క్లుప్త వివరణ : పవిత్ర ముహర్రం నెల మరియు ఆషూరాహ్ దినపు ప్రత్యేక శుభాలు
అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు : నజీర్ అహ్మద్
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
వర్గం: Bidah
మీలాదున్నబీ – సంభాషణ (Milad-un-Nabee)

అనువాదకులు : సలీం సాజిద్ అల్ మదనీ
పునర్విచారకులు : అబూ అద్నాన్ ముహమ్మద్ మునీర్ ఖమర్
క్లుప్త వివరణ: ఇది ఇద్దరూ ముస్లిం సోదరుల మధ్య జరిగిన సంభాషణా రూపంలో రచించబడినది – వారిలో ఒకరు మీలాదున్నబీ వేడుకలను తాతముత్తాతల పరంగా వస్తున్న ఆచారంగా భావిస్తూ ఆచరిస్తున్నవారు, ఇంకొకరు సరైన ఇస్లామీయ జీవన విధానం తెలిసిన వారు. ఇది చదివిన తర్వాత ఎవరైనా సరే, తమలో చోటుచేసుకున్న బిదాఅత్ లను అంటే అపోహలను దూరం చేసుకుని, ఇస్లాం ధర్మపు అసలైన పద్ధతిలో జీవించే మార్గదర్శకత్వం పొందగలరని ఆశిస్తున్నాం.
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను
జునైద్: అస్సలాము అలైకుమ్
అబ్దుల్లాహ్: వ అలైకుమ్ అస్సలామ్. ఏంటి పొద్దున ఇలా వచ్చారు? ఇవ్వాళ షాపు దగ్గరికి వెళ్ళలేదా?
జునైద్: ఇవ్వాళ మిలాదున్నబీ కదా! బజార్లో దుకాణాలన్నీ కూడా మూసే ఉంటాయి.
అబ్దుల్లాహ్: అంటే మీరు ఈ రోజు పండుగ జరుపుకుంటున్నారన్న మాట.
జునైద్: ఎందుకని అడిగారు? మీరు జరుపుకోవటం లేదా?
అబ్దుల్లాహ్: ఇస్లాంలో మనకు పండుగలు రెండే కదా!
1) ఈదుల్ ఫిత్ర్
2) ఈదుల్ అజహా
జునైద్: ఈ మూడో పండుగ, ఈదె మీలాదున్నబీ కూడా ఉంది కదా!
అబ్దుల్లాహ్: అలాగా! మరయితే ఈదె మీలాదున్నబీ రోజున మనం ఈద్గాహ్ కు వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నామా?
జునైద్: ఈదె మీలాదున్నబీ రోజునయితే ఈద్గాలో చేసే ప్రార్థనలే లేవు కదా?
అబ్దుల్లాహ్: మరి మిగతా రెండు పండుగ రోజుల్లో నమాజులు ఎందుకు చేస్తున్నాం?!
జునైద్: అవి చేయాలి కాబట్టి చేస్తున్నాం.
అబ్దుల్లాహ్: అదే; అవి ఎందుకు చేయాలి అని అడుగుతున్నాను.
జునైద్: ఎందుకంటే ఆ నమాజులు చేయమని మనకు ఆజ్ఞాపించబడింది.
అబ్దుల్లాహ్: ఈదె మీలాద్నుబీ రోజున నమాజు చేయాలని ఆజ్ఞాపించబడలేదా మరి?!
జునైద్: ఆజ్ఞాపించబడలేదేమో! అందుకనేగా ఎవరూ ఆ రోజు ఈద్గాహ్ కు వెళ్ళి నమాజ్ చేయనిది!
అబ్దుల్లాహ్: నమాజు సంగతి పక్కన పెడదాం. అసలు మీలాదున్నబీ జరుపుకోవాలని ఎక్కడైనా రాసి ఉందా?
జునైద్: అలాంటి ఆజ్ఞ ఉన్నట్టు నేనెక్కడా వినలేదు. అలాగని జరుపుకోరాదని కూడా ఎక్కడా లేదుగా?!
అబ్దుల్లాహ్: మరి ఆ రోజు పండుగ నమాజు జరుపుకో రాదని మాత్రం ఎక్కడయినా ఉందా?!
జునైద్: లేదు, అలాంటిదేమీ లేదు.
అబ్దుల్లాహ్: మరి మీరు ఆరోజు పండుగ ప్రార్థన ఎందుకు చేయరు?
జునైద్: అసలు మీరు ఏం చెప్పదలచుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి.
అబ్దుల్లాహ్: నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే ఇస్లాంలో ఈ పండుగకు సంబంధించి ఎటువంటి ఆధారాలూ లేవు. ఒకవేళ ఈ పండుగ గనక నిజంగా ఉండి ఉంటే ఇతర రెండు పండుగల్లాగా ఈ పండుగ రోజు కూడా నమాజు చేయబడేది. హదీసుల్లో దాని ప్రాధాన్యత వివరించబడేది. దాని ఆదేశాల గురించి, నియామాల గురించి దైవప్రవక్త వివరించి ఉండేవారు.
జునైద్: అంటే ఈ పండుగ జరుపుకునేవారు తప్పు చేస్తున్నారని నీ అభిప్రాయమా?
అబ్దుల్లాహ్: ముస్లింల ఆచరణ పేరు ఇస్లాం కాదు, ఖుర్ఆన్ హదీసుల వివరణే ఇస్లాం. ఖుర్ఆన్ హదీసుల ద్వారా రూఢీ కానిది ఇస్లాం ధర్మం కాదు. ఎవరయినా ఖుర్ఆన్ హదీసుల ద్వారా రూఢీ కాని దానిని ధర్మంగా భావిస్తున్నట్లయితే అతను ధర్మంలో కల్పితానికి పాల్పడుతున్నాడన్న మాట. అది ఘోరనేరం. దాన్ని ‘బిద్అత్’ అంటారు. బిద్అత్ లకు దూరంగా ఉండమని దైవ ప్రవక్త (సల్లల్లా హు అలైహి వ సల్లం) తన అనుచర సమాజాన్ని ఎంతగానో హెచ్చరించారు.
జునైద్: దైవప్రవక్త సహచరుల (సహాబాల) వారి శిష్యుల (తాబయీన్ల) కాలంలో ఎవరయినా ఈ పండుగ జరుపుకునేవారా?
అబ్దుల్లాహ్: ప్రసక్తే లేదు. సహాబాల, తాబయీన్ల తర్వాత ఏ ఇమామూ, ఏ హదీసువేత్త కూడా ఈ పండుగ జరుపుకోలేదు. అహెలె-సున్నత్ కు చెందిన నలుగురు ఇమాముల్లో ఎవరూ కూడా అసలు ఈ పేరు సైతం వినలేదు. ఈ కొత్త పోకడ (బిద్అత్) హిజ్రీ శకం 625 నుంచి మొదలైంది.
జునైద్: అది సరే. నాదొక చిన్న సందేహం. ఒక ముస్లిం తనకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పట్ల ఎంతో ప్రేమ ఉందని చెప్పుకుంటూ ఆయన పుట్టిన రోజున, ఆయన గౌరవార్థం ఏ కార్యమూ చేయకుండా గడిపేయటం భావ్యమా చెప్పండి?!
అబ్దుల్లాహ్: అవునండీ, అదే భావ్యం. ఎందుకంటే సహాబాలుగాని, వారి శిష్యులుగాని, సలఫ్ పండితులుగాని ఈ పండుగ జరుపుకున్నట్లు మీకు చరిత్రలో ఎక్కడా కనిపించదు. ఇకపోతే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పట్ల ప్రేమాభిమానాల సంగతి! ఖుర్ఆన్ గ్రంధాన్ని, దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) చూపిన విధానాన్ని అనుసరించటం ద్వారా అవి వ్యక్తమవు తాయిగాని ఆయన పుట్టిన రోజు పండుగ జరుపుకోవటం ద్వారా కాదు. క్రీ.శ. 625కు పూర్వం గడిచిన ప్రజలకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీద ప్రేమ లేదంటారా? దైవప్రవక్త ( సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ కాలాన్ని ఉత్తమ కాలంగా అభివర్ణించారు మరి!
జునైద్: క్రైస్తవులు తమ ప్రవక్త పుట్టిన రోజు సందర్భంగా క్రిస్మస్ పండుగ (ఈద్ మిలాద్) జరుపు కుంటారు. మన ప్రవక్త, ప్రవక్తలందరిలో కెల్లా గొప్పవారు. అలాంటప్పుడు మన ప్రవక్త పుట్టిన రోజును మనం జరుపుకోకుండా ఎలా ఉంటాం?
అబ్దుల్లాహ్: క్రైస్తవులు తమ ప్రవక్తను ‘దేవుడు’, దేవుని కుమారుడు అంటారు. మరి వారికి పోటీగా మనం కూడా మన ప్రవక్తను ‘దేవుడు,’ ‘దేవుని కుమారుడు’ అని అందామా? మీరు విషయాన్ని అర్థం చేసుకోండి. అందుకనేగా ఖుర్ఆన్, హదీసులు క్రైస్తవుల్ని మార్గ విహీనులుగా ఖరారు చేస్తున్నాయి. వాళ్లంతా తమ ప్రవక్త బోధనలకు వ్యతిరేకమైన పనులు చేస్తుంటారు. క్రిస్మస్ కూడా క్రైస్తవులు తాము స్వయంగా కల్పించుకున్న ఆచారమే తప్ప ఈసా ప్రవక్త దాని గురించి బోధించలేదు.
జునైద్: మిలాదున్నబీ పండుగ దురాచారమయితే కాదు కదా! అది మంచి ఆచారమే కదా!
అబ్దుల్లాహ్: అది మంచి ఆచారమే అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఆయన సహ చరులు ఆ పండుగ ఎందుకు జరుపుకోలేదు? ఆ కాలంలో పండుగ జరుపుకోవటానికి వారి దగ్గర డబ్బులు లేకనా? సంవత్సరానికి రెండు పండుగలు జరుపుకునేవారికి ఇంకొక్క పండుగ భారమవుతుందా?
జునైద్: ప్రవక్త సహచరుల కాలంలో జరగని చాలా పనులు ఈ కాలంలో జరుగుతున్నాయి. ఈ రోజు మనం మోటారు వాహనాల్లో, విమానాల్లో ప్రయాణం చేస్తున్నాం. మరి మీరు ప్రవక్త సహచరుల ఇస్లాంను అనుసరిస్తూ గాడిదలపై, గుర్రాలపైనే స్వారీ చేయవచ్చు కదా!
అబ్దుల్లాహ్: అయ్యా! విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల వల్ల ఇస్లాం కల్పితం కాదు. ధర్మంలో నూతన పోకడల వల్ల ఇస్లాం కల్పితం అవుతుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచిం చారు: “ఎవరైనా ధర్మంలో ఏదైయిన కొత్త విషయాన్ని సృష్టిస్తే దాన్ని తిరస్కరించాలి” (సహీహ్ బుఖారి, ముస్లిం). దీని గురించి వివరిస్తూ హాఫిజ్ ఇబ్నెహజర్ (రహిమహుల్లాహ్) ఏమన్నారో చూడండి: “నూతన విషయం అంటే ధర్మంలో నూతన విషయం. ధర్మంలో ఎవరైనా నూతన విషయాలను జొప్పిస్తే దాన్ని తిరస్కరించాలన్నమాట” (ఫత్ హుల్ బారీ 5/322). దీని ద్వారా అర్థమయ్యిందేమిటంటే ప్రతి కొత్త విషయం ఖండించదగింది కాదు. ధర్మంతో, ధర్మజ్ఞానంతో సంబంధం ఉన్న వినూత్న కల్పితాలు మాత్రమే ఖండించదగినవి. అలాంటి కొత్త విషయాలను ధర్మంలో భాగంగా, పుణ్యప్రదంగా భావించి చేస్తే అలాంటి నూతన విషయాలన్నీ ఖండించదగినవే. ఇకపోతే ప్రాపంచిక విషయాలంటారా?! వాటి గురించి అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు! “ఆయన గుర్రాలనూ, కంచర గాడిదలనూ, గాడిదలనూ సృష్టించాడు. వారు వాటిపై స్వారీ చేయటానికి, అవి మీ జీవితాలకు శోభను చేకూర్చటానికి, ఆయన ఇంకా చాలా వస్తువులను (మీ ప్రయోజనం కొరకు) సృష్టిస్తాడు. వాటిని గురించి మీకసలు తెలియనే తెలియదు.” (సూరయె నహ్లి:8). ఆ కాలంలో ప్రజలకు తెలియని వస్తువులను, వాహనాలను కూడా ఉపయోగించవచ్చని పై ఆయతుల్లో అల్లాహ్ స్వయంగా సెలవిస్తున్నాడు. అంటే ధర్మ సమ్మతమైన రీతిలో విజ్ఞాన శాస్త్రం ద్వారా ఉనికిలోకి వచ్చిన వినూత్న ఆవిష్కరణ లన్నిటినీ మనం ఉపయోగించవచ్చన్నమాట.
జునైద్: మరి సంతానం కలిగినప్పుడు వేడుక ఎందుకు జరుపుకుంటారు?
అబ్దుల్లాహ్: ఎందుకంటే సంతానం కలిగిన ఏడవ రోజున ‘అఖీఖా’ చేయమని షరీఅతు (ఇస్లామీయ ధర్మ శాస్త్రం) స్వయంగా ఆదేశించింది. ఏ పని చేయమని అయితే షరీఅత్ ఆదేశిస్తుందో అది ధర్మమైపోతుంది.
ఇప్పుడు చెప్పండి! రబీవుల్ అవ్వల్ 12వ తేదిన పండుగ జరుపమని షరీఅత్ ఆదేశించిందా? లేక అలా చేయమని ఎవరైనా బోధించి ఉన్నారా? లేదు. షరీఅత్ లో అటువంటి ఆజ్ఞ ఏదీ లేదు, ప్రవక్తగాని ఆయన సహచరులుగాని దీని గురించి బోధించలేదు. అదీగాక సంతానం పుట్టినప్పుడు ఒక్కసారి మాత్రమే వేడుక జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం కాదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలై హి వ సల్లం) ప్రతి సంవత్సరం పుడుతూ ఉంటారా ఏమి? సంతానం పుట్టిన తర్వాత ఏదో రోజు వేడుక జరుపుకుంటారు. అదే రోజు వేడుక జరుపుకోవటమనేది ఎక్కడా లేదు. అదీ ఆ ఒక్క రోజు! ప్రతి యేడు కాదు!
జునైద్: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పుట్టినప్పుడు అబూలహబ్ ఒక బానిసరాలిని విడుదల చేశాడని చెబుతారు?!
అబ్దుల్లాహ్: చేశాడు.. నిజమే! అది ఎందుకు? తనకు భాతృజుడు కలిగాడన్న ఆనందంతో అతను అలాచేశాడు. అంతేగాని ప్రపంచంలో ఒక గొప్ప ప్రవక్త పుట్టాడని అతను బానిసరాలిని విడుదల చేయలేదు సుమా! అది గుర్తుంచుకోవాలి. అతను చేసిన ఈ పని పుణ్యప్రదమైనదే అయితే తనకు ప్రవక్త పదవీ బాధ్యతలు లభించిన తరువాత ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మళ్లీ ఎప్పుడన్నా అలా చేయమని ఆదేశించారా? ప్రపంచంలోని ఇతర జనాల్లాగే అబూలహబ్ కూడా తనకు భాతృజుడు కలిగాడని తెలియగానే సంబరపడ్డాడు. ఏ ఇంట పిల్లవాడు పుట్టినా ఆ ఇంటి వారికి ఆనందం కలగటమనేది సహజం. అతను ఆ రోజును పండుగగా తలచి బానిసను విడుదల చేయలేదు. దైవప్రవక్త పదవీ బాధ్యతల పట్ల అబూలహబ్ కు ప్రేమ ఉన్నట్లయితే అతను జీవితాంతం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ద్వేషిస్తూ ఉండేవాడు కాదు. అతన్ని, అతని భార్యను శపిస్తూ ఖుర్ఆన్లో ఒక సూరా సాంతం అవతరించేది కాదు. అలాంటప్పుడు అబూలహబ్ చేసినదాన్ని సమర్ధిస్తూ మిలాదున్నబీ పండుగ జరుపుకుంటున్నట్లయితే అది దైవప్రవక్త సంప్రదాయం కాదు, అబూలహబ్ సంప్రదాయం.
జునైద్: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పుట్టిన తేది విషయంలో చరిత్రకారుల్లో విభిన్న అభిప్రాయాలున్నాయని చెబుతుంటే విన్నాను. అసలు వాస్తవం ఏమిటి?
అబ్దుల్లాహ్: అల్లాహ్ అభీష్టం మేరకే అలా జరిగింది. ఇస్లాం ధర్మాన్ని స్వచ్ఛంగా ఉంచటానికి, ఇస్లాంలో ఇటువంటి కల్పనలు జరగకుండా ఉండటానికి అల్లాహ్ వారిని ఒకే అభిప్రాయం మీద నిలబడనీయలేదు. ఇప్పటివరకూ మేము చెబుతూ వస్తున్నది కూడా అదే కదా! పూర్వం ప్రజలు ఈ పండుగ జరుపుకునేవారు కాదు. తర్వాత కాలంలోనే ఈ ఆచారం సృష్టించబడింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గాని, ఆయన సహచరులు గాని రబీవుల్ అవ్వల్ 12వ తేదిన పండుగ జరుపుకొని ఉన్నట్లయితే ముస్లింలందరూ ఆ తేదిని బాగా గుర్తు పెట్టుకునేవారు. ఇక ఆ తర్వాత ఆ తేది విషయంలో ముస్లింల మధ్య భేదాభిప్రాయమే నెలకొని ఉండేది కాదు.
జునైద్: సరే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పుట్టినరోజు పండుగ మొదటి నుంచి జరుపు కోవటం జరగలేదని నేను ఒప్పుకుంటున్నాను. మరి నేటి వైజ్ఞానిక యుగంలోనూ దైవప్రవక్త (సల్ల ల్లాహు అలైహి వ సల్లం) గారి నిజమైన పుట్టిన తేది కనుగొనబడ లేదేమిటి?
అబ్దుల్లాహ్: చూడండి! ఆయన మరణించిన తేది రబీవుల్ అవ్వల్ 12 అన్న విషయంలో అందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఇకపోతే ఆయన పుట్టిన తేది గురించి జరిపిన ఆధునిక పరిశోధనల్లో తేలిందేమిటంటే ఆయన పుట్టింది రబీవుల్ అవ్వల్ 9వ తేదిన. ఖాజీ సులైమాన్ గారి ‘రహ్మతుల్లిల్ ఆలమిన్’ గ్రంధంలో, మౌలానా షిబ్లీ నోమానీ గారి “సీరతున్నబీ” గ్రంథంలో ఈ వివరాలన్నీ ఉన్నాయి.
జునైద్: అసలు ఈ మిలాదున్నబీ పండుగ ఎక్కణ్ణుంచి ప్రారంభమైంది? ఎలా ప్రారంభమైంది?
అబ్దుల్లాహ్: ఇదెక్కడి వింతండి బాబూ? ఒక విషయాన్ని వారు కనిపెట్టి దాని ఆధారాలు మమ్మల్ని అడుగుతున్నారు. ఏమైనా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలం నుంచి – ఇమాములు, హదీసువేత్తలకాలం వరకు ఈ పండుగ ఆనవాళ్లు కూడా చరిత్రలో కనిపించవు. ఈ ఆచారం హిజ్రీ శకం 625 నుంచి ప్రారంభమైంది. ధర్మజ్ఞానం లేని కొందరు మనుషులు ఈ ఆచారానికి శ్రీకారం చుట్టారు.
జునైద్: నిజంగా ఇది అన్యాయమే కదా! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఆయన సహచరులు చేయని పనిని మనమెందుకు చేయాలి?
అబ్దుల్లాహ్: జజాకల్లాహ్ ఖైరా! నేను చెప్పిన విషయం మీరు అర్థం చేసుకున్నందుకు అల్లాహ్ నాకు మేలు చేయాలని కోరుకుంటున్నాను.
జునైద్: మీరు చెప్పిన మాట అర్థమయింది. ఇంకొక చిన్న సందేహం. ఈ పండుగ జరుపుకునేవారు సామాన్యంగా మంచి ఉద్దేశ్యంతోనే చేస్తారు. మరో వైపు హదీసులో ఇలా ఉంది కదా! “ఆచరణలన్నీ సంకల్పం (ఉద్దేశం) పైనే ఆధారపడి ఉంటాయి”.
అబ్దుల్లాహ్: మీకు ఏదైనా సహీహ్ హదీసు చూపించి అది నా ఆచరణలకు భిన్నంగా ఉందని చెబితే అటువంటి సమయంలో వారు “మా మౌల్వీ సాహెబ్ గారు అలాగే చేస్తాము” అని చెప్పి దాటవేస్తారు. ఇప్పుడు మీకు సహీహ్ హదీసు గుర్తొచ్చింది. కాని మేమలా చేయము. ఆ హదీసు నూటికి నూరు పాళ్లు కరెక్టే. కాని బిద్అత్ అంటే ఏమిటో తెలుసా? ఆ ఆచరణ మంచి ఉద్దేశంతోనే చేయబడుతుంది. కాని అసలు ఆ పనిమాత్రం చెడ్డదై ఉంటుంది. స్వీకారానికి అనర్హమై ఉంటుంది. అల్లాహ్ సమక్షంలో ఒక పని స్వీకృతికి నోచుకోవాలంటే ఒకటి: ఆ పని మంచి ఉద్దేశంతో చేయ బడి ఉండాలి. రెండు: అది సున్నత్ కు అనుగుణంగా జరిగి ఉండాలి. ఈ రెండు నియమాల్లో ఏ ఒక్కటి లేకపోయినా ఆ ఆచరణ స్వీకరించబడదు. ఖుర్ఆన్ హదీసుల్లో చాలా చోట్ల ఈ విషయం పస్తావించబడింది.
జునైద్: మిలాదున్నబీ పండుగ చేస్తే అసలు ఎటువంటి పుణ్యం లభించదంటారా?
అబ్దుల్లాహ్: అసలు దాని ఉనికే ఇస్లాంలో లేనప్పుడు అది పుణ్యకార్యం ఎలా అవుతుంది చెప్పండి. పైగా ఇదొక బిద్అత్ (కొత్త పోకడ). ధర్మంలో కొత్త పోకడలకు పాల్పడటం సామాన్యమైన నేరం కాదు సుమా! మీరు పుణ్యం ఏమిటి అని అడుగుతున్నారు. అసలు పరలోకంలో ఇటువంటి వారికి కౌసర్ సరస్సు నీళ్ళు కూడా లభించవు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్వయంగా వారిని తమ దగ్గరకు రానీరు. ఒక హదీసు ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పి ఉన్నారు:
“ప్రళయదినాన నేను నా అనుచర సమాజం వారికి కౌసర్ సరస్సు నుంచి నీళ్లు త్రాపుతూ ఉంటాను. అప్పుడు నా అనుచర సమాజంలోని కొందరిపై దైవదూతలు లాఠీచార్జీ చేస్తుంటారు (వుజూ ప్రభావం మూలంగా వారి కాళ్ళు, చేతులు ప్రకాశిస్తూ ఉంటాయి). వారు ఏం తప్పు చేశారని వాళ్ళని కొడ్తున్నారు అని నేను అడుగుతాను. వాళ్లను నా దగ్గరికి రానీయండి వారు నా అనుచరులే అని అంటాను. అప్పుడు దూతలు సమాధానం ఇస్తారు: “ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నీ తదనంతరం వీళ్ళు ధర్మంలో ఎటువంటి మార్పులు చేశారో మీకు తెలియదు”. అది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “వాళ్ళని దూరంగా తరిమేయండి. ఎందుకంటే నా తదనంతరం వాళ్ళు నా ధర్మంలో మార్పులు చేశారు. అందులో కొత్త ఆచారాలు కల్పించారు” అని విసుక్కుంటారు.”
జునైద్: అమ్మో! విషయం చాలా భయంకరమైనదే! మీరు నాకు ఈ హదీసు వినిపించి నా కళ్లు తెరిపించారు. మీరు నాకు సరైన మార్గం చూపినందుకు అల్లాహ్ మీకు మేలు చేయుగాక! ఇన్షా అల్లాహ్ నేను కూడా నా స్నేహితులు, బంధువులందరికీ ఈ విషయం తెలియజేసి వారికి సరైనమార్గం చూపుతాను. వారు అన్ని రకాల బిద్అత్ లను, దురాచారాలను వదలిపెట్టి సరైన మార్గంలో నడిచేలా చేస్తాను.
అబ్దుల్లాహ్: అల్లాహ్ మనందరికి సత్కార్యాలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక! ఆమిన్
—
రాసినవారు: మౌలానా అబ్దుల్ ఖుద్దూస్ సలఫీ ముహమ్మద్ సలీమ్ సాజిద్ అల్ మదనీ రియాద్.
పున:పరిశీలించిన వారు: షేఖ్ అబూ అద్నాన్ ముహమ్మద్ మునీర్
మీలాద్ ఉన్ నబీ ముస్లింల పండగేనా ? – బిన్ బాజ్ & బిన్ ఉతయమీన్
Milad-un-Nabee – Is it Muslim’s Festival? – by Shaik Ibn Baz & Saalih bin Uthaymeen
మీలాదున్ నబీ ముస్లింల పండుగేనా?!
సేకరణ : అతావుర్రహ్మాన్ జియావుల్లాహ్
అల్ అసర్ ఇస్లామిక్ సెంటర్
22-8-444, మస్జిద్-ఎ-ఏకఖానా, పురాని హవేలి,
హైద్రాబాద్-500 002.
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం
అల్ హమ్ దు లిల్లాహి వకఫా వ సలామున్ అలా ఇబాదిహిల్లజీ నస్తఫా అమ్మాబాద్:
ప్రస్తుత కాలపు బిద్అత్ (కొత్తపోకడ)లలో తీవ్రతరమైన బిద్అత్ రబీవుల్ అవ్వల్ మాసంలో పన్నెండవ తేదీన దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం. ఈ వేడుకలు అనేక దేశాల ప్రజలు ఎంతో భక్తీశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.
కాని ఈ వేడుకకు షరీఅత్ పరంగాగాని చారిత్రక పరంగాగాని అసలు స్థానం ఉందా? ఈ విపరీత పోకడ ఈ సమాజంలో ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక ఉన్న ఉద్దేశమేమిటి? ఈ వాస్తవం చాలా మందికి తెలియదు.
ఆ వాస్తవాలను బట్టబయలు చేసి దీని రూపకర్తల తెరచాటు దురుద్దేశాలను గనక తేటతెల్లం చేస్తే ప్రియప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి వీరాభిమానులకు విషయం స్పష్టంగా బోధపడుతుంది. ఈ విషయంపై వారు మంచి మనస్సుతో ఆలోచించి పశ్చాత్తాపం చెంది తిరిగి ఋజుమార్గం వైపుకు వచ్చేస్తారు.
మూడు ఉత్తమ తరాలు (ఖైరుల్ ఖురూన్) గడిచినప్పటికీ ఎక్కడా కూడా సహాబా (రజియల్లాహు అన్హుమ్)లు గాని, తాబయీన్లు గాని, తబేతాబయీన్లు గాని వారి తర్వాత వచ్చిన వారి లో ఏ ఒక్కరూ కూడా మీలాదున్నబీ వేడుకలు జరిపినట్లు ఆధారాలు లేవు. నిజానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను అమితంగా ప్రేమించినవారు, అత్యంత ఎక్కువగా సున్నత్ పరిజ్ఞానం కలవారు, షరీఅత్కు విధేయులై ఉండటానికి అందరికంటే ఎక్కువగా ఆసక్తి కనబరచిన వారు వీరే కదా!
బనూ ఉబైదుల్ ఖద్దాహ్ అనే తెగవారు మొట్టమొదటగా ఈ బిద్అత్ ను ప్రారంభించారు. వీళ్లు తమను తాము ఫాతిమీలుగా చెప్పుకుంటారు. అలీ బిన్ అబీతాలిబ్ (రజియల్లాహు అన్హు) సంతానానికి చెందినవాళ్ళమని ప్రచారం చేసుకుంటారు. నిజానికి వీళ్ళు ‘బాతినియ్య’ మత స్థాపకులలోని వారు. వీళ్ల పితామహుడు ఇబ్నెదీసాన్. ఇతనికి అలద్ధాహ్ అనే బిరుదు వుంది. ఇతను జాఫర్ బిన్ ముహమ్మద్ సాదిఖ్ వద్ద నుండి స్వాతంత్య్రం పొందిన బానిస.
ఇతను ఇరాక్ లోని బాతినియ్యా మత స్థాపకుల్లోనివాడు. తర్వాత పశ్చిమం (మురాఖష్) వైపు వెళ్ళాడు. అక్కడ అఖీల్ బిన్ అబూతాలిబ్తో తన సంబంధాన్ని కలుపుకున్నాడు. దాంతో తనకు తాను అఖీల్ సంతానంగా భావించుకున్నాడు. కరడుగట్టిన రాఫిజీ మతస్తులు కొంతమంది తన సందేశాన్ని స్వీకరించగానే తాను ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బిన్ జాఫరుల్ సాదిఖ్ సంతానంలోని వాడని బహిరంగంగా ప్రకటించటం మొదలుపెట్టాడు. అతని సందేశాన్ని స్వీకరించినవారు అతను చెబుతున్నది నిజమేనని భావించారు. నిజానికి ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బిన్ జాఫరుల్ సాదిఖ్కు సంతానమే లేదు. ఇతని విధేయుల్లో హమ్గాన్ బిన్ ఖుర్ముత్ అనేవ్యక్తి ఉండే వాడు. ఇతనికి ఖురామతా అనే గుర్తింపు ఉండేది. కొంతకాలం తర్వాత ఈ కోవకు చెందినవారి లోనే సయీద్ బిన్ హుసైన్ అహ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ మైమూన్ బిన్ దీసానుల్ ఖద్దాహ్ అనే వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అతను తన పేరును, వంశపరంపరను మార్చుకున్నాడు. తన అభిమానుల్లో “నేను ఉబైదుల్లాహ్ బిన్ అల్ హసన్ బిన్ ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బిన్ జాఫ రుల్ సాదిఖ్” అని చెప్పుకున్నాడు. ఈ విధంగా పాశ్చాత్తదేశం (మురాకష్)లో అతని మోసం ప్రారంభ మైంది. కాని వంశపరంపరకు చెందిన విజ్ఞాన పరిశోధకులు అతని వంశపరంపర సంబంధాన్ని తోసిపుచ్చారు. అలా హిజ్రి 402వ యేట రబీవుల్ ఆఖిర్ మాసంలో కొందరు ధర్మవే త్తలు, హదీసువేత్తలు, ఖాజీలు, పుణ్యాత్ములు కలిసి ఫాతిమీ ఉబైదీ వర్గం వారి వంశపరంపరలో ఉన్న లోపాలను క్రోడీకరించారు. అందరూ కలిసి ఇలా ప్రకటించారు: ‘అలోకిమ్’ బిరుదాంకితు డు ఈజిప్ట్ పాలకుడు మన్సూర్ బిన్ నజ్జార్ బిన్ మఅద్ బిన్ ఇస్మాయిల్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ సయీద్ ప్రాచ్యదేశాలకు (మురాకష్) వెళ్ళినప్పుడు తన పేరును “అబ్దుల్లాహ్”గా తన బిరుదును “మహీగా” మార్చుకున్నాడు.
ఇతని పూర్వీకులు ఖారిజీ మతస్తులు. అలీబిన్ అబూతాలిబ్తో వీరి వంశ పరంపర కలవదు అతను ప్రకటించుకున్నదంతా పచ్చి అబద్దం. అదీగాక మాకు తెలిసినంతమటుకు అలీ బిన్ అబూతాలిబ్ వంశస్తుల్లో ఎవరూ కూడా వాణ్ణి ఖారిజీ మతస్తునిగా లెక్కగట్టకుండా ఉండలేదు. అసలు నిజం ఏమిటంటే ఈజిప్ట్ చక్రవర్తి మరియు వాడి పూర్వీకులందరూ కూడా అవిశ్వాసులు. ఇస్లాం సుగంధం ఇసుమంతైనా సోకని పరమ అవిధేయులు. సత్య తిరస్కారులు. ఇంకా చెప్పాలంటే వారందరూ కూడా మజూసీలు (అగ్నిని పూజించే వాళ్ళు). విగ్రహారాధకులు. వారు ఇస్లాంలో హద్దుల్ని నిర్భయంగా అతిక్రమించారు. వ్యభిచారాన్ని ధర్మసమ్మతంగా భావించేవారు. మద్యపానం పాపం కాదన్నారు. సమాజంలో విపరీతంగా రక్తపాతం సృష్టించారు. దైవప్రవక్తల్ని తూలనాడేవారు. సదాచార సంపన్నులైన పూర్వీకులకు (సలఫ్కు) శాపనార్ధాలు పెట్టేవారు”.
ఈ విషయాలన్నీ ఆనాడు గ్రంథస్తం చేయబడ్డాయి. ఆ కాగితాల మీద హనఫీ, మాలికీ, షాఫయీ, హంబలీ, అహ్లెహదీసు, తర్కశాస్త్ర పండితులు, వంశపరంపర పరిశోధకులు, అలవీ వర్గం వారు, ఇంకా సామాన్యప్రజల సంతకాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ ఫాతిమీల వంశ పరంపరలోని లోపాలను ఎత్తిచూపారు. నిజానికి ఈ ఫాతిమాలు (ఉబైదీలు) అగ్నిపూజారులనీ, యూదుమతస్తులని ఎలుగెత్తి చాటారు. అలా ఎలుగెత్తి చాటిన పండితులయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా పుస్తకాలు కూడా రాశారు. నిజానికి ఈ ఫాతిమీలు ఇస్లాం తిరస్కారులనీ, పైకి మాత్రం వారు రాఫిజీలుగా, షియాలుగా కనిపించేవారని వారు తమ పుస్తకాల్లో పేర్కొన్నారు (ఇబ్నె కసీర్ గారి అల్ బిదాయా వన్ని హాయా గ్రంధం 15/537 నుంచి 540 పేజీలు). ఫాతిమీలు (ఉబై దీలు) హిజ్ర శకం 362వ యేట రమజాన్ నెల 5వ తేదీన ఈజిప్ట్లోకి ప్రవేశించారు. వారి పాలనాకాలం ఇక్కడి నుంచి ప్రారంభమయింది. ముస్లిం సమాజంలో మొట్టమొదటగా బిద్అత్ ద్వారాన్ని తెరిచినది కూడా వీరే. ఒక్క దైవప్రవక్త పుట్టిన రోజు (మీలాదున్నబీ) మాత్రమే కాదు, మీలాదె అలీ మీలాదె హసన్, మీలాదె హుసైన్, మీలాదె ఫాతిమా మొదలగు పండుగలు, ఇంకా వీటితోపాటు మజూసీల (అగ్నిపూజారుల), క్రైస్తవుల పండుగలు కూడా వీరు రంగవైభవంగా జరు పుకునేవారు. దీని ద్వారా వారు ఇస్లాం ధర్మానికి ఎంత దూరంగా ఉండేవారో, ఇస్లాం ధర్మానికి వారు ఎంతటి విముఖులో అర్థమవు తుంది. అంతేకాదు పైన పేర్కొన్న పండుగలు వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీద అభిమానం మూలంగానో లేక అలీ (రజియల్లాహు అన్షు) కుటుంబం మీద ప్రేమ వల్లనో జరుపుకునేవారు కాదు. పైగా ఈ పండుగలను ముస్లిం సమాజంలో ప్రవేశపెట్టి లోపాయికారీగా తమ తప్పుడు విశ్వాసాలను, మూఢ నమ్మకాలను ప్రచారం చేసి ముస్లింలను తమ నిజధర్మం నుంచి, నికార్సయిన విశ్వాసాల నుంచి తప్పించటమే వారి అసలు ఉద్దేశం.
మరి ఫాతిమీలు (ఉబైదీలు) దురుద్దేశ పూరితంగా సృష్టించిన ఈ నీచపు బిర్అత్ పండుగను ఇంగిత జ్ఞానం ఉన్న ఏ ముస్లిం జరుపుకుంటాడు??? అంతేకాకుండా ఆ కాలపు సామాజిక పరి స్థితులపై దృష్టి సారిస్తే ఉబైదీల రాజకీయాలు కేవలం ఒక లక్ష్య సాధన కోసమే కేంద్రీకృతమై ఉం డేదని తెలుస్తుంది. అదేమిటంటే పూర్తి చిత్తశుద్ధి పరాయణతలతో తమ మతం స్వీకరించడం కోసం ప్రజలను సన్నద్ధం చేయడం. ఈజిప్ట్శం చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో దానిని వ్యాపింపజేయడం. దీని కోసం ఉబైదీరాజులు యూదుల, క్రైస్తవుల పట్ల వీలైనంతవరకు సానుభూతి, కనికరం చూపేవారు. వారికి ఉన్నత పదవులు, హోదాలు కట్టబెట్టేవారు. మరోవైపు సున్నీల పట్ల వారి వ్యవహారం అందుకు భిన్నంగా ఉండేది. ముగ్గురు ఖలీఫాలను, ఇతర సహాబాల ను మరియు సున్నీలందరిని వారు మింబర్లపై నిలుచొని దూషించేవారు. హిబ్రీ 372 వ యేట ఈజిప్ట్ దేశంలో తరావీహ్ నమాజ్ను నిషేధించారు. హిజ్రా 395 వ యేట ఈజిప్టని అన్ని మస్జిదులు, భవనాలు, శ్మశాన వాటికలు మరియు దుకాణాలపై సల్ఫెసాలిహీన్లకు వ్యతిరేకంగా దూషణా వచనాలు రాశారు. వాటిని రంగు రంగులతో తీర్చిదిద్దారు. వీటన్నిటినీ మించి ఉబైదీ పాలకుడు (మన్సూర్ బిన్ నజ్జార్) తానే దేవుడినని ప్రకటించుకున్నాడు. ఖతీబ్ (ఉపన్యాసకుడు) మింబర్ (వేదిక)పై తనపేరు ప్రస్తావిస్తే గౌరవార్ధం వెంటనే లేచి నుంచోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాడు. అతని రాజ్యం నడిచే దేశాలన్నిటిలో ప్రజలు అలానే చేసేవారు. చివరకు మక్కా మదీనాలలో కూడా, ముఖ్యంగా ఈజిప్ట్వరికి తన పేరు ప్రస్తావనకు వచ్చిన వెంటనే సాష్టాంగ పడవలసిందిగా ఆదేశాలిచ్చాడు. పౌరుషం గల ఒక ముస్లిం వ్యక్తి ఇస్లాం శత్రువులు రూపొందించిన ఇలాంటి దుష్ట పోకడలను అవలంబించడాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారిపై ప్రేమగా నమ్ముతాడా?!!!
ఇస్లాం సోదరులారా!
ఇదీ “మీలాద్” చరిత్ర. దురదృష్టకరమైన విషయమేమిటంటే చాలామంది ముస్లింలు దీనిని ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. వాస్తవానికి దీని చాటున ఉబైదీయులు రహస్యంగా తమ మతాన్ని వ్యాపింపజేసి సున్నత్ను నాశనం చేశారు. అందుకే ఈ కొత్త పోకడ రూపొందిన నాటినుండే మన పండితులు దానిని వ్యతిరేకిస్తూ వచ్చారు. దానికి వ్యతిరేకంగా చాలా పుస్తకాలు రాశారు. ఎవరైతే ఈ వేడుక జరుపుకోవడాన్ని ధర్మసమ్మతమని నిరూపించడానికి ప్రయత్నించారో వారి గురించి “పాపం చేస్తూ, దానికి సాకులు చూపటం ఇంకా పెద్ద పాపం” అని అభివర్ణించారు. ఖైరుల్ ఖురూన్లో (ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుంచి తాబయీన్ల కాలం వరకు) దీని ఆధారాలు లేవు. కాబట్టి దీనిని నిర్మొహమాటంగా తిరస్కరించ వచ్చు. మన పూర్వీకులకు ధర్మం కాని విషయం నేడు మనకు కూడా ధర్మం కాజాలదు. అది పుణ్యప్రదమైన కార్యమే అయితే మన కంటే ముందు వారే దానిని అవలంబించే వారు. అయినప్ప టికీ ఈ విషయానికి సంబంధించి ప్రఖ్యాత ఉలమాల రెండు ఫత్వాలను మీ ముందుంచుతున్నాము.
అష్శేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహ్మలై) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జన్మదిన వేడుకల అదేశం మీలాదున్నబీ నాడు జరిగే కార్యాల గురించి ఆయన ఇలా పేర్కొన్నారు:
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి జన్మదిన వేడుకలు జరుపు కోవడం ధర్మసమ్మతం కాదు. వేరేవారి జన్మదిన వేడుకలూ జరుపగూడదు. ఎందుకంటే ఇవి ధర్మంలో నూతనంగా రూపొందించబడ్డ కొత్త పోకడలు. వీటిని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) గాని, ఖలీఫాలు, సహాబాలు గాని వారిని అనుసరించే వారు గాని ఎవరూ జరుపలేదు. అత్యధిక ధర్మజ్ఞానం కలవారు. దైవప్రవక్త ప్రేమికులు, షరీఅత్ అవలంబీకులు వీరేనని నిరూపించబడింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రభోదించారు:
“మన్ అహ్ దస ఫీ అమ్రినా హాజా మాలైస మిన్హు ఫహువ రద్దున్”
అర్థం:– “మా ధర్మంలో లేని విషయాన్ని రూపొందించినవాడు ధూర్తుడు”.
మరో హదీసులో ఇలా ఉంది:
“అలైకుమ్ బిసున్నతీ వసున్నతిల్ ఖులఫాయి ర్రాషిదీనల్ మహదియ్యీన్ మింబాదీ తమస్సకూ బిహా వ అజ్జూ అలైహా బిన్నవాజిజి, వ ఇయ్యాకుమ్ వ ముహ్ దసాతిల్ ఉమూరి, ఫ ఇన్నకుల్ల ముహ్ దసతిన్ బిద్అతున్, వకుల్ల బిద్ అతిన్ దలాలహ్”
అర్థం:- మీరు నా తర్వాత నా సున్నత్ను, మార్గదర్శకులైన ఖులఫాయె రాషిదీన్ల సున్నత్ను తప్పనిసరిగా పట్టుకోండి. దానిని స్థిరంగా పట్టుకోండి. పళ్ళతో బిగించి మరీ పట్టుకోండి. నూతన విషయానికి దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రతి నూతన విషయం బిద్అత్ . ప్రతి బిద్అత్ మార్గభ్రష్టతే.
పైన పేర్కొనబడిన రెండు హదీసులలోనూ కొత్తపోకడ (బిద్అత్ )ను సృష్టించడాన్ని దానిని అవలంబించడాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. అంతేకాకుండా అల్లాహ్ తన అంతిమ గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు:
“వమా ఆతాకుముర్రసూలు ఫ ఖుజూహు వమా నహాకుమ్ అన్హు ఫన్అహూ వత్తఖుల్లాహ ఇన్నల్లాహ షదీదుల్ ఇఖాబ్” (సూరయె హష్:7)
అర్థం:– దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీకిచ్చిన దానిని పుచ్చు కోండి. ఆయన వారించిన వాటికి దూరంగా ఉండండి. మరియు అల్లాహ్కు భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడు.
మరోచోట అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
ఫల్ యజ్ణరిల్లజీన ముఖాలిఫూన అన్ అమ్హీ అన్ తుసీబహుమ్ ఫిత్నతున్ అవ్ ముసీ బహుమ్ అజాబున్ అలీమ్. (సూరె నూర్:63)
అర్థం:- “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశాలను వ్యతిరేకించే వారు వారిపై ఏదైనా ముప్పు లేదా దైవశిక్ష వచ్చిపడుతుందేమోనని భయపడుతూ ఉండాలి.
ఇంకా ఇలా సెలవిచ్చాడు:
“లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనతున్ లిమన్ కాన యర్రిుల్లాహ వ ల్ యౌమల్ ఆఖిర” (సూరె అహ్జాజ్-21)
అర్థం:– అల్లాప్పై, అంతిమ దినంపై ఆశలు పెట్టుకుని అత్యధికంగా అల్లాహ్ను స్మరించే ప్రతి వ్యక్తికి అల్లాహ్ ప్రవక్తలో మంచి ఆదర్శం ఉంది.
ఆయన ఇంకా ఇలా సెలవిచ్చాడు:
“వస్సాబిఖూనల్ అవ్వలూన మినల్ ముహాజిరీన వల్ అన్సారి వల్లజీనత్తబ వూహుమ్ బి ఇ హసానిన్ రజియల్లాహు అన్హుమ్ వరజూ అన్హు వ అ అద్ద లహుమ్ జన్నాతిన్ తహ్రీ త హతహల్ అన్హారు ఖాలిదీన ఫీహా అబదన్ జాలికల్ ఫౌజుల్ అజీమ్.”
(సూరె తౌబా-100)
అర్థం:- అందరికంటే ముందు విశ్వాస సందేశాన్ని స్వీకరించటానికి ముందంజ వేసిన ము హాజిరుల (వలసవచ్చిన వారి) పట్ల, అన్సారుల (ఆశ్రయమిచ్చిన వారి) పట్ల, తరువాత నిజాయితీ తో వారి వెనుక వచ్చిన వారి పట్ల అల్లాహ్ తృప్తి చెందాడు. వారు కూడా అల్లాహ్ పట్ల తృప్తి చెందారు. అల్లాహ్ వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే ఉద్యానవనాలను సిద్ధపరచి ఉంచాడు. వారు వాటిలో సదా ఉంటారు. ఇదే మహత్తరమైన సాఫల్యం.
ఇంకా ఇలా సెలవిచ్చాడు:
“అలమ అక్కలు లకుమ్ దీనకుమ్ వ అత్మము అలైకుమ్ నీమతీ వరజీతు లకు ముల్ ఇస్లామ దీనా-” (సూరె మాయిదహ్-3)
అర్థం:- ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లాంను మీ ధర్మంగా అంగీకరించాను. ఇలాంటి సూక్తులు చాలానే ఉన్నాయి
ఈ విధంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం వల్ల అల్లాహ్ ఈ సమాజం కోసం ధర్మాన్ని పూరిపూర్ణం చేయలేదనే భావం వస్తుంది. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వీటి గురించి ప్రచారం చేయలేదు. కాబట్టి ఆయన అనుచర సమాజం (ఉమ్మత్) ఎలాంటి వాటిని ఆచరించడం భావ్యం కాదు. అల్లాహ్ సాన్నిధ్యం పొందే ఆలోచనతో అల్లాహ్ షరీఅత్లో ఆయన ఆదేశించని విషయాలను సృష్టించటం చాలా అపాయకర విషయం. ఇది అల్లాహ్ మరియు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు అభ్యంతరం చెప్పటంతో సమానం. వాస్తవానికి అల్లాహ్ తన దాసులకోసం ధర్మాన్ని పరిపూర్ణం చేశాడు. వారిపై తన అనుగ్రహాలను సంపూర్ణంగా అవతరింప జేశాడు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చాలా స్పష్టంగా ఇస్లాం ఆదేశాలను ప్రచారం చేశా రు. స్వర్గానికి చేర్చే, నరకానికి దూరంగా ఉంచే ఏ మార్గాన్నీ ఆయన తన సమాజానికి వివరించకుండా వదిలిపెట్టలేదు. ఈ విషయం సహీహ్ హదీసులో అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రజియ ల్లాహు అన్హు) ద్వారా నిరూపించ బడింది. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రభో దించారు:
మా బఅసల్లాహు మిన్ నబియ్యిన్ ఇల్లా కాన హఫ్లైన్ అలైహి అన్ యదుల్ల ఉమ్మతహూ అలాఖైరిన్ యాలముహు లహుమ్ వయున్జరహుమ్ మినర్రిన్ యాలముహు లహుమ్.
అల్లాహ్ పంపిన ప్రవక్తలందరూ తమ సమాజాలకు మేలైందని భావించిన వాటి వైపు మార్గదర్శకత్వం వహిస్తూ, ఇంకా తమ సమాజాలకు కీడైందిగా భావించిన చెడులను గురించి వారి ని హెచ్చరిస్తూ ఉండటం తప్పనిసరి. (సహీహ్ ముస్లిం)
మనప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవక్తలందరిలో కెల్లా ఉత్తములు. ఆయన అంతిమ ప్రవక్త అని అందరికీ తెలుసు. ప్రచారం, బోధన మరియు మంచి తనంలో ఆయన వారందరికంటే పరిపూర్ణులు. జన్మదిన వేడుక జరుపుకోవడం ఈ ధర్మంలో ఉండి, దానిని అల్లాహ్ ఇష్టపడేవాడే అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సమాజానికి తప్పనిసరిగా ఆ విషయాన్ని తెలియజేసేవారు. దానిని తన జీవితంలో తప్పకుండా జరిపి ఉండేవారు. లేదా కనీసం ఆయన సహచరులైనా ఆ వేడుకలను జరుపుకునే వారు. కాబట్టి ప్రముఖులైన వీరే జరపలే దంటే ఇస్లాంలో దానికి ఎలాంటి స్థానం లేదని ఇట్టే అర్థమవుతుంది. అంతేకాదు ఈ కొత్త పోకడ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సమాజాన్ని అప్రమత్తంగా ఉండమని చెప్పిన బిన్అత్ ల లోనిది. ఈ విషయం పైన పేర్కొన్న రెండు హదీసులలోనూ వివరించబడింది.
అవే అర్థాలలో ఇతర హదీసులూ ఉన్నాయి. ఉదాహరణకు జుముఅ ప్రసంగంలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్బోధించారు:
అమ్మాబాద్! ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహి, వఖైరల్ హద్లో హద్లు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వ సల్లం వ షర్రల్ ఉమూరి ముమ్హసాతుహా, వ కుల్ల బిర్అతిన్ జలాలహ్ (సహీహ్ ముస్లిం)
అమ్మాబాద్, అత్యుత్తమ వచనం అల్లాహ్ గ్రంధం. దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారిది అత్యుత్తమ మార్గం. కొత్తగా రూపొందించిన పోకడలు నికృష్టమైనవి. ప్రతి కొత్త పోకడ మార్గ భ్రష్టతే.
ఈ అధ్యాయానికి సంబంధించి ఖుర్ఆన్ వాక్యాలు, హదీసులు చాలానే ఉన్నాయి. పై ఋజువులను ఆచరిస్తూ ఉలమాల ఒక పెద్దసమూహం మీలాద్ వేడుకలను చాలా స్పష్టంగా తిరస్క రించింది. అయితే తర్వాతి తరాలవారు వారిని వ్యతిరేకిస్తూ మీలాద్ వేడుకలను ధర్మసమ్మతంగా ఖరారు చేశారు. వారించబడ్డ (ముంకర్) కార్యాలకు దూరంగా ఉంటూ వేడుకలు జరుపుకోవచ్చన అన్నారు. ఉదాహరణకు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను కీర్తించడంలో అతిశయించడం, స్త్రీ పురుషులు కలివిడి తనం, సంగీత వాయిద్యాల వినియోగం, ఇంకా ధర్మం అ నుమతించని ఇతర కార్యాలకు దూరంగా ఉంటూ మీలాద్ జరుపుకోవచ్చని వారు అభిప్రాయపడ్డా రు. దీన్ని వారు బిట్అతె హసనాగా పేర్కొన్నారు.
ప్రజల మధ్య వివాదంగా మారిన విషయాన్ని అల్లాహ్ గ్రంధం మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసులతో సరిచూడాలి. మరి ఈ సందర్భంగా అల్లాహ్ ఏం సెలవిస్తున్నాడో చూడండి!
యా అయ్యుహల్లజీన ఆమనూ అతీఉల్లాహ వ అతీ వుర్రసూల వ ఉలిల్ అమ్రి మిన్కుమ్ ఫ ఇన్ తనాజాతుమ్ ఫీ షైయిన్ ఫరుద్దూహు ఇలల్లాహి వర్రసూలి ఇన్ కున్ తుమ్ తూమిన ూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి జాలిక ఖైరున్ వ అప్సాను తావీలా- (సూరె నిసా-59)
అర్థం:– విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్కు, ప్రవక్తకు, మీలో అధికారం అప్పగించబడిన పెద్దలకు విధేయత చూపండి. మీ మధ్య ఏదైనా వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్ వైపుకు, ఆయన ప్రవక్త వైపుకు మళ్ళించండి, మీరు అల్లాహ్ మీద, అంతిమ దినం మీదా విశ్వాసం కలవారే అయితే. ఇదే సరైన పద్దతి. ఫలితాన్ని బట్టి ఇదే ఉత్తమమైనది.
అల్లాహ్ మరో చోట ఇలా సెలవిచ్చాడు:
“వమఖ్లఫ్ తుమ్ ఫీహి మిన్ షైఇన్ ఫ హుకుహూ ఇలల్లాహ్”.
(సూరె షూరా-10)
అర్థం:- మీ మధ్య ఏ విషయంలో అభిప్రాయ భేదం తలెత్తినా, దానిని గురించి తీర్పు చెప్ప టం అల్లాహ్ పని. మనం ఈ సమస్యను గనుక అంటే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జన్మదిన వేడుకను అల్లాహ్ గ్రంధంతో సరి చూస్తే మనకు కొన్ని విషయాలు బోధపడతాయి. అవే మిటంటే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశించిన విషయాలను ఆచరిస్తూ వారించి న విషయాలకు దూరంగా ఉండాలి. అల్లాహ్ ఈ సమాజం కోసం తన ధర్మాన్ని పరిపూర్ణం చేశా డు. ఈ జన్మదిన వేడుకలూ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారు తీసుకువచ్చిన ధర్మంలో లేదు. ఈ ఆచారం అల్లాహ్ మన కోసం పరిపూర్ణం చేసిన ధర్మ విషయాలలోనిదీ కావు. ఇందు లో మనకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు విధేయులై ఉండాలని ఆదేశించడం జరి గింది. అలాగే మనం ఈ సమస్యను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్తో సరిచూస్తే అక్కడ కూడా మనకు ఆయన(సల్లల్లాహు అలైహి వ సల్లం) జన్మదిన వేడుకలు జరుపుకున్నట్లు ఆధారాలు లభించవు. అసలు దీని గురించి ఆయన ఆదేశించినట్లు గాని, కనీసం సహాబా(రజియల్లాహు అన్హుమ్)లు దీనిని జరుపుకున్నట్టుగానీ ఋజువులు దొరకవు. కాబట్టి ఇది ధర్మానికి సంబంధించిన విషయం కాదన్న సంగతి దీని ద్వారా మనకు తెలుస్తుంది. నిజానికి ఇది కొత్తగా సృష్టించబడిన ఒక బిద్అత్ . ఇది యూదుల, క్రైస్తవుల వేడుకలను పోలి ఉంది. కాబట్టి జ్ఞానమున్న నిజాయితీ పరుడైన, సత్య సంధుడైన ప్రతి వ్యక్తికీ మీలాద్ వేడుకలు జరుపుకోవడం ఇస్లాం ధర్మంలోని అంశం కాదని పగటి వెలుగులా స్పష్టమవుతోంది. ఇదొక కొత్త పొకడ(బిద్అత్ ). అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) బిన్అత్లను విడనాడాల్సిందిగా, వాటికి దూరంగా ఉండాల్సిందిగా ఆదేశించారు. సంబరాలు జరుపుకుంటున్న ఈ ప్రపంచాన్ని చూసి విజ్ఞులు మోసపోకూడదు. ఒక అసత్య పనిని చాలామంది కలిసి చేసినంత మాత్రాన అది సత్యం అయిపోదు. షరీఅత్ ఋజువుల ద్వారానే సత్యం నిరూపితమవుతుంది. దివ్వ ఖుర్ఆన్ఆ అల్లాహ్ యూదులను, క్రైస్తవులను ఉద్దేశించి ఇలా సెలవిచ్చాడు:
వఖాలూ లన్ మదులల్ జన్నత ఇల్లా మన్ కాన హూదన్ అవ్ నసారా తిల్క అమానియు ్యహుమ్ ఖుల్ హాతూ బుỐనకుమ్ ఇన్ కున్తుమ్ సాదిఖీన్– (సూరె బఖరహ్-111)
అర్థం:- యూదులు, క్రైస్తవులు తాము తప్ప మరెవ్వరూ స్వర్గంలో ప్రవేశించలేరు అని ప్రక టిస్తారు. ఇవి వారి కాంక్షలు మాత్రమే. వారిని ఇలా అడుగు: “మీరు చెప్పేది సత్యమే అయితే దా నికి నిదర్శనాలేమిటో చూపండి”
మరోచోట అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“వ ఇన్ తుతీ అక్సర మన్ ఫిల్ అరి ముజిల్లూక అన్ సబీలిల్లాహి”. (సూరెఅన్ఆమ్-116)
అర్థం:– ప్రవక్తా! పుడిమిపై నివసించే ప్రజలలో అధిక సంఖ్యాకులు చెప్పినట్లుగా నీవు నడిస్తే వారు నిన్ను అల్లాహ్ మార్గం నుండి తొలగిస్తారు.
ఈ మీలాద్ వేడుక ఒక బిద్అత్ మాత్రమే కాదు. ఇది అనేక చెడుగులకు కూడా ఆలవాల మవుతుంది. ఉదాహరణకు స్త్రీ పురుష కలివిడి వాతావరణం, సంగీత వాయిద్యాల వినియోగం, మత్తు పానీయాల వినియోగం ఇవే కాకుండా ఇతర చెడులు కూడా జరుగుతాయి. ఒక్కోసారి వీటి కంటే పెద్ద తప్పిదం అయిన షిర్కు కూడా జనం పాల్పడుతుంటారు. అదెలాగంటే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు ఔలియాలను అతిశయించి కీర్తించడం, వారిని అర్థించడం, వారికి విన్నపాలు చేసుకోవటం, వారిని సహాయం చేయమని వేడుకోవడం, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు అగోచర విషయాలు తెలుసని నమ్మడం, ఇవే కాకుండా ఇతర తిరస్కార కార్యాలు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) జన్మదిన సందర్భంగా ఔలియాల “ఉర్స్ دو సందర్భంగా ఆచరించే ప్రత్యేక కార్యాలు తలపెట్టడం లాంటివి చేస్తుంటారు. దైవ ప్రవక్త (సల్లల్లా హు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు:
ఇయ్యాకుమ్ వల్ గులువ్వ ఫిద్దీని, ఫ ఇన్నమా అప్లక మన్ కాన ఖబ్లకుముల్ గులువ్వ ఫిద్దీని.
అర్థం:- మీరు ధర్మంలో అతిశయిల్లడానికి దూరంగా ఉండండి. ఎందుకంటే మీకు పూర్వం వారు కూడా ధర్మంలో అతిశయిల్లడం వల్లనే నాశనం చేయబడ్డారు. మరోచోట దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు:
లాతత్రూనీ కమా అత్అతిన్నసారా ఇబ్న్ మరాయమ ఇన్నమా అన అబ్ున్ ఫఖూలూ అబ్దు ల్లాహి వరసూలుహ్.
“క్రైస్తవులు ఈసా బిన్ మర్యమ్ను హద్దుమీరి కీర్తించినట్టు మీరు నన్ను కీర్తించకండి. నేను అల్లాహ్ దాసుడిని. కాబట్టి మీరు నన్ను అల్లాహ్ దాసుడు మరియు అల్లాహ్ ప్రవక్త అని మాత్రమే అనండి”. (బుఖారి ముస్లిం)
ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ప్రజలు ధర్మంలో లేని కొత్త పోకడలను అయితే ఎంతో ఉత్సాహంగా చేస్తారు. కాని అల్లాహ్ వారిపై విధించిన జుమా మరియు ఫర్జ్ నమాజ్లకు మాత్రం ఆమడ దూరంలో ఉంటారు. అసలు ఫర్జ్ వైపు కన్నెతి కూడా చూడరు. తాము పాల్పడుతున్న ఈ వైఖరి ఘోర అపరాధం అన్న ఆలోచన కూడా వారికి రాదు. వాస్తవానికి ఈ వైఖరి ఈమాన్ బలహీనతకు తార్కాణం. రకరకాల పాపాలు, చెడులు చేయడం వల్ల వారి హృదయాలకు తుప్పు పట్టింది. ఆ తుప్పు వల్ల వారలా ప్రవర్తిస్తున్నారు. అల్లాహ్ మమ్మల్ని, ముస్లింలందరిని కూడా ఈ జాడ్యం నుంచి కాపాడుగాక! ఈ చెడు మూలంగానే కొందరు మీలాద్వేడుకల సందర్భంగా దైవప్ర వక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హాజరవుతారని భావిస్తారు. దానికోసం వారు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను ఆహ్వానిస్తూ లేచి నించుంటారు. ఇది మూర్ఖత్వం, అజ్ఞానం తప్ప మరేమి కాదు. ఎందుకంటే వారు ఉహించుకున్నట్లు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రళయం వరకు తన సమాధి నుండి లేపబడరు. ఎవరిని కలవరు. వారు జరుపుకుంటున్న సభలకు హాజరవ్వరు. అయన(సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రళయం వరకు తన సమాధిలోనే ఉంటారు. అల్లాహ్ సూరతుల్ మూమినూన్లో పేర్కొన్నట్లు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆత్మ అల్లాహ్ వద్ద ‘ఆలా ఇల్లియ్యీన్’లో ఉంటుంది.
అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
సుమ్మ ఇన్నకుమ్ బాద జాలిక లమయ్యితూన్ సుమ్మ ఇన్నకుమ్ యౌమల్ ఖియామతి తుబ్ అసూన్.
ఆ తర్వాత నిశ్చయంగా మీరందరూ మరణిస్తారు. మళ్ళీ ప్రళయదినం రోజున లేపబడతారు
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు:
అన అవ్వలు మన్ యన్అఖు అన్హుల్ ఖబ్లు యౌమల్ ఖియామతి వ అన అవ్వలు షాఫి యిన్ వ అవ్వలు ముషఫ్ఫయిన్.
అర్థం:- ప్రళయదినం నాడు అందరికంటే ముందు నా సమాధి చీలుతుంది. ఇంకా నేనే మొదట సిఫారసు చేస్తాను. నేను చేసిన సిఫారసే మొదట స్వీకరించ బడుతుంది.
కాబట్టి ఈ సూక్తి మరియు హదీసు ఇంకా ఎలాంటి భావం కలిగిన ఇతర హదీసులు, ఖుర్ ఆన్ సూక్తులు చెప్పేదేమిటంటే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గాని ఇతర ప్రజలుగాని ప్రళయదినం నాడే సమాధుల నుండి లేపబడతారు. ఈ విషయమై ముస్లిం పండితులందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. కాబట్టి ప్రతి ముస్లిం ఇలాంటి విషయాలను తెలుసుకుని అజ్ఞానులు కల్పించిన వినూత్న పోకడలకు (బిన్అత్లకు)దూరంగా ఉండాలి. బిన్అత్లకు సంబంధించి అల్లాహ్ ఎలాంటి ఆధారాలూ అవతరింపజేయలేదు. సహాయం కోసం అల్లాహ్నే వేడుకోవాలి. నమ్మకం కూడా ఆయనపైనే ఉండాలి. వలా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్…………
ఒకసారి ఫజీలతు షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ ఉసైమీన్ (రహ్మలై)గారిని “దైవ ప్రవక్త (స ల్లల్లాహు అలైహి వ సల్లం) జన్మదిన వేడుక జరపవచ్చా?” అని ప్రశ్నించటం జరిగింది. అందుకా యన ఇలా సమాధానమిచ్చారు.
మొదటిది:- ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏ రోజు జన్మించారో సరిగ్గా ఎవరికీ తెలియదు. ఆధునిక విద్యావేత్తల పరిశోధన ప్రకారం అది రబీవుల్ అవ్వల్ తొమ్మిదో తేది అని తెలుస్తుంది. కనుక రబీవుల్ అవ్వల్ పన్నెండో తేదిన ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జన్మది న వేడుకలు జరిగినట్టు చరిత్రలో దాఖలాలే లేవు.
రెండో విషయం:- షరీఅత్ పరంగా కూడా మీలాద్ వేడుకలకు ఆధారాలు లేవు. ఒకవేళ మీలాద్ వేడుక అనేది షరీఅత్లో ఉండి ఉంటే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తప్పకుండా దానిని జరుపుకునేవారు. లేదా కనీసం తన సమాజానికి సందేశం అయినా ఇచ్చి వెళ్ళేవారు.
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ వేడుకలు జరిపి ఉంటే లేదా దాన్ని ప్రచారం చేసి ఉంటే నాటి నుంచి నేటి వరకు అవి ఎడతెగకుండా జరపబడుతూ ఉండేవి.
ఎందుకంటే దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
ఇన్నా నహ్ను నజ్జలనజ్జిక్తే వ ఇన్నా లహూ లహాఫిజూన్ (సూరె హిజ్-9)
“మేమే ఈ దివ్య ఖుర్ఆన్ గ్రంధాన్ని అవతరింపజేశాము. మేమే దాని సంరక్షకులము”
ఈ వేడుకలకు ఎలాంటి ఆధారాలూ లేవు. కాబట్టి ఇవి ధర్మంలోని విష యాలు కావు. ధర్మంలో లేని విషయాలను ఆచరించరాదు. వాటి ద్వారా దైవసాన్నిధ్యం పొందడమనేది అసంభవం. అల్లాహ్ తన వరకు చేరడానికి ఒక నిర్ణీత మార్గాన్ని నిర్దేశించాడు. అదే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెచ్చిన మార్గం. అల్లాహ్ దాసులము, ఆయన బానిసలమైన మనం ఆయన వరకు చేరడానికి స్వంతంగా మార్గాన్ని ఎలా రూపొందించుకోగలం? ధర్మంలో లేని విష యాన్ని మనం మన కోసం ధర్మసమ్మతం చేసుకోవడం అల్లాహ్ సన్నిధిలో నేరంగా పరిగణించ బడుతుంది. అలా చేస్తే అల్లాహ్ ఆదేశాన్ని ధిక్కరించినట్లవుతుంది.
అల్అమ అక్మల్లు లకుమ్ దీనకుమ్ వ అత్మము అలైకుమ్ నీమతీ
భావం:- “ఈ రోజు నేను మీ కోసం మీ ధర్మాన్ని పరిపూర్ణం చేశాను మరియు మీ పైనా అనుగ్రహాలను పరిపూర్ణం చేశాను”.
మేము చెప్పేదేమంటే ఒకవేళ మీలాద్ వేడుక ధర్మంలో ఉండి ఉంటే అది ఆయన(సల్లల్లాహు అలైహి వ సల్లం) మరణానికి ముందు నుంచే ఉండేది. అలాగే అది ధర్మంలో లేనప్పుడు బలవంతాన దానిని ధర్మంలో చేర్చడం కూడా సముచితం కాదు. ఎందుకంటే అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“అలయౌమ అక్మలు లకుమ్ దీనకుమ్”
“ఈ రోజు నేను మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం చేశాను”.
మిలాద్ వేడుకలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరణించిన చాలా కాలం తర్వాత ఉనికిలోకి వచ్చినవి అన్నమాట అక్షర సత్యం. కనుక ఈ సంగతి తెలిసి కూడా ఎవరైనా ఈ వేడుకల్ని ధర్మంలో అంతర్భాగంగా భావిస్తున్నట్ల యితే అతని ఈ ఆలోచనా తీరు పైన పేర్కొన బడిన ఖుర్ఆన్ వాక్యానికి విరుద్ధంగా పోతుందన్న కఠోర సత్యాన్ని కూడా అతను గ్రహించాలి.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జన్మదిన వేడుకలు జరుపుకునే వారి ఉద్దేశం ఆయన (సల్లల్లా హు అలైహి వ సల్లం) ను గౌరవించడం, ఆయన పట్ల తమకున్న ప్రేమను వ్యక్తపరచడం, ఈ వేడుక ద్వారా ప్రజలలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) పట్ల ప్రేమాభిమానాలను పురిగొల్పడమే అని అనడంలో సందేహం లేదు. ముమ్మాటికీ ఈ విషయాలన్ని ఆరాధన క్రిందికే వస్తాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను ప్రేమించడమూ ఆరాధనే. ఆయన (సల్లల్లా హు అలైహి వ సల్లం) ను తమ ప్రాణం కన్నా, తమ సంతానం కన్నా, తల్లిదండ్రుల కన్నా ప్రజలం దరి కన్నా, ఎక్కువగా ప్రేమించాలి. అప్పుడే ఈమాన్ పరిపూర్ణం అవుతుంది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను గౌరవించడమూ ఆరాధనే. అదేవిధంగా ఆయన(సల్లల్లాహు అలైహి వ సల్లం ) వ్యక్తిత్వం పట్ల ప్రజలను చైతన్యవంతుల్ని చేయడమూ ఆరాధనే. ఆయన వ్యక్తిత్వం గురించి తెలిస్తే సహజంగానే ప్రజలు అల్లాహ్ ధర్మంవైపు శ్రద్ధ చూపుతారు.
కాబట్టి అల్లాహ్ సాన్నిధ్యం పొందడం కోసం, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను గౌరవించ టం కోసం జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆరాధన అవుతుంది. అయితే అంతే వాస్తవమైన మరొక విషయం ఏమిటంటే అల్లాహ్ ధర్మంలో లేని విషయాన్ని అందులోకి చొప్పించటానికి ప్రయత్నించటం కూడాఎన్నటికీ ధర్మసమ్మతం కాదు. కాబట్టి మీలాద్ వేడుకలు జరుపుకోవడం పచ్చి బిన్అత్. ఇదొక హరామ్ (నిషిద్దం) ఆచారం. అంతేకాకుండా సాధారణంగా ఈ వేడుకల్లో జ నం షరీఅత్ అనుమతించని విషయాలకూ పాల్పడుతుంటారని వినవస్తోంది. అటువంటి నీతి బాహ్య పనులను షరీఅత్ మాత్రమే కాదు. బుద్ధిజ్ఞానమున్న ఏ మనిషీ వాటికి అనుకూలంగా మాట్లాడలేడు. ప్రజలు హద్దులు మీరి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కీర్తనలు పాడుతుం టారు. చివరకు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను అల్లాహ్ కంటే గొప్పవానిగా చిత్రీకరిస్తా రు (నవూజు బిల్లాహ్).
చెడులలోనే మరో విషయం ఏమిటంటే సాధారణంగా వేడుక జరుపుకునే వారిలో కొందరు అవివేకుల, అజ్ఞానుల గురించి మనం వింటూ ఉంటాము. వేడుక సందర్భంగా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జీవిత చరిత్ర చదివేవారు ఆయన జన్మదిన ప్రస్తావన రాగానే అక్క డున్న వారందరూ ఒకేసారి లేచి నించోని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆత్మ హాజరయ్యింది కాబట్టి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) గౌరవార్థం మేము లేచి నించున్నాము ‘ అంటారు. ఇది బుద్ధిహీనతకు పరాకాష్ఠ. ఆయన గౌరవార్థం లేచి నించోవడం గొప్పతనం కానే కాదు. ఎందుకంటే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన కోసం లేచి నించోడాన్ని ఎన్నడూ ఇష్టపడేవారు కాదు. ప్రజలలో అత్యధికంగా దైవప్రవక (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను ప్రేమించి నవారు అత్యధికంగా ఆయనకు మర్యాద ఇచ్చిన వారు ఆయన గారి సహచరులు(సహాబాలు)కాని ఆయన(సల్లల్లాహు అలైహి వ సల్లం) జీవితంలో వారు కూడా ఆయన కోసం లేచి నించునేవారు కాదు. ఎందుకంటే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ పద్ధతిని ఇష్టపడేవారు కాదు. అటువంటప్పుడు జనం కల్పించుకునే ఊహలకు, భ్రమలకు ఇస్లాంలో స్థానం ఎక్కడుంటుందండీ?!
ఈ బిద్అత్ మిలాద్ వేడుక – మూడు ఉత్తమ తరాల (ఖైరుల్ ఖురూన్) తర్వాత ఉనికిలోకి వచ్చింది. ఈ వేడుకల్లో ధర్మ విరుద్ధ కార్యాలు జరుగుతుంటాయి. స్త్రీ పురుషుల కలివిడి వాతావర ణం, ఇతర పాపాలూ జరుగుతుంటాయి.
(సాలిహుల్ ఉసైమిన్ గారి ఫతావా అర్కానుల్ ఇస్లాం :172-174)
అల్ బిదాఅ (కల్పితాచారం) (The Innovation)
1. అల్ బిదాఅ (కల్పితాచారం)(The Novelty)بــدعـــــت –
నిర్వచనం: ‘పూర్వ కాలంలో అటువంటిదేదీ ఉనికిలో ఉన్నట్లు నిదర్శనం, ఆధారం అస్సలు లేకుండా నూతనంగా ఏదైనా క్రొత్త విషయాన్ని పుట్టించటం’ అనే ఆచరణ నుండి అల్ బిదాఅఁ (కల్పితాచారం) అనే పదం ఉత్పత్తి అయినది. ఇది అల్లాహ్ దివ్యఖుర్ఆన్ లో అల్ బఖర అధ్యాయంలోని 117 వవచనం లో చేసిన క్రింది ప్రకటనల వలే ఉన్నది. “بَدِيعُ السَّمَاوَاتِ وَالأرْضِ” – దివ్యవచనపు భావం యొక్క అనువాదం – {భూమ్యాకాశాల (స్వర్గాల) ముఖ్యారంభం ఆయనకే చెందును}, దీని భావం ఏమిటంటే, పూర్వనిదర్శనాలేవి లేకుండానే సృష్టించగలిగిన ఆయనే వీటి సృష్టికారకుడు. ఇదే విషయాన్ని దివ్యఖుర్ఆన్ లో అల్ అహ్ఖాఫ్ అధ్యాయంలోని 9వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు, “قُلْ مَا كُنْتُ بِدْعًا مِنْ الرُّسُلِ” – దివ్యవచనపు భావం యొక్క అనువాదం – {ప్రకటించు(ఓ ముహమ్మద్ ): “నేను ప్రవక్తల మధ్య నూతన, వింతైన చోద్యమైన, ఎన్నడూ వినని–కనని సిద్ధాంతాలను తెచ్చేవాడిని కాను} అంటే అల్లాహ్ నుండి దివ్యసందేశాన్ని తెచ్చిన వారిలో నేనే మొదటి వాడిని కాను, కాని నాకు పూర్వం కూడా అనేక మంది సందేశహరులు వచ్చారు. అనే అల్లాహ్ యొక్క ప్రకటనను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం తెలిపారు.
కల్పితాచారం (అల్ బిదాఅ) రెండు రకాలుగా విభజింపబడినది:
1) అలవాట్లలో నూతన కల్పితాలు – అనువతించబడినది.
2) ధర్మంలో నూతన కల్పితాలు – నిషేధించబడినది.
మరల రెండు రకాలు
A) పలుకులలో సైద్ధాంతిక కల్పితాలు
B) ఆరాధనలలో కల్పితాలు – నాలుగు తరగతులుగా విభజింపబడినది.
- i) మొదటి తరగతి – ఆరాధనల మూలాధారంలో కల్పితం.
- ii) రెండో తరగతి – ఆరాధనలను హెచ్చించే కల్పితం.
- iii) మూడో తరగతి – ఆరాధనల పద్ధతిలో కల్పితం.
- iv) నాలుగో తరగతి – ఆరాధనా సమయంలో కల్పితం.
ఒక్కో రకాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం.
1) అలవాట్లలో కల్పితం, ఇది అనుమతించబడిని. ఉదాహరణకు – నూతన వస్తువులను కనిపెట్టడం, ఇది ఇస్లాం ధర్మంలో అనువతించబడినది. ‘నిషేధించబడినది’ అనే స్పష్టమైన సాక్ష్యాధారాలు లేని అలవాట్లన్నీ అనుమతించబడినవే – అనేది ఇస్లాం ధర్మంలోని మౌలిక నియమం, ప్రాథమిక నిబంధన.
2) ధర్మంలో కల్పితం, ఇస్లాం ధర్మపు ప్రాథమిక నియమాల కారణంగా ఇది నిషేధించబడినది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు, “من أحدث في أمرنا” – అనువాదం – “సరైన ప్రమాణిక కారణం లేకుండానే, మా వ్యవహారాలలో (అల్లాహ్ పంపిన ఇస్లామీయ జీవన విధానంలో) నూతన కల్పితాలను కనిపెట్టే వారు తిరస్కరించబడతారు”
ధర్మంలోఅల్బిదాఅ (కల్పితాలు) అనేదిమరలరెండురకాలుగావిభజింపబడినది– మొదటిదిపలుకులలో సైద్ధాంతిక కల్పితాలుకల్పించటం, రెండోదిఆరాధనలలోనూతనకల్పితాలుకల్పించటం.
A) మొదటివిభాగం: పలుకులలో సైద్ధాంతికపరమైన కల్పితాలు కల్పించటం, జహ్మియాహ్, ముతజిలాహ్, రాఫిదాహ్ మొదలైన పలుకులలో మరియు దైవవిశ్వాసంలో దారి తప్పిన అనేక తరగతులు. ఉదాహరణకు – దివ్యఖుర్ఆన్ అల్లాహ్ యొక్క సృష్టి అనే ప్రకటన.
B) రెండోవిభాగం: ఆరాధనలలో కల్పితాలు, అల్లాహ్ తెలిపిన పద్ధతిలో కాకుండా వేరే పద్ధతిలో ఆరాధించటం. ఇది నాలుగు తరగతులుగా విభజింపబడినది:
i) మొదటితరగతి: ఆరాధనల మూలాధారంలో కల్పితం, అంటే అసలు ఇస్లామీయ షరియత్ (ధర్మశాస్త్రం)లో లేని నూతన ఆరాధనలను తీసుకరావటం. ఉదాహరణకు – ఇస్లామీయ మూలాధారాలలో ఎక్కడా అస్సలు ప్రస్తావించని నూతన ఆరాధనలను కల్పించటం, మీలాదున్నబీ వంటి పండగలను జరపటం… మొదలైనవి.
ii) రెండోతరగతి: ఆరాధనలను హెచ్చించటం – అల్లాహ్ ఆదేశించిన కొన్ని ప్రత్యేక ఆరాధనలలో అదనపు విషయాలను చేర్చటం, జొహర్ లేక అసర్ నమాజులోని నాలుగు రకాతులకు అదనంగా ఐదవ రకాతును చేర్చటం.
iii) మూడోతరగతి: ఆరాధనల పద్ధతిలో కల్పితం – అల్లాహ్ ఆదేశించిన ఆరాధనా పద్ధతులలో నూతన కల్పితాలు చేర్చటం. అంటే అల్లాహ్ తెలిపిన పద్ధతిలో కాకుండా వేరే క్రొత్త పద్ధతులలో ఆరాధించటం. గుంపుగా చేరి, లయబద్ధమైన రాగాలలో అల్లాహ్ ను స్తుతించడం, లేదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ లకు విరుద్ధమైన పద్ధతిలో, ఏవైనా ఆరాధనలను స్వయంగా తనకే భారమయ్యేటంతటి తీవ్రంగా ఆచరించటం.
iv) నాలుగోతరగతి: ఆరాధనా సమయంలో కల్పితం. ఏవైనా ప్రత్యేక ఆరాధనలకు, అల్లాహ్ ఏనాడూ కేటాయించని ఆరాధనా సమయాలను కల్పించడం, ఉదాహరణకు – షాబాన్ నెల 15వ తేదీ దినాన్ని ఉపవాసం దినంగా, రాత్రిని ప్రార్థనల రాత్రిగా పరిగణించడం. ఎందుకంటే, ఉపవాసం ఉండటం మరియు రాత్రి ప్రార్థనలు చేయటం అనేది ఇస్లాం ధర్మపరంగా అనుమతింపబడినవే కాని వాటికోసం ఒక ప్రత్యేకమైన తేదీ మరియు సమయం కేటాయించడానికి స్పష్టమైన సాక్ష్యాధారాలు కావలసి ఉంటుంది.
ఇస్లాంలోఅన్నిరకాలనూతనకల్పితాలుతీసుకురావటంగురించినఅంతర్జాతీయధర్మశాసనం:
ఇస్లాం ధర్మంలోని ప్రతి నూతన కల్పితం నిషేధించబడినది మరియు అది తప్పుడు దారి వైపుకు తీసుకు వెళ్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు, “وإياكم ومحدثات الأمور” – అనువాదం – “(ఇస్లాం ధర్మంలో) నూతన పోకడల గురించి, చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ప్రతి నూతన పోకడ ఒక బిదాఅ (కల్పితం) మరియు ప్రతి బిదాఅ ఒక తప్పుడు మార్గం మరియు ప్రతి తప్పుడు మార్గం నరకాగ్నికి చేర్చుతుంది”. ఇంకా వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు, “من عمل عملا” – అనువాదం – “సరైన ప్రమాణిక కారణం లేకుండానే, మా వ్యవహారాలలో (అల్లాహ్ పంపిన ఇస్లామీయ జీవన విధానంలో) నూతన కల్పితాలను కనిపెట్టిన వారెవరైనా సరే తిరస్కరించబడతారు”
ఇస్లాం ధర్మంలో క్రొత్తగా కనిపెట్టబడిన ప్రతి విషయం ఒక బిదాఅ (కల్పితం) అని మరియు ప్రతి కల్పితం స్వీకరించబడని ఒక తప్పుడు మార్గం అని ఈ రెండు హదీథ్ లు తెలుపుతున్నాయి. అంటే ఆరాధనలలో లేదా సిద్ధాంతాలలో నూతన పోకడలు, కల్పితాలు తీసుకురావటం నిషేధించబడినది. ఇంకా వాటి నిషేధం ఆయా కల్పితాల రకాలను బట్టి మార్పు చెందుతుంది. వాస్తవానికి వాటిలో కొన్ని, స్పష్టమైన అవిశ్వాసానికి చెందినవి. ఉదాహరణకు – సమాధుల చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా ఆయా పుణ్యపురుషులకు దగ్గరవటానికి ప్రయత్నించటం లేక వారిని సహాయం అర్థించటం లేక బలి ఇవ్వటం లేక మొక్కుబడులు చెల్లించడం మొదలైనవి. ఇంకా జహ్మియా లేక ముతాజిలాహ్ ప్రజలు చేస్తున్న ప్రకటనలు, సమాధులపై గోరీల వంటి కట్టడాలు, అక్కడ చేసే ఆరాధనలు. ఇంతేగాక, ఇతర కల్పితాలు సైద్ధాంతిక అవిధేయతగా పరిగణించబడతాయి. ఉదాహరణకు – ఇస్లామీయ ధర్మ సాక్ష్యాధారాలకు విరుద్ధమైన అల్ ఖవారిజ్ లేక అల్ ఖదరియ్యా లేక అల్ ముర్జియ ప్రజల ప్రకటనలు మరియు సిద్ధాంతాలు. ఏదేమైనప్పటికీ, వాటిలో కొన్ని కల్పితాలు అల్లాహ్ యొక్క అవిధేయతకు చెందుతాయి. ఉదాహరణకు – మండుటెండలలో బయట నమాజు చేయటం మరియు మండుటెండలో ఉపవాసంతో బయటే గడపటం లేదా కామకోరికలు తగ్గించుకోవటానికి శస్త్ర చికిత్స ద్వారా వృషణాలు తీసివెయ్యడం లేదా పనిచెయ్యకుండా చేయటం.
ముఖ్యసూచనలు:
ఎవరైతే కల్పితాలను మంచి కల్పితాలు మరియు చెడు కల్పితాలని విభజించేవారు పొరబడుతున్నారు. ఇంకా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీథ్ కు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు – “فإن كل بدعة ضلالة” – అనువాదం – “ప్రతి నూతన కల్పితం ఒక తప్పుడు మార్గం”, కాబట్టి, అన్ని రకాల నూతన కల్పితాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తప్పుడు మార్గాలుగా పరిగణించెను. కాని కొంత మంది ప్రజలు కల్పితాలలో కొన్ని మంచివి కూడా ఉంటాయని దావా చేయుచున్నారు. ప్రముఖ ఇస్లామీయ పండితుడు హాఫిజ్ ఇబ్నె రజబ్ ఇలా తెలిపారు, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క “كل بدعة ضلالة” – అనువాదం – “ప్రతి నూతన కల్పితం ఒక తప్పుడు మార్గం” అనేవి క్లుప్తమైన వారి నోటి పలుకులు, కాని భావంలో చాలా విశాలమైనవి, విస్తారమైనవి. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ఉపదేశించిన ఇస్లామీయ ములసిద్ధాంతాలలో ఎటువంటి మినహాయింపూ లేదు. అలాగే వారి “من أحدث في أمرنا” – “ఎవరైతే ఏదైనా నూతన కల్పితం కనిబెడతారో” అనే దానికీ మంచి కల్పితం లేదై చెడు కల్పితం అనబడే విభజనా లేదు మరియు దానిలో ఒకదానికి ఎటువంటి మినహాయింపూ లేదు. కాబట్టి, ఎవరైనా నిరాధారమైన మరియు నిరూపించబడలేని, నూతన కల్పితాలను, పోకడలను ఇస్లాం ధర్మంలో భాగంగా క్రొత్తగా చేర్చేతే, అలాంటి వారు తప్పుడు మార్గం చూపుతున్నారని గ్రహించవలెను. సైద్ధాంతిక పరమైనది అయినా, లేక మాటల్లో – చేతల్లోనిది అయినా, బహిర్గతమైనది అయినా లేక అంతర్గతమైనది అయినా – ఇలాంటి వారి వాదలను ఇస్లాం ధర్మం ఒప్పుకోదు. వారు.”
ఇంకా ముందుకు పోతే, ఇలాంటి ప్రజల దగ్గర “మంచి కల్పితం” అనే దానిని నిరూపించటానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. ఒక్క ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు తరావీహ్ (రమాదాన్ నెల రాత్రులలో చేసే ప్రత్యేక ఐచ్ఛిక, స్వచ్ఛంద నమాజులు) గురించి “ఏమి మంచి కల్పితం” అనే ప్రకటన తప్ప.
అంతేకాకుండా, ఇస్లాం ధర్మంలో అనేక క్రొత్త విషయాలు చోటు చేసుకున్నాయని కూడా వారు అంటుంటారు. అటువంటి వాటిని ముందు తరాల పుణ్యపురుషులు (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించిన తర్వాతి మొదటి మూడు శతాబ్దాలలో నివసించిన ఉత్తమ పురుషులు) ఎవ్వరూ నిరాకరించలేదని వాదిస్తుంటారు. వాటికి కొన్ని ఉదాహరణలు: దివ్యఖుర్ఆన్ ను ఒక గ్రంథరూపంలో జమచేయటం, హదీథ్ లను నమోదు చేయటం వంటివి.
వాస్తవంలో వీటికి ఇస్లాం ధర్మంలో ఆధారాలున్నాయి. కాబట్టి అవి నూతన పోకడలు, కల్పితాల క్రిందికి రావు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు చేసిన తరావీహ్ ల ప్రకటన విషయంలో – ఆయన ఉద్ధేశం పూర్తిగా భాషాపరమైనదే కాని ధర్మసంబంధమైనది కాదు. నిజానికి, నూతన కల్పితాలు నిరూపించుకోవటానికి ఇస్లాం ధర్మంలో ఎలాంటి ఆధారాలు లేవు, అవకాశాలు లేవు.
ఇంకా, దివ్యఖుర్ఆన్ ను ఒక గ్రంథరూపంలో జమచేయటం అనే దానికి ఇస్లాం ధర్మంలో ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులలో కొందరిని, అవతరించిన ఆయత్ (వచనా) లను వ్రాయమని ఆదేశించేవారు. అలా వేర్వేరుగా వ్రాయబడిన విభిన్న పత్రాలను సహచరులు జమ చేసి, ఒక గ్రంథరూపంలో భద్రపరచారు. అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరలతో మూడు సార్లు తరావీహ్ (రమదాన్ నెలలో ప్రత్యేకంగా చేసే రాత్రి పూట అదనపు నమాజులు) నమాజులు చేసారు. ఆ తర్వాత, తరావీహ్ నమాజు ప్రజలపై తప్పని సరి అయిపోతుందేమో అనే భావంతో, దానిని కొనసాగించలేదు.
కాని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో సహచరులు ఎవరికి వారే, ఇమాం లేకుండానే తరావీహ్ నమాజు చదివివేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ప్రజలను ఒక ఇమాం వెనుక జమచేసి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చదివించినట్లుగా తరావీహ్ నమాజు చదివించెను. కాబట్టి, ఇది ఖచ్చితంగా ఇస్లాం ధర్మంలో ప్రవేశ పెట్టబడిన నూతన కల్పితం అస్సలు కాజాలదు.
హదీథ్ లను నమోదు చేయటం గురించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కోసారి అనుమతి కోరిన తన సహచరులలో కొందరికి హదీథ్ లు వ్రాయటానికి అనుమతి ఇచ్చేవారు. నిజానికి, అటువంటి అనుమతి సహచరులందరికీ ఇవ్వకపోవటానికి కారణం, ప్రజలు హదీథ్ ఉపదేశాల మరియు ఖుర్ఆన్ ఆయత్ (ప్రవచనాలు) ల మధ్య కన్ఫ్యూజ్ కాకూడదనే ఆయన అభిప్రాయం. కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తర్వాత ఈ కారణం యొక్క అవసరం లేకుండా పోయినది. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మరణం కంటే ముందు, ఖుర్ఆన్ ఆయత్ (ప్రవచనాలు) కూలంకషంగా పరీక్షించబడినాయి, తనిఖీ చేయబడినాయి మరియు సరిచూడ బడినాయి.
కాబట్టి, ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీథ్ (ఉల్లేఖన) లను కాలక్రమంలో నశించిపోకుండా, భద్రపరచాలనే ఉద్దేశ్యంతో నమోదు చేశారు. అల్లాహ్ యొక్క అంతిమ దివ్యసందేశాన్ని (ఖుర్ఆన్) మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉల్లేఖనలను మూర్ఖులు, అజ్ఞానులు నష్టం కలుగజేయకుండా భద్రపరచిన అలాంటి గొప్ప ముస్లిం పండితులకు అల్లాహ్ అనేక దీవెనలు ప్రసాదించుగాక.
నేడు ఎక్కువగా కనబడుతున్న కొన్ని నూతన కల్పితాలు:
1)ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జన్మదినం జరపటం.
2)అల్లాహ్ ను ఆరాధనలలో మరియు అల్లాహ్ కు సన్నిహితమవటంలో నూతన పోకడలు కల్పించటం
నేటి రోజులలో అనేక నూతన కల్పితాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రజలలో సరైన జ్ఞానం తగ్గిపోయినది. మరియు ఎవరైతే అల్లాహ్ ను ఆరాధిస్తున్నారో, వారు ఇలాంటి నూతన పోకడలను అల్లాహ్ ఆదేశాలుగా భావిస్తున్నారు. అంతేకాక దైవారాధనలలో మరియు అలవాట్లలో అవిశ్వాసులను అనుసరించే వారు వ్యాపిస్తున్నారు. ఈ రాబోయే పరిస్థితిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీథ్ లో ఇలా వివరించారు, “لتتبعن سنن من كان قبلكم” – అనువాదం – “మీ పూర్వికులు తప్పుదోవ పట్టిన విధంగానే మీరు కూడా తప్పుదోవ పడతారు”.
రబి అల్ అవ్వల్ నెలలో (ఇస్లామీయ కాలెండరులోని మూడవ నెలలో) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జన్మదినాన్ని (మీలాదున్నబీ) జరుపుకోవటం:
నిజానికి, ఇది క్రైస్తవులు జరుపుకునే ‘క్రిష్టమస్’ అనే పండుగను పోలి ఉన్నది; అజ్ఞాన ముస్లింలు మరియు తప్పుదోవ పట్టిన ముస్లిం పండితులు రబి అల్ అవ్వల్ నెలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జన్మదినాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. కొంతమంది ఈ పండుగను మస్జిద్ లలో జరుపు కుంటున్నారు మరి కొందరు తమ ఇళ్ళల్లో లేదా ప్రత్యేకంగా అలంకరించిన ప్రదేశాలలో జరుపు కుంటున్నారు. క్రైస్తవులు జరుపుకునే క్రిష్టమస్ అనే కల్పితం వంటి ఈ ముస్లిం ల నూతన కల్పిత ఉత్సవాలలో అనేక మంది ప్రజలు హాజరు అవుతున్నారు.
ఇస్లాం ధర్మంలో ఇది నూతన కల్పితంగా పుట్టడటమే కాకుండా, ఇటువంటి పండుగలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను మితిమీరి స్తుతించే అనేక కవితాగానాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను సహాయం కోసం అర్థించటం మొదలైన అనేక విధాల బహుదైవారాధన పద్ధతులు, అసహ్యకరమైన పద్ధతులు కూడా చోటు చేసుకున్నాయి. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఇలాంటి వాటిని నిషేధించెను. “لا تطروني” – అనువాదం – “మర్యం కుమారుడైన జీసస్ (అలైహిస్సలాం)ను హద్దుమీరి స్తుతించినట్లుగా మీరు నన్ను స్తుతించవద్దు, కాని నన్ను అల్లాహ్ యొక్క దాసుడు అని మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త అని మాత్రమే పిలవ వలెను.”
ఇటువంటి ప్రజలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా డప్పులతో మరియు ఇతర సూఫీలు వాడే సంగీత పరికరాలతో, చెవుల కింపైన మరియు మృదుమధురమైన పాటలతో కూడిన ఆ జన్మదిన పండుగలకు హాజరవుతారని అపోహ పడుతున్నారు. అంతే కాకుండా, ఇటువంటి పండుగలలో స్త్రీపురుషులు కలిసి ఒకే చోట ఉండటం వలన దుర్బుద్ధి పుట్టి, వ్యభిచారానికి దారితీసే అవకాశాలుంటాయి. నిజానికి ఇటువంటిదేదీ జరగక, కేవలం ఉత్సాహంగా, ఆనందంగా ఇటువంటి పండుగలను జరుపుకున్నా కూడా ఇలా చేయటమనేది ఒక నూతన కల్పితమనే విషయాన్ని త్రోసిపుచ్చదు. ప్రతి నూతన కల్పితం చెడు మార్గం వైపునకు దారితీస్తుంది. అంతేకాక, పైన తెలిపిన చెడు సంప్రదాయాలకు, పాపపు పనులకు ఇది ఒక అనివార్యమైన మార్గంగా మారుతుంది.
అల్లాహ్ యొక్క అంతిమ సందేశంలో (ఖుర్ఆన్), అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఉత్తమమైన మొదటి మూడు శతాబ్దాలలోని పుణ్యపురుషుల ఆచరణలలో ఎక్కడా కనిపించక పోవటం వలన ఇది బిదాఅ (నూతన కల్పితం) అయినది. అయితే, ఎలాగోలా ఇది నాలుగవ శతాబ్దంలో ఫాతిమీ సామ్రాజ్య కాలంలో మొదలైనది.
అల్ ఇమాం అబు హఫ్స్ తాజుద్దీన్ అల్ ఫాకిహనీ ఇలా తెలుపారు, “తాము కూడా అనుసరించటానికి, కొంత మంది మంచి వ్యక్తులు మాటిమాటికీ నన్ను రబి అల్ అవ్వల్ లో కొంతమంది ఒకచోట గుమిగూడి చేసే అల్ మౌలిద్ (పుట్టినరోజు) అనే ఉత్సవానికి ఇస్లాం ధర్మంలో ఏదైనా ఆధారమున్నదా, లేదా? అని ప్రశ్నించారు. వారు ఆ ప్రశ్నను ప్రత్యేకమైన పద్ధతిలో తమకు అనుకూలమైన జవాబు రాబట్టాలనే సంకల్పంతో మాటిమాటికీ అడిగేవారు. అప్పుడు నేను కేవలం అల్లాహ్ యొక్క శుభాశీస్సులనే ఆశిస్తూ, వారితో ఇలా పలికాను, ‘దివ్యఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ లలో మౌలిద్ (పుట్టినరోజు) గురించి నాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు మరియు సరైన ధర్మజ్ఞానం కలిగిన ప్రసిద్ధ ఇస్లామీయ పండితులు ఎవ్వరూ ఇలాంటి ఉత్సవాలు, పండుగలు చేయలేదు. కాబట్టి, ఖచ్చితంగా అసత్యపరులు మొదలు పెట్టిన ఒక నూతన కల్పితమిది.
షేఖ్ అల్ ఇస్లాం ఇబ్నె తైమియా ఇలా తెలిపారు “మరియు ప్రజలు క్రైస్తవులను అనుసరిస్తూ లేక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై తమ మితిమీరిన ప్రేమాభిమానాలను ప్రదర్శించటానికి, ఆయన జన్మతేదీలో ఉన్న భేదాభిప్రాయాలను దాచిపెట్టి, మీలాదున్నబీని, ఒక పండుగగా జరపటం అనేది ఒక నూతన కల్పితం. వాస్తవానికి, మన ప్రాచీన పుణ్యపురుషులు దాని ఉనికినే గుర్తించలేదు. ఒకవేళ ఇది ఒక స్వచ్ఛమైన మంచి పని అని వారు భావించి ఉన్నట్లయితే, దీనిని వారు తప్పకుండా చేసేవారు. ఎందుకంటే, పుణ్యాలు సంపాదించటంలో వారు చూపిన ఆసక్తి, ఆతృత, కుతూహలం ఇంకెవ్వరూ చూపలేరు.
వాస్తవానికి, వారు (మొదటి మూడు తరాల వారు) తమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అధికంగా ప్రేమాభిమానాలు చూపేవారు మరియు పుణ్యకార్యాలు చేయటానకి ప్రాధాన్యత నిచ్చేవారు. నిజానికి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ను అనుసరించటం మరియు విధేయత చూపటం మొదలైన అనుమతింపబడిన పనుల ద్వారానే ఆయనపై ప్రేమాభిమానాలు ప్రదర్శించగలం అనే విషయాన్ని వారు గ్రహించారు. వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై గల తమ ప్రేమాభిమానాలను ఆయన ఆదేశాలను బహిరంగంగా మరియు అంతర్గంతంగా శిరసావహించేవారు, సున్నత్ లను పున:స్థాపించటానికి ప్రయత్నించేవారు, ఆయన సందేశాన్ని సాధ్యమైనంత వరకు వ్యాపింపజేసేవారు, మనస్పూర్తిగా దీనికోసం అవసరమైతే మాటలతోమరియు చేతలతో పోరాటం చేయటానికి కూడా వెనుకాడే వారు కాదు.
ఆరంభంలో ఇస్లాం స్వీకరించిన వారు, మక్కా వదిలి మదీనాకు వలస పోయిన ముహాజిర్ లు, మక్కా నుండి వలస వచ్చిన వారికి పూర్తి సహాయసహకారాలందించిన అన్సారులు, ఇంకా ఎవరైతే ఆయనను ఖచ్చితంగా అనుసరించేవారో (దైవవిశ్వాసంలో) వారు, పాటించిన సరైన పద్ధతి.
ఇటువంటి జన్మదిన వేడుకలు (మీలాదున్నబీ) వంటివి తర్వాత తర్వాత పుణ్యపురుషుల, ఔలియాల, ఇమాంల జన్మదిన వేడుకలు, ఉరుసులు జరుపుకునే ఆచారంగా మారిపోయినవి. ఈ విధంగా ఇఅల్ బిదాఅఁ (నూతన కల్పితా) లను ఖండిస్తూ, అనేక వ్యాసాలు వ్రాయబడినవి. ఇలా ఇస్లాం ధర్మంలో ఒక పెద్ద దుష్టాచారానికి మార్గం ఏర్పడినది.
అల్లాహ్ యొక్క ఆరాధనలలో మరియు అల్లాహ్ కు దగ్గరవటానికి ప్రయత్నించటంలో నూతన కల్పితాలు:
ఈనాడు ఆరాధనలలో, ప్రార్థనలలో అనేక నూతన కల్పితాలు కనబడుతున్నాయి. నిజానికి, ఆరాధనలకు ముఖ్యాధారం సరైన ప్రామాణికత. కాబట్టి అంత తేలికగా ఆరాధనలను సరైన ప్రామాణికత, సాక్ష్యాధారాలు లేకుండా చట్టబద్ధం కాకూడదు. ఇంకా, వేటికైతే సాక్ష్యాధారలు ఉండవో, అవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచారవ్యవహారాలకు విరుద్ధంగా తీసుకు వచ్చిన నూతన కల్పితాలని గ్రహించవలెను. ఒక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు – “من عمل عملا” – అనువాదం – “సరైన ప్రమాణిక కారణం లేకుండానే, మా వ్యవహారాలలో (అల్లాహ్ పంపిన ఇస్లామీయ జీవన విధానంలో) నూతన కల్పితాలను కనిపెట్టిన వారెవరైనా సరే తిరస్కరించబడతారు”
సరైన సాక్ష్యాధారాలు లేకుండా, ప్రజలు ఆచరిస్తున్న ఆరాధనలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని:
నమాజు చేయటానికి ముందు బిగ్గరగా తన సంకల్పాన్ని ప్రకటించటం, ఉదాహరణకు, ‘అల్లాహ్ కోసం నేను ఫలానా ఫలానా నమాజు చేయటానికి సంకల్పం చేసుకున్నాను’ అనేది మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ లలో ఎక్కడా కనబడపోక పోవటం వలన ఇది ఒక నూతన కల్పితం. అంతే కాక, అల్లాహ్ యొక్క ఈ ప్రకటన, “قُلْ أَتُعَلِّمُونَ اللَّهَ بِدِينِكُمْ وَاللَّهُ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الأرْضِ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ” – అనువాదం {ప్రకటించు (ఓ ముహమ్మద్ ^): “ఏమిటీ! మీ ధర్మం గురించి అల్లాహ్ నే ఆదేశించాలనుకుంటున్నావా? కాని, భూమ్యాకాశాల మధ్యలో ఉన్నది అల్లాహ్ కు సంపూర్ణంగా తెలుసు: ప్రతిదాని గురించి ఆయన సంపూర్ణజ్ఞానం కలిగి ఉన్నాడు}.
నిజానికి, సంకల్పం అనేది మనస్సులో వెలువడేది, ఎందుకంటే మనస్సు (హృదయం) యొక్క పనులలో అదొకటి, కాని అది నాలుక పని కాదు. అలాగే, నమాజు తర్వాత గుంపుగా, పబ్లిక్ గా దుఆ చేయటం.ఎందుకంటే, ప్రతి ఒక్కరూ, స్వయంగా దుఆ చేయవలసి ఉన్నది గాని గుంపుగా కాదు.
అలాగే ఇంకో నూతన కల్పితం – కొన్ని సందర్భాలలో దుఆ చేసిన (వేడుకున్న) తర్వాత ప్రత్యేకంగా సూరహ్ ఫాతిహా పఠించటం. (సహాయం కోసం అల్లాహ్ ను ప్రార్థించటం) మరియు చనిపోయిన వారి కోసం సమర్పించటం. ఇంకా ఉత్తర క్రియలు (మరణానంతరం పాటించే ఆచారాలు), ప్రజలకు విందు భోజనాలు పెట్టడం మరియు అక్కడ ఖుర్ఆన్ పఠించడానికి ఎవరినైనా నియమించడం వంటివి నూతనంగా కనిపెట్టిన ఆచారాలు. అంతేకాక, అలాంటి ఆచారాలు చనిపోయిన వారికి ప్రయోజనం చేకూరుస్తాయని వారు నమ్ముతున్నారు. కాని అలా చేయమని అల్లాహ్ ఏనాడూ ఆదేశించక పోవటం వలన, అది ఒక దారి తప్పిన నూతన కల్పితం.
అలాగే, మరికొన్ని దారి తప్పిన నూతన కల్పిత ఆచారాలు – అల్ ఇస్రా వల్ మేరాజ్ మరియు అల్ హిజ్రాహ్ అన్నబవీయహ్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం మక్కా నుండి మదీనాకు వలస పోయిన రోజు) నాడు పండుగలు చేయటం. ఇవి కూడా సరైన సాక్ష్యాధారాలు లేని ఇస్లాం ధర్మంలో క్రొత్తగా కనిపెట్టబడిన కల్పిత ఆచారాలు. ఇంకా, కొంతమంది అల్ ఉమ్రా అర్రజబీయహ్ అనే పేరుతో రజబ్ (ఇస్లామీయ కాలెండరులోని 7వ నెల) నెలలో ఉమ్రా (ప్రత్యేక పద్ధతిలో మక్కా యాత్ర) చేయటం కూడా అలాంటి నూతన కల్పిత ఆచారమే. నిజానికి, ఈ నెలలో ప్రత్యేకమైన పద్ధతిలో జరప వలసిన ఆరాధనలు ఏమీ లేవు.
ఇంకొన్ని నూతనంగా కనిపెట్టబడిన కల్పితా ఆచారాలలో అల్లాహ్ ఆదేశించిన ప్రార్థనా సూక్తులు, పద్ధతులు మరియు సమయాలకు బద్ధవిరుద్ధమైన పద్ధతులలోని సూఫీ ప్రార్థనలు కూడా వస్తాయి.
అలాంటిదే ఇంకో బిదాఅఁ (నూతన కల్పితం) షాబాన్ (ఇస్లామీయ కాలెండరు లోని 8వ నెల) 15వ తేదీని ప్రత్యేక మైన దినంగా భావించి, ఆ రోజున ఉపవాసం ఉండటం మరియు ఆ రాత్రి జాగరణ చేస్తూ, ఆరాధనలు చేయటం కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క సున్నత్ లలో ఎక్కడా నమోదు చేయబడలేదు.
అలాంటివే మరికొన్ని బిదాఅఁలు (నూతన కల్పితం) పుణ్యపురుషుల సమాధులపై కట్టఢాలు, అక్కడ ప్రార్థనల చేసే ప్రాంతాలుగా మార్చడం, వాటిని దర్శించి ఆ మృతులను సహాయం అర్థించటం వంటి బహుదైవారాధన పనులు ఆచరించడం, ఇంకా మహిళులను కూడా దర్శనానికి అనుమతి ఇవ్వడం (అలా మాటిమాటికి మహిళలు సమాధులను సందర్శించటం నిషేధించబడినది) వంటివి.
చివరిగా:
బిదాఅఁలను (నూతన కల్పితాచారాలను) మనం అవిశ్వాసుల సందేశం గా చెప్పవచ్చును. ఇవి మన ఇస్లామీయ ధర్మంలో క్రొత్తగా చేరిన పోకడలు. అటువంటి వాటిని ఆచరించమని అల్లాహ్ గాని లేదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం గాని ఆదేశించలేదు. వాస్తవానికి, బిదాఅఁ అనేది ఘోరమైన మహాపాపాల కంటే నీచమైనది. వీటి వలన షైతాన్ సంతోషపడతాడు. ఎందుకంటే, పాపాత్ముడికి తను చేసేది పాపాం అని తెలుస్తుంది, తర్వాత ఎప్పుడైనా మంచి మార్గంలోనికి రావాలని తలంచినప్పుడు, పశ్చాత్తాప పడి క్షమాభిక్ష వేడుకుంటాడు. కాని బిదాఅఁ (నూతన కల్పితాచారలలో) మునిగి ఉన్నవాడికి తను చేస్తున్న అస్వీకారపు పనిని కూడా అల్లాహ్ కు చేరువయ్యే ఒక విధమైన ఆరాధనగానే నమ్మటం వలన, అతడు అస్సలు పశ్చాత్తాప పడక పోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతే కాక, అటువంటి వారు సమాజంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క సున్నత్ లను సర్వనాశనం చేస్తు, క్రొత్త క్రొత్త ఆచారవ్యవహారాలను తెచ్చిన వారువుతారు. అటువంటి వారు సమాజపు బహిష్కరణకు అర్హులవు తారు.
కాబట్టి, బిదాఅఁ (నూతన కల్పితాచారములు) ప్రజలను అల్లాహ్ కు దూరం చేస్తాయి. అల్లాహ్ యొక్క ఆగ్రహానికి మరియు కఠిన శిక్షకు గురి చేస్తాయి. మనస్సులో తప్పుడు దారిని, దుష్టత్వాన్ని మరియు లంచగొండితనాన్ని నాటుతాయి.

You must be logged in to post a comment.