ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఎందుకు ఎక్కువ మంది భార్యలున్నారు? https://youtu.be/XPzalQiVVY4 [6 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బహుళ వివాహాల గురించిన ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. మొత్తం 11 మంది భార్యలు ఉన్నారని, వారిలో ఇద్దరు ఆయన జీవితకాలంలోనే మరణించారని, ఆయన మరణించే సమయానికి తొమ్మిది మంది ఉన్నారని వక్త స్పష్టం చేశారు. ఈ వివాహాలు అల్లాహ్ యొక్క ప్రత్యేక అనుమతితో జరిగాయని, దీనికి సూరతుల్ అహ్‌జాబ్‌లో ప్రమాణం ఉందని వివరించారు. ఈ వివాహాల వెనుక ఉన్న అనేక కారణాలను ఆయన వివరించారు: స్త్రీలకు ఆదర్శవంతమైన జీవితాన్ని తెలియజేయడం, వైవాహిక జీవితంలోనూ ఆయన ఒక ఉత్తమ ఆదర్శంగా నిలవడం, వివిధ వంశాలు మరియు వర్గాల మధ్య సంబంధాలను బలపరచడం, మరియు ఇస్లాం యొక్క గొప్పతనాన్ని, శత్రువుల పట్ల కూడా గౌరవప్రదంగా వ్యవహరించే తీరును తెలియజేయడం వంటివి ముఖ్యమైనవి. ఇది ఇస్లాం యొక్క విశ్వజనీన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి దోహదపడిందని ఆయన పేర్కొన్నారు.
ఒక హిందూ సోదరుడు ప్రశ్న అడిగి ఉన్నారు షేక్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు కొందరు 11 మంది భార్యలు అంటారు, మరికొందరు 9 మంది భార్యలు అంటారు. అసలు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎంత మంది భార్యలు? ఎందుకు దైవప్రవక్త ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు? అనేసి ఒక హిందూ సోదరుడు అడుగుతున్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొత్తం భార్యలు 11. అయితే తమ జీవితంలో ఇద్దరు భార్యలు చనిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించే సందర్భంలో తొమ్మిది భార్యలు వారి వద్ద ఉన్నారు.
అయితే, ప్రవక్తకు నలుగురి కంటే ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకునే అటువంటి అనుమతి, అర్హత స్వయంగా నిజ సృష్టికర్త అయిన మనందరి ఆరాధ్యుడైన అల్లాహ్ ప్రసాదించాడు. ఆ ఆజ్ఞ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పెళ్లిళ్లు చేసుకున్నారు. దీని యొక్క వివరణ సూరతుల్ అహ్‌జాబ్‌లో చూడవచ్చును. సూరా నెంబర్ 33, మరి ఇందులో ప్రత్యేకంగా ఎక్కడైతే అల్లాహ్ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒకరి కంటే ఎక్కువగా భార్యలు చేసుకునే అటువంటి అనుమతి ఇచ్చాడో, ఆయతు నెంబర్ 28 నుండి సుమారు సుమారు 35 వరకు మరియు ఆ తర్వాత ఒక రెండు ఆయతులు కూడా మీరు చూశారంటే దీనికి సంబంధించిన ఎన్నో లాభాలు మనకు ఏర్పడతాయి.
బహుళ వివాహాల వెనుక ఉన్న కారణాలు
సంక్షిప్తంగా మనం చెప్పుకోవాలంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం పురుషులకే ప్రవక్త కారు, స్త్రీలకు కూడాను. అయితే, ప్రవక్త వారి ఆదర్శ జీవితం పురుషులకు ఎంత అవసరమో, అలాగే స్త్రీలకు కూడా అవసరం. ఒకరి కంటే, నలుగురి కంటే ఎక్కువ భార్యల ద్వారా ఇలా ప్రవక్త వారి ఆదర్శవంతమైన జీవితాన్ని తెలుసుకొని ప్రజలందరికీ తెలియజేయడానికి మంచి సహకారం ఏర్పడుతుంది.
రెండవ విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన అందరి కొరకు ఒక ఉత్తమ ఆదర్శం అని ఇదే సూరతుల్ అహ్‌జాబ్‌లో కూడా అల్లాహ్ మనకు తెలియజేశాడు. అయితే, ఈ ఆదర్శం కేవలం మస్జిద్ వరకు, బయట బజారు వరకు, యుద్ధాల్లోనే కాదు, వైవాహిక జీవితంలో, ఫ్యామిలీ లైఫ్‌లో కూడా. అంతేకాదు, ఇంకా మనం కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే, మానవుల్లో, సమాజంలో విద్యా రీత్యా గానీ, బుద్ధి జ్ఞానాల పరంగా గానీ, విషయాలు నేర్చుకుని ఆచరించే పరంగా గానీ, సమాజంలో ప్రజలు ఏ తారతమ్యాలు ఏర్పాటు చేసుకుంటారో దాని పరంగా గానీ వేరువేరుగా ఉంటారు గనుక, వేరువేరు వంశాలకు సంబంధించిన భార్యలు ప్రవక్త దగ్గర ఉండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉత్తమ ఆదర్శాన్ని అందరికీ తెలియజేయడానికి.
అంతే కాదు, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా వచ్చారు. సర్వ మానవాళిలో ప్రత్యేకంగా ఆ కాలంలో బహుదైవారాధకుల రూపంలో, యూదుల రూపంలో, క్రైస్తవుల రూపంలో ఎందరో అక్కడ నాయకులు ఉన్నారు. అయితే, ఆ నాయకుల యొక్క బిడ్డలు సైతం ఎప్పుడైతే యుద్ధంలో బానిసరాళ్లుగా వచ్చారో, వారికి వారి హోదా, అంతస్తు ప్రకారంగా వారి యొక్క తండ్రులకు ఇస్లాం యొక్క గొప్పతనం తెలిసిరావాలి, ‘నా బిడ్డలు బానిసరాళ్లు అయ్యారు’ అన్నటువంటి అవమానంతో ఇస్లాం పట్ల మరింత వారి యొక్క హృదయాలలో ఏ చెడు చేసుకోకూడదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాంటి బిడ్డలను వివాహం చేసుకున్నారంటే, ఇస్లాం యొక్క గొప్ప నాయకుల వద్ద నా బిడ్డలు ఒక మహారాణిగా ఉన్నారు అన్నటువంటి సంతోషంతో వారు కూడా ఇస్లాంకు మరింత దగ్గరగా అయ్యారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూశారా? అనే ప్రశ్నకు ఈ ప్రసంగం సమాధానమిస్తుంది. ప్రవక్త అల్లాహ్‌ను చూడలేదని స్పష్టంగా చెప్పబడింది. ఈ వాదనను బలపరచడానికి, సహీహ్ ముస్లిం మరియు సహీహ్ బుఖారీ నుండి రెండు హదీసులు ఉదహరించబడ్డాయి. మొదటి హదీసులో, అబూ దర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్తను నేరుగా అడిగినప్పుడు, “అతను కాంతి (నూర్), నేను ఎలా చూడగలను?” అని ప్రవక్త సమాధానమిచ్చారు. రెండవ హదీసులో, మస్రూక్ ఇదే ప్రశ్నను ఆయిషా (రదియల్లాహు అన్హా)ను అడిగినప్పుడు, ప్రవక్త అల్లాహ్‌ను చూశారని చెప్పేవారు అబద్ధం చెప్పినట్లేనని ఆమె తీవ్రంగా స్పందించి, ఖురాన్ ఆయత్‌ను ఉదహరించారు. అయితే, ప్రళయ దినాన స్వర్గంలో విశ్వాసులందరూ అల్లాహ్‌ను చూస్తారని కూడా వివరించబడింది.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూశారా?
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూశారా? సరైన సమాధానం చూడలేదు. అవును, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూడలేదు.కొందరు అనుకుంటారు మేరాజ్ పోయినప్పుడు చూశారు కదా అని. కానీ, ఇది సరైన మాట కాదు.
హదీసుల ఆధారాలు
సహీహ్ ముస్లిం షరీఫ్ లో హదీస్ నెంబర్ 178, అబూ దర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు.
“నేను స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించాను. ‘ప్రవక్తా, మీరు మీ ప్రభువును చూశారా?’ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ‘అతను సర్వమూ నూర్ (కాంతి). నేను ఎలా చూడగలుగుతాను?'”
అతను సర్వమూ నూర్, కాంతి, ప్రకాశం. నేను ఎలా చూడగలుగుతాను? అబూ దర్ రదియల్లాహు అన్హు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగితే ప్రవక్త ఇలా సమాధానం ఇచ్చారు.
అయితే మరొక హదీస్ చూడండి సహీహ్ బుఖారీలో వచ్చింది. హదీస్ నెంబర్ 4855. ఇంతకుముందు దీనిలోని ఒక భాగం మనం విని ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ టాపిక్‌కు సంబంధించిన విషయం వినండి.
هَلْ رَأَى مُحَمَّدٌ صلى الله عليه وسلم رَبَّهُ (హల్ ర’ఆ ముహమ్మదున్ సల్లల్లాహు అలైహి వసల్లం రబ్బహు) ‘ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారా?'”
“నీవు చెప్పిన ఈ మాటతో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.ఈ మూడు మాటల నుండి, విషయాల నుండి నువ్వు ఎక్కడున్నావు? తెలియకుండా ఇంకా ఎందుకున్నావు? ఎవరైతే నీతో చెబుతాడో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారని, فَقَدْ كَذَبَ (ఫఖద్ కదబ్) “అతడు అబద్ధం పలికాడు.” అసత్యం మాట్లాడాడు.
మళ్ళీ ఆయిషా రదియల్లాహు తా’ఆలా అన్హా ఈ ఆయత్ ను పఠించారు:
“ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు, సర్వమూ తెలిసినవాడు.”
ముగింపు
ఈ విధంగా ఈ రెండు హదీసులు మరియు ఖురాన్ ఆయత్ ద్వారా మనకు తెలిసిన బోధ ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్‌కు వెళ్ళినప్పుడు గానీ, ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలం గానీ, ఎప్పుడూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూడలేదు.
అయితే ప్రళయ దినాన స్వర్గంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అల్లాహ్‌ను చూస్తారు మరియు ఇన్ షా అల్లాహ్ విశ్వాసులందరూ కూడా తప్పకుండా చూస్తారు.
وُجُوهٌ يَوْمَئِذٍ نَاضِرَةٌ * إِلَى رَبِّهَا نَاظِرَةٌ (వుజూహున్ యవ్‌మఇదిన్ నాదిరహ్, ఇలా రబ్బిహా నాదిరహ్) “ఆ రోజు కొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి. తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి.”
ఇంకా వేరే ఎన్నో ఆయతులు, హదీసులు కూడా దీనికి దలీలుగా ఉన్నాయి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
జుమా రోజు స్నానం చేయడం, సువాసన పూసుకోవడం ధర్మం https://youtu.be/S94_5Yq3hOA [8 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమా రోజు ఆచరించాల్సిన పలు సున్నతుల గురించి వివరించారు. ముఖ్యంగా, జుమా రోజు స్నానం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. కొన్ని హదీసుల ప్రకారం ఇది ప్రతి ప్రౌఢ వయస్సుకు చేరిన వ్యక్తిపై విధిగా (వాజిబ్) ఉండగా, మరికొన్ని హదీసుల ప్రకారం ఇది అత్యంత ఉత్తమమైన (అఫ్దల్) చర్య. స్నానంతో పాటు, శుభ్రమైన దుస్తులు ధరించడం, అందుబాటులో ఉన్న సువాసన లేదా నూనె రాసుకోవడం, మస్జిద్‌కు తొందరగా వెళ్లడం, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా దొరికిన చోట కూర్చోవడం, మరియు ఇమామ్ ప్రసంగాన్ని (ఖుత్బా) శ్రద్ధగా, మౌనంగా వినడం వంటివి కూడా వివరించబడ్డాయి. ఈ నియమాలను పాటించిన వ్యక్తి యొక్క ఒక జుమా నుండి మరో జుమా మధ్య జరిగిన పాపాలు మరియు అదనంగా మరో మూడు రోజుల పాపాలు క్షమించబడతాయని శుభవార్త ఇవ్వబడింది.
అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్.
జుమాకు సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సూక్తులు, హదీసుల తెలుగు అనువాదం మనం వింటూ ఉన్నాము. ఇప్పుడు జుమా రోజు స్నానం చేసే ఆదేశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన హదీసులు విందాము.
జుమా రోజు స్నానం (ఘుస్ల్) చేయడం
عَنْ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ ـ رضى الله عنهما ـ أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ “ إِذَا جَاءَ أَحَدُكُمُ الْجُمُعَةَ فَلْيَغْتَسِلْ ” అన్ అబ్దుల్లా హిబ్ని ఉమర రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల, “ఇదా జాఅ అహదుకుముల్ జుముఅత ఫల్ యగ్తసిల్”. (అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: “మీలో ఎవరు జుమాకు హాజరవుతున్నారో, వారు స్నానం చేయాలి”.) (సహీహ్ బుఖారీ 877, సహీహ్ ముస్లిం 844)
عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ ـ رضى الله عنه ـ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ “ الْغُسْلُ يَوْمَ الْجُمُعَةِ وَاجِبٌ عَلَى كُلِّ مُحْتَلِمٍ ” అన్ అబీ సయీదినిల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల, “అల్ గుస్లు యౌమల్ జుముఅతి వాజిబున్ అలా కుల్లి ముహ్తలిం”. (అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “జుమా రోజు స్నానం చేయడం, ప్రాజ్ఞ వయస్సుకు చేరిన ప్రతి ఒక్కరిపై విధిగా ఉంది”.) (సహీహ్ బుఖారీ 858, సహీహ్ ముస్లిం 846)
వుదూ మరియు స్నానం మధ్య ఆధిక్యత
عَنْ سَمُرَةَ بْنِ جُنْدَبٍ، قَالَ قَالَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم “ مَنْ تَوَضَّأَ يَوْمَ الْجُمُعَةِ فَبِهَا وَنِعْمَتْ وَمَنِ اغْتَسَلَ فَالْغُسْلُ أَفْضَلُ ” అన్ సమురతబ్ని జుందుబిన్ రదియల్లాహు అన్హు ఖాల ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, “మన్ తవద్దఅ యౌమల్ జుముఅతి ఫబిహా వనిఅమత్, వ మనిగ్తసల ఫహువ అఫ్దల్”.
(సముర బిన్ జుందుబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఎవరైతే జుమా రోజు వుదూ చేసుకున్నారో, చాలా మంచి పని చేశాడు అతను. మరెవరైతే స్నానం చేశారో, ఈ స్నానం చేయడం అన్నది చాలా ఉత్తమం”.) (అబూ దావూద్ 354, తిర్మిది 497, నిసాయి 1379, దారిమి 1581. ఇది హసన్ కోవకు చెందిన హదీస్).
జుమా ఆచారాలు మరియు వాటి పుణ్యఫలాలు
عَنْ أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ ثُمَّ أَتَى الْجُمُعَةَ فَدَنَا وَاسْتَمَعَ وَأَنْصَتَ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ وَزِيَادَةُ ثَلاَثَةِ أَيَّامٍ وَمَنْ مَسَّ الْحَصَى فَقَدْ لَغَا
(అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఎవరైతే మంచి రీతిలో, ఉత్తమ రీతిలో ప్రవక్త చెప్పినట్లు, చూపినట్లు వుదూ చేశారో, మళ్ళీ జుమాకు హాజరయ్యాడో, మొదటి పంక్తులలో ఇమామ్‌కు చాలా దగ్గరగా కూర్చొని జుమా ప్రసంగం (ఖుత్బా) చాలా శ్రద్ధగా, మౌనంగా విన్నాడో, అలాంటి వ్యక్తికి రెండు జుమాల మధ్యలో, అంటే మొత్తం ఏడు రోజులు, ఇంకా అదనంగా మూడు రోజులు, అంటే మొత్తం పది రోజుల పాపాలు మన్నించబడతాయి. అయితే ఎవరైతే ఈ జుమా ఖుత్బా ప్రసంగం సందర్భంలో కంకర రాళ్లు కూడా ముట్టుకుంటాడో, అతని యొక్క జుమా పుణ్యమంతా కూడా వృధా అయిపోతుంది”.) (అబూ దావూద్ 1050, తిర్మిది 498. హదీస్ సహీహ్).
ఈ నాలుగు హదీసులలో మనకు తెలిసిన సారాంశం ఏమిటంటే, జుమా రోజు స్నానం చేయడం చాలా ఉత్తమమైన విషయం. సహీహ్ బుఖారీ, ముస్లిం హదీసుల ఆధారంగా కొందరు విధి అని కూడా అంటారు, ‘వాజిబున్’ అన్న పదం వచ్చింది గనక. కానీ అబూ దావూద్, తిర్మిది, నసాయి ఇంకా వేరే హదీసు గ్రంథాలలో వచ్చిన హదీసు ఆధారంగా ‘అఫ్దల్’ అన్న పదం వచ్చింది గనుక, విధి కాదు. కానీ మనిషికి అవకాశం ఉండి, సౌకర్యాలు ఉన్నప్పుడు దీనిని ఏమాత్రం వదలకూడదు.
మరొక ముఖ్య విషయం మనం గమనించాల్సింది, సామాన్యంగా మనం జుమా రోజు స్నానం చేసినప్పుడు పరిశుభ్రత కొరకు, స్నానం చేయాలి, ఈ రోజు జుమా అన్నటువంటి ఆలోచనలు, ఇరాదా, నియ్యతులు ఉంటాయి. కానీ వీటితో పాటు అతి ముఖ్యమైనది, జుమా రోజు స్నానం చేయడం విధి లేదా అతి ఉత్తమం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు గనక, ప్రవక్త ఈ ఆదేశాన్ని మనం పాటిస్తున్నాము అన్నటువంటి నియ్యత్ మనసులో ఉండేది ఉంటే, ఈ స్నానం చేయడం ద్వారా కూడా మనకు పుణ్యాలు లభిస్తాయి. ఈ విషయం మనకు నాలుగో హదీసులో కూడా చాలా స్పష్టంగా తెలిసింది. అల్లాహు తఆలా దీనికి బదులుగా ఇంకా వీటితో పాటు మరికొన్ని పుణ్య కార్యాలు ఏదైతే తెలుపబడ్డాయో, తొందరగా రావడం, ముందు పంక్తుల్లో కూర్చోవడం, ఎలాంటి వృధా కార్యకలాపాలు చేయకుండా ఉండడం, శ్రద్ధగా ఖుత్బా వినడం, వీటి ద్వారా అల్లాహు తఆలా పది రోజుల పాపాలు మన్నిస్తాడు.
జుమా రోజు సువాసన పూసుకోవడం
ఇక జుమా రోజు సువాసన పూసుకోవడం కూడా ఒక పుణ్య కార్యం. అయితే, దీనికి సంబంధించిన ఒక హదీసు విందాము.
సల్మాన్ ఫార్సీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “జుమా రోజు ఎవరైతే స్నానం చేస్తారో, మంచి విధంగా తన శక్తి ప్రకారం పరిశుభ్రత పాటిస్తాడో, మంచి దుస్తులు ధరించుకుంటాడో మరియు తన వద్ద ఉన్నటువంటి నూనె తలకు పూసుకుంటాడో మరియు అలాగే ఇంట్లో ఉన్న సువాసన కూడా పూసుకుంటాడో, ఇంకా మస్జిద్‌కు వెళ్లి మస్జిద్లో ఇద్దరి మధ్యలో విడదీయకుండా, ఎక్కడ అతనికి స్థలం దొరికిందో అక్కడ, అల్లాహ్ అతని అదృష్టంలో రాసినన్ని రకాతుల నమాజులు చేస్తాడో, మళ్ళీ ఇమామ్ ప్రసంగం ఇచ్చినప్పుడు, జుమా ఖుత్బా ఇచ్చినప్పుడు శ్రద్ధగా, మౌనంగా ఖుత్బా వింటాడో, అల్లాహు తఆలా ఈ జుమా నుండి వచ్చే జుమా వరకు ఈ మధ్యలో జరిగిన అతని పాపాలను మన్నిస్తాడు”. (సహీహ్ బుఖారీ 883).
ఈ హదీసులో తెలిపినటువంటి జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి ఎంత గొప్ప శుభవార్త ఇవ్వడం జరిగిందో గమనించండి. కానీ ఈ శుభవార్త ఎవరి కొరకు ఉంది? ఈ హదీసులో తెలుపబడినటువంటి ఈ జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి.
అల్లాహ్ మనందరికీ జుమా యొక్క ఘనతను దృష్టిలో ఉంచుకొని, అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానంలో జుమా కోసం సంసిద్ధతలు, తయారీలు చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక. ఆ రోజు చదవవలసిన సూర కహఫ్ ఇంకా వేరే పుణ్య కార్యాలు చేసేటువంటి సద్భాగ్యం కూడా ప్రసాదించు గాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సహాబా : ‘సహాబీ‘కి బహువచనం ‘సహాబా‘. విశ్వాస (ఈమాన్) స్థితిలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను కలుసుకుని, విశ్వాసస్థితిలో తనువు చాలించిన వారంతా సహాబా (సహచరులు- రది అల్లాహు అన్హుమ్) అనబడతారు.
వారు ముస్లిం సమాజంలో అందరికన్నా శ్రేష్టులని, ఇస్లాం వైపు ముందంజవేసిన వారని, ప్రవక్త సహచర్య భాగ్యం పొందినవారని, ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)తో కలిసి జిహాద్ చేసినవారని, షరీయత్ బరువు బాధ్యతలను మోయటమే గాకుండా దానిని తమ తరువాతి తరాల వారికి అందించిన ధన్యజీవులని, ఈ కారణంగా వారు ప్రపంచంలోనే అత్యుత్తమ సమూహం అని మనం విశ్వసించటం తప్పనిసరి (వాజిబ్). – [నుండి: సహాబా అంటే ఎవరు? వారి గురించి ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి? – డా. సాలెహ్ అల్ ఫౌజాన్]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఈ ప్రసంగంలో, సహాబాల (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు) యొక్క నిర్వచనం, వారి ఉన్నత స్థానం మరియు ప్రాముఖ్యత వివరించబడింది. వారి జీవిత చరిత్రను తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమో హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనతో స్పష్టం చేయబడింది. సహాబాల యొక్క సద్గుణాలను మరియు వారి పట్ల అల్లాహ్ యొక్క ప్రసన్నతను సూరతుల్ ఫతహ్ వంటి ఖుర్ఆన్ ఆయతుల ద్వారా వివరించారు. సహాబాలను దూషించడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రంగా ఖండించిన హదీసులు, వారి పట్ల విశ్వాసులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు మరియు వారి మధ్య ఉన్న వివిధ స్థాయిల గురించి చర్చించబడింది. సలఫె సాలెహీన్ (పూర్వపు సత్పురుషులు) సహాబాలను ఎలా గౌరవించేవారో అబ్దుల్లా బిన్ ఉమర్ మరియు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ వంటి వారి ఉదాహరణలతో వివరించబడింది. సహాబాలను దూషించే వారి పట్ల ఇమామ్ అహ్మద్ వంటి ఇస్లామీయ పండితుల కఠినమైన వైఖరిని కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.
సహాబా – నిర్వచనం
సోదర సోదరీమణులారా, సహాబీ ఇది ఏకవచనం, సహాబా ఇది బహువచనం. సహాబియా ఇది ఏకవచనం, స్త్రీలను అంటారు. సహాబియాత్ ఇది బహువచనం, స్త్రీలను అంటారు. ఏ స్త్రీలు? ఏ పురుషులు? సహాబీ అంటే ఎవరైతే విశ్వాస స్థితిలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి, కలిసి, విశ్వాస స్థితిలోనే చనిపోయారో వారిని సహాబీ అంటారు. ఇక ఒక్కరు పురుషులైతే సహాబీ, ఇద్దరు పురుషులైతే సహాబియాన్, అంతకంటే ఎక్కువ వారిని సహాబా లేదా అస్హాబు ముహమ్మద్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మిత్రులు అని అనబడుతుంది. ఒక స్త్రీ అయ్యేది ఉంటే, ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం వారిని చూసి, ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం వారిపై విశ్వసించి, విశ్వాస స్థితిలో చనిపోయిన స్త్రీ సహాబియా, సహాబియతాన్, సహాబియాత్.
సహాబాల జీవిత చరిత్ర తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం?
అయితే సోదర సోదరీమణులారా, వారి జీవిత గాథ తెలుసుకోవడం, వారి జీవిత విషయాలు తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము అన్నటువంటి ఒక ప్రశ్న మీరు అడగవచ్చు. అయితే సమాధానం చాలా శ్రద్ధగా వినండి. ఈ సమాధానం నేను నా ఇష్టంతో, నేను నా ఆలోచనతో చెప్పేది కాదు. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మిత్రులలో, సహాబాలలో ఒక గొప్ప సహాబీ. ఆయన తెలుపుతున్నారు. ఏమన్నారు ఆయన?
“అల్లాహు తాలా మానవుల హృదయాల పట్ల దృష్టి వేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయాన్ని అందరి హృదయాల కంటే ఎంతో ఉత్తమంగా చూశాడు. ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆ తర్వాత, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రజల హృదయాలను వెతికాడు, చూశాడు. సహాబాల హృదయాలను ఎంతో పరిశుద్ధంగా పొందాడు. అల్లాహ్ ఆ సహాబాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్నేహితులుగా, అండదండగా, వారికి వారి ఈ ప్రచార కార్యక్రమంలో దోహదపడేవారుగా ఎన్నుకున్నాడు“
ఈ సహాబాలు ఎంత గొప్పవారు, ఎంత గొప్ప శ్రేణికి చెందినవారు. అల్లాహు తాలా స్వయంగా ప్రళయ దినం వరకు సురక్షితంగా ఉండేటటువంటి సత్య గ్రంథం, దివ్య గ్రంథం ఖుర్ఆన్ లో వంద కంటే పైగా ఆయతులలో వారిని ప్రశంసించాడు. వారి యొక్క ఉన్నత గుణాలను ప్రస్తావించాడు. వారి యొక్క ఎన్నో మంచి విషయాలను ప్రళయం వరకు వచ్చే ప్రజలందరి కొరకు ఒక మంచి ఆదర్శంగా ఉంటాయని కూడా తెలిపాడు.
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన ఈ సహాబాలు, వారిని విశ్వసించడం మన విశ్వాసంలోని ఒక ముఖ్యమైన భాగం. మనం అల్లాహ్ ను విశ్వసిస్తున్నాము, అల్లాహ్ యొక్క ప్రవక్తలను, వారిలో ప్రత్యేకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తాము. ఇంకా విశ్వాసానికి సంబంధించిన ఏ ఏ విషయాలు ఉన్నాయో, వాటిలో ఒక ముఖ్యమైన విషయం సహాబాలను కూడా విశ్వసించడం.
హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు చెప్పిన ఒక విషయాన్ని గమనించండి,
أَبَرُّ هَذِهِ الْأُمَّةِ قُلُوبًا (అబర్రు హాదిహిల్ ఉమ్మతి ఖులూబా) సహాబాలు సర్వ విశ్వాసులలో, సర్వ విశ్వాసులలో అతి పరిశుద్ధమైన హృదయాలు గలవారు.
وَأَعْمَقُهَا عِلْمًا (వ అ’మఖుహా ‘ఇల్మా) చాలా లోతుగల జ్ఞానం, విద్య గలవారు.
وَأَقَلُّهَا تَكَلُّفًا (వ అఖల్లుహా తకల్లుఫా) చాలా తక్కువగా వారు ఏదైనా పని చేయడంలో వారి నుండి కావాలని ఏదీ పొరపాటు జరిగేది కాదు మరియు కావాలని ఎలాంటి బాధలలో చిక్కుకునే ప్రయత్నం చేసేవారు కారు.
وَأَحْسَنُهَا حَالًا (వ అహ్సనుహా హాలా) అందరికంటే ఉత్తమ స్థితిలో జీవితం గడిపేవారు.
اخْتَارَهُمُ اللَّهُ لِصُحْبَةِ نَبِيِّهِ وَلِإِقَامَةِ دِينِهِ (ఇఖ్తారహుముల్లాహు లిసుహబతి నబియ్యిహి వలి ఇఖామతి దీనిహి) అల్లాహు తాలా వారిని తన ప్రవక్తకు స్నేహితులుగా ఎన్నుకున్నాడు మరియు తన ఈ ధర్మాన్ని స్థాపించబడటానికి వారిని ఎన్నుకున్నాడు
గమనించారా? అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కాలో ఉండగానే విశ్వసించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జీవితం గడిపారు. తొలి రోజుల్లో ఇస్లాం స్వీకరించిన సహాబాలను చూశారు. మదీనా వలస వచ్చిన తర్వాత సహాబాలను చూశారు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చివరి దశలో ఇస్లాం స్వీకరించిన వారిని కూడా చూశారు. అయితే గమనించండి, వారు సహాబాల గురించి ఎంత గొప్ప విషయం తెలిపారు.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ ప్రవక్త. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కొరుకుడు పడనివారు. ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు. దైవకృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగపడటాన్ని నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖారవిందాలపై తొణకిస లాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది. ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు. (48:29)
గమనించండి, ఈ రోజుల్లో ఎవరైతే సహాబాలను అగౌరవపరుస్తున్నారో, సహాబాలలో ఏ ఒక్కరి ప్రస్తావన వచ్చినా వారి పట్ల అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారో, ఒకసారి ఈ ఖుర్ఆన్ ఆయత్ ల పట్ల శ్రద్ధ వహించాలి. అల్లాహ్ వారిని ప్రశంసిస్తున్నాడు. వారిలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలను ప్రస్తావిస్తున్నాడు. వారి యొక్క ఈ ఉత్తమ గుణాలు కేవలం ఖుర్ఆన్ లోనే కాదు, ఖుర్ఆన్ కంటే ముందు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో తౌరాత్ మరియు ఇంజీల్, వాటిలో కూడా వీరి ఉత్తమ గుణాలు ఉన్నాయి అని స్వయంగా అల్లాహ్ సాక్ష్యం పలుకుతున్నాడో, అలాంటి వారిని మనం దూషించడం, అలాంటి వారి గురించి మనం చెడుగా ఆలోచించడం, అలాంటి వారి పట్ల మనం ఏదైనా దుర్భాషలాడటం, ఇది మన విశ్వాసంలో కొరత, మన విశ్వాసానికి చాలా భయంకరమైన ముప్పు కలుగజేస్తుంది.
అల్లాహ్ తాలా వారిని ప్రశంసిస్తూ ఇస్లాం మరియు ఇస్లాం స్వీకరించిన వారి పట్ల ఎంత మృదువుగా, ఎంత ఆప్యాయతతో, కరుణా కటాక్షాలతో వారు జీవితం గడుపుతారంటే, అవిశ్వాసానికి సంబంధించిన విషయాలు మరియు సత్య ధర్మమైన ఇస్లాంకు వ్యతిరేకమున్న విషయాలు వారికి ఏమాత్రం ఇష్టం ఉండవు. నీవు వారిని రుకూ చేస్తూ, సజ్దా చేస్తూ చూస్తూ ఉంటావు. వారు అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని, అల్లాహ్ యొక్క సంతృప్తిని కోరుతూ ఉంటారు. మరియు వారి యొక్క సజ్దా గుర్తులు, చిహ్నాలు వారి ముఖాలపై ఎంతో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమన్నాడో గమనించండి అల్లాహు తాలా,
ఇదంతా వారి గురించి ప్రస్తావించి, ప్రశంసించి, “వారి ఈ ఉపమానం తౌరాతులో ఉంది.” ఈ ఉదాహరణలు, ఈ పోలికలు, ఈ ఉత్తమ గుణాలు వారి గురించి ఏవైతే ప్రస్తావించబడ్డాయో, ఇవన్నీ కూడా తౌరాతులలో కూడా ఉన్నాయి. అంటే వీరి గుణాలు ఇలా ఉంటాయి, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తారో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క ఈ ఉత్తమ గుణాలు అని తౌరాత్ లో ప్రస్తావన వచ్చి ఉంది. అంతే కాదు, ఇంజీల్ లో ఎలా ఉంది?
“ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు“.” (48:29)
సహాబాలను దూషించడంపై ప్రవక్త హెచ్చరిక
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో స్పష్టంగా తెలిపారు:
لَا تَسُبُّوا أَصْحَابِي (లా తసుబ్బూ అస్ హాబీ) నా సహాబాలను మీరు దూషించకండి.
అంతేకాదు, వారి యొక్క స్థానం ఎంత గొప్పదో అది కూడా ఇదే హదీసులో తెలియబరిచారు. అదేమిటి?
“లవ్ అన్ఫఖ అహదు మిన్కుమ్ మిస్ల ఉహుదిన్ జహబా, మా బలగ ముద్ద అహదిహిమ్ వలా నసీఫహు.” మీలో ఎవరైనా ఉహద్ పర్వతం ఎంత పెద్దగా ఉందో అంత బంగారం అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసినా, సహాబాలు సామాన్యంగా ఏదైనా విషయం, ఏదైనా వస్తువు, వారు ఒక ముప్పావు కిలో, 600 గ్రాములు, లేదా 300 గ్రాముల వరకు ఏదైతే ఖర్చు పెట్టారో దానికి సమానం కూడా కాజాలదు. అల్లాహు అక్బర్.
గమనించండి సోదరులారా. ఉహద్ పర్వతం ఎంత పెద్దదో తెలుసా? ఇంచుమించు 7 నుండి 8 కిలోమీటర్ల పొడవు, 2 నుండి 3 కిలోమీటర్ల వెడల్పు మరియు 700 మీటర్ల ఎత్తు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీలో ఎవరైనా ఉహద్ పర్వతం అంత బంగారం ఖర్చు పెట్టినా, సహాబాలు ఒక 300 గ్రాముల వరకు లేదా ఒక 600, 650 గ్రాముల వరకు ఏదైనా వస్తువు ఖర్చు పెట్టి ఉంటే, మీ ఈ ఉహద్ పర్వతం లాంటి బంగారం అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం సహాబాలు చేసిన ఈ పుణ్యానికి, దానానికి సమానంగా కాజాలదు. సహాబాల స్థానంలో, మీ స్థానంలో ఇంత పెద్ద గొప్ప వ్యత్యాసం ఉంది. మీరు ఏ నోట వారిని దూషిస్తారు? ఏ నోట వారిని మీరు చెడుగా ప్రస్తావిస్తారు?
సహాబాల పట్ల మన హక్కులు మరియు బాధ్యతలు
మొదటి హక్కు సహాబాల గురించి మనపై ఉన్నది ఏమిటి? అల్లాహు తాలా లేదా చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఏ ఘనతలు తెలిపారో వాటిని నమ్మడం. వారిలో ఎంతో గొప్ప స్థానంలో, వారి స్థానాల్లో హెచ్చుతగ్గులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మొట్టమొదటి స్థానంలో హజ్రత్ అబూబకర్, రెండవ స్థానంలో హజ్రత్ ఉమర్, మూడవ స్థానంలో హజ్రత్ ఉస్మాన్, నాలుగో స్థానంలో హజ్రత్ అలీ రదియల్లాహు అన్హుమ్ వరద్వు అన్. ఇక ఈ నలుగురి తర్వాత, ఇహలోకంలో ఏ పది మంది గురించైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చారో వారిలో ఈ నలుగురు వస్తారు, మిగిలిన ఆరుగురు, ఆ తర్వాత బద్ర్ లో పాల్గొన్నవారు. కానీ మొట్టమొదటి హక్కు ఏమిటి? ఎవరి గురించి ఏ ఏ ఘనతలు ఖుర్ఆన్ లో లేదా హదీసుల్లో వచ్చి ఉన్నాయో వాటిని మనం నమ్మాలి. వాటిలో ఏ ఒక్కటిని కూడా తిరస్కరించకూడదు.
ఎందుకో తెలుసా? ఉదాహరణకు, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఘనతలో ఖుర్ఆన్ లో కొన్ని ఆయతులు అవతరింపజేయబడ్డాయి. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో హదీసుల్లో ఆయన గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. వాటిలో ఏ ఒక్కటినీ కూడా మనం తిరస్కరిస్తే, ఇందులో అబూబకర్ స్థానంలో ఏ కొరత ఏర్పడదు. కానీ మనం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటలు తిరస్కరించిన వారిలో, అల్లాహ్ యొక్క ఆయతులను తిరస్కరించిన వారిలో అయిపోతాము. ఎప్పుడైతే మనం వారికి ఏ స్థానం ఇవ్వబడినదో దానిని మనం విశ్వసిస్తున్నామో, నమ్ముతున్నామో, అక్కడే వారిలోని ఏ ఒక్కరి పట్ల కూడా మన మనసులో ఏ కీడు కానీ, ఏ కపటం గానీ, ఎలాంటి దోషం కానీ ఉండకూడదు. మన హృదయంలో ఎలాంటి కపటము, ద్వేషము, జిగస్సు ఏదీ కూడా ఉండకూడదు. మన హృదయం వారి గురించి ఎంతో తేటతెల్లగా, స్పష్టంగా ఉండాలి. ఎలాంటి కీడు లేకుండా ఉండాలి.
“ఎవరైతే విశ్వాస స్త్రీ పురుషులను వారి ఏ పాపం లేకుండా, ఏ కారణం లేకుండా వారిని బాధ పెడతారో, వారికి హాని కలుగజేస్తారో, వారు చాలా భయంకరమైన పాపాన్ని మరియు ఒక భయంకరమైన అపనిందను, స్పష్టమైన పాపాన్ని తమ మెడకు కట్టుకున్నవారైపోతారు.“
అందు గురించి అలాంటి వారు భయపడాలి. ఇక్కడ సామాన్యంగా విశ్వాసుల పదం ఏదైతే వచ్చిందో, ఎవరో విశ్వాసులని అనుకోకండి. విశ్వాసుల్లో మొట్టమొదటి స్థానంలో సహాబాలు వస్తారు అన్న విషయం మరవకండి.
కాలాల్లో ఉత్తమమైన కాలం
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? సహీ బుఖారీ, సహీ ముస్లిం ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో ఈ హదీస్ ఉంది:
خَيْرُ النَّاسِ قَرْنِي ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ (ఖైరున్నాసి ఖర్నీ, సుమ్మల్లజీన యలూనహుమ్, సుమ్మల్లజీన యలూనహుమ్) అన్ని కాలాల్లో అతి ఉత్తమమైన కాలం నాది, మళ్లీ ఆ తర్వాత వచ్చే కాలం, మళ్లీ ఆ తర్వాత వచ్చే కాలం.
అల్లాహు అక్బర్. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఆ కాలాన్ని అన్ని కాలాల్లో అతి శ్రేష్టమైనదని తెలుపుతున్నారు. ఎందుకు? ఎందుకంటే ప్రజలు తిరస్కరించినప్పుడు ఈ సహాబాలు ఇస్లాంను స్వీకరించారు, విశ్వాస మార్గాన్ని అవలంబించారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వదిలేశారో, చివరికి స్వయంగా వారి కుటుంబంలోని కొందరు, అప్పుడు ఈ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చేరువుగా అయ్యారు, దగ్గరగా అయ్యారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ ఇంటి నుండి వెళ్లగొట్టారో, అప్పుడు ఈ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహాయమందజేసి, తమకు దగ్గరగా తీసుకున్నారు. ఈ విధంగా ఇస్లాం పట్ల సహాబాల త్యాగాలు ఇంతా అంతా కావు, ఎంతో గొప్పమైనవి.
సలఫె సాలెహీన్ మరియు సహాబాల గౌరవం
మన సలఫె సాలెహీన్ రహిమహుముల్లాహ్ సహాబాలను ఎలా గౌరవించేవారు? సహాబాల గురించి వారి యొక్క విశ్వాసం, వారి యొక్క ప్రేమ, వారి యొక్క గౌరవ మర్యాదలు ఎలా ఉండేవి? వాటిని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము.
హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు, హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు గారి యొక్క కుమారుడు. ఒక సందర్భంలో అతను తెలిపాడు, “ప్రజలారా, సహాబాలను దూషించకండి. సహాబాలు కొంతసేపు, ఒక చిన్నపాటి గడియ, వారు ఏదైతే అల్లాహ్ ఆరాధనలో గడిపారో, మీరు మీ జీవితాంతం చేసే మీ ఆరాధన వారి ఆ గడియపాటు ఆరాధనకు చేరుకోదు.” వారి స్థానం అంత గొప్పది కనుక మీరు వారిని దూషించకండి.
అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ రహిమహుల్లాహ్, చాలా గొప్ప ముహద్దిస్, ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చాడు. వచ్చి, ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ఎక్కువ ఘనత గలవారా, లేకుంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజా అని ప్రశ్నించాడు. అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ ఏం సమాధానం చెప్పారు? దానికంటే ముందు ఒక విషయం తెలుసుకోండి. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ సహాబీ కాదు, తాబియీన్లలో వస్తారు. ఆయన చాలా ఉత్తమమైన వారు, ఆయన ఒక ఖలీఫా, వారిని ఐదవ ఖలీఫా అని అంటారు. కానీ ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ఆయనకు ఎన్నో ఘనతలు ఉన్నాయి. అట్టి ముఖ్యమైన ఘనత ఏమిటి? సహాబీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ కళ్లారా చూశారు, విశ్వసించారు, విశ్వాస స్థితిలో మరణించారు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఏ వహీ వచ్చేదో దానిని రాసేవారు ఏ సహాబాలైతే ఉన్నారో, కాతిబీనె వహీ, వారిలో ఒకరు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బావమరిది. అంటే, హజ్రత్ అమీరె ముఆవియా రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క సోదరి ఉమ్మె హబీబా రదియల్లాహు తాలా అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర భార్య. విశ్వాసం మరియు సహాబీ కావడం తో పాటు ఇన్ని రకాల ఇంకా మరెన్నో ఘనతలు కూడా ఉన్నాయి. అయితే అతి ముఖ్యమైన విషయం అతను సహాబీ. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చాలా ఉత్తమమైన వారు కానీ సహాబీ కాదు.
అయితే ఒక వ్యక్తి వచ్చి ఏమడుగుతున్నాడు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ తో? అమీరె ముఆవియా ఎక్కువ ఘనత గలవారా లేకుంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఎక్కువ ఘనత గలవారా? అప్పుడు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ రహిమతుల్లాహి అలైహి చెప్పారు, “ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉండగా, ఆయన ముక్కులో పోయినటువంటి దుమ్ము, ధూళి, దాని స్థానానికి కూడా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చేరుకోడు, నీవేం మాట్లాడుతున్నావు?”
అల్లాహు అక్బర్. ఇక్కడ గమనించండి, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమతుల్లాహి అలైహి గారికి ఉన్న ఘనత, వారికి ఉన్న విద్య, ఆయన ఒక ఖలీఫా, ఆ విషయాల్లో మనం ఏ కొరత చూపి ఆయన్ని అవమానించడం కాదు. సహాబాల ఘనత ఎంత గొప్పదో అది తెలియజేస్తున్నాము. ఇది మనమే కాదు, మనకంటే ముందు పూర్వీకులు సలఫె సాలెహీన్ రహిమహుల్లాహ్, వారిలో అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ ఎలాంటి ముహద్దిస్ అంటే, ఎందరో ముహద్దిసులు చెప్పారు, ఈయనపై ఎలాంటి దోషం లేని, జరహ్ లేని ముహద్దిస్ అని.
సహాబాల యొక్క స్థానం, వారి యొక్క ఘనత విషయంలో సహీ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
اللَّهَ اللَّهَ فِي أَصْحَابِي ، اللَّهَ اللَّهَ فِي أَصْحَابِي (అల్లాహ అల్లాహ ఫీ అస్హాబీ, అల్లాహ అల్లాహ ఫీ అస్హాబీ) “నా సహాబాల ప్రస్తావన వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను, మీరు అల్లాహ్ తో భయపడండి. నా సహాబాల ప్రస్తావన వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను, మీరు అల్లాహ్ తో భయపడండి.“
ఆ తర్వాత చెప్పారు, “మీరు వారిలో ఏ ఒక్కరిని కూడా తమ మనోవాంఛల కొరకు, తమ మనసులోని చెడు కోరికల కొరకు ఒక సాకుగా తీసుకోకండి”
فَمَنْ أَحَبَّهُمْ فَبِحُبِّي أَحَبَّهُمْ، وَمَنْ أَبْغَضَهُمْ فَبِبُغْضِي أَبْغَضَهُمْ (ఫమన్ అహబ్బహుమ్ ఫబిహుబ్బీ అహబ్బహుమ్, వమన్ అబ్గదహుమ్ ఫబిబుగ్దీ అబ్గదహుమ్) “ఎవరైతే వారి పట్ల ప్రేమగా ఉంటాడో అతడు నా పట్ల ప్రేమగా ఉన్నట్లు. మరియు ఎవరైతే వారి పట్ల ద్వేషంగా ఉంటాడో, అతడు నా పట్ల ద్వేషంగా ఉన్నట్లు“
وَمَنْ آذَاهُمْ فَقَدْ آذَانِي، وَمَنْ آذَانِي فَقَدْ آذَى اللَّهَ، وَمَنْ آذَى اللَّهَ يُوشِكُ أَنْ يَأْخُذَهُ (వమన్ ఆదాహుమ్ ఫఖద్ ఆదానీ, వమన్ ఆదానీ ఫఖద్ ఆదల్లాహ తబారక వ తాలా) “ఎవరైతే నా సహాబాలను హాని కలిగించాడో, వారికి కీడు కలుగజేశాడో, అతడు నాకు కీడు కలుగజేసినట్లు, నాకు బాధ కలుగజేసినట్లు. మరి ఎవరైతే నన్ను బాధ పెట్టాడో, అతడు అల్లాహ్ ను బాధ పెట్టినవాడవుతాడు.“
గమనించారా? సహాబాల యొక్క స్థానం ఎంత గొప్పగా ఉందో? వారిని ప్రేమించడం, వారి పట్ల ద్వేషంగా ఉండకుండా ప్రేమగా ఉండడం ఎంత ముఖ్యమో మన జీవితంలో, అర్థమవుతుంది కదా ఈ హదీసుల ద్వారా?
మరొక హదీస్, హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు దీనిని:
مَنْ سَبَّ أَصْحَابِي فَعَلَيْهِ لَعْنَةُ اللَّهِ وَالْمَلائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ (మన్ సబ్బ అస్హాబీ ఫఅలైహి ల’నతుల్లాహి వల్ మలాఇకతి వన్నాసి అజ్మయీన్) ఎవరైతే నా సహాబాలను దూషిస్తాడో, అతనిపై అల్లాహ్ యొక్క శాపం, దైవదూతల శాపం మరియు సర్వ ప్రజల యొక్క శాపం పడుగాక.
సహాబాలను దూషించడంపై ఇస్లామీయ పండితుల అభిప్రాయం
ఇమామ్ అహ్మద్ రహిమతుల్లాహి అలైహి, నాలుగు ఇమాములలో ఒక గొప్ప ఇమాం కదా. ఆయన ఏమన్నారో తెలుసా? సహాబాల విషయంలో, “నీవు ఎప్పుడైనా ఏదైనా వ్యక్తిని చూశావు, అతడు సహాబాలలో ఏ ఒక్కరినైనా దూషిస్తున్నాడు అంటే, అతడు నిజమైన ముస్లిమో కాదో అని శంకించవలసి వస్తుంది, అనుమాన పడే అటువంటి పరిస్థితి వస్తుంది.”
ఇలాంటి మాట ఎందుకు చెప్పారు ఇమామ్ అహ్మద్ రహిమతుల్లాహి అలైహి? ఎందుకంటే నిజమైన ముస్లిం, ఖుర్ఆన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ హదీసుల జ్ఞానం ఉన్న ముస్లిం, ఏ సహాబీని కూడా దూషించడు.
ఇంకా మరో సందర్భంలో హజ్రత్ ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్ తెలిపారు, “ఏ వ్యక్తికి కూడా సహాబాలను దూషించడం దూరం, సహాబాలను అగౌరవంగా ప్రస్తావించడం కూడా తగదు. ఎవరైనా అలా చేశాడంటే ఆ వ్యక్తి కాలంలో, ఆ వ్యక్తి ఉన్నచోట ఏ ముస్లిం నాయకుడు ఉన్నాడో అతడు అలాంటి వ్యక్తికి శిక్ష ఇవ్వాలి. ఎందుకంటే సహాబాలను దూషించడం ఇది చిన్నపాటి పాపం కాదు, ఘోర పాపాల్లో లెక్కించబడుతుంది“
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ప్రళయ దినం యొక్క భయంకరమైన స్వభావం, దాని అనివార్యత మరియు దాని రాకకు ముందు అల్లాహ్ తన కారుణ్యంతో పంపిన సూచనల గురించి వివరించబడింది. ఈ సూచనలు మూడు రకాలుగా విభజించబడ్డాయి: ఇప్పటికే జరిగిపోయినవి (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాక), ప్రస్తుతం జరుగుతూ పెరుగుతున్నవి (అజ్ఞానం మరియు అనైతికత పెరగడం), మరియు ప్రళయానికి అతి సమీపంలో సంభవించే పది పెద్ద సూచనలు. ముఖ్యంగా దజ్జాల్ యొక్క ఫితనా (సంక్షోభం) మరియు దాని నుండి రక్షణ పొందే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టబడింది. ఈ సూచనల గురించిన జ్ఞానం, విశ్వాసులు తమ విశ్వాసాన్ని పటిష్టం చేసుకోవడానికి, సత్కార్యాల వైపు పయనించడానికి మరియు చెడుకు దూరంగా ఉండటానికి ఒక హెచ్చరిక అని వక్త ఉద్బోధించారు.
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.
మా సోదరులారా! ప్రళయదినం మరియు దాని యొక్క సూచనల గురించి కొన్ని విషయాలు ఈ రోజు మనం ఇన్ షా అల్లాహ్ తెలుసుకుందాం.
ప్రళయదిన భయంకరత
ప్రళయదిన విషయం అనేది చాలా భయంకరమైనది. ఎంత భయంకరమైనదంటే దాన్ని మనం ఊహించలేము ఇప్పుడు. దాని గురించి అల్లాహ్ త’ఆలా సూరె హజ్ లో ఆరంభంలోనే ఒక ఆయత్ లో మూడు విషయాలు తెలిపాడు. ఏ రోజైతే ప్రళయం సంభవిస్తుందో, ఆ రోజు:
ఆనాడు మీరు దాన్ని చూస్తారు… పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. (22:2)
يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّآ اَرْضَعَتْ (యౌమ తరౌనహా తద్’హలు కుల్లు ముర్దిఅతిన్ అమ్మా అర్దఅత్) ఆ రోజు పాలు త్రాపించే తల్లి, పాలు త్రాగే తన పిల్లను మరిచిపోతుంది.
రెండో విషయం చెప్పాడు:
وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا (వ తదఉ కుల్లు దాతి హమ్లిన్ హమ్లహా) ప్రతి గర్భిణీ యొక్క గర్భం పడిపోతుంది
మూడో విషయం చెప్పాడు.
وَتَرَى النَّاسَ سُكَارٰى (వ తరన్ నాస సుకారా) జనులు ఆ రోజు, ప్రజలు ఆ రోజు మత్తులో ఉంటారు.
وَمَا هُمْ بِسُكَارٰى (వమా హుమ్ బిసుకారా) కాని నిజానికి వారు మత్తులో ఉండరు. (22:2)
ఆ మత్తులో ఉండడం అనేది ఏదో మత్తుపదార్థం సేవించినందుకు కాదు.
وَلٰكِنَّ عَذَابَ اللّٰهِ شَدِيْدٌ (వలాకిన్న అదాబల్లాహి షదీద్) ఆనాటి అల్లాహ్ యొక్క శిక్ష అనేది చాలా కఠినమైనది. అందుగురించి ప్రళయం సంభవించే రోజు ఇలాంటి పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటారు.
మన చావు వచ్చింది అంటే మన ప్రళయం వచ్చేసింది అన్నట్లే
ఆ రోజు రాకముందే విశ్వాసులు సిద్ధమవడం, సత్కార్యాలు ముందుకు పంపుకోవడం, విశ్వాస మార్గాన్ని అవలంబించి ప్రజలందరూ కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ వైపునకు మరలడం తప్పనిసరి. అయితే ప్రళయం అనేది ఈ ప్రపంచమంతా, విశ్వమంతా నాశనమైన రోజు సంభవిస్తుంది. ఆ రోజు వరకు మనం బ్రతికి ఉంటామో లేదో తెలియదు. కానీ ఏ రోజైతే మనకు మన చావు వస్తుందో, ఆ రోజు మన ప్రళయం మనపై సంభవించినట్లే. మనం ఎప్పుడుచనిపోతామో, రేపో మాపో తెలుసా మనకు? తెలియదు. అయితే మనం, మన చావు వచ్చింది అంటే మన ప్రళయం వచ్చేసింది అన్నట్లే. ఆ ప్రళయం గురించి మనం వేచించి ఉండవలసిన అవసరం లేదు. అందుగురించే ఆ ప్రళయ విషయం వచ్చినప్పుడు మనలో ఒక భయం ఏర్పడినప్పుడు మనం సత్కార్యాల వైపునకు ముందుకు వెళ్ళాలి, విశ్వాస మార్గాన్ని బలంగా పట్టుకోవాలి. అప్పుడే మనకు ఇహలోకంతో పాటు పరలోకంలో కూడా మోక్షం అనేది ప్రాప్తమవుతుంది.
ప్రళయ దినం సూచనలు
అయితే అల్లాహ్ యొక్క దయ మనపై చాలా ఉంది గనక, ఎల్లప్పుడూ మన మేలు కోరేవాడే గనక, ఆ ప్రళయానికి ముందు ఎన్నో సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు సంభవించినప్పుడల్లా మనిషి ప్రళయాన్ని గుర్తు చేసుకోవాలి. మరియు ఆ ప్రళయ రోజు, ప్రళయ దినాన తాను సాఫల్యం పొందిన వారిలో చేరకోవాలి అని తనకు తాను సిద్ధపడుటకు అల్లాహ్ త’ఆలా అలాంటి సూచనలు పంపిస్తూ ఉంటాడు.
ఖుర్ఆన్ లో అల్లాహ్ చెప్పాడు:
فَهَلْ يَنْظُرُوْنَ اِلَّا السَّاعَةَ اَنْ تَأْتِيَهُمْ بَغْتَةً ۚ فَقَدْ جَاۤءَ اَشْرَاطُهَا (ఫహల్ యన్దురూన ఇల్లస్ సాఅత అన్ త’తియహుమ్ బగ్ తతన్, ఫఖద్ జా’అ అష్రాతుహా) ఏమిటీ, ప్రళయ ఘడియ హటాత్తుగా తమపైకి రావాలని వారు ఎదురు చూస్తున్నారా? నిస్సందేహంగా దానికి సంబంధించిన సూచనలు (ఇప్పటికే) వచ్చేశాయి. (47:18)
ఏమిటి? ప్రళయం గురించి వారు వేచి చూస్తూ ఉన్నారా? అది ఎప్పుడైనా ముందు నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏకాయెకిగా రావచ్చు. కానీ ఆ ప్రళయానికంటే ముందు దానికి సంబంధించిన సూచనలు వచ్చేసాయి.
اِقْتَرَبَتِ السَّاعَةُ وَانْشَقَّ الْقَمَرُ (ఇఖ్ తరబతిస్ సాఅతు వన్ షఖ్ ఖల్ ఖమర్) ప్రళయం సమీపించినది, చంద్రుడు రెండు ముక్కలయ్యాడు.(54:1)
ఇవన్నీ కూడా ప్రళయ సూచనల్లో.
అయితే సోదరులారా, ప్రళయం గురించి మనం సిద్ధపడడం, అది రాకముందే దాని గురించి మనం తయారీ చేయడం చాలా అవసరం. అయితే ప్రళయానికి ముందు ఏ సూచనలైతే రానున్నాయో, ఆ సూచనలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతో వివరంగా మనకు తెలిపారు. దానికి సంబంధించిన హదీసులన్నీ ఏవైతే వచ్చాయో, ఆ హదీసులు, పండితులు ఆ సూచనలన్నిటినీ మూడు రకాలుగా విభజించారు.
ప్రళయ సూచనలు మరియు వాటి రకాలు
ఒకటి, కొన్ని సూచనలు వచ్చేసాయి, సమాప్తమైపోయాయి. మరియు కొన్ని రెండో రకమైన సూచనలు, ఆ సూచనలు రావడం మొదలైంది, అది ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మూడో రకమైన సూచనలు ఏమిటంటే, ఆ మూడో రకమైన సూచనలు ప్రళయానికి మరీ దగ్గరగా వస్తాయి, అవి చాలా పెద్ద సూచనలు. అవి రావడం మొదలైంది అంటే ఒకటి వెనుక మరొకటి వస్తూనే పోతాయి. అందులో ఎలాంటి మధ్యలో గ్యాప్ అనేది ఉండదు.
మొదటి రకం, సూచనలు మొదలై సమాప్తం కూడా అయినవి:
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా నియమింపబడి పంపబడడం. ప్రవక్తను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా పంపడం అనేది ప్రళయ సూచనల్లో ఒకటి అని కూడా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చావు, ఆయన ఈ లోకాన్ని వీడిపోవడం కూడా ప్రళయ సూచనల్లో ఒకటి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు:
بُعِثْتُ أَنَا وَالسَّاعَةُ كَهَاتَيْنِ (బుఇస్తు అన వస్సాఅతు కహాతైన్) నేను మరియు ప్రళయ ఘడియ ఈ రెండు వేళ్ళ వలే (దగ్గరగా) పంపబడ్డాము.
అంటే మా మధ్యలో ఎక్కువ సమయం లేదు అని భావం. కానీ ఆ సమయం అనేది మన అంచనా ప్రకారంగా కాదు, అల్లాహ్ యొక్క జ్ఞాన ప్రకారంగా.
ప్రళయ సూచనల్లో రెండో రకమైన సూచనలు, మొదలైపోయినాయి మరియు ఇంకా పెరుగుతూనే పోతున్నాయి.
ఉదాహరణకు, వాటి గురించి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ హదీస్ సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది. దాని కొంత భాగం బుఖారీలో కూడా ఉంది.
ఒకసారి జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇస్లాం అంటే ఏమిటి? ఈమాన్ అంటే ఏమిటి? మరియు ఇహ్సాన్ అంటే ఏమిటి? అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానికి సమాధానం చెప్పారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అడిగారు. ప్రళయం ఎప్పుడు వస్తుందో అనేది నాకు తెలియదు అని ప్రవక్త గారు చెప్పారు. అయితే దాని యొక్క సూచనలు ఏవైనా చెప్పండి అని జిబ్రీల్ అడిగినప్పుడు, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు:
أَنْ تَلِدَ الْأَمَةُ رَبَّتَهَا (అన్ తలిదల్ అమతు రబ్బతహా) బానిస స్త్రీ తన యజమానురాలికి జన్మనివ్వడం.
మరియు రెండో సూచన ప్రవక్త వారు చెప్పారు, ఒంటిపై గుడ్డ లేనటువంటి వాళ్ళు, కాళ్ళల్లో చెప్పులు లేనటువంటి వాళ్ళు మరియు తిందామంటే టైం కు తిండి దొరకనటువంటి పేదవాళ్ళు, ఎంత ధనం వాళ్ళ చేతుల్లో వచ్చేస్తుందంటే, పెద్ద పెద్ద బిల్డింగులు వాళ్ళు కడతారు.
ఇంకా బుఖారీ ముస్లిం లో మరొక హదీస్ వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయానికి కంటే ముందు కొన్ని సూచనలు సంభవిస్తాయి. విద్య, ధర్మజ్ఞానం అనేది లేపబడుతుంది. అజ్ఞానం పెరిగిపోతుంది. ప్రజలు మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు సేవించడం అధికమైపోతుంది. మరియు వ్యభిచారం కూడా చాలా పెరిగిపోతుంది.
మరొక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయానికి ముందు కొన్ని సూచనలు ఉన్నాయి: అశ్లీలత అనేది ఎక్కువైపోతుంది. ప్రజలు తమ బంధుత్వాన్ని తెంచుకుంటూ ఉంటారు, కలుపుకోవడానికి బదులుగా. మరి ఎవరైతే అమానత్, ఏ విషయమైనా గానీ, నమ్మి ఒకరిని ఏదైనా అతని దగ్గర పెడితే, అలాంటి అమానతులు కాజేసుకునే వాళ్ళు అయిపోతారు. మరి ఎవరైతే మోసం చేసే వాళ్ళు ఉన్నారో, అమానత్ లో ఖియానత్ చేసే వారు ఉన్నారో, అలాంటి వారిని చాలా విశ్వసనీయులు, అమానతులు పాటించే వాళ్ళు అని భావించడం జరుగుతుంది.
ఈ విధంగా ఇంకా ఎన్నో సూచనలు హదీసులో వచ్చి ఉన్నాయి. ఒక సందర్భంలో ఒక గ్రామీణుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, “ప్రవక్తా, ప్రళయం ఎప్పుడు ఉన్నది? దానికి సూచనలు ఏమిటి?” అని అడిగాడు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయం, దానికి సూచన ఏమిటంటే, ఎప్పుడైతే అమానత్, అమానత్ గా ఉండకుండా దాన్ని కాజేసుకోవడం జరుగుతుందో, ఒకరిని విశ్వసనీయుడు, చాలా నమ్మకస్తుడు అని అతని వద్ద ఏదైనా మాట, ఏదైనా వస్తువు పెడితే దానిలో మోసం చేస్తాడో, అప్పుడు నీవు ప్రళయం వస్తుంది అని వేచించు. అయితే అమానత్ లో ఖియానత్ అనేది ఎలా జరుగుతుంది అని ఆ వ్యక్తి అడిగినప్పుడు, ఏ హోదా, ఏ పని, ఏ తగిన మనిషికి ఇవ్వాలో అలా కాకుండా, దానికి అర్హులు లేని వారికి ఇవ్వడం జరుగుతుందో అప్పుడు నీవు ప్రళయం గురించి వేచించు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.
ఈ విధంగా సోదరులారా, ఇక్కడ ఒక విషయం చాలా మనం శ్రద్ధగా మనం గమనించాలి. అదేమిటంటే, ఈ రోజుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే, ఇక ప్రవక్త చెప్పారు గనక, ప్రవక్త మాటల్లో ఎప్పుడూ కూడా అబద్ధం ఉండదు, చెప్పింది జరిగి తీరుతుంది అని ఈ రకంగా కేవలం మనం ఆలోచించి ఉండకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయానికి ముందే సంభవించే సూచనల గురించి మనకు తెలుపుతున్నారు అంటే ఇది కూడా స్వయంగా ఆయన అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త, అల్లాహ్ యొక్క సత్యమైన నిజమైన సందేశ దూత అని భావం. ఎందుకు? ఆయన ఏ మాట కూడా తన ఇష్ట ప్రకారంగా తన నోటితో చెప్పేవారు కాదు.
وَمَا يَنْطِقُ عَنِ الْهَوٰى ۗ اِنْ هُوَ اِلَّا وَحْيٌ يُّوْحٰى (వమా యన్తిఖు అనిల్ హవా. ఇన్ హువ ఇల్లా వహ్యుయ్యూహా) అతను తన మనోవాంఛల ప్రకారం మాట్లాడడు. అది పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు. (53:3-4)
ఏదో ముందుకు జరగబోయే విషయాల గురించి ఏదైతే ప్రవక్త గారు చెప్తున్నారో, ఈ రోజుల్లో కొందరు అగోచర జ్ఞానం ఉన్నది, ఆ పండితుడు చాలా ఆరితేరినవాడు, అతను చాలా గొప్పవాడు అని ఏదో పంచాంగం చెప్పినట్లుగా కొన్ని విషయాలు తెలుపుతూ ఉంటారు. ఇలాంటి మోసపూరితమైన మాటలు, నవూదుబిల్లా అస్తగ్ఫిరుల్లా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పేవారు కాదు. అలాంటి విషయాలు ప్రవక్త చెప్పేవారు కాదు. సూర నజ్మ్ లో అల్లాహ్ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన తన కోరికతో ఏదీ మాట్లాడడు. అల్లాహ్ ప్రవక్త గారి గురించి చెప్తున్నాడు, ప్రవక్త వారు తమ కోరికతో, తమ ఇష్టం వచ్చినట్లు ఏదంటే అది మాట్లాడడు. అల్లాహ్ అతని వైపునకు ఏ వహీ పంపుతాడో, ఏ దివ్యవాణి పంపుతాడో, దాని ప్రకారమే ప్రవక్త అల్లాహ్ పంపినటువంటి విషయాల్ని ఇతరులకు తెలియజేస్తాడు.
అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఈ సూచనలు ఎందుకు తెలిపారు? ఇందులో మంచి విషయాలు ఏవైతే కరువవుతాయో, ఏ మంచి విషయాలలో మనం కొరత చూస్తామో, ఆ మంచి చేయడానికి మనం ముందుగా ఉండాలి. ఉదాహరణకు, ప్రళయానికి ముందు ధర్మ విద్య లేపబడుతుంది. అంటే ఏంటి? అది ఎక్కడో ఇట్లా పెట్టి ఉంటది ఎవడో వచ్చి తీసుకుంటాడు అట్లా భావం కాదు. దీనికి రెండు భావాలు ఉన్నాయి. ఒకటి, ధర్మ పండితులు ఎవరైతే ఉన్నారో, వారి చావు అనేది ఎక్కువైపోతుంది. రెండో భావం, ప్రత్యేకంగా ముస్లింలు మరియు ఇతరుల హృదయాల్లో నుండి ధర్మ జ్ఞానం అవలంబించాలి అన్నటువంటి ప్రేమ అనేది తగ్గిపోతుంది.
ఇది ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి. ఇదిగో ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలా. ఇప్పుడు ఈ బండ ఎండల్లో 45-47 వరకు కూడా డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత చేరుకుంటుంది. అయినా గాని పని వదులుకుంటామా మనం? చెమటలు కారుతూ ఉంటాయి. శరీరం మండుతూ ఉంటుంది. కానీ ఎందుకు పని చేస్తాం? ఎందుకు ఆ కష్టాన్ని భరిస్తూ ఉంటాం? ఈ పట్టి కష్టపడితేనే ఈ చెమట మనది వస్తేనే, మనం కొంచెం ఓపిక వహిస్తేనే మనకు జీతం దొరుకుద్ది. అప్పుడే మనం మన కడుపు నింపగలుగుతాము, మన పిల్లల కడుపు నింపగలుగుతాము అని ఆలోచిస్తాం. ఇంతకంటే ఎక్కువ ఆలోచన మనకు కేవలం ఈ శరీరం గురించేనా? ఈ ఆత్మ గురించి వద్దా? ఈ ఆత్మ వీడి పోయింది అంటే ఈ శరీరం ఏదైనా లాభంలో ఉందా? తీసుకెళ్లి బొంద పెడతాం. తీసుకెళ్లి దఫన్ చేసేస్తాం. మట్టిలో అది కుళ్ళిపోతుంది. కానీ ఆత్మ మిగిలి ఉంటుంది. అల్లాహ్ త’ఆలా మరొక శరీరం ప్రసాదిస్తాడు. ఈ శరీరంలో కూడా ఒక వెన్నుముక బీజం ఉంటుంది, ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా రెండోసారి లేపినప్పుడు దాని ద్వారా మళ్ళీ లేపుతాడు.
అయితే, చెప్పే విషయం ఏంటి? ఈ కేవలం శరీరానికి ఎంత సుఖం మనం ఇవ్వదలుచుకుంటున్నామో, దాని గురించి ఎంత కష్టపడుతున్నామో, మనకు ఇష్టం లేని ఒక సత్కార్యం, మనకు ఇష్టం లేని విశ్వాసం, మనకు ఇష్టం లేని ఒక మంచి కార్యం, దాని వైపునకు కూడా మనం మనసును ఒప్పించి అయినా కానీ ముందడుగు వెయ్యాలి.
ఇంకా కొన్ని సూచనలు మనం విన్నాం. ఏంటవి? వ్యభిచారం అధికమైపోవడం. మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు సేవించడం అధికమైపోవడం. అశ్లీలత పెరిగిపోవడం. ఇలాంటి విషయాలు మనం విన్నప్పుడు ఏం చేయాలి? అరే ప్రవక్త చెప్పిండు కదా ఎట్లైనా అయిపోతది అని మనం కూడా దాంట్లో పాల్గొనాలా? కాదు. ప్రవక్త ఈ వార్త మనకు ఇస్తున్నారు అంటే, తమ పరలోకాన్ని సాఫల్యం చేసుకోగోరే వారు, ప్రళయ దినాన తమకు నరకం నుండి మోక్షం కలగాలి, ప్రళయ దినాన వచ్చే కష్టాలన్నీ కూడా దూరం కావాలి అని కోరుకునేవారు ఇహలోకంలో సంభవించే ఈ చెడులకు దూరం ఉండండి. ఏ మంచి విషయాలు తగ్గుతాయి అని తెలుస్తుందో, దాన్ని మనం చేయడానికి ముందడుగు వెయ్యాలి. ఏ చెడు పెరుగుతుంది అని మనకు తెలుస్తుందో, దానికి మనం దూరం ఉండాలి. ఇది అసలు కారణం చెప్పడానికి.
పెద్ద సూచనలు
మరి సోదరులారా, ప్రళయం సంభవించేకి ముందు మూడవ రకమైన సూచనలు ఏవైతే సంభవిస్తాయో, అవి చాలా పెద్ద సూచనలు, చాలా ఘోరమైనవి. ఒక సందర్భంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు, అప్పటికి సహాబాలు, ప్రవక్త గారిని విశ్వసించిన సహచరులు ప్రళయం గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. “మీరేం చర్తించుకుంటున్నారు? ఏ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు? పరస్పరం ఏ విషయం మీద చర్చలు జరుగుతుంది?” అని ప్రవక్త గారు అడిగారు. వారు చెప్పారు, “మేము ప్రళయం గురించి పరస్పరం చర్చించుకుంటున్నాము.”
అప్పుడు ప్రవక్త గారు చెప్పారు,
إِنَّهَا لَنْ تَقُومَ حَتَّى تَرَوْنَ قَبْلَهَا عَشْرَ آيَاتٍ (ఇన్నహా లన్ తఖూమ హత్తా తరౌన ఖబ్లహా అష్ర ఆయాతిన్) నిశ్చయంగా, ప్రళయం, దానికంటే ముందు పది పెద్ద సూచనలు సంభవించే వరకు ప్రళయం రాదు.
ఏంటి ఆ పెద్ద సూచనలు?
అద్-దుఖాన్ (పొగ): ఒక చాలా విచిత్రమైన మరియు చాలా భయంకరమైన ఒక పొగ ఏర్పడుతుంది. దాని వివరణ మనం వివరంగా మరో సందర్భంలో తెలుసుకుందాము.
అద్-దజ్జాల్: దజ్జాల్ యొక్క రాక.
దాబ్బతుల్ అర్ద్: ఒక జంతువు వస్తుంది. మాట్లాడుతుంది. ఇతను విశ్వాసి, ఇతను అవిశ్వాసి అనేది చెప్తుంది.
సూర్యుడు పడమర నుండి ఉదయించడం: సూర్యుడు ప్రతిరోజు ఎటునుంచి ఉదయిస్తున్నాడు? తూర్పు నుండి. కానీ ప్రళయానికి సమీపంలో ఇటు పడమర వైపు నుండి ఉదయిస్తాడు.
ఈసా ఇబ్ను మర్యం రాక: యేసు క్రీస్తు, ఈసా అలైహిస్సలాం దిగి వస్తారు.
య’జూజ్ మరియు మ’జూజ్: ఒక జాతి, వారు బయటికి వెళ్తారు.
మూడు పెద్ద భూకంపాలు: ఒకటి తూర్పులో, మరొకటి పడమరలో, మరొకటి ఈ జజీరతుల్ అరబ్ (అరబ్ ద్వీపంలో). చాలా గాంభీర్యంగా భూమి క్రుంగిపోతుంది.
యమన్ నుండి ఒక అగ్ని: ఇందులో చివరి పెద్ద సూచన, యమన్ నుండి ఒక అగ్ని వెలుదేరుతుంది, అగ్ని వెళ్తుంది. ఆ అగ్ని వెళ్ళింది అంటే చాలా పెద్ద పెద్దగా ఉంటుంది. ప్రజల్ని నెట్టేసుకుంటూ వస్తుంది. ప్రజలు పరిగెడుతూ ఉంటారు. ఎక్కడ? షామ్ (సిరియా) వైపున. అది చివరి యొక్క పెద్ద సూచన అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.
అయితే ఈ పెద్ద సూచనలు ఒకటి తర్వాత మరొకటి, ఒకటి తర్వాత మరొకటి ఈ విధంగా మొదలై కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. వాటి మధ్యలో ఏ గ్యాప్ అనేది ఉండదు.
వీటన్నిటిలో అతి భయంకరమైనది దజ్జాల్ యొక్క సంక్షోభం, దజ్జాల్ యొక్క ఫితనా. దజ్జాల్ ఎవడు? అతడు ఒక మానవుడు, ఒక మనిషే. కానీ ప్రళయానికి ముందు అతడు వస్తాడు. అల్లాహ్ త’ఆలా అతనికి ఒక శక్తిని ఇస్తాడు. దాని మూలంగా అతడు ఎన్నో మహిమల పేరు మీద ప్రజలను మోసం చేసి, నేను మీ దేవుణ్ణి, నేను మీ అనారోగ్యులకు, రోగంతో ఉన్నవారికి స్వస్థత ప్రసాదించేవాణ్ణి, మీలో కష్టంలో ఉన్నవారికి సుఖం ఇచ్చేవాణ్ణి, నేను మీ యొక్క ప్రభువుని అని తనకు తాను చాటింపు చేసుకుంటాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే దజ్జాల్ బయలుదేరాడు అని వింటారో, అతనితోని ఎదుర్కోవడానికి, అతని ముందుకు వచ్చే ప్రయత్నం చేయొద్దు, దూరమే ఉండాలి. ఎందుకంటే ఆ సందర్భంలో ఒక విశ్వాసి నా విశ్వాసం చాలా బలంగా ఉంది, నేను ఎలాంటి మోసంలో పడను అని అనుకుంటాడు. కానీ వాడు ఎలాంటి మాయాజాలం చూపిస్తాడో, దానికి మోసపోయి తన విశ్వాసాన్ని కోల్పోతాడు. అతన్ని ప్రభువుగా నమ్మేస్తాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు:
“చూడండి ఇంతకముందు వచ్చిన ప్రవక్తలందరూ కూడా దజ్జాల్ గురించి హెచ్చరించారు. ఎందుకంటే ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం వచ్చే వరకు ఎన్ని ఫితనాలు, ఎన్ని సంక్షోభాలు, ఎన్ని ఇలాంటి ఉపద్రవాలు జరిస్తాయో, పుడతాయో, వాటన్నిటిలో అతిపెద్ద భయంకరమైన ఫితనా, ఉపద్రవం దజ్జాల్ యొక్క ఫితనా. అందుగురించే ప్రతి ప్రవక్త తమ జాతి వారికి అతని గురించి హెచ్చరించారు. నేను కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.
వినండి, అతను తనకు తాను ప్రభువుగా చాటింపు చేసుకుంటాడు. అయితే మీ ప్రభువు కేవలం అల్లాహ్ మాత్రమే. దజ్జాల్ ను మీరు గుర్తు పట్టాలంటే అతనికి రెండు కళ్ళు ఉండవు. ఒకే ఒక కన్ను ఉంటది, ఒంటి కన్ను అంటాం కదా. ఒకే కన్ను ఉంటుంది. ఆ ఒక కన్ను కూడా సామాన్య మనుషుల కన్నుల మాదిరిగా ఉండదు, బయటికి వచ్చి ఒక ద్రాక్ష పండు పెద్దది ఎలా ఉంటుందో ఆ విధంగా భయంకరంగా ఉంటుంది. మరియు అతని తల మీద, నుదుటి మీద ك ف ر (కాఫ్-ఫా-రా) కాఫిర్ అన్న పదం రాసి ఉంటుంది. చదివిన వాళ్ళు, చదవని వాళ్ళు, జ్ఞానులు, అజ్ఞానులు అందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతారు.
మరియు అతడు ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజలకు ఎన్నో మోసపెడుతూ వారిని నేను ప్రభువుగా నమ్మండి అని అంటూ ఉంటాడు. అయితే ప్రజల్ని నమ్మించడానికి ఒక సందర్భంలో అతనికి ఎలాంటి శక్తి లభిస్తుంది అంటే చాలా పెద్ద సంఖ్యలో అతని వెంట జనం ఉంటుంది. ఒక సందర్భంలో ప్రవక్త గారు చెప్పారు, అతన్ని అనుసరించే వారిలో స్త్రీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది అని. ఒక సందర్భంలో అతని వెంట చాలా పెద్ద జనం ఉంటుంది. అతడు ఆకాశాన్ని ఆదేశిస్తే వర్షం కురుస్తుంది. భూమిని ఆదేశిస్తే పంట వెళ్తుంది. చూడు, నేను ప్రభువును కాదా అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాడు.
ప్రజలు కొందరు నమ్మరు. ఆ సందర్భంలో ఒక వ్యక్తిని ముందుకు తీసుకువచ్చి నీ తల్లిదండ్రిని బ్రతికించి చూపించాలా అని అంటాడు. అయితే అతని వెంట షైతానులు ఉంటాయి. ఇద్దరు షైతానులు అతని యొక్క తల్లిదండ్రి యొక్క రూపంలో అతని ముందుకు వస్తారు. ఇలాంటి మోసం జరుగుద్ది మరియు అల్లాహ్ యొక్క ఎంత గొప్ప దయ మనపై గమనించండి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కూడా మొత్తం మన విశ్వాసంలో పడకుండా, విశ్వాసంపై స్థిరంగా ఉండడానికి అల్లాహ్ మనకు ప్రవక్త ద్వారా ఈ విషయాలు తెలియపరిచాడు. కానీ మన దురదృష్టం ఏంటంటే చదువుకు, విద్యకు ఎంతో దూరం ఉండిపోతున్నాం. విషయాలన్నీ తెలుసుకోవాలి. రోజు కొంచెం ఒక పేజీ అయినా గానీ ఖుర్ఆన్ దాని అనువాదంతో చదవాలి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులను చదువుతూ ఉండాలి. ప్రవక్త వారి యొక్క జీవితం చదువుతూ ఉండాలి. ఈ కాంక్ష ఇంకా ఎప్పుడు మనలో పుడుతుంది?
వాస్తవానికి ఈ రోజుల్లో గమనిస్తే, ఏ ఉపద్రవాలు, సంక్షోభాలు, ఫితనా ఎక్కువ అవుతూ ఉన్నాయో, అందులో నేనైతే అనుకుంటా, మన చేతులో ఇలాంటి పెద్ద పెద్ద షైతానులు రావడం అని కూడా ఒకటి భావిస్తాను. ఎందుకో తెలుసా? వాస్తవానికి దీని వెనక నిజంగా వీటి ద్వారా, అంటే ఈ మొబైల్ సెట్స్, స్మార్ట్ ఫోన్స్, మరి ఇలాంటి దీనికి సంబంధించిన ఎన్నో పరికరాలు ఏవైతే ఉన్నాయో, వీటి వలన కొంత ప్రయోజనం, ఎంతో లాభం ఉండవచ్చు. కానీ ఈ రోజుల్లో జనం ఆ లాభానికంటే ఎక్కువగా నష్టంలో దాన్ని ఉపయోగిస్తున్నారు, వాటిని ఉపయోగిస్తున్నారు. గంటల తరబడి పేజీ పైకి చేస్తూ, చేస్తూ, Facebook నుండి, Facebook లో చూసి చూసి మన ఫేస్ ఏ పాడైపోతుంది. కానీ దానిని మనం గమనించడం లేదు. దానికి బదులుగా ఏదైనా మంచి విషయం చదవాలి అంటే కోరిక పుట్టడం లేదు. ఉదాహరణకు Facebook ఇచ్చాను. ఈ విధంగా ఎన్నో విషయాలు ఉన్నాయి. అంతకు ముందు, ఇవి రాకముందు డిష్ లు, టీవీలు, మంచి మంచి ప్రోగ్రాంలో అని అనుకునేవాళ్ళం. స్త్రీలు ఫిలింలు, సీరియల్ లలో, పురుషులు ఎంతో మంది ఎన్నో రకాల ఆటల్లో, క్రికెట్ అని కొందరు, మరికొందరికి మరికొన్ని కాంక్షలు.
సోదరులారా, అల్లాహ్ మనపై కరుణించి, ఆయన మనకు ఎంతో మనపై దయచేసి, ప్రళయానికి ముందు సంభవించే సూచనల గురించి ఏ చిన్న చిన్న వివరాలు అయితే తెలిపాడో, మన ప్రవక్త ద్వారా వాటిని తెలుసుకొని మంచి విషయాలకు ముందుకు వెళ్లి, చెడు నుండి మనం దూరం ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ఇహలోకం బాగుపడుతుంది, మన పరలోకం కూడా మనకు బాగుపడుతుంది. అక్కడ నరకం నుండి మోక్షం పొంది స్వర్గంలో మనం చేరగలుగుతాం.
దజ్జాల్ ఇక్కడ ఉండేది ఎన్ని రోజులు? కేవలం 40 రోజులు మాత్రమే ఈ ప్రపంచంలో. కానీ మొదటి రోజు ఒక సంవత్సరం మాదిరి, రెండో రోజు ఒక నెల మాదిరిగా, మూడో రోజు ఒక వారం మాదిరిగా, మిగితా రోజులు 37 సామాన్య రోజులుగా ఉంటాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. చివరికి ఈసా అలైహిస్సలాం దిగి వస్తారు. విశ్వాసుల ఒక సంఖ్య, విశ్వాసుల ఒక గ్రూప్ వారి వెంట ఉంటుంది. ఈసా అలైహిస్సలాం దజ్జాల్ ను వెతికి, దజ్జాల్ ను చంపేస్తారు. హత్య చేస్తారు.
కానీ ఒక విషయం, ఇతడు చాలా పెద్ద దజ్జాల్, భయంకరమైనవాడు. అయినా గానీ రెండు విషయాలు దీంట్లో మనం గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటి? ఇతని ఉపద్రవాలు, ఇతని యొక్క ఫితనా, ఇతను ప్రజల్ని దుర్మార్గంలో పడవేయడానికి ఎంత ఏ ప్రయత్నం చేసినా గానీ, అల్లాహ్ పై గట్టి నమ్మకంతో అతన్ని ఎదురించకుండా, మనం ఉన్నకాడ మనం ఉండి, విశ్వాసంపై స్థిరంగా ఉండి, సత్కార్యాలు చేస్తూ ఉండి, ప్రత్యేకంగా దజ్జాల్ నుండి రక్షణకై, దజ్జాల్ నుండి అల్లాహ్ మనల్ని రక్షించాలని ప్రవక్త ఏ దుఆలు అయితే మనకు నేర్పారో, ఏ ప్రత్యేక కార్యాలు అయితే మనకు నేర్పారో అవి చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు అతని ఎన్ని భయంకరమైన, ఎన్ని మోసాలు, ఎన్ని మాయాజాలం మహిమలు అని చూపించినా గానీ అందులో ఇన్ షా అల్లాహ్ మనం పడం. కానీ విశ్వాసం మరియు ప్రవక్త చూపిన విధానంలో మనం ఉండాలి, కరెక్ట్ గా ఆచరణలో ఉండాలి. ఉదాహరణకు ప్రతి నమాజులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు,
అని చదివేవారు. ఇది చదువుతూ ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు ప్రతి జుమా రోజు ఏం చదవాలి? సూరె కహఫ్ చదువుతూ ఉండండి అని చెప్పారు. అది చదువుతూ ఉండాలి.
ఈ రోజుల్లో మన పరిస్థితి ఏమైంది? మా తల్లిదండ్రి మమ్మల్ని స్కూల్ కు పంపలేదు, మా తల్లిదండ్రి మమ్మల్ని మదరసాలో చేర్పించలేదు, మాకు ఖుర్ఆన్ చిన్నప్పుడు నేర్పలేదు అని ఇప్పటివరకు మనం నేర్చుకోలేకపోతున్నాము. కానీ మన చిన్నప్పుడు ఇట్లాంటి మొబైల్స్ ఉండెనా? వీటిని ఎలా ఆపరేటింగ్ చేయాలో అవన్నీ తెలుసా? అక్షరజ్ఞానం లేని వాళ్ళు కూడా ఇవి ఉపయోగించుకుంటున్నారు, దీన్ని వాడుతున్నారు. ఏమీ రాని వ్యక్తి కూడా తనకు ఇష్టమైన పాట దాంట్లో ఎన్నుకొని వింటున్నాడు, ఇష్టమైన ఫిలిం దాంట్లో తీసి చూస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు ఆ చెడులో ఏ జ్ఞానం అయితే మనది ఉపయోగపడుతుందో, మంచి తెలుసుకోవడానికి నాకైతే చదువు రాదు, చలో ఈ రోజు నేను ఏం చేస్తా, ఈ ఖుర్ఆన్ అప్లికేషన్ దీంట్లో స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేసి ఆ ఈరోజు జుమ్మా కదా, జుమ్మా రోజు నేను సూర కహఫ్, నాకు చదవ రాదు, కనీసం చూసుకుంటూ శ్రద్ధగా వింటూ ఉంటా. అట్లా ఎవరైనా ఆలోచిస్తున్నారా? బహుశా వెయ్యిలో ఎవరైనా ఒకరు ఉంటే ఉండవచ్చునేమో. ఇలాంటి ప్రయత్నాలు చేయాలి మనం.
రెండో విషయం, ఆ పెద్ద దజ్జాల్ నుండి మనం రక్షణ పొందాలంటే, అతని యొక్క మాయాజాలంలో మనం చిక్కిపోకూడదు అంటే ఈ పనులు చేయడంతో పాటు, ఆ పెద్ద దజ్జాల్ రాకముందు ఎందరో చిన్న చిన్న దజ్జాల్లు వస్తూ ఉంటారు. వాటి మాయాజాలకు కూడా మనం దూరం ఉండాలి. ఈ రోజుల్లో ఎందరో ఉన్నారు. గారడీ ఆటల్లాంటివి ఆడిపిస్తారు, మంత్రాలు చేస్తున్నాము, చేతబడి చేస్తున్నాము, మా దగ్గర మాయాజాలం ఉన్నది, మా దగ్గర ఫలానా శక్తి ఉన్నది, దేవుడు నాలో వదిగి వచ్చాడు, దేవుడు నాలో ఈ విధంగా చూపించుకుంటూ ప్రజల్ని మోసం చేసి, ప్రజల యొక్క నజరానాలు, ప్రజల యొక్క డబ్బులు, ప్రజల యొక్క ఆస్తులు అన్నీ కాజేసుకుంటూ దేవుని పేరు మీద తింటూ ఉన్నారు. అల్లాహ్ పేరు మీద తింటూ ఉన్నారు. ఇక ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఆ పేర్లు చెప్పేది ఉంటే కొందరికి కోపాలే వస్తాయి.
మన బర్రార్ లలో కూడా ఎన్నో మజార్లు, దర్గాలు, దర్బారులు, బాబాల యొక్క ఏమైతే అనుకుంటామో అక్కడ కూడా ఇలాంటి విషయాలు ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అందుగురించి సోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇలాంటి మోసాల్లో పడకుండా, దుర్మార్గంలో పడకుండా, విశ్వాసంపై మన యొక్క చావు కావాలి అంటే తప్పకుండా మనం ఏం చేయాలి? విశ్వాస మార్గం మీద ఉండాలి. ఖుర్ఆన్ హదీస్ చదువుతూ ఉండాలి. ధర్మ జ్ఞానం మనం నేర్చుకుంటూ ఉండాలి. అల్లాహ్ త’ఆలా ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ప్రళయం రాకముందు ఏ సూచనలైతే సంభవిస్తా ఉన్నాయో, అల్లాహ్ ఆ సూచనల్లోని చెడు విషయాల నుండి మనల్ని దూరం ఉంచి, ఏ మంచి విషయాలు కరువవుతాయో వాటికి చేరువై, దగ్గరై, అలాంటి విషయాలు నేర్చుకొని మన వాళ్ళల్లో వాటిని ఇంకింత పెంపొందించే భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ త’ఆలా దజ్జాల్, దజ్జాల్ కు ముందు వచ్చే ఇంకా చిన్న చిన్న దజ్జాల్ ల వారందరి ఫితనాల నుండి కూడా మనల్ని అల్లాహ్ కాపాడుగాక.
జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వబరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, భార్యతో మల మార్గం ద్వారా సంభోగించడం ఇస్లాంలో ఘోరమైన పాపమని, దీనికి పాల్పడే వారిపై అల్లాహ్ శాపం ఉంటుందని హదీసుల ఆధారంగా వివరించబడింది. కొందరు భర్తలు తమ కోరికలను తీర్చుకోవడానికి ఖుర్ఆన్ ఆయతులను తప్పుగా అన్వయించి, భార్యలను మోసం చేయడం లేదా బెదిరించడం వంటివి చేస్తున్నారని ప్రస్తావించబడింది. ఈ దుశ్చర్యలకు కారణం అజ్ఞానం, వివాహానికి ముందున్న చెడు అలవాట్లు, మరియు పాశ్చాత్య సంస్కృతి, నీలి చిత్రాల ప్రభావం అని పేర్కొనబడింది. ఇస్లాం పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మలమూత్ర విసర్జన తర్వాత ఎడమ చేతితో శుభ్రపరుచుకోవాలని చెప్పిన ధర్మంలో, నోటితో మర్మాంగాలను తాకడం వంటివి ఎంతమాత్రం అనుమతించబడవని స్పష్టం చేయబడింది. వైవాహిక జీవితంలో ఇస్లామీయ హద్దులను పాటించి, పవిత్రంగా జీవించాలని, చెడు అలవాట్లను విడిచిపెట్టి పశ్చాత్తాపం చెందాలని ఉపదేశించబడింది.
కొందరు బలహీన విశ్వాసులు తమ భార్యలతో మల మార్గం ద్వారా సంభోగించడంలో వెనకాడరు. ఇది ఘోర పాపాల్లో పరిగణించబడుతుంది. ఇది ఘోర పాపాల్లో పరిగణించబడుతుందని బహుశా వారికి తెలియదేమో. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా శపించారో గుర్తుందా? అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీస్ వినండి:
مَلْعُونٌ مَنْ أَتَى امْرَأَتَهُ فِي دُبُرِهَا (మల్’ఊనున్ మన్ అతా ఇమ్రఅతహూ ఫీ దుబురిహా) తన భార్యతో మల మార్గం ద్వారా సంభోగించే వాడిపై శాపం కురియు గాక. (అబూ దావూద్ 2162 సహీహుల్ జామి 5865).
అల్లాహ్ అన్ని రకాల శాపనాల నుండి, శాపనాలకు గురి అయ్యే కార్యాల నుండి దూరం ఉంచు గాక.
అయితే సోదర మహాశయులారా, ఇంతకుముందే మనం ఒక హదీస్ చదివి ఉన్నాము, రుతుస్రావంలో కలిసే వారి గురించి. ఆ హదీస్ ఇక్కడ కూడా వస్తుంది. ఎందుకంటే అందులో కూడా వచ్చింది,
“రుతువుస్రావంలో ఉన్న భార్యతో సంభోగించువాడు, లేదా భార్యతో మల మార్గం ద్వారా సంభోగించువాడు మరియు జ్యోతిష్యుని వద్దకు వెళ్ళేవాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించినదానిని తిరస్కరించినవాడగును“. (తిర్మిజి 135, సహీహుల్ జామి 5918).
సోదర మహాశయులారా, స్వాభావిక గుణం గల ఎందరో భార్యలు ఈ పద్ధతిని తిరస్కరిస్తారు. కానీ కొందరు భర్తలే విడాకులిస్తానని బెదిరిస్తారు. మల మార్గం ద్వారా వారు తమ కోరికను పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అయితే వారు గమనించాలి, వారు రెండు రకాల పాపాలు, రెండు రకాల ఘోరమైన స్థితులకు గురవుతున్నారు. ఒకటి, శాపం వారిపై పడుతుంది. రెండవది, కుఫ్ర్ లో పడిపోతున్నారు వారు.
ఇక మరికొందరు భర్తలు ఎలా ఉన్నారంటే నవూజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, ఖుర్ఆన్ ఆయత్ యొక్క భావం తప్పుగా చెప్తారు. అరే భర్త అయితే ఖుర్ఆన్ ఆయత్ చెప్తున్నాడు, తన తప్పుడు కోరికను పూర్తి చేసుకోవడానికి, మరి ఎవరైనా ఆలిమ్ ను అడుగుదామా, ఈ ఆయత్ యొక్క సరైన భావం ఏంటి అని అనుకుంటారు కొందరు స్త్రీలు. కానీ సిగ్గుపడి అడగలేరు. వారి గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది, శ్రద్ధ వహించండి. పండితులతో ప్రశ్నించి తెలుసుకోవడానికి సిగ్గుపడే తమ భార్యలను కొందరు భర్తలు మోసం చేసి మల మార్గం ద్వారా వారి కోరికను పూర్తి చేసుకునే విధానం యోగ్యమని ఖుర్ఆన్ యొక్క ఈ ఆయత్ చూపుతారు. ఏంటి ఆ ఆయత్?
[نِسَاؤُكُمْ حَرْثٌ لَكُمْ فَأْتُوا حَرْثَكُمْ أَنَّى شِئْتُمْ] (నిసాఉకుమ్ హర్సుల్లకుమ్ ఫ’తూ హర్సకుమ్ అన్నా షి’తుమ్) మీ భార్యలు మీకు పంటపొలాల (వంటివారు), కావున మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవచ్చు. (బఖర 2: 223).
మీరు కోరిన విధంగా మీ యొక్క భార్యలతో మీరు ఉండండి అన్నటువంటి విషయం దీన్ని ప్రస్తావించి, తమ ఆ నిషిద్ధ కార్యం చేయడానికి ఈ ఆయత్ ను దలీల్ గా తీసుకుంటారు. కానీ వారికి తెలిసి ఉండాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులు ఖుర్ఆన్ ఆయతుల భావాన్ని విశదీకరిస్తాయి. అయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో చెప్పారు, భర్త తన భార్యతో సంభోగించడానికి ఆమె ముందు నుండి, ఆమె వెనుక నుండి ఎలా వచ్చినా సరే, కానీ సంతానం కలిగే దారి నుండే సంభోగించాలి.
అయితే మలము వచ్చే దారి నుండి సంతానం కలగదు అన్న విషయం అందరికీ తెలిసినదే. ఇంతటి ఘోర పాపానికి ఒడిగట్టే కారణాలు ఏమిటో తెలుసా? పవిత్ర దాంపత్య జీవితంలో కాలు మోపే ముందు అజ్ఞానపు దుశ్చేష్టలకు పాల్పడి ఉండడం. నిషిద్ధమైన, భిన్నమైన, అసాధారణ పద్ధతులకు వారు అలవాటు పడి ఉండడం. లేదా నీలి చిత్రాల్లోని, కొందరికి బ్లూ ఫిలిమ్స్ చూసేటటువంటి అలవాటు, ఇక పెళ్ళైన తర్వాత కూడా ఆ రోజుల్లో లేక ఆ సమయంలో కూడా చూస్తూ ఉండేటటువంటి కొన్ని సంఘటనలు వారి జ్ఞాపక శక్తిలో నాటుకుపోయాయో వాటిని వారు వదులుకోలేకపోతారు.
అయితే ఇలాంటి వారందరూ కూడా తమ దుశ్చేష్టలను మానుకోవాలి, చెడ్డ అలవాటులను వదులుకోవాలి. అల్లాహ్ తో స్వచ్ఛమైన తౌబా చేయాలి. వారు చేయరు గనక ఇంకింత అలాంటి పాపాల్లోనే కూరుకుపోతూ ఉంటారు.
మరొక ముఖ్య విషయం గమనించండి, భార్య భర్తలిద్దరూ ఏకమై, ఇష్టపడి ఈ దుష్కార్యం చేసుకున్నా అది నిషిద్ధమే అవుతుంది. ఏదైనా నిషిద్ధ కార్యం ఇష్టపడి చేసినంత మాత్రాన ధర్మసమ్మతం కాజాలదు.
సోదర మహాశయులారా, ఇక్కడి వరకు ఈనాటి పాఠాలు పూర్తిగా అయిపోయాయి. కానీ చివరిలో లేక ఈ రోజులో చదివినటువంటి పాఠాల్లో భార్య భర్తల విషయం గురించి ఎన్నో అంశాలు వచ్చినాయి గనక మరొక విషయం చాలా ముఖ్యమైనది మిగిలిపోతుంది. దాన్ని సంక్షిప్తంగా చెప్పేసి నేను నా పాఠాన్ని ముగించేస్తాను.
చివరి పాఠంలో మీరు ఒక విషయం విన్నారు కదా, కొందరు భర్తలు భార్యలకు మోసం చేసి ఖుర్ఆన్ ఆయతులతో తప్పుడు భావం చెప్పే ప్రయత్నం చేస్తారు. విన్నారు కదా? అలాగే మరికొందరు భర్తలు ఖుర్ఆన్ లోని మరొక ఆయత్:
هُنَّ لِبَاسٌ لَّكُمْ وَأَنتُمْ لِبَاسٌ لَّهُنَّ (హున్న లిబాసుల్లకుమ్ వ అన్తుమ్ లిబాసుల్లహున్న) వారు (భార్యలు) మీ కొరకు వస్త్రధారణ, మీరు వారి కొరకు వస్త్రధారణ. (2:187)
భార్యలు భర్తల కొరకు, భర్తలు భార్యల కొరకు వారి యొక్క వస్త్రధారణ, అని ఏదైతే ఆయత్ ఉందో, దీని ద్వారా భార్యలకు మోసం చేసి మరిన్ని చెడు అలవాట్లకు పాల్పడతారు. దుష్కార్యాలకు పాల్పడతారు. అదేంటి? కొందరు భర్తలు భార్యలకు బలవంతం చేస్తారు వారి మర్మాంగాన్ని తమ నోట్లో తీసుకోవాలని.
ఎందరో పురుషులు పరస్పరం కలుసుకొని, ప్రత్యేకంగా కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి యువకులు తమ యొక్క ఫ్రెండ్స్ తో తమ యొక్క భార్యల గురించి ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. కొందరు పురుషులు కూడా వచ్చి ఇలాంటి ప్రశ్నలు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి.
భార్య భర్తలిద్దరూ కూడా ఒకరు మరొకరి మర్మాంగాన్ని నోట్లో తీసుకోవడం, ఇంకా వేరే ఇలాంటి ఏ పనులైనా గానీ, ఇవన్నీ కూడా తప్పుడు అలవాటులు. వాస్తవానికి ఈ కల్చర్ చాలా చెండాలమైనది. ఇస్లామీయ సంస్కృతి, కల్చర్ ఎంతమాత్రం కాదు. వెస్ట్రన్ కల్చర్ ఇది. వాస్తవంగా ఈ సమస్య సుమారు ఈనాటికి 20 సంవత్సరాల క్రితమే కొందరు చాలా అరుదుగా అడిగారు. అప్పుడే నేను ఆనాటి, అంటే 20 సంవత్సరాల క్రితమే అప్పుడు చాలా పెద్ద వయసులో ఉన్న కొందరు ఉలమాలను అడిగితే, వారు ఆశ్చర్యపడ్డారు. ఇలాంటి వాటికి కూడా పాల్పడతారా? వాస్తవానికి ఇది వెస్ట్రన్ నుండి వచ్చినదే. ఈ బ్లూ ఫిలిమ్ లు, ఇంకా వెస్ట్రన్ యొక్క నగ్న చిత్రాలు, ఫిలిమ్ లు అన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రబలిపోతున్నాయి.
ఇందులో ఉన్నటువంటి చెడులను నేను సైంటిఫిక్ పరంగా తెలపడం లేదు. మీ బుద్ధి జ్ఞానాలకు అర్థమయ్యే రీతిలో, సులభమైన రీతిలో కొన్ని విషయాలు చెప్తున్నాను, గమనించండి. ఏ పవిత్రమైన, పరిశుభ్రమైన ఇస్లాం ధర్మం, ఎడమ చేతితోనే ఇస్తింజా చేయాలి, మలమూత్ర విసర్జన తర్వాత శుభ్రత అనేది కేవలం ఎడమ చెయ్యితో చేయాలి, కుడి చెయ్యిని కూడా తాకనివ్వకూడదు అని చెప్పిందో, అలాంటి ధర్మం నోట్లో తీసుకోవడానికి, నాకడానికి, ఆ ఇలాంటి ఇంకా చెడు వాటికి అనుమతి ఇస్తుందా? గమనించండి.
భార్య భర్తలు ఇద్దరు, వారి మధ్యలో ఏ పరదా లేదు అంటే ఇక వేరే ఏ హద్దులూ లేవు, ఎలా ఇష్టం ఉంటే అలా, ఇలాంటి భావం తీసుకోవడం చాలా తప్పు. అందుకొరకే ఇస్లాం ధర్మం గురించి తెలుసుకునే ప్రయత్నం ఇంకా చేస్తూ ఉండాలి కానీ, ఎక్కడో ఒక ఆయత్, ఎక్కడో ఒక హదీస్ తీసుకొని, విని, తన ఇష్ట ప్రకారంగా దాన్ని ధర్మపరంగా అనుమతించినదే అని భావిస్తూ చేయడం ఇది మరీ చాలా ఘోరమైన పొరపాటు, ఘోరమైన తప్పు.
ఇక ఇలాంటి ఈ దుశ్చేష్టల వల్ల, నోట్లో తీసుకునే అటువంటి బలవంతాలు చేయడం ద్వారా ఏ ఏ రోగాలకు గురి అవుతున్నారో, వాటి గురించి నేను ఆ వివరణలోకి వెళ్ళను. ధర్మవేత్తలు కొందరు, డాక్టర్ల యొక్క సలహాలతో అవన్నీ వివరాలు కూడా తెలిపారు. సంక్షిప్తంగా చెప్పేది ఏంటంటే, వీటన్నిటికీ దూరంగా ఉండండి, ధర్మంగా జీవించే ప్రయత్నం చేయండి. ఇస్లాం ధర్మం, ఇది ఎవరో కొందరు థింక్ ట్యాంకర్స్ లేదా పరిశోధన చేసిన ప్రయత్నాలు కావు. మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్, మనందరి కొరకు కారుణ్యమూర్తిగా చేసి పంపిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పంపినటువంటి సత్య ధర్మం. ప్రళయం వరకు వచ్చే అన్ని సమస్యలకు ఉత్తమ మంచి పరిష్కారం ఉంది. చివరికి వైవాహిక జీవితంలో, సామాజిక జీవితంలో, భార్య భర్తల జీవితంలో కూడా, ఇందులో ఏ నిషిద్ధతలు ఉన్నాయో, ఏ చెడులు ఉన్నాయో వాటికి దూరంగా ఉండడంలోనే మన జీవితాలు పరిశుభ్రంగా ఉంటాయి.
అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక. అన్ని రకాల చెడుల నుండి దూరం ఉంచు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’వాన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో అజాన్ తర్వాత పఠించవలసిన రెండు ముఖ్యమైన దువాల గురించి వివరించబడింది. మొదటి దువా సహీహ్ ముస్లిం నుండి ఉల్లేఖించబడింది, దీనిని పఠించడం ద్వారా గత పాపాలు క్షమించబడతాయి. రెండవ దువా సహీహ్ బుఖారీ నుండి తీసుకోబడింది, దీనిని పఠించిన వారికి ప్రళయ దినాన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సిఫారసు లభిస్తుంది. ఈ రెండు దువాల యొక్క ప్రాముఖ్యత మరియు వాటి ద్వారా లభించే గొప్ప ప్రయోజనాలను వక్త నొక్కి చెప్పారు.
మహాశయులారా, ఇప్పుడు మనం అజాన్ తర్వాత రెండు రకాల దువాలు మనకు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పారు. ప్రతీ ఒక్క దువాలో మన గురించి ఎంతో గొప్ప లాభం ఉంది.
మొదటి దువా: పాపాల క్షమాపణ కోసం
మొదటి హదీస్ సహీహ్ ముస్లిం లోనిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ఎవరైతే అజాన్ విన్న తర్వాత, అజాన్ కు సమాధానం చెబుతూ అజాన్ పూర్తిగా విన్న తర్వాత
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వహ్ దహూ లా షరీక లహూ, వ అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, రదీతు బిల్లాహి రబ్బన్, వబి ముహమ్మదిన్ రసూలన్, వబిల్ ఇస్లామి దీనా)
“అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్య దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఏకైక దేవుడు, ఆయనకు భాగస్వాములు లేరు మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. నేను అల్లాహ్ ను ప్రభువుగా, ముహమ్మద్ ను ప్రవక్తగా మరియు ఇస్లాంను నా ధర్మంగా స్వీకరించాను.”
అని చదువుతారో,
غُفِرَ لَهُ ذَنْبُهُ (గుఫిర లహూ దన్బుహూ)
వారి యొక్క పాపాలు క్షమించబడతాయి, మన్నించబడతాయి అని శుభవార్త ఇవ్వడం జరిగింది.
ఇది ఒక దువా. మరోసారి విని మీరు దీన్ని జ్ఞాపకం ఉంచుకునే ప్రయత్నం చేయండి. సామాన్యంగా మనం దీనిలో సగ భాగం అంతకంటే ఎక్కువగా నేర్చుకునే ఉంటాము ఇంతకుముందు.
రెండవ దువా: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సిఫారసు కోసం
ఇక రెండవ దువా, సహీహ్ బుఖారీలోని పదాలు ఈ విధంగా ఉన్నాయి. జాబిర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే అజాన్ విన్న తర్వాత ఈ దువా చదువుతారో, ప్రళయ దినాన వారికి నా సిఫారసు తప్పకుండా లభిస్తుంది. అల్లాహు అక్బర్! ఎంత గొప్ప అదృష్టమో గమనించండి. ప్రళయ దినాన ప్రవక్తలు సిఫారసు చేయాలి అని మనం తహతహలాడుతూ ఉంటాము. ఆ రోజు మనకు ఈ సిఫారసు పొందడానికి ఈ రోజు ఐదు పూటల నమాజులు చేయాలి. అజాన్ విన్నప్పుడు, అజాన్ అయిన తర్వాత దువా మనం చదవాలి.
“ఓ అల్లాహ్! ఈ సంపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడిన నమాజుకు ప్రభువా! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మధ్యవర్తిత్వం మరియు శ్రేష్టతను ప్రసాదించు. మరియు నీవు వాగ్దానం చేసిన ప్రశంసనీయమైన ఉన్నత స్థానానికి ఆయనను చేర్చు.”
అల్లాహ్ త’ఆలా ఈ దువాలను ప్రతీ అజాన్ తర్వాత చదువుతూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక. వీటి యొక్క బరకత్ లో, శుభంలో అల్లాహ్ మన పాపాలను మన్నించి ప్రళయ దినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు మనకు ప్రాప్తి చేయుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ఇస్లాంలో పురుషులు బంగారం ధరించడం పూర్తిగా నిషిద్ధం (హరామ్) అని స్పష్టంగా వివరించబడింది. బంగారం ఏ రూపంలో ఉన్నా – ఉంగరం, గొలుసు, బ్రాస్‌లెట్ వంటివి – పురుషులు వాడకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల ప్రకారం, బంగారం మరియు పట్టు స్త్రీలకు ధర్మసమ్మతం కానీ పురుషులకు నిషిద్ధం. ఒక సహాబీ చేతిలో బంగారు ఉంగరం చూసినప్పుడు ప్రవక్త దానిని తీసి పారేసి, అది నరక జ్వాల వంటిదని హెచ్చరించిన సంఘటన వివరించబడింది. ఆ సహాబీ, ప్రవక్త పారేసిన దానిని తిరిగి తీసుకోకపోవడం, ప్రవక్త పట్ల వారికున్న గౌరవం మరియు అనుసరణకు నిదర్శనం. ఆధునిక కాలంలో గడియారాలు, బటన్లు, పెన్నులు వంటి వస్తువులలో కూడా బంగారం వాడకంపై హెచ్చరిక చేయబడింది. చెడును శక్తి ఉన్నప్పుడు చేతితో ఆపాలని, నిషిద్ధమని తెలిసిన వెంటనే దానిని వదిలివేయాలని ఈ ప్రసంగం బోధిస్తుంది.
పురుషులు బంగారం ధరించడం
బంగారం ఏ రూపంలో ఉన్నా, దానిని పురుషులు వాడుట నిషిద్ధం. శ్రద్దగా వినండి. బంగారం ఏ రూపంలో ఉన్నా, గొలుసు రూపంలో కొందరు వేసుకుంటారు, ఏదైనా ఒక బ్యాంగిల్ రూపంలో చేతిలో వేసుకుంటారు పురుషులు. మరి కొందరు ఉన్నారు, రెండు చెవులలో నుండి ఏదైనా ఒక చెవిలో, ఇలా కొందరు ఈనాటి కాలంలో అలవాటు పడుతున్నారు. అయితే బంగారం ఏ రూపంలో ఉన్నా, దానిని పురుషులు వాడుట నిషిద్ధం.
ఈరోజు మార్కెట్లో గడియారాలు, అద్దాలు, బటన్లు, పెన్నులు, చైన్లు ఇంకా మెడల్ పేరుతో బంగారపు లేదా బంగారు వన్నె ఎక్కించినవి చాలా ఉన్నాయి. ఇంకా పురుషులకు స్వర్ణ గడియారం అని కొన్ని కాంపిటీషన్లలో ప్రకటించబడుతుంది. అయితే ఇవి నిషిద్ధం అని తెలుసుకోవాలి.
ప్రవక్త మరియు సహాబీ సంఘటన
సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చినటువంటి హదీస్. శ్రద్ధగా వింటారు, అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను.
అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన ప్రకారం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక వ్యక్తి చేతికి బంగారపు ఉంగరం చూశారు. ఆయన దానిని తీసిపారేశారు. మళ్ళీ ఇలా హెచ్చరించారు: “మీలో ఎవరికైనా నరకజ్వాల కావాలని ఉంటే దీనిని తన చేతిలో తొడగవచ్చు”. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నవారన్నారు: ‘నీ ఉంగరాన్ని తీసుకో, వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు’. అప్పుడు అతనన్నాడు: ‘లేదు. అల్లాహ్ సాక్షిగా! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తీసిపారేసిన దాన్ని నేను ఎన్నడూ తీసుకోను’. (ముస్లిం 2090).
ఎవరైతే చేతిలో బంగారపు ఏదైనా వస్తువు వేసుకుంటారో, ఉంగరం కానీ, గాజు కానీ, ఇంకా ఇలాంటిది ఏదైనా, అయితే వారు నరక శిక్షకు ఆహుతి అవుతారు అని హెచ్చరిక ఇది.
అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అటు వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ ఉన్నవారు ఆ సహాబీకి చెప్పారు, “నీ ఉంగరాన్ని తీసుకో, వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు.” అప్పుడు ఆ సహాబీ అన్నారు, “లేదు. అల్లాహ్ సాక్షిగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసి పారేసిన దానిని నేను ఎన్నడూ తీసుకోను.” ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఉన్నటువంటి గౌరవ అభిమానం. ప్రవక్తకు ఏ విషయం ఇష్టం లేదో, ప్రవక్త తన చేతితో దానిని తీసి పారేశారో, అలాంటి దాని దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి? ఒక విషయాన్ని ప్రవక్త నిషిద్ధం అని అన్నప్పుడు, దానికి నేను ఎందుకు పాల్పడాలి? ఇలాంటి కాంక్ష ఎంత గొప్పగా ఉండిందో గమనించండి.
ఈ రోజుల్లో, “అరే ఈ తాయెత్తు వేసుకోవద్దు, ఈ ఉంగరం బంగారపుది పురుషులు వేసుకోకూడదు” అని చెప్పినప్పుడు, “సరే, నేను తర్వాత తీసేస్తాను, లేదు ఇంట్లో నేను మా అమ్మతోని ఒకసారి మాట్లాడి ఆ తర్వాత తీస్తాను” ఈ విధంగా మన యొక్క సాకులు ఉంటాయి. కానీ సహాబీ, గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసి పారేసిన విషయానికి దగ్గరగా పోదలుచుకోలేదు.
ఈ హదీస్ లో మనకు బోధపడిన కొన్ని విషయాలు:
బంగారపు ఉంగరం వేసుకొనుట నరక శిక్షకు కారణమవుతుంది.
తన శక్తి పరిధిలో ఉన్నప్పుడు మనిషి చెడును తన చేతితో ఖండించాలి. ఎవరికి అధికారం ఉన్నదో వారే చేయాలి, వేరే వారు చేసి ఇంకా నష్టానికి గురికాకూడదు.
పురుషుడు బంగారపు ఉంగరం వేసుకొని ఉంటే, తెలిసిన వెంటనే, ఏ ఆలస్యం చేయకుండా తన చేతిలో నుండి తీసి కనీసం జేబులోనైనా వేసుకోవాలి. కానీ ఇక ఆ చేతిలో ఉంచుకోకూడదు. మెడలో ఉంటే మెడలో నుండి తీసేయాలి. తర్వాత తన ఇంట్లోని స్త్రీలకు ఇవ్వచ్చు, స్త్రీలు దాన్ని ఉపయోగించవచ్చును.
సహాబాలు ప్రవక్త అనుకరణలో ఎంత ముందుగా ఉండేవారన్న విషయం తెలిసింది.
అయితే ఇక్కడ గమనించండి మరొక విషయం. అదేమిటంటే, ఈ రోజుల్లో కొందరు ఏమంటున్నారు? సరే ఇక బంగారం నిషిద్ధం అన్నారు కదా, మరి వెండిది వేయవచ్చా? “లేదు మా అబ్బాయి వాళ్ళ స్నేహితులు క్లాస్మేట్లు ఎవరో వేసుకున్నారంట, ఇంట్లో వచ్చి అడుగుతున్నాడు, నాకు కూడా ఒక చిన్న ఏదైనా వెండి యొక్క చైన్ ఇవ్వమని, లేదా చేతిలో ఏదైనా చైన్ వేసుకుంటా” అని. లేదు. ఇన్ షా అల్లాహ్ ఆ మాట తర్వాత కూడా వస్తుంది. స్త్రీలు పురుషుల పోలిక, పురుషులు స్త్రీల పోలిక అవలంబించకూడదు అని. కానీ ఇక్కడ ఒక మాట వచ్చింది గనక నేను దాన్ని గుర్తు చేశాను, చెప్పేశాను.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లాం మానవ జీవితంలోని ప్రతి కోణానికి సంబంధించిన ప్రతి విషయం గురించి సన్మార్గం చూపుతుంది. చివరికి మల మూత్ర విసర్జన పద్ధతులను కూడా తెలిపింది, అయితే వీటి వివరాలు ఇందులో తెలుసుకోండి.
ఈ ప్రసంగంలో, వక్త మలమూత్ర విసర్జన చేసేటప్పుడు పాటించవలసిన ఇస్లామీయ పద్ధతులను హదీసుల ఆధారంగా వివరించారు. ప్రధాన అంశాలు: ఏకాంతాన్ని పాటించడం, ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించుకోవడంలో తప్పులేదని చెప్పడం, భూమికి దగ్గరైన తర్వాతే బట్టలు పైకి తీయడం, మరుగుదొడ్డిలోకి ప్రవేశించే ముందు మరియు బయటకు వచ్చిన తర్వాత దువాలు చదవడం, ఆ సమయంలో మాట్లాడకూడదని చెప్పడం, అల్లాహ్ పేరు ఉన్న వస్తువులను లోపలికి తీసుకువెళ్లకపోవడం, ఖిబ్లా వైపు ముఖం లేదా వీపు పెట్టకపోవడం (కట్టడాలలో మినహాయింపు ఉంది), శపించబడిన ప్రదేశాలలో (దారి, నీడ, నీటి వనరులు) విసర్జన చేయకపోవడం, శరీరం లేదా దుస్తులపై తుంపరలు పడకుండా జాగ్రత్తపడటం, శుభ్రత కోసం నీటిని (మరియు రాళ్లను) ఉపయోగించడం, ఎడమ చేతిని మాత్రమే వాడటం, కనీసం మూడుసార్లు శుభ్రపరచడం, ఎముక మరియు పేడతో శుభ్రపరచకపోవడం, ఆ సమయంలో సలాంకు జవాబు ఇవ్వకపోవడం, మరియు అవసరమైతే నిలబడి మూత్రవిసర్జన చేయడం అనుమతించబడినప్పటికీ, తుంపరల పట్ల చాలా జాగ్రత్తగా ఉండటం.
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వఆలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.
మహాశయులారా! అల్లాహ్ యొక్క దయవల్ల ఈ రోజు మనం మలమూత్ర విసర్జన ఇస్లామీయ పద్ధతులు ఏమిటో తెలుసుకుందాము.
1. ఏకాంతం మరియు గోప్యత
మొదటి విషయం, మలమూత్ర విసర్జన కొరకు నాలుగు గోడల మధ్యలో లేదా ఎడారి ప్రాంతంలో పోయే అవసరం ఉన్నప్పుడు కానీ ప్రజల చూపులకు, వారి దృష్టికి దూరంగా వెళ్ళాల్సిన ఆదేశం ఇస్లాం ఇస్తుంది. ఎందుకనగా ప్రతి మనిషి తన మర్మ అవయవాలను ఇతర చూపులకు దూరంగా ఉంచడం తప్పనిసరి విషయం.
దీనికి సంబంధించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో ఒక హదీస్, సహీ బుఖారీ హదీస్ నెంబర్ 148. ఇంకా అలాగే సహీ బుఖారీలోని హదీస్ నెంబర్ 363 లో కూడా ఈ ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ముగైరా బిన్ షోబా రదియల్లాహు త’ఆలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సేవలో ఉండేవారు. ఆయన తెలుపుతున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైనా కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు,
فَانْطَلَقَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم حَتَّى تَوَارَى عَنِّي فَقَضَى حَاجَتَهُ (ఫన్తలఖ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం హత్తా తవారా అన్నీ ఫఖదా హాజతహు) “నాకు కనబడనంత దూరంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళారు, తమ అవసరాన్ని తీర్చుకొని తిరిగి వచ్చేశారు.”
సామాన్యంగా కొన్ని పల్లెటూర్లలో ఇప్పుడు అంతగా లేదు కావచ్చు, కానీ అయినా గాని కొన్ని ప్రాంతాల్లో ఉండవచ్చు, ఇళ్లల్లో మరుగుదొడ్లను నిర్మించుకోవడం మంచిగా భావించరు. కానీ ఇందులో ఎలాంటి అభ్యంతరం ఇస్లామీయ ధర్మ ప్రకారంగా గానీ, ఇందులో ఎలాంటి పాపం అనేది లేదు. స్వయంగా ఆ కాలంలో కూడా మహనీయ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తమ ఇంటి మీద ఇలాంటి ఒక సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయం కూడా సహీ బుఖారీలో ఉంది. అందుగురించి ఇమామ్ బుఖారీ రహమతుల్లా అలై ఒక చాప్టర్ పేరేమి పెట్టారు? ఇళ్లల్లో కాలకృత్యాలు తీర్చుకోవడం.
2. బట్టలు పైకి ఎత్తే విధానం
రెండో విషయం, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు, నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడు ఎలాంటి సందేహం లేదు, లోపలికి వెళ్లి తలుపేసుకున్న తర్వాతే బట్టలు విప్పుతాము. కానీ ఎడారి ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఎక్కడైతే ఒక పరదా లాంటి స్థలం, ప్రజల చూపులకు మనం కనబడకుండా ఉన్నాము అన్నటువంటి నమ్మకం అయిన తర్వాత, ఏ స్థలంలో మనం కూర్చోవాలి అని అనుకుంటున్నామో అక్కడ కూర్చోవడానికి సిద్ధమవుతూ, కిందికి వంగుతూ బట్టలను ఎత్తుకోవాలి.
హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు:
أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ إِذَا أَرَادَ حَاجَةً لاَ يَرْفَعُ ثَوْبَهُ حَتَّى يَدْنُوَ مِنَ الأَرْضِ (అన్నన్ నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లం కాన ఇదా అరాద హాజతన్ లా యర్ఫవు సౌబహు హత్తా యద్నువ మినల్ అర్ద్) “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకోవడానికి, తమ అవసరాన్ని తీర్చుకోవడానికి ఉద్దేశించినప్పుడు భూమికి దగ్గరగా అయ్యేంతవరకు తమ వస్త్రాలు, తమ బట్టలు తీసేవారు కాదు.” (సునన్ అబీ దావూద్: 14)
అయితే ఎంతగా మనం మన మర్మావయవాలను ఇతర చూపుల నుండి దాచి ఉంచవలసిన అవసరం ఉందో, దీని గురించి ఎంత మంచి శిక్షణ స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ ఆచరణ ద్వారా మనకు చూపుతున్నారో గమనించండి. ఈ హదీస్ సునన్ అబీ దావూద్ లో హదీస్ నెంబర్ 14.
3. ప్రవేశించే ముందు దుఆ
మరుగుదొడ్డిలో ప్రవేశిస్తూ లేదా ఎడారి ప్రాంతంలో వెళ్ళినప్పుడు అక్కడ సామాన్యంగా ప్రజలకు తెలిసి ఉంటుంది, అర కిలోమీటర్, పావు కిలోమీటర్, కిలోమీటర్ నడిచి వెళ్తారు, కానీ ఇక్కడి నుండి కాలకృత్యాలు తీర్చుకునే ఈ ప్రాంతం అన్నటువంటి ఒక ఏర్పాటు అనేది అందరికీ తెలిసి ఉంటుంది. ఆ ప్రాంతంలో ప్రవేశించిన తర్వాతనే దుఆ చదువుకోవాలి. ఇక మరుగుదొడ్డి ఏదైతే ఉంటే, నాలుగు గోడల మధ్యలో ఏదైతే ఉంటే, బాత్రూంలో, టాయిలెట్లో ప్రవేశించేకి ముందే దాన్ని చదువుకోవాలి.
బిస్మిల్లాహ్ అనాలి, ఆ తర్వాత,
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْخُبُثِ وَالْخَبَائِثِ “అల్లాహుమ్మ ఇన్నీ అవూదుబిక మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్“ ఓ అల్లాహ్, నేను నీ శరణులో జొచ్చుచున్నాను, స్త్రీ, పురుషుల జిన్నాతుల నుండి
ఇది సహీ బుఖారీలో ఉంది హదీస్ నెంబర్ 142. కానీ బిస్మిల్లాహ్ గురించి ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంత గొప్ప విషయం చెప్పారో గమనించండి. కాలకృత్యాలు తీర్చుకునే సందర్భంలో మనిషి తన మర్మ అవయవాలను దాచి ఉంచలేకపోతాడు గనుక, ఆ సందర్భంలో జిన్నాతులు కూడా చూసే అవకాశం ఉంటుందా లేదా? అందుగురించి మీరు బిస్మిల్లాహ్ అని ఆ సందర్భంలో ముందే అనేది ఉంటే మీకు మరియు జిన్నాతులకు మధ్యలో ఒక పరదా ఏర్పడుతుంది, వారు మీ మర్మ అవయవాలను చూడలేరు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు.
కాలకృత్యాలు తీర్చుకొని పరిశుభ్రత, పరిశుభ్రం చేసుకున్న తర్వాత తిరిగి ఎప్పుడైతే వస్తారో, బయటికి వచ్చిన తర్వాత “గుఫ్రానక” అని అనాలి. బిస్మిల్లా – అల్లాహ్ యొక్క పేరుతో నేను ఈ నా అవసరాన్ని తీర్చుకోవడానికి వెళ్తున్నాను అన్న భావం. అల్లాహుమ్మ ఇన్నీ అవూదుబిక – ఓ అల్లాహ్, నేను నీ శరణులో జొచ్చుచున్నాను, మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్ – స్త్రీ, పురుషుల జిన్నాతుల నుండి. తిరిగి వచ్చిన తర్వాత ఏమనాలి? గుఫ్రానక – అంటే ఓ దేవా, నీవు నన్ను క్షమించు.
4. మాట్లాడరాదు
నాలుగవ విషయం, కాలకృత్యాలు తీర్చుకునే సందర్భంలో మాట్లాడవద్దు. ఏ మాత్రం మాట్లాడవద్దు. మరీ ఏదైనా అత్యవసర విషయం ఉండి సంక్షిప్తంగా ఏదైనా మాట్లాడితే అది వేరే విషయం అని కొందరు పండితులు చెప్పారు. కానీ ఒక సామాన్య పద్ధతి ఏమిటి? మన కాలకృత్యాలు తీర్చుకునే సందర్భంలో మాట్లాడవద్దు. సహీహాలో ఈ హదీస్ ఉంది, షేక్ అల్బానీ రహిమహుల్లాహ్ గారు సహీ అని చెప్పారు.
إِذَا تَغَوَّطَ الرَّجُلَانِ فَلْيَتَوَارَ كُلُّ وَاحِدٍ مِنْهُمَا عَنْ صَاحِبِهِ وَلَا يَتَحَدَّثَانِ عَلَى طَوْفِهِمَا فَإِنَّ اللَّهَ يَمْقُتُ عَلَى ذَلِكَ “ఇద్దరు మనుషులు కలిసి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కడూ తన స్నేహితుని చూపులకు దూరంగా ఉండే అటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళిపోవాలి. మరి తమ అవసరం తీర్చుకున్న సందర్భంలో ఏ మాత్రం మాట్లాడవద్దు. ఇందువల్ల అల్లాహ్ త’ఆలా వారిపై చాలా ఆగ్రహపడతాడు.”
5. తీసుకువెళ్ళకూడని వస్తువులు
ఐదవ విషయం, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు సామాన్యంగా అల్లాహ్ యొక్క పేరు గల ఏ వస్తువు కూడా వెంట తీసుకెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఈ విషయంలో వచ్చిన ఒక హదీస్ బలహీనంగా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉంగరం మీద “ముహమ్మద్ రసూల్ అల్లాహ్” అంటే ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అన్న భావం, ఈ మూడు పదాలు ఉండేవి. అయితే అల్లాహ్ యొక్క పేరు కూడా వచ్చింది గనుక దాన్ని తీసి బయట పెట్టి వెళ్ళేవారు అని. కానీ హదీస్ దయీఫ్ ఉంది. అయినా గానీ సర్వసామాన్యంగా పండితులందరూ కూడా ఏకీభవించారు, అల్లాహ్ పేరు గల ఏ వస్తువు కూడా ఎంబడి తీసుకొని వెళ్ళకూడదు.
కానీ కొన్ని వస్తువులు దాన్ని బయట పెట్టి వెళ్ళడం ద్వారా ఏదైనా మనకు నష్టం ఉంది, దాన్ని కాపాడలేకపోతాము, అలాంటి సందర్భంలో మరికొందరు పండితులు ఏం ఫత్వా ఇచ్చారంటే దానిని బహిరంగంగా ఉండకుండా జేబు లోపల గానీ, దస్తీ లోపల గానీ, ఇలాంటివన్నీ దాచిపెట్టి పోయే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనిషి ఖురాన్ కంఠస్థం చేసి ఉంటాడు, దాన్ని బయటికి తీసి వెళ్ళలేడు కదా. అయితే దాని యొక్క పోలిక అని కొందరు పండితులు చెప్పారు. అలాగే జవ్వాలల్లో ఉదాహరణకు ఖురాన్ ఉంటుంది, లేదా ఏదైనా కాయితం ఉంది, ఏదైనా దువాల పుస్తకం ఉంది, అలాంటివి బయట పెట్టి వెళ్ళడం వల్ల, బయట పెట్టి వెళ్ళడం వల్ల ఏదైనా నష్టం అన్నటువంటి భయం ఉండేది ఉంటే లోపల పెట్టి వెళ్ళవచ్చు అని చెప్పారు.
6. ఖిబ్లా దిశ
ఆరో విషయం, ప్రత్యేకంగా ఎడారి ప్రాంతంలో, ఓపెన్ ప్లేస్ లో కాలకృత్యాలు తీర్చుకునే సందర్భంలో ఖిబ్లా దిశలో ముఖము గానీ వీపు గానీ ఉండకూడదు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 394 లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు అన్హు ఉల్లేఖకులు:
కానీ నాలుగు గోడల మధ్యలో ఉండేది ఉంటే అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అలా కూడా ఉండకుండా ముందు నుండే జాగ్రత్తపడటం మరీ మంచిది. ఎందుకనగా అబూ దావూద్ లో హదీస్ నెంబర్ 11 లో, ఇంకా సహీ బుఖారీ వేరే చోట కూడా ఈ హదీస్ ఉంది ఈ భావంలో, సహీ బుఖారీలో ఉంది 148, ఇబ్నె ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఒకసారి ఏదో అవసరం పడి తమ సోదరి అయిన హఫ్సా రదియల్లాహు త’ఆలా అన్హా గారి ఇంటి కప్పు మీదికి వెళ్ళడానికి పైన ఎక్కుతున్నారు. ఆ సందర్భంలో ప్రవక్త గారు ఖిబ్లా దిశలో, ఖిబ్లా దిశలో వీపు పెట్టి తమ కాలకృత్యాలు తీర్చుకున్నట్టు కనబడింది, తర్వాత బహుశా ఆ విషయంలో అడిగారు. అయితే ఈ హదీస్ ద్వారా ధర్మవేత్తలు ఏమన్నారంటే నాలుగు గోడల మధ్యలో ఉండేది ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు. అదే కాకుండా ఒక సందర్భంలో ఇబ్ను ఉమర్ స్వయంగా ప్రయాణంలో ఉన్నారు, అప్పుడు తమ ఒంటెను నిలిపారు, ఖిబ్లా దిశలో మూత్రం పోశారు. ఆ సందర్భంలో మర్వానల్ అస్ఫర్ అనే ఒక వ్యక్తి ఈ సంఘటనను చూసి వెంటనే ప్రశ్నించారు: “యా అబా అబ్దిర్రహ్మాన్, అలైస ఖద్ నుహియ అన్ హాదా? ఖిబ్లా దిశలో ఉండి, ఖిబ్లా దిశలో ముఖం గానీ వీపు గానీ చేసి కాలకృత్యాలు తీర్చుకోవద్దు, మూత్ర మలమూత్రానికి వెళ్ళవద్దు అని మనకు నిషేధించబడలేదా?“అయితే అబ్దుల్లా బిన్ ఉమర్ ఏమన్నారు?
نُهِيَ عَنْ ذَلِكَ فِي الْفَضَاءِ “ఎడారి ప్రాంతంలో, ఓపెన్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఇలా చేయకూడదు అని నిషేధించబడింది.”
فَإِذَا كَانَ بَيْنَكَ وَبَيْنَ الْقِبْلَةِ شَيْءٌ يَسْتُرُكَ فَلاَ بَأْسَ “ఒకవేళ నీ మధ్యలో మరియు ఖిబ్లా మధ్యలో ఏదైనా అడ్డు ఉండి దాని వెనుక నీవు నీ అవసరాన్ని తీర్చుకుంటే అందులో ఎలాంటి అభ్యంతరం లేదు” అని అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు చెప్పారు.
నాలుగు గోడల మధ్యలో ఖిబ్లా దిశలో ఉన్నా గానీ మన టాయిలెట్, ఎలాంటి అభ్యంతరం లేదు అని హదీసుల ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయినా గానీ ఎవరైనా ముందు నుండే దాన్ని కట్టేటప్పుడు ఖిబ్లాకు వ్యతిరేక దిశలో కట్టేది ఉంటే మరీ మంచిది.
7. శపించబడిన స్థలాలు
ఏడవ విషయం, శాపనకు గురి కావలసిన స్థలాల్లో మలమూత్రం చేయకూడదు. శాపనకు గురి కావలసిన స్థలాల్లో అంటే ఏంటి? హదీస్ లో ఇలాగే ఉంది. ముస్లిం షరీఫ్ 269 లో హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు:
اتَّقُوا اللَّعَّانَيْنِ (ఇత్తఖుల్ లఅనైన్) “అధికంగా శాపం ఇచ్చే రెండు విషయాల నుండి మీరు జాగ్రత్త పడండి.”
ప్రవక్తను అడిగారు, వమల్ లఅనాని యా రసూలల్లాహ్? ప్రవక్తా, ఆ రెండు అధికంగా శాపనానికి గురి అయ్యే ఆ విషయాలు ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు:
الَّذِي يَتَخَلَّى فِي طَرِيقِ النَّاسِ أَوْ فِي ظِلِّهِمْ (అల్లది యతఖల్లా ఫీ తరీఖిన్నాసి అవ్ ఫీ దిల్లిహిమ్) “ప్రజల దారి మధ్యలో లేదా నీడలో మలమూత్ర విసర్జన చేసేవాడు.”
అంటే ఆ మలమూత్ర విసర్జన అనేది ఆ ప్రాంతంలో చేయడం ద్వారా ప్రజలు అసహ్యించుకుంటారు, ప్రజలు శపిస్తారు, ఆ శాపనకు అలాంటి వారు గురి అవుతారు.
సునన్ అబీ దావూద్ లో హదీస్ నెంబర్ 26 లో ఉంది, ముఆద్ ఇబ్ను జబల్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు:
اتَّقُوا الْمَلَاعِنِ الثَّلَاثَةَ (ఇత్తఖుల్ మలాయినిస్ సలాస) “మూడు శాపనానికి గురి అయ్యే విషయాల నుండి మీరు దూరం ఉండండి: అల్ బరాజ్ ఫిల్ మవారిద్, వఖారిఅతిత్ తరీఖ్, వ దిల్ల్. నీళ్ళు త్రాగేచోట మల విసర్జన చేయడం, లేదా దారి మధ్యలో దారి పక్కన, ఇంకా నీడ ఉన్నచోట.”
8. తుంపరల పట్ల జాగ్రత్త
ఎనిమిదవ విషయం, శరీరం లేక మన దుస్తులపై ఎలాంటి మలమూత్ర తుంపరలు పడకుండా జాగ్రత్త పడాలి. ఇందులో ఎలాంటి అలసత్వం చేయకపోవడం చాలా మంచిది. ఎందుకనగా ఇది చాలా భయంకరమైన విషయం, ఇది చాలా పెద్ద పాపంలో లెక్కించబడుతుంది. ఘోర పాపంలో. అందుగురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు సునన్ ఇబ్నె మాజా హదీస్ నెంబర్ 348 లో,
أَكْثَرُ عَذَابِ الْقَبْرِ مِنَ الْبَوْلِ (అక్సరు అదాబిల్ ఖబ్రి మినల్ బౌల్) “సమాధిలో ఎక్కువగా శిక్ష దేని గురించి అయితే జరుగుతుందో, అది మూత్ర విసర్జనలో అశ్రద్ధ చేయడం, లేక మూత్ర తుంపరల నుండి జాగ్రత్త పడకపోవడం, లేదా మూత్రం పోసిన తర్వాత పరిశుభ్రత విషయంలో అశ్రద్ధకు గురి కావడం.” ఇవన్నీ భావాలు కూడా అందులో వస్తాయి.
ఇంకా సహీ బుఖారీ హదీస్ నెంబర్ 216 లో ఉంది. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్తూ ఉంటే రెండు సమాధులు కనబడ్డాయి. అందులో ఉన్న ఆ ఇద్దరు మనుషులకు, శవాలకు చాలా శిక్ష అవుతుంది అని చెప్పారు. అయితే ప్రవక్తలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందులో ఒకరి గురించి చెప్పారు,
كَانَ أَحَدُهُمَا لَا يَسْتَتِرُ مِنْ بَوْلِهِ (కాన అహదుహుమా లా యస్తతిరు మిన్ బౌలిహి) “ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి తన మూత్రం నుండి జాగ్రత్త పడేవాడు కాడు, మూత్ర తుంపరలు మీద పడకుండా తనను తాను కాపాడుకునేవాడు కాడు, ఇంకా మూత్రం పోసిన తర్వాత శుభ్రం చేసుకునేవాడు కాడు, శుభ్రం చేసుకున్నా అందులో కూడా అశ్రద్ధతనం పాటించేవాడు.” ఇవన్నీ భావాలు కూడా ఈ హదీస్ లో వస్తాయి. రెండో వ్యక్తి ఎవరు? చాడీలు చెప్పేవాడు.
9. శుభ్రత పద్ధతులు (నీళ్ళు, రాళ్ళు)
తొమ్మిదవ విషయం, మలమూత్ర విసర్జన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. నీళ్లు ఉపయోగించాలి. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 150 లో ఉంది, “ఇదా ఖరజ లిహాజతిహి అజీవు అన వగులామున్ మఅనా ఇదావతున్ మిమ్మాఇన్ యఅనీ యస్తంజీ బిహి.” హజరత్ అనస్ రదియల్లాహు అన్హు గారు ఈ విషయం తెలుపుతున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మలమూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు నేను మరియు ఇంకో నాలాంటి యువకుడు, మేము ఇద్దరము ప్రవక్త గారి వెంట వెళ్ళేవాళ్ళము, మా వెంట మేము నీళ్ళు తీసుకొని వెళ్ళేవాళ్ళము. అయితే ఎక్కడి వరకైతే వెళ్ళేవారో అక్కడికి వెళ్లి, ఆ తర్వాత ఎక్కడనైతే ప్రజల చూపులకు కనబడకుండా వెళ్ళేది ఉందో, అక్కడి నుండి ప్రవక్త ఆ నీళ్లు తమ వెంట తీసుకొని వెళ్ళేవారు. అయితే నీళ్ళతో పరిశుభ్రత అనేది పాటించాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పాటించేవారు అన్న విషయం మనకి ఈ హదీస్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.
అంతే కాదు, సునన్ తిర్మిదీలో, సునన్ తిర్మిదీలో హదీస్ నెంబర్ 19, హజరత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా స్త్రీలతో చెప్పారు. “ముర్న అజ్వాజకున్న అన్ యస్తతీబూ బిల్ మాఇ ఫఇన్నీ అస్తహ్యీహిమ్, ఫఇన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కాన యఫ్అలు.” “మీరు మీ భర్తలకు, మీ పురుషులకు నీళ్ళతో శుభ్రపరుచుకోవాలని, మలమూత్ర విసర్జన తర్వాత నీళ్లు ఉపయోగించాలని, నీళ్లతో శుభ్రపరుచుకోవాలని మీరు ఆదేశించండి. వారికి నేను చెప్పడంలో సిగ్గుపడుతున్నాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే చేసేవారు.”
ఒకవేళ నీళ్ళు లేని సందర్భంలో లేదా నీళ్లతో పాటు కూడా ఇటిక పెడ్డలను, నీళ్ళు పీల్చే రాయిని లేక టిష్యూ పేపర్, ఇలాంటి వాటిని కూడా ఉపయోగించడం మరీ మంచిది. మరీ మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో వచ్చిన తర్వాత సూరె తౌబాలో ఆయత్ నెంబర్ 108 లో,
ఈ మదీనా వాసుల్లో అన్సార్ లో కొందరు, ప్రత్యేకంగా ఖుబా వాసులు, ఖుబా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నవారు, వారిని ప్రశంసిస్తూ ఈ ఆయత్ అవతరించింది. ఏంటి? అక్కడి వాసుల్లో కొందరు పరిశుభ్రంగా ఉండడాన్ని చాలా ప్రేమిస్తారు, మరియు అల్లాహ్ పరిశుభ్రత పాటించే వారిని కూడా ప్రేమిస్తాడు. ఆ మనుషులు ఎవరు? పరిశుభ్రతను చాలా ఇష్టపడతారు. అయితే వారిని ప్రశంసిస్తూ అల్లాహ్ ఏమన్నాడు? వల్లాహు యుహిబ్బుల్ ముత్తహిరిన్ – అల్లాహ్ పరిశుభ్రత పాటించే వారిని ప్రేమిస్తాడు.
అయితే హజరత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు గారు అంటున్నారు, ఇబ్నె ఖుజైమాలో ఈ హదీస్ ఉంది, సహీ హదీస్, వారు నీళ్ళను ఉపయోగించేవారు. అందుగురించి వారి యొక్క ప్రశంసలో అల్లాహ్ త’ఆలా ఈ ఆయత్ ను అవతరింపజేశాడు. అయితే అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు తఫ్సీర్ గ్రంథాల్లో ఈ విషయం ఉంది, వారు నీళ్లతో పాటు మట్టి పెడ్డలను, ఇటికలను ఇలాంటి వాటిని, నీళ్లు పీల్చే అలాంటి వస్తువులను ఉపయోగించేవారు, రెండిటి ద్వారా వారు పరిశుభ్రతను పాటించేవారు గనుక వారిని ప్రశంసిస్తూ అల్లాహ్ త’ఆలా ఈ ఆయత్ ని అవతరింపజేశాడు. అంటే విషయం ఏంటి ఇక్కడ? నీళ్ళు అయితే కంపల్సరీ వాడాలి, నీళ్ళు లేని సందర్భంలో లేక నీళ్లతో పాటు కూడా ఈ వస్తువులు వాడడం కూడా మరీ మంచిది అన్న విషయం ఈ ఆయత్ మరియు దీనికి సంబంధించిన తఫ్సీర్ల ద్వారా మనకు తెలుస్తుంది.
10. గమనించవలసిన మరికొన్ని విషయాలు
అయితే పరిశుభ్రత కొరకు ఎడమ చెయ్యి మాత్రమే ఉపయోగించాలి, కుడి చెయ్యి ఉపయోగించకూడదు. సహీ బుఖారీలో హదీస్ ఉంది, అబూ ఖతాదా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు:
إِذَا بَالَ أَحَدُكُمْ فَلَا يَأْخُذَنَّ ذَكَرَهُ بِيَمِينِهِ وَلَا يَسْتَنْجِ بِيَمِينِهِ “మీలో ఎవరైనా మూత్రం పోయినప్పుడు తన మూత్రాంగాన్ని కుడి చేత్తో పట్టుకోకూడదు. కుడి చేతితో పరిశుభ్రత కూడా చేయకూడదు.”
అలాగే పరిశుభ్రత సందర్భంలో నీళ్లతో మనం పరిశుభ్రం చేసినా గానీ, పెడ్డలతో చేసినా, టిష్యూ పేపర్ తో చేసినా గానీ, మూడేసి సార్లు చేయాలి. కానీ కనీసం. అంతకంటే ఎక్కువ చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. ఏదైనా ఎక్కడికైనా వెళ్లారు, నీళ్ళు లేవు, పెడ్డలు ఉపయోగిస్తాము, మూడు పెడ్డలు తీసుకోవాలి. లేదా ఒక పెద్ద రాయి తీసుకొని మూడు దిక్కుల్లో, మూడు సార్లు… ఈ విషయాన్ని వివరంగా చెప్పడంలో చాలా సిగ్గుపడుతూ ఉంటాము, కానీ అర్థం కావడానికి, ఒక పెడ్డ తీసుకున్నాము, మూత్రం పోసిన తర్వాత తొందరపాటు పడవద్దు. మధ్యలో ఆగి ఉన్న చుక్కలన్నీ పడిపోయేంతవరకు వేచి ఉండాలి. ఆ తర్వాత పెడ్డ తీసుకొని ఒక వైపున తుడువాలి, దాన్ని తిప్పేసి రెండోసారి తుడువాలి, మళ్ళీ తింపేసి మూడోసారి తుడువాలి. లేదా మూడు వేరేవేరే రాళ్లు పెడ్డలు తీసుకోవాలి. అంటే కనీసం మూడుసార్లు ఈ కడగడం అనేది, తుడువడం అనేది జరగాలి.
ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే ఆదేశించారో, ఇబ్నె మాజాలో ఈ హదీస్ ఉన్నది, హదీస్ నెంబర్ 350. కానీ దీని యొక్క లాభాన్ని హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఎలా చెబుతున్నారో శ్రద్ధ వహించండి. ఈ ప్రవక్త గారి ఆదేశం వచ్చిన తర్వాత మేము మూడేసి సార్లు కడిగేవాళ్ళం,
فَوَجَدْنَاهُ دَوَاءً وَطَهُورًا (ఫవజద్నాహు దవాఅన్ వతహూరా) “దాని మూలంగా దానివల్ల పరిశుభ్రత కూడా పొందినాము, ఎన్నో రోగాలకు చికిత్స కూడా మేము పొందాము.”
అలాగే పరిశుభ్రత కొరకు ఎముక, బొక్క, లేదా పేడ లేదా ఎండిన పిడిక, పెండను పిడికగా చేస్తారు కదా, ఆ పిడికలను గానీ ఏ మాత్రం ఉపయోగించకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ సహీ బుఖారీలో 3571 లో ఉంది. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సహాబీకి ఆదేశించారు రాళ్లు తీసుకురమ్మని, కానీ ఏం చెప్పారు?
وَلاَ تَأْتِنِي بِعَظْمٍ وَلاَ بِرَوْثَةٍ (వలా తఅతినీ బిఅద్మిన్ వలా బిరౌసతిన్) “ఎముక గానీ లేదా పేడ గానీ తీసుకురాకు.”
కాలకృత్యాలు తీర్చుకున్నారు, అన్నీ పరిశుభ్రతలు అయిపోయినాయి, తర్వాత ఆ సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగారు, “మీరు ఎందుకు ఈ రెండిటినీ తీసుకురావద్దని చెప్పారు?” అని. అవి మీ సోదరులైన జిన్నాతులకు ఆహారంగా పనిచేస్తాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు.
మలమూత్ర విసర్జన సందర్భంలో సలాం కూడా చేయరాదు, ఎవరైనా సలాం చేస్తే సమాధానం కూడా, జవాబు కూడా ఇవ్వకూడదు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మూత్రం పోస్తున్నారు. కొంచెం దూరంగా ఒక వ్యక్తి వెళ్తూ వెళ్తూ సలాం చేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానం చెప్పలేదు. తర్వాత అతనితో కలిసి చెప్పారు, ఇలాంటి సందర్భంలో మీరు సలాం చేయకండి. ఒకవేళ మీరు సలాం చేసినా నేను మీకు సమాధానం పలుకను. ఈ హదీస్ ఇబ్నె మాజాలో ఉంది 346.
ఇంతవరకు అల్లాహ్ యొక్క దయవల్ల మనం మలమూత్ర విసర్జనకు సంబంధించిన ఇంచుమించు 14, 13 పద్ధతులను, విషయాలను ఆధారాలతో సహా విన్నాము.
చివరి విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో నిలబడి మూత్రం పోసే అవసరం పడవచ్చు. అది ఇస్లాంలో ధర్మమేనా లేదా? అందులో ఎలాంటి అనుమానం లేదు, అది యోగ్యమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఒక సందర్భంలో ఇలాంటి అవసరం పడింది, నిలబడి మూత్రం పోశారు అన్న విషయం సహీ బుఖారీలో హదీస్ నెంబర్ 224 లో ఉంది.
కానీ అవసరం ఉండి నిలబడి పోసినా లేదా సామాన్యంగా కూర్చుండి మూత్రం పోసినా, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే తుంపరలు, మూత్రపు చుక్కలు మీద పడకుండా చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే సమాధిలో ఎక్కువగా శిక్ష దీని గురించే జరుగుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు.
ఈరోజు అల్లాహ్ యొక్క దయవల్ల ఈ విషయాలు ఏదైతే మనం తెలుసుకున్నామో, ఇలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సరైన పద్ధతిలో ఈ అవసరాలు ఇంకా మన సర్వ జీవితం గడిపే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరన్ వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వబరకాతుహ్.
కొన్ని మలమూత్ర విసర్జన పద్దతులు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
1- మరుగుదొడ్డిలో ఎడమ కాలుతో ప్రవేశిస్తూ, ప్రవేశముకు ముందే చదవాలిః
اللَّهُمَّ إِنِّي أَعُوْذُ بِكَ مِنَ الْخُبُثِ وَالْخَبَائِثِ బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్ . (అల్లాహ్ పేరుతో, ఓ అల్లాహ్ నేను దుష్ట జిన్నాతు స్త్రీ పురుషుల నుండి నీ శరణు జొచ్చుచున్నాను). (బుఖారి 142, ముస్లిం 375).
మరుగుదొడ్డి నుండి కుడి కాలు ముందు వేస్తూ బయటకు వచ్చి చదవాలి:
2- అల్లాహ్ పేరుగల ఏ వస్తువూ మరుగుదొడ్డిలోకి తీసుకెళ్ళకూడదు. కాని దాన్ని తీసి పెట్టడంలో ఏదైనా నష్టం ఉంటే వెంట తీసుకెళ్ళవచ్చును.
3- ఎడారి ప్రదేశంలో కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఖిబ్లా వైపున ముఖము, వీపు గానీ పెట్టి కూర్చోకూడదు. నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు ఏలాంటి అభ్యంతరము లేదు.
4- సతర్ పరిధిలోకి వచ్చే శరీర భాగాన్ని ప్రజల చూపులకు మరుగు పరచాలి. ఇందులో ఏ కొంచమైనా అశ్రద్ధ వహించకూడదు. పురుషుల సతర్ నాభి నుండి మోకాళ్ళ వరకు. స్తీ యొక్క పూర్తి శరీరం, నమాజులో కేవలం ముఖము తప్ప. స్తీ నమాజులో ఉన్నప్పుడు పరపురుషులు ఎదురౌవుతే ముఖముపై ముసుగు వేసుకోవాలి.
5- శరీరం లేక దుస్తులపై మలమూత్ర తుంపరులు పడకుండా జాగ్రత్త వహించాలి.
6- మలమూత్ర విసర్దన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. నీళ్ళు లేనప్పుడు నజాసత్ మరకలను దూరము చేయుటకు రాళ్ళు, కాగితము లాంటివి ఉపయోగించవచ్చును. పరిశుభ్రత కొరకు ఎడమ చెయ్యి మాత్రమే ఉపయోగించాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.