ఈ ప్రసంగంలో ‘వసీలా’ (అల్లాహ్‌కు సామీప్యం పొందడానికి ఒక సాధనం) అనే ఇస్లామీయ భావన గురించి వివరించబడింది. ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం వసీలా యొక్క సరైన అవగాహనను, మరియు సాధారణ అపోహలను వక్త స్పష్టం చేశారు. వసీలా అంటే అల్లాహ్ యొక్క సామీప్యాన్ని ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా వెతకడం అని ఆయన వివరించారు. ఈ ప్రసంగం ఆరు రకాల “ధర్మ సమ్మతమైన వసీలా”పై దృష్టి పెట్టింది: 1. అల్లాహ్ యొక్క అందమైన పేర్లు మరియు గుణగణాల ద్వారా. 2. ఒకరి విశ్వాసం (ఈమాన్) మరియు సత్కార్యాల ద్వారా. 3. తౌహీద్ (ఏకేశ్వరోపాసన) ద్వారా. 4. అల్లాహ్‌కు తమ అవసరాన్ని మరియు నిస్సహాయతను వ్యక్తపరచడం ద్వారా. 5. అల్లాహ్ ముందు తమ పాపాలను ఒప్పుకోవడం ద్వారా. 6. జీవించి ఉన్న ఒక పుణ్యాత్ముడిని తమ కోసం అల్లాహ్‌తో ప్రార్థించమని (దుఆ) కోరడం ద్వారా. మరణించిన ప్రవక్తలు, పుణ్యాత్ములు లేదా వారి సమాధుల ద్వారా వసీలాను వెతకడం ధర్మసమ్మతం కాదని వక్త నొక్కి చెప్పారు.
اَلْحَمْدُ لِلّٰهِ وَحْدَهُ (అల్ హందులిల్లాహి వహ్ దహు) అన్ని పొగడ్తలు ఏకైకుడైన అల్లాహ్ కే.
وَ الصَّلَاةُ وَ السَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ (వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు) ఆయన తర్వాత ప్రవక్త ఎవరూ రారో, ఆయనపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం.
أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహ్ మతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం అల్లాహ్ ను వేడుకోవటానికి ఎవరి సహాయమైనా అవసరమా? అంటే మధ్యవర్తి అవసరమా? అల్లాహ్ ను దుఆ చేయటానికి, అర్థించటానికి, వేడుకోవటానికి లేదా మా దుఆలు స్వీకరింపబడటానికి మధ్యవర్తి అవసరమా? ఒకరి సహాయం అవసరమా? వసీలా అవసరమా? అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో వసీలా గురించి తెలియజేశాడు, కాకపోతే మన సమాజంలో ఒక వర్గం దానికి తప్పుడు అర్థం తీసుకుంటుంది. సహాబాలు, తాబయీన్లు, సజ్జనులు, పూర్వీకులు, ధర్మ పండితులు, ముహద్దసీన్లు, అయిమ్మాలు (ఇమాములు) తీసుకోలేని అర్థం వీళ్ళు తీసుకుంటున్నారు. దాని వాస్తవం ఏమిటి? ఇన్ షా అల్లాహ్ ఆధారంగా, ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ఆధారంగా తెలుసుకుందాం.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర మాయిదా, ఆయత్ 35 లో ఇలా తెలియజేశాడు:
وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةَ (వబ్తగూ ఇలైహిల్ వసీల) ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)
ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అని అల్లాహ్ తెలియజేశాడు. ఈ ఆయత్ లో వసీలా అనే పదం ఉంది.
వసీలా అంటే ఏమిటి?
అసలు వసీలా అంటే అర్థం ఏమిటి? వసీలా అంటే ఏదేని ఆశయాన్ని సాధించటానికి, సామీప్యం పొందటానికి అవలంబించబడే మార్గం లేక సాధనం. ఇది వసీలా యొక్క అర్థం. సింపుల్ గా చెప్పాలంటే, అల్లాహ్ సామీప్యం కొరకు సృష్టితాలను సాధనంగా చేసుకోవటం.
అభిమాన సోదరులారా! అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అంటే ఆయనకు దగ్గర చేర్చే సత్కార్యాలను చేయమని అర్థం. కానీ కొంతమంది అసలు ఈ వసీలాను వదిలేసి, ఖురాన్ లో ఏ వసీలా గురించి చెప్పడం జరిగిందో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ వసీలా గురించి చెప్పారో, దాని నిజమైన అర్థం ఏమిటి, వాస్తవమైన భావం ఏమిటి అది పక్కన పెట్టి, దర్గా, సమాధులను, పుణ్య పురుషులను, ప్రవక్తలను, దైవదూతలను, ఔలియాలను, చనిపోయిన వారిని సాధనంగా చేసుకుంటున్నారు. ఇది ముమ్మాటికీ ఖురాన్ కి, హదీసులకు లకు విరుద్ధం.
వసీలా రకాలు
అభిమాన సోదరులారా! ఇక, వసీలా రెండు రకాలు. ధర్మ సమ్మతమైన వసీలా, అధర్మమైన వసీలా.
ఈరోజు మనం ధర్మ సమ్మతమైన వసీలా గురించి తెలుసుకుందాం. ఏ వసీలా సమ్మతంగా ఉందో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి తెలియజేశారో, ధర్మ సమ్మతమైన వసీలా ఏమిటి ఈరోజు మనము తెలుసుకుందాం, ఇన్ షా అల్లాహ్.
ధర్మ సమ్మతమైన వసీలా
ధర్మ సమ్మతమైన వసీలాలో ఒకటి, గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం.
وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا (వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా) అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. (7:180)
మొదటి ధర్మ సమ్మతమైన వసీలా ఏమిటి? అల్లాహ్ నామాలను, గుణగణాలను సాధనంగా చేసుకోవటం. అల్లాహ్ నామాన్ని, అల్లాహ్ గుణాలను వసీలాగా తీసుకోవటం. ఇది సూర ఆరాఫ్ ఆయత్ నంబర్ 180. వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా – అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. ఇది గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం, అంటే దుఆ చేసేటప్పుడు, వేడుకునేటప్పుడు, ప్రార్థించేటప్పుడు అల్లాహ్ నామాల ద్వారా, అల్లాహ్ గుణ విశేషణాల ద్వారా వేడుకోవటం, అల్లాహ్ యొక్క నామాలను, అల్లాహ్ యొక్క గుణాలను సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం. ఇది మొదటి విషయం.
ఆ తర్వాత రెండవది, విశ్వాసం మరియు సత్కర్మలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేయటం. విశ్వాసాన్ని, సత్కర్మలను. దీనికి ఉదాహరణ, బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఒక పేరు పొందిన ఒక హదీస్ ఉంది, ఫేమస్ హదీస్, గుహ వారి హదీస్. దీనికి ఒక ప్రబల తార్కాణం. ఆ వివరంగా ఉంది హదీస్, నేను కేవలం దాంట్లో యొక్క సారాంశం మాత్రమే చెప్తున్నాను.
ఆ ముగ్గురు వ్యక్తులు, బనీ ఇస్రాయీల్ లో, గుహలో తల దాచుకున్నారు. గాలుల మూలంగా, వర్షాల మూలంగా కొండరాయి విరిగి ఆ గుహ ముఖాన్ని మూసేసింది. ఆ ముగ్గురు వ్యక్తులు గుహ లోపల ఉండిపోయారు. బయటికి రావాలంటే కొండరాయి వచ్చి పడిపోయింది, ఆ ముఖ ద్వారం బంద్ అయిపోయింది. ఆ ముగ్గురు వ్యక్తులు బయటికి రాలేరు, శబ్దం బయటికి రాదు, అది ఊరు కాదు, ఎవరో సహాయం చేసే వారు ఎవరూ లేరు, మాట వినే వారు ఎవరూ లేరు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏదో ఒక దారి చూపిస్తే తప్ప వారికి వేరే మార్గమే లేదు. అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఏం చేశారు? ఆ ముగ్గురు తమ తమ జీవితంలో చేసుకొన్న సత్కర్మలను ఆధారంగా చేసుకుని దుఆ చేశారు. ఒక వ్యక్తి అయితే తమ అమ్మ నాన్నల పట్ల ఏ విధంగా వ్యవహరించాడో అది సాధనంగా చేసుకున్నాడు, అమ్మ నాన్నల పట్ల సత్ప్రవర్తన గురించి. ఇంకో వ్యక్తి దానధర్మాల గురించి, ఇంకో వ్యక్తి వేరే విషయం గురించి, ఆ ముగ్గురు వ్యక్తులు తమ తమ సత్కర్మలను, చేసుకొన్న పుణ్యాలను సాధనంగా చేసుకొని, ఆధారంగా చేసుకొని అల్లాహ్ ను వారు దుఆ చేశారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి దుఆలను ఆలకించి, వారి ప్రార్థన స్వీకరించి, వారికి ఆ బండరాయిని తప్పించి, కొండరాయిని తప్పించారు. వారు ముగ్గురు అల్హందులిల్లాహ్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అంటే దీంతో ఏం అర్థం అవుతుంది? విశ్వాసం మరియు సత్కర్మలను సాధనంగా, వసీలాగా చేసి వేడుకోవచ్చు. ఇది రెండో విషయం.
మూడో విషయము, అల్లాహ్ సన్నిధిలో ఆయన “తౌహీద్ ను ఆశ్రయించటం. అల్లాహ్ యొక్క తౌహీద్ ను ఆశ్రయించి దుఆ చేయటం, తౌహీద్ ను వసీలాగా చేసుకోవటం. ఇది యూనుస్ అలైహిస్సలాం ఇలా దుఆ చేశారు. సూర అంబియా ఆయత్ 21:87:
فَنَادَىٰ فِي الظُّلُمَاتِ أَن لَّا إِلَٰهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ (ఫనాదా ఫిజ్జులుమాతి అల్ లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక) అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు.” అని మొరపెట్టు కున్నాడు(21:87)
ఇది యూనుస్ అలైహిస్సలాం చేప కడుపులో చేసిన దుఆ ఇది. చీకట్లో, కటిక చీకట్లో, సముద్రం చీకటి, మళ్లా చేప కడుపు, ఆ చీకటి. కటిక చీకట్లో యూనుస్ అలైహిస్సలాం చేసిన దుఆ ఇది. చీకట్లో ఇలా మొరపెట్టుకున్నారు: “ఓ అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు.” లా ఇలాహ ఇల్లా అంత – తౌహీద్ ని ఆశ్రయించారు. లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక – “నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీవు పవిత్రుడవు.” అంటే మూడో విషయం, అల్లాహ్ సన్నిధిలో ఆయన తౌహీద్ ని, ఏకత్వాన్ని ఆశ్రయించి దుఆ చేయటం.
నాలుగో విషయం, అల్లాహ్ వైపు మరలి తన అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వ్యక్తపరచి దానిని సాధనంగా చేసుకోవటం. అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వసీలాగా చేసుకొని అల్లాహ్ ను అడగటం, వేడుకోవటం. ఇది అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దుఆ. ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు, దాదాపు 18 సంవత్సరాలు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఎంత ఆయన సహనం, ఓర్పు, ఆయనకు వచ్చిన పరీక్ష. అభిమాన సోదరులారా! అయ్యూబ్ అలైహిస్సలాం అనారోగ్యానికి గురైనప్పుడు, ఆ ఆయన యొక్క నిస్సహాయ స్థితిని ఆయన వసీలాగా చేసుకొని అల్లాహ్ కు ప్రార్థించారు, వేడుకున్నారు. అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దుఆ ఏమిటి? సూర అంబియా ఆయత్ 83:
أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ (అన్నీ మస్సనియద్దుర్రు వ అంత అర్హముర్రాహిమీన్) “నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకీ అపారంగా కరుణించేవాడవు” (21:83)
అని దుఆ చేసుకున్నారు, వేడుకున్నారు. అంటే తన నిస్సహాయ స్థితిని సాధనంగా చేసుకున్నారు.
అభిమాన సోదరులారా, అలాగే ఐదవది, తమ పాపాలను అంగీకరిస్తూ దైవ సన్నిధిలో వాటిని సాధనంగా చేసుకోవటం, పాపాలను అంగీకరిస్తూ, ఒప్పుకుంటూ దానికి సాధనంగా చేసుకుని వేడుకోవటం. ఇది మూసా అలైహిస్సలాం దుఆ చేశారు. సూర ఖసస్, ఆయత్ 16లో:
قَالَ رَبِّ إِنِّي ظَلَمْتُ نَفْسِي فَاغْفِرْ لِي (ఖాల రబ్బీ ఇన్నీ జలంతు నఫ్సీ ఫగ్ ఫిర్లీ) “నా ప్రభూ! నాకు నేనే అన్యాయం చేసుకున్నాను. కనుక నన్ను క్షమించు.” (28:16)
అభిమాన సోదరులారా, ఇది ఐదవది.
ఆరవది ఏమిటంటే, ఇది చాలా గమనించి వినాలి, అపార్థం చేసుకోకూడదు. ఆరవది, బ్రతికి ఉన్న సత్పురుషుల దుఆలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం. పరమపదించిన ఔలియాలు, పరమపదించిన ప్రవక్తలు, పరమపదించిన సత్పురుషులు కాదు. బ్రతికి ఉన్న సత్పురుషుల దుఆలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం.
దీనికి ఉదాహరణ ఏమిటి? సహాబాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో వెళ్లి ఇలా రిక్వెస్ట్ చేసుకునేవారు, విన్నవించుకునేవారు: “ఓ దైవప్రవక్త, వర్షం లేదు, కరువు వచ్చేసింది, మీరు దుఆ చేయండి.” అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు, అల్లాహ్ దుఆ స్వీకరించేవాడు, వర్షం వచ్చేది.
అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత – ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది – అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత సహాబాలు, మరి అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను వసీలాగా చేసుకోవచ్చు కదా? లేకపోతే ఆయన సమాధి వారి దగ్గరే ఉంది కదా? మస్జిద్ లోనే, పక్కనే ఉంది కదా? మదీనాలోనే ఉంది కదా? ఆ సమాధి దగ్గరికి పోయి వసీలాగా అడగవచ్చు కదా? లేదు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, సహాబాలు ఆయన పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు దగ్గరికి పోయి దుఆ చేయమని కోరేవారు. ఇది చాలా గమనించే విషయం. సహాబాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, ప్రవక్త గారి పేరుతో వసీలాగా దుఆ చేయలేదు. ప్రవక్త గారి యొక్క సమాధి దగ్గరికి పోయి వసీలాగా చేసుకోలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత కాలం, ప్రవక్త గారితో దుఆ చేయించేవారు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, సహాబాలు ఆయన పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు బ్రతికి ఉన్నారు కాబట్టి, ఆయన దగ్గరికి పోయి దుఆ చేయమని వేడుకునేవారు, అడిగేవారు, రిక్వెస్ట్ చేసుకునేవారు.
కావున, ఇవి నేను చెప్పిన ఆరు రకాలు, ఇవి మాత్రమే ధర్మ సమ్మతమైన వసీలా.
మొదటిది ఏమిటి? అల్లాహ్ యొక్క నామాలను, గుణాలను వసీలాగా చేసుకోవటం.
రెండవది, విశ్వాసం మరియు సత్కర్మలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం.
మూడవది, అల్లాహ్ సన్నిధిలో అల్లాహ్ యొక్క తౌహీద్ ను ఆశ్రయించటం.
నాలుగవది, అల్లాహ్ వైపు మరలి అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వ్యక్తపరచి దానిని సాధనంగా చేసుకోవటం.
ఐదవది, తమ పాపాలను అంగీకరిస్తూ దైవ సన్నిధిలో వాటిని సాధనంగా చేసుకోవటం.
ఆరవది, బ్రతికి ఉన్న సత్పురుషులు, పుణ్యాత్ముల దగ్గరికి పోయి దుఆ చేయమని కోరటం. వారు కూడా దుఆ చేస్తారు.
ఈ విధంగా, ఇవి తప్ప ఇంకా ఇతర రకమైన వసీలా ధర్మ సమ్మతం కాదు. అది ధర్మ సమ్మతం కాని వసీలా, అధర్మమైన వసీలా. అది ఏమిటో, ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (వ ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) మా ఆఖరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.
وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (వస్సలాము అలైకుమ్ వ రహ్ మతుల్లాహి వ బరకాతుహు) మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, తావీజు (తాయత్తులు) మరియు ఇస్లాంలో వాటి స్థానం గురించి వివరించబడింది. తావీజులు రెండు రకాలుగా విభజించబడ్డాయి: ఖుర్ఆన్ వచనాలు కలిగినవి మరియు ఇతర వస్తువులు (గవ్వలు, దారాలు మొదలైనవి) కలిగినవి. ఖుర్ఆన్ వచనాలు ఉన్న తాయత్తుల విషయంలో కూడా పండితుల మధ్య అభిప్రాయ భేదం ఉందని, అయితే మెజారిటీ పండితులు షిర్క్‌కు దారితీస్తుందనే భయంతో వాటిని కూడా నిషేధించారని ప్రసంగీకులు పేర్కొన్నారు. షిర్క్‌తో కూడిన రెండవ రకం తాయత్తులు పూర్తిగా హరామ్ అని స్పష్టం చేయబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన విధంగా, తాయత్తులకు బదులుగా ఖుర్ఆన్ మరియు దుఆలను పఠించడం ద్వారా రక్షణ మరియు నివారణను వెతకాలని ముగింపులో ఉపదేశించబడింది.
إِنَّ الْحَمْدَ لِلَّهِ وَحْدَهُ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ، أَمَّا بَعْدُ (ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్ద, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బా’ద, అమ్మా బా’ద్) నిశ్చయంగా సర్వ స్తోత్రాలు ఏకైక అల్లాహ్ కే శోభిస్తాయి. మరియు ఎవరి తర్వాత ప్రవక్త లేడో, ఆయనపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఆ తర్వాత…
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమములోకి మీ అందరికీ ఇస్లామీయ అభివాదం.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.
ప్రియ వీక్షకులారా! ఈ రోజు మనం తావీజు, తాయత్తుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం మన సమాజంలో చూస్తూ ఉంటాము, కొందరి మెడలో, చేతులో, నడుంకి తావీజులు, తాయత్తులు కట్టుకుంటారు. చిన్న పిల్లలకి దిష్టి తగలకుండా ఉండటానికి, పెద్దవారైనా సరే, ఎవరైనా సరే రోగానికి గురైనప్పుడు ఆ రోగం పోవాలని, నష్టానికి గురైనప్పుడు నష్టం రాకూడదని, కొందరు భయం కోసము, కొందరు ముందు జాగ్రత్త ఎప్పుడూ నష్టానికి, బాధకి లోను కాకూడదని ఏదేదో కారణాలతో, ఏదేదో ఉద్దేశాలతో తావీజులు కట్టుకుంటారు. ఇది కూడా సమాజంలో ఒక వర్గం దీనిని వ్యాపారంగా కూడా చేసుకున్నది. కాకపోతే, ఇస్లాం ధర్మంలో, షరీఅత్‌లో తావీజు యొక్క వాస్తవికత ఏమిటి? దీనికి అరబీలో ‘తమీమా‘ అంటారు, ‘త’అవీద్’. మామూలుగా తెలుగులో తావీజు, తాయత్తు అని చెప్తారు.
తావీజులలో రకాలు
ఈ తాయత్తులు, ఈ తావీజులు రెండు రకాలు. షేఖ్ సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్ (రహ్మతుల్లాహి అలై) ఒక పుస్తకం ఉంది ‘అఖీదతుత్ తౌహీద్‘, ఆ పుస్తకం ఆధారంగా ఈ తావీజు గురించి ఈ రెండు రకాలు నేను మాట్లాడుతున్నాను. తావీజు రెండు రకాలు ఈ తాయత్తులు.
మొదటి రకం ఏమిటి? ఖుర్ఆన్ ఆధారంగా కట్టే తావీజులు. ఆ తావీజులో ఎటువంటి షిర్క్ లేదు, బిద్అత్ లేదు, కొత్త విషయాలు లేవు. ఖుర్ఆన్ వాక్యాలు మాత్రమే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన వాక్యాలు మాత్రమే ఆ తావీజులో ఉన్నాయి. అంటే ఖుర్ఆన్ సూక్తులను లేదా అల్లాహ్ నామాలను, గుణాలను లిఖించి వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో తావీజు వేయటం. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. అల్లాహ్ సూక్తులను, అల్లాహ్ నామాలను, అల్లాహ్ గుణాలను లిఖించి ఆ వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో వేలాడదీయడం, వేయటం.
ఇటువంటి తావీజు ధర్మ సమ్మతమని కొంతమంది పండితుల అభిప్రాయం. అందరి అభిప్రాయం కాదు, కొంతమంది పండితుల అభిప్రాయం మాత్రమే. ఆధారం ఏమిటి? అటువంటి తావీజులో షిర్క్ లేదు, బిదాత్ లేదు, కొత్త విషయం ఏదీ లేదు. కేవలం అల్లాహ్ వాక్యం ఉంది, అల్లాహ్ నామం మాత్రమే ఉంది, అల్లాహ్ గుణగణాలు మాత్రమే ఉన్నాయి. ఉద్దేశం కూడా ఏమిటి? వ్యాధి నివారణ పొందే ఉద్దేశం. షిర్క్ లేదు కాబట్టి ఇది ధర్మ సమ్మతమే అని కొంతమంది పండితుల అభిప్రాయం.
కాకపోతే, అత్యధిక శాతం, ఎక్కువ మంది ధర్మ పండితులు ఇటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అంటారు. ఆ లిఖించటంలో, ఆ తావీజులో, ఆ కాగితంలో ఖుర్ఆన్ ఆయత్ మాత్రమే ఉన్నప్పటికిని అది ధర్మ సమ్మతం కాదు అని అంటారు అత్యధిక మంది ధర్మ పండితులు. ఉదాహరణకు, అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు త’ఆలా అన్హు) పెద్ద సహాబీ, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పినతండ్రి కుమారుడు అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు త’ఆలా అన్హు), హుజైఫా (రదియల్లాహు త’ఆలా అన్హు), ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఇలా, అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) యొక్క శిష్యులు, ఒక ఉల్లేఖనం ప్రకారం ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహ్మతుల్లాహి అలై), అలాగే వారి శిష్యులు, తర్వాతి తరాల వారు కూడా దీనినే కట్టుబడ్డారు, అంటే ఇది కూడా ఇటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు. అత్యధిక మంది పండితుల అభిప్రాయం ఇదే. ఆధారం ఏమిటి?
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,
إِنَّ الرُّقَى وَالتَّمَائِمَ وَالتِّوَلَةَ شِرْكٌ (ఇన్నర్రుఖా వత్తమాఇమ్ వత్తివలా షిర్కున్) “నిశ్చయంగా మంత్రాలు (షిర్క్ తో కూడినవి), తాయత్తులు మరియు తివలా (ఒక రకమైన క్షుద్ర విద్య) షిర్క్.” (ఇబ్ను మాజా)
అంటే ఈ విధంగా మంత్రించటం, తాయత్తులు వేయటం, తివలా, ఇది ఒక రకమైన చేతబడి, క్షుద్ర విద్య, షిర్కుతో కూడుకున్నది అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
అభిమాన సోదరులారా! కేవలం అల్లాహ్ నామాలు మాత్రమే, అల్లాహ్ గుణాలు మాత్రమే ఉన్నప్పటికీ అది ధర్మ సమ్మతం కాదు అని ఎందుకు అంటున్నారంటే మూడు కారణాల వల్ల అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అంటున్నారు. అది మూడు కారణాలు. ఒకటి ఏమిటి? సర్వసాధారణంగా తాయత్తులు కట్టడం పట్ల వారింపు ఉంది. సర్వసాధారణంగా తాయత్తులు కట్టరాదు, తావీజు వేయరాదు అని వాక్యాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. కావున ఈ సర్వసాధారణకి ప్రత్యేకంగా చేసే ఆధారం ఏదీ లేదు. ఒక విషయం సర్వసాధారణంగా ఉంది, దానికి ప్రత్యేకంగా ఏమైనా రుజువు కావాలి, ఆధారం కావాలి. ఆధారం లేకపోతే అది ధర్మ సమ్మతం అవ్వదు. అంటే మొదటి రకం, మొదటి విషయం ఏమిటి? సర్వసాధారణంగా తాయత్తులు కట్టడం వల్ల వారింపు ఉంది. ఈ సర్వసాధారణమును ప్రత్యేకంగా చేసే ఆధారం ఏదీ లేదు కనుక.
అలాగే రెండవ కారణం ఏమిటి? దీనిని ధర్మ సమ్మతం చేస్తే షిర్క్ ద్వారాలు తెరుస్తాయి. షిర్క్ ద్వారాలను మూసివేయటంలో ఈ వారింపు ఉపయుక్తంగా ఉన్నది కాగా తావీజులు వ్రేలాడదీయవచ్చన్న ఫతవా అనే ఇస్తే, షిర్కుతో కూడుకున్న తావీజును ప్రోత్సహించేందుకు ఆస్కారం ఉంది. అది ఏ విధంగానూ సమ్మతం కాదు. ఇది రెండో కారణం.
మూడోది ఏమిటి? ఖుర్ఆన్ ఆయతులను తావీజుగా చేసి మెడలో, చేతులు వేసుకుంటే తప్పకుండా వాటి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తారు. తప్పనిసరిగా అవుతుంది అది. ఎందుకంటే తావీజు వేసుకొని బాత్రూంకి పోవాలి, కాలకృత్యాలు పూర్తి చేసుకోవాలి, మనిషి ఒకసారి జునుబీ స్థితిలో ఉంటాడు, అశుద్ధ స్థితిలో ఉంటాడు, వివాహం అయిన వారు సంభోగించుకుంటారు భార్యాభర్తలు. మరి మెడలో ఖుర్ఆన్ వాక్యాలు, అల్లాహ్ నామము, చేతిలో అల్లాహ్ వాక్యాలు, ఖుర్ఆన్ వాక్యాలు, అల్లాహ్ నామాలు, అల్లాహ్ పేరు, అల్లాహ్ గుణ విశేషాలు ఇవి మన శరీరంలో పెట్టుకొని మనము బాత్రూం కి పోవటం ఏమిటి? కాలకృత్యాలు తీసుకోవటం ఏమిటి? జునుబీ స్థితిలో ఉండటం ఏమిటి? ఈ విధంగా చాలా కారణాలు ఉన్నాయి, అమర్యాద అవుతుంది ఆ ఈ ఖుర్ఆన్ వాక్యాల విషయంలో. కావున ఈ మూడు కారణాల వల్ల ఆ తావీజులో ఖుర్ఆన్ వాక్యాలు మాత్రమే ఉన్నప్పటికిని అది ధర్మ సమ్మతం కాదు అని పండితుల అత్యధిక మంది పండితుల అభిప్రాయం ఇది.
ముగింపు మరియు సరైన పద్ధతి
అభిమాన సోదరులారా! ఇప్పుడు వరకు నేను చెప్పిన మాటల్లో సారాంశం రెండు రెండు విషయాలు. ఒకటి, ధర్మ సమ్మతమైన తావీజు, దాంట్లో ఎటువంటి షిర్క్ పదాలు ఉండకూడదు. కేవలం అల్లాహ్ వాక్యాలు, అల్లాహ్ నామం, అల్లాహ్ గుణాలు మాత్రమే ఉండాలి. అటువంటి తావీజు ధర్మ సమ్మతమని కొంతమంది మాత్రమే ధర్మ సమ్మతం అంటున్నారు. కాకపోతే, రెండో విషయం ఏమిటి? అత్యధిక మంది ధర్మ పండితులు అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు. ఎందుకంటే ఈ మూడు కారణాలు. మొదటి కారణం ఏమిటి? సాధారణంగా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతీ తావీజు షిర్క్ అన్నారు. దానికి ప్రత్యేకం చేయటానికి ఆధారం లేదు. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏమిటి? ఇది షిర్క్‌కి దారి తీస్తుంది. రెండో కారణం. మూడో కారణం ఏమిటి? అల్లాహ్ వాక్యాల పట్ల, అల్లాహ్ నామం పట్ల, అల్లాహ్ గుణ విశేషాల పట్ల అమర్యాద కలుగుతుంది, అగౌరవం కలుగుతుంది. ఈ కారణాల వల్ల రుజువు లేదు కాబట్టి అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అత్యధిక మంది పండితుల అభిప్రాయం.
కావున, మనము తావీజు కట్టుకోకుండా, తావీజు వ్రేలాడదీసుకోకుండా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానాన్ని అనుసరించి మనము మంత్రించి ఊదుకోవాలి, అది ఆధారం ఉంది కదా! ఆరోగ్యం బాగాలేదు, ప్రవక్త గారు కొన్ని దుఆలు, కొన్ని వాక్యాలు నేర్పించారు. ఖుర్ఆన్ వాక్యాలు ఉన్నాయి, అల్లాహ్ నామాలు ఉన్నాయి, అల్లాహ్ గుణాలు ఉన్నాయి. అవి మంత్రించి, పఠించి ఊదుకోవచ్చు. రోగిపై పఠించి ఊదవచ్చు. నీళ్ళపై మంత్రించి ఆ నీళ్ళు తాగవచ్చు, త్రాపించవచ్చు. ఈ విధానం ఉంది కదా. లేని విధానాన్ని, దాంట్లో షిర్క్ అనే అనుమానం ఉంది, అటువంటి విధానాన్ని ఎన్నుకోవడం కరెక్ట్ కాదు.
ఇక తావీజు విషయంలో రెండో రకం, రెండో కోవకు చెందిన తావీజు, ఇప్పుడు అది ఒక వ్యాపారంగా మారిపోయింది. అది ఎటువంటి పరిస్థితుల్లో ధర్మ సమ్మతం కాదు, అధర్మం, షిర్క్ మరియు హరామ్. అంటే, ఖుర్ఆన్ సూక్తులు ఆధారం కాని, ఆధారం లేని తావీజులు. అంటే గవ్వలు, పూసలు, దారాలు, వెంట్రుకలు, చిప్పలు, భూత పిశాచాల పేర్లు ఇత్యాదివి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ రకమైన తావీజులు ముమ్మాటికి నిషిద్ధం, హరామ్, ధర్మ సమ్మతం కాదు, షిర్క్. అవి ఖచ్చితంగా షిర్క్ కిందికి వస్తాయి. ఎందుకంటే ఈ రకమైన వస్తువులలో అల్లాహ్ నామాల, వాక్యాల బదులు వాటిని ఇతరత్రా వాటితో ముడిపెట్టడం జరుగుతుంది, దైవేతరులను ఆశ్రయించడం జరుగుతుంది. కాగా హదీసులో ఇలా ఉంది, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
مَنْ تَعَلَّقَ شَيْئًا وُكِّلَ إِلَيْهِ (మన్ త’అల్లఖ షై’అన్ వుకిల ఇలైహి) “ఎవరైతే ఏదైనా వస్తువుతో (రక్షణ కోసం) సంబంధం పెట్టుకుంటాడో, అతను దానికే అప్పగించబడతాడు.” (తిర్మిజి)
ఎవరైనా ఏదైనా వస్తువుతో సంబంధం ఏర్పరుచుకుంటే అతను దాని పరమే చేయబడతాడు, అతని నమ్మకం దాని పైనే ఉంటుంది, అల్లాహ్ పైన నమ్మకం ఉండదు. అల్లాహ్ అతనికి పట్టించుకోడు. కావున ఇది షిర్క్ అవుతుంది. ప్రస్తుతం సమాజంలో చాలామంది అది ఒక వ్యాపారంగా చేసుకున్నారు. మీరు దాని గురించి అనుభవం చేసి చూడండి. కొన్ని తావీజులు ఓపెన్ చేసి చూస్తే, కొన్ని అక్షరాలు ఉంటాయి, అర్థం కాని అక్షరాలు ఉంటాయి. అరబీ భాష కావచ్చు, అరబీ భాష కాకపోవచ్చు, అర్థం కాని భాష ఉంటుంది, అర్థం కాని అక్షరాలు ఉంటాయి. కొన్ని తావీజులలో అడ్డంగా, దిడ్డంగా గీతలు ఉంటాయి. కొన్ని తావీజులలో లెక్కలు ఉంటాయి. ఇదన్నీ ఎవరు నేర్పించారు? ఇవన్నీ హరామ్, ఇవన్నీ షిర్క్ కిందికి వస్తుంది, అధర్మం.
కావున, మనం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన విధానాన్నే అనుసరించాలి. రోగానికి గురైనప్పుడు ప్రవక్త గారు మనకి ఏం నేర్పించారు? పిల్లలకి దిష్టి తగలకుండా ఉండాలంటే ప్రవక్త గారు నేర్పించారు. జ్వరం వస్తే ఏం చేయాలి? బాధకి గురైతే ఏం చేయాలి? నష్టానికి గురైతే ఏం చేయాలి? భయంలో ఏం చేయాలి? ప్రయాణంలో ఏం చేయాలి? అల్హమ్దులిల్లాహ్! అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ప్రతీ విధానం నేర్పించారు. ప్రతీ విషయంలో, ప్రతీ సమయంలో, ప్రతీ సబ్జెక్టులో మనకు నేర్పించారు. వివాహంలో, సంభోగం సమయంలో, దుస్తులు వేసుకునేటప్పుడు, ఇంట్లో ప్రవేశించేటప్పుడు, ఇంటి నుంచి బయటికి పోయేటప్పుడు, ఉదయం సాయంత్రం దుఆలు, అజాన్‌కి ముందు అజాన్ తర్వాత, మస్జిద్‌కి పోయేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు, బాధ కలిగినప్పుడు, భయం ఉన్నప్పుడు, టెన్షన్‌లో ఉన్నప్పుడు, అప్పులో ఉన్నప్పుడు, అప్పులు తీర్చేటప్పుడు ప్రతీ సమస్యకి, ప్రతీ రోగానికి, ప్రతీ కష్టానికి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఒక పద్ధతి నేర్పించారు, ఒక విధానం నేర్పించారు.
మరి మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ఏం నేర్పించినా,
وَمَا يَنطِقُ عَنِ الْهَوَىٰ إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَىٰ (వమా యంతిఖు అనిల్ హవా, ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా) అతను తన మనోభిరామం ప్రకారం మాట్లాడటమూ లేదు. అది (అతను మాట్లాడేదంతా) అతని వద్దకు పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు. (53:3-4)
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు అల్లాహ్ తరఫు నుంచే నేర్పుతారు. కావున, మనము ప్రతీ చిన్న పెద్ద షిర్క్ నుండి దూరంగా ఉండాలి. షిర్క్ చాలా ఘోరమైన నేరం, డేంజర్ విషయం అది. షిర్క్ చాలా ఘోరం. కావున, ఈ తావీజు కూడా షిర్క్ కిందికి వస్తుంది. కావున మనం ఈ షిర్క్ నుండి దూరంగా ఉండాలి, ఈ తావీజులు, తాయత్తులతో దూరంగా ఉండాలి. సమాజంలో ఈ బాబాలు, పీర్లు, వీళ్ళు దీనిని ఒక వ్యాపారంగా చేసుకున్నారు. ఇస్లాంలో ఎటువంటి దీనికి స్థానం లేదు. ఇది ధర్మ సమ్మతం కాదు. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ మనకి రోగం వచ్చినా, మన పిల్లలకి రోగాలు వచ్చినా, వారికి దిష్టి తగలకుండా ఉండాలన్నా ప్రవక్త గారు నేర్పించారు. కావున మీరు దుఆల పుస్తకం ఆధారంగా ఉన్న ప్రామాణికమైన హదీసుల పరంగా దుఆలు మనకు ఉన్నాయి, ఆ దుఆలు పఠించండి, ప్రవక్త గారి విధానాన్ని అనుసరించండి. ఇన్షా అల్లాహ్ ఇహపర లోకాలలో సాఫల్యం దక్కుతుంది ఇన్షా అల్లాహ్.
అభిమాన సోదరులారా! కావున ఇంతటితో నేను నా మాటలను ముగిస్తూ, ఇన్షా అల్లాహ్ మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) మా చివరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
జిక్ర్ మరియు ఇస్తిగ్ఫార్ ఘనత & రోజు వారి జీవితంలో చదివే ప్రత్యేక దుఆలు మరియు వాటి ఘనతలు https://youtu.be/Oldiv3H1dE0 [60+ నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, ఇస్తిగ్ఫార్ (క్షమాపణ కోరడం) మరియు ధిక్ర్ (అల్లాను స్మరించడం) యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాల గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. ఇస్తిగ్ఫార్ అనేది పాపాల నుండి హృదయాన్ని శుభ్రపరచడమే కాకుండా, వర్షాలు, సంపద, సంతానం వంటి ప్రాపంచిక మరియు పారలౌకిక శుభాలను తెస్తుందని నొక్కి చెప్పబడింది. సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ వంటి ప్రత్యేక దువాల ఘనత కూడా చర్చించబడింది. అదేవిధంగా, ధిక్ర్ అనేది ఒక ముస్లిం జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆరాధనగా మారుస్తుందని, నిలబడి, కూర్చుని, పడుకుని – అన్ని స్థితులలో అల్లాహ్ స్మరణలో ఉండటం వల్ల అపారమైన పుణ్యం మరియు అల్లాహ్ శిక్ష నుండి రక్షణ లభిస్తుందని స్పష్టం చేయబడింది. లా ఇలాహ ఇల్లల్లాహ్ మరియు సుబ్హానల్లాహి వబిహమ్దిహి వంటి ధిక్ర్ ల యొక్క గొప్పతనం మరియు ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత చేసే తస్బీహ్‌ల వల్ల కలిగే లాభాలు కూడా వివరించబడ్డాయి. అంతిమంగా, ప్రతి ముస్లిం తన జీవితాన్ని ఇస్తిగ్ఫార్ మరియు ధిక్ర్ లతో అలంకరించుకోవాలని ప్రబోధించబడింది.
ప్రియ వీక్షకులారా! ఈరోజు అల్లాహ్ యొక్క దయతో మనం రెండు అంశాలపై మాట్లాడుకుందాము. అయితే ఈ రెండు అంశాలకు సంబంధించిన సందేశం మీకు ముందే చేరి ఉన్నది గ్రూపులలో. ఒకటి ధిక్ర్ గురించి మరొకటి ఇస్తిగ్ఫార్ గురించి. అయితే ధిక్ర్ మరియు ఇస్తిగ్ఫార్ లో మన రోజువారీ జీవితంలో మనం చదివే దువాలలో ఏ గొప్ప విషయాలు ఉన్నాయి, వాటి గురించి ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ఇన్షా అల్లాహ్ నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను.
అయితే ఇందులో ప్రతి ఒక్క అంశం, ధిక్ర్ మరియు ఇస్తిగ్ఫార్, సపరేట్గా మనకు స్పష్టంగా అర్థం కావడానికి నేను రెండు టాపిక్కులుగా, రెండు అంశాలుగా వేరువేరు చెప్తాను. సుమారు ఒక 25 నుండి 30 నిమిషాలు ముందు ఇస్తిగ్ఫార్ గురించి మాట్లాడుకుందాము. ఆ తర్వాత ధిక్ర్ గురించి.
అల్హమ్దులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.
ఇస్తిగ్ఫార్ (క్షమాపణ కోరడం)
أَعُوذُ بِاللَّهِ السَّمِيعِ الْعَلِيمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ فَقُلْتُ اسْتَغْفِرُوا رَبَّكُمْ إِنَّهُ كَانَ غَفَّارًا يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا وَيُمْدِدْكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّاتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَارًا ఫకుల్తుస్తగ్ఫిరూ రబ్బకుమ్ ఇన్నహూ కాన గఫ్ఫారా, యుర్సిలిస్ సమాఅ అలైకుమ్ మిద్రారా, వయుమ్‌దిద్‌కుమ్ బి అమ్వాలివ్ వబనీన వయజ్అల్ లకుమ్ జన్నతివ్ వయజ్అల్ లకుమ్ అన్హారా. నేను ఇలా అన్నాను, ‘క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. నిశ్యయంగా ఆయన అమితంగా క్షమించేవాడు. ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీ సిరిసంపదల్లోనూ, పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని ఒసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు, ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు.’
సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా! సూరత్ నూహ్ 29వ పారాలో ఒక ముఖ్యమైన ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి దావత్, వారు తమ జాతి వారికి ఇచ్చినటువంటి సందేశంలో ఇస్తిగ్ఫార్ గురించి ఉన్నటువంటి కొన్ని ఆయతులు, అందులోని కొన్ని గొప్ప భావం గలటువంటి, ఘనత గలటువంటి విషయాలు తెలియజేయడానికి నేను మీ ముందు తిలావత్ చేశాను.
అయితే ఇస్తిగ్ఫార్ అంటే ఏంటి? ఇస్తిగ్ఫార్ అంటే మనం మన పాపాల మన్నింపుకై అల్లాహ్ తో అర్ధించడం. అస్తగ్ఫిరుల్లాహ్ అని మనం అంటాము సర్వసామాన్యంగా. నమాజ్ నుండి సలాం తిప్పిన తర్వాత అంటే ఏంటి? ఓ అల్లాహ్, నేను నా పాపాల నుండి నీ క్షమాభిక్షను, మన్నింపును కోరుతున్నాను.
సోదర మహాశయులారా, నేను ఈ ఇస్తిగ్ఫార్ గురించి మరికొన్ని విషయాలు చెప్పేకి ముందు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మనలో ఎంతో మంది ఒకరి చేతి కింద పని చేస్తారు. అలాంటప్పుడు సర్వసామాన్యంగా ఏదైనా మన పనిలో మిస్టేక్ జరిగినప్పుడు మనం మన పై వారితో సారీ అని అంటూ ఉంటాము. కదా? కొన్ని సందర్భాల్లో ఒకే రోజులో ఎన్నోసార్లు ఇలాంటి ఏదైనా పొరపాటు జరిగి ఉంటే మనం అక్కడ ఆ సమయంలో ఆ పెద్దవారి ముందు సారీ అని, క్షమించండి అని ఈ భావం గల ఇంకా వేరే ఏ పదాలైనా గానీ ఉపయోగిస్తాము.
ఇక్కడ గమనించండి, ఒక వ్యక్తి పని చేస్తున్నాడు. తనకు పైగా ఉన్నటువంటి అధికారికి ఆ పని గురించి ఉత్తమ రీతిలో చేయాలని, అందులో ఏదైనా లోపం జరిగితే క్షమాపణ కోరాలని మన యొక్క స్వభావంలో ఈ విషయం ఉన్నది. అయితే మనమందరము కూడా మన సృష్టికర్త నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ యొక్క దాసులం. అల్లాహు తాలా ఆరాధన కొరకే మనం పుట్టించబడ్డాము. ఇక తప్పు జరగకుండా నూటికి నూరు శాతం, హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం జీవితం గడపలేము. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, తప్పులు జరుగుతూ ఉంటాయి. అందుకొరకే మనం అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఎల్లవేళల్లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యందు మన యొక్క లోపం, మన యొక్క కొరత, మనతో జరిగేటువంటి తప్పులు, అపరాధాలు, పాపాలు అన్నిటి గురించి ఓ అల్లాహ్, నీవు నన్ను క్షమించు, మన్నించు అని మనం ఇలా అనుకుంటూ ఉంటే ఇది మన యొక్క ఆత్మశుద్ధి, ఆ పాపం నుండి ఇక ముందుకు దూరం ఉండడానికి, జరిగిన పాపం దాని యొక్క శిక్ష నుండి తప్పించుకోవడానికి, అల్లాహ్ యొక్క క్షమాభిక్ష, మన్నింపు పొంది అతని కరుణ ఛాయల్లో రావడానికి, అతనికి ఇంకా దగ్గర అవ్వడానికి ఇస్తిగ్ఫార్ ఎంతో ముఖ్యమైన విషయం.
అయితే రండి, ఇస్తిగ్ఫార్ గురించి రెండు, మూడు గంటలు చెప్పుకుంటూ పోయినా గానీ ఈ అంశం పూర్తి కాదు. అన్ని ఆయతులు, అన్ని హదీసులు ఎన్నో కోణాల నుండి దీనిని మనం చెప్పుకోవచ్చు. కానీ మన రోజువారీ జీవితంలో మనకు చాలా ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు నేను తెలియజేస్తున్నాను, మీరు శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాను.
అన్నిటికంటే ముందు నేను ఇబ్ను మాజాలో వచ్చినటువంటి ఒక హదీస్ వినిపిస్తున్నాను. చాలా ముఖ్యమైన హదీస్ ఇది. దీని ద్వారా మనకు ఇస్తిగ్ఫార్ యొక్క లాభం అన్నది చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే రండి ఇదిగోండి, ఈ హదీస్ అరబీ పదాలు మీరు కూడా చూస్తూ దీని యొక్క అర్థాన్ని, దీని యొక్క భావాన్ని తెలుసుకోండి.
ఇప్పుడే మీకు చూపిస్తూ ఉన్నాను.
అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నిశ్చయంగా దాసుడు ఒక తప్పు, అపరాధం, పాపం చేసినప్పుడు అతని యొక్క హృదయంలో ఒక నల్ల మచ్చ ఏర్పడుతుంది. అతడు ఆ పాపాన్ని వదులుకుంటే, అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటే, పాపం చేయడం ద్వారా అల్లాహ్ కు ఏదైతే దూరమయ్యాడు కదా, తాబా (అల్లాహ్ వైపునకు మరలితే) అతని ఆ హృదయంలో నుండి ఆ మచ్చ అనేది దూరమైపోతుంది. పాపాలు పెరిగిపోతే ఆ నల్ల మచ్చలు పెరుగుతూ పోతాయి, చివరికి పూర్తి హృదయంపై ఆ మచ్చలు మచ్చలు మచ్చలు మచ్చలు ఎక్కువైపోయి హృదయమే నల్లగా అయిపోతుంది. ఇదే అల్లాహు అజ్జవజల్ల తన కితాబులో చెప్పాడు.” ఇదే,
كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا يَكْسِبُونَ కల్లా బల్ రాన అలా ఖులూబిహిమ్ మా కానూ యక్సిబూన్. అది కాదు, అసలు విషయం ఏమిటంటే వారి దురాగతాల మూలంగా వారి హృదయాలకు తుప్పు పట్టింది.
ఇక్కడ అల్లాహు తాలా తుప్పు పట్టింది అని ఏదైతే అంటున్నాడో, ఈ తుప్పు అనేది హృదయానికి దేనివల్ల పట్టింది? వారి యొక్క దురాగతాలు, వారి యొక్క పాపాలు, వారి యొక్క చెడు పనులు ఏవైతే వారు చేస్తున్నారో.
ఇన్షా అల్లాహ్ మీకు విషయం అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ హదీస్ ద్వారా మనకు బోధపడిన విషయం ఏంటి? ఎప్పుడెప్పుడైతే దాసుడు ఓ తప్పుకు, ఓ పాపానికి ఒడిగడతాడో అప్పుడప్పుడు అతని యొక్క హృదయం నల్లగా అవుతుంది. పాపాలు పెరిగిపోతూ పోయాయి, కానీ వాటిని ఆ నల్ల మచ్చను దూరం చేయడానికి పాపాన్ని వదులుకోవడం, అల్లాహ్ తో క్షమాపణ కోరుకోవడం, అల్లాహ్ వైపునకు మరలడం ఇలాంటిదేమీ చేయకుంటే అది ఇంకా నల్లగా అయిపోయి తర్వాత చాలా ప్రమాదానికి మనిషి గురి అయిపోతాడు.
అయితే రండి ఇక్కడ మనం ముందు తెలుసుకుందాము, పాపం అంటే ఏమిటి? సోదర మహాశయులారా, అల్లాహ్ ఏ ఆదేశం ఇచ్చాడో దానిని పాటించకపోవడం పాపం. అల్లాహ్ ఏ విషయాన్ని చేయకూడదు అని చెప్పాడో అంటే అల్లాహ్ యొక్క వారింపులు, వాటికి పాల్పడడం ఇది పాపంలో లెక్కించబడుతుంది. ఈ విధంగా ఇది మన మధ్య అల్లాహ్ కు మధ్యలో కావచ్చు, మన మధ్య మనలాంటి మానవుల మధ్యలో కావచ్చు, మనము మరియు మానవులే కాకుండా ఇతర, ఉదాహరణకు ఎక్కడైనా ఒక చెట్టు ఉన్నది. నీడ ఆ చెట్టు ద్వారా ప్రజలు పొందుతూ ఉన్నారు. అనవసరంగా ఆ చెట్టును కోసేసాము. ప్రజలకు కలిగేటువంటి లాభాన్ని మనం దూరం చేశాము. ఇది కూడా ఒక పాపమే. మనం డైరెక్ట్ గా ఒక మనిషికి బాధ కలిగించలేదు, ఇన్డైరెక్ట్ గా కలిగించాము. జంతువులు ఉన్నాయి, కాలక్షేపంగా నా యొక్క గురి బాగా ఉందా లేదా అని కేవలం పరీక్షించుకోవడానికి పక్షులను, జంతువులను ఈటెతో గానీ లేదా ఇంకా ఈ రోజుల్లో గన్ అలాంటి వేరే పరికరాలతో వాటిని చంపడం ఇది ఇస్లాం ధర్మంలో పాపంగా చెప్పడం జరిగింది. కొందరు కొన్ని రకాల పక్షుల పిల్లల్ని పట్టుకుంటారు దాని మూలంగా ఆ పక్షి యొక్క తల్లి ఏదైతే ఉంటుందో దానికి చాలా బాధ కలుగుతూ ఉంటుంది, ఇది కూడా ఒక పాపంలో వస్తుంది. అర్థం కావడానికి ఈ విషయాలు చెప్తున్నాను. మనం వెళ్తూ వెళ్తూ ఆ ఏందీ తీసుకెళ్లి డస్ట్ బిన్ లో వేసేది అని బనానా అరటిపండు యొక్క ఆ తొక్క ఏదైతే ఉందో అలాగే దారిలో పడేస్తాము. హదీస్ లో ఏముంది? దారిలో నుండి బాధ కలిగించే విషయాన్ని దూరం చేయడం పుణ్యకార్యం. ఇక్కడ మనం బాధ కలిగించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ విధంగా మనం అల్లాహ్ పట్ల గానీ, ప్రజల పట్ల గానీ, ఇంకా వేరే ఎవరి పట్ల గానీ ఏదైనా వారికి హాని కలిగించడం ఇవన్నీ కూడా పాపాల్లో లెక్కించబడతాయి. పాపాలు చేయడం వల్ల అది స్వయం మన ఆత్మకు, మన శరీరానికి, మన ఆరోగ్యానికి, పాపం వల్ల మన ఇంట్లో మనకు, మన పిల్లలకు, మన యొక్క సంపదలో, మన యొక్క ధనంలో, మన రోజువారీ జీవితంలో, మన సమాజానికి ఎంతో చెడు ఉంటుంది. పాపాల ప్రభావం వ్యక్తిగత మరియు సామాజిక జీవితంపై, ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇన్షా అల్లాహ్ ఏ రోజైనా దాని గురించి వివరంగా తెలుసుకుందాము. కానీ ఇప్పుడు నేను ఇక్కడ దాన్ని సంక్షిప్తంగా ఎందుకు ప్రస్తావిస్తున్నాను? ఇలాంటి ఏ తప్పు ఏ పాపం జరిగినా గానీ మనం స్వచ్ఛమైన మనసుతో అల్లాహ్ తో క్షమాపణ కోరుకోవాలి. అల్లాహ్ తో క్షమాభిక్ష కోరాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటామో అక్కడ నాలుగు కండిషన్లను గుర్తుంచుకోవాలి. అప్పుడే అల్లాహ్ తో మనం కోరుకున్న ఆ క్షమాపణ స్వీకరించబడుతుంది. మన యొక్క తప్పు, మన యొక్క పొరపాటు, మన యొక్క పాపం అది మన్నించబడుతుంది. దాని యొక్క శిక్ష నుండి మనం తప్పించుకోగలుగుతాము. ఈ కండిషన్లు పూర్తి చేయడంలో ఎంత వెనక ఉంటామో, ఎంత లేజీతనం మనం చేస్తామో అంతే మన తౌబా ఇస్తిగ్ఫార్ యొక్క ఆమోదం కూడా, అది స్వీకరించబడడం కూడా చాలా వెనక ఉండిపోతాము. ఏంటి అవి? మొదటిది, చేసిన తప్పును ఛీ అని భావించడం. దానిని అది గుర్తు వచ్చినప్పుడు నాతో ఎలా జరిగిపోయింది కదా అని ఒక పశ్చాత్తాప భావం అనేది మనిషిలో ఉండాలి. కొన్ని పాపాల గురించి ఎలా ఉంటుంది? అయ్యో వాడు చూస్తున్నాడు, వీడు చూస్తున్నాడు అని వదులుకుంటాము. కానీ మనసులో ఇంత మంచి అవకాశం పాయే కదా అని అనుకుంటాము. చూడడానికి పాపం చేయట్లేదు కావచ్చు, కానీ ఇది తౌబాలో రాదు. ఎందుకు? పాపం పట్ల కాంక్ష ఉంది. ఇక్కడ ఏం జరగాలి? మొట్టమొదటి షరతు, మొట్టమొదటి నిబంధన, పాపాన్ని తప్పుగా భావించాలి, పాపంగా భావించాలి, ఛీ నాతో ఎలా ఇది జరిగింది కదా అని ఒక బాధగా ఉండాలి. రెండవది, ఏ పాపం నుండి మనం క్షమాపణ కోరుకుంటున్నామో, తౌబా చేస్తున్నామో దానిని వదులుకోవాలి. దానిని వదులుకోవాలి. వడ్డీ తినే వ్యక్తి గానీ, జూదం ఆడే వ్యక్తి గానీ, మత్తు సేవించే వ్యక్తి గానీ, నేను క్షమాపణ కోరుకుంటున్నాను, అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, ఓ అల్లాహ్ నన్ను క్షమించు అని అంటున్నాడు, కానీ ఆ పాపాన్ని వదులుకోవడం లేదు. ఒక వ్యక్తి నమాజ్ చేయట్లేదు. మహా ఘోరమైన పాపం ఇది. ఓ అల్లాహ్ నన్ను క్షమించు అని అంటున్నాడు. మళ్ళీ నమాజ్ సమయం వచ్చింది. నమాజ్ చేయడం, అతడు నమాజ్ చేయకపోవడం ఒక చెడు అలవాటు ఏదైతే చేసుకున్నాడో దానిని వదులుకోవాలి. మూడో కండిషన్, ఇకముందు నేను ఆ పాపానికి ఒడిగట్టను, నేను ఆ పాపం చేయను అని బలంగా సంకల్పించుకోవాలి. దృఢంగా నిశ్చయించుకోవాలి, సంకల్పించుకోవాలి. ఈ మూడు పాపాలు, సారీ, ఈ మూడు కండిషన్లు పాపం యొక్క సంబంధం మనిషి మరియు అల్లాహ్ కు మధ్యలో ఉన్నప్పుడు. కానీ ఒకవేళ ఒకవేళ పాపం ఎవరితో, మనిషి పట్ల జరిగి ఉంటే, ఎవరినైనా కొట్టి ఉన్నాము, ఎవరినైనా మనం అవమానపరిచి ఉన్నాము, ఎవరిదైనా ఏదైనా సొమ్ము అన్యాయంగా తీసుకుని ఉన్నాము, అలాంటప్పుడు ఈ మూడు షరతులతో పాటు కండిషన్లతో పాటు ఆ వ్యక్తితో క్షమాపణ కోరుకోవాలి, ఆ వ్యక్తి మన్నిచేసేయాలి, లేదా అతని యొక్క హక్కు అతనికి చేరవేసేయాలి. ఈ నాలుగు కండిషన్లు ఉంటాయి. ఈ నాలుగు కండిషన్లు మనం పూర్తి చేయాలి. అప్పుడే మన తౌబా, మన ఇస్తిగ్ఫార్ అన్నది స్వీకరించబడుతుంది.
సోదర మహాశయులారా, ఈ సందర్భంలో మరికొన్ని ముఖ్యమైన విషయాలు మీరు గుర్తుంచుకోండి. ఏంటి అవి? ఒకటి, పాపాల సంఖ్య ఎంత ఎక్కువగా ఉన్నా మనం ప్రతిసారి, ప్రతిసారి, ప్రతిసారి అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూనే ఉండాలి. రెండవది, పాపాలు ఎంత ఘోరమైనవి అయినా ఆ ఇంత పెద్ద పాపం చేశాను నేను, అల్లాహ్ క్షమిస్తాడా నన్ను అని అనుకోవద్దు. నిన్ను క్షమించడం అల్లాహ్ కు కష్టం ఏమీ కాదు. కానీ స్వచ్ఛమైన మనసుతో అల్లాహ్ తో క్షమాపణ కోరుకొని పాపాన్ని విడనాడాలి. రెండోది ఏం చెప్పాను నేను ఇప్పుడు? ఎంత ఘోరమైన పాపాలు అయినా గానీ. మూడవది, అజ్ఞానం వల్ల, షైతాన్, మానవుల్లోని, జిన్నాతుల్లోని షైతానుల దుష్ప్రేరేపణ వల్ల అయ్యో ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నా కదా నేను పాపాలు, అని అనుకోవద్దు. అర్థమవుతుంది కదా? పాపాలు ఎంత ఎక్కువగా ఉన్నా, ఎలాంటి ఘోరమైన పాపమైనప్పటికీ, మూడవది ఎంత దీర్ఘకాలం నుండి ఉన్నా గానీ, నేను ఇందులో ప్రతి ఒక్కదానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి కానీ సమయం సరిపోదు అని నేను ఆ ఆధారాలు మీకు చూపడం లేదు.
ఇక సోదర మహాశయులారా, మన రోజువారీ జీవితంలో మనం ప్రతిసారి, ప్రతిసారి, ప్రతిసారి అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూనే ఉండాలి. ఒక్కసారి మీరు గమనించండి, సహీహ్ ముస్లిం షరీఫ్ ఇంకా తిర్మిజీ, ఇబ్ను మాజా వేరే హదీస్ గ్రంథాల్లో వచ్చిన విషయం, మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఏమని విశ్వసిస్తాము? మాసూమ్ అనిల్ ఖతా, పాప రహితులు ప్రవక్తలు. అయినా గానీ సహాబాలు ఏమంటున్నారు? ఒక్కొక్క సమావేశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వందేసి సార్లు రబ్బిగ్ఫిర్లీ, అస్తగ్ఫిరుల్లాహ్, ఓ అల్లాహ్ నా పాపాలను క్షమించు అని అనేవారు. ప్రవక్త అయి ఇంత ఎక్కువగా అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉండేవారంటే మనం ప్రతిరోజు ఎన్నిసార్లు క్షమాపణ కోరుకుంటూ ఉండాలి? అయితే ఎక్కువగా క్షమాపణ కోరుకుంటూ ఉండాలి. ఈ క్షమాపణ కోరుకుంటూ ఉండడం వల్ల మనకు చాలా చాలా లాభాలు కలుగుతాయి. లాభాల దాని యొక్క ఘనతలు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు, చాలా ఎక్కువ ఘనతలు ఉన్నాయి. కానీ సంక్షిప్తంగా కొన్ని చెప్తున్నాను గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చదివిన ఆయత్ ఏదైతే ఉందో స్టార్టింగ్ లో సూరత్ నూహ్ లోని ఆయత్లు ఒక్కసారి ఆ ఆయతుల యొక్క కేవలం భావాన్ని మీరు స్పీడ్ గా చూసి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇదిగోండి మీకు చూపించడం జరుగుతుంది. అల్హమ్దులిల్లాహి కసీరా.
ఆయత్ నెంబర్ 10 నుండి మొదలవుతుంది చూడండి. మన సూర నెంబర్ 71. నేను ఇలా అన్నాను, నూహ్ అలైహిస్సలాం అంటున్నారు, “క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు.” లాభాలు ఏంటి? “ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు.” వర్షాలు లేకుంటే అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉంటే అల్లాహ్ వర్షాలు కురిపిస్తాడు. రెండో లాభం, “మీ సిరిసంపదల్లోనూ,” చూస్తున్నారా? రెండో లాభం సిరిసంపదల్లో. మూడో లాభం, “పుత్ర సంతతిలోనూ.” సంతానం కలిగే విషయంలో “పురోభివృద్ధిని ఒసగుతాడు.” నాలుగో లాభం, “మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు.” మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు. ఐదో లాభం, “ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు.” తోటలు ఉంటే నీళ్లు వాటికి అవసరం. అయితే అల్లాహు తాలా కాలువలను కూడా ప్రవహింపజేస్తాడు. చూస్తున్నారా? ఇక్కడ ఎంత స్పష్టంగా మనకు కనబడిందో, ఇస్తిగ్ఫార్ ఎంత ఎక్కువగా ఉంటుందో అంతే ఎక్కువగా అల్లాహ్ యొక్క దయతో మనకు లాభాలు కలుగుతూ ఉంటాయి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, ఇది సహీహ్ హదీస్, షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ వారు సహీహాలో ప్రస్తావించారు 2299. ఏంటి హదీస్? జుబైర్ బిన్ అవ్వామ్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “ప్రళయ దినాన స్వయం తన కర్మల పత్రాన్ని చూసి సంతోషపడాలి అని ఎవరైతే కోరుతున్నారో, కోరుకుంటున్నారో, ఎంత ఎక్కువ ఇస్తిగ్ఫార్ అందులో ఉంటే అంతే ఎక్కువగా అతనికి ప్రళయ దినాన సంతోషం కలుగుతుంది.” అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. చూడండి, గమనిస్తున్నారా? ఈ ప్రపంచపు ఉదాహరణ ద్వారా కూడా మీకు చెప్పగలను. ఒక వ్యక్తి ఇద్దరు మనుషులు పనిచేస్తున్నారు అనుకోండి ఒక వర్క్ షాప్ లో, ఒక ఫ్యాక్టరీలో, ఒక కంపెనీలో. ఇద్దరితో కూడా తప్పు జరిగింది. కానీ ఒక వ్యక్తి వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్లి, “సార్, ఆ పనిలో నాతో ఈ మిస్టేక్ జరిగింది, క్షమించండి సార్, ఇక నుండి నేను శ్రద్ధ వహిస్తాను.” జీతం తీసుకునే సమయం వచ్చేసరికి మరొక వ్యక్తి క్షమాపణ కోరుకోలేదు. ఆ ఏంటి మొన్న నువ్వు ఆ తప్పు చేశావు కదా, అయ్యో జరగదా అంత మాత్రంలో దాన్ని గురించి మందలిస్తావా? ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ఇంకా వేరే ఏదైనా అడ్డ రీతిలో మాట్లాడాడు. మీరే ఆలోచించండి ఇద్దరిలో ఎవరు ఆ మేనేజర్ కి ఇష్టం? ఆ మేనేజర్ ఎవరి పట్ల ఇష్టపడతాడు? మరియు మనం మన జీతం తీసుకునే సందర్భంలో మనతో జరిగే మిస్టేక్ వల్ల ఏ మన జీతం అయితే కట్ అవుతుందో దాని కారణంగా జీతం పొందిన రోజు సంతోషం ఎవరు ఉంటారు, బాధగా ఎవరు ఉంటారు? కేవలం అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ మీరు గమనించండి. ప్రళయ దినాన మనం అల్లాహ్ ముందు హాజరైన తర్వాత అక్కడ మన కర్మ పత్రాలు తూకం చేయబడతాయి, మన కర్మ పత్రాలు మన కుడి చేతిలో లేదా ఎడమ చేతిలో ఇవ్వబడతాయి. ఆ సందర్భంలో మన కర్మ పత్రంలో మనకు సంతోషకరమైన విషయం చూడాలనుకుంటే అధికంగా, అధికంగా, అధికంగా ఇస్తిగ్ఫార్ అందులో ఉండడం తప్పనిసరి.
మరొక హదీస్ ఉంది. షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుల్ జామిలో ప్రస్తావించారు 3930, అబ్దుల్లా బిన్ బుస్ర్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, “తూబా.” తూబా అంటే ఏంటి? తూబా అంటే మీకు సంతోషం, మీకు శుభవార్త కలుగు గాక అని కూడా భావం వస్తుంది. తూబా అంటే స్వర్గంలో ఒక చెట్టు ఉంది, దాని ద్వారా స్వర్గవాసుల వస్త్రాలు తయారు చేయబడతాయి. ఈ విధంగా అల్లాహు తాలా దాని నీడలో ఉండేటువంటి గొప్ప శుభవార్త మనకు ఇస్తున్నాడని భావం. అయితే ఎవరైతే తన కర్మ పత్రాల్లో ఎక్కువగా ఇస్తిగ్ఫార్ చూస్తారో అలాంటి వారికి గొప్ప శుభవార్త ఉన్నది.
ఈ విధంగా సోదర మహాశయులారా, మనం ఇస్తిగ్ఫార్ పట్ల ఎప్పుడూ కూడా అశ్రద్ధగా ఏమాత్రం ఉండకూడదు. ఇక రండి, మన రోజువారీ జీవితంలో, మన రోజువారీ జీవితంలో ఏ ఏ సందర్భాలలో మనం ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండాలి? సోదర మహాశయులారా, అనేక సందర్భాలు ఉన్నాయి, అనేక సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు చూడండి, ప్రతి నమాజ్ వెంటనే అస్తగ్ఫిరుల్లాహ్. రుకూలో, సజ్దాలో సుబ్హానకల్లాహుమ్మ రబ్బనా వబిహమ్దిక అల్లాహుమ్మగ్ఫిర్లీ. అల్లాహుమ్మగ్ఫిర్లీ. గుర్తుంది కదా, అల్లాహుమ్మగ్ఫిర్లీ అంటే ఓ అల్లాహ్ నన్ను క్షమించు. రుకూలో, సజ్దాలో. అలాగే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తషహ్హుద్ లో మనం చదవవలసిన దువాలలో అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలా అన్హు అడిగినప్పుడు చెప్పిన దువా ఏమిటి? اللَّهُمَّ إِنِّي ظَلَمْتُ نَفْسِي ظُلْمًا كَثِيرًا، وَلَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ، فَاغْفِرْ لِي مَغْفِرَةً مِنْ عِنْدِكَ، وَارْحَمْنِي إِنَّكَ أَنْتَ الْغَفُورُ الرَّحِيمُ అల్లాహుమ్మ ఇన్నీ జలమ్తు నఫ్సీ జుల్మన్ కసీరన్ వలా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత ఫగ్ఫిర్లీ మగ్ఫిరతమ్ మిన్ ఇన్దిక వర్హమ్నీ ఇన్నక అంతల్ గఫూరుర్రహీమ్. చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో, اللَّهُمَّ اغْفِرْ لِي ذَنْبِي كُلَّهُ دِقَّهُ وَجِلَّهُ، وَأَوَّلَهُ وَآخِرَهُ وَعَلَانِيَتَهُ وَسِرَّهُ అల్లాహుమ్మగ్ఫిర్లీ జంబీ కుల్లహూ దిక్కహూ వజిల్లహూ వ అవ్వలహూ వ ఆఖిరహూ వ అలానియతహూ వ సిర్రహూ. అంటే ఏంటి? గమనించండి ఇక్కడ భావాన్ని. ఇది ముస్లిం షరీఫ్ లోని హదీస్. అల్లాహుమ్మగ్ఫిర్లీ జంబీ. ఓ అల్లాహ్ నా పాపాలను క్షమించు. కుల్లహూ అన్ని పాపాలను. దిక్కహూ వ జిల్లహూ, చిన్న పాపాలు, పెద్ద పాపాలు. వ అవ్వలహూ వ ఆఖిరహూ, ముందు చేసినవి, తర్వాత చేసినవి. వ అలానియతహూ వ సిర్రహూ, నేను ఎక్కడైనా దాగి ఉండి గుప్తంగా చేసిన పాపాలైనా లేదా బహిరంగంగా చేసిన పాపాలైనా. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అన్ని రకాల పాపాల నుండి క్షమాపణకై ఎంత మంచి దువాలు నేర్పబడ్డాయో మీరు గమనిస్తున్నారు కదా? ఇలాంటి దువాలు మనం నేర్చుకోవాలి. రెయిన్బో వల్ల ముఖ్యమైన దువాలు అని మాది ఒక పీడీఎఫ్ ఉంది, చదవండి. అందులో ఇలాంటి దువాలన్నీ కూడా జమా చేయడం, అందులో పూర్తి రిఫరెన్స్ తో తెలియజేయడం జరిగినది.
సోదర మహాశయులారా, అతి ముఖ్యంగా, అతి ముఖ్యంగా మనం ఎన్ని రకాల పదాలు, ఏ ఏ సందర్భాలు అల్లాహ్ తో క్షమాపణ కోరుకోవడానికి ఉపయోగిస్తామో వాటన్నిటిలోకెల్లా సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ చాలా చాలా చాలా చాలా చాలా ముఖ్యమైనది. సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్.
اللَّهُمَّ أَنْتَ رَبِّي لَا إِلَهَ إِلَّا أَنْتَ، خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ، وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَا اسْتَطَعْتُ، أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ، أَبُوءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ، وَأَبُوءُ لَكَ بِذَنْبِي فَاغْفِرْ لِي، فَإِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత, ఖలఖ్తనీ వ అన అబ్దుక, వ అన అలా అహ్దిక వ వఅ్‌దిక మస్తతఅతు, అఊజు బిక మిన్ షర్రి మా సనఅతు, అబూఉ లక బి నిఅమతిక అలయ్య, వ అబూఉ లక బి జంబీ ఫగ్ఫిర్లీ, ఫఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత.
మీరందరూ కూడా దీనిని కంఠస్థం చేసుకునే అవసరం లేదు. లేదు, నిజంగా చెప్తున్నాను. కేవలం చూసి చదవండి సరిపోతుంది. మీకు ఈ ఘనత ప్రాప్తిస్తుంది. ఈ దువా గురించి ముస్నద్ అహ్మద్ లో ఒక పదం ఏముందో తెలుసా? ఇన్న అవ్ఫకద్ దుఆ. దువాలలో ఎక్కువ భాగ్యాన్ని ప్రసాదించేటువంటి దుఆ, అల్లాహుమ్మ అంత రబ్బీ వ అన అబ్దుక, జలమ్తు నఫ్సీ వఅతరఫ్తు బిజంబీ, యా రబ్బి ఫగ్ఫిర్లీ జంబీ ఇన్నక అంత రబ్బీ ఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత. మరియు నేను సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ లో ఏదైతే చదివాను కదా, దాని గురించి సహీహ్ బుఖారీలో వచ్చిన హదీస్ ఏమిటి? ఎవరైతే పగలు, ఉదయం పూట దీనిని సంపూర్ణ నమ్మకం మరియు విశ్వాసంతో చదువుతారో సాయంకాలం కాకముందే అతను చనిపోతాడో అతడు స్వర్గవాసుల్లో ఒకడైపోతాడు. ఎవరైతే రాత్రి చదువుతారో పూర్తి నమ్మకంతో అతను ఉదయం కాకముందు చనిపోతే అతడు స్వర్గవాసుల్లో ఒకడైపోతాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా ఎంత గొప్ప అదృష్ట విషయం ఇందులో తెలియజేయడం జరిగింది? అందుకొరకే సోదర మహాశయులారా, ఎల్లవేళల్లో అల్లాహ్ తో మనం క్షమాపణ కోరుకుంటూనే ఉండాలి. కానీ ఉదయం అజ్కార్లలో, సాయంకాలం అజ్కార్లలో కనీసం ఒక్కసారైనా గానీ, ఒక్కసారైనా గానీ ఈ దువా చదవాలి.
సోదర మహాశయులారా ఇక్కడ మీకు ఒక శుభవార్త వినిపిస్తున్నాను, శ్రద్ధ వహించండి. కొందరు మీ యొక్క ఫ్రెండ్స్ లలో, మీకు తెలిసిన వాళ్లలో ఎవరైనా ముస్లిమేతరులు అయి ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా అనారోగ్య సందర్భంలో లేదా అట్లే ఏదైనా సందర్భంలో, “అరే మీ ముస్లింలు మంచిగా దువా చేస్తారురా భాయ్, మీ ముస్లింలు ఆ ఏదో చదివి ఊదుతారు చాలా నయం అవుతుంది” ఈ విధంగా కొంచెం ఒక ముస్లింల వైపు ఆకర్షణ కలిగి, ముస్లింల యొక్క దువాతో వారు ప్రభావితులై ఉంటారు. అలాంటి వారిలో, అలాంటి వారికి ఈ దువా మీరు నేర్పే ప్రయత్నం చేయండి. దీని యొక్క భావం వారిని చదవమని చెప్పండి, అరబీలో ఈ పదాలు రాకపోయినా గానీ.
ఒక సందర్భంలో ఏం జరిగింది? హుసైన్ అనే వ్యక్తి, స్వాద్ తో వస్తుంది ఇక్కడ పేరు, ఇమ్రాన్ ఇబ్ను హుసైన్ గారి యొక్క తండ్రి, ఈ హదీస్ ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉంది, దాని యొక్క రిసెర్చ్ చేసేవారు షేఖ్ షుఐబ్ అల్ అర్నావూత్ దీని యొక్క సనదును సహీహ్ అని చెప్పారు. ఒక వ్యక్తి హుసైన్ ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. అతను వచ్చి ప్రవక్తతో అడిగాడు, “నాకు మీరు ఏదైనా నేర్పండి, నేను చెప్పుకోవడానికి, చదువుకోవడానికి.” ప్రవక్త చెప్పారు,
اللَّهُمَّ قِنِي شَرَّ نَفْسِي، وَاعْزِمْ لِي عَلَى أَرْشَدِ أَمْرِي అల్లాహుమ్మ కినీ షర్ర నఫ్సీ, వ అజిమ్లీ అలా అర్షది అమ్రీ. ఓ అల్లాహ్ నా యొక్క నఫ్స్, స్వయం నాలో ఉన్నటువంటి చెడు నుండి నన్ను కాపాడు. మరియు అతి ఉత్తమ విషయం వైపునకు నాకు మార్గదర్శకత్వం చేసి నేను దానిపై దృఢంగా ఉండే విధంగా నాకు భాగ్యం కలుగజేయి.
ఒక నాన్ ముస్లిం, ముస్లిమేతరుడు అడిగినప్పుడు ప్రవక్త అతనికి ఈ దువా నేర్పారు. ఆ వ్యక్తి ఈ దువా చదవడం మొదలు పెట్టాడు, కొద్ది రోజులకు అల్లాహు తాలా అతనికి భాగ్యం కలుగజేశాడు, అతడు ఇస్లాం స్వీకరించాడు. ఇస్లాం స్వీకరించిన కొద్ది రోజులకు మళ్ళీ వచ్చాడు. వచ్చి చెప్పాడు, “నేను ఒక సందర్భంలో మీ వద్దకు వచ్చాను, మీరు అల్లాహుమ్మ కినీ షర్ర నఫ్సీ వ అజిమ్లీ అలా అర్షది అమ్రీ అని నాకు నేర్పారు. అయితే నేను దానిని చదువుతూ చదువుతూ ఉన్నాను, నాకు ఇస్లాం భాగ్యం కలిగింది. ఇప్పుడు నేను ఏం చెప్పాలో మీరు నాకు తెలియజేయండి.” అప్పుడు ప్రవక్త నేర్పారు,
اللَّهُمَّ اغْفِرْ لِي مَا أَسْرَرْتُ وَمَا أَعْلَنْتُ، وَمَا أَخْطَأْتُ وَمَا عَمَدْتُ، وَمَا عَلِمْتُ وَمَا جَهِلْتُ అల్లాహుమ్మగ్ఫిర్లీ మా అస్రర్తు వమా ఆలన్తు వమా అఖ్తఅతు వమా అమద్తు వమా అలిమ్తు వమా జహిల్తు. ఓ అల్లాహ్ నన్ను క్షమించు. నేను గోప్యంగా చేసిన పాపాలు, బహిరంగంగా చేసిన పాపాలు. ఏ పాపాలైతే నేను తెలిసి చేశానో అవి వాటిని కూడా మన్నించు, ఏ పాపాలైతే తెలియకుండా చేశానో వాటిని కూడా మన్నించు. మరియు ఏ పాపాలైతే నేను తెలిసి చేశానో మరియు ఏ పాపాలైతే నేను తెలియకుండా అజ్ఞానంగా చేశానో అన్నిటినీ కూడా నీవు మన్నించు.
చూస్తున్నారా గమనిస్తున్నారా? ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువాలు నేర్పేవారు. అయితే సోదర మహాశయులారా, చివరిలో నేను ఇస్తిగ్ఫార్ కు సంబంధించిన మరొకటి మీకు వినిపించదల్చుకుంటున్నాను, దాన్ని కూడా గుర్తుంచుకోండి. కానీ నేను చెప్తున్నాను కదా, ఇలాంటి దువాలన్నీ కూడా మీరు కంఠస్థం చేసే అవసరం లేదు, కేవలం చూసి చదువుతున్నా గానీ మీకు లాభం కలుగుతుంది.
أَسْتَغْفِرُ اللَّهَ الَّذِي لَا إِلَهَ إِلَّا هُوَ الْحَيَّ الْقَيُّومَ وَأَتُوبُ إِلَيْهِ అస్తగ్ఫిరుల్లాహల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వ అతూబు ఇలై. అస్తగ్ఫిరుల్లాహల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వ అతూబు ఇలై. ఇది ఎప్పుడూ కూడా చదవడం మర్చిపోకండి. ఇది మర్చిపోకండి ఎందుకంటే ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఎవరైతే ఇది చదువుతూ ఉంటారో వారి యొక్క పాపాలు ఒకవేళ వారి యొక్క పాపాలు ఒకవేళ ఎంత ఎక్కువ ఉన్నా గానీ మన్నించబడతాయి. చివరికి అతను ధర్మ యుద్ధం నుండి వెనుదిరిగినా అలాంటి పాపం కూడా ఈ దువా కారణంగా మన్నించబడుతుంది. చూశారా? చూస్తున్నారా గమనిస్తున్నారా ఎంత గొప్ప లాభం అనేది ఇందులో తెలపడం జరిగింది? అందుకొరకు సోదర మహాశయులారా, ఇస్తిగ్ఫార్ అనేది మాటిమాటికి చేస్తూ ఉండండి. నేను ఇంతకు ముందే చెప్పాను చెప్పుకుంటూ పోతే విషయాలు చాలా ఉంటాయి. కానీ ఈ కొన్ని విషయాలు ఈరోజు మనకు సరిపోతాయి. ప్రత్యేకంగా ఇందులో మన రోజువారీ జీవితంలో మనం చదవవలసిన కొన్ని ముఖ్యమైన దువాలు, సందర్భాల గురించి కూడా తెలపడం జరిగింది. ఆ సందర్భాల్లో వాటిని మీరు పాటిస్తూ ఉండండి. ఇన్షా అల్లాహ్ ఇక్కడి వరకు దీన్ని ఆపేసి ఈ అంశాన్ని వేరే అంశం వైపునకు ముందుకు సాగుదాము. విన్న విషయాలను అర్థం చేసి ఆచరించే సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
ధిక్ర్ (అల్లాను స్మరించడం)
సరే మిత్రులారా, ఇప్పుడు నేను రెండవ అంశం చెప్పబోతున్నాను. అందరూ శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. నేను కొంచెం ఫాస్ట్ గానే చెప్పే ప్రయత్నం చేస్తాను మరియు అందరూ కూడా దీనిని విని, ఆచరించి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వాలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا వజ్కురుల్లాహ జిక్రన్ కసీరా. సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా! మనమందరము దాసులము. దాసుడు తన యజమాని యొక్క స్తుతి, అతని యొక్క పొగడ్త, అతని యొక్క గొప్పతనాన్ని చాటడమే దాసుని యొక్క అసలైన పని. ఇందులో అతను ఎంత వెనక ఉంటే అంతే అతనికి నష్టం జరుగుతుంది, యజమానికి ఏ నష్టం జరగదు. అందుకొరకే ఒక మన తెలుగు కవి ఏం చెప్తున్నాడు?
ఉన్నత చదువులు ఎన్ని చదివినా ఫలము ఉండబోదురా, ఉన్నత చదువులు ఎన్ని చదివినా ఫలము ఉండబోదురా, సృష్టికర్తను గ్రహించలేని డిగ్రీలన్నీ వ్యర్థమురా, నీ డిగ్రీలన్నీ వ్యర్థమురా, నీ డిగ్రీలన్నీ వ్యర్థమురా.
సృష్టికర్తను గ్రహించాలి. ఆ సృష్టికర్తనే మనం స్తుతిస్తూ ఉండాలి, అతన్నే పొగడుతూ ఉండాలి.
సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఎల్లవేళల్లో మనం అల్లాహ్ యొక్క ఆరాధన కొరకే పుట్టించబడ్డాము. అయితే ఇక మనకు వేరే పనులు వద్దా? ఈ లోకంలో జీవిస్తున్నామంటే వేరే ఎన్నో పనులు కూడా ఉంటాయి. మాటిమాటికి అల్లాహ్ నే ఆరాధించుకుంటూ ఎలా ఉండగలుగుతాము అని కొందరు చికాకుగా అడ్డ ప్రశ్న వేస్తారు. కానీ ఇస్లాం ధర్మాన్ని కొంచెం లోతు జ్ఞానంతో, మంచి విధంగా అర్థం చేసుకుంటూ చదివారంటే మన జీవితంలోని ప్రతి క్షణం మనం ఆరాధనలో ఉన్నట్లు, మన జీవితంలోని ప్రతి క్షణం అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ ను గుర్తిస్తూ ఉన్నట్లు చేసుకోగలము. కానీ ఈ భాగ్యం ఎవరికి కలుగుతుంది? ఎవరికి కలుగుతుంది? ఎవరు ఎంత ఎక్కువ ఇస్లాం జ్ఞానం నేర్చుకుంటారో అంతే ఎక్కువగా వారు తమ ప్రతి విషయాన్ని అల్లాహ్ యొక్క ఆరాధన, ప్రతి ఘడియను అల్లాహ్ యొక్క స్మరణలో గడపగలుగుతారు. వారు ఏ పని చేస్తూ ఉన్నా గానీ, ఏదైనా కంపెనీలో పని చేస్తూ ఉన్నా, ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఏదైనా వ్యవసాయంలో ఉన్నా, బజార్లో ఉండి ఏమైనా సామానులు అమ్ముతూ ఉన్నా, చివరికి నిద్రపోతూ ఉన్నా గానీ. అవునా? అవును. ముఆద్ బిన్ జబల్ రదియల్లాహు తాలా అన్హు ఏమంటున్నారు? ఇన్నీ అహ్‌తసిబు నౌమతీ కమా అహ్‌తసిబు కౌమతీ. నేను రాత్రి మేల్కొని అల్లాహ్ ఎదుట నిలబడి తహజ్జుద్ చేస్తూ ఉండి, అహ్‌తసిబు (పుణ్యం ప్రాప్తించాలని కోరుతూ ఉంటానో), అహ్‌తసిబు నౌమతీ (నేను పడకపై పడుకొని నిద్రిస్తూ కూడా దీనికి బదులుగా అల్లాహ్ నాకు పుణ్యం ప్రసాదించాలి, ప్రసాదిస్తాడు అన్నటువంటి ఆశ కలిగి, నమ్మకం కలిగి ఉంటాను).
అవును మరి. ఎవరైతే టైం మేనేజ్మెంట్ ఏ కాదు ఈనాటి పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులలో వినేది, స్వయం తన క్షణ క్షణాన్ని అల్లాహ్ యొక్క స్మరణలో, అల్లాహ్ యొక్క ధిక్ర్ లో, అల్లాహ్ యొక్క ఆరాధనలో ఎలా గడపగలను అన్నది నేర్చుకోవాలి. తాను చేస్తున్న ప్రతిదీ కూడా అల్లాహ్ స్మరణ, అల్లాహ్ యొక్క ఆరాధన అయిపోవాలి. ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి.
ఎందుకంటే ముస్లిం అని ఏదైతే మనం అంటామో దాని భావమే ఏంటి? విధేయుడు. అయితే విధేయత ఏదో ఒక్క సందర్భంలో కాదు, ఎల్లవేళల్లో ఉండాలి. నీవు ఎక్కడ ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఏ పనిలో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు అది నీ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క విధేయతలో ఉంటే నీవు అతని ఆరాధనలో ఉన్నట్లే, అతని స్మరణలో ఉన్నట్లే.
ఈ విధంగా ఎవరైతే అల్లాహ్ యొక్క స్మరణలో ఉంటారో వారికి ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు వారిపై వచ్చిపడినా అల్లాహ్ యొక్క స్మరణ నుండి వారు దూరం కాలేరు. ఒక విషయం ఆలోచించండి, సుఖంగా హాయిగా జీవిస్తున్నారు అని మనం కొందరి గురించి అనుకుంటాము. ఏ విషయం చూసి? అతని వద్ద ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ని చూసి, అతని వద్ద ఉన్న బిల్డింగ్లను చూసి, అతని వద్ద ఉన్న కార్లను చూసి, అతని వద్ద ఉన్నటువంటి ధన సంపద, ఈ లోకపు కొన్ని సౌకర్యాలు. అరే వానికేం బాధరా భాయ్, ఎంత ధరలు పెరిగినా గానీ బోలెడంత డబ్బు ఉన్నది వానికి, వాడు హాయిగా బతుకుతాడు. ఈ విధంగా మనం అనుకుంటాము. కానీ ఒకవేళ అతను అల్లాహ్ స్మరణలో లేకుంటే, తన జీవితాన్ని అల్లాహ్ యొక్క విధేయతలో గడపకుంటే అతడు ఈ సౌకర్యం సౌకర్యం కాదు, ఈ సుఖం సుఖం కాదు, ఇది వాస్తవానికి చాలా చాలా బాధాకరమైన జీవితం.
ఇక సోదర మహాశయులారా, ఈ ధిక్ర్ యొక్క అంశం కూడా, అల్లాహు అక్బర్, చాలా విశాలంగా ఉంది. ఎందుకంటే ప్రతీది కూడా ధిక్ర్ లో రావచ్చు. లా ఇలాహ ఇల్లల్లాహ్ ధిక్ర్. నమాజ్ కూడా ధిక్ర్. ప్రతి ఆరాధన అల్లాహ్ యొక్క ధిక్ర్. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ధిక్ర్ ను రెండు రకాలుగా అర్థం చేసుకోవడానికి సులభ రీతిలో విభజించి నేను చెబుతున్నాను. ఒకటి ఏమిటి? ధిక్ర్ అంటే స్మరించడం, గుర్తు చేయడం, మరిచిపోకుండా ఉండడం. ఈ భావాలు వస్తాయి ధిక్ర్ అన్న అరబీ పదానికి. అయితే అల్లాహ్ యొక్క ధిక్ర్ చేస్తూ ఉండాలి అని అంటే ఏంటి? మనం ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో, ఏ స్థితిలో ఉంటామో అక్కడ ఆ సమయంలో, ఆ స్థితిలో, ఆ సందర్భంలో అల్లాహ్ యొక్క ఏ ఆదేశం ఉన్నది, ప్రవక్త వారి ఏ విధానం ఉన్నది తెలుసుకొని ఆ రకంగా చేయడం, పాటించడం ఇది అల్లాహ్ యొక్క ధిక్ర్. ఇది ఒక సామాన్య భావంలో, ఓకేనా? ఇక రెండవది, మనం అల్లాహ్ ను గుర్తు చేస్తూ కూర్చుంటూ, లేస్తూ అన్ని సందర్భాల్లో అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్ అని అనడం. ఉదాహరణకు, ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడు బిస్మిల్లాహ్. ఏదైనా తిన్న తర్వాత, తాగిన వెంటనే అల్హమ్దులిల్లాహ్. ఏదైనా శుభవార్త మనకు దొరికింది, మాషా అల్లాహ్. ఏదైనా పని పూర్తయింది, అల్హమ్దులిల్లాహ్. ఏదైనా బాధాకరమైన వార్త మనకు వచ్చింది, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఆశ్చర్యకరమైన ఏదైనా విషయం మనకు తెలిసింది, సుబ్హానల్లాహ్. ఎవరి గురించైనా, ఎక్కడైనా ఏదైనా గొప్ప విషయాలు చెప్పుకుంటూ విన్నాము, అల్లాహు అక్బర్. మనం ఏదైనా సహాయం కోరాలనుకున్నాము, లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. మనం అల్లాహ్ ను స్తుతించి పుణ్యాలు సంపాదించుకోవాలనుకుంటున్నాము, సుబ్హానల్లాహి వబిహమ్దిహ్. మన యొక్క పుణ్యాల త్రాసు బరువుగా కావాలని కోరుతున్నాము, సుబ్హానల్లాహి వబిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీమ్. పాపాలు ఎక్కువగా ఉన్నాయి, బాధ కలుగుతుంది, అవన్నీ కూడా తొలగిపోవాలని కాంక్ష ఉంది, లా ఇలాహ ఇల్లల్లాహ్. ఏదైనా బాధగా ఏర్పడుతుంది, కష్టాల్లో ఉన్నారు అవి తొలగిపోవాలి, దూరం అయిపోవాలి, లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్జాలిమీన్. ఈ విధంగా మనం అలవాటు చేసుకోవాలి. కూర్చుంటూ, లేస్తూ అన్ని సందర్భాల్లో.
ఒక్కసారి మీరు సూరత్ ఆలె ఇమ్రాన్. సూర ఆలె ఇమ్రాన్ చివరి కంటే కొంచెం ముందు, కొన్ని ఆయతుల ముందు ఈ రెండు ఆయతులను గనుక మీరు శ్రద్ధ వహించారంటే ఎంత గొప్ప శుభవార్త ఇందులో ఉందో ఒక్కసారి మీరు చూడండి. అల్లాహు తాలా ఇలాంటి శుభవార్త ఇస్తున్నాడు.
الَّذِينَ يَذْكُرُونَ اللَّهَ قِيَامًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِهِمْ وَيَتَفَكَّرُونَ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ رَبَّنَا مَا خَلَقْتَ هَٰذَا بَاطِلًا سُبْحَانَكَ فَقِنَا عَذَابَ النَّارِ అల్లజీన యజ్కురూనల్లాహ కియామవ్ వ కుఊదవ్ వ అలా జునూబిహిమ్ వ యతఫక్కరూన ఫీ ఖల్కిస్ సమావాతి వల్ అర్ద్, రబ్బనా మా ఖలఖ్త హాజా బాతిలా, సుబ్హానక ఫకినా అజాబన్నార్. వారు నిలుచుని, కూర్చుని, తమ పడకలపై ఒత్తిగిలి అల్లాహ్ ను స్మరిస్తూ ఉంటారు. వీరే నిజమైన విజ్ఞులు, బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, ఇలాంటి వారే అల్లాహ్ ను అన్ని స్థితుల్లో స్మరిస్తూ, గుర్తు చేస్తూ, అల్లాహ్ యొక్క ధ్యానంలో ఉంటూ తమ జీవితం గడుపుతారు కదా, భూమి ఆకాశాల సృష్టి గురించి యోచన చేస్తూ ఉంటారు. వారు ఇలా అంటారు, “మా ప్రభువా, నువ్వు ఈ సృష్టిని నిరర్థకంగా చేయలేదు. సుబ్హానక్, నువ్వు పవిత్రుడవు. మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు.”
ఇక్కడ మీరు గమనించారు కదా? వారు నిలుచుని, కూర్చుని, తమ పడకలపై ఒత్తిగిలి అల్లాహ్ ను స్మరిస్తూ ఉంటారు. అల్లాహ్ ను ఎప్పుడెప్పుడు స్మరించాలి? అన్ని స్థితుల్లో స్మరిస్తూ ఉండాలి అన్నటువంటి గొప్ప విషయం ఇందులో మనకు తెలిసినది. అర్థమైంది కదా?
ఇక ఈ ధిక్ర్ మనం ఎల్లవేళల్లో చేస్తూ ఉంటే మనకు ఏంటి లాభం కలుగుతుంది? అల్లాహు అక్బర్. నేను కొన్ని లాభాలు ఇంతకు ముందే మీకు చెప్పాను కొన్ని పదాలు చెప్తూ చెప్తూ. ఇందులో అతి గొప్ప విషయం మీరు గమనించాల్సింది, అదేమిటి? ముస్నద్ అహ్మద్ లో వచ్చిన హదీస్, షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు 134 హదీస్ నెంబర్. నూహ్ అలైహిస్సలాం వారి యొక్క వసియత్, వాంగ్మూలం తన కుమారుడికి ఏముండినది? ఆయన చెప్పారు, నేను లా ఇలాహ ఇల్లల్లాహ్ గురించి నిన్ను ఆదేశిస్తున్నాను, నీవు లా ఇలాహ ఇల్లల్లాహ్ అధికంగా చదువుతూ ఉండు. ఎందుకు? దీని ఘనత, దీని యొక్క గొప్పతనం, దీని యొక్క ప్రాముఖ్యత ఎంతగా ఉన్నదంటే, ఏడు ఆకాశాలు, ఏడు భూమిలు త్రాసులోని ఒక పల్లెంలో పెట్టబడి, లా ఇలాహ ఇల్లల్లాహ్ ను మరో పల్లెంలో ఇది త్రాసు యొక్క రెండు పల్ల్యాలు ఉంటాయి కదా, ఒక వైపున ఏడు ఆకాశాలు, ఏడు భూములు, మరోవైపున కేవలం లా ఇలాహ ఇల్లల్లాహ్ పెట్టబడితే లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నది చాలా బరువుగా అయిపోతుంది. అంతేకాదు, లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క ఘనత, ప్రాముఖ్యత గురించి ఇంకా ఏం చెప్పారు? ఏడు ఆకాశాలు, ఏడు భూములు ఒక రింగ్ మాదిరిగా, ఎలాంటి రింగ్? చాలా బలమైన, గట్టి. లా ఇలాహ ఇల్లల్లాహ్ దానిని విరగ్గొట్టగలిగేంతటి శక్తి కలదు. అల్లాహు అక్బర్ చూస్తున్నారా? ఆ తర్వాత సుబ్హానల్లాహి వబిహమ్దిహి గురించి ఏం చెప్పారో చూడండి. సుబ్హానల్లాహి వబిహమ్దిహి ఇది కూడా అధికంగా నీవు చదువుతూ ఉండు, దీని గురించి నేను నిన్ను ఆదేశిస్తున్నాను. ఇది ఈ సృష్టిలోని ప్రతి వస్తువు యొక్క ఇబాదత్, ప్రతి వస్తువు యొక్క ఆరాధన. ఈ విషయం మీకు ఖురాన్ లో తెలుస్తుందా?
وَإِن مِّن شَيْءٍ إِلَّا يُسَبِّحُ بِحَمْدِهِ وَلَٰكِن لَّا تَفْقَهُونَ تَسْبِيحَهُمْ వఇమ్ మిన్ షైఇన్ ఇల్లా యుసబ్బిహు బిహమ్దిహి వలాకిల్ లా తఫ్కహూన తస్బీహహుమ్. ఆకాశాలు, భూములు అన్నీ కూడా అల్లాహ్ యొక్క స్తుతి, అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడుతున్నాయి. వాటిలో ఉన్న ప్రతీది కూడా సుబ్హానల్లాహి వబిహమ్దిహి అని అంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ హదీస్ లో ఇదే విషయం వచ్చింది. నూహ్ అలైహిస్సలాం తన కొడుక్కు చెప్పారు, “సుబ్హానల్లాహి వబిహమ్దిహి ప్రతి సృష్టిలోని ప్రతీ దాని యొక్క సలాహ్. దీని ద్వారా ఈ సృష్టిలోని ప్రతి ఒక్కరికి సుబ్హానల్లాహి వబిహమ్దిహి అనడం ద్వారానే వారికి వారి యొక్క ఉపాధి, వారి యొక్క ఆహారం లభిస్తున్నది.” అందుకొరకే అల్లాహ్ యొక్క ధిక్ర్ అధికంగా చేస్తూ ఉండాలి. ఈ రోజుల్లో మనం ఏమనుకుంటాము? నాకు మంచి ఉద్యోగం ఉంటేనే నా ఉపాధి, నాకు నా మంచి ఆ వ్యవసాయం ఉంటేనే ఉపాధి. ఇవన్నీ బాహ్యమైన సాధనాలు. వీటిలో హలాల్ ఏవో వాటిని మనం పాటించాలి. కానీ ఉత్తమమైన ఉపాధి లభించడానికి బాహ్యంగా కనబడని ఎన్నో, ఎన్నో సాధనాలు ఉంటాయి. వాటిలో అతి గొప్పది, అతి ముఖ్యమైనది అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ యొక్క ధిక్ర్.
సోదర మహాశయులారా, మన రోజువారీ జీవితంలోని ధిక్ర్ లలో కొన్ని ఘనతలు మీరు చూడండి. ఈ విషయాలను మనం ఒకవేళ గ్రహించామంటే ప్రతిరోజు మనం అల్లాహ్ యొక్క ధిక్ర్ ఇంకా అధికంగా చేస్తూ ఉండగలము. అధికంగా చేస్తూ ఉండగలము. ఉదాహరణకు, ఉదయం సాయంకాలం చదివే దువాలలో ఒక దువా ఉంది,
اللَّهُمَّ إِنِّي أَصْبَحْتُ أُشْهِدُكَ وَأُشْهِدُ حَمَلَةَ عَرْشِكَ وَمَلَائِكَتَكَ وَجَمِيعَ خَلْقِكَ أَنَّكَ أَنْتَ اللَّهُ لَا إِلَهَ إِلَّا أَنْتَ وَأَنَّ مُحَمَّدًا عَبْدُكَ وَرَسُولُكَ అల్లాహుమ్మ ఇన్నీ అస్బహ్తు ఉష్హిదుక వ ఉష్హిదు హమలత అర్షిక వ మలాయికతక వ జమీఅ ఖల్కిక అన్నక అంతల్లాహు లా ఇలాహ ఇల్లా అంత వ అన్న ముహమ్మదన్ అబ్దుక వ రసూలుక. ఉదయం చదివినప్పుడు “అల్లాహుమ్మ ఇన్నీ అస్బహ్తు” అని అంటారు. సాయంకాలం చదివినప్పుడు “అల్లాహుమ్మ ఇన్నీ అమ్సైతు” అని అంటారు. ఈ దువా చదవడం ద్వారా లాభం ఏంటి? ఈ దువా ఉదయం చదివినట్లయితే వారి యొక్క పగలంతా జరిగిన పాపాలు మన్నించబడతాయి. సాయంకాలం చదివిన ఈ దువా ఎవరైతే నాలుగు సార్లు చదివేది ఉంటే వారిని నరకాగ్ని నుండి రక్షణ కల్పించడం జరుగుతుంది.
సోదర మహాశయులారా, మన రోజువారీ జీవితంలో అల్లాహ్ యొక్క ధిక్ర్ లో ఉదయం, సాయంకాలం కొన్ని అజ్కార్లు వేరువేరుగా ఉన్నాయి మరియు ఎక్కువ శాతం ఉదయం, సాయంకాలం రెండు సందర్భాల్లో చదివేటివి ఉన్నాయి. ఒక దువా వస్తుంది,
أَعُوذُ بِكَلِمَاتِ اللَّهِ التَّامَّاتِ مِنْ شَرِّ مَا خَلَقَ అఊజు బికలిమాతిల్లాహిత్ తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్. మూడు సార్లు ఎవరైతే దీనిని చదువుతారో వారికి రాత్రి ఏ విష పురుగు హాని కలిగించదు అని ముస్లిం షరీఫ్ లో వచ్చిన హదీస్. గమనించండి ఎంత గొప్ప పుణ్యం ఇందులో, ఎంత గొప్ప లాభం ఉంది ఇందులో. అలాగే ఉదయం మూడు సార్లు, సాయంకాలం మూడు సార్లు
بِسْمِ اللَّهِ الَّذِي لَا يَضُرُّ مَعَ اسْمِهِ شَيْءٌ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ బిస్మిల్లాహిల్లజీ లా యదుర్రు మఅస్మిహి షైఉన్ ఫిల్ అర్ది వలా ఫిస్సమాఇ వహువస్ సమీఉల్ అలీమ్. చదివేది ఉంటే వారికి ఏదీ కూడా నష్టం పరచదు అని మనకు హదీస్ ద్వారా తెలుస్తుంది.
సోదర మహాశయులారా,
لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌దహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్. ఇది ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత చదివేది ఉంది. ఉదయం, సాయంకాలం చదివేది ఉంది. ఇన్షా అల్లాహ్ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక దర్సు కూడా మనం పెట్టే ప్రయత్నం చేద్దాము. కొన్ని సందర్భాల్లో చదివే దాంట్లో కొన్ని పదాలు ఎక్కువగా కూడా ఉన్నాయి, దాని ప్రకారంగా వాటి యొక్క ఘనతలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ సందర్భంలో మీరు అల్లాహ్ యొక్క ధిక్ర్ లలో ఫర్జ్ నమాజ్ తర్వాత మనం పది పది సార్లు సుబ్హానల్లాహ్, పది సార్లు అల్హమ్దులిల్లాహ్, పది సార్లు అల్లాహు అక్బర్ లేదా 33 సార్లు సుబ్హానల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్, ఒక్కసారి లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్. ముస్లిం షరీఫ్ లో వచ్చిన హదీస్ ఏమిటి? ఎవరైతే 33, 33, 33 తర్వాత లా ఇలాహ ఇల్లల్లాహ్ ఒక్కసారి చదివి వంద పూర్తి చేస్తారో వారి యొక్క పాపాలు సముద్రపు నురుగంత ఉన్నా గానీ అవి మన్నించబడతాయి. ఎంత గొప్ప అదృష్టం గమనిస్తున్నారా మీరు? అలాగే సోదర మహాశయులారా, పది సార్లు, పది సార్లు, పది సార్లు చదవడం ఫర్జ్ నమాజ్ ల తర్వాత. దీని ఘనత నమాజ్ నిధులు అనేటువంటి మా వీడియోలో చెప్పడం జరిగినవి. మీరు జీడీకే ఎన్ఎస్సిఆర్ఈ యూట్యూబ్ ఛానల్ లో వెళ్లి నమాజ్ నిధులు అన్నది చూడండి. సుమారు దాంట్లో 10వ వీడియో, 10వ ఎపిసోడ్. మీకు అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసినంత, ఉమ్రా చేసినంత, హజ్ చేసినంత, అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత పది పది సార్లు మీరు సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ అంటూ ఉంటే, ఎంత గొప్ప ఘనతనో గమనించండి.
ఇంకా సోదర మహాశయులారా, ఈ పది పది సార్లు చదవడం ద్వారా దీని గురించి సహీహ్ హదీస్ ఒకటి అబూ దావూద్ లో కూడా వచ్చి ఉంది. మనం పది పది సార్లు చదివితే 30 అవుతాయి, ఐదు నమాజ్ లలో కలిపితే 150 అవుతాయి, కానీ త్రాసులో ప్రళయ దినాన 1500 పుణ్యాలు లభిస్తాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారు.
సోదర మహాశయులారా, మనం ఎప్పుడైతే నమాజ్ లో వచ్చి నిలబడతామో సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అని చదువుతామో ఆకాశపు ద్వారాలు తెరవబడతాయి అని సహీహ్ ముస్లిం లో వచ్చి ఉంది. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు అంటున్నారు, ప్రవక్తతో నేను ఈ హదీస్ విన్నప్పటి నుండి నా నమాజ్ ఆరంభంలో నేను ఇదే చదువుతాను అని. గమనిస్తున్నారా? ఈ విధంగా అల్లాహ్ యొక్క స్మరణలో చాలా చాలా లాభాలు ఉన్నాయి. అందుకొరకే అల్లాహు తాలా మీరు అధికంగా అల్లాహ్ యొక్క ధిక్ర్ చేయండి అని చెప్పాడు. మరియు ఏ నమాజ్ లో ఎక్కువగా అల్లాహ్ యొక్క ధిక్ర్ ఉంటుందో ఆ నమాజ్ యొక్క సవాబ్, ఆ నమాజ్ యొక్క పుణ్యం పెరిగిపోతుంది. ఏ ఉపవాసంలో అల్లాహ్ యొక్క ధిక్ర్ ఎక్కువ ఉంటుందో ఆ ఉపవాస పుణ్యం అనేది అందరికంటే ఎక్కువగా ఉంటుంది. ఏ హజ్ లో అల్లాహ్ యొక్క ధిక్ర్ ఎక్కువగా ఉంటుందో ఆ హజ్ లో, ఆ హజ్ యొక్క పుణ్యం చాలా ఎక్కువగా ఉంటుంది.
చివరిలో ఒక రెండు విషయాలు తెలుసుకొని సమాప్తం చేద్దాము. అదేమిటంటే అధికంగా అల్లాహ్ యొక్క ధిక్ర్ చేయడం ఇది విశ్వాసుల ఉత్తమ గుణం. ధిక్ర్ లో వెనక అయి ఉండడం, ధిక్ర్ లో బద్ధకం వహించడం ఇది మునాఫికుల గుణం. మునాఫికులు అల్లాహ్ యొక్క ధిక్ర్ చేయడంలో చాలా బద్ధకం వహిస్తారు అని అల్లాహు తాలా స్పష్టంగా ఖురాన్ లో తెలిపాడు. అల్లాహు తాలా ఖురాన్ లో తెలిపాడు. అయితే అలాంటి ఆ బద్ధకం వహించే మునాఫికులలో మనం ఏ మాత్రం చేరకూడదు. మనం ఏ మాత్రం చేరకూడదు. సూరత్ నిసా ఆయత్ నెంబర్ 142. మీకు కూడా నేను ఒకసారి చూపిస్తున్నాను, శ్రద్ధగా చూసి ఆ మునాఫికుల లిస్టులో నుండి తమను తాము బయటికి ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
إِنَّ الْمُنَافِقِينَ يُخَادِعُونَ اللَّهَ وَهُوَ خَادِعُهُمْ وَإِذَا قَامُوا إِلَى الصَّلَاةِ قَامُوا كُسَالَىٰ يُرَاءُونَ النَّاسَ وَلَا يَذْكُرُونَ اللَّهَ إِلَّا قَلِيلًا ఇన్నల్ మునాఫికీన యుఖాదిఊనల్లాహ వహువ ఖాదిఉహుమ్, వఇజా కామూ ఇలస్సలాతి కామూ కుసాలా యురాఊనన్నాస వలా యజ్కురూనల్లాహ ఇల్లా కలీలా. నిశ్చయంగా కపటులు అల్లాహ్ ను మోసం చేయజూస్తున్నారు. అయితే అల్లాహ్ వారి మోసానికి శిక్ష విధించనున్నాడు. వారు నమాజ్ కోసం నిలబడినప్పుడు ఎంతో బద్ధకంతో కేవలం జనులకు చూపే ఉద్దేశంతో నిలబడతారు, ఏదో నామమాత్రంగా దైవాన్ని స్మరిస్తారు. వారు చాలా తక్కువగా అల్లాహ్ యొక్క స్మరణ చేస్తారు. నామమాత్రంగా అల్లాహ్ ని స్మరిస్తారు.
ఇలాంటి వారిలో మనం కలవకూడదు. ఇలాంటి ఈ భావం ఒకటి అక్కడ సూరత్ తౌబాలో కూడా చెప్పడం జరిగింది. సూరత్ తౌబాలో కూడా ఇలాంటి ఒక భావం వచ్చి ఉంది. అయితే సోదర మహాశయులారా, అల్లాహ్ యొక్క ధిక్ర్ అన్నది మనం ఉదయం మేల్కొని అల్హమ్దులిల్లాహిల్లజీ అహ్యానా బాదమా అమాతనా వఇలైహిన్నుషూర్ నుండి మొదలుకొని పొద్దంతలో అనేక సందర్భాల్లో చివరికి మళ్ళీ పడకపై వెళ్లే వరకు ప్రతి సమయం, ప్రతి సందర్భం, ప్రతి స్థితిలో ఉంది. యుద్ధ మైదానంలో శత్రువులు ఒకరిపై ఒకరు అక్కడ తూటలు వదులుకుంటూ, బాణాలు విసురుకుంటూ, రక్త సిక్తం అయ్యే సందర్భంలో కూడా అల్లాహ్ ఏమన్నాడు? మీరు ఒక వర్గాన్ని కలిసి యుద్ధంలో వారితో పోరాటంలో ఉన్నప్పుడు కూడా ధైర్యంగా స్థిరంగా ఉండండి, వెనుదిరగకండి మరియు అల్లాహ్ ను అధికంగా స్మరించండి. గమనించండి, అలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా అల్లాహు తాలా స్మరణ చేయడం నుండి మనకు మినహాయింపు ఇవ్వలేదంటే వేరే ఏ సందర్భంలో ఉంటుంది? అజాన్ తర్వాత కూడా ధిక్ర్ ఉంది, ఇంకా అనేక వజూ తర్వాత ఉంది, మస్జిద్ లో ప్రవేశించే సందర్భంలో ఉంది, రాత్రి వేళ ఉంది, రుకూలో, సజ్దాలో, కునూతులో, సలాం తింపిన తర్వాత, మయ్యిత్ కొరకు అలాగే ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మనం చిన్నపాటి జేబులో ఉండేటువంటి పుస్తకాలు గానీ లేదా మన మొబైల్ లో చిన్నపాటి రెయిన్బో వల్ల ముఖ్యమైన దువాలు ఇలాంటి పీడీఎఫ్ గానీ పెట్టుకొని మనం అల్లాహ్ యొక్క స్మరణ అధికంగా చేస్తూ ఉన్నామంటే మనకు ఇహపరలోకాల్లో మేల్లే మేలు కలుగుతాయి.
చివరిలో ఒక హదీస్ యొక్క భావం, ఇక నేను అది చూపించి మళ్ళీ ఇంకా ఆలస్యం చేయను, హదీస్ భావం చెప్పి సమాప్తం చేస్తాను. అదేమంటే ఎవరైతే ఈ లోకంలో ఎక్కడైనా కూర్చుంటారో లేదా ఏదైనా ఎక్కడైనా నడుస్తారో లేదా ఎక్కడైనా ఇలా వెల్లకిలా పడుకుంటారో, అక్కడ అల్లాహ్ ను స్మరించలేదు, అల్లాహ్ ను స్తుతించలేదు, అల్లాహ్ యొక్క సత్య ప్రవక్తపై దరూద్ చేయలేదు, చదవలేదు అంటే ఆ సమయం, ఆ ఘడియ, ఆ పడుకోవడం, ఆ నడవడం, ఆ కూర్చోవడం ఇదంతా కూడా వారి కొరకు ప్రళయ దినాన పశ్చాత్తాప భావంగా చాలా నష్టకరంగా ఉంటుంది. అక్కడ ఈ నష్టాన్ని తీర్చుకోవడానికి వేరే ఏ సాధనం ఉండదు. ఇలాంటి సమయం రాకముందే ఇక్కడే బుద్ధి జ్ఞానాలు నేర్చుకొని అల్లాహ్ ను అధికంగా స్మరించే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
(ఆడియోలో కనిపించే హదీస్ యొక్క అనువాదం)
ఈ హదీస్ చూస్తున్నారు. దీనిని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. కేవలం అనువాదం నేను చెబుతున్నాను శ్రద్ధ వహించండి. అబూ దర్దా రదియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి సహాబాలతో అడిగారు, “నేను మీకు తెలియజేయనా, మీ కర్మల్లో అతి ఉత్తమమైనవి, అల్లాహ్ కు ఎక్కువగా ఇష్టమైనది, మీ యొక్క చక్రవర్తి అయిన అల్లాహ్ కు ఎక్కువగా ఇష్టమైనది, అంటే అల్లాహ్ కు ఎక్కువ ఇష్టమైన మరియు అల్లాహ్ వద్ద మీ కర్మల్లో అత్యంత ఉత్తమమైనది, మీ యొక్క స్థానాలను చాలా పైకి చేసే ఎత్తు చేసే రెట్టింపు చేసేటువంటిది, మరియు మీరు వెండి బంగారాలను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం కంటే కూడా ఉత్తమమైనది. అంతేకాదు ఇంకా, ఇంకా ఉంది. మీరు మీ శత్రువులను కలిసి, మీరు వారి మెడలను నరకడం, వారు మీ మెడలను నరకడం కంటే కూడా ఉత్తమం.” అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్క విషయం గురించి చెప్పాలనుకుంటున్నారు, కానీ ఎన్ని విషయాల కంటే ఉత్తమమైనదో గమనించండి. సర్వ కర్మల్లో ఉత్తమమైనది, అల్లాహ్ కు చాలా ప్రసన్నతమైనది, స్థానాలను రెట్టింపు చేయునది, మరియు వెండి బంగారం ఖర్చు చేయడం కంటే కూడా ఉత్తమమైనది, శత్రువులను కలిసి వారు మెడలు నరకడం మనం వారి మెడలను మెడలను నరకడం కంటే కూడా ఉత్తమమైనది. ఏంటి? అల్లాహ్ యొక్క ధిక్ర్. అల్లాహ్ యొక్క ధిక్ర్. చూశారా? ఇంత గొప్ప ఘనత. ఈ ఘనతను మనం మరియు ఇది చాలా సులభమైనది కూడా. ధిక్ర్ చేయడానికి మనకు వజూ అవసరం ఉండదు. ధిక్ర్ చేయడానికి మనకు నిలబడాలి, ఖిబ్లా దిశలో ఉండాలి ఇట్లాంటి ఏ కండిషన్లు లేవు. అందుకొరకే ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సబకల్ ముఫర్రిదూన్ అని చెప్పారు. అంటే అల్లాహ్ యొక్క ధిక్ర్ అధికంగా చేసేవారు చాలా చాలా చాలా అందరికంటే ముందుగా దూసుకెళ్లారు అని. అందుకొరకే మరొక హదీస్ లో ఉంది, మనిషిని అల్లాహ్ యొక్క శిక్ష నుండి కాపాడేది అల్లాహ్ యొక్క ధిక్ర్ కంటే గొప్ప విషయం మరొకటి వేరేదేమీ లేదు అని.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి బులూగుల్ మరాం | హదీస్ 1237 https://youtu.be/ScQ39BtR9Fg [13 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
1237. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు`;
“ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి. ఇదే మీ కొరకు శ్రేయస్కరం. (ఎందుకంటే మీరిలా చేసినపుడు) అల్లాహ్ యొక్క ఏ అనుగ్రహం కూడా మీ దృష్టిలో అల్పంగా ఉండదు.” (బుఖారి , ముస్లిం)
సారాంశం:
అల్లాహ్ ను విశ్వసించే వ్యక్తిలో సతతం తృప్తి, కృతజ్ఞతా భావం ఉండాలని ఈ హదీసు చెబుతోంది. ప్రాపంచికంగా తనకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారిని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మనసులో అసూయాద్వేషాలు జనిస్తాయి. ఏ విధంగానయినా ఎదుటి వారిని మించిపోవాలన్న పేరాశ పుట్టుకు వస్తుంది. మరి ఈ ప్రాపంచిక లక్ష్యం కోసం అతడు ఎంతకైనా తెగిస్తాడు. ధర్మమార్గాన్ని పరిత్యజిస్తాడు. దీనికి బదులు మనిషి ఆర్థికంగా తనకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూసినపుడు అల్లాహ్ పట్ల అతనిలో కృతజ్ఞతాభావం జనిస్తుంది. పేదలపట్ల దయ, జాలి ప్రేమ వంటి సకారాత్మక భావాలు పెంపొందుతాయి. వాళ్ల మంచీచెబ్బరల పట్ల అతను శ్రద్ధ వహించటం మొదలెడతాడు. పర్యవసానంగా సమాజంలోని ప్రజల దృష్టిలో కూడా అతనొక దయాశీలిగా, సత్పౌరునిగా ఉంటాడు
—
ఈ ప్రసంగంలో, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ఒక ముఖ్యమైన హదీద్ వివరించబడింది. ప్రాపంచిక విషయాలలో మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూడటం ద్వారా అల్లాహ్ మనకు ప్రసాదించిన అనుగ్రహాల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. అదే సమయంలో, ధార్మిక విషయాలలో మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారిని చూసి, వారిలా పుణ్యకార్యాలలో పురోగమించడానికి ప్రయత్నించాలని సూచించారు. ఈ సూత్రం అసూయ, అసంతృప్తి వంటి సామాజిక రుగ్మతలకు విరుగుడుగా పనిచేస్తుందని వక్త నొక్కి చెప్పారు. సోషల్ మీడియా ప్రభావంతో ఇతరుల ఐశ్వర్యాన్ని చూసి అసంతృప్తికి లోనవ్వకుండా, పేదవారిని, అవసరమైన వారిని చూసి మనకున్నదానిపై సంతృప్తి చెంది, అల్లాహ్ పట్ల కృతజ్ఞతతో జీవించాలని ఆయన ఉద్భోదించారు. ఈ రెండు గుణాలు (కృతజ్ఞత మరియు సహనం) ఉన్నవారిని అల్లాహ్ తన ప్రత్యేక దాసుల జాబితాలో చేర్చుతాడని కూడా వివరించారు.
انْظُرُوا إِلَى مَنْ هُوَ أَسْفَلَ مِنْكُمْ (ఉన్ జురూ ఇలా మన్ హువ అస్ ఫల మిన్కుమ్) మీరు ఎల్లప్పుడూ మీకన్నా క్రింది స్థాయిలో ఉన్న వారిని మాత్రమే చూడండి.
وَلَا تَنْظُرُوا إِلَى مَنْ هُوَ فَوْقَكُمْ (వలా తన్ జురూ ఇలా మన్ హువ ఫౌఖకుమ్) మీకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వారి వైపు చూడకండి.
فَهُوَ أَجْدَرُ أَنْ لَا تَزْدَرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ (ఫహువ అజ్ దరు అల్ లా తజ్ దరూ ని’మతల్లాహి అలైకుమ్) మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని మీరు అల్పదృష్టితో చూడకుండా ఉండడానికి ఇదే ఉత్తమ మార్గం.
ఏంటి దీని భావం? హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు. ఎల్లప్పుడూ, మీరు ఎల్లప్పుడూ మీకన్నా క్రింది స్థాయిలో ఉన్న వారిని మాత్రమే చూడండి. మీరు ప్రాపంచిక సిరిసంపదల రీత్యా మీకన్నా తక్కువ స్థితిలో ఉన్నవారి వైపు చూడండి, అంతేగాని మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్నవారి వైపు చూడకండి. గమనిస్తున్నారు కదా? హదీద్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్నారో వారి వైపు చూడండి. ఎక్కువ స్థాయిలో ఉన్నారో వారి వైపుకు చూడకండి. మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని మీరు అల్పదృష్టితో చూడకుండా ఉండడానికి ఇదే ఉత్తమ మార్గం.
ఇక ఒకవేళ మీరు హదీద్ లోని అరబీ పదాలు అర్థం చేసుకోవాలి శ్రద్ధగా అంటే చూడండి ఇక్కడ, ఉన్ జురూ – మీరు చూడండి. ఇలా మన్ హువ అస్ ఫల మిన్కుమ్ – మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి వైపున. వలా తన్ జురూ – చూడకండి. ఇలా మన్ హువ ఫౌఖకుమ్ – ఎవరైతే పై స్థాయిలో ఉన్నారో. ఫహువ అజ్ దరు – ఇదే ఉత్తమ విధానం, ఉత్తమ మార్గం. ఫహువ అజ్ దరు, అది మీ కొరకు ఎంతో మేలు, ఉత్తమ మార్గం. దేని కొరకు? అల్ లా తజ్ దరూ – మీరు చిన్నచూపుతో చూడకుండా, మీరు తమకు తాము అల్పంగా భావించకుండా, దేనిని? ని’మతల్లాహి అలైకుమ్ – మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని.
సోదర మహాశయులారా, సభ్యతా, సంస్కారాలు, మర్యాదలు వీటికి సంబంధించి హదీద్ లు మనం తెలుసుకుంటున్నాము. ఇందులో ఈ హదీద్ కూడా ఎంత ముఖ్యమైనది ఈనాటి మన సమాజంలో ఒకసారి అర్థం చేసుకోండి. హదీద్ లో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ఇచ్చిన బోధనలని గనక మనం గ్రహించామంటే, పరస్పరం ఎంతో ప్రేమగా, ఒకరు మరొకరితో ఎంతో మంచి రీతిలో కలిసిమెలిసి ఉండవచ్చును. ఈ రోజుల్లో అసూయ, ఈర్ష్య, జిగస్సు, పరస్పరం కపటం, ద్వేషం లాంటి ఈ సామాజిక రోగాలు ఏవైతే పెరిగిపోతున్నాయో, ఇలాంటి హదీథులను చదవకపోవడం వల్ల.
ఈ హదీద్ లో మీకు మూడు విషయాలు తెలుస్తున్నాయి కదా. ఆ మూడు విషయాలు ఏంటి? ఈ హదీద్ ద్వారా మనకు కలిగిన లాభాలు, ప్రయోజనాలు ఏంటి? చివర్లో సంక్షిప్తంగా తెలుసుకుందాము. అయితే రండి.
ధార్మిక మరియు ప్రాపంచిక విషయాలలో మన దృక్పథం
ఒక హదీద్ లో వస్తుంది, ఈ భావాన్ని మీరు మరో హదీస్ ఆధారంగా మంచి రీతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
رَحِمَ اللَّهُ عَبْدًا (రహిమల్లాహు అబ్దన్) అల్లాహ్ ఆ దాసున్ని కరుణించు గాక! చూడండి.
ఇంతకుముందు చదివిన హదీస్ లో ఒక ఆదేశం ఉంది. ఇలా చేయండి, ఇలా చేయకండి, ఇందు ఈ లాభం, ఇలా తెలపబడింది. కానీ ఆ హదీద్ ను విడమరిచి చెప్పేటువంటి మరికొన్ని హదీద్ లలో ఘనతలు, లాభాలు ఎలా ఉన్నాయో గమనించండి. అక్కడ ఏముంది? రహిమల్లాహ్, అల్లాహ్ కరుణించు గాక! ఈ గుణం గనక నేను, మీరు అవలంబించుకున్నామంటే అల్లాహ్ యొక్క కరుణ మనపై కురుస్తుంది. ఏంటి? రహిమల్లాహు అబ్దన్, అల్లాహ్ ఆ వ్యక్తిని కరుణించు గాక!
نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ دُونَهُ (నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ దూనహు) ప్రాపంచిక రీత్యా తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి వైపున చూస్తాడు.
فَحَمِدَ اللَّهَ وَشَكَرَهُ (ఫ హమిదల్లాహ వ షకరహ్) ఓ అల్లాహ్! అతనికంటే నేను ఎంతో మేలు ఉన్నాను. నేను ఎంతో బాగున్నాను. అతనికంటే ఎంతో మంచి స్థితిలో ఉన్నాను. నీకే సర్వ స్తోత్రములు! నీకే అన్ని రకాల పొగడ్తలు! నీకే అన్ని రకాల కృతజ్ఞతలు!
وَفِي دِينِهِ إِلَى مَنْ هُوَ فَوْقَهُ (వ ఫీ దీనిహి ఇలా మన్ హువ ఫౌఖహు) మరి ఎవరైతే ధర్మపరంగా తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నాడో అతన్ని చూస్తాడు.
فَجَدَّ وَاجْتَهَدَ (ఫ జద్ద వజ్తహద్) ఆ తర్వాత అతను చాలా చాలా అలాంటి పుణ్యాలు సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా త్యాగం, ప్రయాస, ప్రయత్నం, కష్టపడతాడు, స్ట్రగుల్ చేస్తాడు దేనికొరకు? ధర్మ కార్యాల్లో, పుణ్య విషయాల్లో అలాంటి వారి స్థానానికి చేరుకోవడానికి, వారికంటే ఇంకా ముందుకు ఉండడానికి.
అమర్ బిన్ షు’ఐబ్ ఉల్లేఖించిన ఒక హదీద్ లో ఇలా కూడా వస్తుంది:
خَصْلَتَانِ (ఖస్లతాని) రెండు ఉత్తమ గుణాలు ఉన్నాయి. ఆ రెండు గుణాలు ఎవరిలో ఉంటాయో, అల్లాహ్ వారిని
شَاكِرًا صَابِرًا (షాకిరన్ సాబిరా) కృతజ్ఞత చెల్లించే వారిలో, ఓపిక సహనాలు వహించే వారిలో అతన్ని కూడా లిఖింపజేస్తాడు. షుక్ర్ చేసేవారు, సబ్ర్ చేసేవారు, కృతజ్ఞత చెల్లించేవారు, సహనాలు పాటించేవారు పుణ్యదాసులు ఎవరైతే ఉన్నారో, అలాంటి వారి జాబితాలో అల్లాహ్ త’ఆలా ఇతన్ని కూడా చేర్చుతాడు. ఎ
వరిని? ఎవరిలోనైతే ఈ రెండు గుణాలు ఉంటాయో. ఏంటి ఆ రెండు గుణాలు?
مَنْ نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ دُونَهُ فَحَمِدَ اللَّهَ عَلَى مَا فَضَّلَهُ بِهِ (మన్ నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ దూనహు ఫ హమిదల్లాహ అలా మా ఫద్దలహు బిహ్) ఎవరైతే ప్రాపంచిక విషయాలలో తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూసి, అల్లాహ్ అతనికంటే ఎక్కువగా అతనికి ఏదైతే అనుగ్రహించాడో దానిని చూసి అల్లాహ్ యొక్క స్తోత్రం పఠిస్తాడు.
وَمَنْ نَظَرَ فِي دِينِهِ إِلَى مَنْ هُوَ فَوْقَهُ فَاقْتَدَى بِهِ (వ మన్ నజర ఫీ దీనిహి ఇలా మన్ హువ ఫౌఖహు ఫక్ తదా బిహ్) మరియు ధర్మ విషయాల్లో తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వారిని చూసి వారి లాంటి ఆ సత్కార్యాలు చేసే ప్రయత్నం చేస్తాడు.
وَأَمَّا مَنْ نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ فَوْقَهُ (వ అమ్మా మన్ నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ ఫౌఖహు) కానీ ఎవరైతే దీనికి భిన్నంగా, ప్రపంచ రీత్యా తనకంటే ఎక్కువ స్థానంలో ఉన్న వారిని చూస్తాడో,
وَآسَفَ عَلَى مَا فَاتَهُ (వ ఆసఫ అలా మా ఫాతహు) అతని వద్ద ఉన్న దానిని చూసి, అయ్యో నాకు ఇది దొరకపాయె, నాకు ఇది ఇవ్వకపాయె, అయ్యో దేవుడు నాకు ఎందుకు ఇంత తక్కువ చేస్తున్నాడో, ఇట్లా బాధపడుతూ ఉంటాడు.
فَإِنَّهُ لَا يُكْتَبُ شَاكِرًا وَلَا صَابِرًا (ఫ ఇన్నహు లా యుక్తబు షాకిరన్ వలా సాబిరా) ఇలాంటి వ్యక్తి, షాకిరీన్, సాబిరీన్ లో, కృతజ్ఞత చెల్లించే, సహనాలు పాటించే వారి జాబితాలో లిఖించబడడు.
అందుకొరకే మన సలఫె సాలిహీన్ రహిమహుముల్లాహ్ ఏమనేవారో తెలుసా? నీవు ప్రపంచ రీత్యా నీకంటే పై స్థాయిలో ఉన్నవారితో ఎక్కువగా కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయకు. దీనివల్ల నీలో ఒక న్యూనతాభావం, అయ్యో నాకు లేకపాయె ఇంత గొప్ప స్థితి, నాకు లేకపాయె ఇంత గొప్ప సంపద, నాకు లేకపాయె ఇలాంటి అందం, నాకు లేకపాయె ఇలాంటి… ఈ బాధ అనేది అతనిలో అతన్ని కుమిలిపోయే విధంగా చేస్తుంది.
అందుకొరకు ఏమి చేయాలి? బీదవాళ్ళు, పేదవాళ్ళు, అలాంటి వారిని చూడాలి. వారి వద్ద ధర్మం ఎక్కువ ఉండి, ప్రపంచ పరంగా ఏమంత ఎక్కువ లేకున్నా గానీ, వారికి తోడుగా ఉండే ప్రయత్నం చేయాలి. దీనివల్ల అల్లాహ్ వారికంటే మంచి స్థితిలో మనల్ని ఉంచాడు అని అల్లాహ్ యొక్క కృతజ్ఞతాభావం కలుగుతుంది.
ఆధునిక కాలంలో హదీద్ యొక్క ప్రాముఖ్యత
ఈ సందర్భంలో ఈనాటి టెక్నాలజీ కాలంలో, మరొక ఈ హదీద్ ద్వారా మనకు కలిగేటువంటి గొప్ప బోధన ఏమిటంటే, ఇక ఏం పనిపాట లేదు కదా అని కొందరు యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, టిక్ టాక్ లో, చాట్… షేర్ చాట్, ఏమేమో సోషల్ మీడియాలో ఏం చూస్తారండీ? మన అవ్వలు, మన అక్కలు అందరూ, ఆ… వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఫ్రిడ్జ్ ఉన్నది. ఆ ఫ్రిడ్జ్ లో ఎట్లా పెట్టాలంట, అవంతా చూపిస్తున్నారు. కిచెన్ ను ఎలా డిజైన్ చేసుకోవాలో అంతా చూపిస్తున్నారు. ఆ… నెలకు ఒకసారి జీతం దొరికినప్పుడు, ఆమె భర్త ఎంతగానో మంచి బట్టలు ఆమెకు కొనిస్తాడో, అవన్నీ వాళ్ళు వ్లోగ్ లు అంట, ఇంకా ఏమేమో యూట్యూబ్ లలో అంతా కచరా పెడుతున్నారు కదా పెట్టేవాళ్ళు. ఈ పని పాట లేని వాళ్ళు అవన్నీ చూసుకుంటూ కూర్చుంటారు.
తర్వాత, ఏమండీ ఈసారి నెల జీతం దొరికిన తర్వాత ఇంట్లో ఫలానా తెచ్చుకుందామా? అని మెల్లగా మొదలవుతాయి మాటలు. ఇక ఒక్కొక్కటి, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ఈ విధంగా శక్తి సామర్థ్యము లేకున్నా పర్లేదండీ, ఫలానా ఫైనాన్స్ వాళ్ళు ఇస్తున్నారట లోన్, ఫలానా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారంట.
ఇవన్నీ ఇలాంటి కోరికలు ఎందుకు పెరుగుతున్నాయి? అలాంటి ఛానెల్ లను చూడకూడదు. ఏ ఛానెల్ ద్వారా అయితే, అయ్యో మన వద్ద ఇది లేకపాయే, ఇది ఉంటే ఎంత బాగుండు అని మనం కుమిలిపోతామో, అలాంటి ఛానెల్ లు చూసుకుంటూ మన ఇల్లులు పాడు చేసుకోవద్దు.
ప్రపంచ రీత్యా, ఈ విషయమైనా గానీ, హోదా, అంతస్తు, విద్య, ఇంకా అందచందాలు, సిరిసంపదలు, సౌకర్యాలు, ఏ విషయంలోనైనా ప్రపంచ రీత్యా మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారిని, వారి యొక్క ఛానెల్ లను, వారి యొక్క ప్రోగ్రాంలను చూసుకుంటూ ఉండి, అయ్యో నాకు లేకపాయె, నాకు లేకపాయె అన్నటువంటి బాధల్లో ఉండకూడదు.
ఈ ప్రపంచ రీత్యా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూసి, అల్హందులిల్లాహ్ ఓ అల్లాహ్ నీ యొక్క ఎంత అనుగ్రహం! కొందరైతే ఇల్లు లేక గుడిసెల్లో ఉంటున్నారు, నేను ఇంత మంచి ఇంట్లో ఉన్నాను. అయ్యో ఫలానా సిటీలో నేను వెళ్ళినప్పుడేదో చూశాను, పైపులలో ఉంటున్నారు, చెట్ల కింద ఉంటున్నారు. నాకైతే దానికంటే మంచిగా కనీసం కిరాయి ఇల్లు అయినా గానీ ఉంది కదా ఓ అల్లాహ్! ఇలాంటి కృతజ్ఞతాభావంలో జీవితం గడపాలి.
కానీ ధర్మపర విషయానికి వస్తే, ధర్మ విషయాలలో, మంచి కార్యాలలో, పుణ్య విషయాలలో మనకంటే ఎక్కువ స్థాయిలో ఎవరున్నారో వారిని చూసి, అలాంటి మార్గం అవలంబించే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే మనకు చాలా మేలు కలుగుతుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
పిసినారితనం నుండి మిమ్మల్ని కాపాడుకోండి | బులూగుల్ మరాం | హదీసు 1280 https://youtu.be/K3wcOKsHcp8 [ 9 నిముషాలు ] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
1280. హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రభోదించారు:
“అన్యాయానికి దూరంగా ఉండండి ఎందుకంటే అన్యాయం ప్రళయదినాన తమస్సుకు, చిమ్మచీకట్లకు కారణభూత మవుతుంది. ఇంకా పిసినారితనం నుండి నుండి మిమ్మల్ని కాపాడుకోండి. మీకు పూర్వం గతించినవారు దీని (పిసినిగొట్టు తనం) మూలంగానే నాశనమయ్యారు.”
సారాంశం:
ఈ హదీసులో అన్యాయంతో పాటు, పీనాసితనం పట్ల అప్రమత్తంగా ఉండాలని తాకీదు చేయబడింది. ‘అన్యాయం’ తీర్పుదినాన అన్యాయం చేసిన మనిషి పాలిట అంధకారబంధురంగా పరిణమిస్తుంది. అతనికి వెలుతురు , కాంతి కావలసిన తరుణంలో దట్టమైన చీకట్లు అతన్ని అలుముకుంటాయి పిసినారితనం కూడా ఒక దుర్గుణమే. పేరాశకు లోనైనవాడు, పిసినిగొట్టుగా తయారైన వాడు సమాజానికి మేలు చేకూర్చకపోగా, సమాజంలో అత్యంత హీనుడుగా భావించబడతాడు. పిసినారితనం నిత్యం మనస్పర్థలకు, కాఠిన్యానికి కారణభూతమవుతుంది, దుష్పరిణామాలకు దారితీస్తుంది.
—
ఈ ప్రసంగంలో, హదీథ్ నంబర్ 1280 ఆధారంగా ‘జుల్మ్’ (అణచివేత) మరియు ‘షుహ్’ (తీవ్రమైన పిసినారితనం లేదా దురాశ) అనే రెండు వినాశకరమైన పాపాల గురించి వివరించబడింది. ప్రళయదినాన అణచివేత చీకట్లుగా మారుతుందని, మరియు ‘షుహ్’ పూర్వపు జాతులను నాశనం చేసిందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. సాధారణ పిసినారితనం ‘బుఖుల్’ కు మరియు తీవ్రమైన దురాశ ‘షుహ్’ కు మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టం చేయబడింది. ‘షుహ్’ అనేది కేవలం తన వద్ద ఉన్నదాన్ని ఖర్చు చేయకపోవడమే కాక, ఇతరుల సంపదను అక్రమంగా పొందాలనే కోరికను కూడా కలిగి ఉంటుందని, ఇది హత్యలు, పాపాలు మరియు బంధుత్వాలను తెంచడం వంటి ఘోరాలకు దారితీస్తుందని వివరించబడింది. చివరగా, సూరత్ అల్-హష్ర్ లోని ఒక ఆయత్ ను ఉటంకిస్తూ, ఎవరైతే తమ ఆత్మల పిసినారితనం నుండి కాపాడబడతారో వారే నిజమైన సాఫల్యం పొందుతారని నొక్కి చెప్పబడింది.
హదీథ్ వివరణ: అణచివేత (జుల్మ్) మరియు పిసినారితనం (షుహ్)
హజ్రత్ జాబిర్ రజియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు, జుల్మ్ కీ దూరంగా ఉండండి. ఎందుకంటే జుల్మ్ ప్రళయ దినాన తమస్సుకు, చిమ్మ చీకట్లకు కారణభూతమవుతుంది. ఇంకా షుహ్, పిసినారితనం నుండి మిమ్మల్ని కాపాడుకోండి. మీకు పూర్వం గతించిన వారు దీనిని, అంటే పిసినిగొట్టుతనం మూలంగానే నాశనమయ్యారు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఏ విషయంలో వినాశనం ఉన్నదో దాని నుండి మనం దూరం కాకపోతే మనమే చాలా ఘోరమైన నష్టంలో పడిపోతాము.
ఈ హదీథ్ లో జుల్మ్ గురించి వచ్చింది. ఇంతకుముందే మనం హదీథ్ నంబర్ 1279 లో దాని వివరాలు తెలుసుకున్నాం. అయితే ఇందులో మరొక విషయం ఏముంది? వత్తఖుష్షుహ్. షుహ్.
షుహ్ (الشُّحّ) మరియు బుఖుల్ (بخل) మధ్య వ్యత్యాసం
షుహ్, ఒక ఒత్తి ఉన్నది ఈ పదం, మరొకటి ఉన్నది బుఖుల్. బుఖుల్ అంటే కంజూసీతనం, పిసినారితనం. చేతిలో డబ్బులు ఉన్నాయి, అల్లాహ్ మార్గంలో, అవసరం ఉన్నవారికి, పేదవారికి దానం చేయకుండా, ఇవ్వకుండా స్వయం తన భార్యాపిల్లలపై, తల్లిదండ్రులపై ఏ మధ్య రకంలో ఖర్చు పెట్టాలో పెట్టకుండా పిసినారితనం వహించడం. ఇదేమిటి? బుఖుల్.
ఇక్కడ హదీథ్ లో వచ్చిన పదం ఏంటి? షుహ్. ధర్మవేత్తలు ఏమంటున్నారంటే, ఈ బుఖుల్ అనేది ఎప్పుడైతే మనిషిలో మితిమీరిపోతుందో, చివరికి అతడు ఖర్చు పెట్టే విషయంలోనే కాదు, డబ్బు, ధనం యొక్క పిశాచి ఎంతగా అయ్యాడంటే ఉన్నదానిని ఖర్చు పెట్టకుండా ఆపుకొని ఉంచుకుంటున్నాడు, అంతే కాదు, ఇంకా కావాలి, కావాలి, కావాలి అన్నటువంటి ఈ పెరాశ అనేది అక్రమంగా సంపాదించడంలో కూడా అతన్ని పడవేస్తుంది. ఇంతటి ఘోర స్థితికి ఎదిగిన వారిని అతడు షుహ్ లో పడ్డాడు అని అంటారు.
అర్థమైంది కదా? అయితే బుఖుల్ అనేది ఏదైతే ఉందో పిసినారితనం, అందులో మరింత ఓ నాలుగు అడుగులు ముందుగా ఉండడం దీనిని షుహ్ అంటారు.
మరొక భావం దీని గురించి కొందరు ధర్మవేత్తలు ఏం చెప్పారంటే, షుహ్ అన్నది మనసుతో. అటు లేనిదాన్ని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు, అందులో అడ్డమార్గాలు తొక్కవలసి వచ్చినా, పాపం చేయవలసి వచ్చినా ఏ భయం లేకుండా చేసి సంపాదించడం మరియు ఖర్చు చేసే విషయంలో అంటే ప్రాక్టికల్ గా ఖర్చు చేసే విషయంలో బఖీల్, ఆపుకొని ఉంచడం, దీన్ని బుఖుల్, ముందు దాన్ని షుహ్ అని అంటారు.
పిసినారితనం (షుహ్) యొక్క వినాశకరమైన పరిణామాలు
కానీ ఇక్కడ గమనించండి, ప్రవక్త వారు ఏమంటున్నారు? ఇలాంటి ఈ పిసినారితనాన్ని మీరు వదులుకోండి. ఇలాంటి ఈ పిసినారితనం మీలో రాకుండా జాగ్రత్తపడండి. ఎందుకు? ఇంతకుముందు జాతి వారి వినాశనానికి ఇది కారణమైంది. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్.
ఎలా అండి ఇది? ఎలా అంటే, గమనించండి. ఈ రోజుల్లో కూడా మనం కుబేరులను చూస్తున్నాము. మిలియనీర్, బిలియనీర్, కోట్లాధిపతులను కూడా చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మనిషిలో ఈ పిసినారితనం చోటు చేసుకుంటుందో, ఏం చేస్తాడు? బంధుత్వాలను లెక్క కట్టడు. ఈ విధంగా మాట్లాడతాడు.
ఇస్లాం ధర్మం పేరుతో ఎందరికీ ఎలర్జీగా ఉంది. ఏ మానవత్వం ముందండి అని అంటారు. కానీ ఇలాంటి పిసినారులు మన సమాజంలో ఎంతోమంది కనబడతారు. మానవత్వత్వం ముందు అన్న వాళ్ళు డబ్బు విషయం వచ్చేసరికి బంధుత్వాలను, స్వయం మానవులను మరిచిపోయి దానికే ఎంత ప్రాధాన్యతను ఇస్తారంటే, చివరికి హత్యలు, ఘోరమైన పాపాలు, నేరాలు చేయవలసి వచ్చినా నాలుగు పైసల కొరకు అవన్నీ చేయడానికి కూడా సిద్ధమవుతారు. ఈ విధంగా ఇంతకుముందు జాతి వారిని వినాశనానికి గురిచేసింది.
ఈ ఇంతకుముందు జాతి వారిని వినాశనానికి గురిచేసింది అంటే ఇహలోకంలో ఇప్పుడు చెప్పిన రీతిలో. ఇది పరలోకంలో కూడా వినాశనం. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే డబ్బును, ధనాన్ని, ప్రజలకు అవసరమున్న విషయాలను, వస్తువులను ఆపుకొని స్వయం లాభం పొందుతూ, కొన్ని సందర్భాలలోనైతే పిసినారితనం ఎంతగా ఉంటుందంటే స్వయం కూడా లాభం పొందడు. స్వయం కూడా లాభం పొందకుండా డబ్బు సంపాదించడంలో ఎంత ముందుకు వెళుగుతారంటే వారి వద్ద దొంగతనం, అక్రమ సంపాదన, హత్య చేయడం మరియు మోసంతో డబ్బు కాజేసుకోవడం ఇవన్నీ ఎలాంటి పాపంగా భావించరు. ఇంకా దానిపై బంధుత్వాలను తెంచడం, ఇవన్నీ పాపాలకు గురి అవుతారు. చివరికి ఏమవుతుంది? ఈ పాపాలన్నీ కూడా పరలోకంలో అతన్ని నష్టంలో పడవేస్తాయి.
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రజియల్లాహు అన్హు) గారి వివరణ
ఒకసారి అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు తన శిష్యులతో, తన దగ్గర కూర్చున్న వారితో అడిగారు, “అయ్యుహుమా అషద్ద్, అల్-బుఖుల్ అవిష్-షుహ్?” (ఈ రెండిటిలో ఏది తీవ్రమైనది, బుఖుల్ ఆ లేక షుహ్ ఆ?). నేను ఇంతకుముందే చెప్పాను కదా రెండు పదాలు ఉన్నాయని. అల్-బుఖుల్, దీని యొక్క అసలైన భావం పిసినారితనం. దానిపై మరొకటి షుహ్. ఈ రెండిటిలో చాలా చెడ్డది ఏమిటి? అని అడిగారు.
అయితే అక్కడ ఉన్నవారు విభేదాల్లో పడ్డారు. కొందరు ఇలా అంటుంటే, కొందరు అది అంటున్నారు. అప్పుడు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ అన్నారు, “అష్-షుహ్హు అషద్దు మినల్-బుఖుల్” (షుహ్ అనేది బుఖుల్ కంటే తీవ్రమైనది). షుహ్ అన్నది బుఖుల్ కంటే చాలా చెడ్డది. “లిఅన్నష్-షహీహ యషుహ్హు అలా మా ఫీ యదైహి ఫయహ్బిసుహూ, వ యషుహ్హు అలా మా ఫీ ఐదిన్-నాసి హత్తా య’ఖుజహూ. వ అమ్మల్-బఖీలు ఫహువ యబ్ఖలు అలా మా ఫీ యదైహి” (ఎందుకంటే ‘షహీహ్’ (షుహ్ గుణం ఉన్నవాడు) తన చేతిలో ఉన్న దానిపై పిసినారితనం చూపి దాన్ని బంధిస్తాడు, మరియు ప్రజల చేతుల్లో ఉన్న దానిపై కూడా దురాశ పడతాడు, దాన్ని తీసుకునేంత వరకు. అయితే ‘బఖీల్’ (బుఖుల్ గుణం ఉన్నవాడు) కేవలం తన చేతిలో ఉన్న దానిపై మాత్రమే పిసినారితనం చూపిస్తాడు).
షుహ్ ఉన్న వ్యక్తి తన చేతిలో ఉన్నదానిని ఆపేస్తాడు, ఇతరులకు ఇవ్వకుండా. అంతేకాదు, ప్రజల చేతుల్లో ఉన్నదాన్ని కూడా మంచి మనసుతో చూడడు, ఎప్పుడు నా చేతిలోకి వచ్చి పడుతుందో, ఎప్పుడు నా దగ్గరికి వచ్చేస్తుందో అని. కానీ బఖీల్ కేవలం తన వద్ద ఉన్నదానిని ఇతరులకు ఖర్చు చేయకుండా ఆపుకునేవాడు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు ఈ విధంగా దీనిని, ఈ రెండు పదాలను వివరించారు.
ఖురాన్ సూచన
అయితే ఖురాన్ సూరతుల్-హష్ర్, 28వ ఖండంలో ఉంది, ఆయత్ నంబర్ తొమ్మిదిని గనక మనం చూస్తే, షుహ్ అన్నది ఎన్నో ఇతర పాపాలకు కారణమవుతుంది అని కూడా తెలుస్తుంది. అందుకొరకే దాని నుండి దూరం ఉన్నవాడే సాఫల్యం పొందుతాడని అల్లాహ్ అక్కడ మనకు తెలియజేస్తున్నాడు.
وَمَن يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ఎవరైతే తమ ఆత్మల పిసినారితనం నుండి కాపాడబడ్డారో, అట్టివారే సాఫల్యం పొందేవారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఫిఖ్‘హ్ దుఆ – ఈ మొదటి క్లాస్ లో దుఆ నిబంధనలు, మర్యాదలు, అంగీకార సమయాలు, సందర్భాలు, స్థలాలు & అవరోధాలు క్లుప్తంగా వివరించడం జరిగింది. వచ్చే క్లాసులలో ప్రతి పాయింట్ గురుంచి వివరంగా చెప్పబడుతుంది ఇన్ షా అల్లాహ్.
విశ్వాసి జీవితంలో దుఆ చాల ముఖ్యమైన అంశం. తప్పక వినండి. అర్ధం చేసుకొని మీ జీవితాలలో అమలు చేసుకోండి. మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి ఇన్ షా అల్లాహ్.
ఈ ప్రసంగంలో, దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత, దాని షరతులు, మర్యాదలు, అంగీకార సమయాలు మరియు అంగీకారానికి అడ్డంకులుగా ఉండే విషయాల గురించి వివరించబడింది. దుఆ అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహమని, అల్లాహ్ యే దుఆ చేయమని ఆదేశించి, దాని విధానాన్ని నేర్పించి, దానిని అంగీకరిస్తానని వాగ్దానం చేశాడని వక్త నొక్కిచెప్పారు. దుఆ అంగీకరించబడటానికి ఐదు ముఖ్య షరతులు ఉన్నాయి: ఇఖ్లాస్ (చిత్తశుద్ధి), ముతాబఆ (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించడం), ప్రగాఢ నమ్మకం, ఏకాగ్రత మరియు దృఢ నిశ్చయం. దుఆ చేసేటప్పుడు వుదూతో ఉండటం, ఖిబ్లా వైపు తిరగడం, చేతులు ఎత్తడం, అల్లాహ్ ను స్తుతించడం, దరూద్ పంపడం మరియు పశ్చాత్తాపం చెందడం వంటి మర్యాదలను పాటించాలని సూచించారు. అర్ధరాత్రి, అజాన్ మరియు ఇఖామత్ మధ్య, వర్షం కురుస్తున్నప్పుడు మరియు జుమా రోజు వంటి ప్రత్యేక సమయాల్లో దుఆ అంగీకరించబడుతుందని తెలిపారు. చివరగా, హరామ్ తినడం, తొందరపాటు, ఘోర పాపాలు చేయడం మరియు విధులను నిర్లక్ష్యం చేయడం వంటివి దుఆ అంగీకారానికి అడ్డంకులుగా నిలుస్తాయని హెచ్చరించారు.
అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్హందులిల్లాహి వహదహ్, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బ’అదహ్, అమ్మా బ’అద్.
సోదర మహాశయులారా, ప్రియ వీక్షకులారా! అల్లాహ్ యొక్క దయతో మనం అల్హందులిల్లాహ్ ఒక కొత్త సబ్జెక్ట్ ప్రారంభం చేయబోతున్నాము. ఈరోజు నుండి, తర్వాత కొన్ని వారాల వరకు అల్లాహ్ యొక్క దయతో ఈ క్లాస్ కొనసాగుతూ ఉంటుంది.
ఇందులో మనం దుఆ, దాని యొక్క నిబంధనలు, మర్యాదలు, అంగీకార సమయాలు, సందర్భాలు, స్థలాలు, అవరోధాలు, అంటే దుఆ అంగీకరించబడడానికి ఏ విషయాలు అడ్డుపడతాయి, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం.
అయితే, ఈరోజు మనది ఫస్ట్ క్లాస్ గనుక, మొదటి క్లాస్. ఇందులో మనం అల్లాహ్ యొక్క దయతో, ఇప్పుడు మీరు ఇక్కడ ముఖ్యంగా ఏ విషయాలు చూస్తున్నారో, దుఆనిబంధనలు, మర్యాదలు, అంగీకార సమయ సందర్భాలు, స్థలాలు, అవరోధాలు అని, వీటి గురించి సంక్షిప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుంటాము. వీటిలో ప్రతీ ఒక్కటి సంపూర్ణ ఆధారాలతో, వాటికి సంబంధించిన ఖురాన్ ఆయతులు మరియు హదీసుల నిదర్శనాలతో రాబోయే క్లాసుల్లో కూడా ఇన్ షా అల్లాహ్ తెలుసుకోబోతారు.
అయితే, రండి ఏమీ ఆలస్యం చేయకుండా, దుఆ గురించి ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మీకు చూపించబడుతుంది, అలాగే ఆ విషయం తెలపబడుతుంది కూడా. అదేమిటంటే, దుఆ అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం. ఈ అనుగ్రహాన్ని మీరు ఒకసారి గ్రహించండి, దుఆ చేయండని అల్లాహ్ యే ఆదేశించాడు. దుఆ చేసే విధానం కూడా అల్లాహ్ యే నేర్పాడు. ఇంకా మీరు దుఆ చేస్తే నేను అంగీకరిస్తాను అన్న వాగ్దానం కూడా అల్లాహ్ చేశాడు.
గమనిస్తున్నారా? దుఆ చేయండని అల్లాహ్ యే ఆదేశించాడు. దుఆ ఎలా చేయాలి, దుఆ చేసే విధానం కూడా అల్లాహ్ యే నేర్పాడు. మనం దుఆ చేస్తే అంగీకరిస్తానని కూడా అల్లాహ్ వాగ్దానం చేశాడు. అంతేకాదు, మనం దుఆ చేస్తున్నందుకు అదనంగా మనకు ఇంకా వేరే పుణ్యాలు కూడా ప్రసాదిస్తాడు. విషయాన్ని గ్రహిస్తున్నారా ఇక్కడ?
ఇక్కడ విషయం గ్రహించండి. ఒకటి, మనం చేసే దుఆ, దుఆలో ఏం అడుగుతామో అది అల్లాహు త’ఆలా అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు. ఇది ఒక విషయం. మరొక విషయం ఏంటి? మనం దుఆ చేసినప్పుడు అల్లాహు త’ఆలా దానిని స్వీకరించడమే కాకుండా, దుఆ చేసినందుకు సంతోషపడి మనకు పుణ్య ఫలం కూడా ఇస్తాడు.
సోదర మహాశయులారా, ఇంతటి గొప్ప ఈ దుఆలో ఉన్నటువంటి అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడైనా మీరు గ్రహించే ప్రయత్నం చేశారా? దీనికి సంబంధించిన ఎన్నో ఆధారాలు, దీనికి సంబంధించిన ఎన్నో సంఘటనలు కూడా గుర్తుకు వస్తున్నాయి. కానీ నేను చెప్పాను కదా, అల్లాహ్ యొక్క దయతో ఇన్ షా అల్లాహ్, అవన్నీ కూడా నేను మీకు తర్వాత రోజుల్లో తెలియజేస్తాను.
ఇక్కడ మరో విషయం గమనించండి. సూరత్ అల్-ముఅ్‌మినూన్… సారీ, సూరత్ అల్-ముఅ్‌మిన్, దానిని గాఫిర్ అని కూడా అనడం జరుగుతుంది. సూర నెంబర్ 40, ఆయత్ నెంబర్ 60 లో ఉంది,
وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ (వకాల రబ్బుకుముద్’ఊనీ అస్తజిబ్ లకుమ్) మరి మీ ప్రభువు చెప్పాడు: “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను.” (40:60)
మరి మీ ప్రభువు చెప్పాడు, మీరు నన్నే ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. అంతేకాకుండా, సూరె ఫాతిహా, ఖురాన్ యొక్క ఆరంభం, దీనిని గనక మనం శ్రద్ధగా గమనించామంటే, స్వయంగా అల్లాహు త’ఆలా ఇందులో దుఆ చేసే విధానము, దుఆలో అతి ముఖ్యమైనవి ఏమిటి అన్న విషయాలు, ఇంకా మనం అల్లాహ్ తో దుఆ చేయడంలో ఏ పద్ధతిని అవలంబించాలి, ఆ విషయం అల్లాహు త’ఆలా తెలియజేశాడు. అలాగే ఖురాన్ చివరిలో రెండు సూరాలు గనక మీరు చూస్తే సూరతుల్ ఫలఖ్ మరియు సూరతున్ నాస్, అందులో కూడా మనం వాస్తవానికి అల్లాహ్ ను వేడుకుంటున్నాము. అల్లాహ్ యొక్క శరణులోకి వస్తున్నాము. ఆ గొప్ప విషయం అక్కడ ఉంది.
ఈ విధంగా సోదర మహాశయులారా, ప్రియ వీక్షకులారా, దుఆ యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను, ఎల్లవేళల్లో మనం దుఆ చేస్తూ ఉండాలి. ఈ దుఆ అనేది మన జీవితంలో చాలా చాలా గొప్ప మార్పు తీసుకువస్తుంది. ఈ దుఆ వల్ల విధి వ్రాత కూడా మార్చడం జరుగుతుంది అన్నటువంటి విషయం కూడా మనం వింటాము, దానికి కూడా సహీ హదీసుల ద్వారా ఆధారం దొరుకుతుంది. కానీ అది ఏ విధి వ్రాత? లౌహె మహ్ఫూజ్ లో ఉన్నది కాదు. దైవదూతలకు ఏదైతే ఇవ్వడం జరుగుతుందో మరియు ఏ దాని ద్వారానైతే ప్రతీ సంవత్సరం అలాగే తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏదైతే వ్రాయబడుతుందో అది అని భావం.
దుఆ యొక్క షరతులు (నిబంధనలు)
ఇక రండి, సోదర మహాశయులారా, దుఆ నిబంధనలు, దాని యొక్క షరతుల గురించి తెలుసుకుందాం. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం.
దుఆ ఆయుధం అని చెప్పడం జరిగింది.
اَلدُّعَاءُ سِلَاحُ الْمُؤْمِنِ (అద్దుఆఉ సిలాహుల్ ముఅ్‌మిన్) దుఆ విశ్వాసి యొక్క ఆయుధం. అని మీరు మాటి మాటికి వింటూనే ఉంటారు కావచ్చు.
అయితే ఆయుధం ఎంత పదునుగా, మనం వాడుక భాషలో ఏమంటాము? కొచ్చగా. ఇలా పెడితేనే కోసేయాలి. అంత పదునుగా మరియు దానిని వాడేవాడు ఎంత నేర్పరి అయి ఉంటాడో, మరియు అది కరెక్టుగా పని చేయడానికి వేరే ఏ ఆటంకము, అడ్డు ఉండదో అప్పుడే ఆ ఆయుధం చాలా చక్కగా పనిచేస్తుంది, ఉద్దేశాన్ని పూర్తి చేస్తుంది.
ఈ మూడిటిలో, మూడు అంటే అర్థమయ్యాయా? ఆయుధం పదునుగా ఉండడం, వాడేవాడు నేర్పరి అయి ఉండడం మరియు ఏ ఆటంకము ఉండకపోవడం. ఈ మూడిటిలో ఏ ఒక్క లోపం ఉన్నా అది సరిగా పనిచేయదు, ఉద్దేశం పూర్తి కాదు. అందుకే, అన్నిటికీ ముందు దుఆ యొక్క షరతులు మరియు దుఆ అంగీకారంలో అడ్డు ఏమిటో తెలుసుకోవడం చాలా చాలా అవసరం.
అయితే సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా, దుఆ యొక్క షరతులలో మొట్టమొదటి షరతు, ఇఖ్లాస్. చిత్తశుద్ధి. అంటే, దుఆ కేవలం అల్లాహ్ తో మాత్రమే చేయాలి, అల్లాహ్ ప్రసన్నత కొరకే చేయాలి. పేరు ప్రఖ్యాతి, ప్రదర్శన బుద్ధి అనేది దుఆ చేయడంలో ఏమాత్రం ఉండకూడదు.
రెండవది, ముతాబఆ. అంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఇత్తిబా, అనుసరణ. అంటే, దుఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన విధానంలోనే చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆకు సంబంధించి ఇంకా ఏ ఏ బోధనలు హదీసులు ఉన్నాయో, అందులో ఏ రీతిలో దుఆ చేయాలి అని, దుఆలో ఏ తొందరపాటు ఇంకా వేరే విషయాలు ఉండకూడదు అని చెప్పారో, వాటిని మనం పాటించాలి.
ఈ ఇఖ్లాస్ మరియు ముతాబఆ, ఈ రెండు షరతులు ప్రతీ సత్కార్యంలో అవసరం. తప్పనిసరి. నమాజ్, ఉపవాసం, హజ్, ఉమ్రా, జకాత్, విధిదానం , తల్లిదండ్రుల పట్ల సేవ, ఎవరికైనా ఏదైనా మనం దానం చేస్తున్నాము, ఎవరి పట్ల ఏదైనా మనం ఉత్తమ రీతిలో వ్యవహరిస్తున్నాము, మీరు ఏ ఏ విషయాన్ని సత్కార్యంగా భావిస్తారో వాటన్నిటిలో కూడా ఇఖ్లాస్ మరియు ముతాబఆ, ఈ రెండు షరతులు ఉండడం తప్పనిసరి. ఈ రెండు షరతులు లేవు అంటే, మన ఏ సత్కార్యం కూడా స్వీకరించబడదు. దీనికి సంబంధించి కూడా ఎన్నో ఆయతులు, ఎన్నో హదీసులు, మన సలఫ్ సాలిహీన్ వారి యొక్క ఎన్నో మంచి మాటలు ఉన్నాయి. ఇన్ షా అల్లాహ్ తర్వాత రోజుల్లో అవి మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మూడవ షరత్, అల్లాహ్ దుఆ అంగీకరిస్తాడని ప్రగాఢ నమ్మకం ఉండాలి. అయ్యో, ఏదో మౌల్వీ సాబ్ చెప్పిండు కదా చేయమని, చేసి చూస్తాను. ఇలా ఉండకూడదు. అల్లాహ్ నా యొక్క దుఆను తప్పకుండా స్వీకరిస్తాడు. బలమైన నమ్మకం ఉండాలి.
నాల్గవ షరతు, మనస్సు పెట్టి దుఆ చేయాలి. దుఆ చేసే సందర్భంలో అశ్రద్ధగా ఉండకూడదు. నోటితో ఏ పలుకులు పలుకుతున్నామో మనస్సులో దాని అర్థ భావాలు తెలిసి, మనం పూర్తి శ్రద్ధా భక్తులతో దుఆ చేయాలి.
ఇక ఐదవ నిబంధన, దృఢ నిశ్చయంతో దుఆ చేయాలి. అంటే ఏంటి దృఢ నిశ్చయంతో? ఓ అల్లాహ్ నీకు ఇష్టం ఉంటే నాకు ఆరోగ్యం ఇవ్వు, లేకుంటే లేదు. నీకు ఇష్టం ఉంటే నన్ను క్షమించు, లేకుంటే లేదు. ఇట్లాంటి ధోరణి, ఇట్లాంటి మాట విధానం ఉండకూడదు. దృఢంగా ఓ అల్లాహ్ నన్ను క్షమించు. ఓ అల్లాహ్ నీవే క్షమించేవాడివి, ఇంక నేను ఎక్కడికి వెళ్లి క్షమాపణ కోరాలి? నీవు నన్ను తప్పకుండా క్షమించాలి. ఓ అల్లాహ్ ఇది నాకు అవసరం, ఆరోగ్యం, విద్య, సదాచరణ, ఇంకా సంతాన బాగోగుల గురించి, తల్లిదండ్రుల మంచి గురించి, ముస్లింలందరి మేలు గురించి మనం ఏదైతే అడుగుతున్నామో, ఓ అల్లాహ్ నీవు దీని శక్తి గలవానివి, నాకు తప్పకుండా ఇది ప్రసాదించు అని దుఆ చేయాలి.
అర్థమైంది కదా? ఈ షరతులు, నిబంధనలు గుర్తుంచుకోండి. ఒకటి ఇఖ్లాస్. రెండవది ముతాబఆ. మూడవది అల్లాహ్ అంగీకరిస్తాడని ప్రగాఢ నమ్మకం. నాలుగవది మనస్సు పెట్టి దుఆ చేయాలి, అశ్రద్ధగా ఉండొద్దు. ఐదవది దృఢ నిశ్చయంతో దుఆ చేయాలి, ఇష్టం ఉంటే ఇవ్వు అన్నటువంటి మాటలు ఉండకూడదు.
ఏమేం తెలుసుకున్నారు మీరు ఇప్పటి వరకు? దుఆ యొక్క ప్రాముఖ్యత. దుఆ ఎంత గొప్ప అనుగ్రహం అల్లాహ్ వైపు నుండి అన్న విషయం తెలుసుకున్నారు. మనం దుఆ చేస్తూ ఉండాలి ఎల్లవేళల్లో అన్న మాట తెలుసుకున్నారు. ఆ తర్వాత రెండవది దుఆ యొక్క షరతులు, దుఆ యొక్క నిబంధనలు తెలుసుకున్నారు.
దుఆ మర్యాదలు (ఆదాబ్)
ఇక రండి, ఇప్పుడు మనం మరికొంత ముందుకు వెళ్లి, దుఆ యొక్క కొన్ని ఆదాబ్, మర్యాదలు, పద్ధతులు తెలుసుకుందాం.
1- వుజూ స్థితిలో ఉండి దుఆ చేయలి. 2- ఖిబ్లా దిశలో ముఖం చేయాలి. 3- రెండు చేతులు భుజాలకు సమానంగా ఎత్తాలి. 4- అల్లాహ్ యొక్క స్తోత్రం, ప్రవక్తపై దరూద్. 5- అల్లాహ్ యొక్క మంచి నామాల, ఉత్తమ గుణవిషేశణాల, మన సత్కార్యాల మాధ్యమంతో. 6- పాపాలపై పశ్చాత్తాపం వ్యక్తపరుస్తూ, క్షమాభిక్ష కోరుతూ దుఆ చేయాలి. (సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్)
అయితే ఇక్కడ గమనించండి, శ్రద్ధ వహించండి. మీరు స్క్రీన్ లో ఏదైతే చూస్తున్నారో అంతవరకే కాకుండా, దాని యొక్క వివరణలో నేను చెప్పే మాటలు కూడా హృదయంలో నాటుకునే ప్రయత్నం చేయండి. లేదా అంటే కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ అయిపోతారు.
మొదటిది, వుదూ స్థితిలో ఉండి దుఆ చేయాలి. అయితే వుదూ లేకుండా దుఆ చేయకూడదా? అలా భావం కాదు. షరతులు ఏవైతే మనం చదివామో అవి తప్పకుండా ఉండాలి. వాటిలో ఏ ఒక్కటి ఉన్నాగాని దుఆ అనేది పైకి వెళ్లదు, అల్లాహ్ అంగీకరించడు. కానీ, ఇక్కడ ఈ మర్యాదలు దుఆ అంగీకారానికి ఇవి మరింత ఎక్కువగా దోహదపడతాయి. ఏదైనా స్థితిలో ఇవి లేకున్నా గాని నడుస్తుంది. కానీ, వీటి అలవాటు చేసుకుంటే మన కొరకే చాలా మంచిది. దుఆ అంగీకారం కొరకు గానీ, దుఆ మనం చేయడంలో మంచి ఖుషూ వ ఖుదూ, దుఆ చేయడంలో మనకు మంచి కాన్సంట్రేషన్ ఉండడానికి ఈ విషయాలన్నీ కూడా దోహదపడతాయి.
అయితే ఇక్కడ గుర్తించాలి, మనం ఇక్కడ దుఆ అని ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో, దుఆ యొక్క మర్యాదలో కొన్ని విషయాలు ఏవైతే ప్రస్తావిస్తున్నామో, ఇక్కడ ప్రత్యేకంగా ఏదైనా అవసరానికి మనం దుఆ చేసుకుంటాము కదా, అది ఇక్కడ ఉద్దేశం. ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు దుఆ చదువుతారు, మజీద్ లో వెళ్ళినప్పుడు దుఆ చదువుతారు, ఇంట్లో వచ్చినప్పుడు దుఆ చదువుతారు. అక్రమకుముల్లాహ్ వఅజకుమ్, మీరు టాయిలెట్ లో వెళ్ళినప్పుడు, వచ్చిన తర్వాత దుఆ చదువుతారు, పడుకునే ముందు చదువుతారు, ఉదయం సాయంకాలం దుఆలు, జిక్రులు చదువుతారు, ఆ సందర్భం గురించి కాదు ఇక్కడ చెప్పడం జరిగేది.
అర్థమైందా? మనం దుఆ అన్న ఉద్దేశంతో, ప్రత్యేకంగా అల్లాహ్ తో వేడుకోవాలి. ఇప్పుడు ఈ నా ప్రాబ్లం సాల్వ్ కావాలి. నేను అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ని ఎంతో శ్రద్ధా భక్తులతో ఏడ్చుకుంటూ అల్లాహ్ తో దీనంగా నేను ఇప్పుడు ఈ మాట నా అల్లాహ్ ముందు పెడతాను అని ఒక ప్రత్యేకంగా ఒక ఉద్దేశంతో ఒక విషయం కోరుతూ, ఒక ప్రాబ్లం పరిష్కరింపబడడానికి ఏదైతే దుఆ చేస్తాము కదా, అలాంటి దుఆ విషయం ఇక్కడ మాట్లాడుతున్నాం మనం. సలాం తిప్పిన తర్వాత కూడా మీరు దుఆ చేస్తారు లేక అజాన్ పూర్తయిపోయిన తర్వాత దుఆ చదువుతారు. అలాంటి దుఆల గురించి ఇక్కడ కాదు మనం చెప్పుకునేది ఇప్పుడు. అర్థమైంది కదా?
అయితే ఎప్పుడైతే ప్రత్యేకంగా, ఒక ఉద్దేశపూర్వకంగా మనం దుఆ చేయడానికి పూనుకుంటామో, అప్పుడు వుదూ ఉంటే చాలా మంచిది. అలాంటి సందర్భంలో కూడా ఒకవేళ వుదూ లేకుంటే దుఆ అంగీకరించబడుతుంది మరియు దుఆ చేయవచ్చు కానీ వుదూ ఉండడం మంచిది.
అలాగే ఖిబ్లా దిశలో ముఖం చేయాలి. ఇది కూడా ఉత్తమ విషయం. లేకుంటే దుఆ ఖుబూల్ కాదు అన్నటువంటి మాట కాదు ఇక్కడ కూడా.
మూడవది, రెండు చేతులు భుజాలకు సమానంగా ఎత్తాలి. నిన్న అంతకుముందు కూడా ఎన్నో సందర్భాల్లో ఇలాంటి ప్రశ్నలో దీనికి సమాధానం వివరంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇట్లాంటి ఏదైనా ప్రత్యేక దుఆ చేయడానికి మనం కూర్చుంటే, అప్పుడు ఏం చేయాలి? రెండు చేతులు భుజాలకు సమానంగా ఎత్తాలి.
ఈరోజు నేను దీని గురించి ఎన్నో హదీసులు చదువుతూ చదువుతూ మరొక విషయం కూడా తెలిసింది. అదేమిటి? దుఆ చేస్తున్నప్పుడు రెండు చేతులు ఎప్పుడైతే మనం ఎత్తుతామో, ఆ చేతుల యొక్క లోపలి భాగం మన ముఖం వైపునకు, ఆ అరచేతుల యొక్క వీపు అంటే అరచేతుల యొక్క పై భాగం ఖిబ్లా దిశలో ఉండాలి. ఈ విధంగా మనం భుజాల వరకు ఎత్తాలి. భుజాల వరకు అంటే భుజాలకు సమానంగా మన ముఖం ముందు.
నాలుగవ మర్యాద, పద్ధతి, అదబ్, అల్లాహ్ యొక్క స్తోత్రం మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్. దీని గురించి ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి చెప్పిన విషయాలు మనం ఇంతకుముందు ప్రవక్తపై దరూద్ ఓ సలాం అనే ఒక అంశం విన్నాము జుమా రోజు. గుర్తుందా? అందులో కూడా ఈ విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది. అదేంటి? దుఆ ఆరంభంలో, మధ్యలో, చివరిలో ఈ మూడు సందర్భాల్లో, మూడిటిలో ఏదైనా ఒక సందర్భంలో అల్లాహ్ యొక్క స్తోత్రము మరియు ప్రవక్తపై దరూద్ చదవాలి. అతి ఉత్తమ పద్ధతి ఏమిటి? ముందు అల్లాహ్ యొక్క స్తోత్రము, ఆ తర్వాత ప్రవక్తపై దరూద్, ఆ తర్వాత మనం అల్లాహ్ తో కోరుకునేది అంటే దుఆ, మళ్ళీ ఆ తర్వాత ప్రవక్తపై దరూద్ చదివి, అల్లాహ్ యొక్క స్తోత్రముతో సమాప్తం చేయాలి, ముగించాలి.
ఐదో విషయం శ్రద్ధ వహించండి. అల్లాహ్ యొక్క మంచి నామములు, ఉత్తమ గుణ విశేషణాలు మరియు మన సత్కార్యాల మాధ్యమంతో, వసీలాతో, ఆధారంతో దుఆ చేయడం ఉత్తమం. ఖురాన్లో కూడా అల్లాహ్ చెప్పాడు కదా మరి,
وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا (వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫద్’ఊహు బిహా) అత్యుత్తమమైన పేర్లు అల్లాహ్ కే ఉన్నాయి. కాబట్టి ఆ పేర్లతోనే మీరు ఆయనను ప్రార్థించండి.
నేను ముందే చెప్పాను మీకు, ఈరోజు నేను ముఖ్యమైన విషయాలు సంక్షిప్తంగా చెప్తున్నాను. తర్వాత రోజుల్లో మనం వివరంగా దలీల్ తో తెలుసుకుందామని. కానీ గుర్తుకు వచ్చేస్తుంది నాకు కూడా, ఇలాంటి ఆయతులు, హదీసులు ఎన్నో ఉన్నాయి. దీని ద్వారా కూడా మన దుఆ అంగీకరింపబడే అటువంటి గ్యారెంటీ అనేది పెరిగిపోతుంది.
సోదర మహాశయులారా, నేను ముందే చెప్పినట్లు, ఈ దుఆ మర్యాదలు అంశం స్టార్ట్ చేసే ముందు, ఏం చెప్పాను? ఈ మర్యాదలు ఏవైతే చెప్పబడుతున్నాయో వీటిని పాటించడం చాలా చాలా ఉత్తమం. ఇప్పుడు ఎమర్జెన్సీ మీకు ఏదైనా, ఒక దెబ్బ తగిలింది మీకు పోతూ పోతూ, నడుస్తూ నడుస్తూ ఫోటోరాయి తగిలింది లేదా మీరు బండిలో వెళ్తూ వెళ్తూ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ కిక్ కొడుతున్నారు స్టార్ట్ కావట్లేదు. ఇక అక్కడ మీరు ఖిబ్లా దిశలో ఉండి, వుదూ చేసుకొని, అదబ్ లో కూర్చొని, ఇవన్నీ చేసుకుంటూ దుఆ చేస్తారా? లేదు వెంటనే మనస్సులో ఓ అల్లాహ్, నా యొక్క బండి ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? ఓ అల్లాహ్ నీవు నాకు సహాయం చేయి. వెళ్తూ వెళ్తూ నడుస్తూ నడుస్తూ ఏదో కింద పడిపోయారు లేదా మీకు ఆ ఏమంటారు దాన్ని? చక్కర వచ్చినట్లు అయిపోయింది. ఆరోగ్యం కొరకు వెంటనే అక్కడ దుఆ చేస్తారు. అలా చేయకూడదా? చేయాలి. అదే ఉత్తమ పద్ధతి అక్కడ. విషయం అర్థమైంది కదా? కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఈ మర్యాదలు ప్రత్యేకంగా దుఆ చేయడానికి మనం కూర్చున్నప్పుడు ఈ పద్ధతులను పాటించడం చాలా చాలా ఉత్తమం.
ఆరవ మర్యాద,పాపాలపై పశ్చాత్తాపం వ్యక్తపరుస్తూ క్షమాభిక్ష కోరుతూ దుఆ చేయాలి. అవును, మనం ఏ విషయం కూడా అల్లాహ్ కు ఇష్టమైనది, పాపం కానిది అల్లాహ్ తో మనం కోరుకుంటున్నప్పుడు, వేడుకుంటున్నప్పుడు, నాకు కావాలి అని మనం అల్లాహ్ తో అర్ధిస్తున్నప్పుడు ముందు మన పాపాల విషయం, ఓ అల్లాహ్ నేను నా అన్ని రకాల పాపాల నుండి నీ క్షమాపణ కోరుతున్నాను. నా పాపాలే నీ కరుణ నా వరకు చేరడంలో అడ్డు కాకూడదు ఓ అల్లాహ్. ఈ పాపాలను వదులుకునేటువంటి భాగ్యం కూడా ప్రసాదించు ఓ అల్లాహ్. ఈ విధంగా మనం వేడుకోవాలి అల్లాహ్ తో, విన్నవించుకోవాలి.
పక్కన అరబీలో సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ అని రాసి ఉంది. కన్ఫ్యూజ్ కాకండి. ఆ సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ అనే దుఆ ఏదైతే ఉందో, అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత, అందులో ఈ విషయం చాలా గొప్పగా నొక్కి చెప్పడం జరిగింది అని గుర్తు రావడానికి కేవలం అది ఒక హింట్ ఇచ్చాను అంతే. అయితే మీరు ఒకసారి
اللَّهُمَّ أَنْتَ رَبِّي لَا إِلَهَ إِلَّا أَنْتَ، خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ، وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَا اسْتَطَعْتُ، أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ، أَبُوءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ، وَأَبُوءُ لَكَ بِذَنْبِي فَاغْفِرْ لِي، فَإِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ (అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత, ఖలఖ్తనీ వ అన అబ్దుక, వ అన అలా అహ్దిక వ వ’అదిక మస్తత’అతు, అ’ఊదు బిక మిన్ షర్రి మా సన’అతు, అబూఉ లక బి ని’అమతిక అలయ్య, వ అబూఉ బి దంబీ ఫగ్ఫిర్లీ, ఫ ఇన్నహూ లా యగ్ఫిరుద్ దునూబ ఇల్లా అంత)
ఓ అల్లాహ్! నీవే నా ప్రభువువు, నీవు తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. నీవే నన్ను సృష్టించావు మరియు నేను నీ దాసుడను. నేను నా శక్తి కొలది నీతో చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉంటాను. నేను చేసిన చెడు నుండి నీ శరణు కోరుతున్నాను. నాపై నీవు కురిపించిన అనుగ్రహాలను నేను ఒప్పుకుంటున్నాను. మరియు నా పాపాలను కూడా నేను ఒప్పుకుంటున్నాను. కాబట్టి నన్ను క్షమించు. నిశ్చయంగా నీవు తప్ప పాపాలను క్షమించేవాడు మరొకడు లేడు.
చదివి చూడండి, దాని అర్థ భావాలను, ఈ మాట అనేది అక్కడ మీకు స్పష్టంగా తెలుస్తుంది. నేను చెప్పాను మీకు ఇప్పుడు హింట్స్ తెలుసుకుంటున్నాము.
దుఆ అంగీకార సమయాలు
దుఆ ప్రాముఖ్యత, దుఆ యొక్క ప్రాముఖ్యత మరియు దాని యొక్క ఇంత పెద్ద అనుగ్రహం అది. ఆ తర్వాత దాని యొక్క షరతులు, నిబంధనలు మరియు మర్యాదలు, ఆదాబ్, ఆ తర్వాత ఇప్పుడు దుఆ అంగీకార సమయాలు తెలుసుకుంటున్నాము.
1- అర్థ రాత్రి 2- రాత్రి మూడవ భాగంలో 3- అజాన్ ఇవ్వబడుతున్నప్పుడు 4- అజాన్ ఇఖామత్ ల మధ్యలో 5- ఇఖామత్ ఇవ్వబడుతున్నప్పుడు 6- ఫర్జ్ నమాజుల తర్వాత 7- రాత్రి నిద్రమేల్కొన్నప్పుడు 8- వర్షం కురుస్తున్నప్పుడు 9- జుమా రోజు ఖుత్బా మధ్యలో, అస్ మగ్రిబ్ మధ్యలో 10- సహరీ సమయంలో
అయితే సోదర మహాశయులారా, మర్యాదల విషయంలో గాని ఇక్కడ అంగీకార సమయాల విషయంలో గాని ఇంక ఎన్నో ఉన్నాయి. కానీ అతి ముఖ్యమైనవి, మన రోజువారీ జీవితంలో మనకు అవసరమయ్యేటివి నేను ఇక్కడ కొన్ని ప్రస్తావించాను.
అంగీకార సమయాలు, అర్ధరాత్రి, రెండవది రాత్రి మూడవ భాగంలో, మూడవది అజాన్ ఇవ్వబడుతున్నప్పుడు, నాలుగవది అజాన్, ఇఖామత్ ల మధ్యలో, ఐదవ సమయం ఇఖామత్ ఇవ్వబడుతున్నప్పుడు, ఆరవ సమయం రాత్రి నిద్ర మేల్కొన్నప్పుడు, ఎనిమిదవ సమయం వర్షం కురుస్తున్నప్పుడు, తొమ్మిదవ సమయం జుమా రోజు ఖుత్బా మధ్యలో అలాగే అస్ర్ మరియు మగ్రిబ్ మధ్యలో. సహీ హదీసుల ద్వారా ఈ రెండు విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
పదవ సమయం, సహరీ సమయం. అంటే రోజా ఉంటే సహరీ చేస్తేనే అని కాదు. మనం ఉపవాసం లేకున్న రోజుల్లో కూడా సహరీ సమయం ఏదైతే ఉందో అది దుఆ అంగీకరింపబడడానికి,
وَبِالْأَسْحَارِ هُمْ يَسْتَغْفِرُونَ (వబిల్ అస్ హారి హుమ్ యస్తగ్ఫిరూన్) వారు రాత్రి జామున క్షమాపణ వేడుకునేవారు.
ఖురాన్ లో కూడా దీని గురించి మనకు ఆధారం కనబడుతుంది.
ఈ విధంగా సోదర మహాశయులారా, అల్లాహ్ యొక్క దయవల్ల మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నాము? దుఆ అంగీకరింపబడే అటువంటి సమయాల గురించి తెలుసుకున్నాము.
దుఆ అంగీకారానికి అడ్డుపడే విషయాలు
ఇప్పుడు రండి దుఆ అంగీకరింపబడడానికి ఏ విషయాలు అడ్డుపడతాయి? ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం.
అల్లాహ్ యే కాపాడుగాక మనందరినీ. మనం ఈ విషయంలో ఒకవేళ జాగ్రత్తగా ఉండకుంటే, మనం ఎన్ని మర్యాదలు పాటించినా, మనం దుఆ అంగీకారం యోగ్యం పొందడానికి ఏ మంచి సమయం ఎన్నుకొని దుఆ చేసినా, అంతా వృధా అయిపోతుంది. ఎలాగో తెలుసా? అల్లాహ్ అందరినీ ఆరోగ్యంగా ఉంచాలి, అన్ని రకాల రోగాల నుండి కాపాడాలి. ఒకవేళ వీరు షుగర్ పేషెంట్ అయి, షుగర్ వ్యాధిని ఇంకా పెరగకుండా, అల్లాహ్ యొక్క దయతో మొత్తమే దూరమైపోయి ఆరోగ్యవంతులు అవ్వడానికి మంచి మందులు వాడుతున్నారు. కానీ, అటు ఒకవైపున మందులు వాడుకుంటూ మంచి రసగుల్లాలు తింటున్నారు, పల్లి పట్టీలు తింటున్నారు, ఇష్టం వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు పెద్దలు చూడటం లేదు కదా అని ఓ దోసెడు చక్కెర కూడా మింగేస్తున్నారు. ఇలా చేస్తే ఏమవుతుంది? మీ మందులు మీకు పనిచేస్తాయా? చేయవు కదా. అందుకొరకే అడ్డంకులు, ఆటంకాలు, అవరోధాలు, దుఆ అంగీకరింపబడడానికి ఏ విషయాలు ఇందులో ముఖ్యమో అవి తెలుసుకోవడం చాలా చాలా అవసరం.
వాటిలో అతి ముఖ్యమైనవి నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను. అదేమిటి? మనిషి హరామ్ తినడం, త్రాగడం, ధరించడం, తొడగడం. వీటన్నిటికీ దూరం ఉండాలి.
నేను చెప్పాను కదా ఇంతకుముందే? హదీసులు, ఆధారాలు అవన్నీ కూడా తర్వాత మనం ఇన్ షా అల్లాహ్ తెలుసుకుందాము. కానీ ఇప్పుడు సంక్షిప్తంగా ఏం తెలిసింది? మన దుఆ అంగీకరింపబడాలంటే మనం హరామ్ తిండికి దూరం ఉండాలి. వడ్డీ అయినా గాని, లంచం తీసుకోవడం అయినా గాని, ఇంకా వేరే దొంగతనం చేసి గాని, లేకుంటే తెలిసి తెలిసి ఈ రోజుల్లో ఎన్నో రకాల జూదములు, లాటరీలు, ఎన్నో రకాల చైన్ బిజినెస్, చైన్ సిస్టం బిజినెస్ లు వస్తున్నాయి, వీటన్నిటికీ దూరంగా ఉండాలి. హరామ్ సొమ్ము అనేది మన తిండిలో, మన త్రాగడంలో, మన దుస్తుల్లో, బట్టల్లో ఏమాత్రం ఉండకూడదు.
రెండవది, తొందరపాటు. అంటే ఏంటి? ఒకసారి, రెండుసార్లు, కొన్నిసార్లు దుఆ చేసి అయ్యో ఇంకా దుఆ అంగీకరింపబడటం లేదు, ఇంకా అంగీకరింపబడటం లేదు అని దుఆ చేయడం మానుకోవడం. ఇది కూడా చాలా ప్రమాదకరం. చేస్తూ ఉండండి దుఆ. మీ యొక్క కోరిక, మీరు ఏ విషయం గురించి అయితే అల్లాహ్ తో దుఆ చేస్తున్నారో, అలా చేయడం ఇస్లాం ప్రకారంగా యోగ్యమైనది ఉంటే, అది మీకు పొందే వరకు ఇహలోకపు ఏదైనా అవసరం కావచ్చు, మీ యొక్క మంచి ఉద్యోగం కొరకు కావచ్చు, మీ చదువులో ఉన్నత శిఖరానికి చేరి మంచి ర్యాంకులో పాస్ అవ్వడం కావచ్చు, ఇంకా మంచి భార్య దొరకాలని లేకుంటే మంచి భర్త దొరకాలని కావచ్చు, అలాగే మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే అల్లాహ్ ఆరోగ్యం ప్రసాదించాలని కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. మీకు అది ప్రాప్తించే వరకు దుఆ చేస్తూనే ఉండండి కానీ, ఏంటయ్యా, ఓ సంవత్సరం నుండి దుఆనే చేస్తున్నాను, పది సంవత్సరాల నుండి దుఆ చేస్తున్నాను, నాకు సంతానమే కలగటం లేదు అని దుఆ చేయడం వదులుకోవడం, ఇంకా వేరే తప్పుడు మార్గాలు వెళ్ళడం, ఉదాహరణకు సంతానం లేనివారు ఎంతోమంది ఏం చేస్తారు? దర్గాల వద్దకు వెళ్ళిపోతారు. అది ఇంకా మరింత ఎక్కువ ప్రమాదంలో పడిపోతారు.
మూడో విషయం, ఘోరమైన పాపాలు. ప్రతీ పాపం కూడా చాలా ప్రమాదకరమైనది, నష్టం చేకూర్చేది. కాకపోతే, పెద్ద పెద్ద పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకోకపోవడం. ఇది కూడా మన దుఆ అంగీకారానికి అడ్డు కలుగుతుంది. చూడండి కొన్ని సందర్భాల్లో స్వీకరించబడుతుంది, అది అల్లాహ్ యొక్క దయ. అల్లాహ్ ఖురాన్ లో చెప్పిన ప్రకారంగా మనకు ఏం తెలుస్తుంది? ఎన్నో సందర్భాల్లో, అలాగే సహీ బుఖారీలో వచ్చిన ఒక హదీస్ ప్రకారంగా ద’వతుల్ మజ్లూమ్, అవిశ్వాసి, కాఫిర్, ముష్రిక్, బహుదైవారాధకుల దుఆ కూడా అల్లాహ్ స్వీకరిస్తాడు. కానీ, మనం అల్లాహ్ ను నమ్ముకున్న వాళ్ళము, ముస్లింలము, విశ్వాసులము. మనం పాపాలను, ప్రత్యేకంగా పాపాలలో ఘోర పాపాలు ఏవైతే ఉంటాయో వాటిని వదులుకోవాలి.
ఇక నాలుగవది, అల్లాహు త’ఆలా మనపై విధించిన వాటిని పాటించకపోవడం. అల్లాహు త’ఆలా మనపై ఏ విధులను విధించాడో, ఆ విధులను మనం ఒకవేళ నెరవేర్చకుంటే, మన దుఆలు అంగీకారానికి అవి అడ్డుపడతాయి. అందుకొరకే అల్లాహ్ విధించిన ప్రతీ విధిని మనం పాటిస్తూ ఉండాలి.
ఐదవది, ఏ విషయం మనం అల్లాహ్ తో కోరుతున్నామో, అడుగుతున్నామో, ఇది నాకు కావాలి అని అంటున్నామో అది ఏదైనా పాప విషయం కాకూడదు. ఓ అల్లాహ్, నా కొడుకు టెన్త్ లో మంచిగా పాస్ అయ్యేది ఉంటే, అతడు పబ్జీ గేమ్ ఆడుకోవడానికి మరియు మంచి ఫిలింలు, సీరియల్లు చూసుకుంటూ ఉండడానికి ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఇప్పిస్తానని నేను వాగ్దానం చేశా. ఓ అల్లాహ్ ఇంకా జీతం దొరకట్లేదు, నా దగ్గర డబ్బులు లేవు. నాకు మంచిగా డబ్బులు సమకూర్చు ఓ అల్లాహ్. నా కొడుక్కి నేను చేసిన వాగ్దానాన్ని పూర్తి చేస్తాను. మంచిగా ఉందా? పాప కార్యానికి, పాప కార్యం కోరుతూ దుఆ చేయడం జరుగుతుంది కదా, ఇలాంటి దుఆ చేయకూడదు.
అలాగే, బంధుత్వాలు తెగిపోవడానికి, సత్సంబంధాలు ఉండకుండా దూరం కావడానికి అలాంటి దుఆ కూడా చేయకూడదు. ఎవరైనా ఒక బంధువు నుండి ఎప్పుడైనా ఏదైనా మాట మీకు ఇష్టం లేనిది విన్నారు కావచ్చు, ఓ అల్లాహ్ రేపటి నుండి నేను అతని ముఖమే చూడకుండా చెయ్. ఇలా బంధుత్వాల తెగ తెంపులకు దుఆ చేయకూడదు.
అయితే ముఖ్యంగా ఈ ఐదు విషయాలు ఏవైతే మనం మన యొక్క దుఆ అంగీకారానికి అడ్డుగా ఉంటాయో, వాటిని తెలుసుకున్నారు. ఇన్ షా అల్లాహ్ వచ్చే క్లాసులలో ఇందులో ఇంక ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటి వివరాలు, ఖురాన్, హదీసుల ఆధారాలతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
అల్లాహు త’ఆలా మనందరికీ కూడా దుఆ అతనికి ఇష్టమైన రీతిలో, ప్రవక్త విధానంలో చేస్తూ ఉండే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వ’స్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ కు దగ్గర కావాలనుకుంటున్నారా? అల్లాహ్ ప్రేమించేవారిలో, ఇష్టపడేవారిలో చేరాలనుకుంటున్నారా? మరి అల్లాహ్ సామీప్యం పొందడానికి మార్గాలు ఏమిటి? అల్లాహ్ సామీప్యం పొందితే కలిగితే గొప్ప ప్రయోజనాలు ఏమిటి? తప్పక విని ప్రయోజనం పొందండి. మరియు మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి ఇన్ షా అల్లాహ్
ఈ ప్రసంగంలో, అల్లాహ్ సామీప్యాన్ని (వసీలా) ఎలా పొందాలో ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. ప్రసంగం ప్రారంభంలో, విశ్వాసులు అల్లాహ్ సామీప్యాన్ని అన్వేషించాలని సూచించే ఖురాన్ ఆయతును ఉదహరించారు. అల్లాహ్ సామీప్యం పొందడానికి పది ముఖ్యమైన మార్గాలు వివరించబడ్డాయి: సమయానికి నమాజ్ చేయడం, ఫర్జ్ నమాజులతో పాటు సున్నత్ మరియు నఫిల్ నమాజులు అధికంగా చేయడం, అల్లాహ్ పట్ల విధేయత చూపడంలో ఉత్సాహం కలిగి ఉండటం, ఎల్లప్పుడూ అల్లాహ్ ను స్మరించడం (జిక్ర్), అల్లాహ్ ప్రసన్నత కోసం ఉపవాసం ఉండటం, చేసిన పాపాల పట్ల పశ్చాత్తాపం చెందడం, ఖురాన్ ను పారాయణం చేయడం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపడం, సజ్జనులతో స్నేహం చేయడం, మరియు పేదవారికి దానం చేయడం. ఈ మార్గాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి అల్లాహ్ కు ప్రియమైన వాడిగా మారి, అతని ప్రార్థనలు అంగీకరించబడతాయని మరియు ఇహపరలోకాలలో సాఫల్యం పొందుతాడని నొక్కి చెప్పబడింది.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బ’అద్.
سُبْحَٰنَكَ لَا عِلْمَ لَنَآ إِلَّا مَا عَلَّمْتَنَآ ۖ إِنَّكَ أَنتَ ٱلْعَلِيمُ ٱلْحَكِيمُ (సుబ్ హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అన్తల్ అలీముల్ హకీమ్) “(ఓ అల్లాహ్!) నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవూ నీవే!” (2:32)
వ ఖాలల్లాహు తబారక వ త’ఆలా
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَٱبْتَغُوٓا۟ إِلَيْهِ ٱلْوَسِيلَةَ (యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ వబ్తగూ ఇలైహిల్ వసీలహ్) విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)
ప్రియమైన సోదరులారా! సోదరీమణులారా! అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క కృతజ్ఞత, ఆయన దయతో ఈరోజు మనమంతా ఒక కొత్త అంశాన్ని తీసుకొని సమావేశమై ఉన్నాము. అల్లాహ్ తో దుఆ ఏమనగా, ఖురాన్ మరియు హదీసుల ప్రకారం ఏవైతే వాక్యాలు మనకు వినబడతాయో వాటిని అమలుపరిచే భాగ్యాన్ని అల్లాహ్ త’ఆలా మాకు ప్రసాదించు గాక. ఆమీన్. అలాగే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అందరినీ ఒకేచోట సమావేశపరుస్తున్న వారందరికీ అల్లాహ్ త’ఆలా మంచి ఫలితాన్ని ఇహపరలోకాలలో ప్రసాదించు గాక. ఆమీన్.
అల్లాహ్ సామీప్య మార్గాలు
ప్రియమైన మిత్రులారా! ఖురాన్ గ్రంథంలోని ఒక ఆయత్.
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَٱبْتَغُوٓا۟ إِلَيْهِ ٱلْوَسِيلَةَ (యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ వబ్తగూ ఇలైహిల్ వసీలహ్) విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)
ఓ విశ్వాసులారా! అల్లాహ్ యొక్క సామీప్యాన్ని మీరు అన్వేషించండి అని అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథంలో సెలవిచ్చాడు.
ఈరోజు మన అంశం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సామీప్య మార్గాలు. అల్లాహ్ సామీప్యం ఎలా పొందగలము? వాటి యొక్క మార్గాలు ఏమిటి? దాని ఫలితంగా మనకు అల్లాహ్ త’ఆలా కల్పించే భాగ్యాలు ఏమిటి? దీనిపై ఈరోజు సవివరంగా మీ ముందు ఉంచబోతున్నాను.
సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్ తబారక వ త’ఆలా మనల్ని అందరినీ సృష్టించారు. సరైన మార్గం కూడా అల్లాహ్ తబారక వ త’ఆలా మాకు సూచించాడు. సర్వ జనుల్లో అనేకమంది అనేక అభిప్రాయాలు, అనేక ఆలోచనలతో జీవిస్తున్నారు. కొంతమందికి కొన్ని విషయాల వల్ల ప్రేమ, మరి కొంతమందికి కొన్ని విషయాల పట్ల ఆకర్షణ, మరికొంతమందికి కొన్ని విషయాల పట్ల సంతుష్టి ఉంటుంది. అయితే ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఏమి చెబుతున్నాడంటే, ఓ విశ్వాసులారా! నా యొక్క సామీప్యాన్ని మీరు అన్వేషించండి.
అల్లాహ్ యొక్క సామీప్యం ఎంతో ఉన్నతమైన స్థానం. విలువైన స్థానం. ఆ ఉన్నతమైన స్థానానికి, ఆ విలువైన స్థానానికి మనిషి చేరుకోగలిగితే, ఇక అక్కడి నుంచి అల్లాహ్ తబారక వ త’ఆలా ను ఆ మనిషి ఏది కోరుకుంటాడో, ఆ దాసుడు ఏది కోరుకుంటాడో దాన్ని అల్లాహ్ త’ఆలా ప్రసాదిస్తాడు. ఆ విలువైన స్థానం, ఆ విలువైన సామీప్యాన్ని పొందడానికి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక విషయాలు సూచించారు. ఆ సామీప్యం మనిషికి దొరికినట్లయితే ఆ మనిషి యొక్క విలువ కూడా పెరిగిపోతుంది. అతని భక్తి కూడా పెరిగిపోతుంది. అల్లాహ్ వద్ద ఉన్నత స్థానాల్లో ఉంటాడు.
అయితే ఆ సామీప్యం మనకు ఎలా లభిస్తుంది? దాని కోసం మనం ఎన్నుకోవలసిన మార్గాలు ఏమిటి? ఇది మీరు, మేము చెప్పుకుంటే వచ్చేది కాదు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ప్రవక్తా! మీకు ఏ దేవుడైతే, ఏ అల్లాహ్ అయితే మీకు ప్రవక్తగా చేసి పంపించాడో అతని సాక్షిగా నేను చెబుతున్నాను. అల్లాహ్ తబారక వ త’ఆలా మీకు అందజేసిన సందేశం ఏమిటో నాకు వివరించండి.
అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “షహాదతైన్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్.” దాన్ని “అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్.” నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప మరి నిజమైన ఏ దేవుడు లేడు. అలాగే నేను సాక్ష్యమిస్తున్నాను మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని. దీని తర్వాతే మిగతా విషయాలన్నీ అక్కడ వస్తాయి. ఆ వ్యక్తి దాన్ని విశ్వసించేవాడు. ఆ వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో అంటున్నాడు, రేయింబవళ్ళలో అల్లాహ్ తబారక వ త’ఆలా మాపై విధించిన విషయాలు ఏమిటో చెప్పండి.
మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆదేశించారు. రేయింబవళ్ళలో అల్లాహ్ తబారక వ త’ఆలా మనపై విధించిన విషయం ఏమిటంటే, ఐదు పూటల నమాజు విధిగా అల్లాహ్ తబారక వ త’ఆలా చేశాడు. ఆ వ్యక్తి అన్నాడు, ప్రవక్తా! ఇంకేమైనా ఉందా? అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఐదు పూటల నమాజు తర్వాత నీకిష్టమైతే ఇంకా ఎక్కువైనా చదువుకోవచ్చు. ఆ తర్వాత ఆ వ్యక్తి అన్నాడు, ప్రవక్తా! అల్లాహ్ తబారక వ త’ఆలా మీకు అందజేసిన సందేశంలో ఇంకేమైనా చేయవలసి ఉంటే అది కూడా చెప్పండి. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రమజాన్ మాసములో ఉపవాసాలు ఉండుట, పూర్తి మాసంలో ఉపవాసాలు ఉండుట. ఆ వ్యక్తి అన్నాడు, ఇంకేమైనా ఉందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఆ పూర్తి మాసం తర్వాత నీకు ఇష్టమైతే మిగతా రోజుల్లో కూడా నువ్వు ఉపవాసాలు ఉండవచ్చు.
మీకు అందజేసిన ఆదేశాల్లో ఇంకేమైనా ఉందా అని అడిగాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, జకాత్ చెల్లించటం, సంవత్సరానికి ఒకసారి జకాత్ చెల్లించటం. ఈ విధంగా ఒక్కొక్క విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళు చాలా క్లుప్తంగా వివరించారు. అన్ని విషయాలు విన్న ఆ వ్యక్తి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అన్నాడు, ఓ ప్రవక్తా! ఏవైతే మీరు నాకు వినిపించారో, ఏవైతే సందేశం నాకు ఇచ్చారో ఆ సందేశంలో నేను రవ్వంత కూడా ఎక్కువ చేయను, రవ్వంత కూడా తగ్గించను. ఏదైతే నేను నాపై విధిగా ఉందో అది మాత్రమే నేను చేస్తాను. ఇంకా ఎక్కువ చేయను, ఇంకా తక్కువ చేయను అని ఆ వ్యక్తి పలకరించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వెళ్తుండగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏదైతే ఈ మనిషి అన్నాడో, ఏదైతే ఈ మనిషి వాంగ్మూలం ఇచ్చాడో దాన్ని సరిగ్గా నెరవేరిస్తే ఇతను తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్తను ఇచ్చారు.
ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా! ఇది బుఖారీ, ముస్లింలో ఉంది, ఈ ఒక్క హదీస్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే అల్లాహ్ సామీప్యం పొందటం చాలా సులువు. కానీ మనం కాస్త గ్రహించట్లేదు. ఒకవేళ మనం గ్రహిస్తే అల్లాహ్ సామీప్యం పొందటం చాలా సులువైన విషయం. ఎందుకంటే ఆ వ్యక్తి అడిగిన విషయాల్లో ఏవైతే అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో అవి మాత్రమే నేను చేస్తాను అని చెప్పాడు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్త వినిపించారు, ఈ వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు అని. అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందటానికి మనిషికి కావలసినది ఏమిటంటే, అత్యంత విలువైన, అల్లాహ్ తబారక వ త’ఆలా ఏదైతే అతనిపై విధిగా చేశాడో దాన్ని అమలు పరచటం. అల్లాహ్ త’ఆలా విధిగా చేయనిది మనము ఎంత చేసుకున్నా అది విధికి సమానంగా ఉండదు. ధార్మిక పండితులు, ధార్మిక విద్వాంసులు అనేక విషయాలు దీనికి సంబంధించి చెప్పారు. అందులో కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. అవి అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందడానికి మార్గాలు అన్నమాట.
1. మొట్టమొదటిది: సమయానికి నమాజ్ చేయడం
మొట్టమొదటిదిగా అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందటానికి కావలసింది ఏమిటంటే, ‘అదావుస్ సలాతి ఫీ అవ్ఖాతిహా’. నమాజుని దాని యొక్క సమయంలో ఆచరించటం.
ఫజర్ నమాజ్ ఫజర్ సమయంలో, జోహర్ నమాజ్ జోహర్ సమయంలో, అసర్ నమాజ్ అసర్ సమయంలో, మగ్రిబ్ నమాజ్ మగ్రిబ్ సమయంలో, ఇషా నమాజ్ ఇషా సమయంలో. ఏ నమాజ్ ఏ సమయంలో అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో ఆ నమాజ్ ని ఆ సమయంలో విధిగా భావించి ఆచరించాలి. కొంతమంది ఫజర్ నమాజ్ ని హాయిగా పడుకొని జోహర్ నమాజ్ తో కలిపి చదువుతారు. ఇది అల్లాహ్ తబారక వ త’ఆలాకి నచ్చదు. సమయాన్ని తప్పించి నమాజ్ ఆచరించటం అనేది విధిగా అల్లాహ్ తబారక వ త’ఆలా చేయలేదు. కనుక అల్లాహ్ యొక్క సామీప్యం పొందాలంటే ఏదైతే అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో, ఎప్పుడు చేశాడో దాన్ని ఆ ప్రకారంగానే అమలు చేయటం. ఇస్లాం ధర్మంలో రెండో మౌలిక విధి నమాజ్ ది ఉంది. మొదటిది షహాదతైన్, ఆ తరువాత నమాజ్ అన్నమాట. నమాజ్ ని దాని సమయంలో పాటించటం, ఆచరించటం ఉత్తమం.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు, మనిషి చనిపోయిన తర్వాత అన్నిటికంటే ముందు అల్లాహ్ వద్ద అతనితో ప్రశ్నించబడేది నమాజే. నమాజ్ గురించి అతను సమాధానం ఇవ్వగలిగితే మిగతా విషయాల్లో అతను విజయం, సాఫల్యం పొందుతాడు. కనుక ఇది గుర్తుపెట్టుకోవాలి. అల్లాహ్ సామీప్యం పొందడానికి కావలసినది విధిగా చేసి ఉన్న నమాజులని సమయం ప్రకారం ఆచరించటం, పాటించటం.
2. సున్నత్ మరియు నఫిల్ నమాజులు
ఇక రెండోది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఒక వ్యక్తి, ప్రవక్తా! స్వర్గంలో నేను మీతో ఉండాలనుకుంటున్నాను. అప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అయితే నువ్వు ఎక్కువగా నమాజ్ ఆచరించు. విధిగా ఉన్న నమాజులని ఆచరించిన తర్వాత సున్నత్ నమాజులను, నఫిల్ నమాజులను ఇలాంటి నమాజులను ఎక్కువగా ఆచరించటం వలన అల్లాహ్ యొక్క సామీప్యం మనకు లభిస్తుంది. ఎంతవరకు అయితే మనిషి అల్లాహ్ యొక్క భక్తిని తన హృదయంలో, తన మనసులో పెంపొందించుకుంటాడో, అల్లాహ్ తబారక వ త’ఆలా అతనికి తన సామీప్యానికి దరికి తీసుకుంటాడు. కనుక సున్నత్ నమాజులను, నఫిల్ నమాజులను, అలాగే రాత్రిపూట ఏకాంతంలో చదివే తహజ్జుద్ నమాజులను కూడా వదలకూడదు. ఈ నమాజులు మన స్థాయిని పెంచుతాయి. అల్లాహ్ సన్నిధిలో మన యొక్క విలువ పెరుగుతుంది.
3. అల్లాహ్ పట్ల విధేయత
ఆ తర్వాత మూడో మార్గం ఏమిటంటే అల్లాహ్ యొక్క విధేయతను పాటించడంలో ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆశతో ఉండాలి. విధేయత అంటే ఇతాఅత్. ఏదైతే అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ పని చేయమని, ఆ పని చేయమని అల్లాహ్ త’ఆలా మాకు ఆజ్ఞాపిస్తాడో ఆ ఆజ్ఞను శిరసా వహించటానికి ఇతాఅత్ అంటాము. ఆ ఇతాఅత్ చేయటానికి మనము ఎల్లప్పుడూ ఆశ కలిగి ఉండాలి. ఉత్సాహం కలిగి ఉండాలి. ఉత్సాహం లేకుండా ఏదీ మనిషి చేయలేడు, ఇష్టం లేకుండా ఏది మనిషి చేయలేడు. అల్లాహ్ విధేయత పట్ల మనిషి ఉత్సాహం కలిగి ఉంటే ఆ విశ్వాసంలో కలిగే రుచే వేరుగా ఉంటుంది. ఇది మూడో మార్గం అన్నమాట.
4. అల్లాహ్ ను స్మరించడం (జిక్ర్)
ఇక నాలుగో మార్గం ఏమిటంటే అల్లాహ్ తబారక వ త’ఆలాని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి. అంటే జిక్ర్. జిక్ర్ అంటే అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామము యొక్క జపము. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక దుఆలతో నామాలతో, జపాలతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూచించారు. మనిషి కూర్చొని ఉన్నా, నమాజ్ తర్వాత అయినా, ఏదైనా వస్తువు మన చేతి నుండి కింద పడిపోయినా, ఏదైనా వస్తువు మనకు ఆకర్షణను కలిగించినా, అనేక విధాలుగా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామాన్ని మనం స్మరిస్తూ ఉండాలి. సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, మాషాఅల్లాహ్. ఈ విధంగా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామాలను స్మరిస్తూ ఉండాలి. దీని ద్వారా మన యొక్క విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, తద్వారా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క సామీప్యం మనకు లభిస్తుంది.
5. ఉపవాసం
ఇక ఐదోది ఏమిటంటే, అల్లాహ్ ప్రసన్నత కోసం ఉపవాసం ఉండుట. ఉపవాసం అనేది ఎవరికీ కానవచ్చేది కాదు. అల్లాహ్ ప్రసన్నత కోసం మనిషి ఉపవాసం ఉంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమి చెప్పారంటే, ఎవరైతే అల్లాహ్ ప్రసన్నత కోసం ఒక రోజు ఉపవాసం ఉండినట్లయితే, అల్లాహ్ తబారక వ త’ఆలా అతని యొక్క ముఖాన్ని 70 సంవత్సరాల దూరంగా నరకాగ్ని నుండి ఉంచుతాడు. ఇది కేవలం ఒక రోజు ఉపవాసం ఉంటే అల్లాహ్ తబారక వ త’ఆలా అతని ముఖాన్ని నరకాగ్ని నుండి 70 సంవత్సరాల దూరం వరకు తప్పిస్తాడు. ఆ విధంగా అల్లాహ్ ప్రసన్నత కోసం ఎన్ని ఉపవాసాలు ఉన్నా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక ఉపవాసాలు చూపించారు. వారంలో రెండు రోజులు ఉపవాసం ఉండుట, ఒక మాసములో, ఒక నెలలో మూడు రోజులు, 13, 14, 15 వ తేదీలలో ఉపవాసాలు ఉండుట. అలాగే అరఫా రోజున ఉపవాసం ఉండుట, ముహర్రం రోజులో 9, 10 ఈ రెండు రోజులు ఉపవాసాలు ఉండుట. రమజాన్ మాసములో విధిగా చేయబడిన ఒక నెల ఉపవాసాలు ఉండుట. ఈ విధంగా అనేక ఉపవాసాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఉపదేశించారు. ఈ ఉపవాసాల ద్వారా మనిషిలో విశ్వాసము, ఈమాన్ పెరుగుతుంది. దాని మూలంగా అతను అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందగలుగుతాడు.
6. పశ్చాత్తాపం (తౌబా)
ఇక ఆరోది ఏమిటంటే పశ్చాత్తాపం, ‘అత్తౌబతు అనిల్ మ’ఆసీ’. పశ్చాత్తాపం. ఏవైతే మనము చెడు కర్మలు చేసి ఉన్నామో, నేరాలు చేసి ఉన్నామో, దాని పట్ల పశ్చాత్తాపం చెందుతూ ఉండాలి. అల్లాహ్ త’ఆలాతో ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండాలి. అల్లాహ్ త’ఆలా వైపు మరలుతూ ఉండాలి. ఎల్లప్పుడూ అల్లాహ్ త’ఆలాతో క్షమాపణ, మన్నింపు కోరుతూ ఉండాలి. దీని మూలంగా మన యొక్క పాపాలు అల్లాహ్ తబారక వ త’ఆలా తుడిచి పెడతాడు. దాని ద్వారా మన యొక్క ఈమాన్ పెరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం మనకు కలుగుతుంది. మనిషి ఏ సమయంలో ఎలాంటి పాపం చేస్తాడో అతనికే తెలుసు. కొన్ని సందర్భాలు ఇలాంటివి కూడా ఉంటాయి, అతను పాపాలు చేస్తాడు, ఆ పాపాలు అతనికి గుర్తు ఉండవు. కనుక అల్లాహ్ తబారక వ త’ఆలాతో దుఆ ఏమని చేయాలంటే, ఏ పాపాలైతే నేను తెలిసి చేశానో, తెలియక చేశానో అన్నిటినీ నువ్వు క్షమించు అని అల్లాహ్ త’ఆలాతో మన్నింపు కోరుతూ ఉండాలి.
పశ్చాత్తాపం చేయటానికి, క్షమాపణ కోరటానికి, మన్నింపు కోరటానికి గడువు తీసుకోకూడదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, రాత్రిళ్ళలో ఎవరైతే పాపాలు చేస్తారో, నేరాలు చేస్తారో అతని కోసం అల్లాహ్ తబారక వ త’ఆలా పగలు తన రెండు హస్తాలను చాచి, ఓ నా భక్తులారా! ఎవరైతే రాత్రిళ్ళలో మీరు పాపాలు చేసి ఉన్నారో, నేరాలు చేసి ఉన్నారో, నేను మిమ్మల్ని క్షమిస్తాను, రండి. ఆ సమయంలో ఎవరైతే అల్లాహ్ తబారక వ త’ఆలాతో పశ్చాత్తాపం కోరుతారో, అల్లాహ్ త’ఆలా వారిని క్షమిస్తాడు, మన్నించి వేస్తాడు. అదే విధంగా పగటి పూట ఎవరైతే పాపాలు చేస్తూ ఉంటారో, వారి కోసం అల్లాహ్ తబారక వ త’ఆలా రాత్రి తన హస్తాలు చాచి, ఓ నా దాసులారా! మీరు పగటిపూట ఏమైనా నేరాలు చేసి ఉంటే, పాపాలు చేసి ఉంటే, రండి, క్షమాపణ కోరండి, మీ పాపాలను నేను తుడిచి వేస్తాను, మన్నించి వేస్తాను. కానీ మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు పాపం పట్ల పశ్చాత్తాపం చెందితే మళ్ళీ బహుశా నాతో పాపం జరిగే అవకాశం ఉంది. కనుక ఇప్పుడే పశ్చాత్తాపం చెందకూడదు. జీవితంలో చివరి కాలంలో, శేష జీవితంలో నేను పాపాల నుండి విముక్తి పొందటానికి అల్లాహ్ త’ఆలాతో పశ్చాత్తాపం కోరాలి అనే భావన అతనిలో కలిగి ఉంటుంది. ఇది ముమ్మాటికీ తప్పు, పొరపాటు. మనిషి అన్న తర్వాత చిన్న పాపాలు గాని, పెద్ద పాపాలు గాని, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. కానీ అల్లాహ్ తబారక వ త’ఆలా క్షమిస్తూనే ఉంటాడు. గఫూరుర్ రహీం. ఆయన కరుణించేవాడు, క్షమించేవాడు, అమితంగా క్షమించేవాడు, కరుణించేవాడు. ఎల్లప్పుడూ తమ పాపాల పట్ల అల్లాహ్ త’ఆలాతో పశ్చాత్తాపం కోరుతూ ఉండాలి.
7. ఖురాన్ పారాయణం
ఇక ఏడో మార్గం ఏమిటంటే, అల్లాహ్ తబారక వ త’ఆలా అవతరింపజేసిన ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి, కంఠస్థం చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. అల్లాహ్ తబారక వ త’ఆలా మహత్తరమైన గ్రంథాన్ని అవతరింపజేశాడు. మన సాఫల్యం కోసం, పరలోకంలో మనం విజయం సాధించాలనే ఉద్దేశ్యముతో అల్లాహ్ త’ఆలా మన కోసం ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఈనాడు మన స్థితి కాస్త గ్రహించినట్లయితే మనకు అర్థమవుతుంది, అదేమిటంటే ఖురాన్ చదవటం వచ్చిన వాళ్ళు అయినా సరే, ఖురాన్ చదవటం రాని వాళ్ళు అయినా సరే సమానమయ్యారు. ఖురాన్ చదవటానికి వారి వద్ద సమయం లేదు. ఖురాన్ నేర్చుకోవడానికి వారి వద్ద సమయం లేదు. ఇది అంతిమ దైవ గ్రంథం. నిజమైన గ్రంథం. ఈ భూమండలంలో ఏదైనా నిజమైన గ్రంథం, అల్లాహ్ యొక్క దైవ గ్రంథం ఉండినట్లయితే అది కేవలం ఖురాన్ గ్రంథం మాత్రమే. అసలైన స్థితిలో అలాగే భద్రంగా ఉంది.
ఎంత అభాగ్యులు వారు, ఎవరైతే ఈ గ్రంథాన్ని విడిచిపెట్టి తన జీవితాన్ని సాగిస్తున్నారో. చాలా దురదృష్టవంతులు. అల్లాహ్ యొక్క గ్రంథం ఈ భూమండలం మీద ఉన్నప్పుడు మనలో విశ్వాసం దాన్ని చదవడానికి, దాన్ని పారాయణం చేయడానికి, కంఠస్థం చేయడానికి ఎలా తహతహలాడాలంటే అంత ఉత్సాహంతో ఉండాలి. ఖురాన్ గ్రంథం పట్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి ఉన్నారు, ఎవరైతే ఒక అక్షరం చదువుతాడో దానికి బదులుగా అల్లాహ్ తబారక వ త’ఆలా పది పుణ్యాలు లభింపజేస్తాడు. ఖురాన్ గ్రంథంలో వాక్యాలు, పదాలు అనేక అక్షరాలతో కూడి ఉన్నాయి. అది చదవంగానే అల్లాహ్ తబారక వ త’ఆలా వారికి ఎంతో విలువైన పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. దాని మూలంగా వారి యొక్క విశ్వాసం పెరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం వారికి లభిస్తుంది. కనుక ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి. ఏదైతే మనకు వస్తుందో, ఒక సూరా వచ్చినా, మొత్తం ఖురాన్ వచ్చినా, నిరంతరంగా చదువుతూ ఉండాలి.
అల్లాహ్ తబారక వ త’ఆలా సూరె ఫుర్ఖాన్ లో ఈ విధంగా చెప్తున్నాడు, ప్రళయ దినం నాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సన్నిధిలో అంటారు, “యా రబ్బీ ఇన్న హాజల్ కౌమీత్తఖజూ ఖురాన మహ్జూరా”. ఓ నా ప్రభువా! ఈ నా జాతి వారు ఖురాన్ గ్రంథాన్ని చదవటం విడిచిపెట్టారు. కనుక ఈ స్థితి రాకుండా మనం ఏం చేయాలంటే, ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. దాని దాని కారణంగా మనకు మేలు జరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం దొరుకుతుంది.
8. దరూద్
ఎనిమిదో మార్గం ఏమిటంటే, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ తబారక వ త’ఆలా మన సన్మార్గం కోసం పంపించాడు. ఆయన్ని ప్రవక్తగా చేసిన అల్లాహ్ తబారక వ త’ఆలా మనపై పెద్ద ఉపకారమే చేశాడు. ఆయన చెప్పకపోతే, ఆయన మార్గాన్ని సూచించకపోతే నిజమైన మార్గం మనకు దొరికేది కాదు. అర్థమయ్యేది కాదు. కనుక మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అత్యధికంగా దరూద్ చదువుతూ ఉండాలి.
అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, కమా సల్లయిత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్.
ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై చదివే దరూద్, పంపే దరూద్ అన్నమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించి ఉన్నారు, మీలో ఎవరైతే నాపై ఎక్కువ దరూద్ పంపుతారో, చదువుతారో అతను నాకు సమీపంగా ఉంటాడు. అల్లాహ్ సామీప్యం పొందడానికి ఈ దరూద్ కూడా మనకు తోడ్పాటు అవుతుంది.
9. మంచివారితో స్నేహం
అలాగే తొమ్మిదో మార్గం ఏమిటంటే, మంచి వ్యక్తులతో స్నేహం కలిగి ఉండాలి. స్నేహం అన్నది కేవలం ప్రపంచంలో మనం చెప్పుకుంటా స్నేహం కాదు. సద్వర్తుల స్నేహం. ఎవరైతే అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగి ఉంటాడో, ఎల్లప్పుడూ అల్లాహ్ ని గుర్తు చేస్తూ ఉంటాడో, అల్లాహ్ యొక్క విధేయతను పాటిస్తూ ఉంటాడో, అల్లాహ్ తో ఎవరైతే భయపడుతూ ఉంటారో వారి యొక్క స్నేహాన్ని మనము చేసుకోవాలి. మనము ఇటువంటి వారిని స్నేహించము. మన జీవిత కాలంలో మనకున్న స్నేహాలు, స్నేహితులు వేరు. అల్లాహ్ తబారక వ త’ఆలా ఏదైతే సూచిస్తున్నాడో అది వేరు. కనుక గుర్తుంచుకోవాలి, స్నేహం చేసేటప్పుడు మనలో ఉన్న గుణం ఏమిటి, అది మన స్నేహం ద్వారా వ్యక్తమవుతుంది. ఒక మంచి మనిషి అల్లాహ్ తో భయపడేవాడు, అల్లాహ్ పట్ల సంతుష్టుడయ్యేవాడు, అల్లాహ్ యొక్క దాసులతో ప్రేమిస్తాడు, స్నేహం చేస్తాడు. కనుక మంచి స్నేహితులని ఎన్నుకోవాలి. దాని మూలంగా వారు చేస్తున్న ఆచారాలు, వారు చేస్తున్న కర్మలు మనకు కూడా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. దాని ద్వారా మన విశ్వాసం కూడా, ఈమాన్ కూడా పెరుగుతుంది. తద్వారా అల్లాహ్ సన్నిధిలో మనము కూడా ఒక సామీప్యాన్ని పొందగలుగుతాం.
10. దానం చేయడం
పదోది ఏమిటంటే, దానము చేయటం, పేదవారిపై దానము చేయటం. దానం చేయడాన్ని అల్లాహ్ తబారక వ త’ఆలా ఎంతో మెచ్చుకుంటాడు. అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా చెప్పి ఉన్నాడు, ఏదైతే మీకు నేను ప్రసాదించి ఉన్నానో అందులో నుంచి మీరు ఖర్చు పెట్టండి పేదవారిపై. ఇక్కడ చెప్పవలసిన విషయం ఏమిటంటే, మన దగ్గర ఎంత ఉంది అనేది కాదు, ఏదైతే అల్లాహ్ త’ఆలా మనకు ప్రసాదించి ఉన్నాడో, అది కొంత అయినా ఎంతైనా సరే, అందులో నుంచి ఖర్చు పెట్టి అల్లాహ్ ప్రసన్నత కోరటం అనేది ఇక్కడ మాట. ఎల్లప్పుడూ అల్లాహ్ తబారక వ త’ఆలా కోసం, అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం మనము దానధర్మాలు చేస్తూ ఉండాలి. దీని మూలంగా అల్లాహ్ యొక్క సామీప్యం మనకు దొరుకుతుంది.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులు, సహాబాలు ఎంతో శ్రమపడి అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క ప్రసన్నత కోరేవారు. ఒక సందర్భంలో హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆయన వద్ద ఉన్న అన్ని వస్తువులు తీసుకొచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ప్రవేశపెట్టారు. వారి స్థితిని గమనించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు తో అన్నారు, ఓ అబూబకర్! ఇవన్నీ ఇక్కడికి తీసుకువచ్చావు, ఇంట్లో ఏమి పెట్టుకున్నావు? ఆయన అన్నారు, ప్రవక్తా! నేను ఇంట్లో అల్లాహ్ మరియు ప్రవక్తను వదిలేసి వచ్చాను.
ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులు అల్లాహ్ ప్రసన్నత కోసం అనేక విధాలుగా ఖర్చు పెట్టేవారు. అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొందాలని.
ఈ పది సూత్రాలు, పది మార్గాలు ఉన్నాయి అల్లాహ్ యొక్క సామీప్యం పొందడానికి.
అల్లాహ్ సామీప్యం యొక్క ఫలితం
అయితే ఇప్పుడు చెప్పవలసిన విషయం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సామీప్యం మనం పొందినట్లయితే, అప్పుడు అల్లాహ్ తబారక వ త’ఆలా మా యొక్క ప్రతి మాటను వింటూ ఉంటాడు, మేము కోరేదానికి అల్లాహ్ తబారక వ త’ఆలా ప్రసాదిస్తూ ఉంటాడు. ఒక హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, ‘లవ్ అఖ్సమ అలల్లాహి ల అబర్రహ్’. అల్లాహ్ సామీప్యం పొందినవాడు ఎప్పుడైనా అల్లాహ్ మీద ప్రమాణం చేస్తే అల్లాహ్ తబారక వ త’ఆలా అతని యొక్క ప్రమాణాన్ని పూర్తి చేస్తాడు.
అదే విధంగా మరో హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క సామీప్యం పొందినవాడు అల్లాహ్ యొక్క స్నేహితుడు అవుతాడు, వలీ అవుతాడు. ఎవరైతే అల్లాహ్ యొక్క వలీతో ఏదైనా విషయం పట్ల హాని కలిగించినట్లయితే అల్లాహ్ తబారక వ త’ఆలా అంటున్నాడు, అతను తోనే అతనితో నేను యుద్ధం చేయడానికి సిద్ధమై ఉన్నాను. అల్లాహ్ మిత్రుల పట్ల, అల్లాహ్ యొక్క సామీప్యం పొందిన వారి పట్ల అల్లాహ్ తబారక వ త’ఆలా ఏం చెప్తున్నాడంటే, అతనిని నేను మెచ్చుకుంటాను, అతనిని నేను ఇష్టపడతాను, అతను ఏ చేతిలోనైతే పట్టుకుంటుంటాడో ఆ చేతిని నేను అయిపోతాను. ఏ కాలి ద్వారా అయితే అతను నడుస్తూ ఉంటాడో ఆ కాలును నేను అయిపోతాను. ఏ కళ్ళ ద్వారా అతను చూస్తూ ఉంటాడో ఆ కళ్ళు నేను అయిపోతాను. అని ఎంతో ప్రేమతో, ఎంతో ప్రసన్నతతో అల్లాహ్ తబారక వ త’ఆలా చెప్తున్నాడు.
అల్లాహ్ యొక్క సామీప్యం మనం పొందినట్లయితే మన యొక్క ప్రతి మాట అల్లాహ్ తబారక వ త’ఆలా వింటాడు. మేము ఏది కోరితే అల్లాహ్ తబారక వ త’ఆలా అది మాకు ప్రసాదిస్తాడు.
కనుక చివరిగా అల్లాహ్ తబారక వ త’ఆలా తో దుఆ ఏమనగా, ఏవైతే మనం విన్నామో ఆ మాటలని గుర్తించి సరైన మార్గంపై నడిచే భాగ్యాన్ని అల్లాహ్ తబారక వ త’ఆలా మాకు ప్రసాదించు గాక. అల్లాహ్ తబారక వ త’ఆలా ఏవైతే విధిగా చేసి ఉన్నాడో వాటిని ఆచరించి అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే భాగ్యాన్ని అల్లాహ్ త’ఆలా మనకు ప్రసాదించు గాక. ఆమీన్.
వ ఆఖిరు ద’అవానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో షిర్క్ (బహుదైవారాధన) ఇస్లాంలో అత్యంత ఘోరమైన పాపం మరియు నేరం అనే అంశంపై దృష్టి సారించారు. సాధారణంగా ప్రజలు హత్య లేదా అత్యాచారం వంటి నేరాలను అతిపెద్దవిగా భావిస్తారని, కానీ ఖురాన్ మరియు హదీసుల ప్రకారం, అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించడమే (షిర్క్) అన్నింటికన్నా పెద్ద పాపమని వక్తవివరిస్తారు. షిర్క్ యొక్క తీవ్రమైన పరిణామాలను, అంటే చేసిన మంచి పనులన్నీ వృధా కావడం, స్వర్గం నిషేధించబడటం మరియు నరకంలో శాశ్వత శిక్ష వంటి వాటిని ఖురాన్ ఆయతుల ద్వారా ఉటంకిస్తారు. ఇంకా, షిర్క్ రెండు రకాలుగా ఉంటుందని వివరిస్తారు: షిర్క్-ఎ-అక్బర్ (పెద్ద షిర్క్), ఇది ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది, మరియు షిర్క్-ఎ-అస్గర్ (చిన్న షిర్క్). చిన్న షిర్క్‌లో అల్లాహ్ తప్ప ఇతరుల మీద ప్రమాణం చేయడం, తాయెత్తులు కట్టడం, మరియు రియా (ప్రదర్శన కోసం ఆరాధనలు చేయడం) వంటివి ఉంటాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా తెలియజేస్తారు. ప్రతి ముస్లిం ఈ ఘోరమైన పాపం నుండి దూరంగా ఉండాలని, తన ఆరాధనలను కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేయాలని వక్త ప్రబోధిస్తారు.
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.
رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي [రబ్బిష్రహ్ లీ సద్రీ, వ యస్సిర్ లీ అమ్ రీ, వహ్ లుల్ ఉఖ్ దతమ్ మిల్ లిసానీ, యఫ్ ఖహూ ఖౌలీ] (ఓ నా ప్రభూ! నా హృదయాన్ని నా కొరకు విశాలపరచు. నా కార్యాన్ని నాకు సులభతరం చెయ్యి. నా నాలుకలోని ముడిని విప్పు. ప్రజలు నా మాటను సులభంగా అర్థం చేసుకునేటట్లు చెయ్యి.) (20:25-28)
షిర్క్ – ఒక పెద్ద నేరం
గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి నా జుమా ప్రసంగ అంశం, షిర్క్ ఒక పెద్ద నేరం.
అభిమాన సోదరులారా, సాధారణంగా నేరాలన్నింటిలో పెద్ద నేరం ఏమిటి? పాపాలన్నింటిలో పెద్ద పాపం ఏమిటి? అని ప్రశ్నించినప్పుడు, ధర్మజ్ఞానము లేని వారు లేదా అంతంత మాత్రమే ధర్మజ్ఞానం ఉన్నవారు నేరాలన్నింటిలో పెద్ద నేరం అంటే, ప్రజల ప్రాణాలు హరించటం పెద్ద నేరం అని సమాధానం ఇస్తారు. మరి కొంతమంది అయితే అమ్మాయిలపై బలాత్కారాలు చేయటం, అత్యాచారాలు చేయటం పెద్ద నేరం అండి అని కొంతమంది సమాధానం ఇస్తారు. అలాగే మరికొంతమంది ప్రజల సొమ్ము దోచేయటం, లూటీలు చేయటం పెద్ద నేరం అండి అని ఈ విధంగా రకరకాల సమాధానాలు ఇస్తూ ఉంటారు.
నిజం ఏమిటంటే, ఇవన్నీ పెద్ద నేరాలే. కానీ వీటన్నింటికంటే కూడా ఒక పెద్ద నేరం ఉంది. అది బలాత్కారాలు చేయడం కంటే కూడా పెద్ద నేరము, లూటీలు దోపిడీలు చేయటం కంటే కూడా పెద్ద నేరము, ప్రజల ప్రాణాలు హరించటము కంటే కూడా పెద్ద నేరము. ఆ నేరం గురించి మాత్రము ఎక్కువ మందికి తెలియదు, చాలా తక్కువ మంది మాత్రమే ఆ దాని గురించి తెలుసుకొని ఉన్నారు. ఆ అంత పెద్ద నేరం ఏమిటి ఆ పెద్ద నేరం అంటే అభిమాన సోదరులారా, షిర్క్! బహుదైవారాధన. అల్లాహ్‌కు ఇతరులను సాటి కల్పించటం. ఇది పాపాలన్నింటిలో, నేరాలన్నింటిలో పెద్ద నేరము, పెద్ద పాపము.
అరే! అది అంత పెద్ద పాపం అని మీరు ఎలా చెప్పగలరండీ అని మీరు ప్రశ్నిస్తారేమో? ఇది నా మాట కాదు. నేను నా తరఫున ప్రకటిస్తున్న విషయము కాదు. అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షిర్క్ బహుదైవారాధన పెద్ద నేరము అని పాపాలన్నింటిలో నేరాలన్నింటిలో పెద్ద నేరము అని ప్రకటించి ఉన్నారు.
మనం చూసినట్లయితే, సూరా లుఖ్మాన్‌లోని 13వ వాక్యంలో ఈ విధంగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు:
అలాగే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఒక వ్యక్తి ఈ విధంగా ప్రశ్నించాడు. యా రసూలల్లాహ్, అయ్యు జంబి అక్బరు ఇందల్లాహ్? అల్లాహ్ దృష్టిలో పెద్ద నేరము ఏమిటి? అల్లాహ్ దృష్టిలో పెద్ద పాపము ఏమిటి? అని ఆ వ్యక్తి ప్రశ్నించగా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తికి ఈ విధంగా సమాధానం ఇచ్చారు, అన్ తజ్ అల లిల్లాహి నిద్దన్ వహువ ఖలఖక. నీకు పుట్టించిన ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో ఇతరులను సాటి కల్పించడం, సహవర్తులుగా నిలబెట్టడం, ఇది నేరాలన్నింటిలో, పాపాలన్నింటిలో పెద్ద నేరము, పెద్ద పాపము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తికి సమాధానం ఇచ్చారు.
అలాగే మరొక సందర్భంలో శిష్యుల వద్ద ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రశ్నించారు. ఏమన్నారంటే, అలా ఉనబ్బిఉకుం బి అక్బరిల్ కబాయిర్? ఏమండీ నేను మీకు పాపాలలోనే పెద్ద పాపము, ఘోరాలలోనే పెద్ద ఘోరము, నేరాలలోనే పెద్ద నేరము దాని గురించి మీకు తెలుపనా అని తెలియజేశారు. శిష్యులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, బలా యా రసూలల్లాహ్. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తప్పనిసరిగా దాని గురించి మాకు మీరు తెలియజేయండి అనగా, అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదటిగా ప్రస్తావించిన విషయం ఏమిటంటే, అల్ ఇష్రాకు బిల్లాహ్. అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించటం, అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టటం, ఇది పెద్ద పాపాలలోనే పెద్ద పాపము, పెద్ద నేరము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంలో ప్రకటించారు.
అలాగే మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజానికి ఏడు ప్రాణాంతకమైన విషయాల గురించి హెచ్చరించి ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, ఇజ్తనిబుస్ సబ్అల్ మూబిఖత్. ఏడు ప్రాణాంతకమైన విషయాల నుండి మీరు దూరంగా ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అన్నారు. ఆ ఏడు విషయాలు ఏమిటంటే అందులోని మొదటి విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అష్షిర్కు బిల్లాహ్. అల్లాహ్‌తో ఇతరులను సహవర్తులుగా నిలబెట్టడం, షిర్క్ చేయటం, ఇది ఏడు ప్రాణాంతకమైన పాపాలలో మొదటి పాపము అన్నారు.
అభిమాన సోదరులారా! అటు అల్లాహ్ వాక్యము ద్వారా, ఇటు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పలుకుల ద్వారా మనకు ఒక విషయం మాత్రము స్పష్టంగా అర్థమైపోయింది, అది ఏమిటంటే షిర్క్ చేయటం, బహుదైవారాధన చేయటం, అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించటం, ఇది ఘోరమైన నేరం, పెద్ద పాపము అని స్పష్టమయ్యింది.
షిర్క్ యొక్క పరిణామాలు
ఇక రండి, ఈ షిర్క్ చేస్తే, ఈ పాపానికి ఎవరైనా ఒడిగడితే అతనికి జరిగే పరిణామం ఏమిటి? అతనికి జరిగే నష్టం ఏమిటి? అది కూడా మనము ఇన్షా అల్లాహ్ ఖురాన్ మరియు హదీసు గ్రంథాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
షిర్క్ చేసే వ్యక్తికి కలిగే ఒక నష్టం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆ వ్యక్తికి స్వర్గం నుండి దూరంగా ఉంచేస్తాడు. ఎవరైతే షిర్క్‌కు పాల్పడతారో వారి కోసము స్వర్గం నిషేధించబడుతుంది. వారి నివాసం నరకమైపోతుంది. మనం చూసినట్లయితే ఖురాన్‌లోని సూరా మాయిదా 72వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:
అలాగే అభిమాన సోదరులారా, షిర్క్ చేసే వానికి కలిగే మరొక నష్టం ఏమిటంటే, అతని సత్కార్యాలు అన్నీ, అతని కర్మలన్నీ, అతని పుణ్యాలు అన్నీ తుడిచివేయబడతాయి. ఖురాన్‌లోని సూరా జుమర్ 65వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హెచ్చరిస్తూ ఈ విధంగా తెలియజేస్తున్నాడు:
وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” (39:65)
అల్లాహు అక్బర్. స్వయంగా ప్రవక్తలలో గొప్ప ప్రవక్త, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాకీదు చేస్తున్నాడు, ఒకవేళ నీవు గనుక షిర్క్‌కు పాల్పడినట్లయితే, నీ కర్మలన్నీ వృధా చేయబడతాయి అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయనకే, అంత గొప్ప వ్యక్తికే అంత గొప్ప మహా ప్రవక్తకే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాకీదు చేస్తున్నాడంటే, మీలాంటి, నాలాంటి, మనలాంటి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏమిటి అభిమాన సోదరులారా ఒక్కసారి ఆలోచించండి.
కాబట్టి ఇదే విషయము ఖురాన్‌లోని సూరా అన్ఆమ్ 88వ వాక్యంలో మనం చూచినట్లయితే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అక్కడ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు:
ذَٰلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُم مَّا كَانُوا يَعْمَلُونَ ఇదీ అల్లాహ్ మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు. ఒకవేళ వీరు సైతం, దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి. (6:88)
ఇక్కడ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కొంతమంది ప్రవక్తల ప్రస్తావన చేసి చివరికి ఏమంటున్నారంటే, ఇలాంటి ప్రవక్తలు కూడా ఒకవేళ షిర్క్‌కు పాల్పడినట్లయితే, బహుదైవారాధనకు గురైనట్లయితే, అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించినట్లయితే, వారి సత్కార్యాలన్నీ వృధా అయిపోతాయి అంటున్నాడు. కాబట్టి దీని ద్వారా మనకు ఒక విషయం మాత్రము స్పష్టమవుతుంది, అదేమిటంటే అభిమాన సోదరులారా, ఏ వ్యక్తి అయితే షిర్క్ చేస్తాడో, ఏ వ్యక్తి అయితే అల్లాహ్‌తో ఇతరులను సహవర్తులుగా, సాటిగా నిలబెడతాడో, అతని సత్కార్యాలు అన్నీ అతని కర్మలన్నీ వృధా చేయబడతాయి.
అలాగే అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా మనకు తెలియజేసి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆ విషయం మనము జీవితంలో ప్రతివేళ గుర్తు చేసుకుంటూ ఉండాలి. అదేమిటంటే సూరా నిసాలోని 48వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేసి ఉన్నాడు:
إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. (4:48)
అంటే తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని షిర్క్‌ను అల్లాహ్ సుతరాము క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అంటే షిర్క్ తప్ప ఇతర పాపాలు మనిషి చేసి ఉంటే అల్లాహ్ తలిస్తే వాటిని క్షమించగలడేమో గానీ, షిర్క్‌ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా క్షమించడు అని ఈ వాక్యంలో స్పష్టంగా మనకు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి, అభిమాన సోదరులారా, షిర్క్ పెద్ద నేరము అని, షిర్క్ క్షమించరాని నేరము అని, షిర్క్ వల్ల మనిషి స్వర్గానికి దూరమైపోతాడు, నరకానికి చేరుకుంటాడని, అతని కర్మలన్నీ వృధా చేయబడతాయని ఇంతవరకు విన్న విషయాలలో మనము అర్థం చేసుకున్నాము.
షిర్క్ రకాలు
ఇక రండి, షిర్క్ గురించి మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఉంది అదేమిటంటే, షిర్క్ రెండు రకాలు అభిమాన సోదరులారా. ఒకటి షిర్కె అక్బర్, రెండవది షిర్కె అస్గర్. షిర్కె అక్బర్ అంటే ఇప్పటివరకు మనం విన్నాము కదా, అల్లాహ్ దగ్గర చేయవలసిన కార్యాలు అల్లాహ్ వద్ద కాకుండా ఇతరుల వద్ద చేస్తే, అల్లాహ్‌కు ఇతరులను సాటి కల్పిస్తే అది షిర్కె అక్బర్ అవుతుంది. మరి షిర్కె అస్గర్ అంటే ఏమిటి? అభిమాన సోదరులారా, ఆ విషయము కూడా మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా స్పష్టంగా తెలియజేసి ఉన్నారు.
షిర్కె అస్గర్ రెండు రకాలు. చిన్న షిర్క్ రెండు రకాలు. ఒకటి బహిర్గతంగా కనిపించే షిర్క్, రెండవది కనిపించకుండా రహస్యంగా ఉండే షిర్క్.
బహిర్గతంగా కనిపించే చిన్న షిర్క్ ఏమిటి అంటే అభిమాన సోదరులారా, ఒకటి అల్లాహ్‌ను కాకుండా ఇతరుల మీద ప్రమాణం చేయటం. అల్లాహ్‌ను వదిలేసి ఇతరుల మీద ప్రమాణం చేయటం. మనం చూస్తూ ఉంటాం, ఏదైనా సందర్భంలో ఏదైనా ఒక మాట స్పష్టంగా ప్రజలకు నమ్మ జెప్పాలంటే చాలామంది ఏమంటుంటారంటే, నా తల్లి మీద నేను ప్రమాణం చేస్తున్నాను, నా తల్లి సాక్షిగా, నా బిడ్డల మీద నేను ప్రమాణం చేస్తున్నాను, నా బిడ్డల సాక్షిగా, నేను నడుపుతున్న బండి మీద నేను ప్రమాణం చేస్తున్నాను, ఈ బండి సాక్షిగా అని రకరకాల విషయాల మీద వాళ్లు ప్రమాణం చేస్తూ ఉంటారు. అయితే అభిమాన సోదరులారా, ఇలా చేయటం ధర్మ సమ్మతము కాదు. ఒకవేళ మనిషికి ప్రమాణం చేయటం తప్పనిసరి అయితే అతను కేవలం అల్లాహ్ పేరు మీద మాత్రమే ప్రమాణం చేయాలే గానీ ఇతరుల పేరు మీద ప్రమాణం చేయకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్ పేరు మీద కాకుండా ఇతరుల పేరు మీద ప్రమాణం చేస్తే ఆ వ్యక్తి కూడా షిర్క్ చేసినట్లు అవుతుంది, చిన్న షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పలుకులు వినండి, ఆయన తెలియజేశారు: మన్ హలఫ బిగైరిల్లాహి ఫఖద్ కఫర ఔ అష్రక. ఎవరైతే అల్లాహ్ కాకుండా ఇతరుల మీద ప్రమాణం చేస్తాడో అతను కుఫ్రుకు పాల్పడినట్లు లేదా షిర్క్‌కు పాల్పడినట్లు.
అలాగే అభిమాన సోదరులారా, చిన్న షిర్క్ యొక్క కనిపించే రెండో విషయం ఏమిటంటే, తాయెత్తులు వేలాడదీయటం. చాలామంది చేతుల్లో, మెడలలో, నడుము మీద, కాళ్ళ మీద తాయెత్తులు కట్టుకొని ఉంటారు. అభిమాన సోదరులారా, తాయెత్తులు కట్టటము కూడా ధర్మ సమ్మతము కాదు, నిషేధమైన కార్యము. ఎవరైనా వ్యక్తి తాయెత్తులు కట్టినట్లయితే అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది, అతను కూడా చిన్న షిర్క్ చేసినట్లు అవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అల్లఖ తమీమతన్ ఫఖద్ అష్రక. ఎవరైతే తాయెత్తులు కట్టాడో అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లే.
ఇది చిన్న షిర్క్‌లో బహిర్గతంగా కనిపించే షిర్క్.
ఇక రండి అభిమాన సోదరులారా, చిన్న షిర్క్‌లో కనిపించకుండా రహస్యంగా ఉండే ఒక షిర్క్ ఉంది, అదేమిటంటే రియా అని తెలుగులో అంటారు, ప్రదర్శనా బుద్ధితో చేసే సత్కార్యాలు అని తెలుగులో అంటారు. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను ఎక్కువగా ఈ షిర్కె అస్గర్ గురించి భయపడుతూ ఉన్నాను అన్నారు. శిష్యులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నించారు, ఓ దైవ ప్రవక్త, ఈ చిన్న షిర్క్ అంటే ఏమిటండీ, దీని గురించి మీరు కంగారు పడుతున్నారు అని ప్రశ్నించగా అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆయన పలుకులు వినండి, అఖ్వఫు మా అఖాఫు అలైకుం అష్షిర్కుల్ అస్గర్. ఖాలూ యా రసూలల్లాహ్ వమష్షిర్కుల్ అస్గర్? ఖాల అర్రియా. అంటే మీ విషయంలో నాకు అన్నిటికన్నా అధికంగా షిర్కె అస్గర్ చిన్న షిర్క్ గురించి భయమేస్తుంది. దైవ ప్రవక్త ఆ షిర్కె అస్గర్ అంటే ఏమిటి అని శిష్యులు అడిగినప్పుడు ఆయన అన్నారు, ప్రదర్శనా బుద్ధితో పని చేయటం.
అభిమాన సోదరులారా, ఒక వ్యక్తి నమాజు చేస్తున్నాడు, ఉపవాసాలు పాటిస్తున్నాడు, దానధర్మాలు చేస్తున్నాడు, జకాతు చెల్లిస్తున్నాడు, ఉమ్రా హజ్జులు ఆచరిస్తున్నాడు, అయితే అతను అల్లాహ్ ప్రసన్నత కోసం ఈ విషయాలన్నీ చేయట్లేదు గానీ ప్రజల దృష్టిలో నేను ఉత్తముడ్ని, భక్తుడ్ని అని నాకు పేరు ప్రతిష్టలు రావాలి అనే బుద్ధితో ఆ సంకల్పంతో అతను ఈ విషయాలు చేస్తే దీనినే రియా అంటారు, ప్రదర్శనా బుద్ధితో చేసిన సత్కార్యాలు అంటారు. ఇలా చేస్తే అభిమాన సోదరులారా, షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది. ఎందుకంటే సత్కార్యాలు, ఆరాధనలు కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు మాత్రమే చేయాలి గానీ ప్రదర్శనా బుద్ధితో చేయరాదు. ఎవరైనా ప్రదర్శనా బుద్ధితో చేస్తున్నట్టే అతను అల్లాహ్ ప్రసన్నత కోరుకోవట్లేదు గానీ ప్రజల ప్రసన్నత కోరుకుంటున్నాడు కాబట్టి అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది అభిమాన సోదరులారా.
అయితే మన బాధ్యత ఏమిటి? ఇప్పటివరకు మనం షిర్క్ గొప్ప షిర్క్ పెద్ద నేరమని తెలుసుకున్నాము. షిర్క్ రెండు రకాలు, షిర్క్ పెద్దది ఒకటి, చిన్నది ఒకటి అని తెలుసుకున్నాము. అలాగే పెద్ద షిర్క్‌కి, చిన్న షిర్క్‌కి ఉన్న తేడా ఏమిటో కూడా తెలుసుకోవాలి. అదేమిటంటే అభిమాన సోదరులారా, పెద్ద షిర్క్ చేసిన వారికి నరకశిక్ష విధించబడుతుంది, వారు స్వర్గం నుంచి దూరమైపోతారు, వారి సత్కార్యాలన్నీ వృధా చేయబడతాయి. అయితే చిన్న షిర్క్‌కు పాల్పడిన వారి సత్కార్యాలు మాత్రం వృధా చేయబడవు, వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాత్కాలిక శిక్షలు వేసి మళ్లీ శిక్షలు ముగిసిన తర్వాత స్వర్గానికి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ప్రదర్శనా బుద్ధితో ఏ ఏ సత్కార్యాలు ఆరాధనలు వారు చేసి ఉంటారో కేవలం ఆ సత్కార్యాలు, ఆ ఆరాధనలు మాత్రమే వృధా చేయబడతాయి.
కాబట్టి అభిమాన సోదరులారా, ఒక భక్తునిగా మనందరి బాధ్యత ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము షిర్క్‌కి పాల్పడకూడదు. అందుకోసమే మనం చూచినట్లయితే గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే గతించారో, వారు మరణించే ముందు వారి సంతానాన్ని పిలిచి షిర్క్‌కు పాల్పడవద్దు అని తాకీదు చేసి మరీ మరణించారు.
ఖురాన్‌లో లుక్మాన్ అలైహిస్సలాం వారి గురించి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రస్తావించి ఉన్నాడు. సూరా లుక్మాన్‌లో లుక్మాన్ అలైహిస్సలాం ఆయన కుమారుని పిలిచి ఏమంటున్నారంటే, “ఓ కుమారా, నీవు షిర్క్‌కు పాల్పడవద్దు. ఎందుకంటే షిర్క్ పెద్ద నేరము, ఘోరమైన పాపము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీవు షిర్క్‌కు పాల్పడవద్దు” అని తెలియజేశారు.
అదేవిధంగా ప్రవక్తలు, ఇతర గొప్ప గొప్ప భక్తులు వారి సంతానానికి, అనుచర సమాజానికి తెలియజేసిన విషయం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు అల్లాహ్‌ను వదిలి ఇతరులను ఆరాధించకండి, అల్లాహ్‌కు ఇతరులను సహవర్తులుగా సాటిగా కల్పించకండి, మీకు నిలువునా చీల్చేసేసినా సరే, మీకు సజీవంగా దహనం చేసేసినా సరే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బహుదైవారాధన, షిర్క్ చేయవద్దు, చేయవద్దు, చేయవద్దు అని తెలియజేసి ఉన్నారు.
కాబట్టి అభిమాన సోదరులారా, మనందరి బాధ్యత ఏమిటంటే మనం కేవలం అల్లాహ్‌నే ఆరాధించాలి, అల్లాహ్ మీదే నమ్మకం ఉంచాలి, ఆయన ప్రసన్నత కోసం మాత్రమే సత్కార్యాలు చేయాలి. అల్లాహ్‌తో నేను దుఆ చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ షిర్క్ నుండి కాపాడి, అల్లాహ్ ప్రసన్నత కోసం అల్లాహ్ ఆరాధనలు చేయడానికి మల్లా మనందరికీ భాగ్యము కల్పించు గాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మక్కా విశిష్టత (Importance of Makkah) https://youtu.be/TLNWmdSKxEk [43 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, మక్కా నగరం యొక్క ఇస్లామీయ ప్రాముఖ్యత, ఘనత మరియు పవిత్రత గురించి వివరించబడింది. అల్లాహ్ తన సృష్టిలో కొన్ని ప్రదేశాలకు, కాలాలకు మరియు వ్యక్తులకు ఇతరులపై ఘనతను ప్రసాదించాడని, ఇది ఆయన సంపూర్ణ వివేకం మరియు శక్తికి నిదర్శనమని ప్రసంగం మొదలవుతుంది. మక్కా అల్లాహ్ కు అత్యంత ప్రియమైన ప్రదేశమని, అది మానవాళి కోసం నిర్మించబడిన మొట్టమొదటి ఆరాధన గృహం (కాబా) ఉన్న నగరమని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేయబడింది. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం చరిత్ర, ఆయన తన భార్య హాజర్ మరియు కుమారుడు ఇస్మాయిల్ ను ఆ నిర్జన ప్రదేశంలో వదిలి వెళ్ళడం, జమ్ జమ్ బావి ఆవిర్భావం మరియు మక్కా నగరం ఎలా ఏర్పడిందో వివరించబడింది. మక్కా యొక్క పవిత్రత (హరమ్), అక్కడ వర్తించే ప్రత్యేక నియమాలు, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో దానికున్న ప్రాముఖ్యత కూడా చర్చించబడ్డాయి. చివరగా, కాబా మరియు హజర్ అల్-అస్వద్ (నల్లరాయి) గురించి ఉన్న కొన్ని అపోహలను తొలగించి, వాటి వాస్తవ ఇస్లామీయ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రసంగం ముగుస్తుంది.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వబరకాతుహు. అల్ హందులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహ్, అమ్మా బ’అద్.
أَعُوذُ بِاللَّهِ السَّمِيعِ الْعَلِيمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ శాపగ్రస్తుడైన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.
నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన (దైవ) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను. అందులో స్పష్టమయిన సూచనలున్నాయి. మఖామె ఇబ్రాహీం (ఇబ్రాహీం నిలబడిన స్థలం) ఉన్నది. అందులోకి ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు. (3:96-97)
సర్వ స్తోత్రములు, అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు అన్నీ కూడా మనందరి ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. ఆయనే మనందరి ఏకైక, ఏ భాగస్వామి లేని నిజమైన ఆరాధ్యుడు. ఆ తర్వాత, లెక్కలేనన్ని సలాత్ సలాం, కరుణలు, శాంతులు ప్రత్యేకంగా చిట్టచివరి ప్రవక్త, దయామయ మహనీయ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఇతర ప్రవక్తలందరిపై కురియు గాక.
సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా! అల్లాహు త’ఆలా సర్వ సృష్టికర్త, సర్వ అధికారుడు, ఎలాంటి ఏ భాగస్వామి లేనివాడు. ఆయన కోరినది సృష్టిస్తాడు మరియు తన సృష్టిలో ఎవరికి ఏ హోదా, అంతస్తు, ఎవరికి ఎలాంటి ప్రత్యేకత ఇవ్వాలో ఇస్తాడు. అందులో అతన్ని అడిగేవారు ఎవరూ లేరు.
لَا يُسْأَلُ عَمَّا يَفْعَلُ وَهُمْ يُسْأَلُونَ ఆయన తన చేష్టలకు ఎవరికీ జవాబు చెప్పుకోవలసిన అవసరం లేదు, కాని వారే (మానవులే) జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. (21:23)
అల్లాహ్ చేసిన దానిలో అల్లాహ్ ను ప్రశ్నించేవాడు ఎవడూ లేడు.
وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు. (28:68)
అల్లాహు త’ఆలా కోరినది సృష్టిస్తాడు, యఖ్తార్, ఎన్నుకుంటాడు. అల్లాహు త’ఆలా ఈ విధంగా తన సృష్టిలో ఎన్నుకోవడంలో అద్వితీయుడు, అతనికి ఏ భాగస్వామి లేడు. అతడు ఒకరితో ఏదైనా సలహా, సంప్రదింపులు చేసి, వారి కోరికలను అనుసరించడానికి ఏదైనా లొంగిపోయి ఉంటాడు, న’ఊదు బిల్లాహ్, ఇలాంటి ప్రసక్తి ఏ మాత్రం లేదు. అయితే ఇలా అల్లాహు త’ఆలా అద్వితీయుడు కావడం, ఎన్నుకునే విషయంలో ఇది అతని యొక్క, అతని యొక్క రుబూబియ్యత్, ఆ అల్లాహ్ యొక్క సంపూర్ణ వివేకం మరియు అతడే సర్వశక్తిమంతుడు అన్నదానికి గొప్ప నిదర్శనం.
అల్లాహ్ యొక్క ఘనత మరియు ఆయన ఎంపికలు
అయితే అల్లాహు త’ఆలా కొందరి ప్రజలను మరికొందరిపై, కొందరు ప్రవక్తలను మరికొందరి ప్రవక్తలపై, కొన్ని ప్రాంతాలను మరికొన్ని ప్రాంతాలపై, కొన్ని నెలలను మరికొన్ని నెలలపై, కొన్ని రోజులను మరికొన్ని రోజుల పై, కొన్ని రాత్రులను మరికొన్ని రాత్రులపై, కొన్ని సత్కార్యాలను మరికొన్ని సత్కార్యాలపై ఘనత ప్రసాదించాడు. సర్వ సృష్టిలో, అంటే అల్లాహ్ తప్ప సర్వమూ వాటిలన్నింటిలోకెల్లా, వాటన్నిటిలోకెల్లా అత్యుత్తములు, అతి గొప్పవారు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. విశ్వాసాల్లో, సత్కార్యాల్లో, అన్ని విషయాల్లో అతి గొప్ప ఘనత గలది తౌహీద్, లా ఇలాహ ఇల్లల్లాహ్. అల్లాహ్ మాత్రమే ఏ భాగస్వామి లేకుండా ఆరాధ్యనీయుడు అని నమ్మడం, విశ్వసించడం, అలా ఆచరించడం.
ఇస్లామీయ 12 నెలల్లో రమదాన్ మాసానికి చాలా గొప్ప ఘనత ఉంది. రాత్రుల్లో లైలతుల్ ఖద్ర్ కి చాలా గొప్ప ఘనత ఉంది. మరియు రోజుల్లో, పగల్లో యౌమున్నహర్, ఖుర్బానీ చేసేటటువంటి రోజు, ఈదుల్ అద్ హా అది చాలా గొప్ప ఘనత గల రోజు. అయితే ప్రదేశాల్లో, ప్రాంతాల్లో అల్లాహ్ కు అత్యుత్తమ, అతి ప్రియమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే, మొట్టమొదటి స్థానంలో అది మక్కతుల్ ముకర్రమా.
మక్కతుల్ ముకర్రమా గురించి ఈ రోజు నేను జియోగ్రాఫికల్ పరంగా నేను మాట్లాడను. మక్కాకు అల్లాహు త’ఆలా ఈ రకంగా కూడా ఏ ఘనతలు ప్రసాదించి ఉన్నాడో దాని యొక్క వివరణలోకి వెళ్ళను. కానీ అల్లాహ్ కు అత్యంత ప్రియమైన ప్రదేశం ఇది అని మనకు అంటే మక్కా అని ముస్నద్ అహ్మద్ యొక్క హదీస్ ద్వారా కూడా తెలుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు?
వల్లాహి, ఇన్నకి లఖైరు అర్దిల్లాహ్, వ అహబ్బు అర్దిల్లాహి ఇలల్లాహ్. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ఓ మక్కా, నీవు అల్లాహ్ భూమిలో అత్యంత ఖైర్, మేలు, శుభం ఉంది నీలో మరియు అల్లాహ్ కు, అల్లాహ్ యొక్క ఈ భూమిలో అత్యంత ప్రియమైన ప్రదేశం నీవు.
వలవ్ లా అన్నీ ఉఖ్రిజ్తు మిన్కి మా ఖరజ్తు. నన్ను ఈ మక్కా నుండి వెలివేయడం జరిగింది, లేదా అంటే నేను మక్కా నుండి వెళ్లి మదీనాలో స్థావరం అక్కడ వలస చేసి అక్కడ ఉండటం అలా చేసేవాడిని కాదు.
అల్లాహు త’ఆలా ఈ మక్కా నగరం, దీని యొక్క ప్రమాణాలు చేసి ఉన్నాడు, లా ఉక్సిము బిహాదల్ బలద్ అని.
అల్లాహు త’ఆలా ఈ సర్వ భూమండలంపై తన ఆరాధనా కేంద్రంగా నిర్మించడానికి ఆదేశం ఇచ్చినటువంటి ఆ ప్రదేశం మక్కాలో ఉంది. ఆ ఆయతులే నేను ఆరంభంలో చదివాను, సూరత్ ఆలి ఇమ్రాన్, సూర నెంబర్ 3, ఆయత్ నెంబర్ 95.
నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన (దైవ) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను. (3:96)
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో అబూ దర్ రదియల్లాహు త’ఆలా అన్హు ప్రశ్నించారు, అయ్యు మస్జిదిన్ వుది’అ ఫిల్ అర్ది అవ్వల్. ప్రప్రథమంగా ఈ భూమండలంపై నిర్మించబడినటువంటి మస్జిద్ ఏ మస్జిద్ అని అడిగినప్పుడు, అల్ మస్జిదుల్ హరాం. కాబతుల్లాహ్, దాని చుట్టూ ఉన్నటువంటి మస్జిద్-ఎ-హరాం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. సహీ బుఖారీ, సహీ ముస్లిం లోని హదీస్.
సోదర మహాశయులారా, ఇబ్రాహీం అలైహిస్సలాం కాలం కంటే ముందు ఎందరో ప్రవక్తలు ఈ ప్రపంచంలో వచ్చారు. ఆదం అలైహిస్సలాం ఆది మానవులతో పాటు ప్రవక్త కూడా. ఆదం అలైహిస్సలాం తర్వాత ఇద్రీస్, షీత్ అలైహిస్సలాం లాంటి ప్రవక్తలు కూడా వచ్చారు. కానీ షిర్క్ ను ఖండిస్తూ, తౌహీద్ ను ధ్రువపరుస్తూ, తౌహీద్ వైపునకు ప్రజలను ఆహ్వానించడానికి వచ్చినటువంటి మొట్టమొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం. ఆ తర్వాత హూద్ అలైహిస్సలాం, సాలిహ్ అలైహిస్సలాం ఎందరో వచ్చారు. మనకు కొన్ని ఉల్లేఖనాల ద్వారా వారు కూడా హజ్ చేశారు అన్నటువంటి విషయం తెలుస్తుంది. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఇచ్చిన ఆదేశం ప్రకారం నూహ్ అలైహిస్సలాం కాలంలో వచ్చిన తూఫాన్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే కాబతుల్లాహ్ ఉన్నదో దాని చుట్టుపక్కల ఆ మక్కా నగరం, ఆ కాబతుల్లాహ్ చుట్టుపక్కల ఉన్నటువంటి పర్వతాలు, ఆ పర్వతాలు ఉండినవి కానీ కాలాల తరబడి ఎవరూ కూడా అక్కడ వచ్చి నివసించేవారు కాదు.
అయితే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అతని యొక్క పనులలో ఎలాంటి హిక్మత్, ఔచిత్యాలు ఉంటాయో, ఎలాంటి వివేకాలు ఉంటాయో అన్నీ మనము గ్రహించలేము. కేవలం అల్లాహు త’ఆలా తన దయ కరుణతో తెలిపిన కొన్ని విషయాలు తప్ప.
అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం మొదటి భార్య సారాతో ఏ సంతానము కలగలేదు. ఆ తర్వాత రెండో భార్య హాజర్ తో అల్లాహు త’ఆలా ఇస్మాయిల్ అలైహిస్సలాం లాంటి ఒక సుపుత్రున్ని ప్రసాదిస్తాడు. ఇంకా పాలు త్రాగే వయసులోనే ఉంటాడు. అప్పుడు అల్లాహ్ యొక్క అనుమతితో ఇబ్రాహీం అలైహిస్సలాం పాలు త్రాగే బాలుడైన ఇస్మాయిల్ మరియు అతని యొక్క తల్లి హాజర్ ఇద్దరినీ ఈ ప్రాంతానికి తీసుకువచ్చి వదిలేస్తారు. అదే విషయాన్ని స్వయంగా ఖురాన్ లో తెలిపాడు. స్వయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేస్తూ అంటున్నారు, ఇంద బైతికల్ ముహర్రమ్. ఓ ప్రభువా, నేను నా యొక్క భార్య మరియు కుమారున్ని ఇక్కడికి తీసుకువచ్చి వదిలాను. ఎక్కడ? గైరి జీ జర్’ఇన్. అక్కడ ఎలాంటి ఒక చెట్టు లేదు, ఒక మొక్క లేదు. మరియు అక్కడ నీటి యొక్క సౌకర్యం కూడా లేదు. కానీ అల్లాహు త’ఆలా చూడడానికి ఇలాంటి ఈ పరీక్ష పెట్టినా, ఇక ముందుకు ఇక్కడ ఈ నగరాన్ని ప్రజలు వచ్చి నివసించడానికి సౌలభ్యంగా ఉండడానికి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఏర్పాటు చేశాడు.
ఇక్కడ సహీ బుఖారీలో ఆ వివరణ ఏదైతే వచ్చి ఉందో, ఖురాన్ యొక్క తఫ్సీర్ మరియు సహీ బుఖారీలో వచ్చిన హదీసులు, వాస్తవంగా పూర్తి మనం వినాలి. అందులో తండ్రికి, భార్యకు, భర్తకు ప్రతి ఒక్కరికి మన సమాజంలోని ప్రతి ఒక్కరికి ఎన్నో గుణపాఠాలు ఉన్నాయి. గమనించండి. ఆ గుణపాఠాల గురించి ఇప్పుడు నేను వివరాలు ఇవ్వలేను ఎందుకంటే నా అంశం ఫద్లు మక్కా, మక్కా విశిష్టత ఉంది. కానీ అక్కడ చిన్న విషయం ఒకటి ఏం తెలియజేస్తున్నానంటే, హాజర్ అలైహస్సలాం తన కుమారుడు పాలు త్రాగే వాడు, ఏమైనా ఎదిగినటువంటి బాలుడు కాదు. తీసుకొని ఆ ప్రదేశంలో ఉండి ఇబ్రాహీం అలైహిస్సలాం అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇబ్రాహీం, ఎవరి ఆధారంగా మమ్మల్ని వదిలి వెళ్తున్నావు అని అంటే, అల్లాహ్ వైపున చూపిస్తే, ఆ తల్లి హాజర్ ఎంత గొప్ప మాట అంటుంది, ఎంతటి గొప్ప విశ్వాసం, అల్లాహ్ పై ఎలాంటి నమ్మకం, ఎలాంటి ప్రగాఢమైన బలమైన విశ్వాసమో గమనించండి. “అలాంటప్పుడు అల్లాహు త’ఆలా మమ్మల్ని వృధా చేయడు.” అక్కడి నుండి మొదలవుతుంది మక్కా నగరం. ఆ తర్వాత జుర్హుమ్ వంశానికి సంబంధించిన వారు వస్తారు.
అయితే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదే మక్కాలో జన్మించారు. అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వహీ రావడం ప్రారంభమైంది. సుమారు 53 సంవత్సరాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో జీవించారు. ప్రవక్త పదవి పొందడానికి 40 సంవత్సరాలు ముందు, ప్రవక్త పదవి పొందిన తర్వాత 13 సంవత్సరాలు. అక్కడే అనేక మంది గొప్ప సహాబాలు వచ్చారు. ఆ సహాబాల యొక్క ప్రస్తావన ముహాజిరీన్ అని, వస్సాబిఖూనల్ అవ్వలూన్ అని అల్లాహు త’ఆలా సూరతు తౌబాలో కూడా వారిని ప్రశంసిస్తూ ప్రస్తావించాడు.
అల్లాహు త’ఆలా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కా నుండే బైతుల్ మఖ్దిస్, బైతుల్ మఖ్దిస్ నుండి మళ్ళీ ఆకాశాల వైపునకు, గగన ప్రయాణం, ఇస్రా వ మి’రాజ్ జరిగినది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ నగరాన్ని చాలా ప్రేమించేవారు. బుఖారీ, ముస్లిం యొక్క హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చిన తర్వాత అక్కడ వారి యొక్క సహాబాలు, వారి యొక్క ఆరోగ్యాలు కొంచెం అనారోగ్యానికి గురి అవ్వడం, అక్కడి యొక్క వాతావరణం అనుకూలంగా ఉండకపోవడం, ఆ సందర్భంలో ప్రవక్త దుఆ ఏం చేశారు? అల్లాహుమ్మ హబ్బిబ్ ఇలైనల్ మదీనత కమా హబ్బబ్త మక్కత అవ్ అషద్ద్. ఓ అల్లాహ్, మక్కా పట్ల ఎలాంటి ప్రేమ మాకు నీవు కలుగజేశావో, అలాంటిది అంతకంటే ఎక్కువ ప్రేమ నీవు మాకు మదీన విషయంలో కూడా… సోదర మహాశయులారా, సోదరీమణులారా, మనం మక్కా గురించి తెలుసుకుంటున్నాము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ప్రేమించేవారని.
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేశారు ఈ మక్కా నగరం గురించి. ఇబ్రాహీం అలైహిస్సలాం చేసిన దుఆలను గమనించండి, మక్కా యొక్క విశిష్టతను మీరు గ్రహించండి. ఒక దుఆ చేశారు, సూరత్ ఇబ్రాహీం 37,
فَاجْعَلْ أَفْئِدَةً مِّنَ النَّاسِ تَهْوِي إِلَيْهِمْ ఫజ్’అల్ అఫ్’ఇదతమ్ మినన్నాసి తహ్వీ ఇలైహిమ్. కనుక ప్రజలలో కొందరి మనసులు వారి వైపుకు మొగ్గేలా చేయి (14:37)
ఓ అల్లాహ్, ప్రజల యొక్క హృదయాలు, ప్రజల యొక్క హృదయాలు ఈ మక్కా వైపునకు తిరిగి రావాలి. మక్కా యొక్క ప్రేమ వారి హృదయాల్లో నాటుకోవాలి. అలాంటి భాగ్యం నీవు కలుగజేయి.
అంతేకాదు, సూరతుల్ బఖరా ఆయత్ నెంబర్ 126 లో తెలుస్తుంది, ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేశారు,
وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَٰذَا بَلَدًا آمِنًا రబ్బిజ్’అల్ హాదా బలదన్ ఆమినా. నా ప్రభూ! నీవు ఈ ప్రదేశాన్ని శాంతి నగరంగా చెయ్యి. (2:126)
ఓ మా ప్రభువా, ఈ మక్కా నగరాన్ని నీవు అమ్న్ ఓ అమాన్, శాంతి నిలయంగా చేయు. అల్లాహు అక్బర్. అల్లాహు త’ఆలా దానిని ఎలా శాంతి నిలయంగా చేశాడో గమనించండి.
ఏమిటీ, మేము హరమ్‌ను (మక్కా పుణ్యక్షేత్రాన్ని) సురక్షితమైన క్షేత్రంగా చేయటాన్ని వారు చూడటం లేదా? మరి (చూడబోతే) వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు. (29:67)
వారు గమనించడం లేదా? మేము హరమ్ ని ఎంత శాంతి నిలయంగా చేశాము, ఎంత ప్రశాంతతమయిన ప్రదేశంగా చేశాము, ఈ మక్కా చుట్టుపక్కల ఉన్నవారు దొంగతనాలు, దోపిడీలు, లూటీలు ఇంకా కిడ్నాప్ లు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ మక్కా వారు ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు. ఈ సూరత్ అన్ కబూత్ లో ఉన్నటువంటి ఆయత్ మీరు ఒకవేళ వినకుంటే, చిన్న సూరా మీకు కూడా గుర్తు ఉంది కదా,
ఖురైషులను అలవాటు చేసిన కారణంగా,(అంటే) చలికాలపు, ఎండాకాలపు ప్రయాణాలకు వారిని అలవాటు చేసిన కారణంగా,వారు ఈ (కాబా) గృహం యెక్క ప్రభువునే ఆరాధించాలి.ఆయనే వారికి ఆకలిగొన్నప్పుడు అన్నం పెట్టాడు. భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు. (106:1-4)
చుట్టుపక్కన మక్కా నగరానికి చుట్టుపక్కన ఉన్న ప్రజలందరూ కూడా భయాందోళనలో జీవితాలు గడుపుతూ ఉంటారు. కానీ మక్కాలో ఉండే వారు, అల్లాహు త’ఆలా వారికి ఎంతటి గొప్ప ప్రశాంతత, అమ్న్ ఓ అమాన్ ప్రసాదించాడు. ఇమాం ఖుర్తుబి రహిమహుల్లాహ్ తమ తఫ్సీర్ లో తెలియజేశారు, ఇన్న మక్కత లమ్ తజల్ హరమన్ ఆమినన్ మినల్ జబాబిరతి వ మినజ్ జలాజిల్. అల్లాహు త’ఆలా మక్కాను చాలా కాపాడాడు. అక్కడ ఎంతటి గొప్ప శాంతి ప్రసాదించాడంటే ఇంతటి వరకు, ఇప్పటి వరకు ఏ దుర్జన్యపరుడైన రాజు వశపరచుకోలేకపోయాడు మరియు అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి భూకంపాలు కూడా రాలేదు.
అల్లాహు త’ఆలా సూరత్ ఆలి ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 97 లో ఈ ఆయత్ ఏదైతే స్టార్టింగ్ లో తిలావత్ చేయబడిందో, అక్కడ ఈ అమ్న్ ఓ అమాన్, ప్రశాంతత, శాంతి గురించి ఎంత గొప్ప విషయం చెప్పాడు, వమన్ దఖలహు కాన ఆమినా. ఎవరైతే ఈ మక్కా నగరం, మస్జిదుల్ హరాం, ఇందులో ప్రవేశిస్తాడో అతనికి శాంతియే శాంతి ఉంది.
కనుక చూడండి, అల్లాహు త’ఆలా ఇక్కడ ఈ మక్కా నగరానికి ఇంతటి గౌరవం ఏదైతే ప్రసాదించాడో అది ఎప్పటి నుండి? ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేదా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కాలం నుండి కాదండి. ఎప్పటి నుండి? అల్లాహు త’ఆలా భూమ్యాకాశాలను పుట్టించాడో అప్పటి నుండి. సహీ బుఖారీ లోని హదీస్, ఇన్నల్లాహ హర్రమ మక్కత యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్. ఫహియ హరామున్ బి హురామిల్లాహి ఇలా యౌమిల్ ఖియామా. అల్లాహు త’ఆలా భూమ్యాకాశాలను పుట్టించినప్పటి నుండి మక్కాకు ఒక ప్రత్యేక గౌరవం ప్రసాదించాడు. అల్లాహు త’ఆలా ఈ గౌరవాన్ని ప్రళయ దినం నాటికి ఉంచుతానని కూడా వాగ్దానం చేసి ఉన్నాడు.
అయితే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు ఫతహ్-ఎ-మక్కా సందర్భంలో ఏ కొన్ని క్షణాల గురించి అయితే అనుమతి ఇవ్వడం జరిగిందో, ఆ విషయాన్ని కూడా మనం గమనించామంటే చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ చాలా స్పష్టంగా చెప్పారు, ఇంతకుముందు ఎన్నడూ కూడా ఇక్కడ ఏ రక్తపాతం గురించి అనుమతి లేకుండినది, ప్రళయం వరకు కూడా లేదు అని.
అంతేకాదు సోదర మహాశయులారా, ఇబ్రాహీం అలైహిస్సలాం దాని చుట్టుపక్క ప్రాంతాలకు ఎన్నో కిలోమీటర్ల వరకు ప్రశాంతత ఉండాలని అల్లాహు త’ఆలా తో దుఆ ఏదైతే చేశారో, సహీ బుఖారీ, సహీ ముస్లిం లో వచ్చి ఉంది, ఇన్న ఇబ్రాహీమ హర్రమ మక్కా. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడి ప్రశాంతత గురించి ఇచ్చిన బోధనల్లో, సహీ బుఖారీ మరియు ముస్లిం లో వచ్చిన ఈ హదీస్ కూడా చాలా ప్రాముఖ్యత గలది. లా యహిల్లూ లిమ్ రి’ఇన్ యు’మిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్, అన్ యస్ఫిక బిహా దమా. అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసించే ఏ వ్యక్తి కూడా అక్కడ రక్తం ప్రవహింప చేయడు, రక్తపాతానికి ఒడిగట్టడు. అంతేకాదు, సహీ ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ ను గమనించండి, లా యహిల్లూ లి అహదికుమ్ అన్ యహ్మిల బి మక్కత అస్సిలాహ్. మీరు మక్కాలో నడుస్తున్నప్పుడు ఎలాంటి ఆయుధాలు ధరించి అక్కడ నడవడం ఇది సమంజసం కాదు.
అంతేకాదండి, అల్లాహు అక్బర్, మక్కాకు అల్లాహు త’ఆలా ప్రసాదించినటువంటి విశిష్టత కేవలం మానవులకే కాదు, అక్కడి యొక్క ఆ ప్రాంతానికి, అక్కడ వచ్చే, తిరిగే అటువంటి పక్షులకు, అక్కడ పెరిగే అటువంటి వృక్షాలకు, ఇంకా ఎవరి నుండి ఏదైనా వస్తువు తప్పిపోయి పడిపోతే దానికి కూడా ఎంతటి మర్యాద అనండి, గౌరవం అనండి, ఎంతటి రెస్పెక్ట్ ఉందో మనకు సహీ హదీసుల్లో తెలుస్తుంది.
సహీ బుఖారీ మరియు ముస్లిం లో వచ్చిన హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అక్కడి వృక్షాలను నరికేయరాదు. అక్కడ వేట, షికారీ చేయరాదు. మరియు ఎవరికైనా ఏదైనా పడిపోయిన వస్తువు దొరికినా, దానిని అతను ఎత్తుకోకూడదు. ఎవరైనా దాన్ని తీసుకున్నాడంటే, సంవత్సరం అయినా గానీ తన వద్ద ఉంచి, భద్రంగా అది ఎవరిది అని వెతుకుతూ ఉండి, అతని వరకు చేర్పించే ప్రయత్నం చేయాలి. అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా?
అందు గురించే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ సందర్భంలో, ఏ సందర్భంలో అండి? ప్రవక్త ఏదైతే హజ్ చేశారో, లక్ష కంటే పైగా సహాబాలు ప్రవక్త వెంట ఉన్నారో, అందులో హ్యూమానిటీ కి సంబంధించిన, మానవత్వానికి సంబంధించిన గొప్ప నియమ, నిబంధనలు, సూత్రాలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే తెలిపారో, ఒక్కసారి ఈ హదీస్ ను గమనించండి. సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం లో వచ్చిన హదీస్,
ఇన్న దిమా అకుమ్, వ అమ్వాలకుమ్, వ అ’రాదకుమ్, అలైకుమ్ హరామున్, క హుర్మతి యౌమికుమ్ హాదా, ఫీ బలదికుమ్ హాదా, ఫీ షహ్రికుమ్ హాదా.
ప్రజలారా, ఈ మక్కా నగరం ఎంత గౌరవ, మర్యాద గల ప్రదేశమో తెలుసు కదా? ఇప్పుడు మనం ఏ నెలలో ఉన్నామో, జిల్ హిజ్జా నెల, ఇది కూడా ఎంతటి గౌరవ, ప్రాముఖ్యత గల నెలనో తెలుసు కదా? మరియు ఈ రోజు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అరఫాలో ప్రసంగిస్తున్నారు. ఈ రోజు కూడా ఎంతటి గౌరవప్రదమైన రోజో తెలుసు కదా? ఇక గౌరవప్రదమైన రోజు, గౌరవప్రదమైన నెల, గౌరవప్రదమైన ప్రదేశంలో ఉండి, వీటన్నింటిని గుర్తిస్తూ నేను చెబుతున్నాను శ్రద్ధగా వినండి. మీ యొక్క రక్తం అంటే మీ యొక్క ప్రాణం, మీ యొక్క ధనం, మీ యొక్క పరువు, మానాలు కూడా చాలా గౌరవమైనవి, విలువ గలవి. వాటిని ఎవరూ కూడా అక్రమంగా దాడి చేయడం, ఒకరిని నరికేయడం, హత్య చేయడం, ఒకరి ధనం పై అన్యాయంగా దోచుకునే ప్రయత్నం చేయడం, ఒకరి యొక్క మానవ పరువులో ఏదైనా జోక్యం చేసుకోవడం, హరాం, ఎంతమాత్రం కూడా దీనికి అనుమతి లేదు. ఇక్కడ మీరు గమనించండి, ఒక వ్యక్తిని తిట్టకూడదు, ఒక వ్యక్తిని హత్య చేయకూడదు, ఒకరి సామాను, ఒకరి యొక్క వస్తువులను దొంగలించకూడదు అన్న విషయాన్ని ప్రవక్త, క బలదికుమ్ హాదా, మీ యొక్క ఈ బలద్, ఈ నగరం యొక్క గౌరవం ఎలా ఉందో అంతకంటే గొప్పగా ఉంది అన్నటువంటి విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గుర్తు చేస్తున్నారు.
మక్కా గురించి అపోహలు
అందుకొరకే, ముస్లిమేతరులలో ఉన్నటువంటి మరొక అపోహ ఏమిటంటే, ఈ కాబతుల్లాహ్, న’ఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అసల్ ఒక విగ్రహాల గృహం అని. అయితే హదీస్ తో దీనిని వారు నిరూపించే ప్రయత్నం చేస్తారు, ఫతహ్-ఎ-మక్కా సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విగ్రహాలను అయితే పడేశారో, దానిని తీసుకుంటారు. ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి యొక్క విగ్రహాలు, వాటిని ప్రస్తావిస్తారు. కానీ మనం ఒకవేళ నిజంగా చూస్తే, ఖురాన్ ఆయతులు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి, మానవ చరిత్ర, ఏ చరిత్రనైతే భద్రంగా ఉందో దానిలో తెలుస్తున్న విషయం ఏమిటి? మొట్టమొదటి మానవుడు ఆది మానవుడు, ఆదం అలైహిస్సలాం, వారి యొక్క సంతానం కాలాల తరబడి షిర్క్ కు పాల్పడలేదు.
كَانَ النَّاسُ أُمَّةً وَاحِدَةً మానవులందరూ ఒకే ఒక సమాజంగా ఉండేవారు. (2:213)
ఒకే ఒక ధర్మం, ఏకదైవారాధనపై అందరూ నిలిచి ఉన్నారు. ఎంతవరకు? ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు, వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువగా. ఆదం అలైహిస్సలాం చనిపోయిన తర్వాత వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువగా. ఆ తర్వాత మెల్లి మెల్లిగా వారిలో షిర్క్ అనేది పాకింది. దానిని ఖండించడానికే ప్రవక్తలను పంపడం జరిగింది. కాబతుల్లాహ్, దీని యొక్క పునాది తౌహీద్ పై, ఏకదైవారాధనపై ఉండినది. అమర్ బిన్ లుహై మొట్టమొదటి చెడ్డ వ్యక్తి, అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని నరకంలో చూసినట్లు కూడా హదీస్ లో తెలియపరిచారు. అతడు మొట్టమొదటిసారిగా షిర్క్ కు పునాది వేశాడు. దానిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించారు, షిర్క్ నుండి పరిశుభ్రం చేశారు కాబా గృహాన్ని. కానీ ఇది వాస్తవానికి విగ్రహాలయం మాత్రం కాదు. సోదర మహాశయులారా, చివరిలో సూరతుల్ నమ్ల్ ఆయత్ 91 ద్వారా మన యొక్క ఈ నాటి ప్రసంగాన్ని సమాప్తం చేద్దాము.
నేను ఈ నగరం (మక్కా) ప్రభువును మాత్రమే ఆరాధిస్తూ ఉండాలని నాకు ఆదేశించబడింది. ఆయన దీన్ని పవిత్ర మైనదిగా చేశాడు. అన్నింటికీ ఆయనే యజమాని. నేను విధేయులలో ఒకడిగా ఉండాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. (27:91)
నాకు ఆదేశం ఇవ్వడం జరిగింది ఈ నగరం యొక్క ప్రభువుని ఆరాధించాలి అని. ఆయనే ఈ నగరానికి చాలా గొప్ప గౌరవప్రదమైన స్థానం కలుగజేశాడు. అతనికే సర్వాధికారం ఉంది, సర్వ సర్వమూ అతని యొక్క ఆధీనంలో ఉంది. మరియు నేను విధేయులలో, ముస్లింలలో ఉండాలి, అయి ఉండాలి అని కూడా నాకు ఆదేశం ఇవ్వడం జరిగింది.
అయితే ఈ ఆయత్ ను చివరిలో ప్రస్తావించడానికి ముఖ్య కారణం ఏంటి? మనం ఎప్పుడైనా అల్లాహ్ ప్రసాదించిన గౌరవాన్ని, అది ప్రాంతానికి సంబంధించినా, ఏ వ్యక్తికి సంబంధించినా, ఏదైనా నెలకు సంబంధించినా, ఏదైనా కార్యానికి సంబంధించినా ప్రస్తావిస్తున్నప్పుడు దాని యొక్క గొప్పతనం, దాని యొక్క గౌరవంలో మనం అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని మర్చిపోకూడదు. మనం వాస్తవంగా అల్లాహ్ ను గౌరవిస్తున్నాము. అందుకొరకే అల్ హుబ్బు ఫిల్లాహ్ వల్ బుగ్దు ఫిల్లాహ్. అల్లాహ్ ఏ ఏ విషయాలను ప్రేమిస్తాడో వాటన్నిటినీ ప్రేమించడం. అల్లాహ్ ఏ ఏ విషయాలను ద్వేషిస్తాడో వాటన్నిటినీ ద్వేషించడం మన విశ్వాసంలోని ఒక ముఖ్యమైన భాగం. అర్థమైంది కదా?
అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో నేను దుఆ చేస్తున్నాను. ఈ మక్కా విశిష్టత గురించి ఏ విషయాలైతే మనం తెలుసుకున్నామో దాని యొక్క గౌరవాన్ని కాపాడే అటువంటి భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. దీని విషయంలో ఎవరు ఏ తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారో అల్లాహ్ వారికి హిదాయత్ ప్రసాదించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దైవ భీతితో కన్నీరు పెట్టడం (The Excellence Of Weeping Out Of The Fear Of Allah) వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/NNoAU3lUlAs [26 నిముషాలు]
ఈ ప్రసంగంలో, దైవ భీతితో కన్నీరు కార్చడం అనే అంశంపై లోతైన వివరణ ఇవ్వబడింది. మానవునికి అల్లాహ్ నవ్వు మరియు ఏడుపు రెండింటినీ ప్రసాదించాడని ఖురాన్ ఆయతుతో ప్రసంగం ప్రారంభమవుతుంది. మానసిక నిపుణుల ప్రకారం, శారీరక గాయం, ప్రియమైనవారిని కోల్పోవడం, ఆనందం, మోసం మరియు డబ్బు కోసం వంటి వివిధ కారణాల వల్ల మానవులు ఏడుస్తారని వివరించబడింది. అయితే, అసలు ప్రాముఖ్యత దైవ భీతితో కార్చే కన్నీరుకే ఉందని స్పష్టం చేయబడింది. అల్లాహ్ భయంతో ఏడ్చే వ్యక్తి నరకంలోకి ప్రవేశించడం అసాధ్యమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులను ఉటంకించారు. తీర్పు దినాన అల్లాహ్ సింహాసనం నీడలో చోటు పొందే ఏడు రకాల వ్యక్తులలో, ఏకాంతంలో అల్లాహ్ ను స్మరించుకుని కన్నీరు కార్చే వ్యక్తి కూడా ఒకరని చెప్పబడింది. అల్లాహ్ భయంతో కన్నీరు కార్చిన కళ్ళను నరకాగ్ని తాకదని, ఆ కన్నీటి చుక్క అల్లాహ్ కు అత్యంత ప్రియమైనదని వివరించబడింది. దైవదూతలు (మీకాయీల్ అలైహిస్సలాం), ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరియు సహాబాల (ఉస్మాన్, ముఆద్, హసన్, అబూ హురైరా రదియల్లాహు అన్హుమ్) జీవితాల నుండి దైవ భీతితో వారు ఏ విధంగా కన్నీరు కార్చేవారో ఉదాహరణలతో వివరించబడింది. మన హృదయాలు కఠినంగా మారిపోయాయని, మరణాన్ని, సమాధిని స్మరించుకుంటూ, అనారోగ్యులను మరియు స్మశానాలను సందర్శిస్తూ, మన హృదయాలను మృదువుగా చేసుకుని అల్లాహ్ భయంతో కన్నీరు కార్చాలని ప్రసంగం ముగుస్తుంది.
ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై ఎల్లవేళలా వర్షించు గాక. ఆమీన్.
గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు అభిమాన సోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో దైవ భీతితో కన్నీరు పెట్టడం అనే అంశంపై ఇన్షా అల్లాహ్ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అభిమాన సోదరులారా, మానవున్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టించాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన ఈ శరీరం ఒక హార్డ్వేర్ (hardware) అయితే, ఈ శరీరం లోపల అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనిషికి కొన్ని సాఫ్ట్వేర్ (software) లాంటి విషయాలను కూడా అమర్చాడు. మనం చూచినట్లయితే ఈ శరీరం కలిగిన మనిషికి బాధ కలుగుతుంది. ఈ శరీరం కలిగి ఉన్న మనిషికి సంతోషం కూడా కలుగుతుంది. మనిషికి ఆకలి వేస్తుంది, మనిషికి దాహం వేస్తుంది, మనిషి నవ్వుతాడు, మనిషి ఏడుస్తాడు. ఈ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ శరీరంలో ఎన్నో విషయాలను పొందుపరిచి ఉన్నాడు. ఈరోజు మనం దైవ భీతితో మనిషి కన్నీరు కారుస్తాడు కదా, దాని గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాం.
నవ్వు మరియు ఏడుపు అల్లాహ్ నుండి వచ్చినవే
వాస్తవానికి మనం చూచినట్లయితే మనిషికి నవ్వించడం నేర్పించింది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. అలాగే మనిషికి బాధపడి కన్నీరు పెట్టడం నేర్పించింది కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాయే. ఖురాన్ లో మనం చూచినట్లయితే, సూర నజ్మ్ 43వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:
وَأَنَّهُ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ (వ అన్నహూ హువ అద్’హక వ అబ్కా) మరి ఆయనే నవ్విస్తున్నాడు, ఆయనే ఏడిపిస్తున్నాడు. (53:43)
అభిమాన సోదరులారా, మానసిక వైద్య నిపుణులు కొన్ని విషయాలు తెలియజేశారు. అవేమిటంటే, మనిషి ఎన్నో కారణాల వల్ల బాధపడి కన్నీరు కారుస్తాడంట. మనిషి కన్నీరు కార్చడానికి చాలా కారణాలు ఉన్నాయి అని మానసిక వైద్య నిపుణులు తెలియజేశారు. ఒక కారణం ఏమిటంటే, మనిషికి ఏదైనా గాయమైతే, ఆ బాధను ఓర్వలేక అతను కన్నీరు కారుస్తాడంట. అలాగే మనిషి ఎవరైనా దూరమైపోతుంటే, ఎవరినైతే అతను అభిమానించాడో, ప్రేమించాడో, వారు దూరమైపోతుంటే ఆ బాధ వల్ల కూడా మనిషి కన్నీరు కారుస్తాడట.
అలాగే, మనిషికి అనుకోకుండా ఒక పెద్ద సంతోషం కలిగితే, అప్పుడు కూడా పట్టరాని సంతోషంలో మనిషి కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతాయంట. దానినే మనము ఆనంద భాష్పాలని కూడా అంటూ ఉంటాం. అలాగే అభిమాన సోదరులారా, కొంతమంది ఇతరులను మోసం చేయడానికి కూడా కన్నీరు కారుస్తారు. ముసలి కన్నీరు అని మనము అప్పుడప్పుడు సామెత పలుకుతూ ఉంటాం.
అలాగే, కొంతమంది అయితే డబ్బు తీసుకుని మరీ ఏడుస్తారట, కన్నీరు కారుస్తారట. దానిని ఇస్లామీయ పరిభాషలో నౌహా (శోకం) చేయడం అంటారు, మాతం చేయడం అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి మరణించినచో, ఆ వ్యక్తి శవం వద్ద ఏడవడానికి కూలీ మీద కొంతమంది వచ్చి ఏడుస్తారు. ఇది ఇస్లాంలో నిషేధం. మనిషి మరణించిన తర్వాత అతని బంధువులైనా సరే, ఇతర వ్యక్తులైనా సరే అతని వద్ద వచ్చి నౌహా చేయడం, బిగ్గరగా కేకలు పెడుతూ ఏడ్చడం ఇస్లాంలో నిషేధం చేయబడింది.
దైవ భీతితో కార్చే కన్నీరు
అలాగే, దైవ భీతితో కూడా మనిషి కన్నీరు కారుస్తాడట. రండి ఇన్షా అల్లాహ్, ఈనాటి జుమా ప్రసంగంలో ఈ అంశం మీదే ఇన్షా అల్లాహ్ ఖురాన్ మరియు హదీసుల వెలుగులో మరియు సహాబాల జీవితాలకి సంబంధించిన విషయాలతో తెలిసిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.
అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు.
لَا يَلِجُ النَّارَ رَجُلٌ بَكَى مِنْ خَشْيَةِ اللَّهِ حَتَّى يَعُودَ اللَّبَنُ فِي الضَّرْعِ “లా యలిజున్నార రజులున్ బకా మిన్ ఖశియతిల్లాహి హత్తా యఊదల్లబను ఫిద్దర్రా” దీని అర్థం ఏమిటంటే “జంతువు పొదుగు నుండి పాలు పిండేసిన తర్వాత ఆ పాలు మళ్లీ ఆ జంతువు పొదుగులోకి తిరిగి వెళ్లిపోవడం ఎలాగైతే అసంభవమో దైవభీతితో కన్నీరు కార్చిన వ్యక్తి కూడా నరకంలో వెళ్లటం అసంభవం” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
అల్లాహు అక్బర్ (ٱللَّٰهُ أَكْبَرُ)! దైవ భీతితో మానవుడు, భక్తుడు ఒక్కసారి ప్రపంచంలో కన్నీరు పెడితే ఆ వ్యక్తి నరకంలో వెళ్లడం, ఆ వ్యక్తి నరక ప్రవేశం చేయడం అసంభవం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు అభిమాన సోదరులారా!
మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడు మంది అదృష్టవంతుల గురించి తెలియజేశారు. రేపు పరలోకంలో లెక్కింపు రోజున సూర్యుడు చాలా సమీపంలో ఉంటాడు. ఆ రోజు ఎలాంటి నీడ ఉండదు. కేవలం అల్లాహ్ యొక్క సింహాసనం, అర్ష్ యొక్క నీడ మాత్రమే ఉంటుంది. ఆ రోజు ప్రజలు వేడికి తపిస్తూ అల్లాడుతూ ఉంటారు. ఆ రోజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన సింహాసనం యొక్క నీడలోకి ఏడు రకాల మనుషులను తీసుకుంటాడు. ఆ ఏడు రకాల మనుషులలో ఒక రకమైన మనిషి ఎవడంటే
ఏకాంతంలో ఉన్నప్పుడు భక్తుడు, మానవుడు అల్లాహ్ ను తలుచుకొని అల్లాహ్ ను గుర్తు చేసుకొని కన్నీరు కార్చితే అలాంటి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు పరలోకంలో లెక్కింపు రోజున ఆ మహ్షర్ మైదానంలో తన సింహాసనం నీడలోకి తీసుకుంటాడట.
మరో ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. “రెండు రకాల కళ్లు ఉన్నాయి. ఆ రెండు రకాల కళ్లు ఎప్పటికీ నరకాగ్నిని చూడవు. నరకాగ్ని ఆ కళ్లకు కాల్చదు అన్నారు“. ఎవరు ఆ రెండు రకాల కళ్లు? నరకాగ్నిని చూడవట. నరకాగ్ని ఆ కళ్లను కాల్చదట. ఎవరు ఆ రెండు రకాల కళ్లు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,
ఒక రకమైన కళ్లు ఎవరివి అంటే ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ను తలుచుకొని కన్నీరు పెట్టాడో ఆ వ్యక్తి కళ్లకి నరకము తాకదు. నరకాగ్ని ఆ కళ్లకు ముట్టుకోదు. అలాగే పూర్వం యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధాలు జరిగే సమయంలో రాత్రి పూట యుద్ధం ముగిసిన తరువాత సైనికులందరూ పడుకుని ఉంటే ఆ సైనికులకి కొంతమంది వ్యక్తులు కాపలా కాసేవారు. వాళ్ల ప్రాణానికి రక్షణగా వాళ్లు రాత్రి మొత్తం జాగారము చేసి కాపలా కాసేవారు. అలా దైవ మార్గంలో రాత్రి మొత్తం జాగారం చేసి కాపలా కాసిన ఆ కళ్లకు కూడా రేపు నరకపు అగ్ని ముట్టుకోదు, నరకము ఆ కళ్లకు కాల్చదు అన్నారు.
రండి అభిమాన సోదరులారా, మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత మంచి మాట చెప్పి ఉన్నారో చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకి రెండు రకాల చుక్కలు చాలా ప్రియమైనవి అట. అలాగే రెండు గుర్తులు కూడా అల్లాహ్ కు చాలా ఇష్టమైనవి అట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,
“రెండు చుక్కలు అల్లాహ్ కు చాలా ప్రియమైనవి.” ఒక చుక్క ఏమిటంటే, “అల్లాహ్ ను తలచుకుని భక్తుడు ఎప్పుడైతే కళ్ళ నుంచి కన్నీరు కారుస్తాడో, ఆ కన్నీటి చుక్క అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు చాలా ప్రియమైనది.” అలాగే, “దైవ ధర్మ రక్షణ కొరకు ఎప్పుడైతే మానవుడు వెళ్లి శత్రువుని ఎదుర్కొంటాడో, ఆ ఎదుర్కొనే సమయంలో అతని శరీరానికి గాయమై, అతని శరీరం నుండి రక్తపు చుక్క కారుతుంది కదండీ, ఆ చుక్క కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు చాలా ప్రియమైనది.”
ఇక రెండు గుర్తుల గురించి కూడా తెలియజేశారు. “రెండు రకాల గుర్తులు అల్లాహ్ కు చాలా ప్రియమైనవి. అవేమిటంటే, ఒక గుర్తు, “అల్లాహ్ ధర్మ రక్షణ కొరకు పోరాటం చేస్తున్నప్పుడు అతని శరీరానికి ఎక్కడైనా గాయం అవుతుంది. ఆ గాయం మానిన తర్వాత అక్కడ అలాగే గుర్తు పడిపోతుంది. ఆ గుర్తు అల్లాహ్ కు చాలా ఇష్టమైనది.” రెండవ గుర్తు ఏమిటంటే, “అల్లాహ్ విధించిన ఒక విధిని పాటిస్తూ ఉన్నప్పుడు అతని శరీరం మీద గుర్తు పడిపోతుంది. ఆ గుర్తు కూడా అల్లాహ్ కు చాలా ప్రియమైనది.”
దీనికి ఉదాహరణగా మనం చూచినట్లయితే, ఒక వ్యక్తి నమాజ్ ఆచరిస్తూ ఉంటాడు. నమాజ్ చేయడం విధి, తప్పనిసరి. అల్లాహ్ తరపు నుంచి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రతీ ముస్లిం మీద నమాజ్ చేయడం తప్పనిసరి చేశాడు, విధి చేశాడు. మరి ఒక ముస్లిం, ఒక దైవ భక్తుడు నమాజ్ ఆచరిస్తూ ఉంటే, అతని నుదుట మీద గుర్తు పడిపోతుంది, అతని మోకాళ్ళ మీద గుర్తు పడిపోతాది. ఇలా దైవం విధించిన ఒక విధిని ఆచరిస్తున్నప్పుడు అతని శరీరం మీద ఏదైనా గుర్తు పడిపోయిందంటే, ఆ గుర్తు అల్లాహ్ కు చాలా ఇష్టమైనది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
అలాగే రండి అభిమాన సోదరులారా! అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏమనేవారంటే “ల అన్ అద్మఅ మిన్ ఖష్యతిల్లాహ్ అహబ్బు ఇలయ్య మిన్ అన్ అతసద్దక బి అల్ఫి దీనార్” (لَأَنْ أَدْمَعَ مِنْ خَشْيَةِ اللَّهِ أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ أَتَصَدَّقَ بِأَلْفِ دِينَارٍ). అల్ఫి దీనార్ అంటే మనందరికీ తెలుసు. వెయ్యి దీనార్లు. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు. “నేను అల్లాహ్ మార్గంలో వెయ్యి దీనార్లు దానం చేయడము కంటే కూడా అల్లాహ్ ను తలుచుకొని ఒక్కసారి కన్నీరు పెట్టడం నాకు చాలా ప్రియమైనది, ఇష్టమైనది” అన్నారు. అంటే నేను అల్లాహ్ ను తలుచుకొని ఏడవటం, అల్లాహ్ ను తలుచుకొని కన్నీరు కార్చడం దైవమార్గంలో వెయ్యి దీనార్లు ఖర్చు చేయటం కంటే నాకు ఇష్టం అన్నారు.
ప్రవక్తలు మరియు సహాబాల దైవ భీతి
ఇక రండి అభిమాన సోదరులారా, అల్లాహ్ ను తలచుకుని, అల్లాహ్ భీతితో ప్రవక్తలు ఏ విధంగా కన్నీరు కార్చేవారో, దూతలు ఏ విధంగా వణికిపోయేవారో, దైవ భక్తులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు ఏ విధంగా కన్నీరు పెట్టేవారో, అవి కూడా ఇన్షా అల్లాహ్ కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ముందుగా దైవ దూతల గురించి తెలుసుకుందాం. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాం వారితో మీకాయీల్ అలైహిస్సలాం వారి గురించి ప్రశ్నించారు. మీకాయీల్ అలైహిస్సలాం నలుగురు పెద్ద దైవ దూతలలో ఒక దైవదూత. ఆ దైవదూత గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారంటే “మాలి లా అరా మీకాయీల దాహికన్ ఖత్తూ?” (مَا لِي لَا أَرَى مِيكَائِيلَ ضَاحِكًا قَطُّ؟). ఓ జిబ్రయీల్ అలైహిస్సలాం! ఏమిటండి నేను ఎప్పుడూ కూడా మీకాయీల్ని చిరునవ్వు నవ్వుతూ కూడా నేను చూడలేదు. ఆయన ఒక్కసారి కూడా నాకు చిరునవ్వు నవ్వుతూ కనిపించట్లేదు. ఎందుకలా అని అడిగాను. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు “మా దహిక మీకాయీలు ముంజు ఖులికతిన్నార్” (مَا ضَحِكَ مِيكَائِيلُ مُنْذُ خُلِقَتِ النَّارُ). ఓ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నరకాన్ని సృష్టించిన తర్వాత నుంచి మీకాయీల్ అలైహిస్సలాం ఒక్కసారి కూడా నవ్వలేదు అన్నారు.అభిమాన సోదరులారా, దైవదూతలు ఒక్క తప్పు కూడా వారితో దొర్లదు. అయినా గానీ నరకం సృష్టించబడిన తర్వాత వాళ్ళు నవ్వడమే మానేశారు.
అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెరాజ్ యాత్రలో ఎప్పుడైతే అల్లాహ్ ను కలిసి మాట్లాడటానికి వెళ్లారో ఆ రోజు జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఆయన గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “వ జిబ్రయీలు కల్ హిల్సిల్ బాలి మిన్ ఖశియతిల్లాహ్” (وَجِبْرِيلُ كَالْحِلْسِ الْبَالِي مِنْ خَشْيَةِ اللَّهِ). మెరాజ్ యాత్రలో నేను చూశాను. దూతలకు రారాజు, దూతల నాయకుడు జిబ్రయీల్ అలైహిస్సలాం మలయే ఆలాలో పరుపులాగా అల్లాహ్ కు భయపడి నేలకు ఆనిపోయారు. అభిమాన సోదరులారా! దూతల నాయకుడు అల్లాహ్ ను తలుచుకొని, అల్లాహ్ భక్తితో, అల్లాహ్ భీతితో నేల మీద పరుపు లాగా పడిపోయి ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కళ్లారా వారిని చూశారు.
ఇక రండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా తెలుసుకుందాం. అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు నమాజు చేయడానికి నిలబడ్డారు. నమాజు చదువుతున్నారు. నమాజులోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కన్నీరు కార్చడం మొదలెట్టేశారు. ఎంతగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవభీతితో కన్నీరు కారుస్తున్నారంటే చూసిన వాళ్లు ఆయన గురించి చెప్పారు, “వలి జౌఫిహీ అజీజున్ క అజీజిల్ మిర్జలి మినల్ బుకా'” (وَلِجَوْفِهِ أَزِيزٌ كَأَزِيزِ الْمِرْجَلِ مِنَ الْبُكَاءِ). ఎలాగైతే పొయ్యి మీద పెట్టిన ఒక కుండలో నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత ఖత్ ఖత్ ఖత్ అని ఎలా శబ్దం వస్తుందో ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజుకు నిలబడి అల్లాహ్ ను తలుచుకొని లోలోపలే కన్నీరు కారుస్తున్నారు, బాధపడి ఏడుస్తున్నారు అభిమాన సోదరులారా!
అలాగే ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారు తెలియజేశారు. ఒక రోజు రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు కోసం నిలబడ్డారు. నమాజులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడవటం మొదలెట్టారు. ఎంతగా ఏడ్చారంటే వారి గడ్డం తడిసిపోయింది. అయినా ఏడుపు ఆపట్లేదు. మళ్లీ ఏడుస్తున్నారు. ఆయన తొడిగిన బట్టలు కూడా నానిపోయాయి. అయినా ఏడుపు ఆపట్లేదు. ఏడుస్తూనే ఉన్నారు. ఎక్కడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేస్తున్నారో ఆ భూమి కూడా తడిసిపోయింది. ఫజర్ అజాన్ ఇచ్చే సమయం వచ్చేసింది. బిలాల్ రదియల్లాహు అన్హు మస్జిద్లో అజాన్ ఇవ్వటానికి వచ్చి చూస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడుస్తున్నారు. అది చూసిన బిలాల్ రదియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ మీ పాపాలన్నింటినీ మన్నించేశాడు కదా? అయినా కూడా మీరు ఈ విధంగా ఏడవడం ఏంటి?” అని అడిగితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అఫలా అకూను అబ్దన్ శకూరా?” (أَفَلَا أَكُونُ عَبْدًا شَكُورًا؟). నేను దైవానికి కృతజ్ఞుడు చేసి తెలుసుకునే భక్తుని కావద్దా? అందుకోసమే దైవానికి కృతజ్ఞత, కృతజ్ఞతలు తెలుపుకునే భక్తుడు అవ్వటానికి ఏడుస్తున్నాను అన్నారు.
అభిమాన సోదరులారా! మన పరిస్థితి ఏమిటి? దైవదూతలు ఏడుస్తున్నారు. దూతల నాయకుడు జిబ్రయీల్ అలైహిస్సలాం వారు ఏడుస్తున్నారు. దైవప్రవక్తలు ఏడుస్తున్నారు. దైవ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కన్నీరు కారుస్తున్నారు. మన పరిస్థితి ఏమిటి అభిమాన సోదరులారా?
ఇక రండి. మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రెండు చేతులు ఎత్తి ఏడవడం ప్రారంభిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పంపించేశారు. జిబ్రయీల్ అలైహిస్సలాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఓ దైవప్రవక్త మీరు కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు. కారణం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నన్ను మీ వద్దకు పంపించాడు చెప్పండి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయం ఏమిటో తెలుసా అభిమాన సోదరులారా? ఎంత అదృష్టవంతులమో మనము ఒకసారి ఆలోచించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జిబ్రయీల్ అలైహిస్సలాం వారు వచ్చి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే “అల్లాహుమ్మ ఉమ్మతీ, ఉమ్మతీ!” (اللَّهُمَّ أُمَّتِي أُمَّتِي!). ఓ అల్లాహ్! నా అనుచర సమాజాన్ని తలుచుకొని ఏడుస్తున్నాను. నా అనుచర సమాజం ఏమైపోతుందో అని తలుచుకొని ఏడుస్తున్నాను అన్నారు. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం మళ్లీ అల్లాహ్ సన్నిధికి వెళ్లి తెలియజేయగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి శుభవార్త అందజేశాడు. అదేమిటంటే “ఇన్నా సనుర్దీక ఫీ ఉమ్మతిక వలా నసూఉక” (إِنَّا سَنُرْضِيكَ فِي أُمَّتِكَ وَلَا نَسُوءُكَ). ఓ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీ అనుచరుల విషయంలో మేము మీకు సంతృప్తి చెందేలా చేస్తాము. మీకు అసంతృప్తి అయ్యేలాగా చేయము అని చెప్పేశారు. అల్లాహు అక్బర్! అలాంటి ప్రవక్తకి మనము అనుచరులమైనందుకు మనము ఎంతో అదృష్టవంతులమని భావించాలి అభిమాన సోదరులారా!
ఇక రండి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుల గురించి కూడా తెలుసుకుందాం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలాగే శిష్యులందరూ కూర్చుని ఉంటే శిష్యుల ముందర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాగే ఉపన్యాసం ఇవ్వడం ప్రారంభించారు. ఆ ఉపన్యాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని తెలియజేశారంటే, “ఏమండీ నాకు స్వర్గం చూపబడింది. నాకు నరకము కూడా చూపబడింది. నేను చూసిన విషయాలు గనక మీరు చూసినట్లయితే మీరు నవ్వడం మానేసి ఏడవడం ప్రారంభించేస్తారు” అన్నారు. అది విన్న వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులందరూ తల మీద బట్ట వేసుకొని ముక్కు పట్టుకొని ఏడవడం ప్రారంభించేశారు అభిమాన సోదరులారా!
అలాగే హానీ, ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క బానిస ,ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి గురించి ఆయన తెలియజేశారు. అదేమిటంటే ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వెళుతూ వెళుతూ స్మశానం దగ్గర ఆగిపోయి ఏడవడం ప్రారంభించేవారు. ఎంతగా కన్నీరు కార్చేవారంటే ఆయన గడ్డం మొత్తం తడిచిపోయేది. అది చూసిన ఆయన బానిస ఆయన వద్దకు వచ్చి ఏమని అడిగేవాడంటే, “ఏమండీ మీ దగ్గర స్వర్గం గురించి చర్చించబడినప్పుడు మీరు కన్నీరు కార్చరు. అలాగే మీ దగ్గర నరకం గురించి తెలియజేయబడినప్పుడు కూడా మీరు ఈ విధంగా కన్నీరు కార్చరు. కానీ స్మశానాన్ని, సమాధులను చూసి మీరు ఈ విధంగా కన్నీరు కారుస్తారు. కారణం ఏమిటి?” అని ఆయన అడిగినప్పుడు ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారు తెలియజేసిన విషయం ఏమిటంటే, “ఇన్నల్ ఖబర అవ్వలు మంజిలిన్ మిన్ మనాజిలిల్ ఆఖిరహ్. ఫఇన్ నజా మిన్హు ఫమా బాఅదహు ఐసర్, వఇల్లం యంజ్ మిన్హు ఫమా బాఅదహు అషద్దు మిన్హు” (إِنَّ الْقَبْرَ أَوَّلُ مَنَازِلِ الْآخِرَةِ، فَإِنْ نَجَا مِنْهُ فَمَا بَعْدَهُ أَيْسَرُ، وَإِنْ لَمْ يَنْجُ مِنْهُ فَمَا بَعْدَهُ أَشَدُّ مِنْهُ). నేను సమాధిని చూసి ఎందుకు ఏడుస్తున్నాను అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. పరలోక ప్రయాణంలో సమాధి మొదటి స్టేజీ లాంటిది. ఇక్కడ ఏ వ్యక్తి అయితే పాస్ అయిపోతాడో అతను తర్వాత స్టేజీలలో కూడా పాస్ అయిపోతాడు. ఈ ఫస్ట్ స్టేజీలోనే ఏ వ్యక్తి అయితే ఇరుక్కుపోతాడో, నష్టపోతాడో ఆ తర్వాత వచ్చే స్టేజీలన్నీ కూడా అతనికి చాలా భయంకరమైనవిగా మారిపోతాయి. కాబట్టి నా మొదటి స్టేజీలో నా పరిస్థితి ఎలా ఉంటుందో అది తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను అని చెప్పేవారు.
అలాగే ముఆజ్ రదియల్లాహు తాలా అన్హు ఏడుస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు వెళ్లి ఏమండీ మీరు కన్నీరు కారుస్తున్నారు, కారణం ఏమిటి అని అడిగితే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “స్వర్గానికి వెళ్ళే వాళ్ల సమూహం ఏదో అల్లాహ్ కు బాగా తెలుసు. నరకానికి వెళ్లే సమూహం ఏదో అది కూడా అల్లాహ్ కు బాగా తెలుసు. నేను స్వర్గానికి వెళ్లే సమూహంలో ఉన్నానా లేదా నరకానికి వెళ్లే సమూహంలో ఉన్నానా? అది తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను” అన్నారు.
అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడు హసన్ రదియల్లాహు తాలా అన్హు ఏడుస్తూ ఉంటే కన్నీరు కారుస్తూ ఉంటే ప్రజలు వెళ్లి ఆయనను అడిగారు, “ఎందుకయ్యా మీరు ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు?” అంటే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “నేను ప్రళయదినాన్ని తలుచుకొని కన్నీరు కారుస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తలుచుకుంటే నన్ను కూడా నరకంలో వేసేస్తాడు. అతనికి ఎలాంటి పర్వా లేకుండా పోతుంది. నేను ఎవరు, ఏంటి అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు ఏమి అవసరం ఉండదు. ఆయన తలుచుకుంటే నన్ను కూడా నరకంలో పడవేయగలడు కాబట్టి అది తలుచుకొని నేను ఏడుస్తున్నాను” అన్నారు.
అలాగే అభిమాన సోదరులారా! అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో గొప్ప శిష్యుడు. అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వ్యాధిగ్రస్తునిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటే ప్రజలు వెళ్లి ఏమయ్యా ఏడుస్తున్నారు మీరు అంటే ఆయన అన్నారు. “నేను మరణిస్తానేమో, ఈ ప్రపంచాన్ని నేను వదిలేసి వెళ్లిపోతున్నాను కదా అని నేను బాధపడట్లేదు. నేను బాధపడుతున్న విషయం ఏమిటంటే ఇక నా ప్రయాణం చాలా పెద్దదిగా ఉంది. కానీ అంత పెద్ద ప్రయాణంలో నేను సంపాదించుకుంది చాలా తక్కువ. ఇంత తక్కువ మొత్తంతో నేను అంత పెద్ద ప్రయాణాన్ని ఎలా చేయగలను అని తలుచుకొని నేను ఏడుస్తున్నాను” అన్నారు.
అలాగే అభిమాన సోదరులారా! అబ్దుల్లాహ్ ఇబ్నె రవాహా సతీమణి ఒడిలో పడుకొని ఉన్నారు. అక్కడే కన్నీరు కార్చడం మొదలెట్టేశారు. ఆయనను చూసి ఆయన భార్య కూడా కన్నీరు కార్చడం మొదలెట్టేసింది. ఆ తర్వాత ఏమయ్యా ఎందుకు మీరు కన్నీరు కారుస్తున్నారు అని ఆయనతో అడిగినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “రేపు ప్రతి వ్యక్తి స్వర్గానికి వెళ్లాలనుకునే ప్రతి వ్యక్తి నరకం మీద ఉంచిన పుల్సిరాత్ ని దాటుకుని స్వర్గానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ రోజు నేను పుల్సిరాత్ దాటుకుని స్వర్గానికి వెళ్తానా లేదా అని తలుచుకొని బాధపడుతున్నాను అన్నారు. ప్రతి వ్యక్తి ఆ మార్గం ద్వారానే దాటుకోవాల్సి ఉంటుంది. నరకాన్ని దాటుకోవాలంటే ఆ మార్గం మీద నుంచి నడిచి వెళ్ళాలి. ఆ తర్వాత మళ్లీ స్వర్గ ప్రవేశం ఉంటుంది. ఆ మార్గాన్ని నేను దాటుకోగలనా లేదా అని తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను” అన్నారు అభిమాన సోదరులారా.
ఈ విధంగా చూస్తే చాలామంది గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆఖరిలో ఒక్క విషయం చెప్పేసి నా మాట ముగిస్తున్నాను. అదేమిటంటే అభిమాన సోదరులారా! అల్లాహ్ ను తలుచుకొని ప్రతి భక్తుడు ఎప్పుడైనా సరే ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా కన్నీరు కార్చాలి. ఎందుకంటే ఈ జీవితం శాశ్వతము కాదు. ఈ జీవితాన్ని స్వస్తి పలికి అల్లాహ్ పిలుపు రాగానే ప్రపంచాన్ని వదిలేసి మనం వెళ్లిపోవాలి. మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు, కుటుంబ సభ్యులు మూడు రోజులు కన్నీరు కార్చుకుంటారు. మళ్లీ వాళ్ల పనుల్లో వాళ్లు నిమగ్నమైపోతారు. ప్రయాణం చేయాల్సింది ఒంటరిగా మనమే. అక్కడ మనకు కాపాడాల్సింది ఒక అల్లాహ్ మాత్రమే. కాబట్టి అల్లాహ్ ను తలుచుకొని ప్రతి భక్తుడు కన్నీరు కార్చాలి. అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవాలి.
కానీ మన పరిస్థితి ఎలా ఉందంటే మన హృదయాలు నల్ల రాయి లాగా గట్టిగా మారిపోయాయి. కారణం ఏమిటంటే మనలో దైవభీతి లేదు. ప్రపంచ వ్యామోహంలో పడిపోయి ఉన్నాం. డబ్బు డబ్బు, ఆస్తి ఆస్తి, బంగారు నగలూ అని చెప్పేసి దాని వెనకాల పరిగెడుతున్నాం అభిమాన సోదరులారా. ఇది శాశ్వతము కాదు. చావును తలుచుకోండి. సమాధిని తలుచుకోండి. నరకాన్ని తలుచుకోండి. పుల్సిరాత్ని తలుచుకోండి. లెక్కింపు రోజుని తలుచుకోండి. ఇది ఎంత ఎక్కువగా తలుచుకుంటే అంతగా హృదయం మెత్తబడుతుంది. అప్పుడు భక్తుడు దైవ భక్తితో, దైవ భీతితో కన్నీరు కారుస్తాడు. వీలైతే వ్యాధిగ్రస్తుల వద్దకు వెళుతూ వస్తూ ఉండండి. అప్పుడు కూడా మనసులు, హృదయాలు మెత్తబడతాయి. వీలైతే స్మశానానికి వెళుతూ వస్తూ ఉండండి. సమాధుల్ని చూసినప్పుడు కూడా హృదయాలు మెత్తబడతాయి.
కాబట్టి అభిమాన సోదరులారా! ప్రతి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హృదయం, మెత్తని హృదయాన్ని ప్రసాదించి, దైవభీతితో కన్నీరు కార్చేలాగా, అల్లాహ్ తో చేసిన పాపాలకి క్షమాపణ కోరుతూ ఉండేలాగా సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.