
[6:37 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ధర్మపరమైన నిషేధాలు – 24
24- ఎక్కడ అల్లాహ్ యేతరుల కొరకు జంతుబలి జరుగుతుందో అక్కడ అల్లాహ్ కొరకు జంతుబలి చేయకు.
عَن ثَابِتِ بْنِ الضَّحَّاكِ قَالَ: نَذَرَ رَجُلٌ عَلَى عَهْدِ رَسُولِ الله أَنْ يَنْحَرَ إِبِلًا بِبُوَانَةَ فَأَتَى النَّبِيَّ فَقَالَ: إِنِّي نَذَرْتُ أَنْ أَنْحَرَ إِبِلًا بِبُوَانَةَ فَقَالَ النَّبِيُّ : (هَلْ كَانَ فِيهَا وَثَنٌ مِنْ أَوْثَانِ الْجَاهِلِيَّةِ يُعْبَدُ؟) قَالُوا: لَا قَالَ: (هَلْ كَانَ فِيهَا عِيدٌ مِنْ أَعْيَادِهِمْ؟) قَالُوا: لَا قَالَ: رَسُولُ الله : (أَوْفِ بِنَذْرِكَ فَإِنَّهُ لَا وَفَاءَ لِنَذْرٍ فِي مَعْصِيَةِ اللَّهِ وَلَا فِيمَا لَا يَمْلِكُ ابْنُ آدَمَ).
సాబిత్ బిన్ జహ్హాక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక వ్యక్తి ‘బువాన’ అనే చోట ఒంటె బలి ఇవ్వాలని మ్రొక్కుకున్నాడు. అతను ప్రవక్త వద్దకు వచ్చి “నేను ‘బువాన’ అనే చోట ఒంటె బలి ఇవ్వాలని మ్రొక్కు- కున్నాను. (నా మ్రొక్కును పూర్తి చేయాల వద్దా అని ప్రశ్నిం- చాడు). “అజ్ఞాన కాలం నాటి ఏదైనా విగ్రహ పూజ అక్కడ జరుగుతుందా?” అని ప్రవక్త అడిగారు. ‘లేదు’ అని ప్రజలన్నారు. “అయితే వారి పండుగ, ఉత్సవాలు ఏమైనా అక్కడ జరుగు– తాయా?” అని ప్రవక్త అడిగారు. ‘లేదు’ అని వారన్నారు. అప్పుడు ప్రవక్త చెప్పారుః “నీ మ్రొక్కును పూర్తి చేయి. అల్లాహ్ కు అవిధేయతలో ఉన్న ఏ మ్రొక్కూ పూర్తి చేయవద్దు. అలాగే మనిషి అధికారంలో లేని మ్రొక్కు కూడా పూర్తి చేయకూడదు”. (అబూ దావూద్/ బాబు మా యుఅమరు బిహీ మినల్ వఫాఇ… 3313).
పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు
ధర్మపరమైన నిషేధాలు (భాగాలు) – యూట్యూబ్ ప్లేలిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2ipsEd3T9LtuCJ3_1vELEu
ధర్మపరమైన నిషేధాలు (పాయింట్స్ క్లిప్స్) – యూట్యూబ్ ప్లేలిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0PzbYW7saGrZ3TYVB51Rtb