తఫ్సీర్ సూరతుల్ జుముఆహ్ 62: ఆయతులు 9-11 (Tafsir Suratul Jumuah Ayah 9-11) [వీడియో]

బిస్మిల్లాహ్
తఫ్సీర్ సూరతుల్ జుముఆహ్ 62: ఆయతులు 9-11 (Tafsir Suratul Jumuah Ayah 9-11)

[49 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

జుమా రోజు మసీదుకు పిల్లలను తీసుకువచ్చే వారికి కొన్ని సూచనలు [వీడియో]

బిస్మిల్లాహ్

[2 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

ఇతరములు:

ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) : పార్ట్ 13 – వ్యాదిగ్రస్తుని (రోగి) నమాజ్, జుమా నమాజ్, పండుగ నమాజ్ [వీడియో]

బిస్మిల్లాహ్

[32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

వ్యాదిగ్రస్తుని నమాజ్:

నిలబడి నమాజ్ చేసే శక్తి రోగిలో లేనప్పుడు దేనికయినా ఆనుకొని నమాజ్ చేయాలి. ఈ శక్తి లేనప్పుడు కూర్చుండి చేయాలి. ఈ శక్తి కూడా లేనప్పుడు ప్రక్కన పడుకొని చేయాలి. ఈ శక్తి కూడా లేనప్పుడు వెల్లకిల పడుకొని పాదములను ఖిబ్లా వైపున ఉంచి నమాజ్ చేయాలి. సజ్దాలో రుకూ కంటే కొంచము ఎక్కువ తలను వంచాలి. రుకూ, సజ్దా చేయు శక్తి లేనప్పుడు తలతో సైగ చేయాలి. ఏ పరిస్థితిలోనయినా నమాజ్ విడనాడకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః

(صَلِّ قَائِمًا فَإِنْ لَمْ تَسْتَطِعْ فَقَاعِدًا فَإِنْ لَمْ تَسْتَطِعْ فَعَلَى جَنْبٍ).

“నీవు నిలబడి నమాజ్ చేయి. శక్తి లేనిచో కూర్చుండి చేయి. ఈ శక్తి లేనిచో పరుండుకొని చేయి”. (బుఖారిః 1117).

జుమా నమాజ్:

జుమా నమాజ్ వాజిబుంది. అది చాలా గొప్ప దినము. వారము రోజుల్లో అది చాలా ఘనతగల రోజు. అల్లాహ్ ఆదేశం:

[يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِنْ يَوْمِ الجُمُعَةِ فَاسْعَوْا إِلَى ذِكْرِ اللهِ وَذَرُوا البَيْعَ ذَلِكُمْ خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ] {الجمعة:9}

{విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజుకై పిలిచినప్పుడు, అల్లాహ్ సంస్మరణ వైపునకు పరుగెత్తండి; క్రయవిక్రయాలను వదలండి. మీరు గ్రహించగలిగితే, ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది}. (62: జుముఅహ్: 9).

జుమా ప్రత్యేకతలు:

స్నానం చేయుట, శుభ్రమైన మంచి దుస్తులు ధరించుట, దుర్వాసన నుండి అతి దూరంగా ఉండుట ఈ నాటి పత్యేక ధర్మాలు.

జుమా ప్రత్యేకతల్లోః జుమా నమాజ్ కొరకు మస్జిద్ కు శీఘ్రముగా వెళ్ళి, ఇమాం వచ్చే వరకు నఫిల్ నమాజులు, ఖుర్ఆన్ పారాయణం, అల్లాహ్ స్మరణాల్లో గడుపుట. ఇమాం ఖుత్బ (జుమా ప్రసంగం) ఇస్తున్నప్పుడు ఏ పని చేయకుండా, నిశబ్దంగా ఉండి ఖుత్బ వినుట. నిశబ్దంగా ఉండనివారు వృధా పని చేసిన వారవుతారు. వృధా పని చేసిన వారికి జుమా ఫలితం లభించదు. ఖుత్బ సందర్భంలో మాట్లాడ్డం నిషిద్ధం.

జుమా ప్రత్యేకతల్లోః ఈ రోజు సూరె కహఫ్ పారాయణం పుణ్యకార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః

(مَنْ قَرَأ سُورَةَ الْكَهفِ كَانَتْ لَهُ نُورًا يَومَ الْقِيَامةِ مِن مَقَامِهِ إِلى مَكَّةَ وَمَنْ قَرَأ عَشْرَ آيَاتٍ مِنْ آخِرِهَا ثُمَّ خَرَجَ

الدَّجَّالُ لَمْ يَضُرُّه).

“ఎవరు సూరె కహఫ్ పఠిస్తారో వారికి తనున్న ప్రాంతం నుండి మక్కా వరకు మరియు ప్రళయం నాటికీ కాంతియే కాంతి ఉండును. ఎవరు దాని చివరి పది ఆయతులు పఠిస్తారో వారికి దజ్జాల్ వచ్చినప్పటికీ ఏమి నష్టం జరగదు”. (అల్ ముఅజముల్ ఔసత్: తబ్రానీ 2/123).

ఇమాం ఖుత్బ ఇస్తుండగా మస్జిదులో ప్రవేశించువారు రెండు రకాతులు తహియ్యతుల్ మస్జిద్ సంగ్రహంగా చేసుకోవాలి. అప్పటి వరకు కూర్చోకూడదు.

(إِذَا جَاءَ أَحَدُكُمْ يَوْمَ الْجُمُعَةِ وَقَدْ خَرَجَ الْإِمَامُ فَلْيُصَلِّ رَكْعَتَيْنِ).

“మీలో ఎవరైనా మస్జిదులో ప్రవేశించినప్పుడు ఇమాం ఖుత్బా ఇస్తున్నచో రెండు రకాతులు సంగ్రహముగా చేసుకోవాలి” అని ప్రవక్త ఖుత్బ ఇస్తూ చెప్పారు. (ముస్లిం 875).

ఎవరికీ సలాం చేయకుండా నిదానంగా కూర్చోని ఖుత్బ వినాలి. ఖుత్బ తనకు తెలిసిన భాషలో కానప్పటికీ మౌనంగా ఉండాలి. ప్రక్కలో కూర్చున్న వారితో ముసాఫహ (కరచాలణం) చేయకూడదు.

ఇమాంతో జూమా నమాజ్ యొక్క ఒక రకాతు పొందినవారు జుమాను పొందినట్లే. అబూ హురైర ఉల్లేఖించిన హదీసులో ఇలా వచ్చిందిః “జుమా యొక్క ఒక రకాతును పొందినతను జుమాను పొందినాడు”. (బైహఖి). ఒక రకాతు కంటే తక్కువ పొందినతను అనగా ఇమాంతో రెండవ రకాతులోని రుకూ పొందనివాని జుమా కానట్లే. అతను జొహ్ర్ నమాజ్ నియ్యతుతో ఇమాం వెనక నమాజులో పాల్గొని ఇమాం సలాం తింపిన తరువాత జొహ్ర్ నమాజ్ పూర్తి చేసుకోవాలి.

పండుగ నమాజ్

పొద్దు పొడిసి సూర్యుడు బల్లెమంత (బారెడంత) పొడుగులో పైకి వచ్చిన తరువాత పండుగ నమాజ్ సమయం ప్రారంభం అవుతుంది. ఈదుల్ అజ్ హా (బక్రీద్ పండుగ) కొంచము ముందుగా మరియు ఈదుల్ ఫిత్ర్ (రమజాను పండుగ) కొంచము ఆలస్యంగా చేయుట మంచిది. ఈదుల్ ఫిత్ర్ కు వెళ్ళే ముందు ఖర్జూరపు పండ్లు తిని వెళ్ళుట, ఈదుల్ అజ్ హాకు వెళ్ళే ముందు ఏమీ తినకుండా వెళ్ళుట ధర్మం. బురైద రజియల్లాహు అన్హు కథనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ కొంచమైనా భుజించని వరకు ఈదుల్ ఫిత్ర్ కు వెళ్ళకపోయేవారు. ఈదుల్ అజ్ హా చేసుకునెంత వరకు ఏమీ తినక పోయేవారు”. (అహ్మద్). పండుగ రోజు మంచి దుస్తులు ధరించుట అభిలషణీయం.

పండుగ నమాజ్ రెండు రకాతులు. ఇవి ఖుత్బకు ముందు చేయాలి. అందులో ఇమాం బిగ్గరగా ఖుర్ఆను పఠించాలి. పండుగ నమాజుకు అజాను, ఇఖామతు ఏదీ లేదు. ముందు తక్బీరె తహ్రీమ చెప్పి సనా చదవాలి. తరువాత ఏడు సార్లు అల్లాహు అక్బర్ అనాలి. ప్రతీ సారి చేతులు భుజాల వరకు ఎత్తాలి. తరువాత అఊజు బిల్లాహి మినష్షైతా నిర్రజీం, బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం మరియు సూరె ఫాతిహ, దాని తరువాత ఏదైన సూర చదవాలి. మొదటి రకాతు యొక్క రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అంటూ నిలబడిన తరువాత ఐదు సార్లు అల్లాహు అక్బర్ అనాలి. ప్రతీ సారి చేతులు భుజాల వరకు ఎత్తాలి. సూరె ఫాతిహ మరో సూర చదివి రెండవ రకాతు పూర్తి చేయాలి. (మొదటి రకాతులో సూరె ఖాఫ్ లేదా సూరె అఅలా రెండవ రకాతులో సూరె ఖమర్ లేదా సూరె గాషియ చదవడం సున్నత్. (ముస్లిం 878, 891). (మొదటి రకాతులో ఏడు, రెండవ రకాతులో ఐదు తక్బీరుల విషయం అబూదావూదు 1149లో ఉంది).

పండుగ నమాజుకు ముందూ, వెనకా సున్నుతుగానీ, నఫిల్ గానీ ఏమీ లేవు. ఇమాంతో ఒక రకాతు పొందనివారు ఇమాం సలాం తింపిన తరువాత పూర్తి చేసుకోవాలి. ఇమాం ఖుత్బ ఇస్తున్న సమయంలో వచ్చినవారు కూర్చుండి ఖుత్బ వినాలి. ఖుత్బ ముగిసిన తరువాత పైన తెలిపిన విధానంలోనే నమాజ్ చేసుకోవాలి. ఒకరుంటే ఒంటరిగానే చేసుకోవాలి. ఇద్దరు ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే జమాఅతుతో (సామూహికంగా) చేసుకోవాలి.


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

ఒక పల్లెలో మస్జిద్ ఉండదు, ఒక ఇంట్లో జుమా నమాజు జరుపుకోవచ్చా? [ఆడియో]

బిస్మిల్లాహ్

ఒక పల్లెలో మస్జిద్ ఉండదు, వేరే వాళ్ళ ఇంట్లో జుమ్మా జరుగుతుంది అలా చెయ్యచ్చా చెయ్యకూడదా!

[3:32 నిమిషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు.
ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

త్వరగా జుమాకు వెళ్ళడంలోని ఘనత [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (5:39 నిముషాలు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


493. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కధనం :-

శుక్రవారం రోజు ఎవరు జనాబత్ గుస్ల్ (పూర్తి స్థాయి స్నానం) చేసి (పెందలాడే) జుమా నమాజు చేయడానికి వెళ్తాడో, అతను ఒక ఒంటెను బలి ఇచ్చిన వాడవుతాడు. (తర్వాత) రెండవ వేళలో ఇలా వెళ్ళిన వ్యక్తికి ఒక ఆవును బలి ఇచ్చిన పుణ్యం లభిస్తుంది. మూడవ వేళలో వెళ్ళే వాడికి ఒక పోట్టేలును బలిచ్చిన పుణ్యం, నాల్గవ వేళలో వెళ్ళే వాడికి ఒక కోడిని బలిచ్చిన పుణ్యం లభిస్తుంది. అయిదవ వేళలో వెళ్ళేవాడు దైవమార్గంలో ఒక కోడిగ్రుడ్డును దానం చేసిన వాడవుతాడు. ఆ తరువాత ఇమామ్ మస్జిదులో ప్రవేశించగానే దైవదూతలు కూడా అతని ప్రసంగం వినడానికి వస్తారు. (ఆ తరువాత వచ్చే వారికి దైవదూతలు హాజరు వేయరు).

[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 4 వ అధ్యాయం -ఫజ్లిల్ జూముఆ]
జుమా ప్రకరణం – 2 వ అధ్యాయం – శుక్రవారం రోజు సువాసనలు పూసుకోవడం, మిస్వాక్ చేయటం మంచిది.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్


ఇతరములు:

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి

జుమా (శుక్ర వారం)
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

జుమా ఖుత్బా సందర్భంలో మౌనంగా ఉండుట తప్పనిసరి [ఆడియో]

బిస్మిల్లాహ్

[8 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)


494. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

“శుక్రవారం రోజు ఇమామ్ జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు, మీరు గనక మీ (ప్రక్కన కూర్చున్న) సహచరునితో ‘నిశ్శబ్దంగా’ ఉండు అని అంటే మీరొక పనికిమాలిన పనికి పాల్పడినవారవుతారు.”

[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 36 వ అధ్యాయం – అల్ ఇన్సాతి యౌముల్ జుమా వల్ ఇమాము యఖ్తుబ్]

జుమా ప్రకరణం – 3 వ అధ్యాయం – జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్


ఇతరములు:

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి

జుమా (శుక్ర వారం)
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

జుమా రోజు స్నానం చేయడం, సువాసన పూసుకోవడం ధర్మం [ఆడియో]

బిస్మిల్లాహ్

[8 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు.
ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

దుఆ స్వీకరించబడే సమయంలో ఏ దుఆ చేయడం మంచిది? [ఆడియో]

బిస్మిల్లాహ్

(5:29 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

జుమా రోజు ఘనత (మూడు హదీసులు) [ఆడియో]

బిస్మిల్లాహ్

(9 నిముషాలు )
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)వారి 3 హదీసులు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
Recorded : 29-4-1441


6వ అధ్యాయం – ముస్లిం అనుచర సమాజానికి శుక్రవారం వైపు మార్గదర్శనం

496. హజత్‌ అబూహురైరా (రది అల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:- “ప్రపంచంలో మనం యావత్తు అనుచర సమాజాల కంటే వెనుక వచ్చాము. అయితే ప్రళయదినాన మనం అందరికన్నా మించిపోతాము. మనకు పూర్వమే యావత్తు అనుచర సమాజాలకు (దైవ) గ్రంధం లభించింది. మనకు వారి తరువాత లభించింది. (అంటే వారు గతంలోనికి పోయారు. మనం వారి వెనుక ఉన్నాం) కాని ఈ రోజు (అంటే శుక్రవారం) విషయంలో వారు దైవాజ్ఞ పాటింపుతో విభేదించారు. (అంచేత ఈ శుభదినం మనకు లభించింది. ఈ కారణంగానే మనం ప్రళయ దినాన వారిని మించిపోతాము) రేపటి దినం (శనివారం) యూదులకు లభించింది. ఎల్లుండి దినం (ఆదివారం) కైస్తవులకు లభించింది.”

[సహీహ్‌ బుఖారీ : 60వ ప్రకరణం – అంబియా, 54వ అధ్యాయం – హద్దసనా అబుల్‌ యమాన్‌]

నుండి: జుమా ప్రకరణంఅల్-లూలు-వల్-మర్జాన్ (మహా ప్రవక్త మహితోక్తులు)


1148. హజ్రత్‌ అబూహురైరా (రది అల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) ఈ విధంగా ప్రవచించారు:

“సూర్యుడు ఉదయించే దినాల్లో అన్నిటికంటే శ్రేష్టమైనది జుమా రోజు. ఆ రోజున ఆదం పుట్టించబడ్డారు. ఆ రోజునే స్వర్గంలోకి గొనిపోబడ్డారు. తిరిగి అదే రోజున అక్కడి నుండి తొలగించ బడ్డారు.” (ముస్లిం )

(సహీహ్‌ ముస్లింలోని జుమా ప్రకరణం)
నుండి: జుమానాటి ఘనత , జుమా నమాజుహదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ )


ఇతర లింకులు: 

జుమా రోజులో ఒక మహత్తరమైన ఘడియ ఉంది [ఆడియో & హదీసులు]

బిస్మిల్లాహ్

(8:12 నిముషాలు )
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


وعنه أن رسول الله صلى الله عليه وسلم ، ذكر يوم الجمعة، فقال‏:‏ ‏ “‏فيها ساعة لا يوافقها عبد مسلم، وهو قائم يصلي يسأل الله شيئًا، إلا أعطاه إياه‏”‏ وأشار بيده يقللها، ‏(‏‏(‏متفق عليه‏)‏‏)‏ ‏.

1157. హజ్రత్‌ అబూహురైరా (రది అల్లాహు అన్హు)గారు చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒకసారి జుమా గురించి చెబుతూ ఇలా అన్నారు: “ఆ రోజులో ఒక ఘడియ ఉంది. ఏ ముస్లిం దాసుడయినా ఆ ఘడియను పొంది, ఆ సమయంలో అతను నిలబడి నమాజు చేస్తూ అల్లాహ్‌ ను ఏదయినా అడిగితే అల్లాహ్‌ తప్పకుండా ఇస్తాడు.” ఆ సమయం చాలా తక్కువగా ఉంటుందని ఆయన తన చేత్తో సంజ్ఞ చేసి చూపించారు.

(బుఖారీ-ముస్లిం) (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలోని జుమా ప్రకరణం)

ముఖ్యాంశాలు

శుక్రవారం రోజుకి సంబంధించిన మరొక మహత్యాన్ని ఈ హదీసులో పొందుపరచటం జరిగింది. ఆ రోజులో ఒక మహత్తరమైన ఘడియ ఉంది. ఆ ఘడియలో భక్తులు చేసుకునే విన్నపాలను అల్లాహ్‌ తప్పకుండా మన్నిస్తాడు. ఆ ఘడియ చాలా తక్కువగా ఉంటుంది.

అదీగాక ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అందుకని ఆ మహాభాగ్యాన్ని పొందాలంటే ఆ రోజు మొత్తం అత్యధికంగా అల్లాహ్ ను ధ్యానిస్తూ, ప్రార్థనలు, విన్నపాల్లో నిమగ్నులై ఉండాల్సిందే.


وعن أبي بردة بن أبي موسى الأشعري، رضي الله عنه، قال‏:‏ قال عبد الله بن عمر رضي الله عنهما‏:‏ أسمعت أباك يحدث عن رسول الله صلى الله عليه وسلم ، في شأن ساعة الجمعة‏؟‏ قال‏:‏ قلت‏:‏ نعم، سمعته يقول‏:‏ سمعت رسول الله صلى الله عليه وسلم ، يقول‏:‏ ‏ “‏هي ما بين أن يجلس الإمام إلى أن تقضى الصلاة‏”‏ ‏(‏‏(‏رواه مسلم‏)‏‏)‏‏.

1158. హజ్రత్‌ అబూ బుర్దా బిన్‌ అబూ మూసా అష్‌ అరీ (రది అల్లాహు అన్హు) కథనం: ఒకసారి అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు) నాతో మాట్లాడుతూ “శుక్రవారం నాటి ఘడియ గురించి మీ నాన్న ఏదయినా దైవప్రవక్త హదీసు చెప్పినప్పుడు నువ్వు విన్నావా?” అని అడిగారు. దానికి నేను సమాధానమిన్తూ, “విన్నాను ఆ ఘడియ ఇమామ్‌ వేదికపై కూర్చున్నప్పటి నుంచి నమాజ్‌ ముగిసేవరకు మధ్య కాలంలో ఉంటుందని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధిస్తుండగా తాను విన్నానని మా నాన్నగారు చెప్పారు” అని అన్నాను.

(ముస్లిం) (సహీహ్  ముస్లిం లోని జుమా ప్రకరణం)

ముఖ్యాంశాలు

శుక్రవారం రోజు ఆ ఘడియ ఎప్పుడొస్తుందనే విషయమై పండితుల మధ్య భిన్నాభి ప్రాయాలున్నాయి. కొంతమంది పండితులు పై హదీసును నిదర్శనంగా చేసుకొని ప్రార్థనలు స్వీకరించబడే ఆ శుభఘడియ శుక్రవారం రోజు ఇమామ్‌ ఖుత్బా కొరకు వేదికపై కూర్చున్నప్పటి నుంచి నమాజు ముగిసేవరకు మధ్యకాలంలో ఉంటుందనీ, అన్నింటికన్నా బలమైన అభిప్రాయం ఇదేనని అన్నారు. అయితే షేఖ్‌ అల్‌బానీ తదితర హదీసువేత్తలు అబూ మూసా (రది అల్లాహు అన్హు) వివరించిన ఈ హదీసుని ‘మౌఖూఫ్‌‘గా పేర్కొన్నారు. అంటే ఈ హదీసుని తాను నేరుగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుంచి విన్నారో లేదో ఆయన అనుచరుడు తెలుపలేదని దాని భావం. (వివరాల కోసం షేఖ్‌ అల్‌బానీ చేత పరిశోధించబడిన “రియాజుస్సాలిహీన్‌’ గ్రంథం చూడండి). అందుకే మరికొంతమంది పండితులు అబూదావూద్‌ మరియు నసాయి గ్రంథాల్లోని వేరొక హదీసుని ప్రాతిపదికగా చేసుకొని ఆ శుభఘడియ అస్ర్‌ మరియు మగ్రిబ్‌ నమాజుల మధ్యకాలంలో ఉంటుందని తలపోశారు. ఆ హదీసులో శుక్రవారం రోజు ఆ శుభఘడియను అస్ర్‌ నమాజ్‌ తర్వాత చివరివేళలో అన్వేషించమని ఆదేశించటం జరిగింది. మొత్తానికి ఆ ఘడియ నిర్ణయం అస్పష్టంగానే మిగిలిపోయింది కనుక ఆ రోజు సాంతం అత్యధికంగా దైవధ్యానంలో నిమగ్నులై ఉండటానికి ప్రయత్నించటం అన్ని విధాలా శ్రేయస్కరం.


నుండి: జుమానాటి ఘనత , జుమా నమాజు – హదీసులు – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ )

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

%d bloggers like this: