నమాజ్ తర్వాత (సలాం చెప్పిన తర్వాత) చేసుకొనే జిక్ర్ మరియు దుఆలు – వాటి అనువాదం, లాభాలు [వీడియో]

[5:26 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

1- అస్తగ్ ఫిరుల్లాహ్ , అస్తగ్ ఫిరుల్లాహ్, అస్తగ్ ఫిరుల్లాహ్, అల్లాహుమ్మ అంతస్సలాం వ మిన్కస్సలాం తబారక్త యాజల్ జలాలి వల్ ఇక్రామ్.

 أَسْـتَغْفِرُ الله  أَسْـتَغْفِرُ الله  أَسْـتَغْفِرُ الله

اللّهُـمَّ أَنْـتَ السَّلامُ ، وَمِـنْكَ السَّلام ، تَبارَكْتَ يا ذا الجَـلالِ وَالإِكْـرام

(అల్లాహ్ నీ క్షమాభిక్ష కోరుతున్నాను… అల్లాహ్ నీవే సలాం. శాంతి నీ నుండి లభిస్తుంది. ఔన్నత్యం, గొప్పదనాలు గలవాడా నీవు గొప్ప శుభాలు కలవాడివి). (ముస్లిం 592).

2- లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅతైత వలా ముఅతియ లిమా మనఅ’త వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్కల్ జద్ద్.

dhikr-after-obligatory-prayer-dawud-burbank-021.gif

అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఏకైకుడు, సాటిలేనివాడు. విశ్వ సామ్రాజ్యం ఆయనదే. స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయన సర్వాధికారుడు. ఓ అల్లాహ్! నీవు ప్రసాదించే దానిని అడ్డుకునేవాడెవడూ లేడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వలేడు. ఎవరి పెద్దరికం ఐశ్వర్యం నీ శిక్ష ముందు వారికి లాభం చేకూర్చ లేవు. (బుఖారి 844, ముస్లిం 593).

3- లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి లాఇలాహ ఇల్లల్లాహు వలా నఅబుదు ఇల్లా ఇయ్యాహు లహున్నిఅ’మతు వలహుల్ ఫజ్లు వలహుస్సనాఉల్ హసన్ లా ఇలాహ ఇల్లల్లాహు ముఖ్లిసీన లహుద్దీన వలౌ కరిహల్ కాఫిరూన్.

dhikr-after-obligatory-prayer-dawud-burbank-03

(అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఏకైకుడు, సాటిలేనివాడు. విశ్వసామ్రాజ్యం ఆయనదే. స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయన సర్వాధికారుడు. పుణ్యాలు చేసే, పాపాల నుండి దూరముండే భాగ్యం అల్లాహ్ యే ప్రసాదించువాడు, ఆ అల్లాహ్ తప్ప వెరొక ఆరాధ్యుడు లేడు. మేము ఆయన్నే ఆరాధిస్తాము. వరాలు, అనుగ్రహాలు ఆయన ప్రసాదించినవే. మంచి స్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. సత్యతిరస్కారులకు ఎంత అయిష్టకరంగా ఉన్నా సరే మేము మా ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకున్నాము). (ముస్లిం 594).

4-సుబ్ హానల్లాహ్ 33 సార్లు, అల్ హందులిల్లాహ్ 33 సార్లు, అల్లాహు అక్బర్ 33 సార్లు అనాలి. వంద పూర్తి చేయుటకు ఒక్క సారి అనాలి: “లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్”.

* పై జిక్ర్ వంద లెక్క పూర్తి చేసినవారి పాపాలు సముద్రపు నురగంత ఉన్నా మన్నించబడతాయి. (ముస్లిం 597).

5-అల్లాహుమ్మ అఇన్నీ అలా జిక్రిక వ షుక్రిక వ హుస్ని ఇబాదతిక.

dhikr-after-obligatory-prayer-dawud-burbank-05

(అల్లాహ్! నేను నీ ధ్యానం చేయటానికి, నీకు కృతజ్ఞతలు తెలుపుకోటానికి, తగురీతిలో నిన్ను ఆరాధించటానికి నాకు సహాయం చెయ్యి). (అబూదావూద్ 1522).

6- అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ జుబ్ని వఅఊజు బిక మిన్ అన్ ఉరద్ద ఇలా అర్జలిల్ ఉమురి వ అఊజు బిక మిన్ ఫిత్నతిద్దున్యా వ అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్ర్.

dhikr-after-obligatory-prayer-dawud-burbank-08

(అల్లాహ్! పిరికితనం నుండి నీ శరణు వేడుతున్నాను. నికృష్టమైన వృద్ధాప్యానికి చేరుకోవటం నుండి నీ శరణు కోరుతున్నాను. ప్రాపంచిక ఉపద్రవాల నుండి నీ శరణు వేడుతున్నాను. సమాధి యాతనల నుండి నీ శరణు వేడుతున్నాను). (బుఖారి 2822).

7- (1)బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, ఖుల్ హువల్లాహు అహద్, అల్లాహుస్సమద్, లమ్ యలిద్, వలమ్ యూలద్, వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్.

2) బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం, ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్, మిన్ షర్రి మా ఖలఖ్, వ మిన్ షర్రి గాసిఖిన్ ఇజా వఖబ్, వ మిన్ షర్రిన్ నఫ్ఫాసాతి ఫిల్ ఉఖద్, వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్.

(3) బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్, మలికిన్నాస్, ఇలాహిన్నాస్, మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్, అల్లజీ యువస్విసు ఫీ సుదూరిన్నాస్, మినల్ జిన్నతి వన్నాస్.

(1)ఇలా అనుః ఆయనే అల్లాహ్, ఏకైకుడు, అల్లాహ్ ఎవరి అక్కరా లేనివాడు, ఆయనకు సంతానం లేదు మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ కాడు, ఆయనకు సరిసమానుడు ఎవడూ లేడు.

(2) ఇలా అనుః నేను ఉదయ కాలపు ప్రభువు శరణులోకి వస్తున్నాను, ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి, చిమ్మచీకటి కీడు నుండి ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో, ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి, మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో.

(3) ఇలా అనుః నేను మానవుల ప్రభువు, మానవుల సార్వభౌముడు, మానవుల ఆరాధ్య దైవం యొక్క శరణులోకి వస్తున్నాను, కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి, ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో, వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు) (అబూదావూద్ 1523).

8-అల్లాహు లాఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం లా తాఖుజుహూ సినతుఁ వలా నౌం, లహూ మా ఫిస్సమావాతి వమా ఫిల్ అర్జి మన్ జల్లజీ యష్ ఫఉ ఇన్’దహూ ఇల్లా బిఇజ్నిహీ యఅలము మా బైన ఐదీహిం వమా ఖల్ ఫహుమ్  వలా యుహీతూన బిషైఇమ్ మిన్ ఇల్మిహీ ఇల్లా బిమా షాఅ వసిఅ కుర్సియ్యుహుస్ సమావాతి వల్ అర్జ వలా యఊదుహూ హిఫ్జు- హుమా వహువల్ అలీయ్యుల్ అజీం. (సూ. బఖర 255). (ఈ ఆయతును ‘ఆయతుల్ కుర్సీ’అని అంటారు).

(అల్లాహ్! ఆయన తప్ప మరొక సత్యఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. ఆయన నిత్యుడువిశ్వవ్యవస్థకు ఆధారభూతుడు ఆయనకు కునుకురాదు మరియు నిదురరాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే, ఆయన సమ్ముఖంలో -ఆయన అనుజ్ఞ లేకుండా- సిఫారసు చేయగలవాడెవడు? వారి ముందున్నదీ మరియు వారి వెనుక ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు, మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు, ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన అత్యున్నతుడు, సర్వోత్తముడు).

* ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదివిన వారు స్వర్గంలో ప్రవేశించడానికి చావు మాత్రమే అడ్డు ఉంటుంది. (సహీహా 972).

9- అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫిఅ, వరిజ్ఖన్ తయ్యిబ, వ అమలమ్ ముతఖబ్బల. (ఫజ్ర్ నమాజు తర్వాత మాత్రమే.)

(ఓ అల్లాహ్! నేను నీతో ప్రయోజనకరమైన జ్ఞానం, పవిత్ర ఆహారం మరియు అంగీకరింపబడే ఆచరణ కోరుతున్నాను). (ఇబ్ను మాజ 925). ఇది ఫజ్ర్ తర్వాత.

కూర్పు : ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ

[Download PDF]

%d bloggers like this: