
[8:15 నిముషాలు]
Ruling by other than what Allaah has revealed
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ధర్మపరమైన నిషేధాలు – 40
40- అల్లాహ్ అవతరించిన దానిని వదలి, వేరేవాటితో తీర్పు చేయకు [1]. లేదా అందులోని తీర్పుల్లో అన్యాయం, నిరంకుశత్వం, నిర్దాక్షిణ్యం మరియు కఠినాలు ఉన్నాయని, లేదా సంపూర్ణంగా కాకుండా లోపం ఉందని, లేదా వేరే చట్టాలు, తీర్పులు దానికంటే మేలైనవి అని, లేదా దాని లాంటివే మరియు ప్రజలకు ఉత్తమం అయినవని, లేదా అవి ఈ కాలానికి చెల్లవని భావించకు. ఇలాంటి నమ్మకాలన్నియూ అల్లాహ్ తో కుఫ్ర్ (తిరస్కారం) మరియు ధర్మభ్రష్టతకు కారణం అవుతాయి. అల్లాహ్ ఆదేశం చదవండి:
[وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللهُ فَأُولَئِكَ هُمُ الكَافِرُونَ]. {المائدة:44}
అల్లాహ్ అవతరించిన చట్టం ప్రకారం తీర్పు చేయనివారే అవిశ్వాసులు. (మాఇద 5: 44).
[1] అల్లాహ్ అవతరించినది కాకుండా ప్రజా నిర్మిత చట్టాలు అవలం- బించేవారివి మూడు స్థితులు:
1– అల్లాహ్ యేతరుల చట్టాలతో తీర్పు చేసేవాడు అల్లాహ్ అవతరించిన చట్టం ఈ కాలంలో చెల్లదని, లేదా అది గాకుండా వేరేటివే ఉత్తమం అని, లేదా అది అసంపూర్ణమైనది, అన్యాయం, కఠినత్వంతో కూడినది అని నమ్మితే అతడు అవిశ్వాసి అయినట్లే, ఇస్లాం నుండి వైదొలగినట్లే, ధర్మభ్రష్టతకు గురి అయినట్లే. ఇంకా అతడు ఘోర విచ్ఛిన్నకారుడు మరియు అల్లాహ్ తో పోరాటానికి దిగినవాళ్ళల్లో అతి నీచుడు.
[وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللهُ فَأُولَئِكَ هُمُ الكَافِرُونَ].
అల్లాహ్ అవతరించిన చట్టం ప్రకారం తీర్పు చేయనివారే అవిశ్వా- సులు. (మాఇద 5: 44).
2- ఎవరైతే అల్లాహ్ అవతరించిన చట్టమే అతిఉత్తమమైనదని, సంపూర్ణమైనదని నమ్మి కూడా తన కోరిక తీర్చుకొనుటకు లేదా ఏదైనా వాంఛకు లోనై, వేరే చట్ట ప్రకారం తీర్పు చేస్తే అతడు అవిశ్వాసి కాడు, ధర్మభ్రష్తతకైతే అంతకూ గురికాడు. పోతే అల్పవిశ్వాసిగా మరియు అల్లాహ్ ఇష్టానికి వ్యతిరేక మార్గాన్ని అవలంబించినవాడవుతాడు.
[وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللهُ فَأُولَئِكَ هُمُ الفَاسِقُونَ].
అల్లాహ్ అవతరించిన చట్టం ప్రకారం తీర్పు చేయనివారే దుర్మార్గులు. (మాఇద 5: 47).
3- అల్లాహ్ అవతరించినదానితో తీర్పు చేయుటయే విధిగా అని నమ్మి కూడా దౌర్జన్యపరుడైన అధికారి, రాజుకు లేదా కరడుగట్టిన శత్రువు- లకు భయపడి వేరే చట్టాల ప్రకారం తీర్పు చేస్తే అతడు తన పట్ల అన్యాయం చేసుకున్నవాడు మరియు అసంపూర్ణ విశ్వాసిగా పరిగణింపబడతాడు.
[وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللهُ فَأُولَئِكَ هُمُ الظَّالِـمُونَ].
అల్లాహ్ అవతరించిన చట్టం ప్రకారం తీర్పు చేయనివారే దౌర్జన్యపరులు, అన్యాయులు.(మాఇద 5: 45).
పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు:
ధర్మపరమైన నిషేధాలు
https://teluguislam.net/?p=1705
You must be logged in to post a comment.