
[11:37 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ధర్మపరమైన నిషేధాలు – 23
23– అల్లాహ్ యేతరుల కొరకు జంతు బలి చేయకు. అది వారి సన్నిధానం పొందుటకుగాని, లేదా వారితో భయం చెంది, లేదా వారేమైనా ఇస్తారని ఆశించి. ఉదాహరణకుః జిన్నాతుల నుండి ఏ హానీ కలగకూడదని లేదా మృతుల నుండి ఏదైనా లాభం కలగాలని వారి కొరకు బలి ఇచ్చుట([1]).
[قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي للهِ رَبِّ العَالَمِينَ ، لَا شَرِيكَ لَهُ وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا أَوَّلُ المُسْلِمِينَ] {الأنعام:163}
ఇలా అను: నా నమాజ్, నా బలి (ఖుర్బానీ), నా జీవనం, నా మరణం, సమస్తమూ సకలలోకాలకూ ప్రభువైన అల్లాహ్ కొరకే, ఆయనకు ఏ భాగస్వామీ లేడు. ఈ ఆజ్ఞయే నాకు ఇవ్వబడింది[. (అన్ఆమ్ 6: 163,164).
([1]) అల్లాహ్ యేతరుల కొరకు చేసే జంతు బలి రెండు రకాలుగా ఉంటుందిః
1- సన్నిధానం పొందుటకు, గౌరవభావంతో, ఆరాధన ఉద్దేశంతో చేయుట. అందులో అతని నుండి ఎదైనా మేలు ఆశిస్తూ, లేదా అతని నుండి కీడు కలగవద్దన్న భయంతో చేయుట. ఇది పెద్ద షిర్క్. ఇస్లాం నుండి బహిష్కరణకు కారణం. తౌహీద్ కు వ్యతిరేకం. ఉదాహ- రణకుః ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత జంతు బలి ఇచ్చి, దానిని ఇంట్లో ఉంచుట, జిన్, షైతానుల కీడు నుండి రక్షణ ఉద్దేశంతో దాని రక్తాన్ని గోడలకు పూయుట.
2- ఎవరైనా అతిథి, బందువు వచ్చినప్పుడు అల్లాహ్ ప్రసన్నత ఉద్దేశంతో జంతువును కోయుట ఇది ధర్మసమ్మతం.
పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు
You must be logged in to post a comment.