సున్నతు నమాజుల ఘనత, సంఖ్య Sunnat Namazula Ghanata فضل السنن الرواتب (Telugu)
[వ్యవధి: 6 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
సున్నతె ముఅక్కద:
స్థానికులైన ప్రతి ముస్లిం స్త్రీ పురుషులు పన్నెండు రకాతులు పాటించడం ఎంతో పుణ్యకార్యం. అవి జొహ్ర్ కు ముందు 4, దాని తరువాత 2, మగ్రిబ్ తరువాత 2, ఇషా తరువాత 2, ఫజ్ర్ కు ముందు 2 రకాతులు. స్వయంగా ప్రవక్తసల్లల్లాహు అలైహి వసల్లం ఈ సున్నతులు పాటించేవారు. ఇంకా ఆయన ఇలా శుభవార్త ఇచ్చారని ఉమ్మె హబీబ రజియల్లాహు అన్హా తెలిపారుః
(مَا مِنْ عَبْدٍ مُسْلِمٍ يُصَلِّي لله كُلَّ يَوْمٍ ثِنْتَيْ عَشْرَةَ رَكْعَةً تَطَوُّعًا غَيْرَ فَرِيضَةٍ إِلَّا بَنَى اللهُ لَهُ بَيْتًا فِي الْجَنَّةِ أَوْ إِلَّا بُنِيَ لَهُ بَيْتٌ فِي الْجَنَّةِ).
“ఏ ముస్లిం భక్తుడు రాత్రి పగల్లో ఫర్జ్ కాకుండా పన్నెండు రకాతుల అదనపు (నఫిల్) నమాజు చేస్తూ ఉంటాడో అతనికి వాటికి బదులుగా అల్లాహ్ ఒక గృహము స్వర్గంలో నిర్మిస్తాడు, లేదా ఒక గృహం స్వర్గంలో నిర్మించచబడును“. (ముస్లిం 728).
సున్నతె ముఅక్కద మరియు సాధరణంగా నఫిల్ నమాజులన్నియూ ఇంట్లో చేయడం చాలా ఉత్తమం. ప్రవక్త ﷺ ప్రబోధించారని, జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
(إِذَا قَضَى أَحَدُكُمْ الصَّلَاةَ فِي مَسْجِدِهِ فَلْيَجْعَلْ لِبَيْتِهِ نَصِيبًا مِنْ صَلَاتِهِ فَإِنَّ اللهَ جَاعِلٌ فِي بَيْتِهِ مِنْ صَلَاتِهِ خَيْرًا).
“మీలోనెవరైనా మస్జిదులో (ఫర్జ్) నమాజు నెరవేర్చుకున్నాక, తన ఇంటి కొరకు కూడా (సున్నతులు, నఫిల్ల లాంటి) నమాజుల యొక్క కొంత భాగాన్ని మిగిలించుకోవాలి. అల్లాహ్ అతని నమాజుకు బదులుగా అతని ఇంట్లో మేలే చేకూర్చుతాడు”. (ముస్లిం 778).
జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
(فَإِنَّ خَيْرَ صَلَاةِ الْـمَرْءِ فِي بَيْتِهِ إِلَّا الصَّلَاةَ الْـمَكْتُوبَةَ).
“మనిషి తనింట్లో చేసే నమాజు అతి ఉత్తమమైనది. కేవలం ఫర్జ్ నమాజు తప్ప”. (బుఖారి 6113).
ఇతరములు:
సున్నతు మరియు నఫిల్ నమాజులు
- సున్నతు నమాజుల ఘనత السنن الرواتب [వీడియో] [60 నిముషాలు]
- ఫజ్ర్ కు ముందు సున్నతుల ఘనత [ఆడియో క్లిప్] [30 సెకండ్లు]
- హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) నుండి
- ఫర్జ్ నమాజులతో పాటు సున్నతే ము అక్కదా ఘనత [PDF]
- ఫజ్ర్ వేళ సున్నత్ నమాజును సంక్షిప్తంగాచేయాలి , ఆ నమాజులో పటించవలసిన సూరాలు
- ఫజ్ర్ వేళ సున్నత్ తర్వాత కాసేపు కుడివైపు తిరిగి పడుకోవటం … తహజ్జుదు నమాజు [PDF]
- జుహర్ కు సంబంధిన సున్నత్ లు [PDF]
- అసర్ కు సంబంధిన సున్నత్ లు [PDF]
- మగ్ రిబ్ ముందు , దాని తర్వాత చేయబడే సున్నత్ లు [PDF]
- ఇషాకు ముందు , ఆ తర్వాత చేయబడే సున్నత్ లు [PDF]
- జుమా నమాజ్ వేళ చేయబడే సున్నత్ లు [PDF]
- ఇష్రాఖ్ నమాజ్ & చాష్త్ నమాజ్ ఒకటేనా లేక వేర్వేరా? [ఆడియో]
- చాష్త్ (ఇష్రాఖ్)నమాజు ఘనత [వీడియో]
You must be logged in to post a comment.