[8:41 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [8:41 నిముషాలు]
అహ్సనుల్ బయాన్ నుండి:
2:142 سَيَقُولُ السُّفَهَاءُ مِنَ النَّاسِ مَا وَلَّاهُمْ عَن قِبْلَتِهِمُ الَّتِي كَانُوا عَلَيْهَا ۚ قُل لِّلَّهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ ۚ يَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
“వీరు ఏ ఖిబ్లా వైపుకు అభిముఖులయ్యేవారో దాన్నుంచి మరలటానికి కారణం ఏమిటీ?” అని మూర్ఖ జనులు అంటారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: తూర్పు పడమరలు (అన్నీ) అల్లాహ్వే. తాను తలచిన వారికి ఆయన రుజుమార్గం చూపుతాడు.
2:143 وَكَذَٰلِكَ جَعَلْنَاكُمْ أُمَّةً وَسَطًا لِّتَكُونُوا شُهَدَاءَ عَلَى النَّاسِ وَيَكُونَ الرَّسُولُ عَلَيْكُمْ شَهِيدًا ۗ وَمَا جَعَلْنَا الْقِبْلَةَ الَّتِي كُنتَ عَلَيْهَا إِلَّا لِنَعْلَمَ مَن يَتَّبِعُ الرَّسُولَ مِمَّن يَنقَلِبُ عَلَىٰ عَقِبَيْهِ ۚ وَإِن كَانَتْ لَكَبِيرَةً إِلَّا عَلَى الَّذِينَ هَدَى اللَّهُ ۗ وَمَا كَانَ اللَّهُ لِيُضِيعَ إِيمَانَكُمْ ۚ إِنَّ اللَّهَ بِالنَّاسِ لَرَءُوفٌ رَّحِيمٌ
అదే విధంగా మేము మిమ్మల్ని ఒక “న్యాయశీల సమాజం” (ఉమ్మతె వసత్)గా చేశాము – మీరు ప్రజలపై సాక్షులుగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీపై సాక్షిగా ఉండటం కోసం (మేమిలా చేశాము.) ప్రవక్తకు విధేయత చూపటంలో ఎవరు నిజాయితీపరులో, మరెవరు వెనుతిరిగి పోయేవారో తెలుసుకునే (పరీక్షించే) నిమిత్తమే మేము, పూర్వం నీవు అభిముఖుడవై ఉండిన దిశను మీ ‘ఖిబ్లా’గా నిర్ధారించాము. ఇదెంతో కష్టమైన విషయమే అయినప్పటికీ అల్లాహ్ సన్మార్గం చూపిన వారికి (ఏ మాత్రం కష్టతరం కాదు). అల్లాహ్ మీ విశ్వాసాన్ని వృధా కానివ్వడు. నిశ్చయంగా అల్లాహ్ (తన దాసులైన) మానవుల యెడల అమితమైన వాత్సల్యం కలవాడు! పరమ కృపాశీలుడు.
ఖురాన్ వ్యాఖ్యానం : అహ్సనుల్ బయాన్
You must be logged in to post a comment.