చాష్త్ నమాజు (దుహా నమాజు) ఘనత Chasht Namaz Ghanata فضل صلاة الضحى
[వీడియో వ్యవధి 3:37]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
చాష్త్ నమాజ్: దీనినే సలాతుల్ అవ్వాబీన్ అంటారు. ఇది సున్నతె ముఅక్కద. అనేక హదీసుల్లో దీని గురించి ప్రోత్సహించబడింది.
అబూ జర్ర్ ఉల్లేఖించిన హదీస్ ముస్లిం 820 లో ఉంది: ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారుః
عَنْ أَبِي ذَرٍّ عَنْ النَّبِيِّ ﷺ أَنَّهُ قَالَ: (يُصْبِحُ عَلَى كُلِّ سُلَامَى مِنْ أَحَدِكُمْ صَدَقَةٌ فَكُلُّ تَسْبِيحَةٍ صَدَقَةٌ وَكُلُّ تَحْمِيدَةٍ صَدَقَةٌ وَكُلُّ تَهْلِيلَةٍ صَدَقَةٌ وَكُلُّ تَكْبِيرَةٍ صَدَقَةٌ وَأَمْرٌ بِالْمَعْرُوفِ صَدَقَةٌ وَنَهْيٌ عَنْ الْمُنْكَرِ صَدَقَةٌ وَيُجْزِئُ مِنْ ذَلِكَ رَكْعَتَانِ يَرْكَعُهُمَا مِنْ الضُّحَى).
“మానవ శరీరంలో ఎన్ని కీళ్ళు ఉన్నాయో వాటిలో ప్రతి దానికీ బదులుగా ఒక దానం (సదఖా) విధి అయి ఉంది. అయితే ప్రతి సుబ్ హానల్లాహ్ ఒక సదఖా, ప్రతి అల్ హందులిల్లాహ్ ఒక సదఖా, లాఇలాహ ఇల్లల్లాహ్ ఒక సదఖా, అల్లాహు అక్బర్ ఒక సదఖా, ఒక మంచిని బోధించడం ఒక సదఖా, ఒక చెడును నివారించడం ఒక సదఖా, వీటన్నిటికీ బదులుగా చాష్త్ సమయంలో రెండు రకాతులు సరిపోతాయి”.
عَنْ أَبِي هُرَيْرَةَ t قَالَ أَوْصَانِي خَلِيلِي بِثَلَاثٍ لَا أَدَعُهُنَّ حَتَّى أَمُوتَ: صَوْمِ ثَلَاثَةِ أَيَّامٍ مِنْ كُلِّ شَهْرٍ وَصَلَاةِ الضُّحَى وَنَوْمٍ عَلَى وِتْرٍ.
హజ్రత్ అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం:
నా ప్రాణ స్నేహితులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు మూడు విషయాలను గురించి హితబోధ చేశారు. నేను వాటిని చని పోయేంత వరకు వదలిపెట్టను. అవిః 1. ప్రతి (ఇస్లామీయ) నెలలో మూడు రోజుల ఉపవాసం పాటించటం. 2. చాష్త్ నమాజ్ చేయడం. 3. విత్ర్ నమాజ్ చేసి నిద్ర పోవడం. (బుఖారి 1178, ముస్లిం 721).
దీని ఉత్తమ సమయం పొద్దెక్కి, ఎండ తాపం పెరిగిన తర్వాత. పొద్దు వాలిన వెంటనే దీని సమయం సమాప్తమవుతుంది. కనిష్ట సంఖ్య రెండు రకాతులు. గరిష్ట సంఖ్యకు హద్దు లేదు.
ఇతరములు:
You must be logged in to post a comment.