవరి వద్ద వారు లెక్కలు చేసుకోవడానికి రోజుల సంఖ్య, నెలల సంఖ్య ఏది ఉన్నా గానీ అల్లాహ్ త’ఆలా నిర్ణయించినటువంటి నెలల సంఖ్య సంవత్సరంలో 12 నెలలు. ఆ నెలల పేర్లు ఏమిటి? మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సహీ బుఖారీ, సహీ ముస్లింలోని హదీసుల్లో ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. మరో విషయం మనకు ఏం తెలిసిందంటే అల్లాహ్ వద్ద గ్రంథం ఏదైతే ఉందో, లౌహె మహ్ఫూజ్ అని దాన్ని అంటారు, అందులో కూడా ఈ విషయం రాసి ఉంది. మరియు నాలుగు నెలలను అల్లాహ్ త’ఆలా గౌరవప్రదమైనవిగా, నిషిద్ధమైనవిగా ప్రస్తావించాడు. ఆ తర్వాత చెప్పాడు:

ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ
[జాలికద్దీనుల్ ఖయ్యిమ్]
ఇదే సరైన ధర్మం. (9:36)

ఇదే సరైన ధర్మం అనడానికి భావం ఏంటంటే, కొందరు నెలల సంఖ్యలో ఏదైతే తారుమారు చేసుకున్నారో అది తప్పు విషయం. మరి ఎవరైతే కొన్ని నెలలను అల్లాహ్ నిషిద్ధపరిచినటువంటి నెలలను ధర్మసమ్మతంగా చేసుకొని, అల్లాహ్ నిషేధించిన కార్యాలు వాటిలో చేస్తూ ఏ తప్పుకైతే గురయ్యారో, అది వాస్తవం కాదు. అల్లాహ్ ఏ విషయం అయితే తెలుపుతున్నాడో అదే సరైన విషయం, అదే నిజమైన విషయం, అదే అసలైన ధర్మం. దీనికి భిన్నంగా, విరుద్ధంగా ఎవరికీ చేయడానికి అనుమతి లేదు. ఇందులో అల్లాహ్ త’ఆలా ఒక ప్రత్యేక ఆదేశం మనకు ఏమి ఇచ్చాడంటే:

فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ
[ఫలా తజ్లిమూ ఫీ హిన్న అన్ఫుసకుమ్]
కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. (9:36)

ఇందులో మీరు ఏ మాత్రం అన్యాయం చేసుకోకండి. ఏ మాత్రం జుల్మ్ చేసుకోకండి.

ఇక సోదరులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినటువంటి హదీస్ ఏమిటంటే, సహీ బుఖారీ, సహీ ముస్లింలో ఉంది,

“అల్లాహ్ త’ఆలా భూమి ఆకాశాలను పుట్టించినప్పటి స్థితిలో నెలల సంఖ్య ఎలా ఉండిందో, అలాగే ఇప్పుడు అదే స్థితిలో తిరిగి వచ్చింది. సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి. ఆ 12 నెలల్లో నాలుగు నెలలు నిషిద్ధమైనవి. ఆ నాలుగు, మూడు నెలలు క్రమంగా ఉన్నాయి. జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం. ఈ మూడు నెలలు కంటిన్యూగా, క్రమంగా ఉన్నాయి. మరియు ముదర్ వంశం లేక ముదర్ తెగ వారి యొక్క రజబ్, అది జమాదిల్ ఆఖిరా మరియు షాబాన్ మధ్యలో ఉంది.”

ఇక్కడ ఈ హదీసులో కొన్ని విషయాలు మనం కొంచెం అర్థం చేసుకోవాలి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా ప్రభవింపక ముందు మక్కావాసులు, ఆ కాలం నాటి ముష్రికులు, బహుదైవారాధకులు ఈ నాలుగు నెలలను గౌరవించేవారు. ఈ నాలుగింటిలో మూడు నెలలు క్రమంగా ఉన్నాయి కదా, జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం.

అయితే ఆ కాలంలో ఉన్నటువంటి ఒక దురాచారం, ఒక చెడ్డ అలవాటు, కొన్ని మహా ఘోరమైన పాపాల్లో ఒకటి ఏమిటి? ఇతరులపై అత్యాచారం చేయడం, ఇతర సొమ్మును లాక్కోవడం, దొంగతనాలు చేయడం. ఇటువంటి దౌర్జన్యాలు ఏదైతే వారు చేసేవారో, వారు ఈ నిషిద్ధ మాసాల్లో, గౌరవమనమైన నెలల్లో అలాంటి ఆ చెడు కార్యాల నుండి దూరం ఉండేవారు. విషయం అర్థమవుతుందా? అల్లాహ్ తో షిర్క్ చేసేవారు, ఇంకెన్నెన్నో తప్పు కార్యాలు, పాపాలు చేసేవారు. ప్రజలను పీడించేవారు, బలహీనుల హక్కులను కాజేసేవారు, ఎంతో దౌర్జన్యం, అత్యాచారాలు చేసేవారు. కానీ, ఈ మూడు నెలలు వారు ఎలాంటి దౌర్జన్యానికి, ఇతరులపై ఏ అత్యాచారం చేయకుండా, దొంగలించకుండా వారు శాంతిగా ఉండేది. కానీ మూడు నెలలు కంటిన్యూగా శాంతిపరంగా ఉండడం వారికి భరించలేని విషయమై, మరో చెడ్డ కార్యం ఏం చేశారో తెలుసా? జుల్ హిజ్జాలో హజ్ జరుగుతుంది. అందుగురించి జుల్ ఖాదా, జుల్ హిజ్జా ఈ రెండు మాసాలు గౌరవించేవారు.

కానీ ముహర్రం నెల గురించి ఏమనేవారు? ఈసారి ముహర్రం సఫర్ లో వస్తుంది, ఈ ముహర్రంని ఇప్పుడు మనం సఫర్ గా భావిద్దాము. సఫర్ నెల ఎప్పుడు ఉంది? రెండో నెల. ముహర్రం తర్వాత సఫర్ ఉంది కదా. వాళ్ళు ఏమనేవారు? సఫర్ ను ముహర్రం గా చేసుకుందాము, ఈ ముహర్రంను సఫర్ గా చేసుకుందాము. ఇప్పుడు ఈ ముహర్రం మాసాన్ని ఏదైతే సఫర్ గా వారు అనుకున్నారో, దొంగతనం చేసేవారు, లూటీ చేసేవారు, ఇంకా పాప కార్యాలకు పాల్పడేవారు. ఆ తర్వాత నెల ఏదైతే ఉందో, దాన్ని ముహర్రంగా భావించారు కదా, అప్పుడు కొంచెం శాంతిగా ఉండేవారు. ఎందుకంటే మూడు నెలలు కంటిన్యూగా ఉండడం వారికి కష్టతరంగా జరిగింది. అయితే అలాంటి విషయాన్ని కూడా అల్లాహ్ త’ఆలా ఖండించాడు. సూరె తౌబా ఆయత్ నంబర్ 37 లో ఈ విషయాన్ని ఖండించడం జరిగింది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే చెప్పారో, కాలం తిరిగి తన అసలైన స్థితిలోకి, రూపంలోకి వచ్చింది అని ఏదైతే ప్రవక్త చెప్పారో, ఈ విషయం ఎప్పుడు చెప్పారు ప్రవక్త? తాను హజ్ ఏదైతే సంవత్సరంలో చేశారో ఆ సంవత్సరం చెప్పారు. ఆ సంవత్సరంలో నెలల్లో ఎలాంటి తారుమారు లేకుండా, వెనక ముందు లేకుండా, అల్లాహ్ త’ఆలా సృష్టించినప్పటి స్థితిలో ఎట్లానైతే అసల్ స్థితిలో ఉండెనో, అదే స్థితిలో ఉండినది. అదే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.

మరో విషయం ఇందులో గౌరవించగలది ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నాలుగు మాసాలు నిషిద్ధమైనవి, గౌరవప్రదమైనవి. వాటిలో మూడు కంటిన్యూగా ఉన్నాయి, జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం. నాలుగవది రజబ్. ఆ రజబ్ అని కేవలం చెప్పలేదు, ఏం చెప్పారు? రజబ్ ముదర్ అని చెప్పారు. ముదర్ ఒక తెగ పేరు. కబీలా అని అంటాం కదా. ప్రవక్త కాలంలో అప్పుడు ఇంకా ఎన్నో తెగలు ఉండేవి. జమాదుల్ ఆఖిరా తర్వాత రజబ్ ఉంది, రజబ్ తర్వాత షాబాన్. అయితే కొన్ని తెగలు ఈ రజబ్ ను రజబ్ గా భావించకుండా, రమదాన్ ను రజబ్ గా కొందరు అనేవారు. రమదాన్ మాసాన్ని ఏమనేవారు? ఎవరు? వేరే కొన్ని తెగల వాళ్ళు. కానీ ముదర్ తెగ ఏదైతే ఉండెనో, ఆ తెగ వారు రజబ్ నే రజబ్ గా నమ్మేవారు. రజబ్ ను ఒక గౌరవప్రదమైన, అల్లాహ్ నిషేధించిన ఒక మాసంగా వారు విశ్వసించేవారు. అందు గురించి ప్రజలందరికీ తెలియడానికి, వేరే ప్రజలు ఎవరైతే రమదాన్ ను రజబ్ గా చేసుకున్నారో ఆ రజబ్ కాదు, ముదర్ ఏ రజబ్ నైతే రజబ్ మాసంగా నమ్ముతున్నారో మరి ఏదైతే జమాదుల్ ఆఖిరా తర్వాత, షాబాన్ కంటే ముందు ఉందో ఆ రజబ్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశదీకరించారు, వివరించారు.

అయితే ఈ గౌరవప్రదమైన మాసంలో అల్లాహ్ త’ఆలా మనల్ని ఒక ముఖ్యమైన విషయం నుండి ఆపుతున్నాడు. అదేమిటి?

فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ
[ఫలా తజ్లిమూ ఫీ హిన్న అన్ఫుసకుమ్]
మీరు ఈ గౌరవప్రదమైన మాసంలో జుల్మ్ చేయకండి, జుల్మ్ చేసుకోకండి, అన్యాయం చేయకండి, అన్యాయం చేసుకోకండి.

ఇక్కడ కొందరు ఇలాగ అడగవచ్చు, ఈ నాలుగు మాసాల్లోనే జుల్మ్ చేయరాదు, మిగతా మాసాల్లో చేయవచ్చా? అలా భావం కాదు. ప్రతిచోట అపోజిట్ భావాన్ని తీసుకోవద్దు. దీనికి ఒక ఉదాహరణ ఇస్తాను. మన సమాజంలో ఎవరైనా మస్జిద్ లో కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదైనా అబద్ధం పలికాడు అనుకోండి, మనలో ఒక మంచి వ్యక్తి ఏమంటాడు? అరె, ఏంట్రా, మస్జిద్ లో ఉండి అబద్ధం మాట్లాడుతున్నావా? అంటారా లేదా? అంటే భావం ఏంటి? మస్జిద్ బయట ఉండి అబద్ధం మాట్లాడవచ్చు అనే భావమా? కాదు. ఆ బయటి స్థలాని కంటే ఈ మస్జిద్ యొక్క స్థలం ఏదైతే ఉందో దీనికి ఒక గౌరవం అనేది, ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది. నువ్వు బయట చెప్పినప్పుడు, అబద్ధం పలికినప్పుడు, ఏదీ ఏమీ నీవు ఆలోచించకుండా, కనీసం ఇప్పుడు నీవు అల్లాహ్ యొక్క గృహంలో ఉన్నావు, మస్జిద్ లో ఉన్నావు. ఈ విషయాన్ని గ్రహించి అబద్ధం ఎందుకు పలుకుతున్నావు? అక్కడ విషయం మస్జిద్ బయట అబద్ధం పలకవచ్చు అన్న భావం కాదు. మస్జిద్ లో ఉండి ఇంకా మనం చెడులకు, అన్ని రకాల పాపాలకు ఎక్కువగా దూరం ఉండాలి, దూరంగా ఉండాలి అన్నటువంటి భావం. అలాగే ప్రతి నెలలో, ప్రతి రోజు జుల్మ్ కు, అన్యాయానికి, దౌర్జన్యానికి, అత్యాచారానికి దూరంగా ఉండాలి. కానీ ఈ నిషిద్ధ మాసాల్లో, ఈ నాలుగు మాసాల్లో ప్రత్యేకంగా దూరం ఉండాలి. ఇది అయితే తెలిసింది. కానీ జుల్మ్ అని ఇక్కడ ఏదైతే చెప్పబడిందో, ఆ జుల్మ్ అన్నదానికి భావం ఏంటి? మరి అల్లాహ్ త’ఆలా ఏమన్నాడు ఇక్కడ?

فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ
[ఫలా తజ్లిమూ ఫీ హిన్న అన్ఫుసకుమ్]
మీ ఆత్మలపై మీరు అన్యాయం చేసుకోకండి.

మీ ఆత్మలపై మీరు దౌర్జన్యం చేసుకోకండి అని అంటున్నాడు అల్లాహ్ త’ఆలా. ఎవరైనా తెలివిమంతుడు, బుద్ధి జ్ఞానం గలవాడు, తనకు తాను ఏదైనా అన్యాయం చేసుకుంటాడా? చేసుకోడా? అందరూ ఇదే నిర్ణయంపై ఉన్నారు కదా. మరి అల్లాహ్ త’ఆలా అదే విషయం అంటున్నాడు, మీరు అంటున్నారు చేసుకోరు. మరి వారు చేసుకోకుంటే, అల్లాహ్ త’ఆలా ఎందుకు చేసుకోకండి అని అంటున్నాడు? వారు చేసుకుంటున్నారు గనుకనే అల్లాహ్ త’ఆలా చేసుకోకండి అని అంటున్నాడు. అంటే మన ఆత్మలపై మనం అన్యాయం ఎలా చేసుకుంటున్నాము? మన ఆత్మలపై మనం జుల్మ్ ఎలా చేస్తున్నాము? ఈ విషయం మనం గ్రహించాల్సింది.

ఈ విషయాన్ని మనం ఖురాన్, హదీస్ ఆధారంగా సరైన విధంలో అర్థం చేసుకుంటే, మన జీవితాల్లో వాస్తవానికి ఎంతో గొప్ప మార్పు వచ్చేస్తుంది. ఇమాం తబరీ రహమతుల్లా అలైహి చెప్పారు: “లా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుమ్”, మీరు ఇందులో ప్రత్యేకంగా ఈ మాసాల్లో మీపై అన్యాయం చేసుకోకండి అంటే ఏమిటి? ఇర్తికాబుల్ మాసియా వ తర్కుత్తాఆ. జుల్మ్ దేన్నంటారు? ఇర్తికాబుల్ మాసియా – పాప కార్యానికి పాల్పడడం వ తర్కుత్తాఆ – అల్లాహ్ విధేయతను, పుణ్య కార్యాన్ని వదులుకోవడం. పాపానికి పాల్పడడం, పుణ్యాన్ని వదులుకోవడం, దీన్ని ఏమంటారు? జుల్మ్ అంటారు.

సామాన్యంగా మన సౌదీ దేశంలో ఉండి, జుల్మ్ అంటే ఏంటి అంటే, కఫీల్ మనకు మన జీతాలు ఇవ్వకపోవడం అని అనుకుంటాము. అది కూడా ఒక రకమైన జుల్మ్. కానీ అందులోనే జుల్మ్ బంధించిలేదు. జుల్మ్ యొక్క భావం కొంచెం విశాలంగా ఉంది. ఇమాం కుర్తుబీ రహమతుల్లా అలైహి చెప్పారు, “లా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుమ్ బిర్తికాబి జునూబ్”, మీరు పాపాలకు పాల్పడి అన్యాయం చేసుకోకండి.

ఇక మీరు ఖురాన్ ఆయతులను పరిశీలిస్తే, ఎప్పుడైతే ఒక మనిషి అల్లాహ్ ఇచ్చిన ఆదేశాన్ని వదులుకుంటున్నాడో, పాటించడం లేదో, లేక అల్లాహ్ త’ఆలా ఏ దుష్కార్యం నుండి వారించాడో, చేయవద్దు అని చెప్పాడో, దానికి పాల్పడుతున్నాడో, అతడు వాస్తవానికి తనపై అన్యాయం చేసుకున్నవాడు అవుతున్నాడు.

ఉదాహరణకు స్కూల్ లో ఒక స్టూడెంట్ హోంవర్క్ చేసుకొని రాలేదు. అతనికి తెలుసు, నేను ఈ రోజు హోంవర్క్ ఇంట్లో చేయకుంటే రేపటి రోజు స్కూల్ లో వెళ్ళిన తర్వాత టీచర్ నన్ను దండిస్తాడు, కొడతాడు, శిక్షిస్తాడు. తెలుసు విషయం. తెలిసి కూడా అతను హోంవర్క్ చేయలేదు. వెళ్ళిన తర్వాత ఏమైంది? టీచర్ శిక్షించాడు అతన్ని. అతడు స్వయంగా తనపై అన్యాయం చేసుకున్నవాడు అయ్యాడా లేదా? ఎట్లా? అతనికి ఏ దెబ్బలైతే తగిలిందో టీచర్ వైపు నుండి, లేక ఏ శిక్ష అయితే టీచర్ వైపు నుండి అతనిపై పడిందో, అది ఎందువల్ల? ముందు నుండే అతడు అతనికి టీచర్ ఏదైతే ఆదేశం ఇచ్చాడో హోంవర్క్ చేయాలని అది చేయనందుకు. ఈ విషయం ఈ సామెత, ఈ ఉదాహరణ అర్థమవుతుంది కదా. అలాగే అల్లాహ్ త’ఆలా మనకు డైరెక్ట్ గా స్వయంగా ఖురాన్ ద్వారా గానీ, లేకుంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా గానీ ఏ ఆదేశాలు అయితే ఇచ్చాడో, వాటిని పాటించకపోవడం, వేటి నుండి అల్లాహ్ త’ఆలా మనల్ని వారించాడో, ఇవి చేయకండి అని చెప్పాడో, వాటికి పాల్పడడం, ఇది మనపై మనం అన్యాయం చేసుకుంటున్నట్లు.

దీనికి ఖురాన్ సాక్ష్యం చూడండి సూరె బఖరా ఆయత్ నంబర్ 54.

إِنَّكُمْ ظَلَمْتُمْ أَنفُسَكُم بِاتِّخَاذِكُمُ الْعِجْلَ
[ఇన్నకుమ్ జలమ్తుమ్ అన్ఫుసకుమ్ బిత్తిఖాజికుముల్ ఇజ్ల్]
మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: “ఓ నా జాతివారలారా! ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకుని మీరు మీ స్వయానికి అన్యాయం చేసుకున్నారు.” (2:54)

ఇది మూసా అలైహిస్సలాం బనీ ఇస్రాయిల్ వారితో చెప్పి ఉన్నారు. ఎప్పుడైతే మూసా అలైహిస్సలాంని అల్లాహ్ త’ఆలా తూర్ పర్వతం వైపునకు పిలిపించాడో, ఆయన అటు వెళ్లారు, ఇటు కొందరు ఒక ఆవు దూడను తయారు చేశారు, బంగారంతో తయారు చేసి అందులో ఒక వ్యక్తి ఏమన్నాడు? ఇదిగో మూసా అల్లాహ్ పిలుస్తున్నాడు అని ఎక్కడికో వెళ్ళాడు. మీ దేవుడు ఇక్కడ ఉన్నాడు, వీటిని మీరు పూజించండి అని చెప్పాడు, అస్తగ్ఫిరుల్లాహ్. మూసా అలైహిస్సలాం తిరిగి వచ్చిన తర్వాత వారిపై చాలా కోపగించుకున్నాడు. చెప్పాడు, “ఇన్నకుమ్ జలమ్తుమ్ అన్ఫుసకుమ్”, మీరు మీ ఆత్మలపై అన్యాయం చేసుకున్నారు. “బిత్తిఖాజికుముల్ ఇజ్ల్”, ఈ దూడను ఒక దేవతగా చేసుకొని. మీకు ఆరాధ్య దైవంగా మీరు భావించి, మీపై అన్యాయం చేసుకున్నారు. ఇక ఈ ఆయత్ ద్వారా మనకు ఏం తెలుస్తుంది? షిర్క్ అతి గొప్ప, అతి భయంకరమైన, అతి చెడ్డ దౌర్జన్యం, అతి చెడ్డ జుల్మ్.

ఇంకా అలాగే సోదరులారా, అల్లాహ్ ఇచ్చిన ఆదేశాన్ని పాటించకపోవడం, అల్లాహ్ కు కృతజ్ఞత, శుక్రియా చెప్పుకోకపోవడం, తెలుపుకోకపోవడం ఇది కూడా మహా దౌర్జన్యం, జుల్మ్ కింద లెక్కించబడుతుంది. మరి మూడు ఆయతుల తర్వాత, అదే బనీ ఇస్రాయిల్ పై అల్లాహ్ త’ఆలా వారికి ఏ వరాలైతే ప్రసాదించాడో, వారికి అల్లాహ్ త’ఆలా కారుణ్యాలు ఇచ్చాడో ప్రస్తావిస్తూ: “వ జల్లల్నా అలైకుముల్ గమామ్”, మేము మీపై మేఘాల ద్వారా నీడ కలిగించాము. “వ అన్జల్నా అలైకుముల్ మన్న వస్సల్వా”, మన్ మరియు సల్వా తినే మంచి పదార్థాలు మీకు ఎలాంటి కష్టం లేకుండా మీకు ఇచ్చుకుంటూ వచ్చాము. “కులు మిన్ తయ్యిబాతి మా రజక్నాకుమ్”, మేము ప్రసాదించిన ఈ ఆహారాన్ని మీరు తినండి. కానీ ఏం చేశారు వాళ్ళు? కృతజ్ఞత చూపకుండా దానికి విరుద్ధంగా చేశారు. మూసా ప్రవక్త మాటను వినకుండా అవిధేయతకు పాల్పడ్డారు. అల్లాహ్ అంటున్నాడు, “కులు మిన్ తయ్యిబాతి మా రజక్నాకుమ్ వమా జలమూనా”, అయితే వారు మాపై అన్యాయం చేయలేదు, మాపై జుల్మ్ చేయలేదు. “వలాకిన్ కానూ అన్ఫుసహుమ్ యజ్లిమూన్”, వారు తమ ఆత్మలపై మాత్రమే అన్యాయం చేసుకున్నారు.

ఎంత మంది మీలో పెళ్ళైన వాళ్ళు ఉన్నారు? ఎందుకంటే భార్య భర్తల జీవిత విషయంలో కూడా అల్లాహ్ త’ఆలా ఒక విషయాన్ని తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్నట్లు అని అంటున్నాడు. కానీ సామాన్యంగా మనం ఈ విషయం గమనించము. నేనే పురుషుడిని, నేనే మగవాడిని, భార్య నాకు బానిస లాంటిది అన్నటువంటి తప్పుడు భావాల్లో పడి ఎంతో పీడిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఎప్పుడైతే జీవితాల్లో ప్రేమానురాగాలు తగ్గుతాయో, మందగిస్తాయో, మంచి విధంగా జీవించి ఉండరు, మంచి విధంగా తెగతెంపులు చేసుకోకుండా పీడిస్తూ ఉంటారు. ఇది మహా పాపకార్యం. సూరె బఖరా 231 ఆయత్ లో అల్లాహ్ చెప్తున్నాడు:

وَلَا تُمْسِكُوهُنَّ ضِرَارًا لِّتَعْتَدُوا
[వలా తుమ్సికూహున్న జిరారల్ లితఅతదూ]
“వారిని నష్టపరచాలనే దురుద్దేశంతో (ఇద్దత్ సమయంలో) ఆపకండి. (2:231)

వారికి ఏదైనా నష్టం చేకూర్చడానికి మీరు వారిని ఆపి ఉంచకండి. “లితఅతదూ”, వారిపై ఏదైనా దౌర్జన్యం చేయడానికి, వారిపై ఏదైనా అన్యాయం చేయడానికి మీరు వారిని ఆపుకొని ఉంచకండి. అంటే ఆపుకొని ఉంచకండి అంటే విడాకులు ఇవ్వడం లేదు, ఇటు మంచి విధంగా ప్రేమపూర్వకమైన జీవితం గడపడం లేదు. అల్లాహ్ ఏమంటున్నాడు?

وَمَن يَفْعَلْ ذَٰلِكَ
[వమయ్ యఫ్అల్ జాలిక]
ఎవరైతే ఇలా చేస్తారో,

అల్లాహ్ ఒక ఆదేశం ఇచ్చాడు కదా, ఏమి ఇచ్చాడు? మీరు నష్టం చేకూర్చడానికి, అన్యాయం చేయడానికి మీరు వారిని ఆపుకొని ఉంచకండి. ఇక ఎవరైతే ఇలా చేస్తారో, “వమయ్ యఫ్అల్ జాలిక”, ఎవరైతే తమ భార్యలను వారిని పీడించడానికి, వారిపై అన్యాయం చేయడానికి, నష్టం చేకూర్చడానికి ఆపుకొని ఉంటారో,

فَقَدْ ظَلَمَ نَفْسَهُ
[ఫఖద్ జలమ నఫ్సహ్]
అతను తనపై అన్యాయం చేసుకుంటున్నాడు, తనపై జుల్మ్ చేస్తున్నాడు. (2:231)

చూడడానికి అతడు ఆమెపై దౌర్జన్యం చేస్తున్నాడు, కానీ వాస్తవానికి “జలమ నఫ్సహూ”, అతడు తనపై అన్యాయం చేసుకుంటున్నాడు. తనపై జుల్మ్ చేస్తున్నాడు.

ఇక ఈ అతడు తనపై ఎలా అన్యాయం చేస్తున్నాడు అనే విషయాన్ని వివరించడానికి ఎంతో సమయం అవసరం. ఇలాంటి ఉదాహరణలు మన సమాజంలో ఎంతో, ఎన్నో మనకు కనబడతాయి. కానీ నేను చెప్పబోయే విషయం ఏంటి? ఎప్పుడైతే మనిషి అల్లాహ్ యొక్క ఆజ్ఞను దాటుతాడో, అల్లాహ్ నిషేధించిన వాటికి పాల్పడతాడో, అతడు వాస్తవానికి తనపై జుల్మ్ చేసుకున్నవాడు అవుతున్నాడు.

ఈ విధంగా ఖురాన్ లో చూస్తూ పోతే ఎన్నో ఆయతులు మనకు కానవస్తాయి. కానీ సోదరులారా, గమనించవలసిన విషయం ఏంటంటే అల్లాహ్ త’ఆలా ప్రత్యేకంగా ఈ నాలుగు మాసాల్లో, ఇంకా మిగతా 12 మాసాల్లో కూడా మనల్ని అన్ని రకాల జుల్మ్, అన్ని రకాల పాప కార్యాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తున్నాడు. ఒకవేళ ఎప్పుడైనా ఎవరి వైపు నుండి ఏదైనా అన్యాయం, జుల్మ్ వారి తమ ఆత్మలపై జరిగితే ఏం చేయాలి? సూరె నిసా ఆయత్ నంబర్ 110 లో చెప్పాడు:

وَمَن يَعْمَلْ سُوءًا أَوْ يَظْلِمْ نَفْسَهُ ثُمَّ يَسْتَغْفِرِ اللَّهَ يَجِدِ اللَّهَ غَفُورًا رَّحِيمًا

[వమయ్ యఅమల్ సూఅన్ అవ్ యజ్లిమ్ నఫ్సహూ సుమ్మ యస్తగ్ఫిరిల్లాహ యజిదిల్లాహ గఫూరర్ రహీమా]
ఎవరయినా దుష్కార్యానికి పాల్పడి లేదా తనకు తాను అన్యాయం చేసుకుని, ఆ తరువాత క్షమాపణకై అల్లాహ్‌ను అర్థిస్తే, అతడు అల్లాహ్‌ను క్షమాశీలిగా, కృపాశీలిగా పొందుతాడు.” (4:110)

ఎవరైనా ఏదైనా పాప కార్యానికి పాల్పడితే, లేదా తన ఆత్మపై తాను జుల్మ్ చేసుకుంటే, ఆ తర్వాత స్వచ్ఛమైన రూపంలో అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటే, అల్లాహ్ ను క్షమించేవాడు, కరుణించేవాడు, మన్నించేవాడుగా పొందుతాడు.

అందు గురించి సోదరులారా, ఇకనైనా గమనించండి. జీవితం ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలుసా? ఎప్పుడు ప్రాణం పోతుందో తెలుసా మనకు? ఏ మాత్రం తెలియదు. ఇంచుమించు నెల కాబోతుంది కావచ్చు. ఒక టైలర్, పెద్ద మనిషి ఇక్కడ చనిపోయి. సామాన్యంగా వచ్చాడు, భోజనం చేశాడు, హాయిగా స్నేహితులతో కూర్చున్నాడు, కొంత సేపట్లోనే నాకు ఛాతీలో చాలా నొప్పి కలుగుతుంది అని, కొంత సేపటి తర్వాత, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళండి, ఇక నేను భరించలేను అన్నాడు. మిత్రులు బండిలో వేసుకొని వెళ్తున్నారు, హాస్పిటల్ చేరకముందే ఈ జీవితాన్ని వదిలేశాడు. మనలో కూడా ఎవరికి ఎప్పుడు చావు వస్తుందో తెలియదు. ఇంకా మనం ఏ కలలు చూసుకుంటూ ఉన్నాము? ఇంకా ఎందుకు మనం పాప కార్యాల్లో జీవితం గడుపుతూ ఉన్నాము? అల్లాహ్ ఆదేశాలకు దూరంగా, ఖురాన్ నుండి దూరంగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశాలకు దూరంగా, నమాజులను వదులుకుంటూ, ఇంకా ఇతర పాప కార్యాల్లో మనం మునిగిపోతూ, ఇంకెన్ని రోజులు మనం ఇలాంటి జీవితం గడుపుతాము?

సోదరులారా, వాస్తవానికి ఏ ఒక్క మనిషి ఏ చిన్న పాపం చేసినా గానీ అతను తనపై అన్యాయం చేసుకున్నవాడు అవుతాడు. కానీ ఇకనైనా గుణపాఠం తెచ్చుకొని సూరె నిసా ఆయత్ నంబర్ 110 లో అల్లాహ్ చెప్పినట్లుగా, వెంటనే మనం ఇస్తిగ్ఫార్, తౌబా, పశ్చాత్తాపం చెందుతూ అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉంటే తప్పకుండా అల్లాహ్ త’ఆలా క్షమిస్తాడు.

ఇక రజబ్ మాసంలో ఇంకా ఏ దురాచారాలు, ఏ బిదత్లైతే జరుగుతాయో, వాటి గురించి మనం వచ్చే వారంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.


రెండవ భాగం:



రజబ్ మాసంలో జరిగే బిద్’అత్ (దురాచారాలు)

రజబ్ మాసంలో ఒక ముస్లిం ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? 
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=cNwTV9mjw1g [29 నిముషాలు]

ఈ ప్రసంగంలో, రజబ్ నెల యొక్క పవిత్రత మరియు ఆ నెలలో ముస్లింలు దూరంగా ఉండవలసిన పాపాల గురించి వివరించబడింది. అజ్మీర్ ఉర్సు, ప్రత్యేక నమాజులు (సలాతుర్ రగాఇబ్), ప్రత్యేక ఉపవాసాలు మరియు 27వ రాత్రి మేరాజ్ ఉత్సవాలు వంటివి ఇస్లాంలో లేని నూతన కల్పనలని (బిద్అత్) వక్త స్పష్టం చేశారు. అనంతరం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గగన ప్రయాణం (ఇస్రా మరియు మేరాజ్) యొక్క అద్భుత సంఘటనను వివరించారు. ఈ ప్రయాణం ఎందుకు జరిగింది, దాని సందర్భం, ప్రయాణంలో ఎదురైన అద్భుతాలు, వివిధ ప్రవక్తలతో సమావేశం, మరియు ఐదు పూటల నమాజ్ వంటి బహుమానాలు ఎలా లభించాయో వివరించారు. మేరాజ్ నుండి మనం నేర్చుకోవలసిన అసలైన గుణపాఠం ఉత్సవాలు జరుపుకోవడం కాదని, అల్లాహ్ ప్రసాదించిన ఆదేశాలను, ముఖ్యంగా నమాజ్‌ను మన జీవితంలో ఆచరించడమని నొక్కిచెప్పారు.

أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బఅద్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ పైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా మరియు ఆయన సహచరులందరిపైనా అల్లాహ్ యొక్క శాంతి మరియు కారుణ్యం వర్షించుగాక. ఆ తర్వాత…

గతవారంలో మనం రజబ్ నెలలో అల్లాహ్ మనకు ఇచ్చిన ఆదేశం ఏంటి? రజబ్ నెలతో పాటు మిగతా మూడు నెలలు, అంటే టోటల్ నాలుగు గౌరవప్రదమైన నెలలలో ప్రత్యేకంగా జుల్మ్ నుండి, అన్యాయం, అత్యాచారం, దౌర్జన్యం వీటి నుండి దూరం ఉండాలన్న ఆదేశం అల్లాహ్ మనకిచ్చాడు. అయితే దురదృష్టవశాత్తు అనండి, ఎంతోమంది ముస్లింలు ఈ రజబ్ నెలలో ఎన్నో దురాచారాలకు పాల్పడుతున్నారు.

ఉదాహరణకు, రజబ్ నెల మొదలైన వెంటనే, అజ్మీర్ అన్న ప్రాంతం ఏదైతే ఉందో, అక్కడ ఉన్న ఒక సమాధికి ఎంతో గౌరవ స్థానం ఇచ్చి, దాని యొక్క దర్శనం, దాని యొక్క ఉర్స్, యాత్రలు చేయడం. వాస్తవానికి, సమాధిని ఇటుక సిమెంట్లతో కట్టి, దాని మీద గోపురాలు కట్టి, దానికి ఒక సమయం అని నిర్ణయించి ప్రజలు అక్కడికి రావడం, ఇది ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమైన కార్యం. అంతేకాకుండా మరో ఘోరమైన విషయం ఏమిటంటే, ఎందరో సామాన్య ప్రజలలో ఒక మాట చాలా ప్రబలి ఉంది. అదేమిటి? ధనవంతుల హజ్ మక్కాలో అవుతుంది, మాలాంటి బీదవాళ్లు ఏడుసార్లు అజ్మీర్‌కు వెళ్తే ఒక్కసారి హజ్ చేసినంత సమానం అని. ఇది కూడా మహా ఘోరమైన, పాపపు మాట. అల్లాహ్ త’ఆలా ఇహలోకంలో సర్వ భూమిలోకెల్లా హజ్ అన్నది కేవలం మక్కా నగరంలో కాబతుల్లా యొక్క తవాఫ్, సఫా మర్వా యొక్క సయీ, ముజ್ದలిఫా, అరఫాత్, మినా ఈ ప్రాంతాల్లో నిలబడటం, అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసినటువంటి కార్యాలు చేయడం, ఇదే హజ్ కానీ, ఇది కాకుండా వేరే ఏదైనా సమాధి, వేరే ఏదైనా ప్రాంతం, ఏదైనా ప్రదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చి, దానికి హజ్ లాంటి పేరు పెట్టుకోవడం ఇది చాలా ఘోరమైన పాపం.

ఇంకా మరికొందరు ఈ రజబ్ నెలలోని మొదటి వారంలో గురువారం రాత్రి, శుక్రవారానికి ముందు ఒక ప్రత్యేక నమాజ్ చదువుతారు. సలాతుర్ రగాఇబ్ అని దాని పేరు. ఇలాంటి నమాజ్ చేయాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఏ ఒక్క హదీసు, ఏ ఒక్క ఆదేశం లేదు. పోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరులు సహాబా-ఎ-కిరామ్ మరియు ఆ తర్వాత కాలాలలో శ్రేష్ఠ కాలాలలో వచ్చినటువంటి ధర్మవేత్తలు, ధర్మ పండితులు ఇలాంటి నమాజ్ గురించి ఏ ఒక్క ఆదేశం లేదు అని స్పష్టం చేశారు.

ఇంకా మరికొందరు ప్రత్యేకంగా రజబ్ నెలలో ఉపవాసాలు పాటిస్తారు. అయితే రజబ్ నెలలో ప్రత్యేకమైన ఉపవాసాలు పాటించినట్లు ప్రవక్త ద్వారా ఏ రుజువు లేదు. కాకపోతే, ఎవరైనా ప్రతీ నెలలో సోమవారం, గురువారం అల్లాహ్ వద్ద సర్వ మానవుల కార్యాలు లేపబడతాయి గనుక, ఇతర నెలలో ఉంటున్నట్లు ఈ నెలలో కూడా ఉపవాసాలు ఉండేది ఉంటే అభ్యంతరం లేదు. ప్రతీ నెలలో మూడు ఉపవాసాలు ఉన్నవారికి సంవత్సరం అంతా ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త చెప్పారు గనుక, ఎవరైనా రజబ్ నెలలో కూడా మూడు ఉపవాసాలు ఉండేది ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు. అంటే ఇతర రోజుల్లో కూడా వారు, ఇతర మాసాల్లో కూడా వారు ఉంటున్నారు గనుక. కానీ ప్రత్యేకంగా రజబ్ కు ఏదైనా ప్రాధాన్యత ఇస్తూ ఉపవాసం ఉండటం ప్రవక్తతో, సహాబాలతో రుజువు లేని విషయం.

అలాగే మరో దురాచారం ఈ రజబ్ నెలలో ఏమిటంటే, కొందరు 22వ తారీఖు నాడు రజబ్ కే కూండే అని చేస్తారు. అంటే ఓ ప్రత్యేకమైన కొన్ని వంటకాలు చేసి దానిపై ఫాతిహా, నియాజ్‌లు చేసి జాఫర్ సాదిక్ (రహ్మతుల్లాహి అలైహి) పేరు మీద మొక్కడమనండి, లేక ఆయన పేరు మీద నియాజ్ చేయడం అనండి. అయితే సోదరులారా, నియాజ్ అని ఏదైతే ఉర్దూలో అంటారో, మొక్కుకోవడం అని దానికి భావన వస్తుంది. అయితే ఇది కేవలం అల్లాహ్ గురించే చెల్లుతుంది. అల్లాహ్ కు కాకుండా ఇక వేరే ఎవరి గురించి ఇలాంటి నియాజ్‌లు చేయడం ధర్మ సమ్మతం కాదు. పోతే ఈ పద్ధతి, అంటే ఏదైనా ప్రత్యేక వంటకాలు చేసి, వాటి మీద కొన్ని సూరాలు చదివి ఊది నియాజ్‌లు చేయడం, ఇది ఈ నెలలో గాని, ఏ నెలలో గాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఈ పద్ధతిని నేర్పలేదు. అందు గురించి ఇలాంటి దురాచారాల నుండి కూడా మనం దూరం ఉండాలి.

ఇంకొందరు మనం చూస్తాము, 27వ రాత్రి జాగారం చేస్తారు, రాత్రి మేల్కొని ఉంటారు, మస్జిద్ లలో పెద్ద లైటింగ్‌లు చేస్తారు. ఆ మస్జిద్ లలో వచ్చి కొన్ని ప్రార్థనలు, నమాజులు, ఖురాన్ పారాయణం, ఇంకా వేరే కొన్ని కార్యాలు చేసి ఆ రాత్రిని, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు మేరాజ్ ఉన్-నబీ ఏదైతే ప్రాప్తమైందో, మేరాజ్. అంటే రాత్రి యొక్క అతి చిన్న సమయంలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ త’ఆలా జిబ్రీల్ ద్వారా మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వరకు తీసుకెళ్లారు. అక్కడ నుండి ఏడు ఆకాశాల పైకి వెళ్లారు. అక్కడ స్వర్గం, నరకాలను దర్శించారు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్‌తో మాట్లాడారు. మరియు తిరిగి వస్తూ వస్తూ ఐదు పూటల నమాజ్‌ల యొక్క గొప్ప బహుమానం కూడా తీసుకొచ్చారు.

ఇది వాస్తవమైన విషయం. దీనినే సామాన్యంగా తెలుగులో గగన ప్రయాణం అని అంటారు. ఈ గగన ప్రయాణం మన ప్రవక్తకు ప్రాప్తమైంది, ఇది నిజమైన విషయం. కానీ ఏ తారీఖు, ఏ నెల మరియు ఏ సంవత్సరంలో జరిగిందో ఎలాంటి సుబూత్, ఎలాంటి ఆధారం అనేది లేదు. కానీ మన కొందరు సోదరులు 27వ తారీఖు నాడు రాత్రి, అంటే 26 గడిచిన తర్వాత 27, 26 మధ్య రాత్రిలో జాగారం చేసి, ఇది గగన ప్రయాణం, జష్న్-ఎ-మేరాజ్-ఉన్-నబీ అని చేస్తారు. ఇలాంటి మేరాజ్-ఉన్-నబీ ఉత్సవాలు జరపడం కూడా ఇస్లాం ధర్మానికి వ్యతిరేకం.

ఇంతకుముందు మనం తెలుసుకున్నట్లు, గగన ప్రయాణం ప్రవక్తకు మేరాజ్ ప్రాప్తమైంది కానీ, ఏ తారీఖు, ఏ నెల, ఏ సంవత్సరం అన్నది రుజువు లేదు. అయినా, ప్రవక్త గారు మక్కా నుండి మదీనాకు వలస పోక ముందు, హిజ్రత్ చేయక ముందే ఇది జరిగింది అన్నటువంటి ఏకాభిప్రాయం కలిగి ఉంది. అయితే ఈ గగన ప్రయాణం తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పది సంవత్సరాలు మదీనాలో ఉన్నారు. కానీ ఏ ఒక్క సంవత్సరం కూడా మేరాజ్‌ను గుర్తు చేసుకొని ఆ రాత్రి జాగారం చేయడం లాంటి పనులు చేయలేదు.

అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది. దీన్ని ఒక చిన్న సామెత, లేదా అనండి ఉదాహరణ ద్వారా మీకు తెలియజేస్తాను. ఇహలోకంలో మనం కొందరు పండితులను లేదా విద్వాంసులను, లేదా దేశం కొరకు ఏదైనా చాలా గొప్ప మేలు చేసిన వారికి, ఏదైనా సంస్థ గానీ లేకుంటే ప్రభుత్వం గానీ వారిని గౌరవించి వారికి ఇతర దేశంలో టూర్ గురించి వెళ్లి అక్కడి కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను దర్శించి రావడానికి అన్ని రకాల సౌకర్యాలు, టికెట్ ఖర్చులతో పాటు అక్కడ ఉండడానికి, హోటల్లో, అక్కడ తిరగడానికి, అక్కడ ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజుల ఖర్చు గిట్ల మొత్తం భరించి వారిని గౌరవిస్తారు, వారిని సన్మానిస్తారు. విషయం అర్థమవుతుందా? సైన్సులో గాని, ఇంకా వేరే ఏదైనా విషయంలో గాని ఎవరైనా గొప్ప మేలు చేస్తే, వారిని సన్మానించడం, సన్మానిస్తూ వారు చేసిన ఆ మేలుకు ప్రభుత్వం గాని లేదా ఏదైనా సంస్థ గాని ఏం చేస్తుంది? మీరు ఫలానా దేశంలో టూర్ చేసి రండి అన్నటువంటి టికెట్లతో సహా అన్ని ఖర్చులతో సహా వారిని పంపుతుంది.

అలాంటి వ్యక్తి బయటికి పోయి వచ్చిన తర్వాత, అక్కడి నుండి కొన్ని విషయాలు, కొన్ని మంచి అనుభవాలు తీసుకొని వస్తాడు. అయితే, వచ్చిన తర్వాత తన ఇంటి వారికి లేదా తన దేశ ప్రజలకు అక్కడ ఉన్నటువంటి మంచి విషయాల గురించి తెలియజేస్తాడు. ఉదాహరణకు ఎవరైనా జపాన్ వెళ్ళారనుకోండి. అక్కడ టెక్నాలజీ, వారి యొక్క దైనందిన జీవితంలో, డైలీ జీవితంలో ఒక సిస్టమేటిక్‌గా ఏదైతే వారు ఫాలో అవుతున్నారో, వాటవన్నీ చాలా నచ్చి మన భారతదేశాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలనుకుంటే అలాంటి మంచి విషయాలు పాటించాలి అని బోధ చేస్తాడు.

అయితే ఇప్పుడు ఆ మనిషి ఎవరికైతే ఒక సంస్థ లేక ప్రభుత్వం పంపిందో, ఉదాహరణకు అనుకోండి జపాన్‌కే పంపింది, ఏ తారీఖులో ఆయన అటు పోయి వచ్చాడో, ప్రతీ సంవత్సరం ఆ తారీఖున ఇక్కడ ఉత్సవాలు చేసుకుంటే లాభం కలుగుతుందా? లేకుంటే అక్కడికి వెళ్లి వచ్చి అక్కడి నుండి తెచ్చిన అనుభవాలను అనుసరిస్తే లాభం కలుగుతుందా? అక్కడ తీసుకు… అక్కడి నుండి ఏదైతే అనుభవాలు తీసుకొచ్చాడో, అక్కడి నుండి ఏ మంచి విషయాలు అయితే తీసుకొచ్చాడో, వాటిని ఆచరిస్తేనే లాభం కలుగుతుంది. అలాగే, మన ప్రవక్తకు, మన ప్రవక్తను అల్లాహ్ త’ఆలా ఆకాశాల్లోకి పిలిపించి అక్కడ ఏదైతే గొప్ప బహుమానాలు ప్రసాదించాడో అవి మనకు కూడా ఇచ్చారు. అయితే వాటిని మనం ఆచరిస్తేనే మనకు లాభం కలుగుతుంది కానీ, మా ప్రవక్త గారు ఫలానా తారీఖున గగన ప్రయాణం చేశారు అని కేవలం మనం సంతోషపడితే మనకు ఎలాంటి లాభాలు కలగవు.

అయితే సోదరులారా, మనం ఈ మేరాజ్-ఉన్-నబీ సంఘటనలో తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఎలాంటి సందర్భంలో మన ప్రవక్తకు మేరాజ్ గౌరవం ప్రాప్తమైంది? ఈ మేరాజ్ ప్రయాణంలో ప్రవక్తకు ఏ ఏ విషయాలు లభించాయి? రండి సంక్షిప్తంగా ఆ విషయాలు తెలుసుకుందాం.

మక్కాలో మన ప్రవక్త గారు ఇస్లాం ధర్మ ప్రచారం మొదలుపెట్టి ఇంచుమించు 10 సంవత్సరాలు గడుస్తున్నాయి. అయినా అవిశ్వాసుల వైపు నుండి కష్టాలు, బాధలు పెరుగుతూనే పోతున్నాయి. చివరికి ఎప్పుడైతే అబూ తాలిబ్ చనిపోయాడో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి హజ్రత్ ఖదీజా రదియల్లాహు అన్హా గారు చనిపోయారో ఆ తర్వాత మన ప్రవక్త వారిపై దౌర్జన్యాలు, హింసలు ఇంకా పెరిగిపోయాయి.

ఆ సందర్భంలో ప్రవక్త ఏం చేశారు? తాయిఫ్ నగరానికి వెళ్లారు. బహుశా అక్కడి వారు కొందరు ఇస్లాం స్వీకరిస్తారేమో కావచ్చు. కానీ అక్కడ కూడా వారికి, ప్రవక్త గారికి చాలా శారీరకంగా చాలా బాధించారు. అంతేకాకుండా తప్పుడు సమాధానాలు పలికి ప్రవక్త మనసును కూడా గాయపరిచారు. ప్రవక్త అదే బాధలో తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు ఈ గగన ప్రయాణం జరిగింది.

అయితే ఇందులో ఒకవైపు ప్రవక్తకు తృప్తిని ఇవ్వడం జరుగుతుంది. మీరు బాధపడకండి, ఈ భూమిలో ఉన్న ప్రజలు మీ గౌరవాన్ని గుర్తు చేసుకోకుంటే, మీకు అల్లాహ్ త’ఆలా ఎలాంటి స్థానం ఇచ్చాడో దాన్ని వారు గ్రహించకుంటే మీరు ఆకాశాల్లో రండి. ఆకాశంలో ఉన్న వారు మిమ్మల్ని ఎలా గౌరవిస్తారో, మీ యొక్క స్థానాన్ని ఎలా వారు గుర్తిస్తారో చూడండి అని ప్రవక్త గారికి ఒక నెమ్మది, తృప్తి, శాంతి, మనసులో ఏదైతే బాధ ఉందో దానికి మనశ్శాంతి కలిగించడం జరిగింది. దాంతోపాటు ఇదే ప్రయాణంలో ప్రవక్త గారికి ఇంకా ఎన్నో మహిమలు, ఎన్నో రకాల అద్భుతాలు కలిగాయి. ఒక్కొక్కటి వేసి మనం దాన్ని తెలుసుకుందాం.

ప్రవక్త గారి హార్ట్ ఆపరేషన్ ఈ గగన ప్రయాణం కంటే ముందు జరిగింది. అంతకు ముందు ఒకసారి నాలుగు సంవత్సరాల వయసులో కూడా జరిగింది. కానీ గగన ప్రయాణానికి ముందు కూడా ఒకసారి గుండె ఆపరేషన్ చేయడం జరిగింది. అనస్ రదియల్లాహు అన్హు చెప్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఛాతి మీద నేను ఆ ఆపరేషన్ చేసినటువంటి కుట్ల గుర్తులను కూడా చూశాను. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయంలో విశ్వాసం, వివేకాలు నింపబడ్డాయి. (సహీహ్ బుఖారీలో ఈ హదీస్ ఉంది).

గాడిద కంటే కొంచెం పెద్దగా మరియు కంచర గాడిద కంటే కొంచెం చిన్నగా ఉన్నటువంటి ఒక వాహనంపై ప్రవక్తను ఎక్కించడం జరిగింది. దాని పేరు అరబీలో బురాఖ్. రాత్రిలోని అతి తక్కువ సమయంలో మక్కా నుండి ఎక్కడికి వెళ్లారు? బైతుల్ మఖ్దిస్. అక్కడ అల్లాహ్ త’ఆలా తన శక్తితో ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని మన ప్రవక్త ముహమ్మద్ కంటే ముందు వరకు ఎందరు ప్రవక్తలు వచ్చారో ఆ ప్రవక్తలందరినీ అక్కడ జమా చేశాడు. ప్రవక్త గారు వారందరికీ రెండు రకాతుల నమాజ్ చేయించారు.

అక్కడి నుండి, అంటే బైతుల్ మఖ్దిస్ నుండి, ప్రవక్త ఆకాశాల పైకి వెళ్లారు. మొదటి ఆకాశంలో ఆదం అలైహిస్సలాం, రెండవ ఆకాశంలో హజ్రత్ ఈసా మరియు యహ్యా, మూడవ ఆకాశంలో యూసుఫ్, నాల్గవ ఆకాశంలో ఇద్రీస్, ఐదవ ఆకాశంలో హారూన్, ఆరవ ఆకాశంలో మూసా, ఏడవ ఆకాశంలో ఇబ్రాహీం (అలైహిముస్సలాతు వ తస్లీమ్). వీరందరితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలుసుకున్నారు.

ఏడవ ఆకాశాలకు పైగా “సిద్రతుల్ ముంతహా” అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక రేగు చెట్టు ఉంది. ఆ రేగు చెట్టు ఎంత పెద్దదంటే, దాని యొక్క పండు (రేగు పండు ఉంటుంది కదా) చాలా పెద్ద కడవల మాదిరిగా మరియు దాని యొక్క ఆకు ఏనుగు చెవుల మాదిరిగా ఉంటుంది, అంత పెద్ద చెట్టు. దాని యొక్క వ్రేళ్ళు, ప్రతీ చెట్టుకు వ్రేళ్ళు ఉంటాయి కదా కింద, అవి ఆరవ ఆకాశంలో ఉన్నాయి, దాని యొక్క కొమ్మలు ఏడవ ఆకాశంలో చేరుకుంటాయి. అక్కడే ఎన్నో అద్భుతాలు, ఎన్నో విషయాలు జరిగాయి. దానికి దగ్గరే “జన్నతుల్ మఅవా” అన్న స్వర్గం ఉంది.

దైవదూతలు కొందరు ఎవరైతే రాస్తూ ఉంటారో అల్లాహ్ ఆదేశాలను, వారు రాస్తున్న కలముల చప్పుడు కూడా వినిబడుతుంది. ఆ సిద్రతుల్ ముంతహా, ఆ రేగు చెట్టు అక్కడే ప్రవక్త గారికి మూడు విషయాలు ఇవ్వడం జరిగాయి:

  1. 50 పూటల నమాజ్.
  2. సూరహ్ బఖరాలోని చివరి రెండు ఆయతులు.
  3. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నిజంగా విశ్వసించి ఆయనను ఆచరించే వారిలో షిర్క్ చేయని వారు ఎవరైతే ఉంటారో, వారి పెద్ద పాపాలను కూడా అల్లాహ్ త’ఆలా మన్నిస్తాను అంటున్నాడు.

ఇదే రేగు చెట్టు వద్ద ప్రవక్త గారు జిబ్రీల్ అలైహిస్సలాంను ఆయన అసలు సృష్టిలో చూశారు. అక్కడే ప్రవక్త గారు నాలుగు రకాల నదులను చూశారు.

ఆరవ విషయం, అక్కడే ప్రవక్త గారికి పాలు ఒక పళ్లెంలో, మరో పళ్లెంలో తేనె, మరో పళ్లెంలో మత్తు పదార్థం ఇవ్వడం జరిగింది. అయితే ప్రవక్త గారు పాలు తీసుకున్నారు.

ఏడవ ఆకాశంపై బైతుల్ మామూర్ అని ఉంది. ఇక్కడ మనకు భూమి మీద మక్కాలో కాబా ఎలా ఉంది, బైతుల్లాహ్, అక్కడ బైతుల్ మామూర్ అని ఉంది. ప్రతీ రోజు అందులో 70,000 దైవదూతలు నమాజ్ చేస్తారు. ఒకసారి నమాజ్ చేసిన దేవదూతకు మరోసారి అక్కడ నమాజ్ చేసే అవకాశం కలగదు.

ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన మూసా అలైహిస్సలాంను కూడా చూశారు. మూసా అలైహిస్సలాం ఎలా ఉన్నారు, ఈసా అలైహిస్సలాం ఎలా ఉన్నారో ఆ விவரం కూడా ప్రవక్త గారు చెప్పారు. ఇంకా నరకంపై ఒక దేవదూత ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో, అతని పేరు ఖురాన్‌లో మాలిక్ అని వచ్చి ఉంది. ప్రవక్త ఆయన్ని కూడా చూశారు, అతను ప్రవక్తకు సలాం కూడా చేశారు.

ఇదే ప్రయాణంలో ప్రవక్త గారు దజ్జాల్‌ను కూడా చూశారు.

ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గాన్ని దర్శించారు. ఆ స్వర్గంలో మంచి ముత్యాలు, పగడాలు, (హీరే, మోతీ అంటాం కదా) ముత్యాలు, పగడాలతో మంచి వారి యొక్క గృహాలు ఉన్నాయి. ఇంకా అక్కడి మట్టి కస్తూరి వంటి సువాసన ఉంటుంది. స్వర్గంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక చాలా పెద్ద హౌజ్ (సరస్సు), స్వర్గపు నీళ్లు దొరుకుతుంది, దాన్ని కౌసర్ అంటారు, దాన్ని కూడా ప్రవక్త గారు చూశారు.

ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవదూతల ఏ సమూహం నుండి దాటినా వారందరూ “ఓ ప్రవక్తా, మీ అనుచరులకు చెప్పండి వారు కప్పింగ్ (హిజామా) చేయాలి” అని. అరబీలో హిజామా అంటారు, ఉర్దూలో పఛ్నా లగ్వానా, సీంగీ లగ్వానా అంటారు. ఇంగ్లీషులో కప్పింగ్ థెరపీ అంటారు. అంటే ఏంటి? శరీరంలో కొన్ని ప్రాంతాల్లో చెడు రక్తం అనేది ఉంటుంది. దానికి ప్రత్యేక నిపుణులు ఉంటారు, దాన్ని ఒక ప్రత్యేక పద్ధతితో తీస్తారు. ఇది కూడా ఒక రకమైన మంచి చికిత్స. దీనివల్ల ఎన్నో రోగాలకు నివారణ కలుగుతుంది.

ఇదే ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మంచి సువాసన పీల్చారు. ఇదేంటి సువాసన అని అడిగితే, ఫిరౌన్ కూతురుకు వెంట్రుకలను దువ్వెనతో దువ్వి వారి సేవ చేసే ఒక సేవకురాలు ఎవరైతే ఉండెనో, ఆమె, ఆమె సంతానం యొక్క ఇల్లు ఏదైతే ఉందో స్వర్గంలో, అక్కడి నుండి ఈ సువాసన వస్తుంది. ఆమె సంఘటన విన్నారు కదా ఇంతకుముందు? ఫిరౌన్ యొక్క కూతురికి ఒక ప్రత్యేక సేవకురాలు ఉండింది, ఆమె వెంట్రుకలను దువ్వడానికి. ఒకసారి చేతి నుండి దువ్వెన కింద పడిపోతుంది. బిస్మిల్లా అని ఎత్తుతుంది. ఫిరౌన్ కూతురు అడుగుతుంది, “ఎవరు అల్లాహ్? అంటే నా తండ్రియా, ఫిరౌనా?” ఆమె అంటుంది సేవకురాలు, “కాదు. నీ తండ్రికి మరియు నాకు ప్రభువు అయినటువంటి అల్లాహ్.” పోయి తండ్రికి చెప్తే, అతడు ఏం చేస్తాడు? ఒక చాలా పెద్ద డేగలో నూనె మసలబెట్టి, ఆమె పిల్లవాళ్ళను ముందు అందులో వేస్తాడు. తర్వాత ఆమెను కూడా అందులో వేసేస్తాడు. ఇలాంటి శిక్ష వారికి ఇవ్వబడుతుంది, కేవలం అల్లాహ్ ను విశ్వసించినందుకు. అయితే వారికి అల్లాహ్ త’ఆలా ఏదైతే గౌరవ స్థానం, గొప్ప గృహం ఇచ్చాడో స్వర్గంలో, అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు.

హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాంతో కలిసినప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్పారు, “ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ అనుచర సంఘానికి నా సలాం చెప్పండి. మరియు వారికి చెప్పండి, స్వర్గంలో ఉన్నటువంటి భూమి అది చాలా మంచి పంటనిస్తుంది. కానీ అక్కడ ఆ భూమి ప్రస్తుతం ఖాళీగా ఉంది. అందులో విత్తనాలు వేయాల్సిన అవసరం ఉంది.” ఏంటి అని అడిగితే:

سُبْحَانَ اللَّهِ، وَالْحَمْدُ لِلَّهِ، وَلَا إِلَهَ إِلَّا اللَّهُ، وَاللَّهُ أَكْبَرُ
(సుబ్ హా నల్లాహ్, వల్ హందులిల్లాహ్, వ లా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్)
అల్లాహ్ పవిత్రుడు, సర్వ స్తోత్రాలు అల్లాహ్ కే, అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు లేడు మరియు అల్లాహ్ గొప్పవాడు.

అని చెప్పారు. మరొక హదీస్‌లో ఉంది:

لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللَّهِ
(లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్)
పాపాల నుండి రక్షణ మరియు పుణ్యాలు చేసే శక్తి అల్లాహ్ ప్రసాదిస్తేనే లభిస్తాయి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకొందరిని చూశారు నరకంలో, అక్కడ వారికి గోర్లు ఇత్తడి, రాగితో ఉన్నాయి. వారి గోళ్లు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, రాగితో ఉన్నాయి. దాంతోనే వాళ్ళు తమకు తాము తమ ముఖాన్ని, తమ శరీరాన్ని ఇలా గీక్కుంటున్నారు. మొత్తం తోలంతా పడిపోతుంది. ఈ శిక్ష ఎవరికి జరుగుతుంది అని అడిగినప్పుడు జిబ్రీల్ చెప్పారు, ఎవరైతే ఇతరుల మాంసాన్ని తినేవారో మరియు వారి అవమానం చేసేవారో అలాంటి వారికి. మాంసం తినడం అంటే ఇక్కడ వారి యొక్క చాడీలు చెప్పడం. గీబత్, చుగ్లీ, పరోక్ష నింద, చాడీలు చెప్పడం, ఇంకా ఇతరుల అవమానం చేయడం.

ఇంకొందరిని చూశారు ప్రవక్త గారు, అగ్ని కత్తెరలతో వారి యొక్క పెదవులను కట్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరికి శిక్ష అంటే, ఎవరైతే ఇతరులకు మంచి గురించి చెప్తుంటారో కానీ స్వయంగా దానిపై ఆచరించరో అలాంటి వారికి శిక్ష జరుగుతుంది.

మరియు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు గారు “సిద్దీఖ్” అన్న బిరుదు ఏదైతే పొందారో, ఇదే ప్రయాణం తర్వాత పొందారు. సోదరులారా, ఈ విధంగా ప్రవక్త గారికి ఈ గగన ప్రయాణంలో ఏ ఏ విషయాలను దర్శించారో, వాటి కొన్ని వివరాలు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సహీ హదీసుల ఆధారంగానే ఉన్నవి. పోతే ఇందులో ప్రత్యేకంగా నమాజ్ యొక్క విషయం, సూరహ్ బఖరాలోని చివరి రెండు ఆయతుల విషయం, సుబ్ హా నల్లాహ్, వల్ హందులిల్లాహ్, వ లా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ లాంటివన్నీ విషయాలు మనం పాటిస్తూ ఉండాలి. అల్లాహ్ మీకు, మాకు మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక. అల్లాహ్ దయ కలిగితే మరెప్పుడైనా దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=8783

మేరాజ్ (గగణ ప్రయాణ) దృశ్యాలు [వీడియో & టెక్స్ట్]

ప్రవక్త మేరాజ్ (గగణ ప్రయాణాని)కి రజబ్ లోనే వెళ్ళారా?
ఈ సందర్భంగా తర్వాత రోజుల్లో షబె మేరాజ్ జరుపుకున్నారా? 

మేరాజ్ (గగణ ప్రయాణ) దృశ్యాలు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=Qmq6Oq7tJE0
36:38 నిమిషాలు, తప్పక వినండి

ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోని ఒక కీలకమైన ఘట్టం, ఇస్రా మరియు మేరాజ్ (రాత్రి ప్రయాణం మరియు ఆరోహణ) గురించి వివరించబడింది. ప్రవక్త పదవి పొందిన తర్వాత మక్కాలో పది సంవత్సరాల పాటు ఆయన ఎదుర్కొన్న తీవ్రమైన శారీరక, మానసిక, మరియు సామాజిక కష్టాల గురించి ప్రస్తావించబడింది. ముఖ్యంగా తాయిఫ్‌లో ఆయనపై జరిగిన దాడి, ఆ తర్వాత ఆయన ప్రియమైన భార్య హజ్రత్ ఖదీజా మరియు పినతండ్రి అబూ తాలిబ్ మరణంతో కలిగిన దుఃఖం గురించి చెప్పబడింది. ఈ కష్టాల సమయంలో అల్లాహ్ తన ప్రవక్తకు ఓదార్పుగా ప్రసాదించిన అద్భుత ప్రయాణమే ఇస్రా మరియు మేరాజ్. ఈ ప్రయాణంలో జరిగిన సంఘటనలు, ఏడు ఆకాశాలలో ప్రవక్తలను కలవడం, స్వర్గ నరకాలను దర్శించడం, మరియు ముఖ్యంగా ముస్లిం సమాజానికి బహుమానంగా లభించిన ఐదు పూటల నమాజు, సూరహ్ బఖరా చివరి రెండు ఆయతులు, మరియు షిర్క్ చేయని వారి పాపాలు క్షమించబడతాయన్న శుభవార్త గురించి వివరించబడింది. ఈ ప్రయాణం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ, దానిని స్మరించుకునే పేరుతో బిద్అత్ (నూతన ఆచారాలు) చేయకుండా, ప్రవక్త తెచ్చిన అసలైన బోధనలను, ముఖ్యంగా నమాజును మరియు తౌహీద్‌ను ఆచరించాలని నొక్కి చెప్పబడింది.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

మహాశయులారా! ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నలభై సంవత్సరాల వయసు నిండిన తర్వాత ప్రవక్త పదవిని పొందారు. ఆ తర్వాత ఇంచుమించు పది సంవత్సరాల వరకు ప్రజలను అల్లాహ్ వైపునకు పిలుస్తూ కేవలం మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్‌ను మాత్రమే మనం ఆరాధించాలి అని బోధిస్తూ ఎన్నో రకాల ఇబ్బందులను, ఎన్నో రకాల కష్టాలను కూడా భరించారు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై మనం ఊహించలేని, మనం పరస్పరం చెప్పుకోలేనటువంటి శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక అన్ని రకాల కష్టాలు వచ్చాయి. కానీ అల్లాహ్ కొరకు ఎంతో సహనం వహించారు.

పది సంవత్సరాలు గడిచిన తర్వాత మక్కా నగరం, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు చాలా తక్కువ మంది ఇస్లాం స్వీకరించారు. అయితే మక్కా నగరానికి ఇంచుమించు ఒక 80, 90 కిలోమీటర్ల దూరంలో తాయిఫ్ ఒక పెద్ద నగరము. అక్కడ నివసించే వారికి ఇస్లాం బోధన చేద్దామని వెళ్లారు. కానీ అక్కడి నుండి కూడా వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి కేవలం అల్లాహ్‌ను ఆరాధించే వారు అయి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంతోషం కలిగేకి బదులుగా వారు కేవలం నిరాకరించలేదు, పైగా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై రాళ్ల వర్షం కురిపించారు. ఎంతగా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శరీరం నుండి రక్తం వెళ్లి పాదాల్లో ఏ బూట్లయితే వేసుకున్నారో, చెప్పులయితే వేసుకున్నారో అందులో రక్తం ఆగిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సొమ్మసిల్లిపోయారు, స్పృహ తప్పిపోయారు.

మక్కా నగరం తిరిగి వచ్చిన తర్వాత కొద్ది రోజులకు, 25 సంవత్సరాల వరకు అన్ని రకాలుగా సహాయం చేస్తూ, అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తూ, ఆమెకు ఒక ఉత్తమమైన భార్యగా నిలిచిన వారు హజ్రత్ ఖదీజా రదియల్లాహు త’ఆలా అన్హా కూడా చనిపోయారు. గమనించండి, కేవలం సామాన్య మనలాంటి మనుషులకే మన భార్య చనిపోయింది అంటే మనకు ఏడుపొస్తుంది. కానీ ఖదీజా రదియల్లాహు త’ఆలా అన్హా ఒక సామాన్య భార్య కాదు, ఒక సామాన్య స్త్రీ కాదు. ఆ చరిత్రలోకి వెళితే చాలా సమయం మనకు ఇది అయిపోతుంది. హజ్రత్ ఖదీజా రదియల్లాహు త’ఆలా అన్హా వారు చనిపోయాక కొద్ది రోజులకు వెన్నెముక లాంటి సహాయం అందించిన పినతండ్రి హజ్రత్ అబూ తాలిబ్ కూడా చనిపోతారు. ఆయన కేవలం చనిపోవడమే కాదు, ఇస్లాం ధర్మం స్వీకరించకుండా తాత ముత్తాతల ఆచారం మీద నేను చనిపోతున్నాను అని అనడం ప్రవక్త గారికి చెప్పలేనంత బాధ కలిగింది.

ఇన్ని బాధలను, ఇన్ని కష్టాలను, ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ఒక శుభ ఘడియ వచ్చింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. అదేమిటి? రాత్రిలోని కొన్ని క్షణాల్లోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చారు, బురాఖ్ అన్న ఒక జంతువు తీసుకొచ్చారు. ఆ జంతువు గురించి సహీహ్ హదీథ్ లో వచ్చిన ప్రస్తావన ఏమిటి? అది హైట్ లో గాడిద కంటే పెద్దగా మరియు కంచర గాడిద కంటే చిన్నగా మరియు దాని వేగం ఎక్కడివరకైతే దాని దృష్టి పడుతుందో అక్కడి వరకు అది ఒక గంతు వేస్తుంది. అంతటి వేగం గల ఒక జంతువును తీసుకుని వచ్చారు.

కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి. ఈ రోజుల్లో మనం ఎన్నో క్యాలెండర్లలో, ఎన్నో ఫోటోలలో బురాఖున్ నబీ, ప్రవక్త వారికి గగన ప్రయాణం, మేరాజ్ ఏ వాహనంపై అయితే జరిగిందో దాని పేరు బురాఖ్ అని దానికి ఒక స్త్రీ ముఖం లాంటిది, ఇంకా వెనక ఒక తోక వేరే రకం లాంటిది, దాని కాళ్లు మరో జంతువు రకం లాంటివి, ఇలాంటి ఫోటోలు చూస్తాము. ఇవన్నీ కూడా అబద్ధము, అసత్యము, బూటకం. ఎందుకంటే ఆ జంతువు యొక్క చిన్నపాటి వర్ణన వచ్చింది కానీ అది, దాని ముఖం, దాని యొక్క ఇమేజ్, దాని యొక్క ఫోటో ఆ కాలంలో ఎవరూ తీయలేదు, దాని గురించి ఎలాంటి ప్రస్తావన హదీథుల్లో రాలేదు. ఇది మన యొక్క ధర్మంపై ఒక మహా అపనింద మనం వేసిన వాళ్ళం అవుతాము ఇలాంటి ఫోటోలను మనం ప్రచారం చేసి ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి బైతుల్ మఖ్దిస్, బైతుల్ మఖ్దిస్ నుండి ఏడు ఆకాశాల పైకి వెళ్లినటువంటి బురాఖ్ అని చెప్పడం ఇది చాలా తప్పు విషయం.

అయితే సహీహ్ హదీథుల్లో వచ్చిన విషయం ఏంటి? ఆ జంతువు, దాని యొక్క వేగం మనం చెప్పలేము. దానిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎక్కించుకొని మక్కా నుండి బైతుల్ మఖ్దిస్, ఫలస్తీన్ కి వెళ్లారు. ఆ ప్రస్తావన సూరహ్ బనీ ఇస్రాయీల్ లోని మొదటి ఆయతులోనే ఉంది.

سُبْحَانَ الَّذِي أَسْرَىٰ بِعَبْدِهِ لَيْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ إِلَى الْمَسْجِدِ الْأَقْصَى الَّذِي بَارَكْنَا حَوْلَهُ لِنُرِيَهُ مِنْ آيَاتِنَا

“ఆయన పరమ పవిత్రుడు. తన దాసుణ్ణి ఒక రాత్రి మస్జిద్-ఎ-హరామ్ నుండి మస్జిద్-ఎ-అఖ్సా వరకు తీసుకువెళ్లాడు. దాని పరిసరాలను మేము శుభప్రదంగా చేశాము. ఇది మేము మా సూచనలను అతనికి చూపించటానికి చేశాము.” (17:1)

ఆ ప్రభువు, అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు. అన్ని రకాల లోపాలకు, దోషాలకు అతీతుడు. ఆయనే రాత్రివేళ తన దాసునిని మస్జిద్-ఎ-హరామ్ నుండి బైతుల్ మఖ్దిస్, మస్జిద్-ఎ-అఖ్సా ఫలస్తీన్ వరకు తీసుకువెళ్లాడు. ఆ మస్జిద్-ఎ-అఖ్సా దాని చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా మేము దానిని శుభకరమైనదిగా చేశాము. ఎందుకు తీసుకువెళ్ళాము? మా యొక్క సూచనలు, మా యొక్క మహిమలు ఆయనకు చూపించాలని. అయితే దీనిని ఇస్రా అని అంటారు. ఇస్రా అంటే ఏంటి? మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వరకు రాత్రివేళ ఏదైతే ప్రయాణం జరిగిందో దానిని ఇస్రా అని అంటారు. మరియు బైతుల్ మఖ్దిస్ నుండి ఏడు ఆకాశాల వైపునకు ఏ ప్రయాణం అయితే జరిగిందో దానిని మేరాజ్ అని అంటారు. దాని ప్రస్తావన ఖుర్ఆన్ లో సూరహ్ నజ్మ్ లో వచ్చి ఉంది.

అయితే ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇస్రా, మేరాజ్ ఈ ప్రయాణం ఏదైతే చేశారో ఇది వాస్తవం. ఖుర్ఆన్ లో దాని ప్రస్తావన ఉంది, సహీహ్ హదీథుల్లో దాని వివరాలు వచ్చి ఉన్నాయి. కానీ ఆ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏమేమి జరిగినది? ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడెక్కడ ఏమేమి దర్శించారు? ఏ ఏ అద్భుత విషయాలు మనకు తెలియజేశారు? మన విశ్వాసానికి, ఆచరణకు సంబంధించిన బోధనలు అందులో ఏమున్నాయి? అవి మనం తెలుసుకోవాలి ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీథుల ద్వారా మరియు వాటి ప్రకారంగా మనం ఆచరించాలి, వాటి ప్రకారంగా మన విశ్వాసం సరిచేసుకోవాలి.

అలా కాకుండా, ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? జషన్, షబ్-ఎ-మేరాజ్, మేరాజున్ నబీ యొక్క ఉత్సవాలు అని జరుపుకుంటున్నారు. ఒక వ్యక్తి వాట్సాప్ లో ఒక సందర్భంలో ఏం రాశాడు? చేసుకునే వాళ్ళు చేసుకుంటారయ్యా, మీకేం నొస్తుంది? మీకేం బాధ కలుగుతుంది? అని బూతులు కూడా వదిలారు కొందరు. కానీ ఇక్కడ వారి మదిలో, వారి ఆలోచనలో ఏముందంటే, మేము ఏం చేసినా గానీ ప్రవక్త ప్రేమలో చేస్తున్నాము కదా, మేం ఏం చేసినా గానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ గగన ప్రయాణం, మేరాజ్ అయితే ఒక గొప్ప బహుమానంగా ఇవ్వబడినదో దానిని గుర్తు చేసుకుంటున్నాము కదా, ఇందులో తప్పేమిటి? ఇలాంటి కొన్ని మంచి ఆలోచనలు వారివి ఉంటాయి కావచ్చు. కానీ ఇక్కడ గమనించాలి. ఏంటి గమనించాలి? ఒకవేళ ఇలా చేయడం ధర్మం అయితే ఈ ధర్మాన్ని అల్లాహ్ మనకు నేర్పలేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపలేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలు చేయలేదు, ఇమాములు చేయలేదు. అలాంటి కార్యం మనం చేస్తున్నాము అంటే మన ఆలోచన, మన ఉద్దేశం ఎంత ఉత్తమంగా, మంచిగా ఉన్నప్పటికీ అందులో మనకు పుణ్యం లభించదు, దాని వల్ల మనం బిద్అత్ లో పడిపోతాము, అది మహా ఘోరమైన పాపం అయిపోతుంది.

అందు గురించి మహాశయులారా! అలాంటి బిద్అత్ లకు, దురాచారాలకు మనం గురి కాకుండా ఈరోజు మీరు కొన్ని విషయాలు వింటారు ఇన్షా అల్లాహ్. ఏమిటి ఆ విషయాలు? ఈ గగన ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏ ఏ బహుమానాలు బహూకరించబడ్డాయి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ దృశ్యాలను చూశారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ప్రయాణం ఎలా జరిగింది? దానికి సంబంధించిన వివరాలు ఏమిటి?

అయితే పూర్తి వివరంగా చెప్పుకుంటూ పోతే గంటల తరబడి ప్రసంగం జరుగుతుంది. కానీ అలా కాకుండా టూ ద పాయింట్ హదీథుల ఆధారంగా నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. దానిని మీరు శ్రద్ధగా ఆలకిస్తారు అని ఆశిస్తున్నాను.

మొదటి విషయం ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల జరిగినటువంటి గొప్ప మహిమ, ఒక అద్భుతం ఏమిటంటే ఈ ప్రయాణానికి బయలుదేరే ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చెస్ట్ ఆపరేషన్ అని అనండి మీరు, హార్ట్ ఆపరేషన్ అని అనండి, ఓపెన్ హార్ట్ సర్జరీ అని మీరు చెప్పుకోండి, చెప్పుకోవచ్చు. అది జరిగింది. వాస్తవం. హజ్రత్ అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్తున్నారు, నేను స్వయంగా చూశాను ఆ కుట్లను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఛాతి చీల్చబడి, అందులో నుండి గుండెను బయటికి తీసి, జమ్ జమ్ నీళ్లతో దానిని కడిగి, అందులో ఈమాన్, విశ్వాసం, హిక్మత్, వివేకాలతో నింపబడినది. సహీహ్ బుఖారీ, హదీథ్ నంబర్ 3887 లో దీని ప్రస్తావన ఉంది.

ఇక ఏ వాహనం పైన అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం చేశారో నేను ఇంతకు ముందు తెలిపినట్లు గాడిద కంటే పెద్దది మరియు కంచర గాడిద కంటే చిన్నది, దాని పేరు ఏమిటి? బురాఖ్. దీని ప్రస్తావన సహీహ్ బుఖారీలోని ఈ హదీథ్ లోనే వచ్చి ఉంది. ఇంతకు ముందు నేను చెప్పిన నంబర్ 3887.

మరియు ఈ ప్రయాణం మస్జిద్-ఎ-హరామ్ మక్కా నుండి మొదలుకొని ఫలస్తీన్, ఫలస్తీన్ నుండి ఏడు ఆకాశాలు, ఏడు ఆకాశాల పైన అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో సంభాషించడం మరియు స్వర్గాన్ని చూడడం, నరకాన్ని చూడడం మధ్యలో ఇంకా ఎన్నో విషయాలు జరిగాయి. ఇవన్నీ కూడా ఎన్నో రోజులు, ఎన్నో గంటలు పట్టలేదు. لَيْلًا (లైలన్) రాత్రిలోని కొంత భాగం మాత్రమే. అది ఎలా? అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ సర్వశక్తిమంతుడు. అవునా లేదా? విశ్వాసం ఉందా లేదా? ఈ రోజు ఆ అల్లాహ్ ఇచ్చినటువంటి మేధ, బుద్ధి, జ్ఞానం, సైన్స్, విద్యతో రాకెట్లు తయారు చేస్తున్నారు. సామాన్యంగా ఇంతకు ముందు ఎవరైనా ఇక్కడి నుండి మక్కా నేను ఒక రోజులో పోయి వస్తాను అంటే ఎవరైనా నమ్ముతారా? ఇంచుమించు 1000 కిలోమీటర్లు. కానీ ఈ రోజుల్లో సాధ్యమా లేదా? నాలుగు సార్లు పోయి రావచ్చు కదా మక్కా. అదే రాకెట్ యొక్క వేగం ఎంత ఉన్నది? అయితే నేను ఈ విషయాలు మళ్ళీ విడమరిచి చెప్పడానికి వెళ్తే సమయం ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. మన విశ్వాసులం, ఖుర్ఆన్ లో వచ్చిన విషయం, సహీహ్ హదీథ్ లో వచ్చిన విషయాన్ని మనం తూచా తప్పకుండా నమ్మాలి, ఎలాంటి అనుమానాలకు, సందేహాలకు గురి కాకూడదు.

అయితే మస్జిద్-ఎ-అఖ్సా లో చేరిన తర్వాత అక్కడ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆదమ్ అలైహిస్సలాం నుండి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎంత మంది ప్రవక్తలు వచ్చారో వారందరినీ జమా చేశాడు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారందరికీ రెండు రకాతుల నమాజ్ చేయించారు. ఇమామత్, నమాజ్ చేయించే అటువంటి నాయకత్వం ఈ గొప్పతనం ఎవరికి లభించింది? ఎవరికీ? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. అంటే ఇమాముల్ అంబియా అని అంటాము కదా మనం సామాన్యంగా ఉర్దూలో. ఇది వాస్తవ రూపంలో అక్కడ జరిగింది.

ఇంకా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రయాణంలో మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం, ఏడు ఆకాశాలలో పైకి వెళ్లారైతే, మొదటి ఆకాశంలో హజ్రత్ ఆదమ్ అలైహిస్సలాం తో కలిశారు. రెండవ ఆకాశంలో ఈసా మరియు యహ్యా అలైహిముస్సలాం తో కలిశారు. మూడవ ఆకాశంలో యూసుఫ్ అలైహిస్సలాం తో కలిశారు. నాలుగవ ఆకాశంలో హజ్రత్ ఇద్రీస్ అలైహిస్సలాం తో కలిశారు. ఐదవ ఆకాశంలో హారూన్ అలైహిస్సలాం తో కలిశారు. మరియు ఆరవ ఆకాశంలో హజ్రత్ మూసా అలైహిస్సలాం తో కలిశారు. ఏడవ ఆకాశంలో హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తో కలిశారు.

ఈ విధంగా ఏడు ఆకాశాలకు పైన ఒక రేగు చెట్టు ఉంది. దానిని సిద్రతుల్ ముంతహా అని అంటారు. ఆ చెట్టు, రేగు పండు ఒక్కొక్క పండు పెద్ద పెద్ద కడవలు చూసి ఉంటారు. పల్లెటూర్లలో పాతకాలంలో గోధుమాలో లేదా వడ్లు వేయడానికి పెద్ద పెద్ద గుమ్మీలు వాడేవారు. ఒక్కొక్క దాంట్లో 300 కిలో, 500 కిలోలు కూడా అంత స్థలం ఉంటుంది. ఆ విధంగా పెద్ద పెద్ద ఒక్కొక్క పండు అంత పెద్దగా ఉంటుంది. మరియు దాని యొక్క ఆకులు ఏనుగుల చెవుల మాదిరిగా అంత పెద్దగా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. హదీథ్ లో వచ్చిన విషయం ఏంటంటే, హిజ్ర్ అని ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంత వాసులు ఎలాంటి మట్టి నీళ్లు వేయడానికి బిందెలు లాంటివి, నీళ్లు పోసుకోవడానికి కడవల లాంటివి ఏదైతే ఉపయోగిస్తారో దానికి సమానమైన పండ్లు ఆ రేగు పండు ఒక్కొక్కటి మరియు దాని యొక్క ఆకు ఏనుగు చెవుల మాదిరిగా ఉంటాయి.

ఇంకా ఆ రేగు చెట్టు యొక్క వ్రేళ్లు ఆరవ ఆకాశంలో ఉన్నాయి మరియు దాని యొక్క కొమ్మలు ఏడు ఆకాశాలకు పైగా ఉన్నాయి. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎన్నో విషయాలు చూపించడం జరిగింది, ఎన్నో విషయాలు అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో జరిగాయి. ఉదాహరణకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడే అల్లాహ్ యొక్క చాలా దగ్గరగా ఉండే అల్లాహ్ ఆదేశాలను రాస్తూ ఉండే దైవదూతల కలముల శబ్దం విన్నారు, సిద్రతుల్ ముంతహాలో.

జన్నతుల్ మఅవా అన్నది దానికి సమీపంలోనే ఉన్నది. అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మూడు విషయాలు బహుమానంగా ఇవ్వబడ్డాయి. ఎలా? మీకు ఏదైనా బహుమానం దొరికింది, ఏదైనా పెద్ద గిఫ్ట్ దొరికింది, ఒక షీల్డ్, క్రికెట్ లో మీరు కప్ గెలిచారు. దానిని తీసుకొచ్చి పారేస్తారా? ఏం చేస్తారు? కాపాడుతారు. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అక్కడ లభించిన విషయాలు ఏమిటి? ఐదు పూటల నమాజులు, ఇక దాని వివరణలో వెళ్తాలేను, ముందు 50 ఉండే ఆ తర్వాత ఇలా తగ్గింది అనేది. రెండవ బహుమానం, సూరహ్ బఖరా లోని చివరి రెండు ఆయతులు, ఆమన రసూల్ బిమా ఉన్జిలా అక్కడ నుండి మొదలుకొని. మరియు మూడవ బహుమానం ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాజంలో, వారిని అనుసరించే వారిలో ఎవరైతే షిర్క్ నుండి దూరం ఉంటారో అల్లాహ్ త’ఆలా వారి యొక్క ఘోరమైన పాపాలను కూడా మన్నిస్తాడు. అల్లాహు అక్బర్. ఈ మూడు పెద్ద బహుమానాలు.

సహీహ్ ముస్లిం షరీఫ్, హదీథ్ నంబర్ 173 లో వీటి ప్రస్తావన వచ్చి ఉంది. సిద్రతుల్ ముంతహా మరియు అక్కడ ఆ తర్వాత నుండి ఏదైతే విషయాలు చెప్పానో వాటి ప్రస్తావన. ఇక్కడ గమనించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మేరాజ్ ప్రయాణంలో ప్రవక్తకు లభించినటువంటి గొప్ప బహుమానం ఏమిటి? ఏమిటి? చెప్పండి! ఐదు పూటల నమాజు. ఇంకా? సూరహ్ బఖరా లోని చివరి రెండు ఆయతులు. మరియు మూడో విషయం? షిర్క్ చేయని వారి యొక్క ఘోర పాపాలను కూడా అల్లాహ్ త’ఆలా క్షమిస్తాడు అని శుభవార్త.

ఈ రోజుల్లో మేరాజున్ నబీ అన్నటువంటి బిద్అత్ చేసి, ఇంకా అందులో ఎన్నో రకాల షిర్క్ పనులు చేసి, రజబ్ మాసంలో రజబ్ కే కూండే అన్న పేరు మీద ఎన్నో షిర్క్ పనులు చేసుకుంటూ మనం ప్రవక్త విధానానికి ఎంత వ్యతిరేకం చేస్తున్నాము. ఎంతో మంది ఎవరైతే జషన్-ఎ-మేరాజ్-ఉన్-నబీ అని ఈ మేరాజ్-ఉన్-నబీ పేరు మీద రాత్రి జాగారం చేస్తారో, సంవత్సరంలో ఎన్ని నమాజులు వారు చేస్తున్నారు? ఆ రోజు వచ్చి ఎన్నో నఫిల్‌లు చేస్తారు కావచ్చు కానీ, మహాశయులారా! గమనించండి. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప బహుమానంగా ఏ విషయాలు అయితే ఈ ప్రయాణంలో పొందారో వాటిని మనం గౌరవించాలి, వాటిని మనం పాటించాలి, వాటిని ఎప్పుడూ కూడా తూచా తప్పకుండా, అందులో ఎలాంటి అశ్రద్ధ చేయకుండా వాటిని మనం పాటించాలి.

ఇంకా మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం వారిని రెండవ సారిగా అతని యొక్క అసలైన రూపంలో చూశారు.

అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మత్తుపానీయం మరియు పాలు మరియు తేనె మూడు విషయాలు ఇవ్వబడ్డాయి. ప్రవక్తా ఇదిగో తీసుకోండి, మీరు సేవించండి అన్నట్లుగా ఏ విషయాలు ఇవ్వబడ్డాయి? అల్లాహు అక్బర్! మత్తుపానీయం, మరియు పాలు, మరియు తేనె. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తీసుకున్నారు? పాలు తీసుకున్నారు. సహీహ్ బుఖారీ, హదీథ్ నంబర్ 3887 లో ఈ ప్రస్తావన ఉంది.

మరియు ఏడవ ఆకాశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బైతుల్ మఅమూర్ అని చూశారు. బైతుల్ మఅమూర్ ఏంటి? ఇహలోకంలో మన కొరకు బైతుల్లాహ్ ఎలానైతే ఉందో, కాబతుల్లాహ్, అలాగే దానికి స్ట్రెయిట్ గా ఏడు ఆకాశాల పైన బైతుల్ మఅమూర్ ఉంది. దైవదూతలు అక్కడ నమాజ్ చేస్తారు, దాని యొక్క తవాఫ్ చేస్తారు. ఒక్కసారి 70,000 మంది దైవదూతలు అక్కడ తవాఫ్ చేస్తారు, నమాజ్ చేస్తారు. మరియు ఒక్కసారి ఎవరికైతే ఈ అవకాశం దొరికిందో ప్రళయం వరకు మళ్ళీ వారికి ఈ అవకాశం దొరకదు. గమనించండి దైవదూతల సంఖ్య ఎంత గొప్పగా ఉందో. దీని ప్రస్తావన సహీహ్ బుఖారీలో ఉంది, హదీథ్ నంబర్ 3207.

ఇంకా మహాశయులారా, ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ మూసా అలైహిస్సలాం వారిని కూడా చూశారు. అలాగే నరకం యొక్క కాపరి, మాలిక్ అతని పేరు, అతనిని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఈ ప్రయాణంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గాన్ని కూడా చూశారు, అలాగే నరకాన్ని కూడా దర్శించారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గం దర్శించారో అక్కడ చూశారు, వజ్రాలతో తయారు చేయబడినటువంటి అక్కడ గోపురాలు ఉన్నాయి. ఖైమా, ఇక్కడ ఏదైనా వాతావరణం చాలా సునాయాసంగా ఉండి, వేడి కూడా ఎక్కువ లేకుండా, చలి కూడా లేకుండా, మోసమ్-ఎ-రబీ అని ఏదైతే అంటారో మనం చూస్తాము కదా, ఎడారిలో డైరాలు వేసుకొని, ఖైమాలు వేసుకొని అక్కడ కొంత సమయం గానీ లేదా కొద్ది రోజులు గానీ గడుపుతారు. చూశారా కదా? అయితే అలాంటి ఖైమాలో వారికి ఎంత ఆనందం ఏర్పడుతుంది, అన్ని రకాల సౌకర్యాలు బహుశా అందులో ఉంటాయి కావచ్చు కానీ అస్తగ్ ఫిరుల్లాహ్, ఇది పోలిక కాదు స్వర్గంలో లభించే అటువంటి ఖైమాకు. కానీ అక్కడ ఒకే ఒక వజ్రం ఇంత పెద్దగా ఉంటుంది, ఆ ఒకే వజ్రంతో చాలా పెద్ద ఖైమాగా తయారు చేయబడుతుంది. మరియు అక్కడి యొక్క మట్టి కస్తూరి అని చెప్పడం జరిగింది. దీని యొక్క ప్రస్తావన బుఖారీ 349, అలాగే సహీహ్ ముస్లిం 163 లో వచ్చి ఉంది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వర్గంలో కౌథర్ అనేటువంటి ఒక పెద్ద వాగు ఏదైతే ప్రసాదించడం జరుగుతుందో దానిని కూడా చూసి వచ్చారు. అలాగే ఫిరౌన్ కూతురికి జడలు వేసే అటువంటి ఒక సేవకురాలు, ఆమె ఇస్లాం స్వీకరించింది, మూసా అలైహిస్సలాం ను విశ్వసించింది. దానికి బదులుగా ఫిరౌన్ ఆ దౌర్జన్యపరుడు, దుర్మార్గుడు ఏం చేశాడు? ఆమెను, ఆమె యొక్క నలుగురి సంతానాన్ని సలసల మసులుతున్న నూనెలో, వేడి నూనెలో వేసేశాడు. అయితే ఆమెకు స్వర్గంలో ఏ గొప్ప అక్కడ గృహం అయితే ప్రసాదించబడిందో, దానిని అక్కడి నుండి వస్తున్నటువంటి సువాసనను కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయం సహీహ్ ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉంది, జిల్ద్ 5, పేజ్ 30.

అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం వారిని మరొక రూపంలో చూశారు. అల్లాహ్ తో భయపడుతూ ఎంత కంపించిపోయారంటే అతని యొక్క పరిస్థితి ఒక చాలా మాసిపోయిన లేదా పాడైపోయిన తట్టు గుంత ఎలా ఉంటుందో అతనిని చూస్తే అలా ఏర్పడింది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ ఈ హదీథ్ ను సహీహాలో ప్రస్తావించారు, 2289.

ఇంకా మహాశయులారా, హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కూడా ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలిశారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్తతో కలిసి ఏం చెప్పారు? ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు నా వైపు నుండి నీ అనుచర సంఘానికి సలాం తెలుపు. అల్లాహు అక్బర్. సల్లల్లాహు అలైహి వ ఆలా ఆలిహి వసల్లం. అల్లాహ్ త’ఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం పై కూడా తన కరుణ, శాంతులు కురియజేయుగాక. గమనించండి. ఒకవేళ నేను, మీరు, మనందరము, ముస్లింలం అని అనుకునే వాళ్ళము, మేరాజ్-ఉన్-నబీ లాంటి బిదత్ పనులు, జషన్-ఎ-మేరాజ్ అని బిదత్ పనులు చేయకుండా నిజమైన ధర్మంపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన ధర్మంపై ఉండి ఉంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సలాం కూడా మనకు కలుగుతుంది. ఆయన ప్రత్యేకంగా సలాం పంపారు. ఇంకా ఏం చెప్పారు? ఓ ముహమ్మద్, నీ అనుచర సంఘానికి తెలుపు, ఈ స్వర్గం దీని యొక్క మట్టి ఇది చాలా మంచిది. ఇక్కడ విత్తనం వేసిన వెంటనే మంచి చెట్లు మరియు దానికి ఫలాలు వెంటనే అవుతూ ఉంటాయి. అట్లాంటి మట్టి ఇది. మరియు ఇక్కడి యొక్క నీరు కూడా చాలా మంచి నీరు. కానీ ఇప్పటివరకు అది ఎలాంటి చెట్టు లేకుండా ఉంది. అక్కడ చెట్టు మనకు కావాలంటే ఏం చేయాలి? నీ అనుచర సంఘానికి తెలుపు, సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అధికంగా చదువుతూ ఉంటే అల్లాహ్ వారి కొరకు స్వర్గంలో మంచి చెట్లు నాటుతాడు, పరలోకంలో స్వర్గంలో చేరిన తర్వాత వారికి ఆ చెట్లు ప్రసాదించబడతాయి. అల్లాహు అక్బర్. ఏమైనా కష్టమా ఆలోచించండి? సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్ చదవడం.

అలాగే మహాశయులారా, మరొక హదీథ్ లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చెప్పారు, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అధికంగా చదువుతూ ఉండమని చెప్పండి. ఈ హదీథ్ లు తిర్మిజీ మరియు ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉన్నాయి. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహ్ అని చెప్పారు.

అలాగే నరకంని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దర్శించారు. నరకంలో ఏం చూశారు? నరకంలో ఒక చాలా భయంకరమైన దృశ్యం చూశారు. కొందరి యొక్క గోర్లు వారి యొక్క ఆ గోర్లు ఎలాంటివి? ఇత్తడివి. చాలా పొడుగ్గా ఉన్నాయి. వాటితో వారు తమ ముఖాలను, తమ శరీరాన్ని గీకుతున్నారు. తోలు బయటికి వచ్చేస్తుంది. వారి గురించి జిబ్రీల్ ను అడిగారు, ఈ పరిస్థితి వీరికి ఎందుకు జరుగుతుంది? అప్పుడు జిబ్రీల్ వీరికి తెలిపారు, వీరు ఎవరు తెలుసా? ప్రజల మానంలో, వారి యొక్క పరువులో చేయి వేసుకొని వారిని అవమానపరిచేవారు. అంటే పరోక్ష నిందలు, చాడీలు, గీబత్, చుగ్లీ, ఇంకా వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అని వారిని నిందించడం, వారి యొక్క మానం, పరువులో జోక్యం చేసుకోవడం, ఇలా చేసుకునే వారికి ఈ శిక్ష జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సునన్ అబూ దావూద్ లో హదీథ్ వచ్చి ఉంది, 4878 హదీథ్ నంబర్.

ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రయాణంలో ఇంకా ఎన్నో రకాల దృశ్యాలు చూశారు కానీ మనకు సమయం అనేది సరిపోదు గనుక ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. అదేమిటి? షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు, హదీథ్ నంబర్ 306.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గగన ప్రయాణం, ఈ మేరాజ్ ప్రయాణం నుండి తిరిగి వచ్చిన తర్వాత అక్కడి విషయాలు ప్రజలకు తెలుపుతున్నారు. ఎవరైతే సత్య విశ్వాసులో వారు తూచా తప్పకుండా నమ్మారు. కానీ అవిశ్వాసులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హేళన చేశారు. ఏమని? మేము మక్కా నుండి ఫలస్తీన్ కు ఒక నెల రోజులు పడుతుంది మాకు పోవాలంటే. నీవు కేవలం ఫలస్తీన్ వరకే కాదు, ఏడు ఆకాశాల పైకి రాత్రిలోని కొన్ని క్షణాల్లో, కొంత సమయంలోనే వెళ్లి వచ్చావు అంటున్నావు అని హేళన చేశారు. అంతే కాదు, కొందరు అవిశ్వాసులు అయితే ఒకవేళ నీవు వాస్తవంగా ఫలస్తీన్ వెళ్లి, మస్జిద్-ఎ-అఖ్సా చూసి వచ్చావంటే దాని యొక్క వివరణ మాకు తెలుపు అని ఎన్నో ప్రశ్నలు అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఆ సందర్భంలో ఎప్పుడైతే వారు అడిగారో నాకు దాని వివరణ ఏమీ తెలియదు. కానీ ఆ మస్జిద్-ఎ-అఖ్సా యొక్క దృశ్యం అల్లాహ్ నా ముందుకు తీసుకొచ్చాడు. వారు అడిగిన ప్రతి దానికి, ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పుకొచ్చాను. అల్లాహు అక్బర్.

అక్కడ ఆ సమయంలో అబూ బకర్ రదియల్లాహు త’ఆలా అన్హు లేరు. ఎక్కడో దూరంగా ఏదో పని మీద ఉన్నారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయాలు విన్న ఒక వ్యక్తి, “ఈరోజు అబూ బకర్, “ఎల్లవేళల్లో అబూ బకర్ ను చూశాము, ముహమ్మద్ చెప్పింది నిజమే, ముహమ్మద్ చెప్పింది నిజమే అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ముహమ్మద్ కు తోడుగా ఉన్నాడు కదా, ఈరోజు అబూ బకర్ కు వెళ్లి నేను తొందరగా ఈ విషయం తెలియజేస్తాను, అబూ బకర్ ఈ విషయాన్ని తిరస్కరిస్తాడు, అబద్ధం అని అంటాడు అన్నటువంటి నమ్మకంతో వెళ్లి, “అబూ బకర్! ఎవరైనా ఒక రాత్రిలో మక్కా నుండి ఫలస్తీన్ వెళ్లి వచ్చాడు అంటే నువ్వు నమ్ముతావా?” అంటే, “లేదు.” సంతోషం కలిగింది అతనికి. వెంటనే అన్నాడు, “మరి మీ స్నేహితుడు, మీ యొక్క గురువు ముహమ్మద్ అంటున్నాడు కదా?” సల్లల్లాహు అలైహి వసల్లం. అబూ బకర్ వెంటనే చెప్పారు, “నిజమా? ముహమ్మద్ ఈ మాట చెప్పారా?” సల్లల్లాహు అలైహి వసల్లం. అతను అన్నాడు, “అవును, ముహమ్మద్ ఈ మాట చెప్పాడు. అంతే కాదు, రాత్రిలోని కొంత భాగంలో ఫలస్తీన్ వరకే కాదు, మస్జిద్-ఎ-అఖ్సా కాదు, అక్కడి నుండి ఏడు ఆకాశాల పైకి కూడా వెళ్లారట.” వెంటనే అబూ బకర్ చెప్పారు, “ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట చెప్పి ఉంటే నూటికి నూరు పాళ్లు నిజం, ఇది సత్యం, ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు.” అతడే, ప్రశ్న అడిగినవాడు, అబూ బకర్ గురించి ఏదో తప్పుగా ఆలోచించి వచ్చినవాడు చాలా ఆశ్చర్యపోతాడు. “ఎలా నీవు ఇది నిజం నమ్ముతున్నావు?” అని అంటే, “నీకు ఇందులో ఏం అనుమానం? ప్రవక్త చెప్తారు నాకు పొద్దున వహీ వస్తుంది, సాయంకాలం వహీ వస్తుంది, అల్లాహ్ నుండి దైవదూత వస్తున్నాడు, నాకు ఈ సందేశం ఇచ్చారు, మేము అన్ని విషయాలను నమ్ముతున్నాము. ఒకవేళ అల్లాహ్ త’ఆలా తలుచుకొని ప్రవక్తని అక్కడి వరకు తీసుకువెళ్లాడంటే ఇందులో మాకు నమ్మని విషయం ఏమిటి?” అప్పుడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సిద్దీఖ్, సత్యవంతుడు అన్నటువంటి బిరుదు లభించినది. సత్యవంతుడు అని బిరుదు లభించినది.

అందుకు మహాశయులారా, గమనించండి. సిద్దీఖ్ అన్నటువంటి బిరుదు హజ్రత్ అబూ బకర్ కు ప్రవక్తను అనుసరిస్తే లభించిందా? ప్రవక్తను నమ్మితే లభించిందా? లేదా అనుసరణ, ఆచరణ అన్నిటినీ వదులుకొని కేవలం ప్రేమ, ప్రేమ, ప్రేమ అని కేవలం నోటికి చెప్పుకుంటే లభించిందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల అబూ బకర్ కు ఉన్నంత ప్రేమ ఇంకా ఎవరికీ లేకుండే. కానీ ఆయన అంతే అనుసరించేవారు. ప్రవక్త మాటను ఆచరించేవారు. ఈ గుణపాఠం మనం కూడా నేర్చుకోవాలి. ఆచరణ అనేది ఉండాలి ప్రవక్త సున్నత్ ప్రకారంగా, దురాచారాన్ని వదులుకోవాలి, బిదత్ లను వదులుకోవాలి, షిర్క్ లను వదులుకోవాలి. మరియు ఏదైతే నమాజులను వదులుతున్నామో అది వదలకూడదు. ఎందుకు? ఇదే సామాన్య విషయమా నమాజ్? ఎక్కడ దొరికింది నమాజ్ ప్రవక్తకు? ఆకాశాల పైకి పిలువబడి ఇవ్వబడినది. ఇంతటి గౌరవమైన విషయాన్ని మనం ఎంత సునాయాసంగా, ఎంత ఈజీగా వదులుతున్నాము. అల్లాహ్ త’ఆలా మనందరికీ మేరాజ్ ప్రయాణంలో ప్రవక్త గారు ఏ ఏ విషయాలు చూశారో, ఏ ఏ బహుమానాలు పొందారో, దాని గురించి కొన్ని విషయాలు ఏదైతే విన్నామో వాటిని అర్థం చేసుకొని, వాటిని పాటించే భాగ్యం ప్రసాదించుగాక. స్వర్గంలో తీసుకెళ్ళేటువంటి సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించుగాక. మరియు నరకంలో తీసుకెళ్ళే విషయాల నుండి దూరం ఉండే అల్లాహ్ త’ఆలా భాగ్యం కూడా మనకు ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5801



నమాజ్ పాఠాలు: 3 వ పాఠం: నమాజు ఆదేశాలు – పార్ట్ 1 [వీడియో]

బిస్మిల్లాహ్

دروس الصلاة -3-من أحكام الصلاة
నమాజ్ పాఠాలు: 3 వ పాఠం: నమాజు ఆదేశాలు – పార్ట్ 1

ఈ 13:47 నిమిషాల వీడియోలో

సలాం చెప్పిన  తర్వాత దుఆలు,
జమాఅతు నుండి కొన్ని రకాతులు తప్పిపోయిన వ్యక్తి ఆదేశాలు,
నమాజును భంగపరిచే కార్యాలు,
నమాజ్ చేయరాని సమయాలు
తెలుసుకుంటారు. ఇన్ షా అల్లాహ్

మీరు శ్రద్ధగా నేర్చుకోని, ఇతరులకు తెలిపి అధిక పుణ్యాలు సంపాదించండి.

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


నమాజ్ తర్వాత జిక్ర్:

సలాం చెప్పిన  తరువాత ఈ దుఆలు చదవండి:

అస్తగ్ ఫిరుల్లాహ్, అస్తగ్ ఫిరుల్లాహ్, అస్తగ్ ఫిరుల్లాహ్, అల్లాహుమ్మ అంతస్సలాం, వ మిన్ కస్సలాం, తబారక్ త యాజల్ జలాలి వల్ ఇక్రాం. (ముస్లిం 591).

أَسْتَغْفِرُ الله أَسْتَغْفِرُ الله أَسْتَغْفِرُ الله. اَللهُمَّ أَنْتَ السَّلامُ ومِنْكَ السَّلامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ وَ الإكْرَام.

అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను, అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను, అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను. ఓ అల్లాహ్ నీవు ఏలాంటి లోపాలు లేనివాడవు. నీవే రక్షణ నొసంగువాడవు. ఓ ఘనుడవు, పరమదాతయువు నీవు శుభములు గలవాడవు.

లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅతైత వలా ముఅతియ లిమా మనఅత వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్ కల్ జద్ద్. (బుఖారీ 844, ముస్లం 593).

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، اللهُمَّ لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ، وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ، وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ.

అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు. ఆయనకు భాగస్వామి ఎవడూ లేడు. ఆయనకే అధికారము చెల్లును. ఆయనకే సర్వ స్తోత్రములు గలవు. ఆయనే సర్వశక్తుడు. ఓ అల్లాహ్ నీవు నొసంగిన వరాలను ఎవడు అడ్డగింపజాలడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వజాలడు. ధనికుడు తన ధనముతో నీ శిక్షల నుండి తప్పించుకు- పోజాలడు.

లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, లాఇలాహ ఇల్లల్లాహు వలా నఅబుదు ఇల్లా ఇయ్యాహు లహున్నిఅమతు వలహుల్ ఫజ్లు వలహుస్సనాఉల్ హసన్, లాఇలాహ ఇల్లల్లాహు ముఖ్లిసీన లహుద్దీన వలౌ కరిహల్ కాఫిరూన్. (ముస్లిం 594).

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللّهِ، لَا إِلَهَ إِلَّا اللهُ، وَلَا نَعْبُدُ إِلَّا إِيَّاهُ، لَهُ النِّعْمَةُ وَلَهُ الْفَضْلُ، وَلَهُ الثَّنَاءُ الْحَسَنُ، لَا إِلَهَ إِلَّا اللهُ مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ.

అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు. ఆయనకు భాగస్వామి ఎవడూ లేడు. ఆయనకే అధికారము చెల్లును. ఆయనకే సర్వ స్తోత్రములు గలవు. ఆయనే సర్వశక్తుడు. పాపాములను వదులుకొనుట మరియు పుణ్యాలు చేయుట అల్లాహ్ దయవలననే కలుగును. అల్లాహ్ దప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన్నే మేము ఆరాధించుచున్నాము. ఆయనే సర్వ అనుగ్రహాలు దయ చేయువాడు. ఆయనకే ఘనత, మంచి స్తోత్రములు గలవు. అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. చిత్తశుద్ధితో మేము ఆయన్నే ఆరాధించుచున్నాము. ఈ విషయము సత్య తిరస్కారులకు నచ్చకున్నా సరే. (ముస్లిం 591, 593, 594, బుఖారి 844).

తరువాత సుబ్ హానల్లాహ్ 33, అల్ హందులిల్లాహ్ 33, అల్లాహు అక్బర్ 33 సార్లు చదివి, లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ తో 100 పూర్తి చేయాలి. (ముస్లిం 597).

తర్వాత ఆయతుల్ కుర్సీ ఒకసారి చదవాలి.

అల్లాహు  లాఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము లా తఅఖుజుహూ సినతువ్ వలా నౌమ్, లహూ మా ఫిస్సమావాతి వమా ఫిల్ అర్జి మన్ జల్లజీ యష్ ఫఉ ఇందహూ ఇల్లా బిఇజ్ నిహీ యఅలము మా బైన ఐదీహిమ్ వమా ఖల్ ఫహుం వలా యుహీతూన బిషైఇమ్ మిన్ ఇల్మిహీ ఇల్లా బిమాషాఅ వసిఅ కుర్సియ్యుహుస్ సమావాతి వల్ అర్జ వలా యఊదుహూ హిఫ్జుహుమా వహువల్ అలియ్యుల్ అజీం.

సూర ఇఖ్లాస్, సూర ఫలఖ్, సూర నాస్ ప్రతి నమాజ్ తర్వాత ఒక్కోసారి ఫజ్ర్ మరియు మగ్రిబ్ తరువాత మూడేసి సార్లు చదవాలి.

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, ఖుల్ హువల్లాహు అహద్, అల్లాహుస్సమద్, లమ్ యలిద్, వలమ్ యూలద్, వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్.

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్, మిన్ షర్రి మా ఖలఖ్, వమిన్ షర్రి గాసిఖిన్ ఇజా వఖబ్, మవిన్ షర్రిన్ నఫ్ఫాసాతి ఫిల్ ఉఖద్, మవిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్.

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్, మలికిన్నాస్, ఇలాహిన్నాస్, మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్, అల్లజీ యువస్విసు ఫీ సుదూరిన్నాస్, మినల్ జిన్నతి వన్నాస్

మస్బూఖ్:

జమాతుతో ఒకటి లేదా ఎక్కువ రకాతులు తప్పిపోయిన వ్యక్తిని మస్బాఖ్ అంటారు.

ఇమాం రెండవ సలాం త్రిప్పిన తర్వాత ఈ వ్యక్తి సలాం త్రిప్పకుండా తప్పిపోయిన రకాతులు వెరవేర్చాలి.

అతను ఇమాంతో ఏ రకాతులో కలిసాడో అదే అతనిది మొదటి రకాతు.

ఇమాంను రుకూ స్థితిలో పొందినవాని ఆ రకాతు అయినట్లే. ఇమాంను రుకూలో పొందకుంటే ఆ రకాత్ తప్పిపోయినట్లే లెక్క.

జమాతు నిలబడిన తర్వాత వచ్చేవారు జమాతును ఏ స్థితిలో చూసినా అదే స్థితిలో కలవాలి. వారు రుకూ, లేదా సజ్దా ఇంకే స్థితిలో ఉన్నా సరే. వారు మరో రకాతు కొరకు నిలబడే వరకు నిరీక్షించవద్దు.

నిలబడి తక్బీరె తహ్రీమ అల్లాహు అక్బర్ అనాలి. రోగి లాంటి ఏదైనా ఆటంకం ఉన్నవారు కూర్చుండి అల్లాహు అక్బర్ అంటే ఏమీ తప్పు లేదు.

నమాజును భంగపరుచు కార్యాలు:

1- తెలిసి, కావాలని మాట్లడడం, అది కొంచమైనా సరే.

2- పూర్తి శరీరముతో ఖిబ్లా దిశ నుండి పక్కకు మరలడం.

3- వుజూను భంగపరిచే కారణాల్లో ఏ ఒకటైనా సంభవించడం.

4- అనవసరంగా ఎడతెగకుండా ఎక్కువ చలనము చేయడం.

5- కొంచం నవ్వినా నమాజు వ్యర్థమవుతుంది.

6- తెలిసి కూడా ఎక్కువ రుకూ, సజ్దాలు, ఖియాం, జుల్సాలు చేయడం.

7- తెలిసి కూడా (రుకూ, సజ్దా వగైరా) ఇమాంకు ముందు చేయడం.

నమాజులు చేయరాని వేళలు:

కొన్ని సమయాల్లో నమాజు చేయుట యోగ్యం లేదు. అవి:

1- ఫజ్ర్ నమాజు తర్వాత నుండి సూర్యోదయం తర్వాత సూర్యుడు బారెడంత పైకి వచ్చే వరకు.

2- మిట్ట మధ్యానం, సూర్యుడు నడి ఆకాశంలో, తలకు సమానంగా ఉన్నప్పుడు. అది పశ్చిమాన వాలే వరకు.

3- అస్ర్ నమాజు తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు.

కాని ఈ సందర్భాల్లో కొన్ని నమాజులు చేయవచ్చు. ఉదాః తహియ్యతుల్ మస్జిద్ (మస్జిదులో ప్రవేశించిన వెంటనే చేయు నమాజ్). జనాజా నమాజ్. సూర్య గ్రహణ నమాజ్. తవాఫ్ సున్నతులు. తహియ్యతుల్ వుజూ లాంటివి.

అలాగే తప్పిపోయిన నమాజులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసు ఆధారంగా:

 (مَنْ نَسِيَ صَلَاةً أَوْ نَامَ عَنْهَا فَكَفَّارَتُهَا أَنْ يُصَلِّيَهَا إِذَا ذَكَرَهَا)

“ఎవరైనా ఏదైనా నమాజు మరచిపోతే, లేదా దాని సమయంలో నిద్రపోతే గుర్తు వచ్చిన వెంటనే దాన్ని నెరవేర్చడమే దాని ప్రాయశ్చితం”. (ముస్లిం 684, బుఖారి 597).

వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు


నమాజు కు సంబందించిన ఇతర  వీడియోలు పుస్తకాల కొరకు క్రింది లింక్ క్లిక్ చెయ్యండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/

నమాజ్ పాఠాలు: 1వ పాఠం: నమాజ్ ఆదేశం, మర్యాదలు [వీడియో]

బిస్మిల్లాహ్

حكم الصلاة وآدابها  – నమాజు ఆదేశం, దాని మర్యాదలు

22:39 నిముషాలు

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


నమాజ్ ఇస్లాం మూల స్థంబాలలో రెండవది. అది ప్రాజ్ఞ వయస్సుకు చేరిన, బుద్ధిమంతుడైన ప్రతీ ముస్లింపై విధిగా ఉంది.

అల్లాహ్ ఆదేశం ఇలా ఉంది:

[إِنَّ الصَّلَاةَ كَانَتْ عَلَى المُؤْمِنِينَ كِتَابًا مَوْقُوتًا] [النساء:103]

వాస్తవానికి నమాజ్ విశ్వాసులు నిర్ణీత సమయాలలో పాటించవలసిన ధర్మం. (సూరె నిసా 4: 103).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారని ఇబ్ను ఉమర్ (రదియల్లాహు అన్హు )ఉల్లేఖించారు:

(بُنِيَ الْإِسْلَامُ عَلَى خَمْسٍ شَهَادَةِ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ الله وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ وَالْحَجِّ وَصَوْمِ رَمَضَانَ).

“ఇస్లాం పునాది ఐదు విషయాలపై ఉంది:

  • 1- అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరొకడు లేడు, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట.
  • 2- నమాజు స్థాపించుట.
  • 3- జకాత్ (విధిదానం) చెల్లించుట.
  • 4- హజ్ చేయుట.
  • 5- రమజాను ఉపవాసాలు పాటించుట”.

(బుఖారి 8, ముస్లిం 16).

ప్రాజ్ఞ వయస్సుకు చేరడం అంటే పదిహేను సంవత్సరాలు నిండడం, లేదా మర్మాంగం చుట్టున వెంట్రుకలు మొలవడం, లేదా స్వప్నస్ఖలనం ద్వారా ఇంకే విధంగానైనా ఇంద్రియం వెలువడడం.

బాలికలకు నెలవారి రక్తస్రావం అంటే బహిష్టు రావడం. మనిషికి వీటిలో ఏ ఒక్కటి జరిగినా అతను ప్రాజ్ఞవయస్సుకు చేరినట్లు.

నమాజు విధిని తిరస్కరించే వాడు కాఫిర్ (సత్య తిరస్కారి) అవుతాడని ఏకాభిప్రాయం (ఇజ్మాఅ) ఉంది. ఇక బద్ధకం, నిర్లక్ష్యంతో మొత్తానికే నమాజు చేయనివాడు కూడా కాఫిర్ అవుతాడని సహాబాలు  ఏకీభవించారు (ప్రవక్త సహచరుల ఇజ్మాఅ ఉంది).

జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ప్రకారం, నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా విన్నాను:

 (إِنَّ بَيْنَ الرَّجُلِ وَبَيْنَ الشِّرْكِ وَالْكُفْرِ تَرْكَ الصَّلَاةِ).

“ఒక మనిషి మరియు షిర్క్, కుఫ్ర్ (బహుదైవారాధన, సత్యతిరస్కారం) మధ్య ఉన్న వ్యత్యాసం నమాజును విడనాడడం”. (ముస్లిం 82).

ప్రళయదినాన మానవునితో తొలి లెక్క నమాజు గురించే జరుగును. నమాజుకు సంబంధించిన ఖుర్ఆన్ ఆదేశం చదవండి:

నమాజు పాటించడంలో చాలా గొప్ప ఘనతలున్నాయి, వాటిలో కొన్ని: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని, అబూ హురైర (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

 (مَنْ تَطَهَّرَ فِي بَيْتِهِ ثُمَّ مَشَى إِلَى بَيْتٍ مِنْ بُيُوتِ الله لِيَقْضِيَ فَرِيضَةً مِنْ فَرَائِضِ الله كَانَتْ خَطْوَتَاهُ إِحْدَاهُمَا تَحُطُّ خَطِيئَةً وَالْأُخْرَى تَرْفَعُ دَرَجَةً).

“ఎవరైనా తన ఇంట్లో వుజూ చేసుకొని, అల్లాహ్ యొక్క విధుల్లో ఒక విధి నిర్వహించుటకు అల్లాహ్ గృహాల్లోని ఒక గృహం (మస్జిద్)లో ప్రవేశిస్తే, అతను వేసే అడుగుల్లో ఒక దానికి బదులుగా ఒక పుణ్యం లభిస్తే, మరో దానికి బదులుగా ఒక స్థానం పెరుగుతుంది”. (ముస్లిం 666).

అబూహురైర (రది అల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: మహానీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అడిగారు:

 (أَلاَ أَدُلُّكُمْ عَلَى مَا يَمْحُو اللهُ بِهِ الْخَطَايَا ، وَيَرْفَعُ بِهِ الدَّرجَاتِ) قَالُوا: بَلَى يَا رَسُولُ اللهِ. قَالَ: (إِسبَاغُ الْوُضُوءِ عَلَى الْمَكَارِه ، وَكَثْرَةُ الْخُطَا إِلَى الْمَسَاجِد ، وَانْتِظَارُ الصَّلاَةِ بَعدَ الصَّلاَةِ ، فَذَلِكُمُ الرِّبَاط).

“పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో అలాంటి విషయాలు మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారు:

  • “(1) వాతవరణం, పరిస్థితులూ అనుకూలంగా లేనప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం.
  • (2) మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం.
  • (3) ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం, ఇది రిబాత్ తో సమానం(1).

(ముస్లిం 251).

(1)  రిబాత్ అంటే సత్యాసత్యాల మధ్య పోరాటం సాగే రోజుల్లో రాత్రిళ్ళు పహరా కాయడం. శాంతి కాలంలో నమాజ్ పట్ల మక్కువ, పోరాటపు రోజుల్లో ప్రాణాలొడ్డి పహరాకాయడంతో సమానమని అర్థం.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని అబూ హురైర (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

 (مَنْ غَدَا إلَى الْمَسْجِدِ أَو رَاحَ ، أَعَدَّ اللهُ لَهُ فِي الْجَنَّةِ نُزُلاً،كُلَّمَا غَدَا أو رَاحَ).

“మస్జిద్ కు వస్తూ పోతూ ఉండేవారు (ఎంత అదృష్టవంతులంటే), వారు వస్తూ పోతూ ఉన్న ప్రతీసారి అల్లాహ్ వారి కొరకు స్వర్గంలో విందు ఏర్పాటు చేస్తాడు”. (బుఖారి 662. ముస్లిం 669).


నమాజుకు సంబంధించిన ముఖ్య విషయాలు:

1- సామూహికంగా నమాజు చేయడం పురుషులపై విధిగా ఉంది, ఈ హదీసు ఆధారంగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం తెలిపారు:

(لَقَدْ هَمَمْتُ أَنْ آمُرَ بِالصَّلَاةِ فَتُقَامَ ثُمَّ أُخَالِفَ إِلَى مَنَازِلِ قَوْمٍ لَا يَشْهَدُونَ الصَّلَاةَ فَأُحَرِّقَ عَلَيْهِمْ).

“నమాజు చేయించడానికి ఒకరిని ఆదేశించి, సామూహిక నమాజులో పాల్గొనని వారి వైపుకు తిరిగి వారు ఇండ్లల్లో ఉండగా వారి గృహాలను తగలబెడదామని ఎన్నో సార్లు అనుకున్నాను”. (బుఖారి 2420, ముస్లిం 651).

2- ముస్లిం వ్యక్తి శాంతి, నిదానంగా త్వరగా మస్జిదుకు రావాలి.

3- మస్జిదులో ప్రవేశిస్తూ కుడి కాలు ముందు వేసి చదవండి:

అల్లా హుమ్మఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక. (ముస్లిం 713).

اللهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ (ఓ అల్లాహ్ నా కొరకు నీ కరుణ ద్వారాలు తెరువు).  

4- కూర్చునే ముందు రెండు రకాతులు తహియ్యతుల్ మస్జిద్ చేసుకోవడం సున్నత్.

عَنْ أَبِي قَتَادَةَ السَّلَمِيِّ t أَنَّ رَسُولَ الله قَالَ: (إِذَا دَخَلَ أَحَدُكُمْ الْمَسْجِدَ فَلْيَرْكَعْ رَكْعَتَيْنِ قَبْلَ أَنْ يَجْلِسَ).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారని, అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

మీలో ఎవరైనా మస్జిదులో ప్రవేశిస్తే కూర్చునే ముందు రెండు రకాతుల నమాజు చేసుకోవాలి”. (బుఖారి 444, ముస్లిం 714).

5- నమాజులో సతర్ తప్పనిసరి. పురుషుల సతర్ నాభి నుండి మోకాళ్ళ వరకు, స్త్రీల పూర్తి శరీరమే సతర్, నమాజులో కేవలం ముఖము తప్ప.

6- కాబా వైపునకు అభిముఖమై ఉండుట తప్పనిసరి. నమాజు అంగీకారానికి ఇది ఒక షరతు. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప. ఉదాః వ్యాది లేదా మరేదైనా కారణం.

7- ప్రతీ నమాజు దాని సమయములో చేయాలి. సమయానికి ముందు చేయుట సమ్మతం కాదు. సమయం దాటి చేయడం నిషిద్ధం.

8- నమాజుకై శీఘ్రముగా సమయంలో రావడం, తొలి పంక్తిలో చేరుకోవడం, నమాజు కొరకు వేచించడం, ఇవన్నియూ చాలా గొప్ప ఘనతగల కార్యాలు.

عَنْ أَبِي هُرَيرَةَ t أَنَّ رَسُولَ الله قَالَ: (لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ ثُمَّ لَمْ يَجِدُوا إِلَّا أَنْ يَسْتَهِمُوا عَلَيْهِ لَاسْتَهَمُوا وَلَوْ يَعْلَمُونَ مَا فِي التَّهْجِيرِ لَاسْتَبَقُوا إِلَيْهِ…).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించారని, అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

“అజాన్ పలకడం మరియు మొదటి పంక్తిలో చేరడం ఎంత పుణ్యకార్యమో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటి (ఖుర్అ) పద్దతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటి వేసుకొందురు. అలాగే వేళ కాగానే తొలి సమయంలో నమాజుకు రావడంలో ఎంత పుణ్యముందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటిపడుదురు. …..”. (బుఖారి 615, ముస్లిం 437).

عَنْ أَبِي هُرَيْرَةَ t أَنَّ رَسُولَ الله قَالَ: (لَا يَزَالُ أَحَدُكُمْ فِي صَلَاةٍ مَا دَامَتْ الصَّلَاةُ تَحْبِسُهُ).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారని, అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

నమాజు కొరకు వేచిస్తూ ఉన్న వ్యక్తికి నమాజు చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది“. (బుఖారి 659, ముస్లిం 649).


నమాజు సమయాలు:

  • జొహ్ర్ నమాజు నమయం: తల నుండి పొద్దు వాలినప్పటి నుండి ప్రతీ వస్తువు నీడ దానంత అయ్యే వరకు.
  • అస్ర్ నమాజు సమయం: ప్రతీ వస్తువు నీడ దానంత అయినప్పటి నుండి సూర్యాస్తమయం వరకు.
  • మగ్రిబ్ నమాజు సమయం: సూర్యాస్తమయమైనప్పటి నుండి ఎర్రని కాంతులు కనుమరుగయ్యే వరకు.
  • ఇషా నమాజు సమయం: ఎర్రని కాంతులు మరుగైన మరుక్షణం నుండీ అర్థ రాత్రి వరకు.
  • ఫజ్ర్ నమాజు సమయం: ఉషోదయము నుండి సూర్యోదయము వరకు.

నమాజు చేయరాని స్థలాలు:

1- ఖననవాటిక: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

(الْأَرْضُ كُلُّهَا مَسْجِدٌ إِلَّا الْحَمَّامَ وَالْمَقْبَرَةَ).

“భూభాగమంతయూ మస్జిదే. స్నానశాల, మరుగుదొడ్లు మరియు ఖనన వాటిక (ఖబరస్తాన్) తప్ప”. (అబూ దావూద్ 492, తిర్మిజి 317).

అయితే జనాజ నమాజు మట్టుకు ఖబరస్తానులో చేయడం ధర్మమే.

అలాగే స్నానాలు చేసే బాత్ రూంలో నమాజు చేయరాదు. మరుగుదొడ్లో నమాజ్ చేయడం కఠినంగా నిషిద్ధం.

2- సమాధి, గోరీల వైపు:

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నాను అని అబూ మర్సద్ గనవీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

(لَا تُصَلُّوا إِلَى الْقُبُورِ وَلَا تَجْلِسُوا عَلَيْهَا).

గొరీలు ఎదురుగా ఉండగా నమాజ్ చేయడం గానీ, వాటిపై కూర్చోవటం గానీ చేయకండి”. (ముస్లిం 972).

3- ఒంటెశాల అంటే ఒంటెలు కట్టే చోటు. అలాగే అశుద్ధ స్థలాల్లో నమాజు చేయరాదు.

ఫాతిహా అంటే ఏమిటి?ఎలా చేయాలి? [ఆడియో, టెక్స్ట్]

ఫాతిహా అంటే ఏమిటి?ఎలా చేయాలి?
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=yMaP0GqHX7U [9 నిముషాలు]

ఈ ప్రసంగంలో సూరత్ అల్-ఫాతిహా యొక్క ప్రాముఖ్యత మరియు దానిని ఉపయోగించాల్సిన సరైన పద్ధతుల గురించి వివరించబడింది. సూరత్ అల్-ఫాతిహా ఖురాన్‌లోని మొట్టమొదటి సూరా అని, దీనిని నమాజులోని ప్రతి రకాత్‌లో తప్పనిసరిగా పఠించాలని వివరించారు. అంతేకాకుండా, ఆరోగ్యం కోసం (రుఖ్యా) దీనిని పఠించడం సున్నత్ అని, దీనికి సహీహ్ బుఖారీలో ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

అయితే, సమాజంలో వ్యాపించి ఉన్న బిద్అత్ ఆచారాలు, అంటే వంటకాలపై ఫాతిహా చదవడం, మీలాద్‌లు, ఉర్సులు, మరియు ఇతర పండుగల పేరుతో చేసే ఆచారాలను ఖండించారు. పుణ్యపురుషుల పేరుతో చేసే ఇటువంటి పనులు షిర్క్ మరియు బిద్అత్ అని, అల్లాహ్ యే సర్వశక్తుడని, ఆయననే వేడుకోవాలని ప్రబోధించారు. చివరిగా, బిద్అత్ లేదా షిర్క్ ఆచారాలలో భాగంగా చేసిన ఆహారాన్ని తినకూడదని హెచ్చరిస్తూ, సన్మార్గంలో నడవాలని అల్లాహ్ ను వేడుకున్నారు.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అల్ హమ్దులిల్లాహ్! ఫాతిహా గురించి ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. సంక్షిప్తంగా ఇక్కడ వచ్చిన ఒక ప్రశ్నకు సమాధానంగా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వింటారు అని మరియు ఖురాన్ హదీసు ప్రకారంగా సహీహ్ విషయాలపై ఆచరిస్తారు అని ఆశిస్తున్నాను. అల్లాహ్ మనందరికీ ఖురాన్ మరియు హదీసును అనుసరించేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక.

సాధారణంగా ప్రశ్న ఎలా వస్తుంది? ఫాతిహా ఎలా చేయాలి? ఫాతిహా చేసే పద్ధతి ఏంటి? కొంచెం తెలపగలరు. లేదా ఫాతిహా చేసిన అన్నం తినవచ్చా? ఫాతిహా చేసి ఉన్న ఏదైనా పదార్థం త్రాగవచ్చా? అన్నటువంటి ప్రశ్నలు ఉంటాయి. అయితే ముందు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సూరతుల్ ఫాతిహా దివ్య ఖురాన్ అల్లాహ్ పంపినటువంటి సత్య గ్రంథం, దివ్య గ్రంథం ఖురానే మజీద్‌లోని మొట్టమొదటి సూరత్.

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్, అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ నుండి మొదలవుతుంది. గైరిల్ మగ్ దూబి అలైహిమ్ వలజ్జాల్లీన్ పై సమాప్తమవుతుంది.

ఈ సూరా మనం ఎన్నో సందర్భాలలో చదివేది ఉంది. దీనిని సూరే ఫాతిహా అని అంటారు. ఖురాన్‌లో అల్ ఫాతిహా అన్న పేరుతోనే ఇది వ్రాయబడుతుంది. పోతే ఇంకా వేరే ఎన్నో ఘనతలు ఈ సూరాకు ఉన్నాయి, ఇంకా ఎన్నో పేర్లు కూడా ఉన్నాయి.

అయితే మనం రేయింబవళ్లలో, 24 గంటల్లో చేసేటువంటి ఐదు ఫర్జ్ నమాజులలో 17 ఫర్జ్ రకాత్లు ఏవైతే ఉన్నాయో, వాటిలోని ప్రతి ఒక్క రకాత్‌లో సూరే ఫాతిహా తప్పకుండా చదవాలి. మనం జమాత్ లో ఉండి నమాజ్ చేస్తున్నా గానీ, ఒంటరిగా చేస్తున్నా గానీ, ఇమామ్ గా ఉన్నా గానీ, ముక్తదీగా ఉన్నా గానీ. ఇది ఫాతిహా సూరా చదివేది నమాజులో.

ఇక నమాజులో కాకుండా ఆరోగ్యం పొందే ఉద్దేశంతో దీనిని చదవవచ్చు. సహీహ్ బుఖారీలో దీనికి ఆధారం అనేది ఉంది. ఎవరికైనా ఏదైనా పురుగు కాటేసింది లేదా ఏదైనా పాము, తేలు అట్లాంటిది లేదా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా నొప్పి ఉంది, శరీరంలో ఏదైనా బాధ ఉంది, అలాంటి వారు ఈ సూరా చదివి తమపై ఊదుకోవచ్చు. ఇక్కడ విషయం మరోసారి శ్రద్ధగా వినండి. స్వయం ఆరోగ్యం పొందాలన్న ఉద్దేశంతో స్వయం మనకు మనం ఈ సూరా చదివి మన శరీరంపై లేదా నొప్పి ఉన్న భాగంపై లేదా కాటేసిన చోటు మనం ఊదుకోవచ్చు. సాధారణంగా ప్రజలు ఏమనుకుంటారు? ఫలానా వారి దగ్గరికి వెళ్లాలి, వారు మనకు ఏదైనా మంత్రం చేయాలి, దువా చదవాలి, వారు చదివి ఊదాలి – ఇటువంటి విషయాలు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో పర్వాలేదు కానీ, సాధారణంగా మనం ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాలు నేర్చుకోవాలి.

ఇక రండి కొన్ని సందర్భాలలో కొన్ని వంటకాలు చేసి ఏదైతే ఫాతిహా చేయడం అన్నటువంటి పదం మనలో చాలా ప్రబలి ఉందో శ్రద్ధగా వినండి సోదర సోదరీమణులారా. మీలాద్‌లు, ఉర్సులు, జాతరాలు, చాలిస్వాలు, బిస్వాలు, తీస్వాలు ఇలాంటివి, రజబ్ కే కుండే, ఇంకా ముర్దోం కీ ఈద్, బడోం కీ ఈద్, 15 షాబాన్, షబే బరాత్ ఇట్లాంటి ఇంకా ఎన్నో పేర్లతో ఏ ఏ బిద్అత్లన్నీ జరుగుతున్నాయో, సాధారణంగా అలాంటి బిదాత్లలోనే కొన్ని తిను పదార్థాలపై లేదా మంచి బిర్యానీలు, పలావులు, ఇంకా ఏదైనా తీపి పదార్థాలు వండుకొని ఏం చేస్తారు? అక్కడ ఫాతిహా అని చేస్తారు.

ఇక ఇందులో ఇలా చేసే వారు కొందరు మౌల్వీ సాబులు వారి వ్యక్తిగత లాభం కొరకు చేస్తారా, దేని కొరకు చేస్తారో అల్లాహ్ అందరికీ హిదాయత్ ఇచ్చుగాక. కానీ శ్రద్ధగా వినండి ఇలా ఇట్లాంటి బిద్అత్లు అవి చేయడమే నిషిద్ధం ఇస్లాంలో. ఎందుకంటే మొహర్రంలో పీరీల పండుగలు గానీ, ఆ తర్వాత నెలలో ఏదైనా చివరి బుధవారం అని, ఆ తర్వాత వచ్చే రబీ ఉల్ అవ్వల్ నెలలో మీలాద్ అని, ఆ తర్వాత వచ్చే రబీ ఉల్ ఆఖర్ నెలలో పీరానే పీర్ కా మహీనా గ్యార్వీ షరీఫ్ లో అని, ఇంకా లేదా రజబ్ లో రజబ్ కే కుండే 22 రజబ్ ఇమామ్ జాఫర్ సాదిక్ రహిమహుల్లా పేరుతో, కుండే మేరాజ్ యొక్క రాత్రి, ఇట్లాంటివి షాబాన్ లో ఇంకా 15 షాబాన్ షబే బరాత్ ఇట్లాంటివన్నీ కూడా బిద్అత్లు. ఈ బిద్అత్లు చేయడానికి ఇస్లాంలో అనుమతి ఏమాత్రం లేదు.

ఇక ఆ బిద్అత్లు చేసి అందులో కొన్ని వంటకాలు చేసుకొని అందులో ఫాతిహాల పేరుతో ఏమైనా చేయడం కూడా నిషిద్ధం హరామ్ కిందికి వస్తుంది, అవన్నీ జాయెజ్ లేవు. కొందరు ఏమంటారో తెలుసా? మేము ఈసాలే సవాబ్ గురించి చేస్తున్నాము. మన పుణ్యాత్ములకు, పూర్వీకులకు, పుణ్యపురుషులకు, మన బంధువులలో చనిపోయిన వారికి పుణ్యం దొరకాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాము – ఇవన్నీ కేవలం బూటకపు మాటలు, కేవలం ఒక బిద్అత్ ను నడపడానికి పేర్లు మార్చి చేసేటువంటి కొన్ని పనులు. అందుకొరకు జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి వాటికి ఏ ఆధారాలు లేవు.

ఇక కొందరు మౌల్వీ సాబులు ఫాతిహా అన్న పేరుతో ఈ సూరే ఫాతిహా చదువుతారు, కుల్ హువల్లాహు అహద్ చదువుతారు, దరూద్ షరీఫ్ చదువుతారు, ఇంకా కొందరు ఇంకొన్ని పెంచుతారు, మరికొందరు కొన్ని తగ్గిస్తారు. ఆ తర్వాత ఇక ఫాతిహా అయిపోయింది, ఇక దీంట్లో చాలా బర్కత్ ఉంటుంది తినాలి అని అంటారు. మరికొందరు ఈ సూరాలు చదవడమే కాకుండా కొందరు అల్లాహ్ యొక్క వలీలు, అల్లాహ్ యొక్క భక్తులు ఎవరైతే గడిచిపోయారో, వారి పేర్ల మీద కొన్ని ప్రత్యేక పనులు చేస్తారు. ఇట్లాంటివి షిర్క్ వరకు చేరిపిస్తాయి. మొదటి విషయం ఏదైతే ఉందో కేవలం ఆ సూరాలు చదవడం ఖురాన్ లోని – ఇది బిద్అత్ కిందికి వస్తుంది, అది కూడా హరామ్. కానీ మరికొందరు ఏం చేస్తారు? పుణ్యపురుషుల పేర్లతో వాళ్ళ పేర్లు తీసుకొని మనం ఈ విధంగా చదివేది ఉంటే ఇంత ఇంత బర్కత్, ఇంత ఇంత శుభము, ఇంత ఇంత పుణ్యము లభిస్తుంది అన్నటువంటి మూఢనమ్మకాలలో ఉంటారు. వారికి అవన్నీ ఏమీ లభించవు, వాస్తవానికి అన్నీ ప్రసాదించేవాడు అల్లాహ్ యే. ఏదైనా పరీక్ష వచ్చినా గానీ అల్లాహ్ వైపు నుండే వస్తుంది. కానీ ప్రజలలో ఉన్న మూఢనమ్మకం ద్వారా వారు ఇలా చేస్తారు, ఇది షిర్క్ వరకు చేరిపిస్తుంది. అందుకొరకు మనం ఎలాంటి ఫాతిహాలు చేయకూడదు.

ఇక మన ఇంటికి ఎవరైనా ఫాతిహా చేసిన వస్తువు తీసుకొచ్చి వస్తే ఇస్తే అవి తినాలా అని కూడా అడుగుతూ ఉంటారు. అయితే ఒకవేళ కేవలం బిద్అత్ కు సంబంధించినది అయ్యేది ఉంటే అది తీసుకోకూడదు. ఎందుకు? తీసుకోవడంలో ఒక బిద్అత్ కు, ఒక నిషిద్ధ కార్యానికి మనం సపోర్ట్ చేసే వాళ్లం అవుతున్నాము అని. కానీ ఏమీ తెలియకుండా వచ్చేసింది మనం తినేసాము, అల్లాహ్ క్షమించుగాక అని మనం ఇస్తిగ్ఫార్ చేసుకోవాలి.

ఇక ఒకవేళ నేను రెండో రకం ఏదైతే చెప్పానో చూడండి, ఆ ఫాతిహాలలో షిర్క్ లాంటి విషయాలు కూడా ఉంటాయి అని. అవి గైరుల్లాహ్ యొక్క పేరు కూడా అందులో తీసుకోవడం జరుగుతుంది. మరి ఖురాన్ లో నాలుగు చోట్ల అల్లాహ్ త’ఆలా గైరుల్లాహ్ యొక్క పేరు మీద, అల్లాహ్ యేతరుల పేరు మీద ఇట్లాంటి మొక్కుబడులు చేసిన వాటిని తినకూడదు అని నిషేధించాడు. అది షిర్క్ కిందకి వస్తుంది, దాని నుండి అయితే ఎట్టి పరిస్థితిలో కూడా మనం జాగ్రత్త వహించాలి.

అయితే ఈ ఫాతిహాకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు మీ ముందుకు వచ్చేసాయి అని నేను ఆశిస్తున్నాను. అల్లాహ్ త’ఆలా అన్ని రకాల చెడుల నుండి, అన్ని రకాల దురాచారాల నుండి ఇస్లాం యొక్క పేర్లు లేబుల్ లు తగిలించి చేసేటువంటి పనుల నుండి, ఇట్లాంటి మోసపూరితమైన మాటలు చేష్టల నుండి అల్లాహ్ మనందరినీ కూడా కాపాడుగాక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సరైన పద్ధతిని అనుసరిస్తూ అల్లాహ్ యొక్క ఆరాధన పూర్తి ఇఖ్లాస్ చిత్తశుద్ధి మంచి సంకల్పంతో చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక.

బారకల్లాహు ఫీకుమ్ వ జజాకుముల్లాహు ఖైరా. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వసల్లల్లాహు వ సల్లమ అలా నబియ్యినా ముహమ్మద్ వఅలా ఆలిహీ వసహబిహీ అజ్మయీన్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=6885

తయమ్ముం, దాని విధానం మరియు సందర్భాలు [వీడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

తయమ్ముం, దాని విధానం మరియు సందర్భాలు
[https://youtu.be/1saC1XDHDgo [30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 


తయమ్ముమ్‌:

క్రింద తెలుపబడే కారణాలు సంభవించినప్పుడు ప్రయాణికులు, స్థానికులు ఎవరైనా సరే వుజూ మరియు గుస్ల్‌ కు బదులుగా తయమ్ముమ్‌ చేయవచ్చును.

1- అతికష్టంగా వెతికినప్పటికీ నీళ్ళు దొరకనప్పుడు, లేదా ఉండికూడా వుజూకు సరిపడనప్పుడు తయమ్ముమ్‌ చేయవచ్చును. కొంత దూరములో నీళ్ళు ఉన్నా అక్కడికి వెళ్ళి తీసుకోవడంలో అతనికి ధన, ప్రాణ నష్టమున్నప్పుడు కూడా తయమ్ముమ్‌ చేయవచ్చును.

2- వుజూ అవయవాల్లో ఏ ఒకదానికైనా గాయమయితే దాన్ని కడిగే ప్రయత్నం చేయాలి. కడగడం వల్ల నష్టం ఉంటే మసహ్‌ చేయాలి, అంటే చేయి తడి చేసి దాని మీద తుడువాలి. మసహ్‌ వల్ల కూడా హాని కలిగే భయం ఉంటే తయమ్ముమ్‌ చేయవచ్చును.

3- ఏ నీళ్ళు లేదా వాతవరణం మరీ చల్లగా ఉండి నీళ్ళ ఉపయోగం హానికరంగా ఉంటే తయమ్ముమ్‌ చేయవచ్చును.

4- నీళ్ళు కేవలం త్రాగడానికి మాత్రమే ఉన్నప్పుడు కూడా తయమ్ముమ్‌ చేయవచ్చును.

తయమ్ముమ్‌ విధానం:

మనుసులో నియ్యత్‌ /సంకల్పం చేసుకొని రెండు అరచేతులు ఒక సారి భూమిపై తట్టి ముఖముపై మళ్ళీ మణికట్ల వరకు రెండు చేతులపై మసహ్‌ చేయాలి. (కొందరు వుజూ చేసినట్టుగా మోచేతుల వరకు, కాళ్ళు సయితం మసహ్‌ చేస్తారు ఇది ప్రవక్త పద్దతి ఎంతమాత్రం కాదు). వుజూను భంగపరిచే విషయాలే తయమ్ముమ్‌ ను భంగపరుస్తాయి. నమాజుకు ముందు లేదా నమాజు మధ్యలో నీళ్ళు లభిస్తే తయమ్ముమ్‌ భంగమవుతుంది. నమాజు పూర్తి చేసుకున్న తరువాత నీళ్ళు లభిస్తే ఆ నమాజు అయినట్లే. తిరిగి మళ్ళీ చేయవలసిన అవసరం లేదు.

[ఇది నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)  గారు రాసిన “శుద్ధి & నమాజు (Tahara and Salah)” అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ఈ ఆడియోలో, ప్రవక్త తయమ్ముమ్ (నీరు లేనప్పుడు చేసే శుద్ధి) గురించి వివరిస్తున్నారు. తయమ్ముమ్ అంటే అల్లాహ్ ఆరాధన ఉద్దేశంతో పరిశుభ్రమైన మట్టిపై రెండు చేతులు కొట్టి ముఖాన్ని మరియు రెండు అరచేతులను తుడుచుకోవడం. నీరు అందుబాటులో లేనప్పుడు లేదా దాని వాడకం హానికరమైనప్పుడు తయమ్ముమ్ చేయడం విధిగా చెప్పబడింది. ఇది ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఉమ్మత్‌కు మాత్రమే ఇవ్వబడిన ఒక గొప్ప వరం మరియు సౌకర్యం అని, గత ప్రవక్తల అనుచరులకు ఈ సౌలభ్యం లేదని హదీసుల ద్వారా వివరించబడింది. తయమ్ముమ్ యొక్క షరతులు – నియ్యత్ (ఉద్దేశం), నీరు లేకపోవడం, మరియు పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించడం. చిన్న అశుద్ధి (హదసె అస్గర్) మరియు పెద్ద అశుద్ధి (హదసె అక్బర్) రెండింటికీ తయమ్ముమ్ సరిపోతుంది. అయితే, నీరు అందుబాటులోకి వచ్చిన వెంటనే, తయమ్ముమ్ చెల్లదు మరియు స్నానం లేదా వుదూ చేయడం తప్పనిసరి అవుతుంది.

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ సహ్‌బిహీ అజ్మయీన్, అమ్మా బాద్.

తయమ్ముమ్ అంటే అల్లాహ్ యొక్క ఆరాధన ఉద్దేశంతో పరిశుభ్రమైన మట్టి మీద రెండు అరచేతులను కొట్టి ముందు ముఖం మీద తర్వాత రెండు అరచేతుల మీద ఇలా తుడుచుకోవడం.

నీళ్లు లేని సందర్భంలో లేదా నీళ్లు ఉండి దాని ఉపయోగం హానికరంగా ఉన్నందువల్ల ఈ తయమ్ముమ్ చేయటం విధిగా ఉంది. అల్లాహుతాలా దీని గురించి చాలా స్పష్టంగా ఆదేశించాడు. సూరె మాయిదా సూర నెంబర్ ఐదు ఆయత్ నెంబర్ ఆరులో అల్లాహ్ ఆదేశం ఉంది.

فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا
ఫలమ్ తజిదూ మాఅన్ ఫతయమ్మమూ సయీదన్ తయ్యిబా
మీరు నీళ్లు పొందని స్థితిలో పరిశుభ్రమైన మట్టితో తయమ్ముమ్ చేసుకోండి.

فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ مِنْهُ
ఫమ్సహూ బివుజూహికుమ్ వ ఐదీకుమ్ మిన్హ్
మీ ముఖాలను తుడుచుకోండి. మీ చేతులను కూడా తుడుచుకోండి.

అయితే దీని ఆదేశం ఏంటి? విధిగా ఉంది. నీళ్లు లేని సందర్భంలో లేక నీళ్లు ఉండి మన కొరకు హానికరంగా ఉన్న సందర్భంలో తయమ్ముమ్ తప్పనిసరిగా చేయాలి.

అయితే ఇక్కడ ఇంకో విషయం మనకు తెలిసి ఉండటం చాలా మంచిది. అందువల్ల మనం అల్లాహ్ యొక్క కృతజ్ఞత అనేది ఇంకా ఎంతో గొప్పగా చెల్లించుకోవచ్చు. అదేమిటి?

ఈ తయమ్ముమ్ యొక్క సౌకర్యం ఇది అల్లాహ్ వైపు నుండి కేవలం మన కొరకు ఒక గొప్ప వరం. ఎందుకంటే ఇంతకుముందు ప్రవక్తల అనుసరులకు, ఇంతకుముందు ప్రవక్తలను విశ్వసించిన వారికి ఇలాంటి సౌకర్యం అల్లాహ్ ప్రసాదించలేదు. ఈ సౌకర్యం అల్లాహ్ తాలా ఎవరికి ఇచ్చాడు ప్రత్యేకంగా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుసరులకు, ఆయనను విశ్వసించిన వారికి ప్రసాదించాడు.

ఈ విషయం బుఖారీ ముస్లింలో ఒక చాలా స్పష్టమైన హదీస్ ఉంది. జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తాలా అన్హు గారు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు: “ఐదు విషయాలు ఉన్నాయి, నాకంటే ముందు ఏ ప్రవక్తకు అవి ఇవ్వబడలేదు.” గమనించండి. అంటే ఈ ఐదు విషయాల ప్రత్యేకత అనేది కేవలం మన ప్రవక్తకే ప్రసాదించబడినది. ఒకటి, నా శత్రువులు నా నుండి ఒక నెల దూర ప్రయాణంలో ఉంటారు కానీ వారి హృదయాల్లో అల్లాహ్ నా యొక్క భయం వేస్తాడు. రెండవది, అది మన టాపిక్ కు సంబంధించింది.

وَجُعِلَتْ لِيَ الْأَرْضُ مَسْجِدًا وَطَهُورًا
వ జుఇలత్ లియల్ అర్దు మస్జిదవ్ వతహూరా
సర్వభూమిని అల్లాహ్ నా కొరకు నమాజు చేయుటకు స్థలంగా, పరిశుభ్రత పొందుటకు సాధనంగా చేశాడు.

فَأَيُّمَا رَجُلٍ مِنْ أُمَّتِي أَدْرَكَتْهُ الصَّلَاةُ فَلْيُصَلِّ
ఫఅయ్యుమా రజులిమ్ మిన్ ఉమ్మతీ అద్రకత్ హుస్సలా ఫల్ యుసల్లీ.
ఈ భూమిలో మీరు ఎక్కడ సంచరిస్తున్నా సరే, ఎక్కడా ఉన్నా సరే నమాజ్ టైం అయిన వెంటనే నమాజ్ చేసుకోవాలి. నీళ్లు లేవు, తహారత్ లేదు ఇలాంటి ఏ సాకులు చెప్పుకోరాదు.

మూడో విషయం,

وَأُحِلَّتْ لِيَ الْغَنَائِمُ وَلَمْ تَحِلَّ لِأَحَدٍ قَبْلِي
వ ఉహిల్లత్ లియల్ గనాయిమ్ వలమ్ తహిల్ల లిఅహదిన్ ఖబ్లీ.
యుద్ధ ఫలం నా కొరకు హలాల్, ధర్మసమ్మతంగా చేయబడింది. నాకంటే ముందు ఎవరి కొరకు కూడా అది ధర్మసమ్మతంగా లేకుండింది.

మాలె గనీమత్, యుద్ధ ఫలం, యుద్ధ ధనం, యుద్ధం జరిగినప్పుడు ఇస్లాం మరియు కుఫ్ర్ మధ్యలో ఇస్లాం పై ఉన్నవారు గెలిచిన తర్వాత అవిశ్వాసుల ధనం ఏదైతే పొండేవారో దానిని మాలె గనీమత్ అని అనబడుతుంది.

నాలుగో విషయం, وَأُعْطِيتُ الشَّفَاعَةَ వ ఉ’తీతుష్షఫాఆ. ప్రళయ దినాన సిఫారసు చేసే ఈ గొప్ప భాగ్యం అల్లాహ్ నాకు ప్రసాదించనున్నాడు.

ఐదో విషయం,

وَكَانَ النَّبِيُّ يُبْعَثُ إِلَى قَوْمِهِ خَاصَّةً وَبُعِثْتُ إِلَى النَّاسِ عَامَّةً
వ కానన్నబియ్యు యుబ్అసు ఇలా కౌమిహీ ఖాస్సతన్ వ బుఇస్తు ఇలన్నాసి ఆమ్మహ్.
ఇంతకుముందు ప్రవక్తలు ప్రత్యేకంగా తమ జాతి వారి వైపునకు పంపబడేవారు. కానీ నేను సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా పంపబడ్డాను.

ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు, చనిపోయారు కూడా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ప్రళయం వచ్చే వరకు ప్రతి మనిషి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించడం తప్పనిసరి. లేకుంటే అతని అంతిమ గతి ఏమవుతుంది? నరకమే అవుతుంది. అయితే మన టాపిక్ కు సంబంధించిన విషయం ఏంటి ఇక్కడ? భూమి మస్జిద్ గా కూడా ఉంది, అది తహూర్, పరిశుభ్రతకు సాధనంగా కూడా అల్లాహ్ తాలా దానిని చేశాడు.

మూడు విషయాలు మనం విన్నాము. తయమ్ముమ్ అంటే ఏమిటి, దాని ఆదేశం ఏంటి అంటే అది విధిగా ఉంది, మూడో విషయం అది అల్లాహ్ వైపు నుండి ఒక గొప్ప వరం.

నాలుగో విషయం, ఖురాన్లో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో దీని గురించి చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి గనక, ఎవరికీ ఏ సందేహం అనేది ఉండకూడదు. తయమ్ముమ్ చేసే విషయంలో, ఎక్కడ ముస్లిం, ఒక విశ్వాసుడు ఏ ప్రాంతంలో ఉన్నా గానీ, అక్కడ అతనికి నైట్ ఫెయిల్ అయింది అని, భార్య భర్తలు ఉండేది ఉంటే వారిద్దరూ మధ్యలో సంబంధాలు జరిగాయి గనక వారిపై ఇప్పుడు స్నానం చేయడం విధిగా ఉంది, నీళ్లు లేవు అని, ఇంకా వేరే ఏ సాకులు కూడా చెప్పకుండా, నమాజ్ టైం అయిన వెంటనే నీళ్లు లేనప్పుడు తయమ్ముమ్ చేసి లేక నీళ్లు ఉండి మన ఆరోగ్యానికి, మన శరీరానికి హానికరంగా ఉంటే నీళ్లు వాడకుండా తయమ్ముమ్ చేసి వెంటనే నమాజ్ చేయాలి. ఈ రోజుల్లో అనేక మంది యువకులు ప్రత్యేకంగా బజారుల్లో తిరగడం, ఇంకా వేరే పనుల్లో ఉండి, నమాజ్ టైంలో ఏదైనా మస్జిద్ దగ్గర ఉన్నప్పటికీ కూడా నమాజ్ కు రారు. సాకు ఏం చెప్తారు ఎక్కువ శాతం? “నాకు తహారత్ లేదు”. ఇది చాలా ఘోరమైన పాపం.

తయమ్ముమ్ హదసె అక్బర్ (పెద్ద అశుద్ధి), హదసె అస్గర్ (చిన్న అశుద్ధి) రెండిటికీ పనిచేస్తుంది. హదసె అక్బర్ అంటే ఏంటి? స్వప్న స్కలనం కావడం (నైట్ ఫెయిల్ కావడం), లేక భార్య భర్తలు కలుసుకోవడం. ఇందువల్ల ఏదైతే స్నానం చేయడం విధిగా ఉంటుందో దానిని హదసె అక్బర్ అంటారు. సామాన్యంగా మలమూత్ర విసర్జన తర్వాత, ఏదైనా అపాన వాయువు (గాలి) వెళితే, ఇలాంటి స్థితులు ఏవైతే ఉంటాయో వాటిని హదసె అస్గర్ అంటారు.

ఈ రెండిటికీ కూడా తయమ్ముమ్ సరిపోతుంది. దానికి దలీల్ (ఆధారం) ఏమిటి? సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలో ఒక చాలా పెద్ద హదీస్ ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రయాణ విషయంలో. అందులో ఒక తయమ్ముమ్ కు సంబంధించిన విషయం ఏంటంటే, ఒకచోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ చేసి,

فَلَمَّا انْفَتَلَ مِنْ صَلَاتِهِ إِذَا هُوَ بِرَجُلٍ مُعْتَزِلٍ لَمْ يُصَلِّ مَعَ الْقَوْمِ
ఫలమ్మన్ ఫలత మిన్ సలాతిహీ ఇదా హువ బిరజులిమ్ ముఅతజిలిల్ లమ్ యుసల్లి మఅల్ కౌమ్
నమాజ్ చేసి తిరిగిన తర్వాత ఒక వ్యక్తిని చూశారు ప్రవక్త గారు. అతను ఒక పక్కకు ఉన్నాడు, అందరితో కలిసి నమాజ్ చేయలేదు.

مَا مَنَعَكَ يَا فُلَانُ أَنْ تُصَلِّيَ مَعَ الْقَوْمِ
మా మనఅక యా ఫులాన్ అన్ తుసల్లి మఅల్ కౌమ్
అందరితో జమాఅత్ తో సహా, సామూహికంగా నమాజ్ ఎందుకు చేయలేదు నీవు అని ప్రవక్త వారు అతన్ని అడిగారు.

అప్పుడు అతడు ఏం చెప్పాడు?

أَصَابَتْنِي جَنَابَةٌ وَلَا مَاءَ
అసాబత్నీ జనాబతున్ వలా మా
నేను అశుద్ధావస్థకు గురయ్యాను, స్నానం చేయడం నాకు విధిగా అయిపోయింది. నీళ్లు లేవు.

అందు గురించి ఇంతవరకు నేను స్నానం చేయలేకపోయాను గనక, మీతో పాటు నేను నమాజ్ చేయలేదు. అప్పుడు ప్రవక్త ఏమన్నారు?

عَلَيْكَ بِالصَّعِيدِ فَإِنَّهُ يَكْفِيكَ
అలైక బిస్సయీద్ ఫఇన్నహూ యక్ఫీక్
పరిశుభ్రమైన మట్టి ఉంది కదా, అది నీకు సరిపోతుంది.

అలాగే సహీహ్ బుఖారీలోనే అమ్మార్ బిన్ యాసిర్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క సంఘటన ఉంది. అప్పటి వరకు ఆయనకు తయమ్ముమ్ విషయం తెలియదు. నమాజ్ టైం అయిపోయింది, స్నానం చేయడం విధిగా ఉంది. ఆయన ఏం చేశాడు? గాడిద మట్టిలో ఎలా పొర్లుతుందో చూశారా ఎప్పుడైనా? అతను స్వయంగా అంటున్నాడు, గాడిద ఎలా మట్టిలో పొర్లుతుందో అలా నేను మట్టిలో మొత్తం స్నానం చేసినట్టుగా లేచి నమాజ్ చేసుకొని ప్రవక్త వద్దకు వచ్చాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఈ విషయం అడిగాను. ప్రవక్త గారు చెప్పారు, “అంతగా చేసే అవసరం లేదే నీకు. కేవలం రెండు చేతులు పరిశుభ్రమైన మట్టి మీద కొట్టి, మట్టి అంటి ఉంటుంది గనక అని ఒక్కసారి ఊదుకొని ముఖముపై, కుడి చేయి అరచేతితో ఎడమ చేయి అరచేతి మీద, ఈ ఎడమ చేయి యొక్క అరచేతి లోపలి భాగంతో కుడి చేయి అరచేతి పై భాగం మీద మసాజ్ చేస్తే ఒక్కసారి సరిపోతుంది.”

ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల ద్వారా మనకు ఏం తెలుస్తుంది? స్నానం చేయడం విధిగా అయిన సందర్భంలో గానీ, లేక వుదూ చేయడం విధిగా ఉన్న సందర్భంలో గానీ, ఈ రెండు సందర్భాల్లో కూడా నీళ్లు లేనప్పుడు తయమ్ముమ్ సరిపోతుంది.

స్నానం అంటే తెలుసు, వుదూలో మనం కొన్ని ప్రత్యేక అవయవాలు కడుగుతాము. స్నానం చేయడం విధిగా ఉంటే ఏం చేస్తాము? గోరంత కూడా ఎక్కడా పొడితనం ఉండకుండా మంచిగా స్నానం చేస్తాము. కానీ నీళ్లు లేని సందర్భంలో ఒకే ఒక తయమ్ముమ్ రెండిటికీ సరిపోతుంది. ఒకసారి స్నానానికి ఇంకొకసారి వుదూకు అని రెండు రెండు సార్లు తయమ్ముమ్ చేసే అవసరం లేదు. ఒక్కసారి తయమ్ముమ్ చేసి నమాజ్ చేసుకుంటే స్నానానికి బదులుగా మరియు వుదూకు బదులుగా సరిపోతుంది.

తయమ్ముమ్ కూడా ఒక ఇబాదత్. నమాజుకు వుదూ చేయడం షరత్ కదా. వుదూ దేనితో చేస్తాము? నీళ్లతోని. నీళ్లు లేని సందర్భంలో అల్లాహ్ మనకు ఈ సౌకర్యం కలుగజేశాడు. అందు గురించి ఇది కూడా ఒక ఇబాదత్ గనక ఇందులో కొన్ని షరతులు ఉన్నాయి.

మొదటి షరత్, మొదటిది నియ్యత్. నియ్యత్ అంటే తెలుసు కదా ఇంతకు ముందు ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాము. ఏదో పెద్ద మంత్రం అలా చదవడం కాదు నోటితోని. ఏ కార్యం చేస్తున్నామో, ఏ సత్కార్యం, ఏ మంచి కార్యం, ఏ ఇబాదత్, దాని యొక్క సంకల్పం మనసులో చేసుకోవాలి. ఏమని? ఈ నా యొక్క సత్కార్యం ద్వారా అల్లాహ్ యే సంతృప్తి పడాలి, అల్లాహ్ యే నాకు దీని యొక్క ప్రతిఫలం ఇవ్వాలి అన్నటువంటి నమ్మకం ఉండాలి, అన్నటువంటి సంకల్పం, నియ్యత్ అనేది ఉండాలి. వేరే ప్రజలకు చూపడానికి గాని, ముతవల్లాకు చూపడం గాని, ఇంకా మన సంతానానికి చూపించడానికి గాని, నేను ఒక ముస్లింగా అన్నటువంటి భావన ఇతరులకు కలిగించడం కొరకు ఇలాంటి ఏ ప్రాపంచిక ఉద్దేశాలు ఉండకూడదు.

రెండవ నిబంధన, రెండవ షరత్, నీళ్లు లేకపోవడం లేదా ఉండి దానిని వాడడం మనకు నష్టకరంగా ఉండడం. అందుగురించి అల్లాహుతాలా సూరె మాయిదాలో ఏదైతే చెప్పాడో, అది కూడా మనకు ఒక ఆధారంగా ఉంది:

وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ
వ ఇన్ కున్తుమ్ మర్దా అవ్ అలా సఫరిన్
ఒకవేళ మీరు రోగులై ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా…

హానికరంగా ఉండడం అనేదేదైతే చెప్తున్నామో, అది మనకు కొన్ని హదీసుల ద్వారా కూడా వివరంగా తెలుస్తుంది. అంతే కాకుండా ఖురాన్లో అల్లాహ్ ఏం చెప్పాడు? సూరె నిసా, ఆయత్ నెంబర్ 29లో ఉంది:

وَلَا تَقْتُلُوا أَنفُسَكُمْ
వలా తఖ్తులూ అన్ఫుసకుమ్
మీకు మీరు (లేదా ఒకరినొకరు) చంపుకోకండి.

ఆత్మహత్యలు చేసుకోకండి, పరస్పరం ఒకరు మరొకరిని హత్య చేయకండి. ఇవన్నీ భావాలు దీంట్లో వస్తాయి.

إِنَّ اللَّهَ كَانَ بِكُمْ رَحِيمًا
ఇన్నల్లాహ కాన బికమ్ రహీమా
నిశ్చయంగా అల్లాహ్ మీ పట్ల చాలా కనికరం కలవాడు.

ఈ విధంగా ఈ షరతులు మనకు తెలిసినాయి, అర్థమైనాయి.

మూడో షరత్ ఏంటంటే, తయమ్ముమ్ చేయడానికి పరిశుభ్రమైన మట్టితో చేయాలి. ఈ మూడు షరతులు తయమ్ముమ్ కు సంబంధించినవి.

ఇందులో రెండు ఫర్దులు ఉన్నాయి. ఒకటి ఏమిటి? ముఖాన్ని తుడవడం. మరొకటి? రెండు అరచేతులను.

అయితే ఏ సందర్భాల్లో తయమ్ముమ్ చేయవచ్చు అన్న విషయం మనకు ఇంతకు ముందే సంక్షిప్తంగా వచ్చింది. నీళ్లు లేనప్పుడు లేక ఉండి కూడా వాడడం నష్టంగా ఉన్నప్పుడు. దానినే మరికొంచెం వివరంగా తెలుసుకుందాం.

నీళ్లు లేకపోవడం అంటే ఏమిటి? నీళ్లు లేకపోవడం అంటే మనం ఎక్కడ ఉన్నామో ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో ఎక్కడా నీళ్లు వుదూ చేయడానికి దొరకకపోవడం. మనం అక్కడి వరకు మన వద్ద బండి ఉంటే బండి ద్వారా వెళ్లడం గానీ, లేక కాలి నడకతో వెళ్లడం గానీ సాధ్యం ఉండి కొన్ని అడుగులు వెళ్తే అక్కడ దొరుకుతాయి అన్నటువంటి ఛాన్స్ ఉండేది ఉంటే, నీళ్లు లేని కింద లెక్కించబడదు. ఉదాహరణకు, ఇప్పుడు ఇక్కడ మనం సౌదియాలో ఉన్నాం గనక ఇక్కడి నుండి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో నీళ్లు ఉన్నాయి అనుకోండి. మనకు ఇక్కడ దగ్గరలో లేవు, అయితే నమాజ్ టైం అయినప్పుడు మన దగ్గర ఏదైనా బండి ఉంది లేక కార్ ఉంది, లేక మన మిత్రుని దగ్గర బండి ఉంది, వేరే ఎన్నో అవసరాలకు మనం తీసుకుంటూ ఉంటాం, వాడుకుంటూ ఉంటాము. ఆ రెండు కిలోమీటర్ల దూరానికి వెళ్లి ఆ నీళ్లు తీసుకురావడం మనకు కష్టంగా ఉంటుందా? ఉండదు. అయితే దాన్ని నీళ్లు లేవు అన్న విషయం అక్కడ వర్తించదు. మనం ఎక్కడి వరకు వెళ్లి నీళ్లు తీసుకోవడం సాధ్యం ఉన్నదో అక్కడి వరకు వెళ్లి తీసుకోవాలి. ఇక ఎక్కడైతే సాధ్యం కాదో అది నీళ్లు లేవు అన్న దానికి కింద లెక్కించబడుతుంది.

రెండో విషయం, మన దగ్గర నీళ్లు ఉన్నాయి కానీ త్రాగడానికి ఉన్నాయి. ఆ నీళ్లతో మనం స్నానం చేస్తే లేక వుదూ చేయడం మొదలు పెడితే త్రాగడానికి మనకు నీళ్లు దొరకవు. కొన్ని కొన్ని సందర్భాల్లో కరువు ఏర్పడుతుంది, వర్షాలు ఉండవు, మన దగ్గర కూడా అలాంటి ప్రాంతం అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా. నీళ్లు త్రాగడానికి మాత్రమే ఉన్నాయి. వాడుకోవడానికి లేవు. అలాంటి సందర్భంలో కూడా అది నీళ్లు లేని కిందనే లెక్కించబడుతుంది. ఎందుకంటే ఇస్లాం మనల్ని మనం నష్టపరుచుకోవడానికి ఆదేశించదు. ఇదే ఆయత్లో, ఎక్కడైతే మనం ఇంతకు ముందు సూరె మాయిదా ఆయత్ చదివామో అందులోనే అల్లాహుతాలా ముందు ఏం చెప్తున్నాడు?

مَا يُرِيدُ اللَّهُ لِيَجْعَلَ عَلَيْكُم مِّنْ حَرَجٍ
మా యురీదుల్లాహు లియజ్అల అలైకుమ్ మిన్ హరజ్
అల్లాహుతాలా మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికి గురి చేయదల్చుకోలేదు.

وَلَٰكِن يُرِيدُ لِيُطَهِّرَكُمْ
వలాకిన్ యురీదు లియుతహ్హిరకుమ్
అల్లాహ్ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని శుభ్రపరచడం, పరిశుద్ధులుగా చేయడం.

وَلِيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ
వ లియుతిమ్మ నిఅమతహూ అలైకుమ్
తన యొక్క కారుణ్యాన్ని మీపై సంపూర్ణం చేయడం.

ఎందుకు?

لَعَلَّكُمْ تَشْكُرُونَ
లఅల్లకుమ్ తష్కురూన్
మీరు కృతజ్ఞత చెల్లించే వాళ్ళు కావాలి అని.

గమనించండి. నీళ్లు త్రాగడానికి కూడా మనకు లేకుంటే మన జీవితమే చాలా నష్టంలో పడిపోవచ్చు. అందుగురించి వాడుకోవడానికి ఉన్న నీళ్లు మొత్తానికి అయిపోయి, కేవలం త్రాగడానికి మాత్రమే ఉన్నాయి, దానిని వాడితే ఇక మనకు చాలా ఇబ్బందికి గురవుతాము, అలాంటప్పుడు కూడా నీళ్లు లేవు అన్న విషయంలోనే వర్తిస్తుంది.

మూడో రకం, నీళ్లు ఉన్నాయి చాలా. కానీ కొనాల్సి వస్తుంది. కొనాల్సి వస్తుంది. అయితే పిసినారితనం చేసి డబ్బు పెట్టి ఎందుకు కొనాలి? ఎక్కడైనా ఫ్రీగా దొరికితే చూసుకుందాము. అన్నటువంటి భావన ఉంచుకొని, శక్తి ఉండి కూడా మనం కొనకుంటే అది పాపంలో పడిపోతాము. కానీ మన దగ్గర నీళ్లు కొనేంత శక్తి లేదు. ఉన్నాయి నీళ్లు కానీ కొనాల్సి వస్తుంది. కొనేంత శక్తి కూడా మన దగ్గర లేదు. కొన్నే కొన్ని డబ్బులు ఉన్నాయి, అవి మన ఈ రోజుకు గాని, లేకుంటే ఇంకా కొన్ని రోజుల వరకు మన అతి ముఖ్యమైన తిండి ఏదైతే ఉందో దాని గురించి గడవాలి. ఇలాంటి ఇబ్బందికరమైన జీవితం ఉన్నప్పుడు కొనడం కష్టతరంగా ఉన్నప్పుడు, కడుపు నిండా భోజనం చేసుకొని డ్రింకులు తాగవచ్చు కానీ ఇక్కడ వుదూ చేసుకోవడానికి ఒక నీళ్లు, ఒక అర లీటర్ నీళ్లు కొనలేము? ఆ డ్రింకులు ఏంటి, పెప్సీలు ఏంటి అవి మన జీవనానికి అత్యవసరమైన తిండి కింద లెక్కించబడుతుందా? లెక్కించబడదు.

విషయం అర్థమవుతుంది కదా. నీళ్లు లేవు అన్న ఈ పదం అనేది ఎన్ని రకాలుగా వస్తుంది, దాని యొక్క రూపాలు ఏంటున్నాయో అవన్నీ నేను వివరిస్తున్నాను.

రెండో విషయం, నీళ్లు ఉన్నాయి కానీ దాని ఉపయోగం మనకు నష్టకరంగా ఉంది. అంటే చలి వల్ల కావచ్చు. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. వేడి చేసుకోవడానికి ఎలాంటి సౌకర్యం లేదు ఇప్పుడు. ఒకవేళ ఉన్నది సౌకర్యం కానీ ఎంత సేపు పడుతుందంటే, మన ఈ నమాజ్ టైం అనేది దాటిపోతుంది. అలాంటప్పుడు ఆ నీళ్లు ఉపయోగించడం వల్ల మనకు నష్టం కలుగుతుంది అన్న భయం ఉండేది ఉంటే తయమ్ముమ్ చేయవచ్చు. ప్రవక్త సల్లల్లాహు వసల్లం కాలంలో ఒకసారి ఏం జరిగింది? ఒక వ్యక్తికి నెత్తిలో గాయమైంది. ప్రయాణంలో ఉన్నాడు, నెత్తిలో గాయమైంది. చాలా చల్లని రాత్రి, అతనికి స్నానం చేయడం కూడా విధి అయిపోయింది. దగ్గర ఉన్న స్నేహితులను అడిగాడు, ఏం చేయాలి నేను? ఫజర్ నమాజ్ టైం. “లేదు లేదు నీకేంటి, తప్పకుండా నువ్వు స్నానం చేసి నమాజ్ చేయాల్సిందే” అని అన్నారు అతని స్నేహితులు. అల్లాహ్ కరుణించు గాక వారిని. ఆయన స్నానం చేశాడు కానీ అందువల్ల అతని ప్రాణం పోయింది. తర్వాత ప్రవక్త సల్లల్లాహు వసల్లం వారి వద్దకు వచ్చిన తర్వాత, “మీరు మీ సోదరుని చంపేశారు. ధర్మజ్ఞానం లేనప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేదు? ఎందుకు అడగలేదు? అతను అలాంటి సందర్భంలో కేవలం తయమ్ముమ్ చేస్తే సరిపోయేది కదా” అని ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు బోధ చేశారు.

అయితే చలి వల్ల గాని, లేక మన శరీరంలో వుదూ చేసే అవయవాలకు ఏదైనా గాయమై ఉంది, అందువల్ల కూడా మనకు నీళ్లు వాడడం, ఉపయోగించడం నష్టకరంగా, హానికరంగా, ప్రాణం పోయేటువంటి భయం, లేక రోగం ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువ పెరిగే భయం, ఖురాన్లో అల్లాహ్ ఏం చెప్పాడు? “వ ఇన్ కున్తుమ్ మర్దా.” మీరు ఒకవేళ అనారోగ్యానికి గురియై మీకు నీళ్లు దొరకకుంటే తయమ్ముమ్ చేయవచ్చును. చూడండి, గమనించండి, ఇన్ని సౌకర్యాలు అల్లాహ్ ఇచ్చిన తర్వాత అరే జాన్దేలేరే క్యా ముస్లిం థండీ అయినా క్యా నమాజ్ పడతా? సామాన్యంగా అనుకుంటూ ఉంటాం కదా మనం. ఏంటి ఈ ముతవల్లాలు, ఈ మౌల్వీ సాబులు వీళ్లకు ఏం పని పాటలు ఉండయి, కేవలం అల్లాహ్ అల్లాహ్ అంటూ నమాజులు చేసుకుంటూ ఉంటారు, మన లెక్కలో ఎక్కడ పని చేస్తారు? కానీ అదే ఈ తిండి కొరకు, కూడు కొరకు, పని గురించి ఇంతటి చల్లని వాతావరణంలో కూడా ఎవరైనా డ్యూటీ వదులుకుంటాడా? చల్లగా ఉంది ఈ రోజు డ్యూటీకి వెళ్లకూడదు అని. ఏమీ దొరకకుంటే కప్పుకునే బ్లాంకెట్ అయినా వేసుకొని డ్యూటీకి వెళ్తాడు కానీ నమాజ్ విషయం వచ్చేది ఉంటే, అల్లాహ్ యొక్క దయ అని నమాజు ఎగ్గొడతాడు. ఇంకా సౌదియాలో ఇంటి నుండి మనం మస్జిద్ కి వెళ్ళడానికి కిలోమీటర్లు నడిచిపోయే అవసరమే పడదు. అవునా కాదా? వెనకా, ముంగట, కుడి పక్కన, ఎడమ పక్కన, ఎటు చూసినా అల్లాహ్ యొక్క దయ వల్ల మస్జిద్లే మస్జిద్లు. చాలా దగ్గరలో. అయినా గానీ మనం చలి కాలంలో ఇలాంటి సాకులు చెప్పి నమాజులను వదిలేస్తే, మనం ఇంకెవరికో కాదు నష్టంలో పడేసేది. మనకు మనం నరకానికి దారి సులభం చేసుకుంటున్నాము. అందు గురించి సోదరులారా, అల్లాహ్ మనందరికీ భయపడే మరియు ఇలాంటి సౌకర్యాలు ఏదైతే అల్లాహ్ ఇచ్చాడో వాటిని ఉపయోగించుకొని అల్లాహ్ యొక్క ఆరాధన సరైన పద్ధతిలో చేసే భాగ్యం కలిగించు గాక.

అయితే ఒక విషయం ఇక్కడ గుర్తించాలి, అదేమిటి? ఎప్పుడైతే నీళ్లు దొరుకుతాయో అప్పుడు తయమ్ముమ్ చేయడం అనేది మానేసేయాలి. నీళ్లు వచ్చిన వెంటనే. చివరికి కొందరు ఆలిములు ఏమంటున్నారో తెలుసా? నీళ్ల గురించి అన్ని రకాల ప్రయత్నం నువ్వు చేశావు, నీళ్లు దొరకలేదు, తయమ్ముమ్ చేసుకుని నమాజ్ మొదలు పెట్టావు, నీళ్లు వచ్చాయి. నమాజ్ ను తెంపేసేయ్, వుదూ చేసుకొని నమాజ్ చెయ్. అర్థమైందా?

మరో విషయం ఇక్కడ, తయమ్ముమ్ ద్వారా కూడా ఒక్కటి కంటే ఎక్కువ నమాజులు కూడా చేయవచ్చు. ఉదాహరణకు మీరు అసర్ లో తయమ్ముమ్ చేశారు. ఆ వుదూను, అంటే తయమ్ముమ్ తో ఏదైతే మీకు వుదూ అయిందో దాన్ని మీరు కాపాడుకున్నారు. మూత్రానికి వెళ్ళలేదు, ఇంకా వుదూ భంగమయ్యే ఏవైతే కారణాలు మనం ఇంతకు ముందు విన్నామో అలాంటివి ఏవీ సంభవించలేదు. అయితే మగ్రిబ్, ఇషా అన్నీ చేసుకుంటూ వచ్చినా గానీ కానీ నీళ్లు వచ్చేస్తే అరె నేను అప్పుడు తయమ్ముమ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు మగ్రిబ్ నమాజ్ కంటే ముందు నీళ్లు వచ్చేసాయి, అసర్ టైంలో నీళ్లు లేవు. మగ్రిబ్ వరకు నీళ్లు వచ్చేసినాయి. నా అప్పటి వుదూ ఉంది కదా, దానితోనే నేను మగ్రిబ్ చేసుకుంటాను. తప్పు విషయం. నీళ్లు వచ్చేసాయి ఇప్పుడు తయమ్ముమ్ నీది చెల్లదు, తయమ్ముమ్ నీది నడవదు, అది expire అయిపోయినట్లు. అర్థమవుతుంది కదా. మళ్లీ కొత్తగా వుదూ చేసుకొని మీరు మగ్రిబ్ నమాజ్ అనేది చేయాలి. అంటే నీళ్లు వచ్చిన వెంటనే తయమ్ముమ్ సమాప్తం అయిపోతుంది. దాని యొక్క ఆదేశం అనేది ఇక ఉండదు. ఎందుకు? అల్లాహ్ ఏమంటున్నాడు?

فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا
ఫలమ్ తజిదూ మాఅన్ ఫతయమ్మమూ
నీళ్లు పొందని సందర్భంలో మీరు తయమ్ముమ్ చేయండి.

నీళ్లు వచ్చిన తర్వాత? ఇక ఉండదు.

ఇంకో విషయం. స్నానం చేసే విషయంలో, అంటే స్నానం విధి అయింది, నీళ్లు లేవు. నమాజ్ టైం అయింది. ఏం చేసినాం మనం? తయమ్ముమ్ చేసుకొని నమాజ్ చేశాం. ఓకే? తర్వాత నీళ్లు వచ్చాయి. స్నానం చేయాలా చేయవద్దా? చేయాలి. ప్రశ్న అర్థమైందా? ఉదాహరణకు ఫజర్ నమాజే అనుకోండి. రాత్రి నైట్ ఫెయిల్ అయింది. నీళ్లు దొరకలేదు. లేక ఫజర్ నమాజ్ టైం గనక ఎక్ దమ్ మైనస్ డిగ్రీ వాతావరణం ఉండి, నీళ్లు వాడితే మనకు జ్వరం వచ్చేస్తుంది, నీళ్లు వాడేది ఉంటే మనకు ఇంకా ఏదైనా అనారోగ్యానికి గురి అయ్యే సూచనలు ఉన్నాయి. నీళ్లు వాడలేదు, తయమ్ముమ్ చేసుకున్నాము. పొద్దెక్కేసరికి మనకు ఆరోగ్యం బాగైపోయింది, ఇప్పుడు నీళ్లు వాడడంలో నష్టం లేదు. అప్పుడు స్నానం చేయాలా, చేయవద్దా? చేయాలి.

చాలా పెద్దగా ఉంది హదీస్ అని నేను ఇంతకు ముందు ఒక ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హు గారి హదీస్ ఏదైతే చెప్పానో, అందులో ఆ వ్యక్తి నువ్వు ఎందుకు మాతో నమాజ్ చేయలేదు అని ప్రవక్త గారు అడిగారు కదా, అతను ఏమన్నాడు? నా దగ్గర నీళ్లు లేవు, నేను జునుబీ అయిపోయాను, అశుద్ధావస్థకు గురయ్యాను. ప్రవక్త చెప్పారు, నీకు తయమ్ముమ్ సరిపోయేది. ఆ తర్వాత కొంతసేపటికి, అయితే ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు అప్పటికే పంపి ఉన్నారు కొందరిని నీళ్ల గురించి. పోండి మీరు నీళ్ల గురించి వెతకండి అని. ఆ హదీస్ అంతా పొడుగ్గా ఉన్నది అంటే అందులో ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారి గొప్ప మహిమ కూడా ఉన్నది. మరి ఎప్పుడైనా గుర్తు చేయండి చెప్తాను దాని గురించి. కానీ సంక్షిప్తం ఏంటంటే నీళ్లు దొరుకుతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందులో తమ చేతులు పెడతారు, అల్లాహ్ బరకత్ ప్రసాదిస్తాడు, అందరూ తమ తమ దగ్గర ఉన్న పాత్రలన్నీ నింపుకుంటూ ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు చూడండి, ఏ విషయం ఎంత ముఖ్యమైనది, అవసరమైనది ఉంటుందో దాని విషయంలో అశ్రద్ధ వహించరు. ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు ప్రయాణంలో ఉన్నారు, ఎందరో సహచరులు ఉన్నారు, ఎందరియో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ నీళ్లు వచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు ఆ వ్యక్తిని గుర్తు చేసి, అతన్ని పిలవండి, హా నీళ్లు తీసుకెళ్ళు, తీసుకెళ్లి నువ్వు స్నానం చెయ్యి అని ఆదేశించారు.

సహీహ్ బుఖారీలో ఆ హదీస్ ఉంది, 344 హదీస్ నెంబర్. అయితే విషయం ఏం తెలిసింది మనకు? స్నానం విధిగా ఉన్నప్పుడు నీళ్లు లేవు లేక ఉండి దానిని వాడడం మనకు నష్టకరంగా ఉంటే నమాజ్ చేసుకున్నాము తయమ్ముమ్ తోని. కానీ తర్వాత ఆ నష్టం తొలిగిపోయింది లేదా నీళ్లు మనకు దొరికినాయి, అలాంటప్పుడు ఏం చేయాలి? స్నానం అనేది చేయాలి.

కొంచెం ఈ విషయాలు ఎక్కువ శాతం చలి కాలంలో, ఇంకా వేరే ప్రయాణంలో ఉన్న సందర్భంలో, వేరే సందర్భాల్లో కూడా మనకు అవసరం పడతాయి గనక కొంచెం వివరంగా చెప్పడం జరిగింది. అయితే, మేజోళ్లపై మసాహ్ విషయం అనేది అల్లాహ్ యొక్క దయతో మనం వచ్చే నెక్స్ట్ పాఠంలో తెలుసుకుందాము. దీని గురించి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. అయితే తప్పకుండా ఉలమాలతో, ధర్మవేత్తలతో మనం మంచి సంబంధాలు ఉంచుకొని అలాంటి ప్రశ్నలను మనం వారితో తెలుసుకోవాలి. షరీయత్ యొక్క సమాధానం, ధర్మపరమైన సమాధానం ఏముంటుందో తెలుసుకొని దాని ప్రకారంగా అల్లాహ్ యొక్క ఆరాధన చేసే ప్రయత్నం చేయండి. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.


ఇతరములు:

నమాజులో మరచిపోవటం, సహూ సజ్దా చేయటం గురించి

335. హజ్రత్ అబ్దుల్లా బిన్ బహీనా (రధి అల్లాహు అన్హు) కధనం :-

(ఓ రోజు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక నమాజులో రెండు రకాతులు పఠించిన తరువాత లేచి నిల్చున్నారు. ‘ఖాయిదాయె ఊలా’ ప్రకారం కూర్చోవడం మరచిపోయారు. అనుచరులు కూడా ఆయనతో పాటు పైకి లేచారు. నమాజు పూర్తయి ‘సలాం’ చేయడానికి మేము ఎదురుచూస్తున్న తరుణంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘అల్లాహు అక్బర్’ అంటూ కూర్చునే రెండు సార్లు సజ్దా చేశారు. ఆ తరువాత కుడి ఎడమల వైపు సలాం చేశారు.

[సహీహ్ బుఖారీ : 22 వ ప్రకరణం – సహూ, 15 వ అధ్యాయం – మాజాఅ ఫిస్సహూ….]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 19 వ అధ్యాయం – నమాజులో మరచిపోవటం, సహూ సజ్దా చేయటం గురించి. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నమాజు స్థితిలో మాట్లాడటం నిషిద్ధం

311. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

మొదట్లో మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు చేస్తుంటే ఆయనకు సలాం చేసే వాళ్ళము. నమాజు స్థితిలోనే ఆయన మాకు ప్రతి సలాం పలికేవారు. అయితే మేము (అబిసీనియా రాజు) నజాషీ దగ్గర నుండి (వలస వెళ్లి) తిరిగి వచ్చిన తరువాత మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు (నమాజు స్థితిలో) సలాం చేస్తే, ఆయన మాకు సమాధానమివ్వలేదు. (నమాజు ముగిసిన తరువాత) “నమాజు చేస్తున్నప్పుడు మనిషికి ఏకాగ్రత చాలా అవసరం” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 21 వ ప్రకరణం – అల్ అమలు ఫిస్సలాత్, 2 వ అధ్యాయం – మాయున్హా మినల్ కలామి ఫిస్సలాత్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 7 వ అధ్యాయం – నమాజు స్థితిలో మాట్లాడటం నిషిద్ధం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

చీకట్లలో మస్జిదులకు నడిచి వెళ్ళే వారికి ప్రళయ దినాన సంపూర్ణ వెలుగు లభిస్తుందనే శుభవార్తను అందించండి

1058. హజ్రత్ బురైదా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :

చీకట్లలో మస్జిదులకు నడిచి వెళ్ళే వారికి ప్రళయ దినాన సంపూర్ణ వెలుగు లభిస్తుందనే శుభవార్తను అందించండి.

[సుననె అబూదావూద్ లోని నమాజు ప్రకరణం – సుననె తిర్మిజీ లోని నమాజ్ అధ్యాయాలు]

ముఖ్యాంశాలు :

చీకట్లలో మస్జిదులకు వెళ్ళటమంటే ఫజ్ర్ మరియు ఇషాకు సంబందించిన సామూహిక నమాజులకు హాజరు కావటం అని భావం. నేటి ఆధునిక యుగంలో నగరవీధులు కాంతివంతమైన విద్యుద్దీపాలతో ఎంతగా వెలిగి పోయినా, చీకటి వల్ల కలిగే భయాందోళనలను ఎవరూ తొలగించలేరని గ్రహించాలి. అందుకే ఫజ్ర్ మరియు ఇషా నమాజులు నేటికీ చీకట్లో చేయబడే నమాజులగానే పరిగణించ బడతాయి. వాటిని నెరవేర్చే అదృష్టవంతులకు ప్రళయదినాన అల్లాహ్ తరుఫు నుండి పరిపూర్ణమైన వెలుగు లభిస్తుందనే శుభవార్త ఇవ్వబడినది.

189 వ అధ్యాయం – మస్జిదులకు కాలి నడకన వెళ్ళటం – హదీసు కిరణాలు (రియాజుస్సాలిహీన్) – సంకలనం : ఇమామ్ నవవీ (రహ్మతుల్లా అలై)

http://wp.me/p2lYyT-fA

Related Links: