ఇస్లాం ధర్మం యొక్క మానవజాతిపై ఉన్న అనేకానేక వరాల్లో, కారుణ్యాల్లో ఒక్క గొప్ప వరం, కారుణ్యం మేజోళ్ళ (సాక్స్ లు, బూట్లు )పై మసహ్ (తుడవడం) చేయుటకు అనుమతివ్వడం. అయితే ఎవరు ఏ సందర్భంలో చేయాలో ఇందులో మీరు తెలుసుకోగలరు.
[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/BJXq]
[27 నిమిషాల వీడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
మేజోళ్ళ పై ‘మసహ్ ‘
ఇస్లాం ధర్మం యొక్క సులువైన, ఉత్తమ విషయం ఒకటి: మేజోళ్ళపై ‘మసహ్’ చేసే అనుమతివ్వడం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా ‘మసహ్’ చేసేవారని రుజువైనది.
అమ్ర్ బిన్ ఉమయ్య చెప్పారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ తలపాగ మరియు మేజోళ్ళపై ‘మసహ్’ “చేస్తున్నది నేను చూశాను. (బుఖారి 205).
ముగీరా బిన్ షాఅబ చెప్పారు: ఒక రాత్రి నేను ప్రవక్తతో ఉండగా, ఆయన ఒక చోట మజిలీ చేసి (ఓ చాటున) కాలకృత్యాలు తీర్చుకొని వచ్చారు, అప్పుడు నా వద్ద ఉన్న చెంబుతో నీళ్ళు పోశాను ఆయన వుజూ చేశారు. చివరిలో తమ మేజోళ్ళపై ‘మసహ్’ చేశారు. (బుఖారి 203, ముస్లిం 274)
వాటి పై ‘మసహ్’ చేయుటకు ఒక నిబంధన ఏమిటంటే అవి వుజూ చేసిన తర్వాత తొడిగి యుండాలి. పై భాగాన ‘మసహ్’ చేయాలి, క్రింది భాగాన కాదు.
ఇక ‘మసహ్ ‘ గడువు విషయానికి వస్తే; స్థానికులు ఒక పగలు ఒక రాత్రి, ప్రయాణికులు (ఏ ప్రయాణంలో నమాజ్ ఖస్ర్ చేయవచ్చునో ఆ ప్రయాణంలో) మూడు రేయింబవళ్ళు మేజోళ్ళపై ‘మసహ్’ చేయవచ్చును. (వుజూ చేసి తొడిగన తరువాత వుజూ భంగమయిన క్షణం నుంచీ గడువు మొదలవుతుంది).
‘మసహ్’ భంగమయ్యే కారణాలు: గడువు ముగిసిన మరుక్షణం నుంచే ‘మసహ్’ భంగమైపోతుంది. ‘మసహ్’ చేసిన తరువాత కనీసం ఒకసారైనా తీసినట్లయితే ‘మసహ్’ భంగమవుతుంది. లేదా మనిషి (స్వప్నస్ఖలనం లేదా భార్యభర్తల సంభోగం కారణంగా) అశుద్ధతకు లోనైతే ‘మసహ్’ భంగమవుతుంది. స్నానం చేయుటకై అవి తీయడం కూడా తప్పనిసరి.
[ఇది నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన “శుద్ధి & నమాజు (Tahara and Salah)” అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
ఇతరములు :