ఆయతుల్ కుర్సీ Ayat-al-Kursi

బిస్మిల్లాహ్
Tafseer Ayatul Kursi – Youtube Play List (ఆయతుల్ కుర్సీ – యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zZ7VizbWTYAi6VApCjfk3


اللّهُ لاَ إِلَـهَ إِلاَّ هُوَ الْحَيُّ الْقَيُّومُ لاَ تَأْخُذُهُ سِنَةٌ وَلاَ نَوْمٌ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الأَرْضِ مَن ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلاَّ بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلاَ يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلاَّ بِمَا شَاء وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالأَرْضَ وَلاَ يَؤُودُهُ حِفْظُهُمَا وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ

అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము లా త ఖుజుహూ సినతువ్ వ్వలా నౌమున్ ల్లహూ మా ఫిస్సమావాతి వమా ఫిల్ అర్ జి , మన్ జల్లజీ యష్ ఫవూ ఇన్ దహూ ఇల్లా బి ఇజ్నిహీ య – లము మా బైన అయదీహిం వమా ఖల్ ఫహుం వలా యుహీతూన బిషయ్యిమ్మిన్ ఇల్మిహీ ఇల్లా బి మాషా అ వసి అకుర్ సియ్యుహు స్సమావతి వల్అర్జ వలా య ఊదుహూ హిఫ్ జుహుమా వహువల్ అలియ్యుల్ అజీం
(ఖుర్ ఆన్ 2:255).

అల్లాహ్‌ (మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం). ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు; అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకుగానీ, నిద్రగానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన అధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానినీ, వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్యపరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు.

తెలుగు అనువాదం: అహ్సనుల్ బయాన్ నుండి

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ﷺ ఆదేశించారు:

“ఎవరు ప్రతి నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో వారి స్వర్గ ప్రవేశానికి మరణమే అడ్డు”
(నిసాయి ) (సహీహ 972)

ఉదయం ఆయతుల్ కుర్సీ చదివినవారు సాయంకాలం వరకు మరియు సాయంకాలం చదివినవారు ఉదయం వరకు షైతానుల నుండి రక్షింపబడతారు. (హాకిం 2064).

పడకపై వెళ్ళి ఆయతుల్ కుర్సీ చదివినవారి పై అల్లాహ్ ఒక రక్షకుడ్ని నియమిస్తాడు మరియు తెల్లారే వరకు షైతాన్ అతని దగ్గరికి రాడు. (బుఖారి 2311 తర్వాత).

క్రిందవి హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి (Riyadh-us-Saaliheen) నుండి హదీసులు

1019. హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనను “ఓ అబుల్ ముంజిర్! నీ దగ్గరున్న దైవగ్రంథ ఆయతుల్లో అన్నిటికన్నా గొప్పదేదో నీకు తెలుసా?” అని అడిగారు. ‘అల్లాహు లా ఇలాహ ఇల్లాహువల్ హయ్యుల్ ఖయ్యూమ్’ అనే ఆయతు (కావచ్చు) ‘ అని అన్నాను నేను. అప్పుడాయన నా రొమ్ము తట్టి, ‘అబుల్ ముంజిర్! నీకు జ్ఞానం వల్ల శుభం కల్గుగాక!’ అని అభినందించారు. (ముస్లిం) 

(అంటే ‘ఖుర్ఆన్ జ్ఞానశుభంతోనే నీకు అన్నిటికన్నా గొప్ప ఆయతు ఏదో తెలిసింది’ అని చెప్పటమే దైవప్రవక్త ప్రవచన ఉద్దేశ్యం.) 

ముఖ్యాంశాలు 

“అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్” ‘ఆయతుల్ కుర్సీ’కు సంబంధించిన వచనం. ఇక్కడ దీనిభావం, మొత్తం ఆయతుల్ కుర్సీ అని అర్థం చేసుకోవాలి. ఈ ఆయతులో మహోన్నతమైన అల్లాహ్ గుణగణాలు, మహోజ్వలమైన ఆయన అధికారాలు ప్రస్తావించబడ్డాయి. అందుకే ఈ ఆయతు ఎంతో మహత్యంతో కూడుకున్నది.

“నీకు జ్ఞానం వల్ల శుభం కల్గుగాక!” అంటే నీకు ప్రయోజనకరమైన, గౌరవప్రదమైన, సాఫల్యాన్ని తెచ్చి పెట్టే జ్ఞానం అబ్బాలని భావం. ఇక్కడ జ్ఞానమంటే ఖుర్ఆన్ హదీసుల జ్ఞానం. ఇహపరాల్లో మనిషికి సాఫల్యాన్ని తెచ్చి పెట్టే జ్ఞానం అదే! 

1020. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం :

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నన్ను రమజాన్ మాసపు జకాత్ (అంటే ఫిత్రా) సొమ్ముకు కాపలా ఉంచారు. (ఓరోజు – రాత్రి) ఎవరో ఒకతను వచ్చి దోసిళ్ళతో ఆ ధాన్యాన్ని దొంగిలించసాగాడు. వెంటనే నేనతన్ని పట్టుకొని, “(ఎవర్నువ్వు?) పద దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి” అని గద్దించాను. అందుకతను, (భయపడిపోతూ) “అవసరాల్లో ఉన్నానయ్యా! భార్యా బిడ్డలు గలోణ్ణి, ఇప్పుడు నాకు విపరీతమైన అవసరం వచ్చిపడింది” అన్నాడు. నేనతన్ని (దయతలచి) వదలి పెట్టాను. మరునాడు ఉదయం (నేను దైవప్రవక్త సన్నిధికి వెళ్ళాను). దైవప్రవక్త నన్ను పిలిచి “అబూహురైరా! నిన్న రాత్రి నువ్వు పట్టుకున్న వ్యక్తిని ఏం చేశావ్?” అని అడిగారు. దానికి నేను, “దైవ ప్రవక్తా! అతను తన అవసరం గురించి, తన మీద ఆధారపడి వున్నవారి గురించి మొర పెట్టుకున్నాడు. అందుకని నేనతని మీద దయతలచి అతన్ని వదలి పెట్టాను” అని చెప్పాను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), “అతను నీతో అబద్ధం చెప్పాడు. అతను మళ్ళీ వస్తాడు. చూస్తూ ఉండు” అన్నారు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు. కాబట్టి అతను మళ్ళీ తప్పకుండా వస్తాడని నమ్మి అతనికోసం మాటేసి ఉన్నాను. అతను వచ్చి దోసిళ్ళతో ధాన్యాన్ని నింపుకోసాగాడు. (నేను మెల్లిగా వెళ్ళి అతన్ని పట్టుకొని), ఇప్పుడు మాత్రం నేను నిన్ను తప్పకుండా దైవప్రవక్త దగ్గరికి తీసుకువెళ్తాను” అన్నాను. అందుకతను, “నన్ను వదలి పెట్టండి, అవసరాల్లో ఉన్నాను. భార్యాబిడ్డలు గలోణ్ణి. ఇంకెప్పుడూ రాను. (ఈ ఒక్క సారికి వదలి పెట్టండి)” అని బ్రతిమాలాడు. అందుకని అతన్ని వదలి పెట్టేశాను. మరునాడు ఉదయం (నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి వెళ్ళాను) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నన్ను పిలిచి, “అబూహురైరా! నిన్న రాత్రి నువ్వు పట్టుకున్న వ్యక్తిని ఏం చేశావ్?” అని అడిగారు. “దైవ ప్రవక్తా! అతను తన అవసరం గురించి, తనమీద ఆధారపడి వున్నవారి గురించి మొర పెట్టుకున్నాడు. అందుకని నేనతని మీద దయతలచి అతన్ని వదలి పెట్టేశాను” అని చెప్పాను. అది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), “అతను నీతో అబద్దం చెప్పాడు. అతను మళ్ళీ వస్తాడు” అని చెప్పారు.

మూడోసారి కూడా నేనతనికోసం మాటేసి కూర్చు న్నాను. అతను వచ్చి దోసిళ్లతో ధాన్యం నింపుకోసాగాడు. నేనతన్ని పట్టుకొని “ఇప్పుడు నేను నిన్ను తప్పకుండా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి తీసుకువెళ్తాను. నువ్వు ఇలా రావటం ఇది మూడోసారి. ప్రతిసారీ నువ్వు ఇంకెప్పుడూ రానని వాగ్దానం చేసి మళ్ళీ వస్తున్నావు” అని గద్దిస్తూ అన్నాను. దానికతను, “నన్ను వదలి పెట్టండి. నేను మీకు కొన్ని వచనాలు నేర్పిస్తాను. వాటి మూలంగా అల్లాహ్ మీకు ప్రయోజనం చేకూరుస్తాడు” అని అన్నాడు. నేను, “ఏమిటా వచనాలు?” అని అడిగాను. అందుకతను, “మీరు (నిద్రపోవటానికి) పడక మీదకు వెళ్ళి నప్పుడు ఆయతుల్ కుర్సీ పఠించండి. అలా చేస్తే తెల్లవారే వరకు, మీ కొరకు అల్లాహ్ తరఫు నుండి ఒక పర్యవేక్షకుడు నియమించబడతాడు. షైతాన్ మీ దరిదాపులకు కూడా రాడు” అని చెప్పాడు. అప్పుడు కూడా నేనతన్ని వదిలేశాను.

తెల్లవారిన తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నాతో మాట్లాడుతూ, “రాత్రి నువ్వు పట్టుకున్న వాణ్ణి ఏం చేశావ్?” అని అడిగారు. “దైవప్రవక్తా! అతను నాకు కొన్ని వచనాలు నేర్పిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వచనాల మూలంగా అల్లాహ్  నాకు ప్రయోజనం చేకూరుస్తాడట. అందుకని నేనతన్ని వదలి పెట్టేశాను” అని చెప్పాను. “ఏమిటా వచనాలు?” అడిగారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). అప్పుడు నేను, ఆ వచ్చిన వ్యక్తి నాతో “మీరు (నిద్రపోవటానికి) పడక మీదకు వెళ్ళినప్పుడు మొదటి నుంచి చివరి వరకు ఆయతుల్ కుర్సీ పఠించండి” అని అన్నాడని చెప్పాను. “అలాచేస్తే మీ కొరకు అల్లాహ్ తరఫు నుండి ఒక పర్యవేక్షకుడు నియమించబడతాడు. తెల్లవారే వరకు షైతాన్ మీ దరిదాపులకు కూడా రాడు” అని కూడా అన్నాడని చెప్పాను.

అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నాతో, “విను, అతను పెద్ద అబద్ధాలకోరు. అయినప్పటికీ అతను నీతో నిజం చెప్పాడు. అబూహురైరా! మూడు రాత్రుల నుంచి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?” అన్నారు. నేను “తెలీద’న్నాను. “అతను షైతాన్” అని చెప్పారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) (బుఖారీ)

ముఖ్యాంశాలు

ఈ హదీసు ద్వారా ఆయతుల్ కుర్సీ యొక్క ఘనత వెల్లడౌతోంది. రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు ఆ వచనాలను పఠించి నిద్రపోవాలని ఇందులో బోధించబడింది. 

దుఆ యే ఖునూత్ Dua-e-Qunoot

اللَّهُمَّ اهْدِنِي فِيْمَنْ هَدَيْتَ، وَعَافِنِي فِيْمَنْ عَافَيْتَ، وَتَوَلَّنِي فِيْمَنْ تَوَلَّيْتَ، وَبَارِكْ لِي فِيْمَا أَعْطَيْتَ، وَقِنِي شَرَّ مَا قَضَيْتَ، فَإِنَّكَ تَقْضِي وَلا يُقْضَى عَلَيْكَ، إِنَّهُ لا يَذِلُّ مَنْ وَالَيْتَ،   [ وَلا يَعِزُّ مَنْ عَادَيْتَ ]، تَبَارَكْتَ رَبَّنَا وَتَعَالَيْتَ.

 

అల్లహుమ్మహ్దినీ ఫీమన్ హద య్ త, వ ఆఫినీ ఫీమన్ ఆఫయ్ త, వ తవల్లనీ ఫీమన్ తవల్లయ్ త, వ బారిక్ లీ ఫీమా ఆతై త, వఖినీ షర్ర మా ఖదై త, ఫ ఇన్నక తఖ్ ధీ వలా యుఖ్ ధా అలైక, ఇన్నహు లా యుజిల్లు మన్ వాలైత, [వలా య ఇజ్జు మన్ ఆద య్ త] తబారక్ త రబ్బనా వత ఆలయ్ . (  తిర్మిజీ ,  అబూదావూద్ )

ఓ  అల్లాహ్ !  నీవు హిత బోధనిచ్చిన వారిలోనే నాకు హిత బోధనివ్వు . నీవు స్వస్థత నిచ్చిన వారిలోనే నాకు స్వస్థత ఇవ్వు . నీవు సంరక్షకత్వం వహించిన వారిలోనే నాకు సంరక్షణ కలిపించు . నాకు నీవు ప్రసాదించిన దానిలో నాకు శుభాన్ని ఇవ్వు . నీవు నా కోసం నిర్ణయించిన దానిలో కీడు నుండి నన్ను కాపాడు . నిర్ణయించే వాడవు నీవే . నీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ నిర్ణయించలేరు . నీవు మిత్రునిగా చేసుకున్న వారిని ఎవరూ అవమాన పరచలేరు . నీవు విరోధం వహించినవాడు ఎన్నటికీ గౌరవనీయుడు కాలేడు . మా ప్రభూ !  నీవు అమిత శుభములు కలవాడవు .  ఉన్నతమైన ఘనత కలవాడవు .

ఈ mp3 దుఆ  వినండి [Listen]

Shirk – అష్షిర్క్ – దైవత్వంలో భాగస్వాములను చేర్చటం

1. అష్షిర్క్ – దైవత్వంలో భాగస్వాములను చేర్చటం – الشرك

నిర్వచనం:

అల్లాహ్ యొక్క దైవత్వం (తౌహీద్ రుబూబియత్) లో మరియు అల్లాహ్ యొక్క ఏకత్వపు ఆరాధనల (తౌహీద్ ఉలూహియత్) లో ఇంకెవరినైనా చేర్చటం, అంటే ఇతరులను అల్లాహ్ యొక్క భాగస్వాములుగా చేయటం. తౌహీద్ ఉలూహియత్ (అంటే దైవారాధనలలో అల్లాహ్ యొక్క ఏకత్వానికి వ్యతిరేకంగా, ఇతరులను భాగస్వాములుగా చేర్చటం – ఇంకో మాటలో బహుదైవారాధన చేయటం)లో బహుదైవారాధన ఎక్కువగా జరుగుతుంది. అల్లాహ్ తో పాటు ఇతరులను కూడా వేడుకోవటం, ప్రార్థించటం అనేది దీనిలోని ఒక విధానం. కేవలం అల్లాహ్ కే చెందిన ఏకదైవారాధనా పద్ధతులలో కొన్నింటిని ఇతరులకు ప్రత్యేకం చేయటం దీనిలోని మరొక విధానం. ఉదాహరణకు – బలి ఇవ్వటం, ప్రమాణం చేయటం, దిష్టి తీయటం, భయపడటం, ఆశించటం, భక్తి చూపటం (ప్రేమించటం) మొదలైనవి. క్రింద తెలుపబడిన కొన్ని ప్రత్యేక ఆధారాల మరియు మూలకారణాల వలన అష్షిర్క్ (అల్లాహ్ యొక్క ఏకదైవత్వంలో భాగస్వామ్యం కల్పించటం) అనేది,  పాపాలన్నింటిలోను అత్యంత ఘోరమైన పాపంగా గుర్తింప బడినది.

1-   పోలిక: షిర్క్ అనేది దివ్యగుణాలలో సృష్టికర్తను తన సృష్టితాలతో పోలిక కల్పిస్తున్నది. ఎవరైనా అల్లాహ్ తో పాటు ఇతరులను కూడా ఆరాధిస్తున్నట్లయితే, వారు అల్లాహ్ కు భాగస్వాములను చేర్చినట్లు అగును. ఇది అత్యంత ఘోరమైన దౌర్జన్యం (పాపిష్టి పని). దివ్యఖుర్ఆన్ లోని లుఖ్మాన్ అధ్యాయం 13వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –

(لقمان 13) “إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ” – భావం యొక్క అనువాదం – {ఖచ్ఛితంగా, అష్షిర్క్ (బహుదైవారాధన) అనేది అత్యంత ఘోరమైన పాపిష్టి పని}. దౌర్జన్యం (పాపిష్టి పని) అంటే ఒకదానికి చెందిన స్థానంలో వేరేది ఉంచటం. అంటే దేనికైనా చెందిన స్థానంలో దానిని కాకుండా వేరే దానిని ఉంచటం. కాబట్టి ఎవరైనా కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందిన ఆరాధనలలో ఇతరులను కూడా చేర్చటమనేది, వారు తమ ఆరాధనలను తప్పుడు స్థానం లో ఉంచటమన్న మాట. ఇంకో మాటలో – అనర్హులైన వాటికి తమ ఈ ఉన్నతమైన బాధ్యతను (ఆరాధనను) సమర్పించటం. కాబట్టి, కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందిన ‘ఆరాధన’ అనే దివ్యమైన హక్కును, దాని స్థానం నుండి తప్పించి, వేరే స్థానంలో ఉంచటం అంటే అనర్హులైన, అయోగ్యులైన వేరే వాటికి సమర్పించటం అనేది అత్యంత ఘోరమైన మహాపాపంగా సృష్టకర్త ప్రకటించినాడు.

2-    క్షమింపబడని ఘోరాతి ఘోరమైన మహాపాపం: ఎవరైతే ఈ ఘోరమైన మహాపాపం నుండి పశ్చాత్తాపం చెందకుండా, క్షమాభిక్ష వేడుకోకుండా చనిపోతారో, అటువంటి వారిని అల్లాహ్ (ఎట్టి పరిస్థితులలోను క్షమించనని) ప్రకటించెను. ఖుర్ఆన్ లోని అన్నీసా (స్త్రీలు) అనే అధ్యాయంలోని 48వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు

(النساء 48) – “إِنَّ اللَّهَ لا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ”

భావం యొక్క అనువాదం – {తనకు భాగస్వాములను కల్పించటాన్ని (షిర్క్) అల్లాహ్ క్షమించడు; కాని ఇది (షిర్క్) కాక  ఇతర పాపలన్నింటినీ ఆయన క్షమించవచ్చును}

3-    స్వర్గం నిషేధించబడినది:  ఎవరైతే తన ఆరాధనలలో ఇతరులకు భాగస్వామ్యం కల్పిస్తారో (బహుదైవారాధన) చేస్తారో అటువంటి వారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను. మరియు వారిని అల్లాహ్ శాశ్వతంగా నరకంలోనే ఉంచును. దివ్యఖుర్ఆన్ లోని అల్ మాయిదహ్ (వడ్డించిన విస్తరి) అనే అధ్యాయంలోని 72వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –

”إِنَّهُ مَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ “ (المائدة 72)

భావం యొక్క అనువాదం– {తనతో పాటు ఇతరులను ఆరాధిస్తున్న వారి పై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను మరియు నరకంలోనే వారు శాశ్వతంగా ఉండబోతున్నారు. అటువంటి పాపిష్టులకు సహాయపడే వారెవ్వరూ ఉండరు}.

4-   పుణ్యకార్యాలన్నీ వ్యర్థమవుతాయి: షిర్క్ (బహుదైవారాధన) కారణంగా చేసిన పుణ్యకార్యాలన్నీ నిష్ప్రయోజనమవుతాయి, వ్యర్థమవుతాయి, ఉపయోగపడకుండా పోతాయి. దివ్యఖుర్ఆన్ లోని అల్ అన్ ఆమ్ అధ్యాయంలోని 88వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు

” ذَلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُمْ مَا كَانُوا يَعْمَلُونَ- “ (الأنعام 88)

భావం యొక్క అనువాదం – {ఇది అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వం: ఎవరి ఆరాధనలైతే తనను మెప్పిస్తాయో, వారికి అల్లాహ్ దీనిని ప్రసాదిస్తాడు. ఒకవేళ వారు గనుక ఇతరులను అల్లాహ్ ఏకదైవత్వంలో భాగస్వాములుగా చేర్చితే, వారి చేసిన (కూడగట్టిన) పుణ్యకార్యాలన్నీ వ్యర్థమైపోతాయి}.

ఇంకా దివ్యఖుర్ఆన్ లోని అజ్జుమర్ అధ్యాయంలోని 70వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు

(الزمر70) –  “وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِنْ قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنْ الْخَاسِرِينَ”

భావం యొక్క అర్థం – {కాని, ఏవిధంగా నైతే పూర్వికుల ముందు అవతరించినదో, అదే విధంగా మీ దగ్గర కూడా ఇది అవతరింపబడి ఉన్నది. ఒకవేళ మీరు ఎవరినైనా (అల్లాహ్ యొక్క ఏకదైవత్వంలో) చేర్చితే, నిశ్చయంగా మీ యొక్క (జీవితపు) ఆచరణలు నిష్ప్రయోజనమైపోతాయి మరియు మీరు తప్పక (అధ్యాత్మికంగా) నష్టపోయిన వారి పంక్తులలో చేర్చబడతారు}

5-  ప్రాణ సంపదలకు రక్షణ ఉండదు: ఎవరైతే అల్లాహ్ యొక్క ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతారో, వారి యొక్క రక్తం (జీవితం) మరియు సంపద నిషిద్ధం కాదు. దివ్యఖుర్ఆన్ లోని అత్తౌబా అధ్యాయం లోని 5వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు.

(التوبة 5)-  “فَاقْتُلُوا الْمُشْرِكِينَ حَيْثُ وَجَدْتُمُوهُمْ وَخُذُوهُمْ وَاحْصُرُوهُمْ وَاقْعُدُوا لَهُمْ كُلَّ مَرْصَدٍ”

భావం యొక్క అనువాదం – {యుద్ధరంగంలో మీకు ఎదురైన ప్రతి బహుదైవారాధకుడితో (ఏకైక ఆరాధ్యుడైన సర్వలోక సృష్టికర్త యొక్క దైవత్వంలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతున్న వారితో) యుద్ధం చేయండి మరియు వారిని హతమార్చండి మరియు వారిని బంధించండి మరియు చుట్టుముట్టండి మరియు వారి ప్రతి యుద్ధతంత్రంలో, యుక్తిలో ఘోరవైఫల్యం నిరీక్షిస్తున్నది.}

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా ఉపదేశించారు

“أمرت أن أقاتل الناس حتى يقولوا لا إله إلا الله و يُقيموا الصلاة و يُؤتوا الزكاة” –

అనువాదం – “లా ఇలాహ్ ఇల్లల్లాహ్ (కేవలం ఒక్క అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు) మరియు ముహమ్మదుర్రసూలుల్లాహ్ (ముహమ్మద్ ^ అల్లాహ్ యొక్క సందేశహరుడు) అని సాక్ష్యమిచ్చి, నమాజు స్థాపించి, విధిదానం (జకాత్) ఇచ్చే వరకు ప్రజలతో పోరు జరపమని (అల్లాహ్ నుండి) నాకు ఆజ్ఞ ఇవ్వబడినది. కాబట్టి వారు పైవిధంగా ఆచరిస్తే, వారి రక్తం మరియు సంపదకు ఇస్లామీయ ధర్మశాస్త్ర ఆదేశాల సందర్భంలో తప్ప,  నా తరపున గ్యారంటీగా రక్షణ లభిస్తుంది.

6-      ఘోరాతి ఘోరమైన మహాపాపం: షిర్క్ (బహుదైవారాధన, అల్లాహ్ యొక్క ఏకైక దైవత్వంలో ఇతరులను చేర్చటం) అనేది మహా పాపములలో ఘోరాతి ఘోరమైనది.

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా సంబోధించారు –  “ألا أنبئكم بأكبر الكبائر” – అనువాదం – “ఘోరాతి ఘోరమైన మహాపాపం గురించి మీకు తెలియజేయ మంటారా?” మేము (సహచరులం) ఇలా సమాధానమిచ్చాం, “అవును,  ఓ అల్లాహ్ యొక్క సందేశహరుడా r”, వారు ఇలా పలికారు, “الإشراك بالله وعقوق الوالدين” – అనువాదం – “అల్లాహ్ తో ఇతరులెవరినైనా జతపర్చటం, తల్లిదండ్రులకు అవిధేయత చూపటం

కాబట్టి షిర్క్ (బహుదైవారాధన) అనేది అత్యంత ఘోరాతి ఘోరమైన దౌర్జన్యం (పాపిష్టి పని) మరియు తౌహీద్ (ఏకదైవత్వం) అత్యంత స్వచ్ఛమైనది, న్యాయమైనది. మరియు ఏదైనా సరే అల్లాహ్ యొక్క ఏకదైవత్వాన్ని ఖండిస్తున్నట్లయితే, తిరస్కరిస్తున్నట్లయితే, నిరాకరిస్తున్నట్లయితే, వ్యతిరేకిస్తున్నట్లయితే అది అత్యంత ఘోరమైన దౌర్జన్యం (అన్యాయం) అవుతుంది. ఇంకా తన ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చే వారిపై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను. వారి జీవితం, సంపద, భార్య మొదలైనవి కేవలం తననే ఆరాధిస్తున్న ఏకదైవారాధకుల రక్షణ పరిధి లోనికి రావని అల్లాహ్ ప్రకటిస్తున్నాడు. ఇంకా తర్వాతి వారు మొదటి వారిని వారి బహుదైవారాధన కారణంగా ఖైదీ (దాసులుగా) చేయటానికి అనుమతి ఇవ్వబడుతున్నది. ఇంకా బహుదైవారాధకుల ఏ చిన్న మంచి పనినైనా సరే ఆమోదించటాన్ని లేదా ఎవరిదైనా సిఫారసు స్వీకరించటాన్ని లేదా పునరుత్థాన దినమున వారి పిలుపును అందుకోవటాన్ని అల్లాహ్ తిరస్కరించెను. ఎందుకంటే కేవలం అజ్ఞానం వలన, అల్లాహ్ కు భాగస్వామ్యం జతపర్చిన బహుదైవారాధకుడు అందరి కంటే ఎక్కువగా అవివేకుడు, మూఢుడు. అ విధంగా అతడు అల్లాహ్ పై దౌర్జన్యం (అన్యాయం) చెయ్యటమే కాకుండా స్వయంగా తనకు వ్యతిరేకంగా తానే దౌర్జన్యం (అన్యాయం) చేసుకుంటున్నాడు.

7-   ఒక లోపం మరియు తప్పిదం: షిర్క్ (బహుదైవారాధన)  అనేది ఒక లోటు, ఒక లోపం, ఒక దోషం, ఒక కళంకం, ఒక లొలుగు మరియు ఒక తప్పిదం – అల్లాహ్ యొక్క అత్యుత్తమమైన స్వభావం దీని (షిర్క్ భావనల) కంటే ఎంతో మహాన్నతమైనది. కాబట్టి, ఎవరైతే అల్లాహ్ యొక్క ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతున్నారో, అలాంటి వారు కేవలం అల్లాహ్ కే చెందిన ప్రత్యేక ‘మహోన్నత స్థానాన్ని’ తాము ఖండిస్తున్నామని మరియు వ్యతిరేకిస్తున్నామని స్వయంగా అంగీకరిస్తున్నట్లవు తున్నది.

షిర్క్ (బహుదైవారాధన) లోని భాగాలు:

షిర్క్ (బహు దైవారాధన లేదా విగ్రహారాధన) ఎలా ప్రారంభమైనది ? (How shirk or idolatory started?)

షిర్క్ (అల్లాహ్ కు సాటి కల్పించుట) గురించి తెలుసుకున్న తర్వాత, అది ఈ లోకంలో ఎలా ప్రారంభమైనదో తెలుసుకోవటం మంచిది. షిర్క్ మొట్టమొదట నూహ్ అలైహిస్సలాం కు పూర్వపుకాలంలో ప్రారంభం అయినది. అల్లాహ్ నూహ్ అలైహిస్సలాం ను వారి సంతతి వద్దకు ప్రవక్తగా చేసి పంపినప్పుడు ఆయన వారిని విగ్రహారాధనను విడనాడవలసినదిగా ఉద్బోదించారు, సకలరాశి సృష్టికర్త అయిన ఒకే ఒక అల్లాహ్ యొక్క ఆరాధన వైపునకు పిలిచారు. దానితో వారు ఆయనను వ్యతిరేకించారు, విగ్రహారాధనకు కట్టుబడి ఉంటానికి పూనుకున్నారు, ఆయనను ఉపదేశాలను తిరస్కరించారు, ఆయనను కష్టపెట్టడం ప్రారంభించారు. ఇంకా వారు ఇలా ప్రకటించారు.

నూహ్ 71:23:- “ మరియు వాళ్ళు అన్నారు – ఎట్టి పరిస్థితిలోను మన దేవుళ్ళను (విగ్రహారాధన ను) వదలవద్దు. మరియు వద్ మరియు సువాఅ మరియు యగూస్ మరియు యఊఖ్ మరియు నసరా ని వదలవద్దు అన్నారు.”

పై వాక్యం యొక్క వివరణ (సహీ బుఖారీ) లో అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా యొక్క ఉల్లేఖన లో ఇలా వివరించబడినది – ఈ పేర్లన్నీ నూహ్ అలైహిస్సలాం కాలంనాటి ప్రజలలోని పుణ్యపురుషుల పేర్లు. వీరు చనిపోయిన తర్వాత షైతాన్ ఇట్లా ఉసి కొల్పెను.” మీరు మీ సభలలో ఆ పుణ్యపురుషుల ఫొటోలు, విగ్రహములు చేసి ఉంచి వారి గురించి తెలియజేస్తుండండి” వారు అదే విధముగా చేయటం ప్రారంభించారు.  కాని ఆ ప్రజలు వారిని ఆరాధించలేదు. తర్వాత ఈ విధంగా విగ్రహాలు తయారు చేసి వారు చనిపోయారు. వారి తర్వాత వచ్చిన ప్రజలు ఆ విగ్రహాలను ఆరాధించటం (పూజించడం) ప్రారంభించారు.

హాఫిజ్ ఇబ్నె అల్ ఖయ్యిం (రహిమహుల్లాహ్) ఇలా విశదీకరించారు – “చాలామంది మతగురువులు ఇలా తెలిపారు. ఆ పుణ్యపురుషులు చనిపోయినప్పుడు ప్రజలు వారి సమాధుల వద్ద గుమిగూడి తపస్సులు(ధ్యానం) చేసెడివారు. ఆ తర్వాత వారి ఫొటోలు(చిత్రపటాలు), విగ్రహాలు తయారు చేశారు. ఇంకా కాలం మారే కొద్దీ, వారి తరువాత ప్రజలు వాటిని పూజించటం ప్రారంభించారు.” కాబట్టి దీని వలన అర్థం మవుతున్నది ఏమిటంటే షిర్క్ (బహు దైవారాధన లేదా అల్లాహ్ కు సాటి కల్పించుట) ప్రారంభమగుటకు అసలు కారణం పుణ్యపురుషుల విషయంలో గులూ (హద్దు మీరటం) చేయటమే. పుణ్యపురుషుల విషయంలో హద్దు మీరి విధేయత చూపటం వలన ప్రజలలో షిర్క్ చోటు చేసుకుంటుంది.

Source: Tawheed Course – Level 01

సూరతుల్ ఫాతిహ (Sura al-Fatihah)

سُورَةُ الْفَاتِـحَةసూరతుల్ ఫాతిహా :001
అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం
సకల లోకాలకు ప్రభువు అయిన అల్లాహ్ మాత్రమే స్తుతింపదగిన వాడు అల్ హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అర్రహ్మా నిర్రహీం
ప్రతి ఫల(తీర్పు)దినానికి యజమాని మాలికి యౌమిద్దీన్
మేము కేవలం నిన్నేఆరాధిస్తున్నాము మరియు సహాయం కోసం కేవలం నిన్నేఅర్థిస్తున్నాము ఇయ్యాక నఅఁబుదు వ ఇయ్యాక నస్తఈఁన్
మాకు ఋజుమార్గం చూపించు ఇహ్..దీ నశ్శిరాతల్ ముస్తఖీం
అది – నీవు అనుగ్రహించిన వారి మార్గము, నీ ఆగ్రహానికి గురి కానివారూ మరియు మార్గభ్రష్టులు కానివారూ నడిచిన మార్గము. శిరాతల్లదీన అన్ అమ్ త అలైహిమ్, గైరిల్ మగ్దూబి అలైహిమ్ వలద్దాల్లీన్

بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِِالْحَمْدُ للّهِ رَبِّ الْعَالَمِينَ

الرَّحْمـنِ الرَّحِيمِ

مَالِكِ يَوْمِ الدِّينِ

إِيَّاكَ نَعْبُدُ وإِيَّاكَ نَسْتَعِينُ

اهدِنَــــا الصِّرَاطَ المُستَقِيمَ

صِرَاطَ الَّذِينَ أَنعَمتَ عَلَيهِمْ غَيرِ المَغضُوبِ عَلَيهِمْ وَلاَ الضَّالِّينَ

ఖురాన్ లోని రబ్బనా దుఆలు

رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ

రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతన్ వ ఫిల్ ఆఖి రతి హసనతన్ వఖినా ‘అదాబన్నార్

ఓ ప్రభూ ! ఇహలోకం లోనూ మరియు పరలోకం లోనూ మంచిని ప్రసాదించి, నరక శిక్షల నుండి కాపాడుము [2:201]

رَبَّنَا تَقَبَّلْ مِنَّا إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ

రబ్బనా తకబ్బల్ మిన్నా  ఇన్నక  అంతస్  సమీ ఉల్  అలీం [2:127]

ఓ మా ప్రభూ ! మా సేవలను అంగీకరించు, నిస్సందేహంగా నీవు అందరి మొరలనూ వినేవాడవు సర్వం తెలిసినవాడవు .

رَبَّنَا وَاجْعَلْنَا مُسْلِمَيْنِ لَكَ وَمِن ذُرِّيَّتِنَا أُمَّةً مُّسْلِمَةً لَّكَ وَأَرِنَا مَنَاسِكَنَا وَتُبْ عَلَيْنَا إِنَّكَ أَنتَ التَّوَّابُ الرَّحِيمُ

రబ్బనా వజ్ అల్ నా ముస్లిమైని లక వ మిన్ జుర్రియ్యతినా ఉమ్మతన్ ముస్లిమతల్ లక వ అరినా మనాసికనా వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్రహీం

ఓ మా ప్రభూ ! మా ఇద్దరినీ నీ విధేయులుగా చెయ్యి. మా సంతానం నుండి నీ కొరకు ఒక ముస్లిం సమాజాన్ని తయారు చెయ్యి, మాకు నిన్ను ఆరాధించే పద్దతులను  నేర్పు, మా పశ్చాతాపాన్ని అంగీకరించు, నిస్సందేహంగా  నీవు పశ్చాతాపాన్ని  అంగీకరించే వాడవు. దయామయుడవు. [2:128]

رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَثَبِّتْ أَقْدَامَنَا وَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ

రబ్బనా అఫ్ రిగ్ అలైనా సబ్ రన్ వ తబ్బిత్ అఖ్ దామనా వన్ సుర్ నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్

ఓ ప్రభూ ! శత్రువులని ఎదుర్కొనునపుడు సహనము ,స్థిరత్వము నొసంగి శత్రువులపై విజయమును నొసంగుము.
[2:250]

لَا يُكَلِّفُ ٱللَّهُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۚ لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا مَا ٱكْتَسَبَتْ ۗ رَبَّنَا لَا تُؤَاخِذْنَآ إِن نَّسِينَآ أَوْ أَخْطَأْنَا ۚ رَبَّنَا وَلَا تَحْمِلْ عَلَيْنَآ إِصْرًا كَمَا حَمَلْتَهُۥ عَلَى ٱلَّذِينَ مِن قَبْلِنَا ۚ رَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهِۦ ۖ وَٱعْفُ عَنَّا وَٱغْفِرْ لَنَا وَٱرْحَمْنَآ ۚ أَنتَ مَوْلَىٰنَا فَٱنصُرْنَا عَلَى ٱلْقَوْمِ ٱلْكَـٰفِرِينَ

రబ్బనా లాతు ఆఖిజ్ నా ఇన్ నసీనా ఔ అఖ్ తానా. రబ్బనా వలా తహ్ మిల్ అలైనా ఇస్ రన్ కమాహమల్ తహూ అలల్లజీన మిన్ ఖబ్ లినా.రబ్బనా వలా తుహమ్మిల్ నా మా లా తాఖత లనా బిహీ వ అఫు అన్నా వగ్ ఫిర్ లనా వర్ హమ్ నా అన్త మౌలానా ఫన్ సుర్ నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్

అల్లాహ్‌ ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవి చూస్తుంది. (ఇలా ప్రార్థిస్తూ ఉండండి): “ఓ మా ప్రభూ! మేము మరచిపోయినా, లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభూ! మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా ప్రభూ! మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదలిపెట్టు. మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయజూపు. నీవే మా సంరక్షకుడవు. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు.
(2:286)

رَبَّنَا لاَ تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِن لَّدُنكَ رَحْمَةً إِنَّكَ أَنتَ الْوَهَّابُ

రబ్బనా లాతుజిగ్ ఖులూబనా బ అద ఇజ్ హదైత నా వ హబ్ లనా మిల్ లదున్క రహ్మ, ఇన్నక అన్ తల్ వహ్హాబ్

ఓ ప్రభూ ! నీవు మాకు సన్మార్గము చూపిన పిదప మా హృదయములను తప్పు త్రోవలకు పోనియ్యకుము . నీ దయను మా పై ఉంచుము . నీవే సర్వము నొసంగువాడవు
. [3:8]

رَبَّنَا إِنَّنَا آمَنَّا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَقِنَا عَذَابَ النَّارِ

రబ్బనా ఇన్ననా ఆమన్నా ఫగ్ ఫిర్ లనా జునూబనా వ ఖిన్నా అదాబన్నార్

ఓ మా ప్రభూ ! మేము విశ్వ సించాము, కనుక మా పాపాలను మన్నించు ఇంకా మమ్మల్ని నరక బాధ నుండి కాపాడు.
(3:16)

رَبَّنَا آمَنَّا بِمَا أَنزَلَتْ وَاتَّبَعْنَا الرَّسُولَ فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ

రబ్బనా ఆమన్నా బిమా అన్ జల్ త వత్ తబ అ నర్ రసూల ఫక్ తుబ్నా మఅ అష్ షాహిదీన్

ఓ మా ప్రభూ ! నీవు పంపిన దానిని విశ్వసించితిమి . ప్రవక్తకు విధేయులైతిమి . కావున విశ్వసించితిమి . ప్రవక్తకు విధేయులైతిమి . కావున విశ్వసించిన సాక్షులలో మమ్ము వ్రాసికొనుము
[3:53]

ربَّنَا اغْفِرْ لَنَا ذُنُوبَنَا وَإِسْرَافَنَا فِي أَمْرِنَا وَثَبِّتْ أَقْدَامَنَا وانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينََِ

రబ్బనగ్ ఫిర్ లనా జునూబనా వ ఇస్రాఫనా ఫీ అమ్ రినా వ సబ్బిత్ అఖ్ దామనా వన్ సుర్ నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్

ఓ మా ప్రభూ ! మా పాపములను , మా కార్యములలో , మేము మితిమీరి పోయిన దానిని క్షమించుము . మా పాదములను స్థిరముగా ఉంచుము . అవిశ్వాసులను జయించుటకు మాకు సహాయపడుము
(3:147)

رَبَّنَا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَكَفِّرْ عَنَّا سَيِّئَاتِنَا وَتَوَفَّنَا مَعَ الأبْرَارِ

రబ్బనా ఫగ్ ఫిర్ లనా జునూబనా వ కఫ్ఫిర్ అన్నా సయ్యి ఆతినా వత వఫ్ఫ నా మ అల్ అబ్రార్

ఓ ప్రభూ! మా పాపాలను క్షమించు. మా చెడుగులను మా నుంచి దూరం చెయ్యి. సజ్జనులతోపాటు మాకు మరణం వొసగు.
(3:193)

رَبَّنَا ظَلَمْنَا أَنفُسَنَا وَإِن لَّمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ

రబ్బనా జలమ్ నా అన్ ఫుసనా వ ఇన్ లమ్ తఘ్ ఫిర్ లనా వ తర్ హమ్నా లన కూనన్న మినల్ ఖాసిరీన్

మా ప్రభూ! మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము. ఇప్పుడు నీవు గనక మాకు క్షమాభిక్ష పెట్టి, మాపై దయదలచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము
(7:23)

رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَتَوَفَّنَا مُسْلِمِينَ

రబ్బనా అఫ్ రిఘ్ అలైనా సబ్ రవ్ వత వఫ్ఫనా ముస్లిమీన్

ఓ ప్రభూ! మాపై సహనాన్ని కురిపించు. నీకు విధేయులు (ముస్లింలు)గా ఉన్న స్థితిలోనే మరణాన్ని వొసగు
(7:126)

رَبَّنَا لاَ تَجْعَلْنَا فِتْنَةً لِّلْقَوْمِ الظَّالِمِينَ ; وَنَجِّنَا بِرَحْمَتِكَ مِنَ الْقَوْمِ الْكَافِرِينَ

రబ్బనా లా తజ్ అల్ నా ఫిత్నతల్ లిల్ ఖవ్ మిజ్ జాలిమీన్ వ నజ్జినా బి రహ్మతిక మినల్ ఖవ్ మిల్ కాఫిరీన్

మా ప్రభూ! మమ్మల్ని ఈ దుర్మార్గుల పరీక్షా సాధనంగా చేయకు. నీ కృపతో మమ్మల్ని ఈ అవిశ్వాసుల చెరనుండి విడిపించు
(10: 85-86)

رَبِّ إِنِّىٓ أَعُوذُ بِكَ أَنْ أَسْـَٔلَكَ مَا لَيْسَ لِى بِهِۦ عِلْمٌۭ ۖ وَإِلَّا تَغْفِرْ لِى وَتَرْحَمْنِىٓ أَكُن مِّنَ ٱلْخَٰسِرِينَ

రబ్బి ఇన్నీ అవూదు బిక అన్ అస్ అలక మా లైస లీ బిహీ ఇల్మ్ వ ఇల్లా తగ్ ఫిర్ లీ వ తర్ హమ్ నీ అకున్ మినల్ ఖాసిరీన్

నా ప్రభూ! నాకు తెలియని దాని గురించి నిన్ను అర్థించటం నుండి నీ శరణు వేడుతున్నాను. నీవు గనక నన్ను క్షమించి దయదలచకపోతే నేను నష్టపోయేవారిలో చేరిపోతాను
. (11 : 47)

أَنتَ وَلِىِّۦ فِى ٱلدُّنْيَا وَٱلْءَاخِرَةِۖ تَوَفَّنِى مُسْلِمًا وَأَلْحِقْنِى بِٱلصَّٰلِحِينَ

అంత వలియ్యీ ఫిద్ దున్యా వల్ ఆఖిర. తవఫ్ఫనీ ముస్లిమవ్ వ అల్ హిక్నీ బిస్ సాలీహీన్

నీవే ఇహపర లోకాలలో నీవే నా సంరక్షకుడవు. నీకు విధేయునిగా (ముస్లింగా) ఉన్న స్థితిలోనే నన్ను మరణింపజేయి. మరియు నన్ను సద్వర్తనులలో కలుపు.

(దివ్య ఖురాన్ 12:101)

رَبِّ ٱجْعَلْنِى مُقِيمَ ٱلصَّلَوٰةِ وَمِن ذُرِّيَّتِى ۚ رَبَّنَا وَتَقَبَّلْ دُعَآءِ

రబ్బిజ్ అల్ నీ ముకీమస్ సలాతి వ మిన్ జుర్రియ్యతీ రబ్బనా వత కబ్బల్ దుఆ

నా ప్రభూ! నన్ను నమాజును నెలకొల్పేవానిగా చెయ్యి. నా సంతతి నుండి కూడా (ఈ వ్యవస్థను నెలకొల్పే వారిని నిలబెట్టు). ప్రభూ! నా ప్రార్థనను ఆమోదించు.
(14 : 40)

رَبَّنَا ٱغْفِرْ لِى وَلِوَٰلِدَىَّ وَلِلْمُؤْمِنِينَ يَوْمَ يَقُومُ ٱلْحِسَابُ

రబ్బనగ్ ఫిర్ లీ వలి వాలిదయ్య వలిల్ మూ’మినీన యౌమ యకూముల్ హిసాబ్

మా ప్రభూ! నన్ను, నా తల్లిదండ్రులను, విశ్వాసులను లెక్క తేల్చే రోజున క్షమించు. (14 : 41)

رَبِّ ارْحَمْهُمَا كَمَا رَبَّيَانِي صَغِيرًا

రబ్బిర్ హమ్ హుమా కమా రబ్బయానీ సఘీరా

ఓ ప్రభూ! బాల్యంలో వీరు (నా తల్లిదండ్రులు) నన్ను (ప్రేమానురాగాలతో) పోషించినట్లుగానే నీవు వీరిపై దయజూపు
(17:24)

رَّبِّ أَدْخِلْنِى مُدْخَلَ صِدْقٍۢ وَأَخْرِجْنِى مُخْرَجَ صِدْقٍۢ وَٱجْعَل لِّى مِن لَّدُنكَ سُلْطَٰنًۭا نَّصِيرًۭا

రబ్బి అద్ ఖిల్నీ ముద్ ఖల సిద్ కివ్ వ అఖ్ రిజ్ నీ ముఖ్ రజ సిద్ కివ్ వజ్ అల్లీ మిల్ల దున్ క సుల్ తానన్ నసీరా

నా ప్రభూ! నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా మంచిస్థితిలో తీసుకుని వెళ్ళు. ఎక్కడి నుంచి తీసినా మంచిస్థితి లోనే తియ్యి. నా కోసం నీ వద్ద నుండి అధికారాన్ని, తోడ్పాటును ప్రసాదించు.
(17 : 80)

رَبَّنَآ ءَاتِنَا مِن لَّدُنكَ رَحْمَةًۭ وَهَيِّئْ لَنَا مِنْ أَمْرِنَا رَشَدًۭ

రబ్బనా ఆతినా మిల్ల దున్క రహ్మతవ్ వ హయ్యి లనా మిన్ అమ్ రినా రషదా

మా ప్రభూ! నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. మా పనిలో మా కోసం సన్మార్గాన్ని సులభతరం చెయ్యి
(18 : 10)

رَبِّ ٱشْرَحْ لِى صَدْرِى * وَيَسِّرْ لِىٓ أَمْرِى * وَٱحْلُلْ عُقْدَةًۭ مِّن لِّسَانِى *يَفْقَهُوا۟ قَوْلِى

రబ్బిష్ రహ్ లీ సద్ రీ వ యస్సిర్ లీ అమ్ రీ వహ్ లుల్ ఉక్ దతమ్ మిల్ లిసానీ యఫ్ కహూ కౌలీ

ఓ నా ప్రభూ! నా కోసం నా ఛాతీ (మనసు)ని విశాలమైనదిగా చేయి. నా కార్యాన్ని నా కోసం సులభతరం చేయి. నా నాలుక ముడిని విప్పు, ప్రజలు నా మాటను బాగా అర్థం చేసుకోగలిగేందుకు.
(20 : 25 – 28)

رَّبِّ زِدْنِى عِلْمًۭا

రబ్బి జిద్ నీ ఇల్మా

ప్రభూ! నా జ్ఞానాన్ని పెంచు.
(20 :114)

لَّآ إِلَٰهَ إِلَّآ أَنتَ سُبْحَٰنَكَ إِنِّى كُنتُ مِنَ ٱلظَّٰلِمِينَ

లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక ఇన్నీ కున్తు మిన జ్జాలిమీన్

అల్లాహ్‌! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి. (21 : 87)

رَبِّ لَا تَذَرْنِى فَرْدًۭا وَأَنتَ خَيْرُ ٱلْوَٰرِثِينَ

రబ్బి లా తజర్ నీ ఫర్ దన్ వ అంత ఖైరుల్ వారిసీన్

నా ప్రభూ! నన్ను ఒంటరివానిగా వదలకు. నీవు అందరికన్నా అత్యుత్తమ వారసుడవు (21 : 89)

رَّبِّ أَعُوذُ بِكَ مِنْ هَمَزَٰتِ ٱلشَّيَٰطِينِ* وَأَعُوذُ بِكَ رَبِّ أَن يَحْضُرُونِ

రబ్బి అవూజుబిక మిన్ హమజాతిష్ షయాతీన్ వ అవూజు బిక రబ్బి అయ్ యహ్ దురూన్

ఓ నా ప్రభూ! షైతానులు కలిగించే ప్రేరణల నుంచి నేను నీ శరణుకోరుతున్నాను. ప్రభూ! వారు నా వద్దకు రావటం నుంచి నీ శరణు వేడు తున్నాను. (23 : 97,98)

رَّبِّ ٱغْفِرْ وَٱرْحَمْ وَأَنتَ خَيْرُ ٱلرَّٰحِمِينَ

రబ్బిగ్ ఫిర్ వర్ హమ్ వ అంత ఖైరుర్రాహిమీన్

నా ప్రభూ! క్షమించు. కనికరించు. కనికరించే వారందరిలోకెల్లా నీవు ఉత్తముడవు. (23 : 118)

رَبَّنَا ٱصْرِفْ عَنَّا عَذَابَ جَهَنَّمَ ۖ إِنَّ عَذَابَهَا كَانَ غَرَامًا إِنَّهَا سَآءَتْ مُسْتَقَرًّۭا وَمُقَامًۭا

రబ్బనస్ రిఫ్ అన్నా అదాబ జహన్నమ ఇన్న అదాబహా కాన గరామా ఇన్నహా సాఅత్ ముస్ తకర్రవ్ వ ముకామా

మా ప్రభూ! మాపై నుంచి నరకశిక్షను తొలగించు. ఎందుకంటే ఆ శిక్ష ఎన్నటికీ వీడనిది. నిశ్చయంగా అది చాలా చెడ్డచోటు. చెడ్డ నివాస స్థలం
. (25 : 65,66)

رَبَّنَا هَبْ لَنَا مِنْ أَزْوَٰجِنَا وَذُرِّيَّٰتِنَا قُرَّةَ أَعْيُنٍۢ وَٱجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا

రబ్బనా హబ్ లనా మిన్ అజ్ వాజినా వ జుర్రియ్యాతినా కుర్రత అ’యునిన్ వజ్ అల్ నా లిల్ ముత్తకీన ఇమామా

ఓ మా ప్రభూ! నువ్వు మా భార్యల ద్వారా, మా సంతానం ద్వారా మా కళ్లకు చలువను ప్రసా దించు. మమ్మల్ని దైవ భక్తిపరుల (ముత్తఖీన్‌ల) నాయకునిగా చేయి.
(25 : 74)

رَبِّ هَبْ لِى حُكْمًۭا وَأَلْحِقْنِى بِٱلصَّٰلِحِينَ وَٱجْعَل لِّى لِسَانَ صِدْقٍۢ فِى ٱلْءَاخِرِينَ وَٱجْعَلْنِى مِن وَرَثَةِ جَنَّةِ ٱلنَّعِيمِ وَلَا تُخْزِنِى يَوْمَ يُبْعَثُونَ

రబ్బి హబ్ లీ హుక్ మౌ వ అల్ హిక్నీ బిస్సాలిహీన్ వజ్ అల్లీ లిసాన సిద్ కిన్ ఫిల్ ఆఖిరీన్ వజ్ అల్ నీ మివ్ వరసతి జన్నతిన్ నయీమ్ వ లా తుఖ్ జినీ యౌమ యుబ్ అసూన్

నా ప్రభూ! నాకు ‘ప్రజ్ఞ’ను ప్రసాదించు. నన్ను సద్వర్తనులలో కలుపు. భావితరాల వారి (నోటి)లో నన్ను కీర్తిశేషునిగా ఉంచు. అనుగ్రహభరితమైన స్వర్గానికి వారసులయ్యే వారిలో నన్ను (కూడా ఒకడిగా) చెయ్యి. ప్రజలు మళ్లీ తిరిగి లేపబడే రోజున నన్ను అవమానపరచకు
(26 : 83 – 85,87)

رَبِّ أَوْزِعْنِىٓ أَنْ أَشْكُرَ نِعْمَتَكَ ٱلَّتِىٓ أَنْعَمْتَ عَلَىَّ وَعَلَىٰ وَٰلِدَىَّ وَأَنْ أَعْمَلَ صَٰلِحًۭا تَرْضَىٰهُ وَأَدْخِلْنِى بِرَحْمَتِكَ فِى عِبَادِكَ ٱلصَّٰلِحِينَ

రబ్బి అవ్ జి’నీ అన్ అష్ కుర ని’మతకల్లతీ అన్ అమ్ త అలయ్య వ అలా వాలిదయ్య వ అన్ అ’మల సాలిహన్ తర్ దాహు వ అద్ ఖిల్నీ బి రహ్మతిక ఫీ ఇబాదిక స్సాలిహీన్

నా ప్రభూ! నువ్వు నాకూ, నా తల్లి దండ్రులకూ ప్రసాదించిన అనుగ్రహాలకుగాను నిత్యం నీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధిని నాకు ఇవ్వు. నేను, నీ మెప్పును పొందే మంచిపనులు చేసేలా చూడు. నీ దయతో నన్ను నీ సజ్జన దాసులలో చేర్చుకో.
(27 : 19)

رَبِّ إِنِّى لِمَآ أَنزَلْتَ إِلَىَّ مِنْ خَيْرٍۢ فَقِيرٌۭ

రబ్బి ఇన్నీ లిమా అన్ జల్ త ఇలయ్య మిన్ ఖైరిన్ ఫఖీర్

ప్రభూ! నువ్వు నా వద్దకు ఏ మేలును పంపినా నాకు దాని అవసరం ఎంతైనా వుంది
. (28 : 24)

رَبَّنَا ٱغْفِرْ لَنَا وَلِإِخْوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلْإِيمَٰنِ وَلَا تَجْعَلْ فِى قُلُوبِنَا غِلًّۭا لِّلَّذِينَ ءَامَنُوا۟ رَبَّنَآ إِنَّكَ رَءُوفٌۭ رَّحِي

రబ్బనగ్ ఫిర్ లనా వలిఇఖ్వాని నల్లదీనా సబకూనా బిల్ ఇమానీ వలా తజ్ అల్ ఫీ ఖులుబినా గిల్లల్-లిల్లదీన ఆమనూ రబ్బనా ఇన్నక రవూఫుర్ రహీమ్

మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేష భావాన్నీ కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగిన వాడవు, కనికరించేవాడవు.
(59 : 10)

رَبَّنَآ أَتْمِمْ لَنَا نُورَنَا وَٱغْفِرْ لَنَآ ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَىْءٍۢ قَدِيرٌۭ

రబ్బనా అత్ మిమ్ లనా నూరనా వగ్ ఫిర్ లనా ఇన్నక అలా కుల్లి షైఇన్ ఖదీర్

మా ప్రభూ! మా కాంతిని మా కొరకు పరిపూర్ణం గావించు. మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా నీవు అన్నింటిపై అధికారం కలవాడవు.
(66 : 8)

رَبِّ أَوْزِعْنِىٓ أَنْ أَشْكُرَ نِعْمَتَكَ ٱلَّتِىٓ أَنْعَمْتَ عَلَىَّ وَعَلَىٰ وَٰلِدَىَّ وَأَنْ أَعْمَلَ صَٰلِحًۭا تَرْضَىٰهُ وَأَصْلِحْ لِى فِى ذُرِّيَّتِىٓ ۖ إِنِّى تُبْتُ إِلَيْكَ وَإِنِّى مِنَ ٱلْمُسْلِمِينَ

రబ్బి అవ్ జి’నీ అన్ అష్ కుర ని’మతక అల్లతీ అన్ అమ్త అలయ్య వ అలా వాలిదయ్య వ అన్ అ’మల సాలిహన్ తర్దాహు వ అస్ లిహ్ లీ ఫీ జుర్రియ్యతీ ఇన్నీ తుబ్ తు ఇలైక వ ఇన్నీ మినల్ ముస్లిమీన్

నా ప్రభూ! నీవు నాపై, నా తల్లిదండ్రులపై కురిపించిన అనుగ్రహ భాగ్యాలకుగాను కృతజ్ఞతలు తెలుపుకునే, నీ ప్రసన్నతను చూరగొనే విధంగా సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. ఇంకా నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు. నేను నీ వైపునకే మరలు తున్నాను. నేను నీ విధేయులలో ఒకణ్ణి. (46 : 15)

దివ్యఖుర్ఆన్ – అల్లాహ్ నుండి ఒక మహాద్భుత మహిమ

The Noble Quran – a Miracle from Allah (Subhanahu wa Ta’ala)
రచయిత : ముహమ్మద్ ముహ్సిన్ ఖాన్ – తఖీయుద్దీన్ అల్ హిలాలీ
అంశాల నుండి : కింగ్ ఫహద్ దివ్యఖుర్ఆన్ ప్రింటింగ్ ప్రెస్ (ముద్రణాలయం) సంస్థ
అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్ ,పునర్విచారకులు : షేఖ్ నజీర్ అహ్మద్

క్లుప్త వివరణ: దివ్యఖుర్ఆన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై అల్లాహ్ అవతరింపజేసిన ఒక మహాద్భుత మహిమ. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ ఆయత్ లు మరియు హదీథ్ బోధనల నుండి ఈ వ్యాసంలో వివరించబడెను

(సర్వలోక సృష్టికర్తైన అల్లాహ్ , తన చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేసిన అంతిమ సందేశం) – ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం బోధనల వెలుగులో………

[وَمَـا  كَانَ  هـٰــذَا  الْــقُــرْآَنُ   أَنْ  يُــفْــتَــرَى  مِـنْ دُوْنِ  اللهِ  وَلـٰـكِــنْ  تَــصْـدِيْـقَ  الَّذِي   بَــيْـنَ  يَــدَيْــهِ  وَتَــفْـصِـيْـلَ الْـكِـتـٰـبِ  لَا  رَيْــبَ فِــيْــهِ  مِـنْ  رَّبِّ  الْعـٰـلَـمِـيْـنَ] (3710:)

“మరియు అల్లాహ్ తప్ప మరొకరి ద్వారా ఈ ఖుర్ఆన్ అవతరణ సంభవం కాదు: వాస్తవానికిది పూర్వగ్రంథాలలో మిగిలి ఉన్న దానిని సత్యాన్ని ధృవపరుస్తోంది: మరియు ఇది ముఖ్య సూచనలను వివరించే గ్రంథం: ఇది సమస్త లోకాల పోషకుడైన అల్లాహ్ తరుపు నుండి వచ్చింది అనటంలో ఎలాంటి సందేహం లేదు!”

{ఖుర్ఆన్ 10వ అధ్యాయం ‘యూనుస్’ లోని 37వ ఆయత్ యొక్క భావపు అనువాదం}

[وَ مَـنْ  يَـبْـتَـغِ  غَـيْـرَ الْإِسْـلَامِ  دِيْـنًا  فَـلَـنْ  يُـقْـبَـلَ  مِـنْـهُ  وَهُـوَ  فِــيْ  الْأَخِـرَ ةِ   مِـنَ  الْـخَـٰـسِـرِيْـنَ ]  (853:)

“మరియు ఎవరైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించ బడదు మరియు అతను పరలోకంలో నష్టపోయే వారిలో చేరుతాడు”

{ఖుర్ఆన్ 3వ అధ్యాయం ‘ఆలె ఇమ్రాన్’ (మర్యం తండ్రి అయిన ఇమ్రాన్ కుటుంబం) లోని 85వ ఆయత్ యొక్క భావపు అనువాదం}

حدثنا عبدُ الله بنُ يُوسفَ : حدثنا الليث :حدثنا سعيد الـمقبري، عن أبيه، عن أبي هريرة قال:قال النبي ^ :(( ما مِنَ الأنبياءِ نَبيٌّ إلا أعطي من الآيات ما مِثله آمن عليهِ البَشرُ، وَإنَّمـا كان الَّذي أوتيتُـه وحيا أوحاهُ الله إليَّ،  فأرجُو أن أكُونَ أكثرَهُم تَابعاً يوم القِيامَـةِ)).

సహీహ్ బుఖారీ హదీథ్ సంకలనంలోని 9వ గ్రంథపు 379వ హదీథ్ లో నమోదు చేయబడిన అబుహురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా తెలిపారు:

“ప్రవక్తలలో అద్భుతాలు ఇవ్వబడని ప్రవక్తలు లేరు, వేటి వలనైతే ప్రజలు విశ్వసించేవారో. అలాగే నాకు ఈ దివ్యవాణి (ఒక మహిమగా) ఇవ్వబడినది దేనినైతే అల్లాహ్ నా పై అవతరింపజేసాడో. కాబట్టి, పునరుత్థాన దినమున వేరే ఇతర ప్రవక్తల అనుచరుల సంఖ్య కంటే నా అనుచరుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నాను”

حدثنا محمد بن عبادة : أخبرنا يزيد : حدثنا سليم بن حيان، وأثنى عليه : حدثنا سعيد بن ميناء: حدثنا أو سمعت جابر بن عبدالله يقول: جاءت ملا ئكة إلى النبي ^  و هو نائم، فقال بعضُهم : إنه نائم ، وقال بعضهم :إن العين نائمة والقلب يقظان، فقالوا : إنَّ لصا حبكم هذا مثلاً، فاضربوا له مثلاً، فقال بعضهم : إنه نائم، و قال بعضهم : إنَّ العين نائمةٌ، والقلب يقظان، فقالوا: مثله كمثل رجل بنى داراً، وجعل فيها مأدبة وبعث داعياً، فمن أجاب الداعي دخل الدار وأكل من المأدبة، ومن لم يجب الداعي لم يدخل الدار و لم يأكل من المأدبة. فقالوا : أوَّلوها  له يفقهها، فقال بعضهم : إنه نائم، وقال بعضهم إن العين نائمة والقلب يقظان، فقالوا : فالدار، الجنة، والداعي محمد ^ ،  فمن أطاع محمداً  ^ فقد أطاع الله، ومن عصى محمداً   ^    فقد عصى الله،  و محمد ^  فرق بين الناس.  تابعه قتيبة، عن ليثٍ، عن خالدٍ، عن سعيد بن أبي هلالٍ، عن جابرٍ: حرج علينا النبي ^.

సహీహ్ బుఖారీ హదీథ్ సంకలనంలోని 9వ గ్రంథపు 385వ హదీథ్ లో నమోదు చేయబడిన జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా తెలిపారు-

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పండుకుని ఉన్నప్పుడు కొందరు దైవదూతలు ఆయన వద్దకు వచ్చారు. వారిలో కొందరు ఇలా పలికారు “ఆయన నిద్ర పోతున్నారు”. అప్పుడు మిగిలిన వారు ఇలా వ్యాఖ్యానించారు “ఆయన కళ్ళు నిద్ర పోతున్నాయి, కాని ఆయన హృదయం మేలుకునే ఉన్నది”. అప్పుడు వారిలా పలికారు “మీ యొక్క ఈ సహచరుడిలో ఒక నిదర్శనం ఉన్నది”. ఆ తర్వాత వారిలోని ఒక దైవదూత ఇలా పలికారు “ఆయన లోని నిదర్శనాన్ని కనిబెడదాం” అప్పుడు వారిలోని మరొక దైవదూత ఇలా జవాబిచ్చారు “ఆయన నిద్రపోతున్నారు” మరొక దైవదూత మళ్ళీ “ఆయన కళ్ళు నిద్రపోతున్నాయి, కాని ఆయన హృదయం మేలుకునే ఉన్నది” అని తిరిగి పలికారు.

అప్పుడు వారిలా పలికారు “ఆయనలోని నిదర్శనం (ఉదాహరణ) ఇలా ఉన్నది – క్రొత్తగా ఇల్లు కట్టిన ఒక వ్యక్తి, విందు భోజనం ఏర్పాటు చేసి, ప్రజలను ఆహ్వానించటానికి దూతను (వార్తాహరుడిని) పంపినాడు. అప్పుడు ఎవరైతే ఆ దూత యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి, ఆ ఇంటిలో ప్రవేశించారో, వారు విందు భోజనం ఆరగించారు (తిన్నారు). ఇంకా ఎవరైతే ఆ వార్తాహరుని యొక్క ఆహ్వానాన్ని స్వీకరించలేదో, వారు ఆ ఇంటిలో ప్రవేశించనూ లేదు మరియు విందు భోజనం తిననూ లేదు” అప్పుడు మిగిలిన దైవదూతలు ఇలా పలికారు “ఈ దృష్టాంతాన్ని (ఉదాహరణను) ఆయనకు వివరించినట్లయితే, ఆయన కూడా దీనిలోని నిగూఢార్థాన్ని తెలుసుకోగలరు” అప్పుడు వారిలోని ఒక దైవదూత ఇలా పలికారు “ఆయన నిద్రపోతున్నారు” మిగిలిన వారు మళ్ళీ ఇలా పలికారు “ఆయన కళ్ళు నిద్రపోతున్నాయి, కాని ఆయన హృదయం మేలుకునే ఉన్నది” అప్పుడు వారు మళ్ళీ ఇలా పలికారు “ఉదాహరణలోని క్రొత్త ఇల్లు స్వర్గానికి ఉపమానంగా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విందు భోజనానికి పిలిచిన దైవదూత (వార్తాహరుడు) కు ఉపమానంగా మరియు ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను విధేయతగా అనుసరిస్తారో, వారు అల్లాహ్ ను విధేయతగా అనుసరించినట్లే. మరియు ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు అవిధేయత చూపుతారో, వారు అల్లాహ్ కు అవిధేయత చూపినట్లే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దివ్యసందేశం ద్వారా ప్రజలలోని దైవభక్తులను వేరు చేసారు, చెడు నుండి మంచిని వేరుపర్చారు మరియు అవిశ్వాసుల నుండి విశ్వాసులను విడదీశారు”

حدَّثنا مُحَمَّد بن سِنانٍ: حدَّثنا فليح بن سليمان: حدَّثنا هلال بن علي‘ عن عبد الرَّحمنِ بنِ أبي عمرة، عن أبي هريرة قال : قال رسول الله^: أنا أوْلى النَّاسِ بعيسى ابنِ مريم في الدُّنيا والآخرة، والأنبِـياء إخوةٌ لعَلاَّت، أُمَّهاتهم شتَّى ودينهم واحد. وقال إبراهيم بن طهمان، عن موسى بن عُقبة، عن صفوان بن سُليم، عن عطاء بن يسار، عن أبي هريرة رضي الله عنه قال :قال رسول الله ^

సహీహ్ బుఖారీ హదీథ్ సంకలనంలోని 4వ గ్రంథపు 652వ హదీథ్ లో నమోదు చేయబడిన అబు హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా తెలిపారు:

“ఈ లోకంలోను మరియు పరలోకంలోను మర్యం కుమారుడైన ఈసా-యేసు (అలైహిస్సలాం) కు మొత్తం మానవజాతిలో నేనే అత్యంత దగ్గరి వాడిని. ప్రవక్తలు తండ్రి తరుపున సోదరులు, వారి తల్లులు వేరు, కాని వారి ధర్మం ఒక్కటే (అదే ఏకైక దైవారాధన)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశహరుడనే సత్యాన్ని  (Prophethood ను) తప్పక విశ్వసించవలెను.

حدَّثني يونس بن عَبدالأعلى: أخبرنا ابنُ وهْب قال: وأخبرني عمرو أنَّ أبا يونس حدَّثه عن أبي هُريرة عن رسول الله صلّى الله عليه و سلَّم أنَّه قال: والذي نَفْس مُحمَّد بِيده لا يَسمَعُ بِي أحدٌ من هذه الأُمَّةِ يهودي ولا نصراني ثمَّ يموت ولم يؤمن بالذي أُرسلْتُ بِه إلاَّ كان من أصحاب النَّار. (رواه مسلم في كتاب الإيمان)

సహీహ్ ముస్లిం హదీథ్ సంకలనంలోని – విశ్వాసమనే మొదటి హదీథ్ గ్రంథపు 24వ భాగంలో నమోదు చేయబడిన అబు హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా తెలిపారు:

“ఎవరి చేతిలో ముహమ్మద్ యొక్క ఆత్మ ఉన్నదో ఆయన (అల్లాహ్) సాక్షిగా, యూదులలో మరియు క్రైస్తవులలో నా గురించి విని, ఏ దివ్యసందేశంతో (ఏకైక దైవారాధనా సందేశం) నేను పంపబడినానో, దానిని విశ్వసించకుండా చనిపోయే వారెవరూ ఉండరు. కాని వారిలో ఎవరైతే అలా విశ్వసించక చనిపోతారో, వారు నరకాగ్ని నివాసులుగా మిగిలిపోతారు.”

(ఖుర్ఆన్ లోని 3:116వ వచనం కూడా చూడండి)

అల్ బిదాఅ (కల్పితాచారం) (The Innovation)

1. అల్ బిదాఅ (కల్పితాచారం)(The Novelty)بــدعـــــت –

నిర్వచనం: ‘పూర్వ కాలంలో అటువంటిదేదీ ఉనికిలో ఉన్నట్లు నిదర్శనం, ఆధారం అస్సలు లేకుండా నూతనంగా ఏదైనా క్రొత్త విషయాన్ని పుట్టించటం’ అనే ఆచరణ నుండి అల్ బిదాఅఁ (కల్పితాచారం) అనే పదం ఉత్పత్తి అయినది. ఇది అల్లాహ్ దివ్యఖుర్ఆన్ లో అల్ బఖర అధ్యాయంలోని 117 వవచనం లో చేసిన క్రింది ప్రకటనల వలే ఉన్నది. “بَدِيعُ السَّمَاوَاتِ وَالأرْضِ” – దివ్యవచనపు భావం యొక్క అనువాదం – {భూమ్యాకాశాల (స్వర్గాల) ముఖ్యారంభం ఆయనకే చెందును}, దీని భావం ఏమిటంటే, పూర్వనిదర్శనాలేవి లేకుండానే సృష్టించగలిగిన ఆయనే వీటి సృష్టికారకుడు. ఇదే విషయాన్ని దివ్యఖుర్ఆన్ లో అల్ అహ్ఖాఫ్ అధ్యాయంలోని 9వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు, “قُلْ مَا كُنْتُ بِدْعًا مِنْ الرُّسُلِ” – దివ్యవచనపు భావం యొక్క అనువాదం – {ప్రకటించు(ఓ ముహమ్మద్ ): “నేను ప్రవక్తల మధ్య నూతన, వింతైన చోద్యమైన, ఎన్నడూ విననికనని సిద్ధాంతాలను తెచ్చేవాడిని కాను} అంటే అల్లాహ్ నుండి దివ్యసందేశాన్ని తెచ్చిన వారిలో నేనే మొదటి వాడిని కాను, కాని నాకు పూర్వం కూడా అనేక మంది సందేశహరులు వచ్చారు. అనే అల్లాహ్ యొక్క ప్రకటనను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం తెలిపారు.

కల్పితాచారం (అల్ బిదాఅ) రెండు రకాలుగా విభజింపబడినది:

1)  అలవాట్లలో నూతన కల్పితాలు – అనువతించబడినది.
2)  ధర్మంలో నూతన కల్పితాలు – నిషేధించబడినది.

మరల రెండు రకాలు

A) పలుకులలో సైద్ధాంతిక కల్పితాలు
B) ఆరాధనలలో కల్పితాలు – నాలుగు తరగతులుగా విభజింపబడినది.

  • i)    మొదటి తరగతి – ఆరాధనల మూలాధారంలో కల్పితం.
  • ii)    రెండో తరగతి – ఆరాధనలను హెచ్చించే కల్పితం.
  • iii)  మూడో తరగతి – ఆరాధనల పద్ధతిలో కల్పితం.
  • iv)   నాలుగో తరగతి – ఆరాధనా సమయంలో కల్పితం.

ఒక్కో రకాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం.

1) అలవాట్లలో కల్పితం, ఇది అనుమతించబడిని. ఉదాహరణకు – నూతన వస్తువులను కనిపెట్టడం, ఇది ఇస్లాం ధర్మంలో అనువతించబడినది. ‘నిషేధించబడినది’ అనే స్పష్టమైన సాక్ష్యాధారాలు లేని అలవాట్లన్నీ అనుమతించబడినవే – అనేది ఇస్లాం ధర్మంలోని మౌలిక నియమం, ప్రాథమిక నిబంధన.

2) ధర్మంలో కల్పితం, ఇస్లాం ధర్మపు ప్రాథమిక  నియమాల కారణంగా ఇది నిషేధించబడినది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  ఇలా ఆదేశించారు, “من أحدث في أمرنا” – అనువాదం – “సరైన ప్రమాణిక కారణం లేకుండానే, మా వ్యవహారాలలో (అల్లాహ్ పంపిన ఇస్లామీయ జీవన విధానంలో) నూతన కల్పితాలను కనిపెట్టే వారు తిరస్కరించబడతారు

ధర్మంలోఅల్బిదాఅ (కల్పితాలు) అనేదిమరలరెండురకాలుగావిభజింపబడినదిమొదటిదిపలుకులలో సైద్ధాంతిక కల్పితాలుకల్పించటం, రెండోదిఆరాధనలలోనూతనకల్పితాలుకల్పించటం.

A) మొదటివిభాగం: పలుకులలో సైద్ధాంతికపరమైన కల్పితాలు కల్పించటం, జహ్మియాహ్, ముతజిలాహ్, రాఫిదాహ్ మొదలైన పలుకులలో మరియు దైవవిశ్వాసంలో దారి తప్పిన అనేక తరగతులు. ఉదాహరణకు – దివ్యఖుర్ఆన్ అల్లాహ్ యొక్క సృష్టి అనే ప్రకటన.

B) రెండోవిభాగం: ఆరాధనలలో కల్పితాలు, అల్లాహ్ తెలిపిన పద్ధతిలో కాకుండా వేరే పద్ధతిలో ఆరాధించటం. ఇది నాలుగు తరగతులుగా విభజింపబడినది:

i) మొదటితరగతి: ఆరాధనల మూలాధారంలో కల్పితం, అంటే అసలు ఇస్లామీయ షరియత్ (ధర్మశాస్త్రం)లో లేని నూతన ఆరాధనలను తీసుకరావటం. ఉదాహరణకు – ఇస్లామీయ మూలాధారాలలో ఎక్కడా అస్సలు ప్రస్తావించని నూతన ఆరాధనలను కల్పించటం, మీలాదున్నబీ వంటి పండగలను జరపటం… మొదలైనవి.

ii) రెండోతరగతి: ఆరాధనలను హెచ్చించటం – అల్లాహ్ ఆదేశించిన కొన్ని ప్రత్యేక ఆరాధనలలో అదనపు విషయాలను చేర్చటం, జొహర్ లేక అసర్ నమాజులోని నాలుగు రకాతులకు అదనంగా ఐదవ రకాతును చేర్చటం.

iii) మూడోతరగతి: ఆరాధనల పద్ధతిలో కల్పితం – అల్లాహ్ ఆదేశించిన ఆరాధనా పద్ధతులలో నూతన కల్పితాలు చేర్చటం. అంటే అల్లాహ్ తెలిపిన పద్ధతిలో కాకుండా వేరే క్రొత్త పద్ధతులలో ఆరాధించటం. గుంపుగా చేరి, లయబద్ధమైన రాగాలలో అల్లాహ్ ను స్తుతించడం, లేదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  యొక్క సున్నత్ లకు విరుద్ధమైన పద్ధతిలో, ఏవైనా ఆరాధనలను స్వయంగా తనకే భారమయ్యేటంతటి తీవ్రంగా ఆచరించటం.

iv) నాలుగోతరగతి: ఆరాధనా సమయంలో కల్పితం. ఏవైనా ప్రత్యేక ఆరాధనలకు, అల్లాహ్ ఏనాడూ కేటాయించని ఆరాధనా సమయాలను కల్పించడం, ఉదాహరణకు – షాబాన్ నెల 15వ తేదీ దినాన్ని ఉపవాసం దినంగా, రాత్రిని ప్రార్థనల రాత్రిగా పరిగణించడం. ఎందుకంటే, ఉపవాసం ఉండటం మరియు రాత్రి ప్రార్థనలు చేయటం అనేది ఇస్లాం ధర్మపరంగా అనుమతింపబడినవే కాని వాటికోసం ఒక ప్రత్యేకమైన తేదీ మరియు సమయం కేటాయించడానికి స్పష్టమైన సాక్ష్యాధారాలు కావలసి ఉంటుంది.

ఇస్లాంలోఅన్నిరకాలనూతనకల్పితాలుతీసుకురావటంగురించినఅంతర్జాతీయధర్మశాసనం:

ఇస్లాం ధర్మంలోని ప్రతి నూతన కల్పితం నిషేధించబడినది మరియు అది తప్పుడు దారి వైపుకు తీసుకు వెళ్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  ఇలా ప్రకటించారు, “وإياكم ومحدثات الأمور” – అనువాదం – “(ఇస్లాం ధర్మంలో) నూతన పోకడల గురించి, చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ప్రతి నూతన పోకడ ఒక బిదాఅ (కల్పితం) మరియు ప్రతి బిదాఅ ఒక తప్పుడు మార్గం మరియు ప్రతి తప్పుడు మార్గం నరకాగ్నికి చేర్చుతుంది”. ఇంకా వారు సల్లల్లాహు అలైహి వసల్లం  ఇలా తెలిపారు, “من عمل عملا” – అనువాదం – “సరైన ప్రమాణిక కారణం లేకుండానే, మా వ్యవహారాలలో (అల్లాహ్ పంపిన ఇస్లామీయ జీవన విధానంలో) నూతన కల్పితాలను కనిపెట్టిన వారెవరైనా సరే తిరస్కరించబడతారు

ఇస్లాం ధర్మంలో క్రొత్తగా కనిపెట్టబడిన ప్రతి విషయం ఒక బిదాఅ (కల్పితం) అని మరియు ప్రతి కల్పితం స్వీకరించబడని ఒక తప్పుడు మార్గం అని ఈ రెండు హదీథ్ లు తెలుపుతున్నాయి. అంటే ఆరాధనలలో లేదా సిద్ధాంతాలలో నూతన పోకడలు, కల్పితాలు తీసుకురావటం నిషేధించబడినది. ఇంకా వాటి నిషేధం ఆయా కల్పితాల రకాలను బట్టి మార్పు చెందుతుంది. వాస్తవానికి వాటిలో కొన్ని, స్పష్టమైన అవిశ్వాసానికి చెందినవి. ఉదాహరణకు – సమాధుల చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా ఆయా పుణ్యపురుషులకు దగ్గరవటానికి ప్రయత్నించటం లేక వారిని సహాయం అర్థించటం లేక బలి ఇవ్వటం లేక మొక్కుబడులు చెల్లించడం మొదలైనవి. ఇంకా జహ్మియా లేక ముతాజిలాహ్ ప్రజలు చేస్తున్న ప్రకటనలు, సమాధులపై గోరీల వంటి కట్టడాలు, అక్కడ చేసే  ఆరాధనలు. ఇంతేగాక, ఇతర కల్పితాలు సైద్ధాంతిక అవిధేయతగా పరిగణించబడతాయి. ఉదాహరణకు – ఇస్లామీయ ధర్మ సాక్ష్యాధారాలకు విరుద్ధమైన అల్ ఖవారిజ్ లేక అల్ ఖదరియ్యా లేక అల్ ముర్జియ ప్రజల ప్రకటనలు మరియు సిద్ధాంతాలు. ఏదేమైనప్పటికీ, వాటిలో కొన్ని కల్పితాలు అల్లాహ్ యొక్క అవిధేయతకు చెందుతాయి. ఉదాహరణకు – మండుటెండలలో బయట నమాజు చేయటం మరియు మండుటెండలో ఉపవాసంతో బయటే గడపటం లేదా కామకోరికలు తగ్గించుకోవటానికి శస్త్ర చికిత్స ద్వారా వృషణాలు తీసివెయ్యడం లేదా పనిచెయ్యకుండా చేయటం.

ముఖ్యసూచనలు:

ఎవరైతే కల్పితాలను మంచి కల్పితాలు మరియు చెడు కల్పితాలని విభజించేవారు పొరబడుతున్నారు. ఇంకా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం  యొక్క ఈ హదీథ్ కు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు – “فإن كل بدعة ضلالة” – అనువాదం – “ప్రతి నూతన కల్పితం ఒక తప్పుడు మార్గం”, కాబట్టి, అన్ని రకాల నూతన కల్పితాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  తప్పుడు మార్గాలుగా పరిగణించెను. కాని కొంత మంది ప్రజలు కల్పితాలలో కొన్ని మంచివి కూడా ఉంటాయని దావా చేయుచున్నారు. ప్రముఖ ఇస్లామీయ పండితుడు హాఫిజ్ ఇబ్నె రజబ్ ఇలా తెలిపారు, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  యొక్క “كل بدعة ضلالة” – అనువాదం – “ప్రతి నూతన కల్పితం ఒక తప్పుడు మార్గం” అనేవి క్లుప్తమైన వారి నోటి పలుకులు, కాని భావంలో చాలా విశాలమైనవి, విస్తారమైనవి. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం  ఉపదేశించిన ఇస్లామీయ ములసిద్ధాంతాలలో ఎటువంటి మినహాయింపూ లేదు. అలాగే వారి “من أحدث في أمرنا” – “ఎవరైతే ఏదైనా నూతన కల్పితం కనిబెడతారో” అనే దానికీ మంచి కల్పితం లేదై చెడు కల్పితం అనబడే విభజనా లేదు మరియు దానిలో ఒకదానికి ఎటువంటి మినహాయింపూ లేదు. కాబట్టి, ఎవరైనా నిరాధారమైన  మరియు నిరూపించబడలేని, నూతన కల్పితాలను, పోకడలను ఇస్లాం ధర్మంలో భాగంగా క్రొత్తగా చేర్చేతే,  అలాంటి వారు తప్పుడు మార్గం చూపుతున్నారని గ్రహించవలెను. సైద్ధాంతిక పరమైనది అయినా, లేక మాటల్లో – చేతల్లోనిది అయినా,  బహిర్గతమైనది అయినా లేక అంతర్గతమైనది అయినా – ఇలాంటి వారి వాదలను ఇస్లాం ధర్మం ఒప్పుకోదు. వారు.”

ఇంకా ముందుకు పోతే, ఇలాంటి ప్రజల దగ్గర “మంచి కల్పితం” అనే దానిని నిరూపించటానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. ఒక్క ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు తరావీహ్ (రమాదాన్ నెల రాత్రులలో చేసే ప్రత్యేక ఐచ్ఛిక, స్వచ్ఛంద నమాజులు) గురించి “ఏమి మంచి కల్పితం” అనే ప్రకటన తప్ప.

అంతేకాకుండా, ఇస్లాం ధర్మంలో అనేక క్రొత్త విషయాలు చోటు చేసుకున్నాయని కూడా వారు అంటుంటారు. అటువంటి వాటిని ముందు తరాల పుణ్యపురుషులు (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  మరణించిన తర్వాతి మొదటి మూడు శతాబ్దాలలో నివసించిన ఉత్తమ పురుషులు) ఎవ్వరూ నిరాకరించలేదని వాదిస్తుంటారు. వాటికి కొన్ని ఉదాహరణలు: దివ్యఖుర్ఆన్ ను ఒక గ్రంథరూపంలో జమచేయటం, హదీథ్ లను నమోదు చేయటం వంటివి.

వాస్తవంలో వీటికి ఇస్లాం ధర్మంలో ఆధారాలున్నాయి. కాబట్టి అవి నూతన పోకడలు, కల్పితాల క్రిందికి రావు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు చేసిన తరావీహ్ ల ప్రకటన విషయంలో – ఆయన ఉద్ధేశం పూర్తిగా భాషాపరమైనదే కాని ధర్మసంబంధమైనది కాదు. నిజానికి, నూతన కల్పితాలు నిరూపించుకోవటానికి ఇస్లాం ధర్మంలో ఎలాంటి ఆధారాలు లేవు, అవకాశాలు లేవు.

ఇంకా, దివ్యఖుర్ఆన్ ను ఒక గ్రంథరూపంలో జమచేయటం అనే దానికి ఇస్లాం ధర్మంలో ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  తన సహచరులలో కొందరిని, అవతరించిన ఆయత్ (వచనా) లను వ్రాయమని ఆదేశించేవారు. అలా వేర్వేరుగా వ్రాయబడిన విభిన్న పత్రాలను సహచరులు జమ చేసి, ఒక గ్రంథరూపంలో భద్రపరచారు. అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  తన సహచరలతో మూడు సార్లు తరావీహ్ (రమదాన్ నెలలో ప్రత్యేకంగా చేసే రాత్రి పూట అదనపు నమాజులు) నమాజులు చేసారు. ఆ తర్వాత, తరావీహ్ నమాజు ప్రజలపై  తప్పని సరి అయిపోతుందేమో అనే భావంతో, దానిని కొనసాగించలేదు.

కాని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  కాలంలో సహచరులు ఎవరికి వారే, ఇమాం లేకుండానే తరావీహ్ నమాజు చదివివేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  మరణం తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ప్రజలను ఒక ఇమాం వెనుక జమచేసి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  చదివించినట్లుగా తరావీహ్ నమాజు చదివించెను. కాబట్టి, ఇది ఖచ్చితంగా ఇస్లాం ధర్మంలో ప్రవేశ పెట్టబడిన నూతన కల్పితం అస్సలు కాజాలదు.

హదీథ్ లను నమోదు చేయటం గురించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  ఒక్కోసారి అనుమతి కోరిన తన సహచరులలో కొందరికి హదీథ్ లు వ్రాయటానికి అనుమతి ఇచ్చేవారు. నిజానికి, అటువంటి అనుమతి సహచరులందరికీ ఇవ్వకపోవటానికి కారణం, ప్రజలు హదీథ్ ఉపదేశాల మరియు ఖుర్ఆన్ ఆయత్ (ప్రవచనాలు) ల మధ్య కన్ఫ్యూజ్ కాకూడదనే ఆయన అభిప్రాయం. కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  మరణం తర్వాత ఈ కారణం యొక్క అవసరం లేకుండా పోయినది. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  యొక్క మరణం కంటే ముందు, ఖుర్ఆన్ ఆయత్ (ప్రవచనాలు) కూలంకషంగా పరీక్షించబడినాయి, తనిఖీ చేయబడినాయి మరియు సరిచూడ బడినాయి.

కాబట్టి, ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  హదీథ్ (ఉల్లేఖన) లను కాలక్రమంలో నశించిపోకుండా, భద్రపరచాలనే ఉద్దేశ్యంతో నమోదు చేశారు. అల్లాహ్ యొక్క అంతిమ దివ్యసందేశాన్ని (ఖుర్ఆన్) మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  యొక్క ఉల్లేఖనలను మూర్ఖులు, అజ్ఞానులు నష్టం కలుగజేయకుండా భద్రపరచిన అలాంటి గొప్ప ముస్లిం పండితులకు అల్లాహ్ అనేక దీవెనలు ప్రసాదించుగాక.

నేడు ఎక్కువగా కనబడుతున్న కొన్ని నూతన కల్పితాలు:

1)ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  యొక్క జన్మదినం జరపటం.

2)అల్లాహ్ ను ఆరాధనలలో మరియు అల్లాహ్ కు సన్నిహితమవటంలో నూతన పోకడలు కల్పించటం

నేటి రోజులలో అనేక నూతన కల్పితాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రజలలో సరైన జ్ఞానం తగ్గిపోయినది. మరియు ఎవరైతే అల్లాహ్ ను ఆరాధిస్తున్నారో, వారు ఇలాంటి నూతన పోకడలను అల్లాహ్ ఆదేశాలుగా భావిస్తున్నారు. అంతేకాక దైవారాధనలలో మరియు అలవాట్లలో అవిశ్వాసులను అనుసరించే వారు వ్యాపిస్తున్నారు. ఈ రాబోయే పరిస్థితిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  ఒక హదీథ్ లో ఇలా వివరించారు, “لتتبعن سنن من كان قبلكم” – అనువాదం – మీ పూర్వికులు తప్పుదోవ పట్టిన విధంగానే మీరు కూడా తప్పుదోవ పడతారు”.

రబి అల్ అవ్వల్ నెలలో (ఇస్లామీయ కాలెండరులోని మూడవ నెలలో) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జన్మదినాన్ని (మీలాదున్నబీ) జరుపుకోవటం:

నిజానికి, ఇది క్రైస్తవులు జరుపుకునే ‘క్రిష్టమస్’ అనే పండుగను పోలి ఉన్నది; అజ్ఞాన ముస్లింలు మరియు తప్పుదోవ పట్టిన ముస్లిం పండితులు రబి అల్ అవ్వల్ నెలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  యొక్క జన్మదినాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. కొంతమంది ఈ పండుగను మస్జిద్ లలో జరుపు కుంటున్నారు మరి కొందరు తమ ఇళ్ళల్లో లేదా ప్రత్యేకంగా అలంకరించిన ప్రదేశాలలో జరుపు కుంటున్నారు. క్రైస్తవులు జరుపుకునే క్రిష్టమస్ అనే కల్పితం వంటి ఈ ముస్లిం ల నూతన కల్పిత ఉత్సవాలలో అనేక మంది ప్రజలు హాజరు అవుతున్నారు.

ఇస్లాం ధర్మంలో ఇది నూతన కల్పితంగా పుట్టడటమే కాకుండా, ఇటువంటి పండుగలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  ను మితిమీరి స్తుతించే అనేక కవితాగానాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  ను సహాయం కోసం అర్థించటం మొదలైన అనేక విధాల బహుదైవారాధన పద్ధతులు, అసహ్యకరమైన పద్ధతులు కూడా చోటు చేసుకున్నాయి. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  స్వయంగా ఇలాంటి వాటిని నిషేధించెను. “لا تطروني” – అనువాదం – “మర్యం కుమారుడైన జీసస్ (అలైహిస్సలాం)ను హద్దుమీరి స్తుతించినట్లుగా మీరు నన్ను స్తుతించవద్దు, కాని నన్ను అల్లాహ్ యొక్క దాసుడు అని మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త అని మాత్రమే పిలవ వలెను.”

ఇటువంటి ప్రజలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  స్వయంగా డప్పులతో మరియు ఇతర సూఫీలు వాడే సంగీత పరికరాలతో,  చెవుల కింపైన మరియు మృదుమధురమైన పాటలతో కూడిన ఆ జన్మదిన పండుగలకు హాజరవుతారని అపోహ పడుతున్నారు. అంతే కాకుండా, ఇటువంటి పండుగలలో స్త్రీపురుషులు కలిసి ఒకే చోట ఉండటం వలన దుర్బుద్ధి పుట్టి, వ్యభిచారానికి దారితీసే అవకాశాలుంటాయి. నిజానికి ఇటువంటిదేదీ జరగక, కేవలం ఉత్సాహంగా, ఆనందంగా ఇటువంటి పండుగలను జరుపుకున్నా కూడా ఇలా చేయటమనేది ఒక నూతన కల్పితమనే విషయాన్ని త్రోసిపుచ్చదు. ప్రతి నూతన కల్పితం చెడు మార్గం వైపునకు దారితీస్తుంది. అంతేకాక, పైన తెలిపిన చెడు సంప్రదాయాలకు, పాపపు పనులకు ఇది ఒక అనివార్యమైన మార్గంగా మారుతుంది.

అల్లాహ్ యొక్క అంతిమ సందేశంలో (ఖుర్ఆన్), అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు  ఉత్తమమైన మొదటి మూడు శతాబ్దాలలోని పుణ్యపురుషుల ఆచరణలలో ఎక్కడా కనిపించక పోవటం వలన ఇది బిదాఅ (నూతన కల్పితం) అయినది. అయితే, ఎలాగోలా ఇది నాలుగవ శతాబ్దంలో ఫాతిమీ సామ్రాజ్య కాలంలో మొదలైనది.

అల్ ఇమాం అబు హఫ్స్ తాజుద్దీన్ అల్ ఫాకిహనీ ఇలా తెలుపారు, “తాము కూడా అనుసరించటానికి, కొంత మంది మంచి వ్యక్తులు మాటిమాటికీ నన్ను రబి అల్ అవ్వల్ లో కొంతమంది ఒకచోట గుమిగూడి చేసే అల్ మౌలిద్ (పుట్టినరోజు) అనే ఉత్సవానికి ఇస్లాం ధర్మంలో ఏదైనా ఆధారమున్నదా, లేదా? అని ప్రశ్నించారు. వారు ఆ ప్రశ్నను ప్రత్యేకమైన పద్ధతిలో తమకు అనుకూలమైన జవాబు రాబట్టాలనే సంకల్పంతో మాటిమాటికీ అడిగేవారు. అప్పుడు నేను కేవలం అల్లాహ్ యొక్క శుభాశీస్సులనే ఆశిస్తూ, వారితో ఇలా పలికాను, ‘దివ్యఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  యొక్క సున్నత్ లలో మౌలిద్ (పుట్టినరోజు) గురించి నాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు మరియు సరైన ధర్మజ్ఞానం కలిగిన ప్రసిద్ధ ఇస్లామీయ పండితులు ఎవ్వరూ ఇలాంటి ఉత్సవాలు, పండుగలు చేయలేదు. కాబట్టి, ఖచ్చితంగా అసత్యపరులు మొదలు పెట్టిన ఒక నూతన కల్పితమిది.

షేఖ్ అల్ ఇస్లాం ఇబ్నె తైమియా ఇలా తెలిపారు “మరియు ప్రజలు క్రైస్తవులను అనుసరిస్తూ లేక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై తమ మితిమీరిన ప్రేమాభిమానాలను ప్రదర్శించటానికి, ఆయన జన్మతేదీలో ఉన్న భేదాభిప్రాయాలను దాచిపెట్టి, మీలాదున్నబీని,  ఒక పండుగగా జరపటం అనేది ఒక నూతన కల్పితం.  వాస్తవానికి, మన ప్రాచీన పుణ్యపురుషులు దాని ఉనికినే గుర్తించలేదు. ఒకవేళ ఇది ఒక స్వచ్ఛమైన మంచి పని అని వారు భావించి ఉన్నట్లయితే, దీనిని వారు తప్పకుండా చేసేవారు. ఎందుకంటే, పుణ్యాలు సంపాదించటంలో వారు చూపిన ఆసక్తి, ఆతృత, కుతూహలం ఇంకెవ్వరూ చూపలేరు.

వాస్తవానికి, వారు (మొదటి మూడు తరాల వారు) తమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై  అధికంగా ప్రేమాభిమానాలు చూపేవారు మరియు పుణ్యకార్యాలు చేయటానకి ప్రాధాన్యత నిచ్చేవారు. నిజానికి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం  ను అనుసరించటం మరియు విధేయత చూపటం మొదలైన అనుమతింపబడిన పనుల ద్వారానే ఆయనపై ప్రేమాభిమానాలు ప్రదర్శించగలం అనే విషయాన్ని వారు గ్రహించారు. వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  పై గల తమ ప్రేమాభిమానాలను ఆయన ఆదేశాలను బహిరంగంగా మరియు అంతర్గంతంగా శిరసావహించేవారు,  సున్నత్ లను పున:స్థాపించటానికి ప్రయత్నించేవారు, ఆయన సందేశాన్ని సాధ్యమైనంత వరకు వ్యాపింపజేసేవారు, మనస్పూర్తిగా దీనికోసం అవసరమైతే మాటలతోమరియు చేతలతో పోరాటం చేయటానికి కూడా వెనుకాడే వారు కాదు.

ఆరంభంలో ఇస్లాం స్వీకరించిన వారు, మక్కా వదిలి మదీనాకు వలస పోయిన ముహాజిర్ లు, మక్కా నుండి వలస వచ్చిన వారికి పూర్తి సహాయసహకారాలందించిన అన్సారులు, ఇంకా ఎవరైతే ఆయనను ఖచ్చితంగా అనుసరించేవారో (దైవవిశ్వాసంలో) వారు, పాటించిన సరైన పద్ధతి.

ఇటువంటి జన్మదిన వేడుకలు (మీలాదున్నబీ) వంటివి తర్వాత తర్వాత పుణ్యపురుషుల, ఔలియాల, ఇమాంల జన్మదిన వేడుకలు, ఉరుసులు జరుపుకునే ఆచారంగా మారిపోయినవి. ఈ విధంగా ఇఅల్ బిదాఅఁ (నూతన కల్పితా) లను ఖండిస్తూ, అనేక వ్యాసాలు వ్రాయబడినవి. ఇలా ఇస్లాం ధర్మంలో ఒక పెద్ద దుష్టాచారానికి మార్గం ఏర్పడినది.

అల్లాహ్ యొక్క ఆరాధనలలో మరియు అల్లాహ్ కు దగ్గరవటానికి ప్రయత్నించటంలో నూతన కల్పితాలు:

ఈనాడు ఆరాధనలలో, ప్రార్థనలలో అనేక నూతన కల్పితాలు కనబడుతున్నాయి. నిజానికి, ఆరాధనలకు ముఖ్యాధారం సరైన ప్రామాణికత. కాబట్టి అంత తేలికగా ఆరాధనలను సరైన ప్రామాణికత, సాక్ష్యాధారాలు లేకుండా చట్టబద్ధం కాకూడదు. ఇంకా, వేటికైతే సాక్ష్యాధారలు ఉండవో, అవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  యొక్క ఆచారవ్యవహారాలకు విరుద్ధంగా తీసుకు వచ్చిన నూతన కల్పితాలని గ్రహించవలెను. ఒక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  ఇలా ఉపదేశించారు –  “من عمل عملا” – అనువాదం – “సరైన ప్రమాణిక కారణం లేకుండానే, మా వ్యవహారాలలో (అల్లాహ్ పంపిన ఇస్లామీయ జీవన విధానంలో) నూతన కల్పితాలను కనిపెట్టిన వారెవరైనా సరే తిరస్కరించబడతారు

సరైన సాక్ష్యాధారాలు లేకుండా, ప్రజలు ఆచరిస్తున్న ఆరాధనలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని:

నమాజు చేయటానికి ముందు బిగ్గరగా తన సంకల్పాన్ని ప్రకటించటం, ఉదాహరణకు, ‘అల్లాహ్ కోసం నేను ఫలానా ఫలానా నమాజు చేయటానికి సంకల్పం చేసుకున్నాను’ అనేది మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం  యొక్క సున్నత్ లలో ఎక్కడా కనబడపోక పోవటం వలన ఇది ఒక నూతన కల్పితం. అంతే కాక, అల్లాహ్ యొక్క ఈ ప్రకటన, “قُلْ أَتُعَلِّمُونَ اللَّهَ بِدِينِكُمْ وَاللَّهُ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الأرْضِ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ” – అనువాదం {ప్రకటించు (ఓ ముహమ్మద్ ^): “ఏమిటీ! మీ ధర్మం గురించి అల్లాహ్ నే ఆదేశించాలనుకుంటున్నావా? కాని, భూమ్యాకాశాల మధ్యలో ఉన్నది అల్లాహ్ కు సంపూర్ణంగా తెలుసు: ప్రతిదాని గురించి ఆయన సంపూర్ణజ్ఞానం కలిగి ఉన్నాడు}.

నిజానికి, సంకల్పం అనేది మనస్సులో వెలువడేది, ఎందుకంటే మనస్సు (హృదయం) యొక్క పనులలో అదొకటి, కాని అది నాలుక పని కాదు. అలాగే, నమాజు తర్వాత గుంపుగా, పబ్లిక్ గా  దుఆ చేయటం.ఎందుకంటే, ప్రతి ఒక్కరూ, స్వయంగా దుఆ చేయవలసి ఉన్నది గాని గుంపుగా కాదు.

అలాగే ఇంకో నూతన కల్పితం  – కొన్ని సందర్భాలలో దుఆ చేసిన (వేడుకున్న) తర్వాత ప్రత్యేకంగా సూరహ్ ఫాతిహా పఠించటం. (సహాయం కోసం అల్లాహ్ ను ప్రార్థించటం) మరియు చనిపోయిన వారి కోసం సమర్పించటం. ఇంకా ఉత్తర క్రియలు (మరణానంతరం పాటించే ఆచారాలు), ప్రజలకు విందు భోజనాలు పెట్టడం మరియు అక్కడ ఖుర్ఆన్ పఠించడానికి ఎవరినైనా నియమించడం వంటివి నూతనంగా కనిపెట్టిన ఆచారాలు. అంతేకాక, అలాంటి ఆచారాలు చనిపోయిన వారికి ప్రయోజనం చేకూరుస్తాయని వారు నమ్ముతున్నారు. కాని అలా చేయమని అల్లాహ్ ఏనాడూ ఆదేశించక పోవటం వలన, అది ఒక దారి తప్పిన నూతన కల్పితం.

అలాగే, మరికొన్ని దారి తప్పిన నూతన కల్పిత ఆచారాలు – అల్ ఇస్రా వల్ మేరాజ్ మరియు అల్ హిజ్రాహ్ అన్నబవీయహ్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం మక్కా నుండి మదీనాకు వలస పోయిన రోజు) నాడు పండుగలు చేయటం. ఇవి కూడా సరైన సాక్ష్యాధారాలు లేని ఇస్లాం ధర్మంలో క్రొత్తగా కనిపెట్టబడిన కల్పిత ఆచారాలు. ఇంకా, కొంతమంది అల్ ఉమ్రా అర్రజబీయహ్ అనే పేరుతో రజబ్ (ఇస్లామీయ కాలెండరులోని 7వ నెల) నెలలో ఉమ్రా (ప్రత్యేక పద్ధతిలో మక్కా యాత్ర) చేయటం కూడా అలాంటి నూతన కల్పిత ఆచారమే.   నిజానికి, ఈ నెలలో ప్రత్యేకమైన పద్ధతిలో జరప వలసిన ఆరాధనలు ఏమీ లేవు.

ఇంకొన్ని నూతనంగా కనిపెట్టబడిన కల్పితా ఆచారాలలో అల్లాహ్ ఆదేశించిన ప్రార్థనా సూక్తులు, పద్ధతులు మరియు సమయాలకు బద్ధవిరుద్ధమైన పద్ధతులలోని సూఫీ ప్రార్థనలు కూడా వస్తాయి.

అలాంటిదే ఇంకో బిదాఅఁ (నూతన కల్పితం) షాబాన్ (ఇస్లామీయ కాలెండరు లోని 8వ నెల) 15వ తేదీని ప్రత్యేక మైన దినంగా భావించి, ఆ రోజున ఉపవాసం ఉండటం మరియు ఆ రాత్రి జాగరణ చేస్తూ, ఆరాధనలు చేయటం కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క సున్నత్ లలో ఎక్కడా నమోదు చేయబడలేదు.

అలాంటివే మరికొన్ని బిదాఅఁలు (నూతన కల్పితం) పుణ్యపురుషుల సమాధులపై కట్టఢాలు, అక్కడ ప్రార్థనల చేసే ప్రాంతాలుగా మార్చడం, వాటిని దర్శించి ఆ మృతులను సహాయం అర్థించటం వంటి బహుదైవారాధన పనులు ఆచరించడం, ఇంకా మహిళులను కూడా దర్శనానికి అనుమతి ఇవ్వడం (అలా మాటిమాటికి మహిళలు సమాధులను సందర్శించటం నిషేధించబడినది) వంటివి.

చివరిగా:

బిదాఅఁలను (నూతన కల్పితాచారాలను) మనం అవిశ్వాసుల సందేశం గా చెప్పవచ్చును. ఇవి మన ఇస్లామీయ ధర్మంలో క్రొత్తగా చేరిన పోకడలు. అటువంటి వాటిని ఆచరించమని అల్లాహ్ గాని లేదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం గాని ఆదేశించలేదు. వాస్తవానికి, బిదాఅఁ అనేది ఘోరమైన మహాపాపాల కంటే నీచమైనది. వీటి వలన షైతాన్ సంతోషపడతాడు. ఎందుకంటే, పాపాత్ముడికి తను చేసేది పాపాం అని తెలుస్తుంది, తర్వాత ఎప్పుడైనా మంచి మార్గంలోనికి రావాలని తలంచినప్పుడు, పశ్చాత్తాప పడి క్షమాభిక్ష వేడుకుంటాడు. కాని బిదాఅఁ (నూతన కల్పితాచారలలో) మునిగి ఉన్నవాడికి తను చేస్తున్న అస్వీకారపు పనిని కూడా అల్లాహ్ కు చేరువయ్యే ఒక విధమైన ఆరాధనగానే నమ్మటం వలన, అతడు అస్సలు పశ్చాత్తాప పడక పోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతే కాక, అటువంటి వారు  సమాజంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క సున్నత్ లను సర్వనాశనం చేస్తు, క్రొత్త క్రొత్త ఆచారవ్యవహారాలను తెచ్చిన వారువుతారు. అటువంటి వారు సమాజపు బహిష్కరణకు అర్హులవు తారు.

కాబట్టి, బిదాఅఁ (నూతన కల్పితాచారములు) ప్రజలను అల్లాహ్ కు దూరం చేస్తాయి. అల్లాహ్ యొక్క ఆగ్రహానికి మరియు కఠిన శిక్షకు గురి చేస్తాయి. మనస్సులో తప్పుడు దారిని, దుష్టత్వాన్ని మరియు లంచగొండితనాన్ని నాటుతాయి.

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహుఅలైహివసల్లం) అంతిమ హజ్ యాత్రలో చేసిన ప్రసంగం (The Last sermon of the Prophet)

అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో,

623 A.D వ సంవత్సరం, మక్కా నగరం దగ్గర ఉన్న అరాఫాత్ మైదానంలో చేసిన ప్రసంగంలోని భాగం

అల్లాహ్ ను ప్రశంసించి, కృతజ్ఞతలు తెలిపిన తర్వాత, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సంబోధించారు (ప్రపంచం నలుమూల నుండి వచ్చిన దాదాపు లక్షన్నర స్త్రీపురుషుల సమూహానికి చేసిన ఉపదేశం):

“ఓ ప్రజలారా! శ్రద్ధగా వినే చెవిని నాకు అప్పుగా అప్పగించండి, ఎందుకంటే నేను ఈ సంవత్సరం తర్వాత మీ మధ్యన జీవించి ఉంటానో లేదో నాకు తెలియదు. కాబట్టి, నేను మీకు చెబుతున్న దానిని చాలా జాగ్రత్తగా వినండి మరియు  ఈ పదాలను (సందేశాన్ని) నేడు ఇక్కడ హాజరు కాలేకపోయిన వారికి కూడా చేర్చండి.

ఓ ప్రజలారా! మీరు ఈ నెలను, ఈ దినమును పవిత్రమైనదిగా పరిగణించినట్లే,  ప్రతి ముస్లిం యొక్క జీవితాన్ని (ప్రాణాన్ని) మరియు సంపదను(ఆస్తిని) పవిత్రమైన విశ్వాస నిక్షేపంగా (నమ్మికగా) పరిగణించవలెను. మీ వద్ద నమ్మకంతో ఉంచిన వస్తువుల్ని, వాటి అసలైన యజమానులకు తిరిగి వాపసు చెయ్య వలెను.  మీరు ఎవ్వరికీ హాని కలిగించ కూడదు, దాని వలన మీకెవ్వరూ హాని కలిగించరు. ‘నిశ్చయంగా మీరు మీ రబ్ (ప్రభువు) ను కలుసుకోబోతున్నారు మరియు ఆయన నిశ్చయంగా మీ కర్మల లెక్క తీసుకోబోతున్నాడు’ అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచు కోవలెను.

మీరు వడ్డీ తీసుకోవటాన్ని అల్లాహ్ నిషేధించాడు; కాబట్టి ఇక మీదట వడ్డీ వ్యాపారానికి సంబంధించిన నియమనిబంధనలన్నీ, హక్కులన్నీ రద్దు చేయబడినవి. మీ యొక్క అసలు మూలధనం మాత్రం మీరు తీసుకోవచ్చును. మీరు అసమానత్వాన్ని (హెచ్చుతగ్గులను, భేదాలను, వైషమ్యాలను) బలవంతంగా రుద్దకూడదు మరియు సహించకూడదు. వడ్డీ నిషేధించబడినదని అల్లాహ్ తీర్పునిచ్చినాడు మరియు అబ్బాస్ ఇబ్నె అబ్దుల్ ముత్తలిబ్ కు చెల్లించ వలసి ఉన్న మొత్తం వడ్డీ ఇక మీదట రద్దు చేయబడినది.

షైతాన్ నుండి మీ ధర్మాన్ని కాపాడుకునేందుకు అప్రమత్తంగా (జాగ్రత్తగా) ఉండవలెను. అతడు పెద్ద పెద్ద విషయాలలో మిమ్ముల్ని తప్పు దారి పట్టించే శక్తి తనకు ఏ మాత్రం లేదని తెలుసుకుని, తన ఆశలన్నీ వదులుకున్నాడు. కాబట్టి చిన్న చిన్న విషయాలలో కూడా అతడిని అనుసరించకుండా అప్రమత్తంగా ఉండవలెను.

ఓ ప్రజలారా! మీ స్త్రీలపై మీకు కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నమాట వాస్తవమే కాని వారికి కూడా మీ పై హక్కులు ఉన్నాయి. జ్ఞాపకం ఉంచుకోండి, కేవలం అల్లాహ్ పై ఉన్న విశ్వాసం ఆధారంగానే మరియు అల్లాహ్ యొక్క అనుమతి మూలంగానే మీరు వారిని తమ తమ భార్యలుగా చేసుకున్నారు.

మీ స్త్రీలతో మంచిగా ప్రవర్తించండి మరియు దయాదాక్షిణ్యాలతో వ్యవహరించండి ఎందుకంటే వారు మీ జీవిత భాగస్వాములు మరియు శ్రద్ధాభక్తులతో, సేవానిరతితో సహాయ సహకారాలందించే అంకితమైన సహాయకులు. ఒకవేళ వారు స్థిరంగా మీ హక్కులను పూర్తిచేస్తున్నట్లయితే, మీ నుండి దయతో ఆహారం (అన్నపానీయాలు) మరియు దుస్తులు పొందే హక్కు వారి స్వంతమవుతుంది. ఇంకా మీరు అనుమతించని(ఇష్టపడని) వారితో, వారు స్నేహంగా మెలగకూడదనేది మరియు తమ శీలాన్ని అస్సలు కోల్పోకూడదనేది (వ్యభిచరించకూడదు, తుంటరిగా ప్రవర్తించకూడదు) వారిపై మీకున్న హక్కు.

ఓ ప్రజలారా! అత్యావశ్యకంగా నా మాట వినండి. కేవలం అల్లాహ్ నే ఆరాధించండి, ప్రతి దినపు ఐదు తప్పని సరి నమాజులను పూర్తిచేయండి, రమదాన్ నెలలో తప్పనిసరిగా ఉపవాసం ఉండండి మరియు తప్పనిసరి అయిన విధిదానం (జకాత్) పేదలకు పంచిపెట్టండి. ఒకవేళ మీకు తగిన శక్తిసామర్ధ్యాలు ఉన్నట్లయితే, హజ్ యాత్ర పూర్తిచేయండి.

మొత్తం మానవజాతి ఆదం (అలైహిస్సలాం) సంతతి యే మరియు అరబ్ వాసులకు ఇతరులపై ఎటువంటి ఆధిక్యం లేదు, మరియు ఇతరులకు అరబ్ వాసులపై ఎటువంటి ఆధిక్యం లేదు; అలాగే నల్లవారి పై తెల్లవారికి ఎటువంటి ఆధిక్యం లేదు మరియు తెల్లవారి పై నల్లవారికి ఎటువంటి ఆధిక్యం లేదు, కేవలం దైవభక్తి మరియు మంచి నడవడికలో తప్ప.

ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క ఇతర ముస్లింకు సోదరుడని మరియు ముస్లింలు సోదర భావాన్ని తప్పక స్థాపించాలని గ్రహించవలెను. తోటి ముస్లింలకు చెందిన వాటిపై, మీకు ఎటువంటి అధీనం (ఔరసత్వం) లేదు, కాని స్వతంత్రంగా మరియు మనస్పూర్తిగా వారు ఇష్టపడి మీకిస్తే తప్ప. కాబట్టి, ఈ విధంగా మీకు మీరే  (ఇతరుల హక్కును గౌరవించకుండా) అన్యాయంచేసుకోవద్దు.

జ్ఞాపకం ఉంచుకోండి, ఒకరోజు మీరు అల్లాహ్ ముందు హాజరవబోతున్నారు. మీరు చేసిన ప్రతి పనికి, ప్రతి ఆచరణకు ఆ రోజున సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి, జాగ్రత్త! నేను ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయిన తర్వాత మీరు సత్యమార్గానికి  దూరం కావద్దు.

ఓ ప్రజలారా! నా తర్వాత వేరే ప్రవక్త లేక వేరే సందేశహరుడు రారు. మరియు ఏ క్రొత్త ధర్మమూ పుట్టదు. కాబట్టి వివేకంతో, జ్ఞానంతో, బుద్ధితో సరిగ్గా వ్యవహరించండి.

ఓ ప్రజలారా! ఇంకా, నేను మీకు తెలియజేస్తున్న ఈ పదాలను మంచిగా అర్థం చేసుకోవలెను – నేను నా వెనుక (నా తర్వాత) రెండు విషయాలను వదిలి వెళ్ళుతున్నాను, ఒకటి దివ్యఖుర్ఆన్ మరియు రెండోది నా నిదర్శనం (దృష్టాంతం, ఉదాహరణ (సున్నత్) మరియు మీరు ఈ రెండింటినీ గనుక అనుసరిస్తే, ఎట్టి పరిస్థితిలోను నశించిపోరు.

నా వాక్కులు వింటున్నమీరందరూ, వీటిని ఇతరులకు చేర్చవలెను, ఇంకా ఆ ఇతరులు వేరే ఇతరులకు చేర్చవలెను. అలా విన్నవారిలో చిట్టచివరి తరం వారు, ఇప్పుడు నా నుండి ప్రత్యక్షంగా వింటున్న మీకంటే ఇంకా మంచిగా అర్థం చేసుకోవటానికి కూడా ఆస్కారం ఉన్నది.

ఓ అల్లాహ్ (ఏకైక దైవారాధకుడు ), నేను నా కివ్వబడిన దివ్యసందేశాన్ని నీ ప్రజలకు అందజేసానని సాక్ష్యంగా ఉండవలెను.

Source

కవిత ఎలా నూర్ ఫాతిమాగా మారిపోయినది? (How Kavita converted to fatima?)

కవిత ఎలా నూర్ ఫాతిమాగా మారిపోయినది?
(ఇంటర్వ్యూ: బింత్ అర్షద్ సాహీ)

ఒక ఉగ్రవాద శివసేన హిందూ కుటుంబానికి చెందిన, ఒక అమ్మాయి కథ ఇది. ‘కవిత’ అనే ఆ అమ్మాయి స్వయంగా ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది.  ఇస్లాం స్వీకరణ తరువాత ఆమె పేరు ‘నూర్ ఫాతిమా’ గా మార్చుకున్నది.

ప్రశ్న: ఇస్లాం స్వీకరణకు ముందు మీ పేరేమిటి?

జవాబు: ఇస్లాం స్వీకరణకు పూర్వం నా పేరు ‘కవిత’, నన్ను అందరూ ముద్దుగా పేరు ‘పూనమ్’ అని పిలిచేవారు.

ప్రశ్న: మరి ఇస్లాం స్వీకరించిన తరువాత ఇప్పుడు మీ పేరేమిటి?

జవాబు: ఇస్లాం స్వీకరించిన తరువాత నాకు ‘నూర్ ఫాతిమా’ అని పేరు పెట్టడం జరిగింది.

ప్రశ్న: మీరెక్కడ జన్మించారు, ఇప్పుడు మీ వయసెంత?

జవాబు: నేను ముంబాయి లో జన్మించాను.  ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలు. కానీ, నావరకు నేను, నావయసు ఐదు సంవత్సరాలే అనుకుంటాను. ఎందుకంటే, ఇస్లాంకు సంబంధించి నా ఙ్ఞానమూ, అవగాహనా, ఒక ఐదు సంవత్సరాల ముస్లిం పిల్లవాడి కంటే మించదు.

ప్రశ్న: మీ విద్యాభ్యాసాన్ని గురించి చెబుతారా?

జవాబు: ఇండియాలో స్కూలు విద్య పూర్తి చేసిన తరువాత, పై చదువుల కోసం నేను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్ళాను.  మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత, అక్కడే ఎన్నో కంప్యూటర్ కోర్సులు చేసాను. నిజంగా నేను విచారిస్తున్నాను, ప్రాపంచిక జీవితం కోసం చాలా డిగ్రీలు సంపాదించాను.  కానీ పరలోక జీవితం కోసం ఏమీ చేయలేక పోయాను.  ఈ ఆశయం సాధించడం కొరకు ఇప్పుడు సాధ్యమైనంత చేయాలని కోరుకుంటున్నాను.

ప్రశ్న: మీ జీవితానికి సంబంధించి ఇంకా వివరాలు చెప్పండి?

జవాబు: నా చదువులు పూర్తయిన తరువాత, ముంబాయిలో నేను ఒక స్కూల్లో టీచరుగా చేరాను. అది చాలా పెద్ద స్కూల్.  కోటీశ్వరుల పిల్లలే అక్కడ చదవడానికి వస్తారు.

ప్రశ్న: మీ వివాహం ఎక్కడ జరిగింది, మీకెంత మంది పిల్లలు?

జవాబు: నా వివాహం ముంబాయిలో జరిగింది.  కానీ తరువాత నేను నా భర్త వెంట బహ్రెయిన్ వచ్చాను.  నాకు ఇద్దరు మగపిల్లలు.

ప్రశ్న: మీరు ఇస్లాం స్వీకరించటం ఏ విధంగా జరిగింది?

జవాబు: అన్నింటికన్నా ముందుగా నాపై కురిపించిన అనుగ్రహాలకు గాను నేను అల్లాహ్ కు కృతఙ్ఞతలు అర్పించుకుంటున్నాను.  ఆయన ప్రవక్త, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నట్లు “ఎవరికైతే అల్లాహ్ మంచి చేయాలని తలపోస్తాడో, వారికి ధర్మానికి సంబంధించిన అవగాహనను కలుగజేస్తాడు” అని, నాపై అల్లాహ్ ఎంతగానో తన కారుణ్యాన్నీ, అనుగ్రహాన్నీ కురిపించాడని అనుకుంటున్నాను. ముస్లిములు అంటేనే విపరీతంగా అసహ్యించుకునే, ఉగ్రవాద హిందూ వాతావరణంలో పెరిగాను నేను.  నేను ఇస్లాం స్వీకరించటం నా వివాహం అయిన తరువాత జరిగింది. కానీ, చిన్నప్పటినుంచే విగ్రహాలకు పూజ చేయటం అంటే ఇష్టం ఉండేది కాదు నాకు.  ఇప్పటికీ బాగా గుర్తు నాకు – ఒక సారి, మా ఇంట్లో ఉన్న ఒక విగ్రహాన్ని తీసుకెళ్ళి స్నానాలగదిలో పడేసాను.  దాంతో మా అమ్మ నన్ను బాగా తిట్టిపోసింది. దానికి నేను మా అమ్మతో “తనను తాను కూడా రక్షించుకోలేని ఆ విగ్రహానికి ఎందుకమ్మా మీరు తలలు వంచి దండాలు పెడతారు.  అది మీకేం ఇస్తుందనీ?” అన్నాను.  మా కుటుంబంలో ఒక సాంప్రదాయం ఉంది.  ఆడపిల్లకు పెళ్ళైనపుడు, ఆ అమ్మాయి తన భర్త కాళ్ళు కడిగి, ఆ నీళ్ళను తాగాలి.  కానీ ఆ మొట్టమొదటి రోజే, నేను అలా చేయడానికి నిరాకరించాను. దానికి అందరూ నన్ను విపరీతంగా తిట్టారు.  నేను మీకు ముందే చెప్పాను కదూ, నేను ఒక స్కూల్లో టీచరుగా చేరానని – స్కూలుకు నేను ఒక్కదాన్నే వెళ్ళి వస్తూ ఉండటం, కారును నేను స్వయంగా డ్రైవ్ చేయటం వల్ల, దార్లోనే ఉన్న, ఒక ఇస్లామిక్ సెంటర్ కు వెళ్ళడం ప్రారంభించాను. నేను వారి సంభాషణ విన్నాను.  వారు విగ్రహాలను పూజించరన్న విషయం నాకు అర్థమైంది.  వారు, అనుగ్రహాలను, ఆశీర్వాదాలను కోరుకునేది వేరే ఇంకెవరి నుంచో.  వారి దేవుడు విగ్రహాలు కాదు – వేరే ఇంకెవరో.  వారి అభిప్రాయాలు నచ్చాయి నాకు.  తరువాత నాకు అర్థమైంది ఆ ‘వేరే ఇంకెవరో’ –  ‘అల్లాహ్’ అనీ, సమస్త కార్యాలనూ పరిపూర్తి చేసేది ఆయనే అనీ.

ప్రశ్న: ఇస్లాం వైపునకు మీరు ఎలా ఆకర్షించబడ్డారు?

జవాబు: వారి ఆరాధనా విధానం, అదే ‘నమాజు’ నన్ను బాగా ప్రభావితం చేసింది.  అది ‘ఆరాధన’ అన్న విషయం అంతకు ముందు తెలియదు నాకు.  అయితే ముస్లిములందరూ అలా చేస్తారని మాత్రం తెలుసు.  అదేదో ఒకరకం వ్యాయామం కాబోలు అనుకునే దాన్ని. ఇస్లామిక్ సెంటర్ కి వెళ్ళి రావడం మొదలు పెట్టిన తరువాత, అది ఒక ‘ఆరాధన’ అనీ, దానిని ‘నమాజు’ అంటారనీ తెలిసింది నాకు.  నేనెప్పుడూ కలలో ఒక రకమైన ఆకారాన్ని చూస్తూ ఉండే దాన్ని.  అది నలుచదరపు గదిలా ఉండేది.  ప్రతి రోజూ కలలో చూస్తూ ఉండే దానిని.  కలత చెంది నిద్ర నుంచి లేచి పోయేదానిని.  చెమటలు పట్టేవి. పడుకుంటే మళ్ళీ కలలోకి వచ్చేది. నా కలలో కనిపించిన ఆ గదిని గురించి, తరువాత చాలా తెలుసుకున్నాను నేను.

ప్రశ్న:  మీరు ఇస్లాం స్వీకరించడం గురించి మీ కుటుంబానికి ఎలా తెలిసింది?

జవాబు: పెళ్ళయింతర్వాత, నా భర్తతో పాటు బహ్రెయిన్ కు వెళ్ళటం, ఇస్లాం పట్ల అవగాహన పెంచుకోవాటానికి బాగా ఉపకరించింది. అదొక ముస్లిం దేశం కావటం వల్ల, మా ఇంటి చుట్టుపక్కల అందరూ ముస్లిములే ఉండేవారు.  అలా ఒక ముస్లిమం అమ్మాయితో నాకు స్నేహం అయ్యింది.  ఆ అమ్మాయి ఎపుడో కానీ మాయింటికి వచ్చేది కాదు.  చాలాసార్లు నేనే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళుతూ ఉండే దానిని.  ఒకసారి, అది రమదాన్ నెల కావటంతో, ఒకరోజు నాతో వాళ్ళ ఇంటికి ఇక రావద్దని కరాఖండిగా చెప్పేసింది.  నేను ఆశ్చర్యపోయాను.  “నువ్వు మా ఇంటికి రావడం వల్ల, నా ఆరాధనలకు అతరాయం కలుగుతున్నది” అంది తను. నాకు, ఇస్లాం యొక్క ఆరాధనలు, ఆచరణలు, సాంప్రదాయాలు తెలుసుకోవాలని బాగా కోరికగా ఉండటంతో, ఆ అమ్మాయి మాటలు నాలో మరింత ఉత్సుకతను రేపాయి.  నేను ఆ అమ్మాయిని బతిమాలాను “ప్లీజ్! అలా అనకు.  నువ్వు ఏ ఆరాధన చేయాలనుకుంటావో, చెయ్యి.  ఎలా ఆచరిస్తావో అలా ఆచరించు. నేను ఒక్క మాట కూడా మాట్లాడను.  కేవలం చూస్తూ ఉంటానంతే.  నువ్వు ఏం చదువుతావో, జస్ట్ వింటూ ఉంటానంతే.  నావల్ల నీకు ఎలాంటి అంతరాయం, ఆటంకం కలుగకుండా మసలుకుంటాను.” అన్నాను.  ఆ అమ్మాయి సరేనంది.  నేను ఎప్పుడైనా ఆ అమ్మాయిని ఏదో ఒక ఆరాధనలో మునిగి ఉండగా చూస్తే, దానికి బాగా ఆకర్షితమై పోయే దానిని – నేను కూడా అలా చేయాలనీ, అలా ఆచరించాలనీ బలంగా అనిపించేది నాకు.  ఒకసారి ఆ అమ్మాయిని అడిగాను ఆ ‘యోగా వంటి వ్యాయామాన్ని’ గురించి.  తను చెప్పింది దానిని ‘నమాజు’ అంటారనీ, తను పఠించే ఆ గ్రంథాన్ని ‘దివ్య ఖుర్’ఆన్’ అంటారనీ.  నేను కూడా అవన్నీ చేయాలనీ ఆశపడేదానిని.  ఇంటికి తిరిగి వెళ్ళినపుడు, ఒక గదిలోకి దూరి, లోనుంచి గడియ పెట్టుకుని, నాకు అంతగా ఏమీ తెలియక పోయినా, ఆ ఏకాంతంలో నా స్నేహితురాలు ఆచరించినట్లుగా అన్ని పనులూ ఆచరిస్తూ ఉండే దానిని. ఒకరోజు, గది తలుపులు లోపలి నుంచి గడియ పెట్టడం మరిచిపోయి, నమాజు ఆచరించటం ప్రారంభించాను.  నా భర్త గదిలోనికి ప్రవేశించటప్పటికి నేను నమాజులో ఉన్నాను.

‘ఏం చేస్తున్నావ్?’ అని అడిగాడు నన్ను.
‘నమాజు చేస్తున్నాను’ అన్నాన్నేను.

‘నీకేమన్నా మతి పోయిందా?  తెలివుండే మాట్లాడ్తున్నావా నువ్వూ? ఏమంటున్నావో అర్థమవుతున్నదా నీకసలు?’ కోపంతో ఊగిపోతూ అడిగాడు.

ముందు నేను కొద్దిగా వణికాను, భయంతో నాకళ్ళు మూసుకుపోతున్నాయి. కానీ అంతలోనే, నాలో అంతరంగా ఉన్న శక్తి, ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాకు ధైర్యాన్నిచ్చింది.  అంతే, నేను గట్టిగా అరిచి మరీ చెప్పాను ‘అవును, నేను ఇస్లాం స్వీకరించాను. అందుకే నమాజు చేస్తున్నాను’.

‘ఏంటీ? ఏమన్నావ్? ఏదీ మళ్ళొకసారి అను?’ కోపంతో ఊగిపోతూ, రెట్టించి అడిగాడు అతను.

‘అవును, నేను ఇస్లాం స్వీకరించాను’ అన్నాన్నేను.

అంతే, నన్ను పశువును కొట్టినట్లు, కొట్టడం మొదలు పెట్టాడు.  మా అరుపులు, ఆ దెబ్బల చప్పుళ్ళు విని, మా అక్క పరుగెత్తుకు వచ్చింది. ఆవిడ నన్ను విడిపించటానికి ప్రయత్నించింది.  కానీ, నా భర్త చిప్పిందంతా విని, తాను కూడా నాపై చేయి చేసుకోవడం ప్రారంభించింది. నేను తనని ఆపి అన్నాను “అక్కా! దయచేసి, నాదారికి అడ్డు రావద్దు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు.  నా కొరకు ఏది మంచో, ఏది చెడో నాకు తెలుసు.  నేను ఎంచుకున్న మార్గం పై నేను నడిచి తీరుతాను.’ ఇది విని, నా భర్త ఉగ్ర రూపం దాల్చాడు.  నన్ను ఎంతగా హింసించాడంటే – నేను స్పృహ తప్పి పడిపోయాను.

ప్రశ్న: మరి అప్పుడు మీ పిల్లలు ఎక్కడున్నారు? ఎంత వయసు ఉండి ఉంటుంది వాళ్ళకపుడు?  అక్కడినుంచి ఎలా తప్పించుకో గలిగారు మీరు?

జవాబు: ఈ భయానకమైన డ్రామా అంతా జరుగుతున్నపుడు నా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.  నా పెద్ద కొడుకు 9 వ సంవత్సరంలోనూ, నా చిన్న కొడుకు 8 వ సంవత్సరంలోనూ ఉన్నారు.  కానీ ఈ సంఘటన జరిగిన తరువాత నేను ఎవరినీ కలువకుండా కట్టడి చేసారు, చివరికి నా పిల్లలను కూడా.  నన్ను ఒక గదిలో వేసి తాళం వేసారు.  సాంప్రదాయబధ్ధంగా నేను ఇస్లాం స్వీకరించక పోయినప్పటికీ, నేను ఆవిధంగా అనేసాను ‘నేను ఇస్లాం స్వీకరించాను’ అని.  ఒక రోజు రాత్రి, నేను ఆ గదిలో పడిఉండగా, నా పెద్దకొడుకు నావద్దకు వచ్చాడు. అంతే, నన్ను చూస్తూనే, నా చేతుల్లో వాలిపోయి, గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టాడు.  లోనుంచి తన్నుకు వస్తున్న ఏడుపును దిగమింగుకుని, ‘వాళ్ళందరూ లేరా?’ అని అడిగాను.  ఎవరూ ఇంట్లో లేరనీ, వాళ్ళందరూ ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళారనీ చెప్పాడు  (ఏదో హిందూ పండుగ సందర్భంగా జరుగుతున్న ఫంక్షన్ అది). నా పెద్దకొడుకు ‘అమ్మా! వాళ్ళంతా నిన్ను చంపాలనుకుంటున్నారు.  నువ్విక్కడినుంచి పారిపోమ్మా’ అన్నాడు.  నేను వాడిని సముదాయించాను ‘కన్నా! నాకేమీ జరుగదు.  వాళ్ళు నన్నేమీ చేయలేరు. నువ్వు జాగ్రత్త, నీ తమ్ముడ్ని కూడా జాగ్రత్తగా చూసుకో.’ అన్నాను.  కానీ వాడు నన్ను పోరుతున్నట్లుగా, సముదాయిస్తూ మళ్ళీ అడగటం మొదలుపెట్టాడు ‘అమ్మా! నువ్విక్కడి నుంచి పారిపోమ్మా!’ అని.  నేను వాడిని మళ్ళీ సముదాయించాను ‘నాకేమీ జరుగదని, తనను జాగ్రత్తగా ఉండమనీ, తమ్ముడ్ని జాగ్రత్తగా చూసుకోమనీ’. కానీ వాడు ఏడుస్తూ ఎక్కిళ్ళమధ్య మళ్ళీ నన్ను పోరడం మొదలుపెట్టాడు.  నేను వాడికి అర్థమయ్యేలా చెప్పాను ‘నేను వెళ్ళలేననీ, వెళ్ళితే తననీ, తమ్ముడ్నీ చూసే అవకాశం కోల్పోతాననీ’.  వాడన్నాడు ‘నువ్వు బ్రతికి ఉంటే కదమ్మా మమ్మల్ని చూసేదీ!  వెళ్ళిపోమ్మా ఇక్కడినుంచి, వాళ్ళు నిన్ను హత్య చేస్తారు, చంపేస్తారమ్మా నిన్నూ, – ప్లీజ్, ఇక్కడినుంచి వెళ్ళిపో ……..’ వాడు ఏడుస్తూ అంటూనే ఉన్నాడు.  నా కన్నీళ్ళను నేను కళ్ళలోనే ఇంకించుకుంటున్నాను. చివరికి నేను నిర్ణయించుకున్నాను ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని. ఆ నిర్ణయం తీసుకున్న కఠినమైన క్షణాలను నేను ఎన్నటికీ మరిచిపోలేను.  నా పెద్దకొడుకు, నిద్రపోతున్న నా చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళి ‘నానీ ! లేవరా ! అమ్మ వెళ్ళిపోతున్నది. మళ్ళీ మనల్ని కలుస్తుందో లేదో, లేవరా!’ అని లేపుతున్నాడు. వాడు కళ్ళు నులుముకుంటూ లేచాడు.  నన్ను చాలా రోజుల తరువాత చూస్తున్నాడు వాడు. ఒకడుగు ముందుకు వేసి ఏడుస్తూ నన్ను అల్లుకు పోయాడు. నేను మనసులోనే రోదిస్తున్నాను.  బహుశా, పిల్లలకు అన్ని విషయాలూ ముందుగానే తెలుసులా ఉంది.  వాడు నన్ను ఒక్కటే మాట అడిగాడు ‘అమ్మా! వెళ్ళిపోతున్నావా నువ్వూ?’  కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా ‘అవును’ అన్నట్లుగా తలాడించాను ‘మనం తప్పకుండా మళ్ళీ కలుస్తాంరా నానీ’ అంటూ.  నేను మోకాళ్ళపై కూర్చుని, పిల్లలిద్దర్నీ హత్తుకుని తనివితీరా ఏడుస్తున్నాను. ఒకవైపు పిల్లలపై ప్రేమ, వారిని విడిచి వెళ్ళిపోతున్నాని బాధ, మరోవైపు దానిని అధిగమిస్తూ ఇస్లాం పట్ల ప్రేమ.  ఆ చలిచీకటి రాత్రిలో, నేను వెళ్ళిపోతూఉంటే, నా ఇద్దరు కొడుకులూ వీడ్కోలు చెబుతున్నట్లుగా నన్నే చూస్తూ నిలబడ్డారు.  వాళ్ళపై, లోనుంచి పెల్లుబికి వస్తున్న మమతానురాగాలనూ, ప్రేమనూ అతి కష్టంగా అదుపు చేసుకుంటూ వెళ్తున్నాన్నేను. నా వంటిపై గాయాలు పచ్చిగా ఉన్నాయి.  నడవడం కూడా రావడం లేదు.  గేటు దగ్గర నిలబడి పిల్లలిద్దరూ కన్నీళ్ళతో చేతులూపుతున్నారు.  ఆ దృశ్యాన్నీ, ఆ క్షణాలనూ నేను ఎన్నటికీ మరిచిపోలేను. ఆ క్షణాలు నాకెప్పుడు గుర్తుకు వచ్చినా, ముస్లిములు ఇస్లాం కొరకు, తమ కుటుంబాలనూ, భార్యాపిల్లలనూ, తమ సొంత ఊళ్ళనూ వదిలి వలస వెళ్ళిన సంఘటనలను గుర్తు చేసుకునేదానిని.

ప్రశ్న: అప్పుడు మరి ఎక్కడికి వెళ్ళారు మీరు? ఇస్లాం ఎక్కడ స్వీకరించారు?

జవాబు: ఇంటినుంచి తిన్నగా పోలిస్ స్టేషన్ కు వెళ్ళాను. పెద్ద చిక్కు ఏమిటంటే, అక్కడెవరికీ, నేను మాట్లాడే భాష ఏమిటో తెలియదు.  అందులో కొద్దిగా ఇంగ్లీషు అర్థం చేసుకోగలిగే ఒకతను ఉన్నాడు.  నేనున్న ఆందోళణకర స్థితిలో శ్వాస తీసుకోవటానికి కూడా కష్టంగా ఉంది నాకు.  నన్ను కొద్ది సేపు విశ్రాంతి తీసుకోనివ్వమని అతడ్ని రిక్వెస్ట్ చేసి, ఆ ప్రక్కన కూర్చుండి పోయాను.  కొద్దిగా కుదుటపడిన తరువాత, అతనికి చెప్పాను ‘నేను ఇల్లు విడిచి వచ్చేసాననీ, నేను ఇస్లాం స్వీకరించాలనీ’. నేను కంగారు-కంగారుగా అన్ని విషయాలూ అతనికి చెప్పేసాను.  అతడు నన్ను ఓదార్చాడు. తను కూడా ముస్లిమేననీ, తనకు చేతనైనంత సహాయం తప్పనిసరిగా చేస్తాననీ అన్నాడు. అతడు నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళి, తన ఇంట్లో అందరికీ పరిచయం చేసాడు.  ఆ రాత్రికి నాకు వాళ్ళ ఇంట్లోనే ఆసరా కల్పించాడు.  ప్రొద్దున్నే నా భర్త పోలీస్ స్టేషన్ కు వచ్చి, తన భార్య కిడ్నాప్ కు గురైందనీ, పోలీసుల సహాయం కోసం వచ్చినట్లుగా చెప్పాడు.  కానీ వాళ్ళు,  నేను కిడ్నాప్ కు గురి కాలేదనీ, నా అంతట నేనే అక్కడికి వచ్చాననీ అతడికి తెలియజేసారు.  నేను ఇస్లాం స్వీకరించలని కోరుకుంటున్నందున, అతడికి (ముస్లిం కానందున) నాపై ఎటువంటి అధికారం లేదనీ, నాతో ఎటువంటి సంబంధమూ లేదనీ కూడా తెలియజేసారు.  కానీ అతడు మొండిగా నేను తనతో రావల్సిందేనని పట్టుబట్టి, బెదిరించడం ప్రారంభించాడు.  నేను అతడితో వెళ్ళడానికి నిరాకరించాను.  ‘కావాలంటే, నా నగలు, బాంకులో ఉన్న డబ్బూ, ఆస్తీ మొత్తం తీసుకో’ అని, అతడితో వెళ్ళనని తెగేసి చెప్పాను.  అయినా మొదట్లో అతడు ఆశ వదులుకోలేదు.  కానీ తరువాత, ఆశలు వదులుకుని, ఆస్తికి సంబంధించి, నాతో ఒక వ్రాత ఒప్పందం మీద సంతకాలు తీసుకుని వెళ్ళిపోయాడు.

ఆ పోలీసు ‘ఇప్పుడు నీకు ఏ ప్రమదమూ లేదు, నీ వాళ్ళెవరూ నిన్నేమీ చేయలేరు.  నీవు నిర్భయంగా ఇస్లాం స్వీకరించవచ్చు’ అని అన్నాడు. తరువాత  చికిత్స కొరకు కొద్ది రోజుల పాటు నేను హాస్పిటల్ లోనే ఉండి పోవలసి వచ్చింది.  ఒకసారి ఒక డాక్టర్ అడిగాడు ‘ఎక్కడి నుంచి వచ్చావమ్మా నువ్వు? ఇన్ని రోజులైంది, నిన్ను చూడ్డానికి ఒక్కరైనా రాలేదే’ అని.  నేను మౌనంగా ఉండిపోయాను.  ఒకేఒక్క విషయాన్ని అణ్వేశిస్తూ నేను ఇంటిని విదిలేసాను.  ఇప్పుడు నాకు ఇల్లూ లేదూ, ఒక కుటుంబమూ లేదు. నాకు ఉన్న ఒకేఒక బంధం ‘ఇస్లాం’.  ఇంటిని విడిచి బయటకు అడుగు వేసిన మొదటి దశలోనే నన్ను ఆదుకుంది, ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నది .  ఆ ముస్లిమ్ పోలీసతను నన్ను ‘చెల్లీ’ అని పిలిచాడు. తన ఇంట్లో చోటిచ్చాడు. నాకున్న బంధుత్వాలన్నీ తెగిపోయిన, ఆ చలిచీకటి రాత్రి బంధువై నాకు ఆశ్రయం కల్పించాడు.  ఆ సహాయాన్ని నేను ఎన్నటికీ మరిచిపోలేను.

హాస్పిటల్ లో ఉండగా, ‘తరువాత ఏమిటి’ అని ఆలోచిస్తూ ఆందోళనకు గురయ్యే దానిని. మనశ్శాంతీ, రక్షణ కోసం ఎక్కడికెళ్ళాలీ?  హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ అయిన తరువాత నేరుగా ఇస్లామిక్ సెంటర్ కు వెళ్ళాను.  అప్పుడక్కడ ఎవరూ లేరు, వయసు మీరిన ఒకాయన తప్ప, బహుశా అందులోనే అతని నివాసం కూడానేమో. నేను ఆయన దగ్గరికి వెళ్ళి, నా కథంతా చెప్పాను.  ఆయన సలహా మేరకు ముస్లిం స్త్రీలు ధరించే సాంప్రదాయక దుస్తులు ధరించాను. నమాజు ఆచరించటానికి ముందు ముస్లిములు తమ ముఖమూ, చేతులూ, కాళ్ళూ, ఏవిధంగా శుభ్రపర్చుకుంటారో ఆ విధంగా నన్ను శుభ్రపరుచుకోమన్నాడు. (ఆ విధంగా శుభ్ర పరచుకోవటాన్ని ‘వుదూ’ అంటారు). ఆయన వుదూ చేసి చూపించాడు.  తరువాత ఒక గదిలోకి తీసుకెళ్ళాడు నన్ను.  అక్కడ గది గోడకు వేళ్ళాడ్తూ ఉన్న పటాన్ని చూసి అధాట్టుగా అరిచాన్నేను ‘అదే – అదే, ఆ నలుచదరపు గదినే నేను కలలో చూసింది’.  ఆయన నా వైపు చిరునవ్వుతో చూసి అన్నాడు ‘అది అల్లాహ్ గృహం. ప్రపంచం నలుమూలల నుంచీ ముస్లిములు ఉమ్రా, హజ్జ్ ఆచరించటానికి అక్కడికి వస్తూ ఉంటారు. దానిని ‘బైతుల్లాహ్’ అంటారు.’ అది విని, ఆశ్చర్యంతో ‘అల్లాహ్ ఆ గదిలో ఉంటాడా?’ అని అడిగాను ఆయన నా అన్ని ప్రశ్నలకూ ఎంతో వాత్సల్యంగా, ఓర్పుగా సమాధానాలిస్తున్నాడు. బహుశా ఆయనకు ఇస్లాం గురించి చాలా తెలుసు. నేనూ ఆయనతో ఎటువంటి జంకూ లేకుండా మాట్లాడుతూ ఉన్నాను.  ఆయన నా భాషలోనే ఎన్నో విశయాలను విశదీకరిస్తున్నాడు. ఏదో అర్థంకాని అనిర్వచనీయమైన సంతోషాన్ని అనుభవిస్తున్నాన్నేను.  ఆయన నాతో ‘కలిమా’ చదివించాడు.  ఇస్లాం గురించీ, ముస్లిముల గురించీ ఎన్నో విషయాలు చెప్పాడు. నాకిపుడు ఏ ఆందోళనా లేదు, నా హృదయం పై ఎటువంటి భారమూ లేదు.   నాకిపుడు ఎంతో తేలికగా ఉంది. దుర్గంధపూరిత మురికి నీళ్ళల్లో నుంచి స్వచ్ఛమైన జలాలలోనికి ఈదుకు వచ్చినట్లుగా ఉంది నాకు.  ఆ ఇస్లామిక్ సెంటర్ యజమాని, నన్ను తన కూతురిగా చేసుకున్నాడు.  నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళాడు.  తరువాత ఒక ముస్లిం కుటుంబంలో నా వివాహం జరిపించాడు. అవకాశం లభించగానే, మొట్టమొదట ‘బైతుల్లాహ్’ చూడాలనీ, ఉమ్రా చేయాలనీ నా కోరిక.

ప్రశ్న: ఇస్లాం స్వీకరించిన తరువాత మీరెపుడైనా ఇండియా వెళ్ళారా?

జవాబు: లేదు, నేను ఎప్పుడూ, ఇండియా వెళ్ళనూ లేదు, ఇకముందు వెళ్ళాలనే కోరిక కూడా లేదు. అక్కడ నా కుటుంబం వారికి రాజకీయాలలో, హిందూ ధార్మిక వర్గాలలో బాగా పలుకుబడి ఉంది. నన్ను చంపటానికి బహుమతిని కూడా ప్రకటించారు వాళ్ళు. ఇప్పుడు నేనొక ముస్లింను, ఒక ముస్లిమునకు కూతురిని, నాకింకేం కావాలి? నేను ముస్లింను అయినందుకు గర్వపడుతున్నాను. ఇస్లాం వెలుగులో నేను నా శేషజీవితాన్ని గడపాలనుకుంటున్నాను.

ప్రశ్న: ఇస్లాం స్వీకరించటానికి ముందు ‘ముజాహిదీన్’ల గురించి మీ ఆలోచనలు ఏవిధంగా ఉండేవి?

జవాబు: వాళ్ళు దౌర్జన్య పరులనీ, దౌర్జన్యపు అన్ని హద్దులనూ దాటిపోయిన వారనీ మాకు నూరిపోయడం జరిగేది. వాళ్ళ పేరు వింటేనే అసహ్యించుకునేలా తయారు చేసేవారు మమ్మల్ని. కానీ మీడియా తప్పుడు ప్రచారంలోని సత్యాసత్యాలు గ్రహించి తరువాత, నేను వారిని అభిమానిస్తున్నాను.  ప్రపంచ శాంతియే లక్ష్యంగా పని చేస్తున్న వారి విజయం కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకా నేను అల్లాహ్ ను వేడుకుంటున్నాను ‘ఒకవేళ ఆయన నాకు కుమారులను ప్రసాదిస్తే, ‘ముజాహిదీన్’ ల  మొదటి వరుసలో వారిని నిలబెడతాను.  వారిని ఇస్లాం యొక్క ఔన్నత్యం కొరకు అంకితం చేస్తాను.  ఇన్షాఅల్లాహ్!

source

%d bloggers like this: