మస్జిదె ఖుబా (Masjid-e-Quba) ప్రత్యేకతలు [వీడియో]

మస్జిదె ఖూబ ప్రత్యేకతలు – షరీఫ్ మదనీ [3 నిముషాలు]
https://www.youtube.com/watch?v=QOclavePcwo

మదీనాలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మొట్ట మొదట నిర్మించిన మస్జిద్, మస్జిదె ఖుబా.

ఇబ్నుల్ ఖయ్యిం (రహిమహుల్లాహ్) ప్రకారం (జాద్ అల్ మాద్ 3/58) లో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మదీనాలో ప్రవేశించిన సందర్భాన్ని వివరిస్తూ:

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం రాకపై సంతోషపడుతూ, ముస్లింలు తక్బీర్ (అల్లాహు అక్బర్) చెబుతూ, ఆయనను కలవడానికి వెళ్లారు… దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఖుబా వరకు వెళ్లి బనూ అమ్ర్ ఇబ్న్ ఔఫ్ వద్ద ఆగారు. వారి మధ్య దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పద్నాలుగు రోజులు ఆగారు. అప్పుడే ఖుబా మస్జిద్ ను స్థాపించారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రవక్తగా నియమించబడ్డాక స్థాపించిన మొదటి మస్జిద్ ఇది.

ప్రఖ్యాత ఇస్లామీయ విద్వాంసులు ముహమ్మద్ అల్ అమీన్ అల్ శంఖీతి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు:

ప్రజానికానికి నిర్మించబడ్డ మస్జిద్ లలో, మొట్ట మొదటి మస్జిద్, మస్జిదె హరాం. ముస్లింల ద్వారా నిర్మించబడ్డ మొదటి మస్జిద్, మస్జిదె ఖుబా. మస్జిదుల్ హరాం ఇబ్రాహీం అలైహిస్సలాం ద్వారా నిర్మించబడ్డది. మస్జిదె ఖుబా అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ద్వారా నిర్మితమయింది.

అల్లాహ్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను మస్జిదె ఖుబాలో ప్రార్ధించండని ప్రోత్సహించారు. ఎందుకంటే, ఈ మస్జిద్ భయభక్తుల పునాదిపై నిర్మించబడింది. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు:

“అయితే తొలినాటి నుంచే భయభక్తుల పునాదిపై నిర్మించబడిన మస్జిదు నువ్వు నిలబడటానికి అన్ని విధాలా తగినది. బాగా పరిశుద్ధతను పొందటాన్ని ఇష్టపడే వారు అందులో ఉన్నారు. బాగా పరిశుద్ధతను పాటించేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు.” (ఖుర్ఆన్ సూరా తౌబా 9:108)

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:

“ఎవరైతే తన ఇంట్లో పరిశుద్ధులై, ఖుబా మస్జిద్ లో నమాజ్ చేస్తారో, వారికి ఉమ్రా చేసినంత ప్రతిఫలం లభిస్తుంది.” (సునన్ ఇబ్న్ మాజా 1476, 1477 & జామి అత్ తిర్మిజి 324)

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నడుస్తూ లేదా స్వారి చేస్తూ ప్రతి శనివారం మస్జిదె ఖుబాకు వెళ్ళేవారు. అక్కడ రెండు రకాతులు నమాజ్ చేసేవారు. (సహీహ్ బుఖారీ vol 2:1191, 1192 & సహీహ్ ముస్లిం 1399)

మదీనాకు వెళ్ళే వారు, అక్కడ నివసించే వారు మస్జిదె ఖుబాకు వెళ్ళడం మరియు అక్కడ నమాజ్ చేయడం వల్ల సున్నత్ ను పాటించిన మరియు ఉమ్రా చేసిన ప్రతిఫలం లభిస్తుంది. సహల్ ఇబ్న్ హనీఫ్ ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఎవరైతే ఈ మస్జిద్ – అంటే మస్జిదె ఖుబా – కు వచ్చి నమాజ్ చేస్తారో, వారికి ఉమ్రాకు సమానమైన ప్రతిఫలం లభిస్తుంది.” (ముస్నద్ అహ్మద్ 3/437; అల్ నసాయి 699; షేక్ అల్బాని గారు దీన్ని సహీహ్ అల్ తర్ఘీబ్ 1180,1181 లో ధృవీకరించారు).

సఫ్ (లైన్)లో ఖాలీ స్థలం వదలకండి, స్వర్గంలో గృహం పొందండి

మేము మస్జిద్ నిర్మాణం కొరకు దానం చేసాము, కానీ వారు సొంత ఖర్చులకు వాడుకుంటే మాకు పుణ్యం లభిస్తుందా? [వీడియో]

బిస్మిల్లాహ్

[7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

జకాతు & సదఖా మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/zakah/

ముగ్గురు అల్లాహ్ పూచీలో (హామీలో) ఉన్నారు [ఆడియో]

బిస్మిల్లాహ్

[9:05 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అబూ ఉమామ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెలిపారు:

“ముగ్గురు అల్లాహ్ యొక్క హామీ/పూచీ(జమానత్)లో ఉన్నారు. బ్రతికివుంటే వారికి మంచి ఉపాధి లభిస్తుంది వారివైపు నుండి అల్లాహ్ సరిపోతాడు.ఒకవేళ చనిపోతే అల్లాహ్ వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. మొదటి వ్యక్తి ఇంట్లోకి ప్రవేశిస్తూ సలాం చేసేవాడు. అతను అల్లాహ్ యొక్క పూచీలో ఉంటాడు. రెండవ వ్యక్తి మస్జిద్ వైపునకు వెళ్ళేవాడు. అల్లాహ్ యొక్క పూచీలో అతను కూడా ఉంటాడు. మూడో వ్యక్తి అల్లాహ్ యొక్క మార్గంలో బయలుదేరిన వ్యక్తి. అతను కూడా అల్లాహ్ యొక్క హామీలో ఉంటాడు.”

عَنْ أَبِي أُمَامَةَ أَنّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ ثَلاثَةٌ كُلُّهُمْ ضَامِنٌ عَلَى اللَّهِ إِنْ عَاشَ رُزِقَ وَكُفِيَ وَإِنْ مَاتَ أَدْخَلَهُ اللَّهُ الْجَنَّةَ مَنْ دَخَلَ بَيْتَهُ فَسَلَّمَ فَهُوَ ضَامِنٌ عَلَى اللَّهِ وَمَنْ خَرَجَ إِلَى الْمَسْجِدِ فَهُوَ ضَامِنٌ عَلَى اللَّهِ وَمَنْ خَرَجَ فِي سَبِيلِ اللَّهِ فَهُوَ ضَامِنٌ عَلَى اللَّهِ

504 صحيح ابن حبان كتاب البر والإحسان باب إفشاء السلام وإطعام الطعام

499 المحدث شعيب الأرناؤوط خلاصة حكم المحدث صحيح في تخريج صحيح ابن حبان

Abu Umamah reported: The Messenger of Allah, peace and blessings be upon him, said,

Three people have a guarantee from Allah. If he lives he will have provision to suffice him, and if he dies he will enter Paradise: one who enters and greets with peace has a guarantee from Allah, one who goes out to the mosque has a guarantee from Allah, and one who goes out in the way of Allah has a guarantee from Allah.

Source: Ṣaḥīḥ Ibn Ḥibbān 504. Grade: Sahih (authentic) according to Al-Mundhiri

ధర్మపరమైన నిషేధాలు – 16 : షిర్క్ సాధనాలను అంతమొందించుటకు సమాధి ఉన్న మస్జిదులో నమాజు చేయకు [వీడియో]

బిస్మిల్లాహ్

[4:36 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ధర్మపరమైన నిషేధాలు 16

16- షిర్క్ సాధనాలను అంతమొందించుటకు సమాధి ఉన్న మస్జిదులో నమాజు చేయకు [1]

وَأَنَّ المَسَاجِدَ للهِ فَلَا تَدْعُوا مَعَ اللهِ أَحَدًا] {الجنّ:18}

మసీదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కనుక వాటిలో అల్లాహ్ తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్థించకండి[. (జిన్ 72: 18).


[1]  సమాధిపై మస్జిద్ నిర్మిచబడితే దానిని పడగొట్టుట లేదా మస్జిదులో సమాధి చేయబడితే శవాన్ని అందులో నుండి తీసి స్మశానం (ఖబ్రి- స్తాన్)లో సమాధి చేయుట విధిగా ఉంది. ఇలాగే షిర్క్ ఉపద్రవాల నుండి రక్షణ పొందగలుగుతాము.

పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

జమాఅతు నుండి కొన్ని రకాతులు తప్పిపోయిన వ్యక్తి ఆదేశాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[2:24 నిముషాలు]
జమాఅతు నుండి కొన్ని రకాతులు తప్పిపోయిన వ్యక్తి ఆదేశాలు
నమాజ్ పాఠాలు: 3 వ పాఠం: నమాజు ఆదేశాలు – పార్ట్ 1
https://teluguislam.net/?p=8594
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

మస్బూఖ్:

జమాతుతో ఒకటి లేదా ఎక్కువ రకాతులు తప్పిపోయిన వ్యక్తిని మస్బాఖ్ అంటారు.

ఇమాం రెండవ సలాం త్రిప్పిన తర్వాత ఈ వ్యక్తి సలాం త్రిప్పకుండా తప్పిపోయిన రకాతులు వెరవేర్చాలి.

అతను ఇమాంతో ఏ రకాతులో కలిసాడో అదే అతనిది మొదటి రకాతు.

ఇమాంను రుకూ స్థితిలో పొందినవాని ఆ రకాతు అయినట్లే. ఇమాంను రుకూలో పొందకుంటే ఆ రకాత్ తప్పిపోయినట్లే లెక్క.

జమాతు నిలబడిన తర్వాత వచ్చేవారు జమాతును ఏ స్థితిలో చూసినా అదే స్థితిలో కలవాలి. వారు రుకూ, లేదా సజ్దా ఇంకే స్థితిలో ఉన్నా సరే. వారు మరో రకాతు కొరకు నిలబడే వరకు నిరీక్షించవద్దు.

నిలబడి తక్బీరె తహ్రీమ అల్లాహు అక్బర్ అనాలి. రోగి లాంటి ఏదైనా ఆటంకం ఉన్నవారు కూర్చుండి అల్లాహు అక్బర్ అంటే ఏమీ తప్పు లేదు.

నమాజు నిధులు – పార్ట్ 10 (చివరి భాగం): సలాంకు ముందు మరియు తర్వాత చేసే దుఆలు, జిక్ర్ ఘనతలు [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ ఆడియో (mp3) వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

[27:53 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

నమాజు నిధులు (Treasures of Salah) – పూర్వపు పాఠాలు మరియు పుస్తకం ఇక్కడ వినండి/చదవండి
https://teluguislam.net/2011/02/24/treasures-of-salah-namaz-telugu-islam/

12 – సలాంకు ముందు దుఆ:

సలాంకు ముందు దుఆ విషయంలో ఏ ఘనత లేకున్నా అది దుఆ అంగీకార శుభసందర్భమవడమే చాలు. అదెలాగంటే నమాజీ అప్పుడు తన ప్రభువు వైపునకు మరలి, ఆయనతో మొరపెట్టు కుంటాడు. అతను నమాజులోనే ఉన్నాడు గనక ఇది దుఆ అంగీకారానికి ఎంతో ఉత్తమం.

అలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః “మీలో ఎవరైనా నమాజు చేస్తున్నప్పుడు అత్తహియ్యాతు లిల్లాహి… చదవాలి, దాని పిదప తనకిష్టమున్న దాన్ని అర్థించుకోవాలి, మరో ఉల్లేఖనంలో ఉంది “ఇంకేదైనా దుఆ ఎంచుకోవాలి”. (బుఖారి, ముస్లిం).

అబూ ఉమామ ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త ను ఎవరో అడిగారు, ‘ఏ దుఆ ఎక్కువ వినబడుతుంది’ అని. దానికి ప్రవక్త ఇలా చెప్పారుః “మధ్య రాత్రిలో మరియు ఫర్జ్ నమాజుల చివరి భాగంలో”. (తిర్మిజి 3499). హదీసులో అరబీ పదం ‘దుబురుస్సలవాత్’ అని ఉంది, అయితే సామాన్యంగా దీని భావం నమాజు చివరి భాగం, అంటే సలాంకు ముందు అని. అయితే ఒకప్పుడు నమాజు తర్వాత అని కూడా చెప్పబడుతుంది.

మూడవ నిధి  (నిక్షేపం)

నమాజు తర్వాత చేయునటువంటి అజ్కార్

నమాజు తర్వాత చేయవలసిన అజ్కార్ వివిధ వాక్యాల్లో ఉన్నవి. అలాగే వాటి పుణ్యాలు కూడా వివిధ రకాలుగా ఉన్నవి. అందులో కొన్నిః

సలాం తర్వాత 3 సార్లు అస్తగ్ ఫిరుల్లాహ్ అనాలి.

اللَّهُمَّ أَعِنِّي عَلَى ذِكْرِكَ وَشُكْرِكَ وَحُسْنِ عِبَادَتِك
అల్లాహుమ్మ అఇన్నీ అలా జిక్రిక వ షుక్రిక వ హస్ని ఇబాదతిక. (అబూదావూద్ 1522).
(అల్లాహ్! నేను నీ ధ్యానం చేయటానికి, నీకు కృతజ్ఞతలు తెలుపుకోటానికి, తగురీతిలో నిన్ను ఆరాధించటానికి నాకు సహాయం చెయ్యి).

కొన్ని దుఆల గురించి ఇక్కడ చెప్పాము, సలాం తర్వాత పూర్తి దుఆలు తెలుసుకొనుటకు మా పుస్తకం “రేయింబవళ్ళ ముఖ్యమైన దుఆలు” అనే పుస్తకం చదవండి.

ఈ నాటి మన ముఖ్య అంశంలోని రెండవ భాగం సలాం తర్వాత జిక్ర్ ఘనత, ఏ జిక్ర్ ఘనత వచ్చి ఉందో ఆ ఘనతల గురించి చెప్పే ముందు చాలా ముఖ్యమైన ఓ విషయం తెలుసుకోండి:

షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లాహ్ చెప్పారు : شرح منظومة أصول الفقه وقواعده ” (ص176-177) .

నమాజు తర్వాత చేసే జిక్ర్ నాలుగు రకాలుగా వచ్చి ఉంది, ఒక్కోసారి ఒక్కో రకాన్ని పాటించడం ఉత్తమం.

(1) సుబ్ హానల్లాహ్ 10సార్లు, అల్ హందులిల్లాహ్ 10సార్లు, అల్లాహు అక్బర్ 10సార్లు. (అబూదావూద్ 5065).
(2) సుబ్ హానల్లాహ్ 33సార్లు, అల్ హందులిల్లాహ్ 33సార్లు, అల్లాహు అక్బర్ 33సార్లు, 1సారి: లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లాషరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. (ముస్లిం 597). అయితే సుబ్ హానల్లాహ్, అల్ హందులిల్లాహ్, అల్లాహు అక్బర్ ఈ మూడు పదాలు కలిపి 33సార్లు చదవవచ్చు. (బుఖారీ 843, ముస్లిం 595).
(3) సుబ్ హానల్లాహ్ 33సార్లు, అల్ హందులిల్లాహ్ 33సార్లు, అల్లాహు అక్బర్ 34సార్లు. (ముస్లిం 596).
(4) సుబ్ హానల్లాహ్ 25సార్లు, అల్ హందులిల్లాహ్ 25సార్లు, అల్లాహు అక్బర్ 25సార్లు, లాఇలాహ ఇల్లల్లాహ్ 25సార్లు. (నిసాయీ 1350, షేఖ్ అల్బానీ సహీ అన్నారు).

(1)  పాపాల మన్నింపు:

صحيح مسلم 597 مَنْ سَبَّحَ اللهَ فِي دُبُرِ كُلِّ صَلَاةٍ ثَلَاثًا وَثَلَاثِينَ، وَحَمِدَ اللهَ ثَلَاثًا وَثَلَاثِينَ، وَكَبَّرَ اللهَ ثَلَاثًا وَثَلَاثِينَ، فَتْلِكَ تِسْعَةٌ وَتِسْعُونَ، وَقَالَ: تَمَامَ الْمِائَةِ: لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ غُفِرَتْ خَطَايَاهُ وَإِنْ كَانَتْ مِثْلَ زَبَدِ الْبَحْرِ

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ఇలా సెలవిచ్చారుః “ప్రతి నమాజు తర్వాత ఎవరు 33 సార్లు సుబ్ హానల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్, 33 సార్లు అల్ హందులిల్లాహ్, మరి లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్ చదివి వంద పూర్తి చేస్తాడో అతని పాపాలు సముద్రపు నురుగంత ఉన్నా క్షమించబడతాయి”. (ముస్లిం 597).

(2) అనుగ్రహం, ఉన్నత స్థానాలు మరియు భోగబాగ్యాలు + స్వర్గ ప్రవేశం + 1500 పుణ్యాలు

صحيح البخاري 6329 عَنْ أَبِي هُرَيْرَةَ، قَالُوا: يَا رَسُولَ اللَّهِ ذَهَبَ أَهْلُ الدُّثُورِ بِالدَّرَجَاتِ وَالنَّعِيمِ المُقِيمِ. قَالَ: «كَيْفَ ذَاكَ؟» قَالُوا: صَلَّوْا كَمَا صَلَّيْنَا، وَجَاهَدُوا كَمَا جَاهَدْنَا، وَأَنْفَقُوا مِنْ فُضُولِ أَمْوَالِهِمْ، وَلَيْسَتْ لَنَا أَمْوَالٌ. قَالَ: «أَفَلاَ أُخْبِرُكُمْ بِأَمْرٍ تُدْرِكُونَ مَنْ كَانَ قَبْلَكُمْ، وَتَسْبِقُونَ مَنْ جَاءَ بَعْدَكُمْ، وَلاَ يَأْتِي أَحَدٌ بِمِثْلِ مَا جِئْتُمْ بِهِ إِلَّا مَنْ جَاءَ بِمِثْلِهِ؟ تُسَبِّحُونَ فِي دُبُرِ كُلِّ صَلاَةٍ عَشْرًا، وَتَحْمَدُونَ عَشْرًا، وَتُكَبِّرُونَ عَشْرًا»

అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః (ఓ రోజు కొందరు పేద ప్రజలు ప్రవక్త వద్దకు వచ్చి) ‘ప్రవక్తా! ధనికులు తమ సిరిసంపదల మూలంగా ఉన్నత స్థానాలు అధిరోహించడానికి, శాశ్వతపు భోగభాగ్యా లు పొందడానికి మాకంటే ముందు వెళ్ళారు’ అని ఫిర్యాదు చేశారు. “అది ఎలా?” అని ప్రవక్త అడిగారు. వారన్నారుః ‘వారు మా లాగా నమాజు చేస్తారు, మా లాగానే ధర్మ యుద్ధాలు కూడా చేస్తారు. డబ్బు ఉన్నందున వారు (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెడుతున్నారు, మా వద్ద ఆ డబ్బు లేదు. అప్పుడు ప్రవక్త చెప్పారుః “నేను మీకో విషయం తెలియజేయనా? మీరు దాన్ని పాటించి మిమ్మల్ని మించిపోయిన వాళ్ళతో సమానులవుతారు, మీ కంటే వెనక ఉన్న వాళ్ళతోను మించిపోతారు, మీ లాంటి ఈ పద్దతిని అనుసరించే వాడు తప్ప మీ లాంటి ఆచరణ తెచ్చేవాడు మరొకడు ఉండడు. ఆ విషయం: ప్రతి నమాజు తర్వాత 10 సార్లు సుబ్ హానల్లాహ్, 10 సార్లు అల్ హందులిల్లాహ్, 10 సార్లు అల్లాహు అక్బర్ పలకండి”. (బుఖారీ 6329).

أبو داود 5065 – صحيح: عنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: «خَصْلَتَانِ، أَوْ خَلَّتَانِ لَا يُحَافِظُ عَلَيْهِمَا عَبْدٌ مُسْلِمٌ إِلَّا دَخَلَ الْجَنَّةَ، هُمَا يَسِيرٌ، وَمَنْ يَعْمَلُ بِهِمَا قَلِيلٌ، يُسَبِّحُ فِي دُبُرِ كُلِّ صَلَاةٍ عَشْرًا، وَيَحْمَدُ عَشْرًا، وَيُكَبِّرُ عَشْرًا، فَذَلِكَ خَمْسُونَ وَمِائَةٌ بِاللِّسَانِ، وَأَلْفٌ وَخَمْسُ مِائَةٍ فِي الْمِيزَانِ، … قَالُوا: يَا رَسُولَ اللَّهِ كَيْفَ هُمَا يَسِيرٌ وَمَنْ يَعْمَلُ بِهِمَا قَلِيلٌ؟ قَالَ: «… وَيَأْتِيهِ فِي صَلَاتِهِ فَيُذَكِّرُهُ حَاجَةً قَبْلَ أَنْ يَقُولَهَا»

ప్రవక్త ప్రవచించారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “రెండు గుణాలున్నాయి, వాటిని పాటించిన ముస్లిం భక్తుడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. అవి తేలికైనవి, కాని వాటిని పాటించేవారు అరుదు. ప్రతి నమాజు తరువాత 10 సార్లు సుబ్ హానల్లాహ్, 10 సార్లు అల్ హందులిల్లాహ్, 10 సార్లు అల్లాహు అక్బర్ చెప్పాలి. ఇవి (ఐదు నమాజుల్లో చేస్తే) నోటి పై 150 అవుతాయి, కాని (ప్రళయదినాన) త్రాసులో 1500 అవుతాయి”. (అబూ దావూద్ 5065, తిర్మిజి 3410, నిసాయి 1348, ఇబ్ను మాజ 926).

నోటి పై 150, దీని సంఖ్య ఇలా ఉంటుంది:

10 సుబ్ హానల్లాహ్ + 10 అల్ హందిలిల్లాహ్ + 10 అల్లాహు అక్బర్ = 30.
30 × 5 (నమాజులు) = 150

త్రాసులో 1500 యొక్క సంఖ్య ఇది:
150 × 10 పుణ్యాలు = 1500 పుణ్యాలు

(3) ఆయతుల్ కుర్సీ = స్వర్గ ప్రవేశం

النسائي الكبرى 9848 – صحيح : عَنْ أَبِي أُمَامَةَ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «مَنْ قَرَأَ آيَةَ الْكُرْسِيِّ فِي دُبُرِ كُلِّ صَلَاةٍ مَكْتُوبَةٍ لَمْ يَمْنَعْهُ مِنْ دُخُولِ الْجَنَّةِ إِلَّا أَنْ يَمُوتَ» صحيح الجامع 6464

అబూ హూరైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ఆదేశించారుః “ఎవరు ప్రతి నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో వారి స్వర్గ ప్రవేశానికి మరణమే అడ్డు”. (నిసాయి ).

(4) ప్రత్యేకంగా ఫజ్ర్ మరియు మగ్రిబ్ తర్వాత చేసే జిక్ర్ ఘనత

النسائي 1354 –صحيح: عَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «مَنْ سَبَّحَ فِي دُبُرِ صَلَاةِ الْغَدَاةِ مِائَةَ تَسْبِيحَةٍ، وَهَلَّلَ مِائَةَ تَهْلِيلَةٍ، غُفِرَتْ لَهُ ذُنُوبُهُ، وَلَوْ كَانَتْ مِثْلَ زَبَدِ الْبَحْرِ»

షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ వారి సహీహుత్ తర్గీబ్ హదీసు నం. 472-477లో “లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లాషరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు యుహ్ యీ వయుమీతు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్” ఘనతలో వచ్చిన హదీసుల సారాంశం:

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، يُحْيِي وَيُمِيتُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ
లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లాషరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు యుహ్ యీ వయుమీతు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్

ఈ జిక్ర్ ఫజ్ర్, మగ్రిబ్ తర్వాత 10 సార్లు చదవాలి. (కొన్ని ఉల్లేఖనాల్లో అస్ర్ తర్వాత అని ఉంది). అయితే ఒక్కసారి చదివినందుకు లభించే ఘనతలు ఇలా ఉన్నాయి:

  • 1️⃣ ఒక్క విశ్వాస బానిసను విముక్తి కలిగించినంత పుణ్యం,
  • 2️⃣ 10 పుణ్యాలు లిఖించబడతాయి, موجبات
  • 3️⃣ 10 పాపాలు మన్నించబడతాయి, موبقات
  • 4️⃣ 10 స్థానాలు పెంచబడతాయి,
  • 5️⃣ ప్రతి చెడు (مكروه) నుండి కాపాడుకోవడం జరుగుతుంది,
  • 6️⃣ షైతాన్ నుండి రక్షించబడతుంది,
  • 7️⃣ ఆ రోజు షిర్క్ తప్ప ఏ పాపం వల్ల అతను పట్టుబడడు,
  • 8️⃣ ఉదయం వరకు అల్లాహ్, షైతాన్ నుండి అతని రక్షణ కొరకు ఆయుధాలు ధరించిఉన్న దైవదూతలను పంపుతాడు
  • 9️⃣ ఆ రోజు అతనికంటే ఉత్తముడు, ఘనతగలవాడు మరెవడూ ఉండడు.

(కొన్ని ఉల్లేఖనాల్లో రెండు కాళ్ళు మలుచుకునేకి ముందు చదవాలన్న ప్రస్తావన ఉంది).

దుఆలు పుస్తకాలు

నమాజు నిధులు – పార్ట్ 09: సజ్దా మరియు తషహ్హుద్ ఘనతలు [వీడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ ఆడియో (mp3) వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

[21:08 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

నమాజు నిధులు (Treasures of Salah) – పూర్వపు పాఠాలు మరియు పుస్తకం ఇక్కడ వినండి/చదవండి
https://teluguislam.net/2011/02/24/treasures-of-salah-namaz-telugu-islam/

9 – సజ్దాలు

సజ్దా నమాజులోని అతి గొప్ప భాగం, అందులో అల్లాహ్ కొరకు నమ్రత, సమర్పణ సంపూర్ణ రీతిలో పాటించబడుతుంది. అందుకే అనేక పుణ్యాలు, ఉత్తమ ఫలితాలు సజ్దా విషయంలో చెప్పబడ్డాయి. ఈ గొప్ప పుణ్యాన్ని గమనించండి.

 (9.1)  సాఫల్యం (నరకం నుండి రక్షణ, స్వర్గ ప్రవేశ సఫలత)

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا ارْكَعُوا وَاسْجُدُوا وَاعْبُدُوا رَبَّكُمْ وَافْعَلُوا الْخَيْرَ لَعَلَّكُمْ تُفْلِحُونَ – 22:77

అల్లాహ్ ఆదేశం: {విశ్వాసులారా! రుకూ చేయండి, సజ్దా చేయండి, మీ ప్రభువుకు దాస్యం చేయండి, మంచి పనులు చేయండి, దీని ద్వారానే మీకు సాఫల్య భాగ్యం లభించవచ్చును}. (హజ్ 22: 77).

{లఅల్లకుం తుఫ్లిహూన్} వ్యాఖ్వానంలో అబూ బక్ర్ అల్ జజాయిరీ ఇలా చెప్పారు: అంటే నరకం నుండి రక్షణ పొంది స్వర్గ ప్రవేశ ప్రాప్తమే గొప్ప సాఫల్యం. (ఐసరుత్తఫాసీర్ లికలామిల్ అలియ్యిల్ కదీర్).

(9.2)  ప్రళయదినాన అల్లాహ్ దయానుగ్రహాలు, ఆయన సంతోషం మరియు కాంతి లభిస్తాయి

مُّحَمَّدٌ رَّسُولُ اللَّهِ ۚ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُ بَيْنَهُمْ ۖ تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ

{ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త, ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగా ఉంటారు, పరస్పరం కరుణామయులుగా ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు, వారు రుకూ సజ్దాలలో, అల్లాహ్  అనుగ్రహాన్నీ ఆయన ప్రసన్నతనూ అర్థించటంలో నిమగ్నులై ఉండటం కనిపిస్తుంది. సజ్దాల సూచనలు వారి ముఖాలపై ఉంటాయి. వాటి వల్ల వారు ప్రత్యేకంగా గుర్తించ బడతారు}. (ఫత్ హ్ 48: 29).

{సజ్దాల సూచనలు వారి ముఖాలపై ఉంటాయి} యొక్క వ్యాఖ్యానం లో సఅదీ (రహిమహుల్లాహ్) ఇలా చెప్పారు: అధికంగా మరియు మంచిరీతిలో చేసిన దాస్యం (ఇబాదత్) ప్రభావం వారి ముఖాలపై పడింది. చివరికి వారి నమాజుల వల్ల వారి బాహ్యం మెరిసినట్లు వారి ఆంతర్యం సయితం కాంతివంతమైంది. (తైసీరుల్ కరీమిర్రహ్మాన్ ఫీ తఫ్సీరి కలామిల్ మన్నాన్)

(9.3) స్థానం రెట్టింపు, పాపం మన్నింపు

فَقَالَ النَّبِي صلى الله عليه وسلم:  (عَلَيْكَ بِكَثْرَةِ السُّجُودِ لِله فَإِنَّكَ لَا تَسْجُدُ لِله سَجْدَةً إِلَّا رَفَعَكَ اللهُ بِهَا دَرَجَةً وَحَطَّ عَنْكَ بِهَا خَطِيئَةً).

ప్రవక్త ఇలా ఉపదేశించారుః “నీవు ఎక్కువగా సజ్దాలు చేయి, నీవు సజ్దా చేసినపుడల్లా నీ ప్రతి సజ్దాకు బదులుగా అల్లాహ్ నీ కొరకు ఒక  స్థానం పెంచుతాడు, పాపం మన్నిస్తాడు”. (ముస్లిం 488).

(9.4) ప్రవక్త సామీప్యం

రబీఅ బిన్ కఅబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: నేను వుజూ నీళ్ళు, మరేదైనా అవసరమున్నవి అందించుటకు ప్రవక్త వద్దనే రాత్రి గడపేవాణ్ణి. అయితే ఒకసారి ప్రవక్త “అడుగు (నీకిష్టమున్నది అడుగు)” అని అన్నారు. ‘నేను స్వర్గంలో మీ సామీప్యం కోరుతున్నాను’ అని అన్నాను, ఇంకేదైనా? అని ప్రవక్త అడిగాడు, ‘కేవలం అది మాత్రమే’ అని నేనన్నాను. అప్పుడు ప్రవక్త చెప్పారుః “నీ స్వప్రయోజనం కోసం నీవు అధిక సజ్దాలు (నమాజులు) చేసి నాకు సహాయపడు”. (ముస్లిం 489).

(9.5) దుఆ స్వీకారానికి తగిన సమయం

ప్రవక్త ప్రబోధించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “దాసుడు తన ప్రభువుకు అతి చేరువుగా ఉండేది సజ్దా స్థితిలో, గనక అందులో ఎక్కువగా దుఆ చేయండి”. (ముస్లిం 482).

మరో ఉల్లేఖనంలో ఆయన ఇలా చెప్పారు: “సజ్దాలో దుఆ ఎక్కువగా చేయండి, అది స్వీకారయోగ్యమవుతుందన్న నమ్మకం ఈ స్థితిలో ఎక్కువగా ఉంటుంది”. (ముస్లిం 479).

(9.6) పాపాల ప్రక్షాళన

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు: “మనిషి నమాజు చేయుటకు లేచినప్పుడు అతని పాపాలు అతని తల మరియు భుజాలపై వేయబడతాయి, అతను రుకూ, సజ్దాలు చేసినపుడల్లా అవి రాలిపోతాయి”. (బైహఖీ 3/10,  సహీహుల్ జామిఅ 1671).

(9.7) సజ్దా అంగమును నరకాగ్ని కాల్చదు

ప్రవక్త సెలవిచ్చారు: “(మానవ శరీరములో) సజ్దా భాగాన్ని అల్లాహ్ నరకంపై నిషేధించాడు, అంటే అది దాన్ని కాల్చదు”. (బుఖారీ 806, ముస్లిం 182).

విశ్వాసులు చేసిన పాపాల్ని అల్లాహ్ క్షమించనిచో, మరియు వారి పాపాలను అధిగమించే, తుడిచివేసే పుణ్యాలు కూడా వారి వద్ద లేకున్నచో వారు వారి పాపాల పరిమాణాన్ని బట్టి అగ్నిలో శిక్షించబడతారు. అయితే సజ్దా అంగములు చాలా గౌరవనీయమైనవి గనక అగ్ని వాటిని తినదు, వాటిపై ఏలాంటి ప్రభావం పడదు. (అష్షర్హుల్ ముమ్తిఅ. 3వ సంపుటం: షేఖ్ ఇబ్ను ఉసైమీన్)

10 – మొదటి తషహ్హుద్

భూమ్యాకాశాల్లో ఉన్న అల్లాహ్ దాసులకు సమానంగా పుణ్యం

మొదటి తషహ్హుద్ లో ‘అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లా హిస్సాలిహీన్’ అన్న దుఆ చదువుతున్నప్పుడు గొప్ప ఘనత మనకు తెలుస్తుంది. నాతో పాటు మీరూ గమనించండి:

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: నా చేయి ప్రవక్త చేతిలో ఉండగా ఖుర్ఆను సూరాలు నేర్పినట్లు ఆయన నాకు తషహ్హుద్ దుఆ నేర్పారు. ‘అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యి బాతు అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్  ఈ పదాలు మీరన్నప్పుడు భూమ్యాకాశాల్లో ఉన్న ప్రతి పుణ్య పురుషునికి ఈ దుఆ లభిస్తుంది.‘వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు’. (బుఖారీ 831).

నీవు సలాం చేస్తున్నావంటే; భూమ్యాకాశాల్లో బ్రతికి ఉన్న, చని పోయిన పుణ్యపురుషులు, జిన్నాతులు మరియు అల్లాహ్ దూతలు అందరూ అన్ని రకాల లోపాలకు అతీతంగా మరియు ఆపదలకు దూరంగా ఉండాలని దుఆ చేస్తున్నావు అని అర్థం. దీని వల్ల అల్లాహ్ నీపై కరుణించి ఎవరెవరిపై నీవు సలాం చేశావో ప్రతి ఒక్కరికి బదులుగా పుణ్యం ప్రసాదిస్తాడు.

11 – చివరి తషహ్హుద్: (ప్రవక్త పై దరూద్)

ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లంపై దరూద్ చదవడంలో చాలా పుణ్యాలు, రెట్టింపు ప్రతిఫలాలున్నాయి.

(11.1) అల్లాహ్ మరియు ఆయన దూతల అనుకరణ

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا – 33:56

{అల్లాహ్ ఆయన దూతలు ప్రవక్తకై దరూద్ను పంపుతారు, విశ్వాసులారా! మీరు కూడా ఆయనకై దరూద్, సలామ్ లు పంపండి}. (అహ్ జాబ్ 33: 56).

(11.2) పది రెట్ల పుణ్యం

عَنْ أَبِي هُرَيْرَةَ  أَنَّ رَسُولَ الله قَالَ: (مَنْ صَلَّى عَلَيَّ وَاحِدَةً صَلَّى اللهُ عَلَيْهِ عَشْرًا).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ఎవరు నాపై ఒక సారి దరూద్ పంపుతారో అల్లాహ్ అతనిపై పది సార్లు కరుణిస్తాడు”. (ముస్లిం 408).

(11.3) పది పుణ్యాలు లిఖించబడతాయి, పది పాపాలు తొలగించ బడతాయి

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశ ప్రకారం: “నాపై ఒక్కసారి దరూద్ పంపిన వానికి అల్లాహ్ పది పుణ్యాలు వ్రాస్తాడు”. (తిర్మిజి 485), మరో ఉల్లేఖనంలోని పదాలు ఇలా ఉన్నాయి: “అతని పది పాపాలు తొలగిస్తాడు”. మరో హదీసు పదాలు ఇవి: “అతని పది పాపాలు తుడిచివేస్తాడు”. (ముస్నద్ అహ్మద్ 3/102, 4/29). [పది స్థానాలు రెట్టింపు చేయబడతాయని’ ముస్నద్ అహ్మద్ 4/29లో ఉంది.]

కరోనా వల్ల భయం చెంది మస్జిద్ కు నమాజు కొరకు వెళ్లకుంటే ఏమైనా పాపమా? [వీడియో]

బిస్మిల్లాహ్
[1:33 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
https://teluguislam.net/corona/

ఉపవాసాన్ని ఎలా కాపాడుకోవాలి? [ఆడియో క్లిప్]

బిస్మిల్లాహ్

[2 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఇతరములు:

%d bloggers like this: