మద్రాస్ ప్రసంగాలు – ప్రవక్త ﷺ జీవితచరిత్రకు సంబంధించిన వివిధ కోణాలపై 8 ఖుత్బాలు

الرسالة المحمدية 
السيرة النبوية ورسالة الإسلام
అల్లామా సయ్యిద్ సులైమాన్ నద్వీ
అనువాదం : ముహమ్మద్ జాకిర్ ఉమరీ
దివ్యఖుర్ఆన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్, హైదరాబాద్.

మద్రాస్ ప్రసంగాలు అంటే ప్రవక్త ﷺ జీవితచరిత్రకు సంబంధించిన వివిధ కోణాలపై 8 ఖుత్బాలు. వీటిని, సయ్యిద్ సులైమాన్ నద్వీ 1925లో అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో ప్రతివారం లల్లీ హాల్ లో  మద్రాస్ లోని ఇంగ్లీషు మీడియం విద్యార్ధులు మరియు ముస్లిములముందు ప్రసంగించారు.

[ ఇక్కడ పూర్తి పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి PDF]
[ మొబైల్ ఫ్రెండ్లీ] [PDF] [178 పేజీలు] [3.61 MB]

విషయసూచిక

అన్ని చాఫ్టర్లు PDF లింకులు గా క్రింద ఇవ్వబడ్డాయి. లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చదవవచ్చు.

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

ముందుమాట (మూడవ ప్రచురణ)

ఒక క్రమంలో లేకపోయినా, ఈ ప్రసంగాలపై ప్రజలు అంతులేని ఆదరాభిమానాలు చూపారు. అన్ని వర్గాల ముస్లిములూ వీటిని స్వీకరించి చదివారు. స్కూళ్ళలో, కాలేజీల్లో, సభల్లో అన్నిచోట్లా వీటి ద్వారా శిక్షణ ఇవ్వటం జరిగింది. ఇదంతా అల్లాహ్ దయవల్లే జరిగింది కనుక, నేను అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను.

ఈ పుస్తకంలోని కొన్ని ప్రసంగాల్లో ముహమ్మద్(స) చరిత్రను ఇతర ప్రవక్తల చరిత్రలతో పోల్చడం, పరికించటం జరిగింది. ఇలాంటి సందర్భాలలో గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యవిషయం ఏమిటంటే, ముస్లిములే ఇతరులకంటే ఎక్కువగా ఇస్లామ్ వ్యతిరేకతకు పాల్పడుతున్నారు. ప్రవక్తలను గుర్తించినవారి గ్రంధాలలో ఉన్నట్టు ఇతర ప్రవక్తల చరిత్రలను ముందుంచి బోధించటం జరిగింది. వాస్తవం ఏమిటంటే, ప్రతి ప్రవక్త ఇస్లామ్ దృష్టిలో పరిపూర్ణుడు, మచ్చలేనివాడు, లోపం లేనివాడు. వీరిలో ప్రతి ఒక్కరూ మహా ఉత్తములే. వీరి మధ్య కాలం, ఆచరణల వ్యత్యాసం ఉన్నప్పటికీ వీరిపై ఎటువంటి విమర్శలకు తావు లేదు. అలాంటి వాటికి వీరు అతీతులు.

ముందుగా ఈ ప్రసంగాలు 1926లో నాకు పరోక్షంగా అంటే, నేను హిజాజ్ లో ఉన్నప్పుడు ప్రచురించ బడ్డాయి. వీటిని నా దస్తావీజుల ద్వారా ప్రచురించడం జరిగింది. రెండవసారి కూడా ఇలాగే ప్రచురించడం జరిగింది. ఇప్పుడు మూడవసారి ప్రచురించటానికి ముందు వీటిని క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం లభించింది. అయినప్పటికీ ఈ నిమిత్త మాత్రుడు వ్రాసినది ఎటువంటి ఆరోపణలు, ఆక్షేపణలు లేకుండా ఉండదని నేను భావిస్తున్నాను.

27 షఅబాన్ 1355 హిజ్రీ (14 నవంబర్ 1926 క్రీ.శ)                                                                            

మీ సోదరుడు,
సయ్యిద్ సులైమాన్ నద్వీ  

ముందుమాట (మొదటి ప్రచురణ)

ముందు పేజీల్లో ప్రవక్త ముహమ్మద్(స) జీవిత చరిత్రలోని వివిధ కోణాలకు సంబంధించిన కొన్ని ప్రసంగాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని ఇస్లామిక్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ కోరికపై 1925 అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ ప్రసంగాలు చేయడం జరిగింది. కొన్ని సంవత్సరాలుగా ఒక అమెరికన్ క్రైస్తవుని సహాయసహకారాల ద్వారా మద్రాస్ లోని యూనివర్సిటీ విద్యార్ధుల ముందు క్రైస్తవ పండితులు ఏసుక్రీస్తు జీవిత చరిత్రపై ప్రసంగాలు చేస్తూ ఉండటం జరిగేది. ఈ ప్రసంగాలు ప్రతి సంవత్సరం జరిగేవి. శ్రోతలు వీటిని చాలా భక్తిశ్రధ్ధలతో వినటం జరిగేది. అది గమనించిన ముస్లిమ్ విద్యావంతులకు, ఇక్కడి ఇంగ్లీషు మీడియమ్ ముస్లిమ్ విద్యార్ధుల కోసం కూడా ఇటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అంటే ప్రతిసంవత్సరం ఒక ముస్లిమ్ పండితుడిని రప్పించి, అతని సేవలు తీసుకుందామని, అతడు ఇస్లామ్ మరియు ప్రవక్త ముహమ్మద్(స) పై విద్యార్ధుల ముందు ఇంగ్లీషులో ప్రసంగాలు చేస్తే బాగుంటుందని భావించారు.

అదృష్టవశాత్తు ఈ మహాకార్యానికి మద్రాస్ లోని ఒక మహా వ్యక్తి సేఠ్ ఎమ్ జమాల్ ముహమ్మద్ సాహిబ్  ధనసహాయ సహకారాల బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇతను అనేక ముస్లిమ్ స్కూళ్ళకూ, మదర్సాలకు ధనసహాయం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా చేస్తూ ఉండాలని ఆశిస్తున్నాము. ఈ ఖత్బాతె ఇస్లామీయహ్ మద్రాస్ పరంపర యూరప్ లోని ప్రఖ్యాత ఖుత్బాల పరంపరలా లాభదాయకమైనవిగా, ప్రముఖమైనవిగా పేరుపొందుతాయి.

ఈ మహా పవిత్రకార్యానికి నాలాంటి నిమిత్తమాత్రున్ని ఎన్నుకోవడం జరిగింది. దీన్ని నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈవిధంగా ఈ మహాపవిత్ర పరంపరలో మొదటి ముత్యాన్ని అయ్యాను. ఈ ప్రసంగాలు మద్రాస్ లోని లాలీహాల్ లో ప్రతివారం ఒకసారి లేదా రెండుసార్లు, మగ్రిబ్ సలాహ్ తరువాత ఇవ్వడం జరిగేది. ఈ 8 ప్రసంగాలు 1925 అక్టోబర్ మొదటివారంలో ప్రారంభమై 1925 నవంబర్ చివరి వారంలో ముగిసాయి. అలాగే ఈ ఎనిమిది ప్రసంగాల కోసం అన్నివిధాలా నిర్వహణా, ప్రకటన, వాటి ఇంగ్లీషు అనువాదం మొదలైన బాధ్యతలు నిర్వర్తించిన హమీద్ హసన్ గారికి కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను. అదే విధంగా నా పొడిపొడి మాటల ప్రసంగం వినటంలో రెండు లేక మూడు గంటలు ఓర్పూ సహనాలతో విన్న మద్రాస్ ముస్లిములకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఉర్దూ భాష సరిగా అర్ధం కాక పోయినప్పటికీ సభల్లో పాల్గొని సత్యాన్వేషణకు ప్రయత్నించిన ముస్లిమేతర సోదరులకు నేను కృతజ్ఞతలు తెలుపు  కుంటున్నాను. అదేవిధంగా ప్రతివారం ప్రసంగాల సారాంశాన్ని తమ పత్రికల్లో ప్రచురించిన హిందూ, డైలీ ఎక్స్ ప్రెస్, దినపత్రికలకూ కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను.  చివరిగా ఈ ప్రసంగాలను కాగితాల రూపంలో పాఠకుల ముందు ఉంచిన వారి ఈ ప్రయత్నాన్ని స్వీకరించమని, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అత్యధిక పుణ్యాన్ని ప్రసాదించమని దైవాన్ని ప్రార్ధిస్తూ శెలవు తీసుకుంటున్నాను

కారుణ్య అభ్యర్ధి
సయ్యిద్ సులైమాన్ నద్వీ
దీస్నా, బీహార్ .

ముందుమాట

సోదరులారా! ముస్లిమ్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్ ఆఫ్ సదరన్ ఇండియా ఆహ్వానంపై 15 సంవత్సరాల తర్వాత ఈనాడు మీ సేవలో హాజరయ్యే, ఇక్కడకు వచ్చి మీ ముందు మహాప్రవక్త(స) జీవిత చరిత్రకు సంబంధించిన వివిధ కోణాలపై ప్రసంగించే అవకాశం లభించింది. ఇవి మొత్తం 8 ప్రసంగాలు. వేర్వేరు సభలలో మీముందు ఉంచ బడతాయి. వాటి క్రమ సంఖ్య ఈ విధంగా ఉంది.

1. మానవత్వానికి పరిపూర్ణత కేవలం ప్రవక్తల చరిత్రల ద్వారానే లభిస్తుంది.
2. సార్వజనికమైనదీ, ఆదర్శప్రాయమైనదీ ప్రవక్త ముహమ్మద్(స) జీవిత చరిత్ర మాత్రమే.
3. ప్రవక్త ముహమ్మద్(స) జీవితంలోని చారిత్రాత్మక కోణాలు.
4. ప్రవక్త ముహమ్మద్(స) జీవితంలోని పరిపూర్ణతా కోణాలు.
5. ప్రవక్త ముహమ్మద్(స) జీవిత విశిష్టతలు.
6. ప్రవక్త ముహమ్మద్(స) జీవితంలోని ఆచరణాత్మక కోణాలు.
7. ప్రవక్త ముహమ్మద్(స) యొక్క సందేశం.
8. ప్రవక్త ముహమ్మద్(స) పిలుపు (విశ్వాసం,సత్కార్యాలు)

తన ముస్లిమ్ యువకులకు ఇస్లామీయ ప్రసంగాల పరంపర ద్వారా తమ మతాన్ని, ధర్మాన్ని గురించి తెలియజేసే పధ్ధతిలో దేశంలోని రాష్ట్రాలలో అన్నిటికంటే ముందు మద్రాస్ నగరం మొట్టమొదట ముందడుగు వేసింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల కంటే ముందు ఇస్లామ్ వెలుగు పడింది ఈ మద్రాస్ భూభాగంలోనే. ముస్లింలు మొట్టమొదట కాలు మోపింది ఈ భూభాగం పైనే. చంద్రుడు రెండుగా చీల్చబడిన సంఘటన యొక్క వెలుగు అరేబియా సముద్రం దాటి హిందూ మహాసముద్ర తీరానికి చేరి ఇక్కడి హృదయాలను వెలుగుతో నింపింది. తుహ్ఫతుల్ ముజాహిదీన్ లోని ఉల్లేఖనను సత్యమైనదిగా భావిస్తే, దాన్ని మన ముస్లిమ్ సోదరులు డాక్టర్ గులామ్ ముహమ్మద్ సమర్ధిస్తున్నారు. ఎందుకంటే ఆయన మద్రాస్ లోని హిందువుల సంస్కృత పుస్తకంలో ఈ సంఘటన గురించి ప్రస్తావన ఉన్నట్టు చూచి, దాన్ని ప్రచురించారు. దీన్ని బట్టి చూస్తే, మద్రాస్ కు చెందిన ఈ ధార్మిక సంస్ధ దీనిలో ముందడుగు వేసిందంటే, ఇందులో ఆశ్చర్య పడనక్కరలేదు.  ఎందుకంటే 1300 సంవత్సరాల నుండీ ఈ ప్రాంతానికి  ఆ హక్కు ఉంది. ఇతర రాష్ట్రాల ఇస్లామీయ సంస్ధలు కూడా దీన్ని అనుసరిస్తాయని ఆశిస్తున్నాను.

మిత్రులారా ! నేనిప్పుడు మీ ముందు ఉర్దూలో ప్రసంగం చేస్తున్నాను. ఉర్దూభాష భారతదేశంలో చాలా అభివృధ్ధి చెందింది. ఇది దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ వాడుకలో ఉంది. మద్రాస్ లో నిర్వహించబడిన ఈ ప్రసంగాలు ఉర్దూభాష కన్నా ఇంగ్లీషులో ఉండవలసింది. దీనివల్ల అందరికీ లాభం చేకూరేది. అందువల్లే ధార్మిక పండితులపై ఈనాడు ఇంగ్లీషు భాష నేర్చుకోవటం తప్పనిసరి విధి అని అర్థమవుతున్నది. మన పండితులు ప్రపంచ భాషలన్నిటిలోనూ దైవ సందేశాన్ని ప్రజలకు అందజేసే స్ధితికి ఎదగాలని అల్లాహ్ ను ప్రార్ధిస్తున్నాను. 

1.మానవత్వానికి పరిపూర్ణత కేవలం ప్రవక్తల జీవితగాధల ద్వారానే లభిస్తుంది.

ప్రపంచం అద్భుతాలు, ఆశ్చర్యాలు గల కర్మాగారం. ఇందులో అనేక రకాల జీవులున్నాయి. ప్రతి జీవికి ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. నిర్జీవ పదార్ధాలు మొదలు మానవుని వరకు దృష్టిసారిస్తే, వీటిలో క్రమక్రమంగా గమనించేశక్తి, అర్ధం చేసుకునేశక్తి, సంకల్పశక్తి వృధ్ధి చెందుతూ ఉంటుంది. ఘన పదార్ధాల ప్రారంభ స్ధితి అంటే రేణువులు. వీటిలో ఎటువంటి శక్తీ లేదు. ఘన పదార్ధాల ఇతర రకాల్లో జీవితం ఉన్నట్టు కనిపిస్తుంది. నిర్ణయాధికారం లేని పెరుగుదల స్ధితి మొక్కల్లో కనబడుతుంది. జంతువుల్లో ఆలోచనా శక్తితో పాటు నిర్ణయాధికారం కూడా ఉంది. అయితే మానవునిలో గమనించే గుణంతో పాటు అర్ధం చేసుకునే, నిర్ణయం తీసుకునే సర్వాధికారాలు ఉన్నాయి. ఈ గ్రహించే శక్తి, అర్ధం చేసుకునే శక్తి, నిర్ణయం తీసుకునే శక్తి మన బాధ్యతలకు అసలు కారణం. సృష్టితాల్లోని వేటిలో ఈ విషయాలు తగ్గుతూ పోతాయో వాటి ప్రకారం వాటి బాధ్యతలు కూడా తగ్గుతూ పోతాయి. నిర్జీవులకు ఎటువంటి బాధ్యతలూ లేవు. మొక్కల్లో జీవన్మరణాలకు సంబంధించిన కొన్ని విధులు ఉన్నాయి. జంతువుల్లో మరికొన్ని బాధ్యతలు, విధులు అధికమవుతాయి. కాని మానవున్ని చూడండి, నియమనిబంధనలతో అన్ని వైపుల నుండి బంధించ బడి ఉన్నాడు. వివిధ రకాల మానవులను చూడండి. స్పృహ కోల్పోయినవారు, పిచ్చివారు, అవివేకులు, బుధ్ధిమంతులు, వివేకవంతులు, అంటే వివిధ రకాలకు చెందినవారు ఉన్నారు. ఈ గ్రహించే, అర్ధం చేసుకునే, స్వనిర్ణయ శక్తుల హెచ్చుతగ్గుల ప్రకారమే వారివారి విధులు, బాధ్యతలు వర్తిస్తాయి. కొందరికి బాధ్యతలు, సమస్యలు అధికంగా ఉంటే మరికొందరికి తక్కువగా ఉంటాయి.

మరో విధంగా చూడండి, గ్రహణశక్తి, పొందేశక్తి, స్వనిర్ణయం ఎంత తక్కువగా ఉంటే, దైవం అంత అధికంగా సంరక్షణా, పోషణా బాధ్యతలు తనపై వేసుకుంటాడు. క్రమక్రమంగా జీవులు శక్తివంతంగా తయారవుతున్న కొలది దైవం దాని శక్తికి తగిన బరువు బాధ్యతల్ని దానిపై వేస్తాడు. కొండలను పర్వతాలను ఎవరు సంరక్షిస్తున్నారు? జంతువుల వ్యాధులను, వేడిమిని, చలి తీవ్రతను ఎవరు కనిపెట్టుకొని ఉన్నారు? చివరికి శీతల, ఉష్ణప్రదేశాల్లో, కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో, ఎడారుల్లో జీవించే ఒకే రకానికి చెందిన జీవాలు & జంతువులైనా వాతావరణ వ్యత్యాసం వల్ల వాటి అలవాట్లు, ఆహారం, ఇతర అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది.

యూరప్ కుక్కల్లో, ఆఫ్రికా కుక్కల్లో, వాటి అవసరాల్లో, వాటి పంజాల్లో, వాటి వెంట్రుకల్లో, ఉన్నిలో, చర్మంలో, రంగుల్లో, ఇతర విషయాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇవి కేవలం లాభం పొందే మార్గాలు, విధానాలు మాత్రమే. దీనివల్ల తెలిసిన విషయం ఏమిటంటే శక్తికి తగినట్టు దైవం ప్రాణికి బాధ్యతలను కూడా కట్టబెడతాడు.

మానవుడు తన ఆహారం కోసం తానే ఏర్పాటు చేసుకోవాలి. అతడు వ్యవసాయం ద్వారా, చెట్ల ద్వారా, తోటల ద్వారా పళ్ళనూ, ఆకుకూరలను, ఆహారధాన్యాలను సమకూర్చుకుంటాడు. చలి నుండి, వేడి నుండి రక్షించు కోవటానికి సహజంగా చర్మంగానీ, వెంట్రుకలుగానీ, ఉన్నిగానీ ఇవ్వబడలేదు. వాటిని వివిధ దుస్తుల రూపంలో స్వయంగా తయారుచేసుకోవాలి. వ్యాధులను, గాయాలను నయం చేయటానికి స్వయంగా కృషి చేయవలసి ఉంటుంది.

మరోవైపు చూడండి, ఎక్కడ ఈ శక్తులు బలహీనంగా ఉంటాయో, అక్కడ శత్రువుల నుండి రక్షణ, ప్రాణరక్షణ మొదలైన సదుపాయాలు దైవం తనపై వేసుకుంటాడు. వివిధ రకాల జంతువులకు వాటి ఆత్మరక్షణ కోసం అనేక సాధనాలు కల్పించబడ్డాయి. కొన్నిటికి పదునైన పంజాలు, కొన్నిటికి పదునైన పళ్ళు, కొన్నిటికి కొమ్ములు, కొన్నిటికి ఎగిరేశక్తి, కొన్నిటికి ఈతశక్తి, కొన్నిటికి వేగంగా పరిగెత్తేశక్తి, కొన్నిటికి కాటువేసేశక్తి, కొన్నిటికి పళ్ళలో విషం మొదలైన సాధనాలు, ఆయుధాలు ఇచ్చి దైవం వాటి రక్షణా ఏర్పాట్లు చేయడం జరిగింది.

కాని ఈ పేద మానవుని దగ్గర తన్ను తాను రక్షంచుకోవటానికి ఏనుగు దంతాలు లేవు, తొండమూ లేదు, పదునైన పళ్ళూ లేవు, గోర్లుగల పంజాలూ లేవు, కొమ్ములూ లేవు. కుక్కల్లా, పాముల్లా, తేళ్ళులా, కందిరీగల్లా విషమూ లేదు. మానవుడు అన్నివిధాలా ఆయుధాలు లేని నిస్సహాయుడిగా మిగిలాడు. కాని వీటన్నిటి స్ధానంలో అతనికి గ్రహణశక్తి, కండబలం, బుధ్ధీ జ్ఞానాలు, నిర్ణయాధికారం మొదలైన మహాశక్తులు ఇవ్వబడ్డాయి. ఈ శక్తులే అన్నివిధాలా అతని బాహ్య బలహీనతలను తొలగిస్తాయి. మానవుడు తన ఈ శక్తుల వల్లే పెద్దపెద్ద పళ్ళుగల, తొండాలు గల ఏనుగులను సైతం తన అధీనంలోనికి తీసుకుంటాడు. పదునైన పంజాలు, పళ్ళుగల క్రూరమృగాలను చీల్చివేస్తాడు. మహా భయంకర విషసర్పాలను పట్టుకుంటాడు. గాలిలోని పక్షులను మచ్చిక చేసుకుంటాడు. నీటిలోని జీవులను బంధిస్తాడు. ఇంకా తన ఆత్మరక్షణ కోసం ఆయుధాలు, మందుగుండు ఇంకా ఇతర పరికరాలను తయారు చేసుకుంటాడు.

మిత్రులారా! మీరు ఏ మతానికి చెందిన వారైనా, మీ ఈ బాధ్యతలకు మీ గ్రహణ, నిర్ణయ, బుధ్ధీ మొదలైన శక్తులే అసలు కారణం అని అంగీకరించక తప్పదు. ఇస్లామ్ లో ఈ బాధ్యతలకు శ్రమ అని అంటారు. ఈ శ్రమ మీ అంతర్బాహ్య శక్తులకు తగినట్టు విధించడం జరుగుతుంది. ఇస్లామ్ దైవనియ మావళిని ఇలా వివరిస్తుంది.

لَا يُكَلِّفُ ٱللَّهُ نَفۡسًا إِلَّا وُسۡعَهَاۚ   (البقرة286)
అల్లాహ్ ఏ ప్రాణిని దాని శక్తికి మించిన శ్రమకు గురిచేయడు.            (అల్ బఖరహ్-286)

ఈ శ్రమ, బాధ్యత, విధిని వృక్షజాతి, జంతుజాతి అంతేకాదు పెద్దపెద్ద పర్వతాలు, ఆకాశాలు నిర్వర్తించడానికి ముందుకు రాలేదు. ఖుర్ఆన్ లో మరోచోట అమానతుగా పేర్కొనటం జరిగింది. ఈ అమానతు బాధ్యతను సృష్టిలో ఉన్న జీవనిర్జీవాలు, వృక్షజాతి, జంతుజాతి అంతేకాదు పెద్దపెద్ద పర్వతాలు, ఆకాశాలు నిర్వర్తించడానికి ముందుకు రాలేదు.

اِنَّا عَرَضْنَا الأَمَانَةَ عَلي السَّموتِ وَ الأَرْضِ وَالجِبَالِ فَأَبَيْنَ أَنْ يَحْمِلْنَهَا وَ اَشْفَقْنَ مِنْهَا وَ حَمَلَهَا الإِنْسَانُ إِنَّهُ كَانَ ظَلُومًا جَهُولاً.  (الأحزاب72)

మేము అమానతును ఆకాశాల ముందూ, భూమి ముందూ, పర్వతాల ముందూ పెట్టాము.  అవి దానిని మోయటానికి సిధ్ధపడలేదు. కాని మానవుడు దాన్ని తనపై వేసుకున్నాడు. నిస్సందేహంగా అతడు అత్యాచారి, జ్ఞానహీనుడూను.(అహ్జాబ్-72)

అత్యాచారి, అవివేకి, పిచ్చివాడు ఇవన్నీ ప్రేమకు మారుపేర్లు. అత్యాచారి అంటే తన హద్దులను అతి క్రమించేవాడు. ఈ గుణం మానవుని ఆచరణాశక్తి నిలకడగా ఉండకపోవటాన్ని సూచిస్తుంది. అజ్ఞాని, అవివేకి అనేవి అతడి బుధ్ధీజ్ఞానాల హద్దులను అతిక్రమించటాన్ని సూచిస్తున్నాయి. అత్యాచారికి వ్యతిరేకం న్యాయశీలుడు, అజ్ఞానికి వ్యతిరేకం జ్ఞాని. అయితే మానవుడు జ్ఞానాన్ని, న్యాయగుణాన్ని సులువుగా పొందలేడు. వీటిని పొందాలంటే తన ఆచరణాశక్తినీ, మిధ్యేమార్గాన్నీ, బుధ్ధీజ్ఞానాలను ఉపయోగించటం తప్పనిసరి. ఖుర్ఆన్ పరిభాషలో న్యాయానికి మారుపేరు సత్కార్యం, జ్ఞానానికి మారుపేరు విశ్వాసం.

وَ العَصْرِاِنَّ الإنْسَانَ لَفِي خُسْرٍإِلاَّالَّذِيْنَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ, وَتَوَاصَوْا بِالحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ. (العصر103)

కాలంసాక్షిగా ! నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురయిఉన్నాడు. అయితే విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండేవారూ, ఇంకా ఒకరికొకరు పరస్పరం సత్యాన్ని గురించి, సహనాన్ని గురించి బోధించుకునేవారు తప్ప. (అల్అస్ర్-103)

ఈ నష్టమంతా ఆచరణలో గల అతిక్రమించటం, జ్ఞానహీనత వల్లనే. దీనికి సరైన చికిత్స విశ్వాసం. అంటే సత్యజ్ఞానం మరియు న్యాయం అంటే సత్కార్యాలు. ఈ వాస్తవానికి సాక్ష్యంగా అంటే మానవునికి విశ్వాసం, సత్కార్యాల భాగ్యం కలగనంత వరకు మానవుడు తీవ్రనష్టానికి గురయి ఉంటాడని, ఇక్కడ కాలాన్ని పేర్కొనడం జరిగింది. కాలం అంటే గాధలు, చరిత్రలు, సంఘటనలు, చిహ్నాలు. ఇవన్నీ కాలం ప్రారంభమయిన దగ్గరినుండి ఇప్పటి వరకు ఉద్భవిస్తున్నాయి. కార్లాయిల్ అభిప్రాయం ప్రకారం చరిత్ర అంటే కేవలం గొప్పవారి జీవితగాధల పరంపర మాత్రమే. అయితే ప్రపంచంలో ఉద్భవించిన జాతులు, వర్గాలు, వ్యక్తులూ విశ్వాసం, సత్కార్యాలను అవలంభించనంత వరకు తీవ్రనష్టానికే గురి అయి ఉండేవారని చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయి.

ప్రపంచంలో దైవగ్రంధాలు, ధార్మిక గ్రంధాలు, నీతికధలు, సామెతలు మొదలైనవి ఉన్నాయి. అత్యాచారం, అజ్ఞానం, అవిశ్వాసం, న్యాయం, సత్కార్యాల రంగులతో నిండి ఉన్నాయి. ఒకవైపు అత్యాచారం, అజ్ఞానం, చెడు, అంధకారం, మరోవైపు న్యాయం, సత్కార్యం, మంచి, వెలుగుతో కూడిన సామెతలు, నీతి కధలు, గాధలు, చరిత్రలు ఉన్నాయి. మానవ బాధ్యతలను స్వీకరించిన వారిని ప్రశంసించడం జరిగింది. నిరాకరించిన వారిని గురించి చెడుగా ప్రస్తావించటం జరిగింది. యూనానీ అలిడ్, రూమీపేర్లల్ లాటూస్, ఈరానీ షాహ్నామ, హిందీ మహాభారత్, రామాయణం, గీత మొదలైనవన్నీ ఏమిటి? ప్రతి జాతిలోని వారి మహాపురుషుల జీవితాల్లోని జరిగిన మంచీ, చెడుల పోరాటాలు, సంగ్రామాలు, యుధ్ధాలు, సత్యాసత్యాలు, పాపపుణ్యాల గుణపాఠం నేర్పే గాధలు. వీటివల్ల ప్రతిజాతి చెడు, దుర్మార్గం, అవిశ్వాసం, ధిక్కారాల చెడు ఫలితాల నుండి తప్పించుకొని న్యాయం, ధర్మం, విశ్వాసం మొదలైన ఉపమానాల నుండి లాభం పొందాలని.

తౌరాతు, ఇంజీలు, జబూర్ మరియు ఖుర్ఆన్ లోని అనేక అంశాలు కూడా ఇలాంటివే. అత్యాచారుల, అల్లరిమూకల, అవిశ్వాసుల జాతులు మరియు వారి వ్యక్తుల పతనం, వినాశనం, అదేవిధంగా న్యాయశీలురు, పుణ్యాత్ములు, విశ్వాసులు గల జాతుల్లోని వ్యక్తుల అదృష్టం, సాఫల్యం, విజయం మొదలైన వాటి ఉపమానాలు ఉన్నాయి. వాటిని విని అత్యాచారులు న్యాయశీలురు కావాలని, హింసించేవారు పుణ్యాత్ములు కావాలని, అవిశ్వాసులు విశ్వాసులు కావాలని. అందువల్లే అంతిమ ప్రవక్త(స)కు ముందు ప్రతియుగంలో ప్రతిదేశంలో అల్లాహ్(త) సందేశహరులను పంపాడు. వారు తమ జాతుల ముందు తమ జీవితాన్ని ఆదర్శంగా చూపాలని. వారిజాతి అంతా లేదా వారిలోని పుణ్యాత్ములందరూ సాఫల్యం పొందాలని. చివరిగా అంతిమ ప్రవక్త(స)ను పంపడం జరిగింది. ప్రపంచ ప్రజలందరి కొరకు తన ఆదర్శ జీవితాన్ని విడిచి వెళ్ళాలని. ప్రవక్త(స) నోటిద్వారా శాశ్వతంగా ఖుర్ఆన్ ఈ విధంగా ప్రకటించింది.

فَقَدْ لَبِثْتُ فِيْكُمْ عُمُرًا مِنْ قَبْلِهِ أَفَلَا تَعْقِلُونَ (يونس16)

నేను ఇంతకు ముందు నుండీ మీ మధ్యే నా జీవితాన్ని గడిపాను.ఈ మాత్రం మీరు గమనించరా? (యూనుస్-16)

ఈ వాక్యంలో దైవవాణి తన ప్రవక్త యొక్క జీవిత చరిత్రను దైవదౌత్యానికి సాక్ష్యంగా పేర్కొంది. ఏదేమైనా చరిత్ర పుటల్లో వేలమంది మహాపురుషులు ఉన్నారు. తమ తరువాత తరాల కోసం తమ జీవితాన్ని ఆదర్శంగా వదలి వెళ్ళారు. ఒకవైపు రాజుల, చక్రవర్తుల వైభవాలతో కూడిన సభలున్నాయి. మరోవైపు సైన్యాధిపతుల యుధ్ధసైన్యాలు ఉన్నాయి. ఒకవైపు విజయోత్సాహంతో కూడిన సైనిక బలగాలు ఉన్నాయి. ఒకవైపు కవుల కవిత్వాలతో నిండిన సభలు ఉన్నాయి. మరోవైపు ధనికుల సుతిమెత్తని దిండులు, నిగనిగలాడుతున్న ఇనప్పెట్టెలు ఉన్నాయి. వీరిలో ప్రతి ఒక్కరి జీవితం తమ వైపు ఆకర్షిస్తుంది. వీరందరి జీవితాల్లోనూ ఆకర్షణ ఉంది. అదేవిధంగా ప్రపంచంలో పాలించిన పాలితుల్లో ఒక ప్రత్యేకరంగు కనబడుతుంది. అదేవిధంగా నమ్రూద్, ఫిర్ఔన్, అబూజహ్ల్, అబూలహబ్ ల జీవితాలు ఉన్నాయి. ఖారూన్ ది మరో విధమైన జీవితం.

ఏదేమైనా ప్రపంచంలో వేలాది రకాల జీవితాల ఉపమానాలు ఉన్నాయి. ఇవన్నీ మానవ జీవితానికి సంబంధించినవే. అయితే ఎవరి జీవితం మానవులందరికీ ఆదర్శమైనదో, లాభదాయకమైనదో, అనుసరించదగ్గదో మీరు చూపెట్టగలరా? వీరిలో గొప్ప అజేయులు, సైన్యాధిపతులు ఉన్నారు. వీరు తమ కరవాలాలతో ప్రపంచాన్ని గడగడలాడించారు. కాని మానవ కళ్యాణానికి, శ్రేయస్సుకు వారు ఏదైనా ఆదర్శం వదలివెళ్ళారా? వారి ఖడ్గాలు యుధ్ధ మైదానాన్ని దాటి మానవత్వం చిక్కుకున్న మూఢ నమ్మకాలను, మూఢ విశ్వాసాలను పటాపంచలు చేసాయా? మానవ పరస్పర సంబంధాలను సంస్కరించాయా? మానవ సమాజాన్ని సరిదిద్దాయా? మానసిక విచారాలకు, దు:ఖాలకు ఏదైనా చికిత్స చూపెట్టాయా? మానవ హృదయాలకు అంటుకున్న అపరిశుభ్రతను, త్రుప్పును తొలగించాయా?  మన నైతిక విలువలకు, క్రియలకు ఏదైనా గొప్ప స్ధానాన్ని కల్పించాయా?

ప్రపంచంలో గొప్పగొప్ప కవులు కూడా జన్మించారు. కాని ఊహా ప్రపంచానికి చెందిన ఈ శూరులు వాస్తవ ప్రపంచంలో పనికిరాని వారుగా పరిగణించబడ్డారు. అందువల్లే అఫ్లాతూన్ పాలనావ్యవస్ధలో వీరికి ఎటువంటి స్ధానమూ దక్కలేదు. హౌమర్ నుండి ఈనాటి వరకు కొద్దిక్షణాల ఉత్సాహం, సందడిని సృష్టించడం, ఊహాలోకంలోని తియ్యటి బాధను పరిచయం చేయటం తప్ప మానవులకు జీవిత కష్టాలను, బాధలను దూరంచేసే ఎటువంటి సలహాను ఇవ్వలేకపోయారు. ఎందుకంటే వీరి తియ్యటి పలుకుల వెనుక ఆదర్శమైన ఎటువంటి ఆచరణా లేకపోవడమే. అందువల్ల ఖుర్ఆన్ ఇలా వివరించింది.

وَ الشُّعَرَآءُ يَتَّبِعُهُمُ الغَاؤُنَ ,اَلَمْ تَرَ أَنَّهُمْ فِي كُلِّ وَادٍ يُهِيمُونَ وَ اَنَّهُمْ يَقُولُونَ مَا لَا يَفْعَلُونَ , إلَّا الذِينَ آمَنُوا وَ عَمِلُوا الصَّالِحَاتِ . (الشعراء224-227)

ఇక కవులు, వారి వెనుక మార్గభ్రష్టులే నడుస్తారు. వారు ప్రతిలోయలో దారి తప్పటాన్నీ, తాము ఆచరించని దానిని చెప్పటాన్నీ నీవు చూడటం లేదా? అయితే విశ్వసించి సత్కార్యాలు చేసేవారు తప్ప.(224-227)

ఖుర్ఆన్ వీరి ప్రభావంలేని తీపి పలుకుల వాస్తవాన్ని వివరిస్తూ వీరు ఊహాలోకాల్లో తచ్చాడుతూ ఉంటారని,  వీరిలో విశ్వాసం, సత్కార్యాలు నామ మాత్రానికైనా ఉండవని పేర్కొంది. వారు ఏమాత్రం విశ్వాసం, సత్కార్యాలను అవలంభించినా వారి మాటల్లో తప్పకుండా కొంతైనా ప్రభావం ఉంటుంది. అందువల్లే వీరు, రుజుమార్గ సందేశం, సంస్కరణ వంటి మహాకార్యాలను నెరవేర్చలేరు. స్వయంగా కాలచరిత్ర దీనికి సాక్ష్యంగా ఉంది.

తత్వవేత్తలు, విద్యావేత్తలు తమ బుధ్ధీ, వివేకాలను ఉపయోగించి విశ్వరూపురేఖల్నే మార్చివేసారు. వీరు ఈ వింత విశ్వంలోని ఆశ్చర్యకరమైన తమ అభిప్రాయాలను ముందుంచారు. కాని వీరుకూడా రుజుమార్గానికి సంబంధించిన ఎటువంటి చిత్రపటాన్నీ చూపలేకపోయారు. ఇంకా మానవ విధులకు సంబంధించిన ఎటువంటి చిత్రపటాన్నీ చూపలేకపోయారు. మానవ విధుల్లో కూడా ఎటువంటి సహాయ సహకారాలను అందించలేకపోయారు. ఎందుకంటే, వీరి అభిప్రాయాల, ఆలోచనల, సూత్రాల వెనుక ఎటువంటి సదాచరణల ఉపమానాలూ, ఆదర్శాలూ ఉండేవికావు.

అరస్తూ అనే ఆయన నైతిక విలువలను ప్రారంభించాడు. ప్రతి యూనివర్సిటీలో వాటిని గురించి గొప్పగొప్ప ప్రసంగాలు జరిగేవి. వాటి వివరణపై ప్రసంగించటం జరిగేది. అయితే, వాటిని చదివి లేదా విని మానవుల్లోని ఎంతమంది మంచి మార్గాన్ని అవలంభించారు?. ఈనాడు ప్రపంచంలో ప్రతి యూని వర్సిటీలో నైతికతకు సంబంధించిన పెద్దపెద్ద ప్రొఫెసర్లు ఉన్నారు. కాని వారి నైతికవిలువల జ్ఞానం, పరమార్ధం, రహస్యం విద్యాలయాల నాలుగు గోడలమధ్య నుండి బయటకు రానేలేదు. బయటకు రాగలదా? ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చినా, వాళ్ళ ప్రవర్తన సామాన్యులకంటే ఏమాత్రం వేరుగా ఉండేదికాదు. మానవుడు చెవులద్వారా కాదు కళ్ళద్వారా రూపొందుతాడు.

ప్రపంచంలో పెద్దపెద్ద చక్రవర్తులు, రాజులు కూడా వచ్చారు. వీరు ఎప్పుడూ నాలుగు విషయాలపైనే ప్రాధాన్యత ఇచ్చేవారు. 1) ప్రజల ప్రాణాలను, ధనాన్ని దోచుకోవడం. 2) ఒక దేశాన్ని నాశనంచేసి మరో దేశాన్ని స్ధాపించడం. 3) ఒక జాతికి నష్టం కలిగించి, మరో జాతికి సహాయం చేయడం. వీరి ఈ వ్యవహారాన్ని మహారాణి సబా వృత్తాంతంలో ఖుర్ఆన్ ఇలా పేర్కొంది.

إِنَّ المُلُوكَ اِذَا دَخَلُوا قَرْيَةً اَفْسَدُواهَا وَ جَعَلُوا اَعِزَّةَ اَهْلِهَا اَذِلَّةً .(النمل-34)

నిస్సందేహంగా చక్రవర్తులు దేశంలోనైనా ప్రవేశిస్తే, దాన్ని నాశనం చేసి వేస్తారు. ఇంకా అక్కడి ప్రజలను అవమానంపాలు చేస్తారు.(అన్నమ్ల్-34)

4) వారి ఖడ్గాలు జనవాసాల నుండి, ప్రజలనుండి నేరగాళ్ళను దూరం చేసాయి. కాని ఏకాంతంలో, అంత రంగంలో దాగిఉన్న నేరగాళ్ళను వారించలేక పోయాయి. వారు బజారుల్లో, రహదారుల్లో శాంతిభద్రతలు స్ధాపించారు. కాని హృదయాల్లో ప్రశాంతతను స్ధాపించలేకపోయారు. దేశ వ్యవస్ధను సంస్కరించారు. కాని ఆత్మల నివాసప్రాంతాన్ని సరిదిద్దలేకపోయారు. నిజం చెప్పాలంటే, అన్ని రకాల మానసిక చెడు వినాశనం వీరి సభల నుండే బయలుదేరి అన్ని వైపులా వ్యాపించింది. సికందర్, సీజర్ వంటి గొప్పగొప్ప చక్రవర్తులు మనకోసం ఏదైనా ఆదర్శం వదలి వెళ్ళారా?

గొప్పగొప్ప రాజ్యాంగవేత్తలు అప్పటి నుండి ఇప్పటి వరకు జన్మిస్తూ ఉన్నారు.  కాని వారి చట్టాలకు శాశ్వత స్థానం లభించలేదు. వారి అనుచరులకు ఆత్మశుధ్ధి రహస్యం లభించలేదు. తరువాతి తరాల వారు తప్పుడు తీర్మానాలుగా పరిగణిస్తూ, వాటిని రద్దు చేసారు. తమ ఇష్టాలకు అనుగుణంగా మరో చట్టాన్ని తయారుచేసుకున్నారు, మానవ సంస్కరణ కోసం మాత్రం కాదు. ఈనాడు కూడా అదే పరిస్ధితి చలామణిలో ఉంది. ఈ ప్రజాస్వామ్య దేశాల్లో కూడా పరిస్ధితి ఇలాగే ఉంది. చట్టసభలు, శాసన సభలు ఏర్పాటు చేయబడుతున్నాయి. కాని ఈ సభలు నిన్న చేసిన చట్టాన్ని ఈనాడు రద్దు చేస్తున్నాయి. ఇదంతా ప్రజలకోసం కాదు, ప్రభుత్వాల కోసం జరుగుతుంది.

ప్రియమిత్రులారా! మానవుల్లోని ఉన్నత వర్గాలకు చెందినవారు, మానవ సమాజానికి ఏదో లాభం చేకూర్చుతారని ఆశలు ఉన్న ప్రతి ఒక్కరినీ మనం చూసాము. బాగా ఆలోచించండి ! ఇప్పుడు ప్రపంచంలో మార్గదర్శక వెలుగు, మంచి కిరణాలు ఎక్కడున్నా, ఏకాగ్రత హృదయాల్లో నిర్మలత్వం ఎక్కడున్నా అది కేవలం ప్రవక్తల, సందేశహరుల బోధనల, హితబోధల ఫలితమే. కొండ గుహల్లోనైనా, అడవుల్లోనైనా, నగరాల్లోనైనా, ఎక్కడైనా దయ, న్యాయం, పేదల సహాయం, అనాధల సంరక్షణ, సత్కార్యాల గురించి తెలిసి ఉంటే, అది ప్రవక్తల సంఘంలోని ఎవరో ఒకరి సందేశం, పిలుపుల యొక్క శాశ్వత ప్రభావమే. ఖుర్ఆన్ బోధనల ప్రకారం

اِنَّ مِنْ اُمَّةٍ اِلَّا خَلَا فِيْهَا نَذِيرٌ (فاطر- 24)
ప్రతి జాతిలోనూ హెచ్చరించేవాడు వచ్చాడు. (ఫాతిర్-24)

وَ لِكُلِّ قَوْمٍ هَادٍ (لرعد-7)
ప్రతి జాతికి ఒక మార్గదర్శకుడు ఉన్నాడు. (అర్రఅద్-7)

ఈనాడు ప్రతి జాతిలోనూ, ప్రతి దేశంలోనూ వీరి శుభాల వెలుగు మాత్రమే కనబడుతుంది. అన్ని వైపులా వారి హితోపదేశాలే వినబడు తున్నాయి. ఆఫ్రికాకు చెందిన క్రూరుడైనా, యూరప్ కు చెందిన గొప్ప వ్యక్తి అయినా, అందరి హృదయాలలో ప్రశాంతత వీరి బోధనల వల్లే సాధ్యం అవుతుంది. జరుగుతున్నదీ అదే. పైన పేర్కొనబడిన ఉన్నత ప్రముఖుల్లో అందరికంటే ఉన్నత వర్గం ప్రవక్తలదే. వీరు చక్రవర్తుల్లా శరీరాలపై కాదు, హృదయాలపై పరిపాలన చేస్తారు. వారి రాజ్యం భూలోక రాజ్యం కాదు, మానవ హృదయాలే వారి రాజ్యం. సైన్యాధిపతుల్లా కరవాలాలు పట్టుకుని ఉండరు. వీరు చెడులను, పాపాలను వెంటనే తొలగిస్తారు. వీరు ఊహాలోకాల్లో తేలాడే కవులు కాదు. కానీ వారి నోటి తియ్యటి పలుకుల రుచివల్ల, ఇప్పటి వరకు మానవుల చెవులు ఆనందం పొందుతున్నాయి. వాస్తవంగా వారు చట్టసభ్యులు, శాసన సభ్యులుగా వ్యవహరించలేదు. కాని వారు మరణించి వందల ఏళ్ళు గడచినా, వారి బోధనలు చట్టాల్లా, శాసనాల్లా పని చేస్తున్నాయి. ఇవి ప్రజలపైనే కాదు, పాలకులపై, న్యాయస్ధానాలపై కూడా తమ పట్టు బిగించి ఉంచాయి. ఎటువంటి తేడా లేకుండా అందరిపైనా కొనసాగుతున్నాయి. ఇక్కడ ధర్మాన్ని గురించి, నమ్మకాల గురించి ప్రశ్నే లేదు. ఇక్కడ ప్రశ్నంతా ఆచరణా చరిత్రది. ఈ సంఘటన జరిగిందా లేదా? అనేదే. పాటలీపుత్రరాజు, అశోకుని ఆదేశాలు కేవలం రాతి పలకలపై చెక్కబడి ఉన్నాయి. కాని బుధ్ధుని ఉపదేశాలు హృదయ పలకాలపై చెక్కబడి ఉన్నాయి. ఉజ్జయిని, హస్తినాపూర్, కన్నోజ్ మొదలైన ప్రాంతాల రాజుల ఆదేశాలు చెరిగి పోయాయి. కాని ధర్మశాస్త్రాలు ఇప్పటి వరకు చెలామణిలో ఉన్నాయి. బాబుల్ లో అందరి కంటే ముందు చట్టాలు తయారు చేసిన రాజు హమురాబీ చట్టాలు అనేక సంవత్సరాల క్రితమే మట్టిలో కలసి పోయాయి. కాని ఇబ్రాహీమ్ (అ) బోధనలు ఇప్పటి వరకు సజీవంగా ఉన్నాయి. ఫిర్ఔన్ యొక్క ‘అనా రబ్బుకుముల్ ఆలా’ అనే నినాదం ఆ ఒక్క దినమే వినిపించింది. కాని మూసా(అ) గొప్పతనాన్ని ప్రపంచం ఈనాడు కూడా కొని యాడుతుంది. సోలన్ తయారు చేసిన చట్టాలు ఎన్నిరోజులు నడిచాయి? కాని తౌరాతులోని దివ్యాదేశం ఈనాడు కూడా  న్యాయ తూనికలో ఉంది. ఈసా(అ)ను న్యాయస్ధానంలో దోషిగా నిలబెట్టిన రోమన్ చట్టాలు, శతాబ్దాల క్రితమే అదృశ్య మయ్యాయి. కాని ఈసా(అ) బోధనలు మాత్రం ఈనాడు కూడా పాపాత్ములను పుణ్యాత్ములుగా, నేరస్తులను పరిశుధ్ధులుగా మలచటంలో నిమగ్నమయి ఉన్నాయి. మక్కాకు చెందిన అబూ జహల్, ఈరాన్ కు చెందిన కిస్రా, రోమ్ కు చెందిన ఖైసర్ ల ప్రభుత్వాలు పతనమయ్యాయి. కాని మదీనా ఆధ్యాత్మిక చక్రవర్తి గతించిన తరువాత కూడా ఆయన ఆదేశాలు నిరాటంకంగా కొనసాగు తున్నాయి.

పాఠకులారా! నా వెనుకటి ప్రసంగాన్ని విని మీరు సంతృప్తి చెందినట్లయితే, ఇది కేవలం నమ్మకాల వల్ల కాదు, సాక్ష్యాధారాలవల్ల, ఆచరణా చరిత్ర వల్ల మీ మనసులో నమ్మకం చోటు చేసుకుంది. మానవత్వం వాస్తవ లాభం గురించి, సదాచరణల గురించి, నైతికతల అభివృధ్ధి గురించి, హృదయాల పరిశుధ్ధతల గురించి, మానవశక్తుల్లో మిధ్యేమార్గాన్ని విధించడం గురించి, సఫలయత్నం ఎవరైనా చేసి ఉంటే, అది కేవలం ప్రవక్తల వర్గమే. వీరు దైవసందేశరులుగా వచ్చారు. ప్రపంచానికి దైవబోధనల్ని, రుజుమార్గాన్ని చూపారు. అంతేకాదు తమ తర్వాత ప్రజలు జీవితం గడపడానికి ఒక రుజుమార్గం వదలి వెళ్ళారు. వీరి బోధనల, ఆచరణల ద్వారా చక్రవర్తులు, రాజులు, ప్రజలు, ధనవంతులు, పేదవారు, జ్ఞానులు, అజ్ఞానులు అందరూ సమానంగా లాభం పొందుతున్నారు. 

وَوَهَبْنَا لَهُ اِسْحقَ وَ يَعْقُوبَ كُلَّا هَدَيْنَا وَ نُوحًا هَدَيْنَا مِنْ قَبْلُ وَ مِنْ ذُرِّيَّتِهِ دَاوُدَ وَسُلَيْمنَ وَ اَيُّوبَ وَ يُوسُفَ وَ مُوسى وَ هرُونَ وَ كَذَالِكَ نَجْزِى المُحْسِنِينَ. وَزَكَرِيَّا وَيَحْى وَ عِيسى وَاِلْيَاسَ كُلٌّ مِنَ الصَّلِحِينَ. وَاِسْمَاعِيلَ وَ اليَسَعَ وَ يُونُسَ وَ لُوطًا وَكُلًّا فَضَّلْنَا عَلى العالَمِينَ. وَ مِنْ آبَائِهِمْ وَ ذُرِّيّتِهِمْ وَ اِخْوَانِهِمْ وَاجْتَبَيْنهُمْ وَ هَدَينهُمْ اِلى صِرَاطٍ مُسْتَقِيمٍ. ذلِكَ هُدَى اللهِ يَهْدِى بِهِ مَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ وَلَوْ اَشْرَكُوا لَحَبِطَ عَنْهُمْ مَا كَانُوا يَعْمَلُونَ. اُولئِكَ الَّذِينَ آتَيْنهُمُ الكِتَابَ وَ الحُكْمَ وَ النُّبُوَّةَ  فَاِنْ يَكْفُرْ بِهَاهؤُلَاءِ فَقَدْ وَكَّلْنَا بِهَا قَومًا لَيْسُوا بِهَا بِكفِرِينَ. اُولئِكَ الَّذِينَ هَدَى اللهُ فَبِهُد هُمْ اِقْتَدِهْ  قُلْ لَا  اَسْئلكُمْ عَلَيهِ اَجْرًا اِنْ هُوَ اِلَّا ذِكْرى لِلْعالَمِينَ. (الأنعام-84-90)

మేము ఇబ్రాహీముకు, అతని జాతికి వ్యతిరేకంగా ప్రసాదించిన సూచన ఇది. మేము కోరిన వారికి ఉన్నత స్ధానాలను ప్రసాదిస్తాము. వాస్తవంగా నీ ప్రభువు వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడూను. మేము అతనికి ఇస్హాఖ్, యాఖూబ్ లను ప్రసాదించాము. ప్రతి ఒక్కరికి మేము సన్మార్గం చూపించాము. అంతకు ముందు నూహ్ ను ఇంకా అతని సంతతిలోని వారైన దావూదు, సులైమాన్, అయ్యూబ్, యూసుఫ్, మూసా, హారూన్ లకు కూడా సన్మార్గం చూపించాము. విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలం ప్రసాదిస్తాము. జకరియ్యా, యహ్యా, ఈసా, ఇల్యాస్ లకు కూడా, వీరిలో ప్రతి ఒక్కరూ సజ్జనులే. ఇస్మాయీల్, అల్ యసఅ, యూనుస్, లూత్ లకు. వీరిలో ప్రతి ఒక్కరికీ మేము ప్రపంచ ప్రజలపై ఘనతను ప్రసాదించాము. ఇంకా వారి తాత మత్తాతలనూ, వారి సంతానాన్నీ, వారి సోదరులను మేము అనుగ్రహించాము. వారికి రుజు మార్గం వైపునకు దారి చూపాము. ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. దాని ద్వారా తన దాసులలో తాను కోరిన వారికి సన్మార్గం ప్రసాదిస్తాడు. ఒకవేళ వారు కూడా సాటి కల్పించి ఉంటే, వారు చేసినదంతా నాశనం అయిఉండేది. మేము గ్రంధాన్ని, వివేకాన్ని, దైవదౌత్యాన్ని ప్రసాదించినవారు వీరే. ఒకవేళ వారు దానిని విశ్వసించటానికి తిరస్కరిస్తే, మేము అనుగ్రహాన్ని వేరేవాళ్ళకు అప్పగించాము. వారు దానిని తిరస్కరించేవారుకారు. వారే అల్లాహ్ తరపు నుండి మార్గ దర్శకత్వం పొందినవారు. వారి మార్గాన్నే నీవు అనుసరించు. (అల్ అన్ఆమ్-84-90)

ఈ శుభవచనాల్లో మానవ మార్గదర్శకత్వానికి, రుజుమార్గానికి ఒక ప్రత్యేక వర్గం నుండి వివిధ పేర్లను పేర్కొనడం జరిగింది. వీరిని అనుసరించి, అనుకరించి మనం మన మానసిక రుగ్మతలను, నైతిక బలహీనతలను తొలగించగలం. ఇదే ఆ ఉత్తమ వర్గం. అల్లాహ్(త) వీరిని ప్రపంచ ప్రాంతాలన్నిటిలోనికి పంపడం జరిగింది. ప్రపంచ భాషలన్నిటిలోనూ సందేశాల వెలుగును వ్యాపింపజేయటం జరిగింది. ఈనాడు మానవుని వద్ద ఉన్న సాఫల్యం, నైతిక భాగ్యం, సదాచరణలు మొదలైనవన్నీ వీరి శుభాల వల్లే లభించాయి. మీకోసం ప్రతిచోట తమ అడుగజాడలను వదలి వెళ్ళారు. ఈనాడు ప్రపంచ ప్రజలు వీటిని అనుసరించి సాఫల్యాన్ని కోరుతున్నారు.

నూహ్(అ) సందేశ ఉత్సాహం, గడగడలాడించిన ఇబ్రాహీమ్(అ) ఏకదైవత్వం, ఇస్హాఖ్ తండ్రి వారసత్వం, ఇస్మాయీల్(అ) దయాగుణం, మూసా (అ) కృషిప్రయత్నాలు, హారూన్(అ)  సత్యసంధత, యాఖూబ్(అ)  స్వీకరణ, సత్యం కోసం దావూద్(అ) ఆందోళన, సులైమాన్(అ)  వివేకం, జకరియ్యా(అ)  ఆరాధన, యహ్యా(అ) సౌశీల్యం, ఈసా(అ) దాస్యం, యూనుస్(అ) తన తప్పును ఒప్పుకోవటం, లూత్(అ) వీరత్వం, అయ్యూబ్(అ) సహనం, వీరే ఆ వాస్తవ శిల్ప కారులు. వీరి వల్లే మన మానసిక, నైతికవిలువల ప్రపంచం కలకలలాడుతుంది. ప్రపంచంలో ఈ సద్గుణాలు ఎక్కడ కనిపించినా, అంతా వీరి చలవే. ఈ మహా పురుషుల ఉపమానాల, ఆదర్శాల ఫలితమే.

మానవులకు మంచి సమాజం, మంచి సంస్కృతి, పరిపూర్ణ సంతోషం, విశ్వంలో ఉన్నత స్ధానం ప్రసాదించటంలో మానవుల్లోని వివిధ వర్గాల కార్యకర్తల ప్రధాన పాత్ర ఉంది. ఖగోళ శాస్త్రజ్ఞులు నక్షత్రాల మార్గాలను కనుగొన్నారు. శాస్త్రవేత్తలు వస్తువుల ప్రత్యేకతలను గూర్చి తెలిపారు. వైద్యులు వ్యాధులకు మందులు కనుగొన్నారు. నిపుణులు భవనాల నిర్మాణాన్ని కనుగొన్నారు. పారిశ్రామిక వేత్తలు వృత్తులను కనుగొన్నారు. వీరందరి కృషి ప్రయత్నాలవల్ల ఈ ప్రపంచం పరిపూర్ణమయ్యింది. కానీ మన మానసిక శాంతి ప్రపంచాన్ని స్ధాపించిన ఈ మహపురుషులకే మనమందరం కృతజ్ఞతలు తెలుపుకోవలసి ఉంది. ఎందుకంటే, వీరే మన అంతర్గత చెడు గుణాలను సరిదిద్దారు. మన మానసిక వ్యాధులకు ఔషధాలు కనిపెట్టారు. మన మనోభావాల, ఊహల, నిర్ణయాల చిత్రాలను సరిదిద్దారు. మన హృదయాలను ఒక గాడిలో పెట్టారు. దీని వల్ల ప్రపంచంలో సరైన సంస్కృతి, సమాజం పరిపూర్ణ రూపం దాల్చింది. నైతికత, చరిత్ర మానవునికి ప్రధానమని తేలింది. మంచి, సత్కార్యాలు ఆచరణా మైదానంలో అందచందాలుగా నిలిచాయి. దైవానికి దాసునికి మధ్య సంబంధం పటిష్టం అయ్యింది. ఆదిలో చేసిన వాగ్దానం మనకు గుర్తుకు వచ్చింది. ఒకవేళ మనం మానవ సమాజంలోని ఈ రహస్యాలు మంచి, అదృష్టం మొదలైన ప్రవక్తల బోధనలను తెలుసుకోకపోతే, ఈ ప్రపంచం పరిపూర్ణ స్ధితికి చేరి ఉండేదా? అందుకే ఈ మహాపురుషులైన ప్రవక్తల ఉపకారం మనపై ఎంతో ఉంది. మనలో ప్రతి ఒక్కరూ ఏ జాతికి, ఏ వర్గానికి, ఏ దేశానికి చెందిన వారైనా సరే, వీరిపట్ల కృతజ్ఞులుగా మెలగాలి. దీన్నే ఇస్లామ్ లో సలాతువస్సలామ్ అంటారు. దీన్ని ఎల్లప్పుడూ వారి పేర్లతో పాటు పలకడం జరుగుతుంది.

జనులారా! ఈ పవిత్ర జనులు తమ తమ కాలాల్లో వచ్చి వెళ్ళిపోయారు. ఈ విశ్వంలో ఏదీ శాశ్వతంగా ఉండదు. వారు ఎంత పవిత్రులైనా, పరిశుధ్ధులైనా, నిష్కలంకులైనా వారికి శాశ్వత జీవితం లభించ లేదు. అందువల్ల వారి తరువాత మానవ మార్గదర్శకత్వానికి పనికి వచ్చేది వారి జీవితాల్లో వ్రాయబడిన వారి ఆదర్శాలు, బోధనలు, ఉపదేశాలు మొదలైనవి. ఇవి తప్ప మరేమీ మనకు లాభం చేకూర్చలేవు. మరో మార్గమూ లేదు.

ప్రపంచ ప్రాచీన విద్యలు, వృత్తులు, అభిప్రాయాలు, పరిశోధనలు, సంఘటనలు, పరిస్ధితులు తెలుసుకోవడానికి ఇవి తప్ప మరో మార్గం లేదు. వీటినే మనం జీవిత గాధలుగా, చరిత్రగా పిలుస్తున్నాం. మన జీవితాల్లో ఎన్నో విధాలుగా ఎన్నో సంఘటనలు జరగవచ్చు, వాటిలో గుణపాఠం, దూరదృష్ఠి కానరావచ్చు. కాని మన నైతికత, మానసిక జీవిత పరిపూర్ణతకు పరిశుధ్ధతకూ కేవలం దైవప్రవక్తల మరియు వారి అడుగు జాడలపై నడిచిన ప్రముఖుల జీవిత చరిత్రలే మనకు లాభాన్ని చేకూర్చగలవు. ఇప్పటి వరకు ప్రపంచానికి వీరి వల్లే లాభం కలిగింది. ముందు కూడా వీరివల్లే లాభం కలుగుతుంది. అందువల్ల మనం మన ఆత్మపరిశీలనకు, ఆత్మపరిశుధ్ధతకు, ఆత్మపరిపూర్ణతకు ఈ మహాపురుషుల గాధలను, చరిత్రలను భద్రపరచడం మన ప్రధాన బాధ్యత. 

ఎంత గొప్ప తత్వం అయినా, ఎంత మంచి విద్య అయినా, ఎంత మంచి మార్గదర్శకం అయినా, ఒకరి జీవితానికి లభించడం గాని, అది సాఫల్యం పొందడం గాని దాని వెనుక ఒక మహావ్యక్తి ఉండనంత వరకు జరుగదు. ఆయన మనకు అన్నివిధాలా శ్రధ్ధలో, ప్రేమలో, గొప్పతనంలో కేంద్రబిందువై ఉండాలి. ఫిబ్రవరి 1924 లో మేము హిజాజ్, ఈజిప్టుల నుండి తిరుగు ప్రయాణంలో క్రుకోదియా అనే పేరుగల నౌకలో ఉన్నాం. అందులో ఉన్న వారిలో ప్రఖ్యాత కవి డాక్టర్ టాగూర్ కూడా ఉన్నారు. ఆయన కూడా అమెరికా నుండి తిరుగు ప్రయాణంలో ఉన్నారు. తోటి ప్రయాణీకుల్లో ఒకరు ఆయన్ను బ్రహ్మ సమాజం విఫలం కావడానికి కారణాలేమిటి? దాని సూత్రాలు, ఆశయాలు గొప్పగా ఉండేవే, ఇతర ధర్మాలు సత్యమైనవని, వాటి వ్యవస్ధాపకులు సత్యవంతులని, పుణ్యాత్ములని మతం బోధించేది. ఇందులో బుధ్ధీజ్ఞానాలకు వ్యతిరేకమైనది ఏదీ ఉండేది కాదు. దీన్ని ప్రస్తుత పరిస్ధితులు, సంస్కృతి, తత్వం మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకొని స్ధాపించటం జరిగింది. మరెందుకు ఇది సఫలం కాలేదు?”  అని ప్రశ్నించారు. దానికి తాత్విక కవి ఇలా సమాధానం ఇచ్చారు, మంచి విషయాన్నే ముందుకు తెచ్చారు. ఇది ఎందుకు సఫలం కాలేదంటే, దీని వెనుక వ్యక్తిత్వ జీవితంగానీ, ఆచరణాత్మక చరిత్రగానీ లేదు. మనకు కేంద్రంగా ఉండడానికి, మనకు ఆదర్శప్రాయం కావడానికి అని సమాధానం ఇచ్చారు. దీనివల్ల తెలిసిందేమిటంటే ఒక మతంగానీ, ధర్మంగానీ తన ప్రవక్త జీవిత చరిత్ర ఆచరణాపధం లేకుండా విజయం సాధించలేదు.

ఏదేమైనా రుజుమార్గం కొరకు, మార్గదర్శకత్వం కొరకు నిర్మలమైన, నిష్కలంకులైన, నిరపరాధులైన, అన్నివిధాలా  పరిపూర్ణులైన మహాపురుషుల అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వారు కేవలం ప్రవక్తలు మాత్రమే. 

2. విశ్వవ్యాప్తమైన శాశ్వత ఆచరణాపధం కేవలం ప్రవక్త ముహమ్మద్ () జీవితచరిత్రలోనే ఉంది

సోదరులారా! ఈరోజు మన సభ యొక్క రెండవ దినం. ఇంతకు ముందు చెప్పినదంతా దృష్టిలో పెట్టుకోవాలి. గత ప్రసంగంలో మానవుడు ప్రస్తుత, భవిష్యత్ అంధకారాన్ని తొలగించడానికి వర్తమాన కాల వెలుగును పొందడం చాలా అవసరం. మనకు ఈ ఉపకారాన్ని చేసిన వివిధ మానవ వర్గాలకు చెందిన మహాపురుషులు కృతజ్ఞతలకు అర్హులు. అయితే అందరికన్నా ఎక్కువ ఉపకారం చేసినవారు ప్రవక్తలు, సందేశహరులు. వీరిలో ప్రతి ఒక్కరూ తమ కాలాల్లో తమ జాతుల్లో ఆనాటి కాల పరిస్ధితులకు అనుగుణంగా ఉన్నత సద్గుణాలు, పరిపూర్ణ గుణసంపదలు గల ఒక ఆదర్శ జీవితాన్ని, ఆదర్శ పధాన్నీ వారి ముందు ఉంచారు. ఒకరు సహనాన్ని, మరొకరు దాతృత్వాన్ని, ఇంకొకరు త్యాగాన్ని, మరొకరు ఏకత్వాన్ని గురించి, సత్యాన్ని గురించి, కొందరు విధేయత గురించి, మరి కొందరు శీలాన్ని గురించి, మరికొందరు దైవభక్తి గురించి. ఈవిధంగా ప్రతి ఒక్కరూ ప్రపంచంలో మానవుని అవరోధాలతో కూడుకొని ఉన్న జీవితంలో ఒక్కొక్క శిఖరాన్నీ స్ధాపించారు. వీటివల్ల రుజుమార్గం ఏదో తెలిసిపోతుంది. కాని ఒక మార్గదర్శి నాయకుని అవసరం ఎంతయినా ఉండింది. అతడు తన ఉపదేశాల ద్వారా ఆచరణా, ఆదర్శాలతో మార్గాన్నంతటినీ వెలుగుతో నింపుతాడు. అంటే మన చేతుల్లో తన జీవిత ఆచరణను, ఒక గైడ్ రూపంలో ఇచ్చి వెళ్ళాడు. వారిని అనుసరించి, వారి ఉపదేశాలకు అనుగుణంగా ప్రతి బాటసారి నిర్భయంగా తన గమ్యాన్ని చేరు కుంటాడు. ఆ నాయకుడే ప్రవక్తల పరంపరలో చివరి ప్రవక్త ముహమ్మద్(స). వీరి గురించి ఖుర్ఆన్ ఇలా అంటుంది,

يَآاَيُّهَا النَّبِيُّ اِنَّا اَرْسَلْنَاكَ شَاهِدًا وَ مُبَشِّرًا وَ نَذِيرًا وَ دَاعِيًا اِلي اللهِ بِاِذْنِهِ  وَ سِرَاجًا مُنِيرًا. (الأحزاب-45)

ఓ ప్రవక్తా! మేము నిన్ను సాక్షిగా, శుభవార్త ఇచ్చేవాడుగా, హెచ్చరించేవాడుగా, అల్లాహ్ అనుమతితో ఆయన వైపుకు పిలిచేవాడుగా, ప్రకాశంచే దీపంగా చేసి పంపాము.(అల్ అహ్జాబ్-45)

ప్రవక్త(స) ప్రపంచంలో అల్లాహ్ మార్గదర్శకత్వానికి, బోధనలకు సాక్ష్యులు. పుణ్యాత్ములకు సాఫల్య శుభవార్త అందించేవారు. ఇంకా ఆ మార్గాన్ని అవలంభించని వారిని హెచ్చరించేవారు. రుజుమార్గం నుండి తప్పిపోయిన వారిని, అల్లాహ్ మార్గం వైపు ఆహ్వానించే సందేశహరులు, ఆయన స్వయంగా వెలుగు మరియు దీపం వంటివారు. అంటే ఆయన, ఆయన జీవితం మార్గదర్శిని. మార్గంలో ఉన్న అంధకారాన్ని తొలగిస్తుంది. ప్రతి ప్రవక్త దైవసాక్షి, సందేశహరుడు, శుభవార్త ఇచ్చేవాడు, హెచ్చరించే వాడుగానే ఈ ప్రపంచంలోనికి వచ్చాడు. కాని ఈ సద్గుణాలన్నీ అందరి జీవితాల్లోనూ ఆచరణపరంగా బహిర్గతం కాలేదు. కొందరు ప్రవక్తలు ప్రత్యేకంగా సాక్ష్యులుగా వచ్చారు. యాఖూబ్(అ), ఇస్హాఖ్(అ), ఇస్మాయీల్(అ) మొదలైనవారు. మరికొందరు శుభవార్తలిచ్చే వారుగా వచ్చారు. ఇబ్రాహీమ్(అ), ఈసా(అ) మొదలైనవారు. మరికొంత మంది ప్రవక్తలు హెచ్చరించే వారుగా వచ్చారు.  నూహ్(అ), మూసా(అ), హూద్(అ), షుఐబ్(అ). మరికొంతమంది సందేశహరులుగా వచ్చారు. యూసుఫ్(అ), యూనుస్(అ) మొదలైనవారు. కాని ఆయన ఒక్కరే అన్నీ గుణాలు కలిగి వచ్చారు. ఆయన జీవితంలో ఈ గుణాలన్నీ బహిర్గతం అయ్యాయి. ఆయనే ప్రవక్త ముహమ్మద్(స). ఎందుకంటే ఆయన ప్రపంచానికి చిట్టచివరి ప్రవక్తగా పంపబడ్డారు. వీరు పరిపూర్ణులు. ఈయన తర్వాత ఇంకెవ్వరూ రాలేదు. ప్రవక్త(స) పరిపూర్ణ జీవన విధానాన్ని ఇచ్చి పంపబడ్డారు. దీని పరిపూర్ణతకు ఎంతమాత్రం ఇతరుల అవసరం లేదు. ప్రవక్త(స) బోధనలకు శాశ్వత ఉనికి ఉండేది. ఎందుకంటే తీర్పుదినం వరకు అవి సజీవంగా ఉండాలి గనుక. అందువల్లే ప్రవక్త(స)కు  పరిపూర్ణ గుణాలన్నీ ప్రసాదించబడ్డాయి. ఇంకా పతనం లేనివారుగా పంపబడ్డారు.

మిత్రులారా ! నేను చెప్పినదంతా నా ధార్మిక మనోభావాల వాదన కాదు. ఇది వాస్తవం. ఇదంతా సాక్ష్యాధారాలపై ఉంది. ఒకరి చరిత్ర లేదా ఆదర్శ జీవితం మానవులకు ఆదర్శవంతంగా నిలవాలి. దీనికి కొన్ని షరతులున్నాయి. వీటిలో అన్నిటికంటే మొట్టమొదటిది మరియు ప్రధామైనది చారిత్రకత.

చారిత్రకత:- ఒక పరిపూర్ణ మానవుని జీవిత పరిస్ధితులు చారిత్రక ప్రామాణికతలు కలిగి ఉండటమే చరిత్ర ఉద్దేశ్యం. అవి కధల్లా, నవలల్లా ఉండరాదు. సాధారణంగా మానవునిలో ఉన్న ఒక గుణం ఏమిటంటే, ఒక వ్యక్తి జీవిత చరిత్ర గురించి అది కల్పితమని, ఊహించుకున్నదని, ప్రామాణికమైనది కాదని తెలిసిన వెంటనే, అది ఎంత ప్రభావపూరితమైన విధంగా ప్రవేశపెట్టినా హృదయాలు దానిపట్ల ఏమాత్రం ప్రభావితం కావు. అందువల్లే ఒక పరిపూర్ణ జీవితగాధ భాగాలన్నిటిపై ధృడ విశ్వాసం, గట్టినమ్మకం  ఉండాలి. అందువల్లే చారిత్రక మహా వ్యక్తుల వల్ల, హృదయాలు ప్రభావితం అయినట్టు కల్పిత కధల వల్ల, నవలల వల్ల ప్రభావితం కావు.

రెండవ కారణం చారిత్రక గాధలు తప్పనిసరి కావడం. ఎందుకంటే ప్రవక్త(స) పరిపూర్ణ జీవిత విధానాన్ని కేవలం వినోదం కోసం, ఆట్లాట కోసం, తీరిక సమయాల్లో కాలక్షేపం కోసం ప్రవేశపెట్టటం జరగలేదు. మనం మన జీవితాన్ని దానికనుగుణంగా మలచుకోవాలని, దానిని అనుసరించాలని చూపెట్టటం జరిగింది. కాని ఆ జీవితం చారిత్రక, వాస్తవిక విధంగా నిరూపణ పొందనపుడు దాన్ని మీరు అనుసరించరు. దానిపట్ల ఏమాత్రం ప్రాముఖ్యత చూపెట్టరు. ఈ కాల్పనిక కధల ద్వారా ఎవరూ తమ జీవితానికి ఆదర్శ సూత్రాలను స్వీకరించరు. ఎందుకంటే ప్రభావపూరితంగా, ఆచరణయోగ్యంగా, అనుకరణయోగ్యంగా ఉండాలంటే అన్నిటికంటే ముందు ఆ మహాపురుషుని జీవితం చారిత్రక ప్రమాణాలతో కూడుకొని ఉండాలి.

మనమంతా ప్రవక్తలను గౌరవిస్తాం, వారు సత్య ప్రవక్తలని గట్టి నమ్మకం కలిగి ఉంటాం. కాని, “ఈ ప్రవక్తలు వీరిలో కొందరికి కొందరిపై ప్రాధాన్యత నిచ్చాము” ప్రకారం అంతిమ దైవదౌత్యం చివరి పరిపూర్ణ మానవత్వ చరిత్ర కావటంవల్ల ముహమ్మద్(స)కు  ప్రత్యేక  ప్రాధాన్యత ప్రసాదించడం జరిగింది. ఇతర ప్రవక్తలకు ఈ ప్రాధాన్యత ఎందుకు ఇవ్వబడలేదంటే, వారిని అంతిమ దైవ ప్రవక్తగా నియమించ బడలేదు. వారి జీవితాలు ఒక ప్రత్యేక జాతి, ఒక ప్రత్యేక కాలం, ఒక ప్రత్యేక ప్రాంతం వరకే పరిమితం అయ్యేవి. అందువల్లే ఆయా కాలాల తర్వాత వారి బోధనలు, ఆదర్శాలు క్రమంగా అంతరించాయి.

ప్రతిదేశంలో, ప్రతిజాతిలో, ప్రతియుగంలో, ప్రతిభాషలో ఎంతమంది ప్రవక్తలు దైవసందేశం తీసుకొని వచ్చి ఉంటారో ఆలోచించండి. ఒక ఇస్లామీయ ఉల్లేఖన ప్రకారం 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు. కాని ఈనాడు మనకు వారిలో ఎంతమంది పేర్లు గుర్తున్నాయి? ఒకవేళ కొందరి పేర్లు గుర్తున్నా, వారిలో ఎంతమంది జీవితాలు మనకు గుర్తున్నాయి. ప్రపంచ జాతుల్లో అన్నిటికంటే ప్రాచీన జాతి హిందూ జాతిగా భావిస్తారు. కాని ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, వారి మతంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. కాని వారిలోని ఏ ఒక్కరికి చారిత్రక ప్రాముఖ్యత ఉన్నట్టు కనబడదు. కొందరివి కేవలం పేర్లు మాత్రమే ఉన్నాయి. మరిదేనితోనూ సంబంధం లేదు. చరిత్రలో వీరికి రవ్వంత స్ధానం కూడా లేదు. వీటిలో చాలా పాత్రలు మహాభారతం, రామాయణం లోనివి, కాని వారి జీవిత వివరాలు, సంఘటనలు ఏ కాలానికి చెందినవి, ఏ సంవత్సరానికి చెందినవి అనేది కానరాదు. 

యూరప్ కు చెందిన చాలామంది పండితులు కొన్ని కల్పిత గాధలను కొన్ని కాలాలకు ప్రత్యేకించారు. వీటిని మన హిందూ విద్యావంతులు ప్రామాణిక సంఘటనలుగా పరిగణిస్తున్నారు. కాని యూరప్ కు చెందిన చాలామంది పరిశోధకులు వీటిని వాస్తవ గాధలుగా చరిత్రగా పరిగణించడమూలేదు, వాస్తవాలుగా స్వీకరించడమూలేదు.

ఈరాన్ కు చెందిన ప్రాచీన మజూసీ(అగ్నిఆరాధకులు) ధర్మస్ధాపకుడు ఇప్పుడు కూడా లక్షలమంది నమ్మకాలకు కేంద్రంగా ఉన్నాడు. కాని అతని చారిత్రాత్మక వ్యక్తిత్వం కూడా ప్రాచీన శిధిలాల్లో కనుమరుగై ఉంది. చివరికి అతని చారిత్రాత్మక వ్యక్తిత్వంపై అనుమానించే అలవాటు ఉన్న అమెరికా మరియు యూరప్ కు చెందిన పండితులు సంశయంలో పడిఉన్నారు. పాశ్చాత్త ప్రజల్లో అతని చారిత్రాత్మక ఉనికిని అంగీకరించేవారు కూడా అనేక సందేహాలతో అతని జీవిత చరిత్రను ఏదో ఒక విధంగా నిర్ధారించి ఉన్నారు. అయితే వీరిలో కూడా అనేక అభిప్రాయ బేధాలు ఉన్నాయి. అందువల్ల ఏ మానవుడూ అతన్ని తన ఆచరణాత్మకమైన జీవితానికి పునాది రాయిగా ఎంచుకోడు. జర్తస్త్ ఎక్కడ జన్మించాడు, ఎప్పుడు జన్మించాడు, ఎక్కడ మరణించాడు, వీటన్నిటి గురించి చరిత్రకారుల మధ్య అనేక అభిప్రాయ బేధాలున్నాయి. దీన్ని గురించి ప్రామాణిక ఉల్లేఖన ఒక్కటి కూడా కనపడదు. కాల్పనిక అభిప్రాయాలు ఈ ప్రశ్నల అంధకారాన్ని ఏ మాత్రం తొలగించలేవు. అంతేకాదు ఫారసీ చరిత్రకారులు ఈ అనుమానాస్పదమైన కాల్పనిక జ్ఞానాన్ని నేరుగా తమ ఉల్లేఖనల ద్వారా  పొందలేదు. కాని యూరోపియన్, అమెరికన్ విద్యావేత్తల ద్వారా వాళ్ళు ఇప్పుడిప్పుడే అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీరే వారి విద్యార్జనలోని సర్వసాధనాలు. వీరు ఫిర్దౌసీ రాజు చరిత్ర కంటే ముందుకు వెళ్ళలేదు. అయితే యూనానీ శత్రువులు వాటిని నాశనం చేసారనే మాట వట్టిదే. ఏది ఏమైనా మేము ఇక్కడ అవి నశించాయని మాత్రమే తెలుపుతున్నాము. అవి ఏ విధంగా నశించినా, చెరిపి వేయబడినా,  వాటికి శాశ్వత జీవితం లభించలేదనడానికి ఇదే సాక్ష్యం. కెర్న్ మరియు డార్మి టేటర్ వంటి విద్యావేత్తలకు కూడా జర్తస్త్ వ్యక్తిత్వం యొక్క చారిత్రకతను తిరస్కరించ వలసి వచ్చింది.

ప్రాచీన కాలంలో ఆసియాలోని అన్నిటికంటే విశాలమైనది బౌధ్ధమతం. ఇది భారతదేశం, చైనా, మధ్య ప్రాచ్యం, ఆఫ్ఘనిస్తాన్ వరకు వ్యాపించి ఉండేది. ఇప్పుడు కూడా బర్మా, సిలోన్, చైనా, టిబేట్, జపాన్ లలో వ్యాపించి ఉంది. భారతదేశంలో అయితే దీన్ని బ్రాహ్మణులు నాశనం చేశారనే చెప్పవచ్చు. మధ్యప్రాచ్యంలో ఇస్లామ్ దీన్ని అంతం చేసింది. కాని మిగిలిన ఆసియాలో దీని ప్రభుత్వం, దీని సంస్కృతి, దీని మతం కరవాల బలంతో స్ధాపించబడి ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు విజయవంతంగా కొనసాగుతుంది. కాని ఇవన్నీ బుధ్ధుని జీవితాన్నీ, చరిత్రను, చారిత్రక వెలుగును కొనసాగించగలిగాయా? ఒక చరిత్రకారుడి ప్రశ్నలన్నిటికీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వగలవా? స్వయంగా బుధ్ధుని కాలంలో విస్తరించి ఉన్న మగధ దేశ రాజుల సంఘటనలకు అంటగట్టటం జరుగుతుంది. ఇది తప్ప మరో మార్గమే లేదు. ఈ రాజుల కాలాన్ని కూడా వారి దౌత్య సంబంధాలు యూనానీలతో ఉండడం వల్ల నిర్ధారించడం జరిగింది. చైనా ధర్మ వ్యవస్ధాపకుని గురించి బుధ్ధునికన్నా చాలా తక్కువ వివరాలు ఉన్నాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతన్ని అనుసరించేవారు కోట్ల సంఖ్యలో ఉన్నారు.

సామీ జాతిలో అనేకమంది ప్రవక్తలు వచ్చారు. కాని చరిత్ర వారి పేర్లు తప్ప ఇతర ఏ విషయాన్నీ మిగల్చలేదు. నూహ్(అ), ఇబ్రాహీమ్(అ), హూద్(అ), సాలిహ్(అ), యహ్యా(అ) మొదలైనవారి పరిస్ధితులు, జీవిత గాధలు మనకు కొంత వరకు మాత్రమే తెలుసు. వీరి జీవితాలకు సంబంధించిన ముఖ్యవిషయాలు, చరిత్రకు అందకుండా పోయాయి.  ఇప్పుడు ఆ మహావ్యక్తుల అసంపూర్ణ జీవిత భాగాలు మానవ జీవితానికి ఆదర్శంగా నిలుస్తాయా? ఖుర్ఆన్ ను వదలి యూదుల గ్రంధాలలో ఉన్న వీరి ప్రతి ఒక్క విషయం పట్ల పరిశోధకులు అనుమానాన్నే వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆ అనుమానాలను చూడనట్టు ప్రవర్తించినా ఆ మహాపురుషుల చిత్రాలు ఎంతవరకు పరిపూర్ణంగా ఉన్నాయి.

మూసా(అ) గురించి మనకు తౌరాతు ద్వారా తెలుస్తుంది. కాని ఇప్పుడు ఉన్న తౌరాతు గ్రంధం చరిత్రకారుల అభిప్రాయాల ప్రకారం మూసా(అ) మరణించిన పిదప అనేక సంవత్సరాల తర్వాత ఉనికిలోనికి వచ్చింది. అంతేకాదు ప్రస్తుతం ఉన్న తౌరాతులో ప్రతి సంఘటన పట్ల రెండు వేర్వేరు ఉల్లేఖనాల పరంపర ఉంది. ఒక్కొక్క చోట వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ కారణం వల్లే తౌరాతులోని గాధలు, సంఘటనల్లో అడుగడుగునా వ్యతిరేక ప్రకటనలు కానవస్తాయి. దీన్ని గురించి ఎన్ సైక్లోపేడియా చివరి ఎడిషన్ లోని బైబిల్ ఆర్టికల్ లో వివరంగా ఉంది. అటువంటప్పుడు మూసా(అ) గురించేకాదు, ఆదమ్(అ) నుండి మూసా(అ) వరకు గల గాధల, సంఘటనల చారిత్రక స్ధానం ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

ఈసా(అ) గురించి ఇంజీల్లలో ప్రస్తావించబడి ఉంది. కాని ఈనాడు క్రైస్తవులు వీటిలో కేవలం 4 ఇంజీల్లనే స్వీకరిస్తున్నారు. మిగతా బాల్య ఇంజీలు, బర్నాబా ఇంజీలు మొదలైనవి ప్రామాణికత లేనివిగా పరిగణించబడ్డాయి. ఈ 4 ఇంజీల్లలో ఒక్కదాన్ని రచించినవారు కూడా స్వయంగా ఈసా(అ) ను చూడ లేదు. ఆయన ఒకరి నుండి విని దీన్ని రచించినట్టు కూడా ఎక్కడా లేదు. వీటితో సంబంధం ఉంది అని అంటున్న నలుగురు వ్యక్తుల పట్ల కూడా ఆ సంబంధం సరికాదని సందేహాలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఇవి ఏ భాషలో వ్రాయబడ్డాయి, ఏ కాలంలో వ్రాయబడ్డాయి అనేవి కూడా వివరంగా లేదు. క్రీస్తుశకం నుండి అనేక సంవత్సరాల వరకు వాటి రచనా కాలాన్ని అనేక విధాలుగా అనేకమంది చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఈసా(అ) జననాన్నీ, మరణాన్నీ, త్రిత్వ సిధ్ధాంతాన్ని ముందుంచి ఇప్పుడు కొందరు అమెరికా చరిత్ర కారులు ఈసా(అ) ఉనికి కేవలం ఒక కల్పితం అని, ఆయన జననం, త్రిత్వసిధ్ధాంతం యూనానీ, రూమీ మేతాలజీ అనుకరణే అని అభిప్రాయపడు తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఊహలు, అభిప్రాయాలు ఆ జాతుల్లో వివిధ దేవతల గురించి హీరోల గురించి ముందు నుండి ఉండేవి. కనుక చికాగోలోని ప్రఖ్యాత పత్రిక ఓపెన్ కోర్ట్ లో కొన్ని నెలల వరకు ఈసా(అ) కాల్పనిక ఉనికిపై చర్చ జరిగింది. ఈ ప్రకటన వల్ల క్రైస్తవుల ఉల్లేఖనాల ద్వారా తెలుపబడిన ఈసా(అ) జీవిత చారిత్రకత వాస్తవం చాలా బలహీనతకు గురయింది.

పరిపూర్ణత:- ఒక మానవుని చరిత్ర శాశ్వత ఆదర్శం కావాలంటే, ఆయన జీవితరంగాలన్నీ మన కళ్ళముందు ఉండటం తప్పనిసరి. ఏ రంగమూ, ఏ ఆచరణ రహస్యంగా, తెలియకుండా ఉండరాదు. ఆయన జీవిత చరిత్ర పరిస్ధితులు, ప్రత్యేకతలు పగటి వెలుగులా ప్రపంచం ముందు ఉండాలి. దీనివల్ల ఆయన జీవిత చరిత్ర  మానవ సమాజానికి ఆదర్శవంతమైన జీవితంగా ఎంత వరకు పనికి వస్తుందో తెలుస్తుంది.

ఈ ప్రామాణికత ద్వారా ప్రపంచ మహాపురుషుల జీవిత చరిత్రలపై దృష్టిసారిస్తే, ప్రవక్త ముహమ్మద్(స) తప్ప ఇతరులెవ్వరూ కనబడరు. దీనివల్ల ప్రవక్త(స) అంతిమ ప్రవక్తగా ప్రపంచంలోనికి పంపబడ్డారని తెలుస్తుంది. వేలమంది ప్రవక్తలు, సంస్కర్తలు వచ్చారు. కాని వారిలో ముగ్గురు లేక నలుగురు మాత్రమే చారిత్రకత కలిగి ఉన్నారు. కాని పరిపూర్ణతలో వారూ వెనుకబడి పోయారు. ఆలోచించండి! జనాభా లెక్కల ప్రకారం ఈనాడు బౌధ్ధ మతస్తులు ప్రపంచ జనాభాలోని నాల్గవ వంతుపై పట్టు కలిగి ఉన్నారు. కాని బుధ్ధుని జీవితం కొన్ని కధల, గాధల వరకే పరిమితమై ఉండిపోయింది. కాని ఒకవేళ మనం ఆ కధలకు, గాధలకు, వృత్తాంతాలకు చారిత్రక స్ధానం ఇచ్చి బుధ్ధుని జీవితంలోని ప్రముఖ సంఘటనలను వెదికితే, మనకు అపజయమే ఎదురవుతుంది. ఈ కధలవల్ల, వృత్తాంతాల వల్ల మనకు ప్రాచీనకాలంలో  నేపాల్ లోని ఒక ప్రాంతంలో రాజు కొడుకు ఉండేవాడని, అతడికి ఆలోచించే సహజ గుణం ఉండేదని, యుక్త వయస్కుడయిన తర్వాత, ఒక బిడ్డకు తండ్రి అయిన తర్వాత అకస్మాత్తుగా అతని దృష్టి కొందరు బాధితులపై పడిందని, అతడు చాలా ప్రభావితుడయ్యాడని, ఇల్లూ వాకిలి వదలి, రాజ్యాన్నీ వదలి వెళ్ళిపోయాడని, బనారస్, గయ, పాటలీపుత్ర, రాజ్గీర్ మొదలైన పట్టణాల్లో, అడవుల్లో, కొండల్లో సంచరించేవాడని, జీవితంలోని ఎన్నో దశలను దాటిన తర్వాత గయలోని ఒక వృక్షం క్రింద సత్యం అవతరించిందని ప్రకటించాడు. బనారస్ నుండి బీహార్ వరకు తన నూతన ధర్మాన్ని గురించి హితబోధ చేస్తూ ఉన్నాడు. ఆ తరువాత ఈ లోకం నుండి పరమ పదించాడు. మాకు తెలిసినంత వరకు బుధ్ధుని గురించి ఇది మా సారాంశం.

జర్తస్త్ కూడా ఒక ధర్మస్ధాపకుడు. ఇంతకు ముందు పేర్కొన్నట్టు అనుమానాలు, అపోహలు తప్ప అతని జీవిత చరిత్ర గురించి ఎలాంటి ఆధారాలూ లభించలేదు. ఈ కల్పితాల ద్వారా లభించిన దాన్ని మేము చెప్పటం కంటే, 20వ శతాబ్దపు ప్రామాణిక విజ్ఞాన సారాంశం అంటే ఇన్ సైక్లోపీడియా బ్రిటానికాలోని ఆర్టికల్ జరాస్టర్ నుండి ఇక్కడ పొందు పరచడం జరిగింది. ఈ వాక్యాల్లో “జర్తస్త్ అనే ఏ వ్యక్తిని మేము కలిసామో, అతడు మరో జర్తస్త్ కి భిన్నంగా ఉన్నాడు. సరిగ్గా అతడికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆ రెండవ కాల్పనిక మహిమాన్వితుడైన వ్యక్తితో (దీని తర్వాత గాధ యొక్క కొన్ని వాస్తవ పరిస్ధితులను పేర్కొని వ్యాస రచయిత ఇలా వ్రాస్తున్నాడు.) మనం గాధల ద్వారా జర్తస్త్ పరిస్ధితులను తెలుసుకోగలమని భావించరాదు. అది మనకు జర్తస్త్ జీవితానికి సంబంధించిన ఏ చారిత్రక ప్రకటన ఇవ్వదు. మనకు ఏది తెలిసినా దాని అర్ధం వివరంగా ఉండదు లేదా సరిగ్గా అర్ధంకాదు.

జర్తస్త్ గురించి వ్రాస్తూ ఆధునిక రచనల అధ్యాయాన్ని ప్రారంభిస్తూ రచయిత ఇలా వ్రాస్తున్నాడు. “అతని జన్మస్ధలాన్ని నిర్ధారించే ఆధారాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ కాల నిర్ధారణ గురించి కూడా యూనానీ చరిత్రకారుల ప్రకటనలు, ఆధునిక పరిశోధకుల అభిప్రాయాలు వ్యతిరేకంగా ఉన్నాయి. జరాస్టర్ కాలాన్ని గురించి మాకు ఏమాత్రం తెలియదు.”

ఏదేమైనా, అతని గురించి మాకు తెలిసినదంతా ఏమిటంటే ఆజర్ బైజాన్ లోని ఒక ప్రాంతంలో జన్మించి, బల్క్ ప్రాంతంలో సందేశ ప్రచారం చేసాడు. హస్తాష్ప్ రాజు అతని ధర్మాన్ని స్వీకరించాడు. అతడు కొన్ని అసాధారణ మహిమలు ప్రదర్శించాడు. వివాహం చేసుకున్నాడు. సంతానం కలిగింది. ఆ తరువాత ఎక్కడో ఒకచోట మరణించాడు. ఇటువంటి వ్యక్తిలో పరిపూర్ణత మచ్చుకైనా ఉంటుందా? అతని జీవితం సమాజానికి ఆదర్శం అవుతుందా?

వెనుకటి ప్రవక్తల్లో అందరి కంటే ఎక్కువగా ప్రఖ్యాతి గాంచినది మూసా(అ) జీవితం. ప్రస్తుత తౌరాతు ప్రామాణికమైనదా లేదా అనే విషయాన్ని  ప్రక్కనపెట్టి, దాని విషయాలన్నింటినీ సత్యమైనవిగా భావిద్దాం. అయితే తౌరాతుకు చెందిన ఐదు గ్రంధాలనుండి మనకు లభించిన మూసా(అ) కు సంబంధించిన భాగాలు గమనిద్దాం. అవి, మూసా(అ) జన్మించారు, ఫిర్ఔన్ భవనంలో సంరక్షించబడ్డారు, యుక్తవయస్సుకు చేరి ఫిర్ఔన్ జాతి అత్యాచారాలకు వ్యతిరేకంగా బనీఇస్రాయీల్ ప్రజలకు కొన్ని సందర్భాల్లో సహాయం చేస్తారు. ఆ తరువాత ఈజిప్టు నుండి పారిపోయి మద్యన్ వెళ్తారు. అక్కడ అతని వివాహం జరుగుతుంది. కొంతకాలం వరకు అక్కడ జీవితం గడిపి ఈజిప్టు తిరిగి వస్తారు. దారిలో దైవదౌత్యం లభిస్తుంది. ఫిర్ఔన్ వద్దకు వెళతారు. మహిమలు ప్రదర్శిస్తారు. బనీఇస్రాయీల్ ను తనతో పంపమని కోరుతారు. అనుమతి లభించదు. చివరికి అనుకోకుండా రాత్రివేళ తన జాతిని వెంట బెట్టుకొని బయలు దేరుతారు. దైవమహిమవల్ల వారి కొరకు సముద్రంలో మార్గం ఏర్పడుతుంది. వారిని వెంబడించిన ఫిర్ఔన్ వాడి సైన్యం అందరూ మునిగి పోతారు. మూసా(అ) తన జాతిని వెంటబెట్టుకొని అరబ్ మరియు సిరియా ప్రాంతాలలో ప్రవేశిస్తారు. అవిశ్వాసులతో యుధ్ధాలు జరుగుతాయి. ఆ స్థితిలో వృధ్ధాప్యానికి చేరుకుంటారు. ఒక కొండపై అతనికి మరణం సంభవిస్తుంది. తౌరాతు చివరిలో ఇలా ఉంది.

“దైవదాసుడైన మూసా(అ) దైవాదేశాల ప్రకారం మువాబ్ ప్రాంతంలో మరణించారు. ఆయన అతన్ని మువాబ్ లో ఉన్న లోయ బైతె ఫగూర్ ముందు ఖననం చేసాడు. అయితే ఈనాటి వరకు అతని సమాధి గురించి ఎవరికీ తెలియదు. మూసా(అ) మరణించినపుడు అతని వయస్సు 120 ఏళ్ళు. ఇప్పటి వరకు బనీఇస్రాయీల్ లో మూసా(అ) వంటి ప్రవక్త ప్రభవించలేదు”

1. ఇవి తౌరాతుకు చెందిన ఐదవ గ్రంధంలోని వాక్యాలు, మూసాతో సంబంధం ఉన్న రచన అయినా అన్నిటి కంటే ముందు దానిలోని ఈ వాక్యాలపై మీ దృష్టి పడాలి. ఈ గ్రంధమంతా లేదా దాని కొన్ని భాగాలు మూసా(అ) రచన కాదు. అయితే ప్రపంచం మూసా(అ) జీవిత చరిత్రను రచించిన ఆ రచయితనే మరచి పోయింది.

2. వారి పదాలు, ఈనాటి వరకు అతని సమాధి గురించి ఎవరికీ తెలియదు. అంతేకాదు ఇప్పటి వరకు ఇటువంటి ప్రవక్త బనీ ఇస్రాయూల్ లో రాలేదు. అంటే మూసా(అ) జీవితానికి చాలాకాలం తర్వాత ఈ భాగాలు వ్రాయబడ్డాయి. ఇందులో ప్రజలు ఒక ప్రముఖ వ్యక్తిని మరచిపోగలరు, మరో క్రొత్త ప్రవక్త రావాలని ఆశలు పెట్టుకోవటం జరగ గలదు.

3. మూసా(అ) 120 సంవత్సరాలు వయస్సు పొందారు. కాని ఆ 120 సంవత్సరాల జీవితంలో ఒక సుదీర్ఘ కాలానికి సరిపోయే ఏ ఆదర్శాలు, ఘటనలు తెలిసాయి? అదే విధంగా ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన ఏ ముఖ్యభాగాలు మన చేతికి వచ్చాయి? జననం, యవ్వనం, వలస పోవటం, వివాహం, దైవదౌత్యం మొదలైన విషయాలు మాత్రమే తెలుసు, కొన్ని పోరాటాల తర్వాత వృధ్ధాప్యంలో 120 సంవత్సరాల వయస్సులో మరణం సంభవిస్తుంది. ఈ సంఘటనలను పోనివ్వండి. ఇవి వ్యక్తిగత సంఘటనలు, ప్రతి ఒక్కరి జీవితంలో వేర్వేరుగా సంభవిస్తాయి. మానవునికి తన సామాజిక ఆచరణాపరమైన ఆదర్శానికి కావలసినవి – నైతిక గుణాలు, మంచి అలవాట్లు, పధ్ధతులు. ఇవే మూసా(అ) జీవిత చరిత్రలో కానరానివి. సాధారణంగా వ్యక్తుల కుటుంబం, వంశం, పేరు, స్వగ్రామం మొదలైన విషయాలు తౌరాతులో పేర్కొనబడి ఉన్నాయి. ఈ వివరాలు చట్టాలకు ఎంత అవసరమైనా, ఆచరణా ఆదర్శం లేని ఈ భాగాలు ఒక వ్యక్తి జీవిత చరిత్ర పరిపూర్ణం కావటానికి ఏ మాత్రం పనికిరావు.

అందరికంటే ఇస్లామ్ కు దగ్గరి కాలం వారు ఈసా(అ). ఈనాడు వీరిని అనుసరించేవారు యూరోపియన్ జనాభా లెక్కల ప్రకారం ఇతర మతాల కంటే చాలా అధిక సంఖ్యలో ఉన్నారు. కాని ఈ ధర్మ ప్రవక్త జీవిత భాగాలు ఇతర ప్రఖ్యాత ధర్మాల వ్యవస్ధాపకుల, ప్రవక్తల జీవిత భాగాల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈనాడు యూరప్ క్రైస్తవుల చారిత్రక అభిరుచి ఎలా ఉందంటే, వీరు బాబుల్, అసీరియా, అరబ్, సిరియా, ఈజిప్టు, ఆఫ్రికా, భారతదేశం, తుర్కిస్తాన్ లలోని వేల సంవత్సరాల నాటి సంఘటనలను, కధలను, గ్రంధాలను, శిలాఫలకాలను చదివి, కొండలు, గుహలు, నేల పొరలను త్రవ్వి ప్రజల ముందుకు తెస్తున్నారు. అంతేకాక ప్రపంచ చరిత్రలో తప్పిపోయిన పేజీలను మళ్ళీ మొదటి నుండి సంకలనం చేస్తున్నారు. ఇన్ని మహత్యాలు చేసినా ఈసా(అ) జీవితానికి సంబంధించి కప్పబడిన సంఘటనలను తిరిగి బ్రతికించలేరు. ప్రొఫెసర్ రీనాన్ ఎన్ని విధాలా ప్రయత్నించినా ఈసా(అ) సంఘటనలకు జీవితం లభించలేదు.

ఇంజీలు ప్రకారం ఈసా(అ) జీవితం 33 సంవత్సరాలు. ప్రస్తుత ఇంజీలులో ఉన్న ఉల్లేఖనాలన్నీ ప్రామాణికత లేనివే. ఒకవేళ ఉన్నా, అవి కేవలం ఆయన చివరి మూడు సంవత్సరాల జీవితం పైనే ఆధారపడి ఉన్నాయి. మనకు కేవలం ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన ఈ భాగాలే తెలుసు. ఆయన జన్మించారు, తరువాత ఈజిప్టు వచ్చారు, బాల్యంలో ఒకటి లేక రెండు మహిమలు ప్రదర్శించారు, ఆ తరువాత ఆయన అదృశ్యమయ్యారు, ఆ తరువాత 30 సంవత్సరాల వయస్సులో బాప్టిస్మా ఇస్తారు. కొండ ప్రాంతాల్లో, సముద్ర తీరాన మత్స్యకారులకు హితబోధ చేస్తూ దర్శనమిస్తారు. కొంతమంది శిష్యులు తయారవుతారు. యూదులతో చర్చలు జరుపుతారు. యూదులు అతన్ని పట్టిస్తారు. రూమీ గవర్నర్ న్యాయస్ధానంలో కేసు నడుస్తుంది. ఆయన్ను ఉరిశిక్ష విధించడం జరుగుతుంది. మూడవ రోజు అతని సమాధిలో అతని శవం ఉండదు. 30 సంవత్సరాలు, కనీసం 25 సంవత్సరాల కాలం ఎక్కడ గడిచింది, ఎలా గడిచింది, ప్రపంచానికి దీన్ని గురించి ఏమీ తెలియదు. చివరి మూడు సంవత్సరాల కాలంనాటి సంఘటనల్లో కూడా ఏముంది – మహిమలు, బోధనలు, చివరికి ఉరి. 

విశిష్టత:-  ఒక వ్యక్తి జీవిత చరిత్ర ఇతరులకు ఆదర్శం కావటానికి మూడవ షరతు విశిష్టత. విశిష్టత అంటే వివిధ వర్గాల, జాతుల ప్రజలకు రుజుమార్గం, వెలుగు చూపడానికి కావలసిన ఉదాహరణలు, లేదా ప్రతివ్యక్తి వివిధ రకాల సంబంధాలను, విధులను, లావాదేవీలను నిర్వర్తించడానికి కావలసిన ఉదాహరణలు, ఉపమానాలు, అవి అన్నీ ఆదర్శజీవితంలో ఉండాలి. ఈ దృష్టితో చూస్తే, ప్రవక్త ముహమ్మద్(స) తప్ప ఇతరులేవ్వరూ ఈ ప్రమాణాలకు సరిపోరు. ధర్మం అంటే ఏమిటి? దేవుని, దాసుల మరియు పరస్పర విధులు బాధ్యతలు, నియమాలు మొదలైన వాటిని స్వీకరించడం, నిర్వర్తించడం, మరోవిధంగా చెప్పాలంటే దేవుని హక్కులను దాసుని హక్కులను నెరవేర్చటం. అందువల్ల తమ ధర్మాన్ని అనుసరించే ప్రతిఒక్కరూ తమ ప్రవక్తల వ్యవస్ధాపకుల చరిత్రల్లో హక్కులు, విధులు, బాధ్యతలు మొదలైనవాటి వివరాలు వెదకాలి. వాటికి అనుగుణంగా జీవించటానికి కృషి చేయాలి. దేవుని హక్కులు, దాసుల హక్కుల దృష్ట్యా ఒకవేళ మీరు వివరాలు వెతకనారంభిస్తే ప్రవక్త ముహమ్మద్(స) తప్ప మీకు ఇతరులెవ్వరూ కానరారు.

మతాలు రెండురకాలు. ఒక మతంలో దేవునిపై విశ్వాసం ఉండదు. ఉదాహరణకు బౌధ్ధ, జైన మతాలు. ఎందుకంటే వీటిలో దేవుని గురించి ఆయన గుణగణాలను గురించి, దైవ హక్కుల గురించి ఎటువంటి వివరాలూ లేవు. అందువల్లే దీని వ్యవస్ధాపకుల్లో దైవప్రేమ, ఏకాగ్రత మొదలైన విషయాలు వెదకటమే వ్యర్ధం. మరో మతంలో దైవాన్ని ఏదో ఒక రంగులో స్వీకరించడం జరిగింది. ఇటువంటి మతాల ప్రవక్తల, వ్యవస్ధాపకుల జీవితాల్లో దైవప్రీతి, దైవవిధేయతల వంటి సంఘటనలు కానరావు. దేవుని పట్ల మనం ఎలాంటి నమ్మకాలు కలిగి ఉండాలి, వారి నమ్మకాలు ఎలా ఉండేవి. ఆ నమ్మకాలపై వారు ఎంతవరకు సంతృప్తికరంగా ఉండేవారు మొదలైన వివరాలన్నీ వీరి చరిత్రల్లో కనబడవు. తౌరాతునంతా చదవండి, దేవుని ఏకత్వం, ఆయన ఆదేశాలు, ఖుర్బానీ షరతులు తప్ప తౌరాతు ఐదు గ్రంధాల్లోనూ మూసా(అ)లో దైవ ప్రేమ, విధేయత, ఆరాధన, దైవంపై నమ్మకం, దైవ గుణగణాల పట్ల ఆయన హృదయంలోని ప్రేమ అనే విషయల గురించి ఎక్కడా కనిపించదు. ఒకవేళ మూసా(అ) ధర్మం అంతిమ ధర్మంగా వచ్చిఉంటే, ఆ ధర్మంవారు ఆయన జీవిత సంఘటనలను, ఆదేశాలను, ఉపదేశాలను లిఖిత రూపంలోనికి తెచ్చి ఉండేవారు. కాని దైవం మరొకటి తలచింది. అందువల్లే వారికి ఆ భాగ్యం కలుగలేదు.

ఈసా(అ) జీవితానికి అద్దం లాంటిది ఇంజీలు గ్రంధం. ఇంజీలులో దైవం ఈసా(అ)కు తండ్రి అనే విషయం తప్ప ఈ ప్రాపంచిక జీవితంలో మహోన్నతుడైన తండ్రీకొడుకుల్లో ఎటువంటి సంబంధాలు ఉండేవి అనేది మనకు తెలియదు. తనయుడి ద్వారా తండ్రి కుమారుడ్ని చాలా ప్రేమించేవాడని తెలుస్తుంది. కాని కుమారునికి తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండేదో, అతడు ఎంత వరకు తన తండ్రిపట్ల విధేయత, ఆజ్ఞాపాలనల్లో కట్టుబడి ఉండేవాడో, అతడు రాత్రీపగల్లో ఆయన ముందు వంగేవాడా లేదా? ఆహారం తప్ప అతడు మరేవస్తువైనా ఎప్పుడైనా ఆయన్ను అడిగేవాడా ? పట్టుబడ్డ రాత్రికి ముందు ఏ ఒక్కరాత్రి అయినా అతడు దేవున్ని ప్రార్ధించాడా అనేవి ఏ మాత్రం తెలియలేదు. మరి ఇలాంటి జీవిత చరిత్ర వల్ల మనం ఏం లాభం పొందగలం? ఒకవేళ ఈసా(అ) చరిత్రలో దైవానికి దాసునికి మధ్య సంబంధాలు పటిష్టంగా ఉండి ఉంటే, 350 సంవత్సరాల తర్వాత మొదటి చక్రవర్తి కోనిస్ లో 300మంది క్రైస్తవ పండితులను తన తీర్పుకోసం సమావేశ పరిచే అవసరం ఉండేదికాదు. ఇంకా అది ఇప్పటి వరకు అర్ధంకాని రహస్యంలా ఉండేది కాదు.

ఇప్పుడు దాసుల హక్కుల గురించైనా తీసుకోండి, వీటిని గురించి పరిశీలించినా ప్రవక్త ముహమ్మద్ (స) జీవితంతప్ప ఇతర ప్రపంచ మహావ్యక్తుల జీవితాలన్నీ ఖాళీగా ఉన్నాయి. బుధ్ధుడు తన వంశాన్నీ, కుటుంబాన్నీ, భార్యాబిడ్డలను వదలి అడవి దారి పట్టాడు. ఆ తరువాత ఏనాడూ తన ప్రియమైన భార్యాబిడ్డలతో కలవడానికి రాలేదు. వారితో ఎటువంటి సంబంధమూ ఉంచలేదు. స్నేహితులను కూడా వదలి వేసాడు. రాజ్యపాలన విస్మరించాడు. ఆత్మ సమర్పణను, మరణాన్ని పొందటాన్ని మానవజీవితం యొక్క చివరి ఆశయంగా భావించాడు. ఇటువంటి పరిస్ధితుల్లో ఈ ప్రపంచంలోని రాజ్యం, ప్రజలు, రాజులు, సేవకులు, తండ్రీకొడుకులు, సోదరులు, సోదరీమణులు, స్నేహితులు మొదలైన సంబంధాలకు బుధ్ధుని జీవితం ఎంత వరకు పనికి వస్తుంది. సన్యాసులకు, బిక్షవులకు, సామాన్య ప్రజలకు, వ్యాపారులకు పనికివచ్చే బుధ్ధుని జీవితంలోని పరిపూర్ణత ఏదైనా ఉందా? అందువల్లే అతని జీవితం ఏనాడూ ఆయన అనుచరులకు, వ్యాపారులకు ఏ విధంగానూ ఆదర్శంగా పనికి రాలేదు. ఎందుకంటే, చైనా, జపాన్, సిరియా, వియత్నామ్, టిబెట్, బర్మాల ప్రభుత్వాలు, వ్యాపారులు, పరిశ్రమలు, ఇంకా ఇతర లావాదేవీలు వెంటనే మూసి వేయబడతాయి. అభివృధ్ధి చెందిన నగరాలకు బదులు కేవలం నిర్మానుష్యమైన అడవులే మిగిలి ఉంటాయి.

అదేవిధంగా మూసా(అ) జీవిత చరిత్రలోని ఒక రంగం స్పష్టంగా ఉంది. అది యుధ్ధం, సైన్యాధిపత్యం. ఇవి తప్ప ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకునేవారికి ప్రాపంచిక హక్కులు, బాధ్యతలు, విధులు మొదలైన విషయాలకు ఎటువంటి ఆదర్శమూ లేదు. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, సోదరులు, సోదరీ మణులు, మిత్రులు, స్నేహితులు మొదలైనవారి గురించి వారి ప్రవర్తన ఎలా ఉండేది? ఒప్పందాల విషయంలో ఆయన నియమాలేమిటి? తన ధనాన్ని, సంపదనూ ఏ కార్యాల్లో ఖర్చు పెట్టారు? వ్యాధి గ్రస్తుల పట్ల, అనాధల పట్ల, ప్రయాణీకుల పట్ల, పేదల పట్ల ఆయన ప్రవర్తన ఎలా ఉండేది? అతని అనుచరులు ఈ విషయాల్లో ఆయన జీవితంలోని ఆదర్శాలను ఎలా వినియోగించారు. మూసా(అ) కు భార్య, సంతానం, సోదరులు, బంధుమిత్రులు అందరూ ఉండేవారు. నిస్సందేహంగా ఆయన దౌత్య పరమైన ఆచరణా దూషణలకు, విమర్శలకు అతీతంగా ఉండేవారని మన దృఢ విశ్వాసం . కాని ఆయన చరిత్రకు సంబంధించిన ఆధునిక గ్రంధాల్లో మనకు ఆదర్శం కావలసిన విషయాలేవీ కనబడవు.

ఈసా(అ) కు తల్లి ఉండేది. ఇంజీలు ప్రకారం సోదరసోదరీమణులు ఉండేవారు. తండ్రి కూడా ఉండే వాడు. కాని అతని జీవిత చరిత్రకు సంబంధించిన సంఘటనలు, బంధుమిత్రుల పట్ల ప్రవర్తన, ఆచరణా విధానం మొదలైన వివరాలు కానరావు. అయితే జీవితం ఎల్లప్పుడూ సంబంధాలతోనే ముడి పడి ఉంటుంది. అసలు ధర్మం అంటే ఈ బాధ్యతలను నిర్వర్తించటమే. ఈసా(అ) పాలితునిగానే జీవితం గడిపారు. అందువల్లే ఈసా(అ) జీవిత చరిత్రలో పాలకుని విధులకు సంబంధించిన ఆదర్శాలు, ఉదాహరణలు కనబడవు. ఇతనికి భార్యాబిడ్డలూ లేరు. అందువల్ల ఈ రెండు జతల కొరకు తౌరాతు మొదటి అధ్యాయంలోనే తల్లిదండ్రుల కంటే దృఢమైన సంబంధాన్ని ఏర్పరచింది. కాని ఈసా(అ)ను అనుసరించటానికి ఏ విధమైన మార్గాలూ లేవు. అందువల్లే ప్రపంచానికి అతని జీవిత చరిత్ర ఆదర్శం కాజాలదు. ఇల్లూ వాకిలి, భార్యాబిడ్డలు, ధనసంపదలు, యుధ్ధం, ఒప్పందాలు, మిత్రులు, శత్రువులు అంటే ఎలాంటి సంబంధాలు లేనటువంటి ఒక వ్యక్తి ఇటువంటి సంబంధాలు గల ప్రపంచానికి ఆదర్శం ఎలా కాగలడు? ఒకవేళ ఈనాడు ప్రజలు ఇటువంటి జీవితాన్ని అవలంభిస్తే, రేపు ఈ ప్రపంచం శ్మశానంలా తయారవుతుంది. అభివృధ్ధి పధకాలన్నీ అకస్మాత్తుగా ఆగిపోతాయి. యూరప్ క్రైస్తవులు మాత్రం ఒక్క నిమిషం కూడా సజీవంగా ఉండకపోవచ్చు.

ఆచరణ:- ఆదర్శ జీవితానికి కావలసిన చివరి ప్రామాణిక సూత్రం ఏదంటే ఒక ధర్మ ప్రచారకుడు లేదా ధర్మ వ్యవస్ధాపకుడు తను బోధించే విషయాలను, హితబోధలను స్వయంగా తాను ఆచరించి చూపాలి. అతని ఆచరణలు వారికి ఉదాహరణలు, ఆదర్శాలు కావాలి. తన ఆచరణల ద్వారా తన బోధనలను నిరూపించి చూపాలి. హృదయాలను సంతోషపరిచే తత్వాలు, వేదాంతాలు, నీతులు ఒక దానికి మించిన మరొకటి చెప్పగలడు, కాని ప్రతివ్యక్తి నిలకడగా ఎల్లప్పుడూ చూపనిదే ఆచరణ. ఒక వ్యక్తి యొక్క చరిత్ర ఆదర్శ ప్రాయమైనది, పరిపూర్ణమైనది కావాలంటే కేవలం అతని బోధనలు, అభిప్రాయాలు నైతిక వేదాంత నీతులతో సరిపోదు. అతని ఆచరణలు, ఘనకార్యాలు కావాలి. ప్రామాణికత లేకపోతే మంచీచెడు ఒకటిగానే ఉంటాయి. ప్రపంచం మాటలు చెప్పే వారిదే అయి పోతుంది. ఈ ప్రపంచంలో ఎంతోమంది ప్రవక్తలు, ధార్మిక గురువులు, వ్యవస్ధాపకులు వచ్చారు. వీరిలో ఎవరైనా తన చరిత్రను, ఆచరణను ప్రపంచానికి ఆదర్శం గా అందించగలరా?

నీవు దైవాన్ని ధనానికి, ప్రాణాలకు తెగించి ప్రేమించు, నువ్వు శత్రువునూ ప్రేమించు, నీ కుడి బుగ్గపై కొట్టిన వాడి ముందు నీ ఎడమ బుగ్గను కూడా అందించు, నిన్ను అనవసరంగా ఒక మైలు దూరం తీసుకొని వెళ్ళిన వాడితో రెండు మైళ్ళ దూరం వెళ్ళు. నిన్ను నీ కోట్ అడిగిన వాడిని నీ కమీజును కూడా ఇచ్చివేయి. నువ్వు నీ ధనసంపదలన్నింటినీ దైవమార్గంలో ఖర్చుచేయి. నువ్వు నీ సోదరున్ని 70 సార్లు క్షమించు, ఆకాశ రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించటం కష్టమే.

ఇవి ఇలాంటి బోధనలు వినటానికి ఎంతో మనోహరంగా ఉంటాయి. కాని ఆచరణ ద్వారా అవి నిరూపించబడక పోతే అవి చరిత్ర భాగం కాదు. అవి కేవలం తియ్యటి పలుకులే. తన శతృవుపై పట్టు సంపాదించనివాడు, క్షమాపణ గురించి ఆదర్శాన్ని ఎలా ఇవ్వగలడు? తన దగ్గర ఏమీ లేనివాడు, పేదవారికి, అగత్యపరులకు, అనాధలకు సహాయం ఎలా చెయ్యగలడు? బంధుమిత్రులు, భార్యాబిడ్డలు లేనివాడు సంబంధాల మయమైన ఈ ప్రపంచానికి ఆదర్శం ఎలా కాగలడు? ఇతరుల్ని క్షమించే అవకాశం రానివాడి జీవితం మనలోని కోపిష్టులకు, ఆగ్రహం చెందేవారికి ఆదర్శం ఎలా కాగలదు?

కొద్దిగా ఆలోచించండి! సత్కార్యాలు రెండు విధాలు. ఉదాహరణకు మీరు కొండగుహల్లోకి పోయి జీవితాంతం కూర్చుండిపోయారు. ఇది కేవలం చెడుల నుండి, పాపాల నుండి తన్నుతాను రక్షించు కోవడం అవుతుంది. అంటే మీకు అభ్యంతరం కలిగే ఏ పనినీ మీరు చేయలేదు. కాని ఇది స్వప్రయోజనం కోసం, పరుల కోసం మీరేమి చేసారు? మీరు పేదలకు సహాయం చేసారా? ఆకలిగొన్న వారికి అన్నం పెట్టారా? బలహీనులకు అండగా ఉన్నారా? అత్యాచారులకు వ్యతిరేకంగా సత్యాన్ని చాటారా? ఆపదల్లో చిక్కుకున్నవారిని ఆదుకున్నారా? దారి తప్పిన వారికి దారి చూపించారా? క్షమించటం, దానం చేయటం, అతిధి మర్యాదలు, సత్యం పలకటం, ఈ విషయాల్లో ఉత్సాహం, కృషి, పరిశ్రమ, విధి నిర్వహణ, నైతిక విధులు మొదలైన వాటికి ఆచరణతో సంబంధం ఉంది. కేవలం స్వప్రయోజనం కోసం ఆచరించిన మాత్రాన పుణ్యం లభించదు. పుణ్యం కేవలం ఆచరించిన కారణంగా కాక ఇతరుల కొరకు ఆలోచించడంలోనూ ఉంది. అంటే ఆచరణా భాగం లేని జీవిత చరిత్రకు ఆదర్శ జీవితంగా బిరుదు ఇవ్వడం జరుగదు. ఎందుకంటే మానవుడు అతని ఏ విషయాన్ని అనుసరించాలి? ఏ ఆచరణ నుండి గుణపాఠం నేర్చుకోవాలి?

ఒప్పందం, యుధ్ధం, పేదరికం, ధనం, ఒంటరి తనం, వైవాహిక జీవితం, దైవంతో సంబంధాలు, దాసులతో సంబంధాలు, పరిపాలన, పాలితులు, ప్రశాంతత, కోపం, ఏకాంతం, దాంపత్యం మొదలైన రంగాలన్నీ ఈ సమస్యలతో, సంబంధాలతో నిండున్నాయి. అందువల్ల ప్రజలకు ఈ కష్టాలను పరిష్కరించ టానికి, ఈ సంబంధాలను మంచిగా నిర్వర్తించటానికి ఆచరణాపరమైన ఆదర్శాలు కావాలి. మాటల ద్వారా కాదు చేతల ద్వారా. ఈ ప్రమాణాలపై కూడా కేవలం ముహమ్మద్(స) జీవిత చరిత్ర మాత్రమే నిలబడగలదు. ఇతరులెవ్వరి జీవిత చరిత్ర  కూడా ఉన్నత ప్రమాణాలపై నిలబడలేదు.

ఈనాడు నేను చెప్పిన వాటిని బాగా గుర్తుంచుకోండి! ఒక వ్యక్తి జీవిత చరిత్రను ఆదర్శంగా స్వీకరించాలంటే, ఆ చరిత్రలోని 4 విషయాలను బాగా పరిశీలించాలి. అంటే చారిత్రకత, విశిష్టత, పరిపూర్ణత, ఆచరణ. అంతేగాని ఇతర ప్రవక్తల జీవిత చరిత్రలు వారి కాలాల్లో ఈ ప్రత్యేకతలు కలిగి ఉండేవి కావని నా అభిప్రాయం కాదు. ఇతరుల వరకు చేరిన వారి జీవిత వివరాలు, ప్రస్తుతం ఉన్న వారి చరిత్రలు ఈ ప్రత్యేకతలు కలిగి లేవు. ఇలా కావటం కూడా దైవలీలే. దీని వలన వీరు నిర్ధిష్ట జాతికి, నిర్ధిష్ట కాలానికి చెందినవారే అని నిరూపించబడింది. అందువల్లే వారి జీవిత చరిత్రలు భద్రంగా ఉంచవలసిన లేక ఇతర జాతులకు చేర వేయవలసిన అవసరం ఉండేది కాదు. కేవలం ప్రవక్త ముహమ్మద్(స) మాత్రమే విశ్వప్రవక్తగా, అన్ని జాతుల వైపు తీర్పుదినం వరకు ఆదర్శంగా అనుసరించ దగినవాడుగా పంపబడ్డారు. అందువల్లే ఆయన జీవిత చరిత్ర అన్ని విధాలా పరిపూర్ణంగా, శాశ్వతంగా భద్రపరచడం జరిగింది. ఇదే అంతిమ దైవ దౌత్యానికి అన్నిటి కంటే గొప్ప ఆచరణా సాక్ష్యం.

3. ప్రవక్త ముహమ్మద్(స) జీవితంలోని చారిత్రాత్మక కోణాలు.

ఇప్పుడు ఈ నాలుగు ప్రామాణిక సూత్రాల ఆధారంగా ఇస్లామ్ ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్రపై దృష్టి సారిద్దాం. అన్నిటికంటే మొట్టమొదటి విషయం చారిత్రకత. ఈ విషయంలో ప్రపంచమంతా ఏకాభిప్రాయం కలిగి ఉంది. ఇస్లామ్ తన ప్రవక్త మరియు ఆయన అనుచరుల విషయాలను జాగ్రత్తగా భద్రపరచి ఉంచింది. ఈ విషయంపై ప్రపంచమంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. ప్రవక్త(స) నుండి బోధనలు, ప్రవచనాలు, ఆచరణలు, ఆయన జీవితానికి సంబంధించిన ఉల్లేఖనలు నమోదు చేసిన వారిని, గ్రంధరూపం ఇచ్చినవారిని “హదీసు ఉల్లేఖనకర్తలు, ముహద్దిసీన్లు, చరిత్రకారులు” అంటారు. వీరిలో ప్రవక్త(స) అనుచరులు, తరువాత తరం, వీరి తరువాతి రెండవ తరం, మూడవ తరం వారు, ఈ విధంగా ఇస్లామీయ క్యాలండరులోని నాల్గవ శతాబ్దం వరకు జీవించిన వారు ఉన్నారు. ఉల్లేఖనాలన్నీ లభించి, లిఖిత రూపం ఇచ్చిన తరువాత ఉల్లేఖకుల పేర్లు, జీవిత చరిత్ర, నైతిక అలవాట్లు మొదలైన వాటికి కూడా లిఖితరూపం ఇవ్వడం జరిగింది. వీరి సంఖ్య ఇంచుమించు ఒక లక్షకు చేరింది. అంతేకాక వారి జీవిత చరిత్రలకు అస్మాఉర్రిజాల్ అని పేరు పెట్టటం జరిగింది. 1854 తరువాత వరకు కూడా భారతదేశ విద్యావిభాగంతో సంబంధం ఉన్న, బెంగాల్ ఏవిషయాటెక్ సొసైటీకి సెక్రటరీగా ఉన్న ప్రఖ్యాత జర్మన్ డాక్టర్ స్ప్రింగర్ ప్రయత్నం వల్ల “వాఖిదీ సారాంశం” వాన్ క్రైమర్ సంపాదకత్వంలో 1884లో ప్రచురించబడింది. అదేవిధంగా ప్రవక్త(స) అనుచరుల చరిత్రల రూపంలో హాఫిజ్ ఇబ్నె హజర్ “అసాబహు ఫీ అహ్వాలిస్సహాబహ్”  ప్రచురించడం జరిగింది. కేవలం ప్రారంభ దశ అరబీ గ్రంధాల ద్వారా “లైఫ్ ఆఫ్ ముహమ్మద్” ను రచించిన మొదటి యూరోపియన్ వ్యక్తి. అయితే ఇతడు వ్యతిరేకంగా వ్రాసాడు. కలకత్తాలో ప్రచురించబడిన  “అసాబహు ఫీ అహ్వాలి స్సహాబహ్” యొక్క ఇంగ్లీషు తొలిపలుకులో ఇలా వ్రాసినాడు.

ముస్లిముల వంటి జాతి ఇప్పటి వరకు రాలేదు, ఇక ముందు రాదు కూడా. ముస్లింలు అస్మాఉర్రిజాల్ వంటి పరిశోధనను వెలుగులోనికి తెచ్చారు. దీనివల్ల ఈనాడు 5లక్షల మంది వ్యక్తుల పరిస్ధితులు తెలుసుకోవచ్చు.

ప్రవక్త(స) జీవితంలోని చివరి సంవత్సరం హజ్జతుల్ విదాలో ప్రవక్త(స) అనుచరుల సంఖ్య సుమారు ఒక లక్ష ఉండేది. వీరిలోని 11 వేల మందికి సంబంధించి వారి కాలం లోనే వ్రాయబడిన జీవిత చరిత్ర వివరాలు ఈనాడు మన ముందు ఉన్నాయి. వీరిలో ప్రతి ఒక్కరూ ప్రవక్త(స) జీవిత చరిత్రకు సంబంధించిన ప్రవచనాలు, ఆదేశాలు, సంఘటనలు ఎంతో కొంత ఇతరులకు అందించి ఉన్నారు. అంటే వీరు ఉల్లేఖనా సేవలు అందించారు. వీరి జీవిత చారిత్రకతకు కారణం ఇదే.

ప్రవక్త(స) 11వ హిజ్రీలో మరణించారు. సుమారు 40వ హిజ్రీ వరకు ప్రధాన అనుచరులు బ్రతికి ఉన్నారు. 60వ హిజ్రీ వరకు ప్రవక్త(స) కాలంలో బాల్యంలో ఉన్నవారిలో చాలామంది బ్రతికి ఉన్నారు. ఆ శతాబ్దం పూర్తయ్యేసరికి ఇంచు మించూ అందరూ చనిపోయారు. అందరి కంటే చివరిలో మరణించిన వారి పేర్లు, మరణించిన సంవత్సరం క్రింద ఇవ్వబడ్డాయి.

పేరుఊరు పేరుమ . స
1. అబూ ఉమామ బాహిలీ 2. అబ్దుల్లాహ్ బిన్ హారిస్ బిన్ జిజ్ఆ 3. అబ్దుల్లాహ్ బిన్ అబీ అవ్ ఫా 4. సాయిబ్ బిన్ యజీద్ 5. అనస్ బిన్ మాలిక్సిరియా ఈజిప్టు కూఫా మదీనా బస్రహ్86 హి. శ 86 హి.శ 87 హి.శ 91 హి.శ 93 హి శ

పై పట్టిక చివరిలో ఉన్న అనస్ బిన్ మాలిక్, ప్రవక్త(స) కు ప్రియ సేవకులు. 10 సంవత్సరాల వరకు నిరంతరం ప్రవక్త(స) సేవలో నిమగ్నమై ఉన్నారు. 93 హి.శ లో మరణించారు.

ప్రవక్త(స) సహచరుల, శిష్యుల కాలం 11వ హిజ్రీ నుండి ప్రారంభ మయ్యింది. అప్పటికి జన్మించి ఉన్నారు, కాని ప్రవక్త(స)ను కలిసే భాగ్యం కలగ లేదు. లేదా చాలా చిన్న వయసులో ఉన్నారు. ప్రవక్త(స) నుండి లాభం పొంద లేక పోయారు. అబ్దుర్రహ్మాన్ బిన్ హారిస్ ఇంచుమించు మూడవ హిజ్రీలో, ఖైస్ బిన్ అబీ హాజిమ్ నాల్గవ హిజ్రీలో, సయీద్ బిన్ ముసయ్యిబ్ 14వ హిజ్రీలో జన్మించారు. ప్రవక్త(స) అనుచరుల తర్వాత అనేక మంది మొదటి తరానికి చెందినవారు. అన్నివైపులా వ్యాపించి ప్రవక్త(స) జీవిత చరిత్ర, ఆదేశాలు, తీర్పులు, సందేశ ప్రచారం చేయటంలో నిమగ్నమయి ఉన్నారు. వీరందరి సంఖ్య ఎంత ఉండేది? నేను కేవలం మదీనాలోని తాబయీన్ల సంఖ్యను ఇబ్నె సఅద్ ద్వారా మీ ముందు పెడుతున్నాను.

1. మొదటి వర్గం:- ప్రవక్త(స) ప్రముఖ సహచరులను చూచి, వారి నుండి సందేశాలు, ఆదేశాలు విన్నవారి సంఖ్య 139 మంది.

2. రెండవ వర్గం:- ఇటువంటి తాబయీన్లు మదీనాలో ప్రవక్త(స) సహచరులను చూచి వారి నుండి వివరాలు గ్రహించినవారు 129 మంది.

3. మూడవ వర్గం:- కొంతమంది సహచరులను కలసి వారి నుండి వివరాలు గ్రహించినవారు 87 మంది. ఈ విధంగా తాబయీన్ల మొత్తం సంఖ్య 355. ఇది ఒక్క పట్టణంలోని సంఖ్య. ఇలా మక్కా, తాయిఫ్, బస్ర, కూఫ, దిమిష్ఖ్, యమన్, ఈజిప్టు మొదలైన పట్టణాల్లోని తాబయీన్ల సంఖ్యను గురించి అంచనా వేయండి. వీరిలో చాలామంది పట్టణాల్లో ప్రవక్త(స) అనుచరుల శిష్యులుగా చేరి, రాత్రీ పగలూ ప్రవక్త(స) ఉపదేశాలను, సందేశాలను, బోధనలను గ్రహించి ప్రచారం చేసేవారు. ప్రతి అనుచరుని ద్వారా లభించిన ఉల్లేఖనలను ఒక చోట చేర్చేవారు. ఈ విధంగా ప్రవక్త(స) పరిస్ధితులు, ఆదేశాలు ప్రచారం చేయడంలో పటిష్టమైన మార్గాన్ని అవలంభించారు. ప్రవక్త(స) సహచరుల్లో అత్యధిక ఉల్లేఖనలు గలవారిని ఈ క్రింద పేర్కొనడం జరిగింది.

పేరుఉల్లేఖనల సంఖ్యమరణించిన సంవత్సరం
1. అబూహురైరహ్ (ర) 2. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (ర) 3. ఆయిషహ్ (ర) 4. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (ర) 5. జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (ర) 6. అనస్ బిన్ మాలిక్ (ర)5374 2660 2210 1630 1560 128659 హిశ 68 హిశ 58 హిశ 73 హిశ 87 హిశ 93 హిశ

వీరే ఆ ప్రముఖులు. వీరి ఉల్లేఖనలే ఈనాడు ప్రవక్త(స) జీవిత చరిత్రకు గొప్ప పెట్టుబడిగా పరిగణించ బడుతున్నాయి. వీరి మరణ తేదీలను పరిశీలిస్తే అవి వేర్వేరుగా ఉండటం కనబడుతుంది. వీరి నుండి ఉల్లేఖనాలను గ్రహించిన వారు, కంఠస్తం చేసినవారు, సంకలనం చేసినవారు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారని తెలుస్తుంది. ఈ విషయాలు తెలుసు కోవటాన్నే ఆ కాలంలో విద్యగా భావించడం జరిగింది. ఇహపరాలు రెంటికీ గౌరవ ప్రదమైనదిగా భావించబడింది. ప్రవక్త (స) “నా నుండి పొందిన జ్ఞానాన్ని ఇతరులకు అందజేయండి, నన్ను చూసినవారు, నన్ను చూడనివారికి అందజేయాలి” అనే ప్రవచనం ప్రకారం, వారందరూ తమ సంతానానికి, బంధువులకు, స్నేహితులకు, కలిసే వారికి వినిపించేవారు, బోధించేవారు. ఇదే వారి జీవిత ధ్యేయంగా, బాధ్యతగా ఉండేది. అందువల్ల ప్రవక్త(స) అనుచరుల తర్వాత వెంటనే వారి తరువాతి తరం ఈ వారసత్వ సంపదను రక్షించే నిమిత్తం సిధ్ధమైపోయింది. వీరిలో ప్రతి ఒక్కరికీ ప్రతిఒక్క సంఘటన గురించి కంఠస్తం చేయవలసి వచ్చేది. వాటిని వల్లించడం జరిగేది. ప్రతి అక్షరం గుర్తు చేసుకోవలసి వచ్చేది. ప్రవక్త(స) తన బోధనలను అందజేయమనడంతో పాటు, తనపై కోరి అసత్యం పలకరాదని, పలికేవారి నివాసం నరకం అని హెచ్చరించారు. ఈ హెచ్చరిక ప్రభావం ఎలా ఉండేదంటే, సహచరులు ఉల్లేఖించేటప్పుడు భయంతో వణికిపోయేవారు. ఒకసారి అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ ప్రవక్త(స) ప్రవచనాల్ని కాపీ చేసారు. అప్పుడు అతని ముఖం రంగు మారిపోయింది, వణికిపోయారు, ఇంకా ప్రవక్త(స) ఇలాగే అన్నారు లేదా ఇంచుమించు ఈవిధంగానే అన్నారు, అని పలికారు.

అరబ్బుల జ్ఞాపకశక్తి చాలా పటిష్టంగా ఉండేది. వీరు అనేక పద్యాలను కంఠస్తం చేసుకొని గుర్తుంచుకునేవారు. అంతేకాక ప్రకృతి యొక్క ఒక నియమం ఏమిటంటే, ఏ విధంగా పని చేయిస్తే, ఆవిధంగా అభివృధ్ధి ప్రాప్తం అవుతుంది. అనుచరులు, ఆ తరువాతి తరం వారు వంచన లేకుండా వినియోగించారు. వీరు ఒక్కొక్క సంఘటనను, ఒక్కొక్క హదీసును ఈనాడు ముస్లిమ్ పిల్లలు ఖుర్ఆన్ ను కంఠస్తం చేసినట్టు అభ్యసించేవారు. ఒక్కొక్క హదీసువేత్త అనేక వేల హదీసులను, లక్షల హదీసులను కంఠస్తం చేసేవారు, గుర్తుంచుకునేవారు. కొంతమంది తమ జ్ఞాపక శక్తి కోసం వ్రాసుకునేవారు కూడా. కాని వాటిని కంఠస్తం చేసుకునే వరకు పండితుల దృష్టిలో వారికి గౌరవం లభించేది కాదు. వ్రాయబడి ఉన్న పత్రాలను లోపాల్లా దాచేవారు. వీరికి ఈ విషయాలు గుర్తులేవని ప్రజలు భావిస్తారని భయపడేవారు.

సోదరులారా!  కొందరు ఇస్లామ్ వ్యతిరేకులు, కొన్ని విద్యాసంస్ధలు వీరిలో ప్రముఖులు సర్ విలియమ్ మ్యూర్, గోల్డ్ జీహర్ ఉల్లేఖనాల లిఖితరూపం ప్రవక్త(స) మరణించిన 90 సంవత్సరాల తర్వాత ప్రారంభమైనదని, వీటిపై అనుమానాలను వ్యక్తపరచి అనుమానాస్పదంగా చేద్దామని ప్రయత్నించారు. కాని మేము ప్రవక్త(స) అనుచరులు ఏ విధంగా సంఘటనలను  గుర్తుంచేవారు, ఏ విధంగా జాగ్రత్త వహించేవారు, ఏ విధంగా రాబోయే తరాలకు అమానతును అప్పగించేవారు మొదలైన వాటిని పైన వివరంగా పేర్కొన్నాము. దీనివల్ల తెలిసిన విషయం ఏమిటంటే, లిఖితరూపం అనేక సంవత్సరాల తర్వాత ప్రారంభమైనా, వీటిని అనుమానించటానికి ఎటువంటి అవకాశమూ లేదు. అనుచరులు తమకు గుర్తున్న వివరాలను సాధారణంగా మూడు కారణాల వల్ల నమోదు చేసేందుకు సిధ్ధపడే వారు కారు.

1. మొదటి కారణం ఏమిటంటే, ఖుర్ఆన్ తప్ప ఇతర ఏ విషయాన్నీ రాయ వద్దని ప్రవక్త(స) వారించారు. దీనివల్ల ఖుర్ఆన్, ఇతర విషయాలు కలసి పోతాయనే భయం ఉండేది. అయితే ఖుర్ఆన్ పూర్తిగా లిఖిత రూపంలోనికి వచ్చిన తర్వాత ప్రవక్త(స) స్వయంగా కొంతమంది అనుచరులను హదీసులను వ్రాసుకునే అనుమతి ఇచ్చారు. అయినా చాలామంది అనుచరులు చివరి క్షణం వరకు రాయడంలో జాగ్రత్త వహించేవారు.

2. వివరాలు లిఖితరూపం దాల్చితే ప్రజలు తమ జ్ఞాపకశక్తి అధికంగా ఉపయోగించరని అనుచరులు భయపడేవారు. అలాగే జరిగింది కూడా. వ్రాత ప్రతులు, లిఖిత రూపంలో వివరాలను భద్రపరచిన కొద్దీ మెదడుకు మేత తగ్గుతూ పోయింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ గ్రంధాలను తమ చేతుల్లోకి తీసుకొని పాండిత్య వాదన చేస్తారని భయపడేవారు. అలాగే జరిగింది కూడా.

3. మూడవ కారణం ఏమిటంటే, అరబ్బుల్లో సంఘటనలను రాసి పెట్టు కోవటాన్ని, వ్రాతరూపంలో భద్ర పరచటాన్ని లోపంగా భావించేవారు. ఒకవేళ రాసుకున్నా దాన్ని దాచి ఉంచేవారు. కొందరు హదీసు వేత్తలు వ్రాసి ఉంచటం కన్నా కంఠస్తం చేయటాన్ని సురక్షితంగా భావించేవారు. వ్రాసి ఉంచితే ఇతరులు అందులో హెచ్చుతగ్గులు చేస్తారనే భయం ఉంటుంది. కాని మెదడులో నాటుకు పోయిన చిత్రాన్ని మార్పులు, చేర్పులు చేయడం ఎవరి తరమూ కాదు.

మొట్టమొదటిసారి ఈనాడు సభలో ఈ వాస్తవాన్ని బహిర్గతం చేస్తున్నాను. అదేమిటంటే, 100 సంవత్సరాలు లేదా 99 సంవత్సరాల వరకు ప్రవక్త(స) వివరాలు కేవలం జ్ఞాపకశక్తి పైనే ఆధారపడి ఉండేవనేది తప్పుడు భావం. అసలు కారణం ఏమిటంటే, వీటికి సంబంధించిన మొదటి ప్రచురణ ముఅత్తా ఇమామ్ మాలిక్ చరిత్ర అల్ మగాజీగా ప్రఖ్యాతి గాంచాయి. వీరిద్దరూ ఒకే కాలానికి చెందినవారు. వీరు క్రమంగా171 హిశ, 151 హిశలో మరణించారు. అందువల్లే వార్తా చరిత్ర హిజ్రీ రెండవ శతాబ్దంలో ప్రారంభమయింది. అయితే ఇంతకు ముందే వార్తా చరిత్ర ప్రారంభమైనదని ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ 101 హిశ లో మరణించారు. అతడు మహా పండితుడు, మదీనా పాలకుడుగా కూడా ఉన్నారు. 99 హిశ లో ఖలీఫా అయ్యారు. తన కాలంలో మదీనా ఖాజీకి ప్రవక్త(స) వివరాలకు వ్రాతరూపం ఇవ్వవలసిందిగా ఆదేశించారు. ఎందుకంటే ప్రజల జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గుతూ ఉంది కదా అన్నారు. ఈ సంఘటన తాలీఖాతె బుఖారీ ముఅత్తా, ముస్నద్ దార్మీలలో ఉంది. ఏది ఏమైనా  ఈ ఆదేశం ప్రకారం ప్రవక్త(స), అనుచరులకు సంబంధించిన వివరాలన్నీ లిఖిత రూపంలో పొందు పరచబడ్డాయి. వీటిని రాజధాని నగరానికి తీసుకురావటం జరిగింది. వీటి కాపీలు ఇతర పట్టణాలకు పంపబడ్డాయి. ఈ బాధ్యత అబూబకర్ బిన్ ముహమ్మద్ బిన్ అమ్ర్ బిన్ హజ్మ్ కే ఎందుకు ఇవ్వబడిందంటే, అతడు ఒక ప్రఖ్యాత ధార్మిక పండితుడు, మదీనా ఖాజీ. మరో గొప్ప కారణం ఏమిటంటే, అతని పిన్ని ఉమ్రహ్, ఆయిషహ్(ర) శిష్యురాలు. ఆయిషహ్(ర) నుండి ఈమె ద్వారా అనేక ఉల్లేఖనలు ముందు నుండే ఇబ్నె హజ్మ్ దగ్గర లిఖిత రూపంలో ఉండేవి. అందువల్లే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ప్రత్యేకంగా ఈమె ద్వారా ఉల్లేఖనాలను గ్రహించి లిఖిత రూపంలో పొందుపరచమని ఇబ్నె హజ్మ్ ను ఆదేశించడం జరిగింది.

ప్రవక్త() కాలం నాటి దస్తావీజులు :-  అంత ఎందుకు, ప్రవక్త(స) కాలంలోనే వార్తలు, చరిత్రలు, ఆదేశాలు, ఇతర వివరాలు లిఖితరూపంలో పొందుపరచడం ప్రారంభించబడింది. మక్కా విజయం సందర్భంగా ప్రవక్త(స) ఒక ప్రసంగం చేయడం జరిగింది. ఇది సహీ బుఖారీలో ఉంది. యమన్ కు చెందిన ఒక వ్యక్తి కోరగా ప్రవక్త(స) అబూషాహ్ ను తన ప్రసంగాన్ని వ్రాసి ఇవ్వమని ఆదేశించారు. ప్రవక్త(స) వివిధ చక్రవర్తులకు పంపిన ఉత్తరాలు, వ్రాసి పంపడం జరిగింది. ఇంచుమించు 10, 15 సంవత్సరాల క్రితం ప్రవక్త(స) ఈజిప్టు చక్రవర్తికి పంపిన ఉత్తరం, ఒక క్రైస్తవ చర్చిలోని ఒక పుస్తకంలో దొరికింది. ఇది ప్రవక్త(స) రాసిన ఉత్తరమే అని నిర్ధారించటం జరిగింది. సాధారణంగా దీని ప్రతులు అన్ని చోట్లా లభిస్తాయి. ఇది ప్రాచీన అరబీ లిపిలో ఉంది. ఈ ఉత్తరం ప్రవక్త(స) రాసినట్టే ఉంది. ఈ ఇస్లామీ పరంపరలు సత్యానికి సాక్ష్యాలుగా నిలిచాయి. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ నా కంటే ఎక్కువ హదీసులు ఉండటానికి కారణం, అతను ప్రవక్త(స) నుండి విన్న వెంటనే వ్రాసుకునే వారు. అయతే నేను రాసేవాడ్ని కాను అని అబూహురైరహ్ (ర) అన్నారు.(బుఖారీ) ప్రజలు అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ ను ‘ప్రవక్త(స) ఒక్కోసారి ఆగ్రహం కలిగి ఉంటారు, ఒక్కోసారి సంతోషంగా ఉంటారు, నువ్వు అన్నిటినీ వ్రాసుకుంటున్నావు?’ అని విమర్శించారు. ఆ తరువాత అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ వ్రాయడం మానివేసి, ప్రవక్త(స)కు ఈ విషయాన్ని తెలిపారు. ప్రవక్త(స) తన తల వైపు సైగ చేస్తూ ‘నువ్వు వ్రాస్తూ ఉండు, ఇక్కడి నుండి బయటకు వచ్చేదంతా సత్యమే అవుతుంది’ అని అన్నారు. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ తన వద్ద వ్రాయబడి ఉన్న వాటిని సాదిఖ అనే పేరు పెట్టారు. ఇంకా ఇలా అనేవారు, ‘నాకు రెండు విషయాలు జీవితంపై కాంక్షను జనింపజేసాయి. వాటిలో ఒకటి సాదిఖ’. సాదిఖ అంటే ప్రవక్త(స) నుండి విని నేను పొందుపరచిన గ్రంధము. జాహిద్ ఇలా అంటున్నారు, ‘మేము అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ వద్ద ఒక పుస్తకం ఉండటం చూసాము, ఇది ఏమిటి అని అడగడం జరిగింది. దానికి ఆయన సాదిఖ, దీన్ని నేను ప్రవక్త(స) నుండి వ్రాసాను. ఇందులో నాకూ ప్రవక్త(స) కూ మధ్య ఎవరూ లేరు’. బుఖారీ ప్రకారం ప్రవక్త(స) మదీనా వలస పోయిన తర్వాత ముస్లిముల జనాభా లెక్కించారు. అందరి పేర్లు వ్రాయబడ్డాయి. అందరూ కలసి 1500 మందిగా తెలిసింది. జకాత్ గురించి రెండు పేజీల్లో ఉన్న వివరాలన్నిటినీ వ్రాయించి, ప్రవక్త(స) ఇతర పట్టణాల పాలకులకు పంపారు. ఇవి అబూబకర్(ర)వద్ద, అబూబకర్ బిన్ అమ్ర్ బిన్ హజ్మ్ కుటుంబంలో, ఇంకా ఇతర ప్రముఖుల వద్ద ఉండేవి. జకాత్ ధనాన్ని వసూలు చేసేవారి వద్ద ఇతర లిఖిత వివరాలు కూడా ఉండేవి. అలీ(ర) వద్ద కూడా ఒక పత్రం ఉండేది. అది అతని కరవాలం ఒరలో ఉండేది. అందులో అనేక విషయాలకు సంబంధించిన హదీసులు ఉండేవి. ప్రజలు కోరగా వాటిని ప్రజలకు చూపించారు. హుదైబియలో ప్రవక్త(స)కు అవిశ్వాసులకు మధ్య జరిగిన ఒప్పందం గురించి అలీ(ర) వ్రాసారు. దాని ఒక కాపీ అవిశ్వాసుల వద్ద, ఒక కాపీ ప్రవక్త(స) వద్ద, మరో కాపీ అలీ(ర) వద్ద ఉంచడం జరిగింది. అమ్ర్ బిన్ హజ్మ్ ను ప్రవక్త(స) యమన్ పాలకుడుగా పంపినపుడు విధులు, జకాత్ సమస్యలు, పరిహారం మొదలైన విషయాలను సూచించి వ్రాయించి ఇచ్చారు. అబ్దుల్లాహ్ బిన్ అల్ హకీమ్ కు ప్రవక్త(స) ఉత్తరం అందింది. అందులో చనిపోయిన జంతువు గురించి ఉంది. వాయిల్ బిన్ హజ్ర్(ర) ప్రవక్త(స) వద్ద నుండి తన దేశానికి తిరుగు ప్రయాణమైనపుడు ప్రవక్త(స) ప్రత్యేకంగా అతని కోసం నమాజు, ఉపవాసం, వడ్డీ, వ్యపారం గురించి, ఇంకా ఇతర ఆదేశాల గురించి వ్రాయించి ఇవ్వడం జరిగింది. ఒకసారి అమ్ర్(ర) ప్రజలతో భర్త పరిహారం నుండి భార్యకు ప్రవక్త(స) ఎంత నిర్ణయించారో మీకు తెలుసా ? అని ప్రశ్నించారు. దానికి జిహాక్ బిన్ సుఫియాన్ నిలబడి నాకు తెలుసు, ప్రవక్త(స) దీన్ని వ్రాయించి మాకు పంపారు, అని అన్నారు. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ తన పరిపాలనా కాలంలో ప్రవక్త (స) జకాత్ ఆదేశాలను వెదికే ప్రయత్నంలో ఒక రాయబారిని మదీనా పంపారు. అతని సమస్యకు పరిష్కారం అమ్ర్ బిన్ హజ్మ్ కుటుంబం దగ్గర లభించింది. ప్రవక్త(స) యమన్ ప్రజలకు వ్రాయించి పంపిన ఆదేశాల్లో ఈ సమస్యలు ఉండేవి. ఖుర్ఆన్ ను కేవలం పరిశుభ్ర స్ధితిలోనే ముట్టుకోవాలి, బానిసను కొనక ముందు విడుదల చేయకూడదు. నికాహ్ కు ముందు తలాఖ్ తగదు. యమన్ నుండి ముఆజ్(ర) ఉత్తరం ద్వారా ప్రవక్త(స)ను ఆకుకూరల్లో కూడా జకాత్ ఉందా అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త(స) లేదు అని సమాధానం ఇచ్చారు. మర్వాన్ తన ప్రసంగంలో మక్కా హరమ్ అని అన్నారు. అది విని అక్కడే ఉన్న రాఫె బిన్ ఖదీజ్ ప్రవక్త(స) అనుచరులు ఎలుగెత్తి బిగ్గరగా మదీనా కూడా హరమ్ అని , ఈ సందేశం నావద్ద వ్రాయబడి ఉంది, మీరు కోరితే చదివి వినిపిస్తాను అని అన్నారు. జిహాక్ బిన్ ఖైస్(ర) నోమాన్ బిన్ బషీర్(ర) కు ఇలా వ్రాసారు, ప్రవక్త(స) జుమహ్ నమాజు లో సూరహ్ జుమహ్ ను వదలి వేరే ఏ సూరహ్ ను పఠించేవారు? దానికి ఆయన హల్ అతాక అనే సూరహ్ అని సమాధానం ఇచ్చారు. (ముస్లిమ్)

ఈ ఆదేశాలు, సమస్యలు ప్రవక్త(స) అనేకమంది ప్రజలకు రాయించారు, పంపించారు. వీటిని గురించి అనేక సాక్ష్యాధారాలు మా వద్ద ఉన్నాయి. ప్రముఖ అనుచరులు ప్రవక్త(స) సాంప్రదాయాలను, ఆదేశాలను పుస్తకరూపం ఇచ్చారు లేదా అబూబకర్(ర) తన పరిపాలనా కాలంలో ఒక గ్రంధాన్ని పొందుపరిచారు. కాని అది అతనికి నచ్చలేదు. వెంటనే చెరిపివేసారు. (తజ్కిరతుల్ హుఫ్ఫాజ్). ఉమర్(ర) కూడా తన పరిపాలనా కాలంలో ఈ విషయంపై ఆలోచించసాగారు. కాని ధైర్యం చాలలేదు. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ ప్రవక్త(స) అనుమతితో ఒక కాగితంపై రాసారు. అందులో ప్రవక్త(స) ప్రవచనాలు ఉండేవి. వాటిని చూడటానికి అనేకమంది ప్రజలు వచ్చేవారు. ఆయన వాటిని వారికి చూపించేవారు.(తిర్మిజి). అలీ(ర) వ్రాసిన తీర్పుల చిట్టా ఇబ్నె అబ్బాస్(ర) వద్దకు తీసుకురావటం జరిగింది.(ముస్లిమ్). అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్(ర) ఉల్లేఖనాల ప్రతులలోని కొన్నింటిని తాయిఫ్ ప్రజలు అతనికి వినిపించటానికి తెచ్చారు.(కితాబుల్ ఇలల్). సయీద్ బిన్ జుబైర్(ర) అతని ఉల్లేఖనాలను వ్రాసేవారు.(దార్మీ). అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ సంకళన గ్రంధం సాదిఖ అతని మనవడు అమ్ర్ బిన్ షుఐబ్ వద్ద ఉండేది.(తిర్మిజి). కాని అమాయకులు అతన్ని బలహీనునిగా ఎందుకు భావించే వారంటే, ఆయన తన తాతగారి పుస్తకం చూచి ఉల్లేఖించేవారు. అతనికి ఇవి కంఠస్తం ఉండేవి కావు. (తహ్జీబ్ 8- 49). జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ ఉల్లేఖనాల ప్రతులను వహబ్ తాబయీ తయారు చేసారు. ఇది ఇస్మాయీల్ బిన్ అబ్దుల్ కలీమ్ వద్ద ఉండేది. ఈ కారణంవల్లే అతడు బలహీనునిగా పరిగణింపబడేవారు. జాబిర్(ర) ఉల్లేఖనాల రెండవ గ్రంధం సులైమాన్ బిన్ ఖైస్ యష్కరీ తయారు చేసారు. అబూజుబేర్, అబూసుఫియాన్, షొఅబీ మొదలైనవారు హదీసువేత్తలు, తాబయీలు, జాబిర్ రెండవ గ్రంధ ప్రతులను వీరి నుండి విన్నారు. సమురహ్ బిన్ జున్దుబ్ అనుచరుల ద్వారా అతని కుమారులు సులైమాన్ ఉల్లేఖనాల ఒక ప్రతిని ఉల్లేఖించారు. ఆ తరువాత ఆయన ద్వారా అతని కుమారుడు, అబూ హురైరహ్(ర) కంటే ఎక్కువ హదీసులు ఎవరికీ గుర్తు ఉండేవి కావు. ఇతని ఉల్లేఖనాల  కొన్ని ప్రతులు హమ్మామ్ బిన్ మంబ తయారు చేసారు. ఇవి హమ్మామ్ ప్రతులుగా ప్రసిధ్ధి గాంచాయి. దీన్ని ఇబ్నెహంబల్ ముస్నద్ రెండవ భాగంలో 312-318 వరకు పొందు పరిచారు. బషీర్ బిన్ నహక్ అబూహురైరహ్ ఉల్లేఖనాల ప్రతుల్ని రాసారు. ఇంకా వాటిని ఉల్లేఖించారు. అయితే అనుమతి కోరిన తర్వాత. అబూహురైరహ్(ర) ఒకసారి ఒక వ్యక్తిని, తన ఇంటికి తీసుకొని వచ్చి ఇవి నా ఉల్లేఖనాలు అని చూపించారు. అయితే అవి అతని చేతివ్రాత కాదని, ఇతరుల వ్రాత అని ఉల్లేఖనకర్త అంటున్నారు.(ఫత్హుల్ బారీ)

అందరికంటే ఎక్కువ హదీసులు గుర్తున్న రెండవ అనుచరులు అనస్(ర). ఆయన తన కుమారులతో ఇలా అనేవారు, కుమారులారా! జ్ఞానాన్ని లిఖితరూపంలోనికి తీసుకురండి.(దార్మీ) అబ్బాస్(ర) తన శిష్యుల మధ్య కూర్చోని వారి ఉల్లేఖనాలను వ్రాసేవారు.(దార్మీ) సల్మా అనే ఒక మహిళ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్, ప్రవక్త(స) సేవకులైన అబూరాఫె నుండి ప్రవక్త(స) ఘనకార్యాల గురించి అడిగి వ్రాసేవారు (ఇబ్నెసఅద్). ప్రవక్త(స) జీవిత చరిత్రకు చెందిన ప్రారంభ రచయితల్లో ఒకరైన వాఖిదీ ఇలా అంటున్నారు, అమాన్ ధనవంతుడైన మున్జిర్ బిన్ సారీ పేర ప్రవక్త(స) పంపిన ఉత్తరాన్ని ఇబ్నెఅబ్బాస్(ర) పుస్తకాల్లో చూసాను (జాదుల్ మఆద్). ఉర్వ బిన్ జుబేర్ బద్ర్ యుధ్ధం వివరాలన్నిటినీ వ్రాసి ఖలీఫా అబ్దుల్ మలిక్ కు పంపారు.(తబ్రీ).

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ ప్రవక్త(స)కు సన్నిహిత సేవకులు. అతనికి ప్రవక్త(స) ఇంటిలోనికి వచ్చే పోయే అనుమతి ఉండేది. ఆయనకు, “ప్రజలు నా దగ్గరకు వచ్చి వినేవారు, వెళ్ళి వాటిని రాసు కునేవారు, అయితే నేను ఖుర్ఆన్ ను తప్ప మరి దేన్నీ వ్రాయటాన్ని ధర్మసమ్మతంగా భావించను” అనే అభ్యంతరం ఉండేది.(దార్మీ) సయీద్ బిన్ జుబైర్ తాబయీ  ఇలా అంటున్నారు, “నేను అబ్దుల్లాహ్ బిన్ ఉమర్  మరియు ఇబ్నెఅబ్బాస్ ల నుండి రాత్రి ఉల్లేఖనాలు విని వచ్చి వాటిని రాతి పలకపై వ్రాసేవాడిని. మళ్ళీ ఉదయం వాటిని చెరిపివేసేవాడిని”.(దార్మీ) బరాబిన్ ఆజిబ్(ర) వద్ద ప్రజలు కూర్చోని ఆయన ఉల్లేఖనాలను వ్రాసుకునేవారు.(దార్మీ) ఇబ్నె ఉమర్(ర) సేవలో 30 సంవత్సరాలు గడిపిన నాఫె తన ముందు ప్రజల కొరకు వ్రాయించేవారు.(దార్మీ) అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ కుమారులు అబ్దుర్రహ్మాన్ ఒక పుస్తకం తీసుకొని వచ్చి, ప్రమాణం చేసి ఇది స్వయంగా అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ వ్రాసిందే అని అన్నారు. సయీద్ బిన్ జుబేర్ ఇలా వ్రాస్తున్నారు, “మాలో కొన్ని విషయాల గురించి అభిప్రాయబేధం తలెత్తినపుడు  వాటిని వ్రాసుకొని ఇబ్నె ఉమర్ వద్దకు ఆ రాసిందాన్ని దాచి తెచ్చేవాళ్ళం. వాటి గురించి అతన్ని అడిగేవాళ్ళం. ఒకవేళ వాటిగురించి తెలిసిపోతే అతనికీ మాకీ మధ్య  తీర్పు జరిగిపోయేది”. తాబయీ అస్వద్ ఇలా అంటున్నారు, “నాకూ అల్ ఖమహ్ కు ఒక పత్రం దొరికింది. దాన్ని తీసుకొని మేము ఇబ్నెఉమర్ వద్దకు వచ్చాము. దాన్ని అతను చెరిపివేసారు”.(జామె) జైద్ బిన్ సాబిత్ దైవవాణిని వ్రాసేవారు. ఆయనకు కూడా ఉల్లేఖనాలను వ్రాయడంలో అభ్యంతరం ఉండేది. మర్వాన్ ఒక ఉపాయం ఆలోచించి అతన్ని ముందు కూర్చోబెట్టాడు. తెర వెనుక వ్రాసేవారిని నియమించాడు. ఆయన చెబుతూఉంటే అతను వ్రాస్తూ ఉంటారు.(జామె) ముఆవియహ్(ర) కూడా ఒక హదీసు ఈ విధంగానే వ్రాయించారు. కాని అతను పసిగట్టి బలవంతంగా చెరిపి వేసారు.(అహ్మద్)

సోదరులారా! మీరు ఇటువంటి ప్రామాణిక సంఘటనల, వ్యక్తుల పేర్లు వింటూ బెంబేలెత్తిపోయి ఉన్నారేమో, కాని నిశ్చింతగా ఉండండి, మనం ఇప్పుడు సరైన ప్రదేశానికి చేరుకున్నాము. ఇక్కడి నుండి రుజుమార్గం స్పష్టంగా కనబడుతుంది. వ్రాతప్రతుల భాండాగారమే ఒకవేళ ప్రపంచంలో నమ్మదగినదైతే ప్రవక్త(స) కాలంలోనే ప్రవక్త అనుచరులు వాటిని తమ చేతులతో పొందు పరిచారు. రానున్న తరాల వారి జ్ఞాపకార్ధం వదలి వెళ్ళారు. ముందు తరాలవారు వాటిని తమ గ్రంధాలలో పేర్కొన్నారు. అనే విషయాన్ని ఈ వాక్యాల ద్వారా తెలియ పరిచాను. ఇప్పుడు మేము చెబుతున్న విషయం ఏమనగా ప్రవక్త(స) అనుచరుల కాలంలోనే తాబయీన్లు వారి ఉల్లేఖనాలు, సంఘటనలు, పరిస్ధితులు ఒక్కొక్కటీ అడిగి, ప్రతి ఇంటికీ వెళ్ళి వృధ్ధులు, యువకులు, స్త్రీలు, పురుషులు అందరి నుండి సేకరించి మన కోసం పొందుపరిచారు. ముహమ్మద్ బిన్ షిహబ్ జుహ్రీ, హిషామ్ బిన్ ఉర్వహ్, ఖైస్ బిన్ అబీహాజిమ్, అతా బిన్ అబీ రిబాహ్, సయీద్ బిన్ జుబైర్, అబుజ్జినాద్ మొదలైన అనేక మంది తాబయీన్లు నిరంతర కృషిచేసి ఒక్కొక్క విషయాన్ని కూడబెట్టారు. మన ముందు ఇంత పెద్ద ఇస్లామీయ భాండాగారాన్ని వదలి వెళ్ళారు. హదీసు మరియు చరిత్రకారులైన జుహ్రీ ప్రవక్త(స) యొక్క ఒక్కొక్క విషయాన్నీ వ్రాశారు. అబుజ్జినాద్ ఇలా అన్నారు, “మేము కేవలం ధర్మాధర్మ విషయాలను వ్రాసేవాళ్ళం. జుహ్రీ మాత్రం విన్నదంతా వ్రాసేవారు”. (జామె) ఇబ్నెకీసాన్ ఇలా అన్నారు, “నేనూ జుహ్రీ విద్యార్జనలో తోడుగా ఉన్నాం. నేను ప్రవక్త(స) సాంప్రదాయాలను వ్రాస్తానని అన్నాను. దానికి జుహ్రీ అనుచరులకు సంబంధించినది కూడా, ఎందుకంటే అదికూడా సాంప్రదాయమేకదా అని అన్నారు. అనంతరం నేను రాయలేదు, అతడు వ్రాసాడు. ఫలితంగా అతడు సాఫల్యం పొందాడు. నేను వినాశనానికి గురయ్యాను”.(ఇబ్నుసఅద్). వీటన్నిటినీ లిఖితరూపంలోకి తెచ్చినవారు అనేకమంది తాబయీన్లు, జుహ్రీ మొదలైనవారు. కేవలం ఇవే ఇంత ఎక్కువగా ఉన్నాయంటే, వలీద్ బిన్ యజీద్ హత్య తరువాత జుహ్రీ యొక్క ఈ సాంప్రదాయ సంపద జంతువుల పై వేసి తీసుకురావటం జరిగింది.

ఇమామ్ జుహ్రీ 50 హిజ్రీలో జన్మించారు. 124వ హిజ్రీలో మరణించారు. ఇతను ఖురైష్ వంశానికి చెందినవాడు. ఇతడు ఎంత గొప్ప నిరంతర కృషి, శ్రమ, భక్తిశ్రధ్ధలతో ప్రవక్త(స) జీవిత విశేషాలు, ఉపదేశాలు ఒకచోట చేర్చాడంటే, దీన్ని గురించి చరిత్రకారుల ఈ వాగ్మూలం ద్వారా తెలుస్తుంది. అతడు మదీనాలోని ఒక్కొక్క అన్సారీ ఇంటికి వెళ్ళేవాడు. వృధ్ధులు, యువకులు, స్త్రీలు, పురుషులు ఎవరు దొరికినా, చివరికి తెరచాటు ఉన్న స్త్రీలతో కూడా మాట్లాడి, ప్రవక్త(స) ఉపదేశాలు, ఇతర వివరాలు, సాంప్రదాయాలు అడిగి తెలుసుకొని వ్రాసుకునే వాడు. ఆ కాలంలో చాలామంది ప్రవక్త (స) అనుచరులు సజీవంగా ఉన్నారు. జుహ్రీకి అనేకమంది శిష్యులు ఉన్నారు. వీరందరూ రాత్రింబవళ్ళు ప్రవక్త(స) బోధనలు, ఆచరణలు, సాంప్రదాయాలు పొందు పరచడంలో, సంకలనం చేయడంలో, విద్యా బోధనలో, అధ్యయనంలో, సందేశ ప్రచారంలో నిమగ్నమై ఉండేవారు. ఇదే వారి జీవిత ధ్యేయంగా ఉండేది. ప్రాపంచిక పనులన్నిటి నుండి వేరై, వీటిలోనే జీవితం గడిపేవారు.

అపార్ధాలకు అసలు కారణం ఏమిటంటే, సామాన్య ప్రజలు హదీసుల ఏరివేత, రాయడం, జీవిత చరిత్రలు మొదలైనవి రచించడం, వ్రాయడం మొదలైన పనులు తాబయీన్లు ప్రారంబించారని భావించడం జరిగింది. తాబయీన్లు అంటే ప్రవక్త(స) అనుచరులను చూచినవారు. వారి నుండి విద్య అభ్యసించినవారు, ప్రవక్త(స) అనుచరుల కాలం 100 సంవత్సరాల వరకు గడిచింది. అంటే తాబయీన్ల కాలం 100 సంవత్సరాల తర్వాత ప్రారంభమైందని, ఈ విధంగా గ్రంధ రచన 100 సంవత్సరాల తర్వాత ప్రారంభ మైందని భావిస్తారు. కాని ఇదంతా తప్పుడు ప్రచారం. తాబయీన్ అంటే ప్రవక్త(స)ను చూడని, సహాబాలను చూచి వారి వద్ద విద్య పొందిన, ప్రవక్త(స) కాలం పొందిన, కాని వారికి దర్శించే భాగ్యం కలగని, లేదా ప్రవక్త(స) చివరి కాలంలో జన్మించిన, లేదా ప్రవక్క(స) మరణించిన తరువాత జన్మించినవారు. వీరందరూ తాబయీన్లే. ఈ విధంగా చూస్తే తాబయీన్ల పరంపర ప్రవక్త(స) కాలంలోనే ఇంచుమించు 11వ హిజ్రీలోనే ప్రారంభమైపోయింది. అందువల్ల ఇది 11వ హిజ్రీ నుండి ప్రారంభం అయింది. అంటే తాబయీన్లు దీన్ని ప్రారంభించారు. ఇది తాబయీన్ల ఘనకార్యం అనడానికి ప్రవక్త(స) అనుచరులు మరణించనవసరం లేదు. అదేవిధంగా 100 సంవత్సరాలు గడవటమూ అవసరం లేదు. ఎందుకంటే అనుచరులను చూచి,వారి నుండి విద్యనభ్యసించినవారు తాబయీ అవుతారు. ఏది ఏమైనా ఈ వివరాల వల్ల ముస్లిముల్లో వార్తల, జీవిత చరిత్రల పరంపర 100 సంవత్సరాల తర్వాత ప్రారంభం అయింది అని అనడం చాలా అన్యాయం.

ముస్లిముల్లో వార్తలు, జీవిత చరిత్రలు, ఆదేశాలు, వివేకపూరిత వచనాల సంకలనం గ్రంధరూపం ఇవ్వటం మొదలైన వాటిని మూడు కాలాలుగా విభజించవచ్చు. 1) ఈ కాలంలో ప్రతివ్యక్తి తనకు తెలిసిన వివరాలు ఒక చోట చేర్చాడు. 2) ఈ కాలంలో ప్రతి ఊరు యొక్క వివరాలు ఒకచోట చేర్చడం జరిగింది. 3) ఈ కాలంలో ఇస్లామీయ ప్రపంచంలోని వివరాలన్నీ ఒకచోట చేర్చటం జరిగింది. ఆ తరువాత వాటిని పుస్తకాల రూపంలో ముద్రించటం జరిగింది. మొదటి కాలం సుమారు 100 హిశ వరకు ఉంది. రెండవ కాలం 150 హిశ వరకు ఉంది. మూడవ కాలం 300 హిశ వరకు ఉంది. మొదటి కాలం ప్రవక్త(స) అనుచరులు మరియు తాబయీన్లది, రెండవ కాలం రెండవ, మూడవ తరాలది. మూడవ కాలం బుఖారీ, ముస్లిమ్, తిర్మిజి, అహ్మద్ మొదలైన వారిది. మొదటి కాలానికి చెందిన సంపదంతా, రెండవ కాలానికి చెందిన పుస్తకాల్లో ఉంది. రెండవ కాలానికి చెందిన సంపదంతా, మూడవ కాలానికి చెందిన పుస్తకాల్లో ఉంది. అంతేకాదు, రెండవ, మూడవ కాలాలకు చెందిన ధార్మిక జ్ఞాన సంపదంతా ఈనాడు వేల పేజీల రూపంలో మన ముందు ఉంది. ఇంత ప్రామాణికమైన చారిత్రక సంపద అంటూ మరొకటేదీ లేదు. అయితే షిబ్లీ నోమానీ అభిప్రాయం ప్రకారం ఇతర జాతులు కూడా ఈ విధమైన కంఠస్త ఉల్లేఖనాలను ఒకచోట చేర్చటం జరిగింది. వీరు ఒక కాలానికి చెందిన పరిస్ధితులను లిఖితరూపంలో సమకూర్చినపుడు ప్రామాణికతకు ప్రాముఖ్యత ఇవ్వకుండా దొరికిన వన్నీ వ్రాసుకునేవారు. వాటి ఉల్లేఖకుల పేరూ, ఊరూ కూడా తెలిసి ఉండదు. ఈ కల్పిత కధల్లో నుండి గాధలను, సంఘటనలను ఎన్నుకునేవారు. ఇవే కొంత కాలానికి చారిత్రక గ్రంధాల్లా మారిపోయేవి. యూరప్ లోని అనేక రచనలు ఈ నియమాన్ని అనుసరించి వ్రాసినవే.

కాని ముస్లిములు చారిత్రక కళను ప్రామాణిక నియమానుసారం అనుసరించారు. దీని మొదటి నియమం ఏమిటంటే, ఆ సంఘటనలో పాల్గొన్న వ్యక్తి చెప్పాలి, ఒకవేళ తాను లేకపోతే సంఘటన వరకు ఉన్న ఉల్లేఖకులందరి పేర్లు చెప్పాలి. అంతేకాదు, ఉల్లేఖన పరంపరలో ఉన్నవారు ఎవరు? ఎలాంటివారు? ఏ వృత్తికి చెందినవారు? వారి నడవడిక ఎలా ఉండేది? వారి బుధ్ధీజ్ఞానాలు ఎలా ఉండేవి? నీతిమంతులా అవినీతిపరులా? తెలివిగలవారా లేక మూర్ఖులా? ఈ చిన్నచిన్న విషయాలను కనిపెట్టటం చాలా కష్టంగా ఉండేది. వేలమంది హదీసు వేత్తలు తమ జీవితాలను దీన్ని గురించే త్యాగం చేసారు. ఒక్కొక్క పట్టణానికి వెళ్ళి ఉల్లేఖకులను కలిసేవారు. వారి గురించి అన్ని రకాల వివరాలు సేకరించేవారు. ఈ పరిశోధనల ద్వారా అస్మాఉర్రిజాల్ అనే అద్భుత మైన కళను కనుగొన్నారు. దీని వల్ల ఇంచుమించు అనేక లక్షల వ్యక్తుల జీవిత వివరాలు తెలుస్తాయి. ఇది కేవలం ఉల్లేఖనాల గురించి పేర్కొనడం జరిగింది. అయితే బుధ్ధిపూర్వకంగా ఉల్లేఖనాలను పరిశీలించే నియమ నిబంధనలను సంకలనం చేయబడ్డాయి. ఎలా ఉల్లేఖనాలను తప్పు, ఒప్పులుగా నిర్ణయించడం జరిగినట్టు, ఈ విషయాల పరిశీలనలో ఉల్లేఖకులు సత్యసంధతతో బాధ్యతను నిర్వర్తించడం జరిగింది. ఫలితంగా తెలిసిన సత్యసంఘటనలు, గాధలు, ఇస్లామ్ కు గర్వకారణంగా నిలిచాయి. ఉల్లేఖకులల్లో గొప్పగొప్ప రాజులు, చక్రవర్తులు కూడా ఉన్నారు. వీరి కరవాలాల భయం ప్రజలపై ఆవరించి ఉండేది. కాని హదీసు వేత్తలు ఎటువంటి భయం లేకుండా అందరి వాస్తవాలను బయట పెట్టారు. ఒకవేళ తన తండ్రి ప్రభుత్వ అధికారి అయితే, ఉల్లేఖన స్వీకరించి నపుడు అతని సమర్ధనలో ఎవరినైనా ఇతర ఉల్లేఖనకర్తను కలుపుకునేవారు. అంటే ఒంటరిగా తన తండ్రి ఉల్లేఖనను కూడా స్వీకరించే వారు కారు. దీన్నిబట్టి సత్యం పట్ల ఎంత జాగ్రత్త వహించేవారో తెలుస్తుంది.

మస్ఊదీ అనే ఒక హదీసువేత్త 154 హి.శలో మఆజ్ బిన్ మఆజ్ అతన్ని ఇలా చూచారు. వీరికి తన జ్ఞాపకశక్తితో పాటు చూచి నిర్ణయానికి వచ్చే అలవాటు కూడా ఉండేది. ఆయన వెంటనే తన జ్ఞాపకశక్తి పట్ల అపనమ్మకాన్ని తెలియపరిచారు. అలాగే ఈ మఆజ్ బిన్ మఆజ్ కూడా పండితులే, వీరికి ఒక వ్యక్తి మరో వ్యక్తిని గురించి ఏమీ అనకుండా మౌనం వహించడానికి 10,000 దీనార్లు ఇవ్వచూపాడు. ఆ దీనార్ల సంచిని నీచదృష్టితో చూస్తూ, నిరాకరించి, “నేను ఎలాంటి సత్యాన్నీ దాచలేను, చరిత్రలో ఇంతకంటే అప్రమత్తత, జాగ్రత్త వహించబడిన ఉదాహరణ మరొకటి ఉంటుందా?” అని అన్నారు.

ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రామాణికమైనవి, అప్రామాణికమైనవి, స్వీకరణ యోగ్యమైనవి, కానివి మొదలైన ఉల్లేఖనలు కుప్పలు, తెప్పలుగా ఉన్నాయి. ఒకవేళ ఈనాడు కూడా ఈ ప్రామాణిక నియమనిబంధనలను ఉపయోగించి పరిశీలిస్తే, సత్యమైనవి, అసత్యమైనవి, కల్పిత మైనవి అన్నిటినీ పాలు, నీళ్శలా వేరుచేయవచ్చును.

సోదరులారా! ఈ పొడిపొడి పరిశోధనల్లో మీ అధిక సమయాన్ని తీసుకున్నాను. ప్రవక్త(స) జీవిత చరిత్రకు సంబంధించిన చారిత్రక కోణం మీకు అర్ధమైపోయి ఉండవచ్చు, ఇప్పుడు మీకు ప్రవక్త(స) జీవిత పరిస్ధితులు, సంఘటనలకు సంబంధించిన వివరాలన్నీ ఎక్కడి నుండి లభించాయి, ఎలా సంకలనం చేయబడ్డాయి, ప్రవక్త(స) జీవిత చరిత్రకు సంబంధించిన ప్రధానమైన, ప్రామాణికమైన, అన్నిటికంటే సత్యమైనదాన్ని గురించి నేను మీకు వివరిస్తాను.

వీటి మూలాలు ఇవి :-

1. ఖుర్ఆన్ గ్రంధం, దీని సత్యతపై, నమ్మకంపై మిత్రులేకాదు శత్రువులు కూడా అనుమానించడానికి సాహసించలేక పోయారు. ప్రవక్త(స) యొక్క జీవిత చరిత్రకు సంబంధించిన భాగాలన్నీ, దైవ దౌత్యానికి ముందు జీవితం, అనాధత్వం, పేదరికం, సత్యాన్వేషణ, దైవవాణి, దైవదౌత్యం, సందేశ ప్రచారం, మేరాజ్, శత్రువుల వ్యతిరేకత, యుధ్ధాలు, సంఘటనలు, నైతికత అన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇంతకంటే ప్రామాణికమైన జీవిత చరిత్ర ఈ భూమిపై మరొకటి లేదు.

2. హదీసులు, ఇవి ఒక లక్ష వరకు ఉన్నాయి. వీటిలో సత్యమైనవి, బలహీనమైనవి, కల్పించ బడినవి వేర్వేరుగా ఉన్నాయి. ఆరు ప్రామాణిక గ్రంధాలున్నాయి. వీటిలో ఉన్న ఒక్కొక్క సంఘటన పరిశోధన, పరిశీలనలతో కూడుకొని ఉన్నది. ధృవపరిచే గ్రంధాలు ఉన్నాయి. వీటిలో అన్నిటి కంటే పెద్ద గ్రంధం ముస్నద్ ఇమామ్ ఇబ్నెహంబల్, ఇది ఆరు భాగాల్లో ఉంది. ఒక్కొక్క భాగం ఈజిప్టు కాగితంపై పేజీలు కలిగి ఉంది. ఇందులో ఒక్కొక్క ప్రవక్త అనుచరుని ఉల్లేఖనాలు వేర్వేరుగా ఉన్నాయి. ఈ భాగాల్లో ప్రవక్త(స) జీవిత చరిత్రకు సంబంధించిన పరిస్ధితులు, బోధనలు, సంఘటనలన్నీ కలిసున్నాయి.

మగాజీ(యుధ్ధాలు), అంటే ప్రవక్త(స) కాలంలో జరిగిన యుధ్ధాలను తెలిపే గ్రంధాలు. మధ్యలో కొన్ని సంఘటనలు కూడా ప్రస్తావించబడి ఉన్నాయి. వీటిలో మగాజీ ఉర్వహ్ బిన్ జుబైర్ (మరణం 94 హిశ), మగాజీ ఇబ్నె ఇస్హాఖ్ (మరణం150 హిశ), మగాజీ బుఖారీ (మరణం153 హిశ), మగాజీ వాఖిదీ (మరణం 207 హిశ) మొదలైనవి ప్రాచీనమైనవి.

4. చారిత్రక పుస్తకాలు, వీటి మొదటి భాగం ప్రత్యేకంగా ప్రవక్త(స) జీవిత చరిత్రపై ఆధారపడి ఉంది. వీటిలో ప్రామాణికమైనవి, నమ్మదగినవి తబఖాత్ ఇబ్నె సఅద్, తారీఖుర్రుసుల్ వల్ ములూక్ ఇమామ్ జాఫర్ తబ్రీ, తారీఖు సగీర్ వ కబీర్ ఇమామ్ బుఖారీ, తారీఖు ఇబ్నెహిబ్బాన్, తారీఖు ఇబ్నెఅబీ ఖసీమహ్ బాగ్దాదీ(మరణం 299 హిశ)మొదలైనవి.

5. ప్రవక్త(స) మహిమలు, మానసిక విజయాలు, వీటికి వేరే గ్రంధం ఉంది. వీటిని సాక్ష్యాధారాల గ్రంధం అంటారు. ఉదా – దైవదౌత్య సాక్ష్యాధారాలు ఇబ్ను ఖుతైబ (మరణం276 హిశ), దైవదౌత్య సాక్ష్యా ధారాలు అబూఇస్హాఖ్ హర్బీ(మరణం276 హిశ), దైవదౌత్య సాక్ష్యాధారాలు  అబూఇస్హాఖ్ హర్బీ (మరణం 255హిశ), దలాయిలు ఇమామ్ బైహఖీ (మరణం 432హిశ), దలాయిలు అబూనయీమ్ అస్ఫహానీ (మరణం535హిశ), దలాయిలు ముస్తగ్ఫిరీ (మరణం432హిశ), దలాయిలు అబుల్ ఖాసిమ్ ఇస్మాయీల్ అస్ఫహానీ(మరణం535హిశ) అయితే ఈ వృత్తిలో అన్నిటి కంటే ప్రామాణిక గ్రంధం ఇమామ్ సుయూతీ వ్రాసిన ఖసాయిసు కుబ్రా.

6. దైనందిన జీవిత వివరాల గ్రంధాలు, వీటిలో ప్రవక్త(స) యొక్క సద్గుణాలు, అలవాట్లు, ప్రత్యేకతలు, ప్రాముఖ్యతలు, లావాదేవీలు ఉన్నాయి. ఇందులో అన్నిటి కంటే మొదటిది, ప్రఖ్యాతి గాంచిన గ్రంధం షమాయిల్ తిర్మిజి (మరణం299హిశ) పెద్దపెద్ద పండితులు దీన్ని గురించి వ్యాఖ్యానాలు, భావాలు, సారాంశాలు వ్రాసారు. అయితే అన్నిటికంటే పెద్ద గ్రంధం కితాబుష్షాఫీ హుఖూఖుల్ ముస్తఫా ఖాజీ అయ్యాజ్, దీని వివరణ షిహాబ్ హఖ్ఖాజీ పుస్తకం నసీముర్రియాజ్. ఈ కళలో ఇతర పుస్తకాలు షమాయిలున్నబీ అబుల్అబ్బాస్ ముస్తగ్ఫిరీ (మరణం432హిశ), షమాయిలున్నూర్ అస్సుయూతీ ఇబ్నుల్ ముఖ్రీ గర్నాతీ (మరణం552హిశ), సఫరుస్సఆదహ్ మజ్దుద్దీన్ ఫేరోజాబాదీ (మరణం 817హిశ) మొదలైనవి.

7. ఇవేకాక ఇంకా ఎన్నో పుస్తకాలు మక్కా, మదీనా నగరాల పరిస్ధితులపై ప్రవక్త(స)తో సంబంధం ఉన్న స్ధానిక పరిస్ధితులపై, ప్రదేశాలపై ఆధారపడి ఉన్నాయి. ఇటువంటి పుస్తకాల్లో అన్నిటికంటే ప్రాచీనమైనది. అఖ్బారు మక్కా అల్ మర్జూఖీ (మరణం223హిశ), అఖ్బారు మదీనా ఉమర్ బిన్ షోబ (మరణం262హిశ), అఖ్బారు మక్కా ఫాకిహీ, అఖ్బారు మదీనా ఇబ్ను జుబాలా మొదలైనవి.

మిత్రులారా! ఈనాటి ప్రసంగంలో ప్రవక్త(స) జీవిత చరిత్రకు సంబంధించిన చారిత్రక వివరాలన్నీ నేను మీ ముందు పెట్టాను. దీనికి సంబంధించిన సానుకూల, వ్యతిరేక భావాలను పరిశీలిస్తే ప్రవక్త(స) జీవిత చరిత్ర యొక్క  చారిత్రక స్ధానం అర్ధమవుతుంది. అయితే హదీసువేత్తలు, ఇస్లామీయ పాలకులు, ఖలీఫాలు కేవలం నోటి పలుకులతో, చేతివ్రాతలతో సరిపెట్టుకోలేదు. ఈ కళలో ప్రావీణ్యం గల మహాపండితులను రప్పించి సరిపెట్టుకోలేదు. ఈ కళలో ప్రావీణ్యంగల మహాపండితులను రప్పించి, సభలు, శిక్షణా తరగతులు, శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసేవారు. ఖతాద అన్సారీ ప్రవక్త(స) సహచరులు, వీరి మనవడు ఆసిమ్ బిన్ ఉమర్ యుధ్ధాల, పోరాటాల రచయిత, వీరు 121వ హిజ్రీలో మరణించారు. వీరు ఖలీఫా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆదేశంపై రాజధాని దిమిష్క్ లోని జామెమస్జిద్ లో కూర్చోని దీన్ని గురించి బోధించేవారు. (తహ్జీబ్)

అంతేకాదు, ప్రవక్త(స) కాలం నుండి ఈనాటి వరకు అనేక కాలాల్లో, అనేక దేశాల్లో, అనేక భాషల్లో ప్రవక్త(స)కు సంబంధించిన  సంఘటనలు, పరిస్ధితులు, బోధనలు, వ్రాయబడిన గ్రందాలు, పుస్తకాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఉర్దూ భాషలోనూ 200 సంవత్సరాలకు మించి లేదు, ఇందు లోనూ రచనా కాలం ఇంచుమించు 1857 హిశ లో ప్రారంభం అయింది. ఈనాటి వరకు చిన్నాపెద్దా పుస్తకాలు ఈ అంశంపై ముద్రించబడుతూనే ఉన్నాయి.

ముస్లిములను వదలి వేయండి వారిధర్మం, విశ్వాసం అంతా ప్రవక్త(స) పై నమ్మకం, విధేయతలోనే ఉంది. ఇతరులను చూడండి, భారత దేశంలో హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బ్రాహ్మణులు అందరూ ప్రవక్త(స) జీవిత చరిత్రను రచించి ఉన్నారు. ప్రవక్త(స) పట్ల నమ్మకం లేని యూరప్ లో కూడా మిషనరీల సేవాభావంతోనో లేదా అభిరుచి భావంతోనో లేదా విశ్వ చరిత్ర అన్వేషణలో లైఫ్ ఆఫ్ ముహమ్మద్ పై అనేక పుస్తకాలు వ్రాయబడ్డాయి. నేటి నుండి 16 లేక 17 ఏళ్ళ క్రితం దిమిష్క్ లోని ఒక పత్రిక అల్ముఖ్తబిస్ లో అప్పటి వరకు అనేక భాషల్లో ప్రవక్త ముహమ్మద్(స)కు సంబంధించిన 1300 పుస్తకాలు ప్రచురించ బడ్డాయని ఉంది. మరి ఆ తరువాత కాలంలో ప్రచురించ బడిన పుస్తకాలను కలుపుకోండి, వాటి సంఖ్య ఎంత ఉంటుందో లెక్క పెట్టలేరు. ప్రొఫెసర్ మార్గొలీస్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లోని ఒక అరబీ ప్రొఫెసర్. ఇంగ్లీషులో అతని పుస్తకం ముహమ్మద్ 1905లో హీరో ఆఫ్ ది నేషన్స్ లో ప్రచురించబడింది. అయితే ఇంగ్లీషులో ప్రవక్త(స) జీవిత చరిత్రపై ఇంతకంటే విషపూరితమైన పుస్తకం ఏదీ ప్రచురించ బడలేదు. ఇందులో ఆ రచయిత పేర్కొన్న ప్రతి సంఘటనపై వాటి మూలాధారాలు పేర్కొన్నాడు. అంతేకాదు, దాన్ని మార్చి చూపించడంలో ఎటువంటి కొరతా చూపలేదు. అయినా అతడు తన ముందుమాటలో ఈ వాస్తవాన్ని ఒప్పుకోక తప్పలేదు.

“ముహమ్మద్ జీవిత చరిత్రను వ్రాసే చరిత్రకారులది చాలా సుదీర్ఘ పరంపర ఉంది. ఇది అంతం కావడం అసాధ్యం. అయితే అందులో చోటు సంపాదించటం గౌరవయోగ్యం.

THE BIOGRAPHERS OF THE PROPHET MUHMMAD FORM A LONG SERIES.  IT IS IMPOSSIBLE TO END.  BUT IN WHICH IT WOULD BE HONOURABLE TO FIND A PLACE.

జాన్ డేవిడ్ ఫోర్ట్ 1870లో ఇంగ్లీషు భాషలో అన్నిటికంటే సానుభూతి గల పుస్తకం అపోలజీ ఫర్ ముహమ్మద్ ఎండ్ ది ఖుర్ఆన్ రచించాడు.ఈ పుస్తకాన్ని అతడు ఈ వాక్యాల ద్వారా ప్రారంభించాడు.

రచయితల్లో, విజేయుల్లో ముహమ్మద్ జీవిత చరిత్ర ఉన్నత ప్రమాణాలతో, వివరాలతో ఉన్నవిధంగా ఇతరులెవ్వరిదీ లేదు. అనే విషయంలో ఎంతమాత్రం సందేహం లేదు.

ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ కు చెందిన బాస్వర్త్ స్మిత్ 1872 క్రి.శలో ముహమ్మద్ ఎండ్ ముహమ్మదనిజ్మ్అనే అంశంపై రాయల్ ఇనిస్టిట్ట్యూషన్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ లో ప్రసంగాలు చేసాడు. వీటిని పుస్తకరూపంలో ప్రచురించడం జరిగింది. ఇందులో అతడు చాలా మంచితనంతో ఇలా వ్రాసాడు.

సాధారణంగా ఒక ధర్మం మతంగా గుర్తించబడటం సహజం. దురదృష్టవశాత్తు మూడు మతాల స్ధాపకులను గుర్తించడం కూడా నిజమే, వారి పేర్లు మనకు సరిగా తెలియకపోవటం వల్ల మనం వాటిని చరిత్రగా భావిస్తాం. మనకు మతాల వ్యవస్ధాపకుల పట్ల తక్కువ, తరువాత మార్గంలో కృషి చేసిన వారి పట్ల ఎక్కువ వివరాలు తెలిసి ఉంటాం. మనం పోలిస్, సుఖ్రాత్ కంటే జర్తన్త్, కన్ఫ్యుషన్ పట్ల చాలా తక్కువ వివరాలు కలిగి ఉన్నాం. మూసా మరియు బుధ్ధుని గురించి ఏంబ్రూస్, సీజర్ కంటే తక్కువ వివరాలు తెలిసి ఉన్నాం. వాస్తవం ఏమిటంటే మనం ఈసా() జీవిత చరిత్ర కొన్ని భాగాల్లో నుండి కొంత మాత్రమే మనకు తెలుసు. ఆయన 30 సంవత్సరాల జీవితంపై నుండి ఎవరు తెరను ఎత్తగలరు? మనకు తెలిసినంత వరకు అతడు 1/3 వంతు ప్రజలకు జీవితం ప్రసాదించాడు. అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. ఒక ఐడియల్ లైఫ్ చాలా దూరం లేదా దగ్గరగా, సాధ్యం లేదా అసాధ్యంగా ఉంటుంది. కాని అతని ఎన్నో భాగాలు మనకు తెలియవు. మనం అతని తల్లి, అతని కుటుంబ జీవితం, అతని మిత్రులు, వారితో సంబంధాలు, సందేశ ప్రచారం మొదలైన విషయాల గురించి మనకేం తెలుసు? ఇతని గురించి ఎన్నో ప్రశ్నలు మనలోని ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్నాయి. అవి ప్రశ్నలుగానే మిగిలి ఉంటాయి. కాని ఇస్లామ్ లో ప్రతి విషయం ఉన్నత ప్రమాణాలతో కూడుకొని ఉంది. ఇందులో సరిగా కానరాకపోవటం, రహస్యం అనేవి లేనేలేవు. మనకు చరిత్ర ఉంది. మనకు బాధర్, మిల్టన్ గురించి తెలిసినట్టు ముహమ్మద్ గురించీ తెలుసు. మేథోలజీ, కల్పిత గాధలు, గాధల మహత్యాల సంఘటనలు ప్రాధమిక అరబీ రచయితల్లో లేవు. ఒకవేళ ఉన్నా చారిత్రక సంఘటనల ద్వారా వాటిని వేరుచేయ వచ్చును. ఇక్కడ ఏవ్యక్తీ తనను మోసం చేయలేడు. ఇతరులనూ మోసగించ లేడు. ఇక్కడ అంతా వెలుగే వెలుగు, ఇందులో ప్రతి వస్తువూ కనబడుతుంది. ప్రతి విషయాన్ని చూడ వచ్చు. (పేజీ 14-15-1889)

ప్రవక్త(స) జీవిత చరిత్రను గురించి ముస్లిములు వేలకొలది గ్రంధాలు, పుస్తకాలు రచించారు, రచిస్తున్నారు. అయితే వీటిలో ప్రతి ఒక్కటి ఇతర ప్రవక్తల పుస్తకాల, జీవిత చరిత్రలకంటే స్పష్టంగా, ప్రామాణికమైనవిగా, చారిత్రాత్మక మైనవిగా ఉన్నాయి. ప్రవక్త(స) జీవిత చరిత్రకు చెందిన ప్రాధమిక గ్రంధాలు వేలమంది రచయితల, వ్యక్తుల నుండి వివరాలు సేకరించి, గ్రహించి ఇతరులకు అంద జేయడం జరిగింది. హదీసులో మొదటి గ్రంధం ముఅత్తా, దీని రచయిత ఇమామ్ మాలిక్ నుండి 60 మంది విన్నారు. వీరిలో పాలకులు, పండితులు, వేదాంతులు, నాయకులు, భాషా ప్రవీణులు, మరియు రుషులు మొదలైన వారున్నారు. ఇమామ్ బుఖారీ రచన జామె సహీని ఆయన శిష్యుడు ఫర్బరీ నుండి 700 మంది విన్నారు. ఇంత అప్రమత్తత, ప్రామాణికతతో ప్రపంచంలోని ఏ మహా పురుషుని జీవిత చరిత్ర వ్రాయబడిందో చూపించండి? ఈ ప్రత్యేకతలన్నీ కేవలం ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్రలోనే ఉన్నాయి.

4.ప్రవక్త ముహమ్మద్() జీవితంలోని పరిపూర్ణతా కోణాలు.

మిత్రులారా! ఈనాటి నా అంశం పరిపూర్ణత,  ఒకరి జీవితం ఎంత చారిత్రాత్మకమైనదైనా, అది పరి పూర్ణం కానిదే, మనకోసం అది ఆదర్శం కాజాలదు. అదేవిధంగా ఒకరి జీవితం పరిపూర్ణంగా, నిష్కల్మషమైనదిగా ఉందని నిరూపించాలంటే, ఆ జీవితం యొక్క అన్నీ కోణాలు మన ముందు ఉండాలి. ప్రవక్త ముహమ్మద్(స) యొక్క జీవితంలోని ప్రతి ఘడియ జననం నుండి మరణం వరకు ఆ కాలం ప్రజల ముందు ఉండేది. మరణానంతరం ఇస్లామీయ చరిత్రలో ఉండేది, ఆయన జీవితానికి సంబంధించిన ఏ నిమిషమూ ప్రజల దృష్టికి దూరంగా ఉండేదికాదు.

జననం, బాల్యం, యవ్వనం, వ్యాపారం, ప్రయాణం, వివాహం, దైవదౌత్యానికి ముందు, మిత్రులు, పోరాటాలు, ఒప్పందాలు, సత్యసంధత, కాబాగృహం గోడలో హజరె అస్వద్ ను అమర్చటం, రాను రాను ఒంటరితనం, హిరాగుహలో ఒంటరిగా గడపటం, దైవవాణి, ఇస్లామ్ ఉద్భవించటం, సందేశ ప్రచారం, వ్యతిరేకత, తాయిఫ్ వైపు ప్రయాణం, మేరాజ్, వలసపోవటం, యుధ్ధాలు, హుదైబియ ఒప్పందం, ఇస్లామ్ సందేశ లేఖలు, ఇస్లామ్ ప్రచారం, ధర్మపరిపూర్ణత, హజ్జతుల్ విదా, మరణం మొదలైన వాటిలో ఏ విషయం ప్రజలకు కనుమరుగుగా ఉండేదని? చరిత్రకారులు ఎరుగని ఏ వ్యవహారం ఉందని? సత్యం, అసత్యం, మంచీ, చెడు అన్నీ స్పష్టంగా ఉన్నాయి. వీటిని గురించి ప్రతి వ్యక్తి తెలుసుకోగలడు. ఒక్కోసారి హదీసు వేత్తలు ప్రామాణిక హదీసులతో పాటు, బలహీనమైన హదీసులను కూడా ఎందుకు భద్రపరచి ఉంచారా? అనే ఆలోచన కూడా వస్తుంది. కాని ఇందులో దైవ నిర్ణయం ఉందని, వ్యతిరేకులకు అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉండకూడదని, ముస్లిములు తమ ప్రవక్త యొక్క బలహీనతలను దాచిపెట్టటానికి అనేక ఉల్లేఖనాలను వ్యర్ధం చేసారనే మాట రాకూడదనే విషయం అర్ధమవుతుంది. ఈనాడు క్రైస్తవ లిట్రేచర్ పై అనేక అభ్యంతరాలు వినటం జరుగుతుంది. అందువల్లే మన హదీసు వేత్తలు ప్రవక్త(స)కు సంబంధించిన ప్రతివిషయాన్ని అందరి ముందు పెట్టటం జరిగింది. అంతేకాదు, వీటిమధ్య ఉన్న వ్యత్యాసాన్నీ వాటిని గ్రహించే నియమాల్నీ విశదపరచి ఉన్నారు.

లేవటం, కూర్చోవటం, పడుకోవటం, మేల్కొనటం, వివాహం, భార్యాబిడ్డలు, మిత్రులు, బంధువులు, సలాహ్, ఉపవాసం, రాత్రీపగల ప్రార్ధనలు, ఒప్పందాలు, యుధ్ధాలు, రాకపోకలు, ప్రయాణం, శుచి శుభ్రతలు, తినటం త్రాగటం, నవ్వటం, ఏడ్వటం, వస్త్రాధారణ, నడవటం, సంచరించటం, హాస్యం, మాట్లడటం, ఏకాంతం, పధ్ధతులు, చివరికి దాంపత్య జీవితం, పరిశుభ్రత, సంఘటనలు మొదలైనవన్నీస్పష్టంగా భద్రపరచబడి ఉన్నాయి. ఇక్కడ నేను కేవలం షమాయిలె తిర్మీజిలో అధ్యాయాలను చదివి వినిపిస్తాను. దీనివల్ల మన ప్రవక్త(స)కు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్నీ ఎలా పొందు పరచడం జరిగిందో తెలిసిపోతుంది.

1. ప్రవక్త(స) రూపురేఖలు, 2. ప్రవక్త(స) వెంట్రుకలు 3. ప్రవక్త(స) పండిన వెంట్రుకలు 4. ప్రవక్త (స) దువ్వెన 5. ప్రవక్త (స) సువాసన పులుమకోవటం 6. ప్రవక్త(స) సుర్మ ఉపయోగించటం 7. ప్రవక్త (స) దుస్తులు 8. ప్రవక్త(స) జీవిత విధానం 9. ప్రవక్త(స) మేజోళ్ళు 10. ప్రవక్త(స) కాళ్ళను శుభ్ర పరచటం 11. ప్రవక్త(స) ఉంగరం 12. ప్రవక్త(స) కరవాలం 13. ప్రవక్త(స) కవచం 14. ప్రవక్త(స) గురించి 15. ప్రవక్త(స) పగిడి గురించి 16. ప్రవక్త(స) పైజామా గురించి 17. ప్రవక్త(స) వేగం గురించి 18. ప్రవక్త (స) ముఖంపై వస్త్రం కప్పుకోవటం గురించి 19. ప్రవక్త(స) సభ 20. ప్రవక్త(స) తలగడ, పడక 21. ప్రవక్త(స) తలగడ ఉపయోగించటం 22. ప్రవక్త(స) భోజనం చేయటం 23. ప్రవక్త(స) రొట్టె గురించి 24. ప్రవక్త(స) నంచుకునే కూరలు, మాంసం 25. ప్రవక్త(స) వుజూ గురించి 26. ప్రవక్త(స) భోజనానికి ముందు, తరువాత దుఆ పఠించటం 27. ప్రవక్త(స) ఉపయోగించే చెప్పులు 28. ప్రవక్త (స) ఉపయోగించే పళ్ళు 29. ప్రవక్త(స) త్రాగే పానీయాలు 30. ప్రవక్త(స) త్రాగే విధానం 31. ప్రవక్త (స) సువాసనలు 32. ప్రవక్త(స) మాట్లాడే విధానం 33. ప్రవక్త(స) ఆయతులు పఠించే విధానం 34.రాత్రి పూట ప్రవక్త(స) మాట్లడే కధలు చెప్పే విధానం 35. ప్రవక్త(స) పడుకునే విధానం 36. ప్రవక్త(స) ప్రార్ధించే విధానం 37. ప్రవక్త(స) చిరునవ్వు 38. ప్రవక్త(స) హాస్యం 39. ప్రవక్త(స) సూర్యోదయం తరువాత కార్యాలు 40. ప్రవక్త(స) ఇంట్లో నఫిల్ నమాజులు చదివే విధానం 41. ప్రవక్త (స) ఉపవాసాల విధానం 42. ప్రవక్త(స) ఖుర్ఆన్ పఠించే విధానం 43. ప్రవక్త(స) ఏడ్చే విధానం 44. ప్రవక్త (స) పడక 45.ప్రవక్త(స) వినయ వినమ్రతలు 46. ప్రవక్త(స) సద్గుణాలు 47. ప్రవక్త(స) క్షవరం చేసుకునే విధానం 48. ప్రవక్త(స) పేర్లు 49. ప్రవక్త(స) జీవన స్ధితి 50. ప్రవక్త(స) మరణ సంవత్సరం, వయస్సు 51. ప్రవక్త(స) మరణం 52. ప్రవక్త(స) వదలి వెళ్ళిన వారసత్వ సంపద.

ఇవన్నీ ఆయన వ్యక్తిగత పరిస్ధితులు, వీటిలో ప్రతి ఒక్క అంశం గురించి అనేక సంఘటనలు ఉన్నాయి. అంతేకాదు, వీటిలో ప్రతీది స్పష్టంగా ఉంది. ప్రవక్త(స)కు సంబంధించిన ఏ కోణమూ తెరచాటున లేదు. ఇంట్లో భార్యాబిడ్డల మధ్య గడిపేవారు. బయట శిష్యులు, సహచరులు, మిత్రులతో గడిపేవారు.

మిత్రులారా! ఎంత పెద్ద వ్యక్తి అయినా తన ఇంట్లో సామాన్య వ్యక్తిలాగే ఉంటాడు. అందువల్లే వాల్టేర్ ప్రఖ్యాత సామెత ప్రకారం, ఏవ్యక్తీ తన ఇంట్లో హీరో కాలేడు. బాస్వర్త్ మిత్ అభిప్రాయం ప్రకారం కనీసం ఈ నియమం ప్రవక్తల్లో ఎవరూ ముహమ్మద్ లా తమ అనుచరులకు ఇంతగొప్ప పరీక్షకు గురి చేయలేదు. ముహమ్మద్(స) అందరికంటే ముందు తనను ప్రవక్తగా పరిచయం చేసారు. ఆయన్ను గురించి వారికి చాలా బాగా తెలిసి ఉండేది. ఆయన భార్యా, సేవకుడు, సోదరుడు, అందరికంటే తన గురించి చాలా బాగా తెలిసిన స్నేహితుడు, అందరూ ఎంతమాత్రం సంకోచించకుండా ఆయన సత్య వాదాన్ని అంగీకరించారు.

మానవుని వ్యక్తిగత బలహీనతలను అతడి భార్యకన్నా బాగా తెలిసిన వారెవరూ ఉండరు. కాని అందరికంటే ముందు ఆయన భార్య ఇస్లామ్ స్వీకరించారు. దైవదౌత్యానికి 15 సంవత్సరాల ముందు నుండి ఆమె అతనితో ఉన్నారు. ఆయన యొక్క ప్రతి చిన్న విషయం ఆమెకు తెలిసి ఉండేది. అందు వల్లే అందరికంటే ముందు ఆమె మాత్రమే ఇస్లామ్ స్వీకరించారు.

ఒక భార్య ఉన్న మహావ్యక్తులకు కూడా భార్యను “నువ్వు నా ప్రతి విషయాన్నీ అంతరంగిక, బహిరంగ విషయాలన్నిటినీ నిర్భయంగా అందరికీ తెలియపరచు” అని ఆదేశించే ధైర్యం ఉండదు. కాని ప్రవక్త (స)కు 9మంది భార్యలుండేవారు. అందరికీ దీన్ని గురించి అనుమతి ఉండేది. ఇటువంటి ఉదాహరణ మరెక్కడైనా ఉందా?

ఇవన్నీ ప్రవక్త(స) వ్యక్తిగత వివరాలు. ప్రవక్త(స) సద్గుణాలు, ప్రత్యేకతలు, ఉత్తమ గుణాలు అనేక గ్రంధాల్లో, పుస్తకాల్లో నిండి ఉన్నాయి. ఈ కోవకు చెందిన పుస్తకాల్లో ఖాజీ అయాజ్ ఉందులుసీ రచించిన అష్షిఫా ప్రధానమైంది. ఇస్లామ్ ప్రవక్త(స)  ఉత్తమగుణాలు పరిచయం చేయడానికి ఖాజీ అయాజ్ పుస్తకం అష్షిఫాను యూరోపియన్ భాషలో అనువదిస్తే సరిపోతుందని ఇస్లామ్ శతృవుల్లోని ఒకరు ఫ్రాన్సులో నాతో అన్నారు. సీరతున్నబీ రెండవ భాగంలో ప్రవక్త(స) సద్గుణాలను, ఉత్తమ గుణాలను పేర్కొన్నాము.

ప్రవక్త(స) రూపురేఖలు, దౌత్యచిహ్నం, ముఖవర్చస్సు, వేగం, మాట్లాడే విధానం, చిరునవ్వు, దుస్తులు, ఉంగరం, ఆహారం, భోజనం చేసే పధ్ధతి, భోజన అలవాట్లు, మంచి దుస్తులు, ఇష్టమైన రంగులు, అయిష్టమైన రంగులు, పరిమళాలను ఉపయోగించటం, సున్నితత్వం, స్వారీ పట్ల ఆసక్తి.

అనుదిన చర్యల ప్రకారం అంశాలు:- ఉదయం నుండి సాయంత్రం వరకు, నిద్ర, రాత్రి ఆరాధనలు, నమాజు విధులు, ప్రసంగ విధులు, ప్రయాణ విధులు, పరామర్శించే విధులు, కలుసుకునే నియమాలు, సాధారణ విధులు.

ప్రవక్త() సభలో అంశాలు:-  ప్రవక్త(స) సభ, బోధనా సభలు, సభ నియమాలు, సభల సమయాలు, స్త్రీల ప్రత్యేక సభలు, బోధనా పధ్ధతి, సభలో మాట్లాడే విధానం, సాన్నిహిత్యం, వివరణా పధ్ధతి, ప్రసంగ విధానాలు, ప్రవక్త(స) ప్రసంగాల ప్రభావం.

ఆరాధనలో అంశాలు:- దుఆ, నమాజు, ఉపవాసం, జకాత్, దానధర్మాలు, హజ్, దైవస్మరణ, అల్లాహ్ పై నమ్మకం, సహనం, కృతజ్ఞతలు.

ప్రవక్త() నైతికతకు సంబంధించిన వివరణాత్మకమైన భాగాలు:- ప్రవక్త(స) సద్గుణాల విశిష్టత, ఆచరణా బధ్ధత, మంచి ప్రవర్తన, మంచిగా వ్యవహరించటం, న్యాయం, ధర్మం, దానధర్మాలు, ఆతిధ్యం, ఇతరులకు ప్రాముఖ్యత ఇవ్వటం, మోసం పట్ల అయిష్టత, దానధర్మాలు తీసుకోవటం పట్ల అయిష్టత, కానుకలు స్వీకరించటం, ఉపకారం స్వీకరించటం, అల్లర్ల పట్ల అయిష్టత, ఇతరుల లోపాలను ఎంచటం పట్ల అయిష్టత, అనవసరమైన ప్రశంసల పట్ల అయిష్టత, నిరాడంబరత, ప్రదర్శనాబుధ్ధి పట్ల అయిష్టత, సమానత్వం, నిదానం, అనవసరమైన గొప్పలకు పోవటం, సిగ్గులజ్జ, తనచేత్తో పనిచేయటం, దృఢ నిశ్చయం, స్ధిరత్వం, వీరత్వం, స్పష్టంగా మాట్లడటం, వాగ్దానం, భక్తిశ్రధ్ధలు, తృప్తి, క్షమాగుణం, శత్రువుల పట్ల సత్ప్రవర్తన, అవిశ్వాసులతో, విగ్రహారాధకులతో మంచిగా ప్రవర్తించటం, యూదులు, క్రైస్తవులతో మంచి ప్రవర్తన, పేదల పట్ల ప్రేమ ఆదరణ, బధ్ధశత్రువుల పట్ల క్షమాగుణం కలిగి ఉండటం, శత్రువుల కొరకు దుఆ, పిల్లలపై ప్రేమ, స్త్రీలపట్ల సత్ప్రవర్తన, జంతువులపై జాలి దయ, ప్రేమ, సున్నిత స్వభావం, పరామర్శ, ఓదార్పు, కోమల స్వభావం, సంతానం పట్ల ప్రేమ, భార్యల పట్ల సత్ప్రవర్తన మొదలైనవి.

హాఫిజ్ ఇబ్నెఖయ్యూమ్ ప్రవక్క(స) గుణగణాలను అందరి కంటే అధికంగా జాదుల్ మఆద్ లో పొందుపరిచారు. అయితే వ్యక్తిగత వివరాలు వినండి, ప్రవక్క(స) దైవవాణి పధ్ధతి, భోజన పధ్ధతి, నికాహ్ మరియు దాంపత్య జీవిత పధ్ధతి, నిద్ర నుండి మేల్కొనే పధ్ధతి, వాహనంపై స్వారీచేసే పధ్ధతి, సేవకులను తన సేవ కోసం స్వీకరించే పధ్ధతి, పరస్పర వ్యవహారాలు, వ్యాపార పధ్ధతి, కాలకృత్యాల పధ్ధతి, సంస్కరణా పధ్ధతి, మీసాలు ఉంచే, కత్తిరించే పధ్ధతి, మాట్లాడే పధ్ధతి, మౌనంగా ఉండే పధ్ధతి, సంతోషం, ఏడ్వటం, ప్రసంగం, వుజూ, సాక్సులపై మసహ్, తయమ్ముమ్, నమాజులోని రెండు సజ్దాల మధ్య కూర్చోవటం, సజ్దా చేసే పధ్ధతి, నమాజులో కూర్చునే పధ్ధతి, చూపుడు వ్రేలును ఎత్తే పధ్ధతి, నమాజు ముగించే పధ్ధతి, నమాజులో దుఆ చేసే పధ్ధతి, సజ్దా సహూ పధ్ధతి, సుత్రా, ఇంట్లో బయట అదనపు నమాజులు ఆచరించే పధ్ధతి, ఏతెకాఫ్ పధ్ధతి, జనాజా నమాజు పధ్ధతి, దానధర్మాల పధ్ధతి, ఉపవాసాలు, ఖుర్బానీ, యుధ్ధాలు, వ్యాధులు నయంచేసే పధ్ధతి మొదలైనవి.

నేను మీ ముందు చిన్న చిన్న విషయాల గురించి క్లుప్తంగా పేర్కొన్నాను. వారి పెద్ద పెద్ద విషయాలను గురించి అర్ధం చేసుకోవచ్చు. చిన్న చిన్న విషయాలను బధ్రంగా ఉంచడం జరిగిందంటే, పెద్దపెద్ద విషయాలను ఎలా ఉంచడం జరుగుతుందో ఆలోచించండి, అన్నిటినీ భద్రంగా ఉంచడం జరిగింది.

జనులారా! పరిపూర్ణత అంటే నా ఉద్దేశ్యం ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. అంతేకాదు, ప్రవక్తల్లోనూ ముహమ్మద్(స) జీవిత చరిత్ర తప్ప ఇతరులెవ్వరిదీ భద్రంగా లేదు, అనే విషయం కూడా అర్ధమై ఉంటుంది.

చాలా తక్కువ సమయం ఉంది, కాని అంశం ఇంకా చాలా ఉంది. రెండు ముక్కల్లో చెప్పాలంటే, ప్రవక్త (స) ఎక్కడ ఉన్నా, ఏది చేసినా, ఎలా ఉన్నా వాటిని ప్రజల ముందుకు తీసుకురావాలనే ఆదేశం ఉండేది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఇతరులకు తెలియజేయాలని ఆదేశించడం జరిగింది. మస్జిదె నబవీ ప్రాంగణంలో కొందరు విశ్వాసులు ఉండేవారు. వారికి ఇల్లూవాకిలీ ఉండేదికాదు. వారు తమ వంతు ప్రకారం అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చేవారు, వాటి నుండి ఉపాధి పొందేవారు. మిగిలిన సమయమంతా ప్రవక్త(స) నుండి ఉపదేశాలు గ్రహించేవారు. వీరి సంఖ్య సుమారు 70 ఉండేది. అబూహురైరహ్(ర) కూడా వీరిలో ఒకరు. అందరికంటే ఎక్కువ ఉల్లేఖనలు వీరివే. వీరందరూ ప్రవక్త (స) అంతరంగిక, బహిరంగ విషయాలను గూఢచారుల్లా కనిపెట్టేవారు. మదీనాలో ఉండే ప్రతి ఒక్కరూ 10సంవత్సరాల వరకు ప్రవక్త(స) ప్రతి కదలికను కనిపెడుతూ ఉండేవారు. యుధ్ధాలు, పోరాట సమయాల్లో అనుచరులకు రాత్రీ పగలు ప్రవక్త(స)ను చూచే అవకాశం లభించేది. ఒక పోరాటంలో సుమారు 10,000 మంది, తబూక్ యుధ్ధంలో 30,000 మంది, హజ్జతుల్ విదాలో 1,25,000 మంది అనుచరులకు ప్రవక్త(స)ను దర్శించే భాగ్యం కలిగింది. వీటన్నిటిబట్టీ తెలిసిన విషయం ఏమిటంటే ప్రవక్త(స)కు చెందిన ఏ భాగమూ తెరచాటున లేదు. మిత్రులైనా శత్రువులైనా ఒక్క మాటైనా అనలేక పోయారు. ఇటువంటి వ్యక్తి జీవితం ఆదర్శమైనదా?  లేక పూర్తి వివరాలు లేనివారి జీవితం ఆదర్శమైనదా ?.

ఒక విధంగా ఆలోచించండి! ప్రవక్త(స) కేవలం తన అనుచరుల మధ్యే కాదు, అవిశ్వాసుల మధ్య కూడా ఉండేవారు. అంతేకాదు, ఆయన వ్యాపార జీవితం, లావాదేవీలు, కార్యకలాపాల్లో ఎంతమాత్రం దగా, మోసం, వాగ్దానభంగం మచ్చుకైనా కానరావు. చివరికి ఆయనకు అమీన్ సత్యసంధుడు అనే బిరుదు లభించింది. దైవదౌత్యం తరువాత కూడా ప్రజలు నమ్మి తమ సంపదలను ఆయన దగ్గర ఉంచేవారు. అందుకే మదీనా వలస పోయినపుడు అలీని అక్కడే ఉండి, ప్రజల అమానతులను వారికి అప్ప జెప్పి రావాలని సూచించారు. అయితే తాను చివరి ప్రవక్తనని ఎలుగెత్తి చాటగానే, ఖురైష్ ప్రజలందరూ ఆగ్రహించి సంబంధాలు త్రెంచుకున్నారు. శత్రువులుగా మారిపోయారు, దుర్భాషలాడారు, మార్గాల్లో అడ్డగించారు, అతనిపై చెత్తా చెదారాన్ని వేశారు, రాళ్ళతో కొట్టారు, హత్యచేసి చంపటానికి కుట్రలు పన్నారు, ప్రవక్త(స)ను మాంత్రికుడన్నారు, కవి అన్నారు, పిచ్చివాడన్నారు, ఇంత చేసినవారు కూడా ఆయన గుణశీలతపై వేలెత్తి చూపలేదు. దైవ ప్రవక్త అని ప్రకటించడమంటే తన్ను తాను పుణ్యాత్మునిగా నిష్కలంకునిగా భావించడమన్నమాట. ఆయన శీలాన్ని శంకించటానికి కొందరి సాక్ష్యాధారాలైనా సరిపోయేవి. ఆయన వాదాన్ని తప్పు పట్టటానికి వారు తమ సంపదలను, సంతానాన్ని, తమ ప్రాణాలను త్యాగం చేసారు. కాని ఆయన సత్యతపై ఎంతమాత్రం దాడి చేయలేక పోయారు. దీనివల్ల ఆయన మిత్రుల దృష్టిలో ఎంత గౌరవం కలిగి ఉండేవారో, శత్రువుల దృష్టిలో కూడా అంతే గౌరవం కలిగి ఉండేవారని తెలియడంలేదా?

ఒకరోజు ఖురైష్ కు చెందిన ధనవంతులు ఒక సభ ఏర్పాటు చేసారు. ప్రవక్త ప్రస్తావన కొనసాగుతుంది. ఖురైష్ నాయకుల్లో ప్రముఖుడైన నజ్ర్ బిన్ హారిస్ ఇలా అన్నాడు, “ఓ ఖురైష్ ప్రజలారా! మీపై వచ్చిన ఈ ఆపదను తొలగించలేకపోయారు, ముహమ్మద్ మీ మధ్య బాల్యం నుండి యవ్వనానికి ఎదిగాడు, మీలో అందరికంటే మంచివాడు, సత్యవంతుడు, సత్యసంధుడు. మరి ఇప్పుడు ఆయన వెంట్రుకలు తెల్లవయి పోయాయి. ఇప్పుడు ఆయన మీకు ఈ మాటలు వినిపిస్తే, మీరు అతన్ని మాంత్రికుడని, జ్యోతీష్కుడని, కవి అని, పిచ్చివాడని అంటున్నారు. అల్లాహ్ సాక్షి! నేను ఆయన మాటలు విన్నాను, ముహమ్మద్ లో ఇవేవీ లేవు” (ఇబ్నుహిషామ్)

ప్రవక్త(స) బధ్ధ శత్రువైన అబూ జహల్ ఇలా అనేవాడు, “ఓ ముహమ్మద్! నేను నిన్ను అసత్యవాదని అనను, అయితే నీవు చెబుతున్నదాన్ని, బోధిస్తున్నదాన్ని సత్యంగా భావించను”. (తిర్మిజి) అప్పుడు ఖుర్ఆన్ లోని ఈ వాక్యం అవతరించింది,

قَدْ نَعْلَمُ اَنَّهُ لَيَحْزُنُكَ الَّذِي يَفُولُونَ فَاِنَّهُمْ لَا يُكَذِّبُونَكَ وَلكِنَّ الظَالِمِينَ بِآيَاتِ اللهِ يَجْحَدُونَ .(الأنعام-33)

ప్రవక్తా ! ప్రజలు కల్పించే మాటలవల్ల నీకు బాధ కలుగుతుందనే విషయం మాకు బాగా తెలుసు. కాని వారు తిరస్కరిస్తున్నది నిన్నుకాదు, వాస్తవం ఏమిటంటే, దుర్మార్గులు తిరస్కరిస్తున్నది అల్లాహ్ వాక్యాలను మాత్రమే. (అల్ అన్ ఆమ్-33)

అల్లాహ్(త) ప్రవక్త(స)ను తన కుటుంబం వారికి ఇస్లామ్ సందేశాన్ని అందజేయమని ఆదేశించి నపుడు, ప్రవక్త(స) ఒక కొండపైకి ఎక్కి ప్రజలందరూ అక్కడ చేరిన తర్వాత బిగ్గరగా ఇలా అన్నారు, “ఓ ఖురైష్ ప్రజలారా! ఒకవేళ నేను మీతో కొండ వెనుక నుండి ఒక సైన్యం వస్తుందని చెబితే మీరు నమ్ముతారా?” అన్నారు. దానికి అందరూ ఏకకంఠంతో “అవును, ఎందుకంటే, మేము నిన్నెన్నడూ అసత్యం పలుకుతుండగా వినలేదని” అన్నారు.

రోమ్ రాజు సభలో ప్రవక్త(స) రాయబారి వెళ్ళాడు. ప్రవక్త(స)కు బధ్ధశత్రువైన అబూసుఫియాన్ ప్రవక్త (స) వివరాల కోసం పిలవబడతారు. సమయం సందర్భం చూడండి, పరస్పరం శతృవులైన ఇరువురిలో ఒకరిని మరొకరి గురించి అడగటం జరిగింది. అంతేకాదు, పరదేశ రాజు సభలో సాక్ష్యం ఇవ్వవలసి ఉంది. అతన్ని సంతోషపెడితే కొద్ది క్షణాల్లోనే అతని సైన్యాలు మదీనా వైపు పరిగెత్తుతాయి. క్రింది ప్రశ్నలకు సమాధానాలు బాగా వినండి,

               ఖైసర్అబూసుఫియాన్
1. దైవప్రవక్తగా చెప్పుకుంటున్న వాని కుటుంబం ఎలాంటిది ? 2. ఆ కుటుంబంలో మరెవరైనా ప్రవక్తగా చెప్పుకున్నారా? 3. ఆ కుటుంబంలో రాజులెవరైనా పుట్టారా? 4. అతని ధర్మాన్ని స్వీకరించినవారు పేదవారా? ధనవంతులా? 5. అతని అనుచరులు పెరుగుతున్నారా? లేక తరుగుతున్నారా? 6. ఎప్పుడైనా అతను అసత్యం పలికినట్టు అనిపించిందా? 7. అతడెప్పుడైనా వాగ్దాన భంగం చేసాడా?                                                8. అతడేమి బోధిస్తున్నాడు?ఉత్తమ కుటుంబం   లేదు   లేదు                 పేదవారు   పెరుగుతున్నారు   లేదు   ఇప్పటి వరకు అనిపించలేదు ఇక ముందు చూద్దాం ఒకే దైవాన్ని ఆరాధించమని, నమాజు చేయమని, పరిశుధ్ధతను పాటించమని, సత్యాన్ని పలకమని, బంధువుల హక్కులు చెల్లించమని బోధిస్తున్నాడు.

ఇంతకంటే కఠినమైన సాక్ష్యం మరెక్కడైనా ఉందా? ప్రవక్త(స) పరిపూర్ణతకు ఇంతకంటే గొప్ప ఆధారం మరెక్కడ దొరుకుతుంది.

ఒక విషయం వైపు మీ దృష్టిని మరల్చుతున్నాను, మొట్టమొదట ఆయన్ను విశ్వసించింది మత్స్యకారులు కాదు, ఈజిప్టుకు చెందిన ప్రజలు కాదు, బుధ్ధిమంతులు, వివేకవంతులు అయిన తన ఊరికి చెందినవారు. వారు ఎటువంటి వారంటే, అప్పటి వరకు వారు ఎవరికీ విధేయత చూపలేదు. వీరి వ్యాపారం, లావాదేవీలు ఈరాన్, సిరియా, ఈజిప్టు, ఆసియాల వరకు వ్యాపించి ఉండేవి. వీరిలో మహా వివేకవంతులు, మహాజ్ఞానులు కూడా ఉండేవారు. వీరి బుధ్ధీ, జ్ఞాపకశక్తులను నిరూపించే ఆదేశాలు, విధులు, నియమనిబంధనలు ఈనాటి వరకు భద్రంగా ఉన్నాయి. వీరు పెద్దపెద్ద సైన్యాలను ఎదుర్కొన్నారు. వీరిలో మహా సైన్యాధిపతులు, చక్రవర్తులు, పాలకులు ఉన్నారు. ఇటువంటి వారు ప్రవక్త(స)ను అనుసరించారు, అనుకరించారు, ఆయన అడుగు జాడల్లో నడవటం అదృష్టంగా భావించారు. ఇది ఆయన పరిపూర్ణతకు తిరస్కరించలేని నిదర్శనం. ప్రవక్త(స) తన దైనందిన జీవితాన్ని, సంఘటనలను ఎప్పుడూ కప్పిపుచ్చటానికి ప్రయత్నించలేదు. ఆయన ఎలా ఉండేవారో అలాగే అందరికి తెలిసి ఉండేది. ఇప్పటి వరకు అలాగే ఉంది.

ఆయిషహ్(ర) ప్రవక్త(స) భార్య, 9 సంవత్సరాలు ఆయన దాంపత్యంలో ఉన్నారు. ఆమె ఇలా అంటున్నారు, మీలో ఎవరైనా ప్రవక్త(స) అల్లాహ్ ఆదేశాలను దాచి ఉంచారని, ప్రజలకు తెలియ జేయలేదని అనేవాడు అసత్యవాది.(సహీబుఖారీ)

يَآاَيُّهَا الَّرسُولُ بَلِّغْ مَا اُنْزِلَ اِلَيكَ مِنْ رَبِّكَ وَاِنْ لَمْ تَفْعَلْ فَمَا بَلَّغْتَ رِسَاَلَتهُ. (المائدة-67)

ప్రవక్తా! నీ ప్రభువు తరపు నుండి నీపై అవతరించిన దానిని ప్రజలకు అందజేయి. ఒకవేళ అలా చేయకపోతే నీవు ఆయన సందేశాన్ని అందజేయనట్టే. (అల్ మాయిదహ్-67)

ప్రపంచంలో ఏ వ్యక్తీ తన ఎటువంటి బలహీనతనైనా బహిరంగ పరచ టానికి ఇష్ట పడడు. ప్రత్యేకంగా ఒక సమాజానికి నాయకుడిగా ఉన్నవాడు ఎంత మాత్రం అంగీకరించడు. కాని ఖుర్ఆన్ లో అనేక చోట్ల ప్రవక్త(స) పొరపాట్లపై హెచ్చరించడం జరిగింది. వీటిలో ప్రతి ఒక్క వాక్యాన్నీ పఠించి వినిపించేవారు. ప్రజలు కంఠస్తం చేసుకున్నారు. మస్జిద్ లో పఠించడం జరిగింది. ఈ వాక్యాలు ముస్లింల పెదాలపై ఉన్నాయి. ఒకవేళ ఈ వాక్యాలు ఖుర్ఆన్ లో లేకపోతే ఎవరికీ తెలిసి ఉండేవి కావు. కాని ఒక ఆదర్శ జీవితం అందరికీ తెలిసి ఉండ వలసి ఉంది. అందువల్లే అలా చేయడం జరిగింది.

ప్రవక్త(స) తన దత్తపుత్రుని భార్యతో నికాహ్ చేసుకోవటం అరబ్ అజ్ఞానులకు అభ్యంతర కరమైనదిగా ఉండేది. ఈ సంఘటన గురించి ఖుర్ఆన్ లో వివరంగా ఉంది. ఆయిషహ్(ర), ఒకవేళ ప్రవక్త(స) ఏదైనా దైవవాణిని దాచే ప్రయత్నం చేయదలచితే, ఈ వాక్యాన్ని తప్పకుండా దాచి ఉంచేవారు. (ఇందులో నికాహ్ గురించి ఉంది) అని అన్నారు. ఫలితంగా వారికి అభ్యంతరం తెలిపే అవకాశమే ఉండేదికాదు. కాని ప్రవక్త(స) అలా చేయలేదు. వీటన్నిటివల్ల ప్రవక్త(స) జీవితానికి సంబంధించిన ఏ కోణమూ అంధకారంగా లేదు అనే విషయం స్పష్టమవుతుంది.

బాస్వర్త్ గారి సాక్ష్యం ఇక్కడ పేర్కొనదగినది, “ఇక్కడ అంతా పగటి వెలుగులా ఉంది. ప్రతి వస్తువుపై పడుతుంది. ప్రతి ఒక్కరి వరకు అది చేరుతుంది. వ్యక్తిత్వంలోని అంధకారాల, వాస్తవాల వరకు మనం చేరలేము. కాని ముహమ్మద్ జీవిత చరిత్రకు సంబంధించిన వివరాలన్నీ మనకు తెలుసు. అతని యవ్వనం, ఉధ్బవం, సంబంధాలు, అలవాట్లు, ఆలోచన, అభివృధ్ధి, దైవవాణి అవతరణ మొదలైనవి. అతని వ్యక్తిత్వానికి సంబంధించినంత వరకు వివరాలన్నీ మన ముందు ఉన్నాయి. మన ముందు ఖుర్ఆన్ ఉంది. తన అసలు రూపంలో భద్రంగా ఉంది. దాని అధ్యాయాలు క్రమంగా లేవు. కాని దాని సత్యమైనదనడంలో ఎవరూ ఏ విధంగానూ అనుమానించలేదు. ఇప్పుడు మన ముందు ఏదైనా దివ్యగ్రంధం ఉంటే, అది ఖుర్ఆన్ మాత్రమే. సాధారణంగా ఇది కల్పితాలకు, ఊహలకు దూరంగా ఉంది. సంకళనం చేయనిదిగా, పరస్పర వ్యతిరేకంగా, అలసట వచ్చేదిగా ఉంటుంది. అయితే ఇందులో గొప్పగొప్ప ఆలోచనలు నిండి ఉన్నాయి. ఆయన హృదయం దైవస్మరణతో నిండి ఉండేది. దేవుని ధ్యానంలో నిమగ్నమై ఉండేవారు. కానీ ఏనాడూ మానవ బలహీన లకు అతీతుడని ప్రకటించలేదు. ఇది ఆయన చివరి గొప్పతనం.”

గబ్బన్ వాక్యాలు ఇలా ఉన్నాయి :- “ ప్రారంభ కాలంలో ఏ ప్రవక్త కూడా ముహమ్మద్ లా ఇంతటి కష్టతరమైన పరీక్షలో పాసవలేదు. ఆయన మొట్టమొదట తన బలహీనతలను తెలిసిన వారికే నేను దైవ ప్రవక్తనని సందేశం అందజేసాడు. వీరికి ఆయన గురించి బాగా తెలిసి ఉండేది. ఆయన భార్య, సేవకుడు, పినతండ్రి కుమారుడు, ప్రాణ స్నేహితుడు స్వయంగా ముహమ్మద్ పేర్కొన్నట్టు, ఆయన మిత్రుడు వెనుదిరగలేదు. ఆందోళన చెందనూలేదు. వీరే మొట్టమొదట ఆయన్ను విశ్వసించారు. ప్రవక్తల విభజన ముహమ్మద్ విషయంలో పూర్తిగా తలక్రిందులయింది. ఆయన అనామకుడిగా ఉండ లేదు అయితే, ఆయనను గుర్తంచని వారి వద్ద తప్ప (స్మిత్1108) ”

ఈ సాక్ష్యాధారాల ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రవక్త(స) పట్ల ఎంత ఎక్కువ తెలిసిన వాడయితే అంతే ఎక్కువగా ఆయన పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉంటాడు. సాధారణంగా ప్రవక్తలను మొదట వారి గురించి తెలియని వారే విశ్వసించారు. ఆ తరువాత సన్నిహితులు, బంధువులు విశ్వసించారు. కాని ప్రవక్త(స) జీవిత చరిత్ర దీనికి వ్యతిరేకంగా ఉంది. ప్రవక్త(స) ను అందరికంటే ముందు ఆయన గుణ గణాలను, అలవాట్లను, పరిస్ధితులను బాగా తెలిసినవారే విశ్వసించారు. అంతేకాదు, వీరిలో ప్రతి ఒక్కరూ తన విశ్వాసాల, నమ్మకాల మూలంగా కఠిన పరీక్షకు కూడా గురయ్యారు.

ఖదీజ(ర) మూడు సంవత్సరాల వరకు ప్రవక్త(స)తో పాటు అబూతాలిబ్ శరణులో బంధీలై ఉన్నారు. ఈ కాలంలో ఆకలి దప్పికలకు, కరవు కాటకాలకు గురి కావలసి వచ్చింది. అన్ని వైపుల శత్రువులు చుట్టుముట్టి ఉన్న సమయంలో కూడా అబూబకర్(ర) రాత్రి అంధకారంలో ప్రవక్త(స) వెంట ఉంటూ మిత్రత్వ హక్కును నెరవేర్చాడు. అలీ(ర) రాత్రి, ఉదయం కమేలా కాబోయే పడకపై పడుకున్నారు. జైద్ ప్రవక్త(స) ప్రత్యేక సేవకులు, ఆచూకీ తెలిసి తన తండ్రి వచ్చి, ఎంత నచ్చజెప్పినా ప్రవక్త(స)ను వదలి వెళ్ళడానికి సిధ్ధపడలేదు.

గార్ ఫ్రీ హేగిన్స్ అపోలొజీ ఫర్ ముహమ్మద్ లో ఇలా వ్రాస్తున్నారు, “ క్రైస్తవులు ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే బాగుంటుంది, ముహమ్మద్ యొక్క సందేశం ఆయన అనుచరుల్లో ఎలాంటి మత్తు జనింపజేసిందంటే, దాన్ని ఈసా(అ) ప్రారంభ అనుచరుల్లో వెదకడం వ్యర్ధం, ఈసా(అ)ను ఉరి కంభానికి ఎక్కించినపుడు ఆయన అనుచరులు పారిపోయారు. వారి ధార్మిక శ్రధ్ధాభక్తులు పోసాగాయి, తమ నాయకుడ్ని చావు పంజాలో వదలివేసి పారిపోయారు, దీనికి వ్యతిరేకంగా ముహమ్మద్(స) అనుచరులు తమ బాధిత నాయకుడ్ని చుట్టు ముట్టారు. అతన్ని రక్షించడానికి తమ ప్రాణాలను సైతం ధారపోసి రక్షించారు. ఆయనకు ఆధిక్యత తెచ్చిపెట్టారు. “

ఉహుద్ యుధ్ధంలో ఖురైష్ ప్రజల దాడులకు ముస్లిముల సైన్యం చెల్లా చెదురైంది. అప్పుడు ప్రవక్త(స) కేకవేసి , ఈనాడు నాకోసం ఎవరు ప్రాణత్యాగం చేస్తారు? అని అన్నారు. ఆ పిలుపు విన్న వెంటనే, ఏడుగురు అన్సారీలు వచ్చారు, వరుసగా ఒక్కొక్కరు పోరాడి ప్రాణాలు అర్పించారు. ఒక అన్సారీ స్త్రీ యొక్క తండ్రి, సోదరుడు, భర్త ముగ్గురూ హతమయ్యారు. వరుసగా ముగ్గురి గురించి ఆమెకు తెలియపర్చడం జరిగింది. అయితే ప్రతిసారి ఆమె ప్రవక్త(స) ఎలా ఉన్నారని మాత్రమే అడిగేది. దానికి ప్రజలు క్షేమంగా ఉన్నారని సమాధానం ఇచ్చేవారు. ఆమె ప్రవక్త(స) దగ్గరకు వచ్చి ప్రవక్తా, నీవు ఉండగా ఏ కష్టమూ లేనట్టే అని పలికింది.

మిత్రులారా ! ఈ ప్రేమ, ఈ పిచ్చితం, త్యాగనిరతి వారిలో ఉండేది. వారికి ఆయన గురించి అన్నీ తెలిసి ఉండేవి. పరిపూర్ణత లేని ఒక వ్యక్తి కోసం వారు తమ ప్రాణాలను అర్పించటానికి సిధ్ధమౌతారా? ఎందుకంటే, ఇస్లామ్ తన ప్రవక్త జీవితాన్ని వారి కోసం ఆదర్శంగా చేసింది. ఆయన విధేయతను దైవ ప్రేమ పొందే సాధనంగా చేసింది.

إِنْ كُنْتُمْ تُحِبُّونَ اللهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللهُ . (آل عمران-31)

ప్రజలారా! ఒకవేళ మీరు అల్లాహ్ ను ప్రేమించేవారైతే నన్ను అనుసరించండి, అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు.(ఆలిఇమ్రాన్-31)

ప్రవక్త(స) విధేయతను, అనుకరణను అల్లాహ్(త) ప్రేమను పొందే సాధనంగా గుర్తించడం జరిగింది. ఒక్క నిమిషం ధార్మిక విషయాల్లో ప్రభావితమై తన ప్రాణాన్ని త్యాగం చేయటం చాలా సులభం, కాని జీవితమంతా ప్రతి విషయంలో విధేయత చూపటం, అనుకరించటం, ఒక్క అడుగు కూడా అటూ ఇటూ కదలకుండా తిన్నగా నడవటం అన్నిటికంటే కఠిన పరీక్ష వంటిది. ఈ విధేయతా పరీక్షలో ప్రవక్త(స) అనుచరులందరూ పాసయ్యారు. ఈ ప్రేరణే సహచరుల్లో, మొదటి తరం వారిలో, రెండవ తరం వారిలో, హదీసు వేత్తల్లో, చరిత్రకారుల్లో ఈ ప్రధాన బాధ్యతను జనింప జేసింది. ప్రవక్త(స) యొక్క ప్రతి విషయాన్నీ ఇతరులకు తెలియజేయాలనే తపన వీరిలో ఉండేది. సాధ్యమైనంత వరకు వాటిని అనుసరించే ప్రయత్నం చేస్తూఉండేవారు. ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే అనుచరుల దృష్టిలో ప్రవక్త(స) జీవితం పరిపూర్ణ జీవితంగా భావించబడేది. అందువల్లే ఆయన అనుసరణను, అనుకరణను పరిపూర్ణతకు ప్రమాణంగా భావించేవారు.

ఇస్లామ్ దృష్టిలో ప్రవక్త(స) జీవితం ఒక ముస్లిమ్ కొరకు పరిపూర్ణ ఆదర్శం. అందువల్ల ఈ జీవితానికి సంబంధించిన కోణాలన్నీ ప్రజల ముందుకు రావటం తప్పనిసరి. వాటన్నిటినీ ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ప్రవక్త(స) జీవితానికి సంబంధించిన ఏ ఒక్క సంఘటన తప్పలేదని నిరూపించడం జరిగింది.

ఏ సంఘటనా తెరవెనుక ఉండిపోలేదు. ఉన్నదంతా చరిత్రపుటల్లో ఆదర్శంగా ఉంది. ఒక వ్యక్తి పరిపూర్ణుడు అనడానికి ఇది చాలు. ఒక వ్యక్తి జీవితం అన్నివిధాలా స్పష్టంగా ఉంటేనే అది ఆదర్శ జీవితంగా పనికి వస్తుంది.

ప్రపంచంలో బాబిల్, ఆసియా, భారతదేశం, చైనా, ఈజిప్టు, సిరియా, యూనాన్, రూమ్ వంటి గొప్ప గొప్ప సంస్కృతులు ఉన్నాయి. నైతికతకు సంబంధించిన గొపగొప్ప సిధ్ధాంతాలు సృష్టించబడ్డాయి. సంస్కృతికి సంబంధించిన సూత్రాలు వ్రాయబడ్డాయి. కూర్చునే, తినే, ధరించే, జీవించే, నిద్రించే, వివాహం, సంతోషం, దు:ఖం, విందు, కలవడం, పరిశుభ్రత, పరామర్శ మొదలైన నియమనిబంధనలు సమకూర్చబడ్డాయి. వీటి ద్వారా జాతుల సంస్కృతి, సమాజాలకు నియమాలు విధించబడ్డాయి. ఇవన్నీ కొన్ని సంవత్సరాలు చెలామణీ అయ్యాయి. ఆ తరువాత అంతమయ్యాయి. శతాబ్దాలుగా వాటిని స్ధాపించడం జరిగింది. ఆ తరువాత రద్దు చేయడం జరిగింది. కాని ఇస్లామ్ సంస్కృతి, సమాజాలను కొన్ని సంవత్సరాల్లో స్ధాపించడం జరిగింది. 1400 సంవత్సరాల నుండి అన్నీ జాతుల్లో ఉంది. ఎందుకంటే దాని మూలం ఒకటి, అది ముహమ్మద్(స) జీవితం. ఈ జీవిత వెలుగులో అనుచరులు తమ జీవితాల్ని అలంకరించు కున్నారు. వీరి తరువాత తాబయీన్లు, ఆ తరువాత తరాలవారు ప్రపంచమంతా వ్యాపింపజేసారు. ఈవిధంగా ఇస్లామ్ ప్రపంచమంతటా వ్యాపించింది. ఆయన జీవితం కేంద్రంగా ఉండేది. తరువాతి తరాల వారు దాని చుట్టూ వృత్తాకారంగా గీత గీసారు. కాని ఈనాడు ముస్లింలు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ముహమ్మద్(స) యొక్క ఒక్క జీవితం అనుచరులందరి జీవితం అయిపోయింది. ఇప్పుడు ఇస్లామీయ ప్రపంచ జీవితం అయి పోయింది. ఆ పరిపూర్ణ చిత్రం ఈనాడు కూడా మన ముందు ఉంది, ఆఫ్రికా, భారతదేశం నుండి ఏ వర్గమైనా ఈనాడు క్రైస్తవం స్వీకరిస్తే, వారికి మత బోధనగా ఇంజీల్ ను బోధించడం జరుగుతుంది. కానీ సంస్కృతి, జీవిత ఆచరణలలో మాత్రం యూరప్ సంస్కృతిని బోధించడం జరుగుతుంది. కాని ఎంతటి నీచజాతికి చెందిన వారైనా ఇస్లామ్ స్వీకరిస్తే ధర్మం, సంస్కృతి, జీవిత విధానం అన్నీ ఒకే చోటు నుండి లభిస్తాయి. ముస్లిమ్ అవడంతో పాటు ప్రవక్త(స) జీవితం మొత్తం మానవ అవసరాలను బట్టి, పరిస్ధితులను బట్టి అతని ముందుకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఒక ముస్లిమ్ జీవితం ఆదర్శ జీవితాన్ని అనుసరిస్తూ పోతుంది.

ఒక యూదుడు ప్రవక్త(స) అనుచరున్ని ఎగతాళి చేస్తూ, మీ ప్రవక్త మీకు ప్రతి విషయాన్ని గురించి శిక్షణ ఇస్తున్నాడు, చిన్నచిన్న విషయాల గురించి కూడా బోధిస్తున్నాడు అని అన్నాడు. దానికి ఆ అనుచరుడు గర్వంగా అవును మా ప్రవక్త మాకు ప్రతి విషయాన్ని గురించి నేర్పుతాడు, చివరికి కాలకృత్యాలు తీర్చుకునే విధానం కూడా నేర్పుతాడు అని అన్నాడు. ఈనాడు కూడా మనం ఈ పరిపూర్ణ విద్యాచరిత్రను గర్వంగా ప్రజలకు అందజేస్తున్నాము. అంటే ప్రవక్త ముహమ్మద్(స) జీవితం ప్రపంచానికి ఆదర్శం వంటిది. ఇందులో తొంగి చూచి ప్రతి వ్యక్తి తన శారీరక, మానసిక, అంతరంగిక, బహిరంగ, అంతర్గత, బహిర్గత, వాక్కర్మలను, హృదయాన్ని, నియమ నిబంధనలను, పధ్ధతులను సరిదిద్దుకుంటాడు. అందువల్లే ఏ ముస్లిమ్ వ్యక్తికయినా జీవితానికి సంబంధించిన ఎటువంటి విధానాన్ని గురించైనా ఇస్లామ్ పరిధి దాటిపోయే అవసరం ఉండదు. ప్రవక్త జీవిత చరిత్ర ప్రపంచానికి ఒక ఆదర్శం వంటిది. దీని ద్వారానే మంచీ చెడు, తప్పు ఒప్పులన్నీ బహిర్గతమౌతాయి. సారాంశం ఏమిటంటే మానవులందరి కోసం ఇదొక్కటే పరిపూర్ణ ఆదర్శం. ఇటువంటి పరిపూర్ణ, స్పష్టమైన జీవిత చరిత్ర మాత్రమే మానవుల కొరకు ఆదర్శం కాగలదు.

5. ప్రవక్త ముహమ్మద్(స) జీవిత విశిష్టతలు.

సోదరులారా! దైవాన్ని తృప్తిపరచడానికి, సాన్నిహిత్యం పొందటానికి ప్రతి మతంలో ఒకే మార్గం ఉంది. అదేమిటంటే, ఆ ధర్మ వ్యవస్ధాపకుని ఆదేశాలు, ఉపదేశాలను అనుసరించడం. కాని ఇస్లామ్ అంత కంటే ఉత్తమ పంధాను అవలంభిస్తూ తన ప్రవక్త జీవిత విధానాన్ని అందరి ముందు పెట్టింది. దైవప్రీతిని, దైవసాన్నిహిత్యాన్ని పొందటానికి ఇదే ఉత్తమ మార్గమని ఆదేశించింది. ఇస్లామ్ లో రెండు విషయాలు ఉన్నాయి. ఖుర్ఆన్ మరియు సున్నత్. అంటే దైవాదేశాలు ఖుర్ఆన్ ద్వారా మన వరకు చేరాయి. సున్నత్ అంటే ప్రవక్త(స) సాంప్రదాయం, దీని శాబ్దిక అర్ధం మార్గం. ప్రవక్త(స) దైవాదేశాలను పాటిస్తూ నడచిన మార్గం అంటే ఆయన ఆదర్శ జీవితం. దీని చిత్రం హదీసుల్లో వాక్యాల రూపంలో ఉంది. కనుక ఒక ముస్లిమ్ సాఫల్యం, మానసిక పరిపూర్ణత పొందటానికి ప్రవక్త(స) సాంప్రదాయం అత్యవసరం.

మానవులందరూ ఒకే ధార్మికతను అవలంభించడం అసాధ్యం. ఎందు కంటే అది ఒకే ఒక్క వ్యక్తిత్వం వరకు పరిమితమై ఉంటుంది. ఈ ప్రపంచం అనేక రకాల, అనేక వృత్తుల, అనేక ఆచరణలతో నడుస్తుంది. ఇందులో రాజులు, ధనవంతులు, ప్రజలు, పాలకులు మొదలైన వారున్నారు. అదేవిధంగా శాంతి భద్రతల కోసం న్యాయమూర్తులు, ఖాజీలు, సైన్యం, సైనికాధికారులు కూడా అవసరమే. పేదవారూ ఉన్నారు, ధనవంతులూ ఉన్నారు. రాత్రి పూట దైవాన్ని పూజించే భక్తులు కూడా ఉన్నారు. సైనికులు, వీరులు, భార్యాపిల్లలు, స్నేహితులు, బంధువులు, వ్యాపారస్తులు, ఇమాములు, గురువులు కూడా ఉన్నారు. ఈ ప్రపంచం అనేక రకాల వ్యక్తుల వల్ల నడుస్తుంది. వీరందరికీ తమ జీవితాన్ని సరిదిద్దుకోవటానికి ఒక ఆదర్శం కావాలి. ఇస్లామ్ మానవులందరినీ ప్రవక్త సాంప్రదాయాల్ని అనుసరించమని ఆదేశిస్తుంది. దీని అర్ధం ఏమిటంటే, అనేక జాతుల ప్రజల కొరకు ప్రవక్త(స) జీవితంలో అనేక ఉదాహరణలు, ఉపమానాలు ఉన్నాయి. వారిలో ప్రతి ఒక్కరికీ వేర్వేరు మార్గదర్శక దీపం కాగలదు. ఇస్లామ్ యొక్క ఈ అభిప్రాయం ద్వారా ప్రవక్త(స) సాంప్రదాయంలో విశిష్టత ఉందని నిరూపించబడింది. అంటే మానవుల్లోని ప్రతి ఒక్కరి కోసం ఆయన జీవితంలో ఆదర్శం ఉంది. ఆచరణ కొరకు ఎన్నో సూక్తులు ఉన్నాయి. ఒక ధనవంతునికి పేదవాని జీవితం, ఒక పేద వానికి ధనవంతుని జీవితం పరిపూర్ణ ఆదర్శం కాజాలదు. అందువల్ల ఈ ప్రపంచానికి విశ్వవ్యాప్తమైన శాశ్వత ప్రవక్త జీవితం ఎంతయినా అవసరం ఉంది.

మానవుల్లోని లింగభేదం తర్వాత మరో విశిష్టత ఏమిటంటే ప్రతి మానవుడు వేర్వేరు సమయాల్లో వేర్వేరు పనులు చేస్తాడు. మనం నడుస్తాం, సంచరిస్తాం, తిరుగుతాం, కూర్చుంటాం. లేస్తాం, తింటాం, త్రాగుతాం, పడు కుంటాం, మేల్కొంటాం, నవ్వుతాం, ఏడుస్తాం, ధరిస్తాం, స్నానం చేస్తాం, ఇస్తాం, తీసుకుంటాం, నేర్పుతాం, నేర్చుకుంటాం, చస్తాం, చంపుతాం, తింటాం, తినిపిస్తాం, ఉపకారం చేస్తాం, ప్రాణం ధారపోస్తాం, రక్షిస్తాం, ప్రార్ధిస్తాం, ఆరాధిస్తాం, వ్యాపారం చేస్తాం, వీటన్నిటితో మన శారీరక సంబంధం ఉంది. వీటికి ఆచరణా రూపం ఎంతయినా అవసరం. ప్రతి విషయంలో మనకు ఒక సరైన పాఠం, నియమం కావాలి.

అవయవాలతో సంబంధం ఉన్న కర్మల తర్వాత మెదడుతో సంబంధం ఉన్న చర్యలు, అంటే వీటిని మనం మనోవేదనలు, మనోభావాలు, ఆలోచనలు అని అంటాం. ప్రతి నిమిషం మనం ఆవేదనలకు, ఆలోచనలకు గురవుతాం. ఒక్కోసారి ఇష్టపడతాం, ఒక్కోసారి అసహ్యించుకుంటాం, ఒక్కోసారి సంతోషంగా ఉంటాం, ఒక్కోసారి విచారంగా ఉంటాం, కష్టాలకు గురి అవుతాం, అనుగ్రహాలతో నిండి ఉంటాం, విఫలమవుతాం, గెలుపొందుతాం ఇటువంటి విభిన్న పరిస్ధితుల్లో విభిన్న మనోవేదనలకు గురిఅవుతాం. సద్గుణాలు ఈ మనోభావనలపైనే ఆధారపడి ఉంటాయి. వీటన్నిటి గురించి మనకు ఒక ఆచరణాపరమైన జీవిత చరిత్ర అవసరం ఉంది. అతని చేతిలో మన అంతర్గత మనో కాంక్షల కళ్ళెం ఉండాలి. మనలో ఉన్న ఈ అంతులేని మనోకాంక్షలు మదీనాకు చెందిన మహాను భావుడు నడచిన మార్గంలో మనల్నీ నడపాలి.

దృఢసంకల్పం, స్ధిరత్వం, వీరత్వం, సహనం, కృతజ్ఞత, నమ్మకం, అదృష్టం పట్ల ఇష్టం, కష్టాలను భరించే శక్తి, త్యాగం, తృప్తి, నిరపేక్ష, ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వటం, సున్నితత్వం, దీనత్వం, పేదరికం మొదలైన ఎత్తు పల్లాలు, నైతిక విలువల కోసం అనేక మందికి అనేక విధాలుగా ఏర్పడతాయి. కనుక మనకు ఆచరణా యోగ్యమైన మార్గదర్శకం, ఉపమానం అవసరం. కాని అది ఎక్కడ దొరుకుతుంది? కేవలం ముహమ్మద్(స) వద్ద మాత్రమే, మూసా(అ) వద్ద మనకు వీరత్వంతో కూడిన శక్తియుక్తుల నిధి దొరకవచ్చు, కాని సున్నిత గుణాలు దొరకవు, ఈసా(అ) వద్ద సున్నిత స్వభావం, నైతికత లభిస్తుంది, గానీ వీరత్వానికి సంబంధించిన ఏ విషయమూ దొరకదు, అయితే ఒక మానవునికి ఈ ప్రపంచంలో ఈ రెండు స్వభావాలు మధ్యస్ధితిలో తప్పకుండా కావాలి. ఈ రెండు స్వభావాల విశేష మధ్యస్ధ ఉపమానాలు కేవలం ప్రవక్త ముహమ్మద్(స) జీవిత చరిత్రలోనే లభించ గలవు. ఇటువంటి విభిన్న రకాల, వాస్తవ మనో భావాల, పరిపూర్ణ సద్గుణాలు గల వ్యక్తిత్వం అంటే అది కేవలం ప్రవక్త ముహమ్మద్(స) మాత్రమే. మీరు ధనవంతులైతే మక్కాకు చెందిన వ్యాపారిని అనుకరించండి, ఒకవేళ మీరు పేదవారైతే షఅబు అబీతాలిబ్ లోని ఖైదీ, మదీనా అతిధి పరిస్ధితిని వినండి, ఒకవేళ చక్రవర్తి అయితే అరబ్ సుల్తాన్ పరిస్ధితులను చదవండి. ఒకవేళ మీరు ఓటమి చవి చూస్తే, ఉహద్ నుండి గుణపాఠం నేర్చుకోండి, ఒకవేళ అధ్యాపకులైతే సుఫ్ఫా విద్యాలయ ప్రధానో పాధ్యాయుడ్ని చూడండి. ఒకవేళ శిష్యులైతే రూహుల్ అమీన్ ముందు కూర్చునే శిష్యునిపై దృష్టి వేయండి. ఒకవేళ బోధకులైతే మదీనా మస్జిద్ లోని మెంబర్ పై నిలబడేవాని మాటలు వినండి, ఒకవేళ అసహాయ స్ధితిలో ఉన్న సత్య ప్రచారకుని విధిని నిర్వర్తించదలిస్తే మక్కాలోని అసహాయ ప్రవక్త సద్గుణాలను అవలంభించండి. ఒకవేళ శత్రువులను అణచి వేసినవారైతే మక్కా విజయుడ్ని చూడండి. ఒకవేళ మీ వ్యాపార, ప్రాపంచిక కృషి ప్రయత్నాలను సరిదిద్దగోరితే బనీనజీర్, ఖైబర్, ఫదక్ భూముల యజమాని లావాదేవీలను చూడండి. ఒకవేళ అనాధలైతే ఆమినహ్ తనయుడ్ని మరువకండి. ఒకవేళ బాలురయితే హలీమ ముద్దుబిడ్డను మరువకండి. ఒకవేళ యువకులైతే మక్కా పశువుల కాపరి జీవిత చరిత్రను చదవండి. ఒకవేళ ప్రయాణీకులైతే బస్రా ప్రయాణకుడి ఉపమానాల్ని వెదకండి. ఒకవేళ న్యాయమూర్తులైతే సూర్యోదయానికి ముందు కాబాలో ప్రవేశించిన సంస్కరణ కర్తను చూడండి. అతని దృష్టిలో ధనవంతులు, పేదవారూ అందరూ సమానులే. ఒకవేళ మీరు భర్త అయితే ఖదీజ(ర), ఆయిషహ్(ర)ల భర్త జీవిత చరిత్రను చదవండి. ఒకవేళ సంతానవంతులైతే ఫాతిమ తండ్రిని, హసన్ హుసైన్ ల తాతగారిని చూడండి. మీరు ఎవరైనా ఏ స్ధితిలో ఉన్నా మీ జీవితాన్ని సరిదిద్దడానికి ఒక ఉపమానం, మోడల్ కావాలి. మీ అంధకార గృహానికి మార్గ దర్శక దీపిక ప్రవక్త(స) జీవిత చరిత్ర వెలుగు నుండి ఎల్లప్పుడూ లభిస్తుంది.

అందువల్ల మానవుల్లో విశ్వాస వెలుగును కోరే ప్రతి వ్యక్తికి ముహమ్మద్(స) జీవిత చరిత్ర మార్గదర్శక దీపిక, ముక్తి పొందే మార్గం, ఎవరి దృష్టిలో ముహమ్మద్(స) పవిత్ర జీవిత చరిత్ర ఉంటుందో, వారి ముందు నూహ్(అ), ఇబ్రాహీమ్(అ), అయ్యూబ్(అ), యూనుస్(అ), మూసా(అ) మరియు ఈసా (అ)ల జీవిత చరిత్రలున్నాయి. అంటే ఇతర ప్రవక్తలందరి చరిత్రలు ఒకే రకానికి చెందిన సరుకుల దుకాణం, కాని, ముహమ్మద్(స) పవిత్ర జీవిత చరిత్ర సద్గుణాలు, ఆచరణలు అన్నిరకాల వస్తువుల దుకాణం. ఇక్కడ మానవునికి కావలసిన ఏ వస్తువైనా దొరుకుతుంది. 30సంవత్సరాల క్రితం పట్నాలో ప్రఖ్యాత ఇస్లామ్ బోధకుడు మాస్టర్ హసన్ అలీ నూరె ఇస్లామ్ అనే పేరుతో ఒక పత్రిక నడిపేవారు. ఇందులో ఆయన తన ఒక విద్యావంతుడైన హిందూ స్నేహితుడి అభిప్రాయాన్ని ప్రచురించారు. ఒకరోజు ఆ స్నేహితుడు మాస్టర్ గారితో నేను మీ ప్రవక్తను ప్రపంచంలో అందరికంటే పరిపూర్ణ వ్యక్తిగా భావిస్తున్నాను అని అన్నాడు. దానికి మాస్టారుగారు మా ప్రవక్త(స)కు వ్యతిరేకంగా ఈసా(అ)ను మీరు ఎలా భావిస్తున్నారు అని ప్రశ్నించారు. దానికి ఆ వ్యక్తి ఆయన జీవితంలో ఒకేసారి అనేక విభిన్న, రకరకాల ఉత్తమ గుణాలు కనిపిస్తాయి. ఒకే వ్యక్తిలో ఇన్ని సద్గుణాలు ఒకేసారి ఉండటం చరిత్రలో ఎవరిలోనూ లేదు. దేశమంతా గుప్పెట్లో ఉన్న రాజు, తనను కూడా తన అధీనంలో భావించని అసహాయుడు. ఖజానాలు నిండి ఉన్న ధనవంతుడు, నెలల తరబడి పొయ్యి వెలగని పస్తులుండే పేదవాడు. మహాసైన్యాలను ఓడించే పిడికెడు మంది సైన్యానికి సైన్యాధిపతి, తన తోడు ప్రాణాలు త్యాగం చేసేవారు ఎంతమంది ఉన్నా ఏమాత్రం సంకోచించకుండా ఒప్పందంపై సంతకం చేసే ప్రియుడు. వేలమందిని ఒంటరిగా ఎదుర్కొనే ఒంటరివాడు.

ఒక్క రక్తపు బొట్టును కూడా కార్చని సున్నిత మనస్కుడు, ప్రతి ఒక్కరిని గురించి ఆలోచించే బంధువు, భార్యాబిడ్డల పట్ల, పేద దరిద్ర ప్రజల పట్ల, వక్రమార్గం అనుసరించినవారి పట్ల, సమాజంలో అందరిపట్ల ఆలోచించే మహావ్యక్తి, అల్లాహ్ ను తప్ప ఇతరులెవ్వరినీ ప్రార్ధించని వ్యక్తి, తనకు హాని తల పెట్టిన వారి పట్ల ప్రతీకారం తీర్చుకోని వ్యక్తి, తన శత్రువుల కొరకు దుఆ చేసే, వారి మంచి కోరే వ్యక్తి, అయితే అల్లాహ్ శత్రువులను మాత్రం ఎన్నడూ క్షమించని వ్యక్తి, సత్యమార్గంలో అడ్డగించే వారిని నరకాగ్ని గురించి, దైవశిక్ష గురించి హెచ్చరించే వ్యక్తి, దాడి జరిగినా దైవభక్తునిలా ప్రత్యక్షమయ్యే వ్యక్తి, విజయం పొందికూడా దైవప్రవక్తగా దర్శనమిచ్చే వ్యక్తి, చక్రవర్తి అయినా ఖర్జూరపు ఆకులపై పడుకునే వ్యక్తి, నలువైపుల నుండి ధనసంపదలు వచ్చి పడుతున్నా ఇంట్లో పస్తులున్న వ్యక్తి, యుధ్ధ ఖైదీలను ముస్లిముల ఇళ్ళల్లో సేవకులుగా పంపబడుతున్నా తన కూతురికి ఒక సేవకుడైనా ఇవ్వలేని వ్యక్తి, ఉమర్(ర) ప్రవక్త సన్నిధిలోకి వచ్చి అటూ ఇటూ చూస్తూ దౌత్య పరికరాలను వెదుకుతారు. ప్రవక్త(స) తాళ్ళతో అల్లిన మంచంపై మేను వాల్చి ఉన్నారు. వీపుపై తాళ్ళ గుర్తులు ఉన్నాయి. ఒకవైపు పిడికెడు జొన్నలు ఉన్నాయి. ఉట్టిలో ఖాళీ కుండ ఉంది. విశ్వప్రవక్త ఇంటి ఈ పరిస్ధితి చూచి ఉమర్(ర) ఏడ్వసాగారు. కారణం అడగ్గా “ఓ అల్లాహ్ ప్రవక్తా! ఇంతకంటే మరి దేన్ని గురించి ఏడ్వను? ఖైసర్, కిస్రా చక్రవర్తులు స్వర్గ సుఖాలను జుర్రుతున్నారు. తమరు ప్రవక్త అయి ఉండి కూడా ఈ స్ధితిలో ఉన్నారు”. అప్పుడు ప్రవక్త(స) “ఉమర్! ఖైసర్, కిస్రా చక్రవర్తులు ప్రాపంచిక భోగభాగ్యాలను పొందటం, మనం పరలోక గౌరవాలను పొందటం నీకు ఇష్టంలేదా?” అని అన్నారు.

అబూ సుఫియాన్ ప్రవక్త(స)కు అందరికన్నా పెద్ద శత్రువు, మక్కా విజయం నాడు అతడు అబ్బాస్ (ర) ప్రక్కన నిలబడి ఇస్లామీయ సైన్య విన్యాసాన్ని వీక్షిస్తున్నారు, రంగు రంగుల జెండాల నీడలో సైన్యం సముద్రంలా కదలి వస్తుంది. అబూసుఫియాన్ కళ్ళు ఇప్పుడు కూడా నమ్మ లేక పోతున్నాయి. అతడు అబ్బాస్(ర)తో ఇలా అన్నాడు, “అబ్బాస్! మీ అన్న కొడుకు గొప్ప చక్రవర్తి అయిపోయాడు”, కానీ, అబ్బాస్ కళ్ళు మరో విషయాన్ని చూస్తున్నాయి, అందువలన అతనిలా అన్నాడు, “అబూ సుఫియాన్! ఇది రాజరికం కాదు దైవదౌత్యం”.

అదీ బిన్ హాతిమ్ తాయీ వర్గానికి చెందిన ధనవంతుడు, ఇతడు హాతిమ్ తాయీ కుమారుడు, ఇతడు క్రైస్తవుడు, అతడు ప్రవక్త(స) సన్నిధికి వచ్చాడు. అనుచరుల విధేయత, పోరాటానికి కావలసిన యధ్ధసామాగ్రి చూచి ప్రవక్త ముహమ్మద్(స) చక్రవర్తా లేక ప్రవక్తా? అని నిర్ణయించడం కష్టతర మౌతుంది. అదే సమయంలో అకస్మాత్తుగా ఒక పేద బానిసరాలు వచ్చి నిలబడి ప్రవక్త(స)తో విన్న వించుకోవాలి అని పలికింది, దానికి ప్రవక్త(స) చూడు మదీనాలో ఏ వీధిలోనైనా నీకు సహాయం చేయగలను అని పలికిన వెంటనే నిలబడి ఆమె అవసరాన్ని పూర్తి చేస్తారు. ఈ బయటి గొప్పతనం వెనుక వినమ్రత, దీనత్వం, చూచి అదీ కళ్ళ ముందు నుండి తెరలు తొలగిపోయాయి. ఆయన తన మనసులో ఇది నిజంగా దైవదౌత్య గొప్పతనమే అని అర్ధం చేసుకున్నారు, వెంటనే మెడలో నుండి శిలువను తీసివేసి, ముహమ్మద్(స) ముందు ఇస్లామ్ స్వీకరించారు. ఇంతవరకు నేను చెప్పినవన్నీ కవిత్వాలు, గానవినోదాలు కావు. ఇవన్నీ చారిత్రక వాస్తవాలు. ప్రతి వ్యక్తికి పనికివచ్చే ఉత్తమ గుణాలు, ఉపమానలు కలిగి ఉన్న మహాపురుషుడు మాత్రమే ఈ ప్రపంచానికి విశ్వనాయకుడు కాగలడు. ఆగ్రహం, కరుణ, దయ, గౌరవం, దానం, ఆకలిదప్పికలు, వీరత్వం, దయాశీలత, నిర్మల హృదయం, ఇంటి బాధ్యతలు, ఉభయ లోకాలకు పనికివచ్చే బోధనలు, ప్రాపంచిక రాజరికాన్ని గురించి శుభవార్త తెలిపే వాటి విధానాలు నియమాలను కూడా ఆచరణ ద్వారా తెలుపుతాడు. సాధారణంగా ప్రపంచంలో కేవలం క్షమించడం, సున్నితత్వం మొదలైనవి మానవ పరిపూర్ణతకు అన్నిటి కంటే గొప్ప సాధనాలుగా ప్రచారంలో ఉన్నాయి. అంతేకాదు కేవలం ఇవే ఉన్నాయి అని భావించబడుతుంది. అందువల్ల ఎవరిలో కేవలం ఇవి ఉంటే వారినే మనం పరిపూర్ణ వ్యక్తిగా భావిస్తాం. కాని ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవడానికి కేవలం ఇవే చాలవు, ఒక వ్యక్తిలో చూస్తే కోపం, ఆగ్రహం, గౌరవం, ప్రేమ, శతృత్వం, పగ, ప్రతీకారం, కోరిక, తృప్తి, క్షమాగుణం మొదలైన సహజ గుణాలు ఉంటాయి. అందువల్ల ఒక పరిపూర్ణ వ్యక్తి మాత్రమే వాటిని ఉపయోగించే మిధ్యేమార్గాన్ని నిర్ణయిస్తాడు.

తమ ప్రవక్త జీవిత చరిత్రలు కేవలం కరుణ, దయ, క్షమాగుణం మొదలైన వాటిపైనే ఆధారపడి ఉన్నాయని వాదించే ధర్మాలు సమూహికంగా వారు ఎన్ని దినాలు వాటిపై అమలు చేయగలరు? ఖిస్తిన్ తీన్ మొదటి క్రైస్తవ చక్రవర్తి దగ్గర నుండి ఈనాటి వరకు క్రైస్తవమతంలో ఎంతో మంది రాజులు, చక్రవర్తులు జన్మించారు, ఎన్నో సామ్రాజ్యాలు స్ధాపించబడ్డాయి. కాని వారిలో ఎవరైనా తన రాజ్య చట్టాన్ని కేవలం తన ప్రవక్త జీవిత చరిత్ర వెలుగులో తయారు చేసారా? వాస్తవ ప్రపంచంలో అన్ని విధాలా తన అనుచరుల కొరకు ఆదర్శం కాని జీవిత చరిత్రలు విశిష్టమైనవి ఎలా కాగలవు?.

నూహ్(అ) జీవితం దైవ తిరస్కారానికి వ్యతిరేకంగా ఆగ్రహావేశాలను ప్రదర్శిస్తుంది. ఇబ్రాహీమ్(అ) చరిత్ర విగ్రహాలను నాశనం చేసే దృశ్యాన్ని ప్రదర్శిస్తుంది. మూసా(అ) జీవితం అవిశ్వాసులతో యుధ్ధం, పోరాటాలను, అంత:పుర యంత్రాంగం, సామూహిక చట్టాల, నియమాల ఉపమనాలు ఇస్తుంది. ఈసా(అ) జీవితం కేవలం అసహాయత, దీనత్వం, క్షమాగుణం, సంతృప్తి మొదలైన వాటి గురించి శిక్షణ ఇస్తుంది. సులైమాన్(అ) జీవితం రాజరిక దృఢసంకల్పాలను నేర్పుతుంది. అయ్యూబ్ (అ) జీవితం సహనం, కృతజ్ఞతలతో నిండి ఉంది. యూనుస్(అ) జీవితం విచారం, చింతనల, ఒప్పుకోలుల ఉపమానాలు చూపుతుంది. యూసుఫ్(అ) జీవితం కారాగారంలో బందీగా సత్యసందేశ, ప్రచార ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంది. దావూద్(అ) జీవితం ఏడుపులు, ధ్యానం, ప్రార్ధనలను చూపుతుంది. యాఖూబ్(అ) జీవితం ఆశ, అల్లాహ్ పై నమ్మకం, ధైర్యం మొదలైన వాటిని నేర్పుతుంది. కాని ముహమ్మద్ ప్రవక్త(స) జీవిత చరిత్రను చూడండి, ఇందులో ప్రవక్తలందరి జీవిత చరిత్రలు, సద్గుణాలు , నైతికతలు అన్నీ ఇమిడి ఉన్నాయి.

హదీసువేత్త ఖతీబ్ బాగ్దాదీ గారి ఒక బలహీనమైన ఉల్లేఖన ఇలా ఉంది, ప్రవక్త(స) జన్మించినపుడు ఇలా ఒక పిలుపు వచ్చింది, ముహమ్మద్ ను దేశదేశాలు త్రిప్పండి, సముద్రపు లోతుల్లోకి తీసుకు వెళ్ళండి, ప్రపంచమంతా అతని పేరు ప్రతిష్టలు తెలుసుకుంటుంది, అతన్ని మానవులు, జిన్నులు, జంతువులు, పక్షులు ప్రతి ప్రాణి ముందుకు తీసుకువెళ్ళండి, అతన్ని ఆదమ్ సృష్టిలో, షీస్ జ్ఞానంలో, నూహ్ వీరత్వంలో, ఇబ్రాహీమ్ స్నేహంలో, ఇస్మాయీల్ మాటల్లో, ఇస్హాఖ్ సంతోషంలో, సాలెహ్ పాండిత్యంలో, లూత్ వివేకంలో, మూసా కఠినత్వంలో, అయ్యాబ్ సహనంలో, యూనుస్ విధేయతలో, యూష పోరాటంలో, దావూద్ శబ్దంలో, దానియాల్ ప్రేమలో, ఇల్యాస్ గాంభీర్యంలో, యహ్యాశీలంలో, ఈసా భక్తిలో అంటే ప్రవక్తలందరి ఉత్తమ గుణాల్లో ఆయన్ను ముంచి తీయండి.

ఈ ఉల్లేఖనను తమ పుస్తకాల్లో పేర్కొన్నవారి ఉద్దేశ్యం ఏమిటంటే, ఇతర ప్రవక్తలకు వేర్వేరుగా లభించిన ప్రవక్త(స)కు లభించిన సద్గుణాలన్నింటినీ ప్రజలకు తెలియజేయడం, ప్రవక్త(స) గొప్ప తనాన్నిచాటడం మాత్రమే.

ప్రవక్త(స)ను ఆయన వివిధ జీవిత కోణాల్లో చూడండి, ఈ విశిష్టత మీకు తేటతెల్లమయిపోతుంది. ప్రవక్త మక్కానుండి యస్రిబ్ వెళుతున్నప్పుడు చూస్తే, మీకు ఈజిప్టు నుండి మద్యన్ వెళుతున్నట్లు అనిపించదా? హిరా గుహలో సీనా లోయలోని వారిలో ఎలాంటి పోలిక కనబడు తుంది? అయితే ఇక్కడ వ్యత్యాసం ఏమిటంటే, ఇక్కడ మూసా(అ) కళ్ళు విప్పి ఉన్నాయి, అక్కడ ప్రవక్త (స) కళ్ళు మూసుకొని ఉన్నాయి. మూసా(అ) బయట చూస్తున్నారు. ప్రవక్త(స) లోపల, తూర్ కొండపై బోధించే ఈసాలో సఫా కొండపై ఎక్కి ఓ ఖురైష్ ప్రజలారా! అని ఉద్దేశించేవానిలో ఎంతో తేడా ఉంది. బద్ర్, హునైన్, అహ్జాబ్, తబూక్ ల సైన్యాధిపతికి మాబీలను, అమ్వానీలను, ఉమురీలను ఎదుర్కొనే మూసా(అ)కు ఎంతో తేడా ఉంది.

ప్రవక్త(స) మక్కాకు చెందిన ఏడుగురు ఖురైష్ నాయకులను శపించారు. అంటే ప్రవక్త(స) మూసాను పోలి ఉన్నారు. అతడు కూడా ఫిర్ఔన్ జాతివారిని శపించారు. ఎందుకంటే, వారు మహిమలను, మహత్యాలను చూసి కూడా విశ్వసించలేదు. దీనికి వ్యతిరేకంగా ఉహుద్ సంగ్రామంలో తన శత్రువుల కొరకు ప్రార్ధించారు. అంటే అప్పుడు ఈసా(అ)ను పోలి ఉన్నారు. ఇతడు ఏనాడూ తన శతృవుల కొరకు చెడును కోరలేదు. ప్రవక్త(స)ను మస్జిదె నబవీ న్యాయస్ధానంలో, తీర్పుల్లో, యుధ్ధాల్లో, పోరాటాల్లో చూస్తే మూసా(అ)ను పోలి ఉన్నారు. కాని ఇంట్లో, కొండల్లో, రాత్రి అంధకారంలో ఒంటరిగా చూస్తే ఈసా(అ) గుర్తు కొస్తారు. రాత్రీ పగలు ప్రార్ధనల్లో, కీర్తనల్లో, స్మరణల్లో చూస్తే దావూద్(అ) గుర్తు కొస్తారు. మక్కా విజయంనాడు ప్రవక్త(స)ను చూస్తే సైన్యాధిపతి సులైమాన్ గుర్తుకొస్తారు. షుఅబ్ అబీ తాలిబ్ లోని సాంఘిక బహిష్కార జీవితం చూస్తే ఈజిప్టు కారాగారంలో ఉన్న యూసుఫ్(అ) గుర్తుకొస్తారు. మూసా(అ) చట్టాలు తీసుకువచ్చారు. దావూద్ దుఆ, విన్నపాలను తీసుకువచ్చారు. ఈసా(అ) భక్తి శ్రధ్ధలను, నైతికతలను తీసుకువచ్చారు. కాని ముహమ్మద్(స) చట్టాలూ తెచ్చారు, దుఆలూ, ప్రార్ధనలూ తెచ్చారు. భక్తీ, ఏకాగ్రతలను, నైతికతలనూ తెచ్చారు. వీటన్నిటి మిశ్రమమే ఖుర్ఆన్ రూపంలో ప్రవక్త(స)కు ఇవ్వబడింది.

మిత్రులారా! ఇప్పుడు ప్రవక్త(స) జీవిత చరిత్ర యొక్క మరో కోణాన్ని గురించి వివరిస్తాను, ప్రపంచంలో రెండు రకాల విద్యాలయాలు ఉన్నాయి. ఒకచోట ఒకే వృత్తి నేర్పిస్తారు. ప్రతి వృత్తికి వేర్వేరు విద్యాలయాలు ఉన్నాయి. ఉదా – మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్, మరొకటి వ్యాపార విద్యాలయం, మరొకటి వ్యవసాయ విద్యాలయం, మరొకటి చట్టాల విద్యాలయం, మరొకటి సైనిక శిక్షణ ఇచ్చేది, అదే విధంగా అరబీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రతి పాఠశాల ఒకే రకానికి చెందిన విద్య నేర్పుతుంది.

మెడికల్ కాలేజ్ నుండి కేవలం డాక్టర్లు తయారవుతారు, వ్యవసాయ విద్యాలయం నుండి వ్యవసాయ నిపుణులు తయారవుతారు, చట్ట విద్యాలయం నుండి న్యాయవాదులు తయారవుతారు, వ్యాపార సంస్ధల నుండి వ్యాపార నిపుణులు తయారవుతారు, మిలటరీ విద్యాలయం నుండి సైనికులు తయారు అవుతారు, ఈ విధంగా అక్కడ కూడా యూనివర్సిటీలు ఉన్నాయి, ఇవి మరో రకానికి చెందిన విద్యాలయాలు, వీటిలో వివిధ రకాల విద్యలు నేర్పుతారు, వీటిలో వైద్య, వ్యాపార, సాంకేతిక, పారిశ్రామిక మొదలైన విద్యలు నేర్పుతారు, అంటే ఇక్కడి నుండి ప్రతి రంగానికి చెందిన నిపుణులు తయారవుతారు.

కొంచెం ఆలోచించండి! కేవలం ఒక రకానికి చెందిన విద్య నేర్చిన వ్యక్తి, ఒక రకానికి చెందిన వృత్తి నేర్చిన వ్యక్తి వల్ల మానవ సమాజం పరిపూర్ణం కాదు. అన్ని రకాల విద్యలు కలసినప్పుడే సమాజం పరిపూర్ణం అవుతుంది. ఒకవేళ ఒకే విద్య, ఒకే వృత్తి వల్ల ఈ ప్రపంచం అంతా స్ధాపించబడితే నాగరికత, సంస్కృతుల మిషన్ వెంటనే మూసుకు పోతుంది. మానవ కార్యకలాపాలన్నీ స్తంభించి పోతాయి. అంతేకాదు ప్రపంచమంతా భక్తిశ్రధ్ధలు, వంటరితనంతో నిండిపోతే అప్పుడు అది పరిపూర్ణ స్ధితికి చేరలేదు.

ఇప్పుడు రండి, ఈ ప్రామాణికత ద్వారా అనేక మంది ప్రవక్తల జీవిత చరిత్రలను పరిశీలిద్దాం, ఈసా(అ) పలికినట్టు చెట్టు తన పండ్ల ద్వారా గుర్తించ బడుతుంది. విద్యాలయాలు తమ శిష్యుల ద్వారా గుర్తించ బడతాయి. ప్రవక్తలు ఉపాధ్యాయులుగా ఉన్న విద్యాలయాలను పరిశీలిస్తే ఒకచోట 20, మరోచోట 35, మరోచోట 50 మంది విద్యార్ధులు మీకు దొరుకుతారు. కాని చివరి విద్యాలయం అయిన ప్రవక్త(స) విద్యాపీఠాన్ని పరిశీలిస్తే, ఒకేసారి లక్షకు పైగా విద్యార్ధులు కనబడతారు. ఒకవేళ మీరు ఆ ఇతర విద్యాపీఠాల విద్యార్ధుల గురించి, వారు ఎక్కడి వారు, ఎలా ఉండేవారు, వారి గుణగణాలు, అలవాట్లు, పరిస్ధితులు, జీవిత చరిత్రలు ఎలా ఉండేవి, వారి విద్యాబుధ్ధులు, ఆచరణా ఫలితాలు ఎలా ఉన్నాయని పరిశీలిస్తే వాటికి ఎటువంటి సమాధానం దొరకదు. కాని ముహమ్మద్(స) విద్యాపీఠంలో ప్రతి విషయం మీకు లభిస్తుంది, విద్యార్ధి పేరు, ఊరు, వివరాలు, చరిత్ర, విద్య, ఫలితాలు, శిక్షణ ప్రతీది ఇస్లామీయ చరిత్ర పుటల్లో నమోదై ఉంది.

ముందుకు పదండి, తమ ద్వారాలు అందరి కొరకు తెరచి ఉన్నాయని దైవదౌత్య ధార్మిక సందేశానికి చెందిన ప్రతి విద్యాపీఠం వాదిస్తుంది, కాని ఆ విద్యాపీఠం వ్యవస్ధాపకుల ప్రధాన గురువుల చరిత్ర చదవండి, వారి కాలంలో ఒకే దేశానికి, ఒకే వంశానికి, ఒకే కుటుంబానికి చెందిన విద్యార్ధులు చేరారా? లేక వివిధ జాతులకు, వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్ధులు చేరారా? తౌరాతుకు చెందిన ప్రవక్తలందరూ ఇరాఖ్ దేశం లేదా సిరియా లేదా ఈజిప్టు దేశం కంటే ముందుకు పోలేదు, అంటే తమ ప్రాంతంలోనే, తమ జాతిలోనే, తమ సంతతిలోనే వారు దైవదౌత్య బాధ్యతలు నిర్వర్తించారు. సాధ్యమైనంత వరకు ఇస్రాయీలు కుటుంబంలోనే వారు ప్రయత్నించారు. ప్రాచీన ప్రవక్తలు కూడా తమ జాతి వరకే బాధ్యులుగా ఉండేవారు. వీరు బయట ప్రాంతానికి వెళ్ళలేదు. ఈసా(అ) విద్యాపీఠంలో కూడా ఇతర విద్యార్ధులు ఉండేవారుకారు. తప్పిపోయిన వారిని చేర్చటంలోనే నిమగ్నమయి ఉండేవారు. ఇతరులకు విద్యా శిక్షణ ఇచ్చి పిల్లల రొట్టెను కుక్కల ముందు వేయడానికి ఇష్టపడేవారు కారు. (ఇంజీలు) భారతదేశానికి చెందిన బోధకులు ఆర్యవర్తుకు బయట వెళ్ళే ఆలోచనే రాలేదు. అయితే బుధ్ధుని శిష్యుల్లోని రాజులు ఆయన సందేశాన్ని ఇతర జాతులకు కూడా అందజేసారు. కాని ఇది క్రైస్తవుల్లో తరువాతి తరానికి చెందిన కార్యాలు, అంత ఎందుకు, స్వయంగా ధార్మిక బోధకుని జీవిత చరిత్రలో ఈ విశ్వవ్యాప్త విశిష్టతకు చెందిన ఒక్క ఉదాహరణ కూడా లేదు.

రండి, అరబ్ కు చెందిన నిరక్షరాశి అయిన అధ్యాపకుని విద్యాపీఠాన్ని పరిశీలిద్దాం, ఇందులోని విద్యార్ధులు అబూబకర్, ఉమర్, ఉస్మాన్, అలీ, తల్హా, జుబైర్ మొదలైన మక్కా ఖురైష్ తెగవారు అయిన విద్యార్ధులు. వీరు ఎవరు? అబూబకర్ ఒక ధనవంతుడు, వీరు తిహామా ప్రాంతానికి చెందిన గిఫారీ తెగకు చెందినవారు. వీరెవరు? వీరు అబూహురైరహ్ మరియు తుఫైల్ బిన్ అమ్ర్ యమన్ నుండి వచ్చారు, వీరు దోసీ తెగవారు. వీరెవరు? వీరే అబూమూసా అష్అరీ మరియు ముఆజ్ బిన్ జబల్, వీరు కూడా యమన్ నుండి వచ్చారు, వీరు ఇతర తెగలకు చెందినవారు. వీరెవరు? వీరు జమాద్ బిన్ సాలబ అజ్ద్ తెగవారు, వీరు ఖబ్బాబ్ బిన్ అర్త్ తమీమ్ తెగకు చెందినవారు, వీరు మున్జిర్ బిన్ హిబ్బాన్ మరియు మున్జిర్ బిన్ ఆయిజ్ అబ్దుల్ ఖైస్ తెగకు చెందినవారు, వీరు బహ్రైన్ నుండి వచ్చారు, వీరు ఉబైద్, జాఫర్ అమాన్ ధనవంతులు, వీరు ఫర్దహ్, వీరు మఆన్ అంటే, వీరు సిరియా సరిహద్దుకు చెందినవారు. ఈ నల్లని వ్యక్తి ఎవరు? వీరు బిలాల్(ర) హబష్ దేశానికి చెందిన వారు. వీరెవరు? వీరిని సుహైబ్ రూమీ అంటారు. వీరెవరు? వీరు ఈరాన్ కు చెందిన సల్మాన్ ఫారసీ, వీరు ఫేరోజ్ దేలమీ, వీరు సయఖ్ బత్ మరియు మర్కబూద్ ఈరాన్ వంశానికి చెందినవారు.

హుదైబియ ఒప్పందం 6వ హిజ్రీలో జరిగింది. ఈ ఒప్పందం ముస్లిములకు చాలా లాభదాయకమైనదిగా పరిణమించింది. అంటే ఖురైష్ మరియు ముస్లిములు యుధ్ధం ఆపివేయాలి, ముస్లిములు తాము కోరిన చోట తమ ధర్మాన్ని గురించి ప్రచారం చేసుకోవచ్చు. ఈ సువర్ణ అవకాశాన్ని ప్రవక్త(స) ఎలా ఉపయోగించారో చూడండి, 6వ హిజ్రీలోనే ఇతర జాతుల రాజులకు, చక్రవర్తులకు ఇస్లామ్ సందేశాన్ని ఉత్తరాల ద్వారా ప్రవక్త(స) పంపారు. వారికి దైవసందేశాన్ని అందజేసారు. దహియ్య కల్బీ హిర్ఖల్ సభ లోనికి, అబ్దుల్లాహ్ ఈరాన్ చక్రవర్తి సభలోనికి, హాతిబ్ బిన్ బల్త ఈజిప్టు రాజు సభలోనికి, అమ్ర్ నజ్జాషీ సభలోనికి, షుజా బిన్ వహబ్ అల్అసదీ సిరియా ధనవంతుల వద్దకు, సలీత్ బిన్ అమ్ర్ యమామ సభలోనికి ప్రవక్త(స) ఉత్తరాలు తీసుకొని, ముహమ్మద్ విద్యాపీఠంలో ప్రవేశం ఉచితమంటూ వెళతారు

మహాశయులారా! ఈ సంఘటనవల్ల ముహమ్మద్ విద్యాపీఠం విశేషం అంటే ఇందులో ప్రవేశానికి రంగు, మతం, దేశం, ప్రాంతం, జాతి, భాషలతో సంబంధమే లేదు. ఇది ఏ వంశం వారైనా, ఏ దేశం వారైనా, ఏ భాషకు చెందిన వారైనా అంటే ప్రపంచ ప్రజలందరికీ వర్తిస్తుంది అనే వాస్తవం స్పష్ట మౌతుంది.

రండి, ఈ విద్యాపీఠం స్ధానం, ఔన్నత్యం గురించి చర్చిద్దాం, ఇది ఒక స్కూలు వంటిదా? కాలేజ్ వంటిదా? ఇక్కడ ఒకే విషయం గురించి శిక్షణ ఇవ్వబడుతుందా? లేక ఇది ఒక యూనివర్సిటీ వంటిదా? ఇక్కడ అభిరుచికి అనుగుణంగా, ఇష్టప్రకారం, శక్తికి తగ్గట్టు వివిధ దేశాల, వివిధ జాతుల ప్రజలకు విద్యా బోధన జరుగుతుంది. మూసా(అ) బోధనలను చూడండి, అక్కడ కేవలం సైనికులు, సైనికాధికారులు, న్యాయమూర్తులు కొన్ని ధార్మిక పదవులు కనబడ తాయి. ఈసా(అ) శిష్యులను చూడండి, కొందరు భక్తిపరులుగల పేదవారు, అగత్యపరులు, పాలస్తీన్ వీధుల్లో కనబడతారు. కాని ముహమ్మద్ (స) వద్ద ఏం కనబడుతుంది? ఒక వైపు హబష్ రాజు నజ్జాషీ, ధనవంతుడు జుల్ కలా, ఆమిర్ బిన్ షహ్ర్, ఫేరోజ్ దేలమీ, మర్కబూద్, ఉబైద్, జాఫర్ మరో వైపు బిలాల్, యాసిర్, సుహైబ్, ఖబ్బాబ్, అమ్మార్, అబూ ఫకీహా బానిస మరియు సుమయ్య, లబీన, జనీర నహ్దియ, ఉమ్మె అబీస్ సేవకురాళ్ళు, జాగ్రత్తగా చూడండి, ధనవంతులు, పేదవారు, యజమానులు, సేవకులు, బానిసలు ఒకే వరుసలో నిలబడి ఉన్నారు.

ఒకవైపు విద్యావంతులు, వ్యాపారులు, ధనవంతులు, వీరులు, బలవంతులు, పాలకులు ఈ విద్యా పీఠం నుండి విద్యనభ్యసించారు.  అబూబకర్ సిద్దీఖ్, ఉమర్ ఫారూఖ్, ఉస్మాన్ గనీ, అలీ ముర్తుజా, ముఆవియహ్ బిన్ అబీ సుఫియాన్, వీరు తూర్పు నుండి పడమర వరకు, ఆఫ్రికా నుండి భారతదేశం వరకు పాలించారు. వీరి పరిపాలన పెద్దపెద్ద చక్రవర్తుల, పాలకుల రాజకీయ ఆలోచనా సరళిని, యంత్రాంగ ఘనకార్యాలను రద్దుచేసింది. వీరి ధర్మ,న్యాయ తీర్పులు ఈరానీ చట్టాలను, రూమీ శాసనాలను ప్రభావహీనంగా చేసివేసాయి. ప్రపంచ రాజకీయ, యంత్రాంగ చరిత్రలో అగ్ర స్ధానాన్ని పొందారు. ఇటువంటి ఉపమానం మరెక్కడా కనిపించదు.

మరో వైపు ఖాలిద్ బిన్ వలీద్, సఅద్ బిన్ అబీవఖ్ఖాస్, అబూ ఉబైదహ్ బిన్ జర్రాహ్, అమ్ర్ బిన్ అల్ఆస్ జన్మించారు. తూర్పు పడమరలకు చెందిన రెండు దుర్మార్గ సామ్రాజ్యాలను కొన్నేళ్ళలోనే తలక్రిందులు చేసారు. ప్రపంచ అజేయ సైన్యాధిపతులుగా నిరూపించబడ్డారు. వీరి విజయాల పేరు ప్రతిష్టలు ఈనాటి వరకు ప్రపంచానికి గుర్తున్నాయి. సఅద్ ఇరాక్, ఈరాన్ రాజ కిరీటాలను దించి ఇస్లామ్ పాదాలపై వేసాడు. ఖాలిద్, ఉబైదహ్ రూమీలను సిరియా నుండి తరిమి వేసి ఇబ్రాహీమ్ భూభాగం అమానతును ముస్లిములకు అప్పగించారు. అమర్ బిన్ అల్ఆస్ ఫిర్ఔన్ భూభాగం నైలునదిని రోమన్ చక్రవర్తి నుండి బలవంతంగా లాక్కున్నాడు. అబ్దుల్లాహ్ బిన్ జుబైర్, ఇబ్నె అబీ సరహ్ ఆఫ్రికా భూభాగాన్ని శత్రువుల నుండి లాక్కున్నాడు. వీరే ఆ ప్రఖ్యాత అజేయ సైన్యాధిపతులు. వీరి యోగ్యతను ప్రపంచం సమ్మతించింది. చరిత్ర వారి గురించి సాక్ష్యం ఇచ్చింది.

మూడో వైపు బాజాన్ బిన్ సాసాన్ (యమన్), ఖాలిద్ బిన్ సయీద్ (సన్ఆ), ముహాజిర్ బిన్ ఉమయ్య(కంద), జియాద్ బిన్ లబీద్( హజరమౌత్), అమ్ర్ బిన్ హజ్మ్(నజ్రాన్), యజీద్ బిన్ అబీ సుఫియాన్(తైమ), అలా బిన్ హజ్రమీ (బహ్రైన్) మొదలైన అనుచరులు రాష్ట్రాలను, నగరాలను విజయ వంతంగా పాలించారు. దైవదాసులకు సుఖాన్ని అందించారు.

మరోవైపు పండితులు, వేదాంతులు, వివేకవంతులు ఉన్నారు. ఉమర్ బిన్ ఖత్తాబ్, అలీ బిన్ అబీతాలిబ్, అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్, అబ్బాస్, అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్, ఉమర్ బిన్ అల్ఆస్, ఆయిషహ్, ఉమ్మెసల్మా, ఉబయ్ బిన్ కఅబ్, ముఆజ్ బిన్ జబల్, జైద్ బిన్ సాబిత్, ఇబ్నె జుబైర్ మొదలైనవారున్నారు. వీరు ఇస్లామీయ చట్టాల్నీ, శాసనల్నీ ప్రారంభించారు. ప్రపంచ శాసనకర్తల్లో అగ్రస్ధానాన్ని సంపాదించారు.

ఐదవవర్గం ఉల్లేఖనకర్తలది, అబూహురైరహ్, అబూ మూసా అష్అరీ, అనస్ బిన్ మాలిక్, అబూ సయీద్ ఖుద్రీ, ఉబాదహ్ బిన్ సామిత్, జాబిర్ బిన్ అబ్దుల్లాహ్, బరా బిన్ ఆజిబ్ మొదలైన అనేక మంది అనుచరులు ఉన్నారు. ప్రవక్త జీవిత చరిత్రకు సంబంధించిన ఆదేశాలను, సంఘటనలను ఉల్లేఖించారు, వ్రాసి అందించారు.

6 వర్గం. వీరు 70మంది, వీరు సుఫ్ఫావారుగా పేరు పొందారు. వీరివద్ద తల దాచుకోవడానికి మస్జిదె నబవీ గట్టు తప్ప మరేదీ ఉండేదికాదు. ఒంటి మీద బట్టలే వారి ఆస్తి, పగలు అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొని వచ్చేవారు, వాటిని అమ్మి తామూ తినేవారు, దైవమార్గంలోనూ ఖర్చుచేసేవారు, రాత్రివేళ దైవ విధేయతలో, ఆరాధనలో గడిపేవారు.

ఏడవ వర్గాన్నీ చూడండి! వారికంటే సత్యవంతులు ఈ ప్రపంచంలో మరెవరూ లేరు. వీరు ఈనాటి ఆహారం రేపటికి భద్రపరచి ఉంచడం కూడా దైవ నమ్మకానికి వ్యతిరేకంగా భావించేవారు. వీరికి ప్రవక్త సన్నిధి మసీహుల్ ఇస్లామ్ అనే బిరుదు ఇచ్చింది. సల్మాన్ ఫారసీ, వీరు భక్తిశ్రధ్ధలలో, దైవభీతిలో అగ్రగణ్యులు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ 30 సంవత్సరాలు దైవవిధేయతలో, ఆరాధనలో గడిపేవారు. ముస్అబ్ బిన్ ఉమైర్ ఇస్లామ్ కు ముందు ఖరీదైన పట్టువస్త్రాలు ధరించేవారు. భోగభాగ్యాలతో జీవితం గడిపేవారు. కాని ఇస్లామ్ స్వీకరించిన తర్వాత గోనెసంచులను, అతుకులు గల దుస్తులను ధరించేవారు. వీరు మరణం పొందిన తర్వాత కఫన్ దుస్తులు కూడా పూర్తిగా పొందలేక పోయారు, కాళ్ళపై గడ్డివేసి ఖననం చేయబడ్డారు. ఉస్మాన్ బిన్ మజ్ఊన్ ఇస్లామ్ కు ముందు సూఫీ అనబడే వారు. అల్లర్లకాలంలో ముహమ్మద్ బిన్ సల్లమహు, ఎవరైనా ముస్లిమ్ కరవాలంతో నా ఇంట్లో నన్ను చంపటానికి ప్రవేశిస్తే నేనేమీ భయపడను అని అనేవారు. అబూదర్దా రాత్రులు నమాజుల్లో, పగలు ఉపవాసాల్లో గడిచేవి.

మరోవైపు చూడండి! వీరోచితులైన అరబ్ మహావివేకులు కూడా ఉనారు. వీరిలో తల్హా, జుబైర్, ముగీర, మిఖ్దాద్, సఅద్ బిన్ మఆజ్, సఅద్ బిన్ ఉబాదహ్, అసద్ బిన్ హసీర్, అస్అద్ బిన్ జరారహ్, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్. వ్యాపారుల్లో చూడండి, మక్కా వర్తకులు, వ్యాపారులు, మదీనాకు చెందిన రైతులు ఉన్నారు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, సఅద్ బిన్ జుబైర్ వంటి ధనవంతులు కూడా ఉన్నారు.

మరోవర్గం సత్యంకోసం అమరులైనవారిది, అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన అమాయకులది. వీరు అల్లాహ్ మార్గంలో తమ విలువైన ప్రాణాలను త్యాగం చేసారు. కాని సత్యాన్ని మాత్రం వదలడానికి ఇష్టపడలేదు. ఖదీజకు మొదటి భర్త ద్వారా పుట్టిన హాలా కరవాలాలతో ముక్కలు మక్కలు చేయ బడ్డారు, సుమయ్య అమ్మార్ తల్లి అబూజహల్ కత్తికి బలై మరణించారు. యాసిర్ అవిశ్వాసుల చేతుల్లో హింసల పాలై మరణించారు, ఖుబైబ్ ఉరికంబం పై ప్రాణాలర్పించారు. జైద్ కరవాలం ముందు తన మెడను వంచారు, హరామ్ బిన్ మల్హా ఇంకా ఆయన 69మంది మిత్రులు మఊన బావివద్ద అసియ్య, రఅల్, జక్వాన్ వర్గాల చేతుల్లో దారుణంగా చంపబడ్డారు, రజీ సంఘటనలో ఆసిమ్ అతని మిత్రులు బనూలిహ్యాన్ బాణాలకు గురై మరణించారు. 7వ హిజ్రీలో ఇబ్నె అబీ అఫ్జాకు చెందిన 49మంది బనూ సలీమ్ వర్గం చేతుల్లో చంపబడ్డారు, కఅబ్ బిన్ ఉమర్ గిఫారీ తన మిత్రులతో పాటు జాతుఇస్తిలాహ్ మైదానంలో చంపబడ్డారు, ప్రపంచంలో ఒక ప్రముఖ మతం కేవలం ఒక్క ఉరిపై గర్వ పడుతుంది. కాని ఇస్లామ్ లో ఎన్నో ఉరికంబాలు, ఎన్నో త్యాగాలు, మరణాలు, అర్పణలున్నాయి. కరవాలాలైనా, బళ్ళాలయినా, ఉరికంబాలైనా ఇవన్నీ ప్రాణాలు కోరేవే, ఎన్నో కుటుంబాలు వీటిని తట్టుకుంటూ అనేక ఏళ్ళ వరకు ఆపదలను భరిస్తూ సహనంతో కఠిన పరీక్షల్లో పాసయ్యాయి. వీరు అగ్ని జ్వాలలపై, మండుతున్న ఇసుకపై విశ్రాంతి తీసుకున్నారు. రాతి పలకలను తమ గుండెల పై ఉంచుకున్నారు. వీరి మెడలో త్రాళ్ళువేసి ఈడ్చుకు పోవడం జరిగింది. కాని ముహమ్మద్ పవిత్ర వచనాన్ని మాత్రం వదల్లేదు. షుఅబు అబీ తాలిబ్ సాంఘిక బహిష్కరణలో 3 సంవత్సరాల వరకు ఆకులు, అలములు తిని గడిపారు. సఅద్ బిన్ అబీ వఖ్ఖాస్ ఒక రాత్రి ఆకలి బాధ వల్ల ఒక ఎండిపోయిన చర్మాన్ని శుభ్రపరచి కాల్చి నీటిలో కలిపి తిన్నారు. ఉత్బ బిన్ గజ్వాన్ ఇలా అంటున్నారు, మేము ఏడుగురము ఆ అసహజ ఆహారాన్ని తింటూ మా నోటిలో గాయాలు అయ్యాయి. ఖబ్బాబ్ ఇస్లామ్ స్వీకరించినపుడు అవిశ్వాసులు అతన్ని మండుతున్న బొగ్గులపై పరుండ బెట్టారు. చివరికి ఆ బొగ్గులు అతని వీపు క్రిందే ఆరిపోయాయి.

బిలాల్ ను మద్యాహ్నం మండుతున్న ఇసుకపై పరుండబెట్టి అతని గుండెపై శిలాఫలకాన్ని పెట్టేవారు. అతని మెడలో త్రాడు వేసి వీధుల్లో లాక్కుంటూ పోయేవారు. అబూ ఫకీహా కాళ్ళకు త్రాడు కట్టి నేలపై లాక్కుంటూ పోయేవారు. అతని పీక పిసకడం జరిగింది. అమ్మార్ ను మండుతున్న ఇసుకపై పరుండబెట్టి కొట్టేవారు. జుబైర్ ను అతని చిన్నాన్న చాపలో చుట్టి, పొగ వదిలేవారు. సయీద్ బిన్ జైద్ ను త్రాళ్ళతో కట్టి కొట్టేవారు. ఉస్మాన్ ను అతని చిన్నాన్న త్రాళ్ళతో కట్టి కొట్టాడు. ఇదంతా జరిగింది. కాని వారి ఇస్లామ్ మత్తు వదలలేదు. ఇది కౌసర్ యజమాని మత్తుకదా.

సోదరులారా! ఇది ఆలోచించవలసిన విషయం, ఇదే ఆ దానవ, అదే విగ్రహారాధకుల, ఆ ముష్టి గుణాల ఖురైషీ సమాజం. మరి ఈ విఫ్లవం ఎలా వచ్చింది? ఒక నిరక్షరాశి శిక్షణ అజ్ఞానులను జ్ఞానులుగా, విశాల హృదయులుగా, వివేకవంతులుగా, శాసనకర్తలుగా ఎలా మార్చగలిగింది? ఒక్క ఒంటరి ప్రవక్త యొక్క సందేశ ప్రచారం అరబ్బులను సైన్యాధిపతులుగా, వీరులుగా ఎలా మార్చగలిగింది? వీరికి దేవుని పేరు కూడా తెలియకుండా ఉండేది. అలాంటి వీరు దైవభక్తులుగా, దైవభీతిపరులుగా, విధేయులుగా, త్యాగ శీలురుగా ఎలా మారిపోయారు? మీరు ముహమ్మద్ విద్యాపీఠాన్ని గురించి తెలుసుకున్నారు. వివిధ రకాల విద్యార్ధులను, పండితులను, శాసనకర్తలను, సైనికులను, న్యాయమూర్తులను, అధికారులను, ధనవంతులను, పేదవారిని, బానిసలను, యజమానులను, చంపేవారిని, చంపబడే వారిని, సత్యపద గాములను కూడా చూచారు. మీ నిర్ణయం ఏమిటి? మరే నిర్ణయం కాగలదు? ముహమ్మద్(స) సర్వ సద్గుణాలు కలిగి ఉన్న పరిపూర్ణ వ్యక్తి. అన్ని రంగులు కలిగి ఉన్న పరిపూర్ణ వ్యక్తి. ఈయన వేర్వేరు రంగులే సిద్దీఖ్, ఫారూఖ్, జున్నూరైన్, ముర్తుజా, అబూజర్, సల్మాన్, అబూదర్దా, మస్ఊద్, బిలాల్, సుహైబ్, అమ్మార్, ఖుబైబ్ రూపాల్లో కనబడతాయి. ముహమ్మద్(స) విశ్వానికి వెలుగు అందించే సూర్యుడు, వీరు ఆయన నుండి తమకు కావలసినంత తమ శక్తికి తగ్గట్టు లాభం పొందుతున్నారు.

వివిధ రకాలకు చెందిన పురుషుల్లో విబేధాలు ఉన్నా ఒక విషయం మాత్రం అందరిలో ఉండేది, అది ఒక మెరుపు వంటిది, అది ఒక ఆత్మ వంటిది, ఈ తపన అందరిలో ఉండేది. పాలకులైనా, పాలితులైనా, ధనవంతులైనా, పేదవారైనా, గురువులైనా, శిష్యులైనా ఎవరైనా సరే అందరిలో ఏకత్వం వెలుగు, ఏకత్వం ఆత్మ, త్యాగశీలత, దైవదాసుల మార్గదర్శక తపన, దైవప్రీతి ఉండేవి. వారు ఎక్కడున్నా, ఏం చేసినా అందరిలోనూ సత్యానుగ్రహం ఒకే విధంగా ఉండేది. దైవం, ఖుర్ఆన్, ప్రవక్త, వర్గం అన్నీ ఒక్కటే, వీరు ఏ పని చేసినా ప్రాపంచిక స్నేహం, భూతదయ, అల్లాహ్ ఔన్నత్యం, సత్యాభి వృధ్ధి మొదలైన వన్నీ ప్రధాన ఉద్దేశ్యంగా ఉండేవి.

మిత్రులారా!  ఈనాటి ప్రసంగంలో నేను ముహమ్మద్(స) యొక్క విశేష గుణాల్ని అనేక కోణాల ద్వారా విశదపరిచాను. ఒకవేళ మీరు ప్రకృతి పరిశీలన తర్వాత ఈ ప్రపంచం మానవ అభిరుచుల, సామర్ధ్యాల, శక్తియుక్తుల మిశ్రమం అని భావిస్తే, ముహమ్మద్(స) విశేష వ్యక్తిత్వం తప్ప ఇతరులెవ్వరూ చివరి, శాశ్వత, విశ్వవ్యాప్త మార్గదర్శి కాలేరు. అందువల్లే ఇలా ప్రకటించడం జరిగింది, “ఒకవేళ మీరు అల్లాహ్ ను ప్రేమిస్తే నన్ను అనుసరించండి! ఒకవేళ మీరు చక్రవర్తులైతే నన్నే అనుసరించండి, ఒకవేళ మీరు పాలితులైతే నన్నే అనుసరించండి, ఒకవేళ మీరు సైన్యాధిపతులైనా, సైనికులైనా నన్నే అనుసరించండి, ఒకవేళ మీరు ఉపాధ్యాయులైనా, విద్యార్ధులైనా నన్నే అనుసరించండి, ఒకవేళ మీరు ధనవంతులైనా, పేదవారైనా నన్నే అనుసరించండి, ఒకవేళ మీరు బాధించే వారైనా, బాధితులైనా నన్నే అనుసరించండి, ఒకవేళ మీరు దైవదాసులైనా, ప్రజల సేవకులైనా, ఏ పుణ్యకార్యం చేయాలనుకున్నా, అన్నిటికన్నా మంచి ఆదర్శం కావాలన్నా నన్నే అనుసరించండి”.

6. ప్రవక్త ముహమ్మద్(స) జీవితంలోని ఆచరణాత్మకమైన కోణాలు.

ముస్లిములారా! ప్రవక్త(స)ను ఏ విషయంలో ఎలా అనుసరించాలి? దీని కోసం మనం ప్రవక్త(స)ను ఆచరణా కోణంలో పరిశీలించాలి, అయితే ఈ ఆచరణా కోణం ఇతర ప్రవక్తల, ధర్మ వ్యవస్ధాపకుల  జీవిత చరిత్రల్లో కానరాదు. కాని ముహమ్మద్(స) యొక్క జీవిత రంగాలన్నిటిలో వివరంగా స్పష్టంగా ఉండే రంగం ఇదే, ఈ ఒక్క ప్రామాణికత ద్వారా మనం ప్రవక్తల నాయకుడు, చివరి ప్రవక్త ఎవరు కాగలరని నిర్ణయించగలం, విలువైన బోధనలకు, తియ్యటి పలుకులకు, మంచి విద్యలకు ఈ ప్రపంచంలో కొరత లేదు. కొరత ఉంటే అది ఆచరణలోనే ఉంది. ప్రస్తుతం ఉన్న ధర్మాల వ్యవస్ధాపకుల జీవిత చరిత్రలను చదవండి, మనోహరమైన త్యూరీలు దొరుకుతాయి. మనస్సుకు హత్తుకునే సామెతలు, గొప్ప ప్రసంగాలు, భాషాపరమైన సాహిత్యాలు ప్రభావ పూరితమైన ఉపమానాలు తృప్తి పరుస్తాయి. కాని వాటిలో దొరకనిది ఏదైనా ఉంటే అది ఆచరణ మాత్రమే. తాము ఇచ్చే సందేశాలను, ఉపదేశాలను, బోధనలను ఆచరించి చూపాలి. ఇటువంటిదే పరిపూర్ణ వ్యక్తిత్వం.

మానవుని ఆచరణా చరిత్ర పేరే గుణ సంపన్నత, ఖుర్ఆన్ తప్ప ఇతర ఏ ధర్మానికి చెందిన ఏ గ్రంధమూ తన వ్యవస్ధాపకుని గుణసంపదకు,  అతని ఔన్నత్యానికి ఎటువంటి సాక్ష్యం ఇవ్వలేదు. కాని ఖుర్ఆన్ తన ప్రవక్త గురించి శత్రువుల్లో, మిత్రుల్లో, అన్నిచోట్ల ఈ విధంగా ప్రకటించింది.

وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍ وَ إِنَّكَ لَعَلَى خُلُقٍ عَظِيْمٍ . (القلم-3-4)

నిస్సందేహంగా నీ కొరకు అంతం కాని ప్రతిఫలం ఉంది, నిస్సందేహంగా నీవు మహా ఉత్తమ సద్గుణ సంపన్నుడవు.(అల్ఖలమ్-3-4)

ఈ రెండు వాక్యాల్లో వాదనను,సాక్ష్యాన్నీ పేర్కొనడం జరిగింది, మొదటి వాక్యంలో అంతం కాని ప్రతి ఫలం అని వాదించబడింది. రెండవ వాక్యంలో ఆయన ఆచరణ, సద్గుణాలను సాక్ష్యాలుగా పేర్కొనడం జరిగింది. అంటే ఆయనకు అంతం కాని ప్రతిఫలం ఇవ్వబడింది. కారణం ఆయన ఆచరణ సద్గుణాలు, మక్కా నిరక్షరాశి అయిన అధ్యాపకుడు ఎలుగెత్తి ప్రశ్నిస్తున్నాడు.

لِمَا تَقُولُونَ مَالَا تَفْعَلُونَ . (سورة الصف-2)

మీరు చేయని దాని గురించి చెబుతారెందుకు? (సూరతుస్సఫ్-2)

అది అతని హక్కుగా అంటున్నారు. ఎందుకంటే ఆయన ఏది చెప్పినా అది చేసి చూపిస్తాడు. ప్రవక్త (స), ఈసా(అ) చరిత్రలను సూక్ష్మంగా పరిశీలిస్తే, ఇద్దరిలో చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఒకరి జీవితంలో ఈ సద్గుణాల్లో ఏవీ కనబడవు, మరొకరి జీవితంలో ఇవన్నీ పరిపూర్ణంగా ఉన్నాయి. ఆచరణా గుణాలు ఒక వ్యక్తిని పరిపూర్ణ వ్యక్తిగా తయారు చేస్తాయి. దీని గురించి ఖుర్ఆన్ ఇలా సాక్ష్యం ఇస్తుంది.

فَبِمَا رَحْمَةٍ مِنَ اللهِ لِنْتَ لَهُمْ وَلَوْ كُنْتَ فَظًّا غَلِيْظَ القَلْبِ لَانْفَضُّوا مِنْ حَوْلِكَ. (آل عمران -159)

దైవానుగ్రహం వల్లనే నీవు సున్నిత స్వభావుడవయ్యావు, ఒకవేళ నీవు కఠిన స్వభావుడవైతే,    ప్రజలు నీ దగ్గర నుండి చెదిరిపోతారు.(ఆలిఇమ్రాన్-159)

ఇక్కడ ప్రవక్త(స) సున్నిత మనస్తత్వాన్ని గురించి ప్రస్తావించబడింది. దీన్ని వాదనలు, ఆధారాలతో పాటు ఖుర్ఆన్ లో పేర్కొనడం జరిగింది. ఖుర్ఆన్ లో మరో చోట ఇలా పేర్కొనడం జరిగింది,

لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِنْ اَنْفُسِكُمْ عَزِيْزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيْصٌ عَلَيكُمْ بِاْلمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيْمٌ.(التوبة-128)

మీ వద్దకు మీలో నుండే ఒక ప్రవక్త వచ్చాడు, మీరు నష్టానికి గురికావటం ఆయనకు ఎంతమాత్రం ఇష్టంలేదు, ఆయన మీ సాఫల్యాన్నే కోరుకుంటున్నాడు.(అత్తౌబహ్-128)

ఈ వాక్యంలో అల్లాహ్(త) ప్రవక్త(స) యొక్క మనోభావాలను పేర్కొన్నాడు. ఇవన్నీ మానవుని సహజగుణాలు. అందువల్లే ప్రజలారా! మీరు బాధలకు కష్టాలకు గురికావటం, సత్యాన్ని తిరస్కరించటం, అజ్ఞానాన్నీ, పాపకార్యాల్ని పట్టుకొని వ్రేలాడటం ప్రవక్తకు చాలా బాధ కలిగిస్తుంది. ఆయన మీ మంచినే కోరుతున్నాడు. మానవుల పట్ల శ్రేయోభిలాష మీకు సందేశం, ప్రచారం, బోధనలకు వత్తిడి చేస్తుంది. ఆయన సందేశాన్ని స్వీకరించిన వారి పట్ల ఆయన ఎంతో ఉదారంగా వ్యవహరిస్తాడు. ఈ వాక్యంలో ముహమ్మద్(స) మానవులందరి శ్రేయోభిలాషని, మంచిని కోరేవారని, ప్రత్యేకంగా ముస్లింలపై చాలా దయాళువు అని సాక్ష్యం ఇవ్వబడింది. ఇవన్నీ ఆయన నైతిక ఆచరణకు ఆకాశ సాక్ష్యాధారాలు.

ఇస్లామీయ ఆదేశాలు, ప్రవక్త(స) ద్వారా ఇవ్వబడిన బోధనల మిశ్రమమే ఈ ఖుర్ఆన్. ఆచరణా పరంగా ప్రవక్త(స) జీవిత చరిత్ర ఖుర్ఆన్ కు వ్యాఖ్యానం వంటిది. ఆయనపై అవతరించిన ప్రతి ఆదేశాన్ని ఆయన ఆచరించి చూపారు. విశ్వాసం, ఏకత్వం, నమాజ్, ఉపవాసం, హజ్, జకాత్, దానధర్మాలు, జిహాద్, ఇతరులను ప్రాధాన్యత ఇవ్వడం, త్యాగం, దృఢ నిశ్చయం, నిలకడ, సహనం, కృతజ్ఞత, ఇవేకాక ఇంకా ఎన్నో నేర్పిన విషయాలను ముందు తాను ఆచరించి చూపారు. ప్రవక్త(స) ఖుర్ఆన్ లో ఉన్నదంతా ముందు తాను ఆచరించి చూపారు. కొందరు అనుచరులు ఆయిషహ్(ర) వద్దకు వెళ్ళి ప్రవక్త(స) సద్గుణాల గురించి, దినచర్యల గురించి తెలుపమని కోరారు. సమాధానంగా ఆమె “మీరు ఖుర్ఆన్ చదవలేదా?” అని ప్రశ్నించి, “ఆయన సద్గుణాలు ఖుఆన్” అని అన్నారు. (అబూదావూద్) ఖుర్ఆన్ పదాల్లో వాక్యాల్లో ఉన్నాయి. ముహమ్మద్(స) జీవిత చరిత్ర దాని వివరణ, వ్యాఖ్యానమూను.

ఒక వ్యక్తి సద్గుణాలను గురించి, అలవాట్లను గురించి, దిన చర్యలను గురించి అతడి భార్య కంటె ఎక్కువగా ఇతరులెవ్వరికీ తెలిసి ఉండదు. ప్రవక్త(స) తాను దైవప్రవక్తనని ప్రకటించినప్పటికి ఖదీజాతో పెళ్ళయి 15సంవత్సరాలు అయిపోయింది. ఇది ఎంత పెద్ద కాలం అంటే ఒక వ్యక్తి గురించి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వివరాల ప్రభావం ఏం చేసిందో తెలుసా?ఇటు ప్రవక్త(స) నేను దైవ్రవక్తనని ప్రకటించారు. అటు ఖదీజా హృదయం ధృవీకరించింది. ప్రవక్త(స) దైవదౌత్య భారం వల్ల ఆందోళనకు గురైతే ఖదీజా “ఓ అల్లాహ్ ప్రవక్తా! అల్లాహ్ మిమ్మల్ని ఒంటరిగా వదలడు, ఎందుకంటే తమరు బంధువుల హక్కులను నెరవేర్చుతారు, సత్యాన్ని సమర్ధిస్తారు, కష్టాల్లో ప్రజలకు సహాయం చేస్తారు” అని ఓదార్చేవారు.(బుఖారీ) ఆలోచించండి! దైవదౌత్యానికి ముందు ఆయనలో ఉండే క్రియాత్మక గుణాలు ఇవి.

ప్రవక్త(స) భార్యలందరిలో ఖదీజా తర్వాత ప్రవక్త(స)కు అందరికంటే ప్రియమైనది ఆయిషహ్(ర). ఆయిషహ్(ర) 9సంవత్సరాల వరకు ప్రవక్త(స)కు తోడుగా ఉన్నారు, స్వయంగా ఆమె “ప్రవక్త(స) ఎవరినీ చీవాట్లు పెట్టేవారు కారని, చెడుకు బదులు చెడు చేసేవారు కారని, పైగా క్షమించేవారని, ఎల్లప్పుడూ పాపాలకు దూరంగా ఉండేవారని, ఏనాడూ ఎవరితోనూ ప్రతీకారం తీర్చు కోలేదని, ఆయన ఎవరినీ, సేవకుడ్నిగాని, సేవకురాలినిగాని, చివరికి జంతువునైనా ఏనాడూ కొట్టలేదని, అంతేకాదు, ఎవరి ధర్మసమ్మతమైన విన్నపాన్నైనా సరే ఏనాడూ తిరస్కరించలేదని” సాక్ష్యం ఇస్తున్నారు.

బంధువుల్లో ప్రవక్త(స) గురించి అలీకి బాగా తెలిసి ఉండేది. బాల్యం నుండి యవ్వనం వరకు ఆయన సేవలో ఉన్నారు. ఆయన ఇలా సాక్ష్యం ఇస్తున్నారు, “ఆయన ముఖంపై చిరునవ్వు ఉండేది. సున్నిత మనస్తత్వం, మంచిగుణాలు కలిగి ఉండేవారు. దయామయులు, కఠోర మనస్కులు కారు, నోటి ద్వారా చెడు పలికేవారు కారు. ప్రజల లోపాలను బలహీనతలను వెదికేవారు కారు. ఎవరైనా ఏదైనా తన మనస్తత్వానికి వ్యతిరేకంగా అంటే మౌనం వహించేవారు. సూటిగా సమధానం ఇచ్చి నిరాశకు గురిచేయరు. ఎవరి హృదయాన్నీ కష్టపెట్టేవారు కారు. బాధకు గురిచేసేవారు కారు, ఎందుకంటే ఆయన కరుణామయులు, దయాశీలురు”.

ఇంకా అలీ(ర) ఇలా అంటున్నారు, “ప్రవక్త(స) విశాల హృదయులు, సూటిగా మాట్లాడేవారు, సున్నిత మనస్కులు, ప్రజలు ఆయన వద్ద కూర్చుంటే సంతోషించేవారు, ప్రవక్త(స)ను మొదటిసారి చూచిన వ్యక్తి భయానికి గురౌతాడు, కాని తరువాత మాటామంచీ పెరిగిన కొద్దీ ఆయన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు”. (షమాయిల్ తిర్మిజి)

ప్రవక్త(స) జీవిత చరిత్ర చదివి సరిగ్గా ఇటువంటి అభిప్రాయమే ప్రఖ్యాత చరిత్రకారుడు వెలుబుచ్చాడు. ఆయన సవతి కొడుకు హిన్ద్ ప్రవక్త పరిరక్షణలో ఉండేవాడు. ప్రవక్త(స) గురించి “ఆయన సున్నిత స్వభావం గలవారని, కఠోర మనస్కులు కారని, ఎవరి మనస్సును నొప్పించేవారు కారని, ఎవరినీ అగౌరవ పరిచేవారు కారని, భోజనం ఎలాంటిదైనా తినేవారని, లోపాలు ఎంచేవారు కారని, ఆయనకు తన వ్యక్తిగత కార్యాల్లో ఎంతమాత్రం కోపం వచ్చేది కాదని, ప్రతీకారం తీర్చుకునేవారు కారని, ఒకవేళ ఎవరైనా సత్యాన్ని వ్యతిరేకిస్తే కోపం వచ్చేదని సాక్ష్యం ఇచ్చారు”.

ఆయనకు చాలా దగ్గరగా ఉండే, ఆయన గురించి బాగా తెలిసినవారి సాక్ష్యాలు. దీనివల్ల ఆయన జీవిత చరిత్రలోని ఆచరణా స్ధానం ఎటువంటిదో తెలిసిపోతుంది. ఆయన తన అనుచరులకు బోధించిన దానిని అందరికంటే ముందు తాను స్వయంగా ఆచరించి చూపారు.

ప్రవక్త(స) ప్రజలకు దేవున్ని గుర్తుచేయాలని, ప్రేమించాలని హితబోధ చేసారు. ఈ బోధనలవల్ల అనుచరుల జీవితంలో చాలా మార్పు వచ్చింది. స్వయంగా ప్రవక్త(స) జీవితం దానికి అనుగుణంగా ఉండేదని ఆలోచిస్తే ప్రవక్త(స) ఎల్లప్పుడూ దైవాన్ని ప్రార్ధించేవారు, గుర్తు చేసుకునే వారు, తింటూ త్రాగుతూ, కూర్చుంటూ లేస్తూ, అన్నివేళలా, ఎల్లప్పుడూ, అల్లాహ్ ను స్తుతించే వారు, కీర్తించేవారు. ఈనాడు చాలా గ్రంధాలు వీటి గురించే ఉన్నాయి. వివిధ కాలాల్లో, వివిధ సందర్భాల్లో పఠించే అనేక దుఆలు ఉన్నాయి. హిస్నె హసీన్ అనే పుస్తకం ఈ దుఆలతోనే కూడుకొని ఉంది. ప్రతి దుఆలో దేవుని ప్రేమ, గొప్పతనం, ఠీవి, ఆధిక్యత, దైవభీతి ఉట్టిపడుతూ ఉంటాయి. ప్రవక్త(స) నోటిపై ఎల్లప్పుడూ దేవుని గొప్పతనమే ఉండేది. ఖుర్ఆన్ లో అల్లాహ్(త) తనను ప్రార్ధించే వారిని ఇలా ప్రశంసించడం జరిగింది.

الَّذِينَ يَذْكُرُونَ اللهَ قِيمًا وَ قُعُودًا وَ عَلى جُنُوبِهِمْ .(آل عمران-191)

నిల్చున్నా కూర్చున్నా ఇంకా ప్రక్కలపై ఎల్లప్పుడూ అల్లాహ్ ను ప్రార్ధిస్తూ ఉంటారు.(ఆలిఇమ్రాన్-191)

ఇదే ప్రవక్త(స) జీవితం. ప్రవక్త(స) ఎల్లప్పుడూ దైవధ్యానంలో నిమగ్నమయి ఉండేవారని ఆయిషహ్ (ర) సాక్ష్యం ఇస్తున్నారు. ప్రవక్త(స) ప్రజలకు నమాజు గురించి ఆదేశించేవారు, ఈ విషయంలో ఆయన పరిస్ధితి ఎలా ఉండేదో తెలుసా? ఆయన 8 వేళల నమాజు అంటే 5 పూటలు, సూర్యోదయం తరువాత, ఇష్రాఖ్, మరికొంత ప్రొద్దెక్కిన తర్వాత చాష్త్, రాత్రి తహజ్జుద్ చదివేవారు. ముస్లింలపై రోజుకు 17 రకాతులు విధిగా చేయబడ్డాయి. కాని ప్రవక్త(స) 50 లేక 60 రకాతులు చదివేవారు. 5పూటలు నమాజులు విధించబడిన తర్వాత ముస్లింలకు తహజ్జుద్ నమాజు రద్దు చేయబడింది. కాని ప్రవక్త(స) జీవితాంతం తహజ్జుద్ నమాజులు ఆచరించేవారు. అంతేకాదు రాత్రంతా నమాజులో నిలబడేవారు. దానివల్ల ఆయన కాళ్ళు వాచిపోయేవి. ఆయిషహ్(ర) ప్రవక్త(స)తో “అల్లాహ్(త) మిమ్మల్ని పూర్తిగా క్షమించి వేసాడు, అయినా తమరు ఈ విధంగా కష్టపడుతున్నారని” అడగ్గా, “ఓ ఆయిషహ్! నేను దేవుని కృతజ్ఞుడైన దాసునిగా కాకూడదా?” అంటే అది దైవప్రేమ వల్ల అని తెలిపారు. రుకూ ఎంత దీర్ఘంగా చేసేవారంటే, చూచేవారు ప్రవక్త(స) సజ్దా చేయడం మరచిపోయారు అని అనుకునేవారు.

దైవదౌత్య ప్రారంభం నుండే ప్రవక్త(స) నమాజు చదివేవారు. అవిశ్వాసులు ఆయనకు బధ్ధ శత్రువులైనా, హరమ్ లోనికి వెళ్ళి నమాజు చేసేవారు. అనేకసార్లు ప్రవక్త(స) నమాజు స్ధితిలో ఉండగా శత్రువులు దాడి చేసారు. అయినా మానలేదు. శాంతిభద్రతల్లోనూ, కష్టసమయాల్లోనూ, యుధ్ధ సమయాల్లోనూ నమాజు వదిలేవారు కారు. ఖందఖ్ యుధ్ధం సందర్భంగా రాత్రంతా నడిచి అందరూ పడుకున్నారు. ఈ రెండు సందర్భాల్లోనే నమాజు తప్పింది. కాని వెంటనే ఆచరించారు. మరణానికి ముందు విషజ్వరంతో ఉన్నారు, చాలా బాధగా ఉండేది. అయినప్పటికీ ఇద్దరు అనుచరుల సహాయంతో మస్జిద్ లోనికి వచ్చారు. మరణానికి మూడు రోజులు ముందు లేవటానికి ప్రయత్నించారు, కాని వెంటనే స్పృహతప్పి పడిపోయారు. ఇలా మూడుసార్లు జరిగింది. అప్పుడు కూడా సామూహిక నమాజు తప్పింది. ప్రవక్త(స) యొక్క దైవారాధనలో ఆచరణా ఆదర్శం ఇలా ఉండేది.

ప్రవక్త(స) ఉపవాసాల గురించి ఆదేశించారు. ముస్లిములపై రమజాన్ మాస ఉపవాసాలు విధించ బడ్డాయి. మరి ప్రవక్త(స) పరిస్ధితి ఎలా ఉండేదో గమనిద్దాం, ప్రతివారం, ప్రతి నెల ఉపవాసాలు పాటించేవారు. ప్రవక్త(స) ఉపవాసాలు ప్రారంభిస్తే ఇక వరుసగా ఉపవాసాలు ఉంటారేమో అని అనిపించేది. ఉంటే ఏదైనా తినేవారు, లేదా ఉపవాసం ఉండేవారు. అనుచరులు ఆయన్ను అనుసరించదలిస్తే, నాలా మీలో ఎవరున్నారు, నాకు నా ప్రభువు తినిపిస్తాడు, త్రాపిస్తాడు అనేవారు. సంవత్సరంలో రెండు నెలలు షాబాన్, రమజాన్ ఉపవాసాల్లో గడిచేవి. ప్రతినెలలో 13,14, 15 తేదీలు, ముహర్రమ్ 10 రోజులు, షవ్వాల్ 6 రోజులు, వారానికి 2 రోజులు సోమవారం, గురువారం ఉపవాసం ఉండేవారు. ఉపవాసాల విషయంలో ప్రవక్త(స) ఆచరణా చిత్రం ఇది.

ప్రవక్త(స) జకాత్ దానధర్మాల గురించి ఆదేశించారు. ముందు తాను ఆచరించి చూపారు. ఖదీజా సాక్ష్యం మీరు వినే ఉన్నారు. ఆమె ఇలా అన్నారు, “ఓ అల్లాహ్ ప్రవక్తా! తమరు రుణగ్రస్తుల రుణాన్ని చెల్లిస్తారు, పేదవారికి, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తారు”. ప్రవక్త(స) ప్రజలకు మీరు అన్నీ వదలి నా వెంట రండని చెప్పలేదు. కేవలం మీ సంపాదనలో కొంత దైవమార్గంలో ఖర్చు చేయండని మాత్రమే హితబోధ చేసారు. తాను స్వయంగా వచ్చినదంతా దైవమార్గంలో ఖర్చు చేసేవారు. యుధ్దాలవల్ల, విజయాలవల్ల ధనానికి లోటు ఉండేదికాదు. అంతా ప్రజల కొరకు ఉండేది. తన కోసం ఏదీ ఉండేదికాదు. తన ఇంట్లో ఆకలి దప్పులు ఉండేవి. ఖైబర్ విజయం 7వ హిజ్రీ తర్వాత ప్రవక్త(స) భార్యలందరికీ సంవత్సరానికి కావలసిన ధాన్యం పంచడం జరిగేది. కాని సంవత్సరం పూర్తి కాకుండానే ధాన్యం అయిపోయేవి. పస్తులు ప్రారంభం అయ్యేవి. ధాన్యంలోని అధిక భాగాన్ని పేదలకు పంచి పెట్టడం జరిగేది. ఇబ్నె అబ్బాస్(ర) ప్రకారం ప్రవక్త(స) అందరికంటే అధికంగా దానగుణం కలిగి ఉండేవారు. రమజాన్ లో అధికంగా దానం చేసేవారు. జీవితంలో ఏనాడూ లేదు, కాదు అని అనలేదు. ఏ వస్తువునూ ఒంటరిగా తినేవారు కారు. తినే వస్తువు ఎంత తక్కువగా ఉన్నా ఇతరులను కలుపు కునేవారు. ప్రజల్లో ఎవరైనా రుణం ఇవ్వకుండా చనిపోతే నాకు తెలియపరచాలని, నేను అతని రుణం చెల్లిస్తానని, ఒకవేళ అతడు ఆస్తి వదలి ఉంటే అతని వారసులకు చెందుతుందని ప్రజలకు ఆదేశించేవారు. ఒకసారి ఒక వ్యక్తి వచ్చి, “ఓ ముహమ్మద్!  ఈ సరుకు నీది కాదు, నీ తండ్రిది కాదు, దాన్ని నా ఒంటెపై ఎక్కించు” అని అన్నాడు. ఆ సరుకును ప్రవక్త(స) అతని ఒంటెపై ఎక్కించారు. అతడి మాటలకు ఏమాత్రం అపార్ధం చేసుకోలేదు. ఇంకా నేను కేవలం పంచేవాడిని, ధనాధికారి, ఇచ్చేవాడు ఆ దేవుడే అని అనేవారు. అబూజర్ ఇలా అంటున్నారు, “ఒకసారి నేను ప్రవక్క(స)తో పాటు ఒక మార్గంలో పోతున్నాం. అప్పుడు ప్రవక్త(స) నాతో నావద్ద ఉహుద్ కొండంత బంగారం ఉన్నా అందులో నుండి ఒక్క దీనార్ కూడా నావద్ద ఉండడం ఇష్టంలేదు” అని అన్నారు.

మిత్రులారా! ఇవి ప్రవక్త(స) మనోహరమైన పదాలు కావు, ఇవి ఆయన దృఢ సంకల్పానికి, ప్రవర్తనకు ప్రతీక, ఆయన ఆచరణ కూడా ఇలాగే ఉండేది. ఒకసారి బహ్రైన్ నుండి నిధి వచ్చింది, మస్జిద్ ప్రాంగణంలో వేయబడింది, ఫజ్ర్ నమాజు కొరకు ప్రవక్త(స) వచ్చారు. అక్కడ చూచినవారు ఇలా అంటున్నారు, ఆయన ఆ నిధివైపు కన్నెత్తి కూడా చూడలేదు, నమాజు తర్వాత ఆ నిధివద్ద కూర్చుని, పంచటం ప్రారంభించారు. అంతా అయిపోయిన తర్వాత మట్టి అంటుకున్నట్టు బట్టలు దులుపుకొని నిలబడ్డారు.

ఒకసారి ఫదక్ నుండి నాలుగు ఒంటెలపై ఆహార ధాన్యాలు వచ్చాయి. కొంత అప్పుగా ఇవ్వడం జరిగింది. కొంత ప్రజలకు ఇవ్వబడింది. ప్రవక్త(స) ఏమైనా మిగిలిందా అని బిలాల్ ను అడిగారు. ఇప్పుడు ఇంకా తీసుకోవలసిన వారు ఇంకెవరూ లేరు, అందువల్ల కొంత మిగిలింది అని బిలాల్ అన్నారు. అప్పుడు ప్రవక్త(స), ఈ ప్రాపంచిక సంపద ఉన్నంత వరకు నేను ఇంటికి వెళ్ళను అని పలికి, రాత్రి మస్జిద్ లో గడిపారు. ఉదయం బిలాల్ వచ్చి, “ఓ అల్లాహ్ ప్రవక్తా! అల్లాహ్ మిమ్మల్ని ఈ భారం నుండి తప్పంచాడు, అంటే ఉన్నదంతా పంచబడింది” అని అన్నారు. ప్రవక్త(స) దైవానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఒకసారి అస్ర్ తర్వాత అలవాటుకు వ్యతిరేకంగా ఇంట్లోనికి వెళ్ళి వెంటనే బయటకు వచ్చారు. ప్రజలకు ఆశ్చర్యం కలిగింది, అప్పుడు నా దగ్గర బంగారు ఉంగరం ఉన్నట్టు నాకు నమాజులో గుర్తుకు వచ్చింది, అది నా దగ్గర ఉండగా రాత్రి గడవటం కూడా నాకు ఇష్టం లేదు అని అన్నారు. ఉమ్మె సల్మా ఇలా అంటున్నారు, “ఒకసారి ప్రవక్త(స) విచారంగా లోపలికి వచ్చారు, కారణం అడిగాను. దానికి ఆయన ఉమ్మెసల్మా! నిన్న ఆ 7 దీనార్లు వచ్చాయి, సాయంత్రం అయిపోయింది, అవి అలాగే ఉండటం నాకు ఇష్టంలేదు” అని అన్నారు. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం, ప్రవక్త(స) మరణావస్ధలో ఉన్నారు, జ్వరం చాలా తీవ్రంగా ఉంది, మనస్సు ఆందోళనకరంగా ఉంది. అప్పుడే ఆయనకు ఇంట్లో కొన్ని అష్రఫీలు ఉన్నాయని గుర్తుకు వస్తుంది. వెంటనే వాటిని దానం చేయండని ఆదేశిస్తారు, ముహమ్మద్ ఇంట్లో అష్రఫీలు ఉండగా ఆయన తన దైవాన్ని కలవటం మంచిది కాదు అని అన్నారు. ఇవి ఈ అధ్యాయంలో గల ప్రవక్త(స) ఆచరణా పధానికి చెందిన ఉదాహరణలు.

ప్రవక్త(స) నిరాడంబరత, తృప్తిని గురించి ఉపదేశించారు. అయితే ఈ విషయంలో ఆయన ఆచరణ ఎలా ఉండేదో చూడండి, అన్నీ వైపుల నుండి టాక్స్, పరిహార రుసుము, జకాత్, దానధర్మాల నిధులు వచ్చేవి. కాని మహాప్రవక్త ఇంట్లో అవే పస్తులు, అదే బీదరికం ఉండేవి. ప్రవక్త(స) మరణం తరువాత ఆయిషహ్(ర) ఇలా అనేవారు, ప్రవక్త(స) మరణించారు కాని ఏనాడూ రెండు పూటలు కూడా ఆయన కడుపు నిండా అన్నం తినలేదు. ఆమె మరో ఉల్లేఖనలో ఇలా ఉంది, ప్రవక్త(స) మరణించినపుడు ఇంట్లో ఆ రోజు కొన్ని జొన్నలు మాత్రమే ఉన్నాయి. కొన్ని సేర్ల జొన్నలకు బదులుగా ప్రవక్త(స) యుధ్ధ కవచం ఒక యూదుని వద్ద తాకట్టుగా ఉండేది. ప్రవక్త(స) “ఆదమ్ కుమారునికి ఈ కొన్ని వస్తువులు తప్ప మరిదేని హక్కు లేదు. అవి ఉండటానికి ఒక పూరి గుడిసె, శరీరం కప్పటానికి బట్ట, కడుపు నింపటానికి ఎండురొట్టె, నీరు” అని అన్నారు. (తిర్మిజి)

ఇవి కేవలం మనోహరమైన పలుకులు, పదాలు కావు. ఇదే ఆయన వాస్తవ జీవిత చిత్రం. ఉండటానికి ఇల్లు, ఒక చిన్నగది, అందులో మట్టి గోడలు, ఖర్జూరం ఆకులు, ఒంటె వెంట్రుకలతో పైకప్పు. ఆయిషహ్(ర)  ఆయన బట్టలు ఏనాడూ మడతబెట్టి ఉంచడం జరగలేదు. అంటే ఒంటి మీద ఉన్న బట్ట తప్ప మరే బట్టలు ఉండేవికావు. ఒకసారి ఒక బిచ్చగాడు ప్రవక్త(స) వద్దకు వచ్చి, “నేను చాలా ఆకలిగా ఉన్నాను” అని అన్నాడు. ఏమైనా ఉంటే తినడానికి పంపమని తన భార్యల వద్దకు కబురు పంపారు. అందరి దగ్గర నుండి ఇంట్లో నీరు తప్ప మరేమీ లేదు అనే వార్తలు వచ్చాయి. అబూతల్హా ఇలా అంటున్నారు, “ఒకసారి ప్రవక్త(స)ను చూసాను, మస్జిద్ లో మేనువాల్చి ఉన్నారు. ఆకలి బాధ వల్ల ప్రక్కలు తిరుగుతూ ఉన్నారు”. ఒకసారి అనుచరులు తాము పస్తులుండటాన్ని గురించి విన్నవించుకున్నారు. బట్టలు ఎత్తి కడుపు చూపించారు. వారి కడుపులకు రాళ్ళు కట్టి ఉన్నాయి. ప్రవక్త(స) తన కడుపును చూపించారు. రెండు రాళ్ళు కట్టి ఉన్నాయి. అంటే రెండు రోజుల నుండి పస్తులున్నారు. అనేకసార్లు ఆకలి వల్ల వచ్చే శబ్దం బయడపడేది. స్పృహ కోల్పోయే వారు. ఒకరోజు ఇంటి నుండి ఆకలితో బయలుదేరారు. అబూ అయ్యూబ్ అన్సారీ ఇంటికి వెళ్ళారు, ఆయన తోట నుండి ఖర్జూరం పళ్ళు తెచ్చి ఉన్నారు. తినటానికి భోజనం ఏర్పాటు చేసారు. భోజనం ముందుకు వచ్చింది. ప్రవక్త(స) ఒక రొట్టెపై కొంత మాంసం కూర పెట్టి దీన్ని ఫాతిమాకు పంపించి, “చాలా రోజులయింది, ఆమెకు భోజనభాగ్యం కలగలేదు” అని అన్నారు.

ప్రవక్త(స) తన కుమార్తెను, హసన్ హుసైన్ లను చాలా గాఢంగా ప్రేమించేవారు. కాని ఈ ప్రేమను అరబ్ నాయకుల్లా విలువైన దుస్తుల ద్వారా, బంగారం, వెండి నగల ద్వారా వ్యక్తపరచలేదు. ఒకసారి అలీ(ర) ఇచ్చిన బంగారు హారాన్ని ఫాతిమా మెడలో చూచిన ప్రవక్త(స) ఇలా అన్నారు, “ఫాతిమా! ముహమ్మద్ కూతురి మెడలో అగ్నికంకణం పేనుకొని ఉంది అని ప్రజలు నిన్ను అనాలని కోరుతున్నావా?” అని అన్నారు. వెంటనే ఫాతిమా ఆ బంగారు హారాన్ని తీసి అమ్మి వేసారు. ఆ వచ్చిన ధనంతో ఒక బానిసను కొని విడుదల చేసారు. ఒకసారి ఆయిషహ్(ర) బంగారు కంకణాన్ని ధరిస్తే, తీయించి ముహమ్మద్ భార్యకు ఇది తగదు అని అన్నారు. అంతేకాదు ప్రవక్త(స) మానవునికి ఈ ప్రపంచంలో ఒక ప్రయాణీకునికి కావలసినంత ప్రయాణ ఆహారం చాలు అని అనేవారు. ఇవి ఆయన మాటలు, ఇవే ఆయన చేతలు కూడా. ఒకసారి కొంతమంది అభిమానులు కలవడానికి వచ్చారు. ప్రవక్త(స) ప్రక్కల్లో చాప గుర్తులు చూసారు, “ఓ ప్రవక్తా! మేము ఒక మెత్తని పరుపు తయారుచేసి మీకు కానుకగా ఇద్దాం అనుకుంటున్నాము” అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స) “నాకు ఈ ప్రపంచంతో పనేమిటి? ఒక ప్రయాణీకుడు ప్రయాణంలో కొంతసేపు నీడలో విశ్రాంతి తీసుకున్నట్టే నాకు ఈ ప్రపంచంతో సంబంధం ఉంది” అని అన్నారు. 9వ హిజ్రీలో ఇస్లామ్ సామ్రాజ్యం యమన్ నుండి సిరియా వరకు వ్యాపించి ఉండేది. కాని ఆయన (స)వద్ద శరీరం పై ఒక పైజామా , తాళ్ళతో అల్లిన ఒక మంచం, ఒక చెట్టును వలచి తయారు చేసిన తలగడ, ఒక ప్రక్క కొన్ని జొన్నలు, ఒక మూల జంతువు చర్మం, ఉట్టిలో నీటి కుండలు ఇవే ఆ నోటి మాటలకు అద్దం పట్టు చేతలు.

మిత్రులారా! ఇతరులకు ప్రాధాన్యత నిచ్చే విషయం గురించి గొప్పగొప్ప ప్రసంగాలు వింటూ ఉంటాం. కాని ఇటువంటి బోధకుల జీవిత చరిత్రలో దీని ఉదాహరణలు కనిపిస్తాయా? ఆదర్శంకావాలంటే మదీనా వీధుల్లో దొరుకు తుంది. ప్రవక్త(స) ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వటాన్ని గురించి ఉపదేశించారు. దానికి తోడు ఆచరించి చూపారు. ప్రవక్త(స) ఫాతిమాను ఎంతగా ప్రేమించేవారో అది అందరికీ తెలుసు కాని, ఫాతిమా పిండిమర త్రిప్పుతూ చేతులు వాచిపోయాయి, నీళ్ళు తోడుతూ గుండె నొప్పికి గురయ్యారు. ఒకసారి ఆమె ప్రవక్త(స) వద్దకు వచ్చి ఒక సేవకురాలిని ఇవ్వమని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త(స) “ఫాతిమా! ఇప్పటి వరకు సుఫ్ఫా వాళ్ళకే ఏర్పాటు అవలేదు, నీ దరఖాస్తు ఎలా స్వీకరించగలను?” మరో ఉల్లేఖనలో “ఫాతిమా! బద్ర్ అనాధలు నీ కంటే ముందు దరఖాస్తు ఇచ్చి ఉన్నారు” అని అన్నారు. ఒకసారి ప్రవక్త(స) దుప్పటి లేదు, ఒక స్త్రీ దుప్పటి తెచ్చి ఇచ్చారు. అదే సమయంలో ఒక వ్యక్తి ఈ దుప్పటి ఎంత బాగుంది అని అన్నాడు. ప్రవక్త(స) వెంటనే ఆ దుప్పటి తీసి అతనికి ఇచ్చి వేసారు.

ఒక అనుచరుడి ఇంట్లో శుభకార్యం జరగనున్నది, కాని ఆయన వద్ద ఏమీ లేదు. అప్పుడు ప్రవక్త(స) ఆయనతో ఆయిషహ్ వద్దకు వెళ్ళి “పిండి బుట్ట తీసుకురా” అన్నారు. ఆవ్యక్తి వెళ్ళి తీసుకొని వచ్చారు. కాని ప్రవక్త(స) ఇంట్లో రాత్రి తినటానికి ఆ పిండి తప్ప మరేమీ లేదు. ఒకసారి సుఫ్ఫా పేదలను తీసుకొని ఆయిషహ్(ర) ఇంటికి వచ్చారు. “తినడానికి ఏదైనా ఉంటే ఇవ్వండి” అన్నారు, నూకల అన్నం ముందుంచబడింది. అది చాలలేదు, “ఇంకేమైనా ఉందా” అని అడిగారు, ఎండు ఖర్జూరం పాయసం ఇవ్వబడింది. ఆ తరువాత పాలు వచ్చాయి, ఉన్న వీటినే అతిధులకు ఇవ్వడం జరిగింది. ఇదీ ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వటం, దాని ఆచరణ.

అల్లాహ్ పై నమ్మకానికి ప్రత్యక్ష ఉపమానం చూడాలని ఉంటే ముహమ్మద్(స)ను చూడండి, అల్లాహ్ ఆదేశం,ఆత్మస్ధైర్యం గల ప్రవక్తలు సహనం, నిలకడ పాటించినట్లు నీవూ సహనం పాటించు. ప్రవక్త (స) అలాగే చేసి చూపించారు. తమ నమ్మకాలకు వ్యతిరేకంగా ఒక్క పదం కూడా వినజాలని జాతిలో ప్రవక్త(స) జన్మించారు. అంతేకాదు ఈ జాతివారు ప్రతి చిన్న విషయంపై చంపడానికి, చావడానికి సిధ్ధపడేవారు. కాని ప్రవక్త(స) ఏమాత్రం భయ పడకుండా హరమ్ లోనికి వెళ్ళి ఏకత్వ సందేశాన్ని ఎలుగెత్తి చాటేవారు. అంతేకాదు అక్కడ అందరి ముందు నమాజు ఆచరించేవారు. హరమ్ లో ఖురైష్ నాయకులు వచ్చి కూర్చునేవారు. ప్రవక్త(స) వారి ముందు నిలబడి రుకూలు, సజ్దాలు చేసేవారు. “ఓ ముహమ్మద్! నిన్ను ఆదేశించినదాన్ని ప్రకటించు” అనే వాక్యం అవతరించినపుడు ప్రవక్త(స) సఫా కొండపై నిలబడి ఖురైష్ ప్రజలందరినీ ఎలుగెత్తి పిలిచి దైవసందేశాన్ని అందజేసారు.

ఖురైష్ ప్రజలు ప్రవక్త(స)ను అనేక విధాలుగా హింసించారు. శరీరంపై మాలిన్యాన్ని వేసేవారు. మెడలో దుప్పట్లు వేసి లాగేవారు. మార్గంలో ముళ్ళు పరిచేవారు. కాని ప్రవక్త(స) ముందడుగు చెక్కు చెదర లేదు. అబూతాలిబ్ తన సమర్ధాన్ని వాపసు తీసుకున్నప్పుడు ఆవేశం మరియు ఉత్సాహంతో “చిన్నాన్నగారూ! ఒకవేళ ఖురైష్ నా కుడిచేతిలో సూర్యున్ని, ఎడమ చేతిలో చంద్రున్ని పెట్టినా నేను ఈ విధి నిర్వహణ నుండి వెనుతిరగనని” సమాధానం ఇచ్చారు. చివరకు ప్రవక్త(స), బనూ హాషిమ్ షేబ అబీ తాలీబ్ లోయలో 3 సంవత్సరాల వరకు సాంఘిక బహిష్కరణకు గురవయ్యారు. ఖురైషులు ప్రవక్త(స), ఆయన కుటుంబం వారితో సంబంధాలను త్రెంచుకున్నారు. ఆహార ధాన్యాలు లోపలికి రాకుండా అవరోధం కల్పించారు. పిల్లలు ఆకలితో అలమటించేవారు. యువకులు ఆకులు తిని జీవితం గడిపేవారు, చివరికి ప్రవక్త(స) హత్యకు కుట్ర పన్నారు. ఇన్ని జరిగినా ప్రవక్త(స) సహనాన్ని, నిలకడను, ఏకాగ్రతను వదల్లేదు. వలస పోయినపుడు సౌర్ గుహలో దాక్కున్నారు, అవిశ్వాసులు వెంబడించారు, గుహద్వారం వరకు చేరుకున్నారు. వారికి వీరికీ కొన్ని గజాల దూరం మాత్రమే ఉంది, అబూబకర్(ర) ఆందోళన చెందారు, అప్పుడు ప్రవక్త(స) “ఆందోళన చెందవద్దు, మనతో పాటు అల్లాహ్ ఉన్నాడు” అని అన్నారు. ఈ సందర్భంగా సురాఖా బిన్ జూషమ్ చేతిలో బళ్ళెం తీసుకొని గుర్రంపై వీరిని వెంబడిస్తూ వారిని సమీపిస్తాడు. అప్పుడు అబూబకర్(ర) “ఓ ప్రవక్తా! మనం పట్టుబడ్డాం” అని అంటారు. కాని ఆ సమయంలో ప్రవక్త(స) ఖుర్ఆన్ పఠిస్తూ ఎంతో ప్రశాంతంగా ఉంటారు.

మదీనా చేరిన తర్వాత యూదులు, కపటాకారులు, ఖురైష్ ప్రజల వైపు నుండి భయం ఉండేది. అనుచరులు ప్రవక్త(స) ఇంటి బయట కాపలా కాసేవారు. ఒకసారి అల్లాహ్ ప్రజల నుండి నిన్ను కాపాడుతాడుఅనే వాక్యం అవతరించింది. వెంటనే బయటకు తొంగి చూచి కాపలా కాస్తున్నవారితో, “ప్రజలారా తిరిగి వెళ్ళిపోండి, నన్ను వదలివేయండి, నా రక్షణా బాధ్యతలు అల్లాహ్ తీసుకున్నాడు” అని అన్నారు.

నజ్ద్ యుధ్ధం నుండి తిరుగు ప్రయాణంలో ప్రవక్త(స) ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నారు. అనుచరులు అటూ ఇటూ కొంత దూరంలో ఉన్నారు. ఒక వ్యక్తి కరవాలం పట్టుకొని ముందుకు వచ్చాడు. ప్రవక్త(స) కూడా మేల్కొన్నారు. ఆ వ్యక్తి “ఓ ముహమ్మద్ ! నిన్ను నా నుండి ఎవరు రక్షిస్తారు!” అని అన్నాడు. ప్రశాంతంగా, నిదానంగా “అల్లాహ్” అని అన్నారు. ఆ వ్యక్తి ప్రభావితుడై అతడి కరవాలం ఒర లోనికి వెళ్ళిపోయింది.

బద్ర్ సంగ్రామంలో 313మంది ముస్లిములు సాయుధులై 1000మంది అవిశ్వాసులను ఎదుర్కొన్నారు. 313మంది అనుచరుల నాయకుడు అల్లాహ్ సన్నిధిలో చేతులెత్తి ప్రార్ధిస్తున్నారు. అనేక విధాలుగా అల్లాహ్ ను ఇలా శరణు కోరుతున్నారు. “ఓ అల్లాహ్! ఈనాడు ఈ చిన్న సమూహం భూమి నుండి చెరిపి వేయబడితే, ఆ తరువాత నిన్ను ప్రార్ధించే వారెవరూ భూమిపై ఉండరు”.

ముస్లింల అడుగులు తడబడే సందర్భాలు కూడా వచ్చాయి. ముస్లిములు వెనక్కి తగ్గారు. కాని అల్లాహ్ సహాయంపై పరిపూర్ణ నమ్మకం కలిగి ఉన్న ముస్లిములు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా నిలబడ్డారు. ఉహుద్ లో చాలా మంది ముస్లింలు వెనక్కి తగ్గారు, కాని ప్రవక్త(స) తన స్ధానంలో నిలకడగా ఉన్నారు. రాళ్ళు తిన్నారు, బాణాల, కరవాలాల, బళ్ళాల దాడులు జరుగు తున్నాయి. తలలో ఇనుప గొళుసు గుచ్చుకుంది, పళ్ళు విరిగాయి, ముఖానికి గాయాలయ్యాయి. అప్పుడు కూడా తన చేతిని కరవాలంపై పెట్టలేదు, ఎందుకంటే, ఆయన(స) అల్లాహ్ నే నమ్ముకున్నారు. అల్లాహ్ రక్షిస్తాడని, సహాయం చేస్తాడని ఆయనకు గట్టి నమ్మకం ఉండేది. హునైన్ యుధ్ధంలో ఒకసారి పదివేల బాణాల వర్షం కురిసినపుడు కొంతసేపటి వరకు ముస్లిములు వెనక్కి తగ్గారు. కాని ప్రవక్త(స) తన స్ధానంలోనే ఉన్నారు. ఇటు నుండి బాణాల వర్షం కురుస్తుంది, అటు “నేను ప్రవక్తను, అసత్యం పలుకను, నేను అబ్దుల్ ముత్తలిబ్ కుమారున్ని” అని నినాదం చేస్తున్నారు. వాహనం పై నుండి క్రిందికి దిగారు. నేను దైవదాసున్ని, ప్రవక్తను అని అన్న తరువాత చేతులు పైకి ఎత్తి దుఆ చేసారు.

మిత్రులారా! మీరు ఇంతటి వీరుడైన ఏకాగ్రత గల, నిలకడ గల, సైన్యం ఎంత చిన్నదైనా, ఆయుధాలు లేకపోయినా, తన సైన్యం అతన్ని వదలి కొంత దూరం వెనక్కి తగ్గినా, తనను తాను కాపాడుకోవడం కోసం పారిపోని తనను రక్షించు కోవటానికి కరవాలం ఎత్తని సైన్యాధిపతిని ఎక్కడైనా చూసారా? అటువంటి కష్టసమయంలో కూడా భూశక్తులకు భయపడకుండా ఆకాశ శక్తులు కావాలని కోరు తున్నాడు. ఈ విషయంలో ఆయన ఆచరణా పధం ఇలా ఉండేది.

శత్రువులను కూడా ప్రేమించే కధలను వినే ఉంటారు. కాని దాని ఉదాహరణగాని, ఉపమానంగాని చూసి ఉండరు. రండి మదీనా మనిషిలో మీకు ఇవన్నీ చూపిస్తాను. మక్కా పరిస్ధితులను వదలి వేస్తున్నాను, ఎందుకంటే అక్కడ మానవత్వమే ఉండేదికాదు. వలస పోయినపుడు ఖురైషుల నాయకులు, ముహమ్మద్(స) తల నరికి తెచ్చిన వారికి 100 ఒంటెలు బహుమానంగా ఇవ్వటం జరుగుతుంది అని ప్రకటించారు. సురాఖా బిన్ జూషుమ్ ఈ బహుమానం పొందే ఉద్దేశంతో ఆయుధాలు ధరించి ప్రవక్త(స)ను వెంబడించాడు. దగ్గరకు చేరుకుంటాడు, అబూబకర్(ర) ఆందోళనకు గురవుతారు. ప్రవక్త (స) అల్లాహ్ ను ప్రార్ధిస్తారు, మూడుసార్లు వాడి గుర్రం కాళ్ళు భూమిలో దిగబడి పోతాయి. సురాఖా బాణాలు తీసి లాటరీ వేస్తాడు. ప్రతిసారి వారిని వెంబడించకు అనే సమాధానం వస్తుంది. చివరికి అతను భయపడతాడు. తిరిగి వెళ్ళిపోదామని నిశ్చయించుకుంటాడు. ప్రవక్త(స) అతడిని పిలుస్తాడు. ప్రవక్త(స)కు ఖురైషులపై అల్లాహ్(త) ఆధిక్యత ప్రసాదించినపుడు నన్ను విచారించకూడదని శరణుపత్రం వ్రాయించి తీసుకుంటాడు. మక్కా విజయం తర్వాత అతడు ఇస్లామ్ స్వీకరిస్తాడు. కాని ఆనాటి సంఘటన గురించి ఏమాత్రం విచారించరు.

అబూసుఫియాన్ ఎవరో మీకు తెలుసా? ఇతడే బద్ర్, ఉహుద్, కందకం మొదలైన యుధ్ధాలలో ప్రధానపాత్ర వహించాడు. అనేకమంది ముస్లిములను హతమార్చాడు. అనేకసార్లు ప్రవక్త(స)ను చంపటానికి ప్రయత్నించాడు. అడుగడుగునా ఇస్లామ్ మార్గంలో అవరోధాలు కల్పిస్తూ బధ్ధశత్రువులా తయారయ్యాడు. కాని మక్కా విజయానికి ముందు అబ్బాస్(ర) వెంట ప్రవక్త(స) ముందుకు వచ్చాడు. అప్పుడు అతడి ప్రతి నేరం అతన్ని చంపమని సలహా ఇచ్చింది, కాని ప్రవక్త(స) యొక్క క్షమాగుణం అబూసుఫియాన్ తో ఇలా అంటుంది, “భయపడకు, ముహమ్మద్(స) ప్రతీకారం తీర్చుకోరు. ఆ తరువాత ప్రవక్త(స) అతన్ని క్షమిస్తారు. అంతేకాదు, అబూసుఫియాన్ ఇంట్లో దాక్కున్న వారికి కూడా అభయం ఇవ్వబడుతుంది” అని అన్నారు.

హింద ఎవరో తెలుసా? ఈమె అబూసుఫియాన్ భార్య, ఉహుద్ యుధ్ధంలో తన చెలికత్తెలతో కలసి ఆడుతూ పాడుతూ ఖురైషీ సైనికులను ఉత్తేజపరిచేది. ప్రవక్త(స)కు అందరికంటే ప్రియమైన చిన్నాన్నను, ఇస్లామ్ హీరో అయిన హమ్జా శవం పట్ల నీచంగా, అగౌరవంగా ప్రవర్తించింది. ఆయన గుండెను చీల్చింది, ముక్కు, చెవులను కోసి మెడలో వేసుకుంది. గుండెకాయ తీసి నమిలే ప్రయత్నం చేసింది. యుధ్ధం తరువాత ఆ దృశ్యాన్ని చూచి ప్రవక్త(స) చాలా ఆందోళనకు గురయ్యారు. మక్కా విజయంనాడు ముసుగు ధరించి ఆ స్త్రీ ముందుకు వస్తుంది. అక్కడ కూడా ఊరుకోలేదు. కాని ప్రవక్త(స) ఏ విధమైన అభ్యంతరాన్నీ వెలుబుచ్చలేదు. నీవలా ఎందుకు చేసావని కూడా అడగలేదు. ఈ క్షమాగుణానికి ఆమె ప్రభావితురాలై బిగ్గరగా “ఓ ముహమ్మద్ ఇంతకు ముందు నీ వంటే అందరి కన్నా అసహ్యం అనిపించేది, కాని ఈనాడు అందరి కంటే అధికంగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను” అని పలికింది.

హమ్జా హంతకుడు వహ్షీ తాయిఫ్ విజయం తరువాత అక్కడి నుండి పారిపోతాడు, అతడున్న ప్రదేశం కూడా జయించ బడుతుంది. అతడికి తలదాచుకునే చోటు మరెక్కడా లభించదు. అప్పుడు ప్రజలు “వహ్షీ! నీకు ఇంకా ముహమ్మద్ సంగతి తెలియదు, నీకోసం ముహమ్మద్(స) ప్రదేశం కంటే ప్రశాంత మయిన ప్రదేశం మరెక్కడా లేదు” అని అన్నారు. వహ్షీ ముహమ్మద్(స) వద్దకు వెళతాడు. ప్రవక్త(స) అతన్ని చూస్తారు, దృష్టి క్రిందికి వాల్చుకుంటారు. ప్రియచిన్నాన్న మరణదృశ్యం కళ్ళ ముందు కనబడుతుంది. కళ్ళు ఆశ్రువులతో నిండిపోతాయి, హంతకుడు కూడా ముందు ఉన్నాడు. కాని “వహ్షీ వెళ్ళు నా ముందుకు రాకు, చిన్నాన్న మరణ దృశ్యం గుర్తుకొస్తుంది” అని మాత్రమే అన్నారు.

ఇస్లామ్, ముస్లిములకు, ప్రవక్త(స)కు బధ్ధ శత్రువు ఇక్రమ, అబూజహల్ కుమారుడు. ఇతడు ప్రవక్త (స)ను అందరికంటే అధికంగా హింసించాడు. బాధలకు గురిచేసాడు. ఇస్లామ్ కు వ్యతిరేకంగా యుధ్ధాలు కూడా చేసాడు. మక్కా విజయం నాడు అతనికి తన, తన కుటుంబంవారి నేరాలన్నీ గుర్తు న్నాయి. అతను పారిపోయి యమన్ వెళ్ళిపోయాడు. ఆయన భార్య ఇస్లామ్ స్వీకరించారు. ప్రవక్త (స)ను గుర్తు పట్టింది. స్వయంగా ఆమె యమన్ వెళ్ళింది. ఆయన్ను ఓదార్చింది. ఆయన్ను తీసుకొని మదీనా వచ్చింది. ఈ విషయం ప్రవక్త(స)కు తెలిసిన వెంటనే ఆయన్ను ఆహ్వానించడానికి ఎంత తొందరగా లేస్తారంటే ఆయన ఒంటిపై దుప్పటి కూడా ఉండదు. సంతోషం పట్టలేక “ముహాజిర్ ప్రయాణికుడా! నీ రాక నీకు శుభమగుగాక” అని అంటారు, ఆలోచించండి! స్వాగతం ఎవరికి పలకబడుతుంది? ఎవరి రాకవల్ల సంతోషం కలుగుతుంది? ఎవరిని క్షమించడం జరుగుతుంది? అతని తండ్రి మక్కాలో ప్రవక్త(స)ను అనేక విధాలుగా హింసించాడు. శరీరంపై మాలిన్యాన్ని వేసాడు. నమాజు స్ధితిలో దాడి చేసాడు. మెడలో దుప్పటి వేసి లాగాడు. దారున్నద్వహ్ లో ప్రవక్త(స) హత్యకోసం కుట్ర పన్నాడు. బద్ర్ యుధ్ధానికి కారకుడూ ఆయనే. ఒప్పందాలను భంగపరిచిందీ ఆయనే. ఈనాడు ఆయన రాకపట్ల ఇంత సంతోషం వ్యక్తం చేయటం సాధ్యమా?

హిబార్ బిన్ అల్ అస్వద్ ఒక విధంగా ప్రవక్త(స) కుమార్తె జైనబ్ హంతకుడు. అంతేకాదు ఎన్నో ఇస్లామ్ వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడ్డాడు. మక్కా విజయం వార్త విని అతని రక్తం ఉడికిపోతుంది. ఈరాన్ పారిపోదామని అనుకుంటాడు, కాని ఏదో ఆలోచించి ప్రవక్త(స) వద్దకు వెళతాడు. “ఓ ప్రవక్తా! నేను పారిపోయి ఈరాన్ వెళ్ళిపోదామని అనుకున్నాను. కాని నాకు ప్రవక్త క్షమాగుణం, దయ, జాలి గుర్తుకొచ్చాయి. వెంటనే నేను ఇక్కడికి వచ్చేసాను. నా నేరాల గురించి అందిన వార్తలన్నీ నిజమైనవే” అని  విన్నవించుకుంటాడు. అది విన్న వెంటనే ప్రవక్త(స) కారుణ్య ద్వారాలు తెరుచుకుంటాయి. శత్రువు స్నేహితుడు అనే తేడా మాయం అవుతుంది.

బద్ర్ యుధ్ధం తరువాత ఉమైర్ బిన్ వహబ్ ఒక అవిశ్వాస ధనవంతుని కుట్రవల్ల తన ఖడ్గానికి విషం పూసి మదీనా వస్తాడు. అవకాశం దొరికితే ప్రవక్త(స) పని పూర్తి చేద్దామని వేచి ఉంటాడు. కాని పట్టు బడతాడు. ప్రవక్త(స) వద్దకు తీసుకువస్తారు, నేరం తేలిపోతుంది కాని అతన్ని విడుదల చేయడం జరుగుతుంది.

సఫ్వాన్ బిన్ ఉమయ్యహ్ ప్రవక్త(స)ను చంపమని ఉమైర్ ను పంపిన ధనవంతుడు. అంతేకాదు ఒకవేళ ఈ పనిలో ప్రాణాలు కోల్పోతే నీ భార్యాబిడ్డలకు, నీ అప్పుకు నేను బాధ్యుడిని అని వాగ్దానం చేసాడు. మక్కా విజయం తరువాత భయపడి సముద్ర మార్గాన యమన్ పారిపోదామని జిద్దా ఓడరేవుకు పారి పోతాడు. ఉమైర్ ప్రవక్త(స) వద్దకు వచ్చి “ఓ ప్రవక్తా! సఫ్వాన్ మా నాయకుడు భయపడి పారి పోయాడు” అని విన్నవించుకుంటాడు. దానికి ప్రవక్త(స) “అభయం ఇచ్చాను” అని అంటారు. అప్పుడు ఉమైర్ అభయం ఇచ్చినట్టు ఏదైనా సూచన ఇస్తే బాగుంటుందని విన్నవించుకుంటాడు. ప్రవక్త(స) తన పగిడి తీసి ఇస్తారు. ఉమైర్ అది తీసుకొని వాడి దగ్గరకు వెళతాడు. అప్పుడు సఫ్వాన్ నాకు ముహమ్మద్ దగ్గరకు వెళ్ళడంలో ప్రాణభయం ఉందని అంటాడు. దానికి ఉమైర్ “ఓ సఫ్వాన్! ఇంకా నీకు ముహమ్మద్(స) దయాగుణం, జాలి, క్షమాగుణం గురించి తెలియదా” అని అంటాడు. సఫ్వాన్ ప్రవక్త(స) సన్నిధిలో హాజరౌతాడు. “నాకు అభయం ఇచ్చారని విన్నాను, నిజమా” అని అంటాడు. “అవును” అని ప్రవక్త(స) అంటారు. “నేను మీ ధర్మాన్నిస్వీకరించను, నాకు రెండు నెలలు గడువు కావాలి” అని అన్నాడు. దానికి ప్రవక్త(స) “నీకు రెండు కాదు నాలుగు నెలలు గడువు ఇవ్వబడుతుంది” అని అన్నారు. కాని ఆ ఇచ్చిన గడువు పూర్తి కాక ముందే ఇస్లామ్ స్వీకరించాడు.

ప్రవక్త(స) ఖైబర్ వెళతారు. అక్కడ యూదుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. పోరాటాలు జరుగుతాయి. విజయం సాధిస్తారు. ఒక యూద స్త్రీ విందుకు ఆహ్వానిస్తుంది, ప్రవక్త(స) ఆమె విందును స్వీకరిస్తారు. ఆ యాద స్త్రీ మాంసంలో విషం కలుపుతుంది, ప్రవక్త(స) మాంసపు ముక్క నోట్లో పెట్టగానే ఆయనకు దాన్ని గురించి తెలుస్తుంది, యూద స్త్రీని పిలిచి అడగ్గా ఆమె తన తప్పు ఒప్పుకుంటుంది. కాని ఆమె ఎటువంటి శిక్షకు గురిచేయబడదు. అయతే ఆ విష ప్రభావం జీవితాంతం ఉంటుంది.

నజ్ద్ పోరాటం నుండి తిరుగు ప్రయాణంలో ప్రవక్త(స) ఒంటరిగా ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసు కుంటున్నారు, అది మధ్యాహ్న సమయం, ప్రవక్త(స) కరవాలం చెట్టుకు వ్రేలాడుతుంది, అనుచరులు అటూ ఇటూ పడుకొని ఉన్నారు. దగ్గరలో ఎవరూ లేరు. ఒక వ్యక్తి అవకాశం చూచి ప్రవక్త(స) వద్దకు వచ్చి, కరవాలాన్ని తీసుకొని ఒర నుండి బయటకు తీస్తాడు, ప్రవక్త(స) వెంటనే మేల్కొంటారు, ఆ వ్యక్తి కరవాలం త్రిప్పుతూ “ముహమ్మద్ ! ఇప్పుడు నా నుండి నిన్ను ఎవరు రక్షిస్తారు?” అని అంటాడు. ప్రవక్త(స) నిర్భయంగా, ప్రశాంతంగా “అల్లాహ్” అని అంటారు. ఆ సమాధానం విన్నవెంటనే భయపడి పోతాడు, కరవాలాన్ని ఒరలోనికి తీసుకుంటాడు. అనుచరులు చుట్టూ చేరుతారు. ఆ వ్యక్తి కూర్చుండి పోతాడు. ప్రవక్త(స) ఏమాత్రం విచారించరు.

ఒకసారి ఒక అవిశ్వాసిని తీసుకురావడం జరుగుతుంది. ప్రవక్తను చంపే ప్రయత్నంలో ఉన్నాడని అతనిపై ఆరోపణ. అతడు ప్రవక్త(స)ను చూచి భయపడతాడు. ప్రవక్త(స) అతన్ని ఓదార్చుతారు. ఆ తరువాత అతనితో “ఒకవేళ నువ్వు చంపాలనుకున్నా చంపలేవు” అని అన్నారు. మక్కా పోరాటంలో ఈ వ్యక్తుల గుంపు బంధించబడింది. వీరు తన్ యీమ్ కొండ నుండి దిగి ప్రవక్త(స) ను చంపాలను కున్నారు. ప్రవక్త(స)కు ఈ విషయం తెలిసింది. వీరిని వదలి వేయండని ఆదేశించారు.

సోదరులారా! మీరు తాయిఫ్ కు వెళతారు, మక్కా కాలంలో ప్రవక్త(స)కు శరణు ఇవ్వనివారు వీరే, అసలు వీరు వినటానికే సిధ్ధపడలేదు. ఇక్కడ ధనవంతుల కుటుంబాలు ప్రవక్త(స)ను ఎగతాళి చేసారు. ప్రవక్త పట్ల హాస్యంగా ప్రవర్తించమని ఇతరులను పురికొలిపారు. పట్టణంలోని అల్లరి మూకలన్నీ అన్ని వైపుల నుండి ప్రవక్త(స)పై రాళ్ళు రువ్వాయి. చివరికు కాళ్ళకు విపరీతంగా గాయాలయ్యాయి. రెండు కాళ్ళ చెప్పులు రక్తసిక్తం అయ్యాయి. ప్రవక్త(స) అలసిపోయి కూర్చుండి పోతే వీరు భుజాలు పట్టి లేపుతారు. నడవసాగితే మళ్ళీ రాళ్ళు రువ్వుతారు. ఈ రోజు ప్రవక్త(స)కు ఎంతో బాధ కలిగింది, 9సంవత్సరాల తర్వాత ఆయిషహ్(ర) ప్రవక్త(స)ను “అన్నిటి కంటే కఠిన దినం?” ఏది అని ప్రశ్నించగా “తాయిఫ్ దినం” అని సమాధానం ఇచ్చారు. 8హిజ్రీలో ముస్లిమ్ సైన్యాలు ఈ తాయిఫ్ నే చుటుముట్టాయి. కొంతకాలం వరకు ముట్టడి కొనసాగింది. అనేకమంది మస్లింలు చంపబడ్డారు. తిరిగి పోదామని ప్రవక్త(స) నిర్ణయించుకుంటారు. కాని ముస్లింలు సిధ్ధపడరు, తాయిఫ్ ప్రజలను శపించమని విన్నవించుకుంటారు. ప్రవక్త(స) చేతులు ఎత్తుతారు. కాని ఏమని ప్రార్ధిస్తారో చూడండి, “ఓ అల్లాహ్! తాయిఫ్ ప్రజలకు రుజుమార్గాన్ని ప్రసాదించు, వారిని ఇస్లామ్ లోనికి ప్రవేశింపజేయి”. సోదరులారా! ఎవరి గురించి ఇలా ప్రార్ధించారు, ప్రవక్త(స) పై రాళ్ళు రువ్వి గాయపరచిన, శరణు ఇవ్వనివారి గురించి.

ఉహుద్ పోరాటంలో శత్రువులు దాడి చేస్తారు. ముస్లిముల పాదాలు తడబడతాయి. ప్రవక్త(స) శత్రువుల కక్ష్యలో ఉంటారు. ప్రవక్త(స)పై రాళ్ళు, బాణాలు, కరవాలాలు విరుచుకు పడుతున్నాయి. ప్రవక్త(స) పళ్ళు విరిగాయి. తన రక్షణా సాధనాలే తన తలకు గుచ్చుకుంటాయి. ముఖమంతా రక్తసిక్తమౌతుంది. ఈ పరిస్ధితిలో కూడా ఆయన నోటి నుండి ఈ పదాలే వస్తున్నాయి. “తమ ప్రవక్తనే చంపే ప్రయత్నం చేస్తున్న ఆ జాతి ఎలా సాఫల్యం పొందుతుంది. ఓ అల్లాహ్! నా జాతికి మార్గదర్శ కత్వాన్ని ప్రసాదించు, దానికి ఏమీ తెలియదు. నీ శత్రువును ప్రేమించు” అనే ఈసా(అ) ఆచరణ కేవలం కవిత్వం కాదు కఠినమైన ఆచరణా పధం.

వహీ బిన్ ఈద్యాలీల్ కుటుంబం తాయిఫ్ లో ప్రవక్త(స)ను అనేక విధాలుగా హింసిస్తారు, ఇతడే ఒక బృందాన్ని తీసుకొని మదీనా విచ్చేసినపుడు తన పవిత్ర మస్జిద్ లో టెంట్ వేసి విడిది ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు ఇషా నమాజు తర్వాత అతన్ని కలవటానికి వెళ్ళి వ్యధాభరితమైన మక్కా జీవితాన్ని గురించి చెప్పేవారు. ఎవరిని? తనపై రాళ్ళు విసిరిన వారిని, అవమాన పరిచిన వారిని, ఇదీ నీ శత్రువును ప్రేమించు, క్షమించు అంటే అర్ధం.

మక్కా విజయం తర్వాత హరమ్ ప్రాంగణంలో, ఏ ప్రాంగణంలో, ఎక్కడైతే తనకు తిట్టటం జరిగిందో, ఎక్కడైతే చెత్తా చెదారం వేయబడిందో, ఎక్కడైతే తనను చంపటానికి కుట్ర పన్నడం జరిగిందో, అక్కడ మక్కా నాయకులందరూ నిలబడి ఉన్నారు. వారిలో ఇస్లామ్ కు వ్యతిరేకంగా శక్తివంచన లేకుండా ప్రయత్నించినవారూ ఉన్నారు, ప్రవక్త(స)ను తిరస్కరించినవారూ ఉన్నారు, తనను తిట్టినవారూ ఉన్నారు, తన మార్గంలో ముళ్ళు పరిచేవారూ ఉన్నారు, అన్యాయంగా బంధువులను హతమార్చిన వారూ ఉన్నారు, పేదలను హింసించినవారూ ఉన్నారు, ఈనాడు ఈ నేరస్తులందరూ తలలు దించు కొని నిలబడి ఉన్నారు, అనుచరుల కరవాలాలు ప్రవక్త(స) ఆదేశానికి, ఆజ్ఞ పూర్తయ్యే లోపలే తలలు నరకడానికి వేచి ఉన్నాయి. అకస్మాత్తుగా ప్రవక్త(స) నోరు కదులుతుంది, “ఖురైష్ ప్రజలారా! మీరే చెప్పండి, ఈనాడు మీ పట్ల ఎలా ప్రవర్తించాలి?” సమాధానం వస్తుంది, “ముహమ్మద్ నీవు మా మంచి సోదరుడవు, మంచి అన్న కొడుకువు”. అప్పుడు ప్రవక్త(స) ఇలా అంటున్నారు, “యూసుఫ్(అ) హింసలకు పాల్పడిన తన సోదరులతో చెప్పిన విధంగా నేనూ ఈనాడు మీతో చెబుతున్నాను, ఈనాడు మీపై ఎలాంటి ఆరోపణ లేదు, వెళ్ళండి మీరందరూ స్వతంత్రులు”.

శత్రువులను ప్రేమించడమంటే, క్షమించడమంటే ఇదే. ఇస్లామ్ ప్రవక్త యొక్క ఆచరణా పధం, అభ్యాస శిక్షణ. ఇది కేవలం తియ్యటి మాటల వరకే, ఉత్సాహ భరితమైన ప్రసంగాల వరకే పరిమితం కాదు, ప్రపంచంలో సంఘటనగా ఆచరణగా ఉద్భవించింది.

ఇతర ధర్మాలవారు తమ ప్రవక్తల వ్యవస్ధాపకుల సుమధుర, మనోహర పదాలవైపు పిలుస్తూ ఉంటారు. మాటిమాటికీ వాటిని వల్లిస్తూ ఉంటారు. ఎందుకంటే అవి తప్ప వారివద్ద మరేమీ లేదు. కాని ఇస్లామ్ తన ప్రవక్త యొక్క పదాల గురించే కాదు, ఆచరణ, సాంప్రదాయాల గురించి కూడా సందేశం ఇస్తుంది. ముహమ్మద్(స) ఈ లోకం నుండి పరమ పదించి నపుడు ఇలా ఉపదేశించారు,

تَرَكْتُ فِيكُمْ الثِّقَلَيْنِ كِتَابَ اللهِ وَ سُنَّتِي.(مسلم)
నేను మీ మధ్య రెండు ప్రధాన విషయాలను వదలి వెళ్తున్నాను,  దైవగ్రంధం, నా ఆచరణా పధం.(ముస్లిమ్)

ఈ రెండు ప్రధాన విషయాలు ఇప్పటి వరకు స్ధిరంగా ఉన్నాయి. ఇన్షాఅల్లాహ్ తీర్పుదినం వరకు స్ధిరంగా ఉంటాయి. అందువల్లే ఇస్లామ్ దైవ గ్రంధంతో పాటు తన ప్రవక్త సాంప్రదాయానికి కూడా విధేయత చూపమని ఆదేశిస్తుంది.  

لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولُ اللهِ اُسْوَةٌ حَسَنَةٌ .( الأحزاب-21)
మీకోసం అల్లాహ్ ప్రవక్త జీవితంలో అత్యుత్తమమైన ఆదర్శం ఉంది.(అల్అహ్జాబ్-21)

స్వయంగా ఇస్లామ్ తన ప్రవక్తను దైవగ్రంధ ఆచరణా రూపంగా, ఆదర్శంగా, మోడల్ గా ప్రదర్శిస్తుంది. ప్రపంచంలో ఈ గౌరవం కేవలం ఇస్లామ్ ప్రవక్తకే ఉంది. ఎందుకంటే ఆయన విద్యాభ్యాసంతో పాటు ఆచరణా విధానాన్ని కూడా ముందుంచుతుంది. నమాజ్ పధ్ధతి తెలియని వారికి “నన్ను నమాజ్ చేస్తూ ఉండగా చూసినట్టు మీరూ నమజ్ ఆచరించండి” అని బోధించారు. భార్యాబిఢ్ఢల పట్ల మంచిగా వ్యవహరించాలని ఈ విధంగా బోధిస్తారు, “భార్యాబిడ్డల పట్ల మంచిగా వ్యవహరించిన వారే మీలో అందరి కన్నా ఉత్తములు. నేను నా భార్యాబిడ్డల కొరకు మీ అందరికంటే మంచివాడను”. చివరి హజ్ సందర్భం, అంతిమ ప్రవక్త చుట్టూ లక్షకు పైగా అనుచరులు. మానవులకు దైవం తరపున చివరి సందేశం ఇలా అంద జేయబడుతుంది. “అరబ్ లోని మూఢనమ్మకాలు, మూఢాచారాలు, అంతం కాని పోరాటాల పరంపరను ఈనాడు రద్దు చేయడం జరిగింది. విద్యాజ్ఞానాలతో పాటు తన ఆచరణా విధానాన్ని చూపెట్టటం జరిగింది.

ఈనాడు అరబ్ లోని ప్రతీకార రక్తపాతం అంతా రద్దు చేయడం జరిగింది. అంటే మీరందరూ పరస్పర హంతకులను క్షమించండి. అందరికంటే ముందు నేను నా కుటుంబానికి చెందిన రబీఅ బిన్ హారిస్ కుమారుని హత్యను క్షమిస్తున్నాను. అజ్ఞానకాలం నాటి వడ్డీ లావాదేవీలన్నిటినీ ఈనాడు నేను రద్దు చేస్తున్నాను. అన్నిటికంటే ముందు నేను మా చిన్నాన్న అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ వడ్డీ వ్యాపారాన్ని రద్దు చేస్తున్నాను”.

ధనప్రాణాల తర్వాత మూఢాచారాలను పాటించేవారు కూడా ప్రజల మానమర్యాదలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తారు. ఇటువంటి వాటిని రద్దు చేసే ధైర్యం చూపితే తమ్ముతాము రద్దు చేసుకో వలసి వస్తుంది. ఎంత ప్రజానాయకులైనా సమాజంలో ఉన్న మూఢాచారాలను సంస్కరించే ధైర్యం చాలా తక్కువ మంది చేస్తారు.

ముహమ్మద్(స) ప్రజలకు సమానత్వం గురించి బోధించారు. అరబ్ లో అందరికంటే నీచులుగా బానిసలు భావించబడేవారు. ప్రవక్త(స) సమానత్వం, సోదరభావం మొదలైన భావాలను ఆచరించి చూపారు. ఒక బానిసను దత్తపుత్రునిగా చేసుకున్నారు. అరబ్ వర్గాల్లో పరస్పర మంచితనంలోని హెచ్చుతగ్గులను కూడా దృష్టిలో పెట్టుకోవటం జరిగేది. యుధ్ధాల్లో కూడా తనకన్నా తక్కువ స్ధాయికి చెందిన వ్యక్తిపై కరవాలం ఎత్తడం కూడా అవమానంగా భావించేవారు, నీచరక్తం నా కరవాలానికి అంట కూడదని. కాని ప్రవక్త(స) ఇలా ప్రకటించినపుడు, “ప్రజలారా! మీరంతా ఆదమ్ కుమారులు, ఆదమ్ మట్టి ద్వారా సృష్టించబడ్డారు. నల్లవారికి తెల్లవారిపై, తెల్లవారికి నల్లవారిపై, అరబీకి అజమీపై, అజమీకి అరబీపై ఎటువంటి ప్రాధాన్యత లేదు. మీలో అందరికంటే అధికంగా దైవభీతి గలవారే మీలో అందరికంటే ఉత్తములు”. ఈ బోధనలు అకస్మాత్తుగా అందరినీ సమానంగా చేసివేసాయి. అయితే ఉపమానాల కొరత ఉండేది. ఆ ఉపమానాలను కూడా ఆయనే ఆచరించి చూపారు. ఆ బానిసను తన అత్తకూతురికిచ్చి వివాహం చేసారు. దత్తపుత్రుని నుండి విడాకులు పొందిన స్త్రీతో వివాహం అరబ్ లో నిషిధ్ధంగా ఉండేది. అంతేకాదు కేవలం పదాల సంబంధం ఉండేది. దీనికి ఆచరణలతో ఎటువంటి సంబంధం ఉండేదికాదు. దీనివల్ల కుటుంబాల్లో చెడులు వ్యాపించి ఉండేవి. వాటిని అరికట్టడం తప్పని సరి అయ్యింది. కాని వాటిని అరికట్టేందుకు ఆచరణ కావాలి. ఇది మానవుని ఆత్మాభిమానంతో సంబంధం కలిగి ఉంది. ఇది చాలా కష్టమైన పని, ప్రవక్త(స) అడుగు ముందుకు వేసి దాన్ని ఆచరించి చూపారు. జైద్ బిన్ హారిసా నుండి విడాకులు పొందిన జైనబ్ ను వివాహం చేసుకున్నారు. ఆనాటి నుండి ఈ మూఢాచారం అరబ్ నుండి అదృశ్యమయిపోయింది. సంఘటనల కొరత లేదు. ఉపమానాల కొదువ లేదు.  కాని సమయం చాలా తక్కువగా ఉంది. ఈనాడు నేను చాలా సమయం తీసుకున్నా ననుకుంటాను.

సోదరులారా! నేను చెప్పిన విషయాల వెలుగులో ఆదమ్ నుండి ఈసా వరకు, సిరియా నుండి ఇండియా వరకు ఉన్న సంస్కర్తల జీవిత చరిత్రల్లో ఇటువంటి ఆదేశాల, ఆచరణల ఉపమానాలు ఎక్కడైనా కనిపిస్తాయా? వెతకండి.

సభికులారా! మధురమైన, మనోహరమైన పలుకులు పలికే బోధకులు, కవులు తమ సభల్లో దైవ ప్రేమను గురించి పేర్కొనడం, అనవసరమైన ప్రగల్భాలు పలకడం, వినిపించడం చేస్తారు. వీరి నానుడి ఆధారంగానే చెట్టు తన పళ్ళ ద్వారా గుర్తించబడుతుంది. వీరి జీవితాల్లో దైవ ప్రేమ ప్రభావం ఉండేదా? అరబ్బుల దైవప్రేమకు సంబంధించిన చరిత్రలు చదవండి. రాత్రులు గడుస్తాయి. ప్రపంచమంతా నిద్రపోతుంది, అతని కళ్ళు జాగరణ చేస్తున్నాయి, చేతులు దైవం ముందు చాచి ఉన్నాయి. నోరు దైవాన్ని కీర్తిస్తుంది. హృదయం విలవిలలాడుతుంది. కళ్ళంట ఆశ్రువులు కారుతున్నాయి. దైవ ప్రేమకు నిదర్శనం ఇదా లేక అదా? .

ఈసా(అ) శిలువ పై ఎక్కించబడినపుడు “ఓ దేవా! ఓ దేవా! నీవు నన్ను ఎందుకు విడిచి పోయావు?” అని అన్నారు. కాని ముహమ్మద్(స) మరణావస్ధలో ఉన్నప్పుడు చివరి శ్వాస పీల్చుకుంటూ “ఓ నా ప్రభూ! నా ఉత్తమ మిత్రుడా” అని అన్నారు. ఈ రెంటిలో దేనిలో దైవప్రేమ కనబడుతుంది.

7. ప్రవక్త ముహమ్మద్(స) యొక్క సందేశం.

ప్రేక్షకులారా! వెనుకటి ప్రసంగాల్లో చారిత్రక సాక్ష్యాధారాల వెలుగులో మానవుల్లో కేవలం దైవప్రవక్తల చరిత్రలే విధేయతకు, ఆదర్శానికి తగినవని వివరించాను. వాటిలో కూడా విశ్వంలో శాశ్వత ఆదర్శం కేవలం ప్రవక్త ముహమ్మద్(స) దేనని స్పష్టపరిచాను. ప్రవక్త ముహమ్మద్(స) మాత్రమే విశ్వంలో శాశ్వత ఆదర్శం కాగలరని అంటే ఆయన బోధనలేమిటనే ప్రశ్న తలెత్తుతుంది. ఆయన ప్రపంచానికి ఏ సందేశం ఇచ్చారు? దేన్ని గురించి సందేశం ఇచ్చారు? ఏ విషయాల సందేశం ఇవ్వటానికి ఆయన ను పంపడం జరిగింది? ప్రపంచంలో అంతకు ముందు వచ్చిన ప్రవక్తల బోధనలను ఆయన ఎలా సంస్కరించారు? ఎలా పరిపూర్ణం చేసారు?.

ప్రపంచంలో సమయానుసారం ప్రవక్తల ద్వారా సందేశాలు వస్తూఉన్నాయి. అవన్నీ ఒక ప్రత్యేక ప్రాంతానికి, ప్రత్యేక కాలానికి పరిమితమై ఉండేవి. వాటిని శాశ్వతంగా భద్రపరిచే ఏర్పాటు చేయబడ లేదు. చాలా కాలం తర్వాత అవన్నీ సంకలనం చేయబడ్డాయి. వాటిలో మార్పులు చేర్పులు జరిగాయి. వాటి అర్ధాలు మార్చివేయబడ్డాయి. వాటి చారిత్రక సాక్ష్యాలు లేవు. ఇదంతా కొన్ని వందల సంవత్సరాల్లో చేయబడింది. అల్లాహ్(త) వాటన్నిటినీ తాత్కాలిక సందేశాలుగా పంపాడు. కాని ప్రవక్త (స) ద్వారా అల్లాహ్ విశ్వవ్యాప్త, శాశ్వత సందేశాన్ని అందజేసాడు. అందువల్లే అది అన్నివిధాలా సురక్షితంగా ఉంది. ఉంటుంది కూడా. ఎందుకంటే దీని తర్వాత మరే సందేశమూ వచ్చే అవకశం లేదు. అల్లాహ్(త) వెనుకటి సందేశాల్లోని దేనినీ, ఇది పరిపూర్ణం చేయబడిందని, దీని రక్షణా బాధ్యతలు నావి అని అనలేదు. ప్రపంచంలోని ప్రాచీన గ్రంధాలు, ధర్మాలు అదృశ్యమయ్యాయి. వాటి అదృశ్యమవడమే అవి ఒక సమయానికి ఒక ప్రాంతానికి పరిమితం అనడానికి సాక్ష్యం. ఇప్పుడున్న వాటిలో ఒక్కొక్క దాన్ని వెదకండి. వాటి పరిపూర్ణత, రక్షణా బాధ్యతల గురించి ఒక్క పదం కూడా కనబడదు. పైగా వాటిలో ఎన్నో కల్పిత విషయాలు, మార్పులు చేర్పులు కనబడతాయి.

మూసా(అ) ఇలా అంటున్నారు, “మీ ప్రభువు మీ మధ్య మీ సోదరుల్లో నుండే నాలాంటి ఒక ప్రవక్త (స)ను ఉద్భవిస్తాడు. మీరు ఆయనను చెవియొగ్గి వినుడు”.(ఇస్తిస్నా 15-18), “నేను వారికోసం వారి సోదరుల్లో నుండే నీలాంటి ఒక ప్రవక్తను ఉద్భవింపజేస్తాను. నా పలుకును అతని నోట్లో వేస్తాను. నేనతనికి ఆదేశించిన దాన్ని అతడు వారికి తెలుపుతాడు”. (ఇస్తిస్నా 14-18). ఇది మూసా తాను మరణించడానికి ముందు బనీఇస్రాయీల్ తో చెప్పిన విషయం. ఇంకా ఇలా అన్నాడు, “దేవా సీనా నుండి వచ్చాడు, నయీర్ నుండి ఉదయించాడు, ఫారాన్ కొండల నుండి వచ్చాడు, అతని కుడి చేతిలో ఒక షరీఅత్తు ఉంది”.(ఇస్తిస్నా 20-23)

పైన పేర్కొన్న తౌరాతు వాక్యాలు మూసా లాంటి మరో ప్రవక్త రానున్నాడని, తనతోపాటు ఒక జీవన విధానాన్ని కూడా తీసుకువస్తున్నాడని, ఆయన నోటిలో దేవుడు తన ఆదేశాలు వేస్తాడని తెలుపు తున్నాయి. అంటే మూసా(అ) దైవదౌత్యం, సందేశం శాశ్వతమైనవి కావని స్పష్టమవుతుంది.

ఆ తరువాత అష్యియా ప్రవక్త వస్తున్నారని శుభవార్త తెలుపుతారు. జోకస్ షరీఅత్తు, తీరప్రాంత దేశాలు, దీవుల వరకే ఉండేది. (40వ భాగం) మలాఖియలో ఇలా ఉంది, “చూడండి, నేను నా ప్రవక్త ను పంపుతాను”, బనీఇస్రాయీల్ కు చెందిన గ్రంధాల గురించి జబూర్ లో రానున్నవారి శుభవార్తలు ఉన్నాయి. దీనివల్ల ఇస్రాయీల్ కు చెందిన ఏ గ్రంధమూ శాశ్వతమైనది, పరిపూర్ణమైనది కాదు. ఇంజీల్ ను చూడండి, అది ఇలా ప్రకటిస్తుంది.

“నేను నా తండ్రిని ఆయన మీకు మరో ప్రవక్తను ప్రసాదించమని ఎల్లప్పుడూ మీతోనే ఉండాలని అభ్యర్ధిస్తాను. (యూహన్నా 14-16) కాని ఆ ప్రవక్త రూహుల్ ఖుదుస్ ఆయన్ను తండ్రి నా పేరుతో పంపుతాడు, అతడే మీకు అన్ని విషయాలు నేర్పుతాడు, నేను మీకు నేర్పిన వాటిని కూడా మీకు గుర్తుచేస్తాడు”. (యూహన్నా-14-26)

ఇంకా చాలా విషయాలు మీకు చెప్పవలసినవి ఉన్నాయి. కాని మీరు ఇప్పుడు వాటిని భరించలేరు. కాని అతడు అంటే సత్యాత్మ వచ్చి మీకు సత్య మర్గాన్ని గురించి అంతా వివరిస్తుంది. ఎందుకంటే అతడు విన్నదంతా మీకు చెప్తాడు.(యూహన్నా-6-8) 

ఈ వాక్యాల్లో ఇంజీలు స్పష్టంగా తాను చివరి దైవగ్రంధం కాదని, పరిపూర్ణం కూడా కాదని, మరో ప్రవక్త వస్తాడని, ఈసా సందేశాన్ని పరిపూర్ణం చేస్తాడని, ముహమ్మద్ సందేశం తర్వాత మరో సందేశం రానున్నదని తెలుపలేదు. ముహమ్మద్ సందేశంలో లోపం లేదని, ఆయన సందేశం  పరిపూర్ణ మైనదని స్పష్టపరచింది.

اَلْيَوْمَ اَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَ اَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي .(المائدة-3)

నేను ఈనాడు మీకోసం మీ ధర్మాన్ని పరిపూర్ణం చేసాను, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేసాను.(అల్ మాయిదహ్-3)

ముహమ్మద్ అంతిమ ప్రవక్త, అంటే ప్రవక్తల పరంపరను పూర్తిచేసేవాడు. ఖుర్ఆన్ దీన్ని గురించి సాక్ష్యం ఇస్తూ, నా ద్వారా ప్రవక్తల పరంపరను పూర్తి చేయడం జరిగిందని పేర్కొంది. ఒక హదీసులో ఇలా ఉంది, గుర్తుంచుకోండి, నా తరువాత ప్రవక్తలెవరూ రారు. అనేక హదీసుల్లో ఇలా ఉంది, నేను దైవదౌత్య భవనంలోని చివరి ఇటుకను, ఖుర్ఆన్ మరో ప్రవక్త వచ్చే ఎటువంటి అవకాశాన్నీ ఇవ్వ లేదు. కనుక ప్రవక్త ముహమ్మద్ చివరి ప్రవక్త అని, శాశ్వత ప్రవక్త అని తేలిపోయింది. అల్లాహ్ (త) తన వాగ్దానాన్ని పేర్కొంటూ దాని రక్షణా బాధ్యతలు కూడా తీసుకున్నాడు.

మిత్రులారా! ముహమ్మద్ ప్రవక్త సందేశం కాకుండా మరే సందేశమైనా విశ్వవ్యాప్త శాశ్వత సందేశంగా వచ్చిందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. బనీఇస్రాయీల్ వద్ద కేవలం బనీఇస్రాయీల్ అని ఉంది. దైవం కేవలం బనీఇస్రాయీల్ దైవం, అందువల్లే  దైవసందేశాన్ని అందజేయలేదు. ఈనాటి వరకు యూదుల ధర్మం మూసా ధర్మం బనీఇస్రాయీల్ వరకే పరిమితమై ఉంది. ప్రాచీన గ్రంధాలన్నిటిలో కేవలం బనీ ఇస్రాయీల్ నే సంబోధించడం జరిగింది. వారిని వారి కుటుంబ దైవం వైపే మల్లించడం జరిగింది. ఈసా (అ) కూడా తన సందేశాన్ని బనీఇస్రాయీల్ నుండి తప్పిపోయిన వారి వరకే పరిమితం చేసారు. ఇతరులకు తన సందేశం వినిపించి పిల్లల రొట్టె కుక్కలకు వేయడంగా భావించారు. భారతదేశానికి చెందిన వేదాలు కూడా ఇతరుల వరకు చేరలేదు. వారు తప్ప ఇతరులందరినీ వారు క్షూద్రులుగా భావిస్తారు. అంతేకాదు వేదాల గురించి క్షూద్రుల చెవిలో పడితే , వారి చెవిలో సీసం కరిగించి పోయాలి అనేది వారి భావన.

ముహమ్మద్ సందేశం ప్రపంచంలో దైవం తరపున మొదటి మరియు చివరి సందేశం. ఇది నల్లవారు, తెల్లవారు, అరబ్బులు , ఇతరులు, ప్రపంచ మానవులందరి కొరకు అవతరించబడింది. దైవం ఎలాగైతే ప్రపంచానికి దైవమో, ప్రవక్త కూడా ప్రపంచమంతటికీ ప్రవక్త. ఆయన ప్రపంచ మంతటికీ కారుణ్యం, ఆయన సందేశం ప్రపంచమంతటికీ సందేశం.

إِنْ هُوَ اِلَّا ذِكْرى لِلْعالَمِيْنَ .(الأنعام-90)

ఇది ప్రపంచమంతటికీ హితబోధ వంటిది.(అల్అన్ఆమ్-90)

تَبرَكَ الَّذِى نَزّلَ الفُرْقَانَ عَلَى عَبْدِهِ لِيَكُونَ لِلْعَالَمِيْنَ نَذِيرًا, اَلَّذِى لَهُ مُلْكُ السَّمَوَاتِ وَ الأَرْضِ. (الفرقان-1)

ఎనలేని శుభాలు గలవాడు, గీటురాయిని తన దాసునిపై అవతరింపజేసాడు. సకల విశ్వవాసులకు హెచ్చరిక చేసేదిగా ఉండేటందుకు. ఆయన భూమ్యాకాశాల సామ్రాజ్యానికి ప్రభువు.(అల్ ఫుర్ఖాన్-1)

ప్రవక్త(స) ప్రపంచానికంతటికీ హెచ్చరించేవాడుగా వచ్చారు. సూరహ్ ఆరాఫ్ లో ఇలా ఉంది,

قُلْ يآاَيُّهَا النَّاسُ إنِّى رَسُولُ اللهِ إِلَيكُمْ جَمِيعًا, اَلَّذِى لَهُ مُلْكُ السَّموتِ وَالأَرْضِ.(الأعراف-158)

ఓ మానవులారా! నేను మీ అందరి వైపునకు వచ్చిన అల్లాహ్ సందేశహరున్ని, ఆయన భూమ్యాకాశాల సామ్రాజ్యానికి ప్రభువు.(అల్ఆరాఫ్-158)

చూడండి ఇందులో ముహమ్మద్(స) సందేశ వైశాల్యం విశ్వమంతా వ్యాపించి ఉందని పేర్కొనడం జరిగింది. అందరూ ఆయన పరిధిలో ఉన్నవారే.

وَاُوْحِىَ اِلَىّ هذَا القُرْآنُ لأُنْذِرَكُمْ بِهِ وَ مَنْ بَلَغَ.(الأنعام-19)

ఈ ఖుర్ఆన్ నావైపు దైవవాణి ద్వారా పంపబడింది, మిమ్మల్నీ మరియు ఇది చేరిన వారికి హెచ్చరించటానికి.(అల్అన్ఆమ్-19)

وَمَا اَرْسَلْنكَ إِلَّا كفَّةً لِلنَّاسِ بَشِيرًا وَنَذِيرًا. (سبا-28)

మేము నిన్ను మానవులందరి వైపు శుభవార్త ఇచ్చేవానిగా, హెచ్చరించేవానిగా పంపాము.(సబా-28)

ధర్మాలన్నిటిలో కేవలం ఇస్లామ్ మాత్రమే శాశ్వతమైన అంతిమ, పరిపూర్ణ, విశ్వవ్యాప్తమైన ధర్మమని ఈ రిఫరెన్సుల ద్వారా నిరూపించబడింది.

సహీ ముస్లిమ్ లోని ఒక ఉల్లేఖనలో ప్రవక్త(స) ఇలా ప్రవచించారు, “నా కంటే ముందు ప్రవక్తలందరూ తమతమ జాతుల వైపు పంపబడ్డారు. కాని నేను ప్రపంచ జాతులన్నిటి వైపు పంపబడ్డాను”. ఇది మా వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. అదేవిధంగా చారిత్రక ఆచరణా సాక్ష్యం మమ్మల్ని సమర్ధిస్తుంది. అసలు విషయం ఏమిటంటే ముహమ్మద్ సందేశం కూడా పరిపూర్ణమనది, శాశ్వతమైనది, విశ్వవ్యాప్తమైనది. అంటే సందేశాన్ని తెచ్చినవాడూ పరిపూర్ణుడే. సందేశం విశ్వవ్యాప్తమైనది, శాశ్వత మైనదీను.

ఇప్పుడు ఈ పరిపూర్ణ, శాశ్వత, విశ్వవ్యాప్తమైన ప్రవక్త యొక్క చిట్టచివరి శాశ్వతమైన, విశ్వవ్యాప్తమైన సందేశం ఏమిటి అనేప్రశ్న తలెత్తుతుంది. ఆయన ధర్మాలన్నిటినీ కలిపి శాశ్వత దైవ ధర్మాన్ని పరిపూర్ణం చేసాడు. అల్లాహ్(త) అనుగ్రహాన్ని పూర్తి చేసాడు.

ప్రతీ మతంలో రెండు భాగాలుంటాయి. ఒకటి మానవుని హృదయంతో, మరొకటి మానవుని శరీరం, ధనంతో సంబంధం ఉంటుంది. మొదటిది విశ్వాసంతో, రెండవది ఆచరణతో సంబంధం ఉంటుంది. ఆచరణ మూడు విధాలుగా ఉంటుంది. 1) దైవానికి సంబంధించినది, దీన్ని ఆరాధన అంటారు. 2) మానవుని పరస్పర లావాదేవీలకు సంబంధించినవి, వీటిని వ్యవహారాలు అంటారు. వీటి అధిక భాగం చట్టాలలో ఉంది. 3) మానవుని పరస్పర సంబంధాలను నెరవేర్చాలి. వీటిని ఉత్తమ గుణాలు అంటారు. విశ్వాసాలు, ఆరాధనలు, వ్యవహారాలు, సంబంధాలు, ఇవన్నీ ధర్మంలోని విధులే, ఈ నాలుగు ముహమ్మద్ సందేశం ద్వారా పరిపూర్ణతకు చేరాయి.

తౌరాతు మరియు ఇంజీలులో విశ్వాసాల భాగం పూర్తిగా అస్పష్టంగా ఉంది. ఇందులో దైవం ఉనికి, ఏకత్వం గురించి ఉంది. కాని సాక్ష్యాధారాలు లేవు, అదే విధంగా మానవుడు దేవున్ని గుర్తుపట్టటానికి కావలసిన గుణగణాలు కూడా ఈ రెంటిలో లేవు, దేవుని ఏకత్వం తరువాత దైవదౌత్యం ఉంది. దైవదౌత్యం గురించి దాని వాస్తవం, దైవవాణి, సంభాషణ వివరణ, ప్రవక్తల స్ధానం, ప్రతి జాతిలో ప్రవక్తలు రావటం, ప్రవక్తల విధులు, ప్రవక్తలను ఏ విధంగా స్వీకరించాలి, ప్రవక్తల సుశీలత మొదలైన విషయాలన్నీ ముహమ్మద్ సందేశానికి ముందు గ్రంధాలలో లేనేలేవు. ప్రతిఫలం, శిక్ష, నరకం, స్వర్గం, తీర్పుదినం, విచారణ, ప్రళయం, పరలోక జీవితం మొదలైన వాటిగురించి తౌరాతులో అస్పష్ట మైన నిదర్శనాలు ఉన్నాయి. ఇంజీలులో ఒక యూదుని ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రధాన విషయాల గురించి ఒకటి లేక రెండు వాక్యాలు దొరుకుతాయి. మరో రెండు వాక్యాలు స్వర్గం, నరకం గురించి ఉన్నాయి. అయితే ప్రవక్త ముహమ్మద్(స) సందేశంలో ప్రతి విషయాన్ని గురించి స్పష్టంగా ఉంది.

దైవదూతల గురించి తౌరాతులోనూ ఉంది, కాని అస్పష్టం. తౌరాతులో ఒక్కోసారి దైవాన్ని గురించి ప్రస్తావించబడుతుందా లేక దైవదూతల గురించి ప్రస్తావించబడుతుందా అనేది తెలుసు కోవటం కష్టం అవుతుంది. ఇంజీలులో ఒకరిద్దరి దైవదూతల పేర్లు ఉన్నాయి. అక్కడ రూహుల్ ఖుదుస్ జిబ్రయీల్ (అ) గురించిన వాస్తవం ఎంత అస్పష్టంగా ఉందంటే దైవదూత అని చెప్పలేము లేదా దైవం అనీ చెప్పలేము. రెండూ చెప్పగలిగేలా ఉంటుంది. కాని ముహమ్మద్ సందేశంలో దైవదూతల వాస్తవికత స్పష్టంగా ఉంది. అందులో వారి స్ధానాన్ని నిర్ణయించడం జరిగింది. వారి బాధ్యతలూ చూపడం జరిగింది. అల్లాహ్ తో, ప్రవక్తలతో, విశ్వంతో వారికి ఉన్న సంబంధం వివరించి పేర్కొనడం జరిగింది. ఇదే ముహమ్మద్ సందేశానికి విశ్వాసాల్లో ఉన్న ఆ పరిపూర్ణత. రండి! ఇప్పుడు ఆచరణలను పరిశీలిద్దాం.

ఆచరణల్లో మొదటి భాగం ఆరాధనలు, తౌరాతులో ఖుర్బానీ (సమర్పణ)కు సంబంధించిన సుదీర్ఘ చర్చ మరియు నియమనిబంధనల గురించి వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఉపవాసాల గురించి కూడా పేర్కొనడం జరిగింది. ప్రార్ధనలు కూడా ఉన్నాయి. బైతుల్లాహ్(అల్లాహ్ గృహం) పేరు కూడా వచ్చింది. ఈ విషయాలన్నీ అస్పష్టంగా ఉన్నాయి. వాటిపై ప్రజల దృష్టి కూడా పడదు. అందువల్లే వారు తిరస్కారభావంతో చూస్తారు. ఆరాధనల విభజన లేదు, నియమాలు పేర్కొనబడ్డాయి. అంతేకాదు వాటి సమయాల వివరణ కూడా స్పష్టంగా లేదు. దైవస్మరణ, ప్రార్ధనల పట్ల ఒక పధ్ధతి ప్రకారం శిక్షణ ఇవ్వబడలేదు, దాసునికి ఒక్క దుఆ అయినా నేర్పబడలేదు.

జబూర్ లో ప్రార్ధనలు, విన్నపాలు చాలా ఉన్నాయి. కాని ఆరాధనా పధ్ధతులు, నియమాలు, సమయాలు, ఇతర షరతుల వివరాలు ఏవీలేవు. ఇంజీల్ లో ఆరాధనల గురించి ప్రస్తావనే లేదు. ఒక చోట ఈసా(అ) నలభై రోజులు పస్తులుండటాన్ని గురించి పేర్కొనడం జరిగింది. దాన్ని ఉపవాసం అనుకోండి. నీ శిష్యులు ఉపవాసాలు పాటించరెందుకు అనే యూదుల అభ్యంతరం కూడా ఇంజీలులో ఉంది. ఉరి తీయబడిన రాత్రి దుఆ చేసారని ఉంది. అక్కడే ఒక దుఆ నేర్పబడింది. కాని ఇతర ఆరాధనల ప్రస్తావనే అక్కడ లేదు. కాని ఇస్లామ్ సందేశంలో ప్రతి విషయం స్పష్టంగా ఉంది, నమాజు, ఉపవాసాలు, హజ్జ్, ఆరాధనలు, పధ్ధతులు, దైవధ్యానం, ప్రార్ధనలు, నమాజు వేళలు, ప్రతి ఒక్కదాని వివరాలు, పాపాల క్షమాపణ, పశ్చాత్తాపం, చింతన, మొదలైన వాటన్నిటి గురించి శిక్షణ ఇవ్వ బడింది. ఇవన్నీ దైవం వరకు చేర్చే సాధనాలు.

ఆచరణ రెండవ భాగం వ్యవహారాలు దేశం, సమాజంలోని చట్టాలు ఈ భాగం మూసా(అ) సందేశంలో చాలా స్పష్టంగా వివరంగా ఉంది. ముహమ్మద్ సందేశం కూడా దాన్ని కొనసాగిస్తుంది. కాని ఈ చట్టాల కఠినత్వాన్ని తగ్గించింది. దాన్ని జాతీయ చట్టస్ధాయి నుండి విశ్వవ్యాప్త చట్టస్ధాయి కల్పించింది. దాని పరిపూర్ణతకు కావలసిన వాటన్నిటినీ చేర్చింది. జబూర్ లో, ఇంజీలులో ఈ జీవిత విధానంగాని, చట్టాలుగాని లేవు. విడాకులు మొదలైనవాటి గురించి ఒకటి రెండు ఆదేశాలు ఉన్నాయి. కాని విశ్వవ్యాప్త ధర్మంలో రాజ్యానికి, సమాజానికి కావలసిన చట్టాల అవసరం ఎంతయినా ఉంది. వాటన్నిటినీ సమకూర్చడం తప్పనిసరి అయింది. ఈసా(అ) సందేశంలో ఇవి ఉండేవి కావు. అందువల్లే క్రైస్తవ జాతులు విగ్రహారాధకులైన యూనానీ, రూమీ జాతుల నుండి రుణంగా తెచ్చుకున్నాయి. కాని ముహమ్మద్ సందేశంలో వీటిలోని ప్రతిభాగం పరిపూర్ణంగా ఉంది. ఎలాంటి నియమ నిబంధనలను ఏర్పరచిందంటే, సమయానుకూలంగా ధార్మిక పండితులు, విద్వాంసులు కొత్త అవసరాల కోసం సమస్యల కోసం పరిష్కారం వెతుకుతూ ఉంటారు. కనీసం వెయ్యి సంవత్సరాల వరకు ఇస్లామ్ పరిపాలన చేసింది, అనేక సామ్రాజ్యాలు స్ధాపించింది. అవన్నీ ఈ చట్టాల పైనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇంతకన్నా మంచి చట్టాలు ప్రపంచం చూపెట్ట లేకపోయింది.

ఆచరణలో మూడవ భాగం సద్గుణాలు, తౌరాతులో కొన్ని ఆదేశాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో 7 ప్రధాన ఆదేశాలు ఉన్నాయి. 1. తల్లిదండ్రుల విధేయత వదలి మిగతా 6 వ్యక్తిగత ఆదేశాలే. 2. నువ్వు హత్య చేయకు 3. నువ్వు దొంగతనం చేయకు 4. నువ్వు వ్యభిచారం చేయకు 5. నీ తోటి సోదరునిపై అసత్య ప్రమాణం చేయకు 6. నీవు నీ పొరుగువాని భార్యపై కన్ను వేయకు 7. నువ్వు పొరుగువాని ధనంపై కన్ను వేయకు. వీటిలో 6వ ఆదేశం 4వ ఆదేశంలో, 7వ ఆదేశం 3వ ఆదేశంలో ఉన్నాయి. అందువల్ల నైతిక గుణాలు నాలుగే మిగిలాయి.

ఇంజీల్ లో కూడా ఈ ఆదేశాలన్నీ పేర్కొనడం జరిగింది. వీటితో పాటు ఇతరులను ప్రేమించమని కూడా బోధించబడింది. తౌరాతు కన్నా ఇందులో ఆదేశాలు అధికంగా ఉన్నాయి. కాని ముహమ్మద్ సందేశం ఒక్క చుక్కను సముద్రం చేసివేసింది. అన్నిటికంటే ముందు అది తన 12 మూల సూత్రాలను నిర్ణయించింది. ఇవి మేరాజ్ లో దైవసన్నిధి నుండి ప్రదానం చేయబడ్డాయి. ఇవి సూరహ్ ఇస్రాలో ఉన్నాయి. ఈ 12లో నుండి 11మానవ సద్గుణాలు, ఒకటి ఏకత్వానికి చెందినది. 11లో నుండి 5 వ్యక్తిగతమైనవి, 5 ఇతరులతో సంబంధించినవి, 1 రెంటికీ సంబంధించినది.

1. తల్లిదండ్రులను గౌరవించు, విధేయత పాటించు 2. నీపై హక్కుగలవారి హక్కులను చెల్లించు 3. అనాధలపట్ల మంచిగా ప్రవర్తించు 4. తూనికల్లో, కొలతల్లో న్యాయంగా ప్రవర్తించు 5. వాగ్దానాన్ని నెర వేర్చు, దాన్ని గురించి నిన్ను విచారించడం జరుగుతుంది. ఈ ఐదు పరస్పర బాధ్యత గలవి.

1. నీ సంతానాన్ని హత్య చేయకు 2. అన్యాయంగా ఇతరుల్ని చంపకు 3. వ్యభిచారం దగ్గరకైనా పోకు 4. తెలియని విషయం వెంటపడకు 5. భూమిపై అహంకారంగా ప్రవర్తించకు. ఈ ఐదు వ్యక్తిగతమైనవి.

ఒకటి రెంటికి సంబంధించినది. దుబారా ఖర్చు చేయకు అంటే ఖర్చు చేయడంలో మిధ్యే మార్గాన్ని అనుసరించు. వీటిని బట్టి ముహమ్మద్ సందేశంలో పరిపూర్ణ సందేశం ఎందుకు ఉందో తెలుస్తుంది. ఈ సందేశం ప్రధాన ఆదేశాలను నిర్ణయించింది, వాటిని పూర్తి చేసింది, అంతేకాదు సద్గుణాలకు సంబంధించిన ఒక్కొక్క విషయాన్నివిప్పి చెప్పింది. మానవుని ఒక్కొక్క యోగ్యతను వివరించింది. మానవుని ఒక్కొక్క బలహీనతను బహిర్గతం చేసింది. మానసిక వ్యాధులను పేర్కొని, వాటి చికిత్సను కూడా చూపెట్టింది. ఇదీ ఆ పరిపూర్ణ ఆచరణ. దీన్ని ముహమ్మద్ సందేశం ద్వారా పరిపూర్ణం గావించ బడింది.

ఇస్లామీయ బోధనల విశాలమైన దస్తావేజును రెండు ముక్కల్లో చెప్పాలంటే వాటిని మనం విశ్వాసం మరియు సత్కార్యాలుగా చెప్పవచ్చును. ఈ రెండే ఇస్లామీయ బోధనలన్నిటికీ వర్తిస్తాయి. ఖుర్ఆన్ లో వీటివల్లే సాఫల్యం సిధ్ధిస్తుందని పేర్కొనటం జరిగింది. అంటే మనం ధృడవిశ్వాసం కలిగి ఉండాలి. చేసే కర్మలు సత్కార్యాలుగా ఉండాలి. సాఫల్యం కేవలం విశ్వాసం, సత్కార్యాల పైనే ఆధారపడి ఉందని, ఖుర్ఆన్ లో అనేక చోట్ల గుర్తు చేయడం జరిగింది. ఇక్కడ నేను కేవలం ముహమ్మద్ సందేశం విశ్వాసాల, సత్కార్యాల పట్ల చేసిన కృషి గురించి చర్చిస్తాను. ఇది మానవ అపరాధాలను సంస్కరించింది. అసంపూర్ణ ధర్మాన్ని పరిపూర్ణం చేసింది. తప్పుడు ఆలోచనలను దూరం చేసింది. వీటివల్ల మానవత్వం నీచ స్ధితికి దిగజారిపోయి ఉండేది.

1. ఈ ప్రాధమిక సమస్యల్లో ముహమ్మద్ సందేశం ద్వారా ముందుకు వచ్చిన సమస్య విశ్వంలోని సృష్టితాల్లో మానవుని స్ధానం, ఇదే ఏకత్వానికి ప్రధానమైనది. ఇస్లామ్ కు ముందు మానవుడు సృష్టితాల్లో తన్నుతాను హీనంగా భావించేవాడు. రాళ్ళకు, కొండలకు, సముద్రాలకు, పచ్చని చెట్లకు, వర్షానికి, అగ్నికి, అడవులకు, విషసర్పాలకు, సంహాలకు, సాధు జంతువులకు, సూర్యునికి, నక్షత్రాలకు, అంధకార చీకట్లకు, భయంకర దృశ్యాలకు భయపడేవాడు, లాభాలు కోరుతూ వాటిని పూజించేవాడు. వాటి ముందు తన తలను వంచేవాడు. ప్రవక్త ముహమ్మద్(స) వచ్చి ప్రపంచానికి “ఓ ప్రజలారా! వీటిలో ఏవీ మీ ప్రభువులు కారు. మీరు వాటి ప్రభువులు, వాటిని మీకోసం సృష్టించడం జరిగింది. మీరు వాటికోసం సృష్టించబడలేదు. అవి మీ ముందు తలవంచి ఉన్నాయి. మీరెందుకు వాటి ముందు తలలు వంచుతున్నారు. ఓ మానవులారా! మీరు ఈ విశ్వంలోని దేవుని ప్రతినిధులు, అందువల్ల వీటన్నిటినీ మీకు అప్పగించడం జరిగింది. మిమ్మల్ని వాటికి అప్పగించలేదు. అవి మీకోసం, మీరు వాటికోసం కాదు” అని పేర్కొనడం జరిగింది.         

إِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِي جَاعِلٌ فِى الأَرْضِ خَلِيفَةً .(البقرة-30)

నేను భువిలో ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను, అని నీ ప్రభువు తన దూతలతో అన్నప్పుడు.(అల్ బఖరహ్-30)

وَهُوَ الَّذِى جَعَلَكُمْ خَلئِفَ فِى الأَرْضِ.(الأنعام-165)

ఇంకా ఆయనే మిమ్మల్ని భూమిపై తన ప్రతినిధిగా చేసాడు.(అల్అన్ఆమ్-165)

ఈ ప్రతినిధి పదవి ఆదమ్ కు ఆదమ్ సంతానానికి గౌరవం, ఔన్నత్యం ప్రసాదించింది. నిస్సందేహంగా మేము ఆదమ్ సంతానానికి ఔన్నత్యాన్ని ప్రసాదించాము. ఇటువంటి మానవుడు తనకంటే చిన్న వారి  ముందు తల వంచు తున్నాడా? ఈ ప్రపంచమంతా మీకోసం ఏర్పాటు చేయబడిందని ఇస్లామ్ బోధించింది.

اَلَمْ تَرَ أَنَّ اللهَ سَخَّرَ لَكُمْ مَا فِى الأَرْضِ.(الحج-65)

దైవం భూమిలో ఉన్నదంతా మీకోసమే సృష్టించాడనే విషయాన్ని మీరు గుర్తించలేదా?అల్ హజ్జ్65

هُوَ الَّذِى خَلَقَكمْ مَا فِى الأَرْضِ جَمِيْعًا .(البقرة-29)

ఆయనే భూమిలో ఉన్నవాటన్నిటినీ మీకోసం సృష్టించాడు.(అల్ బఖరహ్-29)

وَالأَنْعَامِ خَلَقْهَا لَكُمْ فِيهَا دِفْءٌ وَ مِنَافِعَ.(النحل-5)

జంతువులను కూడా మీ కోసమే సృష్టించాడు, మీరు వాటి ఉన్ని,  ఇంకా అనేక లాభాలు పొందాలని.(అన్నహ్ల్-5)

هُوَ الَّذِى اَنْزَلَ مِنَ السَّمَاءِ مَاءً لَكُمْ مِنْهُ شَرَابٌ وَ مِنْهُ شَجَرَةٌ فِيهِ تُسِيمُونَ .

 يُنْبِتُ لَكُمْ بِهِ الزَّرْعَ وَ الزَّيْتُونَ وَ النَّخِيْلَ وَ الأَعْنَابِ وَ مِنْ كُلِّ الثَّمَرَاتِ .(النحل-10,11)

ఆకాశం నుండి మీకోసం నీళ్ళను కురిపించేవాడు ఆయనే, ఆ నీటిని మీరూ తనివితీరా త్రాగుతారు, ఆ నీటివల్ల మీ పశువులకు కూడా మేత మొలుస్తుంది. ఆయన ఆ నీటి ద్వారా పొలాలను   పండిస్తాడు. జైతూను, ఖర్జూరం, ద్రాక్ష ఇంకా రకరకాల ఇతర పండ్లను పండిస్తాడు.(అన్నహ్ల్-10,11)

وَ سَخَّرَ لَكُمْ اللَّيْلَ وَ النَّهَارَ وَ الشَّمْسَ وَ القَمَرَ وَ النُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ.(النحل-12)

ఆయన మీ మేలు కోసం రాత్రినీ, పగలునూ, సూర్యున్నీ, చంద్రున్నీ మీకు వశపరిచాడు. నక్షత్రాలు కూడా ఆయన ఆజ్ఞవల్లనే మీకు వశమై ఉన్నాయి.(అన్నహ్ల్-12)

وَ هُوَ الَّذِى سَخَّرَ البَحْرَ لِتَأْكُلُوا مِنْهُ لَحْمًا طَرِيًّا وَ تَسْتَخْرِجُوا مِنْهُ حِلْيَةً تَلْبَسُونَهَا  وَ تَرَا الفُلْكَ مَوَاخِرَ وَ فِيهِ وَلِتَبْتَغُوامِنْ فَضْلِهِ وَلَعِلَّكُمْ تَشْكُرُونَ .(النحل-14)

సముద్రాన్ని మీ సేవకోసం వినియోగించినవాడు ఆయనే, దాని నుండి మీరు తాజా మాంసాన్ని తీసుకొని తినేందుకు, మీరు ధరించే ఆభరణాలను దాని నుండి వెలికి తీసుకునేటందుకు, సముద్రం రొమ్మును చీల్చుతూ ఓడ పయనించటాన్నీ మీరు చూస్తారు, ఇదంతా ఎందుకంటే మీరు మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషించాలని, ఆయనకు కృతజ్ఞులుగా మెలగాలని(అన్నహ్ల్-14)

ఈ వాక్యాల ద్వారా మానవుడు విశ్వనాయకుడని, దైవ ప్రతినిధి అని ముహమ్మద్ సందేశం స్పష్ట పరిచింది. ఈ వాస్తవం తెలిసిన తర్వాత మానవుడు ఇతరుల ముందు తల వంచడం సమంజసమా!.

అమాయక మానవులు పరస్పరం దైవాలుగా భావించుకుంటున్నారు. పండితులైనా, పామరులైనా, జ్ఞానులైనా, అజ్ఞాను లైనా అందరూ తమను ఆరాధ్యులుగా ప్రదర్శిస్తున్నారు. ఇది కూడా మానవ త్వానికి అవమానమే. ముహమ్మద్ సందేశం దీని వ్రేళ్ళను కోసివేసింది.

وَلَا يَتَّخِذُوا بَعْضُنَا بَعْضًا اَرْبَابًا مِنْ دُونِ اللهِ .(آل عمران-64)

మనం అల్లాహ్ ను వదలి పరస్పరం ప్రభువులుగా చేసుకోకూడదు. ఆలిఇమ్రాన్64

وَلَا يَأْمُرُكُمْ اَنْ تَتَّخِذُوا المَلَائِكَةَ وَ النَّبِيِّينَ اَرْبَابًا .(آل عمران-80)

ఏ ప్రవక్త అయినా దైవదూతలను, ప్రవక్తలను ప్రభువులుగా  భావించండని ఆదేశించడు.(ఆలిఇమ్రాన్-80)

మానవత్వం ఎంత గొప్పతనం కలిగి ఉందంటే, మానవుని నుదురు అల్లాహ్ తప్ప ఇంకెవరి ముందు తల వంచదు. అంతే కాదు మానవుడు కేవలం అల్లాహ్ ముందే చేతులు చాచుతాడు. అల్లాహ్ తప్ప ఇతరు లెవ్వరూ ఇవ్వలేరు, తీసుకోలేరు.

ఈ ముహమ్మద్ సందేశాన్ని ముందుంచి ఏకత్వం విషయాన్ని గురించి ఆలోచించండి. మానవత్వ స్ధానం ఎంత గొప్పదో మీకే తెలుస్తుంది. తౌహీద్ విషయం కూడా ఎంత వివరంగా ఉందో తెలుస్తుంది. ఇక్కడ దైవానికి ఎవరూ సాటిలేరు. అధికారం ఆయనదే, ప్రభుత్వం ఆయనదే, ఆజ్ఞలు, ఆదేశాలు ఆయనవే. ఆయన సింహాసనం నుండి భూమి వరకు ఆకాశం నుండి భూమి వరకు ఆయన ఆదేశమే చెల్లుతుంది.

మిత్రులారా! ఒక వ్యక్తి దైవప్రతినిధిగా ఉంటూ దైవేతరుల ముందు తల వంచగలడా? చెప్పండి చీకటైనా, వెలుగైనా, గాలైనా, నీరైనా, రాజైనా,శత్రువైనా, అడవులైనా, కొండలైనా, నేలైనా, సముద్రం అయినా ఒక ముస్లిమ్ అల్లాహ్ ను వదలి ఇతరులకు భయపడగలడా? కొంచం ఈ మానసిక శిక్షణల నైతిక బలాన్ని చూడండి. ముహమ్మద్(స) సందేశం ఔన్నత్యాన్ని చూడండి.

2. ముహమ్మద్ ప్రవక్త యొక్క రెండవ ప్రధాన సూత్రం ఏమిటంటే మానవుడు సహజంగా పరిశుధ్ధంగా, నిరపరాధిగా పుడతాడు. అయితే ఈ మానవుడే తన కర్మల ద్వారా దైవదూత లేదా షైతాన్, పాపాత్ముడు లేదా పుణ్యాత్ముడు అవుతాడు. తన తెల్లని పత్రాన్ని నల్లగా లేదా తెల్లగా చేసుకుంటాడు. ఇవన్నీ ముహమ్మద్ (స) ద్వారా లభించడం గొప్ప సంతోషకరం, శుభకరం. చైనా, బర్మా, భారతదేశంలోని ధర్మాలన్నీ పునర్జన్మ అనే మూఢనమ్మకాలకు గురయి ఉన్నాయి. యూనాన్ కు చెందిన కొందరు వైద్యులు కూడా ఈ అభిప్రాయాల పట్ల ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. ఈ మూడవ నమ్మకం మానవత్వాన్ని నీచస్ధితికి దిగజార్చింది. అంతేకాదు వీపుపై చాలా పెద్ద బరువును మోపింది. మానవుని ప్రతి విషయం అంతకు ముందు కర్మ ఫలితంగా చూపెట్టింది. అతని జీవితాన్ని మరో జీవితం చేతిలో పెట్టింది. ఈ నమ్మకం ప్రకారం రెండవసారి జన్మించడం పాపాల కారణంగా అని ధృవీకరించింది. క్రైస్తవం కూడా మానవుని ఈ భారాన్ని తగ్గించలేదు పైగా పెంచింది. క్రైస్తవధర్మం ప్రతి మానవుడు తన తండ్రి పాపాల కారణంగా పాపాత్ముడని తీర్మానించింది. అతడు ఎటువంటి పాపం చేయకపోయినా సరే. అందువల్ల మానవుల విముక్తికి మానవుడు కానివారి అవసరం ఉంది. అతడు తన ప్రాణం త్యాగంచేసి మానవుల తరపున పరిహారంగా వ్యవహరిస్తాడు.

కాని ముహమ్మద్(స) వచ్చి ఓ మానవులారా! మీరు మొదటి జీవితం వల్ల ఇలా పుట్టలేదని, మీ తండ్రి పాపాలవల్ల కూడా ఇలా జరగలేదని, మీరు సహజంగా కళంకం లేకుండా జన్మించారని, ఇప్పుడు మీరు మీ ఆచరణల ద్వారా మీ జాతకాన్ని మంచిగా లేదా చెడుగా మార్చుకోగలరని శుభ వార్తలు ఇచ్చారు.

 وَ التِّينِ وَالزَّيتُونَ وَطُورِ سِينِينِ وَ هذَا البَلَدِ الأَمِينِ , لَقَدْ خَلَقْنَا الإِنْسَانَ فِى اَحْسَنِ تَقْوِيمٍ ,  ثُمَّ رَدَدْنَاهُ اَسْفَلَ سَافِلِينَ إِلاَّ الَّذِينَ آمَنُوا وَ عَمِلُوا الصَّالِحتِ .(التين-1-6)

అత్తీన్,జైతూన్ సాక్షి! సీనా పర్వతం సాక్షిగా! శాంతి నగరం సాక్షి! మేము మానవున్ని అద్భుతమైన ఆకారంలో సృష్టించాము. తరువాత మేము అతన్ని వెనక్కి త్రిప్పి నీచాతి నీచుడుగా మార్చి వేశాము. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసేవారు తప్ప.(అత్తీన్-1-6)

وَنَفْسٍ وَمَا سَوَّاهَا فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَاهَا, قَدْ اَفْلَحَ مَنْ زَكَّاهَا وَقَدْ خَابَ مَنْ دَسَّاهَا .(الشمس-7-10)

మానవాత్మ సాక్షి!   ఆత్మనుతీర్చిదిద్ది ఆపై దానికి సంబంధించిన మంచీ చెడులను దానికి తెలియజేసినవాడి సాక్షి! నిశ్చయంగా తన ఆత్మను పరిశుధ్ధ పరచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు. దానిని అణచివేసినవాడు విఫలుడయ్యాడు.(అష్షమ్స్-7-10)

ااِنَّا خَلَقْنَا الإِنْسَانَ مِنْ نُطْفَةٍ مٍنْ اَمْشَاجٍ نَبْتَلِيهِ فَجَعَلْنَاهُ سَمِيعًا بَصِيرًا , اِنَّا هَدَينَاهُ السَّبِيلَ اِمَّا شَاكِرًا وَاِمَّا كَفُورًا . (الدهر-2-3)

మేము మానవున్నిపరీక్షించటానికి అతన్ని ఒక మిశ్రమ వీర్యబిందువుతో సృష్టించాము. లక్ష్యం కోసం మేము అతన్ని వినేవాడుగా చూచేవాడుగా చేశాము. మేము అతనికి మార్గం చూపాము. ఇక అతడు కృతజ్ఞుడైనా కావచ్చు, కృతఘ్నుడైనా కావచ్చు.(అద్దహ్ర్-2-3)

يَآ اَيُّهَاالإِنْسَانُ مَا غَرَّكَ بِرَبِّكَ الكَرِيمِ الَّذِي خَلَقَكَ فَسَوَّاكَ فَعَدَلَكَ فِي اَىِّ صُورَةٍ مَا شَاءَ رَكَّبَكَ .(الإنفطار-6-8)

మానవుడా!పరమదాత అయిన నీ ప్రభువును గురించి విషయం నిన్ను మోసంలో పడవేసింది. ఆయనే నిన్ను సృష్టించాడు, నిన్ను తీర్చి దిద్దాడు, నిన్ను తగినరీతిలో పొందికగా రూపొందించాడు, తాను కోరిన విధంగా నిన్ను మలిచాడు.(అల్ ఇన్ఫితార్-6-8)

ముహమ్మద్ పరిభాషలో ధర్మం సహజత్వం రెండూ ఒకటే, పదాలు రెండు, కాని అసలు సహజ ధర్మం, పాపం అనే మానవుని వ్యాధి బయట నుండి వస్తుంది. ఖుర్ఆన్ ఆదేశం,

فَاَقِمْ وَجْهَكَ لِلدِّيْنِ حَنِيفًا فِطْرَةَ اللهِ الَّتِى فَطَرَ النَّاسَ عَلَيْهَا لَا تَبْدِيلَ لِخَلْقِ اللهِ ,  ذلِكَ الدِّينُ القَيِّمُ وَ لكِنْ اَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ.(الروم-30)

కనుక ప్రవక్తా! ఏకాగ్రతతో మీ ముఖాన్ని ధర్మం వైపు స్ధిరంగా ఉంచండి, అల్లాహ్ మానవులను స్వభావం ప్రకారం సృష్ఠించాడో దానిపైనే ఉండండి. అల్లాహ్ సృష్ఠించిన స్వరూప స్వభావాలు మార్చ శక్యం కానివి, ఇదే సవ్యమైన రుజుమార్గం, కాని చాలా మందికి ఇది తెలియదు. (అర్రూమ్-30)

ఇస్లామ్ ప్రవక్త(స) తన ఒక సందేశంలో ఈ వాక్యం గురించి స్పష్టంగా వివరించారు. బుఖారీలోని రూమ్ వివరణలో ఇలా ఉంది. ప్రవక్త(స) ఇలా ప్రవచించారు, ప్రతి బిడ్డ సహజ స్వభావంతోనే జన్మి స్తుంది. కాని తల్లిదండ్రులు వాడిని యూదునిగానో, క్రైస్తవునిగానో మార్చివేస్తారు. జంతువు సురక్షి తమైన బిడ్డను కన్నట్టు, చెవులు కోయబడిఉన్న బిడ్డ పుట్టటం మీరెవరైనా చూసారా? అని ప్రవక్త(స) పై వాక్యాన్ని పఠించారు.

ఆలోచించండి! ముహమ్మద్ సందేశం మానవులకు ఎంత గొప్ప శుభవార్త నిచ్చిందో, మానవుని శాశ్వత చింతను ఏ విధంగా సంతోషంగా మార్చివేసిందో, అంతేకాదు ప్రతి వ్యక్తికి తన జీవిత కార్యాల్లో ఏ విధంగా స్వాతంత్రం ప్రసాదించిందో.

3. ఇస్లామ్ కు ముందు ప్రపంచ జనాభా మొత్తం అనేక కుటుంబాలుగా విభజించబడి ఉండేది. ప్రజలు పరస్పరం అపరిచితులుగా ఉండేవారు. భారతదేశంలోని రుషులు,మునులు ఆర్యవర్త్ కు వెలుపల దైవసందేశాన్ని ప్రచారం చేయలేదు. వారు పరమేశ్వరుడు కేవలం ఆర్యవర్తుల సుఖ సంతోషాలే కోరు తున్నాడని భావించేవారు. దైవమార్గ దర్శకత్వం కేవలం ఈ దేశానికి చెందిన కొన్ని కుటుంబాలకే పరిమితం అని భావించేవారు. జర్తస్త్ కేవలం ఈరాన్ లోనే దైవసందేశాన్ని ప్రచారం చేసాడు. బనీ ఇస్రాయీల్ కూడా తమ కుటుంబంలోనే ప్రవక్త పంపబడ్డారని సంతోషించే వారు. ఈ ముహమ్మద్ సందేశం మాత్రమే దైవధర్మాన్ని అన్నివైపుల ప్రచారం చేసింది. అంతేకదు దైవమార్గ దర్శకత్వం పొంద టానికి దేశం, జాతి, భాష తప్పనిసరి కావని విశదపరచింది. దీని దృష్టిలో ఫాలస్తీన్, ఈరాన్, భారత దేశం, అరబ్ అందరూ సమానమే. అన్ని వైపుల దాన్ని ప్రచారం చేయడం జరిగింది. అన్నివైపుల మార్గదర్శక వెలుగు వ్యాపించింది.

وَ إِنَّ مِنْ اُمَّةٍ إِلَّا خَلَا فِيهَا نَذِيرٌ .(فاطر-24)

ప్రతి జాతిలో ఒక హెచ్చరించేవాడు వచ్చిఉన్నాడు.(ఫాతిర్-24)

وَلِكُلِّ قَومٍ هَادٍ.(الرعد-7)

ప్రతి జాతికి ఒక మార్గదర్శకుడు ఉన్నాడు.(అర్రఅద్-7)

وّلَقَدْ اَرْسَلْنَا  مِنْ قَبْلِكَ رُسُلاً إِلى قَومِهِمْ.(لروم-47)

మేము నీకంటే ముందు ఎంతో మంది ప్రవక్తలను వారి జాతుల వద్దకు పంపాము.(అర్రూమ్-47)

ఒక యూదుడు బయటవారిని ప్రవక్తగా అంగీకరించలేదు, ఒక క్రైస్తవుడికి ఇతర ప్రవక్తలను, నాయ కులను స్వీకరించటం తప్పనిసరి కాదు. హిందూ ధర్మంలో కూడా ఆర్యవర్తనుడి తప్ప ఇతరులె వ్వరినీ అంగీకరించలేదు. ఈరాన్ లోనూ తన ప్రాంతంలో తప్ప ప్రపంచమంతా అంధకారం కని పిస్తుంది. కాని ముహమ్మద్(స) సందేశం ఏమిటంటే ప్రపంచమంతా అల్లాహ్ సృష్టితాలే, అల్లాహ్ అనుగ్రహాల్లో ప్రపంచ జాతులన్నీ, వంశాలన్నీ సమాన భాగస్వాములే, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా దైవ వెలుగు అన్నిచోట్లా వ్యాపించి ఉంది. మానవులు ఉన్న అన్నీ ప్రాంతాల్లో దైవం తన రాయబారు లను పంపాడు. ప్రవక్తలను అవతరింపజేసాడు. వారి ద్వారా తన ఆదేశాలను తెలియజేసాడు.

ఏ వ్యక్తీ ఖుర్ఆన్ లో పేర్కొనబడిన, పేర్కొనబడని ప్రవక్తలనూ, దైవ గ్రంధాలనూ విశ్వసించనంత వరకు ముస్లిమ్ కాలేడు. ఇదంతా ఇస్లామ్ బోధనల ఫలితమే, ముస్లిమ్ అంటే ఎవరు?.

الَّذِينَ يُؤْمِنُونَ بِمَا اُنْزِلَ إِلَيْكَ وَمَا اُنْزِلَ مِنْ قَبْلِكَ.(البقرة-4)

నీపై అవతరించబడిన, నీకంటే ముందు ప్రవక్తలపై అవతరించబడిన   గ్రంధాలను విశ్వసించినవారు.(అల్ బఖరహ్-4)

وَ لكِنَّ البِرَّمَنْ آمَنَ بِاللهِ وَ الْيَومِ الآخِرِوالْمَلَائِكَةِ وَالكِتَابِ وَالنَّبِيِّينَ.(البقرة-177)

కాని పుణ్యం అంటే అల్లాహ్ ను, తీర్పుదినాన్నీ, దైవదూతలను, గ్రంధాన్నీ, ప్రవక్తలను విశ్వసించినవారిదే.(అల్ బఖరహ్-177)

كُلٌّ مَنْ آمَنَ بِاللهِ وَ الْمَلَائِكَةِ وَكُتُبِهِ وَ رُسُلِهِ, لَا نُفَرِّقُ بَيْنَ اَحَدٍ مِنْ رُسُلِهِ. (البقرة-286)

అల్లాహ్ ను, దైవదూతలను,గ్రందాలను, ప్రవక్తలను విశ్వసించినవారు, మేము ప్రవక్తలమధ్య తేడా చూపము, అంటే కొందరిని విశ్వసించి మరికొందరిని తిరస్కరించడంజరుగదు.(అల్ బఖరహ్-286)

يَآاَيُّهَاالذِينَ آمَنُواآمِنُوبِاللهِ وَرُسُلِهِ وَالكِتَابِ الذِى نَزّلَ عَلى رَسُولِهِ وَالكِتَابِ الذِى اَنْزَلَ مِنْ قَبْلُ .(النساء-136)

విశ్వాసులారా! అల్లాహ్ నూ, ప్రవక్తలనూ, ఆయన ప్రవక్తపై అవతరించబడిన గ్రంధాన్నీ,అంతకు ముందు అవతరించబడిన గ్రంధాలనూ విశ్వసించండి.(అన్నిసా-136)

మిత్రులారా! ప్రపంచ విశ్వమానవ సమానత్వం, సోదరభావం ధర్మవ్యవస్ధాపకులను, ప్రవక్తలను వాస్తవ గౌరవ మర్యాదలను, వారిని ధృవపరచటాన్ని గురించి ముహమ్మద్(స) తప్ప ఇంకెవరు బోధించారు? ఇస్లామ్ ప్రవక్త యొక్క కారుణ్యం, భూతదయ, శ్రేయోభిలాష పరిధి ఎంత విశాలంగా ఉందో మీరే చెప్పండి. ఎందుకంటే ఆయన ఏ మానవున్నీ, ఏ ప్రాంతాన్నీ విడిచిపెట్టలేదు.

4. మతాలన్నీ దైవానికి దాసునికి మధ్య మధ్యవర్తులను ఏర్పరచి ఉన్నారు. ప్రాచీన దేవాలయాల్లో జ్యోతీష్కులు, పూజారులు ఉండేవారు. యూదులు కూడా కొందరిని దైవానికి దాసునికి మధ్య ప్రార్ధనలకు సమర్పణలకు మధ్యవర్తులుగా నిలబెట్టారు. క్రైస్తవులు కొందరు హవారీలను దైవానికి దాసుల కు మధ్యవర్తులుగా నిలబెట్టారు. “వీరికి మానవుల పాపాలను క్షమించే అధికారం ఇవ్వబడింది. వీరు లేకుండా ఎవరి ఆరాధనా స్వీకరించబడదు” అని భావించేవారు. హిందువుల్లో “బ్రాహ్మణులు ప్రత్యేకంగా దేవుని కుడిచేయి నుండి సృష్టించబడ్డారు. అందువల్ల దైవానికి, దాసులకు వీరే మధ్యవర్తులు, వీరు లేకుండా ఎవరి ఆరాధనా స్వీకరించబడదు”. అని భావించేవారు. కాని ఇస్లామ్ లో పూజారుల, జ్యోతీష్కుల,పోపుల, పాదరీ ల అవసరం ఎంతమాత్రం లేదు. శిక్షించే, క్షమించే హక్కు కేవలం అల్లాహ్ కే ఉంది. దాసులకూ దైవానికీ మధ్య జరిగే ఆరాధనల్లో, మొక్కుబడుల్లో, సమర్పణలో ఇతరుల ప్రమేయం ఎంతమాత్రం లేదు. ప్రతి ముస్లిమ్ నమాజులో నాయకత్వం వహించగలడు, ఖుర్బానీ ఇవ్వగలడు, నికాహ్ చదివించగలడు, ధార్మిక కార్యాలన్నీ నిర్వర్తించగలడు. ఇక్కడ ప్రజలకు, “ప్రజలారా నన్ను వేడుకోండి, నేను మీ పిలుపుకు సమాధానం ఇస్తాను” అని అల్లాహ్ బహిరంగంగా ప్రకటించాడు. ప్రతి ఒక్కరూ తమ దైవంతో మాట్లాడగలరు. ఆయన్ను ప్రార్ధించగలరు. ఆయన ముందు వంగ గలరు. నైవేద్యాలు సమర్పించగలరు. ఇక్కడ దైవానికి దాసునికి మధ్య ఎవరూ ఉండరు. ఇది అన్నిటికంటే గొప్ప స్వాతంత్రం. దీన్ని ప్రవక్త ముహమ్మద్(స) ద్వారా ప్రసాదించడం జరిగింది. ప్రతి మానవుడు తన్ను తాను జ్యోతీష్కుడుగా, ప్రీస్ట్ గా, పోప్ గా, పూజారిగా చెప్పుకుంటాడు. దీన్ని గురించి ఎటువంటి దైవాదేశం లేదు.

5. మానవుల విద్యా మార్గదర్శకత్వాల కొరకు మహాపురుషులు సమయానుసారం వస్తూ ఉన్నారు. వారిని గౌరవించడంలో ప్రారంభం నుండి  ప్రజలు హద్దులు మీరి ప్రవర్తించడం జరిగింది. అజ్ఞానులు వారిని దైవంగా, దైవభాగస్వామిగా, దైవావతారంగా భావించసాగారు. హిందువుల్లో దైవావతారాలుగా భావించసాగారు, బౌధ్ధుల్లో, చైనీయుల్లో తమ తమ ధార్మిక వ్యవస్ధాపకులను దైవాలుగా భావించసాగారు. క్రైస్తవులు తమ ప్రవక్తను దైవకుమారునిగా భావించసాగారు. ఇటు బనీఇస్రాయీల్ లో ప్రతివ్యక్తి భవిష్యవాణి పలికేవాడు, ఒక వ్యక్తిని ప్రవక్తగా స్వీకరించాలంటే భవిష్యవాణి మాత్రమే సరిపోయేది. ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా, పాపాత్ముడైనా, గుణహీనుడైనా సరే. అందుకే బనీఇస్రాయీలుకు సంబంధించిన గ్రంధాలలో గొప్పగొప్ప ప్రవక్తల గురించి మార్పులు, చేర్పులు, కల్పితాలు జరిగాయి.

ఇస్లామ్ ప్రవక్త యొక్క నిజమైన స్ధానాన్ని నిర్ణయించింది. ప్రవక్తలు దైవాలు కారని, దైవంవంటి వారు కూడా కారని, దేవుని అవతారాలు కారని, దేవుని కుమారులు కారని, బంధువులూ కారని, వారు కేవలం మానవులే అని వివరంగా బోధించింది. ఎందుకంటే పంపబడిన ప్రవక్తలందరూ మానవులే, అవిశ్వాసులు “మానవుడు ప్రవక్త కాగలడా?” అని ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. దానికి ఇస్లామ్ అవును అని సమాధానం ఇచ్చింది. “ఓ ప్రవక్తా ఇలా పలుకు, నేను కూడా మీలాంటి మానవుడినే”. అని ఖుర్ఆన్ పేర్కొంది.

విశ్వంలోని ప్రవక్తలకు ఎటువంటి అధికారాలూ లేవు. ఎటువంటి శక్తులూ లేవు. వారు చెప్పిందీ, చేసిందీ కేవలం అల్లాహ్ ఆదేశంతోనే, వారూ మానవులే, కాని వారి గుణాల, బాధ్యతల రిత్యా అందరి కంటే ఉత్తములు పరిపూర్ణులు. వారు దైవంతో సంభాషిస్తారు. వారిపై దైవవాణి అవతరిస్తుంది. వారు నిరపరాధులు అంటే పాపాత్ములకు ఆదర్శవంతులు. దేవుడు వారి ద్వారా తన మహిమలను ప్రదర్శిస్తారు. వారు ప్రజలకు మంచిని గురించి బోధిస్తారు. వారిని గౌరవించడం, విధేయత చూపడం అందరి తప్పనిసరి విధి. వారు దైవానికి ప్రియదాసులు, భక్తులు, అల్లాహ్(త) వారికి దైవదౌత్య బాధ్యత ఇచ్చి పంపాడు.

ముహమ్మద్ సందేశం ప్రవక్తల,సందేశహరుల పట్ల, నిర్ణయించిన మిధ్యేమార్గం ఇదే. ఇది మార్పులకు చేర్పులకు కల్పితాలకు అతి ప్రవర్తనకు దూరంగా ఉంది. అంతేకాదు, ఈ ప్రపంచంలో ఏకత్వాన్ని పరిపూర్ణం చేసిన వారకి అనుగుణంగా ఉంది.

మిత్రులారా! నేటి సభ చాలా దీర్ఘంగా సాగింది. ఇంకా చెప్పవలసిన మాటలు చాలా ఉన్నాయి. మళ్ళీ కలుద్దాం.

8. ప్రవక్త ముహమ్మద్(స) పిలుపు (విశ్వాసం,సత్కార్యాలు)

సోదరులారా! ఈనాడు మన కలయిక పరంపర ముగుస్తుంది. ఈ రోజు నా ఎనిమిదవ ప్రసంగంలో ఇస్లామ్ ప్రాధమిక ఆదేశాలను మీ ముందు పెడదామని అనుకున్నాను, అయితే నిస్సందేహంగా ప్రాచీన ధర్మాలన్నీ ఏకత్వ సందేశమే ప్రపంచానికి అందించాయి. అయితే మూడు విధాలుగా అపార్ధాలు, భ్రష్టత్వాలు జనించాయి. ఒకటి శారీరక పోలికలు, ఉపమానాలు, రెండవది గుణాలను, ఉనికిని వేరుగా, శాశ్వతంగా భావించుట. మూడవది కర్మల రంగులతో మోసపోవుట. ముహమ్మద్ సందేశం ఈ ముడులను విప్పింది, అపార్ధాలను తొలగించింది. వాస్తవాలను విశదపరచింది. అన్నిటి కంటే ముందు పోలిక, ఉదాహరణను తీసుకోండి.

1. దైవాన్ని, దైవగుణాల్ని దైవం దాసుని మధ్య సంబంధాల్నీ విశదపర్చటానికి ఊహాజనిత భౌతిక పోలికలు, ఉదాహరణలు ఇతర ధర్మాలకు చెందిన అనుచరులు కల్పంచినవే. ఫలితంగా అసలు దైవం స్ధానంలో ఈ పోలికలు, ఉపమానాలు దైవాలయ్యాయి. ఈ పోలికలు, ఉపమానాలే శరీరంగా మారి విగ్రహాల రూపం ధరించాయి. ఆపై విగ్రహారాధన ప్రారంభమయ్యింది. దైవానికి తన దాసులతో గల ఉదారత, ప్రేమ, ఆదరణలను కూడా పోలికల, ఉపమానాల రంగులో ముంచి ఒక విగ్రహంలా తయారు చేసారు. ఆర్యులు స్త్రీని ప్రేమ దేవతగా భావించేవారు, అందువల్ల దేవునికి దాసునికి గల సంబంధాన్ని తల్లి, కొడుకు అనే పేరు పెట్టారు. ఫలితంగా దైవం మాతారూపం దాల్చాడు. కొన్ని హిందూ వర్గాలు ఈ ప్రేమకు భార్యాభర్తలుగా మార్చివేసారు. ఫకీర్లు చీరలు, గాజులు ధరించి ఈ వాస్తవాన్ని ఎత్తి చూపారు. రోమీలు, యూనానీలు కూడా స్త్రీరూపంలోనే దైవాన్ని చూపారు. అయితే సామీ జాతుల్లో స్త్రీ గురించి బహిరంగంగా ప్రకటించడం సంస్కృతికి విరుధ్ధంగా భావించారు. అందువల్లే కుటుంబానికి యజమాని తండ్రిగా తీర్మానించబడింది. ఈ విధంగా బాబుల్, అసీరియా, సిరియాల శిలల్లో దైవం పురుషుని రూపంలో కనిపిస్తాడు. బనీఇస్రాయీల్ ప్రారంభ కల్పితాల్లో దైవం తండ్రి, దైవదూతలు, మానవులు ఆయన బిడ్డలుగా చూపెట్టటం జరిగింది. బనీఇస్రాయీల్ కు చెందిన కొన్ని గ్రంధాలలో భార్యాభర్తల భ్రమ, దైవం మరియు బనీఇస్రాయీల్ ల మధ్య కూడా కనబడుతుంది. చివరికి బనీ ఇస్రాయీల్ ను, జెరూసలమ్ ను భార్యగా, దైవాన్ని భర్తగా ఊహించడం జరిగింది. అరబ్ లో కూడా దైవం తండ్రిగా, దైవదూతలు ఆయన కుమార్తెలుగా భావించేవారు. ముహమ్మద్ సందేశం ఈ పోలికలను, ఉపమానాలను, పధ్ధతులను, నానుడులను పూర్తిగా ఖండించింది. వీటిని ఉపయోగించటం షిర్క్ (సాటికల్పించటం)గా పరిగణించింది. ఆయనకు పోలినది ఏదీ లేదు అని బహిరంగంగా ప్రకటించింది. ఈ ఒక్కవాక్యం షిర్క్ కు చెందిన పునాదులన్నిటినీ కదిపివేసింది. ఆ తరువాత ఒక చిన్న సూరహ్ ద్వారా మానవుల పెద్ద భ్రమను తొలగించటం జరిగింది.

قُلْ هُوَ اللهُ اَحَدٌ.  اللهُ الصَّمَدُ . لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ . وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا اَحَدٌ . (الإخلاص-1-5)

ప్రవక్తా! ఇలా పలుకు, ఆయనే అల్లాహ్, అద్వితీయుడు అల్లాహ్ నిరపేక్షాపరుడు,  ఎవరి ఆధారమూ ఎవరి అక్కరా లేనివాడు, అందరూ ఆయనపై ఆధారపడేవారే,  ఆయనకు సంతానం ఎవరూ లేరు, ఆయన కూడా ఎవరి సంతానమూ కాదు, ఆయనకు సరిసమానులు ఎవరూ లేరు. (అల్ఇఖ్లాస్-1-4)

ఖుర్ఆన్ లోని ఈ చిన్న సూరహ్ లో ఏకత్వం యొక్క పరమార్ధాన్ని విశదపరచడం జరిగింది. దీనివల్ల ఇస్లామ్ ధర్మం అన్ని రకాల అవిశ్వాసాల నుండి పరిశుధ్ధ పరచబడింది.

1. మిత్రులారా! అంటే దీని అర్ధం ముహమ్మద్ సందేశం దైవం మరియు దాసుని మధ్య ప్రేమ, ఆదరణ, గౌరవం మొదలైన వాటిని త్రెంచి వేసిందని కాదు, వారిద్దరి మధ్య ఉన్న సంబంధాలను మరింతగా ధృడపరచింది. అయితే ఈ సంబంధాలను నెరవేర్చడంలో శారీరక భావనలను, మానవ రూపాలను మాత్రమే కూల్చి వేసింది. దీని దృష్టిలో దైవానికి, దాసునికి మధ్య గల సంబంధం కంటే తండ్రి, తల్లి, కూతురు, భార్యాభర్తల సంబంధం చాలా చిన్నది. ఇటువంటి భావనల్లో ఇస్లామ్ “మీరు మీ తల్లిదండ్రులను గుర్తు చేసినట్లు అల్లాహ్ ను గుర్తుచేయండి. అంతకంటే అధికంగా కూడా” అని బోధించింది. ఇక్కడ దైవప్రీతిని బహిర్గతం చేయడానికి దైవం మీ తండ్రి అని మాత్రం అనలేదు. దైవప్రేమను, తండ్రిప్రేమగా పోల్చటం జరిగింది. అంటే ఇక్కడా శారీరక సంబంధాన్ని తొలగించి, దాని ప్రేమను మిగిల్చి ఉంచింది. అంతేకాదు తండ్రికన్నా దైవాన్నే అధికంగా ప్రేమించాలి. ఇందులోనే అభివృధ్ధి ఉంది. విశ్వాసులు అందరికంటే అధికంగా దైవాన్నే ప్రేమిస్తారు. ఎందుకంటే ఇస్లామ్ దైవాన్ని విశ్వతండ్రిగా పేర్కొనదు. విశ్వ సంరక్షకుడు అంటుంది. ఎందుకంటే ఇస్లామ్ దృష్టిలో ప్రభువు స్ధానం ఉన్నతమైనది. తండ్రీ కొడుకుల సంబంధం తాత్కాలికం. కాని దైవం దాసుల మధ్య సంబంధం శాశ్వతమైనది. దైవం, తండ్రి కన్నా తల్లి కన్నా అధికంగా తన దాసులను ప్రేమిస్తాడు. అయితే అల్లాహ్(త) ప్రాపంచిక సంబంధాలన్నిటికీ అతీతుడు.

2. మిత్రులారా! ప్రాచీన మతాల్లోని ఏకత్వపు నమ్మకాల్లో అపార్ధాలకు రెండవ కారణం గుణగణాలు, అంటే దివ్యగుణాలను దేవుని నుండి వేరుచేసి ఒక ప్రత్యేక ఉనికిగా భావించడం. హిందువుల ధర్మంలో అనేక దేవుళ్ళ అసంఖ్యాక సైన్యం కనబడుతుంది. అసలు ఇది ఈ తప్పటడుగు ఫలితమే. ప్రతి గుణాన్ని వారు ఒక ప్రత్యేక ఉనికిగా భావించారు. ఈ విధంగా ఒకే దేవుడు 33కోట్ల దేవుళ్ళుగా మారి పోయాడు. సంఖ్యను వదలి గుణాల ఉపమానాలను, పోలికలను కూడా వారు శారీరక రూపం కల్పించారు. దేవుని శక్తియుక్తుల గుణాన్ని బహిర్గతం చేయాలంటే వారు చేయి ద్వారా తెలియ పరిచారు. దేవుని శారీరక రూపానికి అనేక చేతులు కల్పించారు. వివేకాన్నీ, బుధ్ధీజ్ఞానాలను వివరించదలిస్తే ఒక తలకు బదులు అనేక తలలు కల్పించారు. హిందూ వర్గాల గురించి ఆలోచిస్తే, ఆ ఒక్క విశేష గుణాల శారీరక రూపం ఉనికి ఫలితంగా అనేక వర్గాలుగా విడిపోయారు. దైవానికి మూడు పెద్ద గుణాలు ఉన్నాయి. సృష్టించడం, కొనసాగించడం, నాశనంచేయడం. హిందూ వర్గాలు ఈ మూడు గుణాలను మూడు ప్రత్యేక వ్యక్తులుగా భావించారు. ఈ విధంగా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వర్ అంటే సృష్టికర్త, పరిరక్షించేవాడు, నాశనం చేసేవాడు గా కల్పించడం జరిగింది. వీరిని ఆరాధించేవారు మూడు వర్గాలుగా ఏర్పడ్డారు.

క్రైస్తవులు దైవం యొక్క మూడు పెద్ద గుణాలు జీవితం, జ్ఞానం, సంకల్పం మూడు ప్రత్యేక వ్యక్తిత్వాలుగా భావించారు. తండ్రి, రూహుల్ ఖుదుస్, కుమారుడు. ఇలాంటి భావాలే రోమీ, యూనానీ, ఈజిప్టు నమ్మకాల్లోనూ ఉన్నాయి. కాని ముహమ్మద్ సందేశం ఈ మహాపరాధాల తెరను తొలగించింది. నవరంగుల వల్ల మోస పోయి ఒకటిని అనేకంగా భావించటం మానవుని అజ్ఞానం, అమాయకత్వం అవుతుంది. ఖుర్ఆన్ లో సమస్త స్తోత్రాలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ కే చెందుతాయని మంచి గుణాలన్నీ ఆయనవే అని, అల్లాహ్ యే భూమ్యాకాశాల వెలుగని, పేర్కొనటం జరిగింది. అరబ్బులు అల్లాహ్ అని, క్రైస్తవులు రహ్మాన్ అని పిలిచేవారు, ఆయన్ను అల్లాహ్ అని పిలిచినా, రహ్మన్ అని పిలిచినా ఒకటే, ఇవన్నీ అల్లాహ్ పేర్లు, మంచి గుణాలు, అల్లాహ్ యే కార్యసాధకుడు బ్రతికించేవాడు, శక్తియుక్తులు గలవాడు. గుర్తుంచుకోండి, ఆయన కరుణామయుడు, క్షమించేవాడు. ఆయనే ఆకాశంలో ప్రభువు, భూమిలోనూ ప్రభువు. ఆయనే వివేకవంతుడు, తెలిసిన వాడూను. ఆయనే వినేవాడు, జ్ఞాని, భూమ్యాకాశాలకు వాటి మధ్య ఉన్నవాటికి ప్రభువు, మీకు నమ్మకమే ఉంటే ఆయన తప్ప ఆరాధ్యులేవరూ లేరు. ఆయనే బ్రతికిస్తాడు, ఆయనే చంపుతాడు, ఆయనే మీ పూర్వీకులకు ప్రభువు. అంటే ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఈ మూడు గుణాలు ఒకరివే. అధిక గుణాలు, తేడావల్ల ఒక వ్యక్తి అధిక వ్యక్తులుగా మారడు.

فَلِلّهِ الحَمْدُ رَبَّ السَّموتِ وَرَبَّ الأَرْضِ رَبُّ العَالَمِينَ .وَلَهُ الكِبْرِيَاءُ  فِى السَّموتِ وَ الأَرْضِ وَهُوَ العَزِيزِ الحَكِيمِ .(الجاثية-36-37)

కనుక అల్లాహ్ మాత్రమే స్తుతిపాత్రుడు ఆయన భూమికీ,ఆకాశాలకూ ప్రభువు, సకల లోకాలకూ ప్రభువు, భూమ్యాకాశాలలో ఘనత ఆయనకు మాత్రమే చెందుతుంది. శక్తిమంతుడూ, వివేకవంతుడూ, ఆయన మాత్రమే.(అల్ జాసియహ్-36-37)

هُوَ الَّذِى لَا اِلهَ إِلَّا هُوَ عَالِمُ الغَيْبِ وَالشَّهَادَةَ وَ هُوَ الرَّحْمنُ الرَّحِيمُ .هُوَ اللهُ الَّذِى لَا اِلهَ إِلَّا هُوَ,  الْمَلِكُ القُدُوسُ السَّلَامُ الْمُؤمِنُ المُهَيْمِنُ العَزِيزُ الجَبَارُ المُتَكَبِّرُ, سُبْحنَ للهِ عَمَّا يَصِفُونَ, هُوَ اللهُ الخَالِقُ الْبَارِىْ المُصَوِّرُ لَهُ الأَسْمَاءُ الحُسْنى , يُسَبِّحُ لَهُ مَافِى السَّموتِ  وَ الأَرْضِ, وَهُوَ العَزِيزُ الحَكِيمِ. (الحشر-22-24)

ఆయనే అల్లాహ్! ఆయన తప్ప ఆరాధ్యులెవరూ లేరు, గోచర,అగోచర విషయాలన్నీ ఎరిగినవాడు. ఆయనే కరుణామయుడు, కృపాశీలుడు, ఆయనే అల్లాహ్, ఆయన తప్ప ఆరాధ్యులెవరూ లేరు. ఆయన చక్రవర్తి, పరమ పరిశుధ్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, తన ఉత్తరువులను తిరుగులేని విధంగా అమలుపరిచేవాడు, శాశ్వతమైన గొప్పవాడు, ప్రజలు కల్పించే భాగస్వామ్యం వర్తించని పరిశుధ్ధుడు, అల్లాహ్ సృష్టి ప్యూహాన్ని రచించేవాడు, దానిని అమలు పరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు, ఆయనకు మంచి పేర్లు ఉన్నాయి, ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువూ ఆయనను స్మరిస్తుంది, ఆయన సర్వాధికుడు, వివేకవంతుడూను.(అల్ హష్ర్-22-24)

ఈ గుణాలుగల దైవాన్ని గురించి మనకు కేవలం ముహమ్మద్ సందేశం ద్వారానే తెలిసింది. కాని ఇతరులు దేవుని నుండి గుణాలను వేరుచేసి దేవుని ముక్కలు ముక్కలు చేసి వేసారు. చిట్టచివరి సందేశం ద్వారా ఆయనే అల్లాహ్ అని, ఆయనే చక్రవర్తి అని, ఆయనే పరిశుధ్ధుడని, ఆయనే సురక్షితుడని, ఆయనే శాంతి ప్రదాత అని, ఆయనే సంరక్షకుడని తెలిసింది. ఇవన్నీ ఒకే దేవుని గుణాలు, ఆయన ఒకే ఒక్కడు.

3. సాటి కల్పించటానికి మూడో కారణం దేవుని అనేక సామర్ధ్యాలు, పొరపాటున ప్రజలు “అనేక కార్యాలు నెరవేర్చేవారు అనేక మంది” అని భావించారు. ఒకరు శిక్షిస్తారు, ఒకరు కాల్చుతారు, ఒకరు పోరాడుతారు, ఒకరు ఒప్పందం కుదుర్చుతారు, ఒకరి బాధ్యత ప్రేమించడం, ఒకరు శతృత్వం వహిస్తారు, ఒకరు జ్ఞానం ప్రసాదిస్తారు, ఒకరు ధనం ప్రసాదిస్తారు, ఈ విధంగా ప్రతి పనికి వేర్వేరుగా అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. ఈ అమాయకులకు అందరూ ఒకే దేవుని పనులని ఇస్లామ్ తెలియ పరచింది. పనులన్నీ రెండు విధాలుగా ఉన్నాయి. ఒకటి మంచి, రెండు చెడు. మరో విధంగా సత్కార్యాలు, దుష్కార్యాలు. ఒక్కరి వల్లే ఈ రెండూ కాలేవు. జర్తస్త్ మతానికి చెందినవారు మంచి పనులకు ఒక దేవుడు ఉన్నాడని, చెడు పనులకు మరో దేవుడు ఉన్నాడని భావిస్తారు. మొదటి దేవుని పేరు యజ్దాన్, రెండవ దేవుని పేరు అహ్రమన్, ప్రపంచాన్ని వారిద్దరి రణరంగంగా భావిస్తారు. ఎందుకంటే వారికి మంచీ చెడుల వాస్తవం తెలియదు.

మిత్రులారా! ప్రపంచంలో ఏదీ మంచిదీ కాదు, ఏదీ చెడ్డదీ కాదు, అది మానవుని ఉపయోగించటంలో, వినియోగించటంలో ఉంటుంది. అగ్గి ఉందనుకోండి, దాని ద్వారా వంట చేసినా, ఇంజన్ నడిపినా అది మంచిదౌతుంది. ఒకవేళ దాని ద్వారా ఇతరుల ఇల్లు తగలబెట్టినా, ఇతరులను కాల్చివేసినా అది చెడు అవుతుంది. అసలు అగ్గి అనేది మంచిదీ కాదు, చెడ్డదీ కాదు, మీ వినియోగం దాన్ని మంచి లేదా చెడుగా మారుస్తుంది. అదేవిధంగా కరవాలంకూడా.

అల్లాహ్(త) ఈ విశ్వాన్ని సృష్టించాడు, భూమ్యాకాశాలనూ సృష్టించాడు, ప్రాణులను సృష్టించాడు, వస్తువుల్లో వాటి ప్రత్యేకతలను సృష్టించాడు. అనేక శక్తులు ప్రసాదించాడు. మానవుడు వాటిని చూచి ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. నేను నా ముఖాన్ని ఈ భూమ్యకాశాలను సృష్టించినవాని వైపు త్రిప్పు కున్నాను. నేను అవిశ్వాసులలోని వాడను కాను, అని స్వీకరిస్తాడు. మరోవైపు ప్రకృతిని చూచి వాటి ప్రత్యేకతలను, వాటి శక్తులను చూచి మానవుడు దేవున్నే తిరస్కరిస్తాడు, భౌతిక పదార్ధాలనే అసలుగా భావిస్తాడు. ఈ ప్రాపంచిక జీవితం తప్ప మరో జీవితం లేనేలేదు, మేము మరణిస్తాము, జీవిస్తాము, మమ్మల్ని కాలం తప్ప మరేదీ చంపదు, అని అంటాడు. ప్రకృతి అద్భుతాలు అందరి ముందూ ఉన్నాయి. అయితే బుధ్ధీజ్ఞానాలు అనేకం ఉన్నాయి. వీటిని చూచి కొందరు అల్లాహ్ వైపు మరలుతారు. మరి కొందరు అపమార్గానికి గురవుతారు. వస్తువు ఒకటే కాని మనుషులు రెండు విధాలుగా మారుతున్నారు. అదేవిధంగా దైవసందేశానికి రెండు ఫలితాలు ఉన్నాయి. ఖుర్ఆన్ ను, ఇంజీల్ ను పఠించి, పరికించి ఒక వ్యక్తి సంతృప్తి పొంది రుజుమార్గం పొందుతాడు. రెండవ వ్యక్తి వాటి పట్ల అపార్ధాలకు గురవుతాడు, వక్రమార్గాన్ని అనుసరిస్తాడు. తిరస్కారానికి వొడిగడతాడు. సందేశం ఒకటే కాని హృదయాలు రెండు, ఈ రెండూ ఒకే దేవునిచే సృష్టింపబడినవే, అంటే సృష్టికర్త ఒక్కడే, అంటే మంచీ చెడు రెండూ ఆయన చేతుల్లోనే ఉన్నాయి. వక్రమార్గం, రుజుమార్గం రెండూ ఆయన చేతుల్లోనే ఉన్నాయి.

يُضِلُّ بِه كَثِيرًا وَ يَهدِى بِهِ كَثِيْرًا وَمَا يُضِلُّ بِهِ إِلَّا الْفاسِقِيْنَ, الَّذِينَ يَنْقُضُونَ عَهْدَ اللهِ مِنْ بَعْدِ مِيثَاقِهِ  وَ يَقْطَعُونَ مَا اَمَرَ اللهُ بِهِ اَنْ يُوصَلَ وَ يُفْسِدُونَ فِى الأَرْضِ اُولئِكَ هُمُ الخسِرُونَ. (البقرة-26,27)

అల్లాహ్() దీని ద్వారా ఎంతో మందిని వక్రమార్గానికి గురిచేస్తాడు, ఇంకెంతో మందికి రుజుమార్గం ప్రసాదిస్తాడు, అయితే పాపాత్ములనే అల్లాహ్() వక్రమార్గానికి గురిచేస్తాడు. అల్లాహ్ వాగ్దానాలను దృఢపరచిన తరువాత భంగపరిచేవారు, కలిపి ఉంచండి అని అల్లాహ్ ఆదేశించిన దాన్ని త్రెంచేవారు, ఇంకా భూమిలో కల్లోలాన్ని  రేకెత్తించేవారు వాస్తవంగా నష్టపడేవారు వీరే.(అల్ బఖరహ్-26,27)

ఈ వాక్యాల్లో రుజుమార్గం వక్రమార్గం రెంటికీ మూలం ఆయనే అని, కాని వాటికి పాల్పడేది మీరే అని విశదపర్చబడింది. అంటే పాపాలు చేసింది మీరు, సంబంధాలను త్రెంచింది మీరు, కల్లోలాన్ని సృష్టించింది మీరు, అవిశ్వాసానికి గురైతే అంధకారం అలుముకుంది. అంధకారం ముందు, పాప కార్యాలు తర్వాత రాలేదు. అల్లాహ్(త) మానవుడ్ని సృష్టించాడు, రెండు మార్గాలను చూపాడు, ఇది స్వర్గానికి పోయే మార్గం అని, అది నరకానికి పోయే మార్గం అని.

اِنّا هَدَيْنَاهُ اَلسَّبِيْلَ اِمَّا شَاكِرًا وَّ اِمَّا كَفُوْرًا. (الدهر-3)
మేము అతనికి రెండు మార్గాలను చూపాము, కృతజ్ఞులుగా ఉండవచ్చు,కృతఘ్నతకూ పాల్పడవచ్చు.(అద్దహ్ర్-3)

اَلله رَبُّكُمْ خَالِقُ كُلِّ شَئٍ لاَ اِلهَ اِلاَّ هُوَ
అల్లాహ్ యే మీ ప్రభువు, ప్రతి వస్తువుకూ ఆయనే సృష్టికర్త, ఆయన తప్ప ఆరాధ్యులేవరూ లేరు.

وَاللّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُوْنَ
అల్లాహ్ మిమ్మల్ని మీరు ఆచరించే దానినీ సృష్టించాడు.

اَعْطى كُلَّ شئٍ خَلَقَهُ ثُمَّ هَدى
ఆయన ప్రతి ప్రాణికీ అన్నీ ఏర్పాట్లు చేసాడు, ఆపై రుజుమార్గం  ప్రసాదించాడు.

అల్లాహ్ ప్రసాదించిన వనరులను సన్మార్గం మంచిగా, వక్రమార్గం చెడుగా వాడుకుంటున్నారు, చెడును అవలంభిస్తే వక్రమార్గం తిరస్కారం, మంచిని అవలంభిస్తే రుజుమార్గం, విధేయత అవుతుంది. ఎందుకంటే అన్నిటినీ సృష్టించినవాడు ఆ అల్లాహ్ యే.

هَلْ مِنْ خَالِقٍ غَيْرَ اللهِ يَرْزُقُكُمْ مِنَ السَّمَاءِ وَ الأرْضِ لاَ اِلهَ إلاّ هُوَ فَأَنّى تُؤفَكُوْنَ. (فَاطِر-3)

అల్లాహ్ తప్ప ఇంకెవరైనా ఆరాధ్యులు ఉన్నారా? ఆయనే మీకు ఆకాశం నుండి భూమి నుండి ఉపాధి ఇస్తున్నాడు. ఆయన తప్ప ఆరాధ్యులేవరూ లేరు. మరి మీరు ఎటు తరిమివేయబడుతున్నారు.(ఫాతిర్-3)

ثُمَّ اَوْرَثْنَا الْكِتَابَ الَّذيْنَ اصْطَفَيْنَا مِنْ عِبَادِنَا فَمِنْهُمْ ظَالِمٌ لِنَفْسِهِ وَ مِنْهُمْ مُقْتَصِدٌ وَ مِنْهُمْ سَابِقٌ بِالْخَيْرَاتِ بِإذْنِ اللهِ .(فَطِرْ-32)

తరువాత మేము వారిని గ్రంధానికి వారసులుగా చేసాము. వారిని మేము తన దాసులలో    నుండి ఎన్నుకున్నాము. వారిలో కొందరు తమ్ముతాము నష్టపరచుకుంటారు. మరికొందరు మధ్యస్ధ మార్గాన్ని  అవలంభిస్తారు. మరికౌందరు సత్కార్యాల్లో చురుకుగా ముందు ఉంటారు.(ఫాతిర్-32)

وَمَا اَصَابَكُمْ مِنْ مُصِيْبَةٍ فَبِمَا كَسَبَتْ اَيْدِيْكُمْ وَ يَعْفُو عَنْ كَثِيْرٍ.(الشورى-30)

మీకు వచ్చే కష్టనష్టాలు మీ చేతులు సంపాదించుకున్నవే, అయతే చాలా విషయాలను ఆయన క్షమించివేస్తూ ఉంటాడు.(అష్షూరా-30)

فاَلْهَمَهَا فُجُوْرَهَا و تَقْوَاهَا , قَدْ اَفْلَحَ مَنْ زَكَهَا , وَ قَدْ خَابَ مَنْ دَسَاهَا.(الشمس-8-10)

ప్రతిప్రాణికీ అల్లాహ్ దాని పుణ్యాలను, పాపాలను తెలియపరిచాడు, తన్నుతాను కాపాడుకున్నవాడు సాఫల్యం పొందుతాడు, తన్నుతాను పాపాలకు గురిచేసుకున్నవాడు నష్టపోతాడు. (అష్షమ్స్-8-10)

4. దైవారాధన ప్రతి మతంలో ఉండేది ఉంది. ప్రాచీన ధర్మాల్లో శరీరాన్ని కష్టపెట్టటమే ఆరాధనగా భావించేవారు. శరీరాన్ని ఎంత కష్టపెడితే అంత పుణ్యం లభిస్తుందని హృదయం అంత పరిశుధ్ధంగా మారుతుందని భావించబడేది. దీని ఫలితంగానే హిందువుల్లో తపస్సు, క్రైస్తవుల్లో వైరాగ్యం ప్రారంభమయింది. అనేక శ్రమలతో కూడిన పనులు ఉనికిలోనికి వచ్చాయి. వీటివల్ల దైవప్రీతి పొందగలమని భావించడం జరిగింది.కొందరు జీవితాంతం స్నానానికి దూరంగా ఉంటారు. కొందరు జీవితాంతం గుహలో కూర్చోని ఉంటారు. కొందరు జీవితాంతం ఎండలో నిలబడి ఉంటారు. వీటినే ఆరాధనగా భావిస్తారు. ఇస్లామ్ కు ముందు దైవసాన్నిహిత్యాన్ని పొందే మార్గాలు ఇవే అని భావించేవారు. ముహమ్మద్ సందేశం వచ్చి మానవులను ఈ కష్టాల నుండి గట్టెక్కించింది. ఇవి ఆరాధనలు కావని శారీరక వ్యాయామాలని తెలిపింది. మన దైవానికి శారీరక రూపం కాదు, హృదయం రంగు చాలా ఇష్టం, శక్తికి మించిన కష్టం ఇస్లామ్ లో లేనేలేదు.

لاَ يُكَلِّفُ اللهُ نَفْساًاِلاَّ وُسْعَهَا.(البقرة-286)
అల్లాహ్(త) ఏ ప్రాణికీ దాని శక్తికి మించిన పని గురించి ఆదేశించడు.(అల్ బఖరహ్-286)

وَ رُهْبَانِيَةَ اِبْتَدَعُوا هَا ماَ كَتَبْنَا هَا عَلَيْهِمْ.(الحديد-27)
సన్యాసత్వాన్ని వారు ధర్మంలో చేర్చుకున్నారు, కాని మేము దాన్ని వారిపై విధించలేదు.(అల్ హదీద్-27)

لاَ مَرْوَةَ فِي الاِسْلامِ.(ابوداوْد)
ఇస్లామ్ లో సన్యాసత్వం లేదు.(అబూదావూద్)

قُلْ مَنْ حَرَّمَ زِيْنَةَ اللهِ الَّتِى اَخْرَجَ لِعِبَادِهِ.(لأعراف-32)
ఇలా పలుకు! అల్లాహ్(త) తన దాసుల కొరకు ఏర్పాటు చేసిన భోగభాగ్యాలను నిషేధించింది ఎవరు?(అల్ఆరాఫ్-32)

يآيها النَّبِيُّ لِمَ تُحَرِّمُ مَا اَحَلَّ اللهُ لَكَ.(التحريم-1)
ఓ ప్రవక్తా! అల్లాహ్ నీ కొరకు ధర్మసమ్మతం చేసిన దాన్ని నీవెందుకు నిషేధిస్తున్నావు?(అత్తహ్రీమ్-1)

إنَّ الَّذِيْنَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِى سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِيْنَ.(المؤمن-6)
నా ఆరాధనను తిరస్కరించి అహంకారంగా ప్రవర్తించిన వారిని నీచాతి నీచమైన స్ధితిలో నరకంలో పడవేస్తాను.(అల్ మూమిన్-6)

يآايُّهَاالنَاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِى خَلَقَكُمْ وَالَّذِيْنَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ. (البقرة-21)

ఓ ప్రజలారా ! మీరు మీ దైవాన్నే ఆరాధించండి, ఆయనే మిమ్మల్నీ, మీ పూర్వీకులనూ    సృష్టించాడు. మీరు దైవభీతి పరులుగా మారాలని.(అల్ బఖరహ్-21)

إنَّ الصَّلاَةَ تَنْهى عَنِ الفَحْشَاءِ وَ المُنْكَرِ.(العنكبوت-45)
నిస్సందేహంగా నమాజ్ అశ్లీల కార్యాల నుండి, చెడు నడతల నుండి వారిస్తుంది.(అల్అన్కబూత్-45)                                   

 يآايُّهَاالذِيْنَ آمَنُوكُتِبَ عَلَيْكُمُ الصِيَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِيْنَ مِنْ قبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُوْنَ. (البقرة-183)
ఓ విశ్వాసులారా! మీ పూర్వీకులపై విధించబడినట్టు మీపై కూడా ఉపవాసాలు విధించబడ్డాయి,    మీలో దైవభీతి జనించాలని.(అల్ బఖరహ్-183)

لِيَشْهَدُوا مَنَافِعَ لَهُمْ وَيَذْكُرُوا اسْمَ اللهِ فِى اَيَّامٍ مَعْلُومَاتٍ عَلّى مَا رَزَقَهُمْ مِنْ بَهِيْمَةِ الأنْعَامِ. (الحج-28)
వారు తమ కొరకు ఇక్కడ ఉంచబడిన ప్రయోజనాలను చూసుకోవాలని, అల్లాహ్ వారికి ప్రసాదించిన పశువులకు కృతజ్ఞతగా కొన్ని నిర్ణీత దినాలలో ఆయన పేరును స్మరించాలని.(అల్ హజ్జ్-28)

الَّذِى يُؤتِى ماَله يَتَزَكَّى وَماَ لِأَحَدٍ عِنْدَهُ مِنْ نِعْمَةٍ تُجْزَئ إلاَّ ابْتَغاء وجْهِ رَبِّهِ الأَعْلَى. (الليل-18-20)
పరిశుధ్ధుడు కావటానికి తన సంపదను ఖర్చుచేసే పరమ దైవభీతిపరుడు దానికి దూరంగా ఉంచ బడతాడు. అతనికి ఎవ్వరూ ఏ విధమైన ఉపకారం చేయలేదు. దానికి అతను బదులు తీర్చెందుకు, అతను కేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే ఈ పని చేసాడు, ఆయన తప్పకుండా సంతోషిస్తాడు.(అల్లైల్-18-20)

اَلنِّكَاحُ مِنْ سُنَّتِى وَ مَنْ رَغِبَ عَنْ سُنَّتِى فَلَيْسَ مِنِّى .(ابن ماجه)
నికాహ్ నా సాంప్రదాయం, నా సాంప్రదాయాన్ని తిరస్కరించినవాడు మావాడు కాడు.(ఇబ్నుమాజ)

وَ الَّذِينَ يَقُولُونَ رَبَّنَا هَبْ لَنَا مِنْ اَزْوَاجِنَا وَ ذُرِّيّتِنَا قُرَّةَ اَعْيُنٍ.(الفرقان-74)
వారు ఇలా ప్రార్ధిస్తూ ఉంటారు, మా ప్రభూ మాకు మా భార్యల ద్వారానూ మా సంతానం ద్వారానూ కంటి చలువను ప్రసాదించు.(అల్ ఫుర్ఖాన్-74)

ఆరాధనల్లో ఒక ఆరాధన ఖుర్బానీ కూడా ఉంది. ప్రజలు తమ్ము తాము దేవతలపై త్యాగం చేస్తారు. తమ సంతానాన్ని తమ సొత్తుగా భావించి బలిస్తారు. దేవతలకు రక్తపు చుక్కలు సమర్పించు కుంటారు. ఖుర్బానీ ఇవ్వబడిన జంతువు మాంసం కాల్చివేయబడేది. దాని పొగ దేవతలకు సంతోషపరిచేది. అందువల్లే యూదులు మాంసాన్ని కాల్చేవారు. కాని ముహమ్మద్(స) అసలు ఖుర్బానీ ఉద్దేశం ఏమిటి అనేది వివరించారు. ఆయన సందేశం మానవుల సమర్పణను అరికట్టింది. జంతువుల ఖుర్బానీని కొనసాగించింది. ఈ ఖుర్బానీలో రక్తపు చుక్కలు చల్లే అవసరం లేదు. మాంసం కాల్చే అవసరం అంతకన్నా లేదు. అసలు ఖుర్బానీ ఉద్దేశం ఏమిటంటే,

وَالبُدُنَ جَعَلْنَاهَا لَكُمْ مِنْ شَعَائِرِ اللهِ لَكُمْ فِيْهَا خَيْرٌ فَاذْكُرُوا اسْمَ اللهِ عَلى صَوَافٍ, فَاِذَا وَجَبَتْ جُنُوبُهَا فَكُلُوا مِنْهَا وَاَطْعِمُوا القَانِعَ وَالمُضْتَرَّ, كَذَلِكَ سَخَّرْنَاهَا لَكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ, لَنْ يَنَالَ اللهَ لُحُومُهَا وَلاَ دِمَائُهَا, وَلَكِنْ يَنَالُهُ التَّقْوى مِنْكُمْ , كَذَلِكَ سَخَّرَهَا لَكُمْ وَلِتُكَبِّرُوا اللهَ  عَلى مَا هَدَكُمْ وَ بَشَّرِ المُحْسِنِينَ.(الحج-37)

ఒంటెలను మేము మీ కొరకు అల్లాహ్ చిహ్నాలలో చేర్చాము. మీకు వాటిలో మేలు ఉన్నది. కనుక వాటిని నిలబెట్టి వాటిపై అల్లాహ్ పేరును స్మరించండి. వాటి వీపులు నేలపై ఆనినపుడు వాటిలో   నుండి స్వయంగానూ తినండి, అడిగే వారికి, అడగని వారికి తినిపించండి. తమ అవసరాలకు  అడిగే వారికి తినిపించండి. ఈ విధంగా మేము జంతువులను మీకు వశపరిచాము. మీరు కృతజ్ఞతలు తెలుపుకుంటారని, వాటి మాంసమూ, వాటి రక్తమూ అల్లాహ్ కు చేరవు, కాని మీ భయభక్తులు ఆయనకు చేరుతాయి. ఆయన వాటిని మీకు ఈవిధంగా వశపరిచాడు. ఆయన ప్రసాదించిన మార్గదర్శకత్వానికి మీరు ఆయన గొప్పతనాన్ని చాటేందుకు, ఓ ప్రవక్తా,  సత్కార్యాలు చేసేవారికి శుభవార్త వినిపించు.(అల్ హజ్జ్-37)

ఖుర్బానీ యొక్క ఒక తప్పుడు భావన మానవుని ప్రాణం అతని సొత్తని, అదే విధంగా అతడి సంతానం ప్రాణాలు కూడా అతడి సొత్తని, అతడి భార్య ప్రాణాలు కూడా అతడి సొత్తని, క్రొత్త సమస్యను తెచ్చి పెట్టింది. ఈ తప్పుడు భావన ఆత్మహత్య, కుమార్తె హత్య, సంతాన హత్య, భార్య హత్య(సతి) అనే మానవ సంహరణ ఆచారాలను జనింపజేసింది. ముహమ్మద్ సందేశం వీటన్నిటినీ నేలమట్టం చేసింది. అందరి ప్రాణాలూ అల్లాహ్ సొత్తు అని, ఒక ప్రామాణికతను చూపించింది. వాటిని దైవాదేశం ప్రకారమే తీయాలని ఆదేశించింది. అందువల్లే అల్లాహ్ తప్ప ఇతరుల పేర జిబహ్ చేయబడిన జంతువును తినటాన్ని నిషేధించింది. ఆత్మహత్య చేసుకున్న వారికి స్వర్గాన్ని నిషేధించడం జరిగింది. ఇస్లామీయ ప్రపంచం తప్ప మిగతా ప్రాంతాలన్నిటిలో చివరికి యూరప్, అమెరికాల్లో కూడా కష్టాల నుండి గట్టెక్కడానికి ఆత్మహత్యను ఒక మంచి ఉపాయంగా భావిస్తారు. చట్టం దీన్ని నిషేధించాలని ప్రయత్నిస్తుంది. కాని వారించలేకపోతుంది. ఎందుకంటే ప్రతివ్యక్తి తన ప్రాణం తన సొత్తుగా భావిస్తున్నాడు. ఈ చర్య వల్ల కష్టాలూ, ఆపదలూ దూరమౌతాయని, మరణానంతర జీవితం లేదని, ఉన్నా మనల్ని విచారించటం జరగదని భావించడం జరుగుతుంది. అయితే ప్రాణం మనది కాదని అది దేవునిదని, ఆత్మహత్యల ద్వారా కష్టాలు వదిలించుకోవటం తప్పుడు అభిప్రాయం అని, ఈ విధంగా కష్టాలకు దూరం అయితే మరణానంతరం అంతకంటే కఠినమైన కష్టాలకు గురికావలసి వస్తుందని ముహమ్మద్ సందేశం తెలియపరచింది.

وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِى حَرَّمَ اللهُ اِلَّاَ بِالْحَقَّ وَلَا تَقْتُلُوا اَنْفُسَكُمْ اِنَّ اللهَ كَانَ بِكُمْ رَحِيْمَا , وَمَنْ يَفْعَلْ ذَلِكَ عُدْوَانًا وَ ظُلْمًا فَسَوْفَ نُصْلِيهِ نَارَا.(النساء-30)

నిషేధించిన ప్రాణాన్ని హత్య చేయకండి, న్యాయంగా తప్ప మిమ్మల్ని మీరు హత్య చేసుకోకండి, ఎందుకంటే అల్లాహ్ మీ పట్ల కారుణ్యం కలిగి ఉన్నాడు, ఒకవేళ ఎవరైనా అలా చేస్తే, అతన్ని నరకం లోనికి నడిపిస్తాము.(అన్నిసా-30)

అరబ్ లో కూతురి హత్యలు కొనసాగేవి. భారతదేశానికి చెందిన రాజకుమారుల్లో కూడా ఈ ఆచారం ఉండేది. ఇతర దేశాల్లోనూ ఈ ఆచారం ఉండేది. అరబ్ లో మరీ క్రూరంగా ఉండేది. ఆడబిడ్డలను సజీవంగా ఖననం చేసేవారు. ముహమ్మద్ (స) సందేశం యొక్క ఒక్క వాక్యం ఈ మూఢాచారాన్ని ఖండించింది.

وَاِذَا المَوْؤُدَةُ سُئِلَتْ بِاَيِّ ذَنْبٍ قُتِلَتْ.(التكوير-8,9)
ఆరోజు సజీవంగా పూడ్చిపెట్టబడిన అమ్మాయిని అడగటం జరుగుతుంది. ఏపాపం కారణంగా చంపబడిందని ప్రశ్నించడం జరుగుతుంది.(అత్తక్వీర్-8,9)

తన సంతానాన్ని హత్య చేయటం అరబ్ లో నేరంగా భావించబడేది కాదు. ఈనాడు కూడా అనేక మంది పసిబిడ్డలు చంపబడుతున్నారు. దేశంలో పంటలు తక్కువగా ఉన్నాయని, జనాభాను నియంత్రించాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అరబ్బుల్లో, ఇతరుల్లో అబార్షన్ చేయించినా, హత్యకు సంబంధించిన చట్టం ఏమీ చేసేదికాదు. యూనాన్ లో పుట్టిన బిడ్డ బలహీన మైనదైతే చంపేవారు. ఆ బిడ్డను కొండపై నుండి విసిరి చంపేవారు. ఈనాడు కూడా బర్త్ కంట్రోల్ పేరుతో ఇదే జరుగుతుంది. ముహమ్మద్ సందేశం ఉపాధి ఎవరూ ఎవరికీ ఇవ్వలేరని, అందరికీ అల్లాహ్ యే ప్రసాదిస్తాడనే వాస్తవాన్ని తెలిపింది.

وَمَا مِنْ دَابَّةٍ فِى الأَرضِ  اِلاَّ عَلى اللهِ رِزْقُهَا.(هود-6)
భూమిపై ఉన్న ప్రతి ప్రాణి ఉపాధి బాధ్యత అల్లాహ్ పైనే ఉంది.(హూద్-6)

وَلَا تَقْتُلُوا اَوْلَادَكُمْ خَشْيَةَ اِمْلَاقٍ نَحْنُ نَرْزُقُهُمْ وَ اِيَّاكُمْ , اِنَّ قَتْلَهُمْ كَانَ خَطْءًا كَبِيْرًا. (الإسراء-31)
పేదరికం వల్ల మీ సంతానాన్ని చంపుకోకండి,మేము వారికీ, మీకూ ఇద్దరికీ ఉపాధి ప్రసాదిస్తాము. నిస్సందేహంగా వారిని చంపడం మహాపాపం.(అల్ ఇస్రా-31)

మహా పాపకార్యాల్లోని ఈ మహా పాపం ప్రవక్త(స)ను తిరస్కరించిన జాతిలో కూడా ఉండేది. ప్రజలు దైవదాసుల మధ్య వంశం, కులం, ధనం, రంగు మొదలైన బేధాలను ఏర్పరచు కున్నారు. భారతదేశం ప్రారంభం నుండి ఈనాటి వరకు తాను తప్ప ఇతరులందరినీ అపరిశుభ్రమైనవారుగా పరిగణించింది. తనను నాలుగు వర్గాలుగా విభజించి గౌరవమర్యాదల క్రమబధ్ధతను ఏర్పరచింది. క్షూద్రులకు ధర్మాధికారాలు ఉండేవికావు. ప్రాచీన ఈరాన్ లో కూడా ఈ నాలుగు జాతులే ఉండేవి. రోమన్లు తమను పాలకులుగా, ఇతరులను దాసులుగా భావించేవారు. బనీఇస్రాయీల్ కేవలం తామే దైవ కుమారులమని, ఇతరులందరూ నీచులని తీర్మానించారు. తమ జాతిలో కూడా తరగతులను ఏర్పరచుకున్నారు. అంత ఎందుకు యూరప్ తన సంస్కృతి, మానవతా వాదం, సమానత్వం గురించి వాదించినా దాని పరిస్ధితి కూడా ఎలా ఉంది?

తెల్లవారు తమ్ముతాము పెత్తందార్లుగా, అధికారులుగా భావించారు. నల్లవారు వారికి సమానులు కారని పరిగణించేవారు. ఆసియా ప్రజలు ప్రయాణంలో కూడా వారితో పాటు ఒకేచోట కూర్చోలేరు. కొన్ని దేశాలలో వారి కాలనీలలో నివసించలేరు కూడా. వారికి వర్తించిన హక్కులు వీరికి వర్తించవు. అమెరికాలోని మానవతా వాదుల దృష్టిలో అక్కడి నల్లవారికి జీవించే హక్కు కూడా లేదు. ఆఫ్రికాలో హబషీలకు, భారతీయులకు కూడా మానవహక్కులు సరిగా వర్తించేవికావు. ఈ తేడా, తారతమ్యాలు ప్రాపంచిక విషయాల్లోనే కాదు, ఆరాధనాలయాల్లో కూడా ఉండేవి. తెల్లవారి ఆరాధనాలయాలు వేరు, నల్లవారి ఆరాధనాలయాలు వేరు. ఇద్దరూ ఒకేచోట దేవుని ముందు తల దించలేరు. ముహమ్మద్ సందేశం వీటన్నిటినీ రూపుమాపింది. ఇస్లామ్ లో అందరూ సమానమే. ధనసంపదలు, రంగు, వంశం, కుటుంబం మొదలైనవి ప్రజల మధ్య తారతమ్యాల్ని సృష్టించలేవు. మక్కా విజయంనాడు ఖురైషులందరూ కాబా దగ్గర నిలబడి ఉన్నారు, ప్రవక్త(స) వారినుద్దేశించి ఇలా అన్నారు, 

يَا مَعْشَرَ قُرَيْشٍ اِنَّ اللهَ قَدْ اَذْهَبَ عَنْكُمْ نِخْوَةَ الجَاهِلِيَّةِ وَ تُعَظِّمُهَا بِالآبَاءِ,

النَّاسُ مِنْ آدَمَ وَآدَمَ مِنْ تُرَابٍ .(ابن هشام)

ఓ ఖురైష్ ప్రజలారా ! అజ్ఞాన కాలపు అహంకారాన్ని, వంశగర్వాన్ని అల్లాహ్ రద్దుచేసాడు. మానవులందరూ ఆదమ్ సంతతి, ఆదమ్ మట్టిద్వారా సృష్టించబడ్డారు.(ఇబ్నెహిషామ్)

హజ్జతుల్ విదాలో ఇలా ఉపదేశించారు:-

لَيْسَ لِلْعَرَبِى فَضْلُ عَلى الأَعْجَمِى وَ لَيْسَ للأَعْجَمِى فَضْلُ عَلى العَرَبِى, كُلُّكُمْ اَبْنَاءُ آدَمَ وَ آدَمَ مِنْ تُرَابٍ.(مسند احمد)

అరబ్బులకు ఇతరులపై, ఇతరులకు అరబ్బులపై ఎటువంటి ప్రాధాన్యత లేదు, మీరంతా ఆదమ్ సంతానం, ఆదమ్ మట్టి ద్వారా సృష్టించబడ్డారు.(ముస్నద్ అహ్మద్)

 ముహమ్మద్ దైవవాణి మానవులందరినీ ఉద్దేశించి ఇలా పేర్కొంది:-

يآ اَيُّهَا النَّاسُ اِنَّا خَلَقْنكُمْ مِنْ ذَكَرٍ وَ اُنْثَى وَ جَعَلْنكُمْ شُعُوبًا وَ قَبَائِلَ لِتَعَارَفُوا اِنَّ اَكْرَمَكُمْ عِنْدَ اللهِ اَتْقكُمْ.(الحجرات-13)

మానవులారా! మేము మిమ్మల్ని ఒకే ఆడ,మగ జంట నుండి సృష్టించాము.మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేసాము. వాస్తవానికి మీలో అందరికంటే అధికంగా భయభీతులు గలవాడే అల్లాహ్ దృష్టిలో ప్రీతిపాత్రుడు.(అల్ హుజురాత్-13)

మరో ఆదేశం:-

وَمَا اَمْوَالُكُمْ وَلَا اَوْلَا دُكُمْ بِالَّتِى تُقَرِّبُكُمْ عِنْدَنَا زُلْفى اِلَّا مَنْ آمَنَ وَ عَمِلَ صَالِحًا فَاُلئِكَ لَهُمْ جَزَآءُ الضِّعْفِ بِمَا عَمِلُوا.(سبا-37,38)

మిమ్మల్ని మాకు దగ్గర చేసేది మీ సంపద గానీ, మీ సంతానంగానీ కాదు. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మాత్రమే, ఇటువంటి వారికే తాము చేసిన దానికి రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది.(సబా-37,38)

ముస్లిములందరినీ పరస్పర సోదరులుగా పరిగణించింది. ప్రవక్త(స) హజ్జతుల్ విదా సందర్భంగా లక్షకు పైగా ఉన్న సమూహం ముందు ఒక ముస్లిమ్ మరో ముస్లిమ్ కు సోదరుడని ప్రకటించారు. ఈ సమానత్వం, సోదరభావం అంతకు ముందు ఉన్న తేడాలన్నిటినీ పటాపంచలు చేసివేసింది. దేవుని దయవల్ల మీరందరూ సోదరులుగా మారిపోయారు అని ఆదేశించడం జరిగింది. దైవ గృహంలో ఎటు వంటి తేడా లేదు. వంశాల, కుటుంబాల తేడా లేదు. వృత్తుల, పదవుల తేడా లేదు. దారిద్ర్యాల, ధన సంపదల తేడా లేదు. దేవుని ముందు అందరూ సమానులే. ఇక్కడ ఎవరూ క్షూద్రులు కారు బ్రాహ్మణులు కారు. ఖుర్ఆన్ అందరూ చదవగలరు. నమాజు అందరూ చదవగలరు. అందరి మధ్యా సంబంధాలు ఏర్పడగలవు. విద్య నేర్చుకునే హక్కు అందరికీ ఉంది. అందరి హక్కులూ సమాన మైనవే. రక్తం కూడా అందరిదీ సమానమే.

మిత్రులారా! ముహమ్మద్ సందేశ ఉపకారాలను మీ ముందు ఉంచాలని అనుకున్నాను. కాని సమయం లేక చింతిస్తున్నాను. స్త్రీలకు, బానిసలకు వారి హక్కులను ఇప్పించింది. మానవతా వాదులున్న యూరప్ లో కూడా ఇలాంటి ఆలోచన లేదు. కాని సమయం లేక చింతిస్తున్నాను. ప్రపంచంలో ప్రాపంచికత, ధార్మికతలలో పడి ప్రాపంచిక కార్యాలను, ధార్మిక కార్యాలను వేరు చేయడం జరిగింది. దైవాదేశాన్ని చక్రవర్తి ఆదేశాన్ని వేరు చేయడం జరిగింది. ప్రపంచాన్ని పొందే మార్గం వేరని, ధర్మాన్ని పొందే మార్గం వేరని భావించడం జరిగింది.

యువకులారా! ఇది చాలా పెద్ద పొరపాటు. ఈ పొరపాటు ప్రపంచమంతా వ్యాపించి ఉండేది. ముహమ్మద్ సందేశం దీన్ని తొలగించింది. ఏకాగ్రతతో, నిర్మలమైన మనస్సుతో ప్రాపంచిక కార్యాలను అల్లాహ్, ఆయన ప్రవక్త ఆదేశాలకు అనుగుణంగా నెరవేర్చడమే ధర్మం అని వివరించింది. అంటే అల్లాహ్ ఆదేశాల ప్రకారం ప్రాపంచిక కార్యాలు నెరవేర్చటమే ధర్మం. కొందరు ప్రజలు గుహల్లో కూర్చోని, ఏకాంతంగా ధ్యానంలో నిమగ్నమవటం, స్మరించటం, ప్రార్ధించటం మాత్రమే ధార్మికతగా భావిస్తారు. స్నేహం, మిత్రులు, భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు, జాతి, దేశం, ఆత్మరక్షణ, ఉపాధి, సంరక్షణ మొదలైనవన్నీ ప్రాపంచికతగా భావిస్తారు. ఇస్లామ్ ఈ వాస్తవాన్ని అందరి ముందూ పెట్టింది. దైవాదేశాల ప్రకారం వాటిని నెరవేర్చడమే ధార్మికత అని చాటి చెప్పింది.

ఇస్లామ్ లో సాఫల్యం రెండు విషయాలపై ఆధారపడి ఉంది. విశ్వాసం, సత్కార్యాలు. ఐదు విషయాలను విశ్వసించటాన్ని విశ్వాసం అంటారు. అల్లాహ్ ను, దైవదూతలను, దైవప్రవక్తలను, దైవ గ్రంధాలను, జాతకాన్ని విశ్వసించటం. ఈ ఐదు విషయాలను విశ్వసించడమే విశ్వాసం అనబడుతుంది. ఆచరణ దీని పైనే ఆధారపడి ఉంది. ఈ విశ్వాసం లేకుండా ఏ కార్యమూ స్వీకరించడం జరుగదు. రెండవది ఆచరణ – మనం చేసే పనులు, సత్కార్యాలు. ఇవి మూడు విధాలు, 1. దైవంతో సంబంధం ఉన్న ఆరాధనలు. 2. వ్యవహారాలు అంటే పరస్పర లావాదేవీలు, వ్యాపారం మొదలైనవి, దైవాదేశాల ప్రకారం వీటిని నెరవేరిస్తే న్యాయం ధర్మం కొనసాగుతుంది. 3. నైతికత అంటే చట్టపరంగా విధించబడని పరస్పర హక్కులు, ఆత్మీయతకు సమాజ అబివృధ్ధికి ఇవి తప్పనిసరి. అంటే 1. విశ్వాసం 2. ఆరాధనలు 3. లావాదేవీలు 4. నైతికతలు. ఈ నాలుగు విషయాలే సాఫల్యానికి ప్రధాన మైనవి.

యువకులారా! నన్ను సూటిగా చెప్పనివ్వండి. మౌనం, ప్రశాంతం, ఒంటరితనం, ఏకాంతంగా జీవితం గడపటం ఇస్లామ్ కాదు. ఇస్లామ్ అంటే ప్రయత్నం, కృషి, ఆచరణ, నిబధ్ధత. అది చావు కాదు జీవితం. అల్లాహ్ ఆదేశం:-

لَيْسَ لِلْإِنْسَانِ اِلاَّ مَا سَعى.(النجم-39)
మానవుడు ప్రయత్నించినదే అతనికి లభిస్తుంది.(అన్నజ్మ్-39)

كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ رَهِيْنَةً.(المدثر-38)
ప్రతి ప్రాణి తన ఆచరణకు బదులు తాకట్టుగా ఉంది.(అల్ ముద్దస్సిర్-38)

ఇస్లామ్ అంతా కృషిప్రయత్నాలే. కాని ఏకాంతంగా కూర్చోని కాదు. మైదానంలోకి రావాలి. ప్రవక్త(స) జీవిత చరిత్ర మన ముందు ఆదర్శంగా ఉంది. ఆ తరువాత నలుగురు ఖలీఫాల జీవితం మన ముందు ఉంది. ఇవన్నీ మనకు ఆదర్శాలు. ఇందులోనే మన సాఫల్యం ఇమిడి ఉంది. ముక్తి మార్గం ఇదే. ఇదే అభివృధ్ధి పధం. ముహమ్మద్(స) సందేశం బుధ్ధుని సందేశంలా కోరికలను అణచివేసేది కాదు. సరైన కోరికలను సరైన విధంగా తీర్చుకోవడం ముహమ్మద్ సందేశం. ఈసా(అ) సందేశంలా ధనసంపదలను, శక్తులను నీచంగా చూచేదిగా, నిషేధించేదిగా లేదు. వాటిని సంపాదించే, ఖర్చు చేసే మార్గాలను సంస్కరించింది. వాటిని ఖర్చు చేసే విధానాన్ని, సందర్భాన్నీ నిర్ణయించింది.

మిత్రులారా! విశ్వాసం, దాని ప్రకారం సత్కార్యం అనేదే ఇస్లామ్. ఇస్లామ్ అంటే ఆచరణ. ఆచరణను విస్మరించటం కాదు, విధులను నిర్వర్తించాలి. విధుల నుండి తప్పించుకోవటం కాదు, వీటి గురించి ప్రవక్త(స) జీవితంలో, ప్రవక్త(స) అనుచరుల జీవితంలో మనకు ఎన్నో ఆదర్శాలున్నాయి. వాటి చిత్రం ఇలా ఉంది,

مُحَمَّدٌ رَسُولُ اللهِ وَ الَّذِينَ مَعَهُ اَشِدَّاءُ عَلى الْكُفَّارِ رُحَمَاءُ بَينَهُمْ, تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا  يَبْتَغُونَ  فَضْلاً مِنَ اللهِ وَ رِضْوَانًا.(لفتح-29)

ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త, ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగానూ, పరస్పరం కరుణామయులుగానూ ఉంటారు, నీవు వారిని చూసినపుడు వారు రుకూ, సజ్దాలలో, అల్లాహ్ అనుగ్రహాన్నీ, ఆయన ప్రసన్నతనూ అర్ధించటలో నిమగ్నులై ఉండటం కనిపిస్తుంది.(అల్ఫత్ హు-29)

సత్యతిరస్కారుల పట్ల పోరాటం కూడా ఉంది. పరస్పరం సహృద్భావం, ప్రేమాభిమానాల భావనలు కూడా, దైవం ముందు రుకూలు, సజ్దాలు కూడా చేస్తారు. ప్రాపంచికపరంగా దైవకారుణ్యాన్ని, ఆయన ఉపాధిని కూడా ఆశిస్తారు. అయితే అది కూడా ధర్మం ప్రకారమే.

رِجَالٌ لَا تُلْهِيهِمْ تِجَارَةٌ وَ لَا بَيْعٌ عَنْ ذِكْرِاللهِ.(النور-37)
వీరు ఎలాంటి వారంటే, వీరి వ్యాపారం, లావాదేవీలు వీరిని దైవధ్యానం నుండి వేరు చేయలేవు.(అన్నూర్-37)

వ్యాపారం, వ్యవహారాలు,లావాదేవీలు కూడా కొనసాగుతున్నాయి. దైవధ్యానం, దైవస్మరణ కూడా కొన సాగుతుంది. వీరు ఒకదాన్ని వదలి రెండవ దాన్ని వెదకరు, రెంటినీ తమ వెంట ఉంచుతారు. ముస్లిములకు రూమీలకు యుధ్ధం జరిగింది. ప్రవక్త (స) అనుచరులు సైనికులుగా ఉన్నారు. రూమీల సైన్యాధిపతి ముస్లిమ్ సైనికుల పరిస్ధితిని గమనించటానికి ఇస్లామీయ కేంప్ లోనికి ఇద్దరు గూఢచారులను పంపిస్తాడు. వారు వచ్చి ముస్లిముల పరిస్ధితి చూసి, చాలా ప్రభావితులై తిరిగి వెళ్ళిపోతారు. వారు రూమీల సైన్యాధిపతితో వీరు ఎలాంటి సైనికులు, రాత్రి దైవాన్ని ప్రార్ధిస్తున్నారు, పగలు ప్రయాణిస్తున్నారు, అని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఇదే ఇస్లామీయ జీవితం.

సోదరులారా! ఈ రోజు ప్రసంగాల పరంపరల చివరి దినం. ఈ ఎనిమిది ప్రసంగాలలో ప్రవక్త(స) జీవిత చరిత్ర గురించి, ఆయన సందేశం గురించి వివరంగా చెప్పాలనుకున్నాను. కాని ఏమీ చెప్పలేదన్నట్లు గానే ఉంది.

అల్లాహ్(త) మనందరికీ సన్మార్గం ప్రసాదించుగాక.

اللهم صلى الله عليه و سلم و على اله و اصحابه اجمعين

وآخر دعوانا عن الحمد لله رب العلمين.



%d bloggers like this: