హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర https://youtu.be/r_3VWYO4FHI [జుమా ఖుత్బా: 25 నిముషాలు] షేఖ్ డా. అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ (హఫిజహుల్లాహ్), జామె అల్ గన్నామ్, జుల్ఫీ, సఊదియ అనువాదం: షేఖ్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో ప్రవక్త సహచరుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం వల్ల కలిగే ప్రాముఖ్యత, దానివల్ల విశ్వాసం ఎలా పెరుగుతుందో వివరించబడింది. ముఖ్యంగా, రెండవ ఖలీఫా అయిన హజ్రత్ ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క జీవిత చరిత్రపై దృష్టి సారించబడింది. ఆయన ఇస్లాం స్వీకరణ, ఆయన ధైర్యం, ఆయనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన శుభవార్తలు, ఆయన పరిపాలన, మరియు ఆయన అమరత్వం (షహాదత్) వంటి ముఖ్య ఘట్టాలను హదీసుల ఆధారాలతో వివరించారు. ఉమర్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఖురాన్ ఆయతులు అవతరించిన సందర్భాలు, ఆయన జ్ఞానం, మరియు ఆయన నిరాడంబర జీవితం గురించి కూడా చర్చించబడింది. ఆయన జీవితం నుండి ముస్లింలు నేర్చుకోవలసిన పాఠాలను ఈ ప్రసంగం ఎత్తి చూపుతుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
విశ్వాసంలో మాధుర్యాన్ని, తీపిని ఆస్వాదించాలన్న కోరిక మీకు ఉందా ? అయితే తప్పనిసరిగా ఈ మంచి వీడియో చూడండి మరియు మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి, ఇన్ షా అల్లాహ్
తప్పకుండ వినాల్సిన వీడియో, డోంట్ మిస్, ఏకాంతంలో డిస్టర్బన్స్ లేకుండా ఏకాగ్రతగా వింటే, సంపూర్ణ లాభం పొందవచ్చు
—
ఈ ప్రసంగం ఇస్లాం ధర్మంలోని ‘ఈమాన్’ (విశ్వాసం) యొక్క ప్రాముఖ్యత మరియు దాని స్వభావాన్ని వివరిస్తుంది. అల్లాహ్ ఖురాన్‌లో విశ్వాసులను ఉద్దేశించి మళ్ళీ విశ్వసించమని కోరడంలోని అంతరార్థాన్ని, విశ్వాసం అనేది హృదయంలో స్థిరపడాల్సిన విషయమని వక్త వివరించారు. అబూ సుఫ్యాన్ మరియు హిరాక్లియస్ మధ్య జరిగిన సంభాషణ ద్వారా నిజమైన విశ్వాసం హృదయంలో చేరిన తర్వాత అది ఎప్పటికీ తొలగిపోదని తెలిపారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజిఅల్లాహు అన్హు) మరియు హంజలా (రజిఅల్లాహు అన్హు) వంటి సహాబాల జీవిత సంఘటనల ద్వారా ఈమాన్ యొక్క స్థాయిలను, అది పెరగడం మరియు తరగడం వంటి లక్షణాలను వివరించారు. చివరగా, ఈమాన్ యొక్క మాధుర్యాన్ని రుచి చూడటానికి అవసరమైన మూడు ముఖ్యమైన లక్షణాలను – అల్లాహ్ మరియు ప్రవక్తను అత్యధికంగా ప్రేమించడం, అల్లాహ్ కోసమే ఎవరినైనా ఇష్టపడటం, మరియు అవిశ్వాసాన్ని అసహ్యించుకోవడం – గురించి వివరిస్తూ ప్రసంగాన్ని ముగించారు.
అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్ హందులిల్లాహ్,
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్.
అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు, సకల ఆరాధనలు ఆ అల్లాహ్ కే అంకితము. ఎవరైతే ఈ సమస్త సృష్టిని సృష్టించి, తన అధికార పీఠాన్ని అధిష్టించి, ఆయన సృష్టించినటువంటి సృష్టరాశులన్నింటిలో కల్లా ఉన్నతమైనటువంటి జీవిగా మానవుడిని మలచాడు. మరియు వారి వైపునకు సందేశాన్ని ఇచ్చేటటువంటి ఉద్దేశంతో ప్రవక్తల యొక్క పరంపరను ప్రారంభించాడు. ఈ ప్రవక్తల యొక్క పరంపర హజ్రతే ఆదమ్ (అలైహిస్సలాం) నుంచి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ఆదర్శ మహామూర్తి, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, జనాబే ముస్తఫా, అహ్మదే ముజ్తబా, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై అల్లాహ్ యొక్క కోటానుకోట్ల దరూద్ లు మరియు సలాములు, శుభాలు మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ఆమీన్.
సోదరీ సోదర మహాశయులారా! అల్లాహ్ యొక్క దయ మరియు ఆయన కారుణ్యంతో ఈరోజు మర్కజ్ మస్జిదే ఇబాదుర్రహ్మాన్ లో ధార్మిక శిక్షణ తరగతులు నిర్వహించాలనేటటువంటి ఉద్దేశంతో నిర్వహించబడినటువంటి ఈ సభకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను.
విశ్వాసులకు అల్లాహ్ పిలుపు
అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో విశ్వాసులను సంబోధిస్తూ 4వ సూరా, సూరా నిసా, 136వ వాక్యంలో అంటున్నాడు:
(యా అయ్యుహల్లజీన ఆమనూ ఆమినూ బిల్లాహి వ రసూలిహి వల్ కితాబిల్లజీ నజ్జల అలా రసూలిహి వల్ కితాబిల్లజీ అంజల మిన్ ఖబ్ల్, వ మన్ యక్ఫుర్ బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వల్ యౌమిల్ ఆఖిరి ఫఖద్ జల్ల జలాలమ్ బయీదా)
ఓ విశ్వసించిన వారులారా! అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను, ఆయన తన ప్రవక్తపై అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు అంతకుముందు ఆయన అవతరింపజేసిన గ్రంథాలను విశ్వసించండి. అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను మరియు అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయాడు. (4:136)
ఇక్కడ అల్లాహ్ ఎవరితో సందేశం ఇస్తున్నాడండి? విశ్వాసులతో సందేశం ఇస్తున్నాడు. ఏమని ఆదేశించాడు? “విశ్వసించండి అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను, ఆ ప్రవక్తపై అవతరింపజేయబడినటువంటి గ్రంథాన్ని” అని. నా ప్రశ్న ఏంటంటే అల్లాహ్ ఆదేశిస్తున్నది విశ్వాసులనైతే, తిరిగి ఎందుకు వారిని విశ్వసించండి అని అన్నాడు? అల్లాహ్ ను, ప్రవక్తను, ప్రవక్తపై అవతరించినటువంటి గ్రంథాన్ని. ఒకవేళ వాళ్ళు విశ్వాసులు కాకపోతే ‘ఓ విశ్వసించిన ప్రజలారా’ అని ఎందుకు పలకబడింది? ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అండి.
నిజమైన విశ్వాసం యొక్క లక్షణం
దాని గురించి మనం తెలుసుకునే ముందు ఇన్ షా అల్లాహ్, ఈ సభ కార్యక్రమం ముగించే లోపు దీని యొక్క జవాబు మీ నోటి ద్వారానే ఇన్ షా అల్లాహ్ విందాం. నబీ కరీం (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి బద్ధ శత్రువు మక్కా ఖురైష్ యొక్క నాయకుడు అబూ సుఫ్యాన్. ఈ అబూ సుఫ్యాన్ హిరాక్లియస్ అనేటటువంటి ఒక రాజుతో కలిశాడు. అతన్ని ఇంగ్లీష్ లో హెర్క్యులియస్ అని అంటూ ఉంటారు. ఈ హెర్క్యులియస్ రాజుతో కలిసినటువంటి సంఘటన సహీ అల్ బుఖారీ లో ఉంది. ఇందులో అబూ సుఫ్యాన్ ని హెర్క్యులియస్ రాజు ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే: “ఇస్లాం లో ప్రవేశించిన తర్వాత ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవక్తను విశ్వసించిన తర్వాత, ఆయన అనుచర సమాజంలో ఏ ఒక్కడైనా ఇస్లాం లోకి ప్రవేశించిన తర్వాత, ఆయన ధర్మము నుంచి వైదొలగిపోయినవాడు, ధర్మ భ్రష్టతకు గురైనటువంటి వాడు, అవిశ్వాసపు పనికి పాల్పడినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా?” అని అడుగుతున్నాడు.
అబూ సుఫ్యాన్ ముస్లింలకు బద్ధ శత్రువు, కావాలనుకుంటే అబద్ధం చెప్పొచ్చు. లేదు, ఆయన ఏం చెప్పాడంటే: “వారిలో ఏ ఒక్కడు విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడలేదు.” ఆ సమయంలో హిరాక్లియస్ చెప్పినటువంటి మాట, వాస్తవానికి విశ్వాసం అంటే అదే, ఒక్కసారి అది మనిషి హృదయంలో ప్రవేశిస్తే దాన్ని తీయడం ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే, విశ్వాసం అనే దాని ఆనవాళ్లు, దాని యొక్క లక్షణం ఏమిటి సోదర మహాశయులారా? అది ఎలా ఉంటుందంట? ఒక్కసారి గనుక అది మనిషి యొక్క హృదయంలో గనుక ప్రవేశిస్తే దానిని తీసివేయడం ఎవరి వల్ల కాదు.
విశ్వాసంలో స్థాయిలు
అలాగే విశ్వాసం అన్నటువంటిది ప్రతి ఒక్కరిదీ ఒక్కో విధంగా ఉంటుంది. అందరి విశ్వాసము కూడా ఒకే స్కేల్ లో ఉండదు. హజ్రతే ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ (రజిఅల్లాహు అన్హు) గారి గురించి మహనీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అంటున్నారు: “నేను కలలో చూశాను, స్వర్గంలో హజ్రతే ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ (రజిఅల్లాహు అన్హు) గారు తెల్లటి పొడవాటి వస్త్రాలు వేసుకొని తిరుగుతుండగా నేను చూశాను” అని అన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సహాబాలు అడిగారు: “ప్రవక్త! పొడవాటి వస్త్రాలు ధరించకూడదని మీరు అంటారు, ఉమర్ గారు స్వర్గంలో వేసుకొని తిరుగుతున్నారు, అక్కడ ఏదైనా రూల్స్ మారాయా?” అని అడిగారు. నబీ కరీం (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అన్నారు: “లేదు, నాకు కలలో ఏదైతే స్వర్గంలో చూపించబడిందో, అది ఏదైతే పొడవాటి దుస్తులు తెల్లటి వెలుగు విరజిమ్ముతున్నటువంటి దుస్తులు, ఆయన విశ్వాసాన్ని దుస్తులతో పోల్చబడింది” అని అన్నారు మహనీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). అంటే హజ్రతే ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ (రజిఅల్లాహు అన్హు) ఆయన విశ్వాసం ఎలాంటిదంటే సోదర మహాశయులారా, స్వర్గవాసులందరిలో కన్నా అత్యంత ఎక్కువ పొడవాటి తెల్లటి వెలుగుతో విరజిమ్ముతున్నటువంటి వస్త్రాలను చూశానంటే, ఇక్కడ విశ్వాసాన్ని ఆ వస్త్రాలతో పోల్చి అందరి కంటే ఎక్కువ విశ్వాసం ఉమర్ ది ఉండటాన్ని ఇక్కడ అల్లాహ్ తాలా యొక్క ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలియజేస్తున్నారు.
ఆ ఉమర్, ఏ ఉమర్ గురించి అయితే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు స్వయానా శుభవార్తని ఇచ్చారో: “నా తర్వాత ప్రవక్త పదవి అనేది అంతమొందించబడింది, ఒకవేళ మిగిలి ఉండి ఉంటే నా తర్వాత ఆ ప్రవక్త పదవికి అర్హుడు ఉమర్ అయ్యేవాడు. కానీ నా తర్వాత ప్రవక్త ఎవరూ రారు, నేను ప్రవక్తల యొక్క పరంపరను పరిసమాప్తి గావించినటువంటి వాడిని” అని అన్నారు. ఆ ఉమర్ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి దగ్గర ముందు కూర్చొని ఉన్నాడు. నబీ కరీం (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అన్నారు: “మీలో ఏ ఒక్కడు అప్పటి వరకు విశ్వాసి కాలేడు, ఎప్పటి వరకు అయితే నన్ను ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని మీ తల్లిదండ్రుల కన్నా, మీ ఆలుబిడ్డల కన్నా, మీ అందరి కన్నా కూడా ఎక్కువగా ప్రేమించనంత వరకు మీరు విశ్వాసులు కాలేరు” అని అన్నారు. ఉమర్ (రజిఅల్లాహు అన్హు) గారు అడిగారు: “ప్రవక్త! మీరు పలికినటువంటి మాట ప్రకారం నేను మిమ్మల్ని నా భార్య పిల్లల కన్నా, నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ నా ప్రాణం కన్నా, నా నఫ్స్ కన్నా ఎక్కువ కాదు ప్రవక్త” అని అన్నారు. “యా ఉమర్! లస్త మూమినా” – “ఓ ఉమర్! నువ్వు విశ్వాసివి కావు” అని అన్నారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). హజ్రతే ఉమర్ ఫారూఖ్ (రజిఅల్లాహు అన్హు) వారు అన్నారు: “ప్రవక్త! అయితే నేను మిమ్మల్ని నా ప్రాణం కంటే అధికంగా ప్రేమిస్తున్నాను ప్రవక్త.” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అన్నారు: “అల్ ఆన యా ఉమర్” – “ఉమర్! ఇప్పుడు నువ్వు విశ్వాసివయ్యావు.”
విశ్వాసమనే పర్వతం
సోదర మహాశయులారా! హజ్రతే ఉమర్ ఫారూఖ్ (రజిఅల్లాహు అన్హు) గారి యొక్క విశ్వాసం గురించి మహనీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు చెప్పినటువంటి మాటలు మనం విన్నాం. 14వ సూరా, సూరా ఇబ్రాహీం, 46వ వాక్యం ఒకసారి చదవండి సోదరులారా. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇందులో ఇలా అంటున్నాడు:
وَقَد مَكَروا مَكرَهُم وَعِندَ اللَّهِ مَكرُهُم وَإِن كانَ مَكرُهُم لِتَزولَ مِنهُ الجِبالُ (వ ఖద్ మకరూ మక్రహుమ్ వ ఇందల్లాహి మక్రుహుమ్, వ ఇన్ కాన మక్రుహుమ్ లితజూల మిన్హుల్ జిబాల్)
వారు తమ ఎత్తుగడలను వేసి చూసుకున్నారు. వారి ఎత్తుగడలన్నీ అల్లాహ్ దృష్టిలో ఉన్నాయి. వారి ఎత్తుగడలు పర్వతాలను కదిలించేటంతటి భీకరమైనవేమీ కావు. (14:46)
అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇక్కడ సహాబాల విశ్వాసాలను కొండలతో పోల్చాడు. వారిపై ఏవైతే కుట్రలు పన్నటం జరిగిందో, అటువంటి కుట్రలే గనుక పన్ని ఉంటే పర్వతాలు కొండలు సైతం కూడా అవి తమ ప్రదేశం నుంచి కదిలిపోయేవేమో కానీ, సహాబాలు కొండల్లా నిలబడిపోయారు, వారి విశ్వాసంలో మార్పు రాలేదని అల్లాహ్ అంటున్నాడు. “ఉలాయికల్లజీనమ్ తహనల్లాహు ఖులూబహుమ్ లిత్తఖ్వా లహుమ్ మగ్ఫిరతున్ వ అజ్రున్ అజీమ్” (49:3) – అలాంటి వారి హృదయాలను అల్లాహ్ భయభక్తుల కొరకు పరీక్షించి ఉన్నాడు, వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి. కాబట్టి సోదర మహాశయులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అన్నటువంటి వాక్యం, మళ్ళీ ఆ వాక్యం వైపునకు వద్దాము, 4వ సూరా సూరా నిసా 136వ వాక్యం.
విశ్వాసం యొక్క పెరుగుదల మరియు తరుగుదల
సోదర మహాశయులారా! మహనీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అంటున్నారు:
“విశ్వాసం అన్నది ఎలాగైతే మీరు మీ యొక్క శరీరాలపై ధరించేటటువంటి దుస్తులు మాసిపోతూ ఉంటాయో, అలాగే విశ్వాసము కూడా మాసిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో దువా చేయండి, అల్లాహ్ మీ విశ్వాసాలను పునరుద్ధరింపజేయాలని.”
కాబట్టి ఇక్కడ ఒక సిద్ధాంతం మనకు తెలుస్తుంది, అదేమిటంటే సోదర మహాశయులారా: “అల్ ఈమాను యజీదు బిత్ తా అ వ యన్ ఖుసు బిల్ మాసియా” – అంటే విశ్వాసము పెరుగుతుంది మరియు విశ్వాసము తరుగుతుంది. విశ్వాసం ఎప్పుడు పెరుగుతుందండి? ఎప్పుడైతే మనిషి మంచి పనులు చేస్తాడో అప్పుడు విశ్వాసం పెరుగుతుంది, ఎప్పుడైతే మనిషి చెడు కర్మలు చేస్తాడో అప్పుడు విశ్వాసం తగ్గిపోతుంది. అల్లాహ్ అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో: “ఇన్నమల్ ముమినూనల్లజీన ఇజా జుకిరల్లాహు వజిలత్ ఖులూబుహుమ్ వ ఇజా తులియత్ అలైహిమ్ ఆయాతుహు జాదత్ హుమ్ ఈమానా” (8:2) – విశ్వాసుల ముందు అల్లాహ్ యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు అల్లాహ్ వారి హృదయాలు ప్రకంపిస్తాయి మరియు వారిపై ఎప్పుడైతే ఖురాన్ వాక్యాలు చదివి వినిపించబడతాయో ఆ సమయంలో వారి విశ్వాసం పెరుగుతుంది.
అలాగే నబీ కరీం (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అంటున్నారు: “ఏ వ్యభిచారం చేసేటటువంటి వాడు వ్యభిచారం చేస్తాడో ఆ సమయంలో అతనిలో విశ్వాసం ఉండదు, తొలగిపోతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి మద్యాన్ని సేవిస్తాడో ఆ సమయంలో అతనిలో విశ్వాసం ఉండదు, ఎప్పుడైతే ఒక వ్యక్తి దొంగతనము చేస్తాడో ఆ సమయంలో అతనిలో విశ్వాసం ఉండదు.” కాబట్టి ఈ హదీసు ద్వారా మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే వ్యభిచరించేటటువంటి వాడు, అలాగే దొంగతనం చేసేటటువంటి వాడు, మద్యపానాన్ని సేవించేటటువంటి వాడు ఈ మూడు పనులు హరామ్ నిషేధించబడినటువంటి పనులు చేస్తున్నప్పుడు అతనిలో విశ్వాసము కోల్పోతాడు, తిరిగి ఎప్పుడైతే తోబా చేసుకుంటాడో అప్పుడే విశ్వాసాన్ని పొందుతాడు.
హంజలా (రజిఅల్లాహు అన్హు) అనుభవం
సహీ ముస్లిం లో హజ్రతే హంజలా (రజిఅల్లాహు అన్హు) గారి యొక్క ఒక సంఘటన మన ముందుకు వస్తుంది. ఎవరు ఈయన? హజ్రతే హంజలా. ఆ హంజలా ఎవరైతే వివాహం చేసుకున్నాడు, వివాహము చేసుకున్నటువంటి మొదటి రాత్రి తన భార్య దగ్గర ఉన్న సమయంలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పిలుపు వినబడింది. వెళ్ళాడు, బయలుదేరాడు, ఉదయం అయ్యేపాటికి చనిపోయి షహదత్ పొందిన వారిలో ఇతని శవం కూడా బయటపడింది. నబీ కరీం (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అన్నారు: “హంజలా గసీలుల్ మలాయిక” – హంజలా (రజిఅల్లాహు అన్హు) దైవదూతలచే గుసల్ స్నానం చేయించబడినటువంటి వాడు.
అటువంటి హంజలా ఒకరోజు అబూబక్ర్ (రజిఅల్లాహు అన్హు) గారి దగ్గరికి వెళ్లారు. అబూబక్ర్ అడిగారు “ఎలా ఉన్నావు హంజలా?” అని. హంజలా (రజిఅల్లాహు అన్హు) గారు అన్నారు: “నాఫఖ హంజలా” – హంజలా మునాఫిక్ అయిపోయాడు అని అన్నారు. సుబ్ హానల్లాహ్! నువ్వు మునాఫిక్ అయిపోయావా? ఇది ఎలా? హంజలా (రజిఅల్లాహు అన్హు) గారు అన్నారు: “మనం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన ముందు కూర్చొని ఉన్నప్పుడు ఆయన స్వర్గము మరియు నరకము గురించి ప్రస్తావన చేస్తూ ఉంటే మా విశ్వాసం ఉప్పొంగేది, మా గడ్డాలు తడిచిపోయేవి, మా కళ్ళ నుంచి కన్నీళ్లు కారేవి. కానీ ఎప్పుడైతే మేము ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నామో, మా భార్య పిల్లల విషయాల్లో, మా కుటుంబం యొక్క విషయాల్లో పడిపోయి ఆయన చెప్పిందంతా మరిచిపోయేటటువంటి వాళ్ళము. అందుకని నేను కపట విశ్వాసిని అయిపోయాను” అన్నాడు.
అబూబక్ర్ (రజిఅల్లాహు అన్హు) గారు విన్నారు: “నా పరిస్థితి కూడా ఇలాగే ఉందే!” అని ఇద్దరు కలిసి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి దగ్గరికి వెళ్లారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అన్నారు: “హంజలా! ఒకవేళ ఏ విధంగానైతే నా ముందు మీరు కూర్చున్నప్పుడు మీ పరిస్థితి ఉంటుందో, ఇలాగే గనుక మీరు సంపూర్ణంగా శాశ్వతంగా ఎల్లావేళలా ఇలాగే ఉండగలిగితే – అంటే దాని అర్థం ఏంటంటే ఉండటం ఎవరి వల్ల కానీ పని – ఒకవేళ మీరు ఇలా గనుక ఉండగలిగితే దైవదూతలు ఆకాశం నుంచి దిగి మీకు మీరు నడిచే మార్గాలలో మీరు పరుండే పడకలపై మీకు ముసాఫా కరచాలనం చేయడానికి దిగేవారు. ఓ హంజలా! కానీ విశ్వాసం అంటే అదే, ఒక్కొక్కసారి మనము విశ్వాసము పెరుగుతుండటాన్ని మనము అనుభవిస్తాము.” సోదర మహాశయులారా, ఉదాహరణకు చూసుకోండి ఇప్పుడు రంజాన్ నెల రానున్నది, రంజాన్ నెల వచ్చేస్తే మన విశ్వాసం ఎంతలా పెరుగుతుందో!
ఈమాన్ మాధుర్యాన్ని రుచి చూసే మూడు లక్షణాలు
సహీ ముస్లిం లో అబ్బాస్ బిన్ అబ్దుల్ ముతలిబ్ (రజిఅల్లాహు అన్హు) ఉల్లేఖిస్తున్నారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అన్నారు: “జాఖ తామల్ ఈమాన్ మన్ రజియ బిల్లాహి రబ్బన్ వ బిల్ ఇస్లామి దీనన్ వ బి ముహమ్మదిన్ రసూలా” – ఆ వ్యక్తి విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూస్తాడు ఎవరైతే అల్లాహ్ ను తన ప్రభువుగా సంతృప్త పడ్డాడో, ఇస్లాం ను ధర్మంగా సంతృప్త పడ్డాడో, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని ప్రవక్తగా సంతృప్త పడ్డాడో ఆ వ్యక్తి విశ్వాసం యొక్క మాధుర్యాన్ని చూడగలడు.
విశ్వాసానికి కూడా మాధుర్యం ఉంటుంది. నబీ కరీం (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అంటున్నారు: మూడు లక్షణాలు ఉన్నాయి, ఎవరిలోనైనా ఈ మూడు గుణాలు గనుక పెంపొందించుకోగలిగితే వారు కూడా విశ్వాసం యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలరు.
అల్లాహ్ మరియు ప్రవక్త అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి.
ఏ వ్యక్తితో స్నేహం చేసినా అల్లాహ్ కోసమే స్నేహము, అల్లాహ్ కోసమే శత్రుత్వం చేసే గుణము ఉన్నటువంటి వాడు.
విశ్వసించిన తర్వాత అవిశ్వాసపు పని చేయడానికి అగ్నిలో కాల్చి వేయడం కన్నా ఎక్కువగా అయిష్టపడాలి.
అల్లాహ్ మరియు ప్రవక్త పట్ల ప్రేమ
“ఖుల్ ఇన్ కున్తుమ్ తుహిబ్బూనల్లాహ ఫత్తబియూనీ యుహ్ బిబ్ కుముల్లాహు వ యగ్ఫిర్ లకుమ్ జునూబకుమ్ వల్లహు గఫూరుర్రహీమ్” (3:31) – ఒక వ్యక్తి అంటున్నాడు నాకు అల్లాహ్ అంటే ప్రేమ, ప్రవక్త అంటే ప్రేమ ఎలా? వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకుంటాడు. ఆ మెసేజ్ పెడుతున్నప్పుడు అజాన్ అవుతుంది, నమాజ్ కు మాత్రం రాడు. అల్లాహ్ మరియు ప్రవక్త పట్ల ప్రేమ అందరికంటే ఎక్కువగా ఉండాలి. అంటే ఎవరికంటే ఎక్కువగా ఉండాలండి? భార్య కన్నా, పిల్లల కన్నా, బంధు మిత్రుల కన్నా, మీ అవసరాల కన్నా.
అల్లాహ్ అంటున్నాడు 9వ సూరా సూరా తౌబా 24వ వాక్యంలో:
(ఖుల్ ఇన్ కాన ఆబాఉకుమ్ వ అబ్నాఉకుమ్ వ ఇఖ్వానుకుమ్ వ అజ్వాజుకుమ్ వ అషీరతుకుమ్ వ అమ్వాలు నిఖ్ తరఫ్ తుమూహా వ తిజారతున్ తఖ్ షౌన కసాదహా వ మసాకిను తర్జౌనహా అహబ్బ ఇలైకుమ్ మినల్లాహి వ రసూలిహి వ జిహాదిన్ ఫీ సబీలిహి ఫతరబ్బసూ హత్తా యతియల్లాహు బి అమ్రిహి, వల్లహు లా యహ్దిల్ ఖౌమల్ ఫాసిఖీన్)
“ఓ ప్రవక్త!) వారితో ఇలా అను: “ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ సమీప బంధువులు, మీరు సంపాదించిన సిరిసంపదలు, కుంటుపడుతుందేమోనని మీరు భయపడే మీ వర్తకం, మీకు ఎంతో ప్రియమైన మీ నివాస గృహాలు – మీకు అల్లాహ్ కన్నా, ఆయన ప్రవక్త కన్నా, ఆయన మార్గంలో సాగించే పోరాటం కన్నా ఎక్కువ ప్రియమైనవైతే, అల్లాహ్ తన తీర్పును తీసుకు వచ్చేవరకు వేచి చూడండి. అల్లాహ్ అవిధేయులకు మార్గదర్శకత్వం చేయడు.” (9:24)
షిర్క్ కు దూరంగా ఉండటం
విశ్వసించిన తర్వాత అవిశ్వాసపు పనిని మనం చేయకూడదు. 4వ సూరా సూరా నిసా 116వ వాక్యం ఒకసారి చదవండి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇందులో ఏమంటున్నాడో చూడండి:
إِنَّ اللَّهَ لا يَغفِرُ أَن يُشرَكَ بِهِ وَيَغفِرُ మా దూన జాలిక లిమన్ యషావు (ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషౌ)
తనకు భాగస్వాములను కల్పించటాన్ని అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడు. షిర్క్ మినహా తాను కోరిన వారి మిగిలిన పాపాలను క్షమిస్తాడు. (4:116)
షిర్క్ కాకుండా ఏ పాపాలైతే మీరు చేశారో, ఆయన కోరిన వారిని ఆయన క్షమిస్తాడంట. షిర్క్ ఒక్కటే మహా పాపం అని కాదు, 70 కంటే ఎక్కువ ఉన్నాయి. అలాగే సూరా అల్ హుజరాత్ (49వ సూరా) 14వ వాక్యం:
“మేము విశ్వసించాము” అని పల్లెవాసులు అంటున్నారు. “మీరు ఇంకా విశ్వసించలేదు. కావున మేము ఇస్లాంను స్వీకరించాము (ముస్లింలమయ్యాము) అని మాత్రమే అనండి. విశ్వాసం (ఈమాన్) ఇంకా మీ హృదయాలలో ప్రవేశించలేదు” అని (ఓ ప్రవక్త!) వారితో చెప్పు. (49:14)
ముగింపు
కాబట్టి సోదర మహాశయులారా! అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చెబుతున్నటువంటి ఈ విషయాన్ని ఆలోచించినట్లయితే, మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజమైనటువంటి విశ్వాసులుగా పెంపొందించుకోవాలి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎప్పటి వరకు అయితే మనకి జీవితాన్ని ప్రసాదించాడో అప్పటి వరకు ఖురాన్ హదీసు పై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఎప్పుడైతే మనం మరణిస్తామో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్’ అనే కలిమా సద్వచనాన్ని పఠిస్తూ విశ్వాస స్థితిలో మరణాన్ని పొందే మహదనుగ్రహాన్ని అల్లాహ్ మనందరికీ అనుగ్రహించు గాక. ఆమీన్.
సుబ్ హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మూడవ ఖలీఫా హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర మరియు షహాదత్ https://youtu.be/ejJd6Qy1NWw [15 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, మూడవ ఖలీఫా అయిన హజ్రత్ ఉస్మాన్ ఇబ్నె అఫ్ఫాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క జీవితం మరియు ఘనత గురించి వివరించబడింది. ఆయన అల్లాహ్ పట్ల గల భయభక్తులు, ఆరాధన, మరియు దాతృత్వం గురించి ప్రస్తావించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఇద్దరు కుమార్తెలను వివాహం చేసుకున్న కారణంగా ఆయనకు “జున్నూరైన్” (రెండు ప్రకాశాల యజమాని) అనే బిరుదు ఎలా వచ్చిందో వివరించబడింది. హుదైబియా సంధి సమయంలో జరిగిన “బైఅతుర్ రిద్వాన్” (అల్లాహ్ ప్రసన్నత పొందిన వాగ్దానం)లో ఆయన ప్రాముఖ్యత, రూమా బావిని కొని ప్రజల కొరకు దానం చేయడం, మరియు తబూక్ యుద్ధం కోసం సైన్యాన్ని సిద్ధపరచడంలో ఆయన చేసిన అపారమైన సహాయం వంటి చారిత్రక సంఘటనలు ఉదహరించబడ్డాయి. ఆయన ఖిలాఫత్ కాలంలో ఖుర్ఆన్‌ను ఒక గ్రంథ రూపంలో సంకలనం చేయడం మరియు మస్జిద్-ఎ-హరామ్, మస్జిద్-ఎ-నబవీల విస్తరణ వంటి ఆయన చేసిన గొప్ప పనులను కూడా పేర్కొనడం జరిగింది. చివరగా, ఆయన అమరత్వం పొందిన విషాదకర సంఘటనను వివరిస్తూ, అంతర్గత కలహాలు (ఫిత్నా) యొక్క తీవ్రత గురించి హెచ్చరించి, ముస్లింలు ఐక్యంగా ఉండవలసిన ఆవశ్యకతను నొక్కిచెప్పబడింది.
(అల్ హందులిల్లాహ్. అల్ హందులిల్లాహి అలా నిఅమిన్ తత్రా, వ అలా అర్జాకిన్ లా నుతీకు లహూ హస్రా. వ అష్ హదు అల్లా ఇల్లాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహ్, షహాదతన్ తకూను లనా జుఖ్రా. వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుల్లాహి వ రసూలుహుల్ మఖ్ సూసు బిల్ ఫదాయిలిల్ కుబ్రా. సల్లల్లాహు అలైహి ఇలా యౌమిల్ ఉఖ్రా. అమ్మా బ’అద్. ఫత్తఖ్వా వికావున్, వ లిబాసుహా ఖైరు లిబాస్.)
సమస్త ప్రశంసలు అల్లాహ్ కే శోభాయమానం. నిరంతరం కురుస్తున్న ఆయన అనుగ్రహాలకు, మనం లెక్కించలేనన్ని ఆయన జీవనోపాధులకు అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని, ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. ఈ సాక్ష్యం మా కొరకు (పరలోకంలో) ఒక నిధిగా ఉండుగాక. మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన ప్రవక్త, ఆయన గొప్ప సద్గుణాలతో ప్రత్యేకించబడినవారు. ప్రళయదినం వరకు ఆయనపై (ప్రవక్తపై) అల్లాహ్ యొక్క కారుణ్యం వర్షించుగాక. ఇక ఆ తర్వాత. దైవభీతి ఒక రక్షణ కవచం, మరియు దాని వస్త్రం ఉత్తమమైన వస్త్రం.
ఈరోజు అల్లాహ్ యొక్క దయతో ఎలాంటి పుణ్యాత్ముని గురించి మనం తెలుసుకుంటామంటే, ఆయన అల్లాహ్ యొక్క ఆరాధన ఎక్కువగా చేసేవారు. అల్లాహ్ యొక్క విధేయతలో చాలా ముందుగా ఉన్నవారు. రేయింబవళ్లు సజ్దాలో, ఖియాంలో ఉంటూ, పరలోకం పట్ల చాలా భయం కలిగి తన ప్రభువు యొక్క కారుణ్యాన్ని ఆశించేవాడు.
أَمَّنْ هُوَ قَانِتٌ آنَاءَ اللَّيْلِ سَاجِدًا وَقَائِمًا يَحْذَرُ الْآخِرَةَ وَيَرْجُو رَحْمَةَ رَبِّهِ (అమ్మన్ హువ ఖానితున్ ఆనా అల్లైలి సాజిదవ్ వ ఖాయిమా, యహ్ జరుల్ ఆఖిరత వ యర్ జూ రహ్ మత రబ్బిహ్) ఏమిటి, ఏ వ్యక్తి అయితే రాత్రి వేళల్లో సాష్టాంగప్రణామం చేస్తూ, దైవారాధనలో నిలబడుతున్నాడో, పరలోకానికి భయపడుతూ, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తున్నాడో అతను (మరియు దానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు – ఇద్దరూ సమానులు కాగలరా?)(39:9)
హాఁ! ఆయనే, చాలా సిగ్గు బిడియం గల, దైవదూతలు సైతం ఆయనతో సిగ్గుపడే అటువంటి పుణ్యాత్ముడు, ప్రవక్త యొక్క సహచరుడు హజ్రత్ ఉస్మాన్ ఇబ్నె అఫ్ఫాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు). ఆయన షహీద్ (అమరవీరులు). ఆయన స్వర్గవాసులలో ఒకరు. ఆయన ఈ లోకంలో భూమిపై నడుస్తుండగానే ఆయన స్వర్గవాసి అన్నటువంటి శుభవార్త ఇవ్వడం జరిగింది.
అవును, సహీహ్ బుఖారీలో వచ్చినటువంటి హదీస్, హదీస్ నెంబర్ 2778. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
مَنْ حَفَرَ رُومَةَ فَلَهُ الجَنَّةُ (మన్ హఫర రూమత ఫ లహుల్ జన్నహ్) “ఎవరైతే రూమా (బావిని) త్రవ్వుతారో, అతని కొరకు స్వర్గం ఉంది.”
وَمَنْ جَهَّزَ جَيْشَ العُسْرَةِ فَلَهُ الجَنَّةُ (వ మన్ జహ్ హజ జైషల్ ఉస్రతి ఫ లహుల్ జన్నహ్) “మరియు ఎవరైతే కష్టకాలంలో ఉన్న సైన్యాన్ని (తబూక్ యుద్ధ సైన్యాన్ని) సిద్ధపరుస్తారో, అతని కొరకు స్వర్గం ఉంది.”
తబూక్ యుద్ధ సందర్భంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే ఇందులో ఎవరైతే సైన్యాన్ని సిద్ధపరుస్తారో, సైన్యం కొరకు సహాయాలు అందిస్తారో, అలాంటి వారి కొరకు కూడా స్వర్గం అన్నటువంటి శుభవార్త ప్రవక్త ఇచ్చినప్పుడు, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఆ బీరె రూమాను దాని యజమాని నుండి కొని అందరి కొరకు దానం చేశారు, వక్ఫ్ చేశారు. మరియు ఆ తబూక్ యుద్ధంలో 300 ఒంటెలు ఇంకా 10,000 దీనార్లు దానం చేశారు.
ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వివాహాలు మరియు ‘జున్నూరైన్’ బిరుదు
హజ్రత్ ఉస్మాన్ ఇబ్నె అఫ్ఫాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ సుకుమార్తె అయినటువంటి రుకయ్యా (రదియల్లాహు త’ఆలా అన్హా) కు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే కొంతకాలం జీవితం గడిపిన తర్వాత, బద్ర్ యుద్ధం సందర్భంలో ఆమె చాలా అనారోగ్యానికి పాలైంది. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారిని ఆమె యొక్క బాగోగులు చూసుకుంటూ, ఆమె అనారోగ్య సమయంలో ఆమె సేవలో ఉండడానికి వదిలారు. అంతేకాదు, బద్ర్ యుద్ధంలో పాల్గొన్నటువంటి యుద్ధ వీరులకు ఏ యుద్ధ ఫలం అయితే లభించిందో, యుద్ధ ఫలంలోని ఏ భాగం లభించిందో, అలాంటి ఒక భాగం ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారికి కూడా ప్రవక్త ఇచ్చారు. అయితే హజ్రత్ రుకయ్యా (రదియల్లాహు త’ఆలా అన్హా) అదే అనారోగ్యంలో ఆ బద్ర్ యుద్ధం సందర్భంలోనే చనిపోయింది.
ఆ తర్వాత వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక సుకుమార్తె అయినటువంటి ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు త’ఆలా అన్హా)ను హజ్రత్ ఉస్మాన్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ఈ లోకంలో ప్రవక్త యొక్క కూతుర్లను ఒకరినొకరి ఇద్దరి కూతుర్లను పెళ్లి చేసుకున్నటువంటి మహానుభావుడు వేరే మరెవ్వరూ లేరు. అందుకొరకే హజ్రత్ ఉస్మాన్ గారికి ‘జున్నూరైన్’ (రెండు ప్రకాశాల యజమాని) అన్నటువంటి బిరుదు లభించింది.
బైఅతుర్ రిద్వాన్ (అల్లాహ్ ప్రసన్నత పొందిన వాగ్దానం)
ఇక హిజ్రత్ చేసి వచ్చిన తర్వాత ఆరవ సంవత్సరంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు ఉమ్రా కొరకు బయలుదేరారు. అయితే మక్కా ఖురైషులు, అవిశ్వాసులు సహాబాలు, ప్రవక్త వారు ఉమ్రా చేయకుండా అడ్డుకున్నారు. ఆ సందర్భంలో వారితో సంధి కుదుర్చడానికి, మాట్లాడడానికి హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారిని రాయబారిగా పంపడం జరిగింది. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వెంటనే ప్రవక్త ఆదేశం మేరకు బయలుదేరారు. ఎలాంటి తడబడాయించలేదు, ఏ రీతిలో కూడా వెనుక ఉండలేదు.
ఆ సందర్భంలో ఆయనకు తెలుసు, ఇక్కడ రాయబారిగా సంధి కుదుర్చడానికి వెళ్తున్నామంటే, అక్కడ మృత్యువును కూడా స్వీకరించడం లేదా వారు ఖైదీగా చేస్తే కూడా ఏమీ చేయలేక ఉండాలి. అలాంటి పరిస్థితులను గమనించి కూడా వెళ్లారు. అయితే ఎప్పుడైతే మక్కాలో ప్రవేశించారో హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు), కాబా వైపున చూశారో, ఆ సందర్భంలో ఖురైష్ యొక్క పెద్దలు, నాయకులు, “ఓ ఉస్మాన్, నీవు మాతో, నీకు మంచి సంబంధం ఉంది. కనుక మేము నీకు తవాఫ్ చేయడానికి అనుమతిస్తున్నాము. కాబా యొక్క తవాఫ్ చేయాలంటే నీవు చెయ్యి. ఎలా మేము మిమ్మల్ని అడ్డుకోము.” కానీ, అల్లాహు అక్బర్! హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఆ సమయంలో ఏం సమాధానం ఇచ్చారో తెలుసా? వారి వైపున చూస్తూ, వారితో చెప్పారు: “అల్లాహ్ సాక్షిగా, ఎప్పటివరకైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తవాఫ్ చేయరో, నేను తవాఫ్ చేయను.”
ఆ తర్వాత ఖురైష్ అతన్ని బంధించారు, అంటే పట్టుకున్నారు, ఆపుకున్నారు. ఆ సందర్భంలో హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) షహీద్ చేయబడ్డారు, హతమయ్యారు, హత్య చేయబడ్డారు అన్నటువంటి ఒక పుకారు లేసినది. అయితే ఇటు సహాబాలందరికీ ఈ విషయం తెలిస్తే, వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలందరినీ కూడా జమా చేసి, మౌత్ (మరణం) కొరకు సిద్ధం అన్నటువంటి ‘బైఅత్’ (శపధం) తీసుకున్నారు. చరిత్రలో ఇలాంటి గొప్ప బైఅత్ మరొకటి కనబడలేదు. దానినే అల్లాహు త’ఆలా స్వయంగా ‘బైఅతుర్ రిద్వాన్’ అన్నటువంటి పేరు ఇచ్చాడు. చదవండి సూరతుల్ ఫత్హ్, ఆయత్ నంబర్ 18:
لَّقَدْ رَضِيَ اللَّهُ عَنِ الْمُؤْمِنِينَ إِذْ يُبَايِعُونَكَ تَحْتَ الشَّجَرَةِ فَعَلِمَ مَا فِي قُلُوبِهِمْ (లఖద్ రదియల్లాహు అనిల్ ముఅమినీన ఇజ్ యుబాయిఊనక తహ్ తష్ షజరతి ఫ అలిమ మా ఫీ కులూబిహిమ్) (ఓ ప్రవక్తా!) విశ్వాసులు చెట్టు క్రింద నీతో (విధేయతా) ప్రమాణం చేస్తూ ఉన్నప్పుడు అల్లాహ్ వారిపట్ల ప్రసన్నుడయ్యాడు. వారి హృదయాలలో ఉన్న దాన్ని ఆయన తెలుసుకున్నాడు. (48:18)
అయితే ఆ సందర్భంలో మరో చాలా గొప్ప సంఘటన, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారి యొక్క గొప్ప ఘనత ఎంత స్పష్టమవుతుందో చూడండి. ఈ విషయం సహీహ్ బుఖారీలో వచ్చి ఉన్నది, హదీస్ నెంబర్ 3698, అలాగే ముస్నద్ బజ్జార్లో కూడా ఉంది. ఏంటి విషయం అది?
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలందరితో శపధం తీసుకుంటున్నారు. హజ్రత్ ఉస్మాన్‌కు బదులుగా ఆయన రక్తం యొక్క పరిహారం తీసుకోవడానికి మనమందరమూ యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా. ఆ సమయంలో అక్కడ ఉస్మాన్ అయితే లేరు కదా! అయితే ప్రవక్త ఏం చేశారు? తమ కుడి చెయ్యిని పైకి లేపి, కుడి చేతిని తమ స్వయంగా ఎడమ చేతిపై కొడుతూ ఏం చెప్పారు? “ఈ కుడి చెయ్యి ఉస్మాన్ యొక్క చెయ్యి. ఉస్మాన్ కూడా నాతోని బైఅత్ చేస్తున్నారు” అన్నట్లుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టపరిచి, ఉస్మాన్ యొక్క ఘనతను ఇంత గొప్పగా చాటి చెప్పారు. ఈ సందర్భంలో ధర్మవేత్తలు ఏమంటున్నారు? అల్లాహు అక్బర్! అల్లాహు అక్బర్! ప్రవక్త తమ కుడి చెయ్యిని ‘ఇది ఉస్మాన్ చెయ్యి’ అని ఏదైతే చెప్పారో, వాస్తవానికి ఆ చెయ్యి ఉస్మాన్ యొక్క చేతుల కంటే ఎంతో గొప్పదైనది.
ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఖిలాఫత్ మరియు సేవలు
ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించాక అబూబక్ర్, అబూబక్ర్ మరణించాక హజ్రత్ ఉమర్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఖలీఫా అయ్యారు. వీరిద్దరి ఖలీఫాల తర్వాత, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) 72 ఏండ్ల వయసు వచ్చినప్పుడు ఖలీఫా అయ్యారు. 12 సంవత్సరాలు ఖిలాఫత్ నడిపించారు. వారి యొక్క ఖిలాఫత్ కాలంలో చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలలో, పుణ్య కార్యాలలో, ఖుర్ఆన్ ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి, దాని యొక్క ఎన్నో కాపీలు తయారుచేసి వివిధ రాష్ట్రాలకు పంపడం, అంతేకాదు మస్జిద్-ఎ-హరామ్, మక్కతల్ ముకర్రమా, అలాగే మస్జిద్-ఎ-నబవీ, మదీనా ఈ రెండిటినీ కూడా చాలా విస్తీర్ణం చేశారు. అక్కడ వస్తున్న నమాజీల కొరకు, హజ్ ఉమ్రాలు చేసే వారి కొరకు, దాని యొక్క దర్శన కొరకు వచ్చే వారి కొరకు చాలా ఇరుకుగా అవుతుంది అని దానిని ఇంకా పెద్దగా పెంచారు.
హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క అమరత్వం
అల్లాహు అక్బర్! వాస్తవానికి హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారి యొక్క సీరత్, వారి యొక్క జీవిత చరిత్రలో చాలా గొప్ప గొప్ప ఘనమైన కార్యాలు ఉన్నాయి. అయితే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్, అల్లాహు త’ఆలా, ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క చివరి సమయం కూడా ఎంత గొప్పగా జరిగింది! అల్లాహు అక్బర్! జుమా రోజున ఆయన షహీద్ అయ్యారు. అసర్ నమాజ్ తర్వాత సమయం. జిల్ హిజ్జా యొక్క హుర్మత్ (గౌరవప్రదమైన) మాసం. ప్రజలందరూ అటు హజ్ చేసి, అయ్యాముత్ తష్రీఖ్ యొక్క రెండవ రోజు, అంటే 12వ జిల్ హిజ్జా రోజున, 84 సంవత్సరాల వయసు నిండినది, అప్పుడు షహీద్ అయ్యారు.
చాలా కఠినంగా హంతకులు ప్రవర్తించారు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) షహీద్ అయ్యేకి కొన్ని క్షణాల ముందు చెప్పారు: “నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గడిచిన రాత్రిలో స్వప్నంలో చూశాను. ప్రవక్త వారు అంటున్నారు:
اصْبِرْ، فَإِنَّكَ تُفْطِرُ عِنْدَنَا الْقَابِلَةَ (ఇస్బిర్, ఫ ఇన్నక తుఫ్ తిరు ఇందనల్ ఖాబిలహ్) ‘ఓ ఉస్మాన్, సహనం వహించు, రేపటి రోజు నీవు మాతో పాటు ఇఫ్తార్ చేస్తావు.'”
ఆ తర్వాత హజ్రత్ ఉస్మాన్ ఖుర్ఆన్ గ్రంథాన్ని తెప్పించారు, చదువుతూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు. అది ఆయన ముందు ఉన్నది, ఆయన చేతుల్లో ఖుర్ఆన్ గ్రంథం ఉండగానే దుండగులు, హంతకులు ఆయనని హతమార్చారు.
ఈ ప్రస్తావన, మరియు నేను ప్రవక్తను స్వప్నంలో చూశాను, ప్రవక్త శుభవార్త ఇచ్చారు అన్నటువంటి మాట ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉంది. షేఖ్ అహ్మద్ షాకిర్ దాని యొక్క ముహక్కిఖ్, సహీహ్ అని చెప్పారు, హదీస్ నెంబర్ 526.
అంతేకాదు, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఖుర్ఆన్ చదువుతున్న సందర్భంలో ఆ దురదృష్టవంతులు, దుండగులు, హంతకులు, పాపాత్ములు ఇంట్లో ప్రవేశించారు. వారిలోని అత్యంత దురదృష్టుడు, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారి యొక్క గడ్డాన్ని పట్టుకొని తొమ్మిది సార్లు పొడిచాడు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క శరీరం నుండి చిమ్మిన రక్తం ఏదైతే చిందిందో, దాని యొక్క ఆ రక్తం ఆయన చదువుతున్నటువంటి ఖుర్ఆన్ పై కూడా పడింది. ఖుర్ఆన్లో ఏ ప్రాంతంలో పడిందో తెలుసా? సూరతుల్ బఖరాలోని ఆయత్ నెంబర్ 137:
فَسَيَكْفِيكَهُمُ اللَّهُ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ (ఫస యక్ ఫీక హుముల్లాహ్, వ హువస్ సమీఉల్ అలీమ్) వారికి వ్యతిరేకంగా నీకు అల్లాహ్ చాలు. ఆయన అన్నీ వింటాడు, అన్నీ ఎరుగును. (2:137)
అల్లాహుమ్మర్ద అన్ అబీ బకర్ వ ఉమర వ ఉస్మాన వ అలీ వ సాయిరిస్ సహాబా. వహ్ షుర్నా ఫీ జుమ్రతిహిమ్. అల్లాహుమ్మ ఇన్నా అహ్ బబ్ నాహుమ్ వ మా రఅయ్ నాహుమ్. అల్లాహుమ్మ ర్ జుఖ్ నా సుహ్ బతహుమ్ ఫిల్ ఆఖిరతి మ’అ నబియ్యినా సల్లల్లాహు అలైహి వసల్లం.
ఓ అల్లాహ్, అబూబక్ర్, ఉమర్, ఉస్మాన్, అలీ పట్ల నీవు సంతృష్టిగా ఉండు. వారిపై నీ యొక్క సంతృష్టి మరియు నీ యొక్క కరుణను కురిపించు. అలాగే తమ అందరి సహాబాలపై కూడా. ఓ అల్లాహ్, మమ్మల్ని కూడా వారితో పాటు లేపు. ఓ అల్లాహ్, మేము వారిని చూడలేదు, కానీ వారిని ప్రేమిస్తున్నాము. కనుక ఓ అల్లాహ్, ప్రళయ దినాన ప్రవక్తతో పాటు వారి యొక్క సోహబత్, వారి యొక్క సాన్నిహిత్యం మాకు ప్రసాదించు.
ఈ సంఘటన నుండి గుణపాఠాలు
మహాశయులారా, ఈ సంఘటన ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే, మనం అన్ని రకాల బాహ్యమైన మరియు ఆంతర్యంలో ఉన్న, కనబడినవి కనబడకపోయేవి, అన్ని రకాల ఫితనాల నుండి, సంక్షోభాల నుండి అల్లాహ్ యొక్క శరణు కోరాలి. మరొక గొప్ప విషయం, ఈ విభేదాలను వదులుకోవాలి. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారు షహీద్ అవ్వడానికి ముఖ్య కారణం, ఏ ఫితనాలు, ఏ సంక్షోభాలు అయితే లేశాయో అవే. మరియు ఆ సందర్భంలో ఇమామ్‌కు, మరియు నాయకునికి వ్యతిరేకంగా ఎవరైతే లేశారో, అలాంటి వారే వారిని షహీద్ చేశారు. అయితే అల్లాహు త’ఆలా ఏదైతే మనం ఏకంగా ఉండాలని, ఐక్యంగా ఉండాలని, విభేదాలు లేకుండా ఉండాలని, పరస్పరం ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలని మాటిమాటికీ ఆదేశిస్తూ ఉంటాడో ఖుర్ఆన్ హదీసులలో, ఆ ఆదేశాలను మనం శ్రద్ధ వహించి ఆచరిస్తూ ఉండాలి. చిన్న చిన్న ప్రాపంచిక కారణాలను తీసుకొని మనం పరస్పరం ఎలాంటి చీలికల్లో పడకూడదు. అల్లాహ్ మనందరికీ హిదాయత్ ప్రసాదించు గాక, ఆమీన్.
వ ఆఖిరు ద’అవాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, “తబర్రుక్ వాస్తవికత” (శుభాన్ని ఆశించడం యొక్క వాస్తవికత) అనే అంశంపై చర్చించబడింది. వక్త తబర్రుక్‌ను రెండు రకాలుగా విభజించారు: ధర్మసమ్మతమైనది (మష్రూ) మరియు నిషిద్ధమైనది (మమ్నూ). ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ద్వారా ధృవీకరించబడిన తబర్రుక్ మాత్రమే ధర్మసమ్మతమైనదని, ఉదాహరణకు మూడు మస్జిద్‌లకు (మస్జిద్-ఎ-హరామ్, మస్జిద్-ఎ-నబవి, మస్జిద్-ఎ-అఖ్సా) ప్రయాణించడం, జమ్ జమ్ నీరు త్రాగడం, మరియు ఖురాన్‌ను పఠించి, అర్థం చేసుకుని, ఆచరించడం ద్వారా శుభం పొందడం వంటివి వివరించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వ్యక్తిత్వం, ఆయన వస్తువులు, మరియు ఆయన శరీరం నుండి వేరైన భాగాల (వెంట్రుకలు) ద్వారా శుభం పొందడం కేవలం ఆయనకు మాత్రమే ప్రత్యేకం అని, సహాబాలు ఇతరులతో ఇలా చేయలేదని స్పష్టం చేశారు. ఖురాన్ మరియు సున్నత్‌లలో ఆధారం లేని ఏ వస్తువు, ప్రదేశం, లేదా వ్యక్తి ద్వారా శుభాన్ని ఆశించడం నిషిద్ధమైన తబర్రుక్ అని, ఇది షిర్క్‌కు దారితీస్తుందని హెచ్చరించారు. దర్గాలు లేదా ఇతర సమాధుల వద్దకు శుభం కోసం ప్రయాణించడం హరామ్ అని హదీసుల ఆధారంగా వివరించారు.
الْحَمْدُ لِلَّهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنُؤْمِنُ بِهِ وَنَتَوَكَّلُ عَلَيْهِ، (అల్ హందులిల్లాహి నహ్మదుహూ వ నస్త ఈనుహూ వ నస్తగ్ ఫిరుహూ వ ను’మిను బిహీ వ నతవక్కలు అలైహ్.) సర్వ స్తోత్రాలు అల్లాహ్ కొరకే. మేము ఆయనను స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్ని కోరుతున్నాము, ఆయన క్షమాపణను వేడుకుంటున్నాము, ఆయనను విశ్వసిస్తున్నాము మరియు ఆయనపైనే నమ్మకం ఉంచుతున్నాము.
وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، (వ న ఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ ఫుసినా వ మిన్ సయ్యిఆతి అ’అమాలినా) మేము మా ఆత్మల చెడు నుండి మరియు మా కర్మల చెడు నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము.
مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، (మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ, వ మన్ యుద్ లిల్హు ఫలా హాదియ లహ్.) అల్లాహ్ ఎవరికి మార్గనిర్దేశం చేస్తాడో, వారిని ఎవరూ మార్గభ్రష్టులుగా చేయలేరు. మరియు ఆయన ఎవరిని మార్గభ్రష్టులుగా వదిలేస్తాడో, వారికి ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు.
وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، (వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహ్.) అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు.
وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، (వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహ్.) మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.
أَرْسَلَهُ بِالْحَقِّ بَشِيرًا وَنَذِيرًا، وَدَاعِيًا إِلَى اللَّهِ بِإِذْنِهِ وَسِرَاجًا مُنِيرًا. (అర్సలహూ బిల్ హఖ్ఖి బషీరవ్ వ నజీరా. వ దాఇయన్ ఇలల్లాహి బి ఇజ్నిహీ వ సిరాజమ్ మునీరా.) ఆయన (అల్లాహ్) అతన్ని (ముహమ్మద్‌ను) సత్యంతో శుభవార్తలు అందించేవాడిగా, హెచ్చరించేవాడిగా, తన అనుమతితో అల్లాహ్ వైపుకు ఆహ్వానించేవాడిగా మరియు ప్రకాశవంతమైన దీపంగా పంపాడు.
أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ (అమ్మా బ’అద్ ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్) నిశ్చయంగా, అన్ని మాటలలోకెల్లా ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం (ఖురాన్).
وَخَيْرُ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صلى الله عليه وسلم (వ ఖైరల్ హద్ యి హద్ యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు అన్ని మార్గాలలోకెల్లా ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గం.
وَشَرُّ الأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلُّ مُحْدَثَةٍ بِدْعَةٌ (వ షర్రల్ ఉమూరి ముహ్ దసాతుహా, వ కుల్లు ముహ్ దసతిన్ బిద్ అహ్) మరియు అన్ని కార్యాలలోకెల్లా చెడ్డ కార్యం (ధర్మంలో) కొత్తగా కల్పించబడినది, మరియు ప్రతి కొత్త కల్పన ఒక బిద్అత్ (ఆవిష్కరణ).
وَكُلُّ بِدْعَةٍ ضَلاَلَةٌ وَكُلُّ ضَلاَلَةٍ فِي النَّارِ (వ కుల్లు బిద్ అతిన్ దలాలహ్, వ కుల్లు దలాలతిన్ ఫిన్నార్) మరియు ప్రతి బిద్అత్ ఒక మార్గభ్రష్టత్వం, మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికి దారి తీస్తుంది.
సర్వ స్తోత్రాలు, అన్ని విధముల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. కారుణ్య శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.
అభిమాన సోదరులారా, నాటి ఈ జుమా ప్రసంగాంశం, తబర్రుక్ వాస్తవికత. తబర్రుక్ అనే విషయంలో మన సమాజంలో అనేక విధాల అపార్థాలు, ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల ఆధారంగా కాకుండా బిద్అతులు చోటు చేసుకున్నాయి. ఇన్షా అల్లాహ్ ఈరోజు తబర్రుక్ వాస్తవికత ఏమిటో తెలుసుకుందాం.
తబర్రుక్ అర్థం మరియు రకాలు
తబర్రుక్ అంటే బరకత్ నుంచి. బరకత్ పొందటం, శుభాలను పొందడం, శుభాలను ఆశించడం, శుభాలు కలగడం అనే అర్థాలు వస్తాయి తబర్రుక్ అంటే. అత్తబర్రుక్ బిష్షై అంటే ప్రత్యేకమైన ఓ వస్తువు ద్వారా శుభాన్ని కోరటం.
ఈ తబర్రుక్ రెండు రకాలు. మష్రూ తబర్రుక్ (ధర్మ సమ్మతమైన తబర్రుక్). రెండవది మమ్నూ తబర్రుక్ (నిషిద్ధమైన తబర్రుక్).
ధర్మసమ్మతమైన తబర్రుక్ (మష్రూ తబర్రుక్ )
ధర్మ సమ్మతమైన తబర్రుక్ అంటే, ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢి అయిన తబర్రుక్. ఉదాహరణకు, శుభం కొరకు, మేలు కొరకు, శుభం పొందటానికి మస్జిద్-ఎ-హరామ్ వైపుకు పయనించటం, ప్రయాణించటం. అది హదీసులో ఉంది. అలాగే మస్జిద్-ఎ-నబవి ప్రయాణించటం, అలాగే మస్జిద్-ఎ-అఖ్సా వైపు పోవటం. అంటే ఈ మూడు మస్జిదుల గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, శుభం కొరకు, మేలు కొరకు, పుణ్యం కొరకు ఈ మూడు మస్జిదుల వైపుకు ప్రయాణం చేయవచ్చు. ఇది ధర్మ సమ్మతమైన తబర్రుక్ పొందటం.
అలాగే జమ్ జమ్ నీరు, దాని గురించి స్పష్టమైన హదీసులు ఉన్నాయి, దాని యొక్క శుభం గురించి.
అలాగే ఖురాన్. స్వయంగా ఖురాన్ గ్రంథం తబర్రుక్‌తో నిండి ఉన్నది. స్వయంగా ఖురాన్ గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర అన్ఆమ్ ఆయత్ నంబర్ 155లో ఇలా తెలియజేశాడు:
وَهَـٰذَا كِتَابٌ أَنزَلْنَاهُ مُبَارَكٌ فَاتَّبِعُوهُ وَاتَّقُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ మరియు ఈ ఖురాన్ మేము అవతరింపజేసిన ఒక శుభప్రదమైన గ్రంథం. కాబట్టి మీరు దీనిని అనుసరించండి, భయభక్తులతో మెలగండి. తద్వారా మీరు కరుణించబడే అవకాశం ఉంది.
అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖురాన్ గురించి సూర సాద్, ఆయత్ 29లో ఇలా తెలియజేశాడు:
كِتَابٌ أَنزَلْنَاهُ إِلَيْكَ مُبَارَكٌ لِّيَدَّبَّرُوا آيَاتِهِ وَلِيَتَذَكَّرَ أُولُو الْأَلْبَابِ ఇదొక శుభప్రదమైన గ్రంథం. బరకత్‌తో కూడిన గ్రంథం, తబర్రుక్‌తో నిండియున్న గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటందుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకునేందుకు దీనిని నీ వైపుకు పంపాము అని అల్లాహ్ సెలవిచ్చాడు.
ఇక ఖురాన్‌తో బరకత్ పొందటం, ఖురాన్‌తో తబర్రుక్ ఆశించటం, ఇలాంటి చాలా ఆయతులు ఖురాన్‌లో ఉన్నాయి. నేను రెండు ఆయతులు పఠించాను, అన్ఆమ్ మరియు సూర సాద్ లోనిది.
ఖురాన్ ద్వారా తబర్రుక్ పొందాలంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దీంట్లో కండిషన్ పెట్టాడు. ఖురాన్ శుభప్రదం, ఎప్పుడు? ఖురాన్‌ని అనుసరిస్తే. ఖురాన్‌ని ఎప్పుడు అనుసరించాలి? పఠించాలి, పారాయణం చేయాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు అనుసరించవచ్చు. అలాగే ఖురాన్ శుభప్రదం ఎప్పుడు? చింతన చేస్తే, గుణపాఠం నేర్చుకుంటే, మన జీవితాలు ఖురాన్ పరంగా ఉంటే ఈ ఖురాన్ మనకోసం బరకత్‌గా మారిపోతుంది, మన జీవితాలలో శుభం జరుగుతుంది, శుభం మనం పొందవచ్చు, శుభాన్ని ఆశించవచ్చు ఖురాన్ ద్వారా, అంటే ఖురాన్‌ను పఠించి, ఖురాన్ పారాయణం చేసి, ఖురాన్ చింతన చేసి, గుణపాఠం నేర్చుకొని ఆచరించినట్లయితే, ఈ ఖురాన్ ద్వారా మనకి బరకత్ వస్తుంది, శుభం అవుతుంది. అలా కాకుండా, కేవలం తబర్రుక్ ఉద్దేశంతో పఠించడం లేదు, ఖురాన్ తెరిచి చూడటం లేదు, అర్థం చేసుకోవడం లేదు, కేవలం బరకత్ ఉద్దేశంతో అందమైన దుస్తులు, అందమైన ఒక చిట్టీలో, ఖరీదైన దుస్తులలో దాన్ని బంద్ చేసి, ప్రయాణం చేసేటప్పుడు వాహనంలో, కొత్త ఇల్లు కట్టేటప్పుడు ఇంట్లో, దుకాణంలో, కేవలం తబర్రుక్ ఉద్దేశంతో, చదవటం లేదు, అర్థం చేసుకోవటం లేదు, పారాయణం లేదు, ఏమీ లేదు, అది సమంజసం కాదు. ఖురాన్ ద్వారా తబర్రుక్ పొందటం స్వయంగా అల్లాహ్ తెలియజేశాడు. ఖురాన్ ద్వారా, ఖురాన్ ఆ గ్రంథమే బరకత్‌తో కూడిన గ్రంథం. ఆ ఖురాన్ ద్వారా మనం బరకత్ పొందాలంటే పఠించాలి, పారాయణం చేయాలి, అర్థం చేసుకోవాలి, దాని అనుగుణంగా నడుచుకోవాలి. దీని ద్వారా ఖురాన్ మనకి బరకత్ అవుతుంది.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తబర్రుక్
అసలు విషయం ఏమిటంటే, ఖురాన్ తర్వాత అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో శుభాన్ని పొందటం. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా శుభాన్ని పొందటం, తబర్రుక్ ఆశించటం,
ఇవి రెండు విధాలు. ఒకటి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో తబర్రుక్ పొందటం, వ్యక్తిత్వంతో ఆయన ఉన్నప్పుడు. సహాబాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను చుంబించేవారు, శుభప్రదమైన చేతులను పట్టుకునేవారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చేతులను పట్టుకొని తమ ముఖాన్ని పైన స్పర్శించుకునేవారు, తిప్పుకునేవారు, శుభం ఉద్దేశంతో, తబర్రుక్ ఉద్దేశంతో. అది అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వ్యక్తిత్వంతో తబర్రుక్‌ని పొందటం.
రెండవది, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం శుభప్రదమైన శరీరంతో, శుభవంతమైన శరీరంతో వేరైన వస్తువులు, వేరైన భాగాలు. ఆయన శుభవంతమైన శిరోజాలు, తల వెంట్రుకలు. ఆయన శరీరంకి ముట్టిన దుస్తులు, ఆయన వాడిన పాత్రలు. అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి సంబంధించిన, ఆయన వాడిన, ఆయన తొడిగిన పాత్రలు, వస్తువులతో తబర్రుక్ పొందటం.
ఇది ధర్మ సమ్మతమైనది అని మనకు పలు హదీసుల ద్వారా తెలుస్తుంది. ఉదాహరణకి ఒక రెండు, మూడు హదీసులు మనం పరిశీలిద్దాం. ముస్లిం గ్రంథంలో హదీస్ ఉంది, అస్మా బిన్తె అబీ బకర్ రదియల్లాహు అన్హా ఈ హదీస్ కి కథనం ఉల్లేఖులు. ఆమె ఇలా అంటున్నారు, అస్మా బిన్తె అబీ బకర్ రదియల్లాహు అన్హా ఎవరంటే, అబూబకర్ గారి కూతురు, ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క అక్క అస్మా రదియల్లాహు అన్హా. అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు యొక్క తల్లి అస్మా రదియల్లాహు అన్హా. ఆవిడ రదియల్లాహు అన్హా ఇలా తెలియజేశారు, ఒక ప్రవక్త గారి ఒక జుబ్బాని తీశారు, జుబ్బా, చొక్కా. అస్మా రదియల్లాహు అన్హా ఒక జుబ్బాని తీసి, ఈ జుబ్బా ఆయిషా రదియల్లాహు అన్హా బ్రతికున్నంత కాలం ఆవిడ దగ్గర ఉండింది ఈ జుబ్బా. ఆయిషా రదియల్లాహు అన్హా పరమపదించిన తర్వాత ఆ జుబ్బాని నేను నా దగ్గర పెట్టుకున్నాను. ఆ జుబ్బా ఎవరిది? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడిన జుబ్బా, తొడిగిన జుబ్బా అది. ఇప్పుడు ఆ జుబ్బా నా దగ్గర ఉంది. ఇప్పుడు మనం మనలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే, కీడు జరిగితే, స్వస్థత కోసం, చికిత్స కోసం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధరించిన ఆ జుబ్బాని మనం నీళ్ళలో వేసి, ఆ జుబ్బాని పిండితే, ఆ నీళ్ళతో మనం ఆరోగ్యం కోసం వాడేవారము, చికిత్స నిమిత్తం ఆ నీళ్లు వాడేవారము, అని అస్మా బిన్తె అబీ బకర్ రదియల్లాహు అన్హుమా సెలవిస్తున్నారు. అంటే ఈ హదీస్ ప్రామాణికమైన హదీస్, ముస్లిం గ్రంథంలో ఈ హదీస్ ఉంది.
అలాగే ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది. సహల్ బిన్ స’అద్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇలా తెలియజేశారు, ఆయన దగ్గర ఒక పాత్ర ఉండింది, మంచి నీళ్లు తాగే పాత్ర, గ్లాస్ లాంటిది, పాత్ర ఉండింది. ఆ పాత్ర, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పాత్రలో నీళ్లు ఒకప్పుడు తాగారు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికి ఉండగా ఆ పాత్రలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మంచి నీళ్లు తాగారు. ఆ పాత్ర సహల్ బిన్ స’అద్ రదియల్లాహు త’ఆలా అన్హు దగ్గర ఉండింది. ఆ పాత్ర తీసి సహల్ రదియల్లాహు అన్హు తబర్రుక్ కోసం, శుభం పొందటం కోసం తాగారని అబూ హాజిమ్ తెలియజేశారు. ఆ తర్వాత అదే పాత్రను నాకు కావాలని ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లాహి అలైహి కోరారు. ఎవరిని? సహల్ బిన్ స’అద్ రదియల్లాహు అన్హుని. ఆ పాత్ర నాకు ఇస్తారా అని కోరితే, సహల్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ గారికి కానుకగా ఆ పాత్రను ఇచ్చేశారు. అర్థం ఏమిటంటే, రిజల్ట్ ఏమిటంటే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడిన పాత్ర ఆయన అనుచరులు ఆ తర్వాత తాబయీన్లు తబర్రుక్‌గా, శుభం కోరటం కోసం వాడేవారు. అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడిన పాత్రలు, ధరించిన దుస్తులు తబర్రుక్ కోసం వాడవచ్చు అని ఈ బుఖారీ హదీస్ ద్వారా రూఢి అవుతుంది.
అలాగే అబూ జుహైఫా రదియల్లాహు అన్హు కథనం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణ నిమిత్తం మధ్యాహ్న సమయంలో బయలుదేరారు. ఒక ప్రయాణంలో మధ్యాహ్నం బయలుదేరారు. దారిలో బతహా ప్రదేశంలో నమాజ్ నిమిత్తం ఆగటానికి. దారిలో నమాజ్ చేయడానికి, జొహర్ మరియు అసర్ నమాజ్ చేయడానికి. ఆ స్థలం పేరు బతహా. అక్కడ ఆగి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేసి జొహర్, అసర్ నమాజ్ చేశారు. సహాబాలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన చెయ్యితో, చెయ్యి పట్టుకొని సహాబాలు తమ ముఖం పైన తిప్పుకున్నారు. ఈ హదీస్ రావి జుహైఫా అంటున్నారు, నేను కూడా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన చెయ్యిని పట్టుకొని నా ముఖం పైన తిప్పాను, ఉంచాను. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన చెయ్యి చల్లగా, కస్తూరి కంటే ఎక్కువ సువాసనగా ఉండింది, అని తెలియజేశారు. అంటే ఈ విధంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వాడిన వస్తువుల ద్వారా, స్వయంగా ఆయన బ్రతికి ఉన్నంతకాలం, స్వయంగా ఆయన వ్యక్తిత్వంతో తబర్రుక్ తీసుకోవటం, తబర్రుక్ ని పొందటం ఇది ధర్మ సమ్మతము.
బుఖారీలోనే ఇంకో హదీసులో ఇలా ఉంది:
فَجَعَلَ النَّاسُ يَأْخُذُونَ مِنْ فَضْلِ وَضُوئِهِ فَيَتَمَسَّحُونَ بِهِ (ఫ జ’అలన్నాసు య’ఖుజూన మిన్ ఫద్లి వుజూఇహీ ఫ యతమస్సహూన బిహీ) అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేస్తే, వుజూలో మిగిలిన నీళ్లను సహాబాలు తీసుకునేవారు. ఆ నీళ్లను తమ శరీరం పైన పూసుకునేవారు, ముఖం పైన పూసుకునేవారు, తమ పైన జల్లుకునేవారు, తబర్రుక్ ఉద్దేశంతో.
అభిమాన సోదరులారా, అలాగే ముస్లిం గ్రంథంలో ఒక హదీస్ ఉంది, హజ్ సమయంలో అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మినా రోజు అది ఖుర్బానీ ఇచ్చిన తర్వాత, క్షవరం చేసుకున్నప్పుడు, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ శుభవంతమైన శిరోజాలను కుడి వైపు, ఎడమ వైపు సహాబాలకు పంచారు. తబర్రుక్ ఉద్దేశంతో సహాబాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన శిరోజాలను తమ వద్ద ఉంచుకున్నారు.
దీంతో ఏమర్థమవుతుంది? అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికున్నంత కాలం ఆయన వ్యక్తిత్వంతో తబర్రుక్ పొందవచ్చు, ఆయన వాడిన, వేసుకున్న, ధరించిన దుస్తుల ద్వారా, ఆయన శరీరం నుంచి వేరైన, అది వెంట్రుకలు, ద్వారా, అలాగే ఆయన వాడిన పాత్రల ద్వారా సహాబాలు తబర్రుక్ పొందారని రూఢి అయ్యింది, ఇది ధర్మ సమ్మతమే. కాకపోతే, ఇది కేవలం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకే పరిమితం. ప్రత్యేకంగా ఆయన కొరకే ఇది.
అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని పోల్చుకుంటూ ఇతర ఔలియాలు, ధర్మ పండితులు, పుణ్య పురుషులు, సజ్జనుల విషయంలో ఇలా చేయటం షిర్క్ అవుతుంది. ధర్మ పండితులు ఇతరులకి, దర్గాలకి పోయి శుభాన్ని కోరటం, ఇది ఫలానా పీర్ జుబ్బా అని, ఇది ఫలానా ఔలియా చొక్కా అని, ఇది ఫలానా ఔలియా పాత్ర అని, ఇది ఫలానా ఔలియాకి ఇది, ఇది అని, అది అని, ఇది ఔలియాలు, బుజుర్గులు, పీర్లు, ధర్మ పండితులు, పుణ్య పురుషులు, సజ్జనులు ఎవరైనా సరే. అంతెందుకు? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత అందరి కంటే ఉత్తములు ఎవరు? అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు. ఉమ్మతె ముహమ్మదియాలో, ప్రవక్తల పరంపర తర్వాత, ప్రవక్తల తర్వాత, ఉమ్మతె ముహమ్మదియాలో అందరికంటే పెద్ద వలీ ఎవరు? అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు. ఎవరైతే ప్రపంచంలో వలీ, వలీ, వలీ అని పేరు పొందారో, వారికంటే పెద్ద వలీ అబూబకర్ రదియల్లాహు అన్హు. ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు. ఆ తర్వాత ఉస్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు. ఆ తర్వాత అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు త’ఆలా అన్హు. ఆ తర్వాత అషర ముబష్షరా. పది మంది సహాబాలకి ప్రవక్త గారు స్వయంగా ఒకే హదీసులో స్వర్గం శుభవార్త ఇచ్చారు. ముహాజిర్లు, అన్సార్లు, అంత పెద్ద పెద్ద సహాబాల ద్వారా ఎవరైనా ఇతర సహాబాలు, తాబయీన్లు శుభాన్ని ఆశించారా? తబర్రుక్ పొందారా? తబర్రుక్ నిమిత్తం ఇలా చేశారా? స్వయంగా ఈ నలుగురు ఖలీఫాలు, అషర ముబష్షరా, ముహాజిరీన్లు, అన్సార్లు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో కాకుండా, ఆయన జుబ్బా, ఆయన వాడిన పాత్ర, ఆయన శరీరం నుంచి వేరైన ఆ శుభవంతమైన శిరోజాలు, ఇవి కాకుండా, ప్రవక్త గారు ఎక్కడ నమాజ్ చేశారో, ప్రవక్త సమాధి నుంచి శుభం తీసుకున్నారా? మనకంటే ఎక్కువగా ధర్మం తెలిసిన వారు. ప్రవక్త గారి జీవితాన్ని చూసిన వారు. ఖురాన్ యొక్క అర్థం ప్రవక్తతో తెలుసుకున్న వారు. అటువంటి సహాబాలు కూడా, ఇది తబర్రుక్ అనేది చేయలేదు. అది ఒక ప్రత్యేకంగా ఉంది, దేని ద్వారా తబర్రుక్ తీసుకోవాలి అనేది ఖురాన్లో అల్లాహ్ తెలియజేశాడు, హదీసులలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఖురాన్ మరియు హదీస్ పరంగా ఉంటే అది ధర్మ సమ్మతం, అది చేయాలి. మంచి విషయం.
ఉదాహరణకు ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. జమ్ జమ్ నీరు ఉంది. వర్షపు నీళ్లు ఉంది. వర్షపు నీరు శుభవంతమని, ఎందుకు? దాంతో ప్రయోజనం ఉంది. తాగుతాము, బ్రతుకు ఉంది, పంటలు పండుతాయి, దాంతో మేలు జరుగుతుంది. శుభవంతమైనది. హజరె అస్వద్ ఉంది. ప్రవక్త గారు ముద్దాడారు. స్వర్గం నుంచి వచ్చిందని చెప్పారు. శుభవంతమైన ఉద్దేశంతో మనం కూడా ముద్దాడతాం. ఆ విధంగా దేని గురించి ఖురాన్లో ఉందో తబర్రుక్ పొందవచ్చు అని, దేని గురించి ప్రవక్త గారు స్వయంగా చెప్పారో తబర్రుక్ ఉంది అని, మరి ఏ విషయాల గురించి ప్రాక్టికల్గా సహాబాలు అమలు చేశారో వాటితో తబర్రుక్ పొందటం, ఆశించటం ధర్మ సమ్మతమే. అవి కాకుండా ప్రస్తుతం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేరు, పరమపదించారు. అంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో తబర్రుక్ పొందేది లేదు, అది అయిపోయింది. రెండవది, ఆయన శరీరం నుంచి వేరైన వస్తువులు, ఆయన దుస్తులు, పాత్రలు, వెంట్రుక, అవి ఇప్పుడు ప్రపంచంలో ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢి అవ్వలేదు, ఎక్కడ ఉన్నాయి అనేది. నిజంగానే ప్రామాణికమైన హదీసుల ద్వారా ఇప్పుడు కూడా రూఢి అయితే అది ధర్మ సమ్మతమే, తబర్రుక్ ఉద్దేశంతో వాడవచ్చు. కాకపోతే రూఢి అవ్వలేదు, ప్రవక్త యొక్క సంబంధించిన వస్తువులు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం శరీరంతో వేరైన వస్తువులు ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయి అనేది ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢి లేదు కాబట్టి. ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ తబర్రుక్‌తో కూడిన అన్ని విషయాలన్నీ పాత ఇండియాలోనే ఉన్నాయి. ఇది ఫలానా ఔలియా, ఇది ఫలానా పీరు, ఇది ఫలానా సహాబీ, ఇది ఫలానా వ్యక్తిది పగడా, ఇది ఫలానా వ్యక్తిది పగడి, ఇది ఫలానా వ్యక్తిది జుబ్బా, ఇది ఫలానా వ్యక్తిది పాత్ర, ఇది ఫలానా ఔలియా గ్లాసు, ఇది ఫలానా ఔలియా వెంట్రుక, ఇది ఫలానా ఔలియా పాదము, ఇది ఫలానా ఔలియా చెప్పులు, ఇవంతా పాత ఇండియాలోనే ఉన్నాయి, అరబ్ దేశాల్లో లేవే? అంటే మనము సృష్టించుకున్నాము. ఒకవేళ ఉన్నా, ఆ తబర్రుక్ అనేది కేవలం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకే పరిమితం, ప్రత్యేకం. ఆయన తప్ప సహాబాలకి అది లేదు. అబూబకర్ రదియల్లాహు కంటే పెద్ద వలీ ఉన్నారా? ఉమర్ కంటే పెద్ద వలీ ఉన్నారా? ఖులఫా-ఎ-అర్బా కంటే పెద్ద వలీలు ఉన్నారా? వారి ద్వారానే వారి అనుచరులు, వారి స్నేహితులు ఆ తర్వాత తాబయీన్లు వారి ద్వారా తబర్రుక్ పొందలేదు కదా, అంటే అది ధర్మ సమ్మతం కాదు అని అర్థం అయిపోయింది.
నిషిద్ధమైన తబర్రుక్ (మమ్నూ తబర్రుక్)
కాకపోతే ఒక హదీస్ ద్వారా మనము తెలుసుకుందాము. ఒక సందర్భంలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హునైన్ కి పోయారు. అబూ వాఖిద్ అల్లైసీ తెలియజేస్తున్నారు, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో పాటు హునైన్ కి పోయాము.
خَرَجْنَا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِلَى حُنَيْنٍ (ఖరజ్నా మ’అన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హునైన్) మేము దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో పాటు హునైన్ కి పోయాము.
అది యుద్ధ సమయంలో.
وَنَحْنُ حُدَثَاءُ عَهْدٍ بِكُفْرٍ (వ నహ్ను హుదసాఉ అహ్దిన్ బికఫ్రిన్) అప్పుడు మేము కొత్త కొత్తగా ఇస్లాం స్వీకరించాము. అంటే అప్పుడే మేము ఇస్లాం స్వీకరించిది, కొత్తగా ముస్లిములము. కొత్తగా ఇస్లాం స్వీకరించాము.
وَلِلْمُشْرِكِينَ سِدْرَةٌ يَعْكُفُونَ عِنْدَهَا وَيَنُوطُونَ بِهَا أَسْلِحَتَهُمْ (వ లిల్ ముష్రికీన సిద్రతున్ య’అకిఫూన ఇందహా వ యనూతూన బిహా అస్లిహతహుం) అక్కడ ఆ హునైన్ ఆ స్థలంలో ఒక రేయి చెట్టు ఉండింది. ముష్రికీన్లు, బహుదైవారాధకులు ఆ రేయి చెట్టు పైన తమ ఆయుధాలను వ్రేలాడదీసేవారు, తబర్రుక్ ఉద్దేశంతో. చేసేది ఎవరు? ముష్రికీన్లు, తబర్రుక్ ఉద్దేశంతో అలా చేసేవారు.
అది చూసి ఈ కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారు, “ఓ దైవ ప్రవక్త,” దానికి జాతు అన్వాత్ అని పేరు ఉంది హదీస్ పుస్తకంలో, ఆ రేయి చెట్టు పైన అది వారు ఆయుధాలు వ్రేలాడదీస్తారు కదా, దాని పేరు జాతు అన్వాత్. ఈ కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారు దైవ ప్రవక్తతో, “ఓ దైవ ప్రవక్త, ఏ విధంగా అయితే ఆ బహుదైవారాధకులు, ఆ ముష్రికీన్లు తబర్రుక్ నిమిత్తం, శుభం పొందటానికి ఈ చెట్టు పైన ఆయుధాలు వ్రేలాడదీస్తున్నారు కదా, మా కోసం కూడా మీరు ఒక అన్వాత్‌ని తయారు చేయండి” అన్నారు, తబర్రుక్ కోసం.
అప్పుడు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసహనంతో ఏమన్నారంటే:
قُلْتُمْ وَالَّذِي نَفْسِي بِيَدِهِ كَمَا قَالَ قَوْمُ مُوسَى: اجْعَل لَّنَا إِلَٰهًا كَمَا لَهُمْ آلِهَةٌ (ఖుల్తుమ్ వల్లజీ నఫ్సీ బియదిహీ కమా ఖాల ఖవ్ము మూసా: ఇజ్అల్ లనా ఇలాహన్ కమా లహుమ్ ఆలిహహ్) అల్లాహ్ సాక్షిగా, ఆ దేవుని సాక్షిగా ఎవరి చేతిలో అయితే నా ప్రాణం ఉందో, అంటే అల్లాహ్ సాక్షిగా, మీరు చెప్పిన మాట చాలా పెద్ద మాట. ఏ విధంగా అయితే మూసా జాతి ప్రజలు మూసా అలైహిస్సలాంని కోరారు. మూసా అలైహిస్సలాం బనీ ఇస్రాయిల్. ఆ బనీ ఇస్రాయిల్లో బహుదైవారాధకులు షిర్క్ చేసేవారు ఆ ఆవు దూడని పూజించేవారు కదా. మూసా అలైహిస్సలాంకి విశ్వసించిన వారు కూడా అడిగారు: “ఓ మూసా అలైహిస్సలాం, వారికి ఏ విధంగా ఇలాహ్ ఉన్నాడో, అలాగే మాకు కూడా ఒక ఇలాహ్ తయారు చేయండి” అన్నారు.
ఇన్నకుమ్ కౌమున్ తజ్హలూన్ (నిశ్చయంగా మీరు ఇంకా అజ్ఞానులే) అని సమాధానం ఇచ్చారు. అంటే అది ఉపమానంగా ఇస్తూ అంతిమ దైవ ప్రవక్త, “ఇప్పుడు కూడా మీకు ఇంకా పాత జ్ఞాపకాలే ఉన్నాయా? పాత ఆచారాలే ఉన్నాయా? ఇంకా మీ ఈమానంలో, మీ విశ్వాసంలో ఇంకా తేడా రాలేదా?” అని అసహనంగా ప్రవక్త గారు బాధపడ్డారు. అంటే, ఇది అధర్మమైన తబర్రుక్, మమ్నూ తబర్రుక్. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఉన్నా కూడా, ఈ చెట్ల ద్వారా, పుట్టల ద్వారా, పండ్ల ద్వారా తబర్రుక్ లేదు అని ఈ హదీస్ ద్వారా రూఢి అయిపోయింది. ఈ హదీస్ ముస్నద్ అహ్మద్ లో ఉంది, ఇది సహీ హదీస్ ఇది.
అలాగే చివర్లో, బుఖారీ కితాబు ఫద్లిస్సలాత్‌లో ఒక హదీస్ ఉంది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:
لاَ تُشَدُّ الرِّحَالُ إِلاَّ إِلَى ثَلاَثَةِ مَسَاجِدَ الْمَسْجِدِ الْحَرَامِ وَمَسْجِدِ الرَّسُولِ -صلى الله عليه وسلم- وَمَسْجِدِ الأَقْصَى (లా తుషద్దుర్రిహాలు ఇల్లా ఇలా సలాసతి మసాజిద్: అల్ మస్జిదిల్ హరామ్, వ మస్జిదిర్రసూల్, వ మస్జిదిల్ అఖ్సా.)
ఈ భూమండలంలో అన్నిటికంటే పవిత్రమైన స్థలాలు ఏమిటి? మస్జిద్‌లు. ఎక్కడైనా సరే, పవిత్రంగా, అన్నిటికంటే పవిత్రం. కాకపోతే, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ తెలియజేశారు, శుభాలు పొందే ఉద్దేశంతో, తబర్రుక్ ఉద్దేశంతో ప్రయాణం చేయటం నిషిద్ధం, హరామ్. అది మస్జిద్ అయినా సరే.
ఫలానా దేశంలో ఫలానా మస్జిద్ ఉంది, అక్కడ పోయి నమాజ్ చేస్తే పుణ్యం వస్తుంది, శుభం కలుగుతుంది, తబర్రుక్ ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రయాణం చేయటం హరామ్. మూడు మస్జిద్‌లు తప్ప. మస్జిద్-ఎ-హరామ్ (మక్కా), మస్జిద్-ఎ-నబవి (మదీనా), మస్జిద్-ఎ-అఖ్సా (ఫలస్తీన్). ఈ మూడు మస్జిద్‌లు తప్ప, అంటే ఈ మూడు మస్జిద్‌లు శుభం పొందే ఉద్దేశంతో, తబర్రుక్ ఉద్దేశంతో ప్రయాణం చేయవచ్చు. హదీస్ ద్వారా రూఢి అయ్యింది, ధర్మ సమ్మతం. ఈ మూడు మస్జిద్‌లు తప్ప ప్రపంచంలో ఎక్కడైనా సరే, మస్జిద్ అయినా సరే, తబర్రుక్ ఉద్దేశంతో ప్రయాణం చేయటం హరామ్.
అయితే, దర్గా విషయం ఏమిటి? దర్గాకి పోతున్నారు, స్త్రీలు, పురుషులు, హిజాబ్ లేదు, చాలా ఖురాన్‌కి, హదీస్‌కి విరుద్ధంగా, మరి తబర్రుక్. ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమాధితో తబర్రుక్ లేదు. ఆయన మదీనాలో నడిచిన వీధులతో తబర్రుక్ లేదు. ఆయన యుద్ధాలు చేసిన యుద్ధ మైదానం ద్వారా తబర్రుక్ లేదు. దేని ద్వారా తబర్రుక్ ఉందో, అది రూఢి అయ్యింది ఖురాన్, హదీస్‌లో ఉంది. అవి తప్ప అది మస్జిద్ అయినా, సమాధి అయినా, దర్గా అయినా, ఔలియా అయినా, సజ్జనులైనా, పుణ్య పురుషులైనా తబర్రుక్ అనేది లేదు. ఒకవేళ తబర్రుక్‌గా భావిస్తే, వాటి ద్వారా శుభాన్ని కోరితే, అది షిర్క్ క్రిందికి వస్తుందని ధర్మ పండితులు తెలియజేశారు.
అభిమాన సోదరులారా, ఇవి సారాంశం, ధర్మ సమ్మతమైన తబర్రుక్, నిషిద్ధమైన తబర్రుక్.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఖురాన్ మరియు హదీస్‌ను అర్థం చేసుకొని, దాని అనుగుణంగా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ త’ఆలా మనందరికీ ఖురాన్ మరియు హదీస్ యొక్క సరైన అవగాహన కలిగే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్, సుమ్మా ఆమీన్. వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర వక్త: సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/c8YBKq1fepo [30 నిముషాలు]
ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప సహాబీ అయిన అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్రను క్లుప్తంగా వివరించబడింది. ఇస్లాం స్వీకరించక ముందు ఆయన పేరు, స్వీకరించిన తర్వాత ప్రవక్త వారు పెట్టిన పేరు, మరియు ఆయనకు “అబూ హురైరా” (పిల్లికి తండ్రి) అనే బిరుదు ఎలా వచ్చిందో వివరించబడింది. ఆయన యెమన్ దేశంలోని దౌస్ తెగలో జన్మించి, తండ్రిని కోల్పోయి తల్లి వద్ద పెరిగిన తీరు, మరియు తుఫైల్ బిన్ అమర్ దౌసీ (రదియల్లాహు అన్హు) ద్వారా ఇస్లాం స్వీకరించిన వృత్తాంతం చెప్పబడింది. మదీనాలో ఆయన అనుభవించిన తీవ్ర పేదరికం, అహ్ల్ అస్-సుఫ్ఫాలో ఒకరిగా జీవించిన విధానం, మరియు ప్రవక్త వారి దుఆ ఫలితంగా ఆయన తల్లి ఇస్లాం స్వీకరించిన అద్భుత సంఘటనను కళ్ళకు కట్టినట్టు వివరించారు. ప్రవక్త వారి తర్వాత, వివిధ ఖలీఫాల కాలంలో ఆయన పాత్ర, బహ్రెయిన్ గవర్నర్‌గా ఆయన సేవలు, మరియు ఆయన మరణ సమయంలో పరలోకం గురించి ఆయనకున్న భయభక్తులను ఈ ప్రసంగం తెలియజేస్తుంది. అత్యధికంగా 5,374 హదీసులను ఉల్లేఖించిన సహాబీగా ఆయన స్థానం, మరియు ఆయన అద్భుతమైన జ్ఞాపకశక్తిని కూడా ఈ ప్రసంగంలో ప్రస్తావించారు.
اَلْحَمْدُ لِلّٰهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللّٰهِ [అల్-హమ్దు లిల్లాహ్, వస్సలాతు వస్సలాము ‘అలా రసూలిల్లాహ్] సకల స్తోత్రములు, పొగడ్తలు అల్లాహ్ కే శోభస్తాయి. మరియు అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు ఆయన ప్రవక్తపై వర్షించుగాక.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ [అస్సలాము ‘అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు] మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
ఈనాటి ప్రసంగంలో మనం ఒక గొప్ప సహాబీ గురించి తెలుసుకోబోతున్నాము. ఆయన గొప్పతనం ఏమిటంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన కోసము, ఆయన తల్లి కోసము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ప్రత్యేకంగా దుఆ చేసి ఉన్నారు. హదీసు గ్రంథము చిన్నది అయినా సరే, పెద్దది అయినా సరే, ఆయన పేరు తప్పనిసరిగా అందులో ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించబడి ఉంటుంది. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నుండి 5,374 హదీసులు, ఉల్లేఖనాలు ఉమ్మత్ అనుచర సమాజం వరకు చేరవేర్చి ఉన్నారు. ఇలాంటి విశిష్టతలు కలిగిన ఆ సహాబీ ఎవరనుకుంటున్నారా? ఆయనే అబూ హురైరా రజియల్లాహు త’ఆలా అన్హు వారు. రండి, ఇన్ షా అల్లాహ్, ఈ ప్రసంగంలో మనం అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్ర క్లుప్తంగా, ఇన్ షా అల్లాహ్, తెలుసుకుందాం.
పేరు & కున్నియత్
ఆయన ఇస్లాం స్వీకరించక ముందు ఆయనకు అబ్దుష్ షమ్స్ అని పేరు ఉండేది. ఇస్లాం స్వీకరించిన తర్వాత, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ పేరు సరికాదు అని మార్చి అబ్దుర్రహ్మాన్ అని పేరు పెట్టారు. అయితే, అబూ హురైరా అని ఆయనకు కున్నియత్, నామాంతరము ఉండేది. అబూ హురైరా అంటే దాని అర్థం ఏమిటి? చిన్న పిల్లికి తండ్రి అని అర్థం. ఆ పేరు ఆయనకు ఎందుకు పెట్టబడింది అంటే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, ఆయన ఒక పిల్లిని పోషిస్తూ ఉండేవారు. ఆ పిల్లి ఆయన మీద అభిమానంతో ఎల్లప్పుడూ ఆయన వెంట వెంట తిరుగుతూ ఉండేది, ఆయన ఒడిలో కూర్చుంటూ ఉండేది. అది చూసిన ప్రజలు ఆయనకు అబూ హురైరా, చిన్న పిల్లికి తండ్రి అని నామాంతరము, కున్నియత్ పెట్టేశారు అని అంటూ ఉన్నారు.
జననం మరియు బాల్యం
ఇక అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఎక్కడ జన్మించారు అని మనం చూచినట్లయితే, యెమన్ దేశంలోని దౌస్ తెగలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు జన్మించారు. ఆయన జన్మించిన కొద్ది రోజులకే వారి తండ్రి మరణించారు. ఆయన అనాథగా తల్లి వద్ద పెరిగారు. తల్లి పేరు ఉమైమ. ఆమె అబూ హురైరా వారిని ఎంతో ప్రేమ, అనురాగాలతో పోషించారు.
ఇక అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఎలా ఇస్లాం స్వీకరించారన్న విషయాన్ని మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో భాగంగా తుఫైల్ బిన్ అమర్ దౌసీ రజియల్లాహు అన్హు వారి ఇస్లాం స్వీకరణ మనము విని ఉన్నాం. తుఫైల్ బిన్ అమర్, ఈయన కూడా యెమన్ దేశస్థులు, దౌస్ తెగకు చెందినవారు, గొప్ప కవి కూడా. మక్కాకు ఒకసారి వచ్చారు. మక్కా వాసులు ఆయనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడకండి, ఆయన మాటలు వినకండి అని హెచ్చరించారు. ఆయన ప్రారంభంలో ప్రవక్త వారి మాటలు వినకూడదు అనుకున్నారు. తర్వాత లోలోపల ఆలోచించి, “నేను కవిని, మంచి చెడులో వ్యత్యాసాన్ని గ్రహించగలిగే వాడిని, మరి అలాంటప్పుడు ముహమ్మద్ మాటలు వినటానికి నేను ఎందుకు భయపడాలి” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు విన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా ఆయన తరపు నుంచి ఏమీ మాట్లాడేవారు కాదు కదా! దైవ వాక్యాలు ప్రజలకు బోధించేవారు కదా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తుఫైల్ బిన్ అమర్ వారికి దైవ వాక్యాలు వినిపించినప్పుడు, ఆయన దైవ వాక్యాలను అర్థం చేసుకొని వెంటనే ఇస్లాం స్వీకరించేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు, “మీ తెగ వారికి కూడా వెళ్లి మీరు ఇస్లాం గురించి బోధించండి” అని ఆదేశించినప్పుడు, ఆయన దౌస్ తెగకు తిరిగి వెళ్లి ఇస్లాం వైపుకి ఆహ్వానించారు. ప్రారంభంలో తెగ వారు ఎవరూ కూడా ఆయన మాటను పట్టించుకోలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు మళ్లీ వెళ్లి ప్రయత్నము చేయమని ఆదేశించినప్పుడు, మళ్లీ వెళ్లి ఆయన ప్రయత్నము చేయగా 80 కుటుంబాలు అల్-హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించాయి. అలా ఇస్లాం స్వీకరించిన వారిలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు.
మదీనా వలస మరియు ఖైబర్ యుద్ధం
మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో విన్నాం అండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణము చేసి వెళ్లిపోయారు. మదీనాకు వలస ప్రయాణం చేసి వెళ్లిపోయిన ఆరవ లేదా ఏడవ సంవత్సరంలో తుఫైల్ బిన్ అమర్ వారు 80 కుటుంబాలను తీసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి హాజరయ్యారు. మదీనాకు వచ్చి చూస్తే, అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేరు. ఆ సమయానికి ఆయన సైన్యముతో పాటు ఖైబర్ ప్రదేశానికి వెళ్లి ఉన్నారు, అక్కడ యూదులతో యుద్ధం సంభవిస్తూ ఉంది. దౌస్ తెగకు చెందిన తుఫైల్ బిన్ అమర్ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు, మిగతా ప్రజలు కొంతమంది మదీనా నుండి చక్కగా ఖైబర్‌కు వెళ్లిపోయారు. ఆ ప్రకారంగా, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మొదటిసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎక్కడ కలిశారు అంటే ఖైబర్ ప్రదేశంలో కలిశారు. ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేసి, అల్-హమ్దులిల్లాహ్ ఆ తర్వాత ఆయన కూడా, దౌస్ తెగ ప్రజలు కూడా యుద్ధంలో పాల్గొని విజేతలుగా మదీనాకు తిరిగి వచ్చేశారు.
మదీనాలో జీవనం మరియు పేదరికం
మదీనాకు వచ్చేసిన తర్వాత ఏమి జరిగిందంటే, దౌస్ తెగకు చెందిన చాలా మంది ప్రజలు వేరే వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. కానీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మూడు విషయాల కారణంగా మదీనాలోనే స్థిరపడిపోయారు. మొదటి విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పదే పదే చూడాలనే కోరిక. రెండవ విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేయాలనే కోరిక. మూడవ విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఇస్లాం శిక్షణ మరియు ధార్మిక శిక్షణ పొందాలనే కోరిక. ఈ మూడు విషయాల కారణంగా అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మదీనాలోనే స్థిరపడిపోయారు. అయితే, గమనించాల్సిన విషయం ఏమిటంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు యెమన్ నుండి మదీనాకు వస్తున్నప్పుడు తల్లిని కూడా వెంట తీసుకొని వచ్చారు. తల్లి ఇస్లాం స్వీకరించలేదు, అయినా గానీ ఆవిడను వెంటబెట్టుకొని మదీనాకు వచ్చేసి ఉన్నారు.
ఇక్కడ మదీనాలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వేరే ఏ వృత్తిని కూడా ఆయన ఎంచుకోకుండా, కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నుండి ఎక్కువగా మాటలు, ఉల్లేఖనాలు, హదీసులు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ పని కోసం ఆయన పూర్తిగా అంకితమైపోయారు. మస్జిద్-ఎ-నబవీలో ఉండిపోతూ ఉండేవారు. ఆయన లాగే మరికొంత మంది సహాబాలు కూడా ఉండేవారు. వారందరినీ కూడా అస్హాబుస్ సుఫ్ఫా అనేవారు. అజియాఫుల్ ఇస్లాం అని, అజియాఫుల్లాహ్ అని, ఖుర్రా అని వారిని పిలిచేవారు. వారందరూ కూడా నిరుపేదలే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారందరి కోసము ఒక ప్రదేశాన్ని కేటాయించి నీడ సౌకర్యము కూడా కల్పించారు. వారందరూ కూడా ఆ ప్రదేశంలో సేద తీరేవారు.
ఇక, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మదీనాలో ఉంటున్నప్పుడు చాలా పేదరికము మరియు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ఆయన స్వయంగా తెలియజేసిన విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాలలో రెండు రెండు రోజులు, మూడు మూడు రోజులు ఆయనకు తినటానికి ఏమీ దొరకని కారణంగా పూర్తిగా నీరసించిపోయి, ఒక్కొక్కసారి స్పృహ కోల్పోయి పడిపోతే, ప్రజలు ఆయన పడుకుంటూ ఉన్నాడేమోలే అనుకునేవారు. మరికొంత మంది అయితే, ఏమైంది ఈయనకు ఎక్కడంటే అక్కడ పడుకుంటున్నారు, పిచ్చి పట్టిందా అని కూడా కొంతమంది భావిస్తూ ఉండేవారు. కానీ వాస్తవానికి, ఆయన నీరసించిపోయి స్పృహ కోల్పోయి పడిపోయేవారు.
ఒకసారి ఆయన కడుపు మీద రాయి కట్టుకొని కూర్చొని ఉన్నారు. ఎవరైనా కనిపిస్తే వారితో మాట్లాడుదాము, వారు ఏమైనా తినటానికి ఇస్తారేమో అని ఆశిస్తూ ఉన్నారు. అంతలోనే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అటువైపు వచ్చారు. ఆయనతో మాట్లాడారు, ఆయన కేవలం మాట్లాడి పలకరించి వెళ్లిపోయారు. తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు వారు వచ్చారు, ఆయనను పలకరించారు, ఆయన కూడా కేవలం పలకరించి మాట్లాడి ముందుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడితే, వెంటనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ముఖ కవళికను గమనించి అర్థం చేసుకొని, “నాతో పాటు రండి” అని ఇంటికి తీసుకుని వెళ్లారు. ప్రవక్త వారి ఇంట్లో ఒక పాత్రలో కొన్ని పాలు ఉన్నాయి. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి ఆదేశిస్తూ, “మీ మిగతా మిత్రులు మస్జిద్ లో ఉన్నారు కదా, అస్హాబుస్ సుఫ్ఫా, వారందరినీ కూడా పిలుచుకొని రండి” అన్నారు. ఆయన మనసులో ఆశ్చర్యపోతూ ఉన్నారు, “ఏమిటండి, ఒక చిన్న పాత్రలో ఉన్న పాలు అంత మంది నా మిత్రులకు సరిపోతాయా?” అని లోలోపల ఆశ్చర్యపోతూ ఉన్నారు, కానీ ప్రవక్త వారి ఆజ్ఞ కదా, పాటించాలి కదా, కాబట్టి వెళ్లి వారందరినీ పిలుచుకొని వచ్చారు. వారందరూ ప్రవక్త వారి ఇంటికి వచ్చినప్పుడు ప్రవక్త వారు తమ స్వహస్తాలతో ఆ పాత్ర ఒక శిష్యునికి అందజేసి, అల్లాహ్ నామాన్ని తలుచుకొని తాగటం ప్రారంభించండి అన్నారు. ఒక శిష్యుడు తాగాడు, వేరే వారికి ఇచ్చాడు. ఆయన తాగాడు, వేరే వారికి ఇచ్చాడు. ఆ ప్రకారంగా అక్కడ ఉన్న వారందరూ కూడా తాగేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి కూడా ఇచ్చారు. ఆయన కూడా ఒకసారి తాగి ఇచ్చేస్తూ ఉంటే, “లేదు మరొకసారి తాగండి, మరొకసారి తాగండి” అని ఇంచుమించు ప్రవక్త వారు మూడు నాలుగు సార్లు ఆయనకు తాగమని చెప్పగా, ఆయన తాగేసి, “ఓ దైవ ప్రవక్త, నా కడుపు నిండిపోయిందండి, ఇక నేను తాగలేను” అని ఇచ్చేయగా, చివరిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ పాలు త్రాగారు. అల్లాహు అక్బర్! ఒక గిన్నెలో ఉన్న పాలు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందులోనే ఎంత వృద్ధి, బరకత్ ఇచ్చాడంటే, అక్కడ ఉన్న వారందరూ కూడా అల్-హమ్దులిల్లాహ్ తనివి తీరా త్రాగగలిగారు.
అలాగే మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా గౌరవించేవారు, అభిమానించేవారు. ప్రవక్త వారికి సేవలు కూడా చేస్తూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు నీటి ఏర్పాటు చేసేవారు, వేరే వేరే పనులు కూడా ప్రవక్త వారి పనులు ఆయన చేసి పెడుతూ ఉండేవారు.
తల్లి ఇస్లాం స్వీకరణ
అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి కూడా మదీనాకు వచ్చి ఉన్నారు, ఆవిడ ఇస్లాం స్వీకరించలేదు అని మనం ఇంతవరకే విని ఉన్నాము కదండీ. తల్లిని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా గౌరవించేవారు, అభిమానించేవారు. ఎందుకంటే, పసితనంలోనే తండ్రి మరణించినా ఆవిడ బిడ్డను పోషించుకుంటూ ఉండిపోయారు గానీ మరొక వివాహము చేసుకోలేదు. కాబట్టి, బిడ్డ కోసం అంకితమైన తల్లి కోసము బిడ్డ, అనగా అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా చాలా అభిమానించేవారు, సేవలు చేసేవారు, గౌరవించేవారు. ఆవిడ కూడా ఇస్లాం స్వీకరించాలని పదేపదే వెళ్లి ఇస్లాం గురించి బోధిస్తూ ఉండేవారు.
ఒకసారి ఏమైందంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తల్లి వద్దకు వెళ్లి ఇస్లాం గురించి బోధిస్తూ ఉంటే ఆమె కోపగించుకున్నారు. కోపగించుకుని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి మీద మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక అనరాని మాట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద కూడా మాట్లాడేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి బాధ కలిగింది. ఏడ్చుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్త, ఇలా జరిగింది మా ఇంట్లో. మీరు అల్లాహ్ తో దుఆ చేయండి, నా తల్లికి ఇస్లాం భాగ్యము లభించాలని, అల్లాహ్ ఆమెకు ఇస్లాం స్వీకరించేలాగా చేయాలని అల్లాహ్ తో ప్రార్థన చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి కోసము ప్రత్యేకంగా అల్లాహ్ తో దుఆ చేయగా, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తిరిగి మళ్లీ ఇంటికి వెళ్లారు. వెళ్లి చూస్తే, తలుపులు మూయబడి ఉన్నాయి, లోపల తల్లి స్నానం చేస్తున్న శబ్దం వస్తూ ఉంది. బిడ్డ వచ్చాడన్న విషయాన్ని గమనించిన తల్లి, “ఓ అబూ హురైరా, ఆగిపో నాయనా కొద్దిసేపు” అని ఆజ్ఞాపించగా, బయటే అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కొద్దిసేపు నిలబడిపోయారు. తర్వాత తల్లి స్నానం ముగించుకొని, బట్టలు ధరించుకొని, తలుపులు తెరిచి, ముందుగా ఆమె పలికిన మాట ఏమిటంటే:
أَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُوْلُ اللهِ [అష్-హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్-హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్] అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.
తల్లి సాక్ష్య వచనం పఠించి, కలిమా పఠించి, ఇస్లాం స్వీకరించారన్న విషయాన్ని చూసి, విని, మళ్లీ పట్టరాని సంతోషంలో ఆనంద భాష్పాలు కార్చుకుంటూ, ఏడ్చుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్త, నా తల్లి ఇస్లాం స్వీకరించేశారు” అని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, మళ్లీ దైవ ప్రవక్తతో వేడుకున్నారు, “ఓ దైవ ప్రవక్త, విశ్వాసులందరూ కూడా నన్ను, నా తల్లిని అభిమానించాలని మీరు అల్లాహ్ తో దుఆ చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొకసారి ఆయన కోసము, ఆయన తల్లి కోసము అల్లాహ్ తో దుఆ చేశారు. అల్-హమ్దులిల్లాహ్! నేటికీ కూడా విశ్వాసులందరూ వారు మదరసాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలు చదువుతూ ఉన్నా, లేదా వారు విద్యార్థులు కాకుండా సామాన్యమైన ప్రజలు ధార్మిక పండితుల నోట ప్రసంగాలలో గానీ, మస్జిదులలో గానీ ఎక్కడైనా గానీ ప్రవక్త వారి మాటలు, ఉల్లేఖనాలు, హదీసులు వింటూ ఉన్నారు అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క పేరు ప్రతి చోట ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించబడుతూనే ఉంటుంది. ఆ ప్రకారంగా, ప్రతి విశ్వాసి అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి అభిమానిగా ఆ రోజుల్లో కూడా ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఇన్ షా అల్లాహ్, అలాగే ఉంటూ ఉంటారు ముందు కూడా. అంటే, ప్రవక్త వారి యొక్క దుఆ ఫలితంగా విశ్వాసులందరూ కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు వారిని అభిమానిస్తూ ఉన్నారు మిత్రులారా, ఇది చెప్పాల్సిన విషయం.
అలాగే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తల్లి గురించి ఎంతగా శ్రద్ధ తీసుకుంటారో చూడండి. మరొక ఉదాహరణ చెబుతూ ఉన్నాను. ఒకసారి ఆకలి కారణంగా ఆయన మస్జిద్-ఎ-నబవీ లోకి ప్రవేశించారు. అక్కడ ఎవరైనా ఏమైనా ఇస్తారేమో అని ఆశతో వస్తే, ఎవరూ లేరు. కొంతమంది అక్కడ కూర్చొని ఉంటే వారి దగ్గరకు వెళ్లి, “ఈ సమయానికి మీరు ఇక్కడ ఉన్నారు ఏమిటి?” అని అడిగారు. వారందరూ ఏమన్నారంటే, “మీరు ఏ విధంగా అయితే ఈ సమయానికి ఆకలితో ఇక్కడికి ఏమైనా దొరుకుతుందని వచ్చారో, అలాగే మేము కూడా వచ్చాము” అన్నారు. తర్వాత వారందరూ కూడా కలిసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్దాము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లారు. వెళ్లి, “ఓ దైవ ప్రవక్త, మాకు తినటానికి ఏమీ దొరకలేదు” అని ఆకలితో ఉన్నాము అని తెలియజేయగా, ప్రవక్త వారు ఖర్జూరపు పళ్ళు తెప్పించి ఒక్కొక్కరికి రెండు రెండు ఖర్జూరపు పండ్లు ఇస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్! సహాబాలు మరియు ప్రవక్త వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారో చూడండి. ఒక్కొక్కరికి రెండు రెండు ఖర్జూరపు పండ్లు వస్తూ ఉన్నాయి. ప్రవక్త వారు అంటున్నారు, “ఈ రెండు ఖర్జూరపు పండ్లు మీరు తినండి. అల్లాహ్ దయతో ఈ పూర్తి రోజుకు ఈ రెండు ఖర్జూరపు పండ్లు మీకు సరిపోతాయి.” అందరూ కూడా రెండు రెండు ఖర్జూరపు పండ్లు తీసుకొని తింటూ ఉన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మాత్రము ఒక ఖర్జూరపు పండు మాత్రమే తిని ఒకటి లోపల పెట్టుకుంటూ ఉంటే, ప్రవక్త వారు చూసి, “ఎందుకండి ఒకటి ఖర్జూరము పెట్టుకుంటూ ఉన్నారు?” అంటే, “నా తల్లి కోసము పెట్టుకుంటున్నాను, ఓ దైవ ప్రవక్త” అన్నారు. అల్లాహు అక్బర్! తల్లి గురించి ఎంత శ్రద్ధ తీసుకునేవారో చూడండి. “నా తల్లి కోసము ఆ ఖర్జూరము నేను పెట్టుకుంటూ ఉన్నాను, ఓ దైవ ప్రవక్త” అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “లేదండి, ఆ ఖర్జూరము మీరు తినేయండి. మీ తల్లి కోసము నేను ప్రత్యేకంగా అదనంగా రెండు ఖర్జూరపు పండ్లు ఇస్తాను” అని దైవ ప్రవక్త వారు రెండు అదనంగా ఖర్జూరపు పండ్లు ఇచ్చి మీ తల్లికి ఇవ్వండి అన్నారు. అల్లాహు అక్బర్! మొత్తానికి, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి ప్రారంభంలో ఇస్లాం స్వీకరించలేదు, తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దుఆ ఫలితంగా ఆవిడ ఇస్లాం స్వీకరించారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా తల్లి గురించి శ్రద్ధ తీసుకునేవారు, సేవలు చేసేవారు, బాగా అభిమానించేవారు కూడానూ.
ఆ తర్వాత మనం చూచినట్లయితే, హిజ్రీ శకం ఏడవ సంవత్సరం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్రా ఆచరించటానికి వెళ్ళినప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ప్రవక్త వారి వెంట వెళ్లి ఆ సంవత్సరము ఉమ్రా ఆచరించి వచ్చారు. ఆ తర్వాత, హిజ్రీ శకం ఎనిమిదవ సంవత్సరం వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బహ్రెయిన్ దేశానికి అలా బిన్ అల్-హదరమీ రజియల్లాహు అన్హు వారిని నాయకునిగా నియమించి పంపిస్తూ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని కూడా ఆయనకు తోడుగా, జతగా పంపించారు. “మీరు అబూ హురైరా వారిని వెంట తీసుకుని వెళ్ళండి, ఆయనను గౌరవించండి” అని అలా బిన్ అల్-హదరమీ వారికి ప్రవక్త వారు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. ఇద్దరూ కలిసి బహ్రెయిన్‌కు వెళ్లారు. అలా బిన్ అల్-హదరమీ వారు బహ్రెయిన్‌కు వెళ్ళిన తర్వాత ప్రవక్త వారి ఆదేశం ప్రకారం అబూ హురైరా రజియల్లాహు అన్హు వారితో, “ఏమండీ, మీకు నేను గౌరవిస్తున్నాను, మీరు ఏ బాధ్యత తీసుకుంటారో చెప్పండి” అన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆలోచించి, “నాకు అజాన్ పలికే బాధ్యత ఇవ్వండి” అన్నారు. అల్లాహు అక్బర్! అజాన్ పలికే బాధ్యత అది సాధారణమైనది కాదు. అది చాలా విశిష్టత కలిగిన బాధ్యత, ఎంతో గౌరవంతో కూడుకున్న బాధ్యత కాబట్టి, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ బాధ్యత ఇవ్వండి అన్నారు. నేడు చాలామంది అజాన్ పలికే బాధ్యతను చిన్నచూపుతో చూస్తూ ఉంటారు, అది సాధారణమైన విషయంగా భావిస్తూ ఉంటారు. లేదండి, చాలా విశిష్టతలతో కూడిన విషయము అది. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ బాధ్యత తీసుకున్నారు.
కొద్ది నెలలకే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే అబాన్ బిన్ సయీద్ అనే ఒక సహాబీని అక్కడికి అనగా బహ్రెయిన్‌కు నాయకునిగా నియమించి పంపించేయగా, అలా బిన్ అల్-హదరమీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఇద్దరూ తిరిగి మళ్లీ మదీనాకు వచ్చేశారు. ఒక సంవత్సరం గడిచింది. హిజ్రీ శకం తొమ్మిదవ సంవత్సరము వచ్చింది. ఆ సంవత్సరము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని నాయకునిగా నియమించి, ఆయన సారథ్యంలో ఇంచుమించు 300 మంది సహాబాలను హజ్ ఆచరించడానికి పంపించారు. వారిలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు. అంటే, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి సారథ్యంలో హజ్ ఆచరించబడినప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా వెళ్లి హజ్ ఆచరించుకొని వచ్చేశారు. ఆ సంవత్సరం ప్రవక్త వారు మాత్రము హజ్‌కి వెళ్ళలేదండి. ఆ తర్వాత వచ్చే సంవత్సరం, అనగా హిజ్రీ శకం పదవ సంవత్సరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా మంది సహాబాలను వెంటబెట్టుకొని వెళ్లి హజ్ ఆచరించారు. ఆ హజ్‌ని హజ్జతుల్ వదా అని అంటూ ఉంటారు. ఆ హజ్‌లో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట వెళ్లి హజ్ ఆచరించుకొని వచ్చారు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనంతర జీవితం
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో, ఆయన పరిపాలన యుగంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా యుద్ధాలలో పాల్గొన్నారు, ముఖ్యంగా ముర్తద్దీన్‌లతో జరిగిన యుద్ధాలలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రత్యేకంగా పాల్గొన్నారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారి మరణానంతరం, ఉమర్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఏం చేశారంటే, బహ్రెయిన్ ప్రదేశానికి ప్రవక్త వారి లాగే అలా బిన్ అల్-హదరమీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు, వీరిద్దరినీ నాయకులుగా నియమించి పంపించేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ సందర్భంలో బహ్రెయిన్‌లో ఇంచుమించు ఒక సంవత్సరం నాయకునిగా పరిపాలన కొనసాగించారు. ఆ ఒక సంవత్సరంలో ప్రభుత్వ తనఖా కూడా పొందారు, అటుగా ఆయన స్వయంగా కూడా వ్యాపారము చేశారు. ఆ ప్రకారంగా, ఆ ఒక సంవత్సరంలో ఆయన పెద్ద మొత్తంలో అల్-హమ్దులిల్లాహ్ డబ్బు సంపాదించుకోగలిగారు.
ఒక సంవత్సరం తర్వాత, ఉమర్ రజియల్లాహు అన్హు వారు వేరే సహాబీని అక్కడికి నాయకునిగా నియమించి పంపించేయగా, అలా బిన్ అల్-హదరమీ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వీరిద్దరూ మళ్లీ మదీనాకు తిరిగి వచ్చేశారు. అయితే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఈసారి మదీనాలో వచ్చినప్పుడు ఆయన వద్ద చాలా డబ్బు సొమ్ము ఉంది. ఇప్పుడు ఆయన మునుపటి లాగా నిరుపేద, ఆకలి దప్పుకలతో గడిపేవారు కాదు. చాలా డబ్బు అల్-హమ్దులిల్లాహ్ ఆయన సంపాదించుకోగలిగి ఉన్నారు. అయితే ఆయన ఏం చేశారో తెలుసా? మదీనాకు వచ్చిన తర్వాత ఆ డబ్బు మొత్తము బైతుల్ మాల్ కోసం అంకితం చేసేశారు. బైతుల్ మాల్ అంటే ప్రభుత్వం తరపున వితంతువులకు, అనాథలకు, మరియు నిరుపేదలకు ఆ సహాయము అందించేవారు. ఆ సహాయ నిధి కోసము ఈయన ఆయన వద్ద ఉన్న సంపద, డబ్బు మొత్తము అంకితం చేసేశారు, విరాళంగా ఇచ్చేశారు. అల్లాహు అక్బర్!
ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో, అంటే ఉమర్ రజియల్లాహు అన్హు వారి మరణానంతరం, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి పరిపాలన యుగంలో, సల్మాన్ బిన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారితో పాటు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా యుద్ధాలలో పాల్గొన్నారు. ముఖ్యంగా, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో ఆయన తూర్ పర్వతం ఉంది కదండీ, వాది-ఎ-సైనా, సైనా అనే ఒక లోయ ఉంది. ఆ మైదానములో ఒక పర్వతం ఉంది, కోహె తూర్. అక్కడ మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ఎలాంటి మధ్యవర్తి లేకుండా మాట్లాడారు కదండీ. ఆ పర్వతం వరకు ఆయన ప్రయాణము కొనసాగించారు అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే, ఆ ప్రయాణంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే, కాబ్ అహ్బార్ రజియల్లాహు అన్హు వారు, వాస్తవానికి ఆయన ఒక యూదుడు, తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించారు. ఆయనకు వేరే గ్రంథాల జ్ఞానము ఉంది. ఆయనతో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం వినిపించారు. ఏమని వినిపించారంటే, “జుమా రోజు చాలా విశిష్టత కలిగినది. జుమా రోజున అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదం అలైహిస్సలాం వారిని పుట్టించాడు. జుమా రోజున ఆయనకు స్వర్గంలో ప్రవేశింపజేశాడు. జుమా రోజునే ఆయన స్వర్గం నుంచి బయటికి వచ్చేశారు.” ఆ విధంగా చెబుతూ చెబుతూ చివర్లో, “జుమా రోజులో ఒక ఘడియ ఉంది. ఆ ఘడియలో భక్తుడు చేసే దుఆ తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆమోదిస్తాడు” అని తెలియజేయగా, కాబ్ అహ్బార్, ఆయన ఏమంటున్నారంటే, “ఆ ఘడియ సంవత్సరంలో ఒకసారి వస్తుంది కదా” అన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అన్నారు, “లేదండి, దైవ ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారము ప్రతి శుక్రవారము ఆ ఘడియ ఉంటుంది” అన్నారు. ఆయన ఆశ్చర్యపోయి వారి గ్రంథము, అంటే వేరే మత గ్రంథాలు ఉన్నాయి కదండీ, ఆయన ఇస్లాం స్వీకరించక ముందు యూదుడు కదండీ, ఆ మతానికి చెందిన గ్రంథము చదివి ఆయన, “ప్రవక్త వారు చెప్పిన మాట నిజము” అని అప్పుడు ఆయన ధ్రువీకరించారు కూడా.
చివరి రోజులు మరియు మరణం
సరే, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క వీర మరణం సంభవించినప్పుడు అలీ రజియల్లాహు అన్హు వారు ముస్లింల నాయకులయ్యారు. ఆయన పరిపాలన యుగంలో ముస్లింల రెండు పెద్ద సమూహాల మధ్య పెద్ద యుద్ధము జరిగింది. ఆ యుద్ధ సమయంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వారిద్దరి మధ్య సంధి కుదిర్చటానికి చాలా ప్రయత్నము చేశారు. చివరికి ఆయన ఫలితం దొరకని కారణంగా యుద్ధంలో పాల్గొనకుండా ఆయన ఒంటరితనాన్ని ఎన్నుకున్నారు. ప్రత్యేకంగా దైవ ఆరాధన కోసం ఆయన అంకితమైపోయారు అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు.
సరే, ఏది ఏమైనప్పటికినీ, అలీ రజియల్లాహు అన్హు వారి తర్వాత, హిజ్రీ శకం 59వ సంవత్సరం, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వ్యాధికి గురయ్యారు. ఆ వ్యాధి రాను రాను ముదురుతూనే పోయింది. మరణ సమయం సమీపించింది. అప్పుడు ఆయన పరలోకాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉన్నారు. ప్రజలు ఆయనతో అడిగారు, “ఏమండీ, ఎందుకు ఏడుస్తున్నారు?” అంటే, అప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తెలియజేశారు, “నేను ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోతున్నానని బాధలో నేను ఏడవట్లేదు. పరలోకాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉన్నాను. ప్రయాణము ముందు ముందు చాలా పెద్దది, నా దగ్గర ఏమో సామాను చాలా తక్కువగా ఉంది. నేను స్వర్గానికి చేరుకుంటానా, నరకానికి చేరుకుంటానా నాకు అర్థం కావట్లేదు. స్వర్గం నా గమ్యస్థానం అవుతుందా, నరకం నా గమ్యస్థానం అవుతుందా తెలియదు కాబట్టి, అది తలుచుకొని నేను ఏడుస్తూ ఉన్నాను” అన్నారు.
అల్లాహు అక్బర్! జీవితాంతం ప్రవక్తకు మరియు సహాబాలకు మరియు ఇస్లాంకు అంకితమైపోయిన అలాంటి సహాబీ పరలోకాన్ని తలుచుకొని, “నా వద్ద సొమ్ము తక్కువ ఉంది,” అంటే పుణ్యాలు తక్కువ ఉన్నాయి, ప్రయాణం చాలా పెద్దదిగా ఉంది, “స్వర్గానికి వెళ్తానో నరకానికి వెళ్తానో తెలియదు” అని ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారంటే, ఆయనలో ఎంత దైవభీతి ఉండేదో ఆలోచించండి. అలాగే, మనము ఎలాంటి ఎక్కువ పుణ్యాలు చేయకపోయినా పరలోకాన్ని తలుచుకొని ఏడవట్లేదు అంటే, ఎలాంటి భ్రమలో మనము జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించండి మిత్రులారా.
సరే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క మరణ సమయము సమీపించింది. ఆయన మదీనాలో ఉంటూ ఉన్నారు. మదీనా యొక్క నాయకుడు ఆ రోజుల్లో మర్వాన్ ఇబ్నుల్ హకం అనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన పరామర్శించడానికి వచ్చారు. వచ్చి, “అల్లాహ్ మీకు స్వస్థత ప్రసాదించుగాక” అని ప్రార్థిస్తూ ఉంటే, అప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అల్లాహ్ తో ప్రార్థించారు, “ఓ అల్లాహ్, నేను నీతో కలవటానికి ఇష్టపడుతూ ఉన్నాను, నువ్వు కూడా నన్ను నీ వద్దకు రావటానికి ఇష్టపడు” అని ప్రార్థించారు. అల్లాహు అక్బర్! ఆ తర్వాత, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క మరణము సంభవించింది.
అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మరణించిన తర్వాత వలీద్ బిన్ ఉత్బా బిన్ అబీ సుఫియాన్ రహిమహుల్లాహ్ వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క జనాజా నమాజు ఆచరించారు. తర్వాత అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి దేహాన్ని అల్-బఖీ, జన్నతుల్ బఖీ అంటుంటారు కదండీ, అల్-బఖీ అల్-గర్కద్, అందులో ఆయనకు ఖనన సంస్కారాలు చేయడం జరిగింది. 59వ హిజ్రీలో ఆయన మరణించారు. అప్పటికి ఆయన వయస్సు ఇంచుమించు 80 సంవత్సరాలకు కొద్దిగా తక్కువ లేదంటే కొద్దిగా ఎక్కువ అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన తర్వాత రోజుల్లో వివాహం చేసుకున్న కారణంగా ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. ఆ కుమార్తె యొక్క వివాహము గొప్ప తాబయీ, సయీద్ బిన్ ముసయ్యిబ్ రహిమహుల్లాహ్ వారితో జరిగింది అని కూడా చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు.
జ్ఞాపకశక్తి మరియు హదీసుల ఉల్లేఖన
అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి 5,374 హదీసులు ఉమ్మత్ అనుచర సమాజం వరకు చేరవేర్చి ఉన్నారు. సహాబీలందరిలో ఎక్కువగా హదీసులు ఉల్లేఖించిన వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అని కూడా చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు.
అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి హదీసుల్ని జీవితాంతం చాలా చక్కగా కంఠస్థం చేసుకొని భద్రంగా గుర్తుంచుకొని ఉన్నారు అని చెప్పటానికి ఒక ఉదాహరణ వినిపిస్తూ ఉన్నాను, చూడండి. ఆయన జీవించి ఉన్నప్పుడు మదీనా నాయకుడు మర్వాన్ ఇబ్నుల్ హకం అని ఇంతవరకు మనం విన్నాము కదా. ఆ మర్వాన్ అనే అతను ఏం చేశాడంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని పిలిపించి ఆ విషయానికి సంబంధించిన ఒక హదీసు వినిపించండి, ఈ విషయానికి సంబంధించిన ఒక హదీసు వినిపించండి అని కొన్ని హదీసులు అడిగారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ హదీసులన్నీ కూడా వినిపించారు. ఈయన ఏం చేశారంటే, ముందే ఒక వ్యక్తిని ఆదేశించి, ఆయన వినిపిస్తున్న హదీసులన్నీ కూడా ఒక పత్రంలో వ్రాసి ఉంచుకోండి అని ఆదేశించగా, తెర వెనుక ఒక వ్యక్తి ఆ హదీసులన్నీ కూడా ఒక పత్రంలో వ్రాసి ఉంచుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత, మళ్ళీ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని ఆ మర్వాన్ అనే వ్యక్తి పిలిపించి మళ్ళీ ఆ హదీసులు ఫలానా ఫలానా హదీసులు వినిపించండి అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు గత సంవత్సరం ఏ విధంగా వినిపించారో అదే విధంగా చక్కగా ఎలాంటి తప్పు దొర్లకుండా వినిపించేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వెళ్లిపోయిన తర్వాత తెర వెనుక కూర్చుని ఉన్న ఆ పత్రాన్ని గమనిస్తున్న వ్యక్తితో అడిగారు, “అబూ హురైరా కరెక్ట్ గానే వినిపించారా? ఏమైనా హెచ్చుతగ్గులు జరిగాయా?” అంటే, ఆ వ్యక్తి కూడా, “ఉన్నది ఉన్నట్టే ఆయన మొత్తం చెప్పారు, ఎలాంటి హెచ్చుతగ్గులు జరగలేదు” అని ఆ వ్యక్తి కూడా సాక్ష్యం ఇచ్చాడు. అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు జీవితాంతం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్ని చక్కగా గుర్తుంచుకొని వేరే వారి వరకు చేరవేశారు అని మనకు ఈ సంఘటన తెలుపుతుంది.
ఆ ప్రకారంగా, నేను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉల్లేఖనాలు చదివి, నేర్చుకొని, ఇతరుల వద్దకు చేర్చే భాగ్యం ప్రసాదించుగాక. ఇది అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్ర. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ అన్న, విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.
وَجَزَاكُمُ اللهُ خَيْرًا [వ జజాకుముల్లాహు ఖైరన్] మరియు అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ [అస్సలాము ‘అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు] మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారి మహిమలు (Prophet’s Miracles) https://youtu.be/2su-OWOpcGo [25 నిముషాలు] వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మహిమలు అనే అంశంపై ఈ ప్రసంగం సాగింది. ప్రవక్తలందరూ తమ ప్రవక్తృత్వానికి నిదర్శనంగా అల్లాహ్ యొక్క అనుమతితో కొన్ని మహిమలను చూపారని, వాటిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మహిమలు ఎన్నెన్నో ఉన్నాయని వక్త వివరించారు. అన్నింటికన్నా గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథమని, అది ప్రళయం వరకు సజీవంగా ఉండే మహిమ అని తెలిపారు. చంద్రుడిని రెండుగా చీల్చడం, హుదైబియా వద్ద తన వేళ్ళ నుండి నీటిని ప్రవహింపజేసి 1500 మంది సహచరుల దాహాన్ని తీర్చడం, కందకం యుద్ధం సమయంలో కొద్దిపాటి ఆహారాన్ని వెయ్యి మందికి పైగా సరిపోయేలా చేయడం, ఒక చెట్టు మరియు తోడేలు ఆయన ప్రవక్తృత్వాన్ని సాక్ష్యమివ్వడం వంటి సంఘటనలను వివరించారు. ప్రవక్తలు చూపిన మహిమలు వారు దైవ ప్రవక్తలని రుజువు చేయడానికే గానీ, వారు దేవుళ్ళమని ప్రకటించుకోవడానికి కాదని, నేటి కాలంలోని దొంగ బాబాలు చేసే కనుగట్టు విద్యలకు, ప్రవక్తల మహిమలకు తేడాను గ్రహించాలని ఉద్భోదించారు.
స్తోత్రాలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి నా జుమా ప్రసంగ అంశం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహిమలు.
మిత్రులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రపంచంలో ప్రవక్తలను, అల్లాహ్ వాక్యాలు ప్రజలకు వినిపించడానికి, ధర్మ ప్రచారము చేయించడానికి వివిధ సందర్భాలలో, వివిధ యుగాలలో, వివిధ ప్రదేశాలలో అనేక మంది ప్రవక్తలను ప్రభవింపజేశాడు. ఆ ప్రవక్తలు ప్రజల ముందర దైవ వాక్యాలు వినిపించినప్పుడు, ప్రజలు ఆ ప్రవక్తలతో కొన్ని సూచనలు, కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు, ఆ ప్రవక్తలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలకు ఆశ్చర్యం కలిగేటట్టుగా కొన్ని మహిమలను, అద్భుతాలను చూపించాడు.
ఆ ప్రకారంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేసి చూపించిన కొన్ని మహిమల గురించి, కొన్ని సూచనల గురించి మనము ఈ ప్రసంగంలో తెలుసుకుందాం.
ఖుర్ఆన్ – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప మహిమ
మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించిన మహిమలు అనేకమైనవి ఉన్నాయి. ఆ మహిమలన్నింటిలో గొప్ప మహిమ, అన్నిటికంటే పెద్ద మహిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. ఇదేంటండీ? మహిమలంటే ఏదో ఆశ్చర్యకరమైన విషయాలు మీరు చెబుతారంటే, ఇదేదో పుస్తకం గురించి మీరు చెబుతున్నారేంటి అని మీరు ఆశ్చర్యపోతారేమో.
అయితే అభిమాన సోదరులారా, ఒక్క విషయం జాగ్రత్తగా వినండి, అదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభించిన అతి గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథం అని ఎందుకు చెబుతున్నానంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించిన మహిమలు అవి అప్పటికప్పుడే కనిపించాయి, ఆ తర్వాత అదృశ్యమైపోయాయి. కానీ ఈ ఖుర్ఆన్ గ్రంథం ఎలాంటి మహిమ అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలం నుండి ఇప్పటి వరకు కూడా అది అలాగే సజీవంగా ఉంది, ప్రళయం వరకు కూడా అది అలాగే ఉంటుంది. కాబట్టి మహిమలన్నింటిలో గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథము అని చెప్పబడుచున్నది.
అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ గ్రంథము కంటే పూర్వము అనేక గ్రంథాలు ప్రపంచంలో వచ్చాయి. కానీ అవి ఏదీ కూడాను తన అసలు రూపంలో నిలబడలేదు. కానీ ఖుర్ఆన్ గ్రంథం అల్ హందులిల్లాహ్ అవతరించబడిన నాటి నుండి నేటి వరకు కూడా అది తన అసలు రూపంలోనే ఉంది, ప్రళయం వరకు కూడా అది అసలు రూపంలోనే ఉంటుంది. ఎందుకంటే గ్రంథాలన్నింటిలో సురక్షితమైన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఖుర్ఆన్ గ్రంథము మాత్రమే. ఆ ఖుర్ఆన్ గ్రంథాన్ని రక్షించే బాధ్యత స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తీసుకుని ఉన్నాడు కాబట్టి అది సురక్షితమైన గ్రంథము. కాబట్టి అది గొప్ప మహిమ అని చెప్పబడుచున్నది.
అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ ఎంత గొప్ప మహిమ అంటే, ఆ ఖుర్ఆన్ గ్రంథాన్ని ఉద్దేశించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి ఛాలెంజ్ చేసి ఉన్నాడు. ఈ ఖుర్ఆన్ లాంటి మరొక గ్రంథము మీరు ఏదైనా రచించి తేగలరేమో తెచ్చి చూపించండి అని ఛాలెంజ్ చేశాడు. ఖుర్ఆన్ పూర్తి గ్రంథము. అలాంటి పూర్తి గ్రంథము మీరు రచించలేకపోతున్నారా? పోనీ ఖుర్ఆన్ లో ఉన్న అధ్యాయాలలో నుంచి ఒక పది అధ్యాయాలు రాసి చూపించండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్లీ ఛాలెంజ్ చేసి ఉన్నాడు. ఒక పది సూరాలు మీరు రాసి చూపించండి అన్నాడు. పది సూరాలు వీలుపడదా? ఒక్క సూరా అయినా సరే మీరు రాసి చూపించగలరా ఖుర్ఆన్ లాంటిది అని అడిగాడు. ఒక్క సూరా కూడా మీరు రాయలేరా? పోనీ ఒక్క ఆయతు, ఒక్క వాక్యము, ఖుర్ఆన్ లో ఉన్న వాక్యాల లాంటి ఒక్క వాక్యము మీరు, జిన్నాతులు అందరూ కలిసి పరస్పరం ఒకరికి ఒకరు సహాయం చేసుకుని మరి ఇలాంటి ఒక్క వాక్యము రాయగలరేమో రాసి చూపించండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఛాలెంజ్ చేశాడు.
అభిమాన సోదరులారా, ఈ ఛాలెంజ్ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అనేక మంది ప్రజలు ఖుర్ఆన్ లాంటి ఒక్క వాక్యము రాయలేకపోయారు. వారు ఎంత కష్టపడ్డా, రాత్రింబవళ్ళు ప్రయత్నించినా వారికి సాధ్యపడలేకపోయింది అభిమాన సోదరులారా. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభించిన సూచనలలో, మహిమలలో గొప్ప సూచన, గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథము అని ఇందుకే చెప్పబడుచున్నది అభిమాన సోదరులారా.
చంద్రుడు రెండుగా చీలిపోవటం
ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ చూపించిన మరొక గొప్ప మహిమ, చంద్రుడు రెండు ముక్కలైపోవటం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో నివసిస్తున్న రోజుల్లో, మక్కాలోని పెద్దలు కొంతమంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో, “నీవు దైవప్రవక్తవే అయితే ఒక సూచన చూపించు, ఒక మహిమ చూపించు” అని ప్రశ్నించారు. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ తో ప్రార్థన చేశారు, దుఆ చేశారు, “ఓ అల్లాహ్, మక్కా వాసులు నాతో సూచన అడుగుతున్నారు, మహిమ అడుగుతున్నారు” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయగా, వెంటనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వహీ ద్వారా చూపించాడు, “ఓ దైవప్రవక్తా, చూడండి, చంద్రుడు రెండు ముక్కలైపోవుచున్నాడు.”
అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా ప్రజలకు ఆ పెద్ద మహిమ చూపించారు, “చూడండి, చంద్రుడు రెండు ముక్కలైపోతున్నాడు” అని. మక్కా ప్రజలు కళ్ళారా చూశారు, చంద్రుడు రెండు ముక్కలైపోయి హిరా పర్వతం కుడి వైపున ఒక భాగము, హిరా పర్వతము ఎడమ వైపున మరొక భాగము, రెండు భాగాలుగా విడిపోయాడు. అభిమాన సోదరులారా, ఇంత పెద్ద అద్భుతము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చూపించాడు. దీని ప్రస్తావన ఖుర్ఆన్ గ్రంథంలో సూరా ఖమర్ ఒకటవ వాక్యం నుండి ఐదవ వాక్యం వరకు మీకు లభిస్తుంది. అలాగే ముస్లిం గ్రంథంలో కూడా దీని ప్రస్తావన మీకు దొరుకుతుంది.
చంద్రుడు రెండు ముక్కలైపోవటం, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచానికి చూపించిన ఒక గొప్ప మహిమ.
వేళ్ళ నుండి నీటి ఊట
అలాగే మరొక మహిమ గురించి మనం చూసినట్లయితే, ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలను తీసుకుని ఉమ్రా చేయటానికి మదీనా నుండి మక్కాకు వస్తూ ఉన్నారు. హుదైబియా అనే ఒక ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట వచ్చిన సహాబాల వద్ద ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి. త్రాగటానికి కూడా నీళ్ళు లేవు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఒక చిన్న పాత్ర ఉంటే, ఆ పాత్రలో కొన్ని నీళ్ళు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, ఆ పాత్ర తీసుకుని అందులో ఉన్న నీళ్ళ నుండి వుజూ చేయటం ప్రారంభించారు. వెంటనే సహాబాలందరూ అక్కడ ప్రోగైపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “ఏంటండీ, మీరందరూ ఇక్కడికి వచ్చేశారు? ఏంటి విషయము?” అంటే అప్పుడు సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు, “ఓ దైవ ప్రవక్తా, మనము ఇంచుమించు 1500 మంది మనం ఉన్నాం ఇక్కడ. ఎవరి వద్ద కూడా నీళ్ళు లేవండి, త్రాగడానికి కూడా నీళ్ళు లేవండి. కేవలం మీ దగ్గర ఉన్న ఆ పాత్రలో నీళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయండి. ఇప్పుడు అందులో ఉన్న నీళ్ళు కూడా మీరు వుజూ చేసేస్తున్నారు కదా, మనకు వుజూ చేసుకోవడానికి గానీ, త్రాగడానికి గానీ, వంట చేసుకోవడానికి గానీ మా దగ్గర అస్సలు నీళ్ళే లేవండి” అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వినిపించగా, అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ ను తలచుకుని, అల్లాహ్ ను ప్రార్థించి, తమ చేతులను ఆ పాత్రలో పెట్టగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వేళ్ళ మధ్య నుండి నీటి ప్రవాహం ఉబికింది. ఎన్ని నీళ్ళు వచ్చాయంటే అక్కడ ఉన్న 1500 మంది సహాబాలు అందరూ ఆ నీళ్ళతో వుజూ చేసుకున్నారు, వారి వద్ద ఉన్న పాత్రలన్నింటినీ నీళ్ళతో నింపుకున్నారు. అల్లాహు అక్బర్. ఇంత పెద్ద మహిమ అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా చూపించాడు.
చెట్టు సాక్ష్యం పలకడం
అలాగే మరొక మహిమ గురించి మనం చూసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో పాటు ఒక ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణంలో వెళ్తూ వెళ్తూ ఉంటే మార్గమధ్యలో ఒక బద్దూ వ్యక్తి కనిపించాడు. ఒక పల్లెటూరు వాసి అని మనం మన భాషలో చెప్పుకుంటాం కదండీ. అలాంటి ఒక పల్లెటూరు వాసి కనిపించగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని దగ్గరకు వెళ్లి, “అయ్యా, అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, నేను అల్లాహ్ పంపించిన ప్రవక్తను అని నీవు సాక్ష్యం పలకవయ్యా” అని చెప్పారు. అంటే, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని నువ్వు సాక్ష్యం పలకవయ్యా అని ఆ పల్లెటూరు వాసితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నిస్తే, అతను ఏమన్నాడంటే, “నేను లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనే సాక్ష్య వచనం, కల్మా పఠించాలంటే, నేను కాకుండా ఎవరైనా ఈ కలిమాను సాక్ష్యం పలికే వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరి నుండైనా మీరు నా ముందర సాక్ష్యం పలికించి చూపిస్తారా?” అని అతను మళ్లీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడిగాడు.
అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరలోనే ఒక చెట్టు ఉంటే, ఆ చెట్టు వైపు సైగ చూపి, ఏమన్నారంటే, “చూడయ్యా, ఈ చెట్టు కూడా అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, నేను అల్లాహ్ పంపించిన ప్రవక్త అని సాక్ష్యం పలుకుతుంది, చూపించనా?” అన్నారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పేరు తలచుకుని ఆ చెట్టుకి పురమాయించగా, ఆ చెట్టు అక్కడి నుంచి నడుచుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి,
أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ (అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్) “అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యులు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని నేను సాక్ష్యమిస్తున్నాను”
అని మూడు సార్లు సాక్ష్యం పలికి, అక్కడి నుంచి వెళ్లి మళ్ళీ తన స్థానంలో వెళ్లి నిలబడిపోయింది. అది చూసిన ఆ వ్యక్తి వెంటనే అతను కూడా,
أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ (అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్)
అని అతను కూడా సాక్ష్యం పలికాడు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన మరొక సూచన, మరొక మహిమ.
ఆహారంలో బర్కత్ (సమృద్ధి)
అభిమాన సోదరులారా, అలాగే మనం చూసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ చూపించిన మరొక మహిమ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వెళ్ళిన తర్వాత ఒకసారి బాగా కరువు ఏర్పడింది. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, ఆకలి దప్పులతో గడుపుతున్న రోజుల్లో మక్కా వాసులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మదీనాకు వెళ్లి హతమార్చాలని, ఆయనను అక్కడి నుంచి కూడా తరిమివేయాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మక్కా వాసుల్ని మదీనా లోపలికి రానియ్యకుండా అడ్డుకోవటానికి కందకం తవ్వాలని నిర్ణయించారు.
ఆ కందకం త్రవ్వేటప్పుడు, కరువు వల్ల సమయానికి అన్నము, నీళ్ళు దొరకని కారణంగా ఆకలి దప్పికలతో ప్రవక్త వారు మరియు సహాబాలు అందరూ కష్టపడుతున్నారు, ఆ గుంత, ఆ కందకము తవ్వుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా బలహీనపడిపోయారు, సహాబాలు కూడా బలహీనపడిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరిస్థితిని చూసి ఒక సహాబీ ఇంటికి వెళ్లి వాళ్ళ ఆవిడతో అన్నాడు, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా రోజుల నుండి అన్నం తినని కారణంగా బలహీనులైపోయారు. కాబట్టి, మన ఇంట్లో ఏమైనా ఉంటే మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆహారం ఏర్పాటు చేద్దాము, ఏమైనా ఉందా చూడు” అంటే, ఆవిడ వెళ్లి వెతకగా ఒక ‘సా’ గింజలు కనిపించాయి. ఒక ‘సా’ అంటే ఇంచుమించు, రెండున్నర కేజీలు గింజలు కనిపించాయి.
అవి తీసుకొని వచ్చి ఆవిడ ఏమందంటే, “చూడండి, ఈ ధాన్యము రెండున్నర కేజీలు మాత్రమే ఉంది. దీనిని నేను పిండిగా మార్చేస్తాను. ఆ తర్వాత మన ఇంట్లో ఒక మేక పిల్ల ఉంది, దాన్ని జబా చేయండి, ఇన్షా అల్లాహ్ దానితో నేను కూర వండుతాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ప్రవక్త వారితో ఒక కొద్ది మంది, ఐదు లేదా పది మంది వస్తే గనక ఇన్షా అల్లాహ్ వారందరికీ మనము ఈ పిండి ద్వారా, ఈ మాంసము ద్వారా ఆహారం ఏర్పాటు చేయగలము, భోజనం ఏర్పాటు చేయగలము. మీరు వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు ఒక పది మందిని కూడా రమ్మని చెప్పండి, ఆహ్వానించండి” అని ఆ సహాబీ వాళ్ళ ఆవిడ చెప్పింది.
ఆ సహాబీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లి, పక్కకు పిలిచి, “ఓ దైవ ప్రవక్త, ఈరోజు మా ఇంట్లో మీకు ఆహారం ఏర్పాటు చేస్తున్నాము. మీరు ఒక పది మందిని తీసుకుని మా ఇంటికి ఆహారానికి, భోజనానికి రండి” అని ఆహ్వానించారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, అక్కడ కందకం తవ్వుతున్న సహాబాలు అందరినీ, “ఏవండీ, ఫలానా సహాబీ వారి ఇంటిలో మనకు ఈరోజు భోజన ఏర్పాటు ఉంది, కాబట్టి అందరూ నా వెంట రండి వెళ్దాం” అని చెప్పి అందరినీ తీసుకుని వచ్చేశారు. అల్లాహు అక్బర్. వారి సంఖ్య ఎంత ఉందో తెలుసా? అక్కడ కందకం తవ్వుతున్న వారి సంఖ్య వెయ్యి కంటే ఎక్కువగా ఉంది. అంత మందిని కూడా తీసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చేశారు.
అది చూసి ఆ సహాబీ కంగారు పడిపోయారు. అదేంటండీ, నేను ఏదో పది మందిని తీసుకుని రమ్మంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏకంగా వెయ్యి కంటే ఎక్కువ మందిని తీసుకుని వచ్చేస్తున్నారు. అంత మందికి నేను భోజన ఏర్పాటు ఎలా చేయగలను? నా దగ్గర ఉన్నది కొంచెమే కదా అని ఆయన కంగారు పడుతుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తితో అన్నారు, ఆ సహాబితో అన్నారు, “ఏమయ్యా, మీ ఇంటిలో పొయ్యి మీద ఉన్న ఆ పాత్రను అలాగే ఉంచమని చెప్పండి మీ ఆవిడతో. అలాగే, మీ ఆవిడ ఆ గింజల్ని పిండి లాగా రుబ్బుతోంది కదా, ఇప్పుడనే రొట్టెలు తయారు చేయవద్దు, అలాగే ఉంచమని చెప్పండి నేను వచ్చేవరకు కూడా” అని చెప్పి పంపించారు.
ఆ సహాబీ వెళ్లి వాళ్ళ ఆవిడతో, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా మందిని తీసుకుని వస్తున్నారు, కాకపోతే ఆ పొయ్యి మీద ఉన్న పాత్రను దింపవద్దని చెప్పారు, రొట్టెలు ఇప్పుడనే వంట చేయవద్దని చెప్పారు, ఆయన వచ్చేవరకు ఆగాలంట” అని చెప్పారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చేవరకు వాళ్ళ ఆవిడ ఆగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా ఇంట్లోకి ప్రవేశించి అల్లాహ్ పేరు తలచుకుని ‘బిస్మిల్లాహ్’ అని ఆ కూర వండుతున్న పాత్రలో వేలు పెట్టి ఇలా తిప్పారు. ఆ తర్వాత ఎక్కడైతే ఆ పిండి ఉందో అక్కడ కూడా వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పేరు తలచుకుని ఆ పిండిలో చెయ్యి పెట్టారు. ఆ తర్వాత ఆ సహాబీ వాళ్ళ భార్యతో ఏమన్నారంటే, “రొట్టెలు తయారు చేయడానికి నీకు ఒక్కరితోనే సరిపోదు కాబట్టి మరొక మహిళను కూడా పిలిపించుకో” అన్నారు. ఆవిడ పక్కింటి ఒక ఆవిడని కూడా పిలిపించుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న పిండిని ఆ ఇద్దరు మహిళలు తీసుకుని రొట్టెలు తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ సహాబీ ఆ పాత్రలో ఉన్న ఆ కూర కొంచెం కొంచెము తీసి ఆ అక్కడ ఉన్న సహాబాలు అందరికీ వడ్డిస్తున్నారు. ఆ సహాబీ చెబుతున్నారు, అక్కడ ఉన్న వెయ్యి మంది కూడా ఆ రొట్టెలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకుని ఆ మాంసము కూర ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకుని పూర్తి వెయ్యి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా తిన్నారు, కడుపునిండా భుజించారు. అయినాగానీ పిండి అలాగే మిగిలిపోయింది, కూర కూడా ఆ పాత్ర నిండా అలాగే మిగిలి ఉంది. అల్లాహు అక్బర్.
అంటే పది మంది తినే ఆహారాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎంతలో ఎంతటి శుభం కల్పించాడంటే, ఎంతటి బర్కత్ ఇచ్చాడంటే వెయ్యి కంటే ఎక్కువ మంది అల్లాహ్ దయవల్ల అక్కడ భోజనం చేశారు. ఇది కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన ఒక గొప్ప మహిమ.
తోడేలు సాక్ష్యం
అలాగే ఒకసారి మదీనా ఇరుపక్కల కొంతమంది యూదులు ఉండేవారు ఆ రోజుల్లో. ఒక యూదుడు గొర్రెలు మేపటానికి గొర్రెలను తోలుకొని వెళితే ఒక తోడేలు వచ్చి ఒక గొర్రెను పట్టుకుని లాక్కుని ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంది. ఆ వ్యక్తి ఏం చేశాడంటే గొర్రెను కాపాడుకోవడానికి ఆ తోడేలును వెంబడించాడు, వెంబడించి వెంబడించి వెంబడించి చివరికి ఆ గొర్రెను ఆ తోడేలు నుండి కాపాడుకుని తీసుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. అప్పుడు ఆ తోడేలు కూర్చుని ఆ యూదునితో మాట్లాడుతా ఉంది. “ఏంటయ్యా, అల్లాహ్ నాకు ఇచ్చిన ఆహారాన్ని నా నోటి వద్ద నుండి నువ్వు లాక్కుని వెళ్ళిపోతున్నావే” అంది. అతను ఆశ్చర్యపడిపోయాడు. ఇదేంటండీ? జంతువు ఏకంగా మనిషితోనే మాట్లాడటం ప్రారంభించేసింది అని ఆ జంతువుతో అతను అడుగుతుంటే అప్పుడు ఆ తోడేలు ఆ వ్యక్తితో అంటూ ఉంది, “దీనికంటే ఒక మరొక్క గొప్ప విషయం నేను నీకు చెప్పనా? మదీనాలో ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడు. అతను జరిగిన విషయాలు కూడా చెబుతుంటాడు, అలాగే జరగబోయే విషయాలు కూడా చెబుతున్నాడు. నువ్వు వెళ్లి అతనితో కలుసు” అంది.
ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ యూదుడు గొర్రెలు ఇంటికి తోలుకొని వచ్చేసి, ఇండ్లల్లో ఆ గొర్రెలు వదిలేసి తిన్నగా మదీనాకు వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడ జరిగిన విషయం, సంఘటన మొత్తం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద వినిపిస్తే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ తోడేలు చెప్పింది నిజమే, నేనే ఆ ప్రవక్తను అని చెప్పగా, వెంటనే ఆ యూదుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోనే,
أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ (అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్) “అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యులు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని నేను సాక్ష్యమిస్తున్నాను”
అని సాక్ష్యం పలికి ముస్లిం అయిపోయాడు అభిమాన సోదరులారా. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన మరొక మహిమ. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అని ఒక జంతువు కూడా సాక్ష్యమిచ్చింది.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఉమ్మిలో స్వస్థత
అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మరికొన్ని మహిమల్లో ఒక మహిమ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మిలి నుండి చాలా మందికి స్వస్థత లభించింది. మనమంతా వినే ఉన్నాం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణం చేసే సందర్భంలో సౌర్ గుహలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ప్రవేశించారు. ఆ గుహను శుభ్రపరిచిన తర్వాత అక్కడ ఉన్న రంధ్రాలన్నింటినీ బట్టతో కప్పేయగా ఒక రంధ్రం మిగిలిపోతే అబూబకర్ రజియల్లాహు అన్హు తమ కాలుని ఆ రంధ్రం పైన పెట్టేసి ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని లోపలికి ప్రవేశించమని చెబితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లోపలికి ప్రవేశించారు, ఆ తర్వాత అబూబకర్, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి తొడ మీద తల పెట్టుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఒక విషపురుగు అబూబకర్ రజియల్లాహు అన్హు వారి కాలుకి కాటేసింది. విషం శరీరంలో ఎక్కుతూ ఉంటే బాధ భరించలేక అబూబకర్ రజియల్లాహు అన్హు వారు కన్నీరు కారిస్తే, ఒక చుక్క ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొహం మీద పడినప్పుడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కళ్ళు తెరిచి, “ఎందుకు ఏడుస్తున్నావు అబూబకర్?” అంటే అప్పుడు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు కాలు చూపించి, “ఏదో విషపురుగు నాకు కాటేసింది” అని చెప్పగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఉమ్మిని తీసి అక్కడ పూయగానే విషం మొత్తం తగ్గిపోయింది. చూశారా అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మి నుండి విషము నుండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వస్థత కల్పించాడు అబూబకర్ రజియల్లాహు అన్హు వారి గారికి.
అలాగే ఖైబర్ ప్రదేశంలో కూడా అలీ రజియల్లాహు అన్హు వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిలవగా, అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలోకి చేరితే, అప్పటికే అలీ రజియల్లాహు అన్హు వారి కళ్ళలో సమస్య ఏర్పడి కళ్ళు బాగా ఎర్రబడిపోయాయి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ ఉమ్మిని తీసి అలీ రజియల్లాహు అన్హు వారి కళ్ళల్లో పూయగా, వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారికి ఉన్న సమస్య తొలగిపోయింది. ఆయనకు కూడా స్వస్థత లభించింది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మిలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వస్థత పెట్టాడు. ఇది కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మరొక మహిమ.
రాళ్ళు, చెట్లు సలాం చెప్పడం
ఇలాగే అభిమాన సోదరులారా, చాలా విషయాలు ఉన్నాయి. చివరిగా ఒక విషయం చెప్పి నేను నా మాటను ముగిస్తున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త పదవి వారికి లభించక పూర్వమే మక్కాలో తిరుగుతూ ఉంటే, రాళ్లు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి, చెట్లు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి, గుట్టలు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మహిమ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో అనేవారు, “నేను బాగా గుర్తు పెట్టుకుని ఉన్నాను, నాకు ప్రవక్త పదవి లభించక పూర్వమే మక్కాలో ఫలానా రాయి నాకు సలాం చెబుతా ఉండింది, నాకు ఇప్పటికీ కూడా బాగా గుర్తు ఉంది” అని దైవ ప్రవక్త చెప్పేవారు.
అలాగే పన్నెండు సంవత్సరాల వయసులో పినతండ్రి అబూ తాలిబ్ గారితో సిరియా దేశానికి వర్తకం కోసము ప్రయాణం చేస్తూ ఉంటే మార్గమధ్యంలో ఒక క్రైస్తవ పండితుడు వచ్చి సాక్ష్యమిచ్చాడు ఏమంటే, “ఈ బాలుడు, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు వేలు చూపించి, ఏమన్నాడంటే, ఈ బాలుడు నడుచుకుని వస్తూ ఉంటే దారిలో కనిపించిన రాయి, దారిలో కనిపించిన చెట్టు వంగి ఇతనికి సలాము చెబుతా ఉంది. కాబట్టి ఇతను పెద్దవాడైన తర్వాత కారుణ్య మూర్తి, రహ్మతుల్లిల్ ఆలమీన్ అవుతాడు” అని ఆరోజే ఆయన సాక్ష్యం పలికాడు.
ముగింపు
కాబట్టి అభిమాన సోదరులారా, ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి, ఇప్పటికే సమయం ఎక్కువ అయిపోయింది. చివరిగా ఒక విషయం ఏమిటంటే, మనం దృష్టి పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ప్రవక్తలు వారు దైవ సందేశహరులు అని ప్రపంచానికి రుజువు చూపించటానికి కొన్ని మహిమలు చూపించారు. ఆ మహిమలు చూపించి మేము కేవలం దైవ సందేశహరులము అని చెప్పుకున్నారు గానీ, మహిమలు చూపించి మేమే దేవుళ్ళము లేదా దేవునిలోని భాగము లేదా దేవుని అవతారము అని వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రకటించుకోలేదు. అయితే ఈ రోజుల్లో ఎవడైతే కొన్ని కిటుకులు, కొన్ని కనుగట్టులు చూపించి ఇదిగోండి నేను మహిమ చూపిస్తున్నాను, ఇదిగోండి నేను మహిమ చూపిస్తున్నాను, నా వద్ద మహిమలు ఉన్నాయి, నేనే దేవుణ్ణి లేదంటే నేనే దేవుని స్వరూపాన్ని, లేదంటే నేనే దేవుని అవతారాన్ని అని ప్రకటిస్తుంటున్నాడంటే అతను అబద్ధం పలుకుతున్నాడు అని మనము గ్రహించాలి.
ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆయనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. మహిమలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్తలకు మాత్రమే ఇచ్చాడు గానీ, ఇలాంటి దొంగ బాబాలకు ఆయన ఇవ్వలేదు. ఇలా ఈ రోజుల్లో ఎవరైనా ప్రకటిస్తున్నాడంటే వాడు దొంగ బాబా అని మనం గుర్తించాలి అభిమాన సోదరులారా.
అల్లాహ్ తో నేను దుఆ చేస్తున్నాను, మనము ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గొప్పతనాన్ని అర్థం చేసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాలను ఆచరించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.
ఆఖూలు ఖవ్ లీ హాజా వస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలిసాఇరిల్ ముస్లిమీన్ ఫస్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త సహచరుల మధ్య విభేదాల, అంతఃకలహాల విషయంలో అహ్లె సున్నత్ వల్ జమాఅత్ వైఖరి :
ఉపద్రవానికి మూలం: ప్రవక్త ప్రియ సహచరుల మధ్య చీలిక రావటానికి ప్రధాన కారకులు యూదులు. వారు ఇస్లాంకు, ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రపన్నారు. వారు వంచనా శిల్పనిష్ణాతుడైన, యమన్ దేశస్థుడైన అబ్దుల్లాహ్ బిన్ సబా అనే యూద వ్యక్తిని దీని కొరకు సిద్ధం చేశారు. వాడు ఇస్లాం స్వీకరిస్తున్నట్లు నాటకమాడి తన చుట్టూ ఓ సుందర వలయాన్ని అల్లుకున్నాడు. తరువాత అతను తృతీయ ఖలీఫా అయిన హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)కు వ్యతిరేకంగా దుర్విమర్శలు చేయటం మొదలెట్టాడు. చివరకు ఆయనపై విషం కక్కాడు. ఆయనపై అపనిందలు కూడా మోపాడు. తత్ఫలితంగా సంకుచిత స్వభావులు, బలహీన విశ్వాసం గలవారు కొందరు అతని మాటల్లో పడి, అసమ్మతి వాదులుగా అతని చుట్టూ చేరారు. వారి కుట్ర మూలంగా హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) నిర్దాక్షిణ్యంగా హత్యచేయబడ్డారు. ఆయన (రదియల్లాహు అన్హు) అమరగతినొందిన తరువాత ముస్లిములలో విభేదాలు పొడసూపాయి. దానికి తోడు యూదులు చాపకింద నీరులా ప్రవహించి ప్రజలను రెచ్చగొట్టడంతో ప్రవక్త సహచరుల మధ్య విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చాయి. వారు తమ తమ ఇత్తెహాద్ ప్రకారం (అంటే వారిలో ప్రతి ఒక్కరూ తాము ఎన్నుకునే విధానమే సరైనదని భావించటం వల్ల) కలహాలకు, యుద్ధాలకు తెరలేచింది.
‘అఖీదయే తహావీయ’ వ్యాఖ్యాత ఇలా అంటున్నారు:
“రఫ్ద్ (షియాతత్వం) అనే ఉపద్రవాన్ని ఓ కపట విశ్వాసి సృష్టించాడు. ఇస్లాం ధర్మాన్ని రూపుమాపి, ఇస్లాం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వ్యక్తిత్వాన్ని కళంకితం చేయాలన్నది వాడి ఉద్దేశ్యం. అందుకే అబ్దుల్లాహ్ బిన్ సబా ఇస్లాం స్వీకరించినట్లు ప్రకటించగానే తన వంచనాపూరిత, మోసపూరిత చేష్టల ద్వారా ఇస్లాం ధర్మానికి తూట్లు పొడవటం మొదలెట్టాడు. క్రైస్తవ మతం పట్ల పౌల్ వ్యవహరించినట్లే ఇతనూ వ్యవహరించాడు. అంటే తనను ఒక మహా సాత్వికునిగా, దుష్ట శిక్షకు శిష్టరక్షణకు నడుం బిగించిన వానిగా చాటుకుని తనచుట్టూ ఓ సుందరవలయాన్ని అల్లుకున్నాడు. ఆ తరువాత హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)కు వ్యతిరేకంగా అసంతృప్త వాదాన్ని వ్యాపింపజేసి, ఆయన్ని హతమార్చే ప్రయత్నం చేశాడు. దరిమిలా ‘కూఫా’ వచ్చి, హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)కి వీరాభిమానిగా ప్రకటించుకుని, ఆయనను పొగడటంలో అతిశయిల్లి రాగానపడ్డాడు. ఆ విధంగా ఆయన (రదియల్లాహు అన్హు)అభిమానం చూరగొని, తన తుచ్ఛమయిన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకుందామనుకున్నాడు. అతని కుత్సితబుద్ధి గురించి తెలియగానే హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు), అతన్ని హతమార్చమని ఆదేశించారు. దాంతో వాడు ‘ఖర్ ఖైస్’కు పలాయనం చిత్తగించాడు. అతని పూర్తి వృత్తాంతం చరిత్రపుటల్లో ఉంది.”
షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు :
హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) అమరగతి నొందిన తరువాత ప్రజల గుండెలు శోకంతో అవిసిపోయాయి. వారి హృదయాలు భగ్న హృదయాలైపోయాయి. ముస్లింలపై దుఃఖ పర్వతం విరుచుకుపడింది. దుష్టశక్తులు చెలరేగిపోయాయి. సజ్జనుల ఆత్మ విశ్వాసం సన్నిగిల్లిపోయింది. అప్పటి వరకూ అణగిమణగి ఉండేవారు ఉపద్రవాన్ని వ్యాపింపజేయటంలో కృతకృత్యులైపోయారు. సంస్కరణా సరణిని అవలంబించదలచిన వారు అశక్తులైపోయారు. అందువల్ల వారంతా ఖిలాఫతకు అందరికన్నా ఎక్కువ అర్హులైన హజ్రత్ అలీ బిన్ అబితాలిబ్ (రదియల్లాహు అన్హు) చేతులపై ప్రతిజ్ఞ (బైఅత్) చేశారు. కాని అప్పటికే ఉపద్రవాగ్ని రాజుకుని ఉండటం వల్ల, ప్రజల హృదయాలు భగ్నమై ఉండటం వల్ల సమాజంలో సమైక్యత, సంఘఠితత్వం సాధ్యం కాలేకపోయింది. ముస్లింలలో సామూహికత వేళ్లూను కోలేక పోయింది. ఆనాటి ఖలీఫాగానీ, సమాజంలో మానవనవనీతంగా పరిగణించబడే మంచివారుగాని ఎంతగా అభిలషించినప్పటికీ అనుకున్న మంచిని సాధించలేకపోయారు. విచ్చిన్నకరమైన ఆ వాతావరణంలో మరికొందరు స్వార్ధపరులు కూడా జొరబడ్డారు. ఆ తరువాత జరగవలసినదంతా జరిగిపోయింది.”
(మజ్మూఅ అల్ ఫతావా : 25/304, 305)
ఇకపోతే హజ్రత్ అలీ, ముఆవియా (రదియల్లాహు అన్హుమ్)ల యుద్ధంలో పాల్గొన్న ప్రవక్త ప్రియ సహచరుల సంజాయిషీ (కారణం)ని వివరిస్తూ షేఖుల్ ఇస్లాం ఇలా అభిప్రాయపడ్డారు:
ముఆవియా (రదియల్లాహు అన్హు) అలీ (రదియల్లాహు అన్హు)తో యుద్దానికి సంసిద్ధమైనపుడు ఖిలాఫత్ తనకే చెందాలని ఆయన కోరలేదు. ఆయనకు ఖిలాఫత్ కట్టబెట్టే విషయమై బైఅత్ (ప్రతిజ్ఞ) కూడా చేయించలేదు. తానొక ఖలీఫా అనే భావనతో ఆయన యుద్ధానికి రాలేదు. ఈ విషయం గురించి ముఆవియా (రదియల్లాహు అన్హు)ను ఎవరు ప్రశ్నించినా వారి ముందు ఆయన ఇదంతా చెప్పేవారు. ఆయన అనుయాయులు కూడా అంతే. వారు అలీ (రదియల్లాహు అన్హు)తోనూ, అలీ సహచరులతోనూ యుద్ధానికి ముందంజ వేయలేదు. అదే సమయంలో హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు), మరియు ఆయన సహచరుల ఆలోచనలు మరోవిధంగా ఉన్నాయి – తానొక ఖలీఫా కావటం చేత ముఆవియ మరియు ముఆవియా సహచరులు వచ్చి తన చేతుల మీద ప్రమాణ స్వీకారం చేయాలన్నది అలీ (రదియల్లాహు అన్హు) అభిలాష. ఎందుకంటే ముస్లింలకు ఖలీఫాగా ఒకే వ్యక్తి ఉండాలి. కాని వారు తనకు విధేయత చూపటం లేదు. తన చేతిపై ‘ప్రమాణం’ చేయటం లేదు సరికదా, తమను స్వతంత్రులుగా ఊహించుకుంటున్నారు. తమ వద్ద శక్తి ఉంది. అధికార బలం ఉంది. అయినప్పటికీ వారు మాట వినటం లేదు. కాబట్టి వారితో యుద్ధం చేసి, వారిని దారికి రప్పించాలి. తద్వారా వారు ఖలీఫాకు విధేయులవుతారు. ఆ విధంగా ముస్లింల సామూహిక వ్యవస్థ పటిష్టంగా ఉండగలుగుతుంది – ఇదీ హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) మరియు ఆయన సహచరుల ఆలోచన. కాగా; హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) మరియు ఆయన సహచరుల ఆలోచనా తీరు తద్భిన్నంగా ఉంది : తాము అలీ (రదియల్లాహు అన్హు)చేతులపై ‘ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. ఈ కారణంగా ఒకవేళ తమతో యుద్ధం చేయబడినా తాము బాధిత ప్రజల కోవకే చెందుతాము. ఎందుకంటే తృతీయ ఖలీఫా హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)దారుణంగా హత్య చేయబడ్డారు. ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)ను హత్య చేయటంలో కీలకపాత్ర పోషించినవారు ప్రస్తుతం హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) సైన్యంలో ఉన్నారు. సైనిక విభాగంలో వారి ప్రాబల్యం కూడా ఎక్కువగానే ఉంది. మనం గనక ఈ సమయంలో నిర్లిప్తంగా ఉండిపోతే వారు మరింతగా విజృంభించి మనపై జులుంకు ఒడిగట్టవచ్చు. అదే గనక జరిగితే ఖలీఫా హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వారిని నిలువరించలేరు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)ను ముట్టడించినపుడు అలీ (రదియల్లాహు అన్హు) ఎలా నిస్సహాయులుగా ఉండిపోయారో అలాగే ఉండిపోవచ్చు. కాబట్టి మనకు న్యాయం చేసే ప్రతిభావంతుడైన ఖలీఫా చేతుల మీద మాత్రమే మనం బైఅత్ (ప్రతిజ్ఞ) చేయాలి.”
సహాబా (రదియల్లాహు అన్హుమ్)మధ్య పొడసూపిన విభేదాలు, అంతఃకలహాల ఫలితంగా జరిగిన యుద్ధాలు – ఈ విషయంలో అహ్లె సున్నత్ వల్ జమాఅత్ వైఖరి రెండు విషయాలపై ఆధారపడి ఉంది.
ఒకటి : ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రియసహచరుల (రదియల్లాహు అన్హుమ్) మధ్య తలెత్తిన వివాదాలపై, అవాంఛనీయ ఘటనలపై అహ్లె సున్నత్ వల్ జమాఅత్ కి చెందిన వారు నోరెత్తకుండా మౌనం వహించటమే శ్రేయస్కరమని భావిస్తారు. ఈ రగడపై వారు తర్జనభర్జన చేయటంగానీ, తమవైన అభిప్రాయాలు వ్యక్తపరచటం గానీ చేయరు. పైగా వారిలా వేడుకుంటూ ఉంటారు:
“మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయా లలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదుస్వభావుడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ :10)
రెండు: సహాబా (ప్రవక్త సహచరులు రదియల్లాహు అన్హుమ్) గురించి ప్రాచుర్యంలో ఉన్న కథనాలకు సమాధానాలివ్వటం. దీనికి సంబంధించిన కొన్ని పద్ధతులు ఇవి :
మొదటి పద్దతి:
అలాంటి కథనాల (ఆసార్)లో కొన్ని పచ్చి అబద్దాలు. ప్రవక్త సహచరులకు అపఖ్యాతి అంటగట్టడానికి ఇస్లాం విరోధులచే సృష్టించబడిన కట్టుకథలవి.
రెండవ పద్ధతి:
సహాబాకు సంబంధించిన మరికొన్ని కథనాలున్నాయి. వాటిలో హెచ్చుతగ్గులు, మార్పులు చేర్పులుచేయబడ్డాయి. ఆ విధంగా వాటి రూపురేఖలనే మార్చివేయటం జరిగింది. అందులో అబద్దం పాళ్ళు అధికం. కాబట్టి అలాంటి వాటిని కూడా పట్టించుకోకుండా ఉండటమే శ్రేయస్కరం.
మూడవ పద్ధతి:
ఆ కథనాలలో ప్రామాణికం అనదగినవి, అలాంటివి చాలా తక్కువే. ఈ విషయంలో మటుకు ప్రవక్త సహచరులు అశక్తులు, క్షంతవ్యులు. ఎందుకంటే వారు ఆ విషయాలలో తమ ‘ఇత్తెహాద్’ ప్రకారం పనిచేశారు. అందులో వారు సత్యం వరకూ చేరుకున్నారు లేదా వారివల్ల పొరపాటు కూడా జరిగి ఉండవచ్చు. ఎందుకంటే వారు ‘ముజ్తహిద్’ లు (సమకాలీన సవాళ్ళను షరీఅత్ బద్దంగా అన్వయించటానికి శాయశక్తులా కృషిచేసిన విజ్ఞులు). ఈ అన్వయింపు ప్రయత్నంలో వారు సరైన ఆజ్ఞ వరకూ చేరగలిగితే వారికి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ఒకవేళ వారు సరైన నిర్ణయానికి చేరుకోలేకపోయినప్పటికీ – వారివల్ల పొరపాటు జరిగినప్పటికీ – చిత్తశుద్దితో కూడిన వారి కృషికి గాను ఒకింత పుణ్యఫలం లభిస్తుంది. మరోవైపు వారి తప్పు కూడా మన్నించబడుతుంది. ఎందుకంటే హదీసులో ఇలా అనబడింది
“న్యాయ నిర్ణయం గైకొనే వ్యక్తి ‘ఇజ్తిహాద్’ చేసినపుడు అతను సరైన నిర్ణయానికి చేరుకోగలిగితే అతనికి రెండింతల ప్రతిఫలం ప్రాప్తమవుతుంది. ఒకవేళ అతని వల్ల పొరపాటు జరిగినట్లయితే అతనికి ఒకింత ప్రతిఫలం లభిస్తుంది.” (బుఖారీ, ముస్లిం)
నాల్గవ పద్ధతి:
ప్రవక్త సహచరులు (సహాబా రదియల్లాహు అన్హుమ్) కూడా మానవమాత్రులే. వారివల్ల కూడా తప్పులు జరగటం సహజం. వ్యక్తిగతంగా చూస్తే వారు దోషరహితులు కారు. అయితే వారివల్ల జరిగే పొరపాట్లను పరిహరించే మరెన్నో పనులు, అంశాలున్నాయి. అవి వారి పాపాలకు పరిహారంగా ఉపయోగపడతాయి. అలాంటి వాటిలో కొన్ని ఇవి
1. బహుశా వారు పశ్చాత్తాపపడ్డారేమో! తప్పులు ఎన్ని జరిగి ఉన్నాసరే, పశ్చాత్తాపం (తౌబా) వాటిని రూపుమాపుతుంది.
2. ఒకవేళ వారివల్ల అలాంటిదేదైనా జరిగి ఉన్నా, మరెన్నో విషయాలలో వారు ముందంజవేసి ఉన్నారు. వారివల్ల జరిగిన తప్పుల మన్నింపునకు అవి సాధనం కావచ్చు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
“నిశ్చయంగా పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి.” (హూద్ : 114)
3. వారి పుణ్యకార్యాలు వేరితరుల కంటే ఎన్నో రెట్లు పెంచబడవచ్చు. గొప్పతనం విషయంలో ఇతర వ్యక్తులు వారితో సరితూగలేరు. వారు మంచి కాలానికి చెందినవారని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి ప్రవచనం ద్వారానే రూఢీ అయింది. వారిలో ఎవరయినా ఒక ‘ముద్’కు సమానంగా దానం చేస్తే అది ఇతరులు ఉహుద్ పర్వతానికి సమానంగా దానం చేసిన బంగారం కన్నా గొప్పది. అల్లాహ్ వారితో ప్రసన్నుడవుగాక! వారిని సంతోషంగా ఉంచుగాక!
షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు :
“మొత్తం అహ్లె సున్నత్ వల్ జమాఅత్, ధర్మవేత్తల నమ్మకం (అఖీదా) ఏమిటంటే సహాబాలలో ఏ ఒక్కరూ దోష రహితులు, పవిత్రులు కారు. అలాగే ప్రవక్త బంధువులుగానీ, సహాబాలలో తొలికాలానికి చెందినవారు గానీ, ఇతరులు గానీ – వారెవరయినా వారివల్ల తప్పు జరగటం సహజం, సంభవం కూడా. అయితే అల్లాహ్ పశ్చాత్తాపం (తౌబా) ద్వారా వారి పాపాలను క్షమిస్తాడు. వారి అంతస్తులను ఉన్నతం చేస్తాడు. అలాగే పాపాలను రూపుమాపే సత్కార్యాల ద్వారా లేదా ఇతరత్రా కారణాల దృష్ట్యా వారిని క్షమిస్తాడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
ఎవరయితే సత్యధర్మాన్ని తీసుకువచ్చారో, మరెవరయితే దానిని సత్యమని ధ్రువీకరించారో అటువంటివారే భయభక్తులు గలవారు. వారికోసం వారి ప్రభువు దగ్గర వారు కోరినదల్లా ఉంది. సదాచార సంపన్నులకు లభించే ప్రతిఫలం ఇదే. అల్లాహ్ వారి దురాచరణలను వారి నుండి దూరం చేయటానికి, వారు చేసిన సదాచరణలకు గాను ఉత్తమ పుణ్యఫలం ఇవ్వటానికి (ఈ వ్యవస్థను నెలకొల్పుతాడు). (అజ్ జుమర్ : 33-35)
ఇంకా ఈ విధంగా సెలవీయబడింది :
తుదకు అతను పూర్తి పరిపక్వతకు, అంటే నలభై ఏళ్ళ ప్రాయానికి చేరుకున్నప్పుడు ఇలా విన్నవించుకున్నాడు : “నా ప్రభూ! నీవు నా తల్లిదండ్రులపై కురిపించిన అనుగ్రహ భాగ్యాలకు గాను కృతజ్ఞతలు తెలుపుకునే, నీ ప్రసన్నతను చూరగొనే విధంగా సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. ఇంకా నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు. నేను నీ వైపునకే మరలుతున్నాను. నేను నీ విధేయులలో ఒకణ్ణి.” ఇలాంటి వారి సత్కార్యాలనే మేము స్వీకరిస్తాము. వారి తప్పులను క్షమిస్తాము. వారికి చేయబడిన సత్య వాగ్దానం ప్రకారం వారు స్వర్గవాసులలో ఉంటారు. (అల్ అహ్ ఖాఫ్ : 15,16)
(మజ్మూల ఫతావా : 35/69)
ప్రవక్త సహచరుల మధ్య తలెత్తిన విభేదాలను, పోరాటాలను ఇస్లాం శత్రువులు తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ సహాబా వ్యక్తిత్వాలపై బురదజల్లేందుకు ప్రయత్నించారు. వారి గౌరవ మర్యాదలను మంట గలిపేందుకు అవకాశంగా తీసుకున్నారు. అదే రకమయిన నీచ స్వభావంతో ఈనాటి కొందరు రచయితలు, సోకాల్డ్ మేధావులు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. వీరు అనాలోచితంగా సహాబాపై విమర్శలు గుప్పిస్తుంటారు. ఆ విధంగా వారు తమను తాము సహాబా వైఖరిపై తీర్పు చెప్పే న్యాయమూర్తులుగా ఊహించుకుంటున్నారు. తగు ఆధారాలు, నిదర్శనాలు లేకుండానే – కేవలం తమ మనోవాంఛలకు లోబడి – స్వార్థపరుల, కపట విమర్శకుల వ్యాఖ్యలను ఉదాహరిస్తూ కొంతమంది సహాబీలను సత్యవాదులుగా, మరికొంతమంది సహాబీలను దోషులుగా నిర్ధారిస్తున్నారు. అంతేకాదు, ఇస్లామీయ సంస్కృతీ నాగరికతల పట్ల తగు అవగాహన లేని కొంతమంది ముస్లిం యువకులలో – ఇస్లాం యొక్క గొప్ప చరిత్రపట్ల, తొలికాలపు మహనీయుల పట్ల లేనిపోని దురనుమానాలను నూరిపోస్తున్నారు. ఆ విధంగా వారిలో ఇస్లాం పట్ల ఏవగింపును కలిగించి, ముస్లిం సముదాయంలో చీలికను తీసుకురావాలని, తొలికాలపు సజ్జనుల పట్ల చివరి కాలపు ప్రజలలో ద్వేషాన్ని, వైషమ్యాన్ని రగుల్గొల్పాలని చూస్తున్నారు. దీనికి బదులు వారు తొలికాలపు సత్పురుషుల అడుగుజాడలలో నడచి, వారి కొరకు దుఆ చేసినట్లయితే ఎంత బాగుండేది! అలాంటి సద్భావన కలిగి ఉండే వారిని అల్లాహ్ సయితం శ్లాఘిస్తాడు. ఉదాహరణకు –
వారి తరువాత వచ్చిన వారు (తమ పూర్వీకులను గురించి) ఇలా వేడుకుంటారు : “మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదుస్వభావం కలిగినవాడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ : 10)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఆరవ ప్రకరణం: మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరుల(రదియల్లాహు అన్హుమ్)ను, మార్గదర్శక నాయకులను తూలనాడరాదు
(1) సహాబాలను (రదియల్లాహు అన్హుమ్) తూలనాడటం పట్ల వారింపు:
అహ్లే సున్నత్ వల్ జమాఅత్ సంవిధానంలో ఉన్న నిబంధనలలో ఒకటేమిటంటే మహాప్రవక్త ప్రియ సహచరుల (రదియల్లాహు అన్హుమ్) విషయంలో వారి ఆంతర్యాలు నిర్మలంగా ఉండాలి. వారి గురించి నోరు జారకూడదు. అల్లాహ్ తన గ్రంథంలో తెలియజేసినట్లుగా ఉండాలి వారి వైఖరి.
వారి తరువాత వచ్చిన వారు (వారి గురించి) ఇలా వేడుకుంటారు: “మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చ యంగా నీవు మృదు స్వభావం కలవాడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ 59 : 10)
ఇంకా వారు – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేసిన ఈ హితవును ఖచ్చితంగా పాటిస్తారు –
“నా సహచరులను దూషించకండి. ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆ శక్తిమంతుని సాక్షిగా! మీలో ఏ వ్యక్తి అయినా ఉహుద్ పర్వతానికి సమానంగా బంగారం ఖర్చుచేసినా, వారిలో (అంటే నా ప్రత్యక్ష సహచరులలో)ని వారు దానం చేసిన ఒక ‘ముద్’కు, ఆఖరికి ‘ముద్’లో సగభాగానికి కూడా సమానం కాజాలదు.” (బుఖారీ, ముస్లిం)
అహ్లే సున్నత్ వల్ జమాఅత్ వారు సహాబాలను దూషించే రాఫిధీల (షియా వారి)తో, ఖవారిజ్ వర్గీయులతో తెగతెంపులు చేసుకుంటారు. వారితో ఎలాంటి స్నేహం, సుహృద్భావం కలిగి ఉండరు. తరచూ సహాబాలను కాఫిర్లు (అవిశ్వాసులు)గా ఖరారు చేసే వీరి ధోరణిని ఖండిస్తారు. వీరిలోని ఏ మంచితనాన్ని అంగీకరించరు.
ప్రవక్త సహచరుల ఔన్నత్యం గురించి ఖుర్ఆన్ హదీసులలో చెప్పబడిన దానిని అహ్లే సున్నత్ వల్ జమాఅత్ వారు శిరసావహిస్తారు. సహాబా ముస్లిం ఉమ్మత్ లో కెల్లా అత్యుత్తములని విశ్వసిస్తారు. ఉదాహరణకు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పినట్లుగా –
”మీ అందరిలోకెల్లా ఉత్తములు నా కాలానికి చెందినవారు.” (బుఖారీ, ముస్లిం)
తన ఉమ్మత్ (అనుచర సమాజం) 73 వర్గాలుగా చీలిపోతుందని, వారిలో ఒకే ఒక వర్గం తప్ప మిగిలిన వారంతా నరకానికి పోతారని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పినపుడు, ఆ ఒక్క వర్గం ఏదంటూ ప్రియ సహచరులు (రదియల్లాహు అన్హుమ్) అడిగారు. సమాధానంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు :
“ఈ రోజు నేను, నా సహచరులు ఏ పద్ధతిపై ఉన్నామో ఆ పద్ధతిపై స్థిరంగా ఉండేవారు.” (ముస్నదె అహ్మద్, తిర్మిజి 2641 హసన్)
ఇమామ్ ముస్లిం గురువుల్లో ప్రముఖులైన ఇమామ్ అబూజర్అ ఇలా అంటున్నారు:
“ఏ వ్యక్తి అయినా మహాప్రవక్త ప్రియసహచరులలో ఎవరినయినా తూలనాడుతున్నట్లు మీరు గమనిస్తే అతణ్ణి ధర్మవిహీనునిగా పరిగణించండి. ఎందుకంటే ఖుర్ఆన్ సత్యం. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సత్యం. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెచ్చిన షరీయత్ సత్యబద్దం. కాగా; వీటన్నింటినీ మన వరకూ చేర్చినవారు సహాబీలే (ప్రియ సహచరులే). కాబట్టి వారిని తూలనాడినవాడు ఖుర్ఆన్ హదీసులనే అసత్యంగా ఖరారు చేయదలుస్తున్నాడని అనుకోవాలి. కనుక అలాంటి వ్యక్తి స్వయంగా నిందార్హుడు. అతనిపై ధర్మవిహీనుడు, మార్గవిహీనుడన్న అభియోగం మోపటం చాలా వరకు సమంజసం, సత్యం.”
అల్లామా ఇబ్నె హమదాన్ తన గ్రంథం ‘నిహాయతున్ ముబ్ త దీన్’లో ఇలా అంటున్నారు :
“ఎవరయితే ప్రవక్త సహచరులను దూషించటం ధర్మసమ్మతం అని భావిస్తూ మరీ దూషిస్తున్నాడో అతను ఖచ్చితంగా కాఫిర్ (అవిశ్వాసి). మరెవరయితే ధర్మసమ్మతం కాదని భావిస్తూ కూడా దూషిస్తాడో అతడు పాపాత్ముడు (ఫాసిఖ్ ).”
ఆయన గారి మరో పలుకు ఇలా ఉంది :
“ఎవరయితే ప్రవక్త ప్రియ సహచరులను దూషిస్తాడో, అతను నిశ్చయంగా కాఫిరే (దాన్ని అతను ధర్మసమ్మతమని భావించినా, భావించక పోయినా). అదేవిధంగా – ఎవరయితే ప్రవక్త సహచరుల (రదియల్లాహు అన్హుమ్)ను అవిధేయులుగా ఖరారు చేస్తాడో లేదా వారి ధర్మావలంబనలో లోపం ఎత్తిచూపిస్తాడో లేదా వారిని కాఫిర్లుగా ఖరారు చేస్తాడో, అతను ముమ్మాటికీ కాఫిర్ (అవిశ్వాసి). (షరహ్ అఖీదతుస్సిఫారీని – 2/388, 389)
(2) ముస్లిం సమాజంలోని మార్గదర్శకులను దూషించటం పట్ల వారింపు :
మహిమోన్నతల దృష్ట్యాగానీ, స్థాయి రీత్యాగానీ సహాబా తర్వాత స్థానం, ఉమ్మత్ కు చెందిన మార్గదర్శక నాయకులది. వారే తాబయీన్, తబయె తాబయీన్, ఆ తర్వాత తరానికి చెందిన ఉలమా. వారంతా సహాబాను శాయశక్తులా అనుసరించారు. అల్లాహ్ సెలవిచ్చినట్లుగా ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజవేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్దితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. (అత్ తౌబా : 100)
కనుక వారిని దూషించటం, వారిలోని లోపాలను ఎత్తి చూపటం, వారిపై విమర్శనాస్త్రాలు సంధించటం ఎంతమాత్రం సమ్మతం కాదు. ఎందుకంటే వారంతా మార్గదర్శకులు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
ఎవరయినా సన్మార్గం ప్రస్ఫుటం అయిన మీదట కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు వ్యతిరేకంగా పోతే, విశ్వాసులందరి మార్గాన్ని వీడి, ఇతర మార్గాన్ని అనుసరిస్తే, మేమతన్ని అతను మరలదలచుకున్న వైపునకే మరల్చుతాము. కడకు అతన్ని నరకంలో పడవేస్తాము. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. (అన్ నిసా : 115)
‘కితాబుత్తహావియ’ వ్యాఖ్యాత (ఇమామ్ ఇబ్నె అబీ అజల్ హనఫీ) ఇలా అన్నారు:
“అల్లాహ్ తో, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో స్నేహపూర్వక సంబంధాల తర్వాత తోటి విశ్వాసులతో కూడా స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవటం ప్రతి ముస్లింకూ తప్పనిసరి. ఈ విషయంలో ఖుర్ఆన్ సర్వ సాధారణమయిన ఆజ్ఞ ఉండనే ఉంది. అయితే మరీ ముఖ్యంగా ప్రవక్తల వారసులతో మనకు స్నేహబంధం ఉండాలి. అల్లాహ్ వారిని ధ్రువతారల మాదిరిగా చేశాడు. నేలలోని, సముద్రాలలోని చీకట్లలో వాటి ద్వారా మార్గం కనుగొనబడుతుంది. వారి మార్గదర్శకత్వంపై, వారి ధర్మావగాహనపై ముస్లింలందరికీ గురి ఉంది.”
ఎందుకంటే వీరు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనుచర సమాజంలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) శిష్యుల, వారు వదలివెళ్ళిన మృత సంప్రదాయాలను పునరుజ్జీవింప జేసేవారు. వారి మూలంగానే దైవగ్రంథం నెలకొని ఉంది. దాని ఊపిరి మూలంగా వారు కూడా నిలబడి ఉన్నారు. వారి గురించి దైవగ్రంథంలో స్పష్టమయిన వివరణ వచ్చింది. వారు కూడా దానికి ప్రతినిధుల వంటి వారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను అనుసరించటం అనివార్యం (వాజిబ్) అన్న విషయంలో వారందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. కాని ఒకవేళ వారిలో ఎవరి ఉవాచ అయినా ప్రామాణిక హదీసుకు వ్యతిరేకంగా మన ముందుకువస్తే, ఆ హదీసును పరిత్యజించటంలో ఆయన వద్ద తప్పకుండా ఏదో కారణం ఉండి ఉంటుంది అని మనం భావించాలి.
సాధారణంగా ఆ కారణం మూడు విధాలుగా ఉంటుంది.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనం అయి ఉండవచ్చన్న విషయంపై అతనికి నమ్మకం కుదరక పోవచ్చు.
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ ప్రవచనం ద్వారా చెప్పదలచిన విషయంపై ఇదమిత్థంగా ఒక నిర్ధారణకు రాకపోయి ఉండవచ్చు.
అది రద్దు అయిపోయిన ఆజ్ఞ కావచ్చు అన్నది అతని నమ్మకం అయి ఉండవచ్చు.
మొత్తానికి మనందరి మీద వారికి ఆధిక్యత ఉంది. మనకు వారు ఉపకారం చేసినవారు. వారు మనకన్నా ముందే విశ్వసించినవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందజేసిన ధర్మాన్ని వారు మన వరకూ చేర్చారు. మనకు అర్థం కాకుండా నిగూఢంగా ఉండిపోయే ఎన్నో విషయాలను వారు మనకు విడమరచి చెప్పారు. అల్లాహ్ వారితో ప్రసన్నుడవుగాక! వారిని సంతుష్టపరచుగాక!
“మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చ యంగా నీవు మృదు స్వభావం కలవాడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ 59 : 10)
కొంతమంది విద్వాంసుల (ఉలమా)చే ధర్మసూత్రాల అన్వయింపు (ఇత్తెహాదీ) ప్రక్రియలో దొర్లిన తప్పుల మూలంగా వారి స్థాయిని దిగజార్చే ప్రయత్నం చేయటం బిదతీల విధానం. ఇలాంటి వాటి కోసం ఇస్లాం విరోధులు కాచుకుని ఉంటారు. తద్వారా ఇస్లాం గురించి లేనిపోని సందేహాలు సృష్టించటానికి, ముస్లిముల మధ్య వైరభావం పుట్టించటానికి శాయశక్తులా యత్నిస్తారు. భావి తరాలవారు తమ పూర్వీకుల (సలఫ్) పట్ల విముఖతను, విసుగును వ్యక్తం చేసేలా కుట్ర పన్నుతారు. విద్వాంసులకు – నవ యువకులకు మధ్య విభేదాలను సృష్టిస్తారు. వారి మధ్య పూడుకోని అంతరాల అగాధాలను కల్పిస్తారు. నేడు సర్వత్రా జరిగేది కూడా ఇదే. కాబట్టి విద్యార్థి దశలో ఉన్న నవయువకులు ఈ స్వార్థపరుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వారు ధర్మవేత్తల (ఫుకహా) యొక్క, ఇస్లామీయ ధర్మశాస్త్రం (ఫికప్) యొక్క స్థాయిని దిగజారుస్తారు.
దానిని చదవటం, చదివించటం పట్ల, దానిలో ఉన్న శ్రేయోదాయకమయిన విషయాలను, సత్యాన్ని సంగ్రహించటం పట్ల తమ అనాసక్తతను, విసుగును ప్రదర్శిస్తూ ఉంటారు. మొత్తానికి వారు తమ ఫికహ్ (ధర్మశాస్త్రం)ను గర్వకారణంగా భావించాలి. తమ విద్వాంసులను గౌరవించాలి. మార్గవిహీనుల, స్వార్థపరుల దుష్ప్రచార జాలంలో మాత్రం చిక్కుకోరాదు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.