మరణాంతర జీవితం – పార్ట్ 21 & 22 [ఆడియో][43:19 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మాబాద్.. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మహాశయులారా, ఈనాటి శీర్షిక ప్రళయ దినాన త్రాసులో తూకం చేయబడేటివి ఏమిటి?
దీనికి సంబంధించిన ఖురాన్ ఆయతులు మరియు హదీసులను పరిశీలిస్తే, అందులో తూకం చేయబడేటివి మూడు విషయాలు అని మనకు తెలుస్తున్నాయి. మొదటిది, స్వయంగా మనిషిని కూడా తూకం చేయడం జరుగుతుంది. రెండవది, మనిషి యొక్క కర్మలను తూకం చేయడం జరుగుతుంది. మూడవది, మనిషి కర్మ పత్రాలు, వాటిని కూడా తూకం చేయడం జరుగుతుంది.
ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా మనకు లాభం ఏమిటి? లాభం ఏమిటంటే, ఈ మూడిటిలో ఏ ఒకటైనా గాని లేదా ఈ మూడిటిని కూడా తూకం చేయబడే సందర్భంలో, ఇంతకుముందే కొంచెం మనం తెలుసుకున్నట్లు, విశ్వాసం మరియు సత్కార్యాలు ఉన్నప్పుడే మన పల్యాలు బరువుగా ఉంటాయి. మరియు ఎవరి పల్యాలు బరువుగా ఉంటాయో వారే సాఫల్యం పొందుతారు. మరి ఎవరి పల్యాలు తేలికగా ఉంటాయో వారు నరకంలో చేరుతారు.
దీని గురించి ఆయతులు సూరె అన్ఆమ్ లో, సూరె అంబియాలో, సూరతుల్ ముఅ్‌మినూన్ లో మరియు అల్ ఖారిఆ సూరాలో ఉన్నాయి:
فَاَمَّا مَنْ ثَقُلَتْ مَوَازِيْنُهٗ فَهُوَ فِيْ عِيْشَةٍ رَّاضِيَةٍ “ఎవరి కర్మ పళ్ళాలు బరువుగా ఉంటాయో అతను తనకు నచ్చిన, మెచ్చిన జీవితం గడుపుతూ ఉంటాడు స్వర్గంలో.”
وَاَمَّا مَنْ خَفَّتْ مَوَازِيْنُهٗ فَاُمُّهٗ هَاوِيَةٌ “మరియు ఎవరి కర్మ పళ్ళాలు తేలికగా ఉంటాయో అతని స్థానం హావియా ఉంటుంది.”
وَمَآ اَدْرٰىكَ مَا هِيَهْ “ఆ హావియా అంటే ఏమి తెలుసు నీకు?”
نَارٌ حَامِيَةٌ “అది భగభగ మండే నరకాగ్ని.”
అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరినీ దాని నుండి రక్షించు గాక. ఇలాంటి విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఒక దొంగ, ఇక్కడే దగ్గర ఎక్కడో కెమెరాలు ఉన్నాయి, పోలీసు వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు అని అర్థం అవుతుందో, అతడు దొంగతనానికి మరీ ప్రయత్నం చేస్తాడా? చేయడు కదా. అలాగే ఎల్లప్పుడూ ఆ సృష్టికర్త మనల్ని చూస్తూ ఉన్నాడు, కర్మ పత్రాల్లో మనం చేసే ప్రతి పని రాయబడుతూ ఉన్నది, రేపటి రోజు వీటన్నిటినీ కూడా తూకం చేయడం జరుగుతుంది—ఇలాంటి భయం ఎంత మనకు ఎక్కువగా ఉంటుందో, ఇలాంటి విషయాలు ఎంత మనకు ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయో, అంతే మనం పాపాల నుండి దూరం ఉండి పుణ్యాలు చేయగలుగుతాము. ఈ పరలోకానికి సంబంధించిన, మరణానంతర జీవితానికి సంబంధించిన ఈ సబ్జెక్టులన్నీ కూడా ఇన్ని ఎపిసోడ్లు మీ ముందు తెలియజేయడానికి ముఖ్య కారణం కూడా ఏంటి? ఇహలోక జీవితం మనకు ఒకేసారి లభిస్తుంది. దీన్ని గనక మనం సద్వినియోగం చేసుకొని విశ్వాస మార్గం అవలంబించి సత్కార్యాలలో ఇంకా ముందుకు ఎగసిపోతూ ఉంటేనే మనకు లాభం ఉంటుంది లేదా అంటే మనం చాలా నష్టంలో పడిపోతాము.
[1 నిముషం ] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
“(తీర్పు దినం రోజు) వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయిన వాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణం “వ్యాపారం కూడా వడ్డీలాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్ద నుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, అతను గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవాధీనం. ఇకమీదట కూడా దీనికి పాల్పడినవారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు.” [అల్ బఖర – 2 : 275 ]
“అల్లాహ్ వడ్డీని హరింపజేస్తాడు. దానధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లాహ్ సుతరామూ ప్రేమించడు.విశ్వసించి (సున్నత్ ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్ ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు. ఓ విశ్వసించినవారలారా! అల్లాహ్ కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలిఉన్న వడ్డీని విడిచి పెట్టండి. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంకండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరు ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరగకూడదు. ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదిలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీకొరకు శ్రేయోదాయకం.” [అల్ బఖర – 2 : 276 – 280 ]
“వడ్డీ తినేవారిని, తినిపించే వారినీ, ఆ వ్యవహారాలు వ్రాసేవారినీ, అందులో సాక్ష్యం పలికేవారందరినీ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శపించారు. ఆ పాపంలో వీరందరూ సమానమే” అని చెప్పారు. (ముస్లిం 1598).
“వడ్డీలో 73 స్థాయిలున్నాయి. వాటిలో అత్యంత హీనమైన స్థాయి (దశ) యొక్క పాపం; ఒక వ్యక్తి తన కన్న తల్లిని పెళ్ళాడటం వంటిది. వడ్డీ యొక్క అత్యంత తీవ్రస్థాయి పాపం ఒక ముస్లిం పరువు ప్రతిష్టలను మంటగలపటం”. (ముస్తద్రక్ హాకిం: 2/37, సహీహుల్ జామి: 3533. ).
“బుద్ధిపూర్వకంగా ఒక దిర్హం వడ్డీ తినడం 36 సార్లకంటే ఎక్కువ వ్యభిచారం చేసినదానితో సమానం”. (అహ్మద్: 5/225, సహీహుల్ జామి:3375).
“వడ్డీ ద్వారా ఎంత ధనం వచ్చినా దాని అంతం అల్పంతోనే అవుతుంది”. (అహ్మద్: 2/37, సహీహుల్ జామి: 3542.)
You must be logged in to post a comment.