సీరత్ పాఠాలు – 3: ప్రవక్త పదవి, ప్రచారం [వీడియో]

బిస్మిల్లాహ్

[18:04 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [18:04 నిముషాలు]

ఇతరములు: 

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad/

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
https://teluguislam.net/2011/03/25/muhammad-the-final-prophet/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ 

మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [15 వీడియోలు]
https://teluguislam.net/2020/01/02/prophet-muhammad-seerah/
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 70 నిముషాలు

“ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో]
https://teluguislam.net/2019/08/05/the-meaning-of-muhammad-rasolullaah/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్

సీరత్ పాఠాలు – 2: ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) పోషణ,వ్యాపారం,వివాహం [వీడియో]

బిస్మిల్లాహ్

[16:19 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [16:19 నిముషాలు]

ఇతరములు: 

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad/

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
https://teluguislam.net/2011/03/25/muhammad-the-final-prophet/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ 

మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [15 వీడియోలు]
https://teluguislam.net/2020/01/02/prophet-muhammad-seerah/
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 70 నిముషాలు

“ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో]
https://teluguislam.net/2019/08/05/the-meaning-of-muhammad-rasolullaah/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్

సీరత్ పాఠాలు 1: శుభ జననం, ఏనుగుల సంఘటన [వీడియో]

బిస్మిల్లాహ్

[16:36 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [16:36 నిముషాలు]

ఇతరములు: 

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad/

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
https://teluguislam.net/2011/03/25/muhammad-the-final-prophet/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ 

మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [15 వీడియోలు]
https://teluguislam.net/2020/01/02/prophet-muhammad-seerah/
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 70 నిముషాలు

“ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో]
https://teluguislam.net/2019/08/05/the-meaning-of-muhammad-rasolullaah/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్

మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కుటుంబం

బిస్మిల్లాహ్

మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కుటుంబం
మహా ప్రవక్త జీవిత చరిత్ర: అర్రహీఖుల్‌ మఖ్ తూమ్ (పూర్తి పుస్తకం)
షేఖ్ సఫియుర్  రహ్మాన్ ముబారక్ ఫూరి

1. హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హా)

హిజ్రత్ కు పూర్వం మక్కాలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కుటుంబమంతా ఆయన సతీమణి ఖదీజా (రదియల్లాహు అన్హా) ఒక్కరే. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివాహం ఆయన ఇరవై అయిదవ ఏట జరిగింది. అప్పుడు హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హా) గారి వయస్సు నలభై ఏండ్లు. ఈమె ఆయనకు మొదటి భార్య. ఆమె బ్రతికి ఉండగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరే వివాహం చేసుకోలేదు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సంతానం ఒక్క హజ్రత్ ఇబ్రాహీం తప్ప కుమారులు, కుమార్తెలందరూ ఆమె గర్భాన జన్మించినవారే. కుమారుల్లో ఏ ఒక్కరూ జీవించి ఉండలేదు. అయితే కుమార్తెలందరూ సజీవంగానే ఉండినారు. వారి పేర్లు ఇవి:

 • 1. హజ్రత్ జైనబ్ (రదియల్లాహు అన్హా)
 • 2. హజ్రత్ రుఖయ్యా (రదియల్లాహు అన్హా)
 • 3. హజ్రత్ ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు అన్హా) మరియు
 • 4. హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) లు.

హజ్రత్ జైనబ్ (రదియల్లాహు అన్హా) పెళ్ళి హిజ్రత్ కు పూర్వం ఆమె మేనత్త కుమారుడు హజ్రత్ అబుల్ ఆస్ బిన్ రబీతో జరిగింది. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) తో హజ్రత్ రుఖయ్యా (రదియల్లాహు అన్హా) వివాహం జరిగింది. ఆమె చనిపోయిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్రత్ ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు అన్హా) వివాహం తిరిగి ఆయనతోనే చేశారు. హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) వివాహం, బద్ర్ యుద్ధం మరియు ఉహద్ యుద్ధం మధ్య కాలంలో హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) తో జరిగింది. ఆమె గర్బాన హజ్రత్ హసన్ (రదియల్లాహు అన్హు) , హజ్రత్ హుసైన్ (రదియల్లాహు అన్హు) లు (కుమారులు) హజ్రత్ జైనబ్, ఉమ్మె కుల్సూమ్ లు (కుమార్తెలు) జన్మించారు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సమాజానికి భిన్నంగా, ఓ ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నారు. వివిధ అవసరాల దృష్ట్యా ఆయన నల్గురి కంటే ఎక్కువ మంది భార్యలను వివాహం చేసుకొనే రాయితీ దైవం ఆయనకు ఒసిగాడన్న విషయం విదితమే. కాబట్టి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏ స్త్రీలనైతే వివాహ మాడారో వారు మొత్తం పదకొండుగురు. వారిలో తొమ్మండుగురు ఆయన పరమపదించేటప్పుడు సజీవంగానే ఉన్నారు. ఇద్దరు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జీవిత కాలంలోనే మరణించారు. (అంటే హజ్రత్ ఖదీజా రదియల్లాహు అన్హా మరియు ఉమ్ముల్ మసాకీన్ హజ్రత్ జైనబ్ బిన్తె కజీమా రదియల్లాహు అన్హా) వీరేకాకుండా మరిద్దరు ఉన్నారనేది, వారితో ఆయన నికాహ్ జరిగిందా లేదా అనే విషయంలో అభిప్రాయ భేదం ఉంది. కాని వారు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో రాత్రి గడపలేదనేది ఏకాభిప్రాయంతో ఒప్పుకున్న విషయం .

ఈ క్రింద మేము ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సతీమణుల పేర్లు, వారి వివరాలు క్రమపద్ధతిలో సంగ్రహంగా మీ ముందుంచుతున్నాం.

2. హజ్రత్ సౌదా బిన్తె‌ జమ్ఆ (రదియల్లాహు అన్హా)

ఈమెగారితో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివాహం , హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హా) మరణా నంతరం, ప్రవక్త అయిన పదవ సంవత్సరం షవ్వాల్ నెలలో జరిగింది. హజ్రత్ సౌదా (రదియల్లాహు అన్హా) అంతకు ముందు తమ పినతండ్రి కుమారుడు సక్రాన్ వివాహ బంధంలో ఉంటూ ఉండేవారు. సక్రాన్ మరణించడం వల్ల ఆమె అప్పుడు వితంతువుగా ఉన్నారు.

3. హజ్రత్ ఆయిషా సిద్దీకా బిన్తె‌ అబూ బక్ర్ (రదియల్లాహు అన్హా)

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఆమెను ప్రవక్త పదవి లభించిన పదకొండవ యేట షవ్వాల్ నెలలో వివాహమాడారు. అంటే హజ్రత్ సౌదా (రదియల్లాహు అన్హా) ను వివాహం చేసుకున్న ఒక సంవత్సరం తరువాత, హిజ్రత్ కంటే రెండు సంవత్సరాల అయిదు నెలలకు ముందు అన్నమాట. అప్పుడు ఆమె వయస్సు ఆరు సంవత్సరాలు. హిజ్రత్ తరువాత ఏడు నెలలకు షవ్వాల్ నెల, హిజ్రీ శకం ఒకటిలో ఆమెను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు పంపించడం జరిగింది. అప్పుడు ఆమె వయస్సు తొమ్మిది సంవత్సరాలు, ఆమె అప్పుడు కన్య. ఆమెను తప్ప మరే కన్యను మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివాహం చేసుకోలేదు. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు అతిప్రియమైన సతీమణి. సమాజంలోని స్త్రీలందరికంటే ఆమె ఒక్కరే ధర్మజ్ఞానం కలిగిన విద్యావంతురాలు.

4. హజ్రత్ హఫ్సా బిన్తె‌ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హా)

ఈమె మొదటి భర్త కనీస్ బిన్ హుజాఫా సహమి (రదియల్లాహు అన్హు) . ఈయన బద్ర్ మరియు ఉహద్ యుద్దాల మధ్యకాలంలో చనిపోవడం వలన హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా) వితంతువు అయ్యారు. ఆ తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెను వివాహమాడారు. ఇది హిజ్రీశకం మూడవ సంవత్సరం నాటి మాట.

5. హజ్రత్ జైనబ్ బిన్తె‌ కజీమా (రదియల్లాహు అన్హా)

ఈమె బనూ హిలాల్ బిన్ ఆమిర్ సఅసఆ తెగవారు. నిరుపేదలపై ఆమె చూపే ప్రేమానురాగాలు, దయాదాక్షిణ్యాల కారణంగా ఆమె ఉమ్ముల్ మసాకీన్ (నిరు పేదల తల్లి)గా ప్రఖ్యాతిగాంచారు. ఈమె హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ హజష్ కు భార్య. ఆయన ఉహద్ యుద్ధంలో అమరగతి నొందిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెను వివాహమాడారు. కేవలం ఎనిమిది నెలలు మాత్రమే భార్యగా ఉండి మరణించారు.

6. హజ్రత్ ఉమ్మె సల్మా బిన్తె‌ అబీ ఉమయ్యా (రదియల్లాహు అన్హా)

ఈమె క్రితం అబూ సల్మాకు భార్యగా ఉండేవారు. హి.శ.4, జమా దిల్ ఆఖిరా నెలలో హజ్రత్ అబూ సల్మా (రదియల్లాహు అన్హు) చనిపోయిన తరువాత అదే సంవత్సరం షవ్వాల్ నెలలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈమెను వివాహమాడారు.

7.జైనబ్ బిన్తె జహష్ బిన్ రియాబ్ (రదియల్లాహు అన్హా)

ఈమె బనూ అసద్ బిన్ కజీమా కుటుంబానికి సంబంధించిన వారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు మేనత్త కూతురు కూడా. ఈమె వివాహం మొదట జైద్ బిన్ హారిసా (రదియల్లాహు అన్హు) తో జరిగింది. ఈయన్ను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి కుమారుడుగా తలచడం జరిగేది. కాని హజ్రత్ జైద్ (రదియల్లాహు అన్హు) తో ఆమెకు పొసగలేదు. జైద్(రదియల్లాహు అన్హు) ఆమెకు తలాక్ ఇచ్చారు. ఇద్దత్ గడువు పూర్తి అయిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను సంబోధిస్తూ దివ్యఖుర్ఆన్ లో ఈ ఆయత్ అవతరించింది:

 فَلَمَّا قَضَى زَيْدٌ مِنْهَا وَطَرًا زَوَّجْنَاكَهَا

జైద్ ఆమెతో తన అవసరం పూర్తి చేసుకున్న తరువాత మేము ఆమెను ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) భార్యగా చేశాము.” (ఖుర్’ఆన్ 33:337)

ఆయనకు సంబంధించే అహ్జాబ్ సూరాలో మరిన్ని ఆయత్ లు అవతరించాయి. ఆ ఆయత్ లలో దత్తపుత్రునికి సంబంధించి ఖచ్చితమైన తీర్పు ఇవ్వడం జరిగింది- వివరాలు ముందు రాబోతున్నాయి- హజ్రత్ జైనబ్ (రదియల్లాహు అన్హా) తో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివాహం హి.శ. 5, జీకాదా మాసంలో లేదా అంతకంటే కొంచెం ముందుగా జరిగింది.

8. జువైరియా బిన్తె హారిస్ (రదియల్లాహు అన్హా)

ఈమె తండ్రిగారు ఖుజాఅ తెగకు చెందిన బనుల్ ముస్తలిక్ సర్దారు. హజ్రత్ జువైరియా (రదియల్లాహు అన్హా) బనూ ముస్తలిక్ ఖైదీల వెంట బందీ అయివచ్చినవారు. బందీల పంపకం జరిగేటప్పుడు ఈమె సాబిత్ బిన్ కైస్ బిన్ షమాస్ (రదియల్లాహు అన్హు) గారి భాగానికి వచ్చారు. ఆయన, ఆమెతో, ఓ ధనరాశికి బదులు స్వతంత్రురాలుగా చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమె తరఫున ఆ మొత్తాన్ని కట్టి విడిపించి వివాహం చేసుకున్నారామెను. ఇది హి.శ. 5 లేదా 6, షాబాన్ నెలలో జరిగిన సంఘటన.

9. ఉమ్మె హబీబా రమలా బిన్తె‌ అబీ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హా)

ఈమె మునుపు ఉబైదుల్లాహ్ బిన్ హజష్ వివాహబంధంలో ఉన్న మహిళ. అతని వెంట హిజ్రత్ చేసి అబీసీనియాకు కూడా వెళ్ళారు. కాని ఉబైదుల్లాహ్ అక్కడకు వెళ్ళిన తరువాత ధర్మభ్రష్టుడై క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. అక్కడే చనిపోయాడు. అయితే ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) మాత్రం ఇస్లామ్ ధర్మంపై స్థిరంగా ఉండిపోయారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), హిజ్రీ శక సంవత్సరం 7లో, అమ్రూ బిన్ ఉమయ్యా జమ్రికు లేఖ ఇచ్చి నజాషీ వద్దకు పంపారు. ఆ లేఖలో ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) తో తమ నికాహ్ చేయమని కూడా రాశారు. నజాషీ, ఉమ్మె హబీబా స్వీకారంతో ఆమె నికాహ్ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో చేసివేశాడు. షుర్జీల్ బిన్ హస్నా వెంట ఆమెను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు పంపించడం జరిగింది.

10. హజ్రత్ సఫియ్యా (రదియల్లాహు అన్హా) బిన్తె‌ హుయ్ బిన్ అక్తబ్

వీరు బనీ ఇస్రాయీల్ (యూదుల)కు చెందినవారు. ఖైబర్ యుద్ధం సందర్భంగా పట్టుబడి బందీగా వచ్చినవారు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెను తన కోసం ఎంచుకొని స్వతంత్రురాలుగా చేసి వివాహమాడారు. ఇది ఖైబర్ విజయం హి.శ. 7 తరువాతి సంఘటన.

11. హజ్రత్ మైమూనా బిన్తె హారిస్ (రదియల్లాహు అన్హా)

ఈమె ఉమ్ముల్ ఫజ్ల్  లుబాబా బిన్తె హారిస్ సోదరి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెను హిజ్రీ శక సంవత్సరం, జీకాదా నెలలో ఉమ్రయె కజా పూర్తి చేసి – ప్రామాణికమైన కథనం ప్రకారం, ఇహ్రామ్ నుండి హలాల్ అయిన తరువాత – వివాహమాడారు.

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివాహమాడిన సతీమణుల సంఖ్య ఇలా పదకొండుకు చేరింది. వీరిలో ఇద్దరు హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హా) మరియు ఉమ్ముల్ మసాకీన్ హజ్రత్ జైనబ్ (రదియల్లాహు అన్హా) ఇద్దరూ ఆయన జీవించి ఉండగానే పరమపదించారు. మిగతా తొమ్మండుగురు సతీమణులు ప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) మరణం తరువాత కూడా జీవించే ఉన్నారు.

వారే కాకుండా, ఆయనతో సంసారం చేయని మరిద్దరు మహిళలున్నారు. వారిలో ఒకరు బనూ కిలాబ్ కు చెందిన మహిళ అయితే మరొకరు ‘కిందా’ తెగకు చెందినవారు. ఈ కిందా తెగ మహిళే ‘జోనియా’గా పిలువబడతారు. వీరితో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివాహం జరిగిందా లేదా? వారి వంశ వృక్షం ఏమిటీ అనే విషయంలో సీరత్ చరిత్రకారుల నడుమ భేదాభిప్రాయాలున్నాయి. ఆ వివరాలేమిటో తెలిపే అవసరం ఇక్కడ లేదని అనుకుంటున్నాము.

ఇక స్త్రీ బానిసల విషయానికి వస్తే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గర ఇద్దరు స్త్రీ బానిసలు ఉండేవారని తెలుస్తోంది. వారిలో ఒకరు ‘మారియ కబ్తియా(రదియల్లాహు అన్హా) ‘. ఈమెను ఈజిప్టు చక్రవర్తి మకూకస్ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు కానుకగా సమర్పించాడు. ఆమె గర్భాన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కుమారుడు ఇబ్రాహీం జన్మించారు. ఆయన బాల్యంలోనే హిజ్రీ శక సంవత్సరం 10, షవ్వాల్ నెల 28 లేక 29వ తేదీ (క్రీ.శ. జనవరి 27, 632)న మదీనాలో మరణించారు.  మరో బానిస స్త్రీ రైనా బిన్తె జైద్ (రదియల్లాహు అన్హా) . ఈమె యూదుల తెగ బనీ నజీర్ లేదా బనూ కురైజాకు చెందినవారు: ఈమె బనూ కురైజా ఖైదీల్లో ఉండగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెను తన కోసం ఎంపిక చేసుకొని తన దగ్గర ఉంచుకున్నారు.

కొందరు పరిశోధకులు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెను బానిసగా కాకుండా స్వతంత్రురాలిగా చేసి వివాహమాడారని తలుస్తారు. కాని ఇబ్నె ఖైమ్ దృష్టిలో మొదటిదే సరిఅయినది. అబూ ఉబైదా (రదియల్లాహు అన్హా), ఈ ఇద్దరు స్త్రీ బానిసలే కాకుండా మరిద్దరు స్త్రీ బానిసల గురించి చెప్పారు. ఆ ఇద్దరిలో ఒకరి పేరు జమీలా. ఈమె ఏదో ఒక యుద్ధంలో బందీ అయి వచ్చారు. మరొకరు ఎవరో ఓ స్త్రీ బానిస. ఆమెను హజ్రత్ జైనబ్ బిన్తె హజష్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు బహూకరించారు.’ [చూడండి, జాదుల్ మఆద్-1/29]

ఇక్కడి వరకు చెప్పుకున్న తరువాత మనం కొంచెం సేపు ఆగి, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)గారి జీవితానికి సంబంధించిన మరో పార్శ్వాన్ని స్పృశించ వలసిన అవసరం ఉంది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), లైంగిక శక్తి సమృద్ధిగా ఉన్న యవ్వన దశలోనే అంటే ముప్పై ఏండ్ల ప్రాయంలోనే ఒకే భార్యతో తృప్తిపడుతూ గడిపేశారు. ఆ భార్య కూడా దాదాపు వృద్ధాప్య దశకు చేరుకున్న భార్యే. అంటే మొదట ఖదీజా (రదియల్లాహు అన్హా) ఆ తరువాత హజ్రత్ సౌదా (రదియల్లాహు అన్హా) లు మాత్రమే. అయితే, ఆయన(సల్లల్లాహు అలైహి వ సల్లం) వృద్ధాప్య దశకు చేరిన తరువాత హఠాత్తుగా ఒక వివాహం తరువాత మరొకటిగా తొమ్మిది వివాహాలు చేసుకోవడానికి ఆయనలో లైంగిక శక్తి అంతగా పెరిగిపోయిందన్న భావన ఏ విధంగా చూసినా సరియైన భావనేనా? కాదు. అలా జరగడానికి వీల్లేదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి యవ్వన దశ మరియు వృద్ధాప్య దశ రెంటిపై దృష్టిని సారించిన తరువాత ఏ వివేకవంతుడైనా అలాంటి భావన సరియైనది కాదు అని ఒప్పుకుంటాడు. యదార్థం ఏమిటంటే, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇన్ని వివాహాలు, మరేవో అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేసుకున్నవే. ఈ వివాహాలు సాధారణ వివాహాలలో ఉండే నిర్ణీత ఉద్దేశ్యాలకంటే ఎంతో ఉన్నతమైనవి. ఇప్పుడు మనం ఆ ఉద్దేశ్యాలను కొద్దిగా తరచి చూద్దాం .

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) , హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా) లను వివాహ మాడి, హజ్రత్ అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) , హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) లతో ఏ వియ్యాన్ని అయితే అందుకున్నారో, అలాగే హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) కు హజ్రత్ రుకయ్యా (రదియల్లాహు అన్హా), హజ్రత్ ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు అన్హా) లను ఒకరి తరువాత ఒకరినిచ్చి, హజ్రత్ అలి (రదియల్లాహు అన్హు) గారికి తన ముద్దుల కుమార్తె హజ్రత్ ఫాతిమానిచ్చి పెళ్ళి చేసి ఏ వియ్యాన్ని అయితే అందుకున్నారో, ఆ వివాహాల ఉద్దేశ్యం, ఆ నలుగురు మహా పురుషులతో తన సంబంధాలను పటిష్ఠపర్చుకోవడమే. ఈ నలుగురూ గడ్డు సమయాల్లో ఇస్లామ్ కోసం త్యాగం చేసిన మహామహులు. వారి ప్రత్యేకత ఏమిటో మనందరికీ తెలిసిందే.

అరబ్బు ఆచారం ప్రకారం, వియ్యపు బంధుత్వం ఎంతో గౌరవమైన దృష్టితో చూడబడుతుంది. వారి దృష్టిలో అల్లుని బంధుత్వం అంటే, వివిధ తెగల నడుమ దగ్గరి సంబంధానికి పునాదిలాంటిది. అల్లునితో యుద్ధం చేయడం సిగ్గుచేటు. ఈ సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకొని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరికొన్ని వివాహాలు చేసుకోవలసి వచ్చింది. ఉద్దేశ్యం, వివిధ వ్యక్తులు, వివిధ తెగల శత్రుత్వాన్ని నీరుగార్చడం. వారిలో అప్పటి వరకు రగులుకుంటున్న ద్వేషాగ్ని కీలలను ఆర్పివేయడం. హజ్రత్ ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హా) బనీ మక్జూమ్ తెగకు చెందిన మహిళ. ఈ తెగ అబూ జహల్ మరియు ఖాలిద్ బిన్ వలీలకు చెందిన తెగ. మహాప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెతో వివాహమాడగా, ఇదివరకు ఉహద్ యుద్ధంలో ఖాలిద్ బిన్ వలీద్ ప్రదర్శించిన కఠిన వైఖరి కాస్తా చల్లారిపోయింది. కాగా, కొన్ని రోజుల అనంతరం ఆయన తన ఇష్ట పూర్తిగా ఇస్లామ్ ధర్మాన్ని స్వీకరించారు. అలాగే అబూ సుఫ్యాన్ కుమార్తె ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) ను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివాహమాడారు. ఆ తరువాత అబూ సుఫ్ యాన్ ఇక మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఎదురుబడలేదు.

హజ్రత్ జువైరియా, హజ్రత్ సఫియ్యా (రదియల్లాహు అన్హా) లు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు సతీమణు లైన తరువాత బనూ ముస్తలిక్ మరియు బనీ నజీర్ తెగలు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో యుద్దాలు మానేశారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ ఇద్దరు మహిళలను పెళ్ళాడిన తరువాత చరిత్రలో ఈ రెండు తెగలు ఎలాంటి పోరాటాలకుగాని, కుట్రలకు గాని దిగినట్లు ఆధారాలు లభించవు. పైగా, హజ్రత్ జువైరియా (రదియల్లాహు అన్హా) తన జాతి స్త్రీలకంటే శుభాలనుగొని తెచ్చారు. అది ఎలాగంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెతో వివాహమాడగా, సహాబా (రదియల్లాహు అన్హుమ్) ఆమె తెగకు చెందిన వంద కుటుంబాలను, “వీరంతా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి అత్తవారి కుటుంబానికి చెందినవారు” అంటూ చెర నుండి విడుదల చేశారు. అలా వారి మనస్సులపై పడిన ప్రభావం ఎలాగుండిందో మనం అర్థం చేసుకోవచ్చు.

అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఓ అనాగరిక జాతికి శిక్షణ గరిపి, దాని హృదయాన్ని ప్రక్షాళన చేసి ఆ జాతి వారికి సభ్యతా సంస్కారాలు నేర్పడానికి దైవం తరఫున నియమించబడిన మహా మనిషి. అప్పటివరకు ఈ జాతి నాగరికత, సభ్యతా సంస్కారాలు, సామాజిక కట్టుబాట్లు, సత్సమాజ నిర్మాణంలో పాల్గొనే బాధ్యతలు ఏవో తెలియని జాతి. ఇస్లామీయ సమాజ నిర్మాణం ఏ సూత్రాల పైన అయితే నిర్మించవలసి ఉండిందో, ఆ నిర్మాణ కార్యక్రమంలో స్త్రీ పురుషుల కలివిడికి ఏ మాత్రం వీలులేదు.

కాబట్టి అలా కలివిడి లేని సూత్రాలను అవలంబిస్తూ స్త్రీలకు నేరుగా శిక్షణ గరపడానికి వీలుండదు. విద్యావికాసాలు గరపడం, వారిని సుశిక్షితులుగా చేసే అవసరం పురుషులకు తోడు స్త్రీలకు కూడా అంతే ముఖ్యమైనది. ఇంకా చెప్పాలంటే ఆ అవసరం పురుషులకంటే అధికమే.

పల్లెల్లో, నగరాల్లో నివసించే అన్ని రకాల వయస్సు కలిగిన మహిళలకు శిక్షణ గరపడం, వారికి ధర్మశాస్త్ర ఆదేశాలను ఎరుకపర్చడం, వారిలో విద్యా బుద్ధులను వ్యాపింపజేసి వారి హృదయాల నుండి అజ్ఞానపు అంధకారాన్ని పోగొట్టడం మరియు వారిలో ధర్మజ్ఞాన ప్రచారాన్ని చేబట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ కారణం చేత, ఆ లక్ష్యసాధన కోసం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం)కు రకరకాల వయస్సులు, వివిధ రకాల సామర్థ్యాలు కలిగిన మహిళలను ఎంపిక చేసుకునే అవసరం ఎంతైనా ఉండింది.

కాబట్టి ప్రవక్త మహనీయుల ప్రైవేటు జీవితానికి సంబంధించిన విషయాలను కూడా ముస్లిం సమాజం ముందు పెట్టే ఘనత చాలా మట్టుకు ముస్లిముల మాతృమూర్తులు అయిన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సతీమణులకే దక్కిందన్న విషయం మనం గ్రహించగలం. ముఖ్యంగా అధిక కాలం వరకు జీవించిన హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారికి ఆ క్రెడిట్టు దక్కుతుంది. ఈమె దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ప్రతి కదలికను, ప్రతి ప్రవచనాన్ని ఉల్లేఖించినవారు.

ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేసుకున్న వివాహాల్లో ఒక వివాహం, అప్పటి మూఢ ఆచారాన్నొకదాన్ని చెరిపివేయడానికి అమలులోనికి వచ్చింది. ఆ మూఢాచారం అరబ్బు సమాజంలో తాతముత్తాతల కాలం నుండి రివాజులో ఉండి బాగా ముదిరి పోయిన ఆచారం. ఇది ఒకరిని దత్తపుత్రునిగా చేసుకునే ఆచారం. అజ్ఞాన కాలంలో దత్తపుత్రునికి, సొంత కుమారునికి ఉండే హక్కులన్నీ ఉండేవి. ఈ ఆచారం, సంప్రదాయం అరబ్బు సమాజం నుండి చెరిపివేయలేనంతగా వ్రేళ్ళూనుకొని ఉంది. ఆ కాలంలో. అయితే ఈ మూఢా చారం, ఈ అజ్ఞానపు సంప్రదాయం , ఇస్లామ్ ప్రవేశ పెట్టిన నికాహ్, తలాక్, వారసత్వం మరియు ఇతర సిద్ధాంతాలు, సూత్రాలకు పూర్తిగా భిన్నమైన ఆచారం. అదేకాకుండా అజ్ఞాన కాలంనాటి ఈ సంప్రదాయాన్ని మట్టు పెట్టడం ఇస్లామ్ ధర్మం యొక్క ప్రథమ లక్ష్యం కూడా. అందుకని దీన్ని చెరిపి వేయడానికి అల్లాహ్ తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివాహం హజ్రత్ జైనబ్ బిన్తె జహష్ తో చేయడం జరిగింది. హజ్రత్ జైనబ్ (రదియల్లాహు అన్హా) మొదట హజ్రత్ జైద్ (రదియల్లాహు అన్హు) కు భార్యగా ఉండేవారు. ఈయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు దత్తపుత్రుడు. అయితే, ఆ భార్యాభర్తల నడుమ పొసగని కారణంగా హజ్రత్ జైద్ (రదియల్లాహు అన్హు) ఆమెకు తలాక్ (విడాకులు) ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దైవతిరస్కారులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు వ్యతిరేకంగా అహ్జాబ్ యుద్ధానికి (అగడ్త యుద్ధానికి) సిద్ధపడుతున్న కాలమది.

ఇటు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు దైవం తరఫున దత్తత ఆచారాన్ని అంతమొందించే సూచనలు అందుతున్నాయి. ఆ కారణంచేత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ గడ్డు పరిస్థితిలో హజ్రత్ జైద్(రదియల్లాహు అన్హు) తన భార్యకు తలాక్ గనకా ఇస్తే, ఆ తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్రత్ జైనబ్ ను వివాహమాడినట్లయితే మునాఫిక్ లు, బహుదైవారాధకులు, యూదులు అందరూ దాన్ని ఆసరాగా చేసుకొని, ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభిస్తారు. అమాయక ముస్లింలను రకరకాల అనుమానాలకు గురిచేసి వారిపై చెడు ప్రభావాలు పడేటట్లు చేస్తారేమో అనే ఆశంక తలెత్తింది. కాబట్టి, అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రయత్నం అంతా, హజ్రత్ జైద్ (రదియల్లాహు అన్హు) తన భార్యకు విడాకులు ఇవ్వకుండా ఉండాలన్నదే.

కాని అల్లాహ్ కు ఈ ధోరణి నచ్చలేదు. ఆయన తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు హెచ్చరిక చేస్తూ ఈ క్రింది ఆయత్ ను అవతరింపజేశాడు.

وَإِذْ تَقُولُ لِلَّذِي أَنْعَمَ اللَّهُ عَلَيْهِ وَأَنْعَمْتَ عَلَيْهِ أَمْسِكْ عَلَيْكَ زَوْجَكَ وَاتَّقِ اللَّهَ وَتُخْفِي فِي نَفْسِكَ مَا اللَّهُ مُبْدِيهِ وَتَخْشَى النَّاسَ وَاللَّهُ أَحَقُّ أَن تَخْشَاهُ

ఓ ప్రవక్తా! అల్లాహ్, ఏ వ్యక్తికి మేలుచేశాడో ఆ వ్యక్తితో నీవు, నీ భార్యను విడిచి పెట్టకు, అల్లాహ్ కు భయపడు’ అని అంటున్న సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు నీవు బయట పెట్టదలచిన విషయాన్ని నీ మనస్సులో దాచి ఉంచావు. నీవు ప్రజలకు. భయపడుతున్నావు. వాస్తవానికి భయపడడానికి అల్లాహ్ యే ఎక్కువ హక్కుదారుడు.” (అల్ అహ్ జాబ్ 33 : 37)

ఎలాగైతేనేమి హజ్రత్ జైద్ (రదియల్లాహు అన్హు) , జైనబ్ (రదియల్లాహు అన్హా) కు తలాక్ ఇచ్చేశారు. ఆమె ఇద్దత్ గడువు పూర్తి అయిన తరువాత ఆమెతో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివాహానికి ఆదేశం అవతరించింది. ఈ ఆయత్ లో అల్లాహ్ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ నికాహ్ నిర్బంధంగా చేసుకోవాలని ఆదేశించాడు. ఆ ఆయత్ ఇలా ఉంది:

فَلَمَّا قَضَىٰ زَيْدٌ مِّنْهَا وَطَرًا زَوَّجْنَاكَهَا لِكَيْ لَا يَكُونَ عَلَى الْمُؤْمِنِينَ حَرَجٌ فِي أَزْوَاجِ أَدْعِيَائِهِمْ إِذَا قَضَوْا مِنْهُنَّ وَطَرًا

తరువాత జైద్ ఆమె విషయంలో తన అవసరాన్ని పూర్తి చేసుకున్నప్పుడు, మేము ఆమె (విడాకులు పొందిన స్త్రీ)తో నీకు వివాహం జరిపించాము. విశ్వాసులకు తమ దత్తపుత్రుల భార్యల విషయంలో, వారు తమ భార్యలకు సంబంధించిన తమ అవసరాన్ని పూర్తి చేసుకున్నప్పుడు ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు.” (33 : 37)

దీని ఉద్దేశ్యం ఏమిటంటే, దత్తపుత్రులకు సంబంధించిన అజ్ఞానపు ఆచారం, అంతకు పూర్వం అవతరించిన ఈ క్రింది ఆదేశాల ద్వారా అంతం చేసినట్లే కార్యరూపంగా అంతమొందించడం.

ادْعُوهُمْ لِآبَائِهِمْ هُوَ أَقْسَطُ عِندَ اللَّهِ

దత్తపుత్రులను వారి తండ్రులతో ఉన్న సంబంధం ప్రకారం పిలవండి. ఇది అల్లాహ్ దృష్టిలో ఎంతో న్యాయసమ్మతమైన విషయం.” (అల్  అహ్ జాబ్ 33 : 5)

مَّا كَانَ مُحَمَّدٌ أَبَا أَحَدٍ مِّن رِّجَالِكُمْ وَلَٰكِن رَّسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ

(మానవులారా!) ముహమ్మద్ మీలోని ఏ పురుషునికీ తండ్రి కారు. కాని ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త. దైవప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివారు.”(అల్  అహ్ జాబ్ 33:40)

ఈ సందర్భంగా ఓ విషయాన్ని మనం గమనించాల్సి ఉంది. ఒక సమాజంలో ఏదైనా దుస్సంప్రదాయం లేదా దురాచారం బాగా వేళ్ళూను కొనిపోతే, కేవలం మాటల ద్వారా దాన్ని చెరిపివేయలేం. లేదా ఆ ఆచార సంప్రదాయాల్లో మార్పు తీసుకురావడం సాధ్యపడదు. ఏ వ్యక్తి అయితే దాన్ని తుడిచివేయడానికి కంకణం కట్టుకుంటాడో లేదా వాటిలో మార్పులు తెచ్చే కృషి చేస్తాడో, ఆ వ్యక్తి చేతలు కూడా దానికి తగిన విధంగా ఉండడం అవసరం. “హుదైబియా ఒప్పందం” సందర్భంగా ముస్లిముల వైఖరి ద్వారా ఆ యదార్థం మరింత తేటతెల్లం అవుతుంది. ‘ఉర్వా బిన్ మస్ఊద్ సకఫీ’ హుదైబియాకు వచ్చినప్పుడు ముస్లిముల సమర్పణ త్యాగనిరతి ఎలాంటిదో చూసి ఉన్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉమ్మి వేసినప్పుడు అది సహాబాల (రదియల్లాహు అన్హా) చేతుల్లో పడుతోంది. వారు దాన్ని అందుకోవడానికి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వుజూ చేయగా క్రింద ఒలుకుతున్న నీటిని అందుకోవడానికి ఎగబడుతున్నారు. అవును! ఈ సహాబాలే ఆ చెట్టు క్రింద మరణాన్నయినా కొనితెచ్చుకుంటామని ప్రవక్త చేతుల మీద ప్రమాణం చేయడానికి తొందరపడుతున్నారు. వీరంతా ఎవరు? వారు హజ్రత్ ‘అబూబక్ర్(రదియల్లాహు అన్హు) , హజ్రత్ ఉమర్(రదియల్లాహు అన్హు) లాంటి త్యాగధనులు.

కానీ ఆ సహాబాల(రదియల్లాహు అన్హుమ్) ను – ఎవరైతే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై తమ ప్రాణాలను సైతం అర్పించడం అదృష్టం అనుకుంటూ ఉండేవారో- ఒప్పందం కుదిరిన తరువాత, తమ తమ హదీ పశువుల్ని జిబహ్ చేయమని ఆదేశించగా వారిలో ఏ ఒక్కరూ తమ స్థానం నుంచి కదలలేదు. చివరికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు బాధ  కూడా కలిగింది. పిదప ఆయన సతీమణి హజ్రత్ ఉమ్మె సల్మా(రదియల్లాహు అన్హా) , మీరే లేచి నా పశువులను జిబహ్ చేయండి అనే సలహా ఇచ్చారు. ఆ సలహాను పాటిస్తూ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తమ ఖుర్బానీ పశువులను జిబహ్ చేసేశారు. అప్పుడు ప్రతి సహాబీ(రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అనుసరించడానికి పరుగులు పెట్టనారంభించాడు. సహాబాలంతా తమ తమ పశువులను జిబహ్ చేసేశారు. ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తోందేమిటంటే, బాగా వ్రేళ్ళునుకొని పోయిన దురాచారాలను రూపుమాపాలంటే మాటలకు, చేతలకు ఉన్న ప్రభావంలో ఎంత తేడా ఉందనేదే. కాబట్టి దత్తత తీసుకునే అజ్ఞాన కాలపు ఆచారాన్ని అంతం చేయడానికిగాను మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన దత్తపుత్రుడు జైద్ (రదియల్లాహు అన్హు) విడాలికులిచ్చిన భార్యతో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివాహం జరిపించడం జరిగింది.

ఈ నికాహ్ జరగగానే మునాఫిక్ లు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దుష్ప్రచారాల దుమారాలు లేపడం మొదలెట్టారు. రకరకాల దుష్ట ఆలోచనలను, అపోహల్ని వ్యాపింపజేశారు. వాటి ప్రభావాలు ఎంతో కొంత అమాయక ముస్లిములపై కూడా పడ్డాయి. ఈ ప్రాపగండాను బలపరచడానికి మరో షరయీ (ధర్మశాస్త్ర సంబంధమైన) అవకాశం మునాఫిక్ ల చేతికి చిక్కింది. అదేమిటంటే, హజ్రత్ జైనబ్ (రదియల్లాహు అన్హా) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఐదవ భార్య కావడం. అప్పటికే ముస్లిములకు నల్గురు భార్యలే ధర్మసమ్మతం అన్న విషయం తెలుసు. అదంతా ఒక ఎత్తు అయితే ఈ దుష్ప్రచారానికి ప్రాణంలాంటి విషయం , అప్పటి వరకు హజ్రత్ జైద్ (రదియల్లాహు అన్హు) , దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు కుమారునిగానే తలచబడడం. ఆ కుమారుని భార్యతో నికాహ్ చేసుకోవడం అప్పటి ఆచారాల ప్రకారం వ్యభిచారంగా తలచబడడం. చివరకు అల్లాహ్ అహ్జాబ్ సూరాలో ఈ రెండు విషయాల గురించి ఆయతులు అవతరింప జేయవలసి వచ్చింది. ఆ దైవవాణి అవతరణ జరిగిన తరువాత, సహాబా(రదియల్లాహు అన్హుమ్) కు, ఇస్లామ్ ధర్మంలో దత్తపుత్రునికి ఎలాంటి విలువ లేదు అని, అల్లాహ్ కొన్ని ఉన్నతమైన, ప్రత్యేకమైన ఉద్దేశ్యాల సాధన కోసం తన ప్రవక్తకు ప్రత్యేకంగా, భార్యల సంఖ్య విషయంలో ఇతరులెవరికీ ఇవ్వనటువంటి అనుమతిని ఒసిగాడన్న విషయం తెలిసిపోయింది.

ఉమ్మహాతుల్ మోమినీన్ (విశ్వాసుల మాతృమూర్తులైన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సతీమణులు) ఎడల దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేసిన సంసారం తీరు ఎంతో గౌరవ ప్రదమైనది, ఉన్నతమైనది మరియు ఎంతో మర్యాదతో కూడుకున్నదిగా ఉండేది. దుర్భరమైన దారిద్య్రంను అనుభవిస్తూ, ఎంతో గడ్డు జీవితాన్ని గడుపుతున్నప్పటికీ, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సతీమణులు కూడా తమ దాంపత్య హక్కులను నిర్వర్తిస్తూ, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎడల ఎంత గౌరవంగా, సమ్మతంగా, తృప్తిగా, మర్యాదగా, సహనంగా, సేవా తత్పరత తో మెలిగేవారు. ఈ గడ్డు పరిస్థితులను సహించడం మరొకరి వల్ల అయ్యేది కాదు. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హా) ఓ ఉల్లేఖనంలో, “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), తాము పరమపదించే వరకు మైదా పిండితో చేసిన రొట్టె తినడం గాని, నా కళ్ళతో (ఆయన ఇంట) వేయించిన మేకను చూడడంగాని జరగలేదు” అని చెప్పారు. [సహీహ్ బుఖారి -2/956]

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి ఉల్లేఖనం ఇలా ఉంది: “అలా పస్తులతో రెండు నెలలు గడిచిపోయి మూడో నెల నెలవంక అగుపడే వరకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంట పొయ్యే వెలగకపోయేది.” హజ్రత్ ఉర్వా (రదియల్లాహు అన్హు) ఆమెతో, “మరి మీరు ఏమి తినేవారు?” అని అడగగా, ఆమె, “కేవలం రెండు నల్లని పదార్థాలు. అంటే ఖర్జూరం మరియు నీరు.” [సహీహ్ బుఖారి-2/956]. దీనికి సంబంధించిన హదీసులు అనేకం ఉన్నాయి.

ఇంత గడ్డు పరిస్థితులు చోటుచేసుకొని ఉన్నప్పటికీ, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సతీమణులచే విమర్శకు గురిఅయ్యే ఏ పొరపాటూ జరగలేదు – కేవలం ఓసారి, అది కూడా మానవ బలహీనతల కారణంగా ఓ పొరపాటు తప్ప. ఈ పొరపాటును ఆధారంగా చేసుకొని కొన్ని ఆదేశాలు ఇవ్వవలసి ఉన్నందున అది జరిగిపోయింది. కాబట్టి అల్లాహ్ ఈ సందర్భంగా వారిని ఇలా హెచ్చ రించాడు:

يَا أَيُّهَا النَّبِيُّ قُل لِّأَزْوَاجِكَ إِن كُنتُنَّ تُرِدْنَ الْحَيَاةَ الدُّنْيَا وَزِينَتَهَا فَتَعَالَيْنَ أُمَتِّعْكُنَّ وَأُسَرِّحْكُنَّ سَرَاحًا جَمِيلًا وَإِن كُنتُنَّ تُرِدْنَ اللَّهَ وَرَسُولَهُ وَالدَّارَ الْآخِرَةَ فَإِنَّ اللَّهَ أَعَدَّ لِلْمُحْسِنَاتِ مِنكُنَّ أَجْرًا عَظِيمًا

ఓ ప్రవక్తా! నీ భార్యలతో ఇలా అను; ఒకవేళ మీరు ప్రాపంచిక జీవితాన్నీ, దాని శోభనూ కోరుతూ ఉన్నట్లయితే, రండి, నేను మీకు ఎంతో కొంత ఇచ్చివేసి మంచి పద్ధతి ప్రకారం సాగనంపుతాను. కాని ఒకవేళ మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను, పరలోక నివాసాన్ని కోరుతూ ఉన్నట్లయితే తెలుసుకోండి, మీలోని పుణ్యవతుల నిమిత్తం అల్లాహ్ గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు.”(అల్  అహ్ జాబ్ 33 : 28,29)

ఇక పరిశుద్ధ సతీమణుల ఔన్నత్యాన్ని కూడా అంచనా వేయండి. వారంతా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కే ప్రాధాన్యత ఇచ్చారు. వారిలో ఏ ఒక్కరూ ప్రాపంచిక సుఖభోగాల వైపునకు కన్నెత్తయినా చూడలేదు. ఇలాగే సవతుల నడుమ ప్రతి రోజు కొన్ని మనస్పర్ధలు ఏర్పడుతూనే ఉంటాయి. కాని సవతుల సంఖ్య అధికమైనప్పటికీ అలాంటి సంఘటన జరగడం ఎప్పుడో ఒకప్పుడు చోటుచేసుకోవడం జరిగింది. అది కూడా మానవ బలహీనతల కారణంగానే. ఆ పొరపాటును అల్లాహ్ ఎత్తిచూపి వారిని హెచ్చరించినందున ఆ తరువాత అలాంటిది మరేదీ జరగలేదు. ఖుర్ఆన్ లోని తహ్రీమ్ సూరా మొదటి అయిదు ఆయత్ లలో ఆ విషయమే చెప్పడం జరిగింది.

చివరగా, ఈ సందర్భంలో, బహుభార్యత్వం గురించి చర్చించే అవసరం లేదని అనుకుంటున్నాము. ఎందుకంటే దీన్ని అందరికంటే అతిగా విమర్శించే వారు ఐరోపా వారే. వారు ప్రస్తుతం ఏ రకమైన జీవితాన్నయితే గడుపుతున్నారో, మరే దురదృష్టకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారో మనకు తెలుసు. బహుభార్యత్వ సిద్ధాంతాన్ని కాదని వారెలాంటి బాధలను కష్టాలను ఎదుర్కొంటున్నారో దాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఇక ఈ విషయాన్ని చర్చించే అవసరమే లేదని చెప్పడం సరిపోతుంది. పాశ్చాత్య సమాజపు దురదృష్టకర నికృష్ట జీవితం, బహుభార్యత్వ సిద్ధాంతం సత్యంపై ఆధారపడి ఉందనడానికి నిదర్శనం. వివేకుల కోసం ఇందులో గొప్ప గుణపాఠమూ ఉంది.


ఇది క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:  [లింక్ క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవవచ్చు]

మహా ప్రవక్త జీవిత చరిత్ర: అర్రహీఖుల్‌ మఖ్ తూమ్ (పూర్తి పుస్తకం)
https://teluguislam.net/2020/01/25/seerah-arraheeq-al-makhtoum/
షేఖ్ సఫియుర్  రహ్మాన్ ముబారక్ ఫూరి


ఇతరములు:

సీరత్: అబిసీనియా వైపు హిజ్రత్ (వలస)

బిస్మిల్లాహ్

అబీసీనియా వైపు హిజ్రత్ (వలస)
మహా ప్రవక్త జీవిత చరిత్ర: అర్రహీఖుల్‌ మఖ్ తూమ్ (పూర్తి పుస్తకం)
షేఖ్ సఫియుర్  రహ్మాన్ ముబారక్ ఫూరి

అబీసీనియా వైపు మొదటి హిజ్రత్ (వలస)

హింసాదౌర్జన్యాల ఈ పరంపర దైవదౌత్యపు నాలుగవ సంవత్సరం మధ్య భాగంలో లేదా చివరి భాగంలో ఆరంభమైంది. ప్రారంభంలో ఇది మామూలుగా సాగింది. కాలం గడిచిన కొలదీ ఉధృతం కాసాగింది. చివరికి దైవ దౌత్యపు అయిదవ సంవత్సర మధ్యభాగానికి చేరుకోగానే తారాస్థాయి నందుకుంది. ఇలా ముస్లిములు మక్కాలో నిలువలేకపోయారు. బహుదైవారాధకుల ఆగడాల నుండి విముక్తి పొందేందుకు ఏదో ఒక మార్గాన్ని ఆలోచించడానికి వివశులైపోయారు. ఇలాంటి కఠినమైన అంధకార బంధురమైన పరిస్థితులలోనే కహఫ్ సూరా (అధ్యాయం) అవతరించింది. ఇది అసలు బహుదైవారాధకులు వేసిన ప్రశ్నలకు సమాధానం. కాని ఈ సూరాలో మూడు సంఘటనలు వివరించబడ్డాయి. వీటిలో అల్లాహ్ తరఫు నుండి తన దాసుల భవిష్యత్తు గురించి సాంత్వన వచనాలు ఉన్నాయి. కాబట్టి అస్హాబె కహఫ్ (గుహవారు) సంఘటనలో, ధర్మానికి, విశ్వాసానికి ప్రమాదం ఏర్పడినప్పుడు దైవధిక్కార, దౌర్జన్య కేంద్రాల నుండి హిజ్రత్ (వలస) చేసి అల్లాహ్ పై భారం వేస్తూ బయటకు వెళ్ళిపోవాలనే సంకేతం కూడా ఉంది.

وَإِذِ اعْتَزَلْتُمُوهُمْ وَمَا يَعْبُدُونَ إِلَّا اللَّهَ فَأْوُوا إِلَى الْكَهْفِ يَنشُرْ لَكُمْ رَبُّكُم مِّن رَّحْمَتِهِ وَيُهَيِّئْ لَكُم مِّنْ أَمْرِكُم مِّرْفَقًا – 18:16

ఇప్పుడు మీరు వారితోను, అల్లాహ్ ను కాదని వారు ఆరాధించే దేవుళ్ళ తోను సంబంధాలు త్రెంచుకున్నారు. కనుక, ఇక పదండి. ఫలానా గుహలో ప్రవేశించి ఆశ్రయం పొందండి. మీ ప్రభువు మీపై తన కారుణ్యఛాయను విస్తరింపజేస్తాడు, మీ కార్యసిద్ధికై సకల సామగ్రిని సమకూరుస్తాడు.” (18: 16)

హజ్రత్ మూసా మరియు ఖిద్ర్ (అలైహిముస్సలాం)ల గురించి వివరిస్తూ, ఫలితాలు ఎల్లప్పుడూ బాహ్యపరిస్థితులకు అనుకూలంగా ఉండవు అని, అప్పుడప్పుడూ బాహ్యపరిస్థితులకు భిన్నంగా ఉంటాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సంఘటనలో, ముస్లిములకు వ్యతిరేకంగా ఏ హింసా దౌర్జన్యాలు జరుగుతున్నాయో వాటి ఫలితాలు కూడా పూర్తిగా భిన్నంగానే బయటబడతాయని, ఈ విద్రోహులు, దైవధిక్కారులు ఇప్పుడు విశ్వసించకపోతే మునుముందు వారే దాసోహం అంటూ ముస్లిముల ఎదుట తల ఒగ్గి వారి అదృష్టం తీర్పుకు ప్రాధేయపడతారు అని భవిష్యవాణి చెప్పడం జరిగింది.

జుల్ ఖర్ నైన్ గురించి అవతరించిన వాక్యాల్లో కొన్ని ప్రత్యేక విషయాల వైపునకు దృష్టిని మరల్చడం జరిగింది.

 1. ఈ భూమండలం అల్లాహ్ దే. ఆయన తన దాసుల్లో తాను కోరిన వ్యక్తిని దాని వారసునిగా చేస్తాడు.
 2. ఈ సాఫల్యం, విజయం విశ్వాసమార్గం పై నడవడం వల్లనే సిద్ధిస్తుంది. దైవధిక్కార ధోరణి వల్ల కాదు.
 3. అల్లాహ్ అప్పుడప్పుడు ఆయా కాలాలకు చెందిన యాజూజ్ మాజూజ్ ల నుండి రక్షించడానికి తన దాసుల నుండి కొందరిని ఎంపిక చేసి నిలబెడతాడు.
 4. అల్లాహ్ కు భయపడే సద్వర్తనులే భూమండల వారసత్వానికి ఎక్కువ హక్కుదారులు.

కహఫ్ సూరా తరువాత జుమర్ సూరా అవతరణ ఆరంభమైంది. అందు హిజ్రత్ (వలస) వైపునకు సంకేతం ఉంది. అందులో అల్లాహ్ సృష్టించిన ఈ లోకం ఇరుకైనది ఎంతమాత్రం కాదని చెప్పడం జరిగింది.

قُلْ يَا عِبَادِ الَّذِينَ آمَنُوا اتَّقُوا رَبَّكُمْ ۚ لِلَّذِينَ أَحْسَنُوا فِي هَٰذِهِ الدُّنْيَا حَسَنَةٌ ۗ وَأَرْضُ اللَّهِ وَاسِعَةٌ ۗ إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُم بِغَيْرِ حِسَابٍ 

(ఓ ప్రవక్తా!) ఇలా చెప్పు, విశ్వసించిన నా దాసులారా! మీ ప్రభువునకు భయపడండి. ఈ లోకంలో సద్వర్తనను అవలంబించే వారికి మేలు జరుగుతుంది. దేవుని భూమి విశాలమైనటువంటిది. ఓర్పు వహించే వారికి లెక్క లేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది.” (జుమర్ 39 : 10)

‘అస్మహ్’ నజాషీ అబీసీనియాకు చెందిన న్యాయవంతుడైన పరిపాలకుడనే విషయం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు తెలుసు. అక్కడ ఎవ్వరిపైనా దౌర్జన్యం జరగదు. అందుకని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఉపద్రవాల నుండి తమ ధర్మాన్ని రక్షించుకునేందుకు అబీసీనియాకు వలస పోవాలని ముస్లిములకు ఆదేశమిచ్చారు. ఆ తరువాత అనుకున్న విధంగా రజబ్ నెల, దైవదౌత్యశకం అయిదవ సంవత్సరం సహాబా (రదియల్లాహు అన్హుమ్) కు చెందిన మొదటి జట్టు అబీసీనియా వైపునకు బయలుదేరింది. ఈ జట్టులో పన్నెండుగురు మగవారు, నలుగురు స్త్రీలు ఉన్నారు. హజ్రత్ ఉస్మాన్ బిన్ అప్ఫాన్ (రదియల్లాహు అన్హు) దానికి నాయకులు. ఆయన వెంట దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)గారి కుమార్తె హజ్రత్ రుఖయ్యా (రదియల్లాహు అన్హా) కూడా ఉన్నారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమె గురించి చెబుతూ, “హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) మరియు లూత్ (అలైహిస్సలాం) తరువాత అల్లాహ్ మార్గంలో హిజ్రత్ చేసిన ప్రథమ కుటుంబం అది” అని సెలవిచ్చారు. [44]

[44]. ముక్తరుస్సీరత్- షేక్ అబ్దుల్లా, పుట. 92, 93; జాదుల్ మఆద్-1/24, రహ్మతుల్ లిల్ ఆలమీన్-1/61.

ఈ జట్టు రాత్రి అంధకారంలో తమ క్రొత్త గమ్యానికి బయలుదేరింది. గోప్యంగా ఉండవలసిన విషయం గనక ప్రయాణం గురించి ఖురైష్ కు తెలియకూడదనే జాగ్రత్త తీసుకోబడింది. ఎర్ర సముద్రం ఓడరేవు ‘షుఅయిబా’ వైపునకు పయనమైందీ జట్టు. అదృష్టవశాత్తు అక్కడ రెండు పడవలు ఉన్నాయి. అవి ఈ జట్టును ఎక్కించుకొని సముద్రానికి ఆవలి ఒడ్డున ఉన్న అబీసీనియా వైపునకు వెళ్ళిపోయాయి. ఖురైష్ కు ఈ విషయం చూచాయగా తెలిసింది. వారు దాన్ని వెంటాడి తీరం వరకు వెళ్ళగలిగారు కాని అప్పటికి సహాబా వెళ్ళిపోవడం వలన వెనక్కు తిరిగివచ్చేశారు. అటు ముస్లిములు అబీసీనియా చేరి ఊపిరి పీల్చుకున్నారు.[45]

కానీ రమజాన్ నెలలో ఓ సంఘటన జరిగింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఓసారి కాబా మసీదుకు వెళ్ళారు. అక్కడ ఖురైష్ ల గుంపు ఒకటి సమావేశమై ఉంది. వారిలో పెద్ద పెద్ద సర్దారులు కూడా ఉన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హఠాత్తుగా నిలబడి నజ్మ్ సూరా పఠనాన్ని ప్రారంభించారు. ఆ దైవధిక్కారులు ఇది వరకు ఖుర్ఆన్ పఠనం వినలేదు. వారి వైఖరే అది. దివ్యఖుర్ఆన్ లో వారి ఈ వైఖరి గురించి ఇలా చెప్పడం జరిగింది. ఈ సత్యతిరస్కారులు ఇలా అంటారు;

ఈ ఖుర్ఆన్ ను అసలు వినకండి. అది వినిపించబడేటప్పుడు వినకుండా విఘ్నం కలిగించండి. బహుశా ఇలాగైనా మీరు ప్రాబల్యం వహించవచ్చు.”

అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హఠాత్తుగా నజ్మ్ సూరా పఠనాన్ని ప్రారంభించినప్పుడు, వారి చెవుల్లో అమృతం గ్రోలినట్లు తోచింది. దాని ఔన్నత్యాన్ని అనుభవించినప్పుడు ఎవ్వరికీ తమ ధ్యాసే లేదు. ఎవరి మనస్సులోను ఎటువంటి చెడు ఉద్దేశ్యం జనించలేదు. చివరికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సూరా చివరన హృదయాలను ప్రకంపించే ఆయత్ ను పఠిస్తూ, “అల్లాహ్ ముందు మోకరిల్లండి (సజ్దా చేయండి). ఆయనకు దాస్యం చేయండి” అనే దైవాదేశాన్ని వినిపిస్తూ సజ్దా చేయగా ఏ ఒక్కడూ తన ఆధీనంలోలేక ‘సజ్దా’ చేశారు(సాష్టాంగబడ్డారు). నిజం చెప్పాలంటే, ఈ పరిస్థితి, గర్విష్టులైన ఖురైషుల మొండితనాన్ని పటాపంచలు చేసేసింది. వారు తమ ఆధీనంలో లేక అందరూ సజ్దాలో పడి పోయారు. [46]

[45]. రహ్మతుల్ లిల్ ఆలమీన్-1/61.
[46]. సహీ బుఖారీలో ఈ సజ్దా సంఘటనను ఇబ్నె మస్ ఊద్, ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు.

కాని ఆ తరువాత దైవగ్రంథ పఠనం ఔన్నత్యం వారి గర్వం అణచివేసిందని, దేన్నయితే అంతమొందించడానికి వారు కంకణబద్ధులై ఉన్నారో దాని కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారో అదంతా బూడిదలో పోసిన పన్నీరు చందాన వృధా అయిందని తెలియగానే నాలుక కరుచుకున్నారు. ఈ సంఘటన జరిగాక అన్నివైపుల నుండి వారి పై నిందల పరంపర వచ్చిపడ నారంభించింది. దీని నుండి తప్పుకోవడానికి సాకులు వెదుకనారంభించారు. చేసేదిలేక దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై అపనింద మోపుతూ, ఆయన వారి విగ్రహాలను గౌరవిస్తూ, “వీరు మహోన్నతమైన దేవతలు, వీరు మనకు సిఫార్సు చేస్తారు”అని చెప్పారని బొంకారు.

ఇది పూర్తిగా అసత్య ప్రచారం. దీన్ని వారు అవలంబించింది, దైవ ప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) సజ్దా చేసినప్పుడు తాము కూడా సజ్దా చేశామన్న నిజాన్ని కప్పిపుచ్చు కోవడానికే. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గురించి సతతం అసత్య ప్రచారం చేసే వీరు, తమను రక్షించుకోవడానికి ఇలాంటి అసత్య మాటల్ని చెప్పడానికి వెనకాడగలరా? [47]

మొత్తానికి బహుదైవారాధకులు సజ్దా చేసిన ఈ సంఘటన వార్త అబీసీనియాకు కూడా చేరింది. వలస వెళ్ళిన ముహాజిర్లు కూడా ఇది విన్నారు. అయితే వీరు విన్నది అసలు యదార్థానికి భిన్నమైన విషయం . అంటే, ఖురైష్ లంతా ముస్లిములైపోయారు అన్నదే ఆ విషయం. అందుకని వారు షవ్వాల్ నెలలో మక్కాకు బయలుదేరారు. మక్కా నగరం ఇక ఒక రోజు ప్రయాణ దూరంలో ఉందనగా అసలు విషయం వారికి తెలిసిపోయింది. ఆ తరువాత కొందరు అటునుంచే తిరిగి అబీసీనియాకు వెళ్ళిపోయారు. కొందరు రహస్యంగా లేదా ఖురైష్ కు చెందిన ఎవరో ఒకరి రక్షణలో మక్కా నగరంలో ప్రవేశించారు.[48]

[47]. పరిశోధకులు ఈ ఉల్లేఖనాన్ని బాగా అధ్యయనం చేసి ఈ నిర్ణయానికే వచ్చారు.
[48]. జాదుల్ మఆద్-1/24; 2/44; ఇబ్నె హిషామ్-1/61.

అబీసీనియాకు రెండో హిజ్రత్

ఆ తరువాత వలస నుండి తిరిగివచ్చిన ముహాజిర్లపై ప్రత్యేకంగాను, ఇతర ముస్లిములపై సాధారణంగాను హింసాదౌర్జన్యాలు బాగా పెరిగి పోయాయి. వారి కుటుంబ సభ్యులు వారిని మరీ ఆగడాలకు గురి చేశారు. ‘నజాషీ’ (అబీసీనియా చక్రవర్తి) వారి ఎడల అవలంబించిన ఉదార వైఖరి వారిని మరింత రెచ్చగొట్టింది. విధిలేక దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన అనుచరుల్ని (సహాబాలను) తిరిగి హిజ్రత్ చేయమని సలహా ఇచ్చారు. అయితే, రెండవసారి చేసిన హిజ్రత్, మొదటి హిజ్రత్ కంటే అనేక కష్టాలను కొనివచ్చింది. ఈసారి ఖురైష్ వారి ప్రయత్నాన్ని వమ్ముచేయడానికే సంసిద్ధులై ఉన్నారు గనుక ఎంతో జాగరూకతతో మెలగవలసిన పరిస్థితి ఏర్పడింది. కాని ముస్లిములు ఖురైష్ కంటే చురుకుగా ప్రవర్తించారు. అల్లాహ్ వారి ఈ ప్రయాణాన్ని సులభతరమూ చేశాడు. వారు ఖురైష్ కు పట్టుబడకముందే అబీసీనియా రాజు వద్దకు చేరుకోగలిగారు.

ఈసారి వారి సంఖ్య మొత్తం 82 లేదా 83 మంది పురుషులు (అమ్మార్ గారి హిజ్రత్ దీనికి భిన్నమైనది), 18 లేక 19 మంది స్త్రీలు [49] అల్లామా మన్సూర్ పూరి అయితే స్త్రీలు ఖచ్చితంగా పద్దెనిమిది మందే అని అంటారు.” [50]

[49].జాదుల్ మఆద్-1/24; రహ్మతుల్ లిల్ ఆలమీన్-1/61.
[50].జాదుల్ మఆద్-1/24; రహ్మతుల్ లిల్ ఆలమీన్-1/61.

అబీసీనియా ముహాజిర్లకు వ్యతిరేకంగా ఖురైష్ కుట్ర

ముస్లిములు తమ విశ్వాసాన్ని, ప్రాణాలను కాపాడుకుంటూ ఓ ప్రశాంత ప్రదేశానికి పారిపోయారన్న అక్కసు ఖురైష్ ను వెంటాడుతూనే ఉంది. వారు, వారిలో గొప్ప తెలివిగల ఇద్దరు వ్యక్తులు, అమ్ర్ బిన్ ఆస్ మరియు అబ్దుల్లా బిన్ రబీలను (అప్పటికి వారింకా ఇస్లామ్ ధర్మాన్ని స్వీకరించలేదు) ఎంపిక చేసి, నజాషీ మరియు క్రైస్తవ పాదరీల నాయకులకు సమర్పించుకోవడానికిగాను కానుకలిచ్చి తమ దూతలుగా పంపించడం జరిగింది. వీరిద్దరూ అబీసీనియాకు వెళ్ళి మొదట క్రైస్తవ పాదరీల నాయకులకు కానుకలిచ్చి ముస్లిములను అబీసీనియా నుండి వెళ్ళగొట్టడానికి తగు కారణాలను చూపెడుతూ మచ్చిక చేసుకున్నారు. క్రైస్తవ పాదరీ నాయకులు, నజాషీకి నచ్చజెప్పి ముస్లిములను వెనక్కు పంపిస్తామనే మాట ఇచ్చిన తరువాత ఈ ఇద్దరు దౌత్య ప్రతినిధులు నజాషీ దర్బారుకు హాజరయ్యారు. అతనికి కానుకలను సమర్పిస్తూ తమ మనోగతాన్ని ఇలా బయటబెట్టారు.

“ఓ రాజా! మీ దేశంలోనికి మాకు చెందిన కొందరు అవివేకులైన యువకులు పారిపోయివచ్చారు. వారు వారి జాతిధర్మాన్ని విడిచి పెట్టేశారు. అయితే ఇటు మీ ధరాన్ని విశ్వసించలేదు, సరికదా. ఓ క్రొత్త ధర్మాన్ని సృష్టించారు. ఆ ధర్మాన్ని మీరుగాని, మేముగాని ఎరుగము. వారి తల్లిదండ్రులు, పినతండ్రులు, కుటుంబ సభ్యులు మమ్మల్ని మీ వద్దకు పంపించారు. ఎందుకంటే, వారి బాగోగుల గురించి వారే బాగా ఎరిగిన వారు గనుక. కాబట్టి ఈ యువకుల్ని మా వెంట మా దేశానికి పంపించమని మనవి చేస్తున్నాం” అని ప్రాధేయపడ్డారు. వారిద్దరు కలసి వారి మనోగతాన్ని బయటబెట్టిన తరువాత క్రైస్తవ మత గురువులు అందుకొని, “మహారాజా! వీరిద్దరు చెప్పిందే సబబు. తమరు ఆ యువకుల్ని వారికి అప్పగించండి. వీరు వారిని వారి జాతికి అప్పజెబుతారు” అని వంతపాడారు.

అయితే నజాషీ, ఈ విషయాన్ని బాగా ఆకళింపుజేసుకోవడానికి, అసలు విషయాన్ని తెలుసుకోవడానికిగాను మరింత లోతులోనికి వెళ్ళడం అవసరం అనుకొని ఆ ముస్లిం యువకుల్ని హాజరుకమ్మని ఆదేశించాడు. ముస్లిములు ఫలితం ఎలాగున్నా సరే, తాము పూర్తి యదార్థమైన విషయాన్నే తెలపాలన్న సంకల్పంతో రాజు సన్నిధికి హాజరయ్యారు. ముస్లిములు దర్బారులోనికి వచ్చి నిలబడిన తరువాత నజాషీ వారిని ఉద్దేశించి;

“మీరు మీ జాతి నుండి వేరుబడడానికి ఆధారభూతమైన ఆ క్రొత్త ధర్మం ఏమిటి? నేను విశ్వసించే ధర్మాన్ని కూడా మీరు అవలంబించలేదు. మరే మతాల్లో దేన్నయినా విశ్వసించడం లేదు. దానికి కారణం ఏమిటి?” అని ప్రశ్నించాడు.

ముస్లిముల వైపు నుండి హజ్రత్ జాఫర్ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ముందుకొచ్చి,

ఓ రాజా! అజ్ఞానంలో కొట్టుమిట్టాడే జాతి మాది. ఇదివరకు మేము విగ్రహాల్ని పూజించేవారం. చనిపోయిన జంతువుల మాంసాన్ని భుజించేవారము. వ్యభిచారానికి పాల్పడేవారం. బంధువులతో సంబంధాల్ని త్రెంచుకునేవారం. పొరుగువారి ఎడల దురుసుగా ప్రవర్తించేవారం. మాలోని శక్తివంతుడు బలహీనుణ్ణి అణచివేసేవాడు. మేము ఈ పరిస్థితిలో ఉండగా అల్లాహ్ మా జాతి నుండే ఓ ప్రవక్తను పంపాడు. ఆయన వంశం ఉన్నతమైనది. ఆయన సత్యసంధత, అమానతులను రక్షించడం, పవిత్రతను మేము మొదటి నుండే ఎరిగి ఉన్నవాళ్ళం. ఆయన మమ్మల్ని అల్లాహ్ మార్గం వైపునకు పిలిచాడు. మేము ఒకే దేవుణ్ణి విశ్వసించాలనీ, ఆయన్నే ఆరాధించాలనీ, ఆయన తప్ప ఏ రాయి రప్పలను విగ్రహాలను మేమూ, మా తాతముత్తాతలు పూజిస్తూ వచ్చామో వాటిని విసర్జించాలని బోధించారు. సతతం సత్యం పలకడం, అమానతులను (అప్పగింతలను) అప్పజెప్పడం, సంబంధాలను పెంపొందించుకోవడం, పొరుగువారితో సద్వర్తనగా మెలగడాన్ని ప్రేరేపిస్తూ, వ్యభిచారం, రక్తపాతాన్ని వదిలేయమని ఆదేశించారు. దుష్కార్యాల్లో చిక్కుకోవడం, అసత్యం పలకడం, అనాధల ఆస్తుల్ని కాజేయడం మరియు శీలవతులైన మహిళలపై అపనిందలు వేయడం లాంటి కార్యాల నుండి మమ్మల్ని వారించారు. ఆయన మమ్మల్ని ఒకే అల్లాహ్ ను ఆరాధించమనీ, ఆయనకు సాటి కల్పించవద్దనీ, ఆదేశించారు. నమాజు చేయమనీ, రోజా (ఉపవాస) వ్రతాన్ని పాటించమనీ, జకాత్ చెల్లించమనీ ఆజ్ఞాపించారు.”

హజ్రత్ జాఫర్ (రదియల్లాహు అన్హు) అలానే ఇస్లామ్ సుగుణాలను ఏకరువు పెడుతూ, “మేము ఆ ప్రవక్తను సత్యప్రవక్తగా నమ్మాము, ఆయన్ను విశ్వసించాము. ఆయన తెచ్చిన దైవధర్మం ప్రకారం నడుచుకుంటున్నాము. ఏయే విషయాలను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హరాం (నిషిద్ధం) చేశారో వాటిని హరాం గానూ, మరే వస్తువుల్ని హలాల్ (ధర్మసమ్మతం) చేశారో వాటిని మేము ధర్మసమ్మతమైనవిగానూ తలచాము. దీనికి మా జాతి మా ఎడల ఉగ్రరూపం దాల్చింది. అది మాపై దౌర్జన్యాలు చేసి హింసించింది. మమ్మల్ని మా ధర్మం నుండి తప్పించడానికి పన్నాగాలు పన్నింది, మమ్మల్ని శిక్షించింది. మా జాతి మమ్మల్ని అల్లాహ్ ఆరాధన చేయకుండా తిరిగి విగ్రహారాధన వైపు మరిలేందుకు; ఏ అశుద్ధ పదార్థాలను వారు ధర్మసమ్మతం చేసుకున్నారో తిరిగి మేము వాటిని ధర్మసమ్మతమైనవిగా భావించాలని ఒత్తిడి తెచ్చింది. వీరిలా మాపై చేస్తున్న ఆగడాలను, హింసాదౌర్జన్యాలను అధికం చేసిన తరువాత, మాకు నిలువనీడ లేకుండా చేసినప్పుడు, మా నడుమ, మా ధర్మం నడుమ అడ్డంగా వచ్చి నిలబడినప్పుడు మేము తమ దేశానికి వలస రావలసివచ్చింది. ఇతరులకంటే మిమ్మల్నే నమ్మి మీ రక్షణలో ఉండడానికి సంసిద్ధులమై వచ్చాము. ఓ రాజా! మీ వద్ద ఉన్నంత వరకు మా పై ఎలాంటి జులుం జరగదని మేమాశిస్తున్నాం” అని విన్నవించు కున్నారు.

దానికి నజాషి, “మీ ప్రవక్త తెచ్చిన ధర్మంలోనిది ఏదైనా మీ దగ్గర ఉందా?” అని ప్రశ్నించాడు. అప్పుడు హజ్రత్ జాఫర్ (రదియల్లాహు అన్హు), “ఉంది!” అని బదులు పలికారు.

నజాషి, “అదేమిటో చదివి వినిపించు” అని ఆదేశించగా, హజ్రత్ జాఫర్ (రదియల్లాహు అన్హు), మరియమ్ సూరాలోని మొదటి ఆయత్ లను పఠించి వినిపించారు. ఈ పఠనాన్ని వినగానే నజాషీ, క్రైస్తవ మతగురువులు బాగా రోదించారు. కన్నీటితో వారి గెడ్డాలు తడిసిపోయాయి.

ఆ తరువాత నజాషీ, “ఈ గ్రంథం మరియు ఈసా (అలైహిస్సలాం) ( ఏసుక్రీస్తు) తెచ్చిన గ్రంథం ఒకే దివ్వె నుండి వెలిసిన వెలుగులు” అంటూ అమ్ర్  బిన్ ఆస్ మరియు అబ్దుల్లా బిన్ రబీయాను ఉద్దేశించి, “మీరిద్దరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. నేను వీరిని మీకు అప్పగించేది లేదు. వీరికి వ్యతిరేకంగా ఏ ఎత్తుగడా ఇక్కడ పనికిరాదు” అని చెప్పాడు.

ఈ రాజు ఆదేశం వెలువడ్డాక వారిరువురు దర్బారు నుండి బయటకు వచ్చారు. అయితే అమ్ర్ బిన్ ఆస్ మాత్రం అబ్దుల్లా బిన్ రబీనుద్దేశించి, “దైవసాక్షి! రేపు చూద్దువుగాని. వారి గురించి నేనే ఎత్తుగడ పన్నుతానో! వారు కూకటి వేళ్ళతో పెకిలించబడతారు” అని అన్నాడు. దానికి అబ్దుల్లా బిన్ రబియా, ” పోనిద్దువూ! వారు మాకు వ్యతిరేకంగా చెప్పినప్పటికీ మన కుటుంబానికి, తెగకు చెందినవారే కదా” అని నచ్చజెప్ప ప్రయత్నం చేశాడు. కాని అమ్ర్  బిన్ ఆస్ మాత్రం ఆయన మాటల్ని పట్టించుకోలేదు.

మరుసటి రోజు అమ్ర్ బిన్ ఆస్, నజాషీ దర్బారుకు వెళ్ళి, “ఓ రాజా! వీరు మరియమ్ కుమారుడు హజ్రత్ ఈసా (అలైహిస్సలాం) (ఏసు) పై ఓ తీవ్రమైన నిందను వేస్తున్నారు” అని చెప్పాడు. దీనికి నజాషీ తిరిగి ముస్లిములను దర్బారుకు రప్పించాడు. ముస్లిములు హజ్రత్ ఈసా (అలైహిస్సలాం) గురించి చేస్తున్న ఆ తీవ్రమైన వ్యాఖ్యలు ఏమిటో తెలుసుకునే ఉద్దేశ్యంతో, ఈసారి ముస్లిములు కొంత తడబడ్డారు. అయితే వారు, ఏది చెప్పినా నిజాన్నే చెబుతామని, దాని పరిణామం ఏమైనాసరే అని నిర్ణయించుకొని దర్బారులో హాజరయ్యారు. నజాషీ వారినుద్దేశించి ఆ విషయాన్నే ప్రస్తావించాడు.

హజ్రత్ జాఫర్ (రదియల్లాహు అన్హు), “మేము హజ్రత్ ఈసా (అలైహిస్సలాం) గురించి మా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పిందే చెబుతున్నాం. అంటే ఆయన (ఈసా – అలైహిస్సలాం) అల్లాహ్ ప్రవక్త అని, ఆయన ఆత్మ అని, కన్య అయిన పవిత్ర మరియమ్ (అలైహస్సలాం) గర్భాన జన్మించినవాడని” చెప్పారు.

దీనికి నజాషీ భూమ్మీద నుండి ఓ గడ్డిపోచ పైకెత్తి, “దైవసాక్షి! మీరు చెప్పింది యదార్థం. హజ్రత్ ఈసా (అలైహిస్సలాం) ఈ గడ్డిపోచకంటే మెరుగైన వాడు కారు” అని అనగా అక్కడున్న క్రైస్తవ మతగురువుల నోటి నుండి ఆశ్చర్యాన్ని వెలిబుచ్చినట్లుగా “ఆ, అదేమిటీ!” అనే పలుకులు వెలువడ్డాయి.

నజాషీ వారి ఈ హూంకరింపును విని, “మీరు హూంకరించినా సరే, (ఇది యదార్థం )” అని పలికాడు.

ఆ తరువాత నజాషీ, ముస్లిములను ఉద్దేశించి, “వెళ్ళండి, నా రాజ్యంలో ప్రశాంతంగా బ్రతకండి. మీ ఎడల దుర్భాషలాడేవానికి జరిమానా విధించబడుతుంది. మిమ్మల్ని బాధించడం వల్ల నాకు బంగారు కొండ లభించినా సరే, దాన్ని నేను సహించేదిలేదు” అన్నాడు.

ఆ తరువాత తన దర్బారులోని వారినుద్దేశించి, “వీరిద్దరు తెచ్చిన కానుకలను వారి ముఖాన పడవేయండి. దైవసాక్షి! అల్లాహ్ నాకు నా రాజ్యాన్ని తిరిగి ప్రసాదించేటప్పుడు ఎలాంటి లంచం పుచ్చుకొలేదు, నేనెలా ఈ లంచాన్ని స్వీకరించగలను? దానికితోడు అల్లాహ్ నా విషయంలో ఎవరి మాటనూ వినలేదు. నేనెలా ఇతరుల మాటలను వినగలను?” అని చెప్పి సభను చాలించాడు.

ఈ సంఘటనను గురించి వివరించిన హజ్రత్ ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హా) ఇలా అంటారు.

“ఆ తరువాత వారిద్దరు తాము తెచ్చిన కానుకలను తమ చేతపట్టుకొని బిడియపడుతూ వెనక్కు తిరిగారు. మేము నజాషీ దగ్గర ఓ మంచి దేశంలో ఓ మంచి పొరుగువాని పంచన ఉండిపోయాము.” [51]

[51]. ఇబ్నె హిషామ్ -1/334-338.

ఇది ఇబ్నె ఇస్హాక్ గారి కథనం. ఇతర సీరత్ చరిత్రకారుల కథనం ప్రకారం, నజాషీ దర్బారులో హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్, బద్ర్ యుద్ధం తరువాత గాని వెళ్ళారు. కొందరి పరిశోధన ప్రకారం, హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) నజాషీ దర్బారులో ముస్లిములను వెనక్కు తోడ్కొని రావడానికి రెండు మార్లు వెళ్ళారు. అయితే బద్ర్ యుద్ధం తరువాత హజ్రత్ జాఫర్ (రదియల్లాహు అన్హు) మరియు నజాషీల నడుమ జరిగిన ప్రశ్నోత్తరాల వివరాలేవైతే చెప్పబడ్డాయో అవి దాదాపు ఇబ్నె ఇస్హాక్ చెప్పిన అబీసీనియా వలస సందర్భంలో జరిగిన ప్రశ్నోత్తరాల వివరాల్లాంటివే.

అయితే, ఈ ప్రశ్నల సారాంశాన్ని బట్టి తెలిసిందేమిటంటే, ఈ వ్యాజ్యం నజాషీ దర్బారులో మొదటిసారే ప్రవేశ పెట్టడం జరిగింది అన్నదే. అందుకని, ముస్లిములను వెనక్కు తీసుకురావడానికి జరిగిన ప్రయత్నం ఒక్కసారే జరిగిందని, అది కూడా అబీసీనియా వలస తరువాత జరిగిన ప్రయత్నం అని గట్టిగా చెప్పగలం.

ఏదిఏమైనా బహుదైవారాధకుల ఈ కుట్ర, కుతంత్రాలు విఫలం అయిపోయాయి. తమ విద్వేష వైషమ్యాలను బహిర్గతం చేసుకోడానికి, తమ అక్కసును కేవలం తమ అధికార పరిధిలోనే వెళ్ళగక్కడం తప్ప మరే గత్యంతరం లేదనే విషయం వారికి తెలిసిపోయింది. దీని కోసం వారు ఓ భయంకరమైన ప్రణాళిక గురించి ఆలోచించనారంభించారు. నిజానికి, ఈ ఉపద్రవాన్ని అడ్డుకోడానికి వారి ముందు రెండే రెండు మార్గాలున్నాయన్న విషయం బాగా అర్థమైపోయింది. ఒకటి, తమ శక్తినుపయోగించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను దైవసందేశ ప్రచారం చేయకుండా అడ్డుకోవడం. రెండు, ఆయన్ను తుదముట్టించడం. అయితే రెండో మార్గం అతి కష్టంతో కూడుకున్న మార్గం. ఎందుకంటే, అబూతాలిబ్  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రక్షకులుగా ఉంటూ, బహుదైవారాధకుల ముందు పటిష్టమైన ఇనుప గోడలా నిలబడి ఉండడం. అందుకని అబూతాలిబ్  తో ముఖాముఖిగా వ్యవహారాన్ని తేల్చుకోవడమే మంచిదని గ్రహించారు వారు.


ఇది క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:  [లింక్ క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవవచ్చు]

మహా ప్రవక్త జీవిత చరిత్ర: అర్రహీఖుల్‌ మఖ్ తూమ్ (పూర్తి పుస్తకం)

బిస్మిల్లాహ్

ప్రవక్త జీవిత చరిత్ర: అర్రహీఖుల్‌ మఖ్ తూమ్ (పూర్తి పుస్తకం)

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి] [PDF]
[ఫైల్ సైజు 135.5 MB]

విషయసూచిక

 • అరేబియా నైసర్గిక స్వరూపం – జాతులు
 • అరబ్బు రాజ్యాలు – నాయకత్వాలు
 • అరేబియా మతాలు – ధర్మాలు
 • అజ్ఞాన కాలంనాటి అరబ్బుల సామాజిక తీరుతెన్నులు
 • ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వంశావళి, జననం, నలబై ఏండ్ల పవిత్ర జీవని
 • శుభ జననం-నలబై ఏళ్ళ పవిత్ర జీవితం
 • దైవదైత్య శకం
 • సందేశ ప్రచారాదేశం – దాని అంతరార్థం
 • ప్రథమ దశ – దైవసందేశ ప్రచార యత్నం
 • బహిరంగ దైవసందేశ ప్రచారం
 • సంపూర్ణ సంఘ బహిష్కరణ
 • అబూ తాలిబ్‌ను కలసిన ఖురైష్‌ చిట్టచివరి ప్రతినిధి బృందం
 • శోక సంవత్సరం
 • ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించిన వారి సహన సంయమనాలను పురికొల్పిన కారణాలు
 • తృతీయ దశ – మక్కాకు వెలుపల ఇస్లామ్‌ సందేశ ప్రచారం
 • ప్రముఖ వ్యక్తులు, వివిధ తెగల్లో ఇస్లామ్‌ ధర్మ ప్రచారం
 • ఇస్రా మరియు మేరాజ్‌
 • ప్రథమ బైతె అఖబా
 • ద్వితీయ బైతె అఖబా
 • హిజ్రత్‌కు ఉపక్రమించిన ప్రథమ బృందాలు
 • దారున్నద్వాలో ఖురైషుల సమావేశం
 • హిజ్రత్‌ చేసి మక్కాను వీడిన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)
 • మదీనాలో గడిపిన పవిత్ర జీవితం
 • హిజ్రత్‌ నాటి మదీనా పరిస్థితులు
 • నవ సమాజ నిర్మాణం
 • యూదులతో జరిగిన ఒప్పందం
 • సాయుధ పోరాటాలు
 • బద్ర్ సంగ్రామం
 • బద్ర్ తరువాయి యుద్ద సన్నాహాలు
 • ఉహద్‌ పోరాటం (గజ్వయె ఉహద్‌)
 • ఉహద్‌ పోరాటం తరువాతి సైనిక చర్యలు
 • గజ్వయె అహఁఖాబ్  (అగడ్త యుద్ధం)
 • అహఁఖాబ్ మరియు ఖురైజా పోరాటాల తదుపరి సైనిక చర్యలు
 • గజ్వయె బనీయిల్‌ ముస్తలిక్‌
 • గజ్వయెబనీ ముస్తలిక్‌ తరువాత చేపట్టిన సైనిక చర్యలు
 • హుదైబియా ఒప్పందం
 • హిజ్రత్‌ చేసి వచ్చిన మహిళల అప్పగింతను నిరాకరించడం
 • క్రొత్త మార్పు
 • హుదైబియా ఒప్పందం తరువాతి సైనిక చర్యలు
 • గజ్వయె ఖైబర్‌; గజ్వయె వాదియిల్‌ ఖురా
 • గజ్వయె జాతుర్రిఖాఖ్‌ (జాతుర్రిఖాఖ్‌ యుద్ధం- హి.శ. 7)
 • ఉమ్రయె ఖజా
 • ‘మూతా’ పోరాటం
 • మక్కా విజయం
 • మూడవ దశ –
 • గజ్వయె హునైన్‌ (హునైన్‌ యుద్ధం)
 • మక్కావిజయం తరువాతి సైనిక చర్యలు –
 • ప్రభుత్వాధికారుల నియామకం
 • గజ్వయె తబూక్‌ (తబూక్‌ పోరాటం)
 • హిజ్రీ శకం 9 లో జరిగిన హజ్‌
 • గజ్వాల (యుద్ధాల)పై ఓ సమీక్ష
 • దైవధర్మంలో తండోపతండాలుగా ప్రజల ప్రవేశం
 • ఇస్లామ్‌ ధర్మప్రచార సాఫల్యం – దాని ప్రభావాలు
 • హజ్జతుల్‌ విదా (చివరి హజ్‌)
 • చిట్టచివరి సైనిక యాత్ర
 • పరమాప్తుని వైపునకు ప్రస్థానం [PDF]
 • మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబం
 • పరిపూర్ణ మూర్తిమత్వం

హజ్రత్ ఉస్మాన్ (రది అల్లాహు అన్హు) సిగ్గు, బిడియం [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (3 నిముషాలు )

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇతరములు:

మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [వీడియోలు]

బిస్మిల్లాహ్

పైన వీడియో ప్లే లిస్ట్ క్లిక్ చేస్తే మొత్తం వీడియోలు ప్లే అవుతాయి. విడి విడిగా టాపిక్ ప్రకారం కావాలనుకుంటే క్రింద ఇచ్చిన లింకుల మీద క్లిక్ చెయ్యండి.

మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 80 నిముషాలు 

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

పై వీడియోలు తో పాటు  క్రింది పుస్తకం చదవండి 

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్