విత్ర్ నమాజు ఘనత, రకాతుల సంఖ్య Witr Namazu Ghanata, Rakatul sankhya أهمية صلاة الوتر
[వ్యవధి: 6:04 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
విత్ర్ నమాజ్:
అలాగే ముస్లిం విత్ర్ నమాజును పాటించుట ధర్మం. ఇది కూడా సున్నతె ముఅక్కద. దీని సమయం ఇషా తరువాత నుండి ఉషోదయం వరకు ఉంటుంది. అయితే రాత్రి చివరి ఘడియలో మేల్కొనగల వారికి ఆ సమయమే ఉత్తమం.
ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాల్లో ఎలాంటి సాంప్రదాయమంటే; ప్రవక్త మహా నీయులు ఎప్పుడూ విడనాడ లేదు. ప్రయాణంలో ఉన్నా, లేదా స్థానికంగా ఉన్నా తప్పకుండా చేసేవారు.
కనిష్ట సంఖ్య ఒక్క రకాతు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రుల్లో పదకుండు రకాతులు చేసేవారు. ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖనంలో ఉంది:
أَنَّ رَسُولَ الله ﷺ كَانَ يُصَلِّي بِاللَّيْلِ إِحْدَى عَشْرَةَ رَكْعَةً يُوتِرُ مِنْهَا بِوَاحِدَةٍ…
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి పూట 11 రకాతులు చేసేవారు, అందులో ఒక రకాతు విత్ర్ చేసేవారు. (ముస్లిం 736).
రాత్రి నమాజు రెండేసి రకాతులు.
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రాత్రి నమాజ గురించి ప్రశ్నించాడు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
(صَلَاةُ اللَّيْلِ مَثْنَى مَثْنَى فَإِذَا خَشِيَ أَحَدُكُمْ الصُّبْحَ صَلَّى رَكْعَةً وَاحِدَةً تُوتِرُ لَهُ مَا قَدْ صَلَّى).
“రాత్రి వేళ నఫిల్ నమాజు రెండేసి రకాతుల చొప్పున చేయాలి. ఇక ఉషోదయం కావస్తోందని భావించినప్పుడు ఒక రకాతు చేయి. దీనివల్ల మొత్తం నమాజు విత్ర్ (బేసి సంఖ్య నమాజ్) అయిపోతుంది”.
(బుఖారి 991, ముస్లిం 749).
విత్ర్ లో దుఆయె ఖునూత్ చేయడం మంచిది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హసన్ బిన్ అలీ (రజియల్లాహు అన్హు) గారికి విత్ర్ లో చదివే దుఆ నేర్పారు. కాని ఎల్లప్పుడు చేయకూడదు. ఎందుకనగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి విత్ర్ నమాజు విధానం గురించి ఉల్లేఖించిన సహచరులు ఖునూత్ గురించి చెప్పలేదు.
రాత్రి నమాజు చేయలేకపోయినవారు మరుసటి రోజు రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండు ఇష్టమున్నన్ని రకాతులు చేయుట మంచిది. ఎప్పుడైనా రాత్రి నమాజు తప్పి పోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే చేసేవారు.
సున్నతు మరియు నఫిల్ నమాజులు
- సున్నతు నమాజుల ఘనత السنن الرواتب [వీడియో] [60 నిముషాలు]
You must be logged in to post a comment.