తఫ్సీర్ సూరతుల్ బఖర – ఆయతులు 1 – 29 [వీడియో]

బిస్మిల్లాహ్

[40 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran

2. సూరా అల్ బఖర

1  الم

అలిఫ్‌ లామ్‌ మీమ్‌.

2:2  ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ ۛ هُدًى لِّلْمُتَّقِينَ

ఈ గ్రంథం (అల్లాహ్‌ గ్రంథం అన్న విషయం) లో ఎంతమాత్రం సందేహం లేదు. భయభక్తులు కలవారికి ఇది సన్మార్గం చూపు తుంది.

2:3  الَّذِينَ يُؤْمِنُونَ بِالْغَيْبِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ

వారు గోప్యమైన విషయాలను విశ్వసిస్తారు, నమాజును నెలకొల్పుతారు. ఇంకా మేము ప్రసాదించిన దానిలో (సంపదలో) నుంచి ఖర్చుపెడతారు.

2:4  وَالَّذِينَ يُؤْمِنُونَ بِمَا أُنزِلَ إِلَيْكَ وَمَا أُنزِلَ مِن قَبْلِكَ وَبِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ

మేము నీ వైపుకు (అంటే ప్రవక్త వైపుకు) అవతరింపజేసిన దానినీ, నీకు పూర్వం అవతరింపజేసిన వాటినీ వారు విశ్వసి స్తారు. పరలోకం పట్ల కూడా వారు దృఢనమ్మకం కలిగిఉంటారు.

2:5  أُولَٰئِكَ عَلَىٰ هُدًى مِّن رَّبِّهِمْ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ

ఇలాంటి వారే తమ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సన్మార్గాన ఉన్నారు. సాఫల్యాన్ని పొందేవారు వీరే.

2:6  إِنَّ الَّذِينَ كَفَرُوا سَوَاءٌ عَلَيْهِمْ أَأَنذَرْتَهُمْ أَمْ لَمْ تُنذِرْهُمْ لَا يُؤْمِنُونَ

అవిశ్వాసులను నీవు భయపెట్టినా, భయపెట్టకపోయినా ఒకటే. ఇక వారు విశ్వసించరు.

2:7  خَتَمَ اللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ وَعَلَىٰ سَمْعِهِمْ ۖ وَعَلَىٰ أَبْصَارِهِمْ غِشَاوَةٌ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ

అల్లాహ్‌ వారి హృదయాలపై,వారి చెవులపై ముద్రవేశాడు. వారి కళ్ళపై పొరవుంది. ఇంకా వారికి మహా (ఘోరమైన) శిక్ష వుంది.

2:8  وَمِنَ النَّاسِ مَن يَقُولُ آمَنَّا بِاللَّهِ وَبِالْيَوْمِ الْآخِرِ وَمَا هُم بِمُؤْمِنِينَ

మేము అల్లాహ్‌ పట్ల, అంతిమదినం పట్ల విశ్వాసం కలిగి ఉన్నామని కొందరంటున్నారు. కాని యదార్థానికి వారు విశ్వసించినవారు కారు.

2:9  يُخَادِعُونَ اللَّهَ وَالَّذِينَ آمَنُوا وَمَا يَخْدَعُونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ

వారు అల్లాహ్‌ను, విశ్వాసులనూ మోసపుచ్చుతున్నారు. అయితే వాస్తవానికి వారు స్వయంగా – తమను తామే మోసపుచ్చుకుంటున్నారు. కాని ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు.

2:10  فِي قُلُوبِهِم مَّرَضٌ فَزَادَهُمُ اللَّهُ مَرَضًا ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْذِبُونَ

వారి హృదయాలలో రోగం ఉంది. ఆ రోగాన్ని అల్లాహ్‌ మరింతగా పెంచాడు. ఇంకా, వారు చెప్పే అబద్ధం మూలంగా వారి కొరకు వ్యధాభరితమయిన శిక్ష ఉంది.

2:11  وَإِذَا قِيلَ لَهُمْ لَا تُفْسِدُوا فِي الْأَرْضِ قَالُوا إِنَّمَا نَحْنُ مُصْلِحُونَ

“భూమిలో కల్లోలాన్ని రేకెత్తించకండి” అని వారితో అన్నప్పుడల్లా, “మేము దిద్దుబాటుకు ప్రయత్నించేవారం మాత్రమే” అని వారు సమాధానమిస్తారు.

2:12  أَلَا إِنَّهُمْ هُمُ الْمُفْسِدُونَ وَلَٰكِن لَّا يَشْعُرُونَ

జాగ్రత్త! నిజానికి కల్లోల జనకులు వీరే. కాని వారికి ఆ విషయం తెలియటం లేదు.

2:13  وَإِذَا قِيلَ لَهُمْ آمِنُوا كَمَا آمَنَ النَّاسُ قَالُوا أَنُؤْمِنُ كَمَا آمَنَ السُّفَهَاءُ ۗ أَلَا إِنَّهُمْ هُمُ السُّفَهَاءُ وَلَٰكِن لَّا يَعْلَمُونَ

“ఇతరులు (అంటే ప్రవక్త ప్రియ సహచరులు) విశ్వసించినట్లే మీరూ విశ్వసించండి” అని వారితో చెప్పినప్పుడు, “మూర్ఖ జనులు విశ్వసించినట్లుగా మేము విశ్వసించాలా?” అని వారు (ఎదురు) ప్రశ్న వేస్తారు. తస్మాత్‌! ముమ్మాటికీ వీరే మూర్ఖులు. కాని ఆ సంగతి వీరికి తెలియటం లేదు.

2:14  وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَوْا إِلَىٰ شَيَاطِينِهِمْ قَالُوا إِنَّا مَعَكُمْ إِنَّمَا نَحْنُ مُسْتَهْزِئُونَ

విశ్వాసులను కలుసుకున్నప్పుడు వారు,”మేమూ విశ్వసించిన వారమే” అని అంటారు. కాని తమ షైతానుల (అంటే తమ పెద్దల లేక సర్దారుల) వద్దకు పోయినప్పుడు, “మేము మీతోనే ఉన్నామండీ. కాకపోతే వాళ్ళతో పరిహాసమాడుతున్నామంతే” అని పలుకుతారు.

2:15  اللَّهُ يَسْتَهْزِئُ بِهِمْ وَيَمُدُّهُمْ فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ

అల్లాహ్‌ కూడా వారితో పరిహాసమాడుతున్నాడు. వారి తలబిరుసుతనాన్ని మరింత అధికం చేస్తున్నాడు. ఫలితంగా వారు అంధులై గమ్యరహితంగా తిరుగుతూపోతున్నారు.

2:16  أُولَٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الضَّلَالَةَ بِالْهُدَىٰ فَمَا رَبِحَت تِّجَارَتُهُمْ وَمَا كَانُوا مُهْتَدِينَ

అపమార్గాన్ని సన్మార్గానికి బదులుగా కొనితెచ్చుకున్నవారు వీరే. అందుచేత వారి ఈ వర్తకం వారికి లాభదాయకమూ కాలేదు, వారు సన్మార్గానికి నోచుకోనూ లేదు.

2:17  مَثَلُهُمْ كَمَثَلِ الَّذِي اسْتَوْقَدَ نَارًا فَلَمَّا أَضَاءَتْ مَا حَوْلَهُ ذَهَبَ اللَّهُ بِنُورِهِمْ وَتَرَكَهُمْ فِي ظُلُمَاتٍ لَّا يُبْصِرُونَ

వారి ఉపమానం నిప్పు రాజేసిన వ్యక్తి లాంటిది. నిప్పు రాజేసినంతనే పరిసరాల్లోని వస్తువులన్నీ వెలుగులోనికి వచ్చాయి. అంతలోనే అల్లాహ్‌ వారి వెలుగును హరించి, వారిని కారు చీకట్లలో, ఏమీ కానరాని స్థితిలో వదిలేశాడు.

2:18  صُمٌّ بُكْمٌ عُمْيٌ فَهُمْ لَا يَرْجِعُونَ

వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. ఇక వారు (సరైన దారికి) మరలిరారు.

2:19  أَوْ كَصَيِّبٍ مِّنَ السَّمَاءِ فِيهِ ظُلُمَاتٌ وَرَعْدٌ وَبَرْقٌ يَجْعَلُونَ أَصَابِعَهُمْ فِي آذَانِهِم مِّنَ الصَّوَاعِقِ حَذَرَ الْمَوْتِ ۚ وَاللَّهُ مُحِيطٌ بِالْكَافِرِينَ

లేదా (వారి ఉపమానం) ఆకాశం నుంచి కురిసే భారీ వర్షం మాదిరిగా ఉంది – అందులోనూ చిమ్మచీకట్లు, ఉరుములు, మెరుపులు! ఉరుముల గర్జన విని, మృత్యు భయంతో వారు తమ వ్రేళ్ళను తమ చెవులలో దూర్చుకుంటారు. అల్లాహ్‌ ఈ అవిశ్వాసులను అన్ని వైపుల నుంచీ ముట్టడిస్తాడు.

2:20  يَكَادُ الْبَرْقُ يَخْطَفُ أَبْصَارَهُمْ ۖ كُلَّمَا أَضَاءَ لَهُم مَّشَوْا فِيهِ وَإِذَا أَظْلَمَ عَلَيْهِمْ قَامُوا ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَذَهَبَ بِسَمْعِهِمْ وَأَبْصَارِهِمْ ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

మెరుపులు వారి దృష్టిని ఎగరవేసుకుపోతాయా! అన్నట్టుంది వారి పరిస్థితి. అవి (మెరుపు తీగలు) వెలుగును విరజిమ్మినపుడల్లా వారు అందులో కొంతదూరం నడుస్తారు. తర్వాత వారిపై చీకటి ఆవరించగానే నిలబడిపోతారు. అల్లాహ్‌యే గనక తలచుకుంటే వారి వినేశక్తినీ, కంటిచూపునూ పోగొట్టేవాడే, నిశ్చయంగా అల్లాహ్‌ అన్నింటిపై అధికారం గలవాడు.

2:21  يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ

ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి- తద్వారానే మీరు (పాపాల నుండి) సురక్షితంగా ఉంటారు.

2:22  الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ

ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి.

2:23  وَإِن كُنتُمْ فِي رَيْبٍ مِّمَّا نَزَّلْنَا عَلَىٰ عَبْدِنَا فَأْتُوا بِسُورَةٍ مِّن مِّثْلِهِ وَادْعُوا شُهَدَاءَكُم مِّن دُونِ اللَّهِ إِن كُنتُمْ صَادِقِينَ

మేము మా దాసునిపై అవతరింపజేసిన దాని విషయంలో ఒకవేళ మీకేదన్నా అనుమానముంటే, అటువంటిదే ఒక్క సూరానైనా (రచించి) తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే (ఈ పని కోసం) అల్లాహ్‌ను తప్ప మీ సహాయకులందరినీ పిలుచుకోండి.

2:24  فَإِن لَّمْ تَفْعَلُوا وَلَن تَفْعَلُوا فَاتَّقُوا النَّارَ الَّتِي وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ ۖ أُعِدَّتْ لِلْكَافِرِينَ

ఒకవేళ మీరు గనక ఈ పని చెయ్యకపోతే- ఎన్నటికీ అది మీ వల్ల కాని పనే- (దీన్ని సత్యమని ఒప్పుకుని) మానవులు,రాళ్ళు ఇంధనం కాగల ఆ అగ్ని నుండి (మిమ్మల్ని మీరు) కాపాడుకోండి. అది సత్య తిరస్కారుల కోసం తయారు చేయబడింది.

2:25  وَبَشِّرِ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أَنَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ كُلَّمَا رُزِقُوا مِنْهَا مِن ثَمَرَةٍ رِّزْقًا ۙ قَالُوا هَٰذَا الَّذِي رُزِقْنَا مِن قَبْلُ ۖ وَأُتُوا بِهِ مُتَشَابِهًا ۖ وَلَهُمْ فِيهَا أَزْوَاجٌ مُّطَهَّرَةٌ ۖ وَهُمْ فِيهَا خَالِدُونَ

విశ్వసించి, సత్కార్యాలు చేసే వారికి క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ)వనాల శుభవార్తలను అందజెయ్యి. తినడానికి అక్కడి పండ్లు వారికి ఇవ్వబడినప్పుడల్లా, “ఇలాంటి పండ్లే ఇంతకు మునుపు మాకు ఇవ్వబడినవి” అని వారంటారు. నిజానికి పరస్పరం పోలి వుండే ఫలాలు వారికి ప్రసాదించబడతాయి. వారి కొరకు పరిశుద్ధులైన భార్యలుంటారు. వారు ఈ స్వర్గవనాలలో కలకాలం ఉంటారు.

2:26  إِنَّ اللَّهَ لَا يَسْتَحْيِي أَن يَضْرِبَ مَثَلًا مَّا بَعُوضَةً فَمَا فَوْقَهَا ۚ فَأَمَّا الَّذِينَ آمَنُوا فَيَعْلَمُونَ أَنَّهُ الْحَقُّ مِن رَّبِّهِمْ ۖ وَأَمَّا الَّذِينَ كَفَرُوا فَيَقُولُونَ مَاذَا أَرَادَ اللَّهُ بِهَٰذَا مَثَلًا ۘ يُضِلُّ بِهِ كَثِيرًا وَيَهْدِي بِهِ كَثِيرًا ۚ وَمَا يُضِلُّ بِهِ إِلَّا الْفَاسِقِينَ

నిశ్చయంగా అల్లాహ్‌ దేనినీ ఉపమానంగా చెప్పటానికి సిగ్గుపడడు- (కడకు) దోమ అయినాసరే, దానికన్నా అల్పమైన వస్తువు అయినాసరే! విశ్వసించినవారు మాత్రం దీన్ని తమ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సత్యమని భావిస్తారు. కాని అవిశ్వాసులు, “ఈ ఉపమానం ద్వారా ఇంతకీ అల్లాహ్‌ ఏం చెప్పదలచుకుంటున్నాడు?” అని అంటారు. ఈ విధంగా ఆయన దీని ద్వారానే ఎంతో మందిని అపమార్గం పట్టిస్తాడు, మరెంతో మందిని సన్మార్గంపైకి తీసుకువస్తాడు. అయితే దీని ద్వారా ఆయన అపమార్గానికి లోను చేసేది అవిధేయులను మాత్రమే.

2:27  الَّذِينَ يَنقُضُونَ عَهْدَ اللَّهِ مِن بَعْدِ مِيثَاقِهِ وَيَقْطَعُونَ مَا أَمَرَ اللَّهُ بِهِ أَن يُوصَلَ وَيُفْسِدُونَ فِي الْأَرْضِ ۚ أُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ

వీరు ఎలాంటి వారంటే అల్లాహ్‌తో చేసిన దృఢమైన ప్రమాణాన్ని భంగపరుస్తారు. అల్లాహ్‌ కలిపి ఉంచమని చెప్పిన వాటిని త్రెంచివేస్తారు. భువిలో చెడుగును వ్యాపింపజేస్తారు. వీరే అసలు నష్టాన్ని పొందేవారు.

2:28  كَيْفَ تَكْفُرُونَ بِاللَّهِ وَكُنتُمْ أَمْوَاتًا فَأَحْيَاكُمْ ۖ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ

మీరు అల్లాహ్‌ యెడల తిరస్కార వైఖరికి ఎలా ఒడిగట్టగలరు? చూడబోతే నిర్జీవులుగా ఉన్న మీకు ఆయనే ప్రాణం పోశాడు. మరి మీ ప్రాణం తీసేవాడూ, తిరిగి మిమ్మల్ని బ్రతికించేవాడు కూడా ఆయనే. ఆ తరువాత మీరు ఆయన వైపుకే మరలించబడతారు.

2:29  هُوَ الَّذِي خَلَقَ لَكُم مَّا فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ اسْتَوَىٰ إِلَى السَّمَاءِ فَسَوَّاهُنَّ سَبْعَ سَمَاوَاتٍ ۚ وَهُوَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ

ఆయనే మీ కోసం భూమిలో ఉన్న సమస్త వస్తువులనూ సృష్టించాడు. తరువాత ఆకాశం వైపుకు ధ్యానాన్ని మరల్చి, తగు రీతిలో సప్తాకాశాలను నిర్మించాడు. ఆయన అన్నీ తెలిసినవాడు.


ఖురాన్ వ్యాఖ్యానం : అహ్సనుల్ బయాన్

%d bloggers like this: