
[5:20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ధర్మపరమైన నిషేధాలు – 44
44– హలాల్ ను హరాం మరియు హరాం ను హలాల్ చేసే వ్యక్తి (ఏలాంటి వాడైనా సరే అతని)ని అనుసరించకు. ఈ హక్కు కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది. అల్లాహ్ హలాల్ చేసినదే హలాల్. అల్లాహ్ హరాం చేసినదే హరాం. దేనిని ఆయన ధర్మంగా చేశాడో అదే ధర్మం.
[اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِنْ دُونِ الله] {التوبة:31}
వారు అల్లాహ్ ను కాదని తమ పండితులను, సాధువులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. (తౌబా 9: 31).
عَنْ عَدِىِّ بْنِ حَاتِمٍ > قَالَ : أَتَيْتُ النَّبِىَّ ^ وَفِى عُنُقِى صَلِيبٌ مِنْ ذَهَبٍ قَالَ فَسَمِعْتُهُ يَقُولُ [اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِنْ دُونِ الله] قَالَ قُلْتُ يَا رَسُولَ الله إِنَّهُمْ لَمْ يَكُونُوا يَعْبُدُونَهُمْ. قَالَ: «أَجَلْ وَلَكِنْ يُحِلُّونَ لَهُمْ مَا حَرَّمَ اللهُ فَيَسْتَحِلُّونَهُ وَيُحَرِّمُونَ عَلَيْهِمْ مَا أَحَلَّ اللهُ فَيُحَرِّمُونَهُ فَتِلْكَ عِبَادَتُهُمْ لَهُمْ». {السنن الكبرى للبيهقي، كتاب آداب القاضي ، باب ما يقضي به القاضي… ، 10/198}
అదీ బిన్ హాతిం (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చాను. అప్పుడు నా మెడలో బంగారు శిలువ ఉండింది. నేను చేరుకునే సరికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “వారు అల్లాహ్ ను కాదని తమ పండితులను, సాధువులను తమ ప్రభువులుగా చేసుకున్నారు”. (తౌబా 9: 31). అన్న ఆయతు పఠిస్తున్నారు. ‘ప్రవక్తా! యూదులు, క్రైస్తవులు తమ పండితుల, సన్యాసుల పూజా, ఆరాధనలు చేసేవారు కాదు కదా?’ అని నేనడిగాను. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అవును, కాని అల్లాహ్ హరాం చేసిన వాటిని పండితులు హలాల్ చేస్తే వారు దానిని హలాల్ గానే భావించేవారు. అలాగే అల్లాహ్ హలాల్ చేసిన వాటిని వారు హరాం చేస్తే వారు దానిని హరాంగానే భావించేవారు. ఇదే వారి ఆరాధన చేసినట్లు” అని విశదపరిచారు.
(బైహఖీ ‘సునన్ కుబ్రా’లో, కితాబు ఆదాబిల్ ఖాజి, బాబు మా యఖ్ జీ బిహిల్ ఖాజీ…, 10/198).
పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు:
ధర్మపరమైన నిషేధాలు
https://teluguislam.net/?p=1705
ధర్మపరమైన నిషేధాలు (భాగాలు) – యూట్యూబ్ ప్లేలిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2ipsEd3T9LtuCJ3_1vELEu
ధర్మపరమైన నిషేధాలు (క్లిప్స్) – యూట్యూబ్ ప్లేలిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0PzbYW7saGrZ3TYVB51Rtb