
[7:44 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ధర్మపరమైన నిషేధాలు – 17
17- బర్కత్ (శుభం) కలిగే ఉద్దేశంతో సమాధుల మీద, దాని చుట్టు ప్రక్కలో ఎక్కడా నమాజు చేయకు. అక్కడ దుఆ చేయుట ఘనత గల విషయమని భావించకు. అక్కడ నమాజు చేయుట సంపూర్ణత్వానికి ఓ నిదర్శనం అని భావించకు. ఇవన్నియూ షిర్కులో లేదా దాని దరిదాపులకు చేరుకుండా ఉండటానికి పాటించవలసిన ముఖ్య పనులు [1].
عَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُولُ الله : (لَعْنَةُ اللهِ عَلَى الْيَهُودِ وَالنَّصَارَى اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ)
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారని ఆయిష (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారుః “యూదులు మరియు క్రైస్తవులపై అల్లాహ్ శాపం కురువుగాక! వారు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనస్థలం(మస్జిదులు)గా చేసుకున్నారు”. (బుఖారి/ అస్సలాతు ఫిల్ బీఅతి/ 436, ముస్లిం/ అన్నహ్ యు అన్ బినాఇల్ మసాజిద్ అలల్ ఖుబూర్…/ 531).
మరో ఉల్లేఖనంలో ఉంది:
(أَلَا وَإِنَّ مَنْ كَانَ قَبْلَكُمْ كَانُوا يَتَّخِذُونَ قُبُورَ أَنْبِيَائِهِمْ وَصَالِحِيهِمْ مَسَاجِدَ أَلَا فَلَا تَتَّخِذُوا الْقُبُورَ مَسَاجِدَ إِنِّي أَنْهَاكُمْ عَنْ ذَلِكَ).
“మీకు పూర్వం గడచిపోయినవారు తమ ప్రవక్తల మరియు పుణ్యాత్ముల సమాధులను మస్జిదులుగా చేసుకునేవారు, వినండి! మీరు అలా సమాధులను మస్జిదులుగా చేయబోకండి. నేను మిమ్మల్ని దీని నుండి నిషేధిస్తున్నాను. (ముస్లిం 532).
[1] సమాధి వద్ద నమాజు స్థితులు:
1- సమాధి వద్ద నమాజు చేయు వ్యక్తి సమాధి మరియు అందులో ఉన్న వారి గురించి ఏ ప్రత్యేక నమ్మకం లేకుండా, అల్లాహ్ ప్రసన్నత కొరకే, కాని అక్కడ చేయుట ఎక్కువ ఘనత అని భావిస్తే అతను షిర్క్ కు సంబంధించిన బిద్అత్ (దురాచారం) చేసినవాడు, శాపగ్రస్తుడు మరియు సృష్టిలో అతి నీచుడవుతాడు. కాని పెద్ద షిర్క్ కు పాల్పడిన, ఇస్లాం నుండి వైదొలిగినవాడు కాడు.
2- సమాధి వద్ద నమాజు చేయు వ్యక్తి అందులో ఉన్నవారి గురించి లాభాలు చేకూర్చే, నష్టాన్ని తొలిగించేవారని నమ్మి, వారితో మొర పెట్టుకుంటే, వేడుకుంటే అలాంటి వ్యక్తి పెద్ద షిర్క్ కు పాల్పడి, ఇస్లాం నుండి దూరమై, తౌహీద్ కు వ్యతిరేకమైన కార్యం చేసినవాడవుతాడు.
3- ఎవరైతే అజ్ఞానంతో సమాధి వద్ద నమాజ్ చేశాడో, అక్కడ సమాధి ఉన్నదని కూడా అతనికి తెలియదో అతని ఆ నమాజ్ సహీ అగును. అతడు పాపాత్ముడు కాడు.
పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు
You must be logged in to post a comment.