మాలికి యౌమిద్దీన్ (ప్రతిఫల దినానికి యజమాని) – అర్థ భావాలు & తఫ్సీర్ [వీడియో] https://youtu.be/KeeL4HZ0aVE [7 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మనిషి ప్రపంచంలోనూ తాను చేసిన కర్మలకు ప్రతిఫలం కొంతవరకు అనుభవించినప్పటికీ పరలోకంలోనే అసలు సిసలు ఫలితం బయటపడుతుంది. సంపూర్ణమైన ప్రతిఫలం అక్కడే ఉనికిలోనికి వస్తుంది. ప్రతి వ్యక్తికీ అతను చేసిన మంచి లేక చెడు పనులను బట్టి అల్లాహ్ అతనికి బహుమానం ఇవ్వటమో, శిక్ష విధించటమో జరిగి తీరుతుంది. ఇదే విధంగా ప్రపంచంలో కూడా తాత్కాలికంగా అనేకమందికి కొన్ని అధికారాలుంటాయి. కాని పరలోకంలో మాత్రం అధికారాలన్నీ అల్లాహ్ హస్తగతం అవుతాయి. తీర్పుదినాన ఆయన తిరుగులేని సార్వభౌమాధికారిగా ఉంటాడు. “ఈరోజువిశ్వసామ్రాజ్యాధికారంఎవరిదోచెప్పండి?” అంటూ ఆనాడాయన ప్రశ్నిస్తాడు. “తిరుగులేనివాడు, ఏకైకుడైనఅల్లాహ్దే” అంటూ ఆయనే సమాధానం కూడా ఇస్తాడు (అల్ మోమిన్ – 16) “ఆనాడు, ఏ మనిషీ ఎవరికొరకైనా ఏదన్నా చెయ్యగలగటమన్నది అసంభవం, ఆ రోజు అధికారమంతా అల్లాహ్ చేతుల్లోనే ఉంటుంది.” (ఇన్ ఫితార్ – 19) – అదీ తీర్పుదినమంటే!
సహీ జిక్ర్, దుఆలు తెలుగులో – Authentic Islamic Dhikr & Dua in Telugu: https://telugudua.net/
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
109:2 لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ లా అఅబుదు మా తఅబుదూన్ మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించటం లేదు.
109:3 وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ వలా అన్తుం ఆబిదూన మాఅఅబుద్ నేను ఆరాధిస్తున్న వానిని మీరు ఆరాధించరు.
109:4 وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدتُّمْ వలా అన ఆబిదుమ్మా అబత్తుం మీరు ఆరాధించే వాటిని నేను అరాధించబోను.
109:5 وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ వలా అన్ తుం ఆబిదూన మా అఅబుద్ మరి నేను ఆరాధించేవానిని మీరెలాగూ ఆరాధించరు.
109:6 لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ లకుం దీనుకుమ్ వ లి యదీన్ మీ ధర్మం మీది, నా ధర్మం నాది.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మిగతా క్లాసులు వీడియో ఒక్కక్కటిగా రోజూ జత చేస్తాము, ఇన్ షా అల్లాహ్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
కనుక, “ఈ ఆవు (మాంసపు) ముక్క నొకదాన్ని హతుని దేహానికేసి కొట్టండి (అతడు లేచి నిలబడతాడు)” అని మేము అన్నాము. ఈ విధంగా అల్లాహ్ మృతులను బ్రతికించి తన నిదర్శనాలను చూపుతున్నాడు – మీరు ఇకనయినా బుద్ధిగా మసలుకోవాలని!
కాని ఆ తరువాత మీ హృదయాలు కఠినమైపోయాయి. రాళ్ళ మాదిరిగా, కాదు – వాటికంటే కూడా కఠినం అయిపోయాయి. కొన్ని రాళ్ళల్లోనుంచైతే సెలయేళ్ళు ప్రవహిస్తాయి. మరి కొన్ని రాళ్ళు పగలగా వాటి నుంచి నీరు చిమ్ముతుంది. మరికొన్ని అల్లాహ్ భయంతో (కంపించి) క్రిందపడి పోతాయి. మీ కార్యకలాపాల పట్ల అల్లాహ్ పరధ్యానంలో ఉన్నాడని అనుకోకండి.
(ముస్లిములారా!) వారు మీ మాటను నమ్ముతారనే (ఇప్పటికీ) మీరు ఆశపడ్తున్నారా? వాస్తవానికి వారిలో, అల్లాహ్ వాక్కును విని, అర్థం చేసుకుని కూడా ఉద్దేశపూర్వకంగా దాన్ని మార్చి వేసేవారు ఉన్నారు.
వారు విశ్వాసులను కలుసుకున్నప్పుడు తమ విశ్వాసాన్ని వెల్లడిస్తారు. తమ వర్గానికి చెందినవారిని ఏకాంతంలో కలుసుకున్నప్పుడు, “అల్లాహ్ మీకు తెలియజేసిన విషయాలను మీరు వీరికి ఎందుకు చేరవేస్తున్నారు? తద్వారా మీ ప్రభువు సమక్షంలో వారు మీపై వాదనకు బలం పొందగలరనే సంగతిని విస్మరించారా ఏమి?” అని అంటారు.
తమ స్వహస్తాలతో లిఖించిన గ్రంథాన్ని దైవగ్రంథమని చెప్పి, ప్రాపంచిక తుచ్ఛ ప్రయోజనాన్ని పొందజూసే వారికి ‘వినాశం’ కలదు. వారి ఈ స్వహస్త లిఖిత రచన కూడా వారి వినాశానికి దారితీస్తుంది. వారి ఈ సంపాదన కూడా వారి నాశనానికి కారణ భూతం అవుతుంది.
పైగా, “మేము నరకాగ్నిలో కొన్ని రోజులు మాత్రమే ఉంటాము” అని వారంటున్నారు. వారిని అడుగు: మీరు ఆ మేరకు అల్లాహ్ నుండి పొందిన వాగ్దానం ఏదన్నా మీ వద్ద ఉందా? ఒకవేళ ఉంటే అల్లాహ్ ముమ్మాటికీ తన వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించడు. (అసలు అలా జరగనే లేదు) అసలు మీరు మీకు తెలియని విషయాలను అల్లాహ్‌కు ఆపాదిస్తున్నారు.
మేము ఇస్రాయీల్ వంశస్థుల నుండి వాగ్దానం తీసుకున్నాము (దాన్ని గుర్తుకు తెచ్చుకోండి) : “అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా మెలగాలి. అలాగే బంధువులను, అనాధలను, అగత్యపరులను (ఆదరించాలి). ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి. నమాజును నెలకొల్పుతూ ఉండాలి, జకాత్ ఇస్తూ ఉండాలి.” అయితే మీలో కొద్దిమంది తప్ప అందరూ మాట తప్పారు, ముఖం తిప్పుకున్నారు.
పరస్పరం రక్తం చిందించరాదనీ (చంపుకోరాదని), తోటి వారిని వారి నివాసస్థలాల నుంచి బహిష్కరించరాదనీ మీనుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, దానికి మీరు అంగీకరించారు. ఆ విషయానికి స్వయంగా మీరే సాక్షులు.
కాని మీరు పరస్పరం చంపుకున్నారు. మీలోని ఒక వర్గం వారిని ఇండ్ల నుంచి బహిష్కరించటం కూడా చేశారు. పాపానికి, దౌర్జన్యానికి పాల్పడుతూ మీరు వారికి వ్యతిరేకంగా-ఇతరులను సమర్థించారు. మరి వారు బందీలుగా పట్టుబడి మీ వద్దకు వచ్చినప్పుడు మీరు వారికోసం నష్టపరిహారం ఇచ్చిన మాట వాస్తవమే. కాని మీరు వారిని వెళ్ళగొట్టడమే అధర్మం (అప్పుడు మీరు దాన్ని అస్సలు లెక్కచేయలేదు). ఏమిటీ? మీరు కొన్ని ఆజ్ఞలను విశ్వసించి, మరికొన్నింటిని తిరస్కరిస్తున్నారా? మీలో ఇలా చేసేవారికి ప్రపంచ జీవితంలో అవమానం తప్ప ఇంకేం ప్రతిఫలం ఉంటుంది? ఇక ప్రళయ దినాన వారు మరింత కఠినమైన శిక్ష వైపు మరలించబడతారు. అల్లాహ్‌కు మీ చేష్టలు తెలియకుండా లేవు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
విశ్వసించిన వారైనా, యూదులైనా, నసారాలయినా, సాబియనులయినా – ఎవరయినాసరే – అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని విశ్వసించి సదాచరణ చేస్తే వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉం(టుం)ది. వారికెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.
తూరు పర్వతాన్ని మీ పైకి ఎత్తి మేము మీ చేత చేయించిన ప్రమాణాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు, “మేము మీకు ప్రసాదించిన దానిని (గ్రంథాన్ని) గట్టిగా పట్టుకోండి. అందులో వున్న వాటిని బాగా జ్ఞాపకం చేసుకోండి, దీని ద్వారానే మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది” (అని ఉపదేశించాము.)
శనివారం విషయంలో ఆజ్ఞోల్లంఘనకు పాల్పడిన మీ వారి గురించి కూడా మీకు బాగా తెలుసు. “అత్యంత అసహ్యకరమైన, ఛీత్కరించబడిన కోతులుగా మారిపోండి” అని మేము వాళ్ళను శపించాము.
మూసా తన జాతివారితో, “అల్లాహ్ మిమ్మల్ని ఒక ఆవును ‘జిబహ్’ చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాడు” అని అన్నప్పుడు, “ఏమిటీ, మాతో వేళాకోళం చేస్తున్నావా?” అని వారు ప్రశ్నించారు. దానికి అతను, “నేనలాంటి మూర్ఖుల్లో ఒకణ్ణి కాకుండా ఉండేందుకు అల్లాహ్ శరణు వేడుతున్నాను” అని జవాబిచ్చాడు.
అప్పుడు వారు, “అయితే అది ఎటువంటిది అయిఉండాలో మాకు వివరించవలసిందిగా నీ ప్రభువును అర్థించు” అని అన్నారు. దానికి అతను, “అది మరీ ముసలిదై ఉండకూడదు, మరీ లేగదూడగా కూడా ఉండరాదు. పైగా అది మధ్యవయస్సులో వున్న ఆవు అయి ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. (సరేనా!) ఇక ఆజ్ఞాపించబడిన విధంగా చెయ్యండి” అని చెప్పాడు.
“అది ఏ రంగుదై ఉండాలో మాకు వివరించమని నీ ప్రభువును ప్రార్థించు” అని మళ్ళీ అడిగారు. “అది పసుపు వర్ణంగలదై, నిగనిగలాడుతూ, చూసేవారికి ఆకర్షణీయంగా కనిపించేలా ఉండాలన్నది అల్లాహ్ ఆజ్ఞ” అని మూసా సమాధానమిచ్చాడు.
అప్పుడు వారు, “అది ఎలాంటిదై ఉండాలో మాకు (ఇంకా బాగా) వివరించమని నీ ప్రభువును ప్రార్థించు. మాకు ఆవు సంగతి ఇంకా ప్రస్ఫుటం కాలేదు. అల్లాహ్ గనక తలిస్తే మేము మార్గదర్శకత్వం పొందుతాము” అని అన్నారు.
దానికి అతను, “ఆ ఆవు పనిచేసేదీ, దుక్కి దున్నేదీ, సేద్యపు పనిలో ఉపయోగపడేదీ అయి ఉండకూడదు. ఇంకా అది ఆరోగ్యవంతమైనదై, ఎటువంటి మచ్చలూ లేకుండా ఉండాలి అన్నది అల్లాహ్ ఆజ్ఞ” అని చెప్పాడు. దానికి వారు “నువ్వు ఇప్పుడు సరిగ్గా చెప్పావు. (మాకిప్పుడు అర్థం అయింది)” అన్నారు. అసలు వారు ఆదేశపాలనకు ఏమాత్రం సుముఖంగా లేరు. ఎట్టకేలకు (మాట విని) ఆవును జిబహ్ చేశారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఓ ఇస్రాయీలు (యాఖూబు) సంతతి వారలారా! నేను మీపై కురిపించిన అనుగ్రహాన్నీ, (నాటి) సమస్త లోకవాసులపై మీకు ఇచ్చిన ప్రాధాన్యతను గురించి (కాస్త) నెమరు వేసుకోండి.
(ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి) ఫిరౌను మనుషుల బారి నుండి మేము మీకు విముక్తి నొసగాము. వారు మిమ్మల్ని దారుణంగా వేధించేవారు. మీ కొడుకులను చంపివేసి, కూతుళ్ళను మాత్రం విడిచి పెట్టేవాళ్ళు. ఈ విముక్తి నొసగటంలో మీ ప్రభువు తరఫునుండి మీకు గొప్ప పరీక్ష ఉండినది.
(జ్ఞాపకం చేసుకోండి) మేము మూసా (అలైహిస్సలాం)కు నలభై రాత్రుల వాగ్దానం చేసి (అతన్ని పిలిచి) నప్పుడు, అతను వెళ్ళిన తరువాత మీరు ఆవు దూడను పూజించటం మొదలెట్టారు. ఆ విధంగా మీరు దుర్మార్గానికి పాల్పడ్డారు.
(గుర్తు చేయి) మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: “ఓ నా జాతివారలారా! ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకుని మీరు మీ స్వయానికి అన్యాయం చేసుకున్నారు. కనుక ఇప్పుడు మీరు పశ్చాత్తాప భావంతో మీ సృష్టికర్త వైపుకు మరలండి. (ఈ ఘోర కృత్యానికి పాల్పడిన) మీలోని వారిని చంపండి. మీ సృష్టికర్త వద్ద ఇదే మీ కొరకు మేలైనది.” మరి ఆయన మీ పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. నిస్సందేహంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కనికరించేవాడు.
మీరు మూసాతో అన్న మాటలను గుర్తుకు తెచ్చుకోండి : “ఓ మూసా! మేము అల్లాహ్‌ను కళ్ళారా చూడనంతవరకూ నిన్ను విశ్వసించము.” (మీ ఈ పెడసరి ధోరణికి శిక్షగా) మీరు చూస్తుండగానే (మీపై) పిడుగు పడింది.
మేము మీపై మేఘాల ఛాయను కల్పించాము. మీపై మన్న్, సల్వాలను (ఆహారంగా) దించాము. “మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన వస్తువులను తినండి” (అని చెప్పాము. కాని, వారు ఆ అనుగ్రహాలు అనుభవించి కృతజ్ఞులయ్యే బదులు కృతఘ్నత చూపటం మొదలుపెట్టారు). వారు మాకెలాంటి అన్యాయం చేయలేదు, కాకపోతే వారు తమకు తామే అన్యాయం చేసుకుంటూ పోయారు.
(ఇంకా ఆ విషయాన్ని కూడా నెమరు వేసుకోండి). “ఈ పురములో ప్రవేశించండి. అక్కడ మీకు ఇష్టమైన చోట, కోరుకున్న విధంగా తృప్తిగా తినండి. కాని నగర ముఖద్వారం గుండా పోతున్నప్పుడు ‘సజ్దా’ చేస్తూ మరీ పోవాలి. పోతున్నప్పుడు ‘హిత్తతున్’అని నోటితో పలుకుతూ ముందుకు సాగాలి. అప్పుడు మేము మీ తప్పులను మన్నిస్తాము, సదాచార సంపన్నులకు మరింతగా అనుగ్రహిస్తాము” అని మేము మీతో అన్నాము.
కాని దుర్మార్గులు వారితో అనబడిన ఈ మాటను మార్చి వేశారు. అందుచేత మేము కూడా ఆ దుర్మార్గులపై వారి (దుర్మార్గం), ధిక్కార వైఖరికి శాస్తిగా ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేశాము.
మూసా (అలైహిస్సలాం) తన జాతి ప్రజల కోసం నీటిని అడిగినప్పుడు, “నీ చేతి కర్రతో ఆ (కొండ) రాతిపై కొట్టు” అని మేమన్నాము. (అలా కొట్టగా) దాన్నుండి పన్నెండు ఊటలు పెల్లుబికాయి. వారిలోని ప్రతి తెగవారూ తమ తమ నీటి స్థలాన్ని తెలుసుకున్నారు. (అప్పుడు మేము వారికి ఈ విధంగా ఆదేశించాము:) “అల్లాహ్ (మీకు ప్రసాదించిన) ఉపాధిని తినండి, త్రాగండి. భువిలో అలజడిని రేపుతూ తిరగకండి.”
(జ్ఞాపకం చేసుకోండి,) “ఓ మూసా! ఒకే రకమైన తిండిని మేము అస్సలు సహించము. అందుకే భూమిలో పండే ఆకుకూరలు, దోసకాయలు, గోధుమలు, పప్పుదినుసులు, ఉల్లిపాయలు ప్రసాదించవలసినదిగా నీ ప్రభువును ప్రార్థించు” అని మీరు డిమాండు చేసినప్పుడు అతనిలా అన్నాడు: “మీరు శ్రేష్ఠమైన వస్తువుకు బదులుగా అధమమైన దానిని కోరుకుంటున్నారెందుకు? (సరే!) ఏదయినా పట్టణానికి వెళ్ళండి. అక్కడ మీరు కోరుకున్నవన్నీ మీకు లభిస్తాయి.” దాంతో వారిపై పరాభవం, దారిద్య్రం రుద్దబడింది. వారు దైవాగ్రహానికి గురై తరలిపోయారు. వారి ఈ దురవస్థకు కారణమేమిటంటే వారు అల్లాహ్ ఆయతుల పట్ల తిరస్కార వైఖరిని అవలంబించేవారు, అన్యాయంగా ప్రవక్తలను చంపేవారు. ఇది వారి అవిధేయతకు, బరితెగించిన పోకడకు పర్యవసానం మాత్రమే!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“నేను భువిలో ప్రతినిధిని చేయబోతున్నాను” అని నీ ప్రభువు తన దూతలతో అన్నప్పుడు, “భూమిలో కల్లోలాన్ని రేకెత్తించి, రక్తం ప్రవహింపజేసేవాణ్ణి ఎందుకు సృష్టిస్తావు (ప్రభూ)? నిన్ను స్తుతించటానికి, ప్రశంసించటానికి, నీ పవిత్రతను కొనియాడటానికి మేమున్నాము కదా!” అని వారన్నారు. దానికి అల్లాహ్, “నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు” అని అన్నాడు.
వారంతా ఇలా అన్నారు : “(ఓ అల్లాహ్!) నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవూ నీవే!”
అప్పుడు అల్లాహ్, “ఓ ఆదం! వీటి పేర్లేమిటో నువ్వు తెలుపు” అన్నాడు. ఆయన వాటి పేర్లన్నీ చెప్పేయగానే అల్లాహ్ ఇలా ప్రకటించాడు: “భూమ్యాకాశాలలో గోప్యంగా వున్నవన్నీ నాకు తెలుసనీ, మీరు బహిర్గతం చేసేవీ, దాచి పెట్టేవీ అన్నీ నాకు తెలుసని (ముందే) నేను మీకు చెప్పలేదా?”
“మీరందరూ ఆదం ముందు సాష్టాంగపడండి” అని మేము దూతలను ఆజ్ఞాపించినపుడు ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం తిరస్కరించాడు. అహంకారి అయి, అవిధేయులలో చేరిపోయాడు.
(తరువాత) మేము, “ఓ ఆదం! నువ్వూ, నీ భార్య – ఇద్దరూ- స్వర్గంలో ఉండండి, మీరు ఇష్టపడిన చోటు నుంచి స్వేచ్ఛగా తినండి, త్రాగండి. కాని ఈ వృక్షం దరిదాపులకు కూడా పోవద్దు. లేదంటే దుర్మార్గులలో చేరిపోతారు” అని చెప్పాము.
కాని షైతాన్ వారిని పెడత్రోవ పట్టించి, అక్కడి నుంచి బయటికి తీసివేయించాడు. మేము వారిని ఇలా ఆదేశించాము: “దిగిపోండి. మీరు ఒండొకరికి శత్రువులు. ఒక నిర్ణీత కాలం వరకు భూమిపైనే ఉండి మీరు లబ్ది పొందవలసి ఉంది.”
అప్పుడు ఆదం (అలైహిస్సలాం) తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకుని (పశ్చాత్తాపం చెందారు.) అల్లాహ్ ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. నిశ్చయంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడాను.
ఓ ఇస్రాయీలు వంశస్థులారా! నేను మీకు అనుగ్రహించిన భాగ్యాన్ని గురించి కాస్త జ్ఞాపకం చేసుకోండి. మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి, నేను మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను. మీరు నాకు మాత్రమే భయపడండి.
మీ వద్దనున్న గ్రంథాలకు ధృవీకరణగా నేను అవతరింపజేసిన ఈ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను) విశ్వసించండి. దీని పట్ల అందరికంటే ముందు మీరే తిరస్కారులు కాకండి. ఇంకా నా ఆయతులను కొద్దిపాటి ధరకు అమ్ముకోకండి. నాకు మాత్రమే భయపడండి.
ప్రజలకైతే మీరు మంచిని గురించి ఆదేశిస్తారు, కాని మీ స్వయాన్ని మరచిపోతారే?! చూడబోతే మీరు గ్రంథపారాయణం చేస్తారాయె. మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా?
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మేము నీ వైపుకు (అంటే ప్రవక్త వైపుకు) అవతరింపజేసిన దానినీ, నీకు పూర్వం అవతరింపజేసిన వాటినీ వారు విశ్వసి స్తారు. పరలోకం పట్ల కూడా వారు దృఢనమ్మకం కలిగిఉంటారు.
“ఇతరులు (అంటే ప్రవక్త ప్రియ సహచరులు) విశ్వసించినట్లే మీరూ విశ్వసించండి” అని వారితో చెప్పినప్పుడు, “మూర్ఖ జనులు విశ్వసించినట్లుగా మేము విశ్వసించాలా?” అని వారు (ఎదురు) ప్రశ్న వేస్తారు. తస్మాత్! ముమ్మాటికీ వీరే మూర్ఖులు. కాని ఆ సంగతి వీరికి తెలియటం లేదు.
విశ్వాసులను కలుసుకున్నప్పుడు వారు,”మేమూ విశ్వసించిన వారమే” అని అంటారు. కాని తమ షైతానుల (అంటే తమ పెద్దల లేక సర్దారుల) వద్దకు పోయినప్పుడు, “మేము మీతోనే ఉన్నామండీ. కాకపోతే వాళ్ళతో పరిహాసమాడుతున్నామంతే” అని పలుకుతారు.
వారి ఉపమానం నిప్పు రాజేసిన వ్యక్తి లాంటిది. నిప్పు రాజేసినంతనే పరిసరాల్లోని వస్తువులన్నీ వెలుగులోనికి వచ్చాయి. అంతలోనే అల్లాహ్ వారి వెలుగును హరించి, వారిని కారు చీకట్లలో, ఏమీ కానరాని స్థితిలో వదిలేశాడు.
2:18 صُمٌّ بُكْمٌ عُمْيٌ فَهُمْ لَا يَرْجِعُونَ
వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. ఇక వారు (సరైన దారికి) మరలిరారు.
లేదా (వారి ఉపమానం) ఆకాశం నుంచి కురిసే భారీ వర్షం మాదిరిగా ఉంది – అందులోనూ చిమ్మచీకట్లు, ఉరుములు, మెరుపులు! ఉరుముల గర్జన విని, మృత్యు భయంతో వారు తమ వ్రేళ్ళను తమ చెవులలో దూర్చుకుంటారు. అల్లాహ్ ఈ అవిశ్వాసులను అన్ని వైపుల నుంచీ ముట్టడిస్తాడు.
మెరుపులు వారి దృష్టిని ఎగరవేసుకుపోతాయా! అన్నట్టుంది వారి పరిస్థితి. అవి (మెరుపు తీగలు) వెలుగును విరజిమ్మినపుడల్లా వారు అందులో కొంతదూరం నడుస్తారు. తర్వాత వారిపై చీకటి ఆవరించగానే నిలబడిపోతారు. అల్లాహ్‌యే గనక తలచుకుంటే వారి వినేశక్తినీ, కంటిచూపునూ పోగొట్టేవాడే, నిశ్చయంగా అల్లాహ్ అన్నింటిపై అధికారం గలవాడు.
ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి.
మేము మా దాసునిపై అవతరింపజేసిన దాని విషయంలో ఒకవేళ మీకేదన్నా అనుమానముంటే, అటువంటిదే ఒక్క సూరానైనా (రచించి) తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే (ఈ పని కోసం) అల్లాహ్‌ను తప్ప మీ సహాయకులందరినీ పిలుచుకోండి.
ఒకవేళ మీరు గనక ఈ పని చెయ్యకపోతే- ఎన్నటికీ అది మీ వల్ల కాని పనే- (దీన్ని సత్యమని ఒప్పుకుని) మానవులు,రాళ్ళు ఇంధనం కాగల ఆ అగ్ని నుండి (మిమ్మల్ని మీరు) కాపాడుకోండి. అది సత్య తిరస్కారుల కోసం తయారు చేయబడింది.
విశ్వసించి, సత్కార్యాలు చేసే వారికి క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ)వనాల శుభవార్తలను అందజెయ్యి. తినడానికి అక్కడి పండ్లు వారికి ఇవ్వబడినప్పుడల్లా, “ఇలాంటి పండ్లే ఇంతకు మునుపు మాకు ఇవ్వబడినవి” అని వారంటారు. నిజానికి పరస్పరం పోలి వుండే ఫలాలు వారికి ప్రసాదించబడతాయి. వారి కొరకు పరిశుద్ధులైన భార్యలుంటారు. వారు ఈ స్వర్గవనాలలో కలకాలం ఉంటారు.
నిశ్చయంగా అల్లాహ్ దేనినీ ఉపమానంగా చెప్పటానికి సిగ్గుపడడు- (కడకు) దోమ అయినాసరే, దానికన్నా అల్పమైన వస్తువు అయినాసరే! విశ్వసించినవారు మాత్రం దీన్ని తమ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సత్యమని భావిస్తారు. కాని అవిశ్వాసులు, “ఈ ఉపమానం ద్వారా ఇంతకీ అల్లాహ్ ఏం చెప్పదలచుకుంటున్నాడు?” అని అంటారు. ఈ విధంగా ఆయన దీని ద్వారానే ఎంతో మందిని అపమార్గం పట్టిస్తాడు, మరెంతో మందిని సన్మార్గంపైకి తీసుకువస్తాడు. అయితే దీని ద్వారా ఆయన అపమార్గానికి లోను చేసేది అవిధేయులను మాత్రమే.
వీరు ఎలాంటి వారంటే అల్లాహ్‌తో చేసిన దృఢమైన ప్రమాణాన్ని భంగపరుస్తారు. అల్లాహ్ కలిపి ఉంచమని చెప్పిన వాటిని త్రెంచివేస్తారు. భువిలో చెడుగును వ్యాపింపజేస్తారు. వీరే అసలు నష్టాన్ని పొందేవారు.
మీరు అల్లాహ్ యెడల తిరస్కార వైఖరికి ఎలా ఒడిగట్టగలరు? చూడబోతే నిర్జీవులుగా ఉన్న మీకు ఆయనే ప్రాణం పోశాడు. మరి మీ ప్రాణం తీసేవాడూ, తిరిగి మిమ్మల్ని బ్రతికించేవాడు కూడా ఆయనే. ఆ తరువాత మీరు ఆయన వైపుకే మరలించబడతారు.
ఆయనే మీ కోసం భూమిలో ఉన్న సమస్త వస్తువులనూ సృష్టించాడు. తరువాత ఆకాశం వైపుకు ధ్యానాన్ని మరల్చి, తగు రీతిలో సప్తాకాశాలను నిర్మించాడు. ఆయన అన్నీ తెలిసినవాడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.