ధర్మపరమైన నిషేధాలు – 9 : దేని విషయంలో ధార్మిక ఆధారం ఉందో దానితో తప్ప రాయి రప్పలు, చెట్లు చేమలు, సమాధులు మజారులు మరేదానితో శుభాలు కోరవద్దు [వీడియో]

బిస్మిల్లాహ్

[4:47 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ధర్మపరమైన నిషేధాలు 9

9- దేని విషయంలో ధార్మిక ఆధారం ఉందో దానితో తప్ప రాయి రప్పలు, చెట్లు చేమలు, సమాధులు మజారులు మరేదానితో శుభాలు కోరవద్దు [1].

عَنْ أَبِي وَاقِدٍ اللَّيْثِيِّ قَالَ: خَرَجْنَا مَعَ رَسُولِ الله إِلَى حُنَيْنٍ وَنَحْنُ حُدَثَاءُ عَهْدٍ بِكُفْرٍ، ولِلْمُشْرِكِينَ سِدْرَةٌ يَعْكُفُونَ عِنْدَهَا، ويَنُوطُونَ بِهَا أَسْلِحَتَهُمْ يُقَالُ لَهَا : ذَاتُ أَنْوَاطٍ ، قَالَ : فَمَرَرْنَا بِالسِّدْرَةِ ، فَقُلْنَا : يَا رَسُولَ الله! اجْعَلْ لَنَا ذَاتَ أَنْوَاطٍ كَمَا لَهُمْ ذَاتُ أَنْوَاطٍ ، فَقَالَ رَسُولُ الله : (اللهُ أَكْبَرُ ، إِنَّهَا السُّنَنُ ، قُلْتُمْ وَالَّذِي نَفْسِي بِيَدِهِ كَمَا قَالَتْ بنو إِسْرَائِيلَ: [اجْعَلْ لَنَا إِلَهًا كَمَا لَهُمْ آلِهَةٌ قَالَ إِنَّكُمْ قَوْمٌ تَجْهَلُونَ] {الأعراف 138} ، لَتَرْكَبُنَّ سُنَنَ مَنْ كَانَ قَبْلَكُمْ).

అబూ వాఖిద్ లైసి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట హునైన్ యుద్ధానికి బయ- లుదేరాము. అప్పుడు మేము కొత్తగా ఇస్లాంలో చేరియుంటిమి. దారిలో ముష్రికులది ఒక రేగు చెట్టు ఉండింది. వారు శుభం కలుగుతుందన్న ఉద్దేశ్యంతో దాని క్రింద కూర్చుండేవారు, తమ ఆయుధాలు దానికి తగిలించేవారు. దానిని ‘జాతు అన్వాత్’ అనేబడేది. మేము ఆ చెట్టు నుండి దాటుతూ, ‘ప్రవక్తా! వారికి ఉన్నటువంటి జాతు అన్వాత్ మాకు కూడా ఒక్కటి నిర్ణయించండి అని అన్నాము. ప్రవక్త చెప్పారు:

“అల్లాహు అక్బర్! ఇవే పద్ధతులు. నా ప్రాణం ఎవ్వని చేతులో ఉందో ఆయన సాక్షి! బనీ ఇస్రాఈల్ వారు ప్రవక్త మూసా అలైహిస్సలాంతో అన్నటువంటి మాటే మీర-న్నారుః “మూసా! వాళ్ళ దేవుళ్ళవంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసి పెట్టు”. మూసా ఇలా అన్నాడు: “మీరు చాలా అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారు[. మీకు పూర్వికులు అవలంభించిన పద్ధతులు మీరూ అవలంభిస్తారు”. (అల్ మొఅజముల్ కబీర్ లిత్తబ్రానీ, సహీహ్ సునన్ తిర్మిజి 1771, ముస్నద్ అహ్మద్ 2/285).


[1]  శుభం పొందే రకాలు:

1- ధార్మిక ఆధారం మూలంగా శుభం కోరడం. ఉదాః అల్లాహ్ యొక్క గ్రంథ (పారాయణం చేసి). అందులో అభ్యంతరం లేదు.

2- స్పృహగల విషయాల ద్వారా. ఉదాః ధార్మిక విద్య. స్వయం తమ కొరకు లేదా ఇతరులకు దుఆ. విద్యగల పుణ్యపురుషుని విద్య ద్వారా, అతని వద్ద కూర్చుండి, లేదా అతని దుఆ ద్వారా. అంతేకాని అతని వ్యక్తిత్వం వల్ల అని కాదు.

3- షిర్క్ సంబంధమైన శుభం. ఇది సమాధులతో, మజారులతో కోరడం. వాటిలో ఏలాంటి శుభం లేదు. దానికి ధార్మిక, లౌకిక ఏ ఆధారము లేదు. ఇందులో కొన్ని రకాలు గలవుః

A.  ఆరాధనలో ఏ ఒక్క భాగమైన సమాధుల కోసం చేస్తే ఇది తౌహీద్ కు వ్యతిరేకమైన పెద్ద షిర్క్ అవుతుంది.

B.  ఆ సమాధులు అతని మరియు అల్లాహ్ మధ్యలో మధ్యవర్తిగా అని నమ్ముతే ఇది కూడా తౌహీద్ కు వ్యతిరేకమైన పెద్ద షిర్క్.

C.  అవి మధ్యవర్తిగా కావు, కేవలం శుభం ఉద్దేశం ఉంటే ఇది షిర్క్ సంబంధమైన బిద్అత్. ఇది విధిగా ఉన్న సంపూర్ణ తౌహీద్ కు వ్యతిరేకమైనది.  


పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

%d bloggers like this: